ఇంటికో రోగి | Fevers and joint pains in Errabelli Nalgonda district | Sakshi
Sakshi News home page

ఇంటికో రోగి

Published Sun, Aug 11 2024 4:57 AM | Last Updated on Sun, Aug 11 2024 4:57 AM

Fevers and joint pains in Errabelli Nalgonda district

నల్లగొండ జిల్లా ఎర్రబెల్లిలో జ్వరాలు, కీళ్లనొప్పులు

వణుకుతున్న పల్లెలు... జిల్లావ్యాప్తంగా ఇదే పరిస్థితి 

7 నెలల్లో 466 డెంగీ కేసులు 

ప్రభుత్వ లెక్కల్లో మాత్రం 157గానే నమోదు

సాక్షి ప్రతినిధి, నల్లగొండ: నల్లగొండ జిల్లా నిడమనూరు మండలంలోని ఎర్రబెల్లి గ్రామంలో ఇంటికో రోగి ఉన్నారు. కొన్ని ఇళ్లలో ఇంటికి ఇద్దరు ముగ్గురు జ్వరాల బారిన ప డ్డారు. చలి జ్వరం, కీళ్లు, ఒంటి నొప్పులతో అల్లాడుతున్నా రు. నీరసం ఆవహించి అడుగు తీసి అడుగు వేయలేకపోతు న్నారు. 

గ్రామంలో 700 వరకు ఆవాసాలు ఉండగా 2 వేల వరకు జనాభా ఉంది. అక్కడ 20 రోజులుగా వైరల్‌ జ్వరా లతో గ్రామస్తులు అల్లాడుతున్నారు. గ్రామంలో ఎక్కడ చూసినా జ్వరంతో బాధపడుతూ చేతికి సెలైన్‌ ఎక్కించుకొనేందుకు పెట్టుకున్న సూదులతో కనిపించడం గమనార్హం. 

జిల్లావ్యాప్తంగా విషజ్వరాలు 
ఆ గ్రామమే కాదు.. తిప్పర్తి మండలంలోని ఎస్సీ కాలనీలో ç60 మంది, నూకలవారిగూడంలో 40 మంది, సైదిబాయిగూడంలో 20 వరకు విషజ్వరాల బారినపడ్డారు. నల్లగొండ పట్టణం, కనగల్, దామరచర్ల తదితర మండలాలతోపాటు జిల్లావ్యాప్తంగా విషజ్వరాలు విజృంభిస్తున్నాయి. గ్రామ పంచాయతీల్లో పారిశుధ్యం నిర్వహణకు నిధుల్లేక మురికి కాలువలు శుభ్రం చేయడం, ఫాగింగ్‌ చేయడం వంటి పనులు చేపట్టకపోవడంతో దోమలు వ్యాప్తి చెంది విషజ్వరాలు విజృంభిస్తున్నాయి.

మరోవైపు జిల్లాలో జనవరి నుంచి ఇప్పటివరకు పీహెచ్‌సీలవారీ లెక్కల ప్రకారం 466 డెంగీ కేసులు నమోదవగా అందులో గత నెలలోనే 162 కేసులు నమోదయ్యాయి. కానీ వైద్య, ఆరోగ్యశాఖ మాత్రం జిల్లాలో 157 డెంగీ కేసులు, 7 చికున్‌గున్యా కేసులు, ఒక మలేరియా కేసు మాత్రమే నమోదైనట్లు ప్రభుత్వానికి నివేదించినట్లు తెలిసింది. అనధికార లెక్కల ప్రకారం జిల్లాలో సుమారు 1500కు పైగా డెంగీ కేసులు నమోదైనట్లు ప్రైవేటు ఆస్పత్రి వర్గాలు చెబుతున్నాయి. 

నాన్నా.. నన్ను కాపాడు 
తీవ్ర జ్వరం బారినపడిన ఓ టెన్త్‌ విద్యార్థిని వేడుకోలు
వైద్యం కోసం తరలిస్తుండగా మృతి
కౌటాల: ‘నాన్నా.. నన్ను కాపాడు’.. తీవ్ర జ్వరంబారిన పడిన ఓ టెన్త్‌ విద్యార్థిని తన తండ్రితో పలికిన చివరి మాటలు ఇవి. దీంతో ఆ తండ్రి మెరుగైన వైద్యం కోసం శనివారం హైదరాబాద్‌ తరలిస్తుండగా మార్గమధ్యలోనే ఆమె మృతిచెందింది. కుమా ర్తె మృతిని తట్టుకోలేకపోతున్న తండ్రి.. ‘నిన్ను కాపాడుకోలేక పోయిన బిడ్డా’అంటూ గుండెలవిసేలా రోదిస్తున్నాడు. ఈ ఘటన కుమురం భీం ఆసిఫాబాద్‌ జిల్లా గుండాయిపేటలో విషాదం నింపింది. 

స్థానికుల కథనం ప్రకారం.. గుండాయిపేటకు చెందిన జాడె కిశోర్, సురేఖ దంపతులకు ముగ్గురు సంతానం. పెద్ద కుమార్తె పూజ (16) జిల్లా కేంద్రంలోని గిరిజన సంక్షేమ బాలికల వసతిగృహంలో ఉంటూ టెన్త్‌ చదువుతోంది. జ్వరం రావడంతో గత శనివారం తండ్రికి ఫోన్‌ చేసింది. ‘నాన్నా జ్వరమొచ్చింది.. చేతనైతలేదు.. కాళ్లు చేతులు గుంజుతున్నయ్‌.. ఇంటికి తీసుకుపో’అని చెప్పింది. దీంతో ఆమెను ఇంటికి తీసుకెళ్లారు. 

స్థానిక ఆర్‌ఎంపీల వద్ద వైద్యం చేయించినా జ్వరం తగ్గకపోగా శుక్రవారం సాయంత్రానికి మరింత ఎక్కువైంది. దీంతో కుటుంబ సభ్యులు వెంటనే మహారాష్ట్రలోని చంద్రాపూర్‌లో ఓ ప్రైవేట్‌ ఆసుపత్రికి తీసుకెళ్లగా శనివారం మధ్యాహ్నం పరిస్థితి విషమించింది. దీంతో వైద్యుల సూచన మేరకు హైదరాబాద్‌కు అంబులెన్స్‌లో తరలిస్తుండగా మార్గమధ్యలో పూజ తన తండ్రి చేయి పట్టుకొని తనను కాపాడాలని కోరింది. దీంతో తండ్రి ఏమీ కాదని ధైర్యం చెప్పాడు. 

కానీ కాసేపటికే పూజ మరణించింది. కాగా, గుండాయిపేట గ్రామంలో కొద్ది రోజులుగా విష జ్వరా లు ప్రబలుతున్నాయి. ప్రతి ఇంట్లోనూ జ్వర బాధితులు ఉన్నారు. జ్వరాల నియంత్రణకు వైద్య శిబిరం ఏర్పాటు చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement