Fever
-
జ్వరం వచ్చిందని చిన్నారికి 40 చోట్ల వాతలు.. చివరకు..
భువనేశ్వర్: ప్రపంచం ఇరవై ఒకటో శతాబ్దంలో ఓవైపు కృత్రిమ మేథతో దూసుకుపోతుంటే మరోవైపు కొందరు ఇంకా మూఢాంధకారంలో మగ్గిపోతున్నారు. తమ మూఢ విశ్వాసాలకు కుటుంబసభ్యులనూ బలిచేస్తున్నారు. ఒడిశాలో ఇలాంటి ఘటన తాజాగా వెలుగుచూసింది.అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్న నెల వయసు పసికందుకు నిర్దాక్షిణ్యంగా వాతలు పెట్టారు. దాదాపు 40 చోట్ల వాతలతో నరకయాతన పడుతున్న చిన్నారిని ఎట్టకేలకు ఆస్పత్రిలో చేర్పించడంతో బతికి ప్రాణాలతో బయటపడ్డాడు. నబారంగ్పూర్ జిల్లాలోని చందహండీ బ్లాక్ గంభారీగూడ పంచాయతీ పరిధిలోని ఫూన్దేల్పాడా గ్రామంలో ఈ దారుణోదంతం జరిగింది. ప్రస్తుతం చిన్నారిని ఉమెర్కోట్ సబ్–డివిజనల్ ఆస్పత్రిలో చేరి్పంచి చికిత్స అందిస్తున్నామని నబారంగ్పూర్ చీఫ్ డి్రస్టిక్ట్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ సంతోష్ కుమార్ సోమవారం చెప్పారు. తలపై, పొట్టపై వాతలు.. నెలరోజుల క్రితం జన్మించిన ఈ బాబు గత పదిరోజులుగా తీవ్ర జ్వరంతో బాధపడుతున్నాడు. ఒళ్లు వేడెక్కి కాలిపోతుండటంతో గుక్కబెట్టి ఏడుస్తున్నాడు. ఈ పరిస్థితుల్లో పిల్లాడిని వెంటనే ఆస్పత్రిలో చేర్పించాల్సిన కుటుంబసభ్యులకు మూఢవిశ్వాసాలపై గురి ఎక్కువ. ఈ గ్రామీణ ప్రాంతంలో పిల్లలకు ఆరోగ్యం బాగోలేకపోతే చెడుగాలి సోకిందని, దుష్టశక్తిని పారద్రోలేందుకు ఉపాయంగా ఇనుప కడ్డీతో ఒంటిపై వాతలు పెడతారు. ఇదే అంధవిశ్వాసంతో కుటుంబసభ్యులు ఈ పిల్లాడికి తలపై, పొట్టపై దాదాపు 40 చోట్ల కాల్చిన ఇనుపకడ్డీతో వాతలు పెట్టారు. కాలిన గాయాలతో పిల్లాడి ఆరోగ్య పరిస్థితి మరింత విషమించింది.దీంతో చేసేదేమీలేక చివరకు పిల్లాడిని ఉమెర్కోట్ ఆస్పత్రిలో చేర్పించారు. ప్రస్తుతం పిల్లాడి ఆరోగ్య పరిస్థితి స్థిరంగా ఉందని వైద్యులు చెప్పారు. విషయం తెలుసుకున్న జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు చందహండీ బ్లాక్ పరిధిలో ప్రజల్లో మూఢవిశ్వాసాలను పోగొట్టి వారిలో సామాజిక చైతన్యం తీసుకొచ్చేందుకు నడుం బిగించారు. వాతలు పెట్టే పురాతన పద్ధతులను విడనాడాలని అవగాహన కార్యక్రమాలు మొదలెట్టారు. -
జ్వరంతో యువకుడి మృతి
ముత్తారం: లక్కారం గ్రామానికి చెందిన సిలివేరు కుమార స్వామి(21) అనే యువకుడు జ్వరంతో చికిత్స పొందుతూ గురువారం మృతి చెందాడు. గ్రామానికి చెందిన సిలి వేరు నర్సయ్య, శంకరమ్మ దంపతులకు ఒక కూతురు, కుమారుడు కుమారస్వామి ఉన్నారు. కుమారస్వామికి తొలుత జ్వరం రాగా స్థానిక ఆర్ఎంపీ వద్ద చికిత్స చేయించుకున్నాడు. జ్వరం తీవ్రత పెరగడంతో పెద్దపల్లిలోని ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమించడంతో కరీంనగర్‌లోని ఓ ప్రవేట్ అస్పత్రిలో చేర్పించారు. కాగా చికిత్స పొందుతూ గురువారం మృతిచెందాడు. -
ప్రాణాలు తీస్తున్న బ్లీడింగ్ ఐ
కిగలీ(రువాండా): రక్తనాళాలను ధ్వంసం చేస్తూ రక్తస్రావానికి కారణమయ్యే ప్రమాదకర మార్బర్గ్ వైరస్ రువాండా దేశంలో ప్రాణాలు తీస్తోంది. ఇప్పటికే ఈ వైరస్ సోకి 15 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇంకా వందల మందికి ఇప్పటికే ఈ వైరస్సోకి ఉంటుందని రువాండా అధికారులు భావిస్తున్నారు. విపరీతమైన జ్వరం, రక్తధారలకు కారణమవడంతో ఈ వైరస్‌ను ‘బ్లీడింగ్ ఐ’వైరస్‌గానూ పిలుస్తారు. మార్బర్గ్ వైరస్ సోకితే 88 శాతం వరకు మరణం సంభవించే అవకాశం ఉంది. ఫలాలను తినే గబ్బిలాల్లో మార్బర్గ్ వైరస్ సహజంగా ఉంటుంది. ఇది ఎబోలా జాతికి చెందిన వైరస్. ఓరోపైచ్ జ్వరం, ఎంపాక్స్‌కు కారణమయ్యే వైరస్ల వ్యాప్తితో బాధపడుతున్న 17 ఆఫ్రికా దేశాల్లో తాజాగా ప్రయాణికుల రాకపోకలపై ప్రభుత్వాలు అడ్వైజరీని విడుదలచేశాయి. బ్లీడింగ్ ఐ వైరస్కూ దాదాపు ఎబోలా వైరస్ లక్షణాలే ఉంటాయి. బ్లీడింగ్ ఐ వైరస్ సోకితే గొంతు నొప్పి, జ్వరం, చలి, తలనొప్పి, దగ్గు, కండరాల నొప్పి, దద్దర్లు వస్తాయి. కొన్ని సార్లు ఛాతి నొప్పి, వాంతులు, విరేచనాలు, తల తిరగడం, బరువు తగ్గడం, రక్తవిరేచనాలు ఉంటాయని క్లెవ్‌ల్యాండ్ క్లినిక్ పరిశోధనలో తేలింది. మార్బర్గ్ వైరస్‌కు స్పష్టంగా ఎలాంటి యాంటీవైరల్ చికిత్స లేదు. ముందస్తు వ్యాక్సిన్లు లేవు. వైరల్ జ్వరం మాదిరిగా చికిత్సావిధానాలనే ప్రస్తుతం అవలంభిస్తున్నారు. -
వరద ప్రాంతాల్లో ఆరోగ్య జాగ్రత్తలు పాటించండి
సాక్షి, అమరావతి: వరద ప్రభావిత ప్రజలు జ్వరాలు, వ్యాధుల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమ డైరెక్టర్ డాక్టర్ పద్మావతి ఆదివారం ఓ ప్రకటనలో సూచించారు. వరదల కారణంగా నీరు నిల్వ ఉండడంతో పలు వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని, జ్వరం, నీళ్ల విరేచనాలు, వాంతులు వంటి లక్షణాలు కనిపిస్తే తక్షణ చికిత్స కోసం సమీపంలోని ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించాలని సూచించారు.తగు సూచనలు, సలహాల కోసం ఆయా ప్రాంతాల్లోని స్థానిక ఏఎన్ఎంను ఫోన్లో సంప్రదించాలని, భోజనానికి ముందు, మల విసర్జన తర్వాత చేతులను శుభ్రంగా సబ్బుతో కడుక్కోవాలన్నారు. వరద ప్రాంత ప్రజలు కాచి చల్లార్చి వడపోసిన నీటినే తాగాలన్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని.. కొబ్బరి చిప్పలు, టైర్లు, రోళ్లు, కూలర్లలో నీరు నిల్వ ఉండకుండా ఎప్పటికప్పుడు తీసివేయాలన్నారు. డెంగీ దోమల లార్వా వృద్ధి చెందకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. -
జ్వర భద్రం
డెంగీ రాష్ట్రాన్ని వణికిస్తోంది. ఇంతకుముందులా కాకుండా ‘మిక్స్డ్ ఇన్ఫెక్షన్ల’తో జనాల ఆరోగ్యాన్ని నిలువునా పీలి్చపిప్పిచేస్తోంది. రెండు, మూడు రకాల వైరస్లు సోకుతుండటం ప్రమాదకరంగా మారుతోంది. జ్వరంతోపాటు తీవ్ర నీరసం, ఒళ్లంతా నొప్పులతో.. కనీసం బెడ్‌పై నుంచి లేచి నడవలేనంతగా బాధపెడుతోంది. ప్రభుత్వ ఆస్పత్రులకు వెళితే తగిన వైద్యం అందక.. ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లి ‘నిలువు దోపిడీ’ సమరి్పంచుకోలేక.. శారీరకంగానే కాదు, మానసికంగానూ జనం అల్లాడిపోయే పరిస్థితి కనిపిస్తోంది. విషజ్వరాలతో పరిస్థితి దారుణంగా మారుతున్నా, ప్రైవేటు ఆస్పత్రుల దోపిడీ కళ్లముందే కనిపిస్తున్నా.. ప్రభుత్వం నుంచి తగిన స్పందన లేదనే ఆగ్రహం వ్యక్తమవుతోంది.సాక్షి, హైదరాబాద్: రాష్ట్రం జ్వరాలతో మంచాన పడింది. డెంగీ, చికున్‌గున్యా, మలేరియా వ్యాప్తి రోజురోజుకూ పెరుగుతోంది. పట్టణాలు, పల్లెలు అనే తేడా లేకుండా జనం విష జ్వరాలతో అల్లాడుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రులన్నీ కిటకిటలాడుతున్నాయి. చాలా ప్రభుత్వ ఆస్పత్రుల్లో మందుల కొరత, మౌలిక సదుపాయాలు లేకపోవడం, వైద్య సిబ్బంది కొరతతో రోగులు ఇబ్బంది పడుతున్నారు. మరోవైపు ప్రైవేట్ ఆస్పత్రులకు వెళితే అడ్డగోలుగా వసూలు చేస్తున్న ఫీజులు చూసి కళ్లు తేలేస్తున్నారు. ఇంత జరుగుతున్నా ప్రభుత్వం నుంచి స్పందన కనిపించడం లేదని బాధితులు వాపోతున్నారు. పెరుగుతున్న డెంగీ తీవ్రత రాష్ట్రంలో వైద్యారోగ్యశాఖ ఆధ్వర్యంలో జ్వర సర్వే జరుగుతోంది. గ్రామాల్లో ఆశ కార్యకర్తలు ఇంటింటికీ తిరిగి సర్వే చేస్తున్నారు. వైద్యారోగ్యశాఖ లెక్కల ప్రకారం రాష్ట్రంలో ఈ ఏడాది ఇప్పటివరకు ఏకంగా 6,051 డెంగీ కేసులు, 164 చికున్‌గున్యా కేసులు, 197 మలేరియా కేసులు నమోదయ్యాయి. కానీ లెక్కలోకి రాని కేసులు భారీ స్థాయిలో ఉన్నాయనే అంచనా. ముఖ్యంగా డెంగీ దడ పుట్టిస్తోంది. జూలై, ఆగస్టు రెండు నెలల్లోనే ఏకంగా 3,317 డెంగీ కేసులు నమోదయ్యాయి. ఇందులో హైదరాబాద్‌లో అత్యధికంగా 1,267 కేసులు, నల్లగొండ జిల్లాలో 276 కేసులు, ఖమ్మం జిల్లాలో 181 కేసులు నమోదయ్యాయి. మిగతా జిల్లాల్లోనూ విష జ్వరాల కేసులు పెరిగినా.. అధికారికంగా నమోదవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరోవైపు చాలా ప్రభుత్వ ఆస్పత్రుల్లో అవసరమైన మందులు లేకపోవడం, టెస్టింగ్ కిట్ల కొరత ఇబ్బందికరంగా మారింది. రూ.50 వేల నుంచి రూ.2 లక్షలదాకా వసూళ్లు ప్రైవేట్ ఆస్పత్రులకు వెళితే వేలకు వేలు వసూలు చేస్తున్నాయని డెంగీ, ఇతర విష జ్వరాల బాధితులు వాపోతున్నా రు. ముఖ్యంగా డెంగీ వచ్చి ఆస్పత్రిలో చేరితే చాలు.. పరిస్థితిని బట్టి రూ.50 వేల నుంచి రూ.2 లక్షల వరకు చికిత్సల కోసం వసూలు చేస్తున్న పరిస్థితి. ఈ పరిస్థితిని చక్కదిక్కడంలో వైద్యశాఖ యంత్రాంగం విఫలమవుతోందన్న ఆరోపణ లు వినిపిస్తున్నాయి. డెంగీ, ఇతర విష జ్వరాల నియంత్రణ, బాధితులకు చికిత్స అందించడంపై దృష్టిపెట్టాలని వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశించినా.. క్షేత్ర స్థాయిలో పరిస్థితి భిన్నంగా కనిపిస్తోంది. ఉన్నతాధికారులు ప్రభుత్వ ఆస్పత్రులను తనిఖీ చేస్తూ, పరిస్థితిని చక్కదిద్దడంపై ఫోకస్ చేస్తున్నా.. ప్రైవేట్ ఆస్పత్రుల దోపిడీని మాత్రం పట్టించుకోవడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. నిజామాబాద్ జిల్లా ఆస్పత్రికి రికార్డు స్థాయిలో రోగులు శుక్రవారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని జనరల్ ఆస్పత్రికి రాష్ట్రంలోనే అత్యధికంగా 2,680 మంది ఔట్ పేషెంట్లు వచ్చారు. హైదరాబాద్‌లోని ఉస్మానియాకు 2,566 మంది, గాం«దీకి 2,192 మంది, వరంగల్ ఎంజీఎంకు 2,385 మంది ఔట్ పేషెంట్లు వచ్చారు. ఓపీ నమోదైంది. సీజనల్ వ్యాధులు విజృంభిస్తుండడంతో ఆస్పత్రులకు రోగుల తాకిడి పెరుగుతోంది.ప్లేట్లెట్స్ టెస్టు కోసం బయటికి.. నాలుగు రోజుల నుంచి జ్వరం వస్తోంది. ఆస్పత్రిలో మూడు రోజులుగా వైద్యం తీసుకుంటున్నా. నా భర్తకు కూడా జ్వరమే. ఆస్పత్రిలో ప్లేట్లెట్ టెస్ట్ చేసే సదుపాయం లేదని టెస్టుల కోసం బయటికి పంపించారు. – కె.లక్ష్మీతిరుపతమ్మ, సత్తుపల్లి మందులు సరిగా ఇవ్వడం లేదు నేను నాలుగు రోజులుగా జ్వరంతో బాధపడుతున్నా. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రికి వస్తే.. వైద్యులు పారాసెటమాల్ 650 ఎంజీ మాత్రలు రాశారు. కానీ సిబ్బంది 500 ఎంజీ మాత్రలు, అదీ రెండు రోజులకు సరిపడానే ఇచ్చారు. 650 ఎంజీ మాత్రలు బయట కొనుక్కోవాలని చెప్పారు. – మశమ్మ, నాగర్కర్నూల్మిక్స్డ్ ఇన్ఫెక్షన్లతో తీవ్ర ప్రభావంసీరో టైప్–1, 2 డెంగీ వేరియంట్లతో ఆరోగ్యం సీరియస్.. కోవిడ్ వచ్చి తగ్గినవారిలో నీరసం మరింత ఎక్కువఅడిషనల్ డీఎంఈ రాజారావు వెల్లడి ‘‘ఏ వైరల్ జ్వరం అయినా వీక్నెస్ ఉంటుంది. కోవిడ్ వచి్చపోయిన వారిలో నీరసం మరింత ఎక్కువగా ఉంటోంది. వైరల్ జ్వరం వచ్చిన వారు విశ్రాంతి ఎక్కువగా తీసుకోవాలి. లేకుంటే సాధారణ స్థితికి రావడానికి ఎక్కువ రోజులు పడుతుంది. డెంగీలో సీరో టైప్–2 అనేది మన వద్ద ఎక్కువగా వ్యాపిస్తోంది. మిగతా డెంగీ వేరియంట్ల కంటే దీని తీవ్రత ఎక్కువగా ఉంటుంది. అదే మిక్స్డ్ ఇన్ఫెక్షన్స్ ఉంటే తీవ్రత మరింత పెరుగుతుంది. ఎవరికైనా సీరో టైప్–1 డెంగీ ఒకసారి వచి్చ, రెండోసారి సీరో టైప్–2 వస్తే.. మొదటిదాని యాంటీబాడీస్, రెండో టైప్ ఇన్ఫెక్షన్ క్రాస్ రియాక్షన్ వల్ల ఆరోగ్య పరిస్థితి మరింత సీరియస్ అవుతుంది. ఇక డెంగీలో ప్లేట్లెట్లు పడిపోవడం కంటే.. ప్లాస్మా లీకేజీ చాలా ప్రమాదకరం. రక్తంలోని నీరు రక్తనాళాల నుంచి లీక్ అవడమే ప్లాస్మా లీకేజీ. దీనివల్ల పల్స్, బీపీ పడిపోవడం, తర్వాత తీవ్ర కడుపునొప్పి, వాంతులు రావడం, చెమటలు పట్టడం, అపస్మారక స్థితిలోకి వెళ్లడం, అవయవాలు విఫలమయ్యే కూడా వెళ్తుంది. అయితే వంద మందికి డెంగీ వస్తే.. అందులో ఐదుగురికి మాత్రమే ప్లాస్మా లీకేజీ వరకు వెళ్లే ప్రమాదం ఉంటుంది. డెంగీలో ప్లేట్లెట్లు పడిపోవడం సాధారణ లక్షణమే. చాలా మందిలో వాటంతట అవే పెరుగుతాయి. ఒకవేళ రక్తస్రావం జరుగుతున్నా, 20 వేలకన్నా తక్కువకు ప్లేట్లెట్ల సంఖ్య తగ్గిపోయినా.. ప్లేట్లెట్లు ఎక్కించాల్సి వస్తుంది. ప్లేట్లెట్ టెస్టులను పెథాలజిస్ట్ చూసి నిర్ధారించాలి. మిషన్‌లో లెక్కిస్తే.. ఉన్నదానికంటే తక్కువగా చూపించే చాన్స్ ఉంటుంది. – ప్రొఫెసర్ ఎం.రాజారావు, అడిషనల్ డీఎంఈఏ ఆస్పత్రిలో చూసినా అవే సమస్యలు.. ⇒ మహబూబ్‌నగర్ జిల్లా జనరల్ ఆస్పత్రితోపాటు పీహెచ్సీలలో మందుల కొరత ఉంది. అన్ని రకాల యాంటీ బయాటిక్స్ అందుబాటులో లేవు. జలుబు సిరప్, కంటి చుక్కల మందులు, క్లేవమ్ వంటి మందులు కూడా లేవు. ఇంజక్షన్లు అందుబాటులో లేవు. వైద్యులు ఐదారు రకాల మందులు రాస్తే వాటిలో రెండు, మూడు రకాలు మాత్రమే ఉంటున్నాయి. మిగతావి బయట కొనుక్కోవాల్సి వస్తోంది. ⇒ నాగర్‌కర్నూల్ జిల్లా జనరల్ ఆస్పత్రిలో జ్వరం, ఇతర జబ్బులకు కేవలం రెండు రోజులకు మాత్రమే మందులు ఇస్తున్నారు. ⇒నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో మందుల కొరత తీవ్రంగా ఉంది. వారం రోజులకు మందులు రాస్తే.. మూడు రోజుల మందులే ఇస్తున్నారు. కొన్ని రకాల మందులు లేకపోవడంతో బయట కొనాల్సిన పరిస్థితి నెలకొంది. ⇒బోధన్ ఆస్పత్రిలో రోగుల సంఖ్య పెరగడంతో వరండాలో బెడ్స్ వేసి వైద్యం అందిస్తున్నారు.డెంగీతో ఇద్దరి మృతిపాపన్నపేట(మెదక్)/సిద్దిపేట అర్బన్: వేర్వేరు జిల్లాల్లో డెంగీతో బాధపడుతూ ఇద్దరు మృతి చెందారు. మెదక్ జిల్లా పాపన్నపేట మండల పరిధిలోని చీకోడ్‌కు చెందిన వడ్ల రాజుకు ఇద్దరు కొడుకులు. పెద్దకొడుకు హర్షిత్చారి (11)కి వారం రోజుల క్రితం డెంగీ సోక గా.. కుటుంబ సభ్యులు మెదక్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రి లో చేర్పించారు. అక్కడ నయం కాకపోవడంతో హైదరాబాద్‌లోని ప్రైవేట్ ఆసుపత్రి కి తరలించారు. అక్కడ డబ్బులు కట్టలేక, నిలోఫర్‌కు తరలించగా.. హర్షిత్ చికిత్స పొందుతూ గురువారం రాత్రి మరణించాడు. సిద్దిపేట అర్బన్ మండలం తడ్కపల్లికి చెందిన సుతారి కనకలక్ష్మి జ్వరంతో బాధ పడుతుండటంతో సిద్దిపేటలోని ఒక ప్రైవేటు ఆస్పత్రిలో వైద్యం చేయించినా తగ్గకపోవడంతో.. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడా నయం కాకపోవడంతో నిమ్స్‌కు తరలించగా.. చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందింది.ప్రైవేట్ ఆస్పత్రులపై ఉక్కుపాదం మోపుతాం ‘సాక్షి’తో వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహఅడ్డగోలు వసూళ్లు చేస్తే కఠిన చర్యలు తప్పవు బాధితులు పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ ఆఫీసు కంట్రోల్ రూమ్‌కు ఫిర్యాదు చేయొచ్చు ‘సాక్షి’తో వైద్యారోగ్యశాఖ మంత్రి రాజనర్సింహసాక్షి, హైదరాబాద్: ప్రైవేట్ ఆస్పత్రుల్లో డెంగీ పేరుతో ఇష్టారాజ్యంగా ఫీజులు వసూలు చేస్తున్నారన్న విషయం తన దృష్టికి వచి్చందని.. అలాంటి వాటిపై ఉక్కుపాదం మోపుతామని వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ హెచ్చరించారు. ఈ అంశంపై ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రులను పర్యవేక్షించేందుకు టాస్‌్కఫోర్స్ పనిచేస్తోందని.. ఇప్పటికే చాలా ప్రైవేట్ ఆస్పత్రులను పరిశీలించిందని తెలిపారు. ప్రైవేట్ ఆస్పత్రుల దోపిడీపై శనివారం సమావేశం నిర్వహించనున్నామని చెప్పారు. డెంగీని గుర్తించేప్పుడు టెస్టు రిపోర్టులు సరిగా ఉంటున్నాయా లేదా పరిశీలిస్తామని తెలిపారు. రెండు, మూడు రోజుల్లో చర్యలు ప్రారంభం అవుతాయన్నారు. ఆస్పత్రులు డెంగీ పరీక్షలు చేసిన, నిర్ధారణ అయిన వివరాలను ప్రభుత్వానికి ఇవ్వాలన్నారు. కంట్రోల్ రూమ్‌కు ఫిర్యాదు చేయండి: ప్రైవేట్ ఆస్పత్రులు అవసరం ఉన్నా, లేకున్నా టెస్టులు చేస్తున్నాయని మంత్రి మండిపడ్డారు. ఈ పరిస్థితిని నియంత్రించాలంటే క్లినికల్ ఎస్టాబ్లి‹Ùమెంట్ యాక్ట్‌ను కఠినంగా అమలు చేయాల్సి ఉందన్నారు. ప్రజారోగ్య సంచాలకుల కార్యాలయంలో కంట్రోల్ రూం నడుస్తోందని.. విషజ్వరాల బాధితులు తమ సమస్యలపై దానికి ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. ‘‘సీజనల్ వ్యాధులను అరికట్టేందుకు, క్షేత్రస్థాయిలో పరిస్థితిని పర్యవేక్షించేందుకు ఉన్నతాధికారులంతా ఆస్పత్రుల పర్యటనకు వెళ్లాలని ఆదేశించాం. జిల్లాలో కలెక్టర్, వైద్యాధికారులు, మున్సిపల్, పంచాయతీరాజ్‌శాఖ అధికారులు సమన్వయంతో పనిచేసి.. పరిస్థితులను చక్కదిద్దాలని ఆదేశించాం. మందుల కొరత ఉండకూడదని చెప్పాం..’’ అని మంత్రి వెల్లడించారు. కోఠి ఆస్పత్రిలోని వెక్టార్ బార్న్ డిసీజెస్ విభాగం కంట్రోల్ రూం నంబర్ 94404 90716 -
విద్యార్థుల ఆరోగ్యంతో సర్కారు చెలగాటం
నూజివీడు: విద్యార్థుల ఆరోగ్యంతో సర్కారు చెలగాటం ఆడుతోంది. ఏలూరు జిల్లా నూజివీడు ట్రిపుల్ ఐటీలో విద్యార్థులు జ్వరాలు, కడుపునొప్పి, వాంతులు, విరేచనాలు, ఒళ్లు నొప్పులతో సతమతమవుతున్నారు. వారికి సరైన చికిత్స అందించడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. మూడు రోజులుగా విద్యార్థులు జ్వరంతో ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌లోనే ఉన్న ఆస్పత్రికి వెళ్తున్నారు. ఇక్కడి ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌లో 6,600 మంది విద్యార్థులతో పాటు శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీకి చెందిన ఇంజినీరింగ్ మూడు, నాలుగు సంవత్సరాల విద్యార్థులు మరో 2,000 మంది ఉంటున్నారు. వీరిలో చాలామంది విద్యార్థులు జ్వరాలు, తలనొప్పి, కళ్లు నొప్పులు, కాళ్ల నొప్పులు, డయేరియా లక్షణాలతో హాస్టల్ రూముల్లోనే పడుకుంటున్నారు. ఈ నెల 26న 193 మంది విద్యార్థులు ఆస్పత్రికి రాగా.. వారిలో 90 మంది జ్వరాలు బారినపడినట్టు గుర్తించారు. మిగిలిన వారు ఒళ్లు నొప్పులు, తలనొప్పి, కడుపు నొప్పి, వాంతులు, విరేచనాలు, కాళ్ల నొప్పులతో బాధపడుతున్నారు. 27న 263 మంది ఆస్పత్రికి రాగా 101 మంది జ్వర బాధితులున్నారు. బుధవారం సాయంత్రానికి 110 మంది రాగా వారిలో 25 మంది జ్వర బాధితులు, మిగిలిన వారు ఇతర ఆరోగ్య సమస్యలతో సతమతమవుతున్నట్టు గుర్తించారు. మూడు రోజుల్లో మొత్తం 566 మంది ఆసుపత్రికి వచ్చి చూపించుకోగా వారిలో 216 మంది జ్వర బాధితులున్నారు. ఈ నెల 9న నూజివీడులోని శ్రీకాకుళం క్యాంపస్‌కు చెందిన 50 మందికి పైగా విద్యార్థులు విరేచనాలతో ఆస్పత్రి పాలవగా.. చికిత్స అందించడంతో రెండు రోజుల్లో రికవరీ అయ్యారు. వారం రోజులుగా విద్యార్థులు నిత్యం ఆస్పత్రి పాలవుతూనే ఉన్నారు. వైఎస్సార్సీపీ ఐదేళ్ల పాలనలో ఏనాడూ విద్యార్థుల్ని ఇంత నిర్లక్ష్యంగా వదిలేసిన దాఖలాలు లేవని ట్రిపుల్ ఐటీ వర్గాలే స్పష్టం చేస్తున్నాయి. రోజుకు 40 నుంచి 50 మంది జ్వరాల బారినపడి మందులు తీసుకొని వెళ్తున్నారని ట్రిపుల్ ఐటీ డైరెక్టర్ ఎం.చంద్రశేఖర్ తెలిపారు. ట్రిపుల్ ఐటీని సందర్శించిన డీఎంహెచ్‌వో జ్వరాల తీవ్రత పెరుగుతుండటంతో డీఎంహెచ్‌వో శరి్మష్ట బుధవారం నూజివీడు ట్రిపుల్ ఐటీకి వచ్చారు. మెస్‌లను పరిశీలించారు. ఆమె మాట్లాడుతూ.. మెస్‌లు ఆరోగ్యకరంగా లేవని, ఆహారం సరిగా ఉండటం లేదన్నారు. విద్యార్థులు సీజనల్ జ్వరాలతో బాధపడుతున్నారని, వైద్యులకు చూపించుకుని మందులు తీసుకుని వెళ్తున్నారని చెప్పారు. ఇన్పేòÙంట్లుగా కేవలం ఏడుగురే ఉన్నారన్నారు. మంచినీటి శాంపిల్స్ సేకరించి పరీక్షలకు పంపుతున్నామన్నారు. ఎవరికి ఎలాంటి ఆందోళనకర పరిస్థితి లేదని పేర్కొన్నారు.15 మందికి పైగా గురుకుల విద్యార్థులకు అస్వస్థతనాయుడుపేట బీఆర్ అంబేడ్కర్ బాలుర గురుకుల పాఠశాలలో మళ్లీ ఘటనఫుడ్ పాయిజన్‌తో విద్యార్థులకు తీవ్ర అనారోగ్యంప్రైవేటు ఆస్పత్రుల్లో చూపించుకోవాలంటూ పలువురు విద్యార్థులను ఇళ్లకు పంపిన సిబ్బంది నాయుడుపేట టౌన్: తిరుపతి జిల్లా నాయుడుపేటలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ బాలుర గురుకుల పాఠశాలలో మళ్లీ ఫుడ్ పాయిజన్ అయ్యింది. గత నెలలో ఇదే గురుకులంలో ఫుడ్ పాయిజన్ అయ్యి 150 మందికి పైగా విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. అయినా ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో ఇప్పుడు మరో 15 మందికి పైగా విద్యార్థులు అనారోగ్యం బారినపడ్డారు. 8, 9, 10, ఇంటర్ తరగతుల విద్యార్థులు మంగళవారం రాత్రి గురుకులంలో చికెన్ తిన్నారు. ఆ వెంటనే వారికి వాంతులు, విరోచనాలు మొదలయ్యాయి. దీంతో గురుకుల సిబ్బంది వీరిలో కొందరిని స్థానిక సామాజిక ఆరోగ్య కేంద్రంతో పాటు ఎల్ఏ సాగరంలోని అర్బన్ హెల్త్ సెంటర్‌కు తరలించారు. మరికొందరు విద్యార్థుల గురించి తల్లిదండ్రులకు సమాచారం అందించి.. ప్రైవేటు ఆస్పత్రులకు తీసుకువెళ్లాలని సలహాలిచ్చి ఇళ్లకు పంపారు. ఈ ఘటనపై ప్రిన్సిపల్ దాదాఫీర్‌ను మీడియా సంప్రదించగా.. పెద్ద ప్రమాదం లేదని.. తొమ్మిది మందికే వాంతులు, విరోచనాలు అయినట్టు తెలిపారు. అయితే 15 మందికి పైగా అస్వస్థతకు గురయ్యారని.. ట్యాబ్లెట్లు ఇవ్వాలని కోరితే తమను పీటీ మాస్టర్ కొట్టారంటూ విద్యార్థులు వాపోయారు. విషయం తెలుసుకున్న తహసీల్దారు గీతావాణి, మున్సిపల్ కమిషనర్ జనార్దన్‌రెడ్డి బుధవారం గురుకులాన్ని సందర్శించారు. గురుకులంలోని వంటశాలకు వెళ్లి విద్యార్థుల కోసం వండిన భోజనాన్ని పరిశీలించారు. మళ్లీ ఇలా జరగకుండా జాగ్రత్తగా ఉండాలని ప్రిన్సిపల్‌ను హెచ్చరించారు. నాయుడుపేట అర్బన్ సీఐ బాబీ కూడా గురుకుల పాఠశాలకు వచ్చి విచారణ జరిపారు. -
మంకీపాక్స్‌పై సర్కారు అలర్ట్
సాక్షి, హైదరాబాద్: మంకీపాక్స్‌పై రాష్ట్ర ప్రభుత్వం ప్రజానీకాన్ని అప్రమత్తం చేసింది. ఈ మేరకు రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వైద్య ఆరోగ్యశాఖ సోమవారం మార్గదర్శకాలు జారీచేసింది. జ్వరం, తలనొప్పి, కండరాల నొప్పులు, వెన్నునొప్పి, చలి, అలసట, చర్మంపై పాపుల్స్గా మారే మాక్యులోపాపులర్ దద్దుర్లు వంటివి ఉంటే అనుమానిత కేసులుగా పరిగణిస్తారు. మంకీపాక్స్ సాధారణంగా రెండు నుండి నాలుగు వారాల వరకు ఉండే వ్యాధి. పిల్లలలో ఎక్కువగా సంభవిస్తాయి. మంకీపాక్స్ కేసు మరణాలు పిల్లల్లో ఎక్కువగా ఉంటాయి. గత 21 రోజులలో మంకీపాక్స్ ప్రభావిత దేశాల నుంచి వచి్చన ఏ వ్యక్తి అయినా తీవ్రమైన దద్దుర్లతో బాధపడుతుంటే అనుమానించాలని పేర్కొంది. వారితో కలిసివున్న వారిని కూడా గుర్తించాలి. మంకీ పాక్స్ అనేది మశూచి రోగుల్లో కనిపించే లక్షణాలతో ఉంటుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ మంకీపాక్స్ వ్యాప్తిని అంతర్జాతీయ ప్రజారోగ్య అత్యవసర పరిస్థితిగా ప్రకటించింది. తద్వారా మరింత వ్యాప్తి చెందకుండా నిరోధించడానికి అవగాహన, వేగంగా కేసులను గుర్తించడం, ఇన్ఫెక్షన్ నియంత్రణ చర్యలు అవసరమని పేర్కొంది. ఆ మేరకు రాష్ట్రంలో చర్యలు తీసుకుంటున్నామని వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. అనుమానిత కేసులు గుర్తిస్తే గాం«దీకి పంపాలి మంకీ పాక్స్ సోకిన రోగులను ఐసోలేషన్‌లో ఉంచాలి. మెడికల్ కాలేజీలు, ఇతర ప్రభుత్వ ఆసుపత్రుల్లో మంకీ పాక్స్‌కు సంబంధించిన రోగుల కోసం ఐసోలేషన్ బెడ్లను కేటాయించాలని ఆదేశించారు. ఇప్పటికే గాం«దీ, ఫీవర్ ఆసుపత్రుల్లో ప్రత్యేక వార్డులను కేటాయించిన సంగతి తెలిసిందే. అన్ని ఆసుపత్రుల సూపరింటెండెంట్లు జిల్లా వైద్యాధికారులతో సమన్వయం చేసుకోవాలని ఆదేశాలిచ్చారు. అనుమానిత కేసులు ఉన్నట్లు గుర్తిస్తే చికిత్స కోసం గాంధీ ప్రభుత్వ ఆసుపత్రికి పంపాలి. అలాగే హైదరాబాద్‌లోని శంషాబాద్ విమానాశ్రయం ద్వారా వచ్చే అంతర్జాతీయ అనుమానిత ప్రయాణీకులుంటే వారిని రంగారెడ్డి డీఎంహెచ్‌వోతో సమన్వయం చేసుకొని గాంధీ ఆసుపత్రికి తరలించాలని ఆదేశించారు. కాగా 1970లో డెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో మంకీపాక్స్ మొదటి మానవ కేసు నమోదైంది. వణికిస్తున్న డెంగీ రాష్ట్రంలో డెంగీ విస్తరిస్తోంది. గతేడాది కంటే ఇప్పుడు అధికంగా సీజనల్ వ్యాధులు సంభవిస్తున్నాయని ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ రవీంద్రనాయక్ ఒక ప్రకటనలో వెల్లడించారు. ఈ ఏడాది జనవరి నుంచి ఆగస్టు 25వ తేదీ వరకు రాష్ట్రంలో 1.42 కోట్ల ఇళ్లను వైద్య బృందాలు సందర్శించాయి. 4.40 కోట్ల మందిని స్క్రీనింగ్ చేశారని ఆయన తెలిపారు.అందులో 2.65 లక్షల మంది జ్వరం బారిన పడినట్లు రవీంద్ర నాయక్ వెల్లడించారు. వర్షాల కారణంగా ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో దోమల సంతానోత్పత్తి పెరిగి డెంగీ విజృంభిస్తుందని చెప్పారు. ఈ ఏడాది జనవరి నుంచి ఈ నెల 25వ తేదీ వరకు మొత్తం 81,932 మంది రక్త నమూనాలను పరీక్షించగా, అందులో 5,372 మంది డెంగీ సోకినట్లు వెల్లడించారు. పాజిటివిటీ 6.5 శాతంగా ఉందని వెల్లడించారు. డెంగీ హైరిస్క్ జిల్లాల్లో హైదరాబాద్ 1,872 కేసులతో మొదటిస్థానంలో ఉంది. సూర్యాపేట 471, మేడ్చల్ మల్కాజిగిరి 426, ఖమ్మం 375, నల్లగొండ 315, నిజామాబాద్ 286, రంగారెడ్డి 232, జగిత్యాల 185, సంగారెడ్డి 160, వరంగల్ జిల్లాల్లో 110 డెంగీ కేసులు నమోదయ్యాయి. ఈ పది జిల్లాలను రాష్ట్రంలో హైరిస్క్ జిల్లాలుగా ప్రకటించారు. చికున్‌గున్యా కేసుల్లోనూ హైదరాబాద్ టాప్ మరోవైపు చికున్‌గున్యా కేసులు కూడా నమోదవు తున్నాయి. ఈ ఏడాది ఇప్పటివరకు 2,673 మంది రక్తనమూనాలను పరీక్షించగా, 152 మందికి చికున్‌గున్యా ఉన్నట్లు గుర్తించారు. పాజిటివిటీ రే టు 5 శా తంగా ఉండటం గమనార్హం. చికున్‌గున్యా హైరిస్క్ జిల్లాలుగా హైదరాబాద్ 61 కేసులతో మొ దటిస్థానంలో ఉంది. వనపర్తి 17, మహబూబ్‌నగర్ జిల్లా లో 19 నమోదయ్యాయి. ఈ ఏడాది ఇప్పటివరకు మలేరియా కోసం 23.19 లక్షల మంది నుంచి రక్తనమూనాలను సేకరించి పరీక్షించగా, అందులో 191 మలేరియా కేసులు నమోదయ్యాయి. పాజిటి విటీ రేటు 0.008 శాతంగా నమోదైంది. రాష్ట్రంలో టీ æ– హబ్ ల్యాబ్స్ పనిచేస్తున్నాయి. వాటిల్లో పరీక్షలు నిర్వహిస్తున్నారు. 53 బ్లడ్‌బ్యాంకులు అవసరమైన బ్లడ్ యూనిట్లతో సిద్ధంగా ఉన్నాయని డీహెచ్ రవీంద్రనాయక్ తెలిపారు. మొత్తం 33 జి ల్లాల్లో 108 అంబులెన్సులు సిద్ధంగా ఉన్నాయని వెల్లడించారు. అవసరమైన మందులన్నీ ఆసుపత్రుల్లో ఉన్నాయన్నారు. కట్టడిలో వైఫల్యం... సీజనల్ వ్యాధులను కట్టడి చేయడంలో వైద్య ఆరోగ్యశాఖ విఫలం కావడం వల్లే ఈ పరిస్థితి వచి్చందని వైద్య నిపుణులు చెప్తున్నారు. దోమల నియంత్రణకు ఇతర శాఖలను సమన్వయం చేయటంలో వైఫల్యం చెందిందని విమర్శిస్తున్నారు. పారిశుధ్య నిర్వహణను ప్రభుత్వం పట్టించుకోకపోవటంతో దోమలు పెరిగాయని చెప్తున్నారు. వానాకాలం మొదలయ్యే సమయానికి ముందస్తు నివారణ చర్యలు చేపట్టాలి. కానీ అవేవీ చేయలేదు. పైగా కీలకమైన సమయంలో బదిలీలు జరగడం, అవి కూడా సక్రమంగా నిర్వహించకపోవడంతో వైద్య సిబ్బంది ఆందోళనలు చేయాల్సి రావడంతో వైద్య ఆరోగ్య సిబ్బంది సీజనల్ వ్యాధులపై దృష్టిసారించలేకపోయారు. మరో వైపు పారిశుధ్యం లోపించిందని అంటున్నారు. సీజనల్ వ్యాధులపై ప్రజలను అప్రమత్తం చేయలేదని, నివారణ చర్యల పట్ల ప్రచారం చేయలేదని మండిపడుతున్నారు. మరోవైపు రాష్ట్రంలో మందుల కొరత నెలకొందనీ, సాధారణంగా సీ జనల్ వ్యాధులకు ముందే అన్ని ఆసుపత్రుల్లో బఫర్ స్టాక్ ఉంచుకో వా లని సూచిస్తున్నారు. దోమల నివారణకు ఫాగింగ్ కూడా పూర్తిస్థాయిలో జరగడంలేదనీ, నిల్వ నీటిల్లో స్ప్రేయింగ్ చేయడంలేదని వైద్యనిపుణులు ఆరోపిస్తున్నారు. -
జ్వరం.. కొత్త లక్షణం
లబ్బీపేట(విజయవాడతూర్పు): జిల్లా ప్రజలను వింత జ్వరాలు వేధిస్తున్నాయి. జ్వరం ఒకటి రెండు రోజుల్లోనే తగ్గుతున్నా ఆ తరువాత కీళ్ల వాపులు, శరీరంపై ర్యాష్ వంటి లక్షణాలు కనిపిస్తున్నాయి. గతంలో జ్వరం వస్తే మూడు నుంచి ఐదు రోజుల పాటు ఉండేది. కానీ ప్రస్తుతం జ్వరం ఒక్కరోజు మాత్రమే ఉంటోంది. 103 నుంచి 104 డిగ్రీల సెల్సియస్ వరకూ నమోదవుతోంది. ఆ తర్వాత తగ్గిపోతోంది. కానీ దుష్ఫలితాలు పది నుంచి 15 రోజుల పాటు వెంటాడుతూనే ఉన్నాయి.మలేరియా, డెంగీ అనుమానిత కేసులువిజయవాడ నగరంలోని మొగల్రాజపురం, మారుతీనగర్, గుణదల, పాతబస్తీలోని చిట్టినగర్, కేఎల్‌రావు నగర్ వంటి ప్రాంతాల్లో డెంగీ, మలేరియా అనుమానిత కేసులు నమోదవుతున్నాయి. కొందరిలో డెంగీ ఎన్ఎస్1 పరీక్షలో పాజిటివ్ వస్తూ, ప్లేట్లెట్స్ కూడా తగ్గుతున్నాయి. అలాంటి వారిలో డెంగీ ఎలీజా పరీక్ష చేస్తే నెగిటివ్ వస్తోంది. గత నెలలో గ్రామీణ ప్రాంతాల్లో జ్వరాలు సోకగా, పదిహేను రోజులుగా నగరంలో కూడా జ్వర బాధితులు పెరుగుతున్నారు. దోమకాటుతో పాటు, వాతావరణంలో వచ్చిన మార్పుల కారణంగా కూడా జ్వరాలు పెరుగుతున్నాయి.దోమల నివారణ ప్రచార ఆర్భాటమేవిజయవాడ నగరంలో వ్యాధులు సోకకుండా దోమల నివారణ చర్యలు తీసుకుంటున్నట్లు ప్రచారమే కానీ, క్షేత్రస్థాయిలో ఎక్కడా అమలు జరగడం లేదు. ఏదైనా అనుమానిత కేసు వచ్చిన ప్రాంతంలో వైద్య ఆరోగ్యశాఖ, నగర పాలక సంస్థ సిబ్బంది వెళ్లి చుట్టు పక్కల ఇళ్లలో యాంటీ లార్వా ఆపరేషన్ చేసి చేతులు దులుపుకొంటున్నారు. డ్రైడే, ఫ్రైడే కార్యక్రమాలు సైతం యాప్‌లో ఫొటోలు అప్లోడ్ చేసేందుకు రెండు, మూడు ప్రాంతాల్లో పర్యటించి సరిపెడుతున్నారు. దోమల నియంత్రణ క్షేత్ర స్థాయిలో అమలు జరగడం లేదు. దీంతో నగర ప్రజలు దోమకాటు వ్యాధులకు గురవుతున్నారు. అధికారుల ప్రకటనలకు, వాస్తవ పరిస్థితికి పొంతన ఉండటం లేదు.కనిపిస్తున్న లక్షణాలు ఇవీ.. ⇒ తొలుత జ్వరం వచ్చి ఒకటి రెండు రోజుల్లోనే తగ్గిపోతుంది.⇒ ఆ తర్వాత తీవ్రమైన తలనొప్పి, ఒళ్లు నొప్పులు ప్రారంభమవుతున్నాయి.⇒ క్రమేణా కీళ్ల నొప్పులు, కాళ్ల వాపులు వస్తున్నాయి. ⇒ ఇలాంటి వారిలో కొందరు రెండు మూడు రోజులు మంచం మీద నుంచి కిందకు దిగి నడవలేని పరిస్థితి తలెత్తుతోంది.⇒ కొందరిలో కాళ్ల వాపులు సైతం ఎక్కువగా వస్తున్నాయి.⇒ వాంతులు, విరేచనాలు వంటి లక్షణాలు కూడా కనిపిస్తున్నట్లు వైద్యులు చెబుతున్నారు.⇒ ఈ లక్షణాలు పది రోజుల నుంచి 15 రోజులు పాటు ఉంటూ ప్రజలను బాధిస్తున్నాయి.⇒ కొంత మందిలో జ్వరం తక్కువగా ఉండి గొంతునొప్పి, జలుబు వంటి సమస్యలు వేధిస్తున్నాయి.⇒ ఇలాంటి వారు తీవ్రంగా నీరసించి పోతున్నారు. రెండు మూడు రోజులకు దగ్గు కూడా ప్రారంభమవుతుంది. వారం నుంచి పది రోజుల పాటు దగ్గు ఇబ్బంది పెడుతోంది.జ్వరాలు చాలా డిఫరెంట్‌గా ఉన్నాయి..ప్రస్తుతం ప్రబలిన జ్వరాలు డిఫరెంట్‌గా ఉన్నాయి. ఒక రోజు జ్వరం వచ్చి తగ్గిపోతుంది. ఆ తర్వాత చాలా మందిలో కీళ్ల నొప్పులు, కీళ్ల వాపులు, కాళ్ల వాపులు వస్తున్నాయి. కొందరైతే, రెండు, మూడు రోజులు మంచంపై నుంచి దిగలేని పరిస్థితి ఏర్పడుతోంది. పది నుంచి పదిహేను రోజుల పాటు నొప్పులు ఉంటున్నాయి. కొందరిలో వాంతులు, విరేచనాలు వంటి లక్షణాలు కనిపిస్తున్నారు. డెంగీ ఎన్ఎస్1 పాజిటివ్ వచ్చి, ప్లేట్లెట్స్ తగ్గినా, ప్రమాదకరంగా మారడం లేదు. వాటికవే పెరుగుతున్నాయి. కొందరిలో భరించలేని తలనొప్పి, బాడీపెయిన్స్ కూడా ఉంటున్నాయి. నిపుణులైన వైద్యులను సంప్రదించి వైద్యం పొందితే మంచిది.– డాక్టర్ ఎస్.డి.ప్రసాద్, జనరల్ ఫిజీషియన్, విజయవాడ -
నాన్నా.. నన్ను కాపాడు
కౌటాల: ‘నాన్నా.. నన్ను కాపాడు’.. తీవ్ర జ్వరంబారిన పడిన ఓ టెన్త్ విద్యార్థిని తన తండ్రితో పలికిన చివరి మాటలు ఇవి. దీంతో ఆ తండ్రి మెరుగైన వైద్యం కోసం శనివారం హైదరాబాద్ తరలిస్తుండగా మార్గమధ్యలోనే ఆమె మృతిచెందింది. కుమా ర్తె మృతిని తట్టుకోలేకపోతున్న తండ్రి.. ‘నిన్ను కాపాడుకోలేక పోయిన బిడ్డా’అంటూ గుండెలవిసేలా రోదిస్తున్నాడు. ఈ ఘటన కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా గుండాయిపేటలో విషాదం నింపింది. స్థానికుల కథనం ప్రకారం.. గుండాయిపేటకు చెందిన జాడె కిశోర్, సురేఖ దంపతులకు ముగ్గురు సంతానం. పెద్ద కుమార్తె పూజ (16) జిల్లా కేంద్రంలోని గిరిజన సంక్షేమ బాలికల వసతిగృహంలో ఉంటూ టెన్త్ చదువుతోంది. జ్వరం రావడంతో గత శనివారం తండ్రికి ఫోన్ చేసింది. ‘నాన్నా జ్వరమొచి్చంది.. చేతనైతలేదు.. కాళ్లు చేతులు గుంజుతున్నయ్.. ఇంటికి తీసుకుపో’అని చెప్పింది. దీంతో ఆమెను ఇంటికి తీసుకెళ్లారు. స్థానిక ఆర్ఎంపీల వద్ద వైద్యం చేయించినా జ్వరం తగ్గకపోగా శుక్రవారం సాయంత్రానికి మరింత ఎక్కువైంది. దీంతో కుటుంబ సభ్యులు వెంటనే మహారాష్ట్రలోని చంద్రాపూర్‌లో ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లగా శనివారం మధ్యాహ్నం పరిస్థితి విషమించింది. దీంతో వైద్యుల సూచన మేరకు హైదరాబాద్‌కు అంబులెన్స్‌లో తరలిస్తుండగా మార్గమధ్యలో పూజ తన తండ్రి చేయి పట్టుకొని తనను కాపాడాలని కోరింది. దీంతో తండ్రి ఏమీ కాదని ధైర్యం చెప్పాడు. కానీ కాసేపటికే పూజ మరణించింది. కాగా, గుండాయిపేట గ్రామంలో కొద్ది రోజులుగా విష జ్వరా లు ప్రబలుతున్నాయి. ప్రతి ఇంట్లోనూ జ్వర బాధితులు ఉన్నారు. జ్వరాల నియంత్రణకు వైద్య శిబిరం ఏర్పాటు చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు. -
ఇంటికో రోగి
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: నల్లగొండ జిల్లా నిడమనూరు మండలంలోని ఎర్రబెల్లి గ్రామంలో ఇంటికో రోగి ఉన్నారు. కొన్ని ఇళ్లలో ఇంటికి ఇద్దరు ముగ్గురు జ్వరాల బారిన ప డ్డారు. చలి జ్వరం, కీళ్లు, ఒంటి నొప్పులతో అల్లాడుతున్నా రు. నీరసం ఆవహించి అడుగు తీసి అడుగు వేయలేకపోతు న్నారు. గ్రామంలో 700 వరకు ఆవాసాలు ఉండగా 2 వేల వరకు జనాభా ఉంది. అక్కడ 20 రోజులుగా వైరల్ జ్వరా లతో గ్రామస్తులు అల్లాడుతున్నారు. గ్రామంలో ఎక్కడ చూసినా జ్వరంతో బాధపడుతూ చేతికి సెలైన్ ఎక్కించుకొనేందుకు పెట్టుకున్న సూదులతో కనిపించడం గమనార్హం. జిల్లావ్యాప్తంగా విషజ్వరాలు ఆ గ్రామమే కాదు.. తిప్పర్తి మండలంలోని ఎస్సీ కాలనీలో ç60 మంది, నూకలవారిగూడంలో 40 మంది, సైదిబాయిగూడంలో 20 వరకు విషజ్వరాల బారినపడ్డారు. నల్లగొండ పట్టణం, కనగల్, దామరచర్ల తదితర మండలాలతోపాటు జిల్లావ్యాప్తంగా విషజ్వరాలు విజృంభిస్తున్నాయి. గ్రామ పంచాయతీల్లో పారిశుధ్యం నిర్వహణకు నిధుల్లేక మురికి కాలువలు శుభ్రం చేయడం, ఫాగింగ్ చేయడం వంటి పనులు చేపట్టకపోవడంతో దోమలు వ్యాప్తి చెంది విషజ్వరాలు విజృంభిస్తున్నాయి.మరోవైపు జిల్లాలో జనవరి నుంచి ఇప్పటివరకు పీహెచ్సీలవారీ లెక్కల ప్రకారం 466 డెంగీ కేసులు నమోదవగా అందులో గత నెలలోనే 162 కేసులు నమోదయ్యాయి. కానీ వైద్య, ఆరోగ్యశాఖ మాత్రం జిల్లాలో 157 డెంగీ కేసులు, 7 చికున్‌గున్యా కేసులు, ఒక మలేరియా కేసు మాత్రమే నమోదైనట్లు ప్రభుత్వానికి నివేదించినట్లు తెలిసింది. అనధికార లెక్కల ప్రకారం జిల్లాలో సుమారు 1500కు పైగా డెంగీ కేసులు నమోదైనట్లు ప్రైవేటు ఆస్పత్రి వర్గాలు చెబుతున్నాయి. నాన్నా.. నన్ను కాపాడు తీవ్ర జ్వరం బారినపడిన ఓ టెన్త్ విద్యార్థిని వేడుకోలువైద్యం కోసం తరలిస్తుండగా మృతికౌటాల: ‘నాన్నా.. నన్ను కాపాడు’.. తీవ్ర జ్వరంబారిన పడిన ఓ టెన్త్ విద్యార్థిని తన తండ్రితో పలికిన చివరి మాటలు ఇవి. దీంతో ఆ తండ్రి మెరుగైన వైద్యం కోసం శనివారం హైదరాబాద్ తరలిస్తుండగా మార్గమధ్యలోనే ఆమె మృతిచెందింది. కుమా ర్తె మృతిని తట్టుకోలేకపోతున్న తండ్రి.. ‘నిన్ను కాపాడుకోలేక పోయిన బిడ్డా’అంటూ గుండెలవిసేలా రోదిస్తున్నాడు. ఈ ఘటన కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా గుండాయిపేటలో విషాదం నింపింది. స్థానికుల కథనం ప్రకారం.. గుండాయిపేటకు చెందిన జాడె కిశోర్, సురేఖ దంపతులకు ముగ్గురు సంతానం. పెద్ద కుమార్తె పూజ (16) జిల్లా కేంద్రంలోని గిరిజన సంక్షేమ బాలికల వసతిగృహంలో ఉంటూ టెన్త్ చదువుతోంది. జ్వరం రావడంతో గత శనివారం తండ్రికి ఫోన్ చేసింది. ‘నాన్నా జ్వరమొచ్చింది.. చేతనైతలేదు.. కాళ్లు చేతులు గుంజుతున్నయ్.. ఇంటికి తీసుకుపో’అని చెప్పింది. దీంతో ఆమెను ఇంటికి తీసుకెళ్లారు. స్థానిక ఆర్ఎంపీల వద్ద వైద్యం చేయించినా జ్వరం తగ్గకపోగా శుక్రవారం సాయంత్రానికి మరింత ఎక్కువైంది. దీంతో కుటుంబ సభ్యులు వెంటనే మహారాష్ట్రలోని చంద్రాపూర్‌లో ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లగా శనివారం మధ్యాహ్నం పరిస్థితి విషమించింది. దీంతో వైద్యుల సూచన మేరకు హైదరాబాద్‌కు అంబులెన్స్‌లో తరలిస్తుండగా మార్గమధ్యలో పూజ తన తండ్రి చేయి పట్టుకొని తనను కాపాడాలని కోరింది. దీంతో తండ్రి ఏమీ కాదని ధైర్యం చెప్పాడు. కానీ కాసేపటికే పూజ మరణించింది. కాగా, గుండాయిపేట గ్రామంలో కొద్ది రోజులుగా విష జ్వరా లు ప్రబలుతున్నాయి. ప్రతి ఇంట్లోనూ జ్వర బాధితులు ఉన్నారు. జ్వరాల నియంత్రణకు వైద్య శిబిరం ఏర్పాటు చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు. -
డబ్ల్యూహెచ్‌వో చెప్పినా.. పెడచెవిన..
‘ఈ సీజన్లో తెలంగాణకు డెంగీ ప్రమాదం పొంచి ఉంది. డెంగీ ప్రమాదం ఎక్కువగా ఉన్న రాష్ట్రాల జాబితాలో తెలంగాణ ఉండగా, డెంగీలోని నాలుగు ప్రధాన వేరియంట్లన్నీ ఇక్కడే కనిపిస్తున్నాయి. డీఈఎన్‌వీ1, డీఈఎన్‌వీ2, డీఈఎన్‌వీ3, డీఈఎన్‌వీ4 ప్రభావం ఎక్కువగా ఉంటుంది. కొన్నిసార్లు రెండు మూడు వేరియంట్లు కూడా ఒకేసారి రోగులపై దాడి చేసే ప్రమాదం పొంచి ఉంది.’ – రాష్ట్రానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరికసాక్షి, హైదరాబాద్: ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరికలకు తగ్గట్టే రాష్ట్రంపై డెంగీ పంజా విసురుతోంది. గతేడాదితో పోలిస్తే ఇప్పుడు పెద్దఎత్తున కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని..ఆస్పత్రుల్లో అవసరమైన కిట్లు, మౌలిక సదుపాయాలు కల్పించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది. కానీ ప్రజారోగ్య సంచాలకుల విభాగం మాత్రం క్షేత్రస్థాయిలో సరైన చర్యలు తీసుకోవడంలో విఫలమవుతోందన్న విమర్శలు ఉన్నాయి. గతేడాది మొదటి ఆరు నెలలతో పోలిస్తే..ఈ ఏడాది ఆరు నెలల్లో డెంగీ కేసులు అధికంగా నమోదైనట్టు వైద్యారోగ్యశాఖ నివేదిక పేర్కొంది.లక్షలాది మందికి జ్వరాలు.. ఆస్పత్రులు కిటకిటరాష్ట్రంలో లక్షలాది మందికి జ్వరాలు సోకాయని వైద్యారోగ్యశాఖ వర్గాలు చెబుతున్నాయి. ఈ మేరకు తాజాగా ఒక నివేదికను ప్రభుత్వానికి పంపించింది. ఒక అంచనా ప్రకారం ప్రస్తుతం రాష్ట్రంలో దాదాపు 3 లక్షల మంది జ్వరాలతో బాధపడుతున్నారని ఒక వైద్యాధికారి వెల్లడించారు.దీంతో రాష్ట్రంలో జ్వరాలతో ఆస్పత్రులు కిటకిటలాడుతున్నాయి. మరోవైపు చికున్‌గున్యా కేసులు భారీగా నమోదయ్యాయి. చాలామంది రోగులు జ్వరంతో బాధపడుతూ ఒళ్లు నొప్పులు కూడా ఉంటున్నట్టు చెబుతున్నారు. కాగా, ఆస్పత్రుల్లో ఔట్ పేషెంట్లు పెరి గారు. హైదరాబాద్ ఫీవర్ ఆస్పత్రిలో సాధారణ రోజుల్లో 40 మంది వచ్చేవారు..కానీ ఇప్పుడు ఆ సంఖ్య వందకు పెరిగిందని డాక్టర్లు చెబుతున్నారు. గాంధీ, ఉస్మానియా ఆస్పత్రులకు వెయ్యిచొప్పున ఓపీ ఉంటోంది.రక్తస్రావం జరిగితే ప్రమాదకరండెంగీని ముందుగా గుర్తించితే 80 శాతం వరకు ఎటువంటి ప్రమాదం లేకుండా చికిత్స పొందవచ్చు. కానీ కొందరికి తీవ్రమైన రక్తస్రావం అవుతుంది. ముక్కు నుంచి కానీ, మలం ద్వారా గానీ, బ్రష్ చేసేప్పుడు పళ్ల మధ్య నుంచి రక్తస్రావం అవుతుంది. ఇలా అధికంగా రక్తస్రావం అయితేనే ప్రమాదకరం. మహిళలకు పీరియడ్స్ సమయంలో సాధారణ రక్తస్రావం కంటే అదనంగా అయ్యే అవకాశం ఉంటుంది. దాన్ని వారు గుర్తించాలి. అలాంటి సమయాల్లో ప్లేట్లెట్ల సంఖ్య 50 వేలున్నా సరే తప్పనిసరిగా ప్లేట్లెట్లు ఎక్కించాల్సి ఉంటుంది. రక్తస్రావం కానప్పుడు 20 వేల వరకు ప్లేట్లెట్లు పడిపోయినా ప్రమాదం కాదు. అప్పుడు ప్రత్యేకంగా ప్లేట్లెట్లు ఎక్కించి రోగిని సాధారణ స్థితికి తీసుకురావొచ్చు.– డాక్టర్ కె.కృష్ణప్రభాకర్, హైదరాబాద్ -
జ్వరం ఒక వ్యాధి కాదు!
మనం జ్వరాన్ని ఓ వ్యాధిగా చూస్తాం. కాబట్టే జ్వరం రాగానే దాన్ని తగ్గించే మాత్రలు వేసుకోవాలని పోరపడుతూ ఉంటాం. నిజానికి జ్వరం అనేది వ్యాధి కాదు...అది వ్యాధిలో కనిపించే ఓ లక్షణం మాత్రమే! కాబట్టి అలా కనిపించే లక్షణానికి చికిత్స చేయటం మాని అందుకు మూల కారణాన్ని కనిపెట్టి దాన్ని సరిదిద్దే చికిత్స తీసుకోవాలి. ఇందుకోసం తప్పనిసరిగా వైద్యుల్ని ఆశ్రయించాల్సిందే! జ్వరం తగ్గుతూ పెరుగుతున్నా, విడవకుండా రెండు రోజుల కు మించి వేధిస్తున్నా నిర్లక్ష్యం చేయకుండా డాక్టర్ని కలిసి పరీక్షలు చేయించుకుని జ్వరాన్ని కలిగించిన వ్యాధి గురించి తెలుసుకోవాలి. అలా కాకుండా తాత్సారం చేస్తే జ్వర కారక వ్యాధి క్రిములు అంతర్గత అవయవాల మీద దాడిచేసి ఆరోగ్యపరంగా తీవ్ర నష్టం కలిగించవచ్చురక్తశుద్ధికి...👉టేబుల్ స్పూన్ నెయ్యి లో పది మిరియాలు వేసి చిన్న మంట మీద వేయించి తర్వాత వడపోసి, మిరియాలు తీసివేయాలి. వీటిని ఆహారంలో మొదటి ముద్దలో కలిపి తినాలి, 40 రోజులపాటు ఇలా చేస్తుంటే రక్తం శుద్ధి అవుతుంది. దీనివల్ల చర్మవ్యాధులు అన్నీ హరించి వేస్తాయి పాస్టిక్ వాటర్ బాటిల్ లో, నీళ్లు తాగడం ఆపి కేవలం రాగి ΄ాత్రలో నీళ్లు మాత్రమే తాగండి ∙మీకు వచ్చే అన్ని రోగాలు, కొద్ది రోజులలో మటుమాయమవుతాయి. -
వెస్ట్ నైలు వైరస్‌ని తొలిసారిగా అక్కడ గుర్తించారు! ఎవరికి ప్రమాదమంటే..
ఇటీవల కేరళలోని వివిధ జిల్లాల్లో వెస్ట్ నైల్ ఫీవర్ కేసులు విజృంభిస్తున్నాయి. దాదాపు పదిమందికి పైగా ఈ వైరస్ సోకింది. ఈ వైరస్ దోమ కాటు వల్ల వ్యాపిస్తుందట. అందువల్ల సురక్షితంగా ఉండేలా జాగ్రలు తీసుకోవటం ముఖ్యం అని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అక్కడ పలు చోట్ల ఇలాంటి కేసులు నమోదవ్వడంతో కేరళ హైఅలర్ట్‌లో ఉంది. అసలేంటీ వెస్ట్ నైలు జ్వరం..? ఎందువల్ల వస్తుందంటే..?వెస్ట్ నైలు జ్వరం అంటే..వెస్ట్ నైలు జ్వరం అనేది వెస్ట్ నైల్ వైరస్ (WNV) వల్ల కలిగే వైరల్ ఇన్ఫెక్షన్. ఈ ఇన్ఫెక్షన్ ఉన్న దోమల కాటు వల్ల వస్తుంది. ముఖ్యంగా క్యూలెక్స్ జాతికి చెందిన జాతులు. ఈ వైరస్ మొట్టమొదట 1937లో ఉగాండాలో గుర్తించారు. ఆ తర్వాత భారతదేశంలో అలప్పుజా జిల్లాలో ఇలాంటి తొలికేసు నమోయ్యింది.లక్షణాలు..కడుపు నొప్పి జ్వరం, తలనొప్పి, గొంతు నొప్పిఆకలి లేకపోవడంకండరాల నొప్పులువికారం, వాంతులు, అతిసారం, దద్దుర్లువాచిన శోషరస గ్రంథులుఈ లక్షణాలు సాధారణంగా 3 నుంచి 6 రోజుల వరకు లేదా ఒక నెల పాటు ఉండవచ్చు. వ్యాధి తీవ్రమైతే వెస్ట్ నైల్ ఎన్సెఫాలిటిస్ లేదా వెస్ట్ నైల్ మెనింజైటిస్ లక్షణాలు కనిపిస్తాయి. అవి ఎలా ఉంటాయంటే..స్పష్టంగా ఆలోచించే సామర్థ్యంలో గందరగోళం లేదా మార్పుస్పృహ కోల్పోవడం లేదా కోమాకండరాల బలహీనతగట్టి మెడఒక చేయి లేదా కాలు బలహీనతఎవరికి ప్రమాదమంటే..60 ఏళ్లు పైబడిన వ్యక్తులు: వెస్ట్ నైల్ వైరస్ సోకితే 60 ఏళ్లు పైబడిన వ్యక్తులు తీవ్రమైన లక్షణాలు, సమస్యలు అభివృద్ధి చేసే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.బలహీనమైన రోగనిరోధక వ్యవస్థ: బలహీనమైన రోగనిరోధక వ్యవస్థలు ఉన్నవారు లేదా క్యాన్సర్, మధుమేహం, మూత్రపిండాల సమస్యలు లేదా అవయవ మార్పిడి వంటి ఏదైనా వ్యాధితో బాధపడుతున్నవారికి ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. నివారణ చర్యలుదోమల నియంత్రణ: దోమల వృద్ధి అరికట్టేలా నిలబడి ఉన్న నీటిని తొలగించడం. క్రిమిసంహారక మందులను ఉపయోగించడం వంటి చర్యలను అమలు చేయడం ద్వారా దోమల జనాభాను తగ్గుతుంది ఫలితంగా ఈ సమస్య తీవ్రత తగ్గుముఖం పడుతుంది.వ్యక్తిగత రక్షణ: పొడవాటి చేతుల చొక్కాలు, పొడవాటి ప్యాంటు ధరించడం. DEET లేదా నిమ్మకాయ యూకలిప్టస్ నూనెను కలిగి ఉన్న క్రిమి వికర్షకాలను పూయడం వల్ల దోమలు కుట్టకుండా నిరోధించవచ్చు.బహిరంగ కార్యకలాపాలను నివారించండి: దోమలు ఎక్కువగా ఉండే తెల్లవారుజాము, సంధ్యా సమయంలో బహిరంగ కార్యకలాపాలను తగ్గించడం ద్వారా దోమల కాటు ప్రమాదాన్ని తగ్గించొచ్చు.దోమల నివారిణిని పిచికారీ చేయండి: బయటకు వెళ్లే ముందు దోమల నివారణను పిచికారీ చేయండి లేదా ఓడోమోస్ను పూయండి.తలుపులు, కిటికీలు మూసి ఉంచండి: మీ ఇళ్లలోకి దోమలు రాకుండా తలుపులు, కిటికీలు మూసి ఉంచండి. రాత్రిపూట కుట్టకుండా ఉండటానికి దోమతెరలను ఉపయోగించండి.(చదవండి: మహిళ ముక్కులో వందలకొద్ది పురుగులు!కంగుతిన్న వైద్యులు) -
కేరళలో వెస్ట్ నైల్ ఫీవర్.. ఎంత ప్రమాదకరమంటే?
కేరళలో వెస్ట్ నైల్ ఫీవర్ విస్తరిస్తోంది. దోమలు కుట్టడం ద్వారా ఈ జ్వరం సోకుతుంది. రాష్ట్రంలోని మూడు నగరాల్లో ఈ కేసులు నమోదైన నేపధ్యంలో అన్ని జిల్లాల్లో ప్రీ మాన్సూన్ క్లీనింగ్ క్యాంపెయిన్ నిర్వహించాలని రాష్ట్ర ఆరోగ్యశాఖ ఆదేశాలు జారీచేసింది. ఈ జ్వరం లక్షణాలు, ఇది సోకకుండా ఎలా రక్షించుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.కోజికోడ్‌లో ఇప్పటివరకు ఐదు వెస్ట్ నైల్ ఫీవర్ కేసులు నమోదయ్యాయని వైద్యాధికారులు మీడియాకు తెలిపారు. మలప్పురం, త్రిస్సూర్‌లో కూడా ఈ వ్యాధి బారినపడినవారున్నారని, ఈ వ్యాధి లక్షణాలు త్వరగా కనిపించవని వారు తెలిపారు. అందుకే వ్యాధి సోకిన వారి సంఖ్యను అధికారులు ఇంకా పూర్తి స్థాయిలో వెల్లడించలేకపోతున్నారని సమాచారం.మీడియాకు అందిన వివరాల ప్రకారం ఈ జ్వరం సోకిన ఐదుగురిలో నలుగురు కోలుకున్నారు. ఒకరు ఇప్పటికీ వైద్య కళాశాలలో చికిత్స పొందుతున్నారు. వెస్ట్ నైల్ జ్వరం లక్షణాలు డెంగ్యూ మాదిరిగానే ఉంటాయి. 80 శాతం కేసుల్లో లక్షణాలు కనిపించవు.వెస్ట్ నైల్ వ్యాప్తి నివారణకు తీసుకుంటున్న చర్యల గురించి కేరళ ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ మాట్లాడుతూ దోమల వృద్ధిని అరికట్టడం, నీటి వనరులను శుభ్రపరచడంపై స్థానిక అధికారులకు సూచనలు ఇచ్చామని తెలిపారు. రాష్ట్రంలో 2011 నుంచి ఈ తరహా కేసులు నమోదవుతున్నాయని, ఈ ఫీవర్ విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. అయితే డ్యెంగ్యూ లక్షణాలు కనిపించినవారు వెంటనే ఆసుపత్రిలో పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.వెస్ట్ నైల్ ఫీవర్ దోమ కాటు ద్వారా మనుషులకు సోకుతుంది. యూఎస్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ తెలిపిన వివరాల ప్రకారం ఈ వ్యాధి సోకిన ప్రతి 10 మందిలో 8 మందికి లక్షణాలు కనిపించవు. అయితే వాంతులు, విరేచనాలు, తలనొప్పి వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ వ్యాధి సోకిన అనంతరం తగిన చిక్సిత్స అందకపోతే బాధితులు మృతి చెందే అవకాశం ఉంది. కేరళలో ఈ వ్యాధి సోకి 2019లో ఒకరు, 2022లో ఒకరు మృతి చెందనట్లు నివేదికలు చెబుతున్నాయి. -
ఒక్కరోజు ఎండలకే పవన్ పరార్
ఎండాకాలం... ఉష్ణోగ్రతలు రోజురోజుకూ పెరుగుతూ ఉంటాయి. సుకుమారంగా సున్నితంగా పెరిగే జీవులకు ఇవి గడ్డు రోజులు. కోళ్లఫారాలు...హైబ్రిడ్ ఆవులు.. గేదెలు పెంచేవాళ్ళు తమ జీవాలను కాపాడుకునేందుకు వాటికి ఏసీలు పెడుతుంటారు. తరచూ చల్లని నీళ్లు చల్లుతూ వాటిని కూల్ చేస్తుంటారు.. లేదంటే అవి ఎండవేడికి తట్టుకోలేక గుడ్లు తేలేస్తాయి..నిత్యం ప్రజల్లోనే ఉంటాను.. ప్రజలతోనే ఉంటాను.. ప్రజలకోసం ఉంటాను.. సీఎం వైఎస్ జగన్‌కు యుద్ధాన్ని చూపిస్తాను అంటూ పెద్ద డైలాగ్స్ చెప్పిన పవన్ కల్యాణ్ పిఠాపురం పర్యటనను ముగించారు. వాస్తవానికి ఏప్రిల్ రెండో తేదీ వరకూ పిఠాపురంలో ఉండేలా షెడ్యూల్ రూపొందించారు. మచ్చుకు ఒక రోజు అలా పిఠాపురం వెళ్లి టీడీపీ వర్మను.. ఇంకొందరు పెద్దలను కలిసి ప్రచారం చేసారు. ప్లీజ్.. ప్లీజ్.. నన్ను గెలిపించండి అని అర్థించారు. తాను గెలిస్తే అక్కడ ప్రైవేటుగా నిధులు సేకరించి ఆస్పత్రి నిర్మిస్తాను అని చెప్పి... కాస్త హడావుడి చేసారు. అంతే.. మళ్ళీ సాయంత్రం చూస్తే పవన్ లేరు. జంప్.. ఏమైంది అని ఆరా తీస్తే జర్రమొచ్చింది అనే సమాచారం తెలిసింది. మండుటెండల్లో రెండ్రోజులు జనాల్లో తిరిగేసరికి ఆయనకు ఆరోగ్యం చెడింది. సాయంత్రానికి జర్రమొచ్చింది... జ్వరం రావడంతో డాక్టర్లు రెస్ట్ తీసుకోవాలని సూచించారు.. దానికితోడు ఆయన మీద అభిమానులు పూలు చల్లడంతో అది కూడా ఎలర్జీకి దారితీసిందని తెలిసింది.. దీంతో ఇక ప్రచారం రద్దు చేసి విశ్రాంతి కోసం హైదరాబాద్ వెళ్లిపోయారు. రాజకీయం అంటే అప్పుడప్పుడు వచ్చి షో చేసి.. ఫోటోలు దిగి... ప్రభుత్వాన్ని.. రాజకీయ వైరి పక్షాలను నోటికొచ్చినట్లు తిట్టడం కాదని.. ఎండావానలను లెక్కచేయకుండా ప్రజల్లో ఉండాలని... అప్పుడే వారి అభిమానం చూరగొంటామని ప్రజలు సైతం అంటున్నారు. ఇక పవన్ కల్యాణ్ అంటే సినిమాల్లో పెద్ద స్టార్.. అడుగుతీసి అడుగువేస్తే పూలు పరుస్తారు... గొడుగుపడతారు.. మేకప్ చెదిరిపోకుండా క్షణానికోసారి టచప్ చేస్తారు. గంటకోసారి ఏసీలో కూర్చోవచ్చు.. కానీ రాజకీయాల్లో అదేం ఉండదు.. ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ... వాగులు వంకలు... గుట్టలు కొండలు అన్నీ దాటాలి. ప్రతి గుండెనూ తడమాలి... ప్రతిపేదవాన్నీ తనవాడు అనుకోవాలి... అన్ని చేస్తేతప్ప ప్రజల్లో నిలవలేరు. జస్ట్ అలా వచ్చి నోటికొచ్చినట్లు తిట్టేసి వెళ్ళిపోతే రాజకీయం కాదు అనే విషయం పవన్ కల్యాణ్‌కు అర్థం కాలేదు. ఒక్కరోజు ఎండలో తిరిగేసరికి జ్వరం వచ్చి వెంటనే ఆస్పత్రికి పరుగెత్తే పరిస్థితి వచ్చింది... దీంతో అయన టూర్ కోసం ఈరోకు ఎదురు చూసిన జనసైనికులు.. అక్కడి ఓటర్లు అయ్యో... సేనాని దమ్ము ఇంతేనా... ముదురు కబుర్లు చెప్పడం.. నోటికొచ్చినట్లు అరవడం... స్క్రిప్టెడ్ డైలాగ్స్ చెప్పడం తప్ప ఆయనకు పట్టుమని రెండ్రోజులు కూడా ప్రజల్లో ఉండే స్టామినా లేదా అని నవ్వుకుంటూన్నారు. ఇక ఈయన మిగతా నియోజకవర్గాల్లో టూర్లు చేస్తారా... క్యాడర్ కోసం అన్ని జిల్లాలు ఈ నిప్పులుగక్కే ఎండల్లో తిరిగి ప్రచారం చేయగలరా ? పిఠాపురం ఒక్కదానికే అయన ఆపసోపాలు పడిపోతుంటే మిగతా జిల్లాలకు వస్తారన్న నమ్మకమే పోతోంది అంటున్నారు. ఆయన్ను నమ్ముకుని టిక్కెట్లు తెచ్చుకుని డబ్బులు ఖర్చు చేసి పోటీకి దిగిన మా పరిస్థితి ఏమిటని అభ్యర్థుల్లో ఆందోళన మొదలైంది. దీంతో ఆగండాగండి రెండ్రోజులు రెస్ట్ తీసుకుని... బ్రాయిలర్ కోడి మళ్ళీ కోలుకుని కూతకు వస్తుంది అని కొందరు పంచులు వేస్తున్నారు. -సిమ్మాదిరప్పన్న -
నిర్లక్ష్యం.. నిండు ప్రాణం ఖరీదు.. టాలీవుడ్ డైరెక్టర్ ట్వీట్ వైరల్!
టాలీవుడ్ డైరెక్టర్ వెంకీ కుడుముల టాలీవుడ్ అభిమానులకు వార్నింగ్ ఇచ్చారు. జ్వరం వస్తే నిర్లక్ష్యం చేయవద్దని ప్రజలతో పాటు ఫ్యాన్స్‌కు విజ్ఞప్తి చేశారు. ఇలాంటి చిన్న తప్పుతో ప్రాణాలు పోగొట్టుకోవద్దని ఆయన సూచించారు. ప్రస్తుతం వెంకీ కుడుముల చేసిన ట్వీట్ నెట్టింట వైరల్‌గా మారింది. ఇంతకీ అసలేం జరిగిందో తెలుసుకుందాం. (ఇది చదవండి: రష్మిక వీడియోలానే మరో స్టార్ హీరోయిన్.. సోషల్ మీడియాలో వైరల్!) ట్వీట్లో వెంకీ రాస్తూ..' కొన్ని వారాలుగా మా కజిన్ జ్వరంతో బాధపడుతున్నారు. అది సాధారణ జ్వరమేనని అనుకున్నారు. దీంతో టైముకి వైద్యుని వద్దకు వెళ్లలేదు. అది కాస్తా అరుదైన జీబీ సిండ్రోమ్‌కు (మనిషిలోని రోగనిరోధకశక్తి అదుపు తప్పి నరాలపై దాడి చేయటం) దారి తీసింది. సరైన సమయంలో చికిత్స తీసుకుని ఉంటే ఇలా జరిగేది కాదు. ఆలస్యం చేయడం వల్లే జీవితాన్ని కోల్పోవాల్సి వచ్చింది. నిర్లక్ష్యం మా కుటుంబానికి తీరని దుఃఖం మిగిల్చింది. కొవిడ్ తర్వాత జ్వరాన్ని కూడా తేలికగా తీసుకుంటున్నారు. దయచేసి అలా చేయొద్దు. జ్వరం వస్తే అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు. వెంటనే వైద్యుడిని సంప్రదించండి. ఇలాంటి చిన్న జాగ్రత్తలే మన ప్రాణాలు కాపాడతాయి.'అని రాసుకొచ్చారు. కాగా.. వెంకీ ప్రస్తుతం నితిన్‌తో ఇటీవల సినిమాను ప్రకటించారు. భీష్మ’ తర్వాత నితిన్ - రష్మిక కాంబోలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై నిర్మిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. (ఇది చదవండి: అశ్వినిని ఏడిపించేసిన బిగ్ బాస్.. హౌస్‌లో ఏం జరిగిందంటే?) #NotJustAFever 💔🙏🏻 pic.twitter.com/kuxuXr4V5L — Venky Kudumula (@VenkyKudumula) November 7, 2023 -
నాన్నా.. హాస్పిటల్‌కు పోదాం
ధర్మపురి: నాన్నా.. ఎట్లనో అయితంది.. హాస్పిటల్‌కు పోదాం.. అంటూ విషజ్వరంతో బాధ పడిన ఓ చిన్నారి మృతిచెందింది. పాప మాట లను గుర్తు చేసుకుంటూ త ల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. వివరాల్లోకి వెళ్తే.. ధర్మపురికి చెందిన కొత్తకొండ రాజు–లక్ష్మి దంపతులకు ఇద్దరు కూతుళ్లు. రా జు స్థానికంగా ఓ రెడీమేడ్ షాపు నిర్వహిస్తుండగా.. తమ పిల్లలను అల్లారుముద్దుగా పెంచుకుంటున్నారు. మూడో తరగతి చదువుతున్న పెద్ద పాప సమన్వి(8)కి వారం రోజుల క్రితం జ్వరం రావడంతో స్థానిక ఆస్పత్రిలో చికిత్స చే యించారు. న యం కాకపోవడంతో జగిత్యాల తరలించగా వై ద్యులు విష జ్వరంగా తేల్చారు. చికిత్స తర్వా త కొంత నయం కావడంతో రెండు రోజుల క్రితం డిశ్చార్జి చేయడంతో ఇంటికి తీసుకువచ్చారు. ఆదివారం అర్ధరాత్రి మళ్లీ జ్వరం రావడంతో తీవ్ర అస్వస్థతకు గురైంది. కుటుంబసభ్యులు వెంటనే జగిత్యాలలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో కరీంనగర్ తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ మనస్వి సోమవారం సాయంత్రం మృతి చెందింది. -
ప్రాణాలు తీస్తున్న ఆర్ఎంపీలు?! అక్కడ అసలేం జరుగుతోంది?
సిర్పూర్(టి) మండలం భూపాలపట్నం గ్రామానికి చెందిన బూరం చెన్నమల్లు యాదవ్ స్వల్ప జ్వరంతో ఆర్ఎంపీ వద్దకు వెళ్లాడు. ఆర్ఎంపీ ఇచ్చిన ఇంజక్షన్‌తో కేవలం ఐదు గంటల్లో ప్రాణాలు కోల్పోయాడు. చింతలమానెపల్లి మండలం రవీంద్రనగర్‌కు చెందిన 14 ఏళ్ల బాలుడు సైతం ఇలాగే మృతి చెందాడు. తాజాగా చింతలమానెపల్లి మండలం కోర్సిని గ్రామానికి చెందిన వివాహిత దన్నూరి పుష్పలత ప్రాణాలు కోలో్పయింది. ఆమె చిన్నారులు తల్లి ప్రేమకు దూరమయ్యారు. కౌటాల మండలం తుమ్మిడిహెట్టికి చెందిన గోంగ్లె బండు– చైతన్య దంపతుల కుమార్తె ఆద్యశ్రీ (4) ఓ ఆర్ఎంపీ నిర్లక్ష్యంతో ప్రాణాలు విడిచింది. వరుసగా చోటుచేసుకుంటున్న ఈ ఘటనలు ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. చింతలమానెపల్లి(సిర్పూర్): గల్లీగల్లీకి వెలుస్తున్న ఆర్ఎంపీ క్లినిక్‌లు, అనుమతి లేని రక్త పరీక్షా కేంద్రాలు.. ప్రజల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుంటున్నాయి. విచ్చలవిడి వైద్యంతో ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయి. పరిధి దాటి వైద్యం చేస్తు న్న కొందరు ఆర్ఎంపీలు పేదల ప్రాణాలు తీస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 1200 మందికి పైగానే ఆర్ఎంపీలు ఉన్నట్లుగా ఆర్ఎంపీ, పీఎంపీల సంఘాల లెక్కలు చెబుతున్నాయి. కనీస పరిజ్ఞానం లేని కొందరు ఆర్ఎంపీలు, పీఎంపీలు వైద్యపరీక్షలు చేస్తున్నారు. వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయడం, సొంతంగా మందులు రాయడం, ఇంజక్షన్లు వేయడం చేస్తున్నారు. కొద్దినెలల పాటు ఆర్ఎంపీలకు అసిస్టెంట్లుగా పనిచేసిన వారు సైతం గ్రామాల్లో సొంతంగా క్లినిక్‌లు తెరుస్తున్నారు. ధనార్జనే ధ్యేయం.. గతంలో ప్రభుత్వాలు తెచ్చిన నిబంధనలను ఆసరాగా చేసుకుని కొందరు ఆర్ఎంపీలు ధనార్జనే ధ్యేయంగా క్లినిక్‌ల్లో వైద్యం చేస్తున్నారు. ప్రాథమిక చికిత్స అందించాల్సి వీరు ఏకంగా ప్రత్యేక భవనాల్లో పడకలు ఏర్పాటు చేసి పదుల సంఖ్యలో రోగులకు వైద్యం అందిస్తున్నారు. భారీ ఫ్లెక్సీల ఏర్పాటు చేసుకుని ప్రచారం చేసుకుంటున్నారు. కొన్నిచోట్ల క్లినిక్, మందుల దుకాణం, వ్యాధి నిర్ధారణ కేంద్రాలను ఒకేగదిలో నిర్వహిస్తుండడం గమనార్హం. పరిమితులు దాటి చేస్తున్న వైద్యం రోగులకు ప్రాణ సంకటంగా మారింది. కాగజ్‌నగర్, ఆసిఫాబాద్‌ల్లోనూ ఆర్ఎంపీ క్లినిక్‌లు ఎలాంటి అనుమతి లేకుండా నిర్వహిస్తున్నా పట్టించుకునే వారు కరువయ్యారు. ప్రాణాలు పోతున్నా చర్యలేవి..? ఆర్ఎంపీలు పరిధి దాటి వైద్యం చేస్తున్నా వైద్యారోగ్యశాఖ అధికారులు మాత్రం చర్యలు తీసుకోవ డం లేదనే ఆరోపణలు ఉన్నాయి. ‘ ఓ వైపు ప్రాణా లు పోతున్నా పట్టించుకోరా..?’ అంటూ ప్రజలు నుంచి ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. కిల్లింగ్ ఇంజక్షన్స్.. ఇటీవల బాధితులు మృతి చెందిన ఘటనలు ఆర్ఎంపీలు అందించిన వైద్యంతోనే జరిగినట్లు తెలుస్తోంది. జ్వరంతో బాధపడుతున్న వారికి ఇంజక్షన్ ఇచ్చిన అనంతరం తీవ్ర అస్వస్థతకు గురై గంటల వ్యవధిలోనే ప్రాణాలు కోల్పోయారు. వాంతులు చేసుకోవడం, చలి పెరగడం, శరీరమంతా దద్దుర్లు రావడం వంటి లక్షణాలు అధికంగా కనిపిస్తున్నాయి. పరిస్థితి అదుపులోకి రాకపోగా రోగులు నేరుగా కోమాలోకి వెళ్తున్నారు. ఆర్ఎంపీలు చేస్తున్న వైద్యం, వారు ఇస్తున్న ‘కిల్లింగ్ ఇంజక్షన్’ ఏంటన్నది వైద్యాధికారులు తేల్చాల్సి ఉంది. రోగుల ప్రాణాలకు ముప్పు వైద్యం అనేది రోగిని అన్నిరకాలుగా పరీక్షించి అందించాల్సి ఉంటుంది. సరైన పద్ధతిలో వైద్యం అందించకపోతే వారి ప్రాణాలకు ముప్పు ఏర్పడే అవకాశాలు ఉంటాయి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం అర్హతలు ఉన్నవారి వద్దే వైద్యం తీసుకోవాలి. బాధితుల పరిస్థితిని తెలుసుకునే అవకాశం కేవలం నిపుణులకు మాత్రమే ఉంటుంది. – అరుణకొండ రవికుమార్, ఎండీ జనరల్ ఫిజీషియన్, మంచిర్యాల ఎక్కువ డోస్ మందులతోనే.. రోగుల జ్వరం తీవ్రతతతోపాటు ప్లేట్‌లెట్స్‌ను కూడా వైద్యులు గమనించాల్సి ఉంటుంది. ప్లేట్లెట్స్ తక్కువగా ఉంటే ఫ్లూయిడ్స్, నరాల ద్వారా ఇచ్చే మందులను పరిశీలనలో ఇవ్వాల్సి ఉంటుంది. ఎక్కువ డోస్ మందులను తీవ్రస్థాయిలో వినియోగించడం ద్వారా శరీర ఉష్ణోగ్రతల్లో మార్పు వచ్చి ప్రాణాలకు ప్రమాదం ఏర్పడుతుంది. – సందీప్ జాదవ్, ఆదిలాబాద్ రిమ్స్ వైద్యులు -
దడ పుట్టిస్తున్న ఇన్‌ఫ్లూయెంజా వైరస్.. వాళ్లకి రిస్క్ ఎక్కువ
ఆదిలాబాద్‌టౌన్: జిల్లాలో ఇన్‌ఫ్లూయెంజా (శ్వాసకోశ సంబంధిత వ్యాధి) దడ పుట్టిస్తోంది. ఏ ఇంటికెళ్లినా ఎవరో ఒకరు దగ్గు, జ్వరం, ఒళ్లు నొప్పులతో బాధపడుతూనే ఉన్నారు. ఈ వైరస్ కోవిడ్ మాదిరిగానే ఒకరి నుంచి మరొకరికి గాలి ద్వారా వ్యాప్తి చెందుతుంది. బాధితులు దాదాపు పది నుంచి పక్షం రోజుల వరకు జ్వరం బారిన పడతారు. జ్వరం తగ్గిన కూడా ఒళ్లు నొప్పులు ఉంటాయని వైద్యులు చెబుతున్నారు. అయితే ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొంటున్నారు. ఐదేళ్లలోపు చిన్నారులు, 65 ఏళ్లు పైబడిన వృద్ధులు, గర్భిణులు, రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారికి ఎక్కువగా సోకుతోంది. దీర్ఘకాలిక శ్వాసకోశ వ్యాధులతో బాధపడుతున్న వారికి తీవ్ర ప్రమాదం ఉందని సూచిస్తున్నారు. ప్రస్తుతం జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిలో ఎక్కువ మందికి ఇన్‌ఫ్లూయెంజా లక్షణాలే కనిపిస్తున్నాయి. చిల్డ్రన్ వార్డులో ఎక్కువ మంది చిన్నారులు శ్వాస సంబంధిత ఇబ్బందులతో అవస్థలు పడుతున్నారు. కొంత మంది మృత్యువాత పడిన ఘటనలు సైతం ఉన్నాయి. అతలాకుతలం.. ప్రస్తుతం జిల్లాలో వైరల్ జ్వరాలు విజృంభిస్తున్నాయి. ఏజెన్సీతో పాటు మైదాన ప్రాంతాల్లో వీటి బారిన పడి జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీనికి తోడు డెంగీ కేసులు నమోదవుతున్నాయి. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటివరకు అధికారిక లెక్కల ప్రకారం 104 కేసులు నమోదయ్యాయని పేర్కొంటుండగా, అనధికారికంగా 200కు పైగానే బాధితులు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రైవేట్‌తో పాటు జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆస్పత్రి, ఉట్నూర్, బోథ్ ఏరియా ఆస్పత్రులు జ్వర పీడితులతో కిక్కిరిసిపోతున్నాయి. ఈనెలలోనే 32 మంది డెంగీ బారిన పడినట్లు వైద్యారోగ్య శాఖ లెక్కలు చెబుతున్నాయి. కాగా ప్రైవేట్ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నవారి లెక్క తేలడం లేదు. మరికొంత మంది బాధితులను హైదరాబాద్, నిజామాబాద్‌తో పాటు మహారాష్ట్రలోని యవత్మాల్, నాగ్‌పూర్ తదితర ప్రాంతాలకు తరలిస్తున్నారు. దోచుకుంటున్న ల్యాబ్‌లు.. సీజనల్ వ్యాధులను అదునుగా చేసుకొని కొంత మంది ల్యాబ్‌ల నిర్వాహకులు అందినకాడికి దండుకుంటున్నారు. జిల్లాలో డెంగీ, మలేరియా, టైఫాయిడ్ తదితర వ్యాధులతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ప్రైవేట్ ఆస్పత్రుల నిర్వాహకులు సంబంధిత ల్యాబ్‌లకు పంపి బాధితుల నుంచి డబ్బులు గుంజుతున్నారు. నిర్వాహకులకు 40 శాతం అందజేసి 60 శాతం వైద్యులు తీసుకుంటుండడంతో వీరి బిజినెస్ జోరుగా సాగుతోంది. అర్హతలు లేకున్నప్పటికీ చాలా మంది ల్యాబ్‌లను ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. దీంతో వారు రోగుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నట్లు సమాచారం. ఇంకొంత మంది శిక్షణ పూర్తి కాకుండానే ప్రైవేట్ ల్యాబ్‌లలో పనిచేస్తూ సొంతంగా పరీక్షలు జరుపుతున్నారనే ప్రచారం ఉంది. ఈ తతంగమంతా వైద్యారోగ్య శాఖ అధికారులకు తెలిసినప్పటికీ చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్నట్లు ఆరోపణలు లేకపోలేదు. నిబంధనల ప్రకారం ప్యాథలాజిస్ట్, ల్యాబ్ టెక్నీషియన్, మైక్రోబయాలజిస్ట్ కోర్సు పూర్తి చేసినవారు మాత్రమే ల్యాబ్ నిర్వహణ చేపట్టవచ్చు. అయితే దీనికి విరుద్ధంగా అనర్హులు ల్యాబ్‌లను ఏర్పాటు చేసి వైద్యులతో కలిసి అక్రమ దందా సాగిస్తున్నారు. కిక్కిరిసిన చిల్డ్రన్ వార్డు.. రిమ్స్ ఆస్పత్రి చిల్డ్రన్ వార్డు చిన్నారులతో కిక్కిరిసి కనిపిస్తోంది. నెలరోజులకు పైగా ఇదే పరిస్థితి. వార్డులో 70 బెడ్లు ఉంటే.. వందకు పైగా చిన్నారులు జ్వరాలతో చికిత్స పొందుతుండడం గమనార్హం. వీరిలో ఎక్కువగా ఇన్‌ఫ్లూయెంజా లక్షణాలు ఉన్నట్లు వైద్యాధికారులు చెబుతున్నారు. చాలా మంది శ్వాసకోశ సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. పక్షం దాటిన జ్వరం వీడటం లేదు. అలాగే మహిళా వార్డు పరిస్థితి కూడా ఇ లాగే ఉంది. జ్వరాలకు సంబంధించి అన్ని వార్డులకు కలిపి దాదాపు 400 మంది వరకు చికిత్స పొందుతున్నారు. కొద్ది రోజులుగా రిమ్స్‌లో ఓపీ 1600 వరకు నమోదవుతుంది. ఆయా పీహెచ్‌సీల్లో జిల్లా వ్యాప్తంగా దాదాపు 500 వరకు ఓపీ ఉందని అధికారులు పేర్కొంటున్నారు. వ్యాధుల కట్టడికి చర్యలు.. జిల్లాలో వ్యాధుల నివారణకు చర్యలు చేపడుతున్నాం. వాతావరణ మా ర్పుల కారణంగా జ్వరపీడితుల సంఖ్య పెరుగుతోంది. ఎక్కువ మంది శ్వాసకోశ సమస్యతో బాధపడుతున్నారు. ఈ ఏడాది 104 డెంగీ కేసులు నమోదయ్యాయి. వారానికి రెండుసార్లు డ్రైడే పాటించాలని అవగాహన కల్పిస్తున్నాం. – మెట్పెల్లివార్ శ్రీధర్,జిల్లా మలేరియా నివారణ అధికారి -
సీఎం కేసీఆర్‌కు వైరల్ ఫీవర్
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గత వారం రోజులుగా వైరల్ ఫీవర్, దగ్గుతో బాధపడుతున్నారు. వైద్యుల బృందం పర్యవేక్షణలో ఇంట్లోనే చికిత్స తీసుకుంటున్నట్లు మంత్రి కేటీఆర్ ఎక్స్ (ట్విటర్) ద్వారా వెల్లడించారు. త్వరలోనే కోలుకుంటారని వైద్యులు చెబుతున్నట్లు ఈ సందర్భంగా తెలిపారు. CM KCR Garu has been suffering from Viral Fever and Cough for the last one week. He is being treated at home by his medical team and is being monitored closely. As per Doctors he should be able to get back to normalcy in a few days — KTR (@KTRBRS) September 26, 2023 -
తలనొప్పిని తరిమేసే గాడ్జెట్.. ధర ఎంతంటే?
తలనొప్పి చాలామందిని తరచు వేధించే సమస్య. తలనొప్పి వచ్చినప్పుడల్లా మాత్రలతో ఉపశమనం పొందడం తప్ప ఇప్పటివరకు నానా తలనొప్పులకు తగిన పరిష్కారమే లేదు. అయితే, ఈ చిన్న పరికరం ఎలాంటి మొండి తలనొప్పులనైనా చిటికెలో తరిమికొడుతుంది. అమెరికన్ కంపెనీ ‘గామాకోర్’ ఇటీవల ఈ పరికరాన్ని ‘గామాకోర్ సఫైర్’ పేరుతో మార్కెట్లోకి విడుదల చేసింది. ఇది రీచార్జబుల్ బ్యాటరీతో పనిచేస్తుంది. దీనిని మెడవద్ద నరాలు ఉండేచోట పెట్టుకుని, ఆన్ చేసుకుంటే వైబ్రేట్ అవుతూ ‘వేగస్’నరాన్ని ఉత్తేజపరచి నొప్పి నుంచి ఉపశమనం కలిగిస్తుంది. అకస్మాత్తుగా వచ్చే తలనొప్పులనైనా, తరచుగా పీడించే మైగ్రేన్ వంటి తలనొప్పులనైనా ఇది నిమిషాల్లోనే తరిమికొడుతుంది. దీనిని ఉపయోగించడం ప్రారంభిస్తే, మాత్రల వాడకమే కాకుండా, వాటితో ఎదురయ్యే దుష్ఫ్రభావాలు కూడా తగ్గుముఖం పడతాయి. దీని ధర 655 డాలర్లు (రూ.54,446) మాత్రమే! -
ఏజెన్సీకి వైద్యాధికారులు
సాక్షిప్రతినిధి, వరంగల్: ఏజెన్సీలో ప్రబలుతున్న విషజ్వరాలపై శుక్రవారం ‘సాక్షి’ ప్రధాన సంచికలో ‘ఏజెన్సీకి ఫీవర్’ శీర్షికన ప్రచురితమైన కథనానికి వైద్యాధికారులు స్పందించారు. జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లో వైద్యశిబిరాలు ఏర్పాటు చేశారు. మహాముత్తారం మండలకేంద్రంతోపాటు అటవీ గ్రామాలైన సింగారం, పోలారం ప్రేమ్‌నగర్ తండాల్లో మండల వైద్యాధికారి సందీప్ ఆధ్వర్యంలో ప్రత్యేక క్యాంపులు ఏర్పాటు చేశారు. ఇంటింటి సర్వే నిర్వహించి జ్వరాల బారిన పడిన వారి వివరాలు సేకరించారు. ములుగు జిల్లా వాజేడు మండలం ఇప్పగూడెంలో వైద్యశిబిరం నిర్వహించి 100మందికి మందుల కిట్ అందజేశారు. వాజేడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని డీఎంహెచ్ఓ అప్పయ్య సందర్శించి రోగులను పరీక్షించారు. తాడ్వాయి పీహెచ్సీ ఆధ్వర్యంలో మేడారం, గంగారం గ్రామాల్లో, కొడిశాల పీహెచ్సీ ఆధ్వర్యంలో ఎల్బాక, పడిగాపూర్ గ్రామాల్లో వైద్యశిబిరాలు నిర్వహించారు. మంగపేట మండలంలోని నర్సింహాసాగర్, అకినేపల్లిమల్లారంలో వైద్యశిబిరాలు ఏర్పాటు చేసి రక్త నమూనాలు సేకరించారు. అవసరమైన వారికి మందులు పంపిణీ చేశారు. -
జ్వరం తగ్గడం లేదా? డెంగ్యూ ఉండొచ్చు జాగ్రత్త! ఈ లక్షణాలు..
వర్షాకాలం సీజన్ కావడంతో విష జ్వరాలు విజృంభిస్తున్నాయి. ఎక్కడ చూసినా డెంగ్యూ, టైఫాయిడ్, మలేరియా వంటి జ్వరాలతో హాస్పిటల్స్‌లో చేరుతున్న వారి సంఖ్య రోజురోజుకి పెరిగిపోతుంది. ముఖ్యంగా డెంగ్యూ కేసులు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తుంది. సాధారణ జ్వరంలాగే వచ్చే ఈ ఫీవర్ లక్షణాలు త్వరగా బయటపడవు. ఆరోగ్యంగానే కనిపిస్తారు. కానీ రోజులు గడిచే కొద్దీ వారిలో డెంగ్యూ లక్షణాలు ఒక్కొక్కటిగా బయటపడుతుంటాయి. సరైన సమయంలో చికిత్స తీసుకుంటేనే ఈ వ్యాధి నుంచి బయటపడొచ్చు. అసలు డెంగ్యూ ఎలా వస్తుంది? దాని లక్షణాలు ఏంటన్నది ఇప్పుడు చూద్దాం. డెంగ్యూ ఎలా వస్తుంది? డెంగ్యూ దోమల వల్ల వస్తుంది. ఇది ఏడిస్ ఏజిప్టి అనే ఆడదోమల కారణంగా వ్యాపిస్తుంది.ఈ దోమలు చికెన్‌గున్యా, యెల్లో ఫీవర్, జికా వైరస్‌లకు సైతం వాహకాలుగా పనిచేస్తాయి. పగలు కుట్టే దోమలతోనే ఈ వ్యాధి సంక్రమిస్తుంది. దీనివల్ల రోగనిరోధక శక్తిపై ప్రభావం చూపిస్తుంది. క్రమంగా వైరస్ తీవ్రత ఎక్కువై జ్వరం పెరుగుతుంది. దీంతో పాటు ఇతర లక్షణాలు కూడా మనకు కనిపిస్తాయి. తీవ్రత పెరిగే కొద్దీ ఫ్లూ లక్షణాలు బయటపడతాయి. డెంగ్యూ వైరస్‌లో నాలుగు సెరోటైప్స్ ఉన్నాయి. వీటిని DENV-1, DENV-2, DENV-3, DENV-4 అని పిలుస్తారు. మన దేశంలో DENV-2 కారణంగా కేసులు ఎక్కువగా నమోదవుతున్నట్లు వైద్య నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ లక్షణాలు కనబడితే జాగ్రత్తపడండి.. వర్షాకాలం మొదలైన జూన్, జులై మాసంలో ప్రారంభమయ్యే విషజ్వరాల తాకిడి ఈ ఏడాది సెప్టెంబర్‌లోనూ కొనసాగుతుంది. డెంగ్యూ వచ్చిన వారిలో సహజంగానే 3 నుంచి 5 రోజుల వరకు ఆ లక్షణాలు కనిపించవు. మరికొందరిలో మాత్రం జ్వరం వచ్చిన వెంటనే లక్షణాలు కనిపిస్తాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. ► డెంగ్యూ వచ్చిన వారికి 104 ఫారెన్‌హీట్ డిగ్రీల జ్వరం ఉంటుంది. అలాగే తలనొప్పి, కండరాలు, ఎముకలు, కీళ్ల నొప్పులు ఉంటాయి. ► వికారం, వాంతులు మరో ప్రధాన లక్షణం. కళ్లు మండటం, వికారం, వాంతులు,తీవ్రమైన కడుపునొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, అలసట, విసుగు డెంగ్యూ జ్వరం లక్షణాలు. ► డెంగ్యూ జ్వరం ఉంటే శరీరంలో ప్లేట్లెట్స్ సంఖ్య గణనీయంగా తగ్గిపోతుంది. డెంగ్యూ జ్వరానికి నిర్దిష్టమైన చికిత్స అంటూ లేదు. అందుకే ఈ లక్షణాలను బట్టి ఎప్పటికప్పుడు చికిత్స చేయించుకోవాలి. ప్లేట్లెట్స్ సంఖ్య 20 వేల కంటే పడిపోతే ప్రమాదకర స్థాయిలో ఉందని అర్ధం. ఈ పరిస్థితుల్లో తక్షణం ప్లేట్లెట్స్ ఎక్కించుకోవల్సి వస్తుంది. డెంగ్యూ లక్షణాలను నిర్లక్ష్యం చేస్తే ప్రాణానికే ప్రమాదం. డెంగ్యూ జ్వరాన్ని తగ్గించే ఆహారాలు డెంగ్యూ వచ్చిన జీర్ణమయ్యే ఆహారాన్నే తీసుకోవాలి. ముఖ్యంగా పండ్లరసాలు ఎక్కువగా తీసుకోవాలి. డెంగ్యూ జ్వరంతో బాధపడతున్నవారు బొప్పాయి పండ్లు లేదా ఆ మొక్క ఆకుల రసాన్ని స్వల్ప మొత్తంలో తీసుకోవడం వల్ల రక్తంలో ప్లేట్లెట్స్ పెరిగి త్వరగా కోలుకుంటారు. ఆరెంజ్ జ్యూస్ రోగనిరోధక శక్తిని పెంచడంలో అద్భుతంగా పనిచేస్తుంది.నారింజలో విటమిన్-సి సమృద్ధిగా లభిస్తుంది. ఇది శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచడంలో సహాయపడుతుంది. డెంగ్యూ జ్వరాన్ని తగ్గించడంలో కొబ్బరి నీళ్లు ముఖ్యపాత్ర పోషిస్తుంది. డెంగ్యూ జ్వరం అటాక్ చేస్తే శరీరంలో నీటి కొరత ఏర్పడుతుంది. అందుకే కొబ్బరినీళ్లను ఎక్కువగా తీసుకుంటే బాడీ హైడ్రేట్‌గా ఉంటుంది. ఇందులో ఖనిజాలు, ఎలక్ట్రోరోలైట్లు ఇందులో అధికంగా ఉంటాయి. ప్రతిరోజు ఓ కివి పండు తినడం వల్ల ప్లేట్లెట్స్ సంఖ్య పెరుగుతుంది. కివి జ్యూస్ తాగినా మంచి ఫలితం ఉంటుంది. పాలకూరలో విటమిన్-ఇ ఉంటుంది. ఇది రక్తం గడ్డకట్టే ప్రక్రియను వేగవంతం చేస్తుంది. అలాగే పాలకూరలోని పోషకాలు డెంగ్యూ జ్వరాన్ని నివారించడంలో సహాయపడుతుంది. వీట్ గ్రాస్ డెంగ్యూ జ్వరాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. ఈ జ్యూస్ తాగడం వల్ల ప్లేట్లెట్స్ కౌంట్ పెరుగుతుంది. తద్వారా జ్వరం తగ్గుతుంది. -
చంటి బిడ్డను చేతులపై ఎత్తుకుని వాగు దాటించిన బాబాయి
కెరమెరి(ఆసిపాబాద్): కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండలం లక్మాపూర్‌లో బాహుబలి సినిమాలో జరిగినట్లు ఓ ఘటన చోటు చేసుకుంది. ఆ సినిమాలో మహేంద్ర బాహుబలిని శివగామి తన చేతిలో పట్టుకుని నదిని దాటినట్లుగా.. లక్మాపూర్ వాగులో ఓ వ్యక్తి చంటి బిడ్డను ఇలా చేతుల్లో పట్టుకుని వాగు దాటాడు. గ్రామానికి చెందిన రాథోడ్ కృష్ణ, సుజాత దంపతుల కూతురు (8 నెలలు) మూడు రోజులుగా జ్వరంతో బాధపడుతోంది. మరోవైపు నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలకు గ్రామ శివారులోని వాగు ఉప్పొంగుతోంది. దీంతో పాపను ఆస్పత్రికి తీసుకెళ్లే వీల్లేక మూడు రోజులు వేచి చూశారు. చిన్నారి పరిస్థితి విషమించడంతో బుధవారం ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు సిద్ధమయ్యారు. సాయంకోసం కృష్ణ తన తమ్ముడు సాయిప్ర కాశ్‌ను తీసుకుని బయల్దేరారు. అయితే వాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో సాయిప్రకాశ్ చిన్నారిని తన చేతుల్లోకి తీసుకుని గొంతు వరకు నీటితో ఉధృతంగా ప్రవహిస్తున్న వాగును దాటారు. తర్వాత చిన్నారి తల్లిదండ్రులు కూడా వాగుదాటారు. అనంతరం ముగ్గురూ కెరమెరిలోని ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించారు. తిరిగి ఇదే రీతిలో వాగుదాటి ఇంటికి వెళ్లారు. కాగా, ఈ వాగుపై 2016లో వంతెన నిర్మాణం ప్రారంభించారు. కాంట్రాక్టర్ నిర్లక్ష్యం.. అధికారుల పర్యవేక్షణ లోపంతో ఇప్పటికీ పనులు పూర్తి కాలేదని ఆ ప్రాంతవాసులు చెపుతున్నారు. దీంతో ఏటా వానాకాలంలో కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తోందని లక్మాపూర్ వాసులు వాపోతున్నారు. చదవండి: వర్షం ఉంటే బడులకు సెలవులివ్వండి -
దోమలతో జాగ్రత్త.. డెంగీ, మలేరియాతో జనం ఇబ్బందులు
వాతావరణ మార్పులతో జిల్లాలో ఒక్కసారిగా విషజ్వరాలు ప్రబలుతున్నాయి. కురుస్తున్న వర్షాల కారణంగా జనం సీజనల్ వ్యాధుల బారిన పడుతున్నారు. డయేరియా, వైరల్ జ్వరాలు సోకుతున్నాయి. పల్లె, పట్టణాలనే తేడా లేకుండా పారిశుధ్య నిర్వహణ అస్తవ్యస్తంగా తయారైంది. దీంతో దోమలు వృద్ధి చెందుతున్నాయి. ఈ ప్రభావం ప్రజారోగ్యంపై పడింది. దీంతో ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులు రోగులతో కిక్కిరిసిపోతున్నాయి. రానున్న రోజుల్లో మరింతగా పెరిగే అవకాశాలు ఉన్నాయని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. జిల్లా ప్రధాన ఆసుపత్రిలో పేరు నమోదుకు జనం బారులు తీరుతున్నారు. ఇందులో చాలా మంది దగ్గు, జ్వరం, జలుబు, ఒళ్లు నొప్పులతో వచ్చినవారే ఉన్నట్లు వైద్యులు తెలిపారు. పారిశుధ్య నిర్వహణ లోపం కారణంగా విషజ్వరాలు ప్రబలుతున్నాయి. ఈనెలలో కురిసిన వర్షాల కారణంగా ఒక్కసారిగా వైరల్ కేసులు పెరిగాయి. జిల్లా ఆసుపత్రితో పాటు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, అర్బన్ హెల్త్ సెంటర్లు, జిల్లా కేంద్రంలోని ప్రైవేట్ ఆస్పత్రులు రోగులతో కిక్కిరిసిపోతున్నాయి. చాలా మంది ఆస్పత్రులకు వెళ్లలేక మంచాన పడుతున్నారు. వైద్యారోగ్యశాఖ అప్రమత్తం సీజనల్ వ్యాధులు ప్రబలుతుండడంతో వైద్యారోగ్య శాఖ అప్రమత్తమైంది. జిల్లాలో ఇంటింటి జ్వర సర్వే ప్రారంభించారు. విష జ్వరాలు, వ్యాధులపై అవగాహన కల్పిస్తున్నారు. ప్రతీ శుక్రవారం డ్రై డే పాటించేలా చర్యలు చేపడతున్నారు. ముఖ్యంగా డయేరియా, వైరల్ ఫీవర్లతో ఆసుపత్రికి ఎక్కువ మంది రోగులు వస్తున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఇళ్లు, పరిసర ప్రాంతాల్లో నీరు నిల్వ ఉండకుండా చూడాలని వైద్యులు సూచిస్తున్నారు. డ్రమ్ములు, పాత టైర్లు వంటి వాటిలో నీరు నిల్వ ఉంటే అందులో దోమలు వృద్ధి చెంది డెంగీ, మలేరియా ప్రబలి విష జ్వరాలు పెరిగే అవకాశం ఉంది. దుర్శేడ్‌లో ఒకరికి డెంగీ కరీంనగర్ మండలం దుర్శేడ్‌లో డెంగీ కేసు నమోదు కావడంతో అధికారులు సోమవారం నియంత్రణ చర్యలు చేపట్టారు. దుర్శేడ్‌కు చెందిన కాశిపాక అర్జున్ హైదరాబాద్‌లో ఓ ప్రైవేట్ ఫుడ్ డెలివరీ సంస్ధలో పనిచేస్తున్నాడు. రెండురోజులక్రితం జ్వ రం రావడంతో దుర్శేడ్‌కు వచ్చిన అర్జున్ ఆది వారం జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యపరీక్షలు చేయించుకోగా డెంగీగా వైద్యులు గుర్తించి చికిత్స అందిస్తున్నారు. ఎంపీడీవో జగన్మోహన్రెడ్డి, సర్పంచు గాజుల వెంకటమ్మ, ఉపసర్పంచు సుంకిశాల సంపత్‌రావు, వార్డుసభ్యుడు అశోక్, ఏఎన్ఎం పద్మ, ఆశావర్కర్లు అనిత, లక్ష్మి తదితరులు అర్జున్ ఇంటిని సందర్శించారు. కుటుంబసభ్యుల వివరాలు సేకరించారు. ఇంటి పరిసరాలను పంచాయతీ సిబ్బందితో శుభ్రం చేయించి బ్లీచింగ్ చల్లారు. అనంతరం చామనపల్లి పీహెచ్సీ ఆధ్వర్యంలో వైద్యసిబ్బంది సమీపంలోని నివాస గృహాల్లోని వ్యక్తులకు వైద్యపరీక్షలు చేశారు. అందుబాటులో వైద్యులు, మందులు వ్యాధులు ప్రబలుతుండడంతో జిల్లా ఆసుపత్రిలో మందులు, వైద్యులను ఎల్లవేళలా అందుబాటులో ఉంచుతున్నాం. పేషెంట్లు ఏ సమయంలో వచ్చినా చికిత్స అందించేలా అన్ని ఏర్పాట్లు చేశారు. ఎక్కువగా వైరల్ ఫీవర్లు, డయేరియా బారిన పడుతున్నారు. చాలా మంది ఓపీ చూపించుకొని మందులు తీసుకెళ్తున్నారు. వారి ఆరోగ్య పరిస్థితిని బట్టి ఆసుపత్రిలో అడ్మిట్ చేసుకొని చికిత్స అందిస్తున్నాం. – డాక్టర్ కృష్ణప్రసాద్, ఆసుపత్రి మెడికల్ సూపరింటెండెంట్ -
రాష్ట్రంలోని ప్రతి కుటుంబాన్ని పలకరిస్తూ ఫీవర్ సర్వే.. ప్రజల ఆరోగ్యం పట్ల ప్రభుత్వానికి ఎంతో శ్రద్ధ
-
బురదరోడ్లు.. ఆపై వైద్యులు లేరు..
బజార్హత్నూర్: వర్షానికి పాడైన రోడ్లు.. సమయానికి అందుబాటులో లేని డాక్టర్లు .. వెరసి ఓ బాలుడి నిండు జీవితం బలైంది. బురద రోడ్డుపై మోటార్‌సైకిల్‌పై ఆ స్పత్రికి చేరడం ఆలస్యం కావడం.. సమ యానికి వైద్యులూ అందుబాటులో లేక ఆ బాలుడు ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం ఆదిలాబాద్ జిల్లా బజార్హత్నూర్ మండలం డేడ్ర గ్రామానికి చెందిన గిరిజన దంపతులు పంద్ర లక్ష్మణ్, జమునల కుమారుడు పరుశురాం(3) బుధవారం రాత్రి నుంచి తీవ్ర జ్వరం, వాంతులు, విరేచనాలతో బాధపడ్డాడు. గ్రామం నుంచి పీహెచ్‌సీకి 16కిలోమీటర్ల దూరం ఉండగా.. వర్షాలకు అధికభాగం రోడ్డు బురదమయమైంది. అదే రోడ్డుపై గురువారం ఉదయం 6 గంటలకు బయలుదేరి మోటార్‌సైకిల్‌పై పీహెచ్‌సీకి బాలుడిని తీసుకువచ్చారు. అయితే ఆ సమయంలో వైద్యులు అందు బాటులో లేరని, కింది స్థాయి సిబ్బంది పట్టించుకోలేదని, రిమ్స్‌కు తీసుకెళ్లాలని సూచించారని లక్ష్మణ్ తెలిపాడు. కొద్దిసేపటికే బాబు మృతిచెందాడని, వైద్యులు అందుబాటులో ఉంటే తన కుమారుడు బతికేవాడని ఆవేదన వ్యక్తం చేశాడు. దంపతులిద్దరూ మోటార్‌సైకిల్‌పైనే మృతదేహంతో గ్రామానికి చేరుకున్నారు. చనిపోయిన తర్వాతే తీసుకొచ్చారంటూ మెడికల్ ఆఫీసర్ వితండవాదన కాగా, ఈ విషయమై మెడికల్ ఆఫీసర్ భీంరావ్‌ను ఫోన్లో సంప్రదించగా.. బాలుడు మృతిచెందిన తర్వాతే ఆస్పత్రికి తీసుకొచ్చారని తెలిపారు. ఆసుపత్రిలో వైద్యులే లేరు కదా మృతిచెందినట్లు ఎవరు నిర్ధారించారని అడగ్గా.. సమాధానం చెప్పలేదు. -
నేటి నుంచి ఫీవర్ సర్వే
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో సీజనల్ వ్యాధుల నియంత్రణకు వైద్య, ఆరోగ్య శాఖ ముందస్తు చర్యలు చేపట్టింది. బుధవారం నుంచి ఇంటింటి ఫీవర్ సర్వేను ప్రారంభిస్తోంది. ఆరోగ్య సిబ్బంది, వలంటీర్లు రాష్ట్రంలోని 1.63 కోట్ల గృహాలను సందర్శించి డెంగీ, మలేరియా, విష జ్వరాలతో బాధపడుతున్న వారిని, లక్షణాలున్న వారిని ఈ సర్వే ద్వారా గుర్తించనున్నారు. ఈ సర్వే కోసం సోమవారం ఉన్నతాధికారులు జిల్లాల వైద్య శాఖ, ఇతర శాఖల అధికారులతో వర్చువల్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. సర్వే చేపట్టాల్సిన విధానం, మార్గదర్శకాలను వివరించారు. కరోనా వ్యాప్తి సమయంలో వైరస్ నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం ఫీవర్ సర్వేను ప్రారంభించింది. ఆరోగ్య సిబ్బంది రాష్ట్రంలోని ప్రతి ఇంటిని సందర్శించి, లక్షణాలున్న వారిని గుర్తించి, పరీక్షలు నిర్వహించడం ద్వారా ప్రారంభ దశలోనే వైరస్ వ్యాప్తిని అరికట్టడంలో ఈ సర్వే ఎంతగానో ఉపయోగపడింది. ఆ తర్వాత కూడా వ్యాధుల నియంత్రణకు సర్వే కొనసాగుతోంది. ఇప్పటివరకు 49 విడతలు రాష్ట్రంలో సర్వే నిర్వహించారు. ఇదే తరహాలో ప్రస్తుతం సీజనల్ వ్యాధుల నియంత్రణకు సర్వే చేపడుతున్నారు. డెంగీ, మలేరియా, ఇతర సీజనల్ వ్యాధులున్న వారిని, లక్షణాలున్నవారిని గుర్తిస్తారు. వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేస్తారు. బాధితులకు మందులు అందిస్తారు. అవసరమైన వారిని ఆస్పత్రుల్లో చేర్పిస్తారు. సీజనల్ వ్యాధులను గుర్తించడానికి ఫీవర్ సర్వే యాప్‌లో మార్పులు చేశామని ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమ డైరెక్టర్ డాక్టర్ రామిరెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. గతంలో కరోనా వైరస్ ప్రశ్నావళి మాత్రమే ఉండేదని, ప్రస్తుతం డెంగీ, మలేరియా, విష జ్వరాల లక్షణాల ప్రశ్నావళిని అదనంగా చేర్చామని చెప్పారు. ఫీవర్ సర్వే నిర్వహణపై అన్ని జిల్లాల డీఎంహెచ్‌వోలకు మార్గదర్శకాలు జారీ చేశామన్నారు. సీజనల్ వ్యాధుల నియంత్రణకు మున్సిపల్, పంచాయతీ రాజ్ శాఖలను సమన్వయం చేసుకుంటూ వైద్య శాఖ పనిచేస్తోందని వివరించారు. -
Operation Kaveri: సూడాన్ నుంచి వచ్చిన వారిలో ఎల్లో ఫివర్
బనశంకరి: సూడాన్ నుంచి వెనక్కి వస్తున్న భారతీయులకు ప్రమాదకరమైన ఎల్లో ఫివర్ భయం పట్టుకుంది. సూడాన్ నుంచి ఇటీవల బెంగళూరుకు చేరుకున్న 362 మందిలో 45 మంది ఎల్లో ఫివర్‌తో బాధపడుతున్నట్లు తేలింది. అధికారులు వీరిని బెంగళూరులోని రాజీవ్‌గాంధీ ఆసుపత్రిలో క్వారంటైన్‌కు తరలించారు. చర్మం, కళ్లు పచ్చగా మారడం, జ్వరం, తలనొప్పి, గొంతునొప్పి, వాంతులు ఈ జ్వరం లక్షణాలు. పరిస్థితి విషమిస్తే 15 రోజుల్లో అంతర్గత రక్తస్రావం సంభవించి, అవయవాలు పనిచేయడం మానేస్తాయి. ఒక్కోసారి మరణానికి కూడా దారితీయవచ్చు. మరోవైపు, ‘ఆపరేషన్ కావేరి’లో భాగంగా సూడాన్ నుంచి మరో 365 మంది భారతీయులను శనివారం తీసుకువచ్చినట్లు విదేశాంగ మంత్రి జై శంకర్ ట్వీట్ చేశారు. దీంతో, ఇప్పటి వరకు 1,725 మంది స్వదేశానికి తరలించినట్లయిందని పేర్కొన్నారు. -
20 లక్షల కరోనా వ్యాక్సిన్లు ఇవ్వండి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా నియంత్రణకు అవసరమైన 20 లక్షల కరోనా వ్యాక్సిన్లను సరఫరా చేయాలంటూ కేంద్రానికి విన్నవిస్తామని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు వెల్లడించారు. ఈ మేరకు లేఖ రాయాలని నిర్ణయించామన్నారు. కరోనా కేసుల పెరుగుదల, కేంద్రం అప్రమత్తం చేసిన నేపథ్యంలో శుక్రవారం ఆయన ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. జూమ్ ద్వారా జరిగిన సమీక్షలో వైద్య, ఆరోగ్యశాఖ కార్యదర్శి రిజ్వీ, ఆరోగ్య కుటుంబ సంక్షేమ కమిషనర్ శ్వేత మహంతి, డీఎంఈ రమేశ్ రెడ్డి, ప్రజారోగ్య సంచాలకులు శ్రీనివాసరావు, వైద్య విధాన పరిషత్ కమిషనర్ అజయ్ కుమార్, గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్ రాజారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ, వివిధ రాష్ట్రాల్లో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో వైద్య, ఆరోగ్య శాఖ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఆందోళన వద్దు.. అప్రమత్తంగా ఉండండి: ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అయితే అప్రమత్తంగా ఉండాల్సి ఉంటుందని హరీశ్ చెప్పారు. దగ్గు, జ్వరం, గొంతు నొప్పి వంటి కోవిడ్ లక్షణాలు ఉన్న వారు సమీపంలోని ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల వద్దకు వెళ్లి పరీక్షలు చేయించుకొని, అవసరమైన వారు చికిత్స పొందాలని సూచించారు. కోవిడ్ వ్యాక్సినేషన్లో తెలంగాణ దేశానికి ఆదర్శవంతంగా నిలిచిందని, ముఖ్యంగా ప్రికాషన్ డోసు పంపిణీ చేయడంలో మొదటి స్థానంలో ఉందని గుర్తు చేశారు. ఇప్పటివరకు 7.75 కోట్ల వ్యాక్సిన్లను అర్హులైన వారికి అందించనున్నారు. 1.35 కోట్ల ప్రికాషన్ డోసులు పంపిణీ చేయగా, 1.62 కోట్ల ప్రికాషన్ డోసు పంపిణీ చేయాల్సి ఉందన్నారు. బీపీ, షుగర్, కిడ్నీ సమస్యలు, కేన్సర్ వంటి దీర్ఘకాలిక రోగాలతో బాధపడుతున్నవారు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ప్రభుత్వం పూర్తి స్థాయిలో సన్నద్ధంగా ఉందని, ముందస్తు జాగ్రత్తల్లో భాగంగా అర్హులైన వారు తమ వంతుగా వ్యాక్సిన్ తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. -
హెచ్3ఎన్2పై వైద్య శాఖ అప్రమత్తం.. రాష్ట్రవ్యాప్తంగా ఫీవర్ సర్వే
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో హెచ్3ఎన్2 ప్రభావం లేనప్పటికీ ముందస్తు నియంత్రణ చర్యల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ నేపథ్యంలో జ్వరం, దగ్గు, జలుబు, ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడేవారిని గుర్తించి వారికి వైద్య సహాయం అందించడానికి సోమవారం నుంచి ఫీవర్ సర్వేను చేపట్టనుంది. ఈ మేరకు ఇప్పటికే అన్ని జిల్లాల వైద్య, ఆరోగ్య శాఖాధికారుల (డీఎంహెచ్‌వో)కు ఉత్తర్వులు జారీ చేసింది. సచివాలయ ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు, గ్రామ, వార్డు వలంటీర్లు ఇంటింటికీ వెళ్లి ప్రజలను స్క్రీనింగ్ చేయాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఆదేశించింది. శీతాకాలం ముగిసి వేసవి ప్రారంభమవుతున్న క్రమంలో వాతావరణ మార్పులతో దగ్గు, జలుబు, వైరల్ జ్వరాలు దేశవ్యాప్తంగా ప్రజలను ఇబ్బంది పెడుతున్న సంగతి తెలిసిందే. ఇన్‌ఫ్లూయెంజా ఎ ఉపరకం హెచ్3ఎన్2 అనే వైరస్ ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందుతోందని భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) ఇప్పటికే వెల్లడించింది. కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ సైతం రాష్ట్రాలకు ఇప్పటికే పలు మార్గదర్శకాలు జారీ చేసింది. సీజన్ మారడం వల్లే.. హెచ్3ఎన్2 ఫ్లూ అనుమానిత లక్షణాలున్న వారికి పరీక్షలు చేయడం కోసం టెస్టింగ్ కిట్లను వైద్య ఆరోగ్య శాఖ కొనుగోలు చేస్తోంది. రెండు రోజుల్లో అన్ని బోధనాస్పత్రులకు వీటిని పంపనుంది. ప్రస్తుతం తిరుపతి స్విమ్స్‌లోని వీఆర్డీఎల్ ల్యాబ్‌లో హెచ్3ఎన్2 నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారు. ఇక్కడ జనవరిలో 12, ఫిబ్రవరిలో తొమ్మిది పాజిటివ్ కేసులను నిర్ధారించారు. అయితే ఆందోళన అవసరం లేదని వైద్యులు చెబుతున్నారు. ఏటా సీజన్ మారుతున్న సమయంలో కేసులు కొంత పెరుగుతాయని అంటున్నారు. ప్రస్తుతం వేసవి సీజన్ మొదలవుతుండటంతో అవే పరిస్థితులు ఉన్నాయని పేర్కొంటున్నారు. ఆస్పత్రులకు వస్తున్న బాధితులకు చాలా అరుదుగా మాత్రమే అడ్మిషన్ అవసరమవుతోందని చెబుతున్నారు. సాధారణంగా ఆస్పత్రులకు వచ్చే ఓపీల్లో 5 నుంచి 6 శాతం వరకు జ్వరం, దగ్గు, జలుబు వంటి కేసులే ఉంటాయని గుర్తు చేస్తున్నారు. వైద్యులు సూచిస్తున్న జాగ్రత్తలు.. ► క్రమం తప్పకుండా చేతులను సబ్బుతో కడుక్కోవాలి. ► ఫ్లూ లక్షణాలున్నవారు మాస్క్ ధరించాలి. ► వీలైనంత ఎక్కువగా ద్రవ పదార్థాలు తీసుకోవాలి. ► షేక్‌హ్యాండ్, ఆలింగనాలు మానుకోవాలి. ► బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మకూడదు. కంగారు పడవద్దు.. వాతావరణం మారుతున్నప్పుడు సాధారణంగా జలుబు, దగ్గు, జ్వరం వంటివి వస్తాయి. వీటికే ప్రజలు కంగారు పడిపోవద్దు. ఈ లక్షణాలు ఉన్నవారు సమీపంలోని ఆశా వర్కర్, ఏఎన్ఎంలను సంప్రదించవచ్చు. వారు మందులు ఇవ్వడంతోపాటు తీసుకోవాల్సిన జాగ్రత్తలను చెబుతారు. హెచ్3ఎన్2 ప్రభావం రాష్ట్రంలో లేదు. అయినప్పటికీ ముందు జాగ్రత్తల్లో భాగంగా నియంత్రణ చర్యలు తీసుకుంటున్నాం. – డాక్టర్ రామిరెడ్డి, డైరెక్టర్, ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ రోగనిరోధక శక్తి తక్కువ ఉన్నవారు జాగ్రత్త.. రోగనిరోధక శక్తి తక్కువగా ఉండే వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వారిపై వైరస్లు, బ్యాక్టీరియాల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. వృద్ధులు, శ్వాసకోశ వ్యాధులు, షుగర్, హెచ్ఐవీ బాధితులు మాస్క్ ధరించాలి. జలుబు, దగ్గు, జ్వరం ఉంటే పారాసెటమాల్, బ్రూఫెన్ మాత్రలు, గొంతు ఉపశమనానికి విక్స్ బిళ్లలు వేసుకోవాలి. శరీరంలో నీటి శాతం తగ్గకుండా చూసుకోవాలి. ఒసెల్టామివిర్ 75 ఎంజీ మాత్ర రోజుకు రెండుసార్లు వేసుకోవాలి. – డాక్టర్ ఎస్.రఘు,సూపరింటెండెంట్, ఛాతీ, సాంక్రమిక వ్యాధుల ఆస్పత్రి, గుంటూరు -
అప్రమత్తతే అత్యంత కీలకం.. నిర్లక్ష్యం చేస్తే ప్రమాదకర పరిస్థితులు!
సాక్షి, హైదరాబాద్/న్యూఢిల్లీ: ఇన్‌ఫ్లూయెంజా లైక్ ఇల్నెస్ (ఐఎల్ఐ), సివియర్ అక్యూట్ రెస్పిరేటరీ ఇల్నెస్ (ఎస్ఏఆర్ఐ)... గత కొంత కాలంగా వైద్య పరిభాషలో తరచుగా వినియోగిస్తున్న పదాలివి. ఆస్పత్రుల్లో జ్వరం, తీవ్ర శ్వాసకోశ సమస్యలకు సంబంధించిన కేసులు వేగంగా పెరుగుతున్నాయి. సీజన్ మార్పు నేపథ్యంలో జ్వరాలు, జలుబు, దగ్గు లక్షణాలు రావడం సహజమే అయినప్పటికీ ప్రస్తుతం వీటి తీవ్రత కాస్త ఎక్కువగా ఉంటోంది. వైరస్ ప్రభావంతో వస్తున్న ఈ సమస్యలను ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా ప్రమాదకర పరిస్థితులు తలెత్తే అవకాశం ఉందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఆందోళన వ్యక్తం చేస్తోంది. వైద్యుల సహకారాన్ని తీసుకోవాలని, ప్రభుత్వ వైద్య సేవలను విస్తృతం చేసిన క్రమంలో ఆస్పత్రులకు వెళ్లి చికిత్స పొందాలని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ హెచ్చరిస్తోంది. ఈ మేరకు దేశంలోని రాష్ట్రాలను అప్రమత్తం చేస్తూ ప్రత్యేకంగా మార్గదర్శకాలు జారీ చేసింది. జాగ్రత్తలు తప్పనిసరి... ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఐఎల్ఐ, ఎస్ఏఆర్ఐ కేసులు వేగంగా వృద్ధి చెందుతున్నాయి. రాష్ట్రాల వారీగా వచ్చిన నివేదికలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తే వీటి పెరుగుదల స్పష్టమవుతోంది. ఈ క్రమంలో ఇటీవల కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించింది. కేంద్ర మంత్రులతో పాటు నీతి ఆయోగ్ సభ్యులు, సంబంధిత శాఖలు, సంస్థలు ఈ సమావేశంలో పాల్గొన్నాయి. దేశవ్యాప్తంగా పరిస్థితులను సమీక్షించిన అనంతరం కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ రాష్ట్రాలకు పలు అంశాలపై సూచనలు చేసింది. తాజాగా విడుదల చేసిన మార్గదర్శకాల్లోనూ ఈ అంశాలను ప్రస్తావిస్తూ తక్షణ చర్యలను సూచించింది. తాజాగా నమోదవుతున్న జ్వరాలు, శ్వాస కోశ సంబంధిత వ్యాధులకు కారణం హెచ్1ఎన్1, హెచ్3ఎన్2 వైరస్ ప్రభావం ఉన్నట్లు అధ్యయనా లు చెబుతున్నాయి. ఈ వైరస్ ప్రభావంతో వస్తున్న వ్యాధులు ఒకరి నుంచి మరొకరికి సోకే అవకాశా లు ఎక్కువగా ఉండటంతో ప్రజలు జాగ్రత్తలు పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు. వ్యాధి లక్షణాలున్నవారు వెంటనే వైద్యుడి సంరక్షణలో జాగ్రత్తలు పాటించి చికిత్స పొందాలని చెపుతున్నారు. దీర్ఘకాలిక వ్యాధులున్న వారిపై ఈ వైరస్ ప్రభావం అధికంగా ఉండటంతో వారు మరింత జాగ్రత్తగా ఉండాలి. వైరస్ సోకిన వ్యక్తులతో మెదిలే సమయంలో మాసు్కలు ధరించడంతో పాటు భౌతికదూరం పాటించడం, చేతులు క్రమం తప్పకుండా శుభ్రం చేసుకోవడం లాంటి చర్యలు తప్పకుండా తీసుకోవాలని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సూచనలు జారీ చేసింది. కోవిడ్–19 జాగ్రత్తలు మరవద్దు.. దేశవ్యాప్తంగా కోవిడ్ కట్టడిలో ఉన్నా.. ప్రస్తుత వాతావరణ పరిస్థితులు, వ్యాధుల తీరును పరిశీలి స్తే కోవిడ్ కేసుల పెరుగుదలకు అవకాశాలున్నట్లు నిపుణులు చెబుతున్నారు. ఈ క్రమంలో టెస్టింగ్, ట్రాకింగ్, ట్రీట్మెంట్, వ్యాక్సినేషన్ అంశాలను తప్పకుండా పాటించాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. జ్వరాలు, శ్వాస సంబంధిత వ్యాధులపై ప్రజలకు విస్తృతంగా అవగాహన కలిగించాలని, జాగ్రత్త చర్యలపై చైతన్య కార్యక్రమాలు నిర్వహించాలని సూచించింది. అదేవిధంగా రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఆస్పత్రుల్లో మందులను అందుబాటులో ఉంచాలని, వైద్య పరికరాల పనితీరును సరిచూసుకోవాలని కోరింది. ఆక్సిజన్ వస తులను పునఃసమీక్షించుకోవాలని స్పష్టం చేసింది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు మొదలు అన్ని రకాల ఆస్పత్రులను సన్నద్ధం చేయాలని ఆదేశించింది. కాగా, ‘గత కొన్ని నెలలుగా కోవిడ్–19 కేసులు గణనీయంగా తగ్గినప్పటికీ, కొన్ని రాష్ట్రాల్లో కోవిడ్ టెస్ట్ పాజిటివిటీ రేట్ క్రమంగా పెరుగుతుండటం తక్షణమే పరిష్కరించాల్సిన అంశం’అని కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ శనివారం రాష్ట్రాలకు రాసిన లేఖలో పేర్కొన్నారు. కొత్తగా నమోదవుతున్న కేసులు తక్కువగానే ఉంటున్నా, కోవిడ్ కట్టడికి ఐదంచెల వ్యూహం అమలుపై అప్రమత్తంగా ఉండాలి అని కోరారు. ఇన్‌ఫ్లూయెంజా ఏటా సీజనల్‌గా వ్యాప్తి చెందేదే అయినప్పటికీ ప్రత్యేకమైన వాతావరణ పరిస్థితులు, వ్యక్తిగత పరిశుభ్రత పాటించకపోవడం, ఎక్కువ మంది జనం ఒకే చోట గుమికూడటం వంటి కారణాలతో హెచ్1ఎన్1, హెచ్3ఎన్2 వంటి కేసులు పెరుగుతున్నాయని పేర్కొన్నారు. -
హెచ్3ఎన్2పై ఆందోళన వద్దు
సాక్షి, అమరావతి : కొత్త రకం ఫ్లూ హెచ్3ఎన్2 ప్రభావం రాష్ట్రంలో పెద్దగా లేదని డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ) డాక్టర్ వినోద్‌కుమార్ స్పష్టం చేశారు. అనవసరంగా ప్రజలు ఆందోళన చెందాల్సిన పనిలేదన్నారు. విజయవాడలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే.. ♦ ముక్కు నుంచి గొంతు మధ్యలోనే ఈ ఫ్లూ వైరస్ ప్రభావం ఉంటుంది. ♦ కరోనా వైరస్లాగా ఊపిరితిత్తుల్లోకి చొచ్చుకుపోయే స్వభావం దీనికి లేదు. ♦ రెసిస్టెన్స్ పవర్ తక్కువగా ఉన్న కొందరిలో ఊపిరితిత్తుల్లోకి చేరి న్యుమోనియాకు దారితీస్తుంది. ♦ ప్రస్తుతం ఫ్లూ చిన్న పిల్లలు, వృద్ధుల్లో కొంతమేర ప్రభావం చూపుతుంది. దీనిని కనిపెట్టడం చాలా సులభం. ♦ప్రభుత్వాస్పత్రుల్లో ఆర్టీపీసీఆర్ టెస్ట్‌లు ద్వారా కేసులు గుర్తిస్తున్నాం ♦ తిరుపతి స్విమ్స్‌లో తరచూ వైరస్‌లపై సీక్వెన్సింగ్ చేస్తుంటాం.. ఇలా గత జనవరిలో 12 కేసులు, ఫిబ్రవరిలో 9 హెచ్3ఎన్2 కేసులు నమోదయ్యాయి. ♦దగ్గు, జలుబు, జ్వరం లక్షణాలున్న వారు జాగ్రత్తలు తీసుకోవాలి. టవైరల్ జ్వరాలకు యాంటిబయోటిక్స్ పనిచేయవు. కాబట్టి జ్వరం వచి్చందని ప్రజలు అనవసరంగా వాటిని వాడొద్దు. ఆస్పత్రుల్లో చేరేవారు చాలా అరుదు ఇక జ్వరాలు, ఇతర లక్షణాలతో ఆస్పత్రులకు వస్తున్నవారిలో ప్రతి వెయ్యి ఓపీల్లో 0.1 శాతం సందర్భాల్లో అడ్మిషన్ అవసరం అవుతోందని విజయవాడ ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపల్, జనరల్ మెడిసిన్ వైద్యుడు డా. సుధాకర్ చెప్పారు. ఎవరికైనా జ్వరం, జలుబు వచ్చినట్లయితే పారాసిటమాల్, దగ్గు ఉన్నట్లైతే సిట్రిజీన్ మాత్ర వాడితే సరిపోతుందన్నారు. అదే విధంగా గొంతు ఇన్ఫెక్షన్ ఉంటే వేడినీళ్లు తాగడంతో పాటు, విక్స్ బిళ్లలు వాడాలన్నారు. మరోవైపు.. గుంటూరు జ్వరాల ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రఘు మాట్లాడుతూ.. ప్రతి ఏడాది సీజన్ మారేప్పుడు జ్వరాలు వస్తుంటాయన్నారు. వీటికి ఇంటి వద్దే జాగ్రత్తలు తీసుకుంటే చాలన్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఆ కాలేజీల్లో అడ్మిషన్లు కాగా.. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఐదు కొత్త వైద్య కళాశాలల్లో ఎంబీబీఎస్ అడ్మిషన్లు ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించిందని డీఎంఈ వినోద్ తెలిపారు. విజయనగరం వైద్య కళాశాలకు ఇప్పటికే అనుమతులు లభించాయని.. మిగిలిన నాలుగు కళాశాలలకు అనుమతులు వస్తాయని భావిస్తున్నామన్నారు. ఏడాదికి మూడు నుంచి నాలుగు వైద్య కళాశాలలను అందుబాటులోకి తీసుకురావాలని ప్రణాళికలు రచించామన్నారు. అలాగే, ఖాళీ అయిన 246 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులను ఎన్నికల కోడ్ ముగియగానే భర్తీ చేస్తామని.. సీనియర్ రెసిడెంట్ల భర్తీకి వాక్–ఇన్ ఇంటర్వ్యూలు నిర్వహిస్తామని వినోద్ చెప్పారు. -
అడెనోవైరస్ కలకలం.. పిల్లలకు మాస్కులు తప్పనిసరి చేసిన సర్కార్
కోల్‌కతా: పశ్చిమబెంగాల్లో అడెనోవైరస్ కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. దీంతో రాష్ట్రప్రభుత్వం అప్రమత్తమైంది. పిల్లలందరూ కచ్చితంగా మాస్కు ధరించాలని సీఎం మమతా బెనర్జీ సూచించారు. చిన్నారులు భయపడాల్సిన అవసరం లేదని జాగ్రత్తలు పాటిస్తే సరిపోతుందని పేర్కొన్నారు. బెంగాల్లో అడెనోవైరస్ బారినపడి ఇప్పటివరకు 19 మంది పిల్లలు ప్రాణాలు కోల్పోయారు. అయితే వీరిలో 13 మంది చిన్నారులకు దీర్ఘకాలిక రోగాలున్నాయని మమత చెప్పారు. పిల్లలలో దగ్గు, జలుబు లక్షణాలు ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలని, ఒకవేళ జ్వరం ఉంటే తక్షణమే హాస్పిటల్లో అడ్మిట్ చేయాలని స్పష్టం చేశారు. ఐక్యరాజ్యసమితి అంటువ్యాధుల నియంత్రణ కేంద్రం వివరాల ప్రకారం అడెనోవైరస్ ఫ్లూ లాంటిదే. ఇది సోకిన చిన్నారులు సాధారణ జ్వరం నుంచి తీవ్ర అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం ఉంటుంది. ముఖ్యంగా పిల్లల శ్వాసకోశ వ్యవస్థపై ఈవైరస్ తీవ్ర ప్రభావం చూపుతుంది. అడెనోవైరస్ అన్ని వయస్కుల పిల్లలకు సోకుతుంది. అయితే ఎక్కువగా నవజాత శిశువులు, 10 ఏళ్లుపైబడిన పిల్లలు దీని బారినపడుతున్నారు. అడెనోవైరస్ లక్షణాలు ► జ్వరం ► జలుబు ► దగ్గు ► గొంతులో నొప్పి ► కళ్లు గులాబీ రంగులోకి మారడం ► న్యుమోనియా ► శ్వాసనాళాల వాపు ► జీర్ణాశయంలో ఇన్ఫెక్షన్ రోగనిరోధక వ్యవస్థ బలహీనంగా ఉన్న, శ్వాససంబంధిత వ్యాధులతో బాధపడుతున్న చిన్నారులకు అడెనోవైరస్ ముప్పు ఎక్కువగా ఉంటుంది. ప్రస్తుతం బెంగాల్ రాష్ట్రంలోని అనేక ఆస్పత్రులు చిన్నారులతో నిండిపోయాయి. దీంతో అన్ని జిల్లాల వైద్య అధికారులు, సిబ్బందిని ప్రభుత్వం అప్రమత్తం చేసింది. అవసరమైన సదుపాయాలు, వైద్య పరికరాలు సమాకూర్చాలని ఆదేశించింది. చదవండి: వాళ్లు గుంపుల్లో తిరగొద్దు.. కర్ణాటక ఆరోగ్య మంత్రి హెచ్చరిక.. -
తెలుగు రాష్ట్రాలను వణికిస్తున్న H3N2 వైరస్
-
ఆస్పత్రిలో చేరిన సోనియా గాంధీ
యూపీఏ చైర్ పర్సన్, కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ తీవ్ర జ్వరంతో న్యూఢిల్లీలోని సర్ గంగారామ్ ఆస్పత్రిలో చేరినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. ఈమేరకు ఆమె వైద్యుల పర్యవేక్షణలో ఉందని చికిత్స తీసుకుంటున్నారని సదరు ఆస్పత్రి వర్గాలు పేర్కొన్నాయి. ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ఐతే సోనియా గురువారమే ఆసుపత్రిలో చేరినట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. ఈ మేరకు సీనియర్ కన్సల్టెంట్ డిపార్ట్మెంట్ ఆఫ్ చెస్ట్ డాక్టర్ అరూప్ బసు మాట్లాడుతూ.. తమ వైద్యుల బృందం ఆమెను దగ్గరుండి మరీ నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. (చదవండి: కేంద్రంపై రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు.. పెగాసెస్‌పై కామెంట్స్ ఇవే..) -
అంతుచిక్కని వ్యాధితో 8 మంది మృతి.. రెండు గ్రామాల్లో లాక్డౌన్..
మలాబో: ఆఫ్రికా దేశం ఈక్వెటోరియల్ గినియాలో అంతుచిక్కని వ్యాధి బెంబేలెత్తిస్తోంది. రక్తస్త్రావ జ్వరంతో 8 మంది చనిపోవడం స్థానికులను హడలెత్తిస్తోంది. ఈ వ్యాధి ఏంటో తెలియక అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ఇటీవల ఓ వ్యక్తి అంత్యక్రియలకు హాజరైన 8 మంది తీవ్ర అనారోగ్యానికి గురై చనిపోయారు. రక్తస్రావం, జ్వరంతో ప్రాణాలు కోల్పోయారు. దీంతో అప్రమత్తమైన అధికారులు 200 మందిని క్వారంటైన్‌కు తరలించారు. రెండు గ్రామాల్లో లాక్డౌన్ విధించారు. వ్యాధి బారినపడిన వారి నమూనాలను సేకరించి పొరుగు దేశం గబాన్‌కు పంపారు. లాసా, ఎబోలా వంటి ప్రాణాంతక మహమ్మారులు వెలుగుచూసిన ప్రాంతం కావడంతో కొత్త వ్యాధి గురించి అధికారులు ఆందోళన చెందుతున్నారు. అంతుచిక్కని వ్యాధిబారిన పడిన వారు ముక్కు నుంచి రక్తం కారడం, జ్వరం, కీళ్ల నొప్పులు, ఇతర అనారోగ్య సమస్యలతో గంటల్లోనే చనిపోయారని అధికారులు వివరించారు. ఈ వ్యాధిపై నిఘా కోసం ప్రపంచ ఆరోగ్య సంస్థ సహకారంతో ముందుకు సాగుతున్నట్లు పేర్కొన్నారు. మరోవైపు ఈక్వెటోరియల్ గినియా పొరుగు దేశం కామెరూన్ కూడా ఈ వ్యాధి పట్ల అప్రమత్తమైంది. సరిహద్దుల్లో ఇతరులకు ప్రవేశం లేకుండా ఆంక్షలు విధించింది. చదవండి: టర్కీ విధ్వంసం.. నాలుగు రోజులు మూత్రం తాగి బతికిన యువకుడు.. -
ప్రభాస్‌కు తీవ్ర జ్వరం.. షూటింగ్స్ క్యాన్సిల్!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వరుస సినిమాలతో ఫుల్ బిజీ అయ్యాడు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ చేస్తున్నాడు. అలాగే నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రాజెక్ట్ కే మూవీ కూడా షూటింగ్ జరుపుకుంటుంది. ఓం రౌత్ దర్శకత్వంలో ఆదిపురుష్ ...కూడా పూర్తి చేశాడు. ప్రభాస్ ప్రస్తుతం మారుతి సినిమాను కంప్లీట్ చేసే పనిలో ఉన్నాడు. ఇవన్నీ వందల కోట్ల బడ్జెట్లో రాబోతున్నాయి. ఇవి కాకుండా మరికొన్ని సినిమాలు సెట్స్‌పైకి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నాయి. ప్రభాస్-మైత్రీ మూవీ మేకర్స్ కాంబోలో సిద్ధార్థ్ ఆనంద్ తెరకెక్కించే సినిమా రానుంది. వీటితో పాటు దిల్ రాజుతో ఓ సినిమా, సందీప్ రెడ్డి వంగాతో స్పిరిట్ అనే సినిమాను ప్రకటించేశాడు.ఇలా వరుస సినిమాతో బిజీగా ఉన్న ప్రభాస్.. తాజాగా అనారోగ్యానికి గురైనట్లు తెలుస్తోంది. (చదవండి: డ్రెస్సుపై ఒక్క చిరుగూ లేకుండా రేప్ సీన్లో నటించా: హీరోయిన్) ప్రస్తుతం ప్రభాస్ తీవ్ర జ్వరంతో బాధపడుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అందుకే షూటింగ్స్ అన్ని క్యాన్సిల్ చేసుకొని ఇంటికి వెళ్లినట్లు ఫిల్మ్ వర్గాల సమాచారం. ఈ నెలలో మారుతి సినిమా కొత్త షెడ్యూల్ హైదరాబాద్‌లో ప్రారంభం కావాలి. ఈ షెడ్యూల్లో ప్రభాస్‌తో పాటు ప్రధాన తారాగణం పాల్గొనాల్సింది. కానీ జ్వరం కారణంగా అది వాయిదా వేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ప్రభాస్ ఆరోగ్యం పరిస్థితి బాగానే ఉందని, అభిమానులు కంగారు పడాల్సిన అవసరం లేదని ప్రభాస్ సన్నిహితులు అంటున్నారు. విశ్రాంతి లేకుండా వరుస సినిమాల ఘూటింగ్స్లో పాల్గొనడం వల్లే ఆయన జ్వరం బారిన పడినట్లు తెలుస్తోంది. -
సీఎం కేసీఆర్‌కు జ్వరం.. మరికొన్ని రోజులు ఢిల్లీలోనే..
న్యూఢిల్లీ: ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ సీఎం కేసీఆర్ జ్వరంతో బాధపడుతున్నారు. జ్వరం కారణంగా 2 రోజులుగా కేసీఆర్ ఎవరినీ కలవలేదు. గత వారం రోజులుగా ఢిల్లీలోనే మకాం వేసిన కేసీఆర్.. మరో నాలుగు రోజులు హస్తీనాలోనే ఉండనున్నట్లు తెలుస్తోంది. సీఎం ఆదేశాల మేరకు సోమవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్లోపాటు పలువురు ఉన్నతాధికారులు ఢిల్లీకి వెళ్లారు. పరిపాలనకు సంబంధించిన అంశాలపై చర్చించేందుకే ఉన్నతాధికారులను కేసీఆర్ ఢిల్లీకి పిలిచినట్టుగా సమాచారం. కాగా టీఆర్ఎస్ పార్టీ పేరును బీఆర్ఎస్గా మార్చుతూ తీర్మానం చేసిన తర్వాత సీఎం తొలిసారి ఢిల్లీ వెళ్లారు. యూపీ మాజీ సీఎం ములాయం సింగ్ యాదవ్ అంత్యక్రియలకు వెళ్లి కేసీఆర్.. అటు నుంచి ఢిల్లీ పయనమయ్యారు. అక్కడ బీఆర్ఎస్కోసం కొత్తగా లీజుకు తీసుకున్న భవనాన్ని పరిశీలించి.. మరమ్మత్తులకు కొన్ని సూచనలు చేశారు. మరసటి రోజు వసంత్ విహార్‌లో కొత్తగా నిర్మిస్తున్న పార్టీ కార్యాలయ పనులను పర్యవేక్షించారు.. అయితే కేసీఆర్‌కు జ్వరం రావడంతో ఆయన ప్రస్తుతం అధికారిక నివాసానికే పమరిమితయ్యారు. చదవండి: మునుగోడు పోరు: కారులో ‘కోటి’ స్వాధీనం.. ఎవరిది ఆ డబ్బు? -
కో–ఇన్ఫెక్షన్స్.. ఏకకాలంలో అనేక జ్వరాలు..!
ఇటీవలి కాలంలో ప్రతి ఇంటా ఎవరో ఒకరు జ్వరంతో బాధపడటం కనిపిస్తోంది. మరీ ముఖ్యంగా ఈమధ్యకాలంలో వరసగా వర్షాలు అందరినీ బెంబేలెత్తించాయి. నిన్న మొన్నటి కరోనా కాలం తర్వాత... అదే సంఖ్యలో మూకుమ్మడి జ్వరాలు ఇటీవల నమోదయ్యాయి. అయితే ఇప్పటి జ్వరాల్లో ఓ ప్రత్యేకత ఉందంటున్నారు వైద్య నిపుణులు. కొందరిలో ఒకే సమయంలో రెండు రకాల జ్వరాలు నమోదవ్వడం ఇటీవల నమోదైన ధోరణి. ఇలా ఒకే సమయంలో అనేక ఇన్ఫెక్షన్లు రావడాన్ని వైద్యనిపుణులు తమ పరిభాషలో ‘కో–ఇన్ఫెక్షన్స్’గా చెబుతున్నారు. ఆ ‘కో–ఇన్ఫెక్షన్ల’పై అవగాహన కోసమే ఈ కథనం. ఓ కేస్ స్టడీ: ఇటీవల ఓ మహిళ జ్వరంతో ఆసుపత్రికి వచ్చింది. తొలుత ఆమెలో డెంగీ లక్షణాలు కనిపించాయి. పరీక్షలో ప్లేట్లెట్ కౌంట్ తగ్గడం డాక్టర్లు చూశారు. ఆ తర్వాత ఆమెకు ఆయాసంగా ఉండటం, ఊపిరి అందకపోవడం గమనించారు. అప్పుడు పరీక్షిస్తే ఆమెకు కోవిడ్ కూడా ఉన్నట్లు తేలింది. ఇలా ఒకేసారి రెండు రకాల జ్వరాలు (ఇన్ఫెక్షన్లు) ఉండటాన్ని ‘కో–ఇన్ఫెక్షన్స్ అంటారు. ఇలా రెండ్రెండు ఇన్ఫెక్షన్లు కలసి రావడం కాస్తంత అరుదు. కానీ ఇటీవల ఈ తరహా కేసులు పెద్ద ఎత్తున రావడం విశేషం. ఇక ఈ కేస్ స్టడీలో కోవిడ్ కారణంగా బాధితురాలిని నాన్–ఇన్వేజివ్ వెంటిలేషన్ మీద పెట్టి, ఆక్సిజన్ ఇస్తూ... రెండు రకాల ఇన్ఫెక్షన్లనూ తగ్గించడానికి మందులు వాడాల్సి వచ్చింది. వైరల్, బ్యాక్టీరియల్ జ్వరాలు కలగలసి... సాధారణంగా జ్వరాలతో బయటపడే ఇన్ఫెక్షన్లు రెండు రకాలుగా ఉంటాయి. వాటిల్లో మొదటివి బ్యాక్టీరియల్ జ్వరాలు. రెండోవి వైరల్ జ్వరాలు. అయితే ఇటీవల బ్యాక్టీరియల్ జ్వరాల్లోనే రెండు రకాలుగానీ లేదా ఒకేసారి రెండు రకాల వైరల్ ఇన్ఫెక్షన్లుగానీ... లేదంటే ఒకేసారి వైరల్‌తో పాటు బ్యాక్టీరియల్ జ్వరాలుగానీ కనిపిస్తున్నాయి. అంతేకాదు... ఒకే సమయంలో అనేక ఇన్ఫెక్షన్లతో పాటు ఒకే సమయంలో కుటుంబసభ్యుల్లో అనేక మంది జ్వరాల బారినపడటం అనేకమందికి ఆందోళన కలిగిస్తోంది. బ్యాక్టీరియల్ జ్వరాలతో కలగలసి... బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ల విషయానికి వస్తే కొందరిలో వైరల్ జ్వరాలతో పాటు టైఫాయిడ్ ఎక్కువగా కనిపిస్తోంది. మరికొందరిలో ఎలుకలతో వ్యాపించే బ్యాక్టీరియల్ జ్వరం ‘లెప్టోస్పైరోసిస్’ కనిపిస్తున్న దాఖలాలూ ఉన్నాయి. ఇటీవల రోజుల తరబడి వర్షాలు కురుస్తుండటంతో బొరియలు వాననీటిలో నిండిపోగా ఎలుకలు ఇళ్లలోకి రావడం పరిపాటిగా మారింది. లెప్టోస్పైరోసిస్ కనిపించడానికి ఇదే కారణం. ఇంకొందరిలో తొలుత జ్వరం రావడం... ఆ తర్వాత బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ తాలూకు రెండో పరిణామంగా (సెకండరీ ఇన్ఫెక్షన్ వల్ల) నిమోనియా కేసులూ కనిపిస్తు న్నాయి. ఇక లక్షణాల తీవ్రత ఎక్కువగా లేని కోవిడ్ రకాలతో (ఒమిక్రాన్ వంటి వాటితో) కలిసి ఇతరత్రా జ్వరాలు రావడం చాలా ఎక్కువగా కనిపిస్తోంది. యాంటీబయాటిక్స్ వద్దు... జ్వరం వచ్చిన వెంటనే కొందరు పారాసిటమాల్‌తో పాటు యాంటీబయాటిక్స్ మొదలుపెడతారు. యాంటీవైరల్ జ్వరాలకు యాంటీబయాటిక్స్ పనిచేయకపోగా... అవసరం లేకపోయినా వాటిని తీసుకోవడం వల్ల కొన్ని కౌంట్లు మారుతాయి. విరేచనాల వంటివి అయ్యే ప్రమాదం ఉంటుంది. గ్యాస్ట్రైటిస్ వంటి అనర్థాలు వచ్చే ముప్పు ఉంటుంది. అందుకే జ్వరం వచ్చిన మొదటి రోజు నుంచే కాకుండా... మూడోనాడు కూడా జ్వరం తగ్గకపోతే... అప్పుడు మాత్రమే డాక్టర్‌ను సంప్రదించి, తగిన మోతాదులోనే యాంటీబయాటిక్స్ తీసుకోవాలి. ఇన్ఫెక్షన్లు కలగలసి రావడం ఇదే మొదటిసారి కాదు... గతంలోనూ కొన్ని సందర్భాల్లో డెంగీ, స్వైన్ ఫ్లూ, టైఫాయిడ్ లాంటివి కలసి వచ్చిన దాఖలాలు చాలానే ఉన్నాయి. అయితే ఇటీవల వర్షాలు సాధారణం కంటే ఎక్కువగా కురిశాయి. దాంతో దోమల కారణంగా మలేరియా, డెంగీ, చికున్‌గున్యా వంటివి కలిసి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. నివారణ... వర్షాకాలంలో పరిసరాల్లో నీళ్లు పేరుకుపోవడంతో దోమలు వృద్ధి చెంది... ఈ జ్వరాలన్నీ వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే ఇంటి పరిసరాల పారిశుద్ధ్య జాగ్రత్తలూ, వ్యక్తిగత పరిశుభ్రత పాటిస్తూ తగినంత అప్రమత్తంగా ఉండాలి. దోమలను ఇంట్లోకి రానివ్వకుండా మెష్ / మస్కిటో రెపల్లెంట్స్ వంటి ముందుజాగ్రత్త చర్యలను తీసుకోవాలి. పిల్లలు, వృద్ధుల ఆరోగ్యం పట్ల మరింత అప్రమత్తంగా ఉండాలి. ఇక పెద్దవయసు వారు అప్పటికే మధుమేహం, అధిక రక్తపోటు వంటి వాటితో బాధపడే అవకాశాలున్నందున వాటి పట్ల మరింత అప్రమత్తత వహించాలి. మూత్రపిండాల వ్యాధితో బాధపడేవారిలో ఇన్ఫెక్షన్లు చాలా తేలిగ్గా సోకే అవకాశాలు ఎక్కువ. కాబట్టి మరింత జాగ్రత్తగా ఉండాలి. వెరసి అందరూ అప్రమత్తంగా ఉండటం చాలా అవసరం. వైరల్ జ్వరాలివే.. వైరల్ జ్వరాల్లో ముఖ్యంగా డెంగీ ఇన్ఫెక్షన్ ఎక్కువగా వస్తోంది. సాధారణంగా అది కోవిడ్‌తో పాటు కలిసి రావడం చాలామందిలో కనిపిస్తోంది. మరికొందరిలో వైరల్ ఇన్ఫెక్షన్లయిన కోవిడ్, ఫ్లూ... ఈ రెండూ కలగలసి వచ్చాయి. ఇంకొందరిలో కోవిడ్, ఫ్లూ, స్వైన్–ఫ్లూ... ఈ మూడింటిలో ఏ రెండైనా కలసి రావడమూ కనిపించింది. లక్షణాలు... వైరల్ జ్వరాల విషయానికి వస్తే... వీటిల్లో జ్వరం తీవ్రత... బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ల కంటే ఎక్కువగా ఉంటుంది. కోవిడ్ వంటివి సోకినప్పుడు జ్వరం, దగ్గు కనిపిస్తుంటాయి. తీవ్రత కొంత తగ్గినప్పటికీ ఇటీవల కోవిడ్‌తో కలసి మరో ఇన్ఫెక్షన్ ఉంటే... ఆయాసం, ఊపిరి అందకపోవడం వంటి లక్షణాలూ ఉండవచ్చు. వెరసి... జ్వరం, స్వల్పంగా జలుబు/ఫ్లూ లక్షణాలు, కొందరిలో ఆయాసం, ఊపిరి సరిగా అందకపోవడం, నీరసం, ఒళ్లునొప్పులు వంటి లక్షణాలు ఎక్కువ. డెంగీ కేసుల్లో కొందరిలో ఒంటిపై ర్యాష్ వంటి లక్షణాలతో పాటు రక్తపరీక్షలు చేయించినప్పుడు... ప్లేట్లెట్స్ తగ్గడం వంటి లక్షణాలూ కనిపించవచ్చు. నిర్ధారణ పరీక్షలు... కోవిడ్ నిర్ధారణ కోసం ఆర్టీ–పీసీఆర్ అందరికీ తెలిసిన వైద్య పరీక్షే. డెంగీ నిర్ధారణ కోసం చేసే కొన్ని పరీక్షల్లో ఫలితాలు కొంత ఆలస్యంగా వచ్చే అవకాశం ఉంది. ఎలాగూ డెంగీలో లక్షణాలకే చికిత్స చేయాల్సి ఉన్నందున... ప్లేట్లెట్ కౌంట్తోనే దీన్ని అనుమానించి... తగిన చికిత్సలు అందించాలి. ఇక బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అయిన టైఫాయిడ్ నిర్ధారణ కోసం వైడాల్ టెస్ట్ అనే వైద్య పరీక్ష చేయించాలి. అవసరాన్ని బట్టి కొన్ని ఇతర పరీక్షలూ చేయించాలి. చికిత్స వైరల్ జ్వరాలకు నిర్దిష్ట చికిత్స లేనందున జ్వరానికి పారాసిటమాల్ ఇస్తూ... లక్షణాలను బట్టి సింప్టమాటిక్ ట్రీట్మెంట్ అందించాలి. ద్రవాహారాలు ఎక్కువగా ఇవ్వాలి. ఏవైనా దుష్ప్రభావాలు కనిపిస్తే... వాటిని బట్టి చికిత్సను మార్చాలి. (ఉదా. డెంగీలాంటి కేసుల్లో ప్లేట్లెట్స్ తగ్గినప్పుడు, వాటిని ఎక్కించడం). ఇక టైఫాయిడ్ వంటి బ్యాక్టీరియల్ జ్వరాలకు యాంటీబయాటిక్స్ పనిచేస్తాయి. అయితే జ్వరం వచ్చిన రెండు, మూడు రోజుల వరకు అది వైరలా, బ్యాక్టీరియలా తెలియదు కాబట్టి కేవలం పారాసిటమాల్ తీసుకుంటూ... ఆ పైన కూడా జ్వరం వస్తూనే ఉంటే వైద్యుల వద్దకు వెళ్లి, పరీక్షలు చేయించి, తగిన చికిత్సలు తీసుకోవాలి. ఇక లెప్టోస్పైరోసిస్ వంటివి కాలేయం, కిడ్నీ వంటి వాటిపై దుష్ప్రభావం చూపే అవకాశం ఉంది. సెకండరీ నిమోనియా మరింత ప్రమాదకారి. అందుకే ఈ కేసుల్లో మరింత అప్రమత్తంగా ఉండాలి. -డాక్టర్ ఆరతి బెల్లారి, కన్సల్టెంట్ ఫిజీషియన్ -
Hyderabad: డెంగీ, ఇతర వ్యాధులతో తల్లడిల్లుతున్న జనం
సాక్షి, హైదరాబాద్: నగరంపై విషజ్వరాలు ముప్పేట దాడి చేస్తున్నాయి. సీజనల్ ఫీవర్లు చుట్టుముడుతున్నాయి. ప్రభుత్వ ఆసుపత్రులన్నీ రోగులతో నిండిపోతున్నాయి. బస్తీ దవాఖానాల్లో పరిస్థితి కూడా అందుకు భిన్నంగా ఏమీలేదు. కరోనా సమయంలో కనపడకుండా పోయిన సీజనల్ వ్యాధులన్నీ ఇప్పుడు విరుచుకుపడుతున్నాయి. జ్వరం, జలుబు, దగ్గు, ఒళ్లు నొప్పులతో బాధపడుతూ బాధితులు దవాఖానాల బాట పడుతున్నారు. అధికారుల గణాంకాల్లో తక్కువగా కనపడుతున్నా, డెంగీ కేసుల సంఖ్య భారీగానే ఉందని ప్రైవేటు ఆసుపత్రుల్లో పేషెంట్ల రద్దీ, ప్లేట్లెట్లకు పెరుగుతున్న డిమాండ్ వెల్లడిస్తోంది. మరోవైపు వైద్యారోగ్య శాఖ కేవలం నామమాత్రపు చర్యలకే పరిమితమైందనే విమర్శలు వినిపిస్తున్నాయి. గాంధీ ఓపీ విభాగంలో క్యూలైన్లలో బారులు తీరిన రోగులు గాంధీఆస్పత్రి/ నల్లకుంట/తార్నాక జ్వరంతో ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే రోగుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. బేగంపేట శ్యాంలాల్ బిల్డింగ్‌లో ఏర్పాటు చేసిన బస్తీ దవాఖానాలో గత నెలలో 16, ఈ నెలలో ఇప్పటివరకు 6 డెంగీ కేసులు నమోదయ్యాయి. సాధారణ రోజుల్లో ఓపీ రోగుల సంఖ్య 60– 70 వరకు ఉంటే ప్రస్తుతం 110 నుంచి 120 మందికి, అలాగే 50 వరకు ఓపీ ఉండే సనత్‌నగర్ అశోక్ కాలనీ బస్తీ దవాఖానాలో ఆ సంఖ్య 100కు చేరింది. ఇక్కడ 6 దాకా డెంగీ కేసులున్నాయి. సనత్‌నగర్ అర్బన్ హెల్త్ ప్రైమరీ సెంటర్లో సాధారణ రోజుల్లో 100–120 వరకు ఉండే సంఖ్య 150కు చేరింది. గత రెండు వారాల్లో ఇక్కడి యూపీహెచ్సీ పరిధిలో 2 డెంగీ కేసులు నమోదు కావడం గమనార్హం. అదే విధంగా కొండాపూర్ ఏరియా జిల్లా ఆస్పత్రికి రోజు 400 నుంచి 450 మంది వస్తున్నారు. వీరిలో రోజుకు 40 నుంచి 50 మంది జ్వరంతో బాధపడుతున్నవారు ఉండగా, రోజుకు 20 మంది ఆస్పత్రిలో చేరుతున్నారు. ‘వర్షాలతో మురుగు పేరుకుపోవడంతో దోమల ద్వారా జ్వరాలు సోకుతున్నాయి. ప్రస్తుతం పేషెంట్ల సంఖ్య రెట్టింపు అయ్యింది’ అని కొండాపూర్ ఏరియా ఆస్పత్రి సూపరిటెండెంట్, డాక్టర్ వరదాచారి చెప్పారు. ఉప్పల్‌లో ఇంటికొకరు.. ఉప్పల్‌లో ఇంటికి ఒకరు చొప్పున విష జ్వరాలు బారిన పడుతుంటే వీరిలో చిన్న పిల్లలు ఎక్కువగా ఉండడం ఆందోళన కలిగిస్తోంది. ఉప్పల్ ప్రాథమిక వైద్య కేంద్రం పరిధిలో ఓపీల దగ్గర క్యూలు సైతం భారీగా పెరిగాయి. రోజుకు 80 నుంచి 100 వరకు ఉండే ఓపీలో 150 వరకు పెరగింది. వైరల్ ఫీవర్ల తీవ్రత ఉందని, ఉప్పల్ పీహెచ్సీ పరిధిలో గత 25 రోజులుగా దాదాపు 30కి పైగా డెంగీ కేసులను నమోదయినట్లు వైద్యాధికారి సౌందర్యలత తెలిపారు. అలాగే రెండు మలేరియా కేసులు నమోదు అయినట్లు చెప్పారు. ‘గత నెల రోజులుగా డెంగీ కేసుల సంఖ్య పెరుగుతోంది. సాధారణ రోజుల్లో నిత్యం 600లోపు ఓపీ ఉంటోంది. కొద్ది రోజులుగా 1000కి పెరిగింది’ అని నల్లకుంట ఫీవర్ ఆసుపత్రి సూపరింటెండెంట్ డా.శంకర్ చెప్పారు. గాంధీలో రోగుల రద్దీ.. విషజ్వరాల వ్యాప్తితో సికింద్రాబాద్ గాం«దీఆస్పత్రికి రోగుల సంఖ్య భారీగా పెరిగింది. అవుట్ పేషెంట్ విభాగంలో 1500 నుంచి 2000 వరకు, ఇన్‌పేషెంట్ విభాగంలో 1800 మందికి వైద్యసేవలు అందిస్తున్నారు. ప్రస్తుతం గాం«దీలో 160 శాతం ఆక్యుపెన్సీ ఉన్నట్లు ఆస్పత్రి గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఓపీ విభాగంలో కంప్యూటర్ చిట్టీలు, వైద్యసేవల కోసం వందలాది మంది రోగులు క్యూలైన్లలో గంటల తరబడి నిరీక్షించే దుస్థితి నెలకొంది. ఇన్పేòÙంట్ విభాగంలోని పలు వార్డుల్లో రోగుల సంఖ్య పెరగడంతో ఫ్లోర్బెడ్స్ (నేలపై పరుపు)వేసి వైద్యసేవలు అందిస్తున్నారు. నెలరోజల నుంచి గాంధీ ఆస్పత్రికి రోగుల రద్ధీ అధికంగా ఉందని, విషజ్వరాలకు గురైన రోగులు ఓపీకి 500, ఐపీలో 250 మంది గతం కంటే అధికంగా వస్తున్నట్లు గుర్తించామని గాంధీ సూపరింటెండెంట్ రాజారావు తెలిపారు. -
మునుగోడు ఉప ఎన్నిక ఫీవర్
-
గ్లూకోజ్ పౌడర్ అనుకొని..
సాక్షి, వరంగల్: జ్వరంతో బాధపడుతున్న మహిళ గ్లూకోజ్ పౌడర్ అనుకుని ఎలుకల మందు తాగి చికిత్స పొందుతూ మృతి చెందింది. వివరాలిలా ఉన్నాయి. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ధర్మారం గ్రామానికి చెందిన గండ్రకోట రేణుక(47) జ్వరంతో బాధపడుతోంది. దీంతో ట్యాబెట్లతో పాటు గ్లూకోజ్ పౌడర్ వాడుతుంది. ఈ క్రమంలో 21వ తేదీ రాత్రి ట్యాబెట్లు వేసుకొని గ్లూకోజ్ పౌడర్ తాగే క్రమంలో కళ్లు సరిగా కనిపించక అక్కడే ఉన్న ఎలుకల మందును నీటిలో కలుపుకుని తాగింది. మరుసటి రోజు ఉదయం తీవ్ర అస్వస్థతకు గురికావడంతో ఆమె కుమారుడు నవీన్‌కు గ్లూకోజ్ పౌడర్ తాగినని చెప్పింది. దీంతో ఇంట్లో పరిశీలించగా గ్లూకోజ్ పౌడర్‌కు బదులు ఎలుకల మందు తాగినట్లు గుర్తించి వెంటనే చికిత్స నిమిత్తం వరంగల్ ఎంజీఎం తరలించాడు. ఈ క్రమంలో చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందినట్లు ఎస్సై ప్రవీణ్ తెలిపారు. చదవండి: వామ్మో! చేపల వలలో భారీ కొండ చిలువ -
సీజన్ వచ్చేసింది.. వణికించే వ్యాధుల జాబితా! లక్షణాలు, ముందు జాగ్రత్తలు
తొలకరి మొదలైంది.. రోజూ వర్షాలు కురుస్తుండడంతో వీధుల్లో నీరు నిల్వ చేరుతోంది. దోమలు వ్యాప్తి చెందుతుండడంతో సీజనల్ వ్యాధుల విజృంభణ ప్రారంభమైంది. ఈ క్రమంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు. వ్యక్తిగత శుభ్రత పాటించాలని సూచిస్తున్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని వెల్లడిస్తున్నారు. జ్వరం.. జలుబు వచ్చిన వెంటనే చికిత్స పొందాలని కోరుతున్నారు. ప్రాణాంతకం కాకముందే ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని తెలియజేస్తున్నారు. చిత్తూరు రూరల్ : వర్షాకాలంలో ప్రజలు అధికంగా సీజనల్ వ్యాధుల బారిన పడుతుంటారు. వాతావరణ మార్పులతో తరచుగా జ్వరం, జలుబుతో బాధపడుతుంటారు. రోగాల వ్యాప్తికి ప్రధానంగా దోమలే కారణమని వైద్యులు చెబుతున్నారు. ఇళ్ల వద్ద, వీధుల్లో నీరు నిల్వ చేరడంతో దోమలు విపరీతంగా పెరిగి వ్యాధుల వ్యాప్తికి కారకాలుగా మారుతున్నాయని వివరిస్తున్నారు. వైరల్ జ్వరాలను ప్రజలు నిర్లక్ష్యం చేయకుండా వెంటనే ఆస్పత్రికి వెళ్లి చికిత్స తీసుకోవాలని సూచిస్తున్నారు. ► తేలికపాటి జ్వరం.. జలుబు: సీజన్ మార్పుతో పెరిగే సూక్ష్మక్రిముల వల్ల వైరల్ జ్వరాలు వ్యాప్తి చెందుతాయి. ఇవి గాలి, నీటి ద్వారా శరీరంలోకి ప్రవేశిస్తాయి . ఈ వైరల్ ఫీవర్ 3 నుంచి 7 రోజుల వరకు ఉంటుంది. జాగ్రత్తలు: భోజనం చేసే ముందు తప్పనిసరిగా చేతులు శుభ్ర పరుచుకోవాలి. నిల్వ పదార్థాలు తినకూడదుౖ తాజా పండ్లు తీసుకోవాలి . వర్షంలో తడవకూడదు . తడిచిన బట్టలలో ఎక్కువ సేపు ఉండ కూడదు. మాస్క్ తప్పనసరిగా ధరించాలి. ► చికెన్ గున్యా: దోమ కాటు వల్ల చికెన్ గున్యా వస్తుంది. తీవ్రమైన జ్వరం , కీళ్ల నొప్పులు చికెన్ గున్యా లక్ష ణాలు , ఇది సోకితే మొదటి రెండు , మూడు రోజులు జ్వరం ఎక్కువగా ఉంటుంది . జాగ్రత్తలు: ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి . కూలర్లు, టైర్లు మొదలైన వాటిలో నీరు నిల్వ చేరకుండా చూసుకోవాలి. శరీరం మొత్తం కప్పేలా దుస్తులు ధరించాలి . ► మలేరియా: తీవ్రమైన తలనొప్పి, వణుకుతో కూడిన అధిక జ్వరం మలేరియా లక్షణాలు . జ్వరం తగ్గి మళ్లీ వస్తుంది . ఆడ దోమ కాటుతో మలేరియా జిరమ్స్ శరీరంలో లోపలికి వెళ్తాయి . 14 రోజుల తర్వాత అధిక జ్వరం వస్తుంది . ఈ దోమలు నిల్వ ఉన్న వర్షపు నీటిలో వృద్ధి చెందుతాయి. జాగ్రత్తలు: దోమతెరలు వినియోగించాలి. ఇంటి చుట్టూ నీరు నిల్వ చేరకుండా చూసుకోవాలి. ఒకవేళ నీరు నిల్వ చేరితే అందులో కిరోసిన్ గాని పురుగు మందుగాని పిచికారీ చేయించాలి. ► డెంగీ: వైరల్ జ్వరం మాదిరి అకస్మాత్తుగా జ్వరం వస్తుంది. తీవ్రమైన ఒళ్లు నొప్పులు వస్తాయి. ఎముకలు విరిగిపోతున్నంత బాధ కలుగుతుంది . ఒక్కోసారి శరీర అంతర్భాగాల్లో రక్తస్రావం జరుగుతుంది. పొట్ట, కాళ్లు , చేతులు , ముఖం , వీపు భాగాల చర్మంపై ఎరగ్రా కందినట్టు చిన్నచిన్న గుల్లలు కనిపిస్తాయి . ఒక్కోసారి ప్లేట్లెట్స్ తగ్గిపోయి రోగి పరిస్థితి విషమంగా మారుతుంది . ఈడిస్ ఈజిప్టు అనే దోమ కాటుతో డెంగీ వ్యాప్తి చెందుతుంది. ఇళ్లలోని కుండీలు , ఓవర్ హెడ్ ట్యాంక్‌లు , ఎయిర్ కూలర్లు , పరిసరాల్లో నిర్లక్ష్యంగా పడేసిన కొబ్బరి బొండాలు , ప్లాస్టిక్ కప్పులు , పగిలిన సీసాలు , టైర్లు వంటి వాటిల్లో చేరిన వర్షపు నీటిలో గుడ్లు పెట్టి ఈడిస్ దోమలు వృద్ధి చెందుతాయి. జాగ్రత్తలు: ఇంటి పరిసర ప్రాంతాల్లో నీరు నిల్వ లేకుండా చూసుకోవాలి . చెత్తాచెదారం సమీపంలో ఉండకూడదు. ఇంట్లో దోమల మందు చల్లించుకోవాలి . దోమ తెరలు వాడడం శ్రేయస్కరం . వారంలో ఒక రోజు డ్రైడే పాటించాలి . ఇంటి పరిసరాల్లో కొబ్బరి బొండాలు , పాత టైర్లు , ఖాళీ డబ్బాల్లో నీరు నిల్వ ఉండకుండా చూడాలి . ఎయిర్ కూలర్లు , ఎయిర్ కండిషన్లు , పూలకుండీల్లో నీటిని తరచూ మార్చాలి. నీళ్ల ట్యాంకులపై సరైన మూతలను అమర్చాలి. శరీరమంతా కప్పి ఉంచుకునేలా దుస్తులు వేసుకోవాలి. ► హెపటైటిస్–ఏ: వర్షాకాలంలో హెపటైటిస్– ఎ ( కామెర్లు) వ్యాధి వచ్చే అవకాశం ఉంది . ఇది కాలేయ కణాలలో సంక్రమణ వల్ల కలుగుతుంది. కలుషితమైన ఆహార పదార్థాల నుంచి , తాగునీటి నుంచి రోగ కారకక్రిములు శరీరంలోకి ప్రవేశిస్తాయి . కాలేయ వ్యాధి కారణం గా రక్తంలో బిలిరుబిన్ పరిమాణం పెరుగుతుంది. దీంతో శరీర భాగాలు పసుపు రంగులోకి మారిపోతాయి. జాగ్రత్తలు: శుభ్రమైన ఆహారం తీసుకోవాలి. కాచి చల్లార్చిన నీటినే తాగాలి. బయట ఆహారం తినకూడదు. వ్యక్తిగత మరుగుదొడ్లు వినియోగించాలి. ► టైఫాయిడ్: వర్షాకాలంలో టైఫాయిడ్ కేసులు పెరిగే అవకాశం ఉంది . ఇది సాల్మొనెల్లా టైఫీ బ్యాక్టీరియా వల్ల వస్తుంది . కలుషిత నీరు తాగడం, ఆహారం తినడం వల్ల ఈ వ్యాధి వ్యాప్తి చెందుతుంది. జాగ్రత్తలు: కాచి చల్లార్చిన నీటిని తాగాలి. బయట ఆహారం తినకూడదు. రోజూ కనీసం 3 నుంచి 4 లీటర్ల నీటిని సేవించాలి. ముఖ్యంగా పండ్ల రసం, కొబ్బరి నీరు, సూప్ వంటివి తీసుకోవడం మంచిది. అప్రమత్తత తప్పనిసరి వర్షాల కారణంగా ప్రజలు సీజనల్ వ్యాధుల బారిన పడకుండా అప్రమత్తంగా ఉండాలి. తగు జాగ్రత్తలు తీసుకుంటే రోగాలు రాకుండా రక్షణ పొందవచ్చు. వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రత తప్పనిసరిగా పాటించాలి. ఏమాత్ర జ్వరం, జలుబు వచ్చినా వెంటనే వైద్యులను సంప్రదించి చికిత్స తీసుకోవాలి. ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యం ఉండకూడదు. వర్షంలో తడవకుండా చూసుకోవాలి. – శ్రీనివాసులు, డీఎంఓ -
తెలంగాణ: ‘మంకీపాక్స్’ కలకలంపై వైద్యాధికారుల స్పందన
సాక్షి, హైదరాబాద్/ కామారెడ్డి: మంకీపాక్స్ అనుమానిత లక్షణాలు కామారెడ్డికి చెందిన ఓ వ్యక్తిలో వెలుగుచూసిన వ్యవహారం.. రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపుతోంది. ఈ నెల మొదటి వారంలో కువైట్ నుంచి కామారెడ్డి ఇందిరానగర్ కాలనీకి చేరుకున్నాడు 35 ఏళ్ల వ్యక్తి. తీవ్ర జ్వరం అటుపై అతనిలో మంకీపాక్స్ లక్షణాలు కనిపించడంతో వైద్య శాఖ అప్రమత్తం అయ్యింది. అదనపు టెస్టుల కోసం హైదరాబాద్ ఫీవర్ ఆస్పత్రికి తరలించగా.. ఇందుకు సంబంధించిన వివరాలను వైద్యాధికారులు వెల్లడించారు. మంకీపాక్స్ అనుమానితుడి ఆరోగ్యం నిలకడగా ఉందని ఫీవర్ హాస్సిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ శంకర్ వెల్లడించారు. ‘‘అనుమానితుడి కుటుంబ సభ్యులను ఐసోలేషన్‌లో ఉంచాం. పేషెంట్లో నుంచి ఐదు రకాల శాంపిల్స్ తీసుకుని పూణే వైరాలజీ ల్యాబ్‌కు పంపిస్తున్నాం. రేపు సాయంత్రం లోగా రిపోర్ట్ వస్తుందని భావిస్తున్నాం’’ ఆయన వెల్లడించారు. గట్టిగా దగ్గినప్పుడు తుంపర్ల ద్వారా వైరస్ వ్యాప్తి చెందుతుందని ఆయన తెలిపారు. అంతేకాదు మంకీపాక్స్ లక్షణాలున్న వ్యక్తితో సన్నిహిత సంబంధాలు ఉన్న మరో ఆరుగురిని సైతం హోం ఐసోలేషన్ లో ఉంచినట్టు వెల్లడించిన ఆర్ఎంవో శ్రీనివాస్ వెల్లడించారు. ఈ నెల 20వ తేదీన జ్వరంతో వైద్యులను సంప్రదించగా.. 23 న మంకీపాక్స్ గా అనుమానం వచ్చింది. దీంతో హైదరాబాద్ ఫీవర్ ఆస్పత్రికి రిఫర్ చేశారు వైద్యులు. దీంతో స్థానికంగా భయాందోళనలు నెలకొన్నాయి. ఇదిలా ఉంటే.. దేశంలో ఇప్పటిదాకా నాలుగు మంకీపాక్స్ కేసులు వెలుగు చూశాయి. అందులో మూడు కేరళ నుంచి.. మరొకటి ఢిల్లీ నుంచి నమోదు అయ్యాయి. ఇక తెలంగాణాలో మంకీపాక్స్ కేసు లక్షణాలు రావడంతో కాస్త ఆందోళన మొదలైంది. అయితే వైద్యులు మాత్రం ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. జాగ్రత్తగా ఉంటే సరిపోతుందని సూచిస్తున్నారు. ఇదీ చదవండి: మంకీపాక్స్ గురించి ఈ విషయాలు తెలుసా? -
కేరళలో ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ కలకలం
తిరువనంతపురం: కేరళలో వాయనాడ్ జిల్లాలోని మనంతవాడిలో ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్‌కి సంబంధించిన రెండు కేసులు నమోదైనట్లు అధికారులు తెలిపారు. ఈ మేరకు భోపాల్‌లోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హై సెక్యూరిటీ యానిమల్ డిసీజెస్ రెండు పందుల నుంచి తీసకున్న శాంపిల్స్ పరీక్షించగా ఈ వ్యాధి గుర్తించనట్లు తెలిపారు. పశుసంవర్థక శాఖకు చెందిన అధికారి ఒక పొలంలో పందులు ముకుమ్మడిగా చనిపోవడంతో...పందుల నుంచి సేకరించిన కొన్ని శాంపిల్స్‌ని పరీక్షల కోసం పంపినట్లు తెలిపారు. దీంతో ఆయా జిల్లాలోని దాదాపు 300 పందులను చంపేందుకు ఆదేశాలు జారీ చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ వ్యాధి వ్యాప్తి చెందకుండా కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించింది. బీహార్‌తోపాటు మరికొన్ని ఈశాన్య రాష్ట్రాల్లో ఈ ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్‌కి సంబంధించిన కేసులు నమోదవ్వడంతో కేంద్ర జారీ చేసిన హెచ్చరికల నేపథ్యంలోనే అధికారులు అప్రమత్తమై ఈ కఠిన చర్యలను అవలంభించారు. ఈ ఆఫ్రికన్ ఫీవర్ అనేది పెంపుడు పందులను ప్రభావితం చేసే ప్రాణాంతక అంటు వ్యాధి. (చదవండి: ఇండిగో రచ్చ: కేరళ సీఎం పినరయి విజయన్‌కు కోర్టు షాక్) -
ఫీవర్’లో మంకీ పాక్స్ ఐసోలేషన్ వార్డు
నల్లకుంట: దేశంలో మంకీ పాక్స్ కేసులు నమోదవుతున్నట్లు వస్తున్న వార్తల నేపథ్యంలో ఆ వ్యాధిని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు తెలంగాణ ప్రభుత్వం అవసరమైన ఏర్పాట్లు చేసిందని నల్లకుంట ఫీవర్ ఆస్పత్రి సూపరింటెండెంట్, మంకీ పాక్స్ నోడల్ ఆఫీసర్ డాక్టర్ కె. శంకర్ అన్నారు. ఇందు కోసం నల్లకుంట ఫీవర్ ఆస్పత్రిలో 36 పడకలతో మంకీ పాక్స్ ఐసోలేషన్ వార్డును సిద్ధం చేశామన్నారు. మంగళవారం మీడియాతో కలిసి ఫీవర్‌లో మంకీ పాక్స్ వార్డుని(7వ వార్డు) పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ విదేశాల నుంచి వచ్చే వారిలో ఒకరికైనా మంకీ పాక్స్ లక్షణాలు కనిపిస్తే నేరుగా విమానాశ్రయం నుంచి నల్లకుంట ఫీవర్ ఆస్పత్రికి తీసుకు వస్తారన్నారు. అనంతరం ఇక్కడి వైద్యుల సూచనల మేరకు అనుమానితుల నుంచి బ్లడ్, యూరిన్, క్కిన్ లీసెన్స్ (నీటి), గొంతు నుంచి శాంపిల్స్ తదితర ఐదు రకాల శాంపిళ్లను సేకరించి పరీక్షల కోసం గాంధీ ఆస్పత్రికి పంపుతామన్నారు. రిజల్ట్స్‌లో ఏమైనా అనుమానాలు ఉంటే మరోసారి శాంపిళ్లు సేకరించి వ్యాధి నిర్ధారణ పరీక్షల కోసం పుణేకు పంపిస్తామన్నారు. ఈ పరీక్షల్లో వ్యాధి నిర్ధారణ అయిన వారికి ప్రత్యేక చికిత్సలు అందించనున్నట్లు తెలిపారు. సాధారణంగా ఈ వ్యాధి గాలి ద్వారా సోకదని, ఈ వ్యాధి సోకిన వ్యక్తి దగ్గరికి పీపీఈ కిట్లు ధరించకుండా వెళ్లినప్పుడు ఆ రోగి దగ్గినా, తుమ్మినా వచ్చే తుంపర్ల ద్వారా ఇతరులకు సోకుతుందన్నారు. ఈ వైరస్ ఒకరినుంచి మరొకరికి వేగంగా వ్యాప్తి చెందుతుందన్నారు. మంకీ పాక్స్ కొత్తది కాదని, పలు దేశాల్లో ఇప్పటికే ఉందన్నారు. ఈ వ్యాధి సోకిన వ్యక్తి కాళ్లు, చేతులు, ముఖంపై, శరీరంపై దద్దుర్లు(గుళ్లలు) ఏర్పడడం, గొంతులో వాపు రావడం తదితర లక్షణాలు ఉంటాయన్నారు. సోమవారం డీఎంఈ కార్యాలయంలో గాంధీ ఆస్పత్రి çసూపరింటెండెంట్ డాక్టర్ రాజారావు, మైక్రో బయాలజిస్టు డాక్టర్లతో కలిసి రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఆస్పత్రుల వైద్యులతో ఏర్పాటు చేసిన జూమ్ మీటింగ్‌లో పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా(సెన్సటైజేషన్) వివరించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా మంకీ పాక్స్ వచ్చిన రోగిని వేరే ఆసుపత్రికి ఎలా తరలించాలి, రోగికి చికిత్స, శాంపిల్స్ సేకరణ, రోగికి వైద్యం అందించే వైద్యులు ఇతర సిబ్బంది తీసుకోవాల్సిన జాగ్రత్తలపై శిక్షణ ఇచి్చనట్లు ఆయన పేర్కొన్నారు. (చదవండి: 111 రోజులు చికిత్స.. ప్రభుత్వాసుపత్రి ప్రాణం పోసింది.. మంత్రి హరీశ్‌రావు అభినందనలు) -
వరద ప్రభావిత ప్రాంతాల్లో జ్వర సర్వే
సాక్షి, హైదరాబాద్: వరద ప్రభావిత ప్రాంతాల్లో ఇంటింటికి వెళ్లి జ్వరం సర్వే చేపట్టినట్లు ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ శ్రీనివాసరావు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్ భూపాలపల్లి, కుమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, ములుగు, నిర్మల్, పెద్దపల్లి జిల్లాల్లో వరద ప్రాంతాలను నాలుగు భౌగోళిక ప్రాంతాలుగా విభజించామన్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించి ఇక్కడ చేపడుతున్న కార్యకలాపాలను సమీక్షించారని తెలిపారు. ‘‘పారిశుధ్య కార్యకలాపాలను వేగవంతం చేయాలని, దోమల నియంత్రణ చర్యలు చేపట్టాలని ఆదేశించాం. మందులు తగినంత నిల్వ ఉండేలా చర్యలు తీసుకుంటున్నాం. సీజనల్ వ్యాధుల నివారణకు కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేశాం. యాంటీ లార్వా ఆపరేషన్లు, డెంగీ, మలేరియాను గుర్తించడానికి ఏర్పాట్లు చేశాం. 297 హైరిస్క్ ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించాం. యుద్ధ ప్రాతిపదికన కార్యకలాపాలు నిర్వహించేందుకు 670 మంది అదనపు ఆరోగ్య సిబ్బందిని వరద ప్రభావిత ప్రాంతాలకు పంపాం. ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్‌లను ఏర్పాటు చేశాం. సహాయక శిబిరాల వద్ద ఆరోగ్య శిబిరాలతో పాటు, గ్రామస్థాయి ఆరోగ్య శిబిరాలు కూడా నిర్వహిస్తాం. అన్ని ఇళ్లకు క్లోరిన్ మాత్రలు పంపిణీ చేస్తున్నాం. రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో 24 గంటలు పనిచేసేలా వార్ రూంలను ఏర్పాటు చేశాం. వరద ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన వైద్య శిబిరాల ద్వారా ఇప్పటివరకు 64,230 మందికి వివిధ రకాల వైద్య చికిత్సలు చేశాం. అందులో మంగళవారం ఒక్క రోజే 18,558 మందికి వైద్య సాయం అందజేశాం’’ అని శ్రీనివాసరావు ప్రకటనలో పేర్కొన్నారు. -
Tomato Fever: ఒళ్లంతా దురద.. జ్వరం, అలసట.. టొమాటో ఫీవర్ అంటే?
ఓ పక్క దేశంలోని చాలా ప్రాంతాల్లో కోవిడ్ మరోసారి విజృంభిస్తోందన్న వార్తల నేపథ్యంలో.. కేరళ రాష్ట్రంలో పిల్లలను ‘టొమాటో ఫీవర్’ వణికిస్తోంది. నిజానికి పిల్లలకు ఏదైనా చిన్న సమస్య వస్తేనే తల్లిదండ్రులు తల్లడిల్లిపోతుంటారు. అలాంటిది ఐదేళ్లలోపు చిన్నారులకే ఎక్కువగా వచ్చే ఈ జ్వరంతో మరింతగా ఆందోళనపడుతున్నారు. నాలుగైదు వారాలుగా వ్యాధి విస్తృతంగా ఉన్న కేరళతో పాటు తమిళనాడు, కర్ణాటకలను బెంబేలెత్తిస్తున్న ‘టొమాటో ఫీవర్’పై అవగాహన కోసం ఈ కథనం. కొద్దిగా ఆసక్తికరమైన పేరుతో ఉన్న ఈ జ్వరం డెంగీ లేదా చికన్‌గున్యా తరహాకు చెందిదా లేక ఇతరత్రా మరేదైనా గ్రూపునకు చెందిన వైరస్‌నా అన్న విషయం ఇంకా నిర్ధారణగా తెలియదు. అయితే ఇది రెస్పిరేటరీ సిన్సీషియల్ వైరస్సా (ఆర్ఎస్వీ) లేక అడినో వైరస్సా లేదా రైనోవైరసా అనే అంశం మీద నిపుణుల్లో ఇంకా చాలా సందేహాలే ఉన్నాయి. ఈ విషయమై వైరాలజీ, వైద్యవర్గాలు ఇంకా పరిశోధనలు కొనసాగిస్తున్నాయి. లక్షణాలు : ► తీవ్రమైన జ్వరం (హైఫీవర్) ► ఎర్రటి టొమాటోపండు రంగులో ఉండే మచ్చలు (బ్లిస్టర్స్) / ర్యాష్ ► ఒళ్లంతా దురద. ► చర్మం ఎండిపోయినట్లుగా ఉండటం (డీహైడ్రేషన్) ► అలసట ► కీళ్లనొప్పులు ► కడుపులో కండరాలు పట్టేయడం ► వికారం / వాంతులు ► నీళ్లవిరేచనాలు ► దగ్గు ► ముక్కుకారుతుండటం ► కొన్నిసార్లు కొంతమంది పిల్లల్లో ఒంటిపై మచ్చలతో పోలిస్తే... కాళ్లూ–చేతులపై ఉండే మచ్చల రంగు ఒకింత మారి ఉన్నట్లు అనిపిస్తుంటుంది. చికిత్స: ఇది దానంతట అదే తగ్గిపోయే వ్యాధి. నిర్దిష్ట చికిత్స అంటూ ఏదీ లేదు. లక్షణాలను బట్టి చికిత్స (సింప్టమాటిక్ ట్రీట్మెంట్) అందిస్తారు. పిల్లలకు ఉపశమనం కోసం గోరువెచ్చని నీటితో స్నానం చేయిస్తుండాలి. బాగా విశ్రాంతి తీసుకోనివ్వాలి. కంటినిండా నిద్రపోయేలా చూడాలి. సూచన : పేరుకు మాత్రమే దీన్ని టొమాటో ఫ్లూ / టొమాటో ఫీవర్ అంటారు. నిజానికి దీనికీ టొమాటోలకూ ఎలాంటి సంబంధం లేదు. ఇది సాధారణ ప్రజలూ గుర్తుపెట్టుకోడానికి వీలుగా పెట్టిన పేరు మాత్రమే. ఇది టొమాటోల వల్ల ఎంతమాత్రమూ రాదు. కాబట్టి ఇది సోకినవారు, ఇతరులూ టొమాటోలను నిరభ్యంతరంగా తినవచ్చు. వాటిలోని పోషకాలు, విటమిన్లతో మంచి వ్యాధినిరోధక శక్తి చేకూరుతుందనీ, ఫలితంగా టోమాటోఫీవర్తో పాటు అనేక జబ్బులను నివారించవచ్చనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. చదవండి: Health Tips: తరచూ చింత చిగురును తింటే.. నివారణ ► ఇది అంటువ్యాధి కావడం వల్ల సోకిన పిల్లల నుంచి ఇతరులను దూరంగా ఉంచాలి. ► పిల్లలను ఎప్పుడూ శుభ్రంగా ఉంచాలి. వ్యక్తిగత పరిశుభ్రతతో చాలావరకు నివారణ సాధ్యం. ► వ్యాధి సోకిన పిల్లల దుస్తులు, వస్తువులు, ఆటబొమ్మలు... ఇతరులు తాకకుండా జాగ్రత్త తీసుకోవాలి. ఈ పేరెలా వచ్చిందంటే... ఇది సోకిన పిల్లల ఒంటి మీద టొమాటో రంగులో ఉండే మచ్చలు (బ్లిస్టర్స్), ర్యాష్ ఏర్పడతాయి. దాంతో ఈ రుగ్మతను టొమాటో ఫీవర్ లేదా టొమాటో ఫ్లూ అని పిలుస్తున్నారు. సాధారణంగా ఐదేళ్ల లోపు పిల్లల్లోనే ఎక్కువగా కనిపించే ఇది... అంతకంటే పెద్దపిల్లల్లోనూ, పెద్దవారిలోనూ చాలా చాలా అరుదుగా మాత్రమే సోకుతుంది. -
మరో కొత్త వైరస్ కలకలం.. 19 మంది మృతి
కొత్త వైరస్లు మానవాళికి సవాల్లు విసురుతున్నాయి. ఇప్పటికే కరోనా, దాని కొత్త వేరియంట్లతో ప్రపంచవ్యాప్తంగా ఆందోళన చెందుతున్న ప్రజలను మంకీ ఫాక్స్, మ్యాంగో ఫీవర్, టమాటో వ్యాధులు మరింత టెన్షన్ పెడుతున్నాయి. తాజాగా కాంగో ఫీవర్ కేసులు పెరగడం వైద్యులను ఆందోళనకు గురిచేస్తోంది. జంతువుల నుంచి మనుషులకు సోకే కాంగో ఫీవర్ ఇరాక్‌లో కలకలం రేపుతోంది. కొత్త వైరస్ వ్యాప్తితో ఆ దేశ ప్రజలు వణికిపోతున్నారు. కాగా, ఈ ఏడాదిలో ఇప్పటికే 19 మంది మృత్యువాత పడ్డట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది. శరవేగంగా వ్యాపించడం, అంతర్గత, బహిర్గత రక్తస్రావానికి(ముక్కు నుంచి రక్తం కారడం) దారి తీయడం, విపరీతమైన జ్వరం దీని ముఖ్య లక్షణాలు. దీని బారిన పడ్డ ప్రతీ ఐదుగురిలో ఇద్దరి చొప్పున మరణిస్తున్నట్టు పలు నివేదికలు చెబుతున్నాయి. ఈ వైరస్ తొలిసారిగా మొట్టమొదట 1944లో క్రిమియాలో కనుగొనబడింది. ఈ తర్వాత 1979లో ఇరాక్‌లోనే వెలుగు చూసింది. ఆఫ్రికా, ఆసియా, మధ్యతూర్పు ప్రాంతాల్లో ఎక్కువగానే కనిపించే కాంగో ఫీవర్ వైరస్ ఇరాక్ ప్రజలను అల్లకల్లోలం చేస్తోంది. ఇక, ఈ వైరస్ ఒకరి నుంచి మరొకరికి వేగంగా వ్యాప్తిస్తుంది. అయితే, ఈ వైరస్‌కు వ్యాక్సిన్ అందుబాటులో లేకపోవడం మరింత టెన్షన్ పెడుతోంది. కాగా, కాంగో హెమోరేజిక్ అనే పేను ద్వారా జంతువుల్లో ఈ వైరస్ వ్యాప్తి జరుగుతుంది. ఆవులు, గేదెలు, మేకలు, గొర్రెల్లో ఈ వైరస్ వాహకంగా ఈ పేలు పనిచేస్తుంది. వైరస్ బారిన పడిన పశువుల రక్తాన్ని తాకినప్పుడు, పశువధ కేంద్రాల్లోని పదార్థాల ద్వారా మనుషులకు ఈ వైరస్ సోకుతుంది. ఇది కూడా చదవండి: విమాన ప్రయాణం విషాదాంతం -
కొనసాగుతున్న 45వ విడత ఫీవర్ సర్వే
సాక్షి, అమరావతి: దేశంలోని ఇతర రాష్ట్రాల్లో కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం 45వ విడత ఇంటంటి ఫీవర్ సర్వే చేపట్టింది. ఆశా వర్కర్‌తో పాటు గ్రామ, వార్డు వలంటీర్లు సోమవారం నుంచి ఇంటింటికి వెళ్లి జ్వరం లక్షణాలున్న వారు ఉన్నారా లేదా అనేది గుర్తించే కార్యక్రమాన్ని చేపట్టారు. ఇప్పటికే 44 సార్లు ఇంటింటి ఫీవర్ సర్వే నిర్వహించడం ద్వారా కోవిడ్ వ్యాప్తి నియంత్రణలో ప్రభుత్వం సఫలీకృతమైంది. ఇప్పుడు రాష్ట్రంలో మొత్తం 1,63,37,078 కుటుంబాల లక్ష్యంగా చేపట్టిన 45వ విడత సర్వే వివరాలను ఏరోజుకు ఆరోజు ఆన్లైన్ యాప్‌లో నమోదు చేస్తున్నారు. ఎవరికైనా జ్వరం లక్షణాలుంటే వారికి కోవిడ్ పరీక్షలను నిర్వహించేందుకు సంబంధిత ఏఎన్ఎంతో పాటు మెడికల్ అధికారి దృష్టికి తీసుకెళతారు. దీర్ఘకాలిక జబ్బులున్నవారిలో జ్వరం లక్షణాలుంటే వెంటనే కోవిడ్ పరీక్షలు నిర్వహిస్తారు. ఆ పరీక్ష ఫలితాల ఆధారంగా హోం ఐసొలేషన్‌కు సూచనలు చేయడంతోపాటు ఉచిత మందుల కిట్ అందజేస్తారు. వైద్యులు పర్యవేక్షిస్తారు. దీర్ఘకాలిక జబ్బులు లేనివారిలో స్వల్ప జ్వరం లక్షణాలుంటే వారికి అక్కడికక్కడే మందులు ఇస్తారు. ఫీవర్ సర్వే నిబంధనల మేరకు పక్కాగా నిర్వహించాలని రాష్ట్ర ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ హైమావతి జి ల్లాల వైద్యాధికారులకు ఆదేశాలు జారీచేశారు. నెలలో రెండుసార్లు ఫీవర్ సర్వే నిర్వహించాలని, ఈ నెలలో తొలివిడత సర్వే ఈ నెల 17వ తేదీలోగా పూర్తికావాలని నిర్దేశించారు. మిగతా రోజువారీ కార్యక్రమాలను కొనసాగిస్తూనే ఫీవర్ సర్వే నిర్వహించాలని స్పష్టం చేశారు. ఇంటింటి ఫీవర్ సర్వేను అత్యంత ప్రాధాన్యతగా తీసుకోవాలని వైద్యాధికారులు సిబ్బందిని ఆదేశించారు. -
పిల్లల్లో జలుబు, గొంతునొప్పి, తీవ్రజ్వరం.. లైట్ తీసుకోకండి!
చిన్నపిల్లలకు జలుబు చేశాక వచ్చే గొంతునొప్పితో పాటు చాలా ఎక్కువ తీవ్రతతో వచ్చే జ్వరం (హైఫీవర్) తో బాధపడుతున్నారనుకోండి.. ‘ఆ... జలుబే కదా... చిన్న గొంతునొప్పే కదా..’ అని నిర్లక్ష్యం చేయకూడదు అంటే ఆశ్చర్యంగా అనిపిస్తోందా? కానీ వాస్తవం. పిల్లలకు జలుబు చేసి గొంతునొప్పితో బాధపడుతున్నప్పుడు దాన్ని కేవలం ఒక చిన్న సమస్యగా చూడకూడదు. ఇందుకు ఓ కారణం ఉంది. జలుబు, గొంతునొప్పి లాంటి లక్షణాలు కనిపించినప్పుడు తొలుత అది టాన్సిల్స్‌కు ఇన్ఫెక్షన్ వచ్చే టాన్సిలైటిస్‌కు దారితీయవచ్చు. ఇది కొందరిలో గ్రూప్–ఏ స్ట్రెప్టోకోకస్ అనే బ్యాక్టీరియా వల్ల వచ్చినట్లయితే దీనికి సరైన యాంటీబయాటిక్స్‌తో పూర్తి కోర్సు వాడుతూ చికిత్స అందించాలి. అలా జరగకపోతే... ఈ సమస్య వచ్చిన ఒకటి నుంచి ఐదు వారాలలోపు రుమాటిక్ ఫీవర్ అనే సమస్యకు దారితీసే ప్రమాదం ఉంది. లక్షణాలు తొలుత జలుబు, గొంతునొప్పి, తీవ్రమైన జ్వరం వచ్చి తగ్గాక ఒకటి నుంచి ఐదు వారాల లోపు మళ్లీ జ్వరం వస్తుంది. ఆ జ్వరంతో పాటు కీళ్లనొప్పులు, కీళ్లవాపులు, ఒంటిమీద ర్యాష్ రావడం వంటి లక్షణాలు కనిపిస్తే దాన్ని రుమాటిక్ ఫీవర్‌గా అనుమానించాలి. అలాగే ఈ పిల్లల్లో శ్వాసతీసుకోవడం వంటి ఇబ్బంది కూడా కనిపిస్తుంది. తీవ్రమైన అలసట, నీరసం, నిస్సత్తువ వంటివీ కనిపిస్తాయి. ఇంకా మరికొన్ని లక్షణాలూ కనిపిస్తాయి గానీ... ఇక్కడ పేర్కొన్నవి మాత్రం రుమాటిక్ ఫీవర్‌ను గుర్తించేందుకు తోడ్పడే ప్రధాన లక్షణాలు. అయితే చిన్న పిల్లల్లో ముందుగా వచ్చే ఈ జలుబు, గొంతునొప్పి, జ్వరాలను చాలామంది సాధారణ సమస్యగానే చూస్తారు. అది రుమాటిక్ ఫీవర్‌కు దారి తీసే ప్రమాదమూ ఉందని కూడా వారికి తెలిసే అవకాశం ఉండదు. కాబట్టి జ్వరం వచ్చి తగ్గి, మళ్లీ ఒకటి నుంచి ఐదు వారాలలోపు జ్వరం వస్తే గనక... అప్పుడు తల్లిదండ్రులు కాస్త అప్రమత్తంగా ఉండాలి. చదవండి: పన్ను నొప్పి: ఆ చీము క్రమంగా దవడకూ, తలకూ పాకవచ్చు.. జాగ్రత్త! నిజానికి రుమాటిక్ ఫీవర్ అనేది సాధారణంగా 5 – 15 ఏళ్ల చిన్నారులపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఇది దాదాపు పదేళ్లు కొనసాగితే మాత్రం... గుండె కవాటాల (వాల్వ్స్)ను తీవ్రంగా ప్రభావితం చేసి గుండెకు ముప్పు తెచ్చిపెడుతుంది. చికిత్స / నివారణ వాస్తవానికి తొలిదశలోనే పూర్తిగా తగ్గిపోయేలా చికిత్స చేస్తే... కేవలం చాలా చిన్న కోర్సు యాంటీబయాటిక్స్తోనే సమస్య పూర్తిగా ముగిసిపోతుంది. కానీ ఆ చిన్న చికిత్సే అందించకపోతే అది గుండె ఫెయిల్యూర్‌కూ దారితీయవచ్చు. చికిత్స అందించాక కూడా కొంతమంది పిల్లల్లో అది వాల్వ్ రీప్లేస్మెంట్ ఆపరేషన్ అవసరం పడేవరకూ వెళ్లే అవకాశం ఉంది (చాలా కొద్దిమంది పిల్లల్లోనే). మరికొందరిలో బ్లడ్‌థిన్నర్స్ (రక్తం పలుచబార్చే మందులు) కూడా జీవితాంతం వాడాల్సి రావచ్చు. ఇలాంటి చిన్నారుల్లో ఆడ పిల్లలు ఉండి, వారు పెద్దయ్యాక గర్భం దాల్చినప్పుడు సైతం అదీ ఓ సమస్యగా పరిణమించవచ్చు. అందుకే పిల్లల్లో జలుబు, గొంతునొప్పితో కూడిన తీవ్రమైన జ్వరం వస్తే దాన్ని చిన్న సమస్యగా పరిగణించకూడదు. పీడియాట్రీషియన్‌ను ఓసారి తప్పనిసరిగా సంప్రదించడమే మేలు. ఇంత పెద్ద సమస్య కేవలం ఒక పూర్తి (కంప్లీట్) కోర్సు యాంటీబయాటిక్తోనూ... అంతేగాక... శారీరక/వ్యక్తిగత పరిశుభ్రత (పర్సనల్ హైజీన్)తోనూ నివారించవచ్చని గుర్తుంచుకోవాలి. -
చురుగ్గా 44వ విడత ఫీవర్ సర్వే
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కరోనా కేసుల నమోదు పెద్దగా లేకపోయినప్పటికీ ముందస్తు అప్రమత్తతలో భాగంగా ప్రభుత్వం ఫీవర్ సర్వే కొనసాగిస్తోంది. వైద్యసిబ్బంది ప్రస్తుతం 44వ విడత ఫీవర్ సర్వే చేస్తున్నారు. ఇప్పటికే 55 శాతం గృహాలకు వెళ్లి ప్రజల ఆరోగ్యపై ఆరా తీశారు. కరోనా అనుమానిత లక్షణాలున్నవారిని గుర్తించి వారికి వైద్యపరీక్షలు చేయడంతో పాటు వైద్యసాయం అందిస్తున్నారు. రెండు వారాలకు ఒక విడత చొప్పున ఫీవర్ సర్వే చేపట్టాలని జిల్లాల అధికారులను ఆదేశించినట్టు ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ డైరెక్టర్ జె.నివాస్ తెలిపారు. ప్రస్తుతానికి రాష్ట్రంలో కరోనా కేసుల నమోదు చెప్పుకోదగ్గ స్థాయిలో లేదన్నారు. అనుమానిత లక్షణాలున్నవారిని పరీక్షించినా నెగిటివ్‌గా నిర్ధారణ అవుతోందని చెప్పారు. కేసుల నమోదు లేనప్పటికీ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ ధరించాలని విజ్ఞప్తి చేశారు. -
Sakshi Cartoon: జ్వరం వస్తే గోలి వేశా! జ్వరం డబులైంది డాక్టర్!
జ్వరం వస్తే గోలి వేశా! జ్వరం డబులైంది డాక్టర్! -
సీఎం కేసీఆర్‌ది జ్వరమా..! వ్యూహమా..?
-
11 జిల్లాల్లో రెండోవిడత జ్వర సర్వే షురూ
సాక్షి, హైదరాబాద్: రెండోవిడత ఇంటింటి జ్వర సర్వే 11 జిల్లాల్లో ఆదివారం ప్రారంభమైంది. జగిత్యాల, కామారెడ్డి, నాగర్‌కర్నూలు, నారాయణపేట, నిర్మల్, వనపర్తి, నిజామాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, మంచిర్యాల, ఆదిలాబాద్, సంగారెడ్డి జిల్లాల్లో సిబ్బంది ఇంటింటికీ తిరిగి వివరాలు సేకరిస్తున్నారని వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది. మిగిలిన జిల్లాల్లో మొదటి విడత సర్వే పూర్తికాగానే మొదలుపెడతారని పేర్కొంది. సర్వేలో భాగంగా కరోనా లక్షణాలున్నవారిని గుర్తించి కిట్లు అందజేస్తుండటంతో ఎక్కడికక్కడే వ్యాప్తిని కట్టడి చేయగలుగుతున్నారు. రోగుల పరిస్థితి తీవ్రం కాకుండా చర్యలు తీసుకుంటున్నారు. సెకండ్ వేవ్‌లో మూడు, నాలుగుసార్లు కూడా జ్వర సర్వే చేపట్టిన సంగతి తెలిసిందే. అప్పుడు ఏకంగా 8 లక్షల మందికి మెడికల్ కిట్లు అందజేశారు. ఇప్పుడు కూడా అవసరాన్ని బట్టి పలు విడతలుగా జ్వర సర్వే చేపడతామని అధికారులు తెలిపారు. ఈ నెల 21 నుంచి 29 వరకూ జరిగిన మొదటి విడత సర్వేలో రాష్ట్రంలో కేవలం 9 రోజుల వ్యవధిలోనే 4,00,283 మందిలో కరోనా లక్షణాలున్నట్లుగా గుర్తించారు. వీరిలో అందరికీ కరోనా అని నిర్ధారణ కాకపోయినా, 3,97,898 మందికి మెడికల్ కిట్లు అందజేశారు. -
జ్వర సర్వేపై కేంద్రం ప్రశంసలు
సాక్షి, హైదరాబాద్: కరోనా వ్యాప్తిని కట్టడి చేసేందుకు రాష్ట్రంలో ప్రారంభించిన జ్వర సర్వేను కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ మంత్రి మన్సుక్ మాండవీయ ప్రశంసించారు. తెలంగాణ అనుసరిస్తున్న పద్ధతిని మంచి వ్యూహంగా అభినందించారు. ఇదే విధానాన్ని అన్ని రాష్ట్రాల్లో అనుసరించేందుకు చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. వివిధ రాష్ట్రాల్లో కరోనా పరిస్థితులపై శుక్రవారం ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇందులో ఏపీ, కర్ణాటక, కేరళ, తమిళనాడు, లక్ష ద్వీప్, అండమాన్ నికోబార్, పుదుచ్చేరి రాష్ట్రాల వైద్య, ఆరోగ్యశాఖ మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. తెలంగాణ తరఫున రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు ఖమ్మం కలెక్టరేట్ నుంచి పాల్గొన్నారు. రాష్ట్రంలో కరోనా పరిస్థితులు, ప్రభుత్వ సన్నద్ధత, జ్వర సర్వే, వ్యాక్సినేషన్ తదితర అంశాలను హరీశ్‌రావు కేంద్ర మంత్రికి వివరించారు. రెండో వేవ్ సమయంలో కరోనా కట్టడి కోసం దేశంలోనే తొలిసారి తెలంగాణ జ్వర సర్వే మొదలు పెట్టి మంచి ఫలితాలు సాధించిందని హరీశ్‌రావు తెలిపారు. ఇప్పుడు మరోసారి జ్వర సర్వే ప్రారంభించినట్లు పేర్కొన్నారు. మొత్తం 21,150 బృందాలు జ్వర సర్వేలో పాలుపంచుకుంటున్నాయని చెప్పారు. వైద్య, ఆరోగ్య, పంచాయతీ లేదా మున్సిపల్ విభాగాల నుంచి ఒక్కో బృందంలో ముగ్గురు ఉంటారని, వీరంతా ప్రతి ఇంటికి వెళ్లి వారి ఆరోగ్యాన్ని పరీక్షిస్తారని తెలిపారు. కరోనా లక్షణాలు ఉన్నవారికి అక్కడే హోంఐసోలేషన్ కిట్స్ ఇస్తున్నామని, తదుపరి వారంపాటు వారి ఆరోగ్య పరిస్థితిని సిబ్బంది పర్యవేక్షిస్తారని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 77,33,427 ఇళ్లలో జ్వర సర్వే చేశామన్నారు. సర్వేతో ప్రభుత్వం వైద్యాన్ని ఇంటి వద్దకే చేర్చిందనీ, దీని వల్ల పాజిటివిటీ రేటు తగ్గి, ఆస్పత్రుల్లో చేరికలు తగ్గాయన్నారు. 60 ఏళ్లు దాటిన అందరికీ బూస్టర్ డోసు ఇవ్వాలి.. దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులతోపాటు 60 ఏళ్ల వయసు పైబడిన వారందరికీ బూస్టర్ డోసు ఇవ్వాలని మంత్రి హరీశ్‌రావు కేంద్రానికి మరోసారి విజ్ఞప్తి చేశారు. కోవిషీల్డ్ రెండు డోసుల మధ్య గడువును తగ్గించాలని, అలాగే 18 ఏళ్లు దాటిన ప్రతి పౌరుడికి బూస్టర్ ఇచ్చే విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. -
ఆసుపత్రులు..ఆధునీకరణ
సాక్షి, హైదరాబాద్: కొత్త ఆసుపత్రులు, కొత్త మెడికల్ కాలేజీల ఏర్పాటుతో పాటు ఉన్న ఆసుపత్రుల ఆధునీకరణ ప్రక్రియ కొనసాగిస్తున్నట్లు వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. ఇందులో భాగంగా లేబర్‌రూములు, డ్రైనేజీ, విద్యుత్ సరఫరా, ఇతర మరమ్మతులతో వీటిని ఆధునీకరించనున్నట్లు చెప్పారు. ముందుగా రాష్ట్రం లోని జిల్లా దవాఖానాలు, ఏరియా ఆసుపత్రులు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో మరమ్మతులు చేపట్ట నున్నట్లు చెప్పారు. రూ.10.84 కోట్ల వ్యయంతో 14 జిల్లాల పరిధిలోని 4జిల్లా దవాఖానాలు, 8 ఏరియా ఆసుపత్రులు, 3 కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో మరమ్మతులు చేపడతామని చెప్పారు. ఈ జాబితాలో నల్లగొండ, భద్రాద్రి కొత్తగూడెం, సంగా రెడ్డి, నిజామాబాద్, హైదరాబాద్, నిర్మల్, కరీం నగర్, మంచిర్యాల, నాగర్‌కర్నూల్, యాదాద్రి భువనగిరి, మెదక్, సిద్దిపేట జిల్లాలు ఉన్నాయి. కరోనా, జ్వర సర్వే, వ్యాక్సినేషన్ అంశాలపై వైద్యా రోగ్య అధికారులతో మంత్రి హరీశ్‌రావు సోమ వారం సమీక్ష నిర్వహించారు. సమావేశంలో వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శి రిజ్వీ, డీఎంఈ రమేష్‌రెడ్డి, ఆరోగ్య కుటుంబ సంక్షేమ కమిషనర్ వాకాటి కరుణ, కాళోజీ వర్సిటీ వీసీ కరుణాకర్‌రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కరోనా కట్టడి కోసం మొదలు పెట్టిన జ్వర సర్వే రాష్ట్రంలో విజయవంతంగా కొనసాగుతోందన్నారు. వ్యాక్సిన్ కార్యక్రమాన్ని వంద శాతం పూర్తి చేయాలని సూచించారు. కొత్తగా 20 బ్లడ్‌స్టోరేజీ సెంటర్లు.. రాష్ట్రంలో కొత్తగా 20 బ్లడ్‌స్టోరేజీ సెంటర్లు (రక్త నిల్వ కేంద్రాలు) ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఒక్కొక్కటి రూ. 12 లక్షల ఖర్చుతో 12 జిల్లాల పరిధిలోని పలు కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, ఏరియా ఆస్పత్రుల్లో వీటిని నెలకొల్ప నున్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 57 బ్లడ్ బ్యాంకులు ఉండగా, 51 బ్లడ్‌స్టోరేజీ సెంటర్లు ఉన్నాయని మంత్రి హరీశ్‌రావు తెలిపారు. -
ఏ తలుపు తట్టినా..జ్వరం..జలుబు!
సాక్షిప్రతినిధి, వరంగల్: రాష్ట్రంలో ఏ ఇంట్లో చూసినా.. ఎవరో ఒకరికి జ్వరం, దగ్గు, జలుబు, గొంతునొప్పి, ఒళ్లు నొప్పులు.. కొందరిలో అన్ని లక్షణాలూ ఉంటే.. మరికొందరు ఏదో ఓ లక్షణంతో కనిపిస్తున్నారు. కొందరు స్వల్పంగా ఇబ్బందిపడుతుంటే.. ఇంకొందరు తీవ్రంగా అవస్థ పడుతున్నారు. మొత్తంగా ఎక్కడ చూసినా.. కరోనా తరహా లక్షణాలతో బాధపడుతున్నారు. జ్వర సర్వేలో భాగంగా ఇంటింటికీ వెళ్తున్న వైద్య బృందాలకు ఇదే పరిస్థితి కనిపిస్తోంది. కరోనా థర్డ్ వేవ్ మొదలైన తర్వాత ఇప్పుడు బాధితుల సంఖ్య భారీ స్థాయిలో కనిపిస్తోందని వైద్య నిపుణులు చెప్తున్నారు. వేలాది బృందాలతో వేగంగా.. ‘ఇంటింటికి ఆరోగ్యం’ పేరిట రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఐదో విడత జ్వర సర్వే మూడు రోజులుగా సాగుతోంది. 25 వేల మంది ఏఎన్ఎంలు, 7వేల మందికిపైగా ఆశా కార్యకర్తలు, వైద్యారోగ్యశాఖ అధికారులు, సిబ్బంది, అంగన్వాడీ కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు ఈ సర్వేలో పాల్గొంటున్నారు. ఒక్కో బృందం రోజుకు 50 ఇళ్ల చొప్పున సర్వే చేస్తూ ప్రజల ఆరోగ్యాన్ని పరిశీలిస్తోంది. కోవిడ్ లక్షణాలున్న వారికి అక్కడికక్కడే కిట్లు అందజేసి హోం ఐసోలేషన్‌లో ఉండాల్సిందిగా సూచిస్తోంది. వైద్యారోగ్యశాఖ లెక్కల ప్రకారం.. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 42.30 లక్షల ఇళ్లకు సర్వే బృందాలు వెళ్లాయి. జ్వరం, జలుబు, గొంతునొప్పి ఇతర లక్షణాలు ఉన్న 1,78,079 మందిగా గుర్తించి.. హోం ఐసోలేషన్ కిట్లు అందజేశాయి. ఆదివారం ఒక్కరోజే 13.04 లక్షల ఇళ్లలో సర్వే చేయగా.. 50,833 మందిలో లక్షణాలను గుర్తించి, కిట్లు అందజేశారు. అయితే సర్వే సందర్భంగా కొందరు పరీక్షలకు అంగీకరించడం లేదని వైద్యారోగ్యశాఖ సిబ్బంది చెప్తున్నారు. ఈ పరిస్థితి ఎక్కువగా ఆసిఫాబాద్, ములుగు, భూపాలపల్లి, కొత్తగూడెం వంటి జిల్లాల్లో కనిపిస్తోందని అంటున్నారు. జిల్లాల వారీగా ఇదీ పరిస్థితి... – ఉమ్మడి వరంగల్‌లో 1,03,021 ఇళ్లలో సర్వే నిర్వహించారు. హనుమకొండ జిల్లాలో 22,375 ఇళ్లను పరిశీలిస్తే.. 3,356 మందికి వ్యాధి లక్షణాలు ఉన్నట్టు గుర్తించారు. భీమదేవరపల్లి మండల కేంద్రంలో 250 మందిని పరీక్షిస్తే.. 60 మందికి జలుబు, జ్వరం ఉన్నట్లు వెల్లడైంది. జనగామ జిల్లాలో 98,292 గృహాల్లో సుమారు 5 వేల మందికి.. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 17,759 ఇళ్లలో 1,892 మందికి లక్షణాలున్నట్టు గుర్తించారు. – నల్లగొండ జిల్లాలో 1,30,558 ఇళ్లలో సర్వే చేసి 4,519 మందికి కిట్లను అందజేశారు. – ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో 5,41,763 ఇళ్లలో సర్వే పూర్తికాగా.. జ్వరం, జలుబు తదితర లక్షణాలతో 14,875 మంది బాధపడుతున్నట్టు గుర్తించారు. – ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో 9,603 మందికి, నిజామాబాద్ జిల్లాలో 4,164 మందికి కిట్లను అందజేశారు. – ఖమ్మం జిల్లాలో 1,33,150 ఇళ్లలో సర్వే చేసి, 4,604 మంది బాధితులను గుర్తించారు. – సంగారెడ్డి జిల్లాలో 7,465 మందికి, మెదక్ జిల్లాలో 4,999 మందికి, సిద్ధిపేట జిల్లాలో 2,956 మందిని ఐసోలేషన్ కిట్లు అందజేశారు. మూడు రోజుల నుంచి జ్వరం, జలుబు ‘‘మూడు రోజుల కింద ఆరోగ్య సిబ్బంది మా ఇంటికి వచ్చి సర్వే చేశారు. అప్పటికే నాకు జలుబు, జ్వరంతో అవస్థ పడుతున్న. వికలాంగుల కుటుంబమైన మేం పట్టణ ప్రాంతాలకు చికిత్సకోసం పోలేని పరిస్థితి. ఆరోగ్య సిబ్బంది ఇచ్చిన మందులు వేసుకుంటున్నాం.’’ – సుడిగల రాధ, కడవెండి, దేవరుప్పుల మండలం, జనగామ జిల్లా రెండు డోసులు వేసుకున్నా జ్వరమొచ్చింది ‘‘కరోనా టీకాలు రెండు డోసులు వేసుకున్నాం. అయినా ఈ మాయదారి రోగం ఏంటో అర్థంకాకుండా ఉంది. ఎక్కడికీ పోవడం లేదు. ఇంటి పట్టునే ఉండాల్సి వస్తోంది. ఇప్పుడు మళ్లాజ్వరమొచ్చింది. ఆరోగ్య సిబ్బంది మందులిచ్చారు.’’ – తుమ్మ బుచ్చమ్మ, చిన్నబోయినపల్లి, ములుగు జిల్లా కొందరు లక్షణాలున్నా చెప్పట్లేదు ‘‘కరోనా నియంత్రణకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా జ్వర సర్వే చేపట్టింది. ఇంటింటికి వచ్చే వైద్య బృందాలకు అందరూ సహకరించాలి. కొందరు జ్వరం, జలుబు, దగ్గు వంటి లక్షణాలు ఉన్నా చెప్పడం లేదు. బయటికి వెళ్లి తిరుగుతున్నారు. ఇది సరికాదు. లక్షణాలు ఉన్నా, పాజిటివ్ వచ్చినా.. దగ్గరలోని ప్రభుత్వ ఆస్పత్రి వైద్య సిబ్బందిని సంప్రదించి.. వారు చెప్పే జాగ్రత్తలు, సూచనలు పాటించాలి. ఇంటింటి జ్వర సర్వే వేగంగా జరుగుతోంది. లక్షణాలున్న వారికి ఐసోలేషన్ కిట్లు అందజేస్తున్నాం.’’ – డాక్టర్ సుదర్శనం, డీఎంహెచ్‌వో, నిజామాబాద్ -
ఫీవర్ సర్వే...లక్షణాలున్నవారు లక్షమంది పైనే..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రారంభమైన ఇంటింటి ఫీవర్ సర్వే శనివారానికి రెండో రోజుకు చేరుకుంది. వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావుసహా అనేక చోట్ల ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఒమిక్రాన్ తీవ్రత నేపథ్యంలో మాస్క్‌లు ధరించాలని, వ్యాక్సిన్ వేసుకోవాలని ప్రజలకు సూచిస్తున్నారు. రెండ్రోజుల్లో 29.26 లక్షల ఇళ్లకు వెళ్లి ఫీవర్ సర్వే చేపట్టినట్లు వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఈ సందర్భంగా గ్రామాలు, పట్టణాల్లో 1.28 లక్షల మందిలో జ్వర లక్షణాలను గుర్తించారు. వారిలో 1.27 లక్షల మందికి హోం ఐసోలేషన్ మెడికల్ కిట్లు అందజేసినట్లు అధికారులు తెలిపారు. వారం రోజుల్లోగా మొదటి విడత ఫీవర్ సర్వే పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిసింది. అవసరమైతే రెండో విడత సర్వే జరిపే అవకాశముంది. కరోనా తీవ్ర లక్షణాలున్న వారికి తక్షణమే టెస్టులు చేసి, అవసరమైతే ఆసుపత్రులకు పంపిస్తున్నారు. కాగా, కోటి హోంఐసోలేషన్ కిట్లను సిద్ధం చేయాలని ప్రభుత్వం ఆదేశించిన నేపథ్యంలో ఇప్పటివరకు 50 లక్షల కిట్లు సిద్ధం చేసినట్లు టీఎస్ఎంఎస్ఐడీసీ ఎండీ చంద్రశేఖర్‌రెడ్డి తెలిపారు. ఫీవర్ సర్వేలో ఎవరికైనా లక్షణాలు కనిపిస్తేæ మందులు ఇవ్వడం వల్ల కరోనా వైరస్ వ్యాప్తిని నియంత్రించవచ్చని వైద్య విద్యా సంచాలకుడు (డీఎంఈ) రమేశ్‌రెడ్డి తెలిపారు. -
భయం అయితంది సర్.. పోశవ్వా..ఫికర్ చేయొద్దు..
మంత్రి హరీశ్: పోశవ్వా.. ఎన్ని టీకాలు వేసుకున్నావ్? పోశవ్వ: ఒక్కటే ఏసుకున్న.. సర్.. మంత్రి: ఇంకా రెండు ఏసుకోవాలి ఎందుకు ఏసుకోలే.. పోశవ్వ: భయం అయితంది సర్.. మంత్రి: ఎందుకు భయం, నేనున్న ఏసుకో.. పోశవ్వ: నువ్వు ఉన్నవని ధైర్యం వచ్చింది.. ఏసుకుంటా సర్.. అని నవ్వుతూ చెప్పింది. సాక్షి, సిద్దిపేట: ‘వైద్య సిబ్బంది, వైద్యులే కాదు.. వైద్య అధికారులు కూడా కాదు.. నేరుగా వైద్య, ఆరోగ్యశాఖ మంత్రే ఫీవర్ సర్వేకు వచ్చారు. అందరితో ఆత్మీయంగా ముచ్చటించారు. కరోనా కారణంగా ఆందోళనలో ఉన్న ప్రజల్లో ఆత్మవిశ్వాసం నింపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజారోగ్యానికి పెద్దపీట వేస్తోందనే విషయాన్ని ప్రత్యక్షంగా చాటిచెప్పారు. శనివారం సిద్దిపేట మున్సిపాలిటీ 37వ వార్డులోని అంబేడ్కర్‌నగర్‌లో ఇంటింటా ఫీవర్ సర్వే జరుగుతున్న తీరును పరిశీలించారు. 27 వేల ఆక్సిజన్ బెడ్లు సిద్ధం మంత్రి హరీశ్‌రావు ఇలా ఇంటింటికీ తిరుగుతూ అందరినీ పలకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫీవర్ సర్వేలో భాగంగా మొదటిరోజు రాష్ట్రవ్యాప్తంగా 12.68 లక్షలమంది ఇళ్లకు మున్సిపాలిటీ, పంచాయతీరాజ్ సిబ్బంది వెళ్లి 48 హోం ఐసోలేషన్ కిట్లు అందించారన్నారు. జ్వరపీడితుల ఆరోగ్య పరిస్థితిని ఆరోగ్య కార్యకర్తలు నిత్యం పరిశీలిస్తారని, అవసరమైతే దవాఖానాకు తరలించి వైద్యసేవలు అందిస్తారని చెప్పారు. 5 నుంచి 8 వారాలు ఈ ఫీవర్ సర్వే చేయిస్తామని, కరోనా పరీక్షల కోసం క్యూలైన్ పెద్దగా ఉన్నచోట మరిన్ని సెంటర్లు పెంచుతామని వెల్లడించారు. తెలంగాణలో ఫీవర్ సర్వే ఆదర్శంగా ఉందని కేంద్రం, నీతి ఆయోగ్ కితాబిచ్చిందని పేర్కొన్నారు. రోజూ కరోనా పరిస్థితిని అంచనా వేసి కట్టడి చేసేందుకు ఎప్పటికప్పుడు సర్వేలపై జిల్లా కలెక్టర్లు సమీక్ష జరుపుతున్నారని తెలిపారు. రాష్ట్రంలో 27 వేల ఆక్సిజన్ బెడ్లు సిద్ధంగా ఉన్నాయన్నారు. కాగా, శనివారం సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రి హరీశ్ మాట్లాడుతూ దళితబంధు పథకాన్ని దేశమంతా అమలు చేయాలని, అందుకోసం వచ్చే బడ్జెట్లో రూ.2 లక్షల కోట్లను పెట్టించాలని తెలంగాణ బీజేపీ నేతలను డిమాండ్ చేశారు. మంత్రి: అంజమ్మా.. మాస్క్ పెట్టుకోలే, ఇగో, మాస్క్ పెట్టుకో.. అంజమ్మ: హరీశన్న వస్తుండంటే ఆగమాగంగా బయటకు వచ్చిన సర్. నువ్ ఉన్నాక మాకు అన్ని మంచిగనే ఉంటాయి సర్.. -
చిన్నారుల ఆరోగ్యంపై ఫీవర్ సర్వేలో ఆరా..బాగుంటేనే బడి..
సాక్షి, హైదరాబాద్: విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిపై ఓ అంచనాకు వచ్చిన తర్వాతే విద్యా సంస్థల రీ ఓపెనింగ్‌పై స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా శుక్రవారం నుంచి ప్రారంభించిన ‘ఇంటింటి జ్వర సర్వే’ని ప్రామాణికంగా తీసుకోవాలని భావిస్తోంది. సర్వేలో భాగంగా ప్రభుత్వ సిబ్బం ది రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఇంటికీ వెళ్లి ప్రజల ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీయనున్న సంగతి తెలిసిందే. కాగా ఈ సర్వేకి సంబంధించి 4,5 రోజుల డేటా ఆధారంగా..విద్యార్థుల లెక్కను విడిగా తీయాలని అధికారులకు ప్రభుత్వం ఆదే శించినట్టు తెలిసింది. సర్వేకి వచ్చిన కార్యకర్తలు కూడా చిన్నారుల ఆరోగ్య పరిస్థితిపై స్పష్టమైన ఫీడ్‌బ్యాక్ తీసుకోవడం విశేషం. సంక్రాంతిని పుర స్కరించుకుని 4 రోజులు ముందుగానే ఈ నెల 8 నుంచి అన్ని రకాల విద్యా సంస్థలకు ప్రభుత్వం సెలవులు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత కరోనా పరిస్థితుల్లో సెలవులు పొడిగిం చింది. అన్నీ బాగుంటే ఈ నెల 31 నుంచి విద్యా సంస్థలను పునఃప్రారంభించాలని ప్రభుత్వం తొలుత భావించింది. అయితే కోవిడ్ కేసులు రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో పునరా లోచనలో పడింది. స్కూళ్ళు తెరిచినా చిన్నారు లను పంపేందుకు తల్లిదండ్రులు ఇష్టపడతారా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేప థ్యంలోనే ఇంటింటి సర్వే ఆధారంగా నిర్ణయం తీసుకోవాలనే యోచనలో ప్రభుత్వం ఉంది. సర్వేలో తేలే అంశాలే కీలకం ప్రధానంగా 15 ఏళ్ళలోపు విద్యార్థుల ఆరోగ్య డేటాను పరిశీలించే ఆలోచనలో అధికారులు న్నారు. రాష్ట్రంలో 26,067 ప్రభుత్వ స్కూళ్లున్నా యి. మరో 12 వేల ప్రైవేటు స్కూళ్ళున్నాయి. వీటిల్లో 1–10 తరగతుల విద్యార్థులు 69 లక్షల మంది వరకు ఉంటారు. వీరి ఆరోగ్య పరిస్థితిపై ప్రభుత్వ సర్వేలో వెల్లడయ్యే అంశాలనే కీలకంగా తీసుకోవాలని నిర్ణయించారు. రాష్ట్రంలో ఎంత మందికి అనారోగ్య పరిస్థితులున్నాయి? ఎంత మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది? వారిలో తీవ్రత ఎంత? క్వారంటైన్లో ఉంటు న్నారా? ఇలాంటి వివరాలను సర్వేలో అడిగి తెలుసుకుంటున్నారు. ఈ మేరకు అందిన సమాచారం ఆధారంగా చిన్నారుల ఆరోగ్య పరిస్థితి, కరోనా తీవ్రతపై ఓ అంచనాకు వచ్చే వీలుందని అధికారవర్గాలు తెలిపాయి. 30 శాతం మందిలో అనారోగ్య లక్షణాలు (జలుబు, దగ్గు, జ్వరం) ఉంటే.. వారు స్కూళ్ళకు వెళ్తే వారి వల్ల మరో 20 శాతం మందికి వ్యాప్తి జరిగే వీలుందని అంచనా వేస్తున్నారు. అదే సమయంలో వ్యాధి లక్షణాల తీవ్రత కూడా గమనించాల్సి ఉంటుందని అధికారులు అంటున్నారు. గతంలో మాదిరి కరోనా ఈసారి పెద్దగా ప్రభావం చూపడం లేదనే వాదనల నేపథ్యంలో వైద్య ఆరోగ్య శాఖ సలహాలు తీసుకునే వీలుందని అధికారులు అంటున్నారు. తల్లిదండ్రులు పంపుతారా? సెకెండ్ వేవ్ తర్వాత సెప్టెంబర్‌లో ప్రత్యక్ష బోధన చేపట్టారు. అయితే దాదాపు రెండు వారాల పాటు 22 శాతానికి మించి విద్యార్థుల హాజరు కన్పించలేదు. ప్రైవేటు స్కూళ్ళల్లో ఆన్లైన్ విధానం అందుబాటులో ఉండటంతో ఈ శాతం ఇంకా తక్కువే నమోదయ్యింది. దీన్ని పరిగణనలోకి తీసుకుంటే ఈ నెల 31 నుంచి స్కూళ్ళు తెరిచినా, కరోనా ఉధృతి ఇదేవిధంగా సాగితే తల్లిదండ్రులు పిల్లల్ని పాఠశాలలకు పంపుతారా? అనే సంశయం వెంటాడుతోంది. అన్ని కోణాల్లోనూ వివరాలు సేకరిస్తున్నామని, ఇవన్నీ ప్రభుత్వానికి నివేదిస్తామని ఓ ఉన్నతాధికారి తెలిపారు. శానిటైజేషన్ కూడా సమస్యే కరోనా థర్డ్‌వేవ్ విజృంభించే సమయంలో అతి కీలకమైన అంశం శానిటైజేషన్. సెకెండ్ వేవ్‌లో దీని అమలు విద్యాశాఖకు తలనొప్పి తెచ్చిపెట్టింది. శానిటైజేషన్ బాధ్యతను పాఠశాల హెచ్ఎంలకు అప్పగించారు. స్కూళ్ళకు ప్రత్యేకంగా సిబ్బంది లేకపోవడంతో పంచాయతీల పరిధిలోని పారిశుధ్య సిబ్బందినే వాడుకోవాల్సి వచ్చింది. అయితే చాలాచోట్ల పంచాయతీ సిబ్బంది ఇందుకు నిరాకరించారు. ఇప్పుడు కూడా ఇదే పరిస్థితి తలెత్తే వీలుందని, స్కూలు ఆవరణ, తరగతి గదులు, మరుగుదొడ్ల శానిటైజేషన్ సమస్యగా మారవచ్చని విద్యాశాఖలో ఆందోళన వ్యక్తమవుతోంది. శానిటైజేషన్ ప్రక్రియకు అదనపు నిధులు మంజూరు చేయాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరాలని భావిస్తోంది. -
తెలంగాణలో మళ్లీ జ్వర సర్వే..ఇంటింటికీ వెళ్లనున్న ఆరోగ్య సిబ్బంది
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా నియంత్రణ, క్షేత్రస్థాయిలో ప్రజల ఆరోగ్యం, పరిస్థితులను పరిశీ లించి తగిన చర్యలు చేపట్టడం లక్ష్యంగా మరోసారి ఇంటింటి జ్వర సర్వే చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. శుక్రవారం నుంచే రాష్ట్రవ్యాప్తంగా ప్రతి పట్టణం, గ్రామంలోని ప్రతి ఇంటికి ఆరోగ్య సిబ్బంది వెళ్లి జ్వర సర్వే చేయనున్నారు. దీనికి సంబంధించి మంత్రి హరీశ్‌రావు, ఎర్రబెల్లి దయా కర్రావు గురువారం కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అనంతరం హరీశ్‌రావు మీడి యాతో మాట్లాడారు. శుక్రవారం నుంచి వైద్య, మున్సిపల్, పంచాయతీరాజ్ శాఖల సమన్వ యంతో వైద్య సిబ్బంది ఇంటింటికీ వెళ్లి జ్వర సర్వే చేస్తారని.. జ్వరం, కరోనా లక్షణాలున్న వారికి అక్కడికక్కడే హోం ఐసోలేషన్ కిట్లు ఇస్తారని తెలి పారు. బాధితుల ఆరోగ్య పరిస్థితిపై ఎప్పటి కప్పుడు పర్యవేక్షణ చేస్తామని.. అవసరమైన మందులు అందుబాటులో ఉంచుతామని వెల్లడిం చారు. కరోనా రెండో వేవ్ సమయంలో రాష్ట్రంలో చేపట్టిన ఇంటింటి సర్వే, హోం ఐసోలేషన్ కిట్లు దేశానికి ఆదర్శంగా నిలిచాయని చెప్పారు. నీతి ఆయోగ్, ఎకనామిక్ సర్వే రిపోర్టు కూడా ఇంటింటి సర్వేను ప్రశంసించాయని గుర్తు చేశారు. అన్ని ఆస్పత్రుల్లో ఏర్పాట్లు రాష్ట్రంలో రెండు కోట్ల టెస్టింగ్ కిట్లు, కోటి హోం ఐసోలేషన్ కిట్లు సిద్ధం చేశామని హరీశ్‌రావు తెలి పారు. కిట్లు లేవన్న భావన రాకుండా గ్రామ స్థాయిలో పంపిణీ చేశామని, వార్డు స్థాయిలోనూ ఉంటాయని చెప్పారు. పట్టణాలు, గ్రామాల్లో కార్య దర్శులు, ఇతర అధికారుల సాయంతో సర్వే నిర్వ హిస్తామన్నారు. కరోనా చికిత్సలకు సంబంధించి అన్ని జిల్లా ఆస్పత్రుల్లో ఏర్పాట్లు చేశామని, మందులు సిద్ధంగా ఉంచామని తెలిపారు. చిన్న పిల్లల కోసం అన్ని జిల్లా ఆస్పత్రుల్లో ప్రత్యేక వార్డు లు, వెంటిలేటర్లు, మందులు అందుబాటులోకి తెచ్చామని చెప్పారు. అవసరమైన వారందరికీ చికిత్సలు చేస్తామన్నారు. ఆక్సిజన్ అందుబాటులో ఉంచాం రాష్ట్రంలో ప్రభుత్వ ఆస్పతుల్లో ఉన్న 27 వేల పడక లకు ఆక్సిజన్ సౌకర్యం సమకూర్చామని వివరిం చారు. 76 ఆస్పత్రుల్లో ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్లను నిర్మించామని.. దీనివల్ల ఆక్సిజన్ సామర్థ్యం 340 టన్నులకు పెరిగిందని చెప్పారు. 500 టన్నుల వరకు కూడా ఆక్సిజన్ అందుబాటులో ఉండాలని సీఎం ఆదేశించారని.. రాబోయే రోజుల్లో ఆ మేరకు ఏర్పాట్లు చేస్తామని చెప్పారు. రాష్ట్రంలో ప్రస్తుత మున్న 56వేల కోవిడ్ పడకల్లో ఒక్క శాతమే ఆక్యు పెన్సీ ఉందన్నారు. కొద్దిపాటి జ్వరం, దగ్గు, ఆయా సం ఉంటే సబ్‌సెంటర్ లేదా ఇతర దవాఖానాలకు వెళ్లాలని సూచించారు. హోం ఐసోలేషన్ కిట్లు వాడితే 99 శాతం కరోనా తగ్గుతుందన్నారు. ఎవరికైనా తీవ్రమైతే వెంటనే దగ్గరలోని ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లాలని ఏఎన్ఎంలకు సూచించామని మంత్రి వివరించారు. వెంటిలేటర్లను జిల్లా, ఏరియా ఆస్పత్రుల స్థాయిలోనూ సిద్ధం చేశామని తెలిపారు. జ్వర సర్వేలో ప్రజాప్రతినిధులు: ఎమ్మెల్యేలు, సర్పంచులు, ఇతర ప్రజాప్రతినిధులు అంతా కూడా ఫీవర్ సర్వేలో పాల్గొనాలని హరీశ్‌రావు సూచించారు. కరోనా నేపథ్యంలో.. మేడారం జాతర విషయంగా ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న దానిపై ముఖ్యమంత్రి తగిన నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. బూస్టర్ డోస్‌కు 9 నెలల కాలపరిమితి వల్ల సమస్య వస్తోందని.. బూస్టర్ డోస్ అందరికీ ఇవ్వాలంటూ కేంద్రానికి లేఖ రాశామని వెల్లడించారు. టెస్టులకు అధిక రేట్లు వసూలు చేయొద్దు ప్రభుత్వ ఆస్పత్రులు, సబ్ సెంటర్లు, బస్తీ దవాఖా నాలు అన్నిచోట్లా కరోనా పరీక్షలు అందుబాటులో ఉన్నందున ప్రజలు ప్రైవేట్‌కు వెళ్లొద్దని హరీశ్‌రావు సూచించారు. ప్రైవేట్‌లో ఎక్కువ ధరకు టెస్టులు చేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వ్యాక్సిన్ విషయంగా పెద్ద రాష్ట్రాల్లో మనం బెస్ట్ వ్యాక్సినేషన్ విషయంలో పెద్ద రాష్ట్రాల్లో మనం ముందున్నామని హరీశ్‌రావు చెప్పా రు. ఫస్ట్ డోస్ నూటికి నూరు శాతం, సెకండ్ డోస్ 77% పూర్తి చేశామన్నారు. డోసుల మధ్య కాల పరిమితి ఎక్కువగా ఉండటం వల్ల రెండో డోసు త్వరగా పూర్తికావడం లేద న్నారు. తక్కువ వ్యాక్సినేషన్ ఉన్న జిల్లాల్లో ప్రత్యేక పర్యవేక్షణ చేయమన్నామని తెలిపా రు. అన్ని జిల్లాల్లో మంత్రులను వ్యాక్సినే షన్‌పై రివ్యూ చేయమన్నామని.. 10–12 జిల్లాల్లో ఇప్పటికే చేశారని వివరించారు. కరోనా తీవ్రత దృష్ట్యా ప్రతి ఆదివారం కూడా మధ్యాహ్నం 2 గంటల వరకు కూడా బస్తీ దవాఖానాలు తెరిచి ఉంచాలని ఆదేశించామ న్నారు. ఎంతమంది వస్తే అందరికీ టెస్టులు చేయాలని సూచించినట్టు స్పష్టం చేశారు. -
తలనొప్పి, గొంతులో గరగరా? అయితే వెంటనే..
సాక్షి, హైదరాబాద్: ఒక్కసారిగా తలనొప్పా?.. లేక గొంతులో గరగరా?.. లక్షణం ఏదైతేనేం వెంటనే కోవిడ్ పరీక్ష చేయించండి. ప్రస్తుతం ఒమిక్రాన్ వేరియెంట్ వ్యాప్తి అత్యంత వేగంగా జరుగుతోంది. ఈ వేరియంట్‌తో చాలా మందిలో లక్షణాలు కనిపించడం లేదు. అదలా ఉంచితే.. లక్షణాలు ఉన్న వారు వెంటనే పరీక్ష చేయించి జాగ్రత్తలు పాటించాలని ఐసీఎంఆర్ సూచిస్తోంది. ప్రస్తుతం మూడో దశ కోవిడ్ వ్యాప్తి కొనసాగుతోంది. ఒమిక్రాన్ సోకితే ఒకట్రెండు రోజుల్లోనే ఒక్కసారిగా తలనొప్పి రావడం, గొంతులో గరగర అనిపించడం, తీవ్ర ఒళ్లు నొప్పులు, ముక్కు కారడం లాంటి లక్షణాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. పైలక్షణాలతో పాటు జ్వరం వచ్చిన వారిలో ఎక్కువ మంది పాజిటివ్‌గా తేలడం గమనార్హం. పాజిటివ్‌గా తేలితే జాగ్రత్తలివే.... ప్రస్తుతం కోవిడ్ సోకినట్లు పరీక్షలో నిర్ధారిస్తే వెం టనే ఐసోలేషన్‌కు వెళ్లిపోవాలి. ప్రత్యేక గదిలో వారం రోజుల పాటు ఉండాలి. బాధితుడికి ఉన్న లక్షణాల ఆధారంగా వైద్యులు సూచించిన మేర మందులు వేసుకోవాలి. మూడు పూటలా పోషక విలువలున్న ఆహారాన్ని తీసుకోవాలి. కోవిడ్ సోకిన వ్యక్తితో పాటు సేవలందించే కుటుంబ సభ్యులు కూడా ఎన్–95 మాస్కు ధరించాలి. ప్రస్తుత సీజన్ లో వైరస్ వ్యాప్తి చెందిన వ్యక్తిలో సగటున ఒక రోజు నుంచి మూడు రోజుల్లో లక్షణాలు బయటపడుతున్నాయి. ఒళ్లు నొప్పులు, ముక్కు కారడం, గొం తులో గరగర లాంటి లక్షణాలు 2,3 రోజులు ఉం టుండగా... జ్వరం, తలనొప్పి లక్షణాలు మాత్రం ఒక రోజులోనే తగ్గుముఖం పడుతున్నాయి. ♦లక్షణాలు లేని వారికి కోవిడ్ నిర్ధారణ పరీక్షలు అవసరం లేదని ఐసీఎంఆర్ చెబుతోంది. ♦ఇక కోవిడ్ వ్యాప్తి చెందిన వ్యక్తితో కాంటాక్ట్ అయిన 60 ఏళ్లు పైబడిన వాళ్లు, దీర్ఘకాలిక వ్యాధులున్న వాళ్లు తప్పక నిర్ధారణ పరీక్ష చేయించాలి. ♦డెల్టా వేరియంట్ వ్యాప్తి చెందిన సమయంలో వైరస్ సోకిన వ్యక్తికి నాలుగు నుంచి ఐదు రోజుల్లో లక్షణాలు బహిర్గతం కాగా... ఇప్పుడు ఒకరోజు నుంచి మూడు రోజుల్లో బయటపడుతున్నాయి. రెండోసారి పరీక్ష అవసరం లేదు.. కోవిడ్ వచ్చిన తర్వాత ఐసోలేషన్‌లో 7 రోజులు ఉండాలి. ఎనిమిదో రోజు ఎలాంటి నిర్ధారణ పరీక్షలు లేకుండా సాధారణ స్థితికి వచ్చి రోజువారీ కార్యక్రమాల్లో పాల్గొనవచ్చు. వీలైనంత వరకు ప్రతి ఒక్కరూ ఎన్–95 మాస్కులు ముక్కు, నోరు కవర్ అయ్యేలా ధరించడం మంచిది. అలాగే అర్హులైన ప్రతి ఒక్కరూ టీకా తీసుకోవాలి. గుమిగూడే ప్రదేశాల నుంచి దూరంగా ఉంటూ క్రమం తప్పకుండా చేతులు కడుక్కోవడం, శానిటైజర్లు వాడటంతో వైరస్ వ్యాప్తిని అడ్డుకోవచ్చు. – డాక్టర్ కిరణ్ మాదల, క్రిటికల్ కేర్ విభాగాధిపతి, నిజామాబాద్ ప్రభుత్వ వైద్య కళాశాల -
జ్వరం, జలుబు, దగ్గుతో ఉక్కిరిబిక్కిరి.. కరోనా కావచ్చేమోనని?
సాక్షి, హైదరాబాద్: ఎల్లారెడ్డిగూడకు చెందిన సతీష్‌కు 10 రోజులుగా జలుబు, దగ్గు. రాత్రిళ్లు శ్వాస పీల్చుకోవడం కష్టంగా మారింది. ఇంటి వైద్యాలు, అలవాటైన మందులు వాడుతున్నా తగ్గినట్టే తగ్గుతూ పెరుగుతూ ఉంది. జలుబూ దగ్గు వదలకపోవడం ఒళ్లునొప్పులు, తేలికపాటి జ్వరం.. ఇవన్నీ చూసి కరోనా పరీక్షలు చేయించుకోమంటూ సన్నిహితులు పోరు చేస్తున్నారు.. ప్రస్తుతం నగరంలో అనేక మందికి సతీష్ లాంటి పరిస్థితి ఎదురవుతోంది. తమకు వచ్చింది సాధారణ సీజనల్ సమస్యా? కరోనా? అనే సందేహాలతో సతమతమవుతున్నవారు. ఇలాంటివారు నగరంలో రోజురోజుకూ పెరుగుతున్నారు. కష్టాలు పెంచిన వర్షాలు... గత కొన్ని రోజులుగా నగరంలో చలి తీవ్రతను మించి వర్షాలు, చలిగాలుల తాకిడి ఎక్కువైంది. ఇది సహజంగానే సిటిజనుల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఓ వైపు వింటర్ సీజన్. మరోవైపు అకాల వర్షాలు.. దీంతో సీజనల్‌గా వచ్చే జలుబు, జ్వరం, ఒళ్లునొప్పులు, దగ్గు, గొంతు ఇన్ఫెక్షన్.. వంటివి మరింతగా పెరిగాయి. మరోవైపు కరోనా సైతం విజృంభిస్తుండడం దీని లక్షణాలు కూడా దాదాపుగా అవే కావడంతో ఏది సాధారణ వ్యాధో, ఏది మహమ్మారో తెలియక నగరవాసులు అయోమయానికి, భయాందోళనకు గురవుతున్నారు. పరీక్షకు వెళ్లాలంటే ఓ రకమైన భయం, వెళ్లకపోతే మరో రకమైన భయం వారిని వెంటాడుతోంది. ఈ నేపథ్యంలో కంగారు పడవద్దని కాస్త అప్రమత్తంగా ఉంటే చాలని వైద్యులు చెబుతున్నారు. చదవండి: ‘ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు మాస్కులు ధరించడం లేదు’ సాధారణమైతే సందేహం వద్దు.. జలుబు, దగ్గు కొందరికి సీజనల్‌గా దాదాపు ప్రతి యేటా వస్తుంటాయి. అలాంటివారికి ఈ అకాల వర్షాల వాతావరణంలో మరింత సులభంగా వస్తాయి. అంతేకాకుండా అస్తమా, డయాబెటిస్ వంటి వ్యాధులున్నా, బైపాస్ సర్జరీ చేయించుకున్నా, స్టంట్ వేయించుకున్న వారిలో సహజంగానే ఇమ్యూనిటీ తక్కువగా ఉండి శ్వాసకోస వ్యాధులు, సీజనల్ ఫ్లూ రావచ్చు. ► ఇలాంటి వారు చల్లటి వస్తువులు తీసుకోవడం, చల్లటి ప్రదేశాల్లో ఉండడం, వర్షంలో తడవాల్సి రావడం వల్ల ఈ సమస్యలు రెట్టింపవుతాయి. వెంటనే ఇది కరోనా కావచ్చని ఆందోళన చెందనక్కర్లేదు. అలాగే ఎక్కువగా బయటకు వెళ్లాల్సిన, సమూహాల్లో పనిచేయాల్సిన అవసరం లేనివాళ్లు కూడా బెంబేలెత్తనవసరం లేదు. అలాగని మరీ నిర్లక్ష్యం చేయకూడదనీ వైద్యులు చెబుతున్నారు. చదవండి: దేశీయ వ్యాక్సిన్‌తో ఒమిక్రాన్‌కి చెక్! 3 రోజులు దాటితే... తగినంత ఇమ్యూనిటీ ఉండి, సీజనల్ వ్యాధులకు గురయ్యే మెడికల్ హిస్టరీ లేనివాళ్లు, జ్వరం, ఒళ్లునొప్పులు తదితర సమస్యలు 3 రోజులు దాటి ఉంటే వెంటనే కరోనా పరీక్ష చేయించుకోవడం మంచిది. ఒకవేళ కరోనా అని తేలినా ఆందోళన చెందనవసరం లేదు. తగిన జాగ్రత్తలు తీసుకుంటూ మందులు వాడితే 2 వారాల వ్యవధిలోనే పూర్తిగా కోలుకునే అవకాశం ఉంది. ఏదేమైనా భయాందోళనలకు గురికాకపోవడం అన్నిరకాలుగా మంచిది. ఏ సమస్య వచ్చినా నిర్లక్ష్యం చేయకుండా ప్రారంభం నుంచే వైద్యుల సలహా మేరకు నడచుకోవడం ఇప్పటి పరిస్థితుల్లో అవసరం. పాజిటివ్ పెరుగుతున్నా... తీవ్రత లేదు సీజనల్ వ్యాధులన్నీ కరోనా కావచ్చనే భయం సహజమే అయినా అన్నీ అవుతాయనుకోలేం. ఫ్లూ లక్షణాలు 3 రోజులు పైబడి ఉన్నవారికి కరోనా పరీక్షలు తప్పనిసరిగా సిఫారసు చేస్తున్నాం. అలా సిఫారసు చేస్తున్నవారిలో ప్రస్తుతం గత 10 రోజులుగా చూస్తే కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిన వారే ఎక్కువ. గతంలో ఉన్నంత తీవ్రమైన ఆరోగ్య సమస్యలు లేకపోవడం మాత్రం ఊరట కలిగించే అంశం. – డా.జి.నవోదయ, కేర్ ఆస్పత్రి -
నోట్లో థర్మామీటర్‌తో జాన్వీ.. కరోనాగా అనుమానం
Janhvi Kapoor Shares Cryptic Post About She Has Fever: బీటౌన్‌లో కరోనా మహమ్మారి తగ్గేదే లే అంటూ వ్యాపిస్తోంది. ఇప్పటికే అనేకమంది సెలబ్రిటీలు కొవిడ్ బారిన పడి ఐసోలేట్ అయ్యారు. ఎంత జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కరోనా సోకిందని.. అందరూ జాగ్రత్తగా ఉండాలని సోషల్ మీడియా వేదికగా పోస్ట్‌లు పెడుతున్నారు. ఇదిలా ఉంటే ఇటీవల అర్జున్ కపూర్ ఇంట్లో నలుగురికి కరోనా సోకింది. అర్జున్ కపూర్, అన్షులా కపూర్, రియా, కరణ్ బూలానీలను కొవిడ్ పలకరించింది. తాజాగా జాన్వీ కపూర్ పోస్ట్ చేసిన ఫొటోలు కొన్ని తనకు కూడా కరోనా వచ్చిందా అనే అనుమానం కలిగించేలా ఉన్నాయి. జాన్వీ మంచంపై పడుకుని నోటిలో థర్మామీటర్ పెట్టుకుని ఉన్న ఫొటో తనకు జ్వరం వచ్చినట్లుగా చెబుతోంది. పోస్ట్‌లో 'మంచంపై పడుకుని నోటిలో థర్మామీటర్ పెట్టుకున్న జాన్వీ ఫొటో, తాను వేసిన పెయింటింగ్, ఫ్రమ్ ది సోల్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ రైటర్స్ పుస్తకంలోని ఒక పేజి, తన పెంచుకునే కుక్కపిల్లకు సంబంధించిన క్యూట్ వీడియో, తన సెల్ఫీ, ఖుషీ కపూర్ పక్కన పడుకుని విశ్రాంతి తీసుకుంటున్న ఫొటో' ఉన్నాయి. ఈ పోస్ట్‌కు 'మళ్లీ ఆ సంవత్సరపు కాలం' అని క్యాప్షన్ ఇచ్చింది. ఈ ఫొటోలు ప్రస్తుతం వైరల్ కాగా ఇవి చూసిన అభిమానులు, నెటిజన్లు 'గెట్ వెల్ సూన్', 'మీరు పెయింటింగ్ చాలా బాగా వేశారు. నాకు చాలా నచ్చింది', 'ముందు బ్రష్ వేసుకోండి. తర్వాత ఫొటోలు దిగితే బాగుంటుంది' అంటూ కామెంట్లు పెడుతున్నారు. View this post on Instagram A post shared by Janhvi Kapoor (@janhvikapoor) ఇదీ చదవండి: బీటౌన్ బ్యూటీకి కొవిడ్.. మరింత స్ట్రాంగ్‌గా తిరిగి వస్తానని -
ట్విటర్ ట్రెండ్: డోలో 650 మేనియా
Dolo 650 Twitter Trending: ‘సొంత వైద్యం’.. కరోనా టైంలో ఎక్కువ చర్చకు వచ్చిన అంశం. అయితే ఆరోగ్యానికి అంత మంచిది కాదనే వైద్య నిపుణుల సలహాలను పాటించిన వాళ్లు కొందరైతే.. తమకు తోచింది చేసుకుంటూ పోయినవాళ్లు మరికొందరు!. వాట్సాప్ యూనివర్సిటీ ప్రచారమో, మరేయితర కారణాల వల్లనో ఇంటి వైద్యానికే ఎక్కువ ప్రాధాన్యం లభించింది ఫస్ట్ వేవ్ టైంలో. అదే సమయంలో అల్లోపతి మందులకు ఫుల్ డిమాండ్ నడిచిన విషయమూ చూశాం. మూడో వేవ్ ముప్పు తరుణంలో మళ్లీ ఇప్పుడా పరిస్థితి నెలకొంది. అసలే ఫ్లూ సీజన్. ఆపై కరోనా ఉధృతి. తాజాగా లక్షాయాభై వేలకు కొత్త కేసులు చేరువైన వైనం. కేసులు ఒక్కసారిగా పెరిపోతుండడంతో జనాల్లోనూ ఆందోళన పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో జ్వరం, ఇతర ట్యాబెట్లు, సిరప్‌ల అమ్మకాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. డోలో మాత్రపై ట్విటర్లో సరదా-సీరియస్ కోణంలో కొనసాగుతున్న ట్రెండ్ ఇందుకు నిదర్శనం. డోలో 650 మేనియా.. అవును ఇప్పుడిది ట్విటర్‌ను షేక్ చేస్తోంది. ప్రమోషనో లేదంటే ట్విటర్ యూజర్ల అత్యుత్సాహామో తెలియదుగానీ నిన్నటి నుంచి ట్విటర్లో పోస్టులు పడుతూనే ఉన్నాయి. జలుబు, జ్వరం, గొంతు నొప్పి, దగ్గు, ఒళ్లు నొప్పులు.. ఎలాంటి లక్షణం కనిపించినా డోలో మాత్ర వేసుకుంటే సరిపోతుందని భ్రమలో మునిగిపోయారు చాలామంది. కొవిడ్ టెస్టులకువెళ్లకుండానే ఈ మాత్రతో తగ్గిపోతుందనే ఉద్దేశంతో ఏదో చాక్లెట్ చప్పరించినట్లు డోలో మాత్రల్ని వేసుకుంటున్నారు. దీనిపై సోషల్ మీడియా రెండుగా విడిపోయింది. విచ్చిల విడిగా వాడడం మంచిదికాదని.. వాడితే తగ్గిపోతుందని ఎవరికి తోచిన ట్వీట్లు వాళ్లు చేసుకున్నారు. ఈ దెబ్బతో ట్విటర్ టాప్ ట్రెండింగ్‌లో #Dolo650 నడుస్తోంది. అందులో కొన్ని పోస్టులు.. Every Indian during Covid 3rd wave👇😂 Taking Dolo 650#Dolo650 pic.twitter.com/ygNploDihV — சிட்டுகுருவி (@save_sparrow2) January 7, 2022 Dolo 650 has become a joke in this country. I see random people behaving like medical experts & popping pills of Dolo 650 like vitamin tablets. Understand. Medicines have a composition & dosage for a reason. Consult a doctor, before becoming a pseudo doctor yourself.🤦🏻♀️#COVID19 — Santwona Patnaik (@SantwonaPatnaik) January 8, 2022 Indian patient when the doctor doesn't prescribe Dolo 650 😂🤣😂#dolo650 pic.twitter.com/QCFMdA9q0V — JITESH JAIN (@Jitesh_Jain) January 8, 2022 I don't no about theories, but it has zero side effects and cure 100%. Biggest medical Mafia is going on be careful my friend. It's time help people. Homeopathy will cure from roots. And You should have a good doctor. Do you know how paracitamol or dolo 650 damage liver ? — Dr.Venkat (@KiteTrades) January 8, 2022 When chemist gives only one Dolo 650.... Indian nibba : pic.twitter.com/zeRC53hDei — Arush Chaudhary (@ArushGzp) January 7, 2022 ప్రొడక్షన్ పెరిగింది ఫ్లూ సీజన్లో సాధారణంగా ట్యాబెట్లు వాడే జనం, కరోనా ఫియర్‌తో ఈసారి అడ్డగోలుగా మందుల్ని వేసుకుంటున్నారు. కరోనా ఫస్ట్ వేవ్ టైంలో జ్వరం, గొంతు ఇన్ఫెక్షన్ మాత్రలకు ఫుల్ గిరాకీ నడిచిన విషయం తెలిసిందే. అయితే రెండో వేవ్ సమయానికి వ్యాక్సిన్ రావడంతో ఆ వ్యవహారం కొద్దిగా తగ్గిపోయింది. ఇప్పుడు వ్యాక్సినేషన్ పూర్తైనా కరోనా బారిన పడుతున్నారనే అంశం కలవరపాటుకు గురి చేస్తోంది. ఈ నేపథ్యంలో మళ్లీ పాత చిట్కాలను పాటించడంతో పాటు మెడిసిన్స్ వైపు మొగ్గు చూపుతున్నారు. పెరిగిన ఈ డిమాండ్‌ను పసిగట్టి మరోవైపు మందుల కంపెనీలు సైతం ప్రొడక్షన్‌ను పెంచుతున్నాయి. "Dolo 650" i.e. acetaminophen/ paracetamol. Liver injury induced by paracetamol. .. pic.twitter.com/IqXfUiwBYI — Amit 🗨️ (@newindia_in) January 8, 2022 వైద్యుల కీలక ప్రకటన అయితే ‘అన్నింటికి ఒకే మందు’ అంటూ సోషల్ మీడియాలో సాగుతున్న ఈ వ్యవహారాన్ని వైద్యులు సీరియస్‌గా తీసుకుంటున్నారు. ఏ మందు అయినా అవసరం ఉన్నప్పుడు.. అవసరం మేరకే వాడాలి. అంతేకానీ ముందు జాగ్రత్త, సొంత ట్రీట్మెంట్ పేరుతో వాడితే సమస్యలు వస్తాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. పైగా అవసరం లేకున్నా వాడడం వల్ల బాడీలో ‘డ్రగ్ రెసిస్టెన్స్’ పెరిగి.. అవసరమైనప్పుడు మందులు పనిచేయకుండా పోతాయని చెప్తున్నారు. ►ఒమిక్రాన్కానీ, ఇంకేదైనా వేరియెంట్‌గానీ కరోనా వైరస్‌ను తేలికగా తీసుకోవద్దు. ►కరోనా అవునో కాదో తెలియకుండా ట్యాబ్లెట్లు వేసుకోవడం మంచిదికాదు. ►ఎవరో ఒకరిద్దరికి తగ్గిందనే భ్రమతో వైద్యుల పర్యవేక్షణ లేకుండా మందులు వాడడం ప్రాణాల మీదకు తెస్తుంది. ►సోషల్ మీడియా ప్రచారాన్ని అస్సలు నమ్మొద్దు.. వైద్యులను నమ్మండి ►లక్షణాలు కనిపిస్తే అప్రమత్తంగా కావాలి. జాగ్రత్తలు పాటించాలి. ఆకలి లేకపోవడం, ఛాతీ నొప్పి, ఊపిరి తీసుకోవడం లాంటి లక్షణాలు కనిపిస్తే టెస్టులు చేయించుకోవడం, ఆసుపత్రికి వెళ్లడం లేదంటే డాక్టర్ సలహాను తీసుకోవడం మంచిది. ►కరోనా సోకినా భయపడాల్సిన అవసరం లేదు. చికిత్సకు మనోధైర్యం తోడైతే కొవిడ్-19 వ్యాధిని అధిగమించొచ్చు. ►అవసరమైతే టెలికాన్సల్టేషన్ ద్వారా కూడా డాక్టర్‌ను సంప్రదించొచ్చు. ►టీకాలతో ఏం ఒరగట్లేదనే ఆలోచన మంచిది కాదు. అవి వ్యాధులనుంచి రక్షణ కలిగిస్తాయి. రోగ నిరోధకశక్తిపై దీర్ఘకాలం పనిచేస్తాయి. కాబట్టి, వ్యాక్సినేషన్‌కు దూరంగా ఉండకూడదు. ►అనుమానంతో పదేపదే కరోనా టెస్టులు చేయించుకుంటూ ఇబ్బంది పడొద్దు. కుటుంబ సభ్యులను కూడా ఇబ్బందులకు గురిచేయొద్దు. ►అన్నింటికి మించి మాస్క్‌లు ధరించడం, భౌతిక దూరం పాటించడం, శుభ్రత తదితర జాగ్రత్తలతో కరోనాను జయించొచ్చు. -
త్వరలో జ్వర సర్వేలు
సాక్షి, హైదరాబాద్: ఫస్ట్, సెకండ్ వేవ్‌ల సందర్భంగా ప్రభుత్వం గ్రామాలు, బస్తీల్లో జ్వర సర్వేలు చేపట్టింది. జ్వరం వచ్చిన వారందరికీ హోం ఐసోలేషన్ కిట్లను అందజేసింది. దాదాపు 8 లక్షల మంది జ్వర పీడితులకు కిట్లు ఇచ్చి వైరస్ కట్టడికి కట్టుదిట్ట చర్యలు తీసుకున్నారు. ఇది వినూత్న కార్యక్రమం కావడంతో దేశంలోనే తెలంగాణ ఆదర్శంగా నిలిచింది. దీంతో ఈసారి కూడా జ్వర సర్వేలు చేపట్టాలని నిర్ణయించినట్లు వైద్య వర్గాలు చెప్పాయి. ఏఎన్ఎం, ఆశా కార్యకర్తలు ఇళ్లకు వెళ్లి జ్వర పీడితులను గుర్తించి అక్కడికక్కడే కిట్లను ఇస్తారు. అవసరమైన వారికి కరోనా పరీక్షలు చేయిస్తారు. జ్వరం సర్వేల సమయంలో కోటి హోం ఐసోలేషన్ కిట్లను అందజేయాలని నిర్ణయించారు. సెకండ్ వేవ్‌లో పారాసిట్మాల్, అజిత్రోమైసిన్, లివోసిట్రజిన్, విటమిన్ మాత్రలు, స్టెరాయిడ్స్లతో కూడిన హోంఐసోలేషన్ కిట్లు అందించారు. ఈసారి కిట్లలో స్టెరాయిడ్స్ ఉంచడం లేదని వైద్య వర్గాలు చెప్పాయి. స్టెరాయిడ్స్ అందరికీ అవసరం లేదని, దీనివల్ల గతంలో అనేక మందికి అనారోగ్య సమస్యలు వచ్చాయన్నాయి. కిట్లను త్వరితంగా సిద్ధం చేసేందుకు ఆగమేఘాల మీద ఆర్డర్లు పెట్టారు. మందులను కోట్లలో సేకరించి, వాటిని కిట్లలో ఉంచేందుకు వివిధ కంపెనీలకు బాధ్యత అప్పగించారు. థియేటర్ల సంగతేంటి? కేసులు పెరుగుతుండటం, సంక్రాంతి పండుగ సమీపిస్తుండటంతో వివిధ అంశాలపై వైద్య ఆరోగ్యశాఖ సమాలోచనలు చేస్తోంది. పండుగ సందర్భంగా బస్సులు, రైళ్లు, విమానాలు, ఇతరత్రా వాహనాల్లో ప్రజల రద్దీ ఉంటుంది. మరోవైపు సినిమా హాళ్లు కూడా నిండుతాయి. ఈ నేపథ్యంలో సమగ్రమైన కరోనా జాగ్రత్తలను పాటించాలని, ఆ మేరకు ప్రత్యేక మార్గదర్శకాలు రూపొందించాలని యోచిస్తున్నారు. ఇక సినిమా హాళ్లలో పక్కపక్కన కూర్చోవడం, గాలి, వెలుతురు పెద్దగా ఉండని స్థితిలో వందల మంది ఉండటంవల్ల వైరస్ ఎక్కువగా వ్యాపిస్తుంది. ఈ నేపథ్యంలో సినిమా హాళ్లలో సగం ఆక్యుపెన్సీకి అవకాశమిస్తే ఎలా ఉంటుందన్న దానిపై వైద్య వర్గాలు చర్చిస్తున్నాయి. -
AP: ఒమిక్రాన్ నేపథ్యంలో ఇంటింటి ఫీవర్ సర్వే
సాక్షి, అమరావతి: కొత్త వేరియంట్ ఒమిక్రాన్ నేపథ్యంలో సోమవారం నుంచి 34వ రౌండ్ ఇంటింటి (హౌస్ టు హౌస్) ఫీవర్ సర్వేకు వైద్య ఆరోగ్య శాఖ సన్నద్ధమైంది. వారంలో ఐదు రోజులపాటు నాణ్యత ప్రమాణాలతో ఫీవర్ సర్వే నిర్వహించాల్సిందిగా అన్ని జిల్లాల మెడికల్ ఆఫీసర్లకు ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ హైమావతి ఆదేశాలు జారీ చేశారు. ఆశా వర్కర్లు, వలంటీర్లు ఇంటింటికి వెళ్లి ప్రజల ఆరోగ్యం గురించి వాకబు చేస్తారు. చదవండి: ఓటీఎస్‌కు మంచి స్పందన ఎవరికైనా జ్వరంతో పాటు కోవిడ్ లక్షణాలుంటే సంబంధిత ఏఎన్ఎంతో పాటు మెడికల్ అధికారి దృష్టికి తీసుకువెళ్తారు. వారు వెంటనే కోవిడ్ పరీక్షలను నిర్వహిస్తారు. పరీక్ష ఫలితాల ఆధారంగా హోం ఐసొలేషన్, చికిత్సకు సంబంధించిన సూచనలు చేస్తారు. ఉచిత మందుల కిట్ ఇవ్వడంతో పాటు వైద్యుల పర్యవేక్షణలో సహాయం అందిస్తారు. ఇప్పటికే 33 సార్లు ఇంటింటి ఫీవర్ సర్వే నిర్వహించడం ద్వారా కోవిడ్ వ్యాప్తి నియంత్రించడంలో ప్రభుత్వం సఫలీకృతం అయింది. ఈ సర్వే డేటాను ఆన్లైన్ యాప్‌లో నిక్షిప్తం చేశారు. ఇప్పుడు 34వ రౌండ్ తర్వాత వివరాలను ఆన్లైన్లో నమోదు చేస్తారు. విదేశాల నుంచి వచ్చిన వారందరికీ పరీక్షలు ఒమిక్రాన్ వచ్చిన తరువాత విదేశాల నుంచి రాష్ట్రానికి రోజుకు 1,500 నుంచి 2,000 మంది వస్తున్నారు. ఈ నెల 1 నుంచి 17 వరకు 26,000 మందికి పైగా రాష్ట్రానికి వచ్చారు. వారందరికీ పరీక్షలు నిర్వహించాం. కోవిడ్ లక్షణాలుంటే తగిన చర్యలు చేపడుతున్నాం. ఒక పక్క కోవిడ్ వ్యాక్సినేషన్‌ను ముమ్మరంగా కొనసాగిస్తూ మరో పక్క ఫీవర్ సర్వే ద్వారా లక్షణాలున్న వారిని గుర్తించి చికిత్స అందిస్తున్నాం. – డాక్టర్ హైమావతి, ప్రజారోగ్య సంచాలకులు -
ఖమ్మం ఉమ్మడి జిల్లాపై డెంగ్యూ పంజా
-
2.5 కోట్ల వ్యాక్సిన్ డోసులు చూసి
పనాజీ: దేశవ్యాప్తంగా శుక్రవారం రికార్డు స్థాయిలో 2.5 కోట్లకు పైగా కోవిడ్ టీకా డోసులు వేయడంతో తన 71వ పుట్టిన రోజు ఎంతో ఉద్వేగంగా జరిగిందని, మరపురాని రోజుగా నిలిచిందని ప్రధాని మోదీ అన్నారు. ప్రపంచంలోని అత్యంత శక్తిమంతమైన దేశాలు కూడా ఇలాంటి అరుదైన ఘనతని సాధించలేకపోయాయని అన్నారు. వ్యాక్సినేషన్‌పై విమర్శలు చేస్తున్న వారిపై ఎదురుదాడికి దిగారు. ఈ డ్రైవ్ చూసిన ఒక రాజకీయ పార్టీకి జ్వరం వచ్చిందని ఎగతాళి చేశారు. శనివారం ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా గోవాలోని ఆరోగ్య కార్యకర్తలు, వ్యాక్సిన్ తీసుకున్న వారితో ముచ్చటించారు. అర్హత కలిగిన ప్రతీ ఒక్కరూ సింగిల్ డోసు వ్యాక్సిన్ తీసుకున్న మొట్టమొదటి రాష్ట్రంగా గోవా నిలిచిన నేపథ్యంలో మోదీ వారితో మాట్లాడారు. ‘నా జీవితంలో ఈసారి జరిగిన పుట్టిన రోజు ఎంతో ప్రత్యేకం. టీకా వేసుకుంటే జ్వరం వస్తుందని అనుకుంటారు. కానీ నా పుట్టిన రోజున 2.5 కోట్ల టీకా డోసులు ఇవ్వడం చూసి ఒక రాజకీయ పార్టీ జ్వరం వచి్చంది’అని మోదీ పరోక్షంగా కాంగ్రెస్‌కు చురకలంటించారు. ఒకేరోజు ఈ స్థాయిలో టీకాలు ఇవ్వడం చిన్న విషయం కాదని, గంటకి 15 లక్షల డోసులు, ప్రతీ నిముషానికి 26 వేలు, సెకండ్‌కి 415 డోసులు ఇచ్చారని భావోద్వేగంతో చెప్పారు. ప్రతిరోజూ పుట్టినరోజు కావాలి: కాంగ్రెస్ ప్రధాని∙మోదీ ప్రతీ రోజూ పుట్టిన రోజు జరుపుకుంటే కొన్ని బీజీపీ పాలిత రాష్ట్రాలు సాధారణ రోజుల కంటే అధికంగా టీకాలు పంపిణీ చేస్తాయని కాంగ్రెస్ వ్యాఖ్యానించింది. రికార్డు స్థాయిలో 2.5 కోట్ల టీకా డోసులు ఇచ్చామంటూ కేంద్రం జబ్బలు చరుచుకుంటోంది కానీ, జనాభాకి ప్రతీ రోజూ ఇదే స్థాయిలో వ్యాక్సినేషన్ కార్యక్రమం జరగాలని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. -
టీకా పంపిణీ చూసి కొన్ని పార్టీలకు జ్వరం పట్టుకుంది : మోదీ
-
అయ్యో.. హారిక..! కన్న తండ్రి భుజాలపై మోసుకెళ్లినా..
తాండూరు రూరల్ (వికారాబాద్): పదకొండేళ్ల బాలికకు నూరేళ్లు నిండాయి. జ్వరంతో ఆరోగ్యం విషమించడం.. ఊరు చుట్టూ వాగు ఉండి ఆసుపత్రికి తీసుకెళ్లడం ఆలస్యం కావడంతో బాలిక మృతిచెందింది. వికారాబాద్ జిల్లా తాండూరు మండలం బొంకూరుకు చెందిన హరిజన్ బాలప్ప, అమృతమ్మల కుమార్తె హారిక (11) ప్రభుత్వ పాఠశాలలో 6వ తరగతి చదువుతోంది. ఇటీవల స్కూల్‌కు వెళ్లి పుస్తకాలు తెచ్చుకుం ది. పాఠశాలలు తెరుచుకోవడంతో స్నేహితులతో కలిసి వెళ్లాలనుకుంది. అయితే వారం రోజులుగా కురుస్తున్న వర్షాలతో బొంకూరు వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో గ్రామస్తులు బయటకు వెళ్లలేని పరిస్థితి. (చదవండి: బంజారాహిల్స్: ఓయో రూమ్స్‌లో అవసరమైన వారికి..) రెండు రోజుల క్రితం జ్వరం.. హారికకు 2రోజుల క్రితం తీవ్రజ్వరం వచ్చింది. వాగు ఉధృతి కారణంగా ఆస్పత్రికి తీసుకెళ్లలేని పరిస్థితి. శుక్రవారం సాయంత్రం జ్వరం తీవ్రం కావడంతో హారికను భుజాలపై ఎత్తుకుని బొంకూర్ నుంచి పొలాల వెంట ఖాంజాపూర్ వెళ్లారు. అక్కడి నుంచి తాండూరు జిల్లా ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్‌లోని నిలోఫర్‌కు రిఫర్ చేశారు. అక్కడ చికిత్స పొందుతూ శనివారం ఉదయం బాలిక కన్నుమూసింది. బొంకూర్ నుంచి తాండూరుకు వెళ్లాలంటే బొంకూర్ వాగుపై వంతెన నిర్మించాలి. తమ సమస్యను అరవై ఏళ్లుగా ఎవరూ పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వంతెన నిర్మించి ఉంటే హారికను జ్వరం వచ్చిన రోజే ఆస్పత్రికి తీసుకెళ్లేవారమని తల్లిదండ్రులు రోధిస్తూ పేర్కొన్నారు. (చదవండి: ‘బతికున్న రోగి చనిపోయాడని చెప్పిన సిబ్బంది’) -
యూపీని వణికిస్తున్న వింత జ్వరం.. 32 మంది చిన్నారులు మృతి
లక్నో: దేశంలో కరోనా మహమ్మారి మూడో దశపై నిపుణుల హెచ్చరికల ఆందోళన కొనసాగుతున్న తరుణంలో ఉత్తర ప్రదేశ్‌లో అంతుచిక్కని జ్వరం ప్రజలను బెంబేలెత్తిస్తోంది. ఇప్పటివరకూ ఈ వ్యాధి బారిన పడి 39 మంది మరణించారు. చనిపోయిన వారిలో ఏడుగురు వృద్ధులతోపాటు 32 మంది చిన్నారులు ఉండటం మరింత ఆందోళన రేపుతోంది. ఫిరోజాబాద్‌లో 32 మంది పిల్లలు, ఏడుగురు పెద్దలు మరణించినట్లు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ధృవీకరించారు. జిల్లాలో డెంగ్యూలాంటి జ్వరం కారణంగా ఈ మరణాలు సంభవించాయని తెలిపారు. బాధిత కుటుంబాలను సందర్శించిన సీఎం యోగి వారికి తగిన సాయం అందిస్తామని హామీ ఇచ్చారు. ఫిరోజాబాద్‌లోని 100 పడకల జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారులను పరామర్శించారు. ఆగస్టు 18న మొదటి కేసు నమోదైందని ముఖ్యమంత్రి చెప్పారు. ప్రభుత్వ ఆసుపత్రిలో దాదాపు 200మంది చిన్నారులు చికిత్స పొందుతున్నారని వైద్యులు ప్రకటించారు. అనుమానాస్పద వ్యాధితో 102 డిగ్రీల సెల్సియస్ జ్వరంతో బాధితులు బాధపడుతున్నారని, ఈ జ్వరం తగ్గడానికి నాలుగు రోజులు పడుతోందన్నారు వెల్లడించారు. గతవారం నుంచి ఇక్కడ విషజ్వరం పీడితుల సంఖ్య మరింత విజృంభిస్తోంది. గత వారం 40 మంది పిల్లలు ఈ వ్యాధితో మరణించారని ఫిరోజాబాద్ ఎమ్మెల్యే మనీష్ అసిజా ఆదివారం ప్రకటించారు. అయితే ఈ వాదనను యుపీ ఆరోగ్య మంత్రి జై ప్రతాప్ సింగ్ తిరస్కరించారు. థర్డ్ వేవ్ వచ్చేసిందన్న వాదన సరికాదని, భారీ వర్షాలు, నీటి నిల్వ కారణంగా, పిల్లలలో మలేరియా, డెంగ్యూ, అధిక జర్వం లాంటి లక్షణాలు వస్తున్నాయని చెప్పారు. అలాగే తమ ఆరోగ్య బృందం నిర్వహించిన పరీక్షల్లో బాధితులందరికీ కరోనా నెగిటివ్ వచ్చిందని చెప్పారు. మిగిలిన వారి శాంపిల్స్‌ను కూడా లక్నోలోని కింగ్ జార్జ్ మెడికల్ యూనివర్సిటీ, పుణెలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి పంపించామన్నారు. మరోవైపు యూపీలోని ఫిరోజాబాద్, మధుర, ఆగ్రా తదితర ప్రదేశాలలో చోటచేసుకుంటున్న మరణాలపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా ఆందోళన వ్యక్తం చేశారు. తక్షణమే మెరుగైన వైద్య సేవలందించేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. फिरोजाबाद, मथुरा, आगरा व उप्र की अन्य जगहों पर बुखार से बच्चों समेत तमाम लोगों की मृत्यु की खबर दुखदाई है। उप्र सरकार को तुरंत प्रभाव से स्वास्थ्य व्यवस्थाओं को चाक-चौबंद कर इस बीमारी के रोकथाम के प्रयास करने चाहिए। बीमारी से प्रभावित लोगों के बेहतर इलाज की भी व्यवस्था की जाए। — Priyanka Gandhi Vadra (@priyankagandhi) August 30, 2021 -
కరోనానా? సీజనల్ జ్వరమా?
సాక్షి,విజయవాడ: ఏడాదిన్నరగా కరోనా ప్రపంచాన్ని వణికిస్తోంది. దీంతో ప్రజల్లో ఫోబియో నెలకొంది. ఏ జ్వరం వచ్చినా.. జలుబు, చిన్నపాటి దగ్గు వచ్చినా నిర్ధారణ పరీక్షలు కూడా లేకుండా కరోనాగా భావించి మందులు వాడేస్తున్నారు. అవి ఒక్కోసారి ప్రాణాల మీదకి తెస్తున్నాయి. తెలియని వారు చేస్తే ఏదో అనుకోవచ్చు.. విద్యావంతులు సైతం ఇదే విధంగా మందులు వాడుతూ ప్రమాదాలను కొనితెచ్చుకొంటుండటం ఆందోళనకర పరిణామం. ఇవే నిదర్శనాలు.. ∙నగరానికి చెందిన ఒక సూపర్‌స్పెషాలిటీ వైద్యురాలికి తీవ్రమైన జ్వరం వచ్చింది. స్వయాన వైద్యురాలు అయినప్పటికీ ఎలాంటి నిర్ధారణ పరీక్షలు చేయించకుండానే కరోనాగా భావించి మందులు వాడేశారు. యాంటీ కోయాగ్యులేషన్(రక్తం పలుచన చేసేవి) మందులు కూడా వినియోగించారు. వారం రోజుల తర్వాత ఓ రోజు వేకువజామున ఆరోగ్యం క్షీణించడంతో ఆస్పత్రికి తరలించారు. అక్కడ పరీక్షలు చేయగా డెంగీగా నిర్ధారణయ్యింది. సహజంగా డెంగీ జ్వరంలో ప్లేట్లెట్స్ తగ్గి రక్తం గడ్డకట్టే గుణం కోల్పోతారు. దానికి తోడు ఆమె రక్తం పలుచన చేసే మందులు కూడా వాడటంతో పరిస్థితి విషమించి కన్నుమూశారు. ∙నగరానికి చెందిన విద్యావంతుడైన ఓ ప్రైవేటు ఉద్యోగికి ఇటీవల జ్వరం వచ్చింది. ఎంతకీ తగ్గక పోవడంతో, కరోనాగా భావించి మందులు వాడేశారు. మూడు రోజులకు జ్వరం తీవ్రం కావడంతో వైద్యుని వద్దకు వెళ్లి పరీక్షలు చేయించుకోగా, టైఫాయిడ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో వైద్యుడు టైఫాయిడ్‌కు మందులు ఇవ్వడంతో ప్రాణాపాయం నుంచి బయట పడ్డారు. డ్రగ్ రెసిస్టెన్స్ పెరుగుతోంది.. ఇప్పుడు సమాజంలో చాలా మంది చిన్న పాటి జ్వరం వచ్చినా, జలుబు, దగ్గు వచ్చినా, లక్షణాలను బట్టి కరోనాగా భావించి మందులు వాడేస్తున్నారు. అది సరైన విధానం కాదని వైద్యులు సూచిస్తున్నారు. ఏ మందు అయినా అవసరం వచ్చినప్పుడు, ఆ మేరకు మాత్రమే వాడాలంటున్నారు. అనవసరంగా మందులు వాడటం ద్వారా శరీరంలో డ్రగ్ రెసిస్టెన్స్ పెరిగి, అవసరమైనప్పుడు పనిచేయకుండా పోతాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఇదీ ‘సీజనల్’ సమయం.. ప్రస్తుతం సీజనల్ జ్వరాలు ఎక్కువగా వస్తున్నాయి. అయితే జ్వరం వచ్చిన వెంటనే కోవిడ్ నిర్ధారణ కోసం ఆర్టీపీసీఆర్ పరీక్ష చేయించుకోవాలి. దానిలో పాజిటివ్ వస్తేనే కరోనాకు మందులు వాడాలి. ఒకవేళ ఆర్టీపీసీఆర్ నెగిటివ్ వచ్చినా జ్వరం తగ్గకుంటే, అప్పుడు సీజనల్ వ్యాధులైన మలేరియా, డెంగీ, టైఫాయిడ్ పరీక్షలు చేయించుకోవాలి. మలేరియా, డెంగీ నిర్ధారణకు జ్వరం వచ్చిన ఒకటీ, రెండు రోజుల్లో పరీక్ష చేయొచ్చు. కానీ టైఫాయిడ్ నిర్ధారణకు వారం రోజుల తర్వాత చేయాల్సి ఉంటుంది. లక్షణాలు ఇవీ.. కోవిడ్: జ్వరం, ఒళ్లు నొప్పులు, పొడిదగ్గు, విరేచనాలు, తలనొప్పి వంటి లక్షణాలు ఉంటాయి. టైఫాయిడ్: జ్వరం వచ్చిన రోజు నుంచి రోజు రోజుకు పెరుగుతూ ఉంటుంది. ఉదయం, సాయంత్రం వేళల్లోనే అధికమవుతుంటుంది, జ్వరం వచ్చినప్పుడు చలి, వణుకు రావడం, విరేచనాలు కూడా అయ్యే అవకాశం ఉంది. డెంగీ: అధిక జ్వరం, ఒళ్లు నొప్పులు, విపరీతమైన న డుం నొప్పితో పాటు, కీళ్ల నొప్పులు ఉంటాయి. మలేరియా: విపరీతమైన జ్వరం, చలి ఎక్కువగా ఉంటుంది, తీవ్రమైన తలనొప్పి, వాంతులు, ఆకలి మందగిస్తుంది. చదవండి:జర జాగ్రత్త!.. ఆహారం.. విరామం.. అతి చేస్తే హానికరం -
స్వర్ణ విజేత నీరజ్ చోప్రాకు తీవ్ర జ్వరం
చండీగఢ్: టోక్యో ఒలింపిక్స్‌లో స్వర్ణ పతకం సాధించిన జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా రెండు రోజులుగా తీవ్ర జ్వరంతో బాధపడుతున్నాడు. కరోనా వైరస్ సోకిందేమోనని అందరూ ఆందోళన చెందుతున్న నేపథ్యంలో నీరజ్‌కు పరీక్షలు చేయగా నెగటివ్ తేలింది. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అతడి ఆరోగ్య పరిస్థితి కొంత మెరుగ్గా ఉందని వైద్యులు తెలిపారు. హరియాణాకు చెందిన నీరజ్ చోప్రా జావెలన్ త్రోయర్‌లో స్వర్ణ పతకం సాధించి త్రివర్ణ పతాకాన్ని ప్రపంచ వేదికపై రెపరెపలాడించాడు. స్వదేశానికి వచ్చిన నీరజ్‌కు అపూర్వ స్వాగతం లభించింది. స్వరాష్ట్రం హరియాణా రూ.6 కోట్ల నగదు బహుమతి ప్రకటించింది. అయితే ఒలింపిక్స్‌లో సత్తా చాటిన తమ క్రీడాకారులను శుక్రవారం ఆ రాష్ట్ర గవర్నర్ బండారు దత్తాత్రేయ ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమానికి వాస్తవంగా నీరజ్ హాజరు కావాల్సింది. కానీ తీవ్ర జ్వరం కారణంగా ఆ కార్యక్రమానికి గైర్హాజరయ్యాడు. వైద్యుల సూచనల మేరకు నీరజ్ ఇంట్లోనే ఉంటున్నాడని సమాచారం. శుక్రవారం 103 డిగ్రీల ఉష్ణోగ్రత నీరజ్‌కు ఉంది. ప్రస్తుతం ఆరోగ్య పరిస్థితి కొంత మెరుగ్గా ఉందని వైద్యులు తెలిపారు. స్వర్ణ పతకం సాధించి వచ్చిన అనంతరం నీరజ్ చాలా బిజీ అయ్యాడు. వరుస కార్యక్రమాలతో తీరిక లేకుండా ఉండడంతో జ్వరం బారినపడ్డాడని అతడి సన్నిహితుడు ఒకరు మీడియాకు తెలిపారు. జ్వరం కారణంగా ఢిల్లీలో జరిగే స్వాతంత్య్ర వేడుకలకు నీరజ్ చోప్రా దూరంగా ఉండనున్నాడు. ఒలింపిక్స్‌లో పతకాలు సాధించిన క్రీడాకారులను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వాతంత్య్ర వేడుకలకు హాజరు కావాలని ప్రత్యేకంగా ఆహ్వానించిన విషయం తెలిసిందే. -
కోవిడ్ సోకినా తీవ్ర జ్వరం ఉండదు
సాక్షి, హైదరాబాద్: కోవిడ్ సోకిన వారిలో జ్వరం తీవ్రంగా ఉంటుంది. ఇది ఎక్కువ మంది బాధితులు చెప్పే మాట. ఇంతకాలం నమోదవుతున్న కోవిడ్ కేసుల్లో జ్వర తీవ్రతతో వచ్చినవారి సంఖ్యే ఎక్కువగా ఉండేది. అయితే ఇకపై జ్వరం ప్రధాన లక్షణం కాకపోవచ్చని నిపుణులు చెబుతున్నారు. కోవిడ్ థర్డ్ వేవ్ ఉంటుందన్న అంచనాల నేపథ్యంలో నిపుణుల హెచ్చరికలు ప్రాధాన్యం సంతరించుకుంటున్నాయి. రెండు డోసుల టీకా పొందిన వారికి వైరస్ సోకితే టీకా రక్షణ కారణంగా జ్వరం ఎక్కువగా ఉండకపోవచ్చని నిపుణులు పేర్కొంటున్నారు. అలాగే వైరస్ మార్పు చెందుతుండటం కూడా మరో కారణమని అభిప్రాయపడుతున్నారు. ‘సెకండ్ వేవ్ వరకు కరోనా లక్షణాలు తీవ్రంగానే కన్పించాయి. ఎక్కువ మందిలో 103 డిగ్రీల వరకు జ్వరం వచ్చేది. తక్కువ మందిలో మాత్రమే జ్వరం లేకపోవటం గుర్తించాం. కానీ కొన్ని రోజులుగా నమోదవుతున్న కేసుల్లో జ్వరం ఉండట్లేదు. ఒకవేళ ఉన్నా చాలా తక్కువ ఉష్ణోగ్రత (మైల్డ్ ఫీవర్) నమోదవుతోంది. ఇకపై జ్వరంతో సంబంధం లేకుండా ఎలాంటి లక్షణం ఉన్నా కోవిడ్ నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాల్సిందే. థర్డ్ వేవ్ ప్రమాదకరంగా మారొద్దంటే ఈ అప్రమత్తత చాలా అవసరం’అని హైదరాబాద్‌కు చెందిన ఇంటిగ్రేటెడ్ స్పెషలిస్ట్, మైక్రోబయోలజిస్టు డాక్టర్ దుర్గా సునీల్ వాస పేర్కొన్నారు. ఇకపై ఎక్కువగా జలుబు, గొంతులో గరగర (ఇరిటేషన్), ముక్కు దిబ్బడ, ముక్కు కారటం, ఒళ్లు నొప్పులు కరోనా లక్షణాలుగా ఉండే అవకాశం ఉందని పేర్కొంటున్నారు. గొంతు, ముక్కులోంచి సేకరించే నమూనాల్లో వైరస్ దొరక్కపోవచ్చని డాక్టర్ సునీల్ పేర్కొంటున్నారు. రక్త పరీక్ష ద్వారా కొంత స్పష్టత..: ర్యాపిడ్, ఆర్టీపీసీఆర్ పరీక్షల్లో నెగెటివ్ వచ్చినా.. కోవిడ్ లక్షణాలు ఉంటే రక్త పరీక్ష (సీబీపీ) చేయించుకోవటం ఉత్తమం అని వైద్యులు సూచిస్తున్నారు. తెల్ల రక్తకణాల్లో ఉండే న్యూట్రోఫిల్ కౌంట్ మరీ ఎక్కువగా ఉన్నా, లింఫోసైట్స్ తక్కువగా ఉన్నా కోవిడ్ సోకి ఉంటుందనే భావించొచ్చని చెబుతున్నారు. వచ్చే 4 నెలలు నిత్యం ఆక్సిజన్ స్థాయిలు పరీక్షించుకోవాలని సూచిస్తున్నారు. ఆక్సిజన్ స్థాయిలో ఏమాత్రం తేడా ఉన్నా ఎలాంటి ఆలస్యం చేయకుండా వైద్యులను సంప్రదించి చికిత్స పొందాల్సి ఉంటుంది. యాంటీ హిస్టమిన్స్ మేలు.. వైరస్ సోకిందన్న అనుమానం ఉండి మందులు వేసుకోవాల్సి వస్తే (వైద్యులను సంప్రదించే వీలు లేకుంటే) యాంటీ హిస్టమిన్స్ (హెచ్1హెచ్2) మందులు వాడొచ్చని డాక్టర్ సునీల్ వాస పేర్కొన్నారు. ఇవి న్యుమోనియాకు గురికానివ్వవని, ఇతర శరీరభాగాలకు సోకకుండా చూస్తాయని చెప్పారు. చిన్నారులకు వస్తుందన్న భయం వద్దు.. వచ్చే నాలుగైదు నెలల పాటు అందరూ సమతుల ఆహారం తీసుకోవాలి. లాక్టోబాసిల్లై ఉండే పెరుగుతో పాటు సల్ఫరోఫేన్ అధికంగా ఉండే బ్రకోలీ, క్యాబేజీ, క్యాలిఫ్లవర్ లాంటి కూరగాయలు తినాలని డాక్టర్ సునీల్ స్పష్టం చేశారు. ఇక థర్డ్‌వేవ్‌లో చిన్న పిల్లలకు ముప్పు ఉంటుందన్న భయాన్ని వీడాలని సూచించారు. వారికి ప్రత్యేకంగా కోవిడ్ టీకాలు వేయించాల్సిన అవసరం లేదన్నారు. వైరస్ సోకినా పెద్దగా ప్రమాదం ఉండదని స్పష్టం చేశారు. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు పెద్ద వయసు వారు వచ్చే నాలుగైదు నెలలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. -
కరోనా వ్యాప్తినియంత్రణలో ఫీవర్ సర్వే కీలక పాత్ర
-
కరోనా కట్టడి: సీఎం జగన్ నిర్ణయాలతో సత్ఫలితాలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కోవిడ్ వ్యాప్తిని నియంత్రించేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ముందుచూపుతో తీసుకున్న నిర్ణయాలు సత్ఫలితాలను ఇస్తున్నాయి. కరోనా సంక్షోభం ప్రారంభం కాగానే ముఖ్యమంత్రి తక్షణం స్పందించి వైద్య, ఆరోగ్యశాఖను అప్రమత్తం చేశారు. అధికారులతో తీసుకోవాల్సిన చర్యలపై నిత్యం స్వయంగా సమీక్షలు నిర్వహించారు. కోవిడ్ వ్యాప్తిని నియంత్రించడానికి, వైరస్ బారిన పడిన వారిని తక్షణం గుర్తించడానికి ప్రభుత్వ పరంగా చేపట్టిన చర్యలు కరోనాను కట్టడి చేయడానికి ఉపకరించాయి. క్షేత్రస్థాయిలోకి పాలనను చేరువ చేసేందుకు సీఎం వైఎస్ జగన్ తీసుకువచ్చిన పాలనాపరమైన మార్పులు కూడా సంక్షోభ సమయంలో ప్రజలకు సత్వర సేవలందించేందుకు కారణమయ్యాయి. ప్రతి రెండువేల జనాభాకు ఒక గ్రామ, వార్డు సచివాలయంను ఏర్పాటు చేసిన నేపథ్యంలో ఈ సచివాలయాల పరిధిలో ఫీవర్ క్లీనిక్స్‌ను ప్రారంభించిన ప్రభుత్వం కరోనా విపత్తులో ఇంటింటి సర్వేలను విజయవంతంగా నిర్వహించింది. కరోనా సంక్షోభం ప్రారంభమైన నాటి నుంచి నేటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 13 సార్లు ఇంటింటి ఫీవర్ సర్వేలు నిర్వహించారు. రెండోవేవ్ సమయంలో 8 సార్లు ఇంటింటి సర్వే కరోనా మొదటి వేవ్ సమయంలో దీనిని ఎలా ఎదుర్కోవాలో అర్థం చేసుకునేందుకే ప్రపంచ వ్యాప్తంగా వైద్యనిపుణులు ఇబ్బంది పడ్డారు. అందుబాటులో ఉన్న అన్ని పద్దతులను అమలులోకి తీసుకువచ్చే ప్రయత్నం చేశారు. ఇదే క్రమంలో మన రాష్ట్రంలో సీఎం జగన్ కరోనా నియంత్రణకు ఇంటింటి సర్వేను ముమ్మరంగా నిర్వహించాలని వైద్యాధికారులను ఆదేశించారు. దీనిపై నిరంతరం సమీక్షలు నిర్వహించారు. ప్రతిసారీ ఫీవర్ సర్వే ఫలితాలను సమీక్షా సమావేశాల్లో విశ్లేషించారు. ఫీవర్ సర్వే అనేది నిరంతరం జరిగే ప్రక్రియగా తీసుకోవాలని, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే సహించేంది లేదని పలుసార్లు సీఎం అధికారులను హెచ్చరించారు. రెండో వేవ్ కరోనా సమయంలో వైద్యపరంగా వైరస్ కట్టడికి అనుసరించాల్సిన విధానాలపై శాస్త్రీయంగా వచ్చిన అన్ని విధానాలను ప్రభుత్వం అమలులోకి తెచ్చింది. మొదటి వేవ్ సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా 5 సార్లు ఫీవర్ సర్వే నిర్వహిస్తే, రెండో వేవ్ సమయంలో 8 సార్లు రాష్ట్రంలో ఇంటింటి సర్వే నిర్వహించారు. అంతేకాదు కరోనా తగ్గుతోందనే ఉదాసీనత పనికిరాదని, తమకు వైరస్ అనుమానిత లక్షణాలు ఉన్నాయన్న ప్రతి ఒక్కరికీ ఆర్టీపీసీఆర్ టెస్ట్‌లు చేయాలని సీఎం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. సచివాలయ స్థాయిలో ఫీవర్ క్లీనిక్స్ సచివాలయ స్థాయిలో ఏర్పాటైన ఫీవర్ క్లీనిక్స్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 40 వేల మంది ఆశా వర్కర్లు, 19 వేల మంది ఎఎన్ఎంలు, దాదాపు 2.66 లక్షల మంది వాలంటీర్లు ఈ ఫీవర్ సర్వే నిర్వహించారు. ఆయా సచివాలయాల పరిధిలో ముందుగా ఆశావర్కర్లు, వాలంటీర్లు ఇంటింటికి వెళ్ళి కుటుంబాల్లోని సభ్యుల ఆరోగ్య పరిస్థితిపై సర్వే నిర్వహించారు. ఈ సర్వేలో జ్వరంతో పాటు ఇతర కోవిడ్ అనుమానిత లక్షణాలు ఉంటే తక్షణం సచివాలయ పరిధిలోని ఎఎన్ఎం, మెడికల్ ఆఫీసర్లకు సమాచారం అందిస్తున్నారు. వెంటనే ఎఎన్ఎం, మెడికల్ ఆఫీసర్ సదరు ఇంటిని సందర్శించి, అక్కడికక్కడే వారికి కోవిడ్ నిర్ధారిత పరీక్షలు నిర్వహిస్తారు. ఈ పరీక్షల్లో కోవిడ్ పాజిటీవ్ వచ్చిన వారిని గుర్తించి, వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉండి, ఇంటిలో ఐసోలేషన్ వసతి ఉందని తేలితే వారికి ఉచితంగా మందుల కిట్లను అందిస్తున్నారు. ఐసోలేషన్ వసతి లేని వారిని సమీపంలోని కోవిడ్ కేర్ సెంటర్‌కు తరలించడం, ఆరోగ్య పరిస్థితి బాగోలేని వారిని ఆసుపత్రికి అంబులెన్స్ ద్వారా పంపించడం చేస్తున్నారు. అంతేకాకుండా కోవిడ్ పాజిటీవ్ పేషెంట్ల వివరాలను కమాండ్ కంట్రోల్ రూంకు అందించడం ద్వారా వైద్యులు నిత్యం హోం ఐసోలేషన్‌లో ఉన్న వారితో ఫోన్లో అందుబాటులో ఉండి, వారి ఆరోగ్య పరిస్థితులను పర్యవేక్షించడం చేస్తున్నారు. అంతే కాకుండా స్థానిక ఎఎన్ఎం, మెడికల్ ఆఫీసర్లు కూడా నిత్యం పేషంట్ల ఆరోగ్యంపై ఫోన్ ద్వారా పర్యవేస్తుంటారు. హోం ఐసోలేషన్‌లో ఉన్న అందరికీ ఉచితంగా మందుల కిట్లు రాష్ట్ర వ్యాప్తంగా 1,63,62,671 నివాసాలు ఉండగా వాటిల్లో కరోనా రెండో వేవ్‌లో 1,50,13,669 ఇళ్ళలో ఫీవర్ సర్వే జరిగింది. మొత్తం 92,364 మంది వైరస్ లక్షణాలు ఉన్న అనుమానితులను గుర్తించారు. వారిలో 88,657 మందికి కోవిడ్ పరీక్షలు నిర్వహించగా, 10,729 మంది పాజిటీవ్ పేషెంట్లను గుర్తించారు. కరోనా విపత్తు ప్రారంభమైన నాటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా హోం ఐసోలేషన్‌లో ఉన్న వారికి ప్రభుత్వమే ఉచితంగా మందుల కిట్లను ఇవ్వాలన్న సీఎం జగన్ ఆదేశాల మేరకు కోవిడ్ పేషెంట్లుకు ఉచితంగా మందుల కిట్లను పంపిణీ చేశారు. కరోనా కట్టడి కోసం ప్రభుత్వం తీసుకున్న అన్ని చర్యలు సత్ఫలితాలను ఇచ్చాయి. అంతేకాకుండా ఫీవర్ సర్వే వల్ల ప్రజల్లో తమ ఆరోగ్యం పట్ల చైతన్యాన్ని కలిగించారు. కోవిడ్ వైరస్ ప్రాథమిక దశలోనే గుర్తించేందుకు, వైద్య సహాయం కోసం అందుబాటులో ఉన్న వనరులను వినియోగించుకునేలా ప్రజల్లో అవగాహనను కల్పించారు. టెస్టింగ్, ట్రేసింగ్, ట్రీట్మెంట్ విధానాన్ని సమర్థంగా అమలు చేయడం వల్ల కోవిడ్ వంటి విపత్కర పరిస్థితిని కూడా ప్రభుత్వం సవాల్‌గా తీసుకుని మరీ ఎదుర్కొంది. చదవండి: ఏపీలో స్థిరంగా తగ్గుతున్న కరోనా కేసులు తగ్గిందని అలసత్వం వద్దు -
విషాదం: ఆస్పత్రికి చేరకుండానే...
హత్నూర(సంగారెడ్డి): జ్వరంతో బాధపడుతున్న ఓ మహిళ తన భర్తతో కలసి ఆటోలో ఆసుపత్రికి వెళ్తూ మార్గమధ్యలోనే ప్రాణాలు విడిచింది. ఆటోడ్రైవర్ భయంతో రోడ్డుపైనే దించేసి వెళ్లిపోయాడు. దిక్కుతోచని ఆ వ్యక్తి తన భార్య మృతదేహాన్ని రోడ్డు పక్కన పెట్టుకొని రోదించడం చూపరులను కంటతడి పెట్టించింది. వివరాలు... సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం లక్మాతండాకు చెందిన మాలోత్ మరోని(50)కి ఆరోగ్యం బాగా లేకపోవడంతో భర్త పాండునాయక్ శనివారం ఆమెను దౌల్తాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లాడు. అక్కడ పరీక్షించిన వైద్యులు సంగారెడ్డికి తీసుకువెళ్లాలని సూచించారు. దీంతో దంపతులిద్దరూ ఆటో మాట్లాడుకుని సంగారెడ్డికి బయలుదేరారు. దారిమధ్యలో బోర్పట్ల బస్సు స్టేజీ సమీపంలోకి చేరుకోగానే తీవ్ర అస్వస్థతకు గురైన మరోని ఆటోలోనే తనువు చాలించింది. దీంతో భయపడిన ఆటోడ్రైవర్ అక్కడే వదిలేసి వెళ్లిపోయాడు. ఏం చేయాలో తోచని పాండునాయక్, భార్య మృతదేహాన్ని రోడ్డు పక్కనే పడుకోబెట్టి కన్నీరు మున్నీరయ్యాడు. అదే సమయంలో అటుగా వెళ్తున్న కొందరు వ్యక్తులు పాండును ఓదార్చడంతోపాటు తండావాసులకు సమాచారం ఇచ్చారు. తండావాసులు మరో వాహనం తీసుకువచ్చి మృతదేహాన్ని అక్కడి నుంచి తీసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహించారు. నాయక్ దంపతులకు నలుగురు కూతుళ్లు కాగా, అందరికీ వివాహాలయ్యాయి. ఈ ఘటనపై పోలీసులను సంప్రదించగా తమకు ఎలాంటి సమాచారం లేదని తెలిపారు. చదవండి: పత్తి.. వరి.. కంది -
AP: నేటి నుంచి 12వ విడత ఫీవర్ సర్వే
సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా గురువారం నుంచి 12వ విడత ఫీవర్ సర్వే నిర్వహించనున్నట్లు వైద్య, ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి అనిల్‌కుమార్ సింఘాల్ తెలిపారు. బాధితులను గుర్తించి సత్వరమే చికిత్స అందించేందుకు ప్రతి మూడు రోజులకు ఒకసారి ఫీవర్ సర్వే చేస్తున్నామని, 19 వేల మంది ఏఎన్ఎంలు, 40 వేల మంది ఆశా కార్యకర్తలు సర్వేలో పాల్గొంటున్నారని చెప్పారు. బుధవారం ఆయన మంగళగిరిలోని ఏపీఐఐసీ భవనంలో మీడియాతో మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకూ చేపట్టిన 11 విడతల జ్వర బాధితుల గుర్తింపు సర్వేలో 2,72,240 మందిని గుర్తించి శాంపిళ్లు పరీక్షించగా 33,262 మంది కరోనా పాజిటివ్‌గా తేలినట్లు చెప్పారు. రాష్ట్రంలో 2 కోట్ల కరోనా నిర్ధారణ పరీక్షలు పూర్తయ్యాయని, జాతీయ సగటు కంటే ఎక్కువగా ఏపీలో టెస్టులు నిర్వహించామన్నారు. మిలియన్ జనాభాకు ఏపీలో 3.75 లక్షల పరీక్షలు చేయగా, దేశవ్యాప్తంగా 2.67 లక్షల టెస్టులు చేశారన్నారు. రాష్ట్రంలో కరోనా తగ్గుముఖం పట్టిందన్నారు. 1,09,69,000 డోసుల పంపిణీ.. ఇప్పటి వరకూ రాష్ట్ర వ్యాప్తంగా 1,09,69,000 వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేశామని సింఘాల్ తెలిపారు. ఒక డోసు తీసుకున్నవారు 58 లక్షల మంది ఉండగా 25,87,000 మంది రెండు డోసులు పూర్తైన వారు ఉన్నట్లు చెప్పారు. పలు కంపెనీల నుంచి రాష్ట్ర ప్రభుత్వం సొంతంగా కొనుగోలు చేసిన వ్యాక్సిన్లలో ఇంకా 16,54,000 డోసులు రావాల్సి ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వ కోటా కింద జూన్ నెల వరకూ 51,40,000 డోసులు రావాల్సి ఉందన్నారు. కరోనా తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో 104 కాల్ సెంటర్‌కు ఫోన్ కాల్స్ కూడా తగ్గుతున్నాయని తెలిపారు. 104 కాల్ సెంటర్ ద్వారా సేవలు అందించడానికి పలువురు వైద్యులు ముందుకొస్తున్నారన్నారు. ఇప్పటి వరకూ 5,012 మంది వైద్యులు పేర్లను రిజిస్ట్రేషన్ చేసుకోగా వారిలో స్పెషలిస్టులు 951 మంది ఉన్నారని చెప్పారు. రాష్ట్రానికి కేంద్రం రోజువారీ 590 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ కేటాయించగా గత 24 గంటల్లో 497 మెట్రిక్ టన్నులను డ్రా చేసుకున్నామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 1,955 బ్లాక్ ఫంగస్ కేసులు నమోదు కాగా 114 మంది మృతి చెందారని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో 1,301 బ్లాక్ ఫంగస్ యాక్టివ్ కేసులు ఉన్నాయన్నారు. రాష్ట్రవ్యాప్తంగా పొసకొనజోల్ ఇంజక్షన్లు, మాత్రలు సరిపడా అన్ని జిల్లాల్లోనూ ఉన్నాయన్నారు. చదవండి: నేడు ఢిల్లీకి సీఎం జగన్ -
ఫీవర్ సర్వేతో కోవిడ్‌కు చెక్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా ఇంటింటి ఫీవర్ సర్వే కారణంగా కోవిడ్ పాజటివ్ రేట్ తగ్గు ముఖం పడుతుందని రాష్ట్ర ప్రజారోగ్య శాఖ విభాగం డైరెక్టర్ శ్రీనివాసరావు చెప్పారు. వైద్య సిబ్బంది, ఏఎన్ఎంలు, ఆశ వర్కర్లు.. మొత్తం 21 వేల మంది 81 లక్షల ఇళ్లను సర్వే చేశారని తెలిపారు. కోవిడ్ లక్షణాలున్న ప్రతి ఒక్కరికీ హోం ఐసొలేషన్ కిట్లు ఇవ్వడం వల్ల వారంతా కోవిడ్‌ను జయించేందుకు అవకాశం ఏర్పడిందని అన్నారు. ఈ నేపథ్యంలోనే ఆసుపత్రుల్లో అడ్మిషన్ల సంఖ్య వారం రోజులుగా తగ్గుముఖం పట్టిందని చెప్పారు. త్వరలోనే 18 సంవత్సరాలు పైబడిన వారికి వ్యాక్సిన్ ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధం ఉందని వివరించారు. వ్యాక్సిన్ల కొరత, బ్లాక్‌ఫంగస్, ఆసుపత్రుల్లో బెడ్ల కొరత వంటి అంశాలపై మంగళవారం ఆయన ‘సాక్షి’తో ముచ్చటించారు. సర్వేకు మంచి ఆదరణ ‘పదిహేనురోజుల క్రితం చేపట్టిన ఫీవర్ సర్వేకు ప్రజల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. ఇంట్లోనే ఉంటూ కరోనాను జయించేందుకు మేము ఇచ్చిన ఐసోలేషన్ కిట్లు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. ఇప్పటివరకు హైదరాబాద్ నగరంతో పాటు అన్ని జిల్లాలు, గ్రామాల్లో 2 లక్షలకు పైగానే కిట్లు ఇచ్చాం. ఫీవర్ సర్వే తెలంగాణ ప్రభుత్వానికి ఒక టర్నింగ్ పాయింట్. అందుకే కేంద్ర ప్రభుత్వం మంగళవారం నుంచి ఈ ఐడియాను దేశవ్యాçప్తంగా అమలు చేస్తోంది. వ్యాక్సిన్లకు గ్లోబల్ టెండర్లు రాష్ట్రంలో 18–45 సంవత్సరాల వయసున్న వారు సుమారు 1.82 కోట్ల మంది ఉన్నారు. వీళ్లుకా కుండా మరో 25 లక్షల మంది ఇతర రాష్ట్రాల వారు ఉన్నారు. అంటే తెలంగాణలో సుమారు 2 కోట్ల మందికి వ్యాక్సిన్ ఇవ్వాల్సి ఉంది. దీనికి 4 కోట్ల డోసులు కావాలి. కానీ కేంద్రం ఇచ్చింది 4.90 లక్షలే. అందుకే వీటిని ముందుగా ఎవరికివ్వాలి? ఎప్పుడివ్వాలి? అనే విషయాలను ముఖ్యమంత్రి కేసీఆర్ పరిశీలిస్తున్నారు. త్వరలో దీనిపై నిర్ణయం ప్రకటించే అవకాశం ఉంది. వ్యాక్సిన్ల కొరత నేపథ్యంలో సీఎం మరో కొత్త నిర్ణయం తీసుకున్నారు. గ్లోబల్ టెండర్లను ఆహ్వానించి తద్వారా రాష్ట్రానికి కావాల్సినన్ని వ్యాక్సిన్ డోసులను తెచ్చుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీంతో పాటు కొత్త వ్యాక్సిన్లు కూడా వస్తున్నాయి. స్పుత్నిక్, జాన్సన్ అండ్ జాన్సన్ అనేవి కూడా మన హైదరాబాద్‌లోనే తయారు కానున్నాయి. దీనిపై స్టేట్ టాస్క్‌ఫోర్స్‌ను మంత్రి కేటీఆర్ ఏర్పాటు చేశారు. వాళ్లు ఈ వ్యాక్సిన్లపై ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తున్నారు. ఇక 45 సంవత్సరాలు పైబడిన వారికి కేంద్రమే వ్యాక్సిన్ ఇస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో 45 సంవత్సరాల పైబడిన వారు 92 లక్షల మంది ఉన్నారు, వీరికి 1.85 కోట్ల డోసులు కావాలి. ఇప్పటివరకు కేంద్రం నుంచి వచ్చింది కేవలం 57 లక్షల డోసులు మాత్రమే. రాష్ట్రంలో కోవాగ్జిన్, కోవిషీల్డ్ నిల్వలు లక్ష డోసులు మాత్రమే ఉన్నాయి..’ అని శ్రీనివాసరావు తెలిపారు. పడకలు మూడింతలు పెంచాం ‘ఫస్ట్ వేవ్‌తో పోలిస్తే సెకెండ వేవ్ తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. దీంతో హైదరాబాద్‌తో పాటు అన్ని జిల్లా కేంద్రాల్లోని ప్రభుత్వ, ప్రై వేటు ఆసుపత్రుల్లో బెడ్ల సామర్థ్యాన్ని పెంచాం. ప్రభుత్వ ఆసుపత్రుల్లో 16 వేలు, ప్రై వేటు ఆసుపత్రుల్లో 38 వేలు మొత్తం 54 వేల బెడ్లు ఏర్పాటు చేశాం. ఇలా ఫస్ట్‌వేవ్‌తో పోలిస్తేæ సెకెండ్ వేవ్‌లో మూడింతలు పెంచాం. వీటిలో ఆక్సిజన్ బెడ్లు 21 వేలు, ఐసీయూ బెడ్లు 12 వేలు ఉన్నాయి. ప్రభుత్వ ఆసుపత్రులు 115కు, ప్రై వేటు ఆసుపత్రులు 1,100కు పెంచి కరోనా రోగులకు చికిత్స అందిస్తున్నాం. ఆక్సిజన్ కొరత లేదు సెకెండ్ వేవ్‌లో రోగుల తాకిడి ఉధృతం కావడంతో..రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో 450 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ సరఫరా అవుతోంది. రాష్ట్రంలో ఎక్కడా ఆక్సిజన్ కొరత లేదా సరఫరా అంతరాయం అనేది లేదు. ఆక్సిజన్ సరఫరాను ఎప్పటికప్పుడు ప్రత్యేక బృందం పర్యవేక్షిస్తుంది. ఉచితంగా బ్లాక్ ఫంగస్ ఇంజెక్షన్ బ్లాక్ ఫంగస్ అనేది కొత్త వ్యాధి కాదు. దీనికి భయపడాల్సిన అవసరం కూడా లేదు. కానీ ఎట్టి పరిస్థితుల్లో అశ్రద్ధ వహించకూడదు. ముక్కు దిబ్బడగా ఉండటం, ముక్కు ద్వారా గాలి సజావుగా పీల్చుకోలేకపోవడం వంటివి దీని లక్షణాలు. ఇది ఎక్కువగా కోవిడ్‌ను జయించిన వాళ్లకు వస్తుంటుంది. ఈ సమస్యను ఎదుర్కొంటున్న వాళ్లు తక్షణం గాంధీ లేదా కోఠి ఈఎన్టీ ఆసుపత్రుల్లోని వైద్యులను సంప్రదించాలి. దీని మందులు ప్రభుత్వ ఆసుపత్రుల్లో మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఒక్కో ఇంజక్షన్ ధర రూ.3,500. వీటిని ఉచితంగా ఇస్తాం..’ అని శ్రీనివాసరావు వివరించారు. -
పల్లెల్లోనే ఎక్కువగా కరోనా పాజిటివ్
సాక్షి, అమరావతి: కరోనా పాజిటివ్ కేసుల నేపథ్యంలో పల్లెటూళ్లు జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. మే 7వ తేదీ నుంచి 14వ తేదీ వరకూ గణాంకాలను తీసుకుంటే పట్టణాల్లో కంటే గ్రామీణ ప్రాంతాల్లో పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగింది. కానీ మరణాలు మాత్రం ఇప్పటికీ పట్టణాల్లోనే ఎక్కువగా ఉన్నాయి. రికవరీ శాతం కూడా పల్లెటూళ్లలోనే ఎక్కువగా ఉన్నట్టు వెల్లడైంది. మే 7 నుంచి 14వ తేదీ నాటికి 355 క్లస్టర్లను ఏర్పాటు చేయగా.. ప్రస్తుతం మొత్తం 4,792 క్లస్టర్లున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఫీవర్ సర్వే జరగనుండటంతో ముందస్తుగా బాధితులను గుర్తించి ఐసొలేషన్ చేసేందుకు వీలు కలుగుతుంది. రాష్ట్రవ్యాప్తంగా ఫీవర్ సర్వే కోసం 19 వేల మంది ఏఎన్ఎంలు, 40 వేల ఆశా కార్యకర్తలు పనిచేయనున్నారు. -
తల్లి చెప్పినా వినలే.. పరీక్ష రాస్తూ మృత్యుఒడిలోకి
పాట్నా: జ్వరం అని తెలిసి కూడా పరీక్ష రాయడానికి ఆ విద్యార్థి వెళ్లాడు. తల్లి వద్దని మొరపెట్టుకున్నా ‘పరీక్ష రాయకపోతే ఈ విద్యా సంవత్సరం వేస్ట్ అవుతుంది’ అని నచ్చచెప్పి విద్యార్థి పాఠశాలకు వెళ్లాడు. అతడి ఉష్ణోగ్రత పరీక్షించగా అధికంగా ఉండడంతో పరీక్ష రాయడానికి పాఠశాల అధికారులు అనుమతి ఇవ్వలేదు. అయినా కూడా వారిని బతిమిలాడాడు. దీంతో తల్లితో పాటు ఉన్నత అధికారులకు ఫిర్యాదు చేశాడు. అతడు ఎలాగైనా పరీక్ష రాస్తానని పట్టుబట్టడంతో అధికారులు అంగీకరించి ఒక్కడే బయట పరీక్ష రాయడానికి అనుమతించారు. అయితే పరీక్ష రాస్తున్న సమయంలో ఆరోగ్యం విషమించడంతో ఆ విద్యార్థి మృతిచెందాడు. చేతిలో పెన్ను.. పేపర్ పట్టుకుని మృత్యు ఒడికి చేరాడు. ఈ విషాద ఘటన బిహార్ రాష్ట్రంలో జరిగింది. మృతుడు రోహిత్ కుమార్. నలంద జిల్లాలోని బిహార్ షరీఫ్ పట్టణంలో ఆదర్శ్ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతుండేవాడు. బోర్డు పరీక్షలు కావడంతో ఆ విద్యార్థి ఈసారి ఎలాగైనా పరీక్షలు రాయాలని పట్టుబట్టి మరీ ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు. ఈ ఘటనతో పాఠశాలలో విషాదం ఏర్పడింది. -
అలర్ట్: జ్వరముంటే కరోనా వ్యాక్సిన్ వద్దు
సాక్షి, హైదరాబాద్: జ్వరమున్నప్పుడు కరోనా వ్యాక్సిన్ వేసుకోకూడదని వైద్య, ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. వ్యాక్సిన్ వేసుకునేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలను, వేసేప్పుడు వైద్య సిబ్బంది చేపట్టాల్సిన చర్యలపై తాజాగా మార్గదర్శకాలు జారీ చేసింది. వచ్చే నెలలో దేశవ్యాప్తంగా కరోనా టీకా వేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. దేశంలో ఇప్పటికే కొన్ని కంపెనీలు దాదాపు 10 కోట్ల డోసులను కూడా సిద్ధం చేశాయి. వచ్చే నెలాఖరులోగా వాటిని నిర్దేశిత ప్రజ లకు వేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. వ్యాక్సిన్ వేసేప్పుడు వైద్య సిబ్బంది టీకా తీసుకునే వారి వివరాలు సేకరించాలని సర్కార్ స్పష్టం చేసింది. అలాగే తీసుకునే వ్యక్తులు కూడా ముందే తమకున్న ఆరోగ్య సమస్యలను వైద్య సిబ్బందికి తెలియజేయాలని సూచించింది. చదవండి: (చేదు జ్ఞాపకాలను మిగిల్చిన 2020) జ్వరముందా? ఏవైనా అలర్జీలున్నాయా? రక్తస్రావం, రక్తం పలుచన వంటి సమస్యలున్నాయా? ఇతరత్రా మందుల వల్ల వారి రోగ నిరోధక శక్తిపై ప్రభావం చూపినట్లుందా? గర్భిణీయా? ప్రెగ్నెన్సీకి ఏవైనా ప్లాన్ చేస్తున్నారా? ఇతర కోవిడ్ వ్యాక్సిన్ తీసుకొని ఉన్నారా... వంటి పూర్తి వివరాలను తీసుకోవాలని వైద్య, ఆరోగ్య శాఖ సూచించింది. ఇటువంటి వారుంటే తాత్కాలికంగా వారికి వ్యాక్సిన్ నిలుపుదల చేయాలని స్పష్టం చేసింది. జ్వరమున్న వారికి తగ్గిన తర్వాత టీకా వేస్తారు. ఇతర అలర్జీలున్న వారికి అవి తగ్గిన తర్వాత వేయాలా లేదా వైద్యులు సూచిస్తారు. అంతేకాదు మొదటి డోసులో తీవ్రమైన అలర్జీ తలెత్తిన వారికి తదుపరి డోసు ఇవ్వకూడదని మార్గదర్శకాల్లో స్పష్టం చేశారు. భయాందోళనలు అవసరం లేదు.. వ్యాక్సిన్‌ను ప్రజల్లోకి తీసుకొచ్చేటప్పుడు ప్రభుత్వం అన్ని రకాల భద్రతా ప్రమాణాలు పాటించి అనుమతినిస్తుందని ఆ మార్గదర్శకాల్లో స్పష్టం చేసింది. ఎటువంటి సమస్యలు తలెత్తకుండా ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటుందని వెల్లడించింది. ఎవరికైనా సైడ్ఎఫెక్ట్స్ వస్తే తక్షణమే స్పందించేలా ప్రత్యేక సిబ్బందిని సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే డాక్టర్లు, నర్సులు, వ్యాక్సిన్‌లో పాల్గొనే సిబ్బందికి శిక్షణ ఇచ్చారు. అంతేకాదు వ్యాక్సిన్ వేసే కేంద్రంలో తప్పనిసరిగా మూడు గదులుండేలా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తారు. వేచి ఉండేందుకు ఒక గది, వ్యాక్సిన్ వేసేందుకు మరొక గది ఉంటుంది. చదవండి: (మే 13 తర్వాతే మళ్లీ మంచి రోజులు) అనంతరం వారికి ఏమైనా సైడ్‌ఎఫెక్టŠస్ వచ్చే అవకాశముందా లేదా పరిశీలించేందుకు వేరే గదిలో అరగంట సేపు ఉంచుతారు. ఒకవేళ ఏవైనా సైడ్‌ఎఫెక్టŠప్ వస్తే ఆదుకునేందుకు అవసరమైన మెడికల్ కిట్ సిద్ధంగా ఉంటుంది. కిట్‌లో అవసరమైన మందులన్నీ ఉంటాయి. కళ్లు తిరిగి పడిపోయినా, అలర్జీ వచ్చినా, గుండె కొట్టుకునే వేగం తగ్గినా, బీపీ హెచ్చుతగ్గులు వచ్చినా, డీహైడ్రేషన్‌కు గురైనా తక్షణమే చర్యలు తీసుకునేలా మెడికల్ కిట్ ఉపయోగపడుతుంది. అవసరమైన వారికి సెలైన్ ఎక్కించేలా ఏర్పాట్లు ఉంటాయి. ఎటువంటి సైడ్‌ఎఫెక్టŠస్ వచ్చినా వైద్యులు చికిత్స చేస్తారు. అవసరమైతే సమీప ఉన్నత స్థాయి ఆసుపత్రికి తరలించేలా అంబులెన్సులను సిద్ధంగా ఉంచుతారు. -
నో-టచ్ థర్మామీటర్లతో జర జాగ్రత్త!
కరోనా మహమ్మారి కారణంగా ఏక్కువ శాతం మంది ఆరోగ్యం విషయంలో శ్రద్ధ కనబరుస్తున్నారు. బయటికి వెళ్ళినప్పుడు మాస్కులు ధరించడం, ఇంటికి వచ్చినప్పుడు చేతుల కడుక్కోవడం రోజువారీ అలవాట్లలో భాగమయ్యాయి. ప్రస్తుతం పిల్లలు, వృద్దులు ఉన్న ఇళ్లలో జాగ్రత్తలు ఎక్కువగా తీసుకుంటున్నారని చెప్పాలి. అందుకే ఈ ఇళ్లలోశరీర ఉష్ణోగ్రతలు కొలిచే థర్మామీటర్లను కూడా ఉపయోగిస్తున్నారు. కోవిడ్ -19 లక్షణాలలో జ్వరం ప్రధానమైంది. అందుకోసమే ప్రతి ఇళ్లలో సాధారణ థర్మామీటర్లతో పాటు, ఇప్పుడు కొత్తగా తీసుకొస్తున్న నో-టచ్ థర్మామీటర్లు కూడా ఎక్కువగా వాడుతున్నారు. ఇప్పుడు నో-టచ్ థర్మామీటర్లు పబ్లిక్ టెంపరేచర్ స్క్రీనింగ్ కోసం విస్తృతంగా ఉపయోగిస్తున్నారు. కానీ, నో-టచ్ థర్మామీటర్ల యొక్క కచ్చితత్వం విషయంలో అనుమానులు రేకెత్తుతున్నాయి. (చదవండి: ఈ మాస్క్ వెరీ స్పెషల్..ధర 69వేలకు పైనే..) సాధారణ థర్మామీటర్లతో పోలిస్తే నో-టచ్ థర్మామీటర్లు ఉష్ణోగ్రతల నమోదు విషయంలో తేడాలు ఉన్నట్లు అమెరికన్ జర్నల్ ఆఫ్ ఇన్ఫెక్షన్ కంట్రోల్లో ప్రచురించబడింది. కొందరు ఆస్ట్రేలియా పరిశోధకులు 265 అంటువ్యాధి లేని రోగులపై అధ్యయనం నిర్వహించారు. ఈ అధ్యయనంలో భాగంగా శరీర ఉష్ణోగ్రత రికార్డింగ్‌లను సేకరించడానికి నో-టచ్ థర్మామీటర్లు, తాత్కాలిక ధమని థర్మామీటర్లను ఉపయోగించినప్పుడు తేడాలు గమనించారు. శరీర ఉష్ణోగ్రతలు 100.4 డిగ్రీల ఫారెన్‌హీట్(38 డిగ్రీల సెల్సియస్) కంటే తక్కువ ఉన్నపుడు ఒకే విధమైన ఫలితాలు చూపించినట్లు పేర్కొన్నారు. కానీ, శరీర ఉష్ణోగ్రతలు 100.4 డిగ్రీల ఫారెన్‌హీట్(38 డిగ్రీల సెల్సియస్) కంటే ఎక్కువ నమోదైనప్పుడు టెంపోరల్ ఆర్టరీ థర్మామీటర్స్ (టాట్) చేత పరీక్షించిన 6 శరీర ఉష్ణోగ్రతలలో 5 శరీర ఉష్ణోగ్రతలను నో-టచ్ థర్మామీటర్లు తప్పుగా చూపిస్తున్నాయని కనుగొన్నారు. అందుకే నో-టచ్ థర్మామీటర్ల విషయంలో జాగ్రత్తగా ఉండాలని పరిశోధకులు సూచిస్తున్నారు. -
జ్వరమొస్తే కరోనా, డెంగీ టెస్టులు తప్పనిసరి
సాక్షి, హైదరాబాద్: ఇప్పుడు సీజనల్ వ్యాధులు ఒకవైపు, కరోనా మరోవైపు ప్రజలను పట్టిపీడిస్తున్నాయి. ప్రధానంగా డెంగీ, కరోనాతో జనం గజగజలాడిపోతున్నారు. ఈ నేపథ్యంలో రెండూ ఒకేసారి వస్తే చికిత్స అందించడం వైద్యులకు సవాల్‌గా మారిందని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఈ నేపథ్యంలో వాటిని ఎలా ఎదుర్కోవాలన్న దానిపై తాజాగా మార్గదర్శకాలు జారీచేసింది. ప్రస్తుత పరిస్థితుల్లో జ్వరం వస్తే ఆలస్యం చేయకుండా వెంటనే కరోనా, డెంగీ పరీక్షలు రెండూ చేయించాలని సూచించింది. కరోనా, డెంగీ జ్వరాల్లో లక్షణాలు దాదాపు దగ్గరగా ఉండటం వల్ల వ్యాధిని గుర్తించడంలో గందరగోళం నెలకొనే ప్రమాదం ఉందని తెలిపింది. మరో విషయం ఏంటంటే రెండింటిలోనూ 80 శాతం మందిలో ఎలాంటి లక్షణాలు కనిపించట్లేదని తెలిపింది. ఇవి తీవ్రమైతే మాత్రం ఆస్పత్రిలో చేరాల్సిన స్థితి ఎదురవుతుంది. కాబట్టి వేగంగా చికిత్స అందించడమే ముఖ్యమని తెలిపింది. రెండింటికీ నిర్దిష్టమైన చికిత్స లేనందున వైద్యుల సమక్షంలో లక్షణాలకు అనుగుణంగా చికిత్స పొందాల్సి ఉంటుంది. పైగా రెండింటికీ వేర్వేరు చికిత్స చేయాలి. ఎందుకంటే డెంగీలో ఐవీ ఫ్లూయిడ్స్ ఇస్తారు. కరోనా రోగుల్లో వాటిని ఇవ్వడం ద్వారా అక్యూట్ రెస్పిరేటరీ డిసీజ్ సిండ్రోమ్, ఊపిరితిత్తుల్లో వాపు వంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. అలాగే కరోనా రోగుల్లో రక్తం గడ్డకట్టకుండా ఇచ్చే హెపారిన్ మందు ఇచ్చేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని కేంద్రం విజ్ఞప్తి చేసింది. డెంగీ రోగుల్లో హెపారిన్ ఇస్తే రక్తస్రావం జరిగే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. అందువల్ల ఈ సీజన్లో కరోనా, డెంగీ బారిన ప్రజలు పడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని కేంద్రం కోరింది. ఇంకా ఏం చేయాలంటే? ► రెండింటి బారిన పడిన బాధితులకు ఆస్పత్రుల్లో చికిత్స అందించాలి. బాధితుడిలో లక్షణాలు, సమస్యలను బట్టి చికిత్స చేసే విధానాన్ని మార్చాలి. ► డెంగీ బాధితుల్లో ‘ప్యాక్డ్ సెల్ వాల్యూమ్ (పీసీవీ)’ఎక్కువగా ఉంటే ఐవీ ఫ్లూయిడ్స్ ఇవ్వాలి. అలాగే ప్లేట్లెట్స్ ఎక్కించే విషయంలో స్పష్టమైన అవగాహన ఉండాలి. ► రక్తంలో ఆక్సిజన్ స్థాయిలు ఎప్పటికప్పుడూ పల్స్ ఆక్సీమీటర్ ద్వారా పరీక్షించాలి. ► ఛాతీలో ఇన్ఫెక్షన్ తీవ్రతను తెలుసుకోవడానికి ఎక్స్‌రే, సీటీ స్కాన్ చేయించాలి. ► ఇంటి పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవడం, నీటి నిల్వలు లేకుండా జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా డెంగీ బారినపడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ► ముఖానికి మాస్కు ధరించడం, చేతులను శుభ్రంగా కడుక్కోవడం, భౌతికదూరాన్ని పాటించడం వంటి కరోనా నివారణ పద్ధతులు పాటించాలి. -
భారత్‌లో మరో వ్యాధి, మహారాష్టలో హై అలర్ట్
ముంబాయి: ఇప్పటికే దేశంలోనే అత్యధిక కరోనా కేసుల నమోదుతో అతలకుతలం అవుతున్న మహారాష్ట్రపై మరో పిడుగు పడింది. మహారాష్ట్ర జిల్లాలో అతి భయంకరమైన కాంగో జ్వరం వ్యాప్తి చెందకుండా అప్రమత్తంగా ఉండాలని పాల్ఘర్ పరిపాలన విభాగం మంగళవారం అధికారులను ఆదేశించింది. సాధారణంగా కాంగో జ్వరం అని పిలువబడే క్రిమియన్ కాంగో హెమోరేజిక్ ఫీవర్ (సీసీహెచ్ఎఫ్), పేలు ద్వారా మానవులలో వ్యాప్తిచెందుతుంది. ఈ నేపథ్యంలో జిల్లా యంత్రాంగం దీని గురించి మాట్లాడుతూ, ఇది పశువుల పెంపకందారులు, మాంసం విక్రేతలు, పశుసంవర్ధక అధికారులకు ఆందోళన కలిగించే విషయమని అన్నారు. దీనికి సరైన వ్యాక్సిన్ లేదా మందులు, చికిత్స అందుబాటులో లేని కారణంగా ముందు జాగ్రత్తలు తీసుకోవడం అత్యవసరమని వారు సూచించారు. పాల్ఘర్ పశుసంవర్ధక శాఖ డిప్యూటీ కమిషనర్ డాక్టర్ ప్రశాంత్ డి కాంబ్లే ఒక సర్క్యులర్‌లో సిసిహెచ్ఎఫ్ గుజరాత్‌లోని కొన్ని జిల్లాల్లో కనుగొనబడిందని, ఇది మహారాష్ట్రలోని సరిహద్దు జిల్లాలకు వ్యాపించే అవకాశం ఉందని చెప్పారు. పాల్ఘర్ గుజరాత్‌లోని వల్సాద్ జిల్లాకు దగ్గరగా ఉంది. ఇప్పటికే వల్సాద్ జిల్లాలో కొన్ని కేసులు నమోదయ్యాయని, అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకొని నివారణ చర్యలు అమలు చేయాలని అధికారులను సంబంధిత శాఖ విభాగం హెచ్చరించింది. ఈ వ్యాధి ఒక నిర్దిష్ట రకం పేల ద్వారా ఒక జంతువు నుంచి మరొక జంతువుకు వ్యాపిస్తుందని, వ్యాధి సోకిన జంతువుల రక్తం ద్వారాగానీ, వ్యాధి సోకిన జంతువుల మాంసాన్ని తినడం ద్వారా గానీ మానవులకు వ్యాపిస్తుందరి అందుకే జాగ్రత్తగా ఉండాలని మహారాష్ట్రలో ఒక సర్క్యులర్ విడుదల చేశారు. ఈ వ్యాధిని నిర్ధారించి, చికిత్స చేయకపోతే 30 శాతం మంది రోగులు మరణిస్తారు. సీసీహెచ్ఎఫ్ అనేది బున్యావిరిడే కుటుంబానికి చెందిన టిక్-బర్న్ వైరస్ (నైరోవైరస్) వల్ల కలిగే ఒక వ్యాధి. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) ప్రకారం ఈ వ్యాధికి గురయితే తీవ్రమైన జర్వం వస్తుంది. ఈ వ్యాధికి ఇంతవరకు వ్యాక్సిన్ అందుబాటులో లేదు. డబ్ల్యూహెచ్ఓ ప్రకారం సూదల పునర్వినియోగం, వైద్యసామాగ్రి కలుషితం కావడం వల్ల కూడా ఈ వ్యాధి వ్యాప్తి చెందుతుంది. చదవండి: మరో వైరస్..! ఐసీఎంఆర్ హెచ్చరిక -
ఆలస్యం చేయకండి..!
సాక్షి, హైదరాబాద్: విశ్వనగరంపై ఒకవైపు కరోనా వైరస్.. మరోవైపు సీజనల్ వ్యాధులు విశ్వరూపం చూపుతున్నాయి. జ్వరాలపట్ల అలసత్వంగా ఉన్నా, చికిత్సకు ఆలస్యం చేసినా పంజా విసిరి జనాలను ఆగం చేస్తున్నాయి. కరోనాలోనూ, మలేరియా, డెంగీ, టైఫాయిడ్లోనూ జ్వరమే సాధా రణంగా కనిపించే లక్షణం. కరోనా కాలంలో ఎవరిలో? ఏ జ్వరం ఉందో? గుర్తించడం బాధితులకే కాదు.. వైద్యులకూ ఇబ్బందిగా మారింది. చాలామంది కరోనా జ్వరాలను కూడా సాధారణ జ్వరంగా భావించి చికిత్సను నిర్లక్ష్యం చేస్తున్నారు. కనీసం టెస్టు కూడా చేయించుకోవడం లేదు. ముఖ్యంగా యాభై ఐదేళ్లు పై బడిన బీపీ, షుగర్, ఆస్తమా, ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు చికిత్సను నిర్లక్ష్యం చేస్తూ చివరకు ప్రాణాల మీదకు తెచ్చుకుం టున్నారు. తీరా ఊపిరి తీసుకోవడం కష్టంగా మారడంతో ఆస్పత్రికి పరుగులు తీస్తున్నారు. అప్పటికే పరిస్థితి చేయిదాటి పోతుండటంతో వైద్యులు కూడా ఏమీ చేయలేక నిస్సహా యతను వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల మృతి చెందిన బాలల హక్కుల సంఘం అధ్యక్షుడు అచ్యుతరావుసహా ప్రముఖ గాయకుడు నిస్సార్, బహుజన మేధావి ఉ.సా, ప్రముఖ జర్నలిస్టు పీవీరావుతోపాటు పలువురిలో అక స్మాత్తుగా శ్వాస సంబంధ సమస్యలు తలెత్తి మృతి చెందడం ఆందోళన కలిగిస్తోంది. ఊపిరి తీసుకోవడం కష్టమవడంతో.. ఇప్పటివరకు కోవిడ్ బారిన పడిన బాధితుల్లో 40 ఏళ్లలోపువారు 57.1 శాతం మంది ఉండగా, ఆపై వయసు వారు 48.8 శాతం మంది ఉన్నారు. 40 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరిలోనూ హైపర్ టెన్షన్, మధుమేహం, ఆస్తమా ఇలా ఏదో ఒక ఇతర అనారోగ్య సమస్య ఉంటుంది. సాధారణ యువకులతో పోలిస్తే వీరిలో రోగనిరోధకశక్తి తక్కువ. వీరిలో చాలామంది తమ పని ప్రదేశాల్లో 35 ఏళ్లలోపు సాధారణ యువకులతో కలిపి పని చేస్తుంటారు. యువకులు అసింప్టమేటిక్‌గా ఉంటున్నారు. వీరిలో చాలామందికి తమకు వైరస్ సోకిన విషయమే తెలియడం లేదు. వీరంతా తాము ఎంతో ఆరోగ్యంగా ఉన్నట్లు భావిస్తున్నారు. మాస్కులు ధరించకుండా, భౌతికదూరం పాటించకుండా, శానిటైజర్ ఉపయోగించకుండా నిర్లక్ష్యంగా వ్యవహ రిస్తున్నారు. అసింప్టమేటిక్ బాధితుల నుంచి రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండే 55 ఏళ్లు పైబడినవారికి వైరస్ సోకుతోంది. వీరిలో చాలామంది సాధారణ జ్వరం, జలుబు, దగ్గుగా భావించి టెస్టులు, చికిత్సలను లైట్‌గా తీసుకుంటున్నారు. తీరా ఊపిరి తీసుకోవడం కష్టమవుతుండటంతో ఆస్పత్రికి పరుగులు తీస్తున్నారు. శరీరంలో ఆక్సిజన్ శాతం పడి పోయి ప్రాణాపాయస్థితిలో ఆస్పత్రికి వచ్చిన వీరిని కాపాడేందుకు వైద్యులు ఎంతో శ్రమిం చాల్సి వస్తోంది. పరిస్థితి విషమించి చాలా మంది ప్రాణాలు కోల్పోవాల్సి వస్తోంది. అంతేకాదు, పడకలు, వైద్య సిబ్బంది నిష్పత్తికి మించి బాధితులు వస్తుండటంతో అత్యవసర పరిస్థితుల్లో వైద్యులు కూడా ఏమీ చేయలేక చేతులెత్తేయాల్సి వస్తోంది. అంతో, ఇంతో అవగాహన ఉన్నవారే... సాధారణ ప్రజలతో పోలిస్తే.. వైరస్‌పై అంతో, ఇంతో అవగాహన ఉన్నవారే చికిత్స లను ఎక్కువ నిర్లక్ష్యం చేస్తున్నారని వైద్యులు అభిప్రాయపడుతున్నారు. ఒంట్లో ఏ చిన్న లక్షణం కన్పించినా చాలామంది వెంటనే అప్రమత్తమైపోతున్నారు. ముందు జాగ్రత్త చర్యగా వివిధ కషాయాలు తాగుతూ పౌష్టికాహారం తీసుకుంటూ ప్రాణాయామం వంటి యోగాసనాలు చేస్తూ వైరస్‌ను జయిస్తు న్నారు. కానీ, వైద్యంపై కనీస అవగాహన లేని ఇలాంటివారితో పోలిస్తే.. ఉన్నత చదువులు చదివి, వైరస్‌పై అంతో, ఇంతో అవగాహన ఉన్నవారే ఎక్కువగా నిర్లక్ష్యం చేస్తున్నట్లు ఇటీవల వెలుగు చూసిన పలు ఘటనలు పరిశీలిస్తే అవగతమవుతుంది. వీరు అతి తెలివిగా ఆలోచించి, చివరకు చిక్కుల్లో పడుతున్నారు. వ్యాధి నిర్ధారణ పరీక్షలు మొదలు.. చికిత్స వరకు... ఇలా ప్రతి విషయంలోనూ దాటవేత ధోరణినే అవలం బిస్తూ చివరకు తమ ప్రాణాల మీదకు తెచ్చు కుంటున్నట్లు వైద్యనిపుణులు అభిప్రాయ పడుతున్నారు. వైరస్‌ను ముందే గుర్తించి అప్రమత్తమైతే... ప్రమాదం నుంచి బయట పడేవారని, నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే ప్రాణాలు కోల్పోవాల్సి వస్తోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. శ్వాసనాళాలపైనే ఎక్కువ ప్రభావం.. ప్రస్తుతం కంటికి కన్పించని ప్రమాదకరమైన కరోనా వైరస్‌తో పోరాడుతున్నాం. ఇది ఒకరి నుంచి మరొకరికి ముక్కు, కన్ను, చెవి, నోరు వంటి భాగాల ద్వారా ప్రవేశిస్తుంది. ముందు గొంతు, శ్వాసనాళాలు, ఆ తర్వాత గుండె, మూత్రపిండాల పనితీరుపై ప్రభావం చూపుతుంది. వృద్ధులు, మధుమేహులు, ఆస్తమా బాధితులపై ఇది ఎక్కువ ప్రభావం చూపుతుంది. ప్రాథమిక దశలో గుర్తించి చికిత్స తీసుకోవడం ద్వారా వైరస్ బారి నుంచి బయటపడొచ్చు. నిర్లక్ష్యం చేయడం ద్వారా వైరస్ శ్వాసనాళాల పనితీరును దెబ్బతీస్తుంది. ఊపిరి తీసుకోవడం కష్టంగా మారుతుంది. శరీరంలో ఆక్సిజన్ శాతం పడిపోతుంది. ఆకస్మిక గుండెపోటుకు కారణమవుతుంది. ముందుగానే టెస్టు చేయించుకుని, చికిత్స తీసుకుంటే ప్రాణాపాయం నుంచి బయటపడే అవకాశం ఉంది. కానీ, చాలామంది ఈ వైరస్‌ను నిర్లక్ష్యం చేసి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. – డాక్టర్ రఫీ, పల్మనాలజిస్ట్, కేర్ ఆస్పత్రి -
ఒళ్లునొప్పులన్నీ కరోనా జ్వరంతోనేనా?
మనకు జ్వరంతో పాటు ఒళ్లునొప్పులు, తీవ్రమైన నీరసం, నిస్సత్తువ రావడానికి అనేక కారణాలు ఉంటాయి. వాటిలో కొన్ని ఇవి... ’ ఇన్ఫెక్షన్లు : – కోవిడ్–19కు కారణమైన సీవోవీ–2 వైరస్ అనే కొత్తవైరస్ ఆవిర్భవించడానికి ముందు కూడా ఒళ్లునొప్పులు ఉన్నాయి. అదే కుటుంబానికి చెందిన వైరస్ల కారణంగా వచ్చే ఫ్లూ (ఇన్ఫ్లుయెంజా), హెచ్1ఎన్1లతో పాటు చికున్‌గున్యా, డెంగీ వంటి వైరల్ ఇన్ఫెక్షన్లలోనూ తీవ్రమైన ఒళ్లునొప్పులు జ్వరంతో పాటు కలిసి వచ్చి తీవ్రంగా బాధిస్తాయి. ఇతర వైరస్లు అయిన హెపటైటిస్–బి, హెచ్ఐవీ వంటి వైరల్ ఇన్ఫెక్షన్లలోనూ ఒళ్లునొప్పులుంటాయి. ఇక బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ల విషయానికి వస్తే... మలేరియాతో పాటు బొరిలియా ప్రజాతికి చెందిన బ్యాక్టీరియాతో వచ్చే లైమ్ డిసీజ్ వంటి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లలోనూ ఒళ్లునొప్పులు కనిపిస్తాయి. దాంతోపాటు టైఫాయిడ్, రికెట్సియల్ వంటి బ్యాక్టీరియల్ జ్వరాలతో పాటు పిల్లి ద్వారా వ్యాప్తిచెందే టాక్సోప్లాస్మోసిస్ వంటి ఏకకణజీవి ద్వారా వ్యాపించే ప్రోటోజోవన్ ఇన్ఫెక్షన్లలోనూ ఒళ్లునొప్పులు రావడం చాలా సాధారణం. ఇక... ట్రైకినెల్లా స్పైరాలిస్, సిస్టిసెర్కోసిస్ (బద్దెపురుగు) వంటి సరిగ్గా ఉడికించని పోర్క్ ద్వారా వ్యాపించే పరాన్నజీవుల వల్ల వచ్చే ఇన్ఫెక్షన్లలోనూ జ్వరంతో పాటు ఒళ్లునొప్పులు వస్తాయి. కీళ్లనొప్పులకు సంబంధించిన వ్యాధులు: కొన్నిసార్లు ఒళ్లునొప్పులూ, కీళ్లనొప్పులూ కలగలిసి వస్తుంటాయి. ఒక్కోసారి ఈ కీళ్లనొప్పులే ఒళ్లునొప్పులుగా అనుకునేంత తీవ్రంగానూ ఉంటాయి. ఉదాహరణకు... కీళ్లనొప్పులతో వ్యక్తం అయ్యే రుమటాయిడ్ ఆర్థరైటిస్‌లో, – జన్యుపరమైన లోపాల వల్ల ముక్కుకు ఇరువైపులా మచ్చలా కనిపించే సిస్టమిక్ లూపస్ అరిథమెటోసిస్లో, – పాలీమయాల్జియా రుమాటికా (అంటే గ్రీకు భాషలో అనేక కండరాల్లో నొప్పి అని అర్థం), – పాలీమయోసైటిస్, జోగ్రెన్స్ సిండ్రోమ్ వంటి కీళ్లవాధుల్లోనూ... ఆ బాధలు ఒళ్లునొప్పుల రూపంలోనే వ్యక్తమవుతుంటాయి. ♦ పైన పేర్కొన్న లక్షణాలు కనిపించగానే మనం ఏవో మందులు వేసుకుంటూ ఉంటాం. వాటిల్లోని విషపదార్థాల వల్ల కూడా ఒక్కోసారి ఒళ్లునొప్పులు రావచ్చు. అలాగే డీ–పెన్సిల్లెమైన్స్, క్లోరోక్విన్, స్టెరాయిడ్స్, జిడోవిడిన్ మందులు తీసుకోవడం వల్ల కూడా ఒళ్లునొప్పులు కనిపిస్తాయి. ♦ ఆల్కహాల్ వల్ల : కొందరిలో ఆల్కహాల్ తీసుకున్న తర్వాతి రోజు కూడా ఒళ్లునొప్పులు రావచ్చు. ఫ్లూ. ఇతర జ్వరాలు :మనలో జలుబు, ఫ్లూ ఎక్కువ కాబట్టి ఫ్లూ గురించి కాస్త వివరంగా చెప్పుకుందాం. ఫ్లూ జ్వరం ఇన్ఫ్లుయెంజా అనే వైరస్ వల్ల వస్తుంది. ఇటీవల ప్రబలుతున్న కోవిడ్–19తో పాటు ఈ ఇన్‌ఫ్లుయెంజాతో వచ్చే ఫ్లూలోనూ ఒకే లక్షణాలు ఉంటాయి. అంటే... తీవ్రమైన ఒళ్లునొప్పులతో పాటు దగ్గు, జలుబు, గొంతునొప్పి ఉంటాయి. ఫ్లూ చాలామందిలో దానంతట అదే తగ్గుతుంది. ఒకవేళ తగ్గకపోతే లక్షణాలనుంచి ఉపశమనం కోసం పారాసిటమాల్ తీసుకుంటే సరిపోతుంది. అలా తగ్గకపోయినా... కొంతమందిలో నిమోనియా, శ్వాసక్రియ సరిగ్గా జరగకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తే మాత్రం వెంటనే... అదేదో ఫ్లూ మాత్రమే కావచ్చు అనుకుని నిర్లక్ష్యం చేయకూడదు. అప్పుడు రోగిని తప్పనిసరిగా ఆసుపత్రికి తీసుకెళ్లాల్సిందే. లెప్టోస్పైరోసిస్ ఇప్పుడిది వర్షాకాలం. వానలు కూడా ఎక్కువగానే పడుతున్నాయి. ఈ వర్షాకాలంలో కనిపించే జబ్బుల్లో ముఖ్యమైనది లెప్టోస్పైరోసిస్. ఇది కూడా ఒళ్లునొప్పులతో మొదలయ్యే జ్వరం. వర్షాకాలాల్లో ఎలుకలు బయట మురుగునీళ్లలో తిరగడం, అవే మళ్లీ ఇండ్లలోకి రావడం వల్ల ఈ వ్యాధి వ్యాప్తిచెందుతుంది. ఇందులోనూ చాలామందిలో ఫ్లూ లక్షణాలే కనిపిస్తాయి. కొద్దిమందిలో మాత్రం కాలేయం, ఊపిరితిత్తులు, మూత్రపిండాలు, గుండె, మెదడు వంటి అనేక కీలక అవయవాలు ఒకేసారి దెబ్బతినే ప్రమాదం (మల్టీ ఆర్గాన్ డిస్ఫంక్షన్ సిండ్రోమ్) జరిగి అది ప్రాణాంతకం కావచ్చు. లెప్టోస్పైరోసిస్‌ను పెన్సిలిన్, టెట్రాసైక్లిన్ వంటి మందులతో పూర్తిగా నయం చేయవచ్చు. అందుకే ఒళ్లునొప్పులు కనిపించగానే అది కోవిడ్–19 యే కావచ్చని ఆందోళన పడి, డీలా పడాల్సిన అవసరం లేదు. కాకపోతే పైన పేర్కొన్న లక్షణాలు పారాసిటమాల్ వాడాక కూడా రెండు రోజుల్లో తగ్గకపోతే... కోవిడ్–19 కావచ్చేమోనని అనుమానించి... అప్పుడు వెంటనే కోవిడ్–19 నిర్ధారణ కోసం అవసరమైన పరీక్షలు చేయించుకోవాలి. ఫైబ్రోమైయాల్జియా మయాల్జియా అన్నదాన్ని బట్టే అది కండరాలకు సంబంధించిన వ్యాధి అని మనకు తెలుస్తుంది. మహిళల్లోనే ఎక్కువగా కనిపించే ఈ వ్యాధిలో కండరాల నొప్పులతో పాటు దేహంలో కొన్నిచోట్ల వేలితో కొద్దిపాటి ఒత్తిడి కలగజేస్తే నొప్పిగా ఉంటుంది. త్వరగా అలసిపోవడం, నిద్రలేమి, తిమ్మిర్లు, ఉదయం లేవగానే కండరాలు బిగుసుకుపోవడం ఈజబ్బులో ముఖ్యంగా కనిపిస్తాయి. ఈ నొప్పులు... తల వెనకభాగం, మెడ కింద, ఎదుర్రొమ్ములో రెండో ఎముక, మోచేతి కింద ఉండే ల్యాటరల్ ఎపీకాండైల్ ఎముక మీద, పిరుదు కండరాలపై నొక్కిచూసినప్పుడు ఒకవేళ నొప్పి ఉంటే దాన్ని ఫైబ్రోమయాల్జియాగా అనుమానించాల్సి ఉంటుంది. ఇది చాలావరకు ప్రమాదకరమైన జబ్బు కానే కాదు. మీకు మూడు నెలలుగా నొప్పులు అదేపనిగా వస్తూ ఉంటే... ఇలా దీర్ఘకాలంగా నొప్పులున్నందున అది కోవిడ్–19 కాకపోవచ్చనీ బహుశా ‘ఫైబ్రోమయాల్జియా’ కావచ్చు. ఇది ప్రమాదకరం కాదు కాబట్టి పూర్తిగా నిర్భయంగా ఉండవచ్చు. ఒంటినొప్పులు ఉన్నవారంతా గుర్తుంచుకోవాల్సిందల్లా... ఈ సీజన్లో జ్వరంతో పాటు వచ్చినందున అది కోవిడ్–19 మాత్రమే కాకపోవచ్చని ధైర్యం వహించాలి. ఒకవేళ రెండు రోజుల కంటే ఎక్కువసేపు ఈ జ్వరమూ, ఒళ్లునొప్పులూ కొనసాగితే... కోవిడ్–19 కాదేమోనంటూ మనల్ని మనం మభ్యపెట్టుకునేందుకు అది మిగతా కారణాల వల్ల కావచ్చేమోనని సర్దిచెప్పుకోవడమూ సరికాదు. విజ్ఞులైన వారు ఈ రెండింటికి మధ్య గీత గీయడం ఇప్పుడున్న పరిస్థితుల్లో తక్షణ అవసరం. కండరాలనొప్పులకుచేయాల్సిన పరీక్షలు మూత్రపరీక్ష ∙ఈఎస్ఆర్ ∙హీమోగ్రామ్ వంటి సాధారణ పరీక్షలు చేయించాలి. కొన్ని ప్రత్యేకమైన లక్షణాలు కనిపించినప్పుడు డాక్టర్లు కాలేయం, మూత్రపిండాలకు సంబంధించిన పరీక్షలు ∙సీరమ్ ప్రోటీన్ ఎలక్ట్రోఫోరోసిస్ (ఎస్పీఈపీ) ∙స్కెలెటల్ సర్వే ∙బోన్ స్కాన్ ∙సీరమ్ క్యాల్షియమ్ ఫాస్ఫరస్ ∙ఆల్కలైన్ ఫాస్ఫోటేజ్ పరీక్షలు ∙25 హైడ్రాక్సీ వైటమిన్ డి లెవెల్స్ ∙సీరమ్ పారాథోర్మోన్ లెవెల్స్ ∙బోన్‌మ్యారో (ఎముక మూలగ) పరీక్ష యాంటీన్యూక్లియర్ యాంటీబాడీస్ పరీక్ష ∙రుమటాయిడ్ ఫ్యాక్టర్ హెచ్ఐవీ ∙హెచ్‌బీఎస్‌ఏజీ హెచ్‌సీవీ పరీక్షలు ∙మజిల్ బయాప్సీ ∙ఈఎంజీ... వంటి పరీక్షలు చేయిస్తారు. ఒకవేళ ఇలాంటి అన్ని రకాల పరీక్షలు చేశాక కూడా రోగనిర్ధారణ జరగకపోతే అది యాంగై్జటీ, డిప్రెషన్ వంటి మానసిక వ్యాధులు కారణం కావచ్చు. క్రానిక్ ఫెటీగ్ సిండ్రోమ్ ఇటీవలి కోవిడ్–19 ఇన్ఫెక్షన్లో... దాదాపు 102 డిగ్రీలతో తీవ్రమైన జ్వరం, ఒళ్లునొప్పుల తర్వాత కనిపించే అత్యంత ప్రధాన లక్షణాల్లో తీవ్రమైన అలసట, నిస్సత్తువ, అమితమైన నీరసం... ఏ పనీ చేయాలని అనిపించనంతటి తీవ్రమైన నిస్త్రాణ కూడా ఒకటి. కానీ ఇలా తీవ్రమైన నీరసం, నిస్సత్తువ, అలసట, నిస్త్రాణ కనిపించాయంటే అది తప్పనిసరిగా కోవిడ్–19 యే కానక్కర్లేదు. ‘క్రానిక్ ఫెటీగ్ సిండ్రోమ్’ అని పిలిచే ఒక కండిషన్‌లోనూ ఇవే లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. ఈ కండిషన్ ఉన్నవారిలోనూ త్వరగా అలసిపోవడం, తగినంత విశ్రాంతి తీసుకున్న తర్వాత కూడా అలసట తగ్గకపోవడం, శక్తి లేనట్టు అనిపించడం ముఖ్యలక్షణాలు. ఆర్నెల్లకు పైగా ఇవే లక్షణాలు ఉండి, జ్ఞాపకశక్తి క్షీణించడం, నిద్రలేమి వంటివి కూడా ఉంటే, ఆ లక్షణాలన్నీ చూసి దీన్ని నిర్ధారణ చేస్తారు. ఈ జబ్బుకు సరైన కారణం తెలియదు. క్రానిక్ ఇన్ఫెక్సియస్ మోనోన్యూక్లియోసిస్ అనే వైరల్ ఇన్ఫెక్షన్ కూడా క్రానిక్ ఫెటీగ్ సిండ్రోమ్‌కు కారణం కావచ్చు. మనం చేయాల్సింది ఇదే.. కోవిడ్–19 విజృంభిస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఒళ్లునొప్పులు రాగానే వెంటనే ఆసుపత్రులకు పరుగెత్తాల్సిన అవసరం లేదు. ముందుగా పారాసిటమాల్గానీ లేదా ఎలాంటి హానీ చేయని నొప్పి నివారణ మందులను డాక్టర్ సలహా మేరకు మాత్రమే ఒకటి రెండు రోజుల పాటు వాడాలి. అప్పటికీ తగ్గకపోతే అప్పుడు ఆసుపత్రికీ లేదా డయాగ్నస్టిక్ సెంటర్లకు వెళ్లి కోవిడ్–19 నిర్ధారణ పరీక్షలు చేయించాలి. ఒకవేళ అక్కడ కోవిడ్–19 లేదంటూ నెగెటివ్ వస్తే... కొంతకాలం ఆగి కొన్ని పరీక్షలు చేయించుకుని, నిర్దిష్టంగా ఏ కారణంగా ఒళ్లునొప్పులు వస్తున్నాయో తెలుసుకోవడం మంచిది. ఒకవేళ ఒంటినొప్పులు తాత్కాలికంగా ఉండి, ఆ తర్వాత తగ్గిపోతే వాటి గురించి పట్టించుకోవాల్సిన అవసరమే ఉండదు. నరాలు, కండరాలకు సంబంధించిన వ్యాధులతో మయస్థేనియా గ్రేవిస్, – ఫైబ్రోమయాల్జియా వ్యాధుల్లో ఒళ్లునొప్పులొస్తాయి. పైగా ‘మయో’ అనే పదం కండరాలకు సంబంధించింది. కాబట్టి కండరాల వ్యాధులైన ఈ జబ్బులు కనిపించప్పుడు కండరాల్లో నొప్పుల కారణంగా ఒళ్లునొప్పులు వ్యక్తం కావడం చాలా సాధారణం. - డాక్టర్ సుధీర్ దారా ఇంటర్వెన్షనల్ పెయిన్ స్పెషలిస్ట్ -
కరోనానా.. మామూలు జ్వరమా..?
గుంటూరు బ్రాడీపేటకు చెందిన ఓ వ్యక్తి జ్వరం, దగ్గుతో బాధపడ్డాడు.. అసలే ఇటీవలికాలంలో తప్పనిసరి పరిస్థితుల్లో కూరగాయలకు, సరుకుల కోసం నగరంలో తిరిగి ఉండడంతో తనకు కరోనా ఏమన్నా సోకిందా అన్న మీమాంసలో పడిపోయాడు. ఎంతకీ జ్వరం తగ్గకపోవడంతో ఎందుకయినా మంచిదని, ఇంట్లోనుంచి బయటకు రాకుండా మందులు వాడుతూ ఉండిపోయాడు. అతని ఆందోళనను గమనించిన స్నేహితుడు ఒకసారి కోవిడ్ నిర్ధారణ పరీక్ష చేయించుకోమని ఫోన్లో సలహా ఇచ్చాడు. వెంటనే పరీక్ష కేంద్రానికి వెళ్లి నిర్ధారణ పరీక్ష చేయించుకున్నాడు.. నెగెటివ్ అని తేలడంతో ఆందోళనతో పాటు జ్వరం కూడా తగ్గిపోయింది. విజయవాడకు చెందిన ఒక మహిళ తనకు గతకొన్ని రోజులుగా విపరీతమైన జ్వరం వస్తున్నా.. ఇరుగుపొరుగు వారికి భయపడి పరీక్షలు చేయించుకోలేదు. తెలిసిన మందులు వాడుతోంది. పక్కింటివారు ఆరోగ్య కార్యకర్తలకు సమాచారం ఇచ్చినా, నాకు మామూలు జ్వరమే అంటూ, వచ్చిన వారిని, పక్కింటివారిని గదమాయించింది. రెండు రోజులు గడిచాక ఒకరోజు రాత్రి ఆయాసం ఎక్కువై ఊపిరి తీసుకోలేని పరిస్థితిలో భర్త ఒక అంబులెన్స్‌లో కోవిడ్ ఆస్పత్రికి తరలించారు.. అక్కడ పరీక్షించిన వైద్యులు ఆమెకు కరోనా పాజిటివ్ అని తేల్చి, ఐసీయూలో ఉంచి, ఆక్సిజన్ పెట్టారు. పదిరోజులు అబ్జర్వేషన్లో ఉంచితే కానీ ఆమె మామూలు స్థితికి రాలేదు. ఆమె భర్త, పిల్లలు సైతం కోవిడ్ బారిన పడ్డారు. సాక్షి, గుంటూరు: ప్రపంప వ్యాప్తంగా కరోనా మహమ్మారి రోజు రోజుకు విజృంభిస్తోంది. కరోనా దెబ్బకు అన్ని దేశాల ప్రజలు అల్లాడిపోతున్నారు. గుంటూరు, కృష్ణా జిల్లాల్లో మార్చి నెల నుంచి కరోనా పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. ఏది కరోనా? ఏది సీజనల్ ? అనే విషయాన్ని తెలుసుకోలేక కొంత మంది ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. మరికొంత మంది సోషల్ మీడియాలో వస్తున్న కరోనా సమాచారం చదివి ముందస్తుగానే మాత్రలు తీసుకుంటూ... వ్యాధి నిరోధక శక్తి పెంచుకుంటున్నామని తమకు ఏమీ కాదనే నిర్లక్ష్య ధోరణితో ఉండి సకాలంలో వైద్యం చేయించుకోకుండా ప్రాణాలు కోల్పోతున్నారు. కరోనా కేసులు, సీజనల్ వ్యాధుల కేసులు రెండు కూడా నేడు నమోదు అవుతున్నా దష్ట్యా ప్రజలు వ్యాధులపై అవగాహన కల్గి ఉండి అప్రమత్తంగా ఉండాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. సీజనల్ వ్యాధుల కాలంతో తికమక... కరోనా కేసులు పెరిగిపోతూ ఉన్న సమయంలోనే మరోపక్క వర్షాకాలం కూడా ప్రారంభం అవ్వటంతో అక్కడక్కడ సీజనల్ వ్యాధులు సైతం వస్తున్నాయి. జనవరి నుంచి ఇప్పటి వరకు గుంటూరు జిల్లాలో 27 మలేరియా కేసులు, 57 డెంగీ కేసులు నమోదు అయ్యాయి. మరో నాలుగు నెలలపాటు సీజనల్ వ్యాధుల కేసులు నమోదు అయ్యే అవకాశాలు ఉన్నాయని వైద్య నిపుణులు తెలియజేస్తున్నారు. జ్వరం వచ్చినా, దగ్గినా, తుమ్మినా, జలుబు వచ్చినా కరోనా జ్వరమా లేక సీజనల్ జ్వరమా అనే అనుమానం ప్రజల్లో విస్తృతంగా తలెత్తుతోంది. ఏది కరోనా, ఏది సీజనల్ అనే విషయం తెలియక త్రీవంగా ఇబ్బంది పడుతున్నారు. చిన్నపాటి దగ్గు వచ్చినా గుండెల్లో దడ పుడుతుంది. జ్వరం వస్తే ముచ్చెమటలు పడుతున్నాయి. ఒంటి నొప్పులు, తలనొప్పి వస్తే భయం వెంటాడుతుంది. తీవ్ర జ్వరమైతే పరీక్ష తప్పనిసరి.. వానాకాలం కొనసాగుతూ ఉంది కాబట్టి దోమల బెడద కూడా ఉంటుంది. వర్షాలతోపాటే సీజనల్ వ్యాధులైన వైరల్ ఫీవర్, జలుబు, దగ్గు, డెంగీ, మలేరియా తదితర వ్యాధులు సహజంగానే వస్తాయి. కరోనా తీవ్రంగా విజృంభిస్తూ ఉండటంతోపాటుగా సీజనల్ వ్యాధులు కూడా వస్తూ ఉండటం రెండింటిలోనూ వ్యాధుల లక్షణాలు ఒకేలా ఉండటంతో జనం గజగజ వణికి పోతున్నారు. ఈ రెండింటిని వేరు చూసి చూడటం అంత సులువు కాదని వైద్యులు కూడా స్పష్టం చేస్తున్నారు. సీజనల్ వ్యాధులుగా భావించి నిర్లక్ష్యం చేస్తే ప్రమాదం ముంచుకొస్తుంది. అలాగని చిన్నపాటి జ్వరం, దగ్గును కరోనాగా భావించి ఆందోళనకు గురికావాల్సిన పనిలేదని జనరల్ మెడిసిన్ వైద్య విభాగాధిపతి, గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ కంచర్ల సుధాకర్ తెలిపారు. కొన్ని లక్షణాలతో కరోనానా? సీజనల్ వ్యాధా? అనే విషయం తెలుసుకోవచ్చని వెల్లడించారు. లక్షణాలు ఏవైనా కరోనా పాజిటివ్ వచ్చిన వ్యక్తిని కలిస్తే కరోనా వైరస్ సోకే అవకాశాలు ఎక్కువ. ఇలాంటి వారు పరీక్షలు చేయించకోవాలి. ఇళ్లలోనే ఉండే వాళ్లు తమకు ఉన్న లక్షణాలను క్షుణ్ణంగా పరీక్షించుకోవాలి. సీజనల్ లేదా సాధారణ జ్వరం, దగ్గు, జలుబు ఉంటే మూడు రోజుల్లో తగ్గుతుంది. అలా తగ్గకుంటే కరోనా పరీక్షలు చేయించుకోవాలి. గుండె, కిడ్నీ, క్యాన్సర్, హెచ్ఐవీ, బీపీ, షుగర్ తదితర దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు లక్షణాలు కనిపించిన వెంటనే పరీక్షలు చేయించుకోవాలి. ఆలస్యంగా ఆస్పత్రికి వస్తున్నారు... వ్యాధి లక్షణాలు గుర్తించిన వెంటనే ఆస్పత్రికి రావాలి. చాలా మంది అవగాహన లేక ఆలస్యంగా ఆస్పత్రులకు వెళ్తున్నారు. ఇళ్ల వద్దకు ఆశా వర్కర్లు, వలంటీర్లు వచ్చి అడిగినప్పుడు ఏ లక్షణాలు లేవని చెబుతున్నారు. చివరి నిమిషం వరకు ఇంట్లో ఉండి ఊపిరి ఆడని పరిస్థితిలో ఆస్పత్రికి వస్తున్నారు. అప్పటికే ఆక్సిజన్ తగ్గిపోవటంతో ఏమీ చేయలేని పరిస్థితి ఉంది. ప్రజలు కరోనాపై అవగాహన పెంచుకోవాలి. కరోనా ప్రారంభంలో జ్వరం, పొడిదగ్గు, గొంతునొప్పి, ఒళ్లు నొప్పులు, రుచి, వాసన తెలియకపోవటం, ముక్కు దిబ్బడ వంటి లక్షణాలు ఉంటాయి. నాలుగు, ఐదో రోజు నుంచి దగ్గు ఎక్కువై ఆయాసం వస్తే వెంటనే ఆస్పత్రికి రావాలి. – డాక్టర్ కంచర్ల సుధాకర్, గుంటూరు, ప్రభుత్వ సమగ్ర ఆస్పత్రి సూపరింటెండెంట్ -
ఏ జ్వరమైనా నిర్ధారణే ముఖ్యం
సాక్షి, అమరావతి: జ్వర లక్షణాలను బట్టి స్వీయ చికిత్సలు తీసుకోవడం ఏమాత్రం ఆచరణీయం కాదని వైద్యులు చెబుతున్నారు. వర్షాకాలం కాబట్టి మలేరియా, డెంగీ జ్వరాలొస్తుంటాయి. వీటి లక్షణాలను బట్టి మందులు వాడటం సరికాదని, ఏ జ్వరమైనా వైద్యుడిని సంప్రదించి నిర్ధారణ చేసుకోవడం ముఖ్యమంటున్నారు. కొన్నిసార్లు కరోనా వైరస్ వల్ల వచ్చే జ్వరం సైతం ఇలాంటి లక్షణాలనే పోలినప్పుడు ఆ మందులు వాడి వదిలేస్తే ప్రమాదమని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ► చలి జ్వరంతో కూడిన లక్షణాలుంటే మలేరియా అయ్యే అవకాశం ఉంది. ► ప్రాథమిక ఆరోగ్య కేంద్రం స్థాయిలోనే ర్యాపిడ్ డయాగ్నిస్టిక్ టెస్ట్ కిట్ ద్వారా నిర్ధారించుకోవచ్చు. ► డెంగీ వస్తే.. తీవ్ర జ్వరంతో పాటు కళ్ల వెనుక నొప్పి, శరీరంపై దద్దుర్లు వస్తాయి.ప్రాథమిక ఆరోగ్యకేంద్రం స్థాయిలో ఐజీజీ, ఐజీఎం పరీక్ష నిర్వహిస్తారు. ► ఈ పరీక్షల్లో పాజిటివ్ వస్తే ఎలీశా టెస్ట్‌కు రిఫర్ చేస్తారు. ఈ పరీక్షలు పెద్దాస్పత్రుల్లోనే జరుగుతాయి. ► కరోనా వైరస్‌కు సంబంధించి దగ్గు, జలుబు, జ్వరం లక్షణాలుంటాయి. ► గొంతు లేదా ముక్కులోంచి తేమను తీసి పరీక్ష నిర్వహిస్తారు. ► మలేరియా, డెంగీ జ్వరాలొచ్చినప్పుడు కరోనా రాదన్న నిబంధనేదీ లేదు. -
జ్వరమా.. నో అడ్మిషన్!
సికింద్రాబాద్: ఏటా వర్షాకాలంలో ప్రజలు సీజనల్ జ్వరాల బారిన పడటం సాధారణమే అయినా ఈసారి కరోనా మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో హైదరాబాద్‌లోని చాలా ప్రైవేటు ఆస్పత్రులు సాధారణ జ్వరాలకు సైతం చికిత్స అందించేందుకు ససేమిరా అంటున్నాయి. మలేరియా వంటి జ్వరాల బారినపడి ఎవరైనా ఆస్పత్రులకు వెళ్తే నిర్దాక్షిణ్యంగా తిప్పి పంపేస్తున్నాయి. కరోనా లక్షణాలేమోనన్న అనుమానంతో బాధితులను అంటరాని వారిగా చూస్తున్నాయి. అడిగినంత ఫీజు చెల్లించేందుకు సిద్ధమని చెప్పినా పడకలు లేవని చెబుతూ చేర్చుకొనేందుకు నిరాకరిస్తున్నాయి. కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకొని రావాలని తెగేసి చెబుతున్నాయి. (మూడు నెలలు ముప్పుతిప్పలే!) 105 డిగ్రీల జ్వరం వచ్చినా... రామంతాపూర్‌కు చెందిన ఒక ప్రభుత్వ ఉద్యోగి భార్య జూన్ 28న తీవ్ర జ్వరం బారినపడటంతో ఆమెను సమీపంలోని ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే ఆమెను చేర్చుకోని వైద్యులు కేవలం మాత్రలు ఇచ్చి పంపారు. జ్వరం ఎక్కువ కావడంతో జూన్ 30న మళ్లీ అదే ఆస్పత్రికి వెళ్లగా బాధితురాలితోపాటు ఆమె భర్తను కనీసం ఆస్పత్రి లోనికి కూడా రానివ్వలేదు. 105 డిగ్రీల జ్వరంతో బాధపడుతున్న ఆమెను సికింద్రాబాద్‌లోని ఒక కార్పొరేట్ ఆస్పత్రికి తీసుకెళ్లగా అక్కడ బెడ్స్ లేవన్నారు. పరిస్థితి విషమంగా ఉందని ఆస్పత్రిలో కనబడిన వాళ్లను కాళ్లావేళ్లా బతిమిలాడినా ఫలితం కానరాలేదు. సికింద్రాబాద్‌లోని అన్ని ప్రైవేటు ఆస్పత్రులకెళ్లినా అదే పరిస్థితి. అక్కడి నుంచి జూబ్లీహిల్స్ వరకు కనబడిన ప్రతి ఆస్పత్రిలో సంప్రదించినా జ్వ రం అనగానే కరోనా పరీక్షలు చేయించుకోవాలని, తమ వద్ద బెడ్స్ లేవని ఎంట్రన్స్లోంచే తిప్పి పంపించారు. చివరకు ఫీవర్ ఆస్పత్రిలో... ఆస్పత్రుల్లో ప్రవేశం దొరక్కపోవడంతో తెలిసిన ఒక మిత్రుడి సూచ నతో నల్లకుంటలోని ఫీవర్ ఆస్పత్రికి జూన్ 30 అర్ధరాత్రి దాటాక వెళ్లగా వైద్యులు తొలుత రెండు మాత్రలు ఇచ్చి అప్పటికప్పుడు వేసుకోమన్నారు. కొంత ఉపశమనం ఉందని బాధితురాలు చెప్పడంతో కొద్ది గంటల్లో జ్వరం పూర్తిగా తగ్గుతుందని చెప్పి మూడు రోజులకు సరిపడా ఉచితంగా మందులు ఇచ్చి డిశ్చార్జి చేశారు. 3 రోజుల్లో జ్వరం తగ్గకపోతే 3 రోజులు ఐసోలేషన్‌లో ఉండేందుకు సిద్ధమై రావాలని, అప్పుడు కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తామని చెప్పారు. తెల్లవారిన తరువాత ఇంటికి వెళ్లిన ఆ మహిళ మరుసటి రోజే పూర్తిగా కోలుకుంది. (కరోనా కేళి.. జేబులు ఖాళీ!) హైదరాబాద్ వ్యాప్తంగా ఇవే పరిస్థితులు... ఇటువంటి పరిస్థితి రామంతాపూర్‌కు చెందిన మహిళకే కాదు... నగరంలో నిత్యం ఎంతో మంది ఎదుర్కొంటున్నారు. జ్వరం వస్తే కనీస చికిత్సలు చేయకుండా ఎక్కువ సంఖ్యలోని వైద్యులు నేరుగా కరోనా పరీక్షలు చేయించుకోవాలని సూచిస్తూ చేతులు దులుపుకుంటున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో జ్వరం తీవ్రత పెరగడం, బాధితులు ఆందోళనకు గురవుతుండటంతో వారి ప్రాణాలకు ముప్పు వాటిల్లే పరిస్థితులు తలెత్తుతున్నాయి. మరోవైపు కరోనా టెస్టులకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతించిన ఆస్పత్రుల్లో విపరీతమైన రద్దీ ఉంటుండటం, చిన్న ప్రైవేటు ఆస్పత్రులు కరోనా పరీక్షలు చేసేందుకు ప్రభుత్వం అనుమతించకపోవడం కూడా ఈ పరిస్థితికి కారణమవుతోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ఈ పరిస్థితిని అధిగమించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని బాధితులు కోరుతున్నారు. -
కరోనా.. సీజనల్ ఫీవర్స్.. సింప్టమ్స్ సేమ్!
సాక్షి, సిటీబ్యూరో: ఇప్పటికే రోజురోజుకూ విస్తరిస్తున్న కరోనా వైరస్‌తో గ్రేటర్ గజగజ వణుకుతోంది. మరోవైపు మాన్సూన్ సీజన్ ప్రారంభమైంది. రెండ్రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. కోవిడ్ మహమ్మారి భయంతో మూడు నెలలుగా బిక్కుబిక్కుమంటూ గడుపుతున్న సిటీజన్లకు సీజనల్ జ్వరాలు మరింత ఆందోళనకు గురి చేస్తున్నాయి. కరోనా బాధితుల్లోనూ, సీజనల్ వ్యాధుల బారిన పడిన వారిలోనూ కామన్ సిమ్టమ్ జ్వరమే. ప్రస్తుతæ పరిస్థితుల్లో ఎవరికి.. ఏ జ్వరం ఉందో? గుర్తించడం కష్టమని వైద్యనిపుణులు అభిప్రాయపడుతున్నారు. అసలు సవాలు ఇప్పుడే.. ప్రస్తుతం సీజన్ మారింది. మాన్సూన్ ప్రారంభమైంది. నైరుతి పవనాల ఆగమనంతో వర్షాలు ప్రారంభమయ్యాయి. బస్తీల్లో పారిశుద్ధ్య లోపానికి తోడు ఇళ్ల మధ్య వర్షపు నీరు నిల్వ ఉండటంతో డెంగీ, మలేరియా దోమలు విజృంభించే ప్రమాదం ఉంది. ఇప్పటికే కరోనాతో కంటిమీద కునుకు లేకుండా గడుపుతున్న సిటిజన్లను.. ఇకపై వెలుగు చూసే సీజనల్ జ్వరాలు మరింత ఆందోళనకు గురి చేయనున్నాయి. ఒకవైపు నగరంలో రోజుకు సగటున 150 కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. రాబోయే రోజుల్లో వైరస్ మరింత వేగంగా ఒకరి నుంచి మరొకరికి విస్తరించే ప్రమాదం లేకపోలేదని వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు. జులై చివరి నాటికి 60 శాతం మంది వైరస్‌కు ఇన్ఫెక్ట్ అవనున్నట్లు స్వయంగా వైద్య ఆరోగ్యశాఖ అధికారులే స్పష్టం చేస్తుండటం మరింత ఆందోళనకు గురి చేస్తుంది. ఇటు సిటిజన్లకు.. అటు వైద్య ఆరోగ్యశాఖకు అసలైన సవాలు ఇప్పుడే మొదలైందని, ప్రస్తుత పరిస్థితుల్లో ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా.. భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. కరోనా వైరస్ భారిన పడకుండా ఉండాలంటే: డాక్టర్ శ్రీహర్ష, సర్వేలెన్స్ ఆఫీసర్, హైదరాబాద్ జిల్లా ♦ వృద్ధులు, పదేళ్లలోపు పిల్లలు, మధుమేహులు, హైపర్‌టెన్షన్ బాధితులు, హృద్రోగులు, కిడ్నీ, లివర్ ఫెయిల్యూర్ బాధితులతో పాటు ఇతర దీర్ఘకాలిక జబ్బులతో బాధపడుతున్నవారు సాధ్యమైనంత వరకు ఇంటి నుంచి బయటికి వెళ్లకపోవడమే ఉత్తమం ♦ మార్కెట్లు, ప్రధాన రహదారులు, ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు వైరస్‌కు హాట్స్పాట్లుగా మారాయి. పని ప్రదేశాల్లో మనిషికి మనిషి ఆరడుగుల దూరం పాటించడం, ముఖానికి మాస్క్‌లు ధరించడం, చేతులకు గ్లౌజులు వేసుకోవడం, ఏదైనా వస్తువును ముట్టుకున్న వెంటనే సబ్బు లేదా శానిటైజర్లతో చేతులను శుభ్రం చేసుకోవడం ద్వారా వైరస్ బారిన పడకుండా కాపాడుకోవచ్చు ♦ చెప్పులను ఇంటి బయటే వదిలేయడం, బయటకు వెళ్లి వచ్చిన ప్రతిసారీ సబ్బుతో స్నానం చేయడం, దుస్తులను వేడినీళ్లలో ఉతకాలి ♦ కరోనా వైరస్‌కు ఇప్పటి వరకు వాక్సిన్ లేదు. ప్రత్యేక మందులు అంటూ ఏమీ లేవు. వేళకు మంచి పౌష్టికాహారం తీసుకోవడం పాటు సి–విటమిన్ అధికంగా ఉండే తాజా పండ్లను ఎక్కువగా తీసుకోవాలి ♦ జలుబు, దగ్గు, జ్వరం వంటి లక్షణాలు కన్పిస్తే వెంటనే సమీపంలోని ఆరోగ్య కేంద్రానికి వెళ్లి వైద్య పరీక్షలు చేయించుకోవాలి. సీజనల్ వ్యాధులు రాకుండా ఉండాలంటే: డాక్టర్ ఆఫ్తాబ్ అహ్మద్, ఫిజీషియన్, అపోలో ఆస్పత్రి ♦ బస్తీల్లో పారిశుద్ధ్య లోపానికి తోడు ఇళ్ల మధ్య మురుగు నీరు నిల్వ ఉండటంతో ఈగలు, దోమలు వ్యాపిస్తాయి. ఆహారం, నీరు కలుషితమై వాంతులు, విరేచనాలు, టైఫాయిడ్ జ్వరాల బారిన పడుతుంటారు. ఇదే సమయంలో డెంగీ, చికెన్‌గున్యా, మలేరియా, స్వైన్‌ఫ్లూ వంటి జ్వరాలు కూడా విజృంభించే ప్రమాదం ఉంది ♦ ఒకవైపు టైఫాయిడ్, డెంగీ, మలేరియా, స్వైన్Œఫ్లూ వంటి సీజనల్ జ్వరాలు.. మరోవైపు కరోనా వైరస్ జ్వరాలు నమోదవుతుంటాయి. వీటిలో ఏది ఏ జ్వరమో? గుర్తించడం వైద్యులకు కష్టమవుతుంది ♦ వాటర్ ట్యాంకులపై మూతలు ఉండేలా చూడటం, పూలకుండీల్లో నిల్వ ఉన్న నీటిని తొలగించడం, ఇంటి పరిసరాలను ఎప్పటికప్పుడు శుభ్రం చేయడం ద్వారా దోమలు విస్తరించకుండా చూడొచ్చు ♦ కిటికీలు, తలుపులకు మెష్లను వాడటం, దోమ తెరలు, మస్కిటో కాయిల్స్, రిపెల్లెట్లను వాడటం ద్వారా డెంగీ, మలేరియా జ్వరాల బారిన పడకుండా జాగ్రత్త పడొచ్చు ♦ పిల్లలకు ఫుల్ షర్ట్లు, ప్యాంట్లు వాడటం ద్వారా దోమలు కుట్టకుండా చూడవచ్చు కాచి వడపోసిన నీళ్లను తాగడం, తాజా పదార్థాలతో తయారు చేసిన వేడివేడి ఆహారాన్ని తీసుకోవడం వల్ల వాంతులు, విరేచనాలు, టైఫాయిడ్ వంటి జబ్బుల బారిన పడకుండా చూసుకోవచ్చు ♦ ఇప్పటికే ఆస్తమా, సైనసైటిస్ వంటి సమస్యలతో బాధపడుతున్న వారు మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. -
చిన్నారి ప్రాణం విలువ రూ.60వేలు?
మహబూబ్‌నగర్, నారాయణపేట: జ్వరం భారిన పడి వైద్యం కోసం వస్త వైద్యుడి నిర్లక్ష్యంతో చిన్నారి ప్రాణం పోయిందంటూ కుటుంబసభ్యులు ఆందోళనకు దిగగా.. రూ.60వేలు అందిస్తామని ఆస్పత్రి వర్గాలు చెప్పినట్లు సమాచారం. ఈ ఘటన పట్టణంలో బుధవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కర్ణాటకలోని ఆన్పూర్కు చెందిన సాబెన్న మూడేళ్ల కుమార్తె భూమిక మంగళవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో జ్వరం, విరేచనాలతో బాధపడుతూ చికిత్స నిమిత్తం పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలోని ఓ చిన్నపిల్లల ఆస్పత్రిలో చేర్పించారు. బుధవారం తెల్లవారు జామున 3 గంటల వరకు బాగానే ఉంది. ఉన్నట్లుండి ఆ చిన్నారి కదలకపోవడంతో వైద్య సిబ్బందిని సంప్రదించారు. వారు వెంటనే వైద్యుడికి సమాచారం ఇవ్వగా, ఆయన వచ్చి పరీక్షించి బాలిక పరిస్థితిని గమనించి హైదరాబాద్‌లోని నిలోఫర్ ఆస్పత్రికి తీసుకెళ్లాలిన సూచించారు. 4 నుంచి 5 గంటల మధ్యలో అంబులెన్స్‌లో హైదరాబాద్ బయల్దేరారు. అయితే కొంత దూరం వెళ్లాక మార్గమధ్యలోనే చిన్నారి మృతిచెందింది. దీంతో వెనుదిరిగి ఆస్పత్రికి చేరుకున్నారు. ప్రాణం ఖరీదు రూ. 60 వేలు?! వైద్యుడి నిర్లక్ష్యంతోనే తమ పాప ప్రాణాలు కోల్పోయిందంటూ తల్లిదండ్రులు, కుటుంబీకులు రెండుగంటల పాటు వైద్యుడితో వాదనకు దిగారు. వారి మధ్య మాటామాటా పెరిగి పరిస్థితి చేయిదాటే సమయంలో అధికార పార్టీకి చెందిన ఇద్దరు నాయకులు ఇరువురిని సముదాయించారు. ఆటు వైద్యుడితో.. ఇటు చిన్నారి తండ్రితో పాటు బంధువులను కూర్చోబెట్టి శాంతింపజేశారు. వైద్యుడి అందించిన చికిత్సలపై వారు అడిగి తెలుసుకున్నారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని బంధువులు పట్టుబట్టారు. అయితే, తనవల్ల ఎలాంటి నిర్లక్ష్యం జరగలేదని, మీరు పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి కేసుపెట్టుకోవచ్చని, ఏదైనా ఉంటే పోస్టుమార్టం రిపోర్టులు తెలుస్తుందని వైద్యుడు చెప్పడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. అక్కడే ఉన్న పోలీసులు కలుగజేసుకొని ఆందోళన చేస్తున్నవారిని సముదాయించి తండ్రి హన్మంతుతో పాటు మరో వ్యక్తిని వైద్యుడి వద్దకు పంపించారు. చివరకు వైద్యుడు రూ.60 వేలు చెల్లిస్తానని ఒప్పుకోవడంతో మా పాప ప్రాణామే పొయింది.. నా బిడ్డ ప్రాణం ఖరీదు రూ.60వేలా అంటూ తండ్రి ఆవేదన వ్యక్తం చేస్తూ వెళ్లారు. కుటుంబసభ్యులు, బంధువులు చిన్నారి మృతదేహాన్ని తీసుకొని కర్ణాటకలోని అన్పూర్కు వెనుదిరిగి వెళ్లిపోయారు. మా నిర్లక్ష్యం ఏమీ లేదు చిన్నారి మృతి చెందడంలో తమ ఆస్పత్రి నిర్లక్ష్యం ఏమీ లేదు. రాత్రి చిన్నారి ఆరోగ్య పరిస్థితిని పరీక్షించగా బాగానే ఉంది. తెల్లవారుజామున కదలడంలేదని చెప్పడంతో ఆస్పత్రిలో వెంటిలేటర్ సదుపాయం లేకపోవడంతో వెంటనే హైదరాబాద్‌కు తీసుకెళ్లాలని సూచించా. మధ్యలోనే మృతిచెందడంతో ఆస్పత్రికి వచ్చి ఆందోళన చేశారు. తమ తప్పులేదని చెప్పాం. అయినా న్యాయం చేయాలని కోరారు. అడ్మిట్, అంబులెన్స్ ఖర్చులు ఇచ్చేందుకు మాత్రమే ఒప్పుకున్నాం. – డాక్టర్ రంజిత్‌కుమార్,చిన్నపిల్లల వైద్యుడు, నారాయణపేట ఆందోళన...వైద్యుడితో వాదన ఉదయం 6గంటలకు చిన్నారి మృతదేహంతో సదరు ఆస్పత్రికి చేరుకున్న కుటుంబసభ్యులు, బంధువులు ఆందోళనకు దిగారు. వైద్యుడి నిర్లక్ష్యంతోనే తమ పాప ప్రాణం పోయిందంటూ వైద్యుడితో వాదనకు దిగారు. సమాచారం అందుకున్న పోలీసులు ఆస్పత్రికి చేరుకొని ఆందోళనకు దిగిన వారిని శాంతిపజేశారు. -
102 డిగ్రీల జ్వరాంతో 103 పరుగులు
టెస్టు క్రికెటర్‌గా, దిగ్గజ ఆటగాడిగా శిఖరాన నిలిచిన సునీల్ గావస్కర్ వన్డే కెరీర్ గణాంకాలు అంతంత మాత్రమే. 1983 వరల్డ్ కప్ విజేత జట్టులో సభ్యుడిగా నిలిచినా... రెండేళ్ల తర్వాత దాదాపు అదే స్థాయి టోర్నీ వరల్డ్ చాంపియన్‌షిప్‌లో కెప్టెన్‌గా జట్టును విజయపథంలో నిలిపినా ఒక బ్యాట్స్‌మన్‌గా గుర్తుంచుకునే ఇన్నింగ్స్ ఏవీ అతని బ్యాట్ నుంచి రాలేదు. నాటి ప్రమాణాల ప్రకారం చూసినా గావస్కర్ ప్రదర్శన అతి సాధారణం. అయితే చివరకు తన ఆఖరి టోర్నీలో మాత్రం అతను ఒక అద్భుతమైన శతకంతో అభిమానులను అలరించాడు. 102 డిగ్రీల జ్వరంతో బాధపడుతూ 1987 ప్రపంచకప్‌లో న్యూజిలాండ్‌పై సన్నీ చేసిన సెంచరీ ఎప్పటికీ మరచిపోలేనిది. సునీల్ గావస్కర్ ముందే ప్రకటించినట్లు 1987 రిలయన్స్ వరల్డ్‌కప్ అతని చివరి వన్డే టోర్నీ. ఆ తర్వాత గుడ్‌బై చెప్పేందుకు సన్నీ సిద్ధమైపోయాడు. టెస్టులతో పోలిస్తే గావస్కర్ వన్డే రికార్డు గొప్పది కాదు. పైగా 1975 ప్రపంచకప్‌లో ఏకంగా 174 బంతులు ఆడి 36 పరుగులతో నాటౌట్‌గా నిలిచిన చెత్త ఘనత కూడా అతని పేరిటే ఉంది. కెరీర్ చివరిదశలో కూడా మరో దూకుడైన ఓపెనర్ కృష్ణమాచారి శ్రీకాంత్‌కు సహకారం అందించే రెండో ఓపెనర్ పాత్రలోనే అతడిని అంతా చూస్తున్నారు. కానీ న్యూజిలాండ్‌పై గావస్కర్ తన శైలికి భిన్నంగా ఆడి ఒక్కసారిగా అందరినీ ఆశ్చర్యపరిచాడు. తప్పనిసరి పరిస్థితుల్లో... వరల్డ్‌కప్‌లో న్యూజిలాండ్‌తో నాగపూర్‌లో చివరి లీగ్ మ్యాచ్ జరగాల్సి ఉంది. అప్పటి వరకు 106 వన్డేలు ఆడిన గావస్కర్ ఖాతాలో ఒక్క సెంచరీ కూడా లేదు. 27 హాఫ్ సెంచరీలు సాధించినా అందులో పేరు చెప్పగానే గుర్తుకొచ్చేవి కూడా ఏమీ లేవు. మ్యాచ్‌కు ముందు సన్నీ బాగా జ్వరంతో బాధపడుతున్నాడు. తాను ఆడలేనంటూ ముందే తప్పుకునే ప్రయత్నం చేశాడు. అయితే చీఫ్ సెలక్టర్ బాపు నాదకర్ణి ఒత్తిడితో బరిలోకి దిగాడు. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్ 50 ఓవర్లలో 9 వికెట్లకు 221 పరుగులు చేయగలిగింది. మామూలుగానైతే ఇది సునాయాస లక్ష్యమే. పైగా భారత్ అప్పటికే సెమీఫైనల్లోకి ప్రవేశించింది కాబట్టి ఒత్తిడి కూడా లేదు. కానీ ఇక్కడే అసలైన ట్విస్ట్ వచ్చింది. దూకుడైన బ్యాటింగ్‌తో... రన్‌రేట్‌తో నిమిత్తం లేకుండా మ్యాచ్‌ను గెలిస్తే భారత్ సెమీస్ ప్రత్యర్థి పాకిస్తాన్ అవుతుంది. అదీ పాక్‌కు వెళ్లి ఆడాలి. ముంబైలో ఇంగ్లండ్‌తో తలపడాలని కపిల్‌దేవ్ బృందం భావిస్తోంది. అలా జరగాలంటే కివీస్ విధించిన 222 పరుగుల లక్ష్యాన్ని 42.2 ఓవర్లలో అందుకోవాలి. అప్పటి లెక్కల ప్రకారం 5.25 రన్‌రేట్‌తో పరుగులు చేయడం అంత సులువు కాదు. పైగా ఓపెనర్‌గా గావస్కర్ సంగతి అందరికీ తెలుసు. జింబాబ్వేతో జరిగిన అంతకుముందు మ్యాచ్‌లో సన్నీ 50 పరుగులు చేసేందుకు ఏకంగా 114 బంతులు తీసుకున్నాడు. కాబట్టి ఈసారి పెద్దగా ఆశలు లేవు. అయితే ఇప్పుడు అలా జరగలేదు. గావస్కర్ తన సహచరుడు శ్రీకాంత్‌తో పోటీ పడి వేగంగా పరుగులు సాధించాడు. భారత అభిమానులంతా ఆశ్చర్యపోయేలా అద్భుతమైన షాట్లతో విరుచుకు పడ్డాడు. చాట్‌ఫీల్డ్ వేసిన ఓవర్లలో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో అతను 20 పరుగులు రాబట్టడం విశేషం. 58 బంతుల్లో 75 పరుగులు చేసిన శ్రీకాంత్ ఎట్టకేలకు వెనుదిరిగే సమయానికి భారత్ 136 పరుగులు చేసింది. ఆ తర్వాత గావస్కర్ జోరు ఆగలేదు. అజహర్ (41 నాటౌట్) ఆటతో మరింతగా తన ధాటిని ప్రదర్శించాడు. ఈ క్రమంలో తన అత్యధిక స్కోరు 92ను అధిగమించాడు. ఎట్టకేలకు మోరిసిన్ బౌలింగ్‌లో మిడాన్ దిశగా సింగిల్ తీయడంతో 85 బంతుల్లో అతని సెంచరీ పూర్తయింది. అప్పట్లో ప్రపంచకప్‌లో ఇది రెండో వేగవంతమైన సెంచరీ కావడం విశేషం. రెండో వికెట్‌కు సన్నీ, అజహర్ కలిసి అజేయంగా 88 పరుగులు జోడించారు. మొత్తంగా 6.96 రన్‌రేట్‌తో 32.1 ఓవర్లలోనే వికెట్ నష్టానికి 224 పరుగులు చేసి ఘనవిజయాన్నందుకుంది. గ్రూప్ టాపర్‌గా నిలిచి సెమీస్‌లో ఇంగ్లండ్‌తో పోరుకు సిద్ధమైంది. మరో ఐదు రోజుల తర్వాత తన సొంత మైదానం వాంఖడేలో ఇంగ్లండ్‌తో సెమీస్‌తో కేవలం 4 పరుగులే చేసిన గావస్కర్ ఆ మ్యాచ్‌తో రిటైర్ అయ్యాడు. అయితే అతని ఏకైక సెంచరీ మాత్రం అభిమానుల మదిలో పదిలంగా నిలిచిపోయింది. చేతన్ శర్మ హ్యాట్రిక్ కూడా... న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో భారత పేసర్ చేతన్ శర్మ తీసిన హ్యాట్రిక్ కూడా మ్యాచ్‌ను ఎప్పటికీ గుర్తుంచుకునేలా చేసింది. కెన్ రూథర్‌ఫోర్డ్, ఇయాన్ స్మిత్, చాట్‌ఫీల్డ్‌లను వరుస బంతుల్లో అవుట్ చేసి చేతన్ ప్రపంచకప్‌లో తొలి హ్యాట్రిక్ నమోదు చేశాడు. అంతేకాకుండా వన్డేల్లో హ్యాట్రిక్ సాధించిన తొలి భారతీయ బౌలర్‌గానూ గుర్తింపు పొందాడు. ఈ మూడు కూడా క్లీన్‌బౌల్డ్‌లే కావడం విశేషం. సన్నీ, చేతన్‌లు ఇద్దరికీ సంయుక్తంగా ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది. -
జలుబు, దగ్గు మాత్రలు కొనేవారి సమాచారం తీసుకోండి
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తోన్న నేపథ్యంలో జ్వరం, దగ్గు, జలుబు మందులు కొనుగోలు చేసిన వ్యక్తుల సమాచారాన్ని సేకరించాల్సిందిగా మందుల షాపులకు కొన్ని రాష్ట్రాలు ఆదేశాలు జారీచేశాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మహారాష్ట్ర, ఒరిస్సా, బీహార్‌లోని కొన్ని ప్రాంతాల్లోని మెడికల్ షాపులకు ఈ ఆదేశాలు జారీచేశారు. కోవిడ్ –19 లక్షణాలు ఉన్నప్పటికీ పరీక్షలు చేయించుకోకుండా, తాత్కాలిక ఉపశమనం పొందుతున్నారనే ఉద్దేశంతో ప్రభుత్వాలు ఈ నిర్ణయం తీసుకున్నాయి. కోవిడ్ లక్షణాలైన జ్వరం, దగ్గు, జలుబు మందులు కొనుగోలు చేసిన వ్యక్తుల ఫోన్ నంబర్, అడ్రస్‌లను తీసుకోవాలని ప్రభుత్వం సూచించింది. కరోనా లక్షణాలను దాచి ఉంచే అవకాశం ఇవ్వకుండా పై అధికారులకు ఈ సమాచారం చేరుస్తారనీ, ఇది కేవలం ముందు జాగ్రత్త చర్య మాత్రమేనని అధికారులు తెలిపారు. జలుబు, దగ్గు, జ్వరం లాంటి కరోనా లక్షణాలు కనిపించినప్పటికీ, ఎవరైనా ఏమైనా అనుకుంటారనే భయంతోనూ, సంశయంతోనూ కొందరు సొంత వైద్యం చేసుకుంటున్నారని తెలంగాణ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అరవింద్ కుమార్ తెలిపారు. -
నిమ్స్‌లో జగదీశ్ రెడ్డికి కేటీఆర్ పరామర్శ
సాక్షి, హైదరాబాద్ : నిమ్స్‌లో చికిత్స పొందుతున్న విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్ రెడ్డిని బుధవారం టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరామర్శించారు. హై ఫీవర్‌తో నిమ్స్‌లో చికిత్స పొందుతున్న మంత్రిని పరామర్శించిన కేటీఆర్... ఆయన ఆరోగ్యంపై ఆరా తీశారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. కేటీఆర్‌తో పాటు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ప్రభుత్వ విప్ బాల్క సుమన్‌తో పాటు పలువురు పార్టీ నేతలు జగదీశ్ రెడ్డిపి పరమర్శించారు. -
జ్వరం మింగిన మాత్రలు 93కోట్లు!
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో అన్ని ప్రభుత్వాస్పత్రుల్లో గత 8 నెలల్లో వివిధ రకాల జ్వరాల బాధితులు ఏకంగా 93 కోట్లకు పైగా పారాసెటిమాల్ మాత్రలను వినియోగించారని తేలింది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు మొదలుకుని బోధనాస్పత్రుల వరకూ మందుల వినియోగంలో పారాసెటిమాల్ మాత్రలే మొదటి స్థానంలో ఉన్నాయి. వీటి విలువ దాదాపు రూ.35 కోట్లని ఈ–ఔషధి గణాంకాలు చెబుతున్నాయి. ఇంకా కొన్ని చిన్న చిన్న ప్రభుత్వ ఆస్పత్రుల నుంచి ఈ–ఔషధి సాఫ్ట్‌వేర్‌కు వివరాలు అప్లోడ్ కాలేదని, అవి కూడా అందితే పారాసెటిమాల్ మాత్రల వినియోగం సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికార వర్గాలు తెలిపాయి. పెయిన్ ‘కిల్లర్స్’ నొప్పి నివారిణి (పెయిన్ కిల్లర్) మాత్రలు తరచూ వాడితే పెను ప్రమాదం ఉంటుందని వైద్యులు హెచ్చరిస్తున్నా చాలామంది రోగులు పెడచెవిన పెడుతున్నారు. గత 8 నెలల్లో.. 76.26 కోట్ల డైక్లోఫినాక్ 50ఎంజీ మాత్రలను రోగులు వాడారు. మాత్రల వినియోగంలో పారాసెటిమాల్ తర్వాత వీటిది రెండో స్థానం. నెలకు సగటున 9.53 కోట్ల డైక్లోఫినాక్ 50ఎంజీ మాత్రలు వాడుతున్నారని వెల్లడైంది. చిన్న చిన్న నొప్పులకు కూడా ఎక్కువ మంది రోగులు పెయిన్‌కిల్లర్స్ వాడుతున్నారని వైద్య నిపుణులు చెబుతున్నారు. మధుమేహం మాత్రల సంఖ్య 60.38 కోట్లు రాష్ట్రంలో అత్యధికంగా వినియోగించే మందుల్లో రక్తపోటు (బీపీ) మందులు కూడా ఉంటున్నాయి. అస్తవ్యస్త జీవనశైలిలో భాగంగా రక్తపోటు (బీపీ) పెరుగుతున్న నేపథ్యంలో మందుల వాడకం ఎక్కువవుతోంది. గత 8 నెలల్లో 40.28 కోట్ల అటెన్‌లాల్ 50 ఎంజీ మాత్రలను బీపీ వ్యాధిగ్రస్తులు వాడారు. అదేవిధంగా మధుమేహం (షుగర్)తో బాధపడుతున్నవారు 60.38 కోట్ల మెట్ఫార్మిన్ 500 ఎంజీ మాత్రలను వినియోగించారు. -
జ్వరం మింగిన మాత్రలు ఏడున్నర కోట్లు
సాక్షి, హైదరాబాద్: డెంగీ, చికున్ గున్యా, ఇతర విష జ్వరాల దెబ్బకు ఆసుపత్రుల్లో మందులు అవసరానికి మించి వినియోగమయ్యాయి. కీలకమైన మూడు నెలల కాలంలో రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగులు ఏకంగా ఏడున్నర కోట్ల జ్వరం మాత్రలు వాడేశారు. సాధారణంగా ఈ కాలంలో రెండున్నర కోట్లు అవసరం కాగా, ఈసారి అదనంగా ఐదు కోట్లు వినియోగించారని తెలంగాణ వైద్య సేవలు మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ (టీఎస్ఎంఎస్ఐడీసీ) వర్గాలు వెల్లడించాయి. అవన్నీ కూడా పారాసిటమాల్, డోలో వంటి మాత్రలే కావడం గమనార్హం. వాటితోపాటు జ్వరాన్ని తగ్గించే యాంటి పైరేటిక్స్, యాంటి బయాటిక్స్, ఐవీ ఫ్లూయిడ్స్‌నూ పెద్ద ఎత్తున కొనుగోలు చేశారు. డెంగీ నిర్దారణ కిట్లు కూడా దాదాపు మూడు రెట్ల మేరకు పెరిగినట్లు అంచనా వేశామని వారు చెబుతున్నారు. ఓఆర్ఎస్ ప్యాకెట్లు వంటివి కూడా అదేస్థాయిలో వినియోగమయ్యాయి. ప్రధానంగా ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో డెంగీ, సీజనల్ జ్వరాలు విజృంభించిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ వర్గాల అంచనా ప్రకారమే రాష్ట్రంలో 10 వేల మందికి డెంగీ సోకినట్లు నిర్ధారణ జరిగింది. దేశంలో అత్యధికంగా డెంగీ కేసులు నమోదైన రాష్ట్రాల్లో తెలంగాణ రెండో స్థానంలో నిలిచిందంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. సర్కారు లెక్కలకు రెండింతలు పైగా డెంగీ కేసులు నమోదైనట్లు వైద్య నిపుణులు చెబుతున్నారు. మూడు నెలలకే ఖతం... రాష్ట్రంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, సామాజిక ఆరోగ్య కేంద్రాలు, ఏరియా ఆసుపత్రులు, జిల్లా ఆసుపత్రులు, బోధనాసుపత్రులన్నీ కలిపి 1,056 ఉన్నాయి. ఈ ఏడాది ఆయా ఆసుపత్రులకు అవసరమైన మందులు కొనుగోలు చేయడానికి రూ.226 కోట్లు ప్రభుత్వం బడ్జెట్లో కేటాయించింది. ఆ నిధులతో టీఎస్ఎంఎస్ఐడీసీ మందులు కొనుగోలు చేసి పంపిస్తుంది. ఇవి కాకుండా కొన్ని సందర్భాల్లో ఆసుపత్రుల సూపరింటెండెంట్లు అత్యవసరమైనప్పుడు కొనుగోలు చేసుకోవచ్చు. ఇందుకోసం టీఎస్ఎంఎస్ఐడీసీకి ఇచ్చిన బడ్జెట్లో 20 శాతం ఆసుపత్రులకు కేటాయిస్తారు. జ్వరాల తీవ్రత పెరగడంతో ఆసుపత్రులకు కేటాయించిన ప్రత్యేక నిధులను కూడా వాటికే వినియోగించారు. 200 ఆసుపత్రుల పరిధిలో ఏడాదికి మందుల కొనుగోలుకు కేటాయించిన సొమ్ము మూడు నెలలకే ఖర్చు చేయడం గమనార్హం. ఈ నేపథ్యంలో ఈ ఆసుపత్రులకు మిగిలిన ఆర్థిక సంవత్సరానికి అవసరమైన మందులను పూర్తిస్థాయిలో కొనుగోలు చేసేందుకు టీఎస్ఎంఎస్ఐడీసీకి నిధుల సమస్య ఏర్పడింది. పెద్ద ఎత్తున జ్వరం మాత్రలు కొనుగోలు చేశాం సీజన్ మూడు నెలల కాలంలో పెద్ద ఎత్తున జ్వరాలు విజృంభించిన సంగతి అందరికీ తెలిసిందే. దీంతో జ్వరానికి సంబంధించిన మందుల వినియోగం భారీగా పెరిగింది. గతేడాది కంటే ఈసారి జ్వరం మాత్రల వినియోగం రెండింతలు అదనంగా పెరిగిందని తేలింది. డెంగీ కిట్లు కూడా భారీగానే వినియోగించాం. ఏడాది బడ్జెట్‌కు అదనంగా మరో రూ.50 కోట్లు కేటాయించాలని ప్రభుత్వానికి ప్రతిపాదించాం. – చంద్రశేఖర్‌రెడ్డి, ఎండీ, టీఎస్ఎంఎస్ఐడీసీ -
జ్వరంతో జడ్జి మృతి
సాక్షి, ఖమ్మం : ఖమ్మం రెండో అదనపు ప్రథమశ్రేణి న్యాయమూర్తి పి.జయమ్మ (45) జ్వరంతో మృతి చెందారు. కొన్ని రోజులుగా ఆమె తీవ్ర జ్వరంతో బాధపడుతున్నారు. హైదరాబాద్‌లోని కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆమె పరిస్థితి విషమించి సోమవారం తెల్లవారుజామున 2 గంటలకు మరణించారు. జయమ్మకు భర్త, ఇద్దరు కుమారులున్నారు. మహబూబ్‌నగర్ జిల్లా హన్వాడ మండలం అయోధ్యనగర్ గ్రామానికి చెందిన జయమ్మ 2013లో జడ్జిగా ఎంపికయ్యారు. హైకోర్టు విభజనలో భాగంగా గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో ప్రిన్సిపల్ జూనియర్ సివిల్‌జడ్జిగా పనిచేసిన ఆమె జనవరి 7, 2019న ఖమ్మం రెండో అదనపు ప్రథమశ్రేణి కోర్టు న్యామూర్తిగా బాధ్యతలు స్వీకరించారు. ఆమె వృత్తిలో అనతికాలంలోనే న్యాయవాదులు, కక్షిదారుల మన్ననలు పొందారు. ఆమె పెద్ద కుమారుడు రోహిత్ డాక్టర్ కాగా.. చిన్న కుమారుడు విజయవాడలో ఎంబీబీఎస్ చదువుతున్నాడు. భర్త వెంకటేశ్వరబాబు డాక్టర్‌గా పనిచేస్తున్నారు. ఖమ్మం బార్ అసోసియేషన్ అధ్యక్షుడు గుడిపూడి తాజుద్దీన్‌బాబా ఆధ్వర్యంలో సోమవారం అత్యవసర సమావేశం నిర్వహించి న్యాయమూర్తి మృతికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. న్యాయమూర్తి మృతికి సంతాప సూచకంగా రెండు నిమిషాలు మౌనం పాటించారు. న్యాయమూర్తి మృతికి ఐలు జిల్లా కమిటీ తీవ్ర సంతాపాన్ని తెలిపింది. సీనియర్, జూనియర్ న్యాయవాదులు, కార్యవర్గం, మహిళా న్యాయవాదులు, కోర్టు గుమస్తాలు తీవ్ర సంతాపం తెలిపారు. న్యాయమూర్తి మృతికి ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఖమ్మం, కొత్తగూడెం, భద్రాచలం, సత్తుపల్లి, ఇల్లెందు, మధిర, మణుగూర్ బార్ అసోసియేషన్లు తీవ్ర విచారాన్ని, సంతాపాన్ని తెలిపాయి. అఖిల భారత న్యాయవాదుల సంఘం (ఐలు) తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, తెలంగాణ బార్ సంఘం సభ్యులు కొల్లి సత్యనారాయణ తదితరులు సంతాపం తెలిపారు. -
సాధారణ జ్వరానికీ డెంగీ పరీక్షలు
జ్వరం వస్తే మందు బిళ్ల వేసుకునేవాళ్లం.. జ్వరం తీవ్రత ఎక్కువగా ఉంటే ఇంజక్షన్ వేసుకుంటే రెండు, మూడు రోజుల్లో నయం అయ్యేది.అయితే ప్రస్తుత పరిస్థితుల్లో జ్వరం కూడా ఖరీదైన వ్యాధిగా మారింది. కొందరు ప్రైవేట్ వైద్యులు, ల్యాబ్‌ల నిర్వాహకుల పుణ్యమా అని జ్వరం పేరు చెబితే భయపడే రోజులు వచ్చాయి. కొన్ని రోజుల నుంచి జిల్లాలో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. ఈ కారణంగా గ్రామాలు, పట్టణాల్లో పిల్లలు మొదలు కొని వృద్ధుల వరకు జ్వరాలతో బాధ పడేవారి సంఖ్య ఎక్కువగా ఉంది. ఇదే అదునుగా భావించి కొన్ని ప్రైవేట్ ఆస్పత్రులు, ల్యాబ్‌లు దోచుకునే పనిలో పడ్డాయి. ప్రొద్దుటూరు క్రైం : టైఫాయిడ్, మలేరియా, సాధారణ జ్వరం వచ్చినప్పుడు ఎవరికైనా నీరసంగా ఉంటుంది. ఈ కారణంగా ప్లేట్లెట్ కౌంట్స్ తగ్గుతాయి. అయితే జ్వరంతో ఆస్పత్రికి వెళ్లిన ప్రతి కేసుకు ప్రైవేట్ ఆస్పత్రులు, అనుబంధ ల్యాబ్ నిర్వాహకులు డెంగీ పరీక్షలు నిర్వహిస్తున్నారు. రక్తకణాలు తగ్గాయని వారిని భయపెడుతూ ఆస్పత్రిలో అడ్మిట్ చేసుకుంటున్నారు. రోజుకు రెండు సార్లు రక్తపరీక్షలు చేస్తూ రోగిని పిప్పి చేస్తున్నారు. ల్యాబ్ పరీక్షలు నిర్వహించే క్రమంలో రోగులకు డెంగీ పాజిటివ్ వచ్చినట్లు చూపుతుండటంతో రోగి, కుటుంబ సభ్యులు బెంబేలెత్తిపోతున్నారు. ఫలితంగా నాలుగైదు రోజులకే సుమారు రూ. 40–50 వేలు దాకా ఆస్పత్రి బిల్లు వేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ఇదే తంతు నడుస్తున్నట్లు తెలుస్తోంది. పుట్టగొడుగుల్లా ల్యాబ్‌లు జిల్లా వ్యాప్తంగా అనుమతి లేని ల్యాబ్‌లు వందల్లో ఉన్నాయి. జిల్లాలో సుమారు 550కి పైగా క్లినికల్ ల్యాబ్‌లు ఉన్నాయి. వీటిలో కొన్నింటికి మాత్రమే వైద్య ఆరోగ్యశాఖ అనుమతి ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. ఈ విషయం బహిరంగ రహస్యమే అయినా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు చర్యలు తీసుకోవడంలో జంకుతున్నట్లు తెలుస్తోంది. ఖచ్చితంగా కోర్సు పూర్తి చేసి ల్యాబ్‌టెక్నీషియన్‌లచే క్లినికల్ ల్యాబ్‌లను నిర్వహించాలి. అయితే చాలా చోట్ల అర్హత, అనుభవం లేని వారితో పరీక్షలు చేయిస్తున్నట్లు ప్రజలు ఆరోపిస్తున్నారు. ఈ కారణంగా తప్పుడు ఫలితాలు వచ్చే అవకాశం ఉందని భయాందోళనలు చెందుతున్నారు. లేబొరేటరీలను తనిఖీ చేసే అధికారం వైద్య ఆరోగ్య శాఖ అధికారులకుంది. ప్రతి ల్యాబ్‌ను అధికారులు తనిఖీ చేయాల్సి ఉంది. నిబంధనల మేరకు ల్యాబ్‌లను ఏర్పాటు చేశారా, రిజిష్టర్ చేయించారా, అర్హులైన టెక్నీషియన్లు ఉన్నారా అనే వివరాలను పరిశీలించాలి. ప్రైవేట్ వైద్యులకు భారీగా కమీషన్లు జిల్లాలోని అనేక ఆస్పత్రులకు ల్యాబ్ సౌకర్యం లేదు. దీంతో వారు బయటికి రాసి పంపుతుంటారు. రెఫర్ చేసినందుకు ప్రైవేట్ ల్యాబ్‌లు వైద్యులకు భారీగా కమీషన్లు ముట్టచెబుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. కమీషన్ డబ్బులే కొందరు డాక్టర్లకు నెలకు రూ. లక్షలు వస్తున్నాయి. వైద్యులు రాసే పరీక్షల్లో వైద్యుడిని బట్టి రక్తపరీక్షలు, స్కానింగ్‌లకు 30 నుంచి 50 శాతం వరకు కమీషన్లు ఇస్తున్నట్లు తెలుస్తోంది. కొంత మంది వైద్యులు ఆస్పత్రిలోనే ల్యాబ్‌లను సొంతంగా నిర్వహించుకుంటున్నారు. ఫీజులు తగ్గిస్తున్నారా అంటే బయట ల్యాబ్‌ల కంటే ఎక్కువ వసూలు చేస్తున్నారనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ప్రొద్దుటూరులో విచ్చలవిడిగా అనుమతి లేని ల్యాబ్‌లు ప్రొద్దుటూరులో అనుమతి లేకుండా విచ్చలవిడిగా ల్యాబ్‌లను ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. సుమారు 50కి పైగా క్లినికల్ ల్యాబ్‌లు ఉండగా వాటిలో కేవలం 14 వాటికే వైద్య ఆరోగ్యశాఖ అనుమతి ఉన్నట్లు సమాచారం. ప్రైవేట్ ఆస్పత్రులకు అనుబంధంగా ఎక్కువగా ల్యాబ్‌లు వెలిశాయి. వీటిల్లో ఇచ్చే రిపోర్టుల్లో కూడా తేడాలున్నట్లు తెలుస్తోంది. ఒక ల్యాబ్‌లో ఒక వ్యక్తి రక్తపరీక్ష చేయించుకొని, అతను మరో ల్యాబ్‌కు వెళ్తే వ్యతిరేక ఫలితాలు వస్తున్నాయని ప్రజలు వాపోతున్నారు. ఏ పరీక్షకు ఎంత ఫీజు వసూలు చేస్తున్నారనే వివరాలు ల్యాబ్‌ల్లో కనిపించవు. నిబంధనల ప్రకారం అన్ని ల్యాబ్‌లు, ప్రైవేట్ ఆస్పత్రుల్లో పేషెంట్లకు కనిపించేలా ధరల పట్టిక పెట్టాలి. ధరల పట్టిక లేకపోవడంతో ఆస్పత్రి డిమాండ్‌ను బట్టి ల్యాబ్ టెస్ట్‌లకు డబ్బు వసూలు చేస్తున్నారు. చర్యలు తీసుకుంటాం.. అనుమతి లేకుండా ల్యాబ్‌లను నిర్వహిస్తే చర్యలు తీసుకుంటాం. అలాగే ల్యాబ్‌ల్లో నిబంధనల మేరకు టెక్నీషియన్లతోనే పని చేయించాలి. ఏఎన్ఎంల రిక్రూట్మెంట్ పనిలో ఉన్నాం. రిక్రూట్మెంట్ పూర్తవ్వగానే క్లినికల్ ల్యాబ్‌లను పరిశీలిస్తాం. – ఉమాసుందరి, డీఎంఅండ్‌హెచ్‌ఓ, కడప. -
ఫీవర్ ఆస్పత్రిలో అవస్థలు
సాక్షి హైదరాబాద్: నల్లకుంట ఫీవర్ ఆసుపత్రిలో నర్సింగ్ సిబ్బంది కొరత కారణంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఆసుపత్రిలో మొత్తం 51 మంది స్టాఫ్ నర్స్ పోస్టులకు గానూ ప్రస్తుతం 41 మంది మాత్రమే ఉన్నారు. కొందరు పదవీ విరమణ పొందగా మరి కొందరు బదిలీపై వెళ్లడంతో 11 స్టాఫ్ నర్స్‌ల ఖాళీలు ఏర్పడ్డాయి. ప్రభుత్వం నూతన నియామకాలు చేపట్టకపోవడంతో ఓపీ, ఇన్ పేషెంట్ వార్డుల్లో విధులు నిర్వహించే నర్సింగ్ సిబ్బందిపై అదనపు భారం పడుతోంది. ఇటీవల సీజనల్ వ్యాధులతో నల్లకుంట ఫీవర్ ఆసుపత్రికి రోగుల తాకిడికి పెరిగింది. రోగుల సంఖ్యకు అనుగుణంగా అదనపు పడకలు ఏర్పాటు చేసినా ఆరోగ్య శాఖ అదే స్థాయిలో నర్సింగ్ సిబ్బందిని నియమించడంలో నిర్లక్ష్యం వహిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. రోగుల రద్ధీ కనుగుణంగా ఒక్కో వార్డులో కనీసం ముగ్గురు లేదా నలుగురు నర్సులు ఉండాలి. ఎడతెరిపిలేని వర్షాలకు తోడు పారిశుధ్య సమస్యలు నెలకొనడంతో గతంలో ఎన్నడూలేని విధంగా సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్నాయి. దీంతో రోగులు చికిత్స కోసం నల్లకుంట ఫీవర్ ఆసుపత్రికి క్యూ కడుతున్నారు. సాధారణ రోగులకు ఓపీలో చికిత్సలు అందిస్తున్న వైద్యులు ఇంటికి పంపేస్తున్నారు. ఆరోగ్యం క్షీణించిన రోగులను ఇన్పేషెంట్లుగా చేర్చుకుని చికిత్స అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో రోగుల రద్ధీకి అనుగుణంగా ఆరోగ్యశాఖ నాలుగు రోజుల క్రితం ఆస్పత్రిలో అదనంగా 50 పడకలు ఏర్పాటు చేసింది. అయితే దానికి తగినట్లుగా స్టాఫ్ నర్స్‌ల కొరతకు తోడు అదనపు సిబ్బంది లేకపోవడంతో ఉన్నవారిపై అదనపు భారం పడుతోందని సిబ్బంది వాపోతున్నారు. వార్డు 2లో ఒక్కరే.. గత ఆదివారం వార్డు 2లో ఒక్క నర్స్ మాత్రమే విధులు నిర్వహించడం గమనార్హం. వార్డులో దాదాపు 75 మంది రోగులు ఉండగా ఒక్క నర్స్ మాత్రమే అందరినీ చూసుకోవడం కష్టంగా మారిందని రోగులు ఆగ్రహం వ్యక్తం చేశారు. స్టాఫ్ నర్స్‌ల కొరత ఉన్నప్పుడు అదనంగా ఎన్ని పడకలు ఏర్పాటు చేసినా ప్రయోజనం లేదన్నారు. రోగుల తాకిడిని దృష్టిలో పెట్టుకుని డిప్యూటేషన్‌పై అదనపు నర్స్‌లను నియమించాలని కోరుతున్నారు. సీజన్ ముగిసే వరకు కనీసం నర్సింగ్ విద్యార్థులనైనా సహాయకులుగా నియమించాలని వారు పేర్కొన్నారు. -
విజృంభిస్తున్న విష జ్వరాలు
నల్లకుంట: గత కొద్ది రోజులుగా ప్రబలుతున్న విష జ్వరాలతో బస్తీలు వణికిపోతున్నాయి. చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు విష జ్వరాల బారిన పడిన మంచానికే పరిమితమవుతున్నారు. సకాలంలో వైద్యం అందక రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రైవేటు ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్నా జ్వరం తగ్గక పోవడంతో నల్లకుంట ఫీవర్ ఆసుపత్రి బాట పడుతున్నారు. బస్తీల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి చికిత్స అందించాలని ప్రజలు కోరుతున్నారు. నిరంతర వర్షాలు, పారిశుధ్య లోపం కారణంగా నగరంలో సీజనల్ వ్యాధులు ప్రబలుతున్నాయి. జ్వరాలతో ఆస్పత్రుల్లో చేరుతున్న వారి సంఖ్య నానాటికీ పెరుతోంది. గ్రేటర్‌లోని అన్ని మురికి వాడలు, బస్తీల్లో ప్రజలు జ్వరాలతో అల్లాడుతున్నారు. కలుషిత నీరు కూడా జ్వరాల పెరుగుదలకు కారణమని వైద్యులు చెబుతున్నారు. బస్తీల్లో పారిశుధ్యం లోపించింది. డ్రెయిన్లు పూడుకుపోయి దుర్గంధాన్ని వెదజల్లుతున్నాయి. పైపులైన్ల లీకేజీల వల్ల రక్షిత నీరు కలుషి తమవుతుండటంతో జ్వరాలు ప్రబలుతున్నాయి. చలి జ్వరం, జలుబు, దగ్గు తదితర వ్యాధులతో బాధపడుతున్న వారి సంఖ్య క్రమేపీ పెరుగుతోంది. దీంతో వైరల్ ఫీవర్స్, మలేరియా తదితర రోగాలతో చికిత్సల కోసం నల్లకుంటలోని ఫీవర్ ఆసుపత్రికి క్యూ కడుతున్నారు. యూపీహెచ్‌సీలు, బస్తీ దవాఖానల్లోనూ జ్వర పీడిత కేసులు అధికంగా నమోదవుతున్నాయి. ‘గాంధీ’లో నేల పడకలే దిక్కు గాంధీఆస్పత్రి : విషజ్వరాలు విజృంభిస్తున్న నేపథ్యంలో సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రికి రోగుల తాడికి విపరీతంగా పెరిగింది. నగరంతోపాటు తెలంగాణ జిల్లాల నుంచి రోగులు క్యూ కట్టడంతో పలు విభాగాలు కిటకిటలాడుతున్నాయి. ఇన్‌పేషెంట్ వార్డుల్లో ఖాళీ లేకపోవడంతో వరండాలో నేలపై పరుపులు వేసి వైద్యసేవలు అందిస్తున్నారు. గాంధీ అవుట్ పేషెంట్ విభాగంలో సోమవారం 2101 రోగులకు వైద్యసేవలు అందించారు. సాయంత్రం ఓపీకి స్పందన అంతంత మాత్రంగా ఉంది. సరైన ప్రచారం లేకపోవడంతో ఈ నెల 1 నుంచి 8 వరకు గాంధీ సాయంత్రం ఓపీలో కేవలం 116 మంది మాత్రమే వైద్యసేవలు పొందారు. జాగ్రత్తలు తీసుకోవాలి కాచి వడపోసిన నీటిని తాగాలి. కలు షిత, నిల్వ ఉన్న ఆహార పదార్థాలను తినరాదు. వేడిగా ఉన్న ఆహారాన్ని భుజించాలి. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి. జ్వరం వస్తే వైద్యుల సలహామేరకు మందులు వాడాలి.– డాక్టర్ పద్మజ, ఫీవర్ సీఎస్ ఆర్ఎంవో -
డెంగీ డేంజర్..వణికిస్తున్నఫీవర్
విశ్వనగరం విషజ్వరాలతో వణికిపోతోంది. డెంగీ, మలేరియా, చికున్‌గున్యా, డిప్తీరియా,డయేరియాలు పంజా విసురుతుండడంతో విలవిల్లాడుతోంది. ఓవైపు డెంగీ దోమమృత్యుఘంటికలు మోగిస్తుంటే.. మరోవైపు ఏజెన్సీ దోమ కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఈ ఏడాది ఇప్పటి వరకు 50 మంది డెంగీతో మరణించగా... వారిలో 40 మందికి పైగా గ్రేటర్ జిల్లాల వారే కావడం ఆందోళన కలిగిస్తోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా గ్రేటర్లో విషజ్వరాలు కేసులు నమోదవుతుండడంపై భయాందోళన వ్యక్తమవుతోంది.ఉస్మానియా, గాంధీ, నిలోఫర్, ఫీవర్ ఆస్పత్రులకు జ్వరపీడితులు క్యూ కడుతున్నారు. సాధారణ రోజులతో పోలిస్తే ప్రస్తుతం ఓపీ రెట్టింపు అయింది. ఉస్మానియాలో ఓపీ 2వేల నుంచి 3వేలకు చేరుకుంది. గాంధీలో 3వేల నుంచి 5వేలకు.. ఫీవర్‌లో 1,200 నుంచి 2,500.. నిలోఫర్‌లో 1,500 నుంచి 2,500 చేరింది. సెలవు రోజుల్లో సైతం ఆయా ఆస్పత్రుల్లో ఓపీ సేవలు అందిస్తున్నారు. మరోవైపు అన్ని పాఠశాలల్లో ప్రతిరోజు దోమల నివారణ మందు స్ప్రే చేయాలని.. కాలనీలు, రోడ్లపై చెత్త లేకుండా ఏరోజుకారోజు తొలగించాలని మంత్రులు అధికారులను ఆదేశించారు. ఎందుకీ పరిస్థితి? 2018 నవంబర్ మొదలు ఈ ఆగస్టు వరకు ఎన్నికల హడావుడి కొనసాగింది. ప్రభుత్వ ఉద్యోగులతో పాటు జీహెచ్ఎంసీ పారిశుధ్య, ఎంటమాలజీ సిబ్బందికీ ఎన్నికల విధులు అప్పగించారు. దీంతో ఆ సమయంలో బస్తీల్లో ఫాగింగ్, యాంటీలార్వా ఆపరేషన్ కార్యక్రమాలను పూర్తిగా నిలిపివేశారు. దీనికి తోడు కాలనీల్లో కొత్త నిర్మాణాలు వెలిశాయి. సెల్లార్లు తవ్వడం, నిర్మాణాల క్యూరింగ్ కోసం నీటిని వాడడం, గదుల్లో రోజుల తరబడి నీరు నిల్వ ఉండడం, ట్యాంకులపై మూతలు లేకపోవడం వల్ల అవన్నీ డెంగీ దోమలకు నిలయంగా మారాయి. కనీసం ఎన్నికలు ముగిసిన తర్వాత కూడా ఫాగింగ్ చేయలేదు. ఇటీవల కురిసిన వర్షాలకు ఈ దోమలువిస్తరించడంతో విషజ్వరాలు వ్యాపిస్తున్నాయి. సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్లో డెంగీ మృత్యుఘంటికలు మోగిస్తోంది. రెండు రోజుల క్రితం మదీనాగూడకు చెందిన హేమంత్(10), అల్లాపూర్ డివిజన్ గాయిత్రినగర్కు చెందిన అభిషేక్(21), సికింద్రాబాద్‌కు చెందిన టిజాన్ ఎలిసా విన్స్టన్(13), నార్సింగి మున్సిపాలిటీలో పర్హీన్(15) మృతి చెందగా... బుధవారం లాలాపేటకు చెందిన రిత్విక(5) మరణించింది. దీంతో సర్వత్రా ఆందోళన వ్యక్త మవుతోంది. చాపకింద నీరులా విస్తరిస్తున్న డెంగీతో భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఉస్మానియా, గాంధీ, ఫీవర్, నిలోఫర్ సహా నగరంలోని ఏ ఆస్పత్రిని పరిశీలించినా 40–50 మంది డెంగీ బాధితులే కనిపిస్తున్నారు. ఆస్పత్రులకు రోగులు పోటెత్తుతుండడంతో ఇప్పటికే సెలవు రోజుల్లోనూ ఓపీ సేవలు అందుబాటులోకి తీసుకొచ్చి హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించిన వైద్యారోగ్యశాఖ తాజాగా వైద్య సిబ్బంది సెలవులపై ఆంక్షలు విధించింది. పరిస్థితి కుదుటపడే వరకు అనివార్యమైతే తప్ప.. సెలవులు మంజూరు చేయొద్దని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో చదువుకుంటున్న పిల్లలు డెంగీ బారినపడకుండా తగిన జాగ్రత్తలు తీసుకునేలా జీహెచ్ఎంసీ సహా వైద్యారోగ్యశాఖను ఆదేశించాలని కోరుతూ బాలల హక్కుల సంఘం హెచ్చార్సీలో బుధవారం ఫిర్యాదు చేసింది. వైద్యారోగ్యశాఖ లెక్కల ప్రకారం ఈ ఏడాది ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 2 వేలకుపైగా డెంగీ పాజిటీవ్ కేసులు నమోదు కాగా... వారిలో ఇప్పటికే 50 మంది మృతి చెందారు. లెక్కల్లో తకరారు... డెంగీ బాధితుల లెక్కలపై ప్రభుత్వం చెప్తున్న లెక్కలకు.. ప్రైవేటు ఆస్పత్రుల్లో నమోదవుతున్న కేసులకు పూర్తి భిన్నంగా ఉంది. అధికారికంగా ఇప్పటి వరకు 2,113 పాజిటివ్ కేసులు మాత్రమే నమోదైనట్లు చెబుతున్నా.. వాస్తవంగా ఈ సంఖ్య రెట్టింపు స్థాయిలో ఉన్నట్లు సమాచారం. గాంధీ ఆస్పత్రిలో ఈ ఏడాది ఇప్పటి వరకు 2,889 మంది నుంచి నమూనాలు సేకరించి, ఐపీఎంలో పరీక్షించగా వీరిలో 451 మందికి డెంగీ పాజిటివ్ వచ్చింది. ఒక్క ఆగస్టులోనే 232 కేసులు నమోదయ్యాయి. ఇక ఉస్మానియాలో మే నుంచి ఇప్పటి వరకు 911 మంది నుంచి నమూనాలు సేకరించి పరీక్షించగా 208 మందికి పాజిటివ్ వచ్చింది. నిలోఫర్ ఆస్పత్రిలో జూన్, జులై, ఆగస్టు నెలల్లో 799 పాజిటివ్ కేసులు నమోదు కాగా... వీటిలో ఒక్క ఆగస్టులోనే 499 కేసులు నమోదు కావడం విశేషం.ఫీవర్ ఆస్పత్రిలో జులై, ఆగస్టులో 74 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. బాధితుల్లో 391 మంది హైదరాబాద్ జిల్లా వాసులు కాగా, మిగిలిన వారంతా రంగారెడ్డి, మల్కాజ్గిరి జిల్లాలకు చెందిన వారే. ఇక యశోద, కేర్, అపోలో, కిమ్స్, సన్‌షైన్, సిటిజన్, కామినేని, గ్లోబల్, తదితర ప్రైవేటు ఆస్పత్రులు డెంగీబాధితులతో కిక్కిరిసిపోతున్నాయి. కేవలం ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే కాదు కార్పొరేట్ ఆస్పత్రుల్లోనూ రోగులకు పడకలు దొరకని పరిస్థితి నెలకొంది. డెంగీ బాధితుడి నుంచి రెండో శాంపిల్ సేకరించి ఐపీఎంకు పంపాలనే నిబంధన ఉన్నప్పటికీ.. నగరంలోని ఏ ఒక్క కార్పొరేట్ ఆస్పత్రి కూడా దీన్ని పాటించడం లేదు. దీంతో ప్రభుత్వం కేవలం ప్రభుత్వ ఆస్పత్రుల్లో నమోదైన కేసులనే డెంగీ కేసులుగా భావిస్తోంది. డెంగీకి కారణమిదే... ఈడిన్ ఈజిఫ్టై (టైగర్ దోమ) కుట్టడం ద్వారా డెంగీ సోకుతుంది. ఇది పగటి పూట మాత్రమే కుడుతుంది. దోమ కుట్టిన 78 రోజులకు హఠాత్తుగా తీవ్రమైన జ్వరం వస్తుంది. కాళ్లు కదలించలేని పరిస్థితి ఉంటుంది. ఎముకలు, కండరాల్లో భరించలేని నొప్పి, శరీరంపై ఎర్రటి పొక్కులు వస్తాయి. రక్త కణాలు సంఖ్య పడిపోతుంది. కొన్నిసార్లు అవయవాలన్నీ పనిచేయడం మానేస్తాయి. లక్షణాలు గుర్తించి వెంటనే చికిత్స తీసుకోవడం వల్ల డెంగీ నుంచి బయటపడొచ్చు. – డాక్టర్ రాజన్న,చిన్నపిల్లల వైద్యుడు అవసరం లేకపోయినా? ఆరోగ్యవంతుడి రక్తంలో ప్లేట్లెట్ల సంఖ్య 1.50 లక్షల నుంచి 4 లక్షల వరకు ఉంటుంది. డెంగీ జ్వరంతో వీటి సంఖ్య క్రమేణా తగ్గుతుంటుంది. 10వేల కంటే తగ్గినప్పుడు మాత్రమే తిరిగి వాటిని భర్తీ చేయాలి. 20వేల లోపు ఉన్నప్పుడు... రక్తస్రావ లక్షణాలు కనిపిస్తే ఎక్కించాలి. 20వేల కంటే ఎక్కువగా ఉన్నప్పుడు ఒకవేళ రక్తస్రావం అయినా ప్లేట్లెట్లు ఎక్కించాల్సిన అవసరం లేదు. దీనికి బదులుగా రక్తం గడ్డకట్టేందుకు ప్లాస్మాను ఎక్కిస్తారు. ప్లేట్లెట్ల సంఖ్య తగ్గడంతో జరిగే అనర్థాలు వ్యక్తిని బట్టి మారుతుంటాయి. ప్లేట్లెట్ల సంఖ్యతో పాటు రక్తంలో ప్యాక్డ్ సెల్ వాల్యూమ్ (పీసీవీ) ఎంత ఉందనేది పరిశీలించడం ముఖ్యం. పీసీవీ సాధారణంంగా ఉండాల్సిన దానికంటే 20శాతం, అంతకంటే ఎక్కువైతే అత్యవసరంగా ఐవీ ఫ్లూయిడ్స్ ఇవ్వాల్సి ఉంటుంది. కానీ చాలా ఆస్పత్రులు అవసరం లేకపోయినా ప్లేట్లెట్స్ ఎక్కించి, రోగుల నుంచి భారీగా డబ్బులు దండుకుంటున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. పండ్లకు డిమాండ్.. డెంగీ బాధితుల్లో ప్లేట్లెట్స్ కౌంట్స్ పడిపోతుంటాయి. వైద్యులు ఇచ్చే మందులతో పాటు ప్రత్యామ్నాయంగా బొప్పాయి, కీవీ పండ్లు ప్లేట్లెట్స్ కౌంట్స్‌ను పెంచేందుకు దోహదపడుతుంటాయని అంతా భావిస్తున్నారు. దీంతో సాధారణ జ్వరపీడితులే కాకుండా డెంగీ బాధితులు సైతం వీటిని కొనుగోలు చేస్తున్నారు. ఒక్కసారిగా వీటికి డిమాండ్ పెరగడంతో వ్యాపారులు ఈ పండ్ల ధరలను అమాంతం పెంచేశారు. నిన్న మొన్నటి వరకు ఒక కీవీ పండు రూ.15 ఉండగా, ప్రస్తుతం రూ.50 వరకు ధర పలుకుతోంది. ఇక కిలో బొప్పాయి రూ.30 ఉండగా.. ప్రస్తుతం రూ.60కి పైగా పలుకుతోంది. దోమల భారీ నుంచి రక్షించుకునేందుకు తెరలను కొనుగోలు చేస్తుండడంతో వాటి ధరలు కూడా అమాంతం పెరిగాయి. సాధారణ రోజుల్లో రూ.200లోపు దొరికిన దోమ తెర... ప్రస్తుతం రూ.1500కి పైగా ధర పలుకుతోంది. ఇదీ పరిస్థితి ♦ నాచారం ఈఎస్ఐ ఆస్పత్రికి రోగుల తాకిడి పెరిగింది. సాధారణ రోజుల్లో ఓపీ సంఖ్య 1,000 వరకు ఉండగా... నాలుగైదు రోజుల నుంచి దాదాపు 2,000 దాటుతోందని సూపరిటెండెంట్ గంగాధర్ తెలిపారు. ♦ ఉప్పల్ ప్రాథమిక వైద్య కేంద్రంలో సాధారణ రోజుల్లో 100 వరకు ఉండే ఓపీ.. ప్రస్తుతం 200 దాటుతోందని డా.పల్లవి తెలిపారు. ఇక్కడ కనీసం ప్యారాసిటమాల్ ట్యాబ్లెట్లు కూడా అందుబాటులో లేకపోవడం గమనార్హం. ♦ మల్లాపూర్ పట్టణ ఆరోగ్య కేంద్రంలో ఓపీ 100 నుంచి 200లకు పెరిగింది. ♦ ఏఎస్‌రావునగర్ జమ్మిగడ్డ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఓపీ రెండింతలైందని డాక్టర్ తేజస్వీని తెలిపారు. ♦ శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలో డెంగీతో ఇప్పటికే ముగ్గురు మరణించారు. మదీనాగూడకు చెందిన హేమంత్ (10), పాపిరెడ్డి కాలనీకి చెందిన అవినాష్ (13), మాదాపూర్ చందానాయక్ తండాకు చెందిన చందర్‌నాయక్ (38) డెంగీతో మృతి చెందారు. ♦ మలక్‌పేట్ ఏరియా ఆస్పత్రి, సరూర్‌నగర్, మీర్పేట్, మలక్‌పేట్‌లలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు బాధితులు పోటెత్తుతున్నారు. ♦ సికింద్రాబాద్‌లోని ఐదు డివిజన్లలో విషజ్వరాలు విజృంభిస్తున్నాయి. లాలాపేట యాదవ బస్తీకి చెందిన చిన్నారి రుత్విక బుధవారం డెంగీతో మృతి చెందడం గమనార్హం. ♦ అంబర్‌పేట నియోజకవర్గంలో నాలుగు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, రెండు బస్తీ దవాఖానాలు ఉన్నాయి. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఓపీ 50 నుంచి 250కి చేరింది. ♦ వనస్థలిపురం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి జ్వరపీడితులు పోటెత్తుతున్నారు. సాధారణంగా రోజుకు సగటున 700–800 మంది అవుట్‌పేషెంట్స్ వస్తుండగా... ఇటీవల ఈ సంఖ్య 1300లకు చేరింది. -
ఫీవర్‌లో మందుల్లేవ్..
నల్లకుంట: కొన్ని ఖరీదైన మందుల్లేక ఫీవర్ ఆస్పత్రిలో రోగులు అవస్థలు పడుతున్నారు. డిప్తీరియా, బుల్నెక్, టెటానస్ రోగులకు నల్లకుంట ఫీవర్ ఆస్పత్రిలో ప్రత్యేక చిక్సితలు అందిస్తారు. ఆయా వ్యాధులతో బాధపడుతున్న రోగి గొంతు మూసుకుపోయి శ్వాస తీసుకోవడం కష్టంగా మారుతుంది. అలాంటి ప్రాణపాయస్థితిలో ఉండే డిప్తిరీయా రోగులకు యాంటి డిఫ్తీరియా సీరం(ఏడీఎస్ )తో పాటు క్రిస్టల్ పెన్సిలిన్(సీపీ) యాంటి బయోటిక్ తప్పని సరిగా ఇవ్వాలి. కాగా ఏడీఎస్ సీరంను మహబూబ్‌నగర్‌లోని విన్స్ బయోఫాం నుంచి ఫీవర్ ఆస్పత్రికి సరఫరా చేస్తున్నారు. సీపీ మందులను ఉత్తరాదికి చెందిన ఫార్మా కంపెనీలు సరఫరా చేస్తున్నాయి. దీని ఖరీదు రూ. 750 నుంచి రూ. 1000 వరకు ఉంటుంది. సీపీ ఖరీదు ఎక్కువగా ఉండడం, ప్రభుత్వం నిర్ధేశించిన ధరకే ఆ మందులు సరఫరా చేయాలనే నిబంధనల నేపథ్యంలో నార్త్‌కు చెందిన ఫార్మా కంపెనీ సరఫరాను అర్థాంతరంగా నిలిపి వేసినట్లు సమాచారం. దీంతో గత నెల రోజులుగా ఆ మందులు స్టాక్ లేకపోవడంతో చికిత్స కోసం వచ్చే డిఫ్తీరియా రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కనీసం బహిరంగ మార్కెట్లో కూడా ఈ మందులు లభించకపోవడం గమనార్హం. ఈ క్రమంలో చిన్నారులు కొందరు మృత్యువాత పడిన సంఘటనలు ఉన్నాయి. ఎంతో ముఖ్యమైన సీపీని కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం చొరవ తీసుకోవాలని రోగుల బంధువులు విజ్ఞప్తి చేస్తున్నారు. బెటాడిన్ గార్గిల్ ,కార్నిటారేట్యాబ్లెట్లు నో స్టాక్.. అదే విధంగా డిఫ్తీరియా రోగులకు ఇవ్వాల్సిన బెటాడిన్ గార్గిల్ లిక్విడ్, కార్నిటారే(గుండెపై ఒత్తిడి పడకుండా చేస్తుంది) ట్యాబ్లెట్లు కూడా స్టాక్ లేదు. కార్నిటారే ట్యాబ్లెట్లకు బదులుగా ఇంజక్షన్లు ఇస్తుండడంతో కాస్తా ఊరట లభిస్తోంది. అయినా డిఫ్తీరియా రోగులు నోరు శుభ్రం చేసుకునేందుకు వినియోగించే బెటాడిన్ గార్గిల్ స్టాక్ లేక పోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. డిఫ్తీరియా బాధితుల్లో పలువురు నిరక్షరాస్యులు, మురికి వాడలకు చెందిన వారే ఉంటున్నారు. దీంతో ఈ జబ్బు బారిన పడిన వారి క్రిస్టల్ పెన్సిలిన్(సీపీ), బెటాడిన్ గార్గిల్ ,కార్నిటారే ట్యాబ్లెట్లు కూడా వాడాలని తెలియదు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి క్రిస్టల్ పెన్సిలిన్(సీపీ) మందును తెప్పించాలని రోగుల బంధువులు కోరుతున్నారు. -
మంచం పట్టిన బూరాడపేట
విష జ్వరాలు పెదబూరాడపేట, చినబూరాడపేట గ్రామాలను పట్టి పీడిస్తున్నాయి. సుమారు మూడు వారాలుగా ఇదే పరిస్థితి ఆయా గ్రామాల్లో నెలకొంది. గ్రామస్తులు జ్వరాల బారిన పడి ఆస్పత్రుల పాలవుతున్నారు. ఇలా జ్వరాలు ప్రబలడానికి ఆయా గ్రామాల్లో తాగునీరే కారణమని వైద్యులు చెబుతున్నారు. సాక్షి, నెల్లిమర్ల రూరల్: విష జ్వరాలతో పెద బూరాడపేట, చిన బూరాడపేట వాసులు మంచం పట్టారు. వర్షాకాలం, తాగునీటి కాలుష్యం వెరసి ప్రజలు రోగాల బారిన పడుతున్నారు. రెండు గ్రామాల్లోను ప్రజలు జ్వరం, దగ్గు, విరేచనాలతో పాటు, కీళ్ల నొప్పులు, కాళ్ల వాపులతో ఆస్పత్రుల పాలవుతున్నారు. సీజనల్ వ్యాధులపై అవగాహన కల్పించాల్సిన అధికారులు పట్టించుకోవడం లేదు. ప్రత్యేకాధికారుల జాడ కాన రావడం లేదు. గడిచిన పది రోజులుగా ఇదే పరిస్థితి నెలకొంది. ఫలితంగా ప్రజలు రోగాలతో అల్లాడుతున్నారు. జ్వర పీడితులు మండల కేంద్రాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందని స్థానికులు వాపోతున్నారు. రెండు గ్రామాల్లో ఒక్కో కుటుంబం నుంచి ఇద్దరు మంచం పట్టి ఉన్నారు. దీంతో స్థానికులు బిక్కుబిక్కు మంటున్నారు .గడిచిన ఇరవై రోజుల నుంచి ప్రధానంగా కీళ్ల నొప్పులు, కాలు వాపుల సమస్యలతో బాధ పడుతున్నారు. రెండు గ్రామాల్లోనూ సుమారు 70మందికి పైగా ఈ సమస్యతో బాధపడుతున్నారని స్థానికులు చెబుతున్నారు. నీటి కాలుష్యం వల్ల ఈ సమస్య ఏర్పడిందని వైద్యులు చెబుతున్నారు. గ్రామంలో మంగళవారం ఓ ప్రైవేటు ఆస్పత్రి నిర్వాహకులు స్వచ్ఛంధంగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. రోగులకు తనిఖీలు నిర్వహించి ఉచితంగా మందులను అందజేశారు. గ్రామంలో పలువురు యువకులు వైద్యాధికారులకు సమాచారం ఇవ్వడంతో కొండవెలగాడ పీహెచ్సీ సిబ్బంది వెంటనే గ్రామాన్ని సందర్శించి జ్వర పీడితుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. కలుషిత నీటితోనే.. కలుషిత నీటిని తాగడం వలనే ప్రజలు రోగాల బారిన పడుతున్నారని వైద్యులు చెబుతున్నారు. ట్యాంక్ నుంచి తాగునీటి సదుపాయం ఉన్నప్పటికీ ప్రజలు ఆ నీటిని వినియోగించడం లేదు. సమీపంలో పంట పొలాల్లో ఉన్న బావి నీటినే తాగేందుకు వినియోగిస్తున్నారు. ఆ నీరు పూర్తిగా కలుషితమని వైద్యులు చెబుతున్నారు. గ్రామంలో తాగునీటి పైపులైన్లు కూడా అస్తవ్యస్తంగా ఉన్నాయి. గతంలో మురుగు నీటి కాలువల నుంచి తాగునీటి పైపు లైన్లను ఏర్పాటు చేయడంతో ఆ నీరు కూడా కలుషితంగా మారింది. వైద్యాధికారి ఏమన్నారంటే... ఈ సమస్యపై స్థానిక పీహెచ్సీ వైద్యాధికారి ప్రశాంత్ రాజ్‌ను వివరణ కోరగా గ్రామంలో ఇప్పటికే సర్వే చేశామని గడిచిన 15 రోజుల నుంచి తరుచూ వైద్య తనిఖీలను చేపడుతున్నామన్నారు. ప్రస్తుతం గ్రామంలో జ్వరాలు అదుపులో ఉన్నాయని చెప్పారు. ట్యాంక్ నుంచి వాటర్ సరఫరా అవుతున్నప్పటికీ ప్రజలు కలుషిత బావి నీటిని వినియోగిస్తున్నారన్నారు. ప్రజలకు ఎప్పటికప్పుడు సూచనలు చేస్తున్నామని తెలిపారు. అలాగే ప్రతి రోజు వైద్య సిబ్బంది గ్రామాల్లో అందుబాటులో ఉంటారన్నారు. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ప్రజలు కాచి చల్లార్చిన నీటిని తాగాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని కోరారు. -
ఫీవర్‌కు పెరుగుతున్నరోగుల తాకిడి
నల్లకుంట: విష జ్వరాలతో వస్తున్న రోగులతో నల్లకుంట ఫీవర్ ఆసుపత్రి కిటకిటలాడుతోంది. గత రెండు వారాలుగా రోగుల తాకిడి పెరగడంతో ఆసుపత్రి అధికారులు ప్రత్యేక చర్యలు తీçసుకుంటున్నారు. రద్ధీ కనుగుణంగా ఓపీ విభాగంలో అదనపు కౌంటర్లు ఏర్పాటు చేశారు. మంగళవారం ఓపీలో ఇబ్బందులు తలెత్తకపోయినా రక్త పరీక్షల ల్యాబ్, ఫార్మసీ కౌంటర్ల వద్ద రోగులు క్యూలైన్లో బారులు తీరాల్సి వచ్చింది. జ్వరాలన్నీ డెంగీ కాదు గాలిలో తేమ కారణంగా వైరల్ జ్వరాలు ప్రబలుతున్నాయి. జ్వరాలపై ప్రజలు ఆందోళన చెందవద్దు. పలువురు డెంగీ భయంతో జ్వరం రాగానే ఫీవర్‌కు పరుగులు తీస్తున్నారు. జ్వరాలన్నీ డెంగీ కాదు. కాచి. చల్లార్చి వడ కట్టిన నీటినే తాగాలి. వ్యక్తిగత పరిశుభ్రతలతో చాలా వరకు వ్యాధులను నివారించవచ్చు. రోగుల తాకిడికి అనుగుణంగా ఆసుపత్రిలో ఏర్పాట్లు చేశాము. మందుల కొరత లేకుండా ప్రత్యేక చర్యలు తీసుకున్నాం. ల్యాబ్ వద్ద రోగులకు ఇబ్బందులు ఎదురవుతున్నట్లు గుర్తించాం. ఆ సమస్యను కూడా పరిష్కరిస్తాము.– డాక్టర్ కె. శంకర్, ఆసుపత్రి సూపరింటెండెంట్ -
ఫీవర్.. ఫియర్
-
'డై' యేరియా!
సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్లో డయేరియా (నీళ్ల విరేచనాలు) చాపకింది నీరులా విస్తరిస్తోంది. కలుషిత నీరు, ఆహారం కారణంగా రాష్ట్రవ్యాప్తంగా ఏటా 3.5లక్షల మంది డయేరియా బారినపడుతుండగా... సగానికిపైగా కేసులు గ్రేటర్ పరిధిలోనే నమోదువుతుండడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. ఒక్క హైదరాబాద్ జిల్లాలోనే 2018లో 71,918 డయేరియా కేసులు నమోదు కాగా... ఈ ఏడాది ఇప్పటి వరకు 41,441 కేసులు నమోదయ్యాయి. ఇవన్నీ కేవలం ప్రభుత్వ ఆస్పత్రుల్లో నమోదైనవి మాత్రమే. ఇక ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స పొందిన వారి సంఖ్య రెట్టింపు స్థాయిలోనే ఉంటుందని వైద్యవర్గాలే పేర్కొంటున్నాయి. సీజన్ వ్యాధుల వివరాలను ఎప్పటికప్పుడుఆయా జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారులకు తెలియజేయాలనే నిబంధన ఉన్నప్పటికీ... నగరంలోని ఏ ఒక్క ఆస్పత్రి కూడాదీన్ని పట్టించుకోవడం లేదు. ఐదేళ్ల లోపు చిన్నారుల మరణాల్లో 13 శాతం డయేరియాతోనే సంభవిస్తున్నట్లు సమాచారం. డయేరియాకు అనేక రకాల సూక్ష్మక్రిములు కారణమవుతున్నప్పటికీ... రోటావైరస్ ద్వారా సోకే డయేరియా అత్యంత ప్రమాదకరమని వైద్యనిపుణులు అభిప్రాయపడుతున్నా రు. నీళ్ల విరేచనాలు, జ్వరం, కడుపునొప్పి, వాం తులతో బాధపడుతూ ఆస్పత్రుల్లో చేరిన 40 శాతం కేసులకు ఈ రోటావైరస్నే ప్రధాన కార ణమని ఇప్పటికే వైద్యుల పరిశీలనలో తేలింది. కలుషిత ఆహారంతో... నగరంలో చాలా వరకు వాటర్ బోర్డు సరఫరా చేసే మంచినీటిపైనే ఆధారపడుతుంటారు. పాతబస్తీ సహా చాలా ప్రాంతాల్లో ఇప్పటికీ నిజాం కాలం నాటి పైపులైన్ల ద్వారానే నీరు సరఫరా అవుతోంది. మంచినీటి సరఫరా లైన్ల పక్కనే డ్రైనేజీ నీరు కూడా పారుతోంది. పైపులకు లీకేజీలు ఏర్పడి చుట్టూ నీరు నిల్వ ఉండడం, డ్రైనేజీ నీరు పైపుల్లోకి చేరడం వల్ల మంచినీరు కలుషితమవుతోంది. ఈ నీరు తాగిన బస్తీవాసులు వాంతులు, విరేచనాలతో బాధపడుతూ ఆస్పత్రుల్లో చేరుతున్నారు. దీనికి తోడు ఇంట్లో వంట చేసుకునే ఓపిక లేక చాలా మంది ఫాస్ట్‌ఫుడ్డు సెంటర్లు, హోటళ్లపై ఆధారపడుతున్నారు. కొన్ని హోటళ్లు రాత్రి మిగిలిపోయిన వంటలను ఉదయం వడ్డిస్తున్నాయి. వంటశాలలు శుభ్రంగా లేకపోవడం, ఆహారపదార్థాలపై ఈగలు, దోమలు వాలడం, చల్లారిన ఆహార పదార్థాలనే మళ్లీ వేడి చేసి వడ్డిస్తున్నారు. ఈ కలుషిత ఆహారం తినడం వల్ల కూడా డయేరియా వ్యాపిస్తోంది. తాజా ఆహారానికి బదులు నిల్వ ఉన్న ఆహార పదార్థాలు తిని అస్వస్థతకు గురై ఆస్పత్రుల్లో చేరుతున్న వారి సంఖ్య ఇటీవల గణనీయంగా పెరిగింది. నల్లకుంట ఫీవర్ ఆస్పత్రి ఓపీకి రోజుకు సగటున 1200 మంది రోగులు వస్తే వారిలో 150 నుంచి 200 మంది కలుషిత ఆహార బాధితులే ఉంటున్నారు. చిన్నారులకు టీకాలు... డయేరియాను రూపుమాపేందుకు ప్రభుత్వం కొత్తగా రోటావ్యాక్సిన్ను అందుబాటులోకి తెచ్చింది. ఇప్పటికే 96 దేశాల్లో ఇది అమలవుతోంది. దేశంలో తొలిసారిగా జాతీయ రోగ నిరోధక టీకాల కార్యక్రమంలో దీన్ని ప్రవేశపెట్టింది. గత పది రోజుల నుంచి హైదరాబాద్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ఆశావర్కర్లు, ఏఎన్ఎం, స్టాఫ్ నర్సులకు వ్యాక్సినేషన్‌పై ప్రత్యేక శిక్షణ కూడా ఇస్తున్నారు. సెప్టెంబర్ 5 నుంచి అన్ని ఆరోగ్య కేంద్రాల్లోనూ ఈ వ్యాక్సిన్ ఇవ్వనున్నట్లు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది. 6, 10, 14 వారాల శిశువులకు 2.5 ఎంఎల్ చొప్పున ఈ వ్యాక్సిన్ వేయనున్నారు. నగరంలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోనూ ప్రతి బుధ, శనివారాల్లోనూ ఈ టీకాలను వేయనున్నట్లు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ వెంకటి శుక్రవారం ‘సాక్షి’ ప్రతినిధితో చెప్పారు. జాగ్రత్తలు అవసరం... కలుషిత ఆహారం, అపరిశుభ్ర నీటితో డయేరియా వస్తుంది. పెద్దలతో పోలిస్తే పిల్లల్లోనే ఎక్కువగా వ్యాపిస్తుంది. వైరస్ కడుపులోకి చేరిన మూడు రోజుల తర్వాత ప్రతాపం చూపుతుంది. నీళ్ల విరేచనాలు, వాంతులు, జ్వరం, కడుపునొప్పి వంటి లక్షణాలు కన్పిస్తాయి. ఒంట్లోని నీరు, లవణాల శాతం తగ్గి నీరసంతో స్పృహ తప్పుతుంటారు. వెంటనే వైద్యులను సంప్రదించి చికిత్స చేయించుకోవాలి. కాళ్లు, చేతులను శుభ్రం చేసుకోవడం ద్వారా ఈ వ్యాధి భారి నుంచి కాపాడుకోవచ్చు.– డాక్టర్ రమేశ్ దంపూరి, చిన్న పిల్లల వైద్యనిపుణుడు, నిలోఫర్ -
గున్యాతో కీళ్ల నొప్పులెలా..?
వాషింగ్టన్ : గున్యా జ్వరం వచ్చినప్పుడు భరించరాని స్థాయిలో కీళ్ల నొప్పులు వస్తుంటాయి. కీళ్ల నొప్పులకు, గున్యా వైరస్‌కు మధ్య ఉన్న సంబంధాన్ని కనుగొనేందుకు శాస్త్రవేత్తలు ఎలుకలపై పరిశోధనలు జరిపారు. సాధారణంగా గున్యా వైరస్ దోమల ద్వారా సంక్రమిస్తుంది. ఈడిస్ ఈజిప్టి, ఈడిస్ అల్బోపిక్టస్ అనే జాతి దోమల కారణంగా గున్యా వ్యాపిస్తుంది. ఈ వైరస్‌లో జన్యు పదార్థం సింగిల్ స్ట్రాండెడ్ ఆర్ఎన్ఏ ఉంటుంది. ఈ వైరస్ సోకినప్పుడు వెంటనే జ్వరం, వణుకు, తలనొప్పి, వాంతులు, తల తిరగడం, కీళ్లు, కండరాల నొప్పులు వంటి లక్షణాలు ఉంటాయి. దీనికి ఎలాంటి మందులు ఇప్పటివరకు కనుక్కోలేదు. అయితే వాషింగ్టన్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్‌కు చెందిన డెబోరా లెన్స్హౌ అనే పరిశోధకురాలు.. ఈ వ్యాధి కారణంగా కీళ్ల నొప్పులు రావడానికి దారితీసే ప్రక్రియను గుర్తించారు. దీంతో ఈ వ్యాధికి మందులు కనుగొనేందుకు మార్గం సుగమమైందంటున్నారు. అయితే ఇన్ఫెక్షన్ తగ్గిపోయిన తర్వాత కూడా కీళ్ల నొప్పులు ఉండటానికి కారణాలను తెలుసుకునేందుకు లెన్స్హౌ ఈ వైరస్ సోకిన కణాలను శాశ్వతంగా మార్క్ చేసే సరికొత్త విధానాన్ని రూపొందించారు. -
డెంగీతో చిన్నారి మృతి
నల్లకుంట: నల్లకుంట ఫీవర్ ఆసుపత్రికి రోగుల తాకిడి కొనసాగుతోంది. జ్వరపీడితులు ఉదయం 7 గంటల నుంచే క్యూలైన్లో వేచి ఉంటున్నారు. ఓపీ ప్రారంభ సమయానికి ముందే దాదాపు 500 మంది వరకు క్యూలైన్లో వేచి ఉంటుండడం గమనార్హం. ఉదయం 8.30 గంటకు ఓపీ చీటీలు జారీ చేస్తుండగా, 9 గంటలకు ఓపీలో రోగులకు చికిత్సలు ప్రారంభిస్తున్నారు. చికిత్సల కోసం వచ్చే వారిలో అధికంగా వైరల్ జ్వరాలతో బాధపడుతున్న వారే ఉంటున్నారని వైద్యులు చెబుతున్నారు. గాంధీ నుంచి నలుగురు వైద్యులు.. ఫీవర్‌లో రోగుల రద్దీ కారణంగా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు మంగళవారం గాంధీ ఆసుపత్రి నుంచి నలుగురు వైద్యులను డిప్యుటేషన్ పంపించారు. సోమవారం డిప్యూటేషన్‌పై వచ్చిన మరో వైద్యుడు మంగళవారం సెలవుపై వెళ్లడం విస్మయాన్ని కలిగిస్తుంది. రోగుల సేవలో ఆర్ఎంఓ,డిప్యూటీ ఆర్‌ఎంఓలు.. రోగుల తాకిడి పెరగడంతో ఫీవర్ ఆర్ఎంఓ, డిప్యూటీ ఆర్‌ఎంఓలు ఎమర్జెన్సీ ఓపీలో కూర్చుని రోగులను పరీక్షించారు. మరో 30 మంది వైద్యులు, హౌజ్ సర్జన్లు 30 కౌంటర్లలో రోగులను పరీక్షించారు. రిపోర్టుల కోసం భారీ క్యూ.. గంటల తరబడి క్యూలో వేచి ఉండడం ఒక సమస్య అయితే..రిపోర్టులు తీసుకోవడం ఇబ్బందిగా మారింది. రిపోర్టుల జారీకి ఒక్కటే కౌంటర్ ఉండడంతో రోగులు ఆసుపత్రి ప్రధాన గేటు బయటి వరకు క్యూ కడుతున్నారు. అతి కష్టం మీద రిపోర్టులు తీసుకుని వెళితే, ఓపీలో వైద్యుల వద్దకు చేరుకోవాలంటే మరో గంట క్యూలైన్లో వేచి ఉంటే కాని వైద్య పరీక్షలు అందని పరిస్థితి. డెంగీతో చిన్నారి మృతి చింతల్: డెంగీ జ్వరం బారిన పడి ఓ చిన్నారి మృతి చెందింది. ఈ సంఘటన కుత్బుల్లాపూర్ సర్కిల్ పరిధిలో జరిగింది. రంగారెడ్డినగర్ డివిజన్ పంచశీల కాలనీకి చెందిన ప్రభాకర్, పవన్ కుమారి ల కుమార్తె దర్శిని (4) స్థానికంగా ఉన్న ఓ ప్రైవేట్ పాఠశాలలో నర్సరీ చదువుతోంది. ఐదు రోజుల క్రితం దర్శిని తీవ్ర జ్వరం రావడంతో స్థానికంగా ఉన్న క్లినిక్‌కు తీసుకువెళ్లగా పరీక్షలు నిర్వహించిన వైద్యలు డెంగీ జ్వరంగా తేల్చారు. నగరంలోని నిలోఫర్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందింది. జేసీ ఆకస్మిక తనిఖీ నల్లకుంట: ఫీవర్ ఆసుపత్రిలో రద్దీని, వైద్యసేవలను హైదరాబాద్ ఇల్లా జాయింట్ కలెక్టర్(జేసీ) జి. రవి మంగళవారం మధ్యాహ్నం జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి జె. వెంకటి, ఆర్డీఓ డి.శ్రీనివాస్ రెడ్డిలతో కలిసి పరిశీలించారు. ముందుగా ఓపీ ఫార్మసీ కౌంటర్లను, ఓపీ విభాగాన్ని పరిశీలించారు. ఓపీలో కల్పిస్తున్న సౌకర్యాల గురించి ఆరాతీశారు. ఆసుపత్రి సీఎస్ ఆర్ఎంఓ డాక్టర్ పద్మజ, డిప్యూటీ ఆర్ఎంవో డాక్టర్ రేణుక రాణిలతో మాట్లాడారు.ఓపిలో రద్దీని అధిగమించేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కోసం ఆసుపత్రి ఆవరణలోని కొన్ని భవనాలను పరిశీలించారు. అదనపు ఓపీ కౌంటర్ల ఏర్పాటుకు లెక్చర్ హాల్ అనుకూలంగా ఉంటుందని ఆసుపత్రి అధికారులు చెప్పారు. -
సాయంత్రం ఓపీ..
సాక్షి, హైదరాబాద్: అన్ని ప్రాంతీయ ఆసుపత్రులు, జిల్లా ఆసుపత్రులు, బోధనాసుపత్రుల్లో సాయంత్రం వేళల్లోనూ ఔట్ పేషెంట్లను (ఓపీ) చూడాలని వైద్య ఆరోగ్యశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా తీవ్రమైన జ్వరాలు, డెంగీ, మలేరియా వంటి కేసులు నమోదు అవుతుండటంతో ఈ నిర్ణయం తీసుకుంది. జ్వరాలపై వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతికుమారి మంగళవారం సమీక్ష నిర్వహించారు. ప్రస్తుతం ఓపీ ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2 వరకు నిర్వహిస్తున్నారు. బుధవారం నుంచి సాయంత్రం 4 నుంచి ఆరేడు గంటల వరకు నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిసింది. దీంతోపాటు అవసరమైన మందులు, ఆసుపత్రుల్లో మంచినీటి సౌకర్యం కూడా కల్పించాలని నిర్ణయించారు. రాష్ట్రంలో 31 జిల్లా ఆసుపత్రులు, 22 ఏరియా ఆసుపత్రులు, 9 బోధనాసుపత్రులు ఉన్న విషయం తెలిసిందే. వీటిల్లో తక్షణమే సాయంత్రం వేళ ఓపీ సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఇదిలావుండగా ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 3 లక్షల మంది జ్వరాలతో బాధపడుతున్నట్లు అధికారులు అంచనా వేశారు. వైద్య బడ్జెట్ రూ. 5,500 కోట్లు! వచ్చే బడ్జెట్ సమావేశాల సందర్భంగా వైద్య ఆరోగ్యశాఖ బడ్జెట్ రూ.5,500 కోట్లు ఉండే అవకాశముందని సమాచారం. ఈ మేరకు అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు తెలిసింది. గత ఆర్థిక బడ్జెట్ రూ.6,900 కోట్లు ఉండగా, ఖర్చు పెట్టిన దాన్ని ఆధారంగా వాస్తవ రూపంలో తాజాగా ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు సమాచారం. -
ఆదివారం సేవలకు అనూహ్య స్పందన
నల్లకుంట: వాతావరణంలో వచ్చిన మార్పుల కారణంగా నగరంలో విష జ్వరాలు విజృంభిస్తున్నాయి. జ్వర పీడితులతో ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులు కిటకిటలాడుతున్నాయి. దీంతో మలేరియా, డెంగీ వంటి వ్యాధులు సోకుతున్నండటంతో నల్లకుంట ఫీవర్ ఆసుపత్రిలో రోగులు బారులు తీరుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆదివారం కూడా ఓపీ సేవలను కొనసాగించాలని ప్రభుత్వం, వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శాంత కుమారి ఆదేశాలు జారీ చేశారు. అందుకు సంబంధించి ఉత్తర్వులు కూడా జారీ చేశారు. ఈ మేరకు నల్లకుంట ఫీవర్ ఆసుపత్రికి 10 మంది వైద్యులను, ఉస్మానియా, గాంధీ ఆసుపత్రులకు ఐదుగురు చొప్పున వైద్యులను అదనంగా కేటాయించారు. రోగుల రద్దీ తగ్గే వరకు వీరు విధులు నిర్వర్తించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. సీజన్ పూర్తయ్యే వరకు మిగతా రోజుల్లో మాదిరిగానే ఆదివారం కూడా ఓపీ సేవలు అందుబాటులో ఉంచాలని సూచించారు. దీంతో ఆదివారం నల్లకుంట ఫీవర్ ఆసుపత్రిలో ఓపీ సేవలు అందించారు. ఓపీలో 600 మందికి పైగా రోగులు చికిత్సలు పొందారు. ఈ సందర్భంగా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కె.శంకర్ మాట్లాడుతూ.. వాతావరణ మార్పులతో ఫీవర్ ఆసుపత్రికి జ్వర బాధితులు అధికంగా వస్తున్నారన్నారు. పెరిగిన రద్ధీని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఫీవర్ ఆసుపత్రికి అధనంగా 10 మంది వైద్యులను నియమించిందన్నారు. రోగులు భయపడాల్సిన పని లేదని, అన్ని రకాల సౌకర్యాలు, మందులు అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. ఉస్మానియా ఆసుపత్రిలో.. అఫ్జల్‌గంజ్: ఉస్మానియా ఆసుపత్రిలో జ్వర బాధితుల కోసం ఆదివారం అందుబాటులో ఉంచిన ఓపీ సేవలకు అనూహ్య స్పందన లభించిందని ఉస్మానియా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ బి.నాగేందర్ అన్నారు. ఆదివారం ఔట్ పేషెంట్లుగా 70 మంది రోగులు నమోదు కాగా సుమారు 50 మంది ఇన్‌పేషెంట్లు ఉన్నట్లు తెలిపారు. సీజనల్ వ్యాధుల నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా అన్ని ఆస్పత్రుల్లో రోగుల సంఖ్య పెరగడంతో రాష్ట్ర వైద్యవిద్య సంచాలకుల ఆదేశాల మేరకు రోగుల సౌకర్యార్థం ఆదివారం ఓపీ సేవలు కొనసాగిస్తున్నామన్నారు. -
డెంగీ కౌంటర్లు
సాక్షి, సిటీబ్యూరో: నగరంలో సాధారణ జ్వరం సోకి ఆస్పత్రులకు వెళ్లినా డెంగీ పేరిట రోగులను పీల్చిపిప్పి చేస్తున్నారు. ఈ పరిస్థితి నివారణతోపాటు ఈ వర్షాకాల సీజన్లో అంటువ్యాధుల నివారణ కార్యక్రమాలను జీహెచ్ఎంసీ ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా జీహెచ్ఎంసీ మెడికల్ ఆఫీసర్లతోపాటు గ్రేటర్ పరిధిలోని హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల వైద్యాధికారులు, ఎంటమాలజీ అధికారులతో జీహెచ్ఎంసీ కమిషనర్ ఎం.దానకిశోర్ ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. జ్వరం సోకిన వారికి ఏ వ్యాధి అయినది సరిగ్గా నిర్ధారించేందుకు ఉస్మానియా, గాంధీ, ఫీవర్ ఆస్పత్రుల్లో జ్వర నిర్ధారణకు ప్రత్యేకంగా 21 కౌంటర్లను అదనంగా తెరవాలని సమావేశంలో నిర్ణయించారు. జ్వరాలతో వచ్చే రోగులకు ప్రత్యేకంగావైద్యపరీక్షలు నిర్వహించి వ్యాధి నిర్ధారించేందుకు ఏర్పాటు చేయనున్న ఈ కౌంటర్లు ఉస్మానియాలో 5, గాంధీలో 6, ఫీవర్ ఆస్పత్రిలో 10 ఏర్పాటు చేయనున్నారు. ఈ ప్రత్యేక కౌంటర్లలో జనరల్ ఫిజీషియన్ అందుబాటులో ఉంటారని, సాయంత్రం 4 గంటల వరకు ఇవి తెరచి ఉంటాయని అధికారులు పేర్కొన్నారు. పలు ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఎలీసా టెస్ట్ నిర్వహించకుండానే డెంగ్యూగా ప్రకటిస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారన్నారు. ఇది చట్టవిరుద్ధమని పేర్కొన్నారు. ప్రైవేట్ ఆస్పత్రుల నుంచి నిర్ధారణ అయిన డెంగీ వివరాల జాబితా ఇప్పటి వరకు కూడా వైద్య, ఆరోగ్యశాఖకు అందలేదని స్పష్టం చేశారు. జీహెచ్ఎంసీ ఇప్పటి వరకు రెండు విడతల్లో దాదాపు 1100 మెడికల్ క్యాంపులు నిర్వహించగా, వచ్చేనెల ఒకటో తేదీ నుంచి 15వ తేదీవరకు మరో 695 మెడికల్‌క్యాంపులు నిర్వహించనున్నట్లు కమిషనర్ దానకిశోర్ ప్రకటించారు. ఇందులో భాగంగా హైదరాబాద్ జిల్లాలో 250, రంగారెడ్డి జిల్లాలో 165, మేడ్చల్ జిల్లాలో 165 మెడికల్ క్యాంపులు నిర్వహించనున్నట్లు తెలిపారు. జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు, మలేరియా అధికారులు,జీహెచ్ఎంసీ మెడికల్ ఆఫీసర్లు, ఎంటమాలజీ విభాగం అధికారులు సంయుక్తంగా అంటువ్యాధులు ప్రబలే వల్నరబుల్ ప్రాంతాల్లో ఈ క్యాంపులు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. దోమలవ్యాప్తి నిరోధానికి వివిధ విభాగాలతో కూడిన ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో జీహెచ్ఎంసీ అడిషనల్ కమిషనర్ సందీప్‌జా, జోనల్ కమిషనర్లు శ్రీనివాస్‌రెడ్డి, శంకరయ్య, తదితరులు పాల్గొన్నారు. -
డెంగీ బూచి..కాసులు దోచి!
బైరమల్‌గూడకు చెందిన కరుణాకర్ తీవ్ర జ్వరంతో బాధపడుతున్నాడు. చికిత్స కోసం సమీపంలో ఉన్న ఓ కార్పొరేట్ ఆస్పత్రిలో చేరాడు. వైద్యపరీక్షల్లో డెంగీ పాజిటివ్‌గా తేలింది. ప్లేట్లెట్స్ కౌంట్పడిపోయిందని చెప్పి..ఐసీయూలో చేర్చి...ఉదయం, సాయంత్రం వైద్య పరీక్షలు చేయడంతో పాటు ప్లేట్లెట్స్ ఎక్కించారు. వారం రోజులకు రూ.1.50 లక్షలు చెల్లించారు. డిశ్చార్జ్ సమయంలో చేతికిచ్చిన బిల్లు చూసి కుటుంబసభ్యులు వణికిపోయారు. ఇలా ఒక్క కరుణాకర్ కుటుంబసభ్యులు మాత్రమే కాదు..సాధారణ జ్వరంతో బాధపడుతూ చికిత్స కోసం ఆస్పత్రులకు చేరుకుంటున్న అనేక మంది వైద్య పరీక్షలు, వాటికవుతున్న ఖర్చులు చూసి వెంటవచ్చిన బంధువులు సైతం ఆశ్చర్యపోతున్నారు. సాక్షి, సిటీబ్యూరో:డెంగీ జ్వరం సంగతేమో కానీ..ఆ పేరుతో ఆస్పత్రిలో చేరిన తర్వాత వైద్యులు చేతికిచ్చే బిల్లులను చూస్తే మాత్రం కచ్చితంగా వణికిపోవాల్సిందే. ప్రస్తుతం సీజన్ మారడంతో నగరంలో డెంగీ జ్వరాలు చాపకింది నీరులా విస్తరిస్తున్నాయి. ఉస్మానియా, గాంధీ, ఫీవర్, నిలోఫర్ ఆస్పత్రి సహా నగరంలో కార్పొరేట్, ప్రైవేటు ఆస్పత్రులన్నీ రోగులతో కిక్కిరిసిపోతున్నాయి. కేవలం ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే కాదు కార్పొరేట్ ఆస్పత్రుల్లోనూ బెడ్లు దొరకని పరిస్థితి. సాధారణ జ్వరాలతో పోలిస్తే డెంగీ కొంత ప్రమాదకరమైనది. ఈ డెంగీ జ్వరంపై రోగుల్లో భయాన్ని నగరంలోని కొన్ని కార్పొరేట్, ప్రైవేటు ఆస్పత్రులు అవకాశంగా తీసుకుంటున్నాయి. దీన్ని బూచీగా చూపించి...సాధారణ జ్వర పీడితులను ఆ చికిత్సల పేరుతో నిలువుదోపిడీకి గురిచేస్తున్నాయి. అవసరం లేకపోయినా ఐసీయూ చికిత్సలు, గంటకోసారి వైద్య పరీక్షలు, హడావిడిగా ప్లేట్లెట్స్ ఎక్కిస్తున్నారు. తీవ్రమైన డెంగీ బాధితులే కాదు..సాధారణ జ్వర పీడితులు సైతం చికిత్సల తర్వాత ఆస్ప త్రులు చేతికిచ్చే బిల్లులు చూసి విస్తుపోవాల్సి వస్తుంది. చికిత్సల పేరుతో ఒక్కో రోగి నుంచి రూ.1.50 లక్షల నుంచి మూడు నుంచి నాలుగు లక్షలకుపైగా వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. అనవసరంగా ప్లేట్లెట్లు, ప్లాస్మాలను మోతాదుకు మించి ఇస్తే..భవిష్యత్తులో అక్యూట్లంగ్ ఇంజ్యూరీ, కొన్ని సార్లు అలర్జిక్ రియాక్షన్లు, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం లేకపోలేదని హెమటాలజిస్టులు చేస్తున్న హెచ్చరికలను సైతం వారు బేఖాతారు చేస్తుండటంపై స ర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. ఐపీఎంకు చేరని రెండో శాంపిల్: ప్రభుత్వం ఐజీఎం ఎలీసాటెస్టులో పాజిటివ్ వచ్చిన కేసులను మాత్రమే డెంగీగా పరిగణిస్తుంది. కానీ కార్పొరేట్ ఆస్పత్రులు, నర్సింగ్ హోమ్స్ ఎన్ఎస్–1 టెస్టు లో పాజిటివ్ వచ్చిన కేసులను కూడా డెంగీగా నమోదు చేస్తున్నాయి. నిజానికి క్లినికల్ వైద్య పరీక్షలో డెంగీ పాజిటివ్ నిర్ధారణ అయిన రోగి నుంచి రెండో శాంపిల్ సేకరించి, ఇనిస్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటీవ్ మెడిసిన్(ఐపీఎం)కు పంపాలనే నిబంధన ఉంది. కానీ ఉస్మానియా, గాంధీ, ఫీవర్ వంటి ప్రభుత్వ ఆస్పత్రులు మినహా నగరంలోని ఏ ఒక్క ఆస్పత్రి కూడా దీన్ని పట్టించుకోడం లేదు. సాధారణ జ్వరాలను కూడా అనుమానిత డెంగీగా నమోదు చేసి గుట్టు చప్పుడు కాకుండా చికిత్సలు చేస్తున్నాయి. సీజనల్ వ్యాధుల వివరాలను ఎప్పటికప్పుడు జిల్లా వైద్య ఆరోగ్యశాఖలోని ఎపిడమిక్ సెల్‌కు అందజేయక పోవడంతో ఏ ఆస్పత్రిలో ఎంత మంది ఏ వ్యాధిబాధితులు చికిత్స పొందుతున్నారనే విషయం వైద్య ఆరోగ్యశాఖ అధికారులకు కూడా తెలియడం లేదు. ఫలితంగా సీజనల్ వ్యా ధుల తీవ్రత ప్రభుత్వ దృష్టికి వెళ్లడం లేదు. జ్వరాలన్నీ డెంగీ కాదు– డాక్టర్ రంగనాథ్,మాజీ సూపరింటెండెంట్, నిలోఫర్ ♦ ఈడిస్ ఈజిప్ట్(టైగర్)దోమ కుట్టడం వల్ల డెంగీ వస్తుంది. ♦ నల్లని ఈ దోమ ఒంటిపై తెల్లని చారలు కన్పిస్తూ కేవలం పగటిపూట మాత్రమే కుడుతుంది. ♦ కళ్లమంట, కండరాల నొప్పులు, అధిక జ్వరం, వాంతులు, విరేచనాలు, చర్మంపై దద్దుర్లు ఏర్పడుతాయి. ♦ చర్మం చిట్లిపోయి రక్తస్తావం అవుతోంది. ♦ బీంగ్ వల్ల బీపీ పడిపోవడంతో షాక్‌కు గురై కోమాలోకి వెళ్లే అవకాశం ఉంది. ఈ జాగ్రత్తలు తీసుకోవాలి– డాక్టర్ సందీప్‌రెడ్డి, జనరల్ ఫిజిషియన్ ♦ డెంగీ వ్యాధి బారిన పడుకుండా ఉండాలంటే వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి. ♦ ఇంటి పరిసరాల్లో మురుగు నీరు, పాత టైర్లు, ఖాళీ కొబ్బరి బోండాలు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. ♦ నీటి ట్యాంకులు, కుండలు, క్యాన్లు వారానికోసారి శుభ్రం చేసుకోవాలి. ♦ ఇంటి గదుల్లో గాలి వెలుతురు ఎక్కువగా ఉండేలా చూడాలి. -
ఉన్నట్టుండి కుడివైపు మూతి వంకరపోతోంది!
నా వయసు 52 ఏళ్లు. నాకు ఉన్నట్టుండి మూడు రోజులుగా కుడి పైపున మూతి వంకరపోతోంది. నీళ్లు ఒక్క పక్క నుంచి కారిపోతున్నాయి. ఎంత ప్రయత్నించినా కనురెప్ప మూసుకుపోవడం లేదు. ఇది పక్షవాత లక్షణమా? మీరు చెప్పిన లక్షణాలను బట్టి మీరు ‘బెల్స్ పాల్సీ’ అనే జబ్బుతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ముఖానికి వెళ్లే ఏడవ నరం (ఫేషియల్ నర్వ్) తాత్కాలికంగా పని చేయకపోవడం వల్ల ఈ సమస్య వస్తుంది. కొందరిలో వైరల్ జ్వరాల తర్వాత, వాటి కారణంగా కూడా సమస్య రావచ్చు. అయితే ఇది పక్షవాతం అనే అపోహ కొందరిలో ఉంటుంది. అది ఎంత మాత్రమూ నిజం కాదు. కొన్నిరకాల మందులతో దీన్ని తగ్గించవచ్చు. ముఖానికి సంబంధించిన కండరాలకు ఫిజియోథెరపీ చేయడం వల్ల ఇది తొందరగా తగ్గే అవకాశం ఉంది. ఈ జబ్బు వచ్చిన వారిలో దాని తీవ్రతను బట్టి అది నయమయ్యే సమయం ఆధారపడి ఉంటుంది. నూటికి 80 నుంచి 90 మందిలో మొదటి ఆరు నెలల్లో నయమవుతుంది. బెల్స్పాల్సీ ముఖానికి సంబంధించిన కండరాలకు తప్పించి, శరీరంలోని ఏ భాగాలనూ ప్రభావితం చేయదు. అయితే... చేయి, కాళ్లలో బలం కోల్పోయినా, మింగడంలో ఇబ్బంది ఏర్పడినా, కనుచూపులో మార్పు కనబడినా... ఈ లక్షణాలలో ఏవి కనిపించినా తక్షణమే డాక్టర్‌ను సంప్రదించాల్సిన అవసరం ఉంది. మీరు చెప్పిన అంశాలను బట్టి మీరు అంతగా ఆందోళనపడాల్సిన అవసరం లేదు. డాక్టరును సంప్రదించి సరైన మందులు, ఫిజియోథెరపీ తీసుకోండి. బెల్స్ పాల్సీ తప్పక నయమవుతుంది. కొన్నేళ్లుగా తీవ్రమైన తలనొప్పి...ఎందుకిలా? నా వయసు 33. గత కొన్నేళ్లుగా నాకు తరచూ తలనొప్పి వస్తూ, తగ్గుతూ ఉంది. ఒక్కోసారి అది నెలలో నాలుగైదుసార్లు కూడా వస్తోంది. ఒక్కోసారి నా రోజువారీ పనులేవీ చేసుకోలేనంత తీవ్రంగా ఈ నొప్పి ఉంటోంది. నా సమస్యకు పరిష్కారం చెప్పండి. తరచూ తలనొప్పి రావడం, దాంతోపాటు వాంతులు, వెలుగును చూడటంలో ఇబ్బంది పడటం, పెద్ద శబ్దాలను తట్టుకోలేకపోవడం, చీకటి గదిలో కాసేపు నిద్రపోయాక తలనొప్పి ఉపశమించడం లాంటి లక్షణాలు ఉంటే అది మైగ్రేన్ కావచ్చు. మీకు మైగ్రేన్ తలనొప్పిని ప్రేరేపించే అంశం ఏమిటో చూడండి. అంటే... సూర్యకాంతికి ఎక్స్పోజ్ కావడం, ఘాటైన వాసనలు, పర్ఫ్యూమ్స్ లేదా సుగంధద్రవ్యాల వాసన, సమయానికి భోజనం చేయకపోవడం, నిద్రలేమి, మీరు తీసుకునే ఆహారపదార్థాలలో నిర్దిష్టంగా ఏదైనా సరిపడక వెంటనే తలనొప్పి రావడం (ఉదాహరణకు చీజ్, ఆరెంజ్, అరటిపండ్లు, అజినమోటో వంటి చైనా ఉప్పు, చాక్లెట్లు వంటివి) జరుగుతుంటే వెంటనే దాన్ని తీసుకోవడం ఆపేయండి. దాంతో తలనొప్పిని నివారించవచ్చు. మీకు వచ్చే తలనొప్పిని నివారించే టోపిరమేట్, డైవల్‌ప్రోయేట్, ఫ్లునరిజిన్, ప్రొపనలాల్ వంటి మందులు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. వాటిని తీసుకుంటే 70 శాతం వరకు మళ్లీ వచ్చే అవకాశం నివారితమవుతుంది. మీరు ఒకసారి న్యూరాలజిస్ట్‌ను సంప్రదించండి. డాక్టర్ బి. చంద్రశేఖర్ రెడ్డి, చీఫ్ న్యూరాలజిస్ట్, సిటీ న్యూరో సెంటర్, రోడ్ నెం. 12, బంజారాహిల్స్, హైదరాబాద్ -
నమో మంత్రమేనా!
‘‘బయటకి కనిపించడం లేదు కానీ ఈ సారి ఒక రాజకీయ పార్టీకి కాదు జనం ఓటు వేస్తున్నది. ఒక వ్యక్తిని చూసి వేస్తున్నారు. ఆయన కరిష్మా అలాంటిది. ప్రతిపక్షంలో అలాంటి నాయకుడే కనిపించడం లేదు. అందుకే అచ్చంగా 2014 మాదిరిగా, ఈ సారి కూడా భారతీయులు నమో మంత్రాన్నే జపిస్తున్నారు’’ ఇదీ కొందరు ఎన్నికల విశ్లేషకుల అభిప్రాయం ఏడు దశల ఎన్నికల్లో ఇప్పటికే నాలుగు దశలు ముగిసి, ఈరోజు ఐదో దశ పోలింగ్ జరుగనుంది. కాంగ్రెస్, బీజేపీ ముఖాముఖి పోరు ఉన్న రాష్ట్రాల్లో బీజేపీకే అనుకూలంగా పరిస్థితులు ఉన్నాయి. అదే సమయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో బీజేపీ విసిరిన సవాళ్లకు ఒడిశాలో బీజేడీ, పశ్చిమ బెంగాల్లో టీఎంసీ, యూపీలో బీఎస్పీ, ఎస్పీ కూటమి, బిహార్‌లో ఆర్జేడీ కూటమి బెదిరినట్టుగా కనిపించడం లేదు. కాంగ్రెస్ పార్టీ తమ బ్రహ్మాస్త్రం అంటూ తీసుకువచ్చిన ప్రియాంక గాంధీ, అధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఎన్నికల ప్రచారంలో ఎలాంటి కొత్తదనాన్ని చూపించలేకపోయారు. రాహుల్ ఎంతో గొప్పగా చెప్పుకున్న కనీస ఆదాయ పథకం (న్యాయ్)ని జనంలోకి తీసుకువెళ్లడంలో కూడా విఫలమైనట్టుగా క్షేత్రస్థాయిలో పరిస్థితులు తేటతెల్లం చేస్తున్నాయి. మోదీ ప్రచారం విభిన్నం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈసారి ఎన్నికల ప్రచారాన్ని కొత్త పుంతలు తొక్కించారు. ఎన్నికల ర్యాలీల నిర్వహణ దగ్గర్నుంచి మీడియాకు ఇచ్చే ఇంటర్వ్యూల వరకు తనని తాను కొత్తగా చూపించే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా వారణాసిలో నామినేషన్, గంగాహారతి, ఆ తర్వాత పడవలో ప్రయాణిస్తూ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలు ఎంతో కొత్తగా కనిపించాయి. మోదీ బయోపిక్ విడుదలకు బ్రేక్ పడిన తర్వాత బాలీవుడ్ స్టార్ అక్షయ్‌కుమార్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూపై ఓటర్లలో ఎనలేని ఆసక్తి కనిపించింది. గత ఎన్నికల్లో గుజరాత్ అభివృద్ధిని ఒక మోడల్‌గా చూపించిన మోదీ ఈసారి ఎన్నికల్ని గత అయిదేళ్లలో ప్రభుత్వం పనితీరుపై కాకుండా, తన వ్యక్తిగత ఇమేజ్ చుట్టూ తిప్పుకోవడమే కాదు, జాతీయ భద్రత అనే అంశాన్ని ఎక్కడికెక్కడ ప్రస్తావిస్తూ ఉద్వేగభరిత వాతావరణాన్ని సృష్టించారన్న అభిప్రాయమూ ఉంది. మోదీ కాకపోతే.. ఎవరు ? ఈ ప్రశ్నకు ప్రతిపక్షాల నుంచి సరైన సమాధానం లేదు. ప్రధానమంత్రితో ఢీ కొట్టే వ్యక్తి తానే భవిష్య ప్రధాని అని చెప్పుకోగలగాలి. కానీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తనకు పదవి ముఖ్యం కాదని, ప్రధాని రేసులో లేనని బహిరంగంగానే వెల్లడించారు. ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ఒక ఇంటర్వ్యూలో ‘‘మోదీ ప్రధాని కాక ముందు గుజరాత్ ముఖ్యమంత్రి. అలాంటి వాళ్లు చాలా మంది ఉన్నారు. నా అభిప్రాయంలో మమతాబెనర్జీ, చంద్రబాబు నాయుడు, మాయావతి వంటి నేతలే ప్రధాని పదవికి అర్హులు’’అని నిర్మొహమాటంగా చెప్పారు. ఆయన కూడా రాహుల్ పేరుని ప్రస్తావించలేదు సరికదా, తన పేరు కూడా తీసుకురాలేదు. ఇక ప్రధాని పదవికి తగినవారంటూ కితాబునిచ్చిన మమత, బాబు, మాయావతి పేర్లు ఓటర్లలో ఏ మాత్రం ఉత్సాహాన్ని తీసుకురాలేకపోయాయి ‘‘బీజేపీ సొంతంగా మేజిక్ ఫిగర్‌కు (272 సీట్లు) చేరుకోలేకపోతే కొత్త మిత్రులు వస్తారు. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు , శాశ్వత మిత్రులు ఉండరు‘‘అని మోదీ బృందంలో కీలక సభ్యుడొకరు వ్యాఖ్యానించారు. ఇక విపక్షాల మధ్య ఐక్యత కూడా కనిపించడం లేదు. మహాగఠ్ బంధన్ అన్నారు కానీ, చాలా చోట్ల పొత్తులున్నా ఎవరికి వారు అభ్యర్థుల్ని దింపారు పోటాపోటీ సమీకరణలు బీజేపీకి అనుకూలమా ? ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ వంటి కీలక రాష్ట్రాల్లో సామాజిక వర్గాల పోటాపోటీ సమీకరణలు బీజేపీకి కలిసివస్తున్నాయన్న వార్తలు వస్తున్నాయి. యూపీలో యాదవులు సహా కొన్ని బీసీ కులాలు, మాయావతి వర్గమైన దళితుల్లోని జాటవులు, ముస్లింల ఓట్లు ఎస్పీ, బీఎస్పీ, ఆర్ఎల్డీతో కూడిన మహాకూటమికి ఇప్పటివరకు జరిగిన నాలుగు దశల్లో పడినట్టుగా విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఫలితంగా అగ్రవర్ణాలతో పాటు మిగిలిన సామాజికవర్గాలైన యాదవేతర బీసీలు, జాటవేతర దళితులు బీజేపీకి అనుకూలంగా మారారు. మోదీ హయాంలో గోవధ నెపంతో మూకదాడులు వంటి చర్యలు ముస్లింలలో అభద్రతా భావాన్ని పెంచాయి. వారి ఓట్లను తమవైపు తిప్పుకోవడానికి కాంగ్రెస్ పార్టీ చిన్న ప్రయత్నం కూడా చేయలేదు. వాళ్ల ఓట్లు ఎక్కడికీ పోవు అన్న ధీమాతో ముస్లింలు నిర్ణయాత్మకంగా ఉండే నియోజకవర్గాల్లో ప్రచారం కూడా చేయలేదు. దీంతో పోలింగ్ బూతులకు వచ్చి ఓటు వేయాలన్న ఉత్సాహం ముస్లిం ఓటర్లకు కలగలేదు. ముంబై వంటి నగరాల్లో ముస్లింల ఓటింగ్ శాతం గణనీయంగా పడిపోయింది. ఇది బీజేపీకి అనుకూలంగా మారుతుందని ఎన్నికల విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కొన్ని రాష్ట్రాల్లో సవాళ్లు మొత్తం లోక్‌సభ స్థానాలు : 543 నాలుగు దశల్లో పోలింగ్ జరిగిన స్థానాలు : 374 మిగిలిన మూడు దశల్లో పోలింగ్ జరిగే సీట్లు : 169 ఈ సీట్లు బీజేపీకి అత్యంత కీలకం. చాలా చోట్ల కాంగ్రెస్‌తో ముఖాముఖి పోరు ఇక్కడే ఉంది. ఉత్తరప్రదేశ్, బిహార్, మధ్యప్రదేశ్, రాజస్తాన్, జార్ఖండ్ రాష్ట్రాల్లో అయిదేళ్ల క్రితం బీజేపీకి ఉన్న పట్టు ఇప్పుడు లేదు. అందుకే పశ్చిమ బెంగాల్, ఒడిశా రాష్ట్రాలపై మోదీ, షా ద్వయం గంపెడు ఆశలు పెట్టుకుంది. గత ఎన్నికల్లో బెంగాల్లో రెండు, ఒడిశాలో ఒక్క స్థానానికి పరిమితమైన బీజేపీ ఈసారి కనీసం చెరో 10 సీట్లు అయినా సాధించాలని ప్రణాళికలు రచించింది. ఒడిశాలో నవీన్ పట్నాయక్ 20 ఏళ్లుగా సీఎంగా ఉండడంతో ఎంతో కొంత ఉన్న ప్రభుత్వ వ్యతిరేకత బీజేపీకి అనుకూలంగా మారినట్టు ఒక అంచనా. బీజేడీ నుంచి ఫిరాయింపుదారులకే ఈ సారి బీజేపీ టికెట్లు ఇచ్చి రంగంలోకి దింపింది. ఇక బిహార్‌లో మోదీ, నితీశ్ ద్వయానికి అనుకూల పవనాలు వీస్తున్నట్టుగానే ఉంది. వీరిద్దరికీ ఎల్జేపీ రామ్‌విలాస్ పాశ్వాన్ జత కట్టడంతో ఎన్టీయే ఎక్కువ సీట్లు సాధించే అవకాశాలున్నట్టు విశ్లేషకులు చెబుతున్నారు. ప్రతిపక్ష ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ జైల్లో ఉండడంతో మహాగఠ్‌బంధన్‌కి పరిస్థితులు పెద్దగా అనుకూలంగా లేవు. జార్ఖండ్‌లో కాంగ్రెస్ నేతృత్వంలో మహాగఠ్‌బంధన్ గట్టిపోటీయే ఇస్తోంది. మొత్తం 14 సీట్లకు గాను గత ఎన్నికల్లో బీజేపీ 12 స్థానాల్లో గెలుపొందింది. అయితే కాంగ్రెస్, జేఎంఎం, బాబూలాల్ మరాండీకి చెందిన జేవీఎం, ఆర్జేడీ చేతులు కలపడంతో మోదీ దూకుడికి కళ్లెం పడే అవకాశముంది. గత ఎన్నికల మాదిరిగా రాష్ట్రాలకు రాష్ట్రాల ను క్లీన్ స్వీప్ చేయలేకపోయినా కొత్త రాష్ట్రాల్లో పట్టు బిగించడం, కొత్త మిత్రులందర్నీ చేరదీయడం ద్వారా రెండోసారి ప్రధాని పీఠం మోదీయే చేజిక్కించుకుంటారని ఎన్నికల విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. సట్టా బజార్లోనూ మోదీ సత్తా లోక్‌సభ ఫలితాలకు ఇంకా కొద్ది రోజులే మిగిలి ఉండగా సట్టా బజార్లో పందెంరాయుళ్లు బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తుందని అంచనా వేస్తున్నారు. మోదీకి అనుకూలంగా కోట్లలో బెట్టింగ్‌లు కాస్తున్నారు. బుకీల అంచనాల ప్రకారం ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయంటే రాజస్థాన్‌లో మొత్తం 25 స్థానాలకు గాను గత ఎన్నికల్లో బీజేపీ క్లీన్ స్వీప్ చేసింది. ఈ సారి బీజేపీకి 18 సీట్లు వస్తాయని అత్యధికులు పందెం కాస్తున్నారు. యూపీ : 41 స్థానాలు మధ్యప్రదేశ్ : 20–22 స్థానాలు గుజరాత్ : 22–24 సీట్లు బిహార్ 12–14 స్థానాలు (పోటీ చేసిన స్థానాలు 17) పశ్చిమబెంగాల్ : 8–11 హరియాణా : 7–9 ఢిల్లీ : 5–7 సీట్లు మహారాష్ట్రలో బీజేపీ–శివసేనకు కలిసి: 31–34 సీట్లు -
జ్వరమా... మలేరియా కావచ్చు!
జ్వరమా... అయితే మలేరియా కావచ్చు అనేది వైద్య ఆరోగ్యశాఖ ద్వారా కొన్నేళ్లుగా ప్రజల్లోకి బాగా వెళ్లిన మాట. ఒకప్పుడు ప్రతి జ్వర పీడితుడిని పరీక్షించి మలేరియా వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేసేవారు. కానీ ఇప్పుడు మలేరియాగా నిర్ధారించినా నివేదికలకు మాత్రం ఎక్కడం లేదు. కేసులు అధికమైతే ఉన్నతాధికారుల నుంచి ఇబ్బందులు ఎదురవుతాయని భావించి సిబ్బంది వ్యాధిగ్రస్తుల వివరాలను దాచి పెడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వ్యాధి నివారణకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఎదురు చూసేకన్నావ్యాధికారక దోమలను నివారించుకోవడంతో మనకు మనమే మలేరియాను పారదోలాల్సిన సమయం ఆసన్నమైంది. నేడు ‘ప్రపంచ మలేరియా దినోత్సవం’ సందర్భంగా ప్రత్యేక కథనం. కర్నూలు(హాస్పిటల్) :జిల్లాలో 87 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 18 కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, ఒక ఏరియా ఆసుపత్రి, ఒక జిల్లా ఆసుపత్రి, ఒక బోధనాసుపత్రి, 542 సబ్‌సెంటర్లు ఉన్నాయి. జిల్లాలో కృష్ణానది, తుంగభద్ర, హంద్రీ, కుందు నదితో పాటు కేసీ కెనాల్, హంద్రీనీవా కాలువ, తెలుగుగంగ, శ్రీశైలం రైట్ బ్రాంచ్ కెనాల్, ఎల్ఎల్సీ కాలువ తదితరాలు ఉన్నాయి. వీటితో పాటు శ్రీశైలం ప్రాజెక్టు, గాజులదిన్నె ప్రాజెక్టు, సుంకేసుల ప్రాజెక్టు, వెలుగోడు రిజర్వాయర్లు ఉండటం వల్ల మలేరియా కేసులు ఎక్కువగా నమోదవుతున్నట్లు వైద్య ఆరోగ్యశాఖ పేర్కొంటోంది. దీంతో పాటు 18 శాతం నల్లమల అటవీప్రాంతాల్లోని 42 చెంచుగూడెల్లో మలేరియా రావడానికి అధికంగా ఆస్కారం ఉందని నిర్ధారించింది. ఈ మేరకు ఆళ్లగడ్డ, రుద్రవరం, చాగలమర్రి, మహానంది, ఆత్మకూరు, కొత్తపల్లి, వెలుగోడు, పాణ్యం, బండి ఆత్మకూరు, గడివేముల, శ్రీశైలం మండలాల్లోని 50 గ్రామాలను సమస్యత్మక (మలేరియా వ్యాప్తికి అవకాశం ఎక్కువ) గ్రామాలుగా గుర్తించారు. కేసులు తగ్గించే పనిలో వైద్యఆరోగ్య శాఖ.. ఒకప్పుడు ప్రతి ఒక్క జ్వరపీడితుడిని రక్తపరీక్ష చేసి మలేరియా నిర్ధారించిన వైద్య ఆరోగ్యశాఖ ఇప్పుడు కేసులు తగ్గించేపనిలో పడింది. ఐదేళ్లుగా జ్వరపీడితుల సంఖ్య వాస్తవంగా తగ్గకపోయినా ఆ శాఖ అధికారులు తగ్గుతున్నట్లు నివేదికలు తయారు చేస్తున్నారు. ప్రతి సంవత్సరం 5లక్షల 20వేలకు తగ్గకుండా రక్తనమూనాలకు పరీక్షలు(మలేరియా) చేస్తున్నారు. అయితే ఇందులో అన్ని కేసుల్లోనూ దాదాపుగా మలేరియా లేనట్లు వస్తోంది. లెక్కలు మార్చి చూపడం తప్ప వాస్తవాన్ని దాచిపెడుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. మలేరియా తగ్గుముఖం పడుతోంది గత నాలుగేళ్లతో పోలిస్తే ప్రస్తుతం జిల్లాలో మలేరియా వ్యాధి తగ్గుముఖం పడుతోందని డీఎంహెచ్ఓ డాక్టర్ జేవీవీఆర్‌కే ప్రసాద్ చెప్పారు. ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మలేరియా నివారణ చర్యల్లో భాగంగా సమస్యాత్మక ప్రాంతాల్లో జూన్ ఒకటి నుంచి డీడీటీ 50 శాతం పిచికారీ చేయిస్తున్నామన్నారు. జిల్లాలోని 12 మలేరియా సబ్యూనిట్స్లో అవసరమైన కీటక సంహారక మందులను, పనిముట్లను అందుబాటులో ఉంచుతున్నామని చెప్పారు. గిరిజన ప్రాంతాల్లో పంపిణీ చేసిన దోమతెరలను ప్రజలు సక్రమంగా వినియోగించుకునేలా హెల్త్ సిబ్బందిచే అవగాహన కల్పిస్తున్నామన్నారు. గ్రామపంచాయతీ, పురపాలక, నగర పాలక సంస్థల సహకారంతో దోమల నివారణకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. సమావేశంలో జిల్లా మలేరియా అధికారి ఎ. నూకరాజు, క్షయ నియంత్రణాధికారి డాక్టర్ శ్రీదేవి, ఆర్బీఎస్కే కో ఆర్డినేటర్ హేమలత తదితరులు పాల్గొన్నారు. వ్యాధిలక్షణాలు 1. చలి, వణుకుతో కూడిన జ్వరం. సరైన వ్యాధి నిర్ధారణ, చికిత్స లేకపోతే నెలల తరబడి బాధిస్తుంది. 2. ప్లాస్మోడియా జాతికి చెందిన రెండు క్రిముల వల్ల మన ప్రాంతంలో మలేరియా వస్తోంది. 3. ఇందులో వైవాక్స్ మలేరియా తక్కువగా బాధిస్తే, పాల్సిఫారమ్ మలేరియా ఎక్కువ బాధించడమే కాకుండా కొన్ని పరిస్థితుల్లో ప్రమాదస్థాయికి చేరుతుంది. 4. మన్య(గిరిజన) ప్రాంతాల్లో పాల్సిఫారమ్ మలేరియా ఎక్కువగా, మైదాన, పట్టణ ప్రాంతాల్లో వైవాక్స్ మలేరియా ఎక్కువగా ప్రబలుతోంది. ఇలా వ్యాపిస్తుంది ♦ ఆడ అనాఫిలిస్ దోమకాటు ద్వారా ఒకరి నుంచి మరొరికి వ్యాధికారక క్రిమి ప్లాస్మోడియా వ్యాప్తి చెందుతుంది. ♦ దోమకుట్టిన 8 నుంచి 12 రోజుల్లో వ్యాధి లక్షణాలు బయటపడతాయి. ♦ చిన్నపిల్లలకు, గర్భిణులకు ఈ వ్యాధి ప్రమాదకరమైనది. చికిత్స: మలేరియా వ్యాధిగ్రస్తులు క్లోరోక్విన్, ప్రైమాక్విన్ అనే మందుతో పూర్తి మోతాదులో రాడికల్ చికిత్స చేయించాలి. పీవీ మలేరియాకు 14 రోజులు, పీఎఫ్ మలేరియాకు మూడు రోజుల చికిత్స చేయాలి. మధ్యలో మానేస్తే వ్యాధి తిరగబెడుతుంది. మలేరియా రాకుండా జాగ్రత్తలు 1. వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రత పాటించాలి. 2. ఇళ్లలో గోడలపై దోమల మందు చల్లించుకోవాలి. 3. కట్టడాలకు సంబంధించిన నీటి నిల్వలు లేకుండా చూడాలి. 4. అనాఫిలిస్ దోమలు మంచినీటి నిల్వల్లో గుడ్లు పెట్టి, లార్వా, ప్యూపాగా పెరిగి పెద్ద దోమలుగా మారతాయి. 5. దోమతెరలను వాడాలి. ఆరు బయట నిద్రించరాదు. 6. ఖాళీ కడుపుతో మలేరియా చికిత్స మాత్రలు మింగరాదు 7. పూర్తి మోతాదులో మాత్రలు మింగాలి. -
జ్వరానికీ మాత్రల్లేవు!
చిత్తూరు ప్రభుత్వ ఆస్పత్రిలో జ్వరంతో వచ్చే బాధితులకు మూడు రోజులకు పది పారాసిటమాల్ మాత్రలు ఇవ్వాలి. కానీ ఇప్పుడు ఒక్కో బాధితులకు ఆరు మాత్రలే ఇస్తున్నారు. ఇదేమిటని అడిగితే స్టాకు లేదంటున్నారు. ఇక రెండు నెలలుగా పారాసిటమాల్ మాత్రలు సరఫరా లేకపోవడంతో ఆస్పత్రి సిబ్బంది బయటి మెడికల్ దుకాణాల్లో రూ.10 లక్షలు అప్పుచేసి మాత్రలు కొన్నారు. బాకీ తీర్చమని దుకాణ నిర్వాహకులు ఒత్తిడి తేవడంతో హెచ్‌డీఎస్ నిధుల నుంచి రూ.7 లక్షలు చెల్లించారు.’’ చిత్తూరు అర్బన్: ఇదొక్కటేకాదు జిల్లాలోని అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఇదే పరిస్థితి. రెండు నెలలుగా ప్రభుత్వం పారాసిటమాల్ మాత్రలను సరఫరానే చేయలేదు. ఫలితంగా రోజుకు సర్కారీ ఆస్పత్రికి వచ్చే చాలామంది జ్వరబాధితులకు పారాసిటమాల్ మాత్రలు లేవని చెబుతున్న సిబ్బంది రోగులనుతిప్పి పంపించేస్తున్నారు. జిల్లాలోని పీహెచ్సీ, సీహెచ్‌సీలతో పాటు అన్ని ప్రభుత్వ ఆస్పత్రులతో కలిపి రోజుకు జ్వరంతో వచ్చేవారి సంఖ్య పది వేల వరకు ఉంటుంది. ఒక్కసారి జ్వరంతో వచ్చే బాధితులను పరిశీలించిన వైద్యులు సూదిమందు వేయడంతో పాటు పది పారాసిటమాల్ మాత్రలను రాసిస్తారు. వీటిని మూడు రోజుల వరకు తీసుకోవాల్సి ఉంటుంది. కానీ ఇప్పుడు రెండు రోజులకే మాత్రలు ఇస్తున్నారు. ప్రస్తుత పరిస్థితి మాత్రలు, సూది మందులు, సిరప్‌లాంటి వాటిని రాష్ట్ర వైద్యశాఖ సరఫరా చేస్తుంది. ఇందుకోసం రాష్ట్ర వైద్యసేవలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ (ఏపీఎంఎస్ఐడీసీ)కు టెండర్లను అప్పగించి ప్రతి జిల్లాకు కావాల్సిన మందులను తిరుపతిలోని సెంట్రల్ డ్రగ్ స్టోర్‌కు (సీడీఎస్) పంపిణీ చేస్తారు. జిల్లా నుంచి ప్రతి వైద్యశాలకు ఏయే మందులు కావాలని ఈ–ఔషధి ద్వారా ఆన్లైన్లో అడిగితే వాటిని తిరుపతిలోని డ్రగ్‌స్టోర్ నుంచి తీసుకోవచ్చు. సంవత్సరంలో నాలుగుసార్లు మందుల జాబితాను ఈ–ఔషధి ద్వారా తీసుకోవాలి. జిల్లాలోని అన్ని ప్రభుత్వ వైద్యశాలలు మూడు నెలలకు ఓసారి మందుల జాబితాను ఆన్లైన్లో ఉంచి సీడీఎస్ నుంచి వీటిని తీసుకుంటారు. జిల్లాకు జనవరిలో పారాసిటమాల్ మాత్రలు ఇచ్చిన ప్రభుత్వం దాని తరువాత ఇప్పటివరకు సరఫరాను ఇవ్వలేదు. గతనెల సీడీఎస్‌లో మిగిలిన మాత్రలను అన్ని ప్రభుత్వ ఆస్పత్రులకు సర్దేశారు. ఈ నెల ఒకటో తేదీ నుంచి ఒక్కటంటే ఒక్క పారాసిటమాల్ మాత్ర సీడీఎస్‌లో నిల్వలేకపోవడం ప్రజారోగ్యంపై పాలకుల నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. కనీసం నెల రోజులకు పారాసెట్మాల్ మాత్రలను జిల్లాలోని అన్ని ఆస్పత్రుల్లో రిజర్వులో ఉండాలి. అంటే ఇప్పటికిప్పుడు జిల్లాకు 60 లక్షల పారాసిటమాల్ మాత్రల కొరత ఉంది. కొనుగోలుకు నిధులేవీ? ప్రభుత్వ ఆస్పత్రుల్లో అత్యవసర మందుల కొనుగోలుకు డీసెంట్రలైజ్డ్ లోక్ పర్చేస్ డ్రగ్స్ బడ్జెట్‌ను ప్రతి మూడు నెలలకోసారి విడుదలచేయాలి. ఒక్కో ఆస్పత్రికి 10 శాతం నిధులను ఆయా ఆస్పత్రుల పర్యవేక్షకుల బ్యాంకు ఖాతాల్లో జమచేయాలి. వీటితో అవసరమైన మందులను కొనుగోలు చేసుకుంటూ రోగులకు ఇబ్బందిలేకుండా అధికారులు జాగ్రత్త తీసుకుంటారు. అయితే ఏడాది కాలంగా ఈ నిధులను ప్రభుత్వం విడుదల చేయలేదు. ఇలాగైతే కష్టమని ప్రశ్నిస్తున్న వైద్యులకు ఓ ఉచిత సలహా ఇస్తున్నారు. మెడికల్ దుకాణాల్లో అప్పులు చేయమని చెబుతున్నారు. విధిలేక ఇప్పటికే జిల్లాలోని అన్ని ప్రభుత్వ వైద్యశాలలు రూ.లక్షల్లో అప్పులు చేశాయి. -
పాఠశాల సిబ్బంది నిర్లక్ష్యానికి విద్యార్థిని బలి!
సాక్షి, బజార్హత్నూర్(బోథ్): చిన్నపాటి జ్వరానికే ఓ విద్యార్థిని మృతి చెందిన సంఘటన శుక్రవారం మండలంలో జరిగింది. ఈ ఘటన అందరినీ విస్తుగొల్పింది. అయితే, చిన్నారి మృతికి పాఠశాల సిబ్బంది నిర్లక్ష్యమే కారణమని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి. బజార్హత్నూర్ మండలం కొలాంగూడ గ్రామానికి చెందిన కొడప మల్లేశ్వరి అదే మండలంలోని మాడగూడ గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో 4వ తరగతి చదువుతోది. గురువారం ఉదయం నుంచి మల్లేశ్వరి జ్వరంతో బాదపడుతుంటే పాఠశాలకు చెందిన ఏఎన్ఎం అనుసూయ పారసెటమల్ మాత్రలు ఇచ్చింది. కానీ, సాయంత్రం వరకు జ్వరం తగ్గకపోవడం, వాంతులు, విరేచనాలు కూడా కావడంతో ఆ సమయంలో హెచ్ఎం రమేష్, ఏఎన్ఎం అనసూయ అందుబాటులో లేకపోడడంతో వార్డెన్ దేవరావ్ బజార్హత్నూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లారు. అక్కడి నుంచి బోథ్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఇక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం వేకువజామున మల్లీశ్వరి అపస్మారకస్థితికి చేరుకుంది. దీంతో వెంటనే ఆదిలాబాద్ రిమ్స్‌కు తరలించారు. కానీ, అప్పటికే విద్యార్థిని మృతి చెందినట్లు రిమ్స్ వైద్యులు తెలపడంతో మృతదేహాన్ని స్వగ్రామమైన కొలాంగూడ గ్రామానికి తరలించారు. ఈ క్రమంలోనే చిన్నారి మృతదేహాన్ని అంబు లెన్స్‌లో తీసుకెళ్లుండగా తన కూతురు మరణానికి పాఠశాల సిబ్బందే కారణమని మృతురాలి తండ్రి కొడప నారాయణ హెచ్ఎంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ దాడి చేయబోయారు. కానీ, గ్రామస్తులు సముదాయించి అతన్ని శాంతింపజేశారు. కుటుంబ సభ్యులు కూడా తమకు న్యాయం చేసేవరకు చిన్నారి మృతదేహంను తీసుకోమని బీష్మించారు. పాఠశాల సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం, రెండెకరాల సాగుభూమి ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీంతో సంఘటన స్థలానికి చేరుకున్న ఎస్సై అబ్దుల్బాఖీ, ఏటీడీవో సౌజన్య ఫోన్లో ఐటీడీఏ డీడీ చందనతో మాట్లాడి బాధిత కుటుంబ సభ్యులకు న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో మృతదేహాన్ని తీసుకెళ్లారు. రాత్రి దాకా చెప్పలేదు.. చిన్నారి మల్లీశ్వరి గురువారం ఉదయం నుంచే జ్వరంతో బాదపడుతున్నా.. ఈ విషయాన్ని తమ కు తెలుపలేదనీ, రాత్రి మాత్రం బజార్హత్నూర్ పీహెచ్‌సీకి తీసుకెళ్తున్నామని మాత్రం తెలిపారని తల్లితండ్రులు కొడప నారాయణ, రుక్మబాయి బోరున విలపిస్తూ వివరించారు. అనారోగ్యంతో ఉన్నప్పుడు ఒక మాట కూడా తెలుపలేదని రాత్రి కూడా ఇదే విషయమడిగితే నిర్లక్ష్యంగా మాట్లాడారని మారోపించారు. గురువారమే తమకు చెప్పి ఉంటే ఎలాగోలా కూతురిని కాపాడుకునేవాళ్లమని వారు కన్నీరుమున్నీరయ్యారు. బాధ్యులపై చర్యలు తీసుకుంటాం.. మల్లీశ్వరి మృతి విషయం తెలుసుకున్న ఏటీడీవో సౌజన్య కొలాంగూడ గ్రామానికి చేరుకుని ఆమె తల్లితండ్రులను ఓదార్చారు. అనంతరం మాడగూడ ఆశ్రమ పాఠశాలకు చేరుకుని విచారణ చేపట్టారు. ప్రతీ తరగతి గదికి వెళ్లి విద్యార్థులను విచారించారు. భోజనాన్ని, తాగునీరు, పరిసరాలను పరిశీలించారు. విద్యార్థిని మృతి రిపోర్ట్‌ను ఉన్నతాధికారులకు పంపి, బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ఆమె తెలిపారు. పాఠశాలలో హెల్త్ క్యాంప్ విద్యార్థిని మృతి సంఘటనతో అప్రమత్తమైన వైద్యారోగ్య సిబ్బంది మాడగూడ ఆశ్రమ పాఠశాల వసతి గృహంలో శుక్రవారం ప్రభుత్వ వైద్యుడు హరీష్ అధ్వర్యంలో హెల్త్ క్యాంప్ నిర్వహించారు. అన్ని తరగతుల విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. హెల్త్ అసిస్టెంట్ గాజుల రమేష్, ఏఎన్ఎం అనసూయ పాల్గొన్నారు. -
బాబోయ్ జ్వరాలు..
సాక్షి, గార: మండలంలో వైరల్ జ్వరాలు విజృంభిస్తున్నాయి. వాతావరణంలో మార్పులు రావడం, ఎండలు మండిపోతుండడంతో ఉపాధి వేతనదారులు, చిన్నారులు, వృద్ధులు జ్వరాల బారిన పడుతున్నారు. అయితే అంతా ఎన్నికల బిజీలో ఉండడంతో వీరు ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారు. వైద్యారోగ్య శాఖ మండలంలో వైద్య శిబిరాలు నిర్వహిస్తే బాగుంటుందని వారు అభిప్రాయపడుతున్నారు. మండలంలో శ్రీకూర్మం పంచాయతీలో సెగిడిపేట తదితర గ్రామాలతో పాటు, సైరిగాం పంచాయతీ అప్పోజీపేట, రామచంద్రాపురం, గొంటి పంచాయతీల పరిధిలో అధికంగా జ్వర బాధితులు ఉన్నారు. ఏడు రోజులుగా బాధపడుతున్నా.. ఏడు రోజులుగా జ్వరం వస్తోంది. గ్రామంలోని డాక్టరును అడిగితే మందులు ఇచ్చారు. కానీ తగ్గలేదు. మండలంలో పెద్ద డాక్టరు దగ్గరుకు వెళ్లినా ఏమాత్రం మార్పులేదు. మందులు వాడుతున్నా జ్వరం తగ్గడం లేదు. – బరాటం వెంకటేశ్వరరావు, అప్పోజీపేట మరో ఊరెళ్తున్నాం.. ఊర్లో జ్వరం ఉందని చెబితే మందులిచ్చారు. తగ్గలేదు సరికదా ఒళ్లంతా (శరీరమంతా) ఊపేస్తుంది. ఇంకో ఊరెళ్లి వైద్యం చేయించుకుంటున్నాం. అయినా జ్వరం తగ్గడం లేదు. తిండి తినడం లేదు. – కిల్లాన అచ్చెమ్మ, సెగిడిపేట, శ్రీకూర్మం -
బాబుకు తరచూ విరేచనాలు... తగ్గేదెలా?
మా బాబుకు రెండేళ్లు. రెండు నెలల క్రితం వాడికి చాలా ఎక్కువగా విరేచనాలు అయ్యాయి. అప్పుడు హాస్పిటల్లో కూడా అడ్మిట్ చేయాల్సి వచ్చింది. అప్పట్నుంచీ తరచూ విరేచనాలు అవుతున్నాయి. మందులు వాడినప్పుడు కొద్దిగా తగ్గి, వెంటనే మళ్లీ పెరుగుతున్నాయి. ఎందుకిలా జరుగుతోంది? మీరు వివరించిన లక్షణాలను బట్టి మీ అబ్బాయికి దీర్ఘకాలిక (క్రానిక్) డయేరియా ఉన్నట్లు చెప్పవచ్చు. ఇలా విరేచనాలు రెండు వారాలకంటే ఎక్కువగా కొనసాగితే వాటిని దీర్ఘకాలిక డయేరియాగా పరిగణించవచ్చు. దీర్ఘకాలిక డయేరియాకు మన పరిసరాలను బట్టి ఇన్ఫెక్షన్స్ ప్రధాన కారణం. వైరల్, బ్యాక్టీరియల్, పోస్ట్ ఇన్ఫెక్షియస్, ట్రాపికల్ స్ప్రూ వంటివి ఇన్ఫెక్షన్స్ కారణమవుతాయి. ఈ అంశాలతోపాటు ఎంజైమ్స్, ఆహారం అరుగుదలలో మార్పులు... అందులోనూ మరీ ముఖ్యంగా చక్కెర పదార్థాలు, ప్రోటీన్ల అరుగుదలలో మార్పులు కూడా ఇందుకు కారణాలు కావచ్చు. వాటితో పాటు ఇమ్యూనలాజికల్, అలర్జిక్ వంటి అంశాలు కూడా విరేచనాలకు కారణమవుతాయి. అలాగే పేగుల స్వరూపంలో లోపాలు (స్ట్రక్చరల్ డిఫెక్ట్స్) కూడా కారణం కావచ్చు. పేగుల కదలిక (మొటిలిటీ)లో మార్పులు కూడా విరేచనాలకు దోహదం చేస్తాయి. వీటికి తోడు ఎండోక్రైన్ కారణాలనూ పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. ఇలాంటి అనేక కారణాల వల్ల పిల్లలకు దీర్ఘకాలిక విరేచనాలు రావడం జరుగుతుంటుంది. పిల్లల్లో వాళ్ల బరువు / ఎదుగుదల నార్మల్‌గా ఉంటే చాలావరకు తీవ్రమైన (సీరియస్) అంశాలు అందుకు కారణం కాకపోవచ్చు. అంటే... ఐబీడీ, ఎంజైముల్లో లోపాలు, అనటామికల్ లోపాలు, ఇమ్యూనలాజికల్ సమస్యల వంటివి అందుకు కారణం అయ్యే అవకాశం పెద్దగా లేదు. ఇక పిల్లలకు దీర్ఘకాలిక విరేచనాలు అవుతున్న సందర్భంలో కంప్లీట్ స్టూల్ ఎగ్జామినేషన్ (క్రానిక్ డయేరియా వర్కప్), కొన్ని స్పెషల్ బ్లడ్ ఇన్వెస్టిగేషన్స్, ఎంజైమ్ పరీక్షలు, అవసరాన్ని బట్టి ఇంటస్టైనల్ బయాప్సీ, మైక్రో బయలాజికల్ పరీక్షలు, ఇంటస్టినల్ మార్ఫాలజీ పరీక్షలు, ఇమ్యూనలాజికల్ పరీక్షలు చేయించడం వల్ల నిర్దిష్టంగా కారణాన్ని తెలుసునే అవకావం ఉంటుంది. మీరు చెప్పిన లక్షణాలను బట్టి చూస్తే మీ బాబుకు ‘పోస్ట్ ఎంటరైటిస్’ అనే కండిషన్ ఉన్నట్లుగా తెలుస్తోంది. అంటే... ఒక ఇన్ఫెక్షన్ వచ్చి తగ్గాక లోపల జరిగిన నష్టం (డ్యామేజీ) వల్ల కొన్ని ఆహారాల పట్ల అతడి కడుపు సెన్సిటివిటీని వృద్ధి చేసుకొని ఉండవచ్చు. దీనివల్ల పదే పదే మోషన్స్ అవుతుండవచ్చు. అయితే మీ బాబు వయసున్న పిల్లల్లో కొన్నిసార్లు రోజుకు 3 నుంచి 6 సార్లు విరేచనాలు కావడం నార్మల్‌గా కూడా జరగవచ్చు. దీన్ని ‘టాడ్లర్స్ డయేరియా’ అంటారు. మీ బాబు తీసుకున్న ఆహారం అతడి ఆహారకోశంలో ఉండాల్సిన టైమ్ కంటే తక్కువగా ఉండటం (డిక్రీజ్డ్ గట్ ట్రాన్జిట్ టైమ్) కూడా ఒక కారణం కావచ్చు. పై కండిషన్స్ వాటంతట అవే తగ్గిపోతాయి. తీసుకునే ఆహారంలో కొద్దిగా ఫైబర్ తగ్గించడం, చక్కెర పదార్థాలను పూర్తిగా మానేయడం ద్వారా గట్‌ఫ్లోరా పూర్తిగా రీప్లేస్ చేయడం వల్ల ఈ కండిషన్స్ నుంచి ఉపశమనం పొందవచ్చు. ఇలాంటి పిల్లలకు సరైన ఆహారం ఇవ్వడం, జింక్, ఫోలిక్ యాసిడ్ సప్లిమెంట్లు, విటమిన్–ఏ ఇవ్వడం, ఇన్ఫెక్షన్ ఉంటే దానికి తగిన చికిత్స చేయడం వల్ల పై కండిషన్లను పూర్తిగా నయం చేయవచ్చు. అప్పటికీ డయేరియా లక్షణాలు తగ్గకుండా ఉంటే ఇతర కారణాలను కనుగొని, వాటికి తగు చికిత్స తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి మీరు ఒకసారి మీ పీడియాట్రీషియన్‌ను సంప్రదించి తగు చికిత్స తీసుకోండి. మాటిమాటికీ జ్వరం... నయమయ్యేదెలా? మా బాబుకు పది నెలలు. వాడికి ఈమధ్య మాటిమాటికీ జ్వరం వస్తోంది. డాక్టర్‌కు చూపిస్తే యూరినరీ ఇన్ఫెక్షన్ కారణంగా ఇలా తరచూ జ్వరం వస్తోందంటున్నారు. మాకు ఆందోళనగా ఉంది. తగిన పరిష్కారం చెప్పండి. మీరు చెప్పిన లక్షణాలను బట్టి మీ బాబుకు ‘యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్’గా చెప్పవచ్చు. యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ నెలల పిల్లల్లోనూ చాలా సాధారణంగా కనిపిస్తుంటాయి. ఏడాది లోపు వయసుండే చిన్నపిల్లల్లో యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్లు మగపిల్లల్లోనే ఎక్కువ. అయితే పిల్లల్లో వయసు పెరిగే కొద్దీ ఈ పరిస్థితి తారుమారై... మగపిల్లల కంటే ఆడపిల్లల్లోనే ఇవి ఎక్కువగా కనిపిస్తుంటాయి. చిన్నపిల్లల్లో యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్లకు అనేక కారణాలుంటాయి. వయసు, జెండర్, వ్యాధి నిరోధక శక్తి, మూత్ర కోశ అంతర్గత అవయవ నిర్మాణంలో ఏవైనా తేడాలు, విసర్జన తర్వాత ఎంతో కొంత మూత్రం లోపలే మిగిలిపోవడం (వాయిడింగ్ డిస్ఫంక్షన్), మలబద్దకం, వ్యక్తిగత పరిశుభ్రత సరిగా పాటించకపోవడం వంటివి యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్లు వచ్చేందుకు కొన్ని కారణాలుగా చెప్పవచ్చు. లక్షణాల ఆధారంగా కొన్నిసార్లు యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్లను నిర్ధారణ చేయడం కాస్త కష్టమే. ఎందుకంటే ఈ లక్షణాలు నిర్దిష్టంగా ఉండవు. రకరకాలుగా కనిపిస్తూ ఉంటాయి. అంటే... కొన్ని లక్షణాలు సెప్సిస్, గ్యాస్ట్రోఎంటిరైటిస్లా కూడా ఉంటాయి. యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ ఉన్న పిల్లల్లో జ్వరం, త్వరగా చిరాకు పడటం, ఆహారం సరిగా తీసుకోకపోవడం, వాంతులు, నీళ్లవిరేచనాలు, మూత్రవిసర్జనను నియంత్రించుకోలేకపోవడం, మూత్రవిసర్జన సమయంలో నొప్పి, పొత్తికడుపులో నొప్పి, చుక్కలు చుక్కలుగా మూత్రం పడటం వంటి లక్షణాల ఉంటాయి. వాటి సహాయంతో దీన్ని గుర్తించవచ్చు. పిల్లల్లో... మరీ ముఖ్యంగా నెలల పిల్లల్లో యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ను డయాగ్నోజ్ చేసినప్పుడు వారిలో మూత్ర కోశ వ్యవస్థ (జెనిటోయూరినరీ సిస్టమ్)కు సంబంధించి ఏదైనా లోపాలు (అబ్నార్మాలిటీస్) ఉన్నాయేమో పరీక్షించడం తప్పనిసరిగా అవసరం. ఉదాహరణకు ఇలాంటి పిల్లల్లో ఫైమోసిస్, విసైకో యూరేటరీ రిఫ్లక్స్ (వీయూఆర్), కిడ్నీ అబ్నార్మాలిటీస్ వంటి సమస్యలు ఉన్నప్పుడు వాళ్లకు యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ. కాబట్టి పిల్లల్లో పదేపదే యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ కనిపిస్తే తప్పనిసరిగా కంప్లీట్ యూరినరీ ఎగ్జామినేషన్ విత్ కల్చర్ పరీక్ష, అల్ట్రాసౌండ్ స్కానింగ్, ఎమ్సీయూజీ, మూత్రపిండాల పనితీరు తెలుసుకోడానికి న్యూక్లియర్ స్కాన్ వంటి పరీక్షలతో పాటు రీనల్ ఫంక్షన్ పరీక్షలు తప్పక చేయించాలి. పిల్లలకు ఏవైనా అవయవ నిర్మాణపరమైన లోపాలు (అనటామికల్ అబ్నార్మాలిటీస్) ఉన్నట్లు బయటపడితే... వాటికి అవసరమైన సమయంలో సరైన శస్త్రచికిత్స చేయించాల్సి ఉంటుంది. ఇక ఇన్ఫెక్షన్ను తగ్గించడానికి తప్పనిసరిగా యాంటీబయాటిక్స్‌తో చికిత్స చేయడం చాలా ముఖ్యం. అలాగే చిన్నపిల్లలకు యూరినరీ ఇన్ఫెక్షన్స్ పదే పదే వస్తున్నప్పుడు... కిడ్నీకి ఇన్ఫెక్షన్ (పైలో నెఫ్రైటిస్) సోకకుండా నివారించడానికి మూడు నుంచి ఆరు నెలల పాటు తప్పనిసరిగా ప్రొఫిలాక్టిక్ యూరినరీ యాంటీబయాటిక్స్ వాడాల్సి ఉంటుంది. కొద్దిగా పెద్ద పిల్లల విషయానికి వస్తే వారిలో మలబద్దకం లేకుండా చూడటం, తరచూ మూత్రవిసర్జన చేసేలా చూడటంతో పాటు మంచినీళ్లు, ద్రవపదార్థాలు ఎక్కువగా తాగేలా వారికి అలవాటు చేయడం అవసరం. మీరు పైన పేర్కొన్న విషయాలపై అవగాహన పెంచుకొని, మీ పిల్లల వైద్య నిపుణుడి ఆధ్వర్యంలో తగిన చికిత్స తీసుకోండి. డా. రమేశ్‌బాబు దాసరి సీనియర్ పీడియాట్రీషియన్, రోహన్ హాస్పిటల్స్, విజయనగర్ కాలనీ, హైదరాబాద్ -
తెల్లరక్తకణాలు అపరిమితంగా పెరిగాయి... సమస్య ఏమిటి?
పీడియాట్రిక్ కౌన్సెలింగ్స్ మా అబ్బాయి వయసు ఆరున్నర ఏళ్లు. మాది హైదరాబాద్‌కు దగ్గరగా ఉన్న ఒక చిన్న టౌన్. ఈమధ్య వాడికి తరచూ జ్వరం వస్తూ ఉంది. పిల్లాడు కూడా చాలా పాలిపోయినట్లుగా కనిపిస్తున్నాడు. ఇలా రెండుమూడుసార్లు యాంటీబయాటిక్స్‌తో చికిత్స చేశాక... ఒకసారి మా ఫ్యామిలీ డాక్టర్ గారు అబ్బాయికి రక్తపరీక్ష చేయించారు. దాంతో అతడి బ్లడ్‌కౌంట్ పరీక్షలో తెల్ల రక్తకణాలు అపరిమితంగా కనిపించాయి. పైగా డాక్టర్ పరీక్ష చేసే సమయంలో స్పీ›్లన్ ఉబ్బినట్లుగా ఉందని చెబుతూ అది లుకేమియా కావచ్చనీ, వీలైనంత త్వరగా పిల్లవాడిని సిటీలో క్యాన్సర్ స్పెషలిస్ట్‌కు చూపించమని అన్నారు. మావాడి సమస్య ఏమిటి? దయచేసి వివరించండి. – ఎల్. రామ్‌ప్రసాద్, చిట్యాల మనకు ఉండే రక్తకణాల్లో ప్రధానమైనవి తెల్లరక్తకణాలు, ఎర్రరక్తకణాలు, ప్లేట్లెట్స్ ముఖ్యమైనవి. మన రోగనిరోధక శక్తి ప్రధానంగా తెల్లరక్తకణాల వల్ల కలుగుతుంది. ఈ రక్తకణాలన్నీ మన ఎముక లోపల డొల్లగా ఉండే భాగంలోని ఎముకమజ్జ లేదా మూలుగ అని మనం పిలుచుకునే బోన్ మ్యారోలో అనునిత్యం తయారవుతుంటాయి. అక్కడి మూలకణాల్లో వృద్ధిచెందిన తొలి కణాలు ఎర్ర, తెల్ల కణాలుగానూ, ప్లేట్‌లెట్స్‌గా రూపొందుతుంటాయి. సాధారణంగా ప్రతి రక్తకణానికీ కొంత జీవన వ్యవధి ఉంటుంది, కొత్త కణాలు పాత కణాల స్థానంలోకి వచ్చి చేరుతుంటాయి. అయితే కొన్ని సందర్భాల్లో మనకు తెలియని కారణాలతో తెల్లరక్తకణాలు నియంత్రణ లేకుండా అమాంతం పెరిగిపోతాయి. దాంతో ఎర్ర రక్తకణాల ఉత్పత్తి తగ్గుతుంది. ఇలా అనియంత్రితంగా రక్తకణాలు పెరగడాన్ని బ్లడ్‌క్యాన్సర్ అని చెప్పవచ్చు. అయితే అక్కడ జరిగే ప్రక్రియకు ఇది స్థూలంగా చెప్పగలిగే వివరణ మాత్రమే. ఈ తరహా బ్లడ్ క్యాన్సర్లలోనూ అనేక రకాలు ఉన్నాయి. అపరిమితంగా పెరిగిపోయిన తెల్లరక్తకణాల వల్ల ఎర్రరక్తకణాల కౌంట్‌కు కూడా తగ్గి పిల్లలు పాలిపోయినట్లుగా కనిపిస్తారు. తరచూ జ్వరం అన్నది ప్రధాన లక్షణంగా ఉంటుంది. ఇక మరికొందరిలో రక్తాన్ని గడ్డకట్టించడానికి అవసరమైన ప్లేట్లెట్స్ కూడా తగ్గుతాయి. ఫలితంగా క్యాన్సర్ రోగులలో అధిక రక్తస్రావం, శరీరం కమిలినట్లుగా కనపడటం, చర్మం మీద ఎర్రగా బ్లీడింగ్ స్పాట్స్ కనిపిస్తుంటాయి. ఇక మరికొందరు పిల్లల్లో ఎముకల కీళ్ల దగ్గర నొప్పులు, చిగుర్లలోంచి రక్తస్రావం వంటి లక్షణాలూ కనిపిస్తాయి. మీరు మీ టౌన్‌లోని డాక్టర్ చెప్పినట్లుగా వీలైనంత త్వరగా మీ సమీపంలోని పెద్దనగరానికి వెళ్లి హిమటోఆంకాలజిస్ట్కు చూపించండి. వారు ఎముకమూలుగను పరీక్షించే ‘బోన్‌మ్యారో టెస్ట్’ చేసి మీ పిల్లవాడికి ఉన్న వ్యాధిని బట్టి చికిత్స మొదలుపెడతారు. బ్లడ్ క్యాన్సర్‌కు చికిత్స ఉందా? మా అబ్బాయి వయసు ఏడేళ్లు. ఈమధ్య మావాడికి చేయించిన ఒక రక్తపరీక్షలో అబ్బాయికి లుకేమియా అని ప్రాథమిక రిపోర్టు వచ్చింది. దాంతో బోన్‌మ్యారో పరీక్ష చేయించమని మా డాక్టర్ చెప్పారు. బోన్‌మ్యారో పరీక్ష అంటే ఏమిటి? ఆ తర్వాత కూడా ఏమైనా పరీక్షలు అవసరమవుతాయా? లుకేమియా అంటే బ్లడ్ క్యాన్సర్ అని తెలిశాక మాకు చాలా ఆందోళనగా ఉంది. బ్లడ్ క్యాన్సర్లకు చికిత్స ఉంటుందా? దయచేసి మాకు తగిన సలహా ఇవ్వండి. – బి. మాలతి, నెల్లూరు మీవాడికి చేసిన రక్తపరీక్షల్లో బ్లడ్‌క్యాన్సర్ ఉన్నట్లు ప్రాథమికంగా తేలడంతో దాన్ని పూర్తిగా నిర్ధారణ చేయడం కోసం బోన్‌మ్యారో పరీక్ష నిర్వహిస్తారు. ఇందులో చిన్నారికి తాత్కాలికంగా కొద్దిగా మత్తు కలిగేలా చేసి, ఎముక మూల నుంచి, కాస్తంత ఎముక మూలుగను సేకరిస్తారు. ఆ తర్వాత ఆ నమూనాలను ల్యాబ్‌లో పరీక్షించి బ్లడ్‌క్యాన్సర్‌ను నిర్ధారణ చేస్తారు. దీనితర్వాత కూడా నిర్దిష్టంగా అది ఏ తరహా క్యాన్సర్ అన్నది కచ్చితంగా నిర్ధారణ చేయడానికి ఫ్లోసైటోమెట్రీతోపాటు మరికొన్ని క్రోమోజోము పరీక్షలు అవసరమవుతాయి. అయితే ఇక్కడ మీరు ఆందోళన చెందాల్సిన అవసరమేమీ లేదు. ఎందుకంటే గతంతో పోలిస్తే ఇప్పుడు చాలారకాల బ్లడ్ క్యాన్సర్లకు ఆధునిక కీమోథెరపీతోపాటు ఇంకొన్ని సపోర్ట్ థెరపీల వంటి చాలా మంచి చికిత్స ప్రక్రియలు అందుబాటులో ఉన్నాయి. కొన్ని రకాల కొత్త చికిత్సా మార్గాలతో బ్లడ్ క్యాన్సర్‌ను ఇంకా సమర్థంగా చికిత్స చేయవచ్చు. కొన్ని హైరిస్క్ క్యాన్సర్లకు ‘బోన్‌మ్యారో ట్రాన్స్‌ప్లాంటేషన్’ అనే చికిత్స కూడా అదించవచ్చు. అంటే... బ్లడ్క్యాన్సర్కు ఎముక లోపల ఉండే లోపభూయిష్టమైన మూలుగను పూర్తిగా అణచివేసి, ఆరోగ్యకరమైన వ్యక్తి నుంచి సేకరించిన మంచి మూలుగను ప్రవేశపెడతారు. ఈ చికిత్స తర్వాత బ్లడ్‌క్యాన్సర్ వచ్చిన వారు పూర్తిగా ఆరోగ్యకరమైన సాధారణమైన వ్యక్తిగా మారిపోతారు. డాక్టర్ శిరీషరాణి ,పీడియాట్రిక్ హిమటోఆంకాలజిస్ట్, రెయిన్బో చిల్డ్రెన్స్ హాస్పిటల్, హైదరాబాద్ -
విజృంభిస్తున్న జ్వరాలు
విజయనగరం, బొబ్బిలి రూరల్: కొద్దిరోజులుగా వాతావరణంలో మార్పులు రావడంతో ప్రజలు ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా గ్రామాల్లో జ్వరాలు విజృంభిస్తున్నాయి. వైద్యారోగ్యశాఖ అధికారులు సకాలంలో నివారణ చర్యలు చేపట్టకపోవడంతో రోగులు సంచి వైద్యులను ఆశ్రయించాల్సి వస్తోంది. మండలంలో దిబ్బగుడ్డివలస ఎస్సీకాలనీలో సుమారు 10 మందికి వరకు జ్వరాలతో మంచపట్టారు. కాలనీకి చెందిన పి నరసమ్మ, తోట పారయ్య, తోట పోలీసు, స్వర్ణలత, జయలక్ష్మి, లక్ష్మి, బూరాడ పాపమ్మ తదితరులు మూడురోజులుగా జ్వరంతో బాధపడుతున్నారు. వీరిలో కొందరు సీతయ్యపేట నుంచి వచ్చే ఆర్ఎంపీ వైద్యుడి వద్ద వైద్య చేయించుకుంటున్నారు. మరికొందరు బొబ్బిలిలోని ప్రయివేటు ఆస్పత్రుల్లో చికిత్ప పొందుతున్నారు. గ్రామంలో హెల్త్ సబ్‌సెంటర్ ఉన్నప్పటికీ ఏఎన్ఎం అందుబాటులో ఉండడంలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. హెల్త్ సబ్‌సెంటర్ సిబ్బంది ఓఆర్ఎస్, ఇచ్చి చేతులు దులుపుకున్నారని రోగులు ఆరోపిస్తున్నారు. గ్రామంలో పారిశుద్ధ్యం లోపించడం వల్లే జ్వరాలు ప్రబలుతున్నాయని స్థానికులు అంటున్నారు. తక్షణం ఉన్నతాధికారులు స్పందించి వ్యాధుల నివరణకు చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. మంచం పట్టిన కైలాం మెంటాడ: మండలంలోని కైలాం గ్రామంలో పలువురు జ్వరాలతో మంచం పట్టారు. గ్రామంలో పారిశుద్ధ్యం లోపించడమే జ్వరాలకు కారణమని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రతి ఇంటిలో జ్వర పీడితులు ఉన్నారని చెబుతున్నారు. కొందరు మండలంలోని ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతుండగా మరికొందరు గజపతినగరం, విజయనగరం వెళ్లి వైద్యం చేయించుకుంటున్నారు. ఇటీవల సంభవించిన పెథాయ్ తుఫాన్ వల్ల వాతావరణం మారడం కూడా వ్యాధులు ప్రబలుతున్నాయని పలువురు అంటున్నారు. ప్రస్తుతం గ్రామంలో బోని కురమమ్మ, కొరిపిల్లి రామానందం, గండి చిన్నంనాయుడు, చప్ప సన్యాసమ్మ, గండి గంగమ్మ, అప్పలకొండ, గండి ఎర్రయ్య, నారాయణమ్మ, కామేష్, యశ్వంత్ కుమార్, కొరిపిల్లి రోహిత్‌నాయుడు తదితరులు జ్వరాలతో బాధపడుతున్నారు. అయినప్పటికీ వైద్యాధికారులు పట్టించుకోవడంలేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. గ్రామంలో పారిశుద్ధ్య పనులు కూడా చేపట్టడంలేదని విమర్శిస్తున్నారు. ఉన్నతాధికారులు వెంటనే స్పందించి వైద్యశిబిరం ఏర్పాటు చేయాలని, పారిశుద్ధ్య పనులు చేపట్టాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. -
కీళ్లకు జ్వరం
చలికాలం జ్వరాల కాలం. చలికాలం కీళ్లనొప్పుల కాలం కూడా. జ్వరాలను, కీళ్లనొప్పులను విడివిడిగా ఎదుర్కొనడం ఒక పద్ధతి. కాని జ్వరం వల్ల కీళ్లనొప్పులు వస్తే? జ్వరం తర్వాత కూడా కీళ్లనొప్పులు వస్తే? ఈ సీజన్లో ఈ సమాచారం తెలుసుకొని ఉండాలి. జ్వరంతో వచ్చే కీళ్లనొప్పులకు పరిష్కారం తెలుసుకొని ఉండాలి. అందుకే ఈ కథనం. కాలం మారింది. దాంతో వాతావరణం మారిపోయింది. బయటి ఉష్ణోగ్రతలకు తగినట్లు ఒళ్లు తనను తాను మార్చుకోవడంలో ఒడిదొడుకులకు లోనవుతుంది. వైరస్లు ఈ సీజన్‌కి ‘జ్వరాల సీజన్’ అని పేరు పెట్టిస్తాయి. ఒంటికి టెంపరేచర్ తగ్గాక ధర్మామీటర్కి అందని కీళ్లజ్వరం మొదలవుతుంటుంది. జ్వరం తర్వాత... జ్వరం మనిషిని నేరుగా పీల్చివేయడం కంటే ఆ తర్వాత పీడించడమే ఎక్కువగా ఉంటుంది. ఒక రోజు జ్వరాన పడితే పూర్తిగా కోలుకోవడానికి ఓ వారం పడుతుంది. నాలుగు రోజులు జ్వరంతో మంచం పడితే కోలుకోవడానికి నెల రోజులు పడుతుంది. అలాంటి జ్వరానికి అనుబంధంగా వచ్చి పడేదే కీళ్ల జ్వరం. జ్వరం తగ్గిన తర్వాత హుషారుగా లేచి తిరుగుదామంటే ఒళ్లు సహకరించదు. కీళ్లు ఒక పట్టాన కదలవు. అప్పటి వరకు దేహంలో ఉన్న జాయింట్స్ గురించి మనకు పెద్దగా పట్టింపు ఉండదు. జాయింట్ మెకానిజం ఒకటి ఉంటుందని అవి కదలడం మానేసినప్పుడు గుర్తుకు వస్తుంది. కీళ్ల నొప్పి అని సింపుల్‌గా చెప్పుకునే ఈ సమస్యకు కారణాలు రకరకాలుగా ఉంటాయి. అలాగే కీళ్ల నొప్పులు కూడా ఒక రకం కాదు, అనేక రకాలుగా ఉంటాయి. కీళ్ల సమస్యకు దారి తీసిన కారణాన్ని బట్టి, కీళ్ల సమస్యల లక్షణాలను బట్టి చికిత్స ఉంటుంది. వైరల్ ఆర్థరైటిస్ నార్మల్ ఫీవర్ నుంచి కానీ, వైరల్ ఇన్ఫెక్షన్ నుంచి కానీ కోలుకుంటున్నప్పుడు కీళ్ల నొప్పులు విడవకుండా పీడించవచ్చు. ఈ లక్షణానికి కారణం ‘వైరల్ ఆర్థరైటిస్’ లేదా వైరస్ ద్వారా వచ్చిన ‘కీళ్లవాతం’. రోగకారక వైరస్ సోకడం వల్ల కీళ్ల నొప్పులు వస్తాయి. సాధారణ పరిభాషలో చెప్పాలంటే కొన్ని వైరస్లు సోకడం వల్ల సంక్రమించే వ్యాధి ఇది. దీని వల్ల కీళ్లలో వాపు వస్తుంది. వైరల్ జ్వరం తగ్గిన తర్వాత కీళ్లనొప్పి రావడం సర్వసాధారణంగా తలెత్తే చికిత్స సంబంధ సమస్య. వైరస్ ద్వారా సంక్రమించిన కీళ్లనొప్పుల్లో చాలా వరకు వాటంతట అవే తగ్గిపోతుంటాయి. కొన్నింటికి వైరస్ నిరోధక చికిత్స చేయవలసి ఉంటుంది. సాధారణంగా వచ్చే కీళ్ల వాపు, వైరస్ ద్వారా సంక్రమించే కీళ్ల వాపు మధ్య తేడాలను నిర్ధారించడం కొంచెం కష్టమే. వైరస్ప్రేరేపిత కీళ్ల వాపు సంభవించడం, వ్యాప్తి చెందడాన్ని గురించి నిర్దుష్ట సమాచారం అందుబాటులో లేదు. ప్రపంచవ్యాప్తంగా ఒక లక్ష మందిలో 0.6 నుంచి 27 మందికి ఈ వ్యాధి సోకుతున్నట్లు అంచనా. అయితే వార్ధక్యంలో ఉన్న వారిలో ఈ శాతం కొంచెం ఎక్కువగా ఉంటుంది. అరవై దాటిన వారిలో చూస్తే ప్రతి లక్షమందిలో 30 నుంచి 40 మందికి వ్యాపిస్తున్నట్లు తెలుస్తోంది. సాధారణంగా జ్వరం అనంతరం బయటకు కనిపిస్తున్నప్పటికీ ఈ వ్యాధి వివిధ రకాల ఇన్ఫెక్షన్ల వల్ల వస్తుంది. వైరల్ ఆర్థరైటిస్‌కు కారణమవుతున్న వైరస్ల జాబితా ఇలా ఉంది. అవి... ∙జఠర సంబంధ వైరస్ ∙డెంగ్యూ వైరస్, ∙హెపటైటిస్ ఎ,బి,సి, ∙హెచ్ఐవి, ∙పాలిచ్చే పశువుల నుంచి సంక్రమించే బి19 వైరస్ ∙గవద బిళ్లలు, రుబెల్లా వైరస్, ఆల్ఫా వైరస్, ∙జీవకణాల ద్వారా సంక్రమించే వైరస్, ∙సువాసనల నుంచి వచ్చే వైరస్ ∙రెట్రో వైరస్లు. వ్యాధి నిరోధానికి రుబెల్లా వ్యాక్సిన్ టీకాలు వేసినప్పుడు కూడా వైరల్ ఆర్థరైటిస్ రావచ్చు. ఇది పిల్లల్లో సర్వసాధారణం. అప్పుడు కూడా పిల్లలు కీళ్ల నొప్పులతో బాధపడతారు. అయితే చాలా మందికి వ్యాక్సిన్ల రూపంలో వైరస్ సోకినప్పటికీ, కొద్దిమందికి మాత్రమే వైరస్ సంబంధ కీళ్ల వాతం వస్తుంది. మల్టిపుల్ జాయింట్ పెయిన్స్ విషక్రిమి సంబంధ కీళ్లవాతం వచ్చిన రోగులు బహుళ కీళ్ల నొప్పుల (మల్టిపుల్ జాయింట్ పెయిన్స్)తో బాధపడుతుంటారు. కేవలం కీళ్ల నొప్పులు లేక కీళ్ల వాపు, కీళ్ల దగ్గర చర్మం ఎరుపెక్కడం, వాతం వల్ల వచ్చిన కీళ్లనొప్పిని పోలి ఉంటుంది. కీళ్ల నొప్పులు ఉన్నట్లుండి రావడమే కాక దద్దుర్లు కూడా వస్తాయి. జ్వరం, చలిపెట్టడం, దద్దుర్ల వంటి ఇతర లక్షణాలు కనిపిస్తాయి. అయితే చాలా కేసుల్లో వైరల్ ఆర్థరైటిస్‌గా రోగ నిర్ధారణ చేయడం కష్టమవుతుంటుంది. వైరల్ ఆర్థరైటిస్ లక్షణాలు ఈ విధంగా ఉంటాయి... అని ఇదమిత్ధంగా చెప్పడానికి ఒక్క నమూనా కూడా లేకపోవడం ఇందుకు కారణం. ∙ఈ రోగానికి సంబంధించిన సంకేతాలు, లక్షణాలు ప్రత్యేకంగా ఏమీలేవు (ఉదాహరణకు జ్వరం, కీళ్లనొప్పులు, దద్దుర్లు). ఎందుకంటే ఇవన్నీ ఇతర వ్యాధులతో కూడా కనిపిస్తాయి. ∙ఒక్కొక్కసారి ఇతర వైరల్ ఇన్ఫెక్షన్లు సోకడానికి ముందు సూచనగా కీళ్ల నొప్పులు రావచ్చు (ఉదాహరణకు హెపటైటిస్ బి వైరస్, పచ్చకామెర్లు రావడానికి ముందు) ∙వైరల్ ఇన్ఫెక్షన్కు సంబంధించిన రుజువులను తరచుగా కనిపెట్టడం కష్టం. వైరల్ ఇన్ఫెక్షన్ అనంతర ఆర్థరైటిస్ చికిత్సజ్వరం లేదా వైరస్ జ్వరం నుంచి కోలుకుని కీళ్లనొప్పులతో బాధపడుతున్న వారికి అవుట్ పేషెంట్‌గా చికిత్స చేయవచ్చు. హాస్పిటల్లో చేరాల్సిన అవసరం ఉండదు. ఈ సమస్య వల్ల శాశ్వత అంగవైకల్యం వస్తుందని రోగులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎందుకంటే రోజులు గడుస్తున్న కొద్దీ నొప్పి తగ్గుముఖం పడుతుంది.వైరల్ ఆర్థరైటిస్‌ను తగ్గించే కొన్ని మందులు పారాసిటమాల్: ఇది మంచి బాధ నివారిణి. దీనిని సరైన మోతాదులో క్రమం తప్పకుండా వేయాల్సి ఉంటుంది. నిద్రకు ఉపయోగపడే మందులు : ట్రమాడాల్ మంచి ఎంపిక. 30–100 మిల్లీగ్రాముల మోతాదులో ఆరు గంటలకొకసారి వాడాలి. ఎసిటిల్ సాలిసైక్లిక్ యాసిడ్: మందులు వాడడం వల్ల వైరల్ ఇన్ఫెక్షన్లు తీవ్రమయ్యే అవకాశం ఉంది. అందువల్ల వాటి తీవ్రత తగ్గిన తరవాత మాత్రమే వాడాలి.మూర్ఛ నిరోధక మందుల, ఉత్సాహ పరిచే మందులు,కార్టికో స్టెరాయిడ్స్: కొద్దిపాటి నొప్పి నుంచి తీవ్రమైన నొప్పి ఉన్న ప్పుడు కూడా వాడవచ్చు. దీనికి ప్రెడ్నిసోన్ మాత్రలను సూచించడం జరుగుతుంది. ఈ మందుల వాడకం వల్ల తగిన గుణం కనిపిస్తున్నట్లయితే మధుమేహం, హైపర్ టెన్షన్, గతంలో ఎముకలు విరిగిన దాఖలాలు, మానసిక స్థితి ఉన్నట్లుంది మారిపోవడం, స్థూలకాయం, హృద్రోగం ఉన్నవారికి ఈ మందులను ఇవ్వరాదు. దీర్ఘకాలిక కీళ్ల నొప్పులు ఉన్న రోగులకు హైడ్రో క్లోరోక్వైన్, సల్ఫాసాలాజైన్, మెథోట్రెక్సేట్ కూడా వాడవచ్చు.కీళ్లనొప్పులతో బాధపడే వారికి మూడు దశల్లో భౌతిక చికిత్స చేయించవచ్చు. అయితే వ్యాధి తీవ్రత ముదరక ముందు, విడవకుండా పీడిస్తున్నప్పుడే భౌతిక చికిత్సకు ప్రాధాన్యమివ్వాలి. లేకపోతే ఎలాంటి ప్రత్యేక వైరస్ నిరోధక చికిత్స చేయాల్సిన అవసరం లేదు. డెంగ్యూ వ్యాధి ఉన్న రోగుల్లో ఆస్పిరిన్ వంటి కొన్ని ఇతర మందులు వాడరాదు. డెంగ్యూ తీవ్రత సంకేతాలు లేనప్పుడు మాత్రం వాటిని వాడవచ్చు.సెప్టిక్ ఆర్థరైటిస్ వచ్చే సూచనలున్నప్పుడు మినహా మిగిలిన సందర్భాల్లో సర్జికల్ డ్రైనేజ్ (రక్తంలో చీమును తీసేయడం) కూడా అవసరం లేదు. ఆహార నియమాల మీద పెద్దగా ఆంక్షలు లేవు. కొన్ని రోజులు విశ్రాంతి తీసుకున్న తర్వాత నెమ్మదిగా కదలడం మొదలు పెట్టాలి. అనుమానించాల్సిన ఇతర కారణాలు సర్వ సాధారణంగా వచ్చే కీళ్ల నొప్పులు ఇతర ఇన్ఫెక్షన్ల వల్ల తీవ్రమయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఇతర ఇన్ఫెక్షన్ల వల్ల వచ్చిందేమోనని పరిశీలించి ఒక అంచనాకు రావడం తప్పనిసరి. వ్యాధిని తీవ్రం చేయగల ఇన్ఫెక్షన్లలో సూక్ష్మ క్రిముల వల్ల వచ్చే ఇన్ఫెక్షన్, కీళ్లవాపు జ్వరం, క్షయ, కీళ్లవాతం, కడుపులో మంట, రక్తంలోకి వివిధ రసాలను విసర్జించు గ్రంథులు జరిగ్గా పనిచేయకపోవడం మొదలైన వాటిని క్షుణ్ణంగా పరిశీలించుకుని నిర్ధారించుకోవాలి.సాధారణంగా వైరల్ ఇన్ఫెక్షన్ నుంచి కోలుకున్న తర్వాత ప్రకృతి సిద్ధమైన కాల్షియం, మెగ్నీషియం మూలకాలు, డి, బి12, ఈ విటమిన్ల లోపం వల్ల కూడా కీళ్ల నొప్పులు వస్తాయి. మంచి ఆహారం తీసుకుంటే ఈ పరిస్థితి నుంచి బయటపడవచ్చు. గమనిక: వ్యాధికి గురైన వాళ్లు తప్పని సరిగా నిపుణులైన వైద్యుల పర్యవేక్షణలో మాత్రమే వైద్యం చేయించుకోవాలి. ఈ కథనం ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. చికున్ గున్యా చికున్ గున్యా వ్యాధి సోకిన వారిలో వివిధ దశల్లో కీళ్ల నొప్పులు ఉంటాయి. వాటిలో ముఖ్యంగా లేచి మామూలుగా తిరగడం ఇబ్బంది కావడం వల్ల వ్యాధి సోకిన రోగుల దైనందిన జీవనంపై ప్రభావం పడుతుంది. వస్తువులు తీసుకోవడం, కుర్చీలు ఎత్తడం, నడవడం మొదలగునవి కూడా సాధ్యం కాదు. వ్యాధి సోకడం వల్ల దాని ప్రభావం కేవలం నొప్పులకే పరిమితం కాదు. రోగుల్లో చాలామందికి సరిగ్గానిద్రపట్టకపోవడం, మనసు స్థిమితంగా ఉండవకపోవడం, మూడ్ మారిపోతుండడం జరుగుతుంటుంది.చికున్ గున్యా సోకిన వారికి చిన్న, పెద్ద కీళ్లు నొప్పులు వస్తాయి. చికున్ గున్యా తీవ్రంగా ఉన్నప్పుడు ఇతర వైరస్‌లకు ముఖ్యంగా డెంగ్యూకు దానికి ఉన్న తేడాను కనిపెట్టలేం. ఈ వ్యాధి సోకిన వారికి దీర్ఘకాలం కీళ్లనొప్పులు ఉంటాయి. ఒక్కొక్కసారి మూడేళ్ల పాటు కూడా కీళ్ల నొప్పులు బాధించవచ్చు. ఈ నొప్పులు సాధారణంగా వేళ్లు, చేతి మణికట్టు, మోకాళ్లు, కాలి చీలమండల దగ్గర కనిపిస్తాయి. అరవై నుంచి ఎనభై శాతం మంది రోగుల్లో ఈ నొప్పులు వస్తూ పోతూ ఉంటాయి. ఇరవై నుంచి నలభై శాతం మంది రోగుల్లో నిరంతరం ఉంటాయి. వయసు పైబడిన వారిలో, మహిళల్లో, ఇది వరకే కీళ్ల నొప్పులు ఉన్న రోగుల్లో ఎక్కువ రోజులు కీళ్ల నొప్పులు ఉండే ప్రమాదముంది. ఇన్పుట్స్: డా‘‘ రాహుల్ అగర్వాల్ (ఎం.డి, జనరల్ మెడిసిన్) సీనియర్ కన్సల్టెంట్ జనరల్ ఫిజీషియన్, డయాబెటాలజిస్ట్ మాక్స్‌క్యూర్ హాస్పిటల్స్, మాధాపూర్,హైదరాబాద్ -
అందరికీ వరం
ప్రాణికోటి సమస్తం ఆరు ఋతువుల ధర్మాలకు అనుగుణంగా నడచుకోవడం ఆరోగ్యానికి అవసరం. శరదృతువు, కార్తిక మాసంలో ఉసిరి చెట్టు కింద భోజనం చేసే ఉత్సవం వనభోజనం. ఈ కాలంలో లభించే ఉసిరికాయ, నేతి బీరకాయలలోని పోషక విలువలు, ఆరోగ్యప్రయోజనాలను ఆయుర్వేదం వివరించింది. ఉసిరిక (ఆమలకీ) గుణధర్మాలు: దీని రుచి షడ్రసాల (తీపి, పులుపు, ఉప్పు, చేదు, కారం, వగరు) లోనూ ఉప్పు (లవణ రసం) మినహా మిగిలిన ఐదు రుచులు ఉంటాయి. ప్రధానంగా నోటికి తగిలేది పులుపు, తీపి, వగరు. శరీరంలో వేడిని తగ్గిస్తుంది. కఫాన్ని హరిస్తుంది. నీరసాన్ని పోగొడుతుంది. రక్త స్రావాన్ని అరికడుతుంది. అన్ని రకాల మూత్ర వికారాలు శమిస్తాయి. వివిధ రూపాలు... పచ్చిగా రసం తీసినా, ఎండబెట్టి వరుగులు చేసినా, గింజలు తీసేసి ఎండిన వరుగులను చూర్ణం చేసినా, మురబ్బా చేసినా, రోటి పచ్చడి చేసినా, నిల్వ ఉండే ఊరగాయగా మలచినా, దీనిలో గల పోషక విలువలు పదిలంగా ఉంటాయి. విశిష్ట ఔషధ ప్రయోగాలు: జ్వరాలు: ఉసిరికాయల రసాన్ని నేతితో వేడి చేసి సేవించాలి . ఆకలి కలగడానికి: నెయ్యి, జీలకర్ర, ఇంగువ చేర్చి, ఉసిరి కాయలను నేతితో ఉడికించి తినాలి అర్శస్ (పైల్స్/మూలశంక): మజ్జిగలో తిప్పతీగ, ఉసిరిక రసాలను కలిపి తాగాలి. ఉసిరిక చూర్ణానికి, కరక్కాయ, తానికాయ చూర్ణాలను కూడా కలిపి సేవించాలి (త్రిఫల చూర్ణం). కామలా (జాండిస్): ఉసిరిక రసం + ద్రాక్షరసం రక్తస్రావాలు: ఉసిరి కాయల ముద్దను నేతితో కలిపి వేడి చేసి తలపై పట్టిస్తే ముక్కులో నుంచి వచ్చే రక్తస్రావం తగ్గుతుంది బొంగురు గొంతు: ఉసిరిక రసం + పాలు ∙ ఎక్కిళ్లు (హిక్క): ఉసిరిక రసం + వెలగకాయ, పిప్పళ్ల చూర్ణం + తేనె ∙ దగ్గు: ఆమలకీ చూర్ణం + పాలు, నెయ్యి ∙ మూర్ఛ: ఉసిరిక చూర్ణ కషాయం + తేనె ∙ హృదయ రోగాలు: చ్యవనప్రాశ, అగస్త్య లేహ్యం (వీటిల్లో ఆమలకీ ప్రధాన ద్రవ్యం) ∙ వాంతులు: పెసర పప్పుతో జావ కాచి, చల్లార్చి, ఉసిరిక రసం కలిపి సేవించాలి. ఇవేకాక అనేక చర్మరోగాలు, కీళ్ల నొప్పులు, జుట్టు తెల్లబడటం, కంటి రోగాలు ఉపశమిస్తాయి. అరటిఆకు భోజనం విశిష్టత: ఈ ఆకులో ఉండే పోలిఫినాల్స్ ఆహారంలోకి చేరి చాలా వ్యాధులకు నిరోధకంగా పనిచేస్తాయి. ఆకలి పెరిగి, ఉత్సాహం కలుగుతుంది. కృమిహరంగా పనిచేస్తుంది. రకరకాల కీళ్ల నొప్పులు తగ్గుతాయి. నేతిబీర: అడవిలో పెరిగేది ఒక రకం, ఇది వాంతికరం. మనం పొలాల్లో పండించేది తినదగినది, జిగురుగా ఉండి కూర రుచికరంగా ఉంటుంది. రక్తదోషాలను హరిస్తుంది. వాత, పిత్త రోగాలను తగ్గిస్తుంది. డా. వృద్ధుల లక్ష్మీనరసింహ శాస్త్రి, ఆయుర్వేద వైద్య నిపుణుల -
కమ్ముకున్న జ్వరం
స్వైన్‌ఫ్లూ గురించి ఆందోళన వద్దు మొదట దాన్ని గురించి పూర్తిగా తెలుసుకోవాలి. అప్పుడు నివారణ ఎంత తేలికో అర్థమవుతుంది. సమర్థంగా నివారిస్తే చికిత్స తప్పిపోతుంది అసలది రాకుండా ఉండాలంటే టీకా ఉండనే ఉంది. చలి ప్రారంభమైంది. వ్యాధులు విజృంభించడానికి ఇది అనువైన కాలం. జ్వరాలు పెచ్చరిల్లే కాలం. సాధారణ జలుబు, జ్వరం గురించి పెద్దగా ఆందోళన చెందాల్సిన పని లేకున్నా ఈ కాలంలోనే ఎక్కువగా దాడి చేసే స్వైన్ ఫ్లూ గురించి అప్రమత్తంగా ఉండాలి. స్వైన్‌ఫ్లూ లక్షణాలన్నీ మామూలు జలుబులాగే అనిపిస్తుంటాయి. కానీ సాధారణ జలుబు కంటే ఇది ఒకింత ప్రమాదకరం. తీవ్రత కూడా ఎక్కువ. అందుకే దీని గురించి తెలుసుకోవడం మరింత అవసరం. ఏమిటీ వైరస్? ‘స్వైన్‌ఫ్లూ’ను హాగ్ ఫ్లూ, పిగ్ ఫ్లూ అని కూడా అంటారు. స్వైన్‌ఫ్లూ అంటే పంది నుంచి వచ్చే ఫ్లూ అని అర్థం. జలుబుతో వచ్చే సాధారణ (ఫ్లూ) జ్వరానికి ఇన్ఫ్లుయెంజా అనే వైరస్ కారణమవుతుంది. ప్రధానంగా గాలి, దగ్గు, తుమ్ము తాలూకు తుంపర్ల ద్వారానే ఈ వైరస్ రోగి నుంచి మామూలు వ్యక్తికి వ్యాపిస్తుంది. ఫ్లూకు కారణమయ్యే ఇన్‌ఫ్లుయెంజాలో అనేక రకాల వైరస్లు ఉన్నాయి. స్వైన్ఫ్లూనకు కారణమయ్యే వైరస్‌ను ‘హెచ్1ఎన్1’ వైరస్‌గా నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా ఈ తరహా వైరస్‌లను ‘ఇన్ఫ్లుయెంజా ఎ’ అనీ, ‘ఇన్ఫ్లుయెంజా బీ’ అని, ‘ఇన్ఫ్లుయెంజా సి’ అని మూడురకాలుగా వర్గీకరిస్తారు. ఇందులో ‘ఇన్ఫ్లుయెంజా బీ’ అన్న రకం పందుల్లో ఉండదు. కానీ ‘ఇన్ఫ్లుయెంజా ఎ’, ‘ఇన్ఫ్లుయెంజా సి’ రెండూ పందుల్లో కనిపిస్తాయి. అందులో ప్రస్తుతం కనిపిస్తున్న వైరస్ ‘ఇన్ఫ్లుయెంజా ఎ’ గ్రూపునకు చాలా దగ్గరగా ఉంది. అలాంటి వైరస్‌లో ఒకటైన ఇది కొన్ని మ్యూటేషన్స్‌కు గురై, మానవులకు సోకే విధంగా రూపొందిందని నిపుణుల మాట. ఈ వైరస్ గతంలో పందుల్లో కనుగొన్న వైరస్‌తో పూర్తిగా సరిపోలడం లేదు.దాంతో సాధారణ పరిభాషలో ప్రస్తుతం ‘స్వైన్ ఫ్లూ’గా అభివర్ణిస్తున్న ఈ వైరస్‌ను నిపుణులు ‘క్వాడ్రపుల్ రీ–అసార్టెంట్’ వైరస్ అని అంటున్నారు. అంటే ఇందులో పందులకు వచ్చే వైరస్ల జీన్స్, పక్షులకు వచ్చే వైరస్ల జీన్స్, మానవులకు వచ్చే వైరస్ల జీన్స్... ఇలా నాలుగు జీన్స్ ఉన్నా... రెండూ పందులకు వచ్చేవే ఉండటంతో దీన్ని ‘స్వైన్ ఫ్లూ’ అని పిలుస్తున్నారు. పిల్లల్లో ఈ కింది లక్షణాలు కనిపిస్తే... ఆయాసపడుతున్నా లేదా శ్వాస అందడంలో ఇబ్బంది ఉన్నాచర్మం రంగు నీలంగా లేదా బూడిద రంగు (గ్రే)గా మారినా తగినంతగా ద్రవ పదార్థాలు తాగలేకపోతున్నా వాంతులు అవుతున్నా సరిగ్గా నడవలేకపోతున్నా లేదా సంభాషించలేకపోతున్నా తట్టుకోలేనట్లుగా కనిపిస్తూ అస్థిమితంగా ఉన్నా ఫ్లూ లక్షణాలు తగ్గినా జ్వరం, దగ్గు మళ్లీ మళ్లీ వస్తున్నా... వెంటనే అలాంటి పిల్లలను వైద్య సహాయం కోసం డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లాలి. పెద్దలలో ఈ కింది లక్షణాలు కనిపిస్తే... ఆయాసపడుతున్నా లేదా శ్వాస అందకపోయినా ఛాతిలో నొప్పి, కడుపులో నొప్పి లేదా పట్టేసినట్లుగా ఉన్నా అకస్మాత్తుగా తలతిరుగుతున్నట్లు అనిపించినా అయోమయంగా అనిపించినా ఆగకుండా తీవ్రంగా వాంతులు అవుతున్నా ఫ్లూ లక్షణాలు తగ్గినా దగ్గు, జ్వరం మళ్లీ వచ్చినా... అలాంటి పెద్దవాళ్లూ (అడల్ట్స్) కూడా వైద్య సహాయం కోసం వెంటనే డాక్టర్‌ను కలవాలి. వ్యాప్తిచెందే అవకాశాలిలా... ఇది వ్యక్తి నుంచి వ్యక్తికి గాలి ద్వారా సోకుతుంది. దగ్గడం, తుమ్మడం వంటి చర్యలతో గాలిలో కలిసి ఈ వైరస్ ఒకరినుంచి ఒకరికి వ్యాపించవచ్చు. అలాగే రోగి ముట్టుకున్న ప్రదేశాలను ఆరోగ్యవంతులు ముట్టుకున్నప్పుడు కూడా ఇది వ్యాపిస్తుంది. స్వైన్‌ఫ్లూ ...మరికొన్ని వ్యాధులకు మార్గం చూపచ్చు... స్వైన్‌ఫ్లూ విషయంలో మరికాస్త జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ వ్యాధి గ్రస్తులకు మరికొన్ని వ్యాధులు తేలిగ్గా సంక్రమించే అవకాశం ఉంది. ఉదాహరణకు న్యుమోనియా, బ్రాంకైటిస్, సైనస్ ఇన్ఫెక్షన్, చెవికి సంబంధించిన ఇన్ఫెక్షన్లు తేలిగ్గా వస్తాయి. ఇలాంటి వాళ్లు అక్యూట్ రెస్పిరేటరీ డిస్ట్రెస్ సిండ్రోమ్ (ఏఆర్డీఎస్) బారిన పడే అవకాశం ఉంది. అందుకే ఈ వ్యాధులను ఫ్లూ–రిలేటెడ్ కాంప్లికేషన్స్ అంటారు. ఉదాహరణకు ఆస్తమా ఉన్న వ్యక్తికిగానీ లేదా హార్ట్ ఎటాక్ వచ్చిన వ్యక్తికిగానీ స్వైన్‌ఫ్లూ సోకితే అది మరింత ప్రమాదకరంగా పరిణమించే అవకాశం ఉంది. ఏయే పరిస్థితుల్లో వైరస్ మనుగడ సాగించలేదంటే... కొన్ని ప్రతికూల పరిస్థితుల్లో స్వైన్‌ఫ్లూ వైరస్ మనుగడ సాగించలేదు. 75 డిగ్రీల సెంటీగ్రేడ్ నుంచి 100 డిగ్రీల సెంటీగ్రేడ్ (167–212 డిగ్రీల ఫారెన్‌హీట్) ఉష్ణోగ్రత వద్ద ఇన్ఫ్లుయెంజా వైరస్ బతికి ఉండే అవకాశం లేదు. క్లోరిన్, హైడ్రోజన్ పెరాక్సైడ్ వంటి జెర్మిసైడ్స్, డిటర్జెంట్ సబ్బుల వల్ల కూడా వైరస్ నిర్మూలన జరుగుతుంది. ఆల్కహాల్ బేస్డ్ హ్యాండ్వైప్స్, జెల్స్ వంటివీ వైరస్‌ను నిర్మూలిస్తాయి. చికిత్స... సాధారణ ఫ్లూకు లాగే దీనికీ చికిత్స చేస్తారు. అయితే... ఫ్లూకు సంబంధించిన సాధారణ లక్షణాలు కనిపించగానే ఇష్టం వచ్చినట్లుగా యాంటీబయోటిక్స్ యాంటీవైరల్ మందులను ఉపయోగించడం ఎంతమాత్రం సరికాదు. తప్పనిసరిగా డాక్టర్ దగ్గరికి వెళ్లి పరీక్షలు చేయించుకోవాలి. సాధారణ యాంటీవైరల్ మందులను మాత్రం డాక్టర్ సలహా మేరకు వాడవచ్చు. సాధారణ ఫ్లూ లక్షణాలు కనిపించగానే యాంటీవైరల్ మందులు వాడటం వల్ల మామూలు వైరస్‌లకూ మందులను ఎదుర్కొనే శక్తిని (రెసిస్ట్ చేసే శక్తి లేదా రెసిస్టెన్స్) మరింతగా పెరుగుతుంది. ఒకవేళ యాంటీవైరల్ మందులనే వాడాల్సి వస్తే డాక్టర్లు తమ విచక్షణతోనూ, అనుభవంతోనూ ఆ విషయాన్ని నిర్ధారణ చేస్తారు. వీళ్లు కాస్త హైరిస్క్ వ్యక్తులు... సాధారణంగా మిగతా వారితో పోలిస్తే కొంత మంది స్వైన్‌ఫ్లూకు గురయ్యే అవకాశం ఎక్కువ. వాళ్లెవరంటే... 65 ఏళ్లు పైబడిన వృద్ధులు, ఐదేళ్ల కంటే తక్కువ వయసున్న పిల్లలు, గర్భిణులు, యుక్తవయస్కుల్లో ఇతర వ్యాధులతో బాధపడుతున్న వారు స్వైన్ ఫ్లూ వ్యాధి వ్యాపించడానికి అవకాశం ఉన్నవారిగా పరిగణిస్తారు. డయాబెటిస్, గుండెజబ్బులు, ఆస్తమా, సీఓపీడీ (క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మునరీ డిసీజ్) లాంటి ఊపిరితిత్తులకు సంబంధించిన జబ్బులున్నవారు, మూత్రపిండాల వ్యాధిగ్రస్తులు, నరాల వ్యాధిగ్రస్తులు, ఎండోక్రైన్ వ్యవస్థలో లోపాలున్న వ్యాధిగ్రస్తులు, కాలేయ వ్యాధులు ఉన్నవారు, దీర్ఘకాలంగా ఆస్పిరిన్, స్టెరాయిడ్స్ వంటి మందులు తీసుకుంటున్నవారు, హెచ్ఐవీ వంటి ఇమ్యూనిటీ తక్కువయ్యే వ్యాధులుండేవారిని హైరిస్క్ గ్రూపునకు చెందినవారిగా పేర్కొనవచ్చు. సాధారణ లక్షణాలివే... సాధారణ ఫ్లూ జ్వరంలో ఉండే లక్షణాలే దీన్లోనూ కనిపిస్తాయి. అంటే కాస్తంత జ్వరం, దగ్గు, గొంతులో ఇన్ఫెక్షన్, గొంతులో గరగర, ముక్కు దిబ్బడ, ముక్కుకారడం, ఒంటినొప్పులు, తలనొప్పి, చలి, అలసట, నీరసం, కళ్లు–ముక్కు ఎర్రబారడం, కడుపులో నొప్పి... లాంటి లక్షణాలు ఇందులో ఉంటాయి. కొందరిలో వాంతులు, విరేచనాలు కూడా కనిపించవచ్చు. టీకాతో కచ్చితమైన నివారణ... స్వైన్ ఫ్లూకు వ్యాక్సిన్ అందుబాటులో ఉంది. కచ్చితమైన నివారణ కోసం వ్యాక్సిన్ తీసుకోవడం మేలు. ఈ వ్యాక్సిన్ సూదిమందు, నేసల్ స్ప్రే రూపాలలో లభిస్తున్నది. సూదిమందుగానో లేక నేసల్స్ప్రేగానో ఈ వ్యాక్సిన్ ఇవ్వడం వల్ల వ్యక్తిలో సైన్‌ఫ్లూ వ్యాధిని ఎదుర్కోగల రోగనిరోధక శక్తి అభివృద్ధి చెందుతుంది. ఆరు నెలల పసివాళ్లు మొదలుకొని వయోవృద్ధుల వరకు అందరూ ముందుజాగ్రత్త చర్యగా స్వైన్‌ఫ్లూ వ్యాక్సినేషన్ తీసుకోవచ్చు. ఈ టీకాను గర్భిణీలు కూడా నిరభ్యంతరంగా తీసుకోవచ్చు. రోగికి దగ్గర ఉండేవారు కీమోప్రొఫిలాక్సిస్ మందులను తీసుకోవాల్సి ఉంటుంది. అంటే వ్యాధి వచ్చే అవకాశాలను ఎక్కువగా ఉండే హెల్త్ ఇండస్ట్రీకి చెందిన డాక్టర్లు, నర్స్‌లకు ప్రభుత్వమే ఈ ప్రొఫిలాక్టిక్ మందులను ఇస్తుంటుంది. నివారణ ఇలా... దగ్గు, తుమ్ము వచ్చినప్పుడు ఎదుటివారిపై తుంపర్లు పడకుండా రుమాలును అడ్డుపెట్టుకోవాలి. రుమాలు లేనప్పుడు వ్యక్తులు విధిగా తమ మోచేతి మడతలో ముక్కు, నోటిని దూర్చి తుమ్మాలి. దీని వల్ల వైరస్ లేదా వ్యాధిని సంక్రమింపజేసే ఇతర సూక్ష్మజీవులు ఒకరి నుంచి ఒకరికి వ్యాపించవు. దగ్గు, తుమ్ము వచ్చినప్పుడు చేతులను అడ్డుపెట్టుకున్నవారు ఆ తర్వాత వాటిని శుభ్రంగా సబ్బుతో కడుక్కోవాలి. దగ్గు, తుమ్ము సమయంలో ఉపయోగించిన రుమాలు/టిష్యూను వేరొకరు ఉపయోగించకూడదు.దాన్ని తప్పనిసరిగా డిస్పోజ్ చేయాలి. జలుబు లేదా ఫ్లూ ఉన్న వ్యక్తుల నుంచి దూరంగా ఉండాలి. ఇలాంటి రోగులు తమ లక్షణాలు తగ్గిన 24 గంటల తర్వాత కూడా ఒకటి రెండురోజులు అందరి నుంచి దూరంగా ఉండటమే మంచిది. జ్వరంతో ఉన్నవారు పిల్లల ఆటవస్తువులను ముట్టుకోకపోవడమే మేలు. పరిసరాలను, కిచెన్లను, బాత్రూమ్లను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. రోగి పక్కబట్టలను, పాత్రలను విడిగా శుభ్రపరచాల్సినంత అవసరం లేదు. వ్యక్తిగత పరిశుభ్రత కోసం ఒకరి బట్టలు, పక్కబట్టలు, పాత్రలను మరొకరు ఉపయోగించకపోవడం మంచిదే. పబ్లిక్ ప్లేసెస్‌లో ఒకే బాత్రూమ్ ఉపయోగించినప్పుడు అందరూ తలుపు హ్యాండిల్గాని, కొళాయి నాబ్ ఉపయోగించినప్పుడు ఇది ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందే అవకాశం ఉంది. దాన్నే ఫొమైట్ ట్రాన్స్మిషన్ అంటారు. కాబట్టి హ్యాండిల్స్/నాబ్స్‌ను ఉపయోగించినతర్వాత చేతులను తప్పనిసరిగా ‘హ్యాండ్ శానిటైజర్స్’తో శుభ్రం చేసుకోవడం అవసరం. పబ్లిక్ ప్రదేశాలలో మాస్క్ వాడటం కొంత మేరకు మంచిదే. -
హైబీపీతో కిడ్నీలు దెబ్బ తినవచ్చా?
కిడ్నీ కౌన్సెలింగ్స్ నా వయసు 35 ఏళ్లు. నాకు ఎలాంటి ఇబ్బందులూ లేవు గానీ... ఈ మధ్య జ్వరం వచ్చినప్పుడు డాక్టర్‌ను సంప్రదించగా ఆయన పరీక్షలు చేశారు. అప్పుడు నా బీపీ 170/120 ఉందనీ, మందులు వాడాలని చెప్పారు. లేదంటే నాకు కిడ్నీలు దెబ్బతినే ప్రమాదం ఉందన్నారు. నేను మందులు వాడకుండా ఉంటే భవిష్యత్తులో ఏమైనా సమస్యలు వచ్చే అవకాశం ఉందా? – విశాల్, హైదరాబాద్ మీ వయసు వారికి ఏ కారణం లేకుండా హైపర్‌టెన్షన్ (బీపీ సమస్య) రావడం చాలా అరుదు. కానీ నలభై ఏళ్లలోపు బీపీ ఇంత ఎక్కువగా ఉంటే మూత్రపిండాలకు (కిడ్నీలకు) సంబంధించిన సమస్య ఏదైనా ఉందా అని చూడాలి. దీనికోసం ఒకసారి మూత్రపరీక్ష, అల్ట్రాసౌండ్ అబ్డామిన్ స్కానింగ్, క్రియాటినిన్ వంటి పరీక్షలతో పాటు ఒకసారి డాక్టర్‌ను సంప్రదించి, అవసరమైన ఇతర పరీక్షలూ చేయించుకోండి. వాటి ద్వారా అసలు మీకు బీపీ అంతగా పెరగడానికి కారణాలు తెలుసుకోవాలి. బయటకు కనిపించేలా ఏ లక్షణాలూ లేనప్పటికీ బీపీ మందులు తప్పనిసరిగా వాడాలి. లేకపోతే భవిష్యత్తులో కిడ్నీలు దెబ్బతినే అవకాశం ఉంది. ఇక ఆహారంలో ఉప్పు చాలా తగ్గించి వాడటం అవసరం. ఇక స్థూలకాయం ఎక్కువగా ఉన్నవాళ్లు బరువు తగ్గించుకోవాలి. పొగతాగే అలవాటు ఉంటే తక్షణం మానేయండి. కాళ్ల వాపులు వస్తున్నాయి... కిడ్నీల సమస్యా? నాకు 67 ఏళ్లు. గత ఎనిమిదేళ్లుగా డయాబెటిస్తో బాధపడుతున్నాను. ఇటీవల ప్రయాణాలు చేసేప్పుడు కాళ్లకు వాపులు వస్తున్నాయి. బ్లడ్ టెస్ట్ చేయిస్తే క్రియాటినిన్ 10 ఎంజీ/డీఎల్ అని వచ్చింది. యూరియా 28 మి.గ్రా. అని చూపిస్తున్నది. యూరిన్ టెస్ట్‌లో ప్రొటిన్ విలువ 3 ప్లస్‌గా ఉంది. నాకు షుగర్ వల్ల కిడ్నీకి సంబంధించిన వ్యాధి ఏమైనా వచ్చిందా? – ఎల్. కృష్ణమూర్తి, జనగామ మీరు తెలిపిన వివరాలను, మీ రిపోర్టుల్లో నమోదైన అంశాలను బట్టి చూస్తే మీకు మూత్రంలో ప్రొటిన్లు ఎక్కువగా పోతున్నాయి. అయితే ఇది డయాబెటిస్ వల్ల వచ్చిన మూత్రపిండాల సమస్యా లేక ఇతర కారణాల వల్ల వచ్చిందా అన్న విషయాన్ని తెలుసుకోవాలి. సాధారణంగా మూత్రంలో ప్రొటిన్లు పోవడానికి డయాబెటిస్ వ్యాధే కారణమవుతుంది. ఈ సమస్య ఉన్నవాళ్లు భవిష్యత్తులో కిడ్నీలు పాడుకాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. డయాబెటిస్ ఉన్నవారు తమలో చక్కెరపాళ్లను అదుపులో ఉంచుకోవడం అత్యవసరం. మీరు తినకముందు బ్లడ్ షుగర్ 110 మి.గ్రా/డీఎల్ లోపు తిన్న తర్వాత 160 మి.గ్రా/డీఎల్ లోపు ఉండేటట్లుగా చూసుకోవాలి. బీపీ 115/75 లోపు ఉంచుకోవాలి. ఇవే కాకుండా మనం తీసుకునే భోజనంలో ఉప్పు తగ్గించుకోవాలి. పొగతాగడం, ఆల్కహాల్ తీసుకోవడం పూర్తిగా మానేయాలి. నొప్పినివారణ మందుల (పెయిన్‌కిల్లర్స్)ను సొంతవైద్యంగా వాడకూడదు. మీరు ఒకసారి వెంటనే దగ్గర్లోని నెఫ్రాలజిస్ట్‌ను సంప్రదించండి. నా వయసు 45 ఏళ్లు. మా ఇంట్లో మా అమ్మగారు, వారి తండ్రిగారు కిడ్నీ సంబంధిత వ్యాధులతో మరణించారు. జన్యుపరమైన అంశాలు కూడా కిడ్నీ సంబంధిత వ్యాధులకు కారణమవుతాయని ఇటీవలే చదివాను. అప్పటి నుంచి నాకు భయం పట్టుకుంది. కిడ్నీ వ్యాధి రాకుండా ఉండటానికి ఏవైనా ముందస్తు నివారణ మార్గాలున్నాయా? దయచేసి నాకు సలహా ఇవ్వండి. – డి. రమేష్‌కుమార్, కాకినాడ మూత్రపిండాలను కబళించే జబ్బుల్లో అతి పెద్దది డయాబెటిస్. మూత్రపిండాల వ్యాధులు రావడానికి సుమారు 40 నుంచి 50 శాతం వరకు ఇదే ప్రధాన కారణం. దీర్ఘకాలంగా ఉన్న అధిక రక్తపోటు కూడా కిడ్నీలను దెబ్బతీస్తుంది. ఇవేకాకుండా వంశపారంపర్యంగా వచ్చే జబ్బులు, ఇన్ఫెక్షన్లు, కిడ్నీలో రాళ్లు మిగతా ఇతర జబ్బుల కారణంగా కూడా కిడ్నీలు చెడిపోతాయి. కిడ్నీ జబ్బులు వచ్చిన తర్వాత చికిత్స చేయించుకోవడం కంటే అది రాకుండా జాగ్రత్త పడటమే ఉత్తమం. కిడ్నీ వ్యాధులలో పరిస్థితి చాలా తీవ్రతరం అయ్యేవరకు ఎలాంటి లక్షణాలు బయటపడవు. అందుకే కిడ్నీ జబ్బులను సైలెంట్ కిల్లర్స్‌గా పేర్కొంటారు. కాబట్టి వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ ఏడాదికి ఒకసారి మూత్రపరీక్ష, సీరమ్ క్రియాటనిన్ పరీక్ష చేయించుకోవడం మంచిది. ఒకవేళ ఈ పరీక్షలలో ఏమైనా అసాధారణంగా కనిపిస్తే మరింత లోతుగా సమస్యను విశ్లేషించేందుకు జీఎఫ్ఆర్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ పరీక్షలు తోడ్పడతాయి. డయాబెటిస్, రక్తపోటు, ఊబకాయంతో బాధపడుతున్నవారు, కుటుంబంలోగానీ, వంశంలో గానీ కిడ్నీ సంబంధిత జబ్బులున్నవారు మరింత జాగ్రత్తగా ఉండాలి. డయాబెటిస్, బీపీని నియంత్రణలో ఉంచుకుంటూ తప్పనిసరిగా ఏడాదికి ఒకసారి పరీక్షలు చేయించుకుంటూ ఉండాలి. దాంతోపాటు ఆకలి మందగించడం, నీరసం, మొహం వాచినట్లు ఉండటం, కాళ్లలో వాపు, రాత్రిళ్లు ఎక్కువసార్లు మూత్రం రావడం, తక్కువ మూత్రం రావడం, మూత్రం నురగ ఎక్కువగా రావడం వంటి లక్షణాలు కనిపిస్తే ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించి, వారు సూచించిన పరీక్షలు చేయించుకొని వ్యాధి నిర్ధారణ చేసుకోవాలి. ఎందుకంటే మూత్రపిండాల వ్యాధులలో సమయమే కీలకపాత్ర పోషిస్తుంది. చికిత్స ఆలస్యం అయ్యేకొద్దీ మూత్రపిండాల సమస్య తీవ్రతరమవుతుంది. ఎక్కువగా నీళ్లు తాగడం, బరువును అదుపులో ఉంచుకోవడం, మాంసాహారం మితంగా తీసుకోవడం, సాధ్యమైనంతవరకు జంక్ఫుడ్స్, ఫాస్ట్ఫుడ్స్కు దూరంగా ఉండటం వంటి జాగ్రత్తలు తీసుకోవాలి. పొగతాగడం, మద్యం వంటి దురలవాట్లకు దూరంగా ఉంటూ క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, తాజాపండ్లు, ఆకుకూరలు ఎక్కువగా తీసుకోవడం ద్వారా కిడ్నీ సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తపడవచ్చు. డాక్టర్ విక్రాంత్‌రెడ్డి, కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్, కేర్ హాస్పిటల్స్, బంజారాహిల్స్, హైదరాబాద్ -
పాప ఎక్కువగా నిద్ర పోతోంది?
పీడియాట్రిక్ కౌన్సెలింగ్ మా పాప వయసు ఐదేళ్లు. ఈమధ్య ఎక్కువగా నిద్రపోతోంది. రోజుకు దాదాపు 17 గంటలు పడుకునే ఉంటోంది. తినడానికి కూడా లేవడం లేదు. డాక్టర్‌ను సంప్రదించాం. మందులు ఇచ్చారు. వాటితో ఎలాంటి గుణం కనిపించలేదు. పాప ఇలా నిద్రపోవడానికి కారణాలు ఏమిటి? మాకు తగిన సలహా ఇవ్వండి. – ఆర్. ఉజ్వల, కొత్తగూడెం పెద్దలతో పోలిస్తే పిల్లల్లో నిద్రకు సంబంధించిన సమస్యలు తక్కువే. పెద్దల్లోనైనా, పిల్లల్లోనైనా నిద్రపోవడానికి తగినంత వ్యవధి, నిద్రలో తగినంత నాణ్యత ఉండటం చాలా ముఖ్యం. ఇక తగినంత నిద్రలేకపోయినా, చాలా ఎక్కువగా నిద్రపోతున్నా మనం ఆ సమస్యను నిర్లక్ష్యం చేయకూడదు. సాధారణంగా పగటిపూట ఎక్కువసేపు పడుకునే పిల్లలను సోమరులుగా, ప్రవర్తనల్లో తేడాలు ఉన్నవారుగా చిత్రీకరిస్తుంటారు. కానీ ఇది సరికాదు. పిల్లలకు ఎంత నిద్ర అవసరం అన్న అంశంపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. దాంతో పిల్లల్లో ఎక్కువసేపు నిద్రపోతూ ఉండే సమస్యను డయాగ్నోజ్ చేయడం కూడా ఒకింత కష్టమే. అతి నిద్రకు కారణాలు: పిల్లలు అతిగా నిద్రపోవడానికి అనేక కారణాలు ఉన్నాయి. నిద్రలో తగినంత నాణ్యత లేకపోవడం ఒక కారణం కావచ్చు. దానితో పాటు ఊపిరి తీసుకోవడంలో సమస్యలు కూడా మరొకి కారణం కావచ్చు. రాత్రి సరైన వేళకు నిద్రపట్టేలా, వేకువజామున వెలుగు రాగానే నిద్రలేచేలా నియంత్రించేందుకు మెదడులో ఒక బయలాజికల్ క్లాక్ ఉంటుంది. అది ఇలా క్రమబద్ధంగా నిద్రపుచ్చుతూ, నిద్రలేపుతూ ఉంటుంది. దీన్ని సర్కాడియన్ రిథమ్ అంటారు. ఈ రిథమ్‌లో వచ్చిన మార్పులు కూడా నిద్ర సమస్యలకు దారి తీస్తాయి. ఇక అకస్మాత్తుగా నిద్రలోకి జారుకునే నార్కోలెప్సీ అనే జబ్బు వల్ల కూడా సమస్యలు రావచ్చు. దీనికి తోడు మరికొన్ని ఇతర కారణాల వల్ల కూడా నిద్ర సమస్యలు వస్తాయి. అవి... ∙మన వ్యాధి నిరోధక శక్తి మనపైనే ప్రతికూలంగా పనిచేసే ఆటోఇమ్యూన్ డిజార్డర్స్ ∙నరాలకు సంబంధించిన సమస్యలు ∙స్థూలకాయం ∙థైరాయిడ్ సమస్యలు ∙ఇన్ఫ్లుయెంజా ∙మోనోన్యూక్లియాసిస్ ∙ఫైబ్రోమయాల్జియా ∙సీలియాక్ డిసీజ్ వంటివి కూడా నిద్రకు సంబంధించిన రుగ్మతలకు కారణాలని చెప్పవచ్చు. కొన్ని సందర్భాల్లో మనం వాడే మందుల వల్ల కూడా నిద్ర సరిగా పట్టకపోవచ్చు, దానితో రోజంతా నిద్రమత్తుగా అనిపించే అవకాశం ఉంది. ఇక మీరు మీ లేఖలో మీ పాపకు పైన పేర్కొన్న లక్షణాలేమీ వివరించలేదు. మీరు లేఖలో చెప్పినదాన్ని బట్టి చూస్తే మీ పాపకు తగినంత నాణ్యత లేని నిద్ర (పూర్ క్వాలిటీ ఆఫ్ స్వీప్) లేదా పూర్ స్లీప్ హైజీన్ వంటి సాధారణ సమస్య మాత్రమే ఉందని అనిపిస్తోంది. అయినప్పటికీ మీరు మీ పాపకు ఒకసారి థైరాయిడ్ ఇవాల్యుయేషన్, డీటెయిల్డ్ స్లీప్ ఇవాల్యుయేషన్ వంటి పరీక్షలు చేయించడం ముఖ్యం. ఈ రోజుల్లో నార్కోలెప్సీ వంటి అరుదైన, తీవ్రమైన నిద్రసంబంధమైన జబ్బులకూ ప్రభావపూర్వకమైన చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. మీరు మరొకసారి మీ పిల్లల వైద్య నిపుణుడిని లేదా న్యూరోఫిజీషియన్‌ను సంప్రదించి తగిన సలహా, చికిత్స తీసుకోగలరు. బాబుకు ఉన్న కళ్ల సమస్య ఏమిటి? మా బాబుకి పదకొండేళ్లు. చాలా ఆరోగ్యంగా, మంచి చురుగ్గా ఉంటాడు. అయితే బాబుకి రెండు కళ్లలోని కనుగుడ్లు గబగబా కదులుతుంటాయి. ఇతరత్రా ఇబ్బంది లేకపోయినా చదవడంలో కాస్త సమస్యగానే ఉంది. వాడి విషయంలో తగిన సలహా ఇవ్వండి. – డి. సూర్యారావు, టెక్కలి మీరు చెబుతున్న లక్షణాలను బట్టి చూస్తుంటే మీ బాబుకి కళ్ల పొజిషన్, కదలికలో తేడా ఉన్నట్టు అనిపిస్తుంది. వీటిలో చాలా రకాలుంటాయి. మీ ఉత్తరంలో బాబు సమస్యకి సంబంధించి చాలా వివరాలు తెలపలేదు. అందుకే ఖచ్చితమైన కారణం నిర్ధారణ చేయడం సాధ్యం కావడం లేదు. మీరు చెబుతున్న కొద్దిపాటి సమాచారాన్ని బట్టి చూస్తే మీ వాడికి నిస్టాగ్మస్ లేదా ఆప్సోక్లోనస్ అనే సమస్యలు ఉండి ఉండవచ్చుననిపిస్తోంది. ముందుగా నిస్టాగ్మస్కు సంబంధించిన వివరాలలోకి వెళ్తే... ఇదొక వ్యాధి కాదు. బాబులోని రుగ్మతకు సంకేతం మాత్రమే. నిస్టాగ్మస్ ఉన్న వారి కళ్లు రిథమిక్‌గా కదులుతూ (రిథమిక్ ఆసిలేషన్ మూవ్మెంట్స్) ఉంటాయి. ఇది ఒకటి లేదా రెండు కళ్లకు ఉండవచ్చు. ఈ సమస్య పుట్టుక నుంచీ ఉండవచ్చు లేదా మధ్యలోనైనా ఇది రావచ్చు. ఈ పరిస్థితికి అనేక కారణాలుంటాయి. ఉదా. కంటి సమస్యలు, చెవి సమస్యలు (లాబ్రెంతైౖటిస్), ఆల్బెనిజం, మెదడు సమస్యలు, కొన్ని సార్లు కొన్ని మందుల వల్ల కూడా ఈ విధమైన లోపాలు ఏర్పడుతుంటాయి. ఇక ఆప్సోక్లోనస్ విషయానికి వస్తే... కళ్లు నాన్ రిథమిక్‌గా, అనేక డైరెక్షన్స్‌లో తిరుగుతుంటాయి. కళ్లను చూస్తే ఏదో కలవరంతోనో, కోపంతో (ఆజిటేటెడ్గా) ఉన్నట్లు అనిపిస్తాయి. కొన్నిసార్లు ఈ స్థితి న్యూరోబ్లాస్టోమా అనే తీవ్రమైన మెదడు జబ్బుకి మొదటి సూచిక అయిండవచ్చు. మీ అబ్బాయి విషయంలో సమస్య పరిష్కారం కోసం పూర్తి స్థాయిలో కంటి పరీక్షలు చేయించడంతో పాటు ఒకసారి బ్రెయిన్ స్కాన్ కూడా చేయించడం మంచిది. ఒకవేళ కంటి సమస్య ఉన్నట్లు నిర్థారణ అయితే (అది ముఖ్యంగా కంటి కండరాలకు సంబంధించిన సమస్య అయినప్పుడు) కొన్ని రకాల శస్త్ర చికిత్సల ద్వారా సమస్యను కొంతవరకు పరిష్కరించవచ్చు. మీవాడి సమస్యకు కారణం ఏమిటనేది తెలుసుకుంటేనే ఇదమిత్థంగా పరిష్కారం చెప్పడం వీలవుతుంది. కాబట్టి మీరు ఒకసారి మీ కంటి వైద్య నిపుణులని కలిసి తగు సలహా, చికిత్స తీసుకోండి. బాబుకు మాటిమాటికీ జ్వరం... ఎందుకిలా? మా బాబు వయసు రెండేళ్లు. వాడికి ఈమధ్య మాటిమాటికీ జ్వరం వస్తోంది. తగ్గినా మళ్లీ తిరగబెడుతోంది. మందులు వాడినంత సేపే గుణం కనిపించి ఆ తర్వాత మళ్లీ ఒళ్లు వెచ్చబడుతోంది. వాడికి ఇలా మాటిమాటికీ జ్వరం రావడంతో మాకు ఆందోళనగా ఉంది. మాకు తగిన సలహా ఇవ్వండి. – వి. రంగారావు, ఒంగోలు పిల్లలు నిత్యం సూక్ష్మక్రిములు, వైరస్, బ్యాక్టీరియాకు ఎక్స్పోజ్ అవుతుండటం వల్ల ఇలా జ్వరం వస్తుండటం మామూలే. గడ్డలు, బ్రుస్సెల్లోసిస్, డెంటల్ యాబ్సెస్, దీర్ఘకాలికమైన జబ్బులు, క్రిప్టోకోకస్, సిస్టైటిస్, ఫెమీలియల్ ఫీవర్ సిండ్రోమ్ వంటి అనేక సాధారణ సమస్యలు మొదలుకొని కొన్ని తీవ్రమైన సమస్యల వరకు ఇలా జ్వరం అనే లక్షణం కనిపించవచ్చు. మీరు ఇచ్చిన కొద్దిపాటి సమాచారంతో మీ బాబుకు జ్వరం ఎందుకు వస్తోందనేది నిర్దిష్టంగా చెప్పడం సాధ్యం కాకపోయినా... యూరినరీ ట్రాక్ట్‌కు సంబంధించిన సమస్య ఉందేమో చూడాలి. కాబట్టి ఒకసారి యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్కు సంబంధించిన పరీక్షలు చేయించండి. అందులో ఏమీ కనిపించకపోతే దీర్ఘకాలికమైన జబ్బులకు సంబంధించిన సమస్యలు ఏమైనా ఉన్నాయేమో అని పరీక్షలు చేయించడం చాలా ముఖ్యం. జ్వరం వచ్చిన ప్రతీసారీ కారణం తెలుసుకోకుండా మందులు – మరీ ముఖ్యంగా యాంటీబయాటిక్స్ వాడటం హానికరం. కాబట్టి మీరు మరొకసారి మీ పిల్లల వైద్య నిపుణుడిని సంప్రదించి తగు చికిత్స తీసుకోండి. డా. రమేశ్‌బాబు దాసరి సీనియర్ పీడియాట్రీషియన్, రోహన్ హాస్పిటల్స్, విజయనగర్ కాలనీ, హైదరాబాద్ -
జ్వరంతో విద్యార్థిని మృతి
పశ్చిమగోదావరి, ద్వారకాతిరుమల: జ్వరంతో బాధపడుతున్న ఒక విద్యార్థిని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటన సోమవారం చోటుచేసుకుంది. మృతురాలి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని దొరసానిపాడుకు చెందిన ఉనమట్ల రాంబాబు, లక్ష్మి దంపతులకు ముగ్గురు కుమార్తెలు. అందులో రెండవ కుమార్తె ఉనమట్ల ప్రసన్న (16) జంగారెడ్డిగూడెంలోని వెంకటేశ్వర కళాశాలలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతోంది. ఆమెకు గత పదిరోజుల క్రితం తీవ్ర జ్వరం రావడంతో ఈనెల 23న విజయవాడలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు. అయితే అక్కడ చికిత్సనందించిన వైద్యులు ప్లేట్లెట్స్ తగ్గిపోయాయంటూ ఆమెకు రక్తం కూడా ఎక్కించారు. అయినా ఫలితం దక్కలేదు. జ్వరం తీవ్రత ఎక్కువై సోమవారం ఉదయం విద్యార్థిని మృతిచెందింది. అందరితో కలసిమెలసి ఉండే ప్రసన్న మృతిచెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. -
పేగుబంధం కూడా కల్తీబంధంగా మారితే..
2016, అక్టోబర్ 4.‘అమ్మా.. ఈ స్వీట్ తీసుకో. నిన్ను ఫంక్షన్లో ఎంత మంది అడిగారో తెలుసా’ ఇంట్లోకి వస్తూనే స్వీట్ ప్యాకెట్లోంచి ఓ మైసూర్‌పాక్ తీసి తల్లి మీరాబి చేతికి ఇచ్చింది మస్తాని. ‘ఎక్కడే.. నీకు తెలుసుగా. మీ నాన్నకు ఒంట్లో బాగోలేదు. అక్కడకు వస్తే మీ నాన్నకు ఇబ్బంది కదా’ అంటూనే ‘ఇంతకీ శ్రీమంతం ఫంక్షన్ బాగా జరిగిందా?’ అంది మీరాబి.‘ఊ.. చాలా బాగా జరిగింది. మా ఆడపడుచుకు వాళ్ల అత్తగారు కోడలికి నెక్లెస్ పెట్టింది తెలుసా. మా ఆడపడుచు ముఖం చూడాలి ఎలా వెలిగిపోయిందో’ అంటూ తనూ స్వీట్ తీసుకొని నోట్లో పెట్టుకుంది. ‘మీ ఆడపడుచు అదృష్టం అంతా. ఇంతకీ చిన్నాకు ఎలా ఉంది? ఒంట్లో బాగోలేదన్నావ్..’ మనవడి బాగోగులు అడిగింది మీరాబి.‘ఇప్పుడు పర్వాలేదమ్మా. జ్వరం తగ్గింది. మళ్లీ వస్తే హాస్పిటల్‌కి తీసుకెళ్లాలి. ఇక నే వెళ్తానమ్మా. మీ అల్లుడు వచ్చే టైమ్ అయ్యింది. పిల్లాడు కూడా ఇంట్లో ఒక్కడే ఉన్నాడు’‘కాసేపు ఉండవే. ఇల్లు ఏమైనా కిలోమీటర్ దూరమా. పక్కనే కదా. అయినా మీ ఆయన పెద్ద ఆఫీసరా... నువ్వేమైనా ఆఫీసరు భార్యవా. కాస్త రెండు రొట్టెలు చేసియ్యి. పిండి కలిపే ఉంది. నేనే చేద్దును కానీ కాళ్లు నొప్పులుగా ఉన్నాయి’ అని మీరాబీ అనడంతో స్వీట్‌బాక్స్ షెల్ఫ్‌లో పెట్టేసి ‘సరేనమ్మా’అంటూ కిచెన్‌లోకి వెళ్లిపోయింది మస్తాని.ఆరోగ్యం బాగా లేని తండ్రి కోసం రొట్టె చేయడం మొదలెట్టింది. మరుసటి రోజు.కొడుకుకు జ్వరం తగ్గకపోవడంతో ఆసుపత్రిలో అడ్మిట్ చేసింది మస్తాని.డాక్టర్ రాసిచ్చిన మందులు తీసుకురావడానికి బయటకు వచ్చింది. ఇంతలో చేతిలో ఉన్న సెల్‌ఫోన్ మోగింది. చూస్తే తమ్ముడు సుభాని. ‘ఏంట్రా...’ అంది మస్తాని!అవతలి నుంచి సమాచారం విని విస్తుపోయింది. ఉన్నఫళంగా ఇంటికి చేరుకుంది.అప్పుడు సమయం సాయంత్రం 6 గంటలు.స్కూల్, కాలేజీలకు వెళ్లిన విద్యార్థులు, పనులకు వెళ్లిన పెద్దలు ఇంటికి చేరుకునే సమయం. గుంటూరు జిల్లా చేబ్రోలులోని ముస్లిం కాలనీ అది.గ్రామస్తులంతా ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగి షేక్ ఖాసీం ఇంటివైపు పరుగులు తీస్తున్నారు.ఖాసీం ఇంటి ముందు పెద్ద ఎత్తున గుమిగూడారు. ఆ గుంపులోంచే లోపలికి నడిచింది మస్తానీ.ఎదురుగా కనిపించిన దృశ్యానికి హతాశురాలైంది. అక్కడే ఉన్న ఆమె అన్నదమ్ములు మస్తానీని చూసి బావురుమన్నారు. ఎదురుగా నేల మీద తల్లీ మీరాబి, తండ్రి ఖాసీం... వారి చుట్టూ రక్తం మడుగు కట్టి ఉంది. ఒంటి నిండా గాయాలు. ఇంతలోనే పోలీస్ జీపు ఖాసీం ఇంటి ముందు ఆగింది. పోలీసులు వేగంగా జీపులోంచి దిగి ఖాసీం ఇంట్లోకి వెళ్లారు. ఇంట్లో కనిపించిన దృశ్యాన్ని చూసి వారు కూడా కొద్దిసేపు నిర్ఘాంతపోయారు. వృద్ధులిద్దరూ విగతజీవుల్లా రక్తపు మడుగులో పyì ఉన్నారు. మృతదేహాల నిండా గొడ్డలితో నరికిన గాయాలు ఉండటాన్ని చూసి గుర్తు తెలియని అగంతకులు హత్య చేసినట్లు నిర్ధారించుకున్నారు.‘ఏం జరిగింది?’ సుభానీని పిలిచి అడిగాడు సీఐ.‘ఏమో తెలియదు సార్. పని మీద ఉదయం గుంటూరుకు వెళ్లాను. సాయంత్రం ఇంటికి వచ్చి చూసే సరికి ఇంట్లో రక్తపుమడుగులో అమ్మ, నాన్న పyì ఉన్నారు. వెంటనే పోలీస్ స్టేషన్‌కు ఫోన్ చేశాను..’ కళ్లనీళ్లతోనే చెప్పాడు సుభాని. ‘మీ ఇంట్లో ఇంకా ఎవరెవరు ఉంటారు’ అడిగాడు సీఐ.‘మేం ఐదుగురం అన్నదమ్ములం, ఇద్దరు అక్కచెల్లెళ్లు. పెద్దన్న బెంగళూరులో ఉంటాడు. మిగతా అందరం అమ్మనాన్నతోనే ఉంటాం. ఈమె మా అక్క మస్తాని. మా పక్కిల్లే వీళ్లది’ అన్నాడు సుభానీ. ఏడుస్తున్న మస్తాని వద్దకు వచ్చిన సీఐ ‘ఏమ్మా ఏం జరిగి ఉంటుందో నీకేమైనా తెలుసా’ అన్నాడు. ‘లేదు సార్. మా అబ్బాయికి విపరీతంగా జ్వరం. తగ్గకపోతే ఆసుపత్రికి తీసుకెళ్లి చేర్పించాను. మా తమ్ముడు ఫోన్ చేసి విషయం చెబితే బాబునక్కడే వదిలేసి హడావిడిగా వచ్చాను’ ధారగా కారుతున్న కళ్లనీళ్లు తుడుచుకుంటూ చెప్పింది మస్తాని. కుటుంబసభ్యులు ఇచ్చిన వివరాల ఆధారంగా సంఘటనా స్థలాన్ని పరిశీలించిన సీఐ, ఎస్సైలు సుభాని ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేశారు. షేక్ ఖాసీం, మీరాబీల హత్యల విషయాన్ని పై అధికారులకు తెలియజేశాడు సీఐ. హత్యాస్థలాన్ని డీఎస్పీ, అదనపు ఎస్పీలు పరిశీలించారు. ‘ఇది దోపిడీ దొంగల పని అయి ఉండాలి. లేదంటే ఎవరైనా సైకో చేసి ఉండాలి. అలాంటి వారే ఇంత వృద్ధుల్ని ఇంత దారుణంగా చంపి ఉంటారు’ అన్నాడు ఎస్పీ. గుంటూరు నుంచి క్లూస్, డాగ్ స్క్వాడ్ టీంలు చేబ్రోలుకు చేరుకున్నాయి. డాగ్ స్క్వాడ్ హత్య జరిగిన ప్రదేశంతో పాటు ఇళ్లంతా కలియదిరిగింది.క్లూస్ టీం సంఘటన స్థలంలో సునిశితంగా పరిశీలించి వేలిముద్రలను సేకరించింది. మృతదేహాల పక్కన ఉన్న రెండు రకాల చేతిగాజులముక్కలను టీం సేకరించింది.గాజు ముక్కలు ఎరుపు, పసుపు రంగుల్లో ఉన్నాయి. ‘మీరాబీ చేతి గాజులై ఉండవచ్చు’ నిర్ధారణకు వచ్చారు పోలీసులు.దోపిడీ దొంగలు, సైకోలకు సంబంధించిన ఆనవాళ్లు ఘటనా స్థలంలో క్లూస్ టీంకు లభించలేదు. రోజులు గడుస్తున్నాయి.దొంగల ముఠాల వల్లగానీ, సైకోల వల్లగాని ఈ హత్యలు జరిగినట్టుగా ఎటువంటి ఆనవాలు దొరకడం లేదు.‘ఇతరత్రా ఎలాంటి సమాచారం లభించలేదంటే కుటుంబ కలహాలు, ఆస్తి తగాదాల నేపథ్యంలో ఈ హత్యలు జరిగి ఉండవచ్చు’ అన్నాడు డీఎస్పీ.‘నిజమే సార్! ఈ కోణంలో విచారిస్తే తప్పకుండా నేరస్తులు ఎవరో తెలిసిపోతుంది’ అన్నాడు సీఐ. డీఎస్పీ, సీఐతో పాటు పోలీసు సిబ్బంది అన్ని కోణాల్లో విచారించడం మొదలుపెట్టారు. ఖాసిం కొడుకులు, బిడ్డల మీద ప్రత్యేక బృందాలతో నిఘా ఉంచారు పోలీసులు.క్లూస్ టీంకు దొరికిన గాజు ముక్కలు మృతురాలు మీరాబీవేనా అనే కోణంలో విచారించడం మొదలుపెట్టారు. ఇంటి చుట్టుపక్కల వారికి ఆ గాజు ముక్కలు చూపించి ‘ఇవి ఎవరివో చెప్పగలరా’ అని అడిగారు. ఒకరిద్దరు మాకెందుకొచ్చిన తంటా అనుకుంటూ ‘తెలియదు సార్’ అన్నారు.ఎదురింట్లో ఉంటున్న సీమా మాత్రం ‘సార్. మీరాబీ పసుపు రంగు గాజులే వేసుకుంటుంది. ఎరుపు రంగు గాజులు రెండు రోజుల ముందు ఆడపడుచు శ్రీమంతం సందర్భంగా మస్తాని వేసుకుంది.వాటికి రెండు వైపులా డిజైన్ ఉంటుంది. నాకు గుర్తు. ఎందుకంటే షాపింగ్‌కి నేనే మస్తానీకి తోడు వెళ్లాను’ అంది.ఆ కొద్దిపాటి క్లూ ఆధారంగా మస్తానీపై అనుమానంతో ఆమె నివాసంలో పోలీసులు తనిఖీ చేశారు. రక్తపు మరకలతో ఉన్న గొడ్డలి, ఇనుప రాడ్డు లభించాయి. ‘ఈ గొడ్డలి ఎవరిది’ కరుకుగా ప్రశ్నించింది పోలీసు స్వరం మస్తానీని. ‘అది మాదే సార్. కానీ ఆ గొడ్డలికి రక్తం ఎలా అంటిందో తెలియదు. అయినా, అది మా ఇంట్లోనే ఉండదు... ’ అక్క మస్తాని ఇంటికి పోలీసులు వచ్చారని తెలియగానే సుభాని పరుగున అక్కడకు చేరుకున్నాడు. గొడ్డలిని చూసిన సుభాని ‘ఆ గొడ్డలి మా ఇంట్లోనే ఉంటుంది సార్. అప్పుడప్పుడు మా అక్క కట్టెలు కొట్టుకోవడానికి తీసుకెళ్తుంటుంది’ చెప్పాడు.‘ఓహో.. అయితే ఈ గొడ్డలితోనే మీ అమ్మను, నాన్నను చంపి ఉంటారు అవునా’ ఎస్సై మాటలకు మస్తానీ నిలువెల్లా వణికిపోయింది. ఆ పక్కనే ఉన్న ఆమె భర్త మొహిద్దీన్ తల వంచుకున్నాడు. పోలీసులు మస్తానీని, ఆమె భర్త మొహిద్దీన్‌లను అదుపులోకి తీసుకున్నారు. గుంటూరు టౌన్ పోలీసు స్టేషన్లో... పోలీసుల ముందు మస్తాని, మొహిద్దీన్‌లు అసలు విషయం చెప్పడం మొదలుపెట్టారు. మస్తానీ గొంతు పెగుల్చుకొని ఒక్కో విషయం చెబుతోంది. పోలీసులు రికార్డ్ చేస్తున్నారు. ‘సార్. మా అమ్మనాన్నలతో కొన్నాళ్లుగా ఆస్తి విషయంలో తగాదాలున్నాయి. పెళ్లప్పుడు నాకు ఇస్తానన్న ఆస్తి రాసివ్వకపోగా మా అమ్మ రోజూ తిడుతూ నాతో గొడవకు దిగుతుండేది. మొన్న 5వ తేదీన కూడా సాయంత్రం ఏ కారణం లేకుండానే మా అమ్మ నన్ను తిడుతూ గొడవకు దిగింది. దాంతో నాకూ కోపం వచ్చింది. ఎదురు తిరిగి ఆమెతో నేనూ గొడవకు దిగాను. ఇద్దరం జుట్లు పట్టుకుని కొట్టుకున్నాం. ఈ గొడవలో మా ఇద్దరి చేతి గాజులు పగిలిపోయి అక్కడ పడ్డాయి. కోపం ఆపుకోలేక పక్కనే ఉన్న గొడ్డలితో మా అమ్మను నరికాను. ఆమె అక్కడికక్కడే చనిపోయింది. ఇంతలో నా భర్త అక్కడికి వచ్చాడు. జరిగిదంతా అతనికి చెప్పాను. మేమిద్దరం అక్కడున్న సమయంలోనే బయటికెళ్లిన మా నాన్న ఇంటికొచ్చాడు. రక్తపు మడుగులో ఉన్న మా అమ్మను చూసి ‘ఏమైంద’ని గట్టిగా అరిచి గొడవ చెయ్యబోయాడు. విషయం బయటికి తెలుస్తుందేమోనని, నాన్నను కూడా చంపేస్తే ఆస్తి పంచుకోడానికి అడ్డు తొలగిపోతుందని నా ¿¶ ర్త, నేను మా నాన్నను పక్కనే ఉన్న ఇనుప రాడ్డుతో తలపై కొట్టి, గొడ్డలితో నరికి చంపేశాం. మామీద అనుమానం రాకూడదని ఏమి తెలియనట్టు హడావిడిగా మా అబ్బాయిని తీసుకొని ఆసుపత్రికి వెళ్లాం. డాక్టర్ వద్దని చెప్పినా సెలైన్ బాటిల్ ఎక్కించమని ఆసుపత్రిలో ఉన్నట్టు నమ్మించాలని ప్రయత్నించాం’ అని పోలీసుల విచారణలో మస్తానీ ఆమె భర్త ఖాజా మొహిద్దీన్‌లు హత్యలకు పాల్పడినట్లు అంగీకరించారు. పోలీసులు నిందితులను అరెస్టు చేసి జైలుకు పంపారు.ప్రస్తుతం కేసు విచారణ కొనసాగుతుంది. – వడ్డే బాలశేఖర్, సాక్షి ప్రతినిధి, గుంటూరు -
వీడుతారా.. కుంభకర్ణ నిద్ర!
ఈ దృశ్యం చూడండి. కాకినాడ ప్రభుత్వాస్పత్రి(జీజీహెచ్)లో చికిత్స కోసం ఒకే పడకపై ఇద్దరేసి రోగులు ఉన్న దృశ్యమిది. రోగులు ఎక్కువైతే మున్ముందు విజయనగరం జిల్లా విద్యార్థుల మాదిరిగా మన జిల్లా రోగులకు ఎదురవుతుందేమో! పరిస్థితి చూస్తుంటే అవుననేలా ఉంది. జీజీహెచ్‌లో స్వైన్çఫ్లూ వార్డు ప్రస్తుతం ఖాళీగా ఉంది. అక్కడ పడకలన్నీ నిరుపయోగంగా ఉన్నాయి. హెల్త్ ఎమర్జెన్సీ నేపథ్యంలో ప్రస్తుత జ్వరాల తీవ్రత దృష్ట్యా నిరుపయోగంగా ఉన్నవాటిని వినియోగించొచ్చు. కానీ, వాటికి నిబంధనలు అడ్డం ఉన్నాయని, వాడటానికి వీలు లేదని చెప్పి, ఒకే పడకపై ఇద్దరేసి రోగులను ఉంచుతున్నారు. సాక్షి ప్రతినిధి, తూర్పుగోదావరి,కాకినాడ: రాష్ట్ర ఆర్థిక మంత్రి, మన జిల్లాకు చెందిన యనమల రామకృష్ణుడు పంటి నొప్పి ఉందని, సింగపూర్ వెళ్లి, ఎంచక్కా రూ. 2.88 లక్షల ప్రజాధనం ఖర్చు చేసి, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయించుకున్నారు. కేవలం పంటి నొప్పికే అంత దూరం వెళ్లి ట్రీట్మెంట్ చేయించుకున్న యనమలకు జిల్లాలో ప్రబలుతున్న జ్వరాలు, ఆస్పత్రుల్లో నెలకొన్న మందుల కొరత కనిపించకపోవడం విచిత్రమే! అటు జిల్లాకే చెందిన ఉప ముఖ్యమంత్రి, హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప తీరు కూడా అదేవిధంగా ఉంది. కొద్ది రో జులుగా జిల్లాలో డెంగీ, మలేరియా, విషజ్వరాలు పెద్ద ఎత్తున ప్రబలుతున్నాయి. ప్రజలు వేలాదిగా ఆస్పత్రుల పాలవుతున్నారు. అధిక సంఖ్యలో మృతి చెందుతున్నారు. గ్రామాలకు గ్రామాలే జ్వ రాల బారిన పడుతున్నాయి. కొన్నిచోట్ల జ్వరాల తీవ్రతకు ప్రజలు భయపడి, ఇళ్లు ఖాళీ చేసేసి, బయటికొచ్చేస్తున్న పరిస్థితులు నెలకొన్నాయి. రాష్ట్రంలోనే అత్యధికంగా డెంగీ ప్రభావం జిల్లాలో ఉందని సాక్షాత్తూ ముఖ్యమంత్రి వీడియో కాన్ఫరెన్స్‌లోనే తేటతెల్లమయ్యింది. పరిస్థితి ఇంత తీవ్రంగా ఉన్నప్పటికీ మన జిల్లాకు చెందిన మంత్రులకు అదేమీ పట్టడం లేదు. జిల్లాలో నెలకొన్న పరిస్థితులపై కనీసం ఆరా తీయడం లేదు. జిల్లాకు జ్వరం పట్టుకుందని పత్రికలు ఘోషిస్తున్నా కుంభకర్ణ నిద్ర పోతున్నారే తప్ప అసలేం జరుగుతోందో గమనిస్తున్న దాఖలాలు లేవు. జ్వరాల తీవ్రత నేపథ్యంలో జిల్లాలో పారిశుద్ధ్య పరిస్థితులను మెరుగుపర్చాలి. పంచాయతీ, వైద్య, ఆరోగ్య శాఖ సిబ్బందిని అప్రమత్తం చేసి ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలి. ఇంటింటికీ వెళ్లి డెంగీ తదితర జ్వరాలు రాకుండా ప్రజలకు ముందస్తు జాగ్రత్తలను వివరించాలి. వైద్యుల కొరత ఉంటే వాటిని భర్తీ చేసేందుకు చర్యలు తీసుకోవాలి. మందుల కొరత ఉంటే ప్రభుత్వ స్థాయిలో ఒత్తిడి చేసి తీసుకురావాలి. కానీ, మన మంత్రులు యనమల, చినరాజప్పలకు ఈ విషయం కనీసంగా కూడా పట్టడం లేదు. తమ వైద్యం, తమ విలాసాలు చూసుకుంటున్నారే తప్ప ప్రజల అనారోగ్యం వారికేమాత్రం కనిపించడం లేదు. కనీసం ఇప్పటివరకూ అధికారులను సమన్వయపరిచి, సమీక్షించిన దాఖలాల్లేవు. తాంబూ లాలిచ్చేశాం.. తన్నుకు చావండన్నట్టుగా అధికారులకు ఆదేశాలిచ్చాం.. వారే చూసుకుంటారనే ధోరణిలో వ్యవహరిస్తున్నారు. మరణాలు సమాధి జిల్లాలో ప్రతి రోజూ చావులు చూస్తున్నాం. డెంగీ, మలేరియా, విషజ్వరాలతో చనిపోతున్నట్టు పత్రికల్లో పతాక శీర్షికన వస్తున్నాయి. జనాలు పిట్టల్లా రాలిపోతున్నారు. కానీ, జిల్లా వైద్యాధికారులు మాత్రం అదంతా ఉత్తిదేనని తీసిపారేస్తున్నారు. జిల్లాలో అసలు మరణాలే లేవని తేల్చేస్తున్నారు. గత జనవరి నుంచి ఇప్పటివరకూ 1,401 మలేరియా, 277 డెంగీ పాజిటివ్ కేసులు మాత్రమే నమోదయ్యాయని, మరణాలు ఎక్కడా చోటు చేసుకోలేదని అధికారులు చెబుతున్నారు. మరి పెద్ద సంఖ్యలో ప్రజలు ఎందుకు ప్రాణాలు కోల్పోతున్నారనే ప్రశ్నకు వారివద్ద సరైన జవాబు లేదు. వేధిస్తున్న మందుల కొరత ♦ ప్రభుత్వాసుపత్రిలో ప్రధానమైన మందులు లేకపోవడంతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ♦ గ్యాస్ట్రిక్‌కు సంబంధించిన కాంబినేషన్ మందులైన పేంటాప్రోజల్, రేంటాడిన్, ట్రాండిన్ 150 ఎంజీ ప్రస్తుతం అందుబాటులో లేవు. ప్రతి వైద్యానికీ ఈ మందు తప్పనిసరి. ♦ చిన్న పిల్లలకు సంబంధించి ఒకటి రెండు సిరప్లు తప్ప ఏవీ లేవు. దగ్గు, బలానికి వాడే సిరప్లు లేవు. ♦ రోగ నిరోధక శక్తిని పెంచే విటమిన్ సి, ఐరన్ టాబ్లెట్లు లేవు. ♦ గుండె సంబంధిత వ్యాధి అత్యవసరమైన సార్బిట్రేట్ టాబ్లెట్లు లేవు. ♦ గుండె, మెదడుకు సంబంధించి ప్రధానమైన ఆస్పిరిన్ మందు కూడా అందుబాటులో లేదు. ♦ నొప్పులకు వాడే డైక్లోఫెనాక్ ఇంజక్షన్ ప్రభుత్వాసుపత్రిలో లేదు. దీనికి బదులు టాబ్లెట్ వాడుతున్నారు. ప్లూయిడ్స్‌లో వాడాలంటే తప్పనిసరిగా ఇంజక్షన్ ఉండాలి. ♦ దగ్గుకు వాడే సీపీఎం సిరప్ లేదు. ♦ సిప్రోఫ్లోక్సాసిన్ ఐ డ్రాప్స్ ఆసుపత్రుల్లో లేవు. ♦ మల్టీ విటమిన్ టాబ్లెట్లు కూడా ప్రభుత్వాసుపత్రిలో దొరకడం లేదు. ♦ వీటిల్లో చాలా మందులు జ్వరాలతో బాధపడుతున్న వారికి పరిస్థితులకు తగ్గట్టుగా వాడాల్సి ఉంటోంది. ఈ మందులు లేకపోవడంతో రోగులు సర్కారీ వైద్యానికి దూరమై, ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లి చేతి చమురు వదిలించుకోవల్సి వస్తోంది. అంత స్తోమత లేనివారికి చావే శరణ్యమవుతోంది. -
పెళ్లయి ఇంకా 13 రోజులైనా గడవలేదు..
పెళ్లయి ఇంకా 13 రోజులైనా గడవలేదు. ఇంట్లో వేసిన పెళ్లి పందిరి కూడా ఇంకా తీయనే లేదు. అప్పుడే ఆ వరుడికి నూరేళ్లు నిండిపోయాయి. జ్వరం ఆయన్ను కాటేసి ఆయన్ను వివాహం చేసుకున్న ఆ వధువుకు వైధవ్యం మిగిల్చింది. విజయనగరం పూల్‌బాగ్ కాలనీలోని పన్నగంటి ఈశ్వరరావు జ్వరంతోబాధపడుతూ బుధవారం మృతిచెందాడు. విజయనగరం ఫోర్ట్: జ్వరం బారిన పడి నవవరుడు మృతి చెందాడు. వివరాల్లోకి వెళితే.. పట్టణంలోని పూల్‌బాగ్ కాలనీకి చెందిన పన్నగంటి ఈశ్వరరావు (24) కార్పెంటర్‌గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఇతనికి గత నెల 24న పూల్‌బాగ్ కాలనీకి చెందిన మౌనిక అనే మహిళతో వివాహాం జరిగింది. ఈ నెల నాలుగో తేదీన జ్వరం రావడంతో ఈశ్వరరావును కుటుంబ సభ్యులు నెల్లిమర్ల మిమ్స్‌కు తరలించారు. అయితే పరిస్థితి విషమంగా ఉండడంతో వైద్యులు కేజీహెచ్‌కు రిఫర్ చేశారు. దీంతో బుధవారం ఆయన్ని విశాఖ కేజీహెచ్‌కు తరలిస్తుండగా, మార్గమధ్యలో మృతి చెందాడు. దీంతో భార్య, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. -
జ్వరం..కలవరం !
జిల్లాలో విష జ్వరాలు విజృంభించాయి. అన్ని ప్రాంతాల్లో జ్వరాలు ప్రబలడంతో ప్రజలు కలవరపడుతున్నారు. మలేరియా, డెంగీ, టైఫాయిడ్ లక్షణాలతో రోగులు ఆస్పత్రులకు వస్తున్నారు. మలేరియా శాఖ లెక్కల ప్రకారం జిల్లాలో ఇప్పటి వరకూ 42 డెంగీ కేసులు, మలేరియా 100 కేసులు నమోదయ్యాయంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. జ్వర పీడితులతో ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులు కిటకిటలాడుతున్నాయి. రోగాల సీజన్ ఆరంభమైన నేపథ్యంలో ప్రజలు వ్యాధుల బారిన పడకుండా అవగాహన కల్పించాల్సిన వైద్య ఆరోగ్య శాఖ నిమ్మకునీరెత్తినట్లు ఉందనే విమర్శలొస్తున్నాయి. లబ్బీపేట(విజయవాడ తూర్పు) : విజయవాడతో పాటు, జిల్లా వ్యాప్తంగా విష జ్వరాలు విజృంభిస్తున్నాయి. తిరువూరు, గుడివాడ, అవనిగడ్డ, మైలవరం, నందిగామ, కైకలూరు, తదితర ప్రాంతాల్లో జ్వరాలతో ప్రజలు బాధపడుతున్నారు. ఇంట్లో ఒకరి తర్వాత మరొకరు జ్వరాల బారిన పడుతున్నారు. ప్రతి ఇంట్లో ఒకరిద్దరు జ్వరాలతో బాధపడుతున్నారు. విజయవాడ ప్రభుత్వాస్పత్రిలోని మెడిసిన్ వార్డులో రోగులకు పడకలు సైతం చాలని పరిస్థితి నెలకొంది. దీంతో నేలపైనే ఉంచి చికిత్స అందించాల్సిన దుస్థితి నెలకొంది. మరోవైపు అవుట్ పేషెంట్స్ విభాగానికి సైతం జ్వరపీడితుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతున్నట్లు వైద్యులు చెబుతున్నారు. మరో రెండు నెలలు జ్వరాలు ఇలానే కొనసాగే అవకాశం ఉందని అంటున్నారు. రోజురోజుకు జ్వరాలతో వచ్చే వారి సంఖ్య పెరుగుతున్నట్లు వైద్యులు తెలిపారు. పడకలన్నీ ఫుల్.... ప్రభుత్వాస్పత్రి జనరల్ మెడిసిన్ విభాగంలో 180 పడకలున్నాయి. యూనిట్లు వారీగా ప్రతిరోజు ఒక్కోవార్డులో అడ్మిషన్లు జరుపుతుంటారు. ప్రస్తుతం వ్యాధుల సీజన్ కావడంతో రోగుల సంఖ్య ఎక్కువుగా ఉంటోంది. మెడిసిన్ విభాగాల్లోని పడకలన్నీ రోగులతో కిటకిటలాడుతున్నాయి. దీంతో రోగులకు ఖాళీగా ఉన్న కార్డియాలజీ, డెర్మటాలజీ వంటి వార్డుల్లో సర్దుబాటు చేసి చికిత్స అందించాల్సిన పరిస్థితి నెలకొంది. ఒక్కో సమయంలో రాత్రివేళల్లో అధికంగా రోగులు వస్తే పడకలు ఖాళీ లేక నేలపైనే రోగులను పడుకోబెట్టి వైద్యం చేస్తున్నారు. అలాంటి వారిని ఉదయం 9 గంటల అనంతరం వైద్యులు సర్దుబాటు చేస్తున్నారు. పెరిగిన అవుట్ పేషెంట్స్.... ప్రభుత్వాస్పత్రిలోని జనరల్ మెడిసిన్ అవుట్ పేషెంట్స్ విభాగానికి సాధారణంగా 150 నుంచి 200 మంది రోగులు నిత్యం చికిత్స కోసం వస్తుంటారు. ప్రస్తుతం వ్యాధుల సీజన్ కావడంతో 350 మందికి పైగా వస్తున్నారు. అవుట్‌పేషెంట్స్ విభాగానికి చికిత్స కోసం వస్తున్న వారిలో అధిక శాతం మంది జ్వర బాధితులే వస్తున్నారు. వారికి వైద్య పరీక్షలు నిర్వహించి పంపించేస్తున్నారు. పరిస్థితి విషమంగా ఉన్న వారిని ఆస్పత్రిలో అడ్మిట్ చేసి చికిత్స అందిస్తున్నారు. దీర్ఘకాలిక వ్యాధులున్న వారికి ప్రమాదమే... వైరల్ జ్వరాలు మధుమేహం, రక్తపోటు, హెచ్ఐవీ వంటి దీర్ఘకాలిక వ్యాధులున్న వారికి వైరల్ జ్వరాలొస్తే ప్రమాదకరంగా మారే ఆవకావాలున్నాయి. ఆరోగ్యంగా ఉన్న వారికంటే అలాంటి వారికి జ్వర ప్రభావం తీవ్రంగా ఉంటుందని డాక్టర్లు చెబుతున్నారు. దీర్ఘకాలిక వ్యాధులున్న వారికి జ్వరం వస్తే వెంటనే వైద్యులను సంప్రదించాల్సి ఉందని సూచిస్తున్నారు. ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యే వారిలో సైతం అలాంటి వారే ఎక్కువుగా ఉంటున్నారు. వైరల్లో కూడా డెంగీ లక్షణాలు.... విష జ్వరాల్లో సైతం డెంగీ లక్షణాలు ఉండటంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. జ్వరంతో పాటు తీవ్రమైన తలనొప్పి, గొంతునొప్పి, జలుబు, ఆకలి మందగించడం, వాంతులు వంటి లక్షణాలు ఉంటున్నాయి. డెంగీ వచ్చిన వారికి కూడా ఇవే లక్షణాలు ఉండటం ఆందోళన కలిగిస్తుంది. మెరుగైన సేవలు అందిస్తున్నాం జ్వరంతో బాధపడుతున్న వారు నగరంతో పాటు జిల్లాలోని వేర్వేరు ప్రాంతాల నుంచి వస్తున్నారు. వారందరికీ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మెరుగైన వైద్యం అందిస్తున్నాం. వ్యాధి నిర్ధారణ పరీక్షలు అందుబాటులో ఉంచాం. ఒకవేళ వార్డుల్లో పడకలు చాలకుంటే ఇతర వార్డుల్లో సర్దుబాటు చేస్తున్నారు.డాక్టర్ ఎస్ బాబూలాల్,సూపరింటెండెంట్, ప్రభుత్వాస్పత్రి -
మళ్లీ భూతవైద్యం
గిరిజన ప్రాంతాల్లో ఇప్పుడు ప్రతి ఇంటా భూత వైద్యులు అందించిన తాయెత్తులు... యంత్రాలు... మళ్లీ కనిపిస్తున్నాయి. అందరి నోటా భూతవైద్యుల మాటే వినిపిస్తోంది. వారే తమకు చికిత్స చేయగలరనీ... తమ గ్రామాల్లోని మరణ మృదంగాన్ని ఆపగలరన్న నమ్మకం వారిలో బలంగా నాటుకుపోయింది. జ్వరాల బారిన పడి సంభవిస్తున్ను వరుస మరణాలు అందరినీ కలవరపెడుతున్న సంగతి తెలిసిందే. కానీ ఆ అవి జ్వర మరణాలు కావని తేల్చిచెబుతున్న వైద్యాధికారులు అసలు కారణం ఏమిటో వారికి తెలియజేయకపోవడమే. ఇక చేసేది లేక మళ్లీ ఆ గిరిజనం భూతవైద్యులకోసం పరుగులు తీస్తున్నారు. సాక్షిప్రతినిధి,విజయనగరం: జిల్లాలో ఇటీవల గిరిజన ప్రాంతాల్లో జ్వరాలు వచ్చి పలువురు మృత్యువాత పడిన సంగతి తెలిసిందే. మారుమూల ప్రాంతాల్లో వైద్యసదుపాయాలు లేకపోవడం, అపారిశుద్ధ్యం పేరుకుపోవడం... ఇటీవల కురిసిన వర్షాలకు తాగునీరు కలుషితం కావడంతో... పలురకాల రోగాల బారిన జనం పడ్డారు. జ్వరానికి ప్లేట్లెట్లు తగ్గిపోతుండటంతో దానిని సకాలంలో గుర్తించలేక మృత్యువాతపడుతున్నారు. ఈ విషయంలో అధికారులు సరైన శ్రద్ధ చూపకపోవడంతో ఈ మరణాలు కాస్త ఎక్కువైన సంగతి విదితమే. దీనిపై సాలూరు ఎమ్మెల్యే రాజన్నదొర తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ రాష్ట్రప్రభుత్వానికి, అధికారులకు హెచ్చరికలు చేయడమే గాకుండా ఏకంగా తన పదవికి రాజీనామా చేస్తామని తెగేసి చెప్పడంతో అధికారులు ఆ గ్రామాలకు పరుగులు తీశారు. కానీ మరణాలకు జ్వరాలు కావని తేల్చిన వైద్యాధికారులు అసలు కారణాలు చెప్పకపోవడంతో ఇక చేసేది లేక మళ్లీ గిరిజనులుభూతవైద్యుల బాట పడుతున్నారు. మూఢనమ్మకాలపైనే మొగ్గు సాధారణంగా గిరిజన పల్లెల్లో నమ్మకాలు ఎక్కువగా ఉంటాయి. ఏ చిన్న కష్టం వచ్చినా వారు ముందుగా వెళ్లేది మంత్రగాళ్లు, భూతవైద్యుల వద్దకే. వారి అమాయకత్వాన్ని ఈ మంత్రగాళ్లు సొమ్ము చేసుకుంటుంటారు. ఆనారోగ్యానికి ‘గాలి’ సోకడమే కారణమని, మీ వాళ్లకెవరో చేతబడి చేయించేశారని వారిని భయపెడుతుంటారు. విరుగుడు కోసం కొన్ని క్షుద్ర పూజలు చేయాల్సి ఉంటుందని, దానికి డబ్బు ఖర్చువుతుందని చెప్పి జేబులు ఖాళీ చేసేస్తుంటారు. ఇప్పుడైతే జ్వరాలంటూ వెళ్లిన వారి వద్ద రూ.3 వేల నుంచి రూ.10 వేల వరకూ వసూలు చేస్తున్నారు. ఒక్కోసారి వారి పిచ్చి చేష్టలు శృతిమించి లైంగిక దాడులకు దారితీస్తుండటం... అమాయకులు ప్రాణాలు కోల్పోవడం... వంటి సంఘటనలు ఎక్కడో చోట రోజూ జరుగుతూనే ఉన్నప్పటికీ అవి వెలుగులోకి రావట్లేదు. కొన్నిసార్లు మాత్రం మంత్రగాళ్ల వల్ల తమకు నష్టం కలిగిందని భావిస్తే ఇక దాడులకు తెగబడటం. అవసరమైతే కొట్టి చంపేయడం వంటివి చేస్తుంటారు. ఇలాంటి మూఢనమ్మకాలపై చైతన్యం తీసుకువచ్చేందుకు జిల్లా అధికార యంత్రాంగం ఇంత వరకూ ఎలాంటి చర్యలు చేపట్టకపోగా వారే వాటివైపు జనం వెళ్లేందుకు పరోక్షంగా కారకులవుతున్నారు. చైతన్య సదస్సుల ఊసేలేదు కొన్నేళ్ల క్రితం జిల్లా పోలీసు అధికారులు గిరిజన పల్లెల్లో ఇంద్రజాలికులతో కలిసి చైతన్య సదస్సులు నిర్వహించేవారు. కానీ ఇప్పుడు అలాంటి ఆలోచన ఉన్నప్పటికీ ఆచరణలో ఎవరూ పెట్టలేకపోతున్నారు. దీంతో జనం తమకు వచ్చిన అనారోగ్యానికి కారణమేమై ఉంటుందోనని భయపడి మంత్రగాళ్ల వద్దకు పరుగులు తీస్తున్నారు. జ్వరానికి వైద్యం చేయించుకోవడం మానేసి మంత్రాలు, తాయెత్తులు కట్టుకుంటున్నారు. ఇంటి ముందు నిమ్మకాయలు, మిరపకాయలు, కొబ్బరికాయలు, గుమ్మడికాయలు, తాళ్లు, యంత్రాలు కడుతున్నారు. విజ్ఞాన శాస్త్రం విశ్వ వ్యాప్తంగా అద్భుతాలు సృష్టిస్తుంటే విజయనగరం జిల్లా మాత్రం మూఢనమ్మకాలంటూ వెనక్కిపోతోంది. దానికి అధికారుల ప్రకటనలు కారణమవ్వడం విచారకరం. గత మూడేళ్లలో భూతవైద్యులపై దాడులు జిల్లాలో గత మూడేళ్లలో 2016, 2018 సంవత్సరాల్లో భూత వైద్యులపై దాడులు చేసి, హత్య చేసిన సంఘటనలు ఉన్నాయి. నలుగురిని కొట్టి చంపేశారు. మరో నలుగురిపై దాడి చేసి తీవ్రంగా గాయపరి చారు. వీటితో పాటు ప్రజలను ఇబ్బంది పెడుతున్న ఒక మంత్రగాడిపైన పోలీసులు 107 సీఆర్.పీసీ కేసు నమోదు చేశారు. 2017లో మాత్రం ఎలాంటి కేసులు నమోదు కాలేదు. -
విద్యార్థినులపై జ్వరాల పంజా
విజయనగరం, సాలూరురూరల్: మండలంలోని కొత్తవలస గిరిజన బాలికల సంక్షేమ ఆశ్రమ పాఠశాల విద్యార్థినులు జ్వరాలబారిన పడ్డారు. సుమారు 20 మందికి పైగా విద్యార్థినులు అనారోగ్యాలతో బాధపడుతున్నారు. ఎ. పావని, యు.కృష్ణవేణి, ఎం.హేమలత, సీహెచ్.భవానీ, జె.పార్వతి, కె.స్వప్న, జి.మేఘన, పి.వసుంధర, తదితరులు జ్వరాలతో ఇబ్బంది పడుతున్నారు. ఈ విషయమై హెచ్ఎం సంధ్యారాణి మాట్లాడుతూ, ఎనిమిది మంది విద్యార్థినులు జ్వరంబారిన పడినట్లు వైద్యులు తెలిపారని చెప్పింది. విద్యార్థినులకు మామిడిపల్లి పీహెచ్సీలో చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. ఇందులో ఇద్దరి విద్యార్థినులను మెరుగైన చికిత్స కోసం సాలూరు పీహెచ్‌సీకి తరలించినట్లు సమాచారం. సేవకురాలిగా హెచ్ఎం.. పాఠశాల ఏఎన్ఎం ముంగి వెంకటలక్ష్మి విద్యార్థినులను తీసుకుని ఆస్పత్రులకు వెళ్తుండడంతో మిగిలిన విద్యార్థినులకు హెచ్ఎం సంధ్యారాణి దగ్గరుండి మరీ సేవలందిస్తోంది. ఎప్పటికప్పుడు టెంపరేచర్ తీయడం.. దగ్గరుండి మందులు వేయించడం.. తదితర పనులన్నీ హెచ్ఎం చేస్తోంది. ఒకే మంచంపై ఇద్దరు ఆశ్రమ పాఠశాలలోని సిక్ రూమ్‌లో ఒక్కో మంచంపై ఇద్దరేసి విద్యార్థినులు పడుకుంటున్నారు. ఒక్కో మంచంపై ముగ్గురేసి కూడా ఉండి వైద్యసేవలు పొందుతున్నారు. తడవడం వల్లే.. భోజనాలకు వెళ్లే సమయంలో తడిసి పోవడం వల్లే జ్వరాలు ప్రబలాయని విద్యార్థినులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మెస్ వద్ద భోజనం చేసే సౌకర్యం లేకపోవడంతో భోజనం పట్టుకుని తిరిగి డార్మిటరీకి వచ్చే క్రమంలో తడిసిపోతున్నామని పలువురు చెబుతున్నారు. ఇదిలా ఉంటే విద్యార్థినులు జ్వరాల బారిన పడడం వల్ల సిబ్బందికి కూడా ఇక్కట్లు తప్పడం లేదు. ఆస్పత్రికి తీసుకెళ్లడం.. రిపోర్టులు తీసుకురావడం వంటి పనులతో వారు కూడా ఇబ్బంది పడుతున్నారు. ఇక విద్యార్థినులు జ్వరాలతో ఇబ్బంది పడుతున్న విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు తమ పిల్లలను తమతో పంపించాలని కోరుతున్నారు. అయితే ఇళ్లకు వెళ్లినా అక్కడ జరగరానిది ఏదైనా జరిగితే తమకే ఇబ్బందని, అందుకే ఇక్కడే వైద్యసేవలందిస్తామని సిబ్బంది చెబుతున్నారు. -
వణుకుతున్న చిన వంతరాం
విజయనగరం, బలిజిపేట: మండలంలోని చినవంతరం జ్వరాలతో వణుకుతోంది. గ్రామంలో సుమారు 50 ఇళ్లు ఉండగా ప్రతి ఇంటిలోనూ జ్వరపీడితుడు ఉన్నాడంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. సుమారు ఇరవై రోజులుగా గ్రామస్తులు జ్వరాలతో ఇబ్బంది పడుతున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. వారి ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రం కావడంతో పైసా, పరకో ఇచ్చి ఆర్ఎంపీ వైద్యుడిచే ఇంటి వద్దే వైద్యం చేయించుకుంటున్నారు.విషయం వైద్యాధికారులకు తెలిసినప్పటికీ గ్రామాన్ని సందర్శించడం లేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఆర్థిక స్థోమత ఉన్న అతికొద్ది మంది మాత్రమే ప్రైవేట్ ఆస్పత్రుల్లో వైద్యం చేయించుకుంటుఆన్నరు. ఒకే ఇంటిలో చిన్నారులు శ్రీలత, భార్గవి జ్వరాలతో మంచంపట్టారు. అలాగే ఒకే కుటుంబానికి చెందిన తల్లి లత, చిన్నారి రోహిత్‌కుమార్.. మరో ఇంటిలో సాయి, సింహాచలమమ్మలు.. ఇంకో ఇంటిలో భార్యాభర్తలు సింహాద్రినాయుడు, సింహాచలమమ్మ జ్వరాలతో బాధపడుతున్నారు. అలాగే గ్రామానికి చెందిన కృష్ణ, బి.సింహాచలం, పి.సింహాచలం, జి.దాలినాయుడు, సీహెచ్ చిన్నంనాయుడు, పి.తిరుపతమ్మ, ఎన్.సింహాచలమమ్మ, సీహెచ్.బుజ్జి, అప్పలనాయుడు, పి.అప్పలనరసమ్మ, సుధ, ఎం.గౌరమ్మ, ఎం.రాధిక, సింహాచలం, సత్తియ్య, బి.నగేష్, బి.పోలినాయుడు, జి.సత్యవతి, సీహెచ్ సత్యంనాయుడు, పి.సత్యనారాయణ, పి.సత్యం, బి.చినబాబు, తదితరులు మంచంపట్టారు. గ్రామంలో రక్షిత మంచినీటి పథకం లేకపోవడంతో ఉన్న ఒక్క బోరు నీటినే తాగేందుకు వినియోగిస్తున్నారు. నీటి కలుషితం వల్లే జ్వరాలు ప్రబలి ఉండవచ్చని గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఏఎన్ఎం గ్రామానికి వచ్చినప్పుడు ఏవో మాత్రలు ఇచ్చి వెళ్లిపోయిందని, వాటి వల్ల ఎటువంటి ఉపయోగం లేదని తెలిపారు. ఇప్పటికైనా సంబంధిత వైద్యాధికారులు స్పందించి జ్వరాలు అదుపులోకి వచ్చేంతవరకు గ్రామంలో వైద్యశిబిరం నిర్వహించాలని గ్రామస్తులు కోరుతున్నారు. డెంగీతో విద్యార్థిని మృతి మెంటాడ: మెంటాడ మండలంలో జ్వర మరణాలు ఆగడంలేదు. ఇప్పటికే ఆండ్ర గ్రామానికి చెందిన కునుకు అప్పలనాయుడు, పిట్టాడ గ్రామానికి చెందిన ఎరగడ సంధ్య, పోరాం గ్రామానికి చెందిన ఎ. వెంకటమణి మృతి చెందిన సంగతి తెలిసిందే. తాజాగా మెంటాడ గ్రామానికి చెందిన లగుడు నీలిమ(7) అనే విద్యార్థిని జ్వరంబారిన పడి ఆదివారం మృతి చెందింది. వారం రోజుల కిందట నీలిమకు జ్వరం రావడంతో స్థానికంగా చికిత్స అందించారు. మూడు రోజుల కిందట విశాఖపట్నం పెద గంట్యాడలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికరి తరలించారు. వైద్యులు చిన్నారిని పరీక్షించి డెంగీ లక్షణాలున్నాయని చెప్పి విశాఖ కేజీహెచ్‌కు రిఫర్ చేశారు. చిన్నారి తండ్రి స్టీల్‌ప్లాంట్ క్యాంటిన్లో పనిచేస్తుండడంతో ఈఎస్ఐ సదుపాయం ఉంది. దీంతో నీలిమను ఈఎస్ఐ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో కన్నుమూసింది. దీంతో తల్లిదండ్రులు దేవి, సురేష్‌లు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. చిన్నారి నీలిమ విశాఖపట్నంలో రెండో తరగతి చదువుతోంది. -
జ్వరాలతో గజ..గజ...
ఓ పక్క సీజనల్ వ్యాధులు.. మరో పక్క కంటి వెలుగు కార్యక్రమం.. ముగ్గురు వైద్యాధికారులకు ఇద్దరు కంటి వెలుగు విధుల్లో.. ఒక్క వైద్యుడిపైనే అదనపు భారం....ఆస్పత్రిలో రోగులు కిక్కిరిసిపోతున్నారు.. వైద్య సేవలు అందించలేక నానా అవస్థలు పడుతున్నారు. రోజుకు దాదాపు 300 మందికి పైగా ఓపీ వస్తుంది. దీంతో సిబ్బంది కూడా అసహనంతో రోగులపై చికాకు పడుతున్నారు. చీదరింపులకు చాలా మంది రోగులు ప్రైవేట్ ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారు. ఇదీ నేలకొండపల్లి ప్రభుత్వ ఆస్పత్రి దుస్థితి. నేలకొండపల్లి : ఖమ్మం జిల్లాలోని నేలకొండపల్లి మండల ప్రజలు వైరల్ ఫీవర్‌తో వణికిపోతుంది. గ్రామాల్లో పేరుకపోయిన పారిశుద్ధ్యం వలన సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్నాయి. మండలంలో ఏ గ్రామం, ఏ ఇంటి తలుపు తట్టినా జ్వరపీడితులే. గ్రామాల నుంచి వస్తున్న జ్వరపీడితులతో కమ్యూనిటీ హెల్త్ సెంటర్ రోగులతో కిక్కిరిసిపోతుంది. జ్వరాలు, నీరసం, కీళ్ల నొప్పులతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రతి రోజూ 300 మందికి పైగా అవుట్ పేషెంట్(ఓపీ) హాస్పిటల్‌కు వస్తున్నారు. దీంతో సిబ్బంది రోగుల పట్ల చికాకుపడటం, చీదరించుకోవటం చేస్తున్నారు. అసలే రోగం, నొప్పులతో వైద్యం కోసం వచ్చే వారి పట్ల సిబ్బంది వ్యవహరిస్తున్న తీరుతో చాలా మంది బాధపడుతున్నారు. చీదరింపులు తట్టుకోలేక ప్రైవేట్ హాస్పిటల్‌ను ఆశ్రయిస్తున్నారు. ఒక్కరే వైద్యుడు.. కమ్యూనిటీ హెల్త్ సెంటర్ కావటంతో మండలం నుంచే కాకుండా ముదిగొండ, కూసుమంచి మండలాలకు చెందిన ప్రజలు కూడా నేలకొండపల్లి హాస్పిటల్‌కు వస్తున్నారు. ఈ హాస్పిటల్లో ముగ్గురు డాక్టర్స్ ఉన్నారు. మండల వైద్యా«ధికారి డాక్టర్ రాజేష్‌ను కంటి వెలుగు పథకానికి నియమించారు. మరో డాక్టర్ రత్నమనోహర్‌ను మంచుకొండ కంటి వెలుగు పథకానికి డిప్యూటేషన్‌పై పంపిం చారు. ఇక మిగిలింది డాక్టర్ సురేష్‌నారాయణ. ఒక్కరే 300 మందికి పైగా ఓపీ చూడాల్సి వస్తుంది. అంతే కాకుండా రాత్రి డ్యూటీలు చేసి మళ్లీ ఉదయం డ్యూటీలు చేస్తుండటంతో అదనపు భారంతో సతమతం అవుతున్నారు. డాక్టర్‌కూ జ్వరమే.. సీజనల్ వ్యాధుల వలన హాస్పిటల్‌కు రోగుల సంఖ్య పెరగటంతో విధులు నిర్వహిస్తున్న వైద్యుడు సురేష్నారాయణకు జ్వరం వచ్చింది. కంటి వెలుగు పథకం ప్రారంభం నుంచి ఒక్కరే విధులు నిర్వహిస్తుండటంతో జ్వరం వచ్చింది. జ్వరం, గొంతు నొప్పితో తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు.సెలవు పెట్టేందుకు ప్రత్యామ్నాయం వైద్యులు లేకపోవటంతో జ్వరంతోనే విధులు నిర్వహిస్తున్నారు. రోజు రోజుకు జ్వరం తీవ్రత కావటంతో ఓపిక తగ్గుతుందని తాను సెలవులో వెళ్లేందుకు సిద్ధపడుతున్నారు. ఉన్న ఒక్క డాక్టర్ కూడా సెలవు పెడితే పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి ప్రత్యామ్నాయంగా వైద్యులను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. రోగులను సిబ్బంది గౌరవించాలి రోగులను అగౌరవ పరిచే విధంగా వ్యవహరిస్తే సిబ్బంది పై చర్యలు తీసుకుంటాం. సీ జనల్ వ్యాధుల వలన రోగు ల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నందున జాగ్రత్తలు పాటించాలి. రోగులను ప్రేమతో చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. డాక్టర్స్ కొరత ఉన్న మాట వాస్తవమే. వాటిని భర్తీ చేసేందుకు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లాం. – డాక్టర్ కొండల్రావు, డీఎంఅండ్‌హెచ్‌ఓ వారం రోజులుగా జ్వరం వారం రోజులుగా జ్వరం వస్తుంది. జ్వరం, నీరసం తో బాధపడుతున్నాను. హాస్పిటల్‌కు వస్తే జనం బాగా ఉండటంతో చాలా ఇబ్బంది పడ్డాను. జ్వర పీడితులు సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. వైద్యం అందించేందుకు మరింత సిబ్బందిని పెంచాలి. – కె.నాగమణి, సింగారెడ్డిపాలెం కీళ్ల నొప్పులు, నీరసంతో ఇబ్బందిగా ఉంది కీళ్ల నొప్పులు, నీరసంతో బాధపడుతున్నాను. రోగులు ఎక్కువగా వస్తున్నారు. దీంతో నిలబడే ఓపిక లేకుండా ఉంది. ఇంటి వద్ద నుంచి హాస్పిటల్‌కు కూడా రాలేక పోయాను. ఇక్కడ డాక్టర్ ఒక్కరే చూడటం వలన క్యూలో నిలబడలేక పోతున్నా. రోగుల బాధలు అర్థం చేసుకుని వైద్యులను నియమించాలి. – పి.కాంతయ్య, మండ్రాజుపల్లి -
పిలవకనే వచ్చిన వైద్యుడు
ఆరేళ్ల ఆయిషా ఒళ్లంతా జ్వరంతో కాలిపోతోంది. బిడ్డకు వైద్యం చేయిద్దామంటే ఆమె తల్లి జుబేదా చేతిలో చిల్లిగవ్వ లేదు. భర్తలేని జుబేదా తన తండ్రితో కలిసి ఉంటోంది. అప్పటికే తండ్రీ కూతుళ్లు మూడు రోజుల నుంచి పస్తులుంటున్నారు. కూతురి ఒళ్లు జ్వరంతో కాలిపోతుండటంతో తన వంతు ప్రయత్నంగా ఆమె నుదుటిపై తడిగుడ్డతో తుడుస్తూ ఉంది. ఇక తన బిడ్డను కాపాడగలిగేవాడు అల్లాహ్ ఒక్కడేనని భావిస్తూ, ‘ఓ అల్లాహ్! నా బేటీ జ్వరాన్ని తగ్గించి స్వస్థత కలిగించు’ అంటూ ప్రార్థన చేయసాగింది జుబేదా. అంతలోనే ఎవరో తలుపు తట్టిన శబ్దం వినిపించింది. ఇంత రాత్రి పూట తమ ఇంటితలుపు తడుతున్నదెవరబ్బా అని తండ్రీ కూతుళ్లు ఆశ్చర్యపోయారు. మెడలో స్టెతస్కోపు, చేతిలో మందుల కిట్టు పట్టుకుని డాక్టర్ లోనికి వస్తూనే, ‘రోగి ఎక్కడ?’ అనడిగారు. డాక్టర్‌ను చూడగానే ఆ జుబేదాకు ప్రాణం వచ్చినట్లయింది. వెంటనే డాక్టర్‌ను జ్వరంతో బాధపడుతున్న కూతురి దగ్గరకు తీసుకెళ్లింది. డాక్టర్ అమ్మాయిని నిశితంగా పరిశీలించి మందుల చీటీని అందిస్తూ తనకు రావాల్సిన ఫీజును అడిగారు. దానికి జుబేదా ‘‘డాక్టర్ గారూ మీకు ఫీజు కట్టడానికి మా దగ్గర చిల్లిగవ్వ కూడా లేదు. మేము ఎన్నోరోజులుగా పస్తులుంటున్నాము’’ అనగానే.. డాక్టర్ కోపంతో ‘‘ఫీజు ఇవ్వడం చేతగానప్పుడు వేళకాని వేళలో ఫోన్ చేసి ఎందుకు పిలిపించారు?’’ అని చీవాట్లు పెట్టాడు. డాక్టర్ గారు పొరబడి తమ ఇంటికొచ్చారని అర్థమైన జుబేదా ధైర్యం కూడగట్టుకొని ‘‘డాక్టర్ గారూ మేము ఫోన్ చేసి మిమ్మల్ని పిలవలేదు. మా ఇంట్లో ఫోన్ లేనేలేదు’’ అని వివరణ ఇచ్చింది. దానికి డాక్టర్ గారు ‘‘ఇది ఫలానా వాళ్ల ఇల్లు కాదా’’ అని అడిగారు. ‘మీరు చెప్పిన పేరుగల వాళ్ల ఇల్లు మా పక్కనే ఉంది’ అని చెప్పింది జుబేదా. తనవల్లే పొరపాటు జరిగిందని తెలుసుకున్న డాక్టర్, అక్కడినుంచి వెళ్లిపోయారు. తిరిగి కాసేపటికే మళ్లీ జుబేదా ఇంటి తలుపుతట్టారు. ‘‘అల్లాహ్ మీద ప్రమాణం చేసి చెబుతున్నాను మీ పరిస్థితులను గురించి తెలుసుకోనంతవరకు నేనిక్కడినుంచి ఈ రోజు కదిలేదిలేదు’’ అని డాక్టర్ గారు తండ్రీ కూతుళ్లను పట్టిపట్టి మరీ అడిగారు. అప్పుడు జుబేదా డాక్టర్‌కు తన హృదయ విదారక గాథను వినిపించింది. డాక్టర్ బయటికి వెళ్లి, బజారు నుంచి వారికి భోజనాలు, అమ్మాయి కోసం మందులు, పండ్లు, పాలు తీసుకొని వచ్చారు. ఇక నుంచి నెల నెలా నిత్యావసరాలకు సరిపడా డబ్బును అందజేస్తానని చెప్పి సెలవు తీసుకున్నారు డాక్టరు. – ముహమ్మద్ ముజాహిద్ -
జ్వరంతో ఆస్పత్రికి వెళితే.. రూ.8 లక్షలు వసూలు
పంజగుట్ట: జ్వరం వచ్చిందని ఆస్పత్రికి వస్తే ఇప్పటి వరకు రూ.8 లక్షలు వసూలు చేసి రోగి ఆరోగ్య పరిస్థితి కూడా చెప్పడం లేదని ఆరోపిస్తూ అతని బంధువులు ఆందోళన చేపట్టిన సంఘటన మంగళవారం పంజగుట్ట పరిధిలో చోటు చేసుకుంది. బాధితుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. సరూర్‌నగర్‌కు చెందిన రిటైర్డ్ ఉద్యోగి అమర్నాథ్ గౌడ్ (61) జ్వరంతో బాధపడుతుండటంతో జులై 31న బంజారాహిల్స్ రోడ్డు నెంబర్.1 లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. వారం రోజుల పాటు ఐసీయూలో ఉంచిన వైద్యులు ఆరోగ్యం మెరుగుపడిందని రూమ్‌కు మార్చారు. రోగి బంధువులతో కూడా మాట్లాడాడు. అయితే గత ఆదివారం ఉదయం అమర్నాథ్ ఆరోగ్యం క్షీణించిందంటూ మరోసారి ఐసీయూలోకి తీసుకెళ్లారన్నారు. అప్పటి నుంచి రోగిని చూడనివ్వకుండా చికిత్స పేరుతో ఫీజులు వసూలు చేస్తున్నారని, పరీక్షలు చేయడమే కాకుండా, డయాలసిస్ చేస్తున్నట్లు తెలిపారన్నారు. జ్వరంతో బాధపడుతున్న వ్యక్తికి డయాలసిస్ ఎందుకని నిలదీయగా బాడీ ఇన్ఫెక్షన్ అయినట్లు చెప్పారన్నారు. మంగళవారం అమర్నాథ్ ఉన్న గదినుంచి దుర్వాసన వస్తున్నట్లు గుర్తించిన కుటుంబ సభ్యులు లోపలికి వెళ్లి చూడగా అతని శరీరంపై పుండ్లు ఉన్నట్లు గుర్తించి డాక్టర్‌ను సంప్రదించగా బాడీ ఇన్ఫెక్షనై వెంటిలేటర్‌పై ఉంచినట్లు తెలిపారన్నారు. ఇప్పటికే చికిత్స కోసం రూ.6.5 లక్షలు వసూలు చేశారని, మరో రూ.6 లక్షలు అవుతాయని ఆస్పత్రి యాజమాన్యం చెబుతోందని బాధితులు వాపోయారు. అసలు ఐసీయూలో ఏం జరుగుతుందో అర్థం కావడంలేదన్నారు. అయితే ఆస్పత్రి ముందు ఆందోళనకు దిగిన రోగి బంధువులను పోలీసులు సముదాయించి ఆస్పత్రి సూపరిండెంట్‌తో చర్చలు జరుపుతున్నారు. -
జ్వరంతో ముగ్గురి మృతి
ముగ్గురిని జ్వరాలు బలిగొన్నాయి. దమ్మపేట మండలంలో ఒకరు, ఇల్లెందు మండలంలో ఇంకొకరు, మణుగూరులో మరొకరు మృతిచెందారు.దమ్మపేట: మండలలోని ముష్టిబండకు చెందిన రైతు పరిటాల వెంకటేశ్వరరావు(55), జ్వరంతో శనివారం మృతిచెందాడు. ప్లేట్లెట్స్ తగ్గడంతో కుటుంబీకులు సత్తుపల్లి ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడి నుంచి హైదరాబాద్ తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. మణుగూరులో బాలుడు... మణుగూరుటౌన్ : మున్సిపాలిటీ పరిధిలోని శివలింగాపురంలో డెంగీ జ్వరంతో బాలుడు మృతిచెందాడు. స్థానిక ప్రయివేటు పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న కాకర్ల ఆదర్శ్(15), గత ఐదు రోజులుగా జ్వరంతో బాధపడుతున్నాడు. స్థానిక ప్రయివేటు వైద్యశాలలో కుటుంబీకులు చేర్పించారు. పరిస్థితి విషమించడంతో హైదరాబాద్‌లోని ప్రయివేటు ఆసుపత్రికి తరలించారు. ఆదివారం మృతిచెందాడు. ముకుందాపురంలో యువకుడు... ఇల్లెందు: మండలంలోని ముకుందాపురం గ్రామానికి చెందిన కోయడ రాజు(35), కొన్ని రోజులుగా జ్వరంతో బాధపడుతున్నాడు. జ్వరం తీవ్రమవడంతో రెండు రోజులు క్రితం హైదరాబాద్‌లోని ప్రైవేట్ వైద్యశాలలో కుటుంబీకులు చేర్పించారు. అతడు అక్కడే ఆదివారం తెల్లవారుజామున మృతిచెందారు. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. -
వైఎస్ జగన్‌కు స్వల్ప అస్వస్థత
సాక్షి, అమరావతి : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్వల్ప అస్వస్థతతో బాధపడుతున్నారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా ప్రజలతో మమేకమవుతూ తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో వైఎస్ జగన్ పాదయాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. నియోజకవర్గంలోని చెందుర్తి క్రాస్ రోడ్ వద్ద 228వ రోజు పాదయాత్ర శనివారం ఉదయం ప్రారంభమైంది. పాదయాత్రలో ఉన్న వైఎస్ జగన్ స్వల్ప అస్వస్థతకు గురైయ్యారు. ఆయన జలుబు, జ్వరంతో బాధపడుతున్నారు. -
విషమంగా కరుణానిధి ఆరోగ్యం
-
కరుణానిధికి ఇన్ఫెక్షన్, జ్వరం
సాక్షి, చెన్నై: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత ఎం.కరుణానిధి(94) మూత్రనాళ ఇన్ఫెక్షన్, జ్వరంతో బాధపడుతున్నారు. గురువారం రాత్రి 7.30 గంటల నుంచి ప్రత్యేక వైద్య బృందం కరుణానిధి ఇంటిలోనే ఉండి చికిత్స అందిస్తోంది. వయో భారం, అనారోగ్య సమస్యలతో రెండేళ్లుగా కరుణానిధి గోపాలపురంలోని ఇంటికే పరిమితమయ్యారు. రెండు నెలల క్రితం కరుణ ఆరోగ్యం కుదుటపడిందని, త్వరలో ప్రజాసేవకు అంకితమవుతారని డీఎంకే కార్యాలయం ప్రకటించింది. డీఎంకే అధినేతగా పగ్గాలు చేపట్టి 50వ వసంతంలోకి అడుగు పెడుతుండడంతో శుక్రవారం స్వర్ణోత్సవ కార్యక్రమాలకు డీఎంకే వర్గాలు సిద్ధమయ్యాయి. ఈ పరిస్థితుల్లో బుధవారం కరుణ ఆరోగ్యం క్షీణించడం గమనార్హం. కాగా, డిప్యూటీ సీఎం పన్నీర్‌సెల్వం పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు స్టాలిన్‌ను కలసి కరుణానిధి ఆరోగ్య పరిస్థితిపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. మక్కల్ నీది మయ్యమ్ అధ్యక్షుడు కమల్ హాసన్ కరుణానిధిని చూసి వెళ్లారు. -
స్క్రబ్ టైఫస్...టెర్రర్
స్క్రబ్ టైఫస్ వ్యాధి పేరు ఉంటేనే టెర్రర్ పుడుతోంది. మూడేళ్లుగా జిల్లాలో ఈ వ్యాధి ప్రభావం కనిపిస్తోంది. మలేరియా, డెంగీ వంటి దోమకాటు జ్వరాలతో పాటు తాజాతా టైఫస్ జ్వరాలు ప్రజలను భయభ్రాంతులకు గురిజేస్తున్నాయి. ఈ తరహా జ్వరాల బారిన పడిన రోగులు జిల్లాతో పాటు పొరుగు జిల్లాల నుంచి సైతం నగరానికి వచ్చి పలు కార్పొరేట్ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. సకాలంలో గుర్తించి చికిత్స పొందకపోతే ఈ వ్యాధి ప్రాణాంతకమేనని వైద్యులు చెబుతున్నారు. లబ్బీపేట(విజయవాడ తూర్పు) : జిల్లాలో స్క్రబ్ టైఫస్ జ్వర లక్షణాలతో రోగులు ఆస్పత్రులకు రావడం ఆందోళన కలిగిస్తోంది. గత ఏడాది తోట్లవల్లూరు మండలం బొడ్డపాడులో జ్వరాలు విజృంభించి ముగ్గురు మృతి చెందడంతో పాటు, పలువురికి స్క్రబ్ టైఫస్ లక్షణాలు కనిపించాయి. ఈ ఏడాది కూడా ఈ తరహా జ్వరంతో కొందరు పలు ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లి చికిత్స పొందుతున్నారని సమాచారం. అంతటి ప్రమాదకరమైన వ్యాధిపై వైద్య ఆరోగ్యశాఖ సిబ్బందికి సైతం పెద్దగా అవగాహన లేదనే చెప్పాలి. జిల్లాలో సోకుతున్న ఈ వ్యాధిపై ప్రభుత్వ వైద్యులకు తప్పనిసరిగా అవగాహన ఉండాలని వైద్య నిపుణులు చెబుతున్నారు. సాధారణ జ్వరంలా కనిపించే స్క్రబ్ టైఫస్‌ను సకాలంలో గుర్తించకుంటే ప్రాణాలు సైతం కోల్పోతారని అంటున్నారు. తొలుత అకస్మిక జ్వరంతో ప్రారంభమై క్రమేణా లివర్, కిడ్నీల పనితీరుపై ప్రభావం చూపడంతో పాటు, రక్తనాళాలు దెబ్బతినడం, తెల్లరక్తకణాలపై ప్రభావం చూపుతుందని పేర్కొంటున్నారు. వ్యాధి ఎలా సోకుతుందంటే... దట్టమైన చెట్లు, వ్యవసాయ భూములు పక్కన నివశించే వారికి ఎక్కువుగా స్క్రబ్ టైఫస్ వ్యాధి సోకుతుంది. చెట్లు, పొలాల్లో ఉండే ‘త్సుట్సుగామూషి ’ అనే కీటకం కుట్టడం ద్వారా జ్వరం వస్తుంది. ఈ కీటకాల్లో కొన్ని తీవ్రమైన ప్రభావం చూపుతాయి. కొందరికి వారం రోజుల వ్యవధిలో వ్యాధి సోకుతుందని, మరికొందరిలో కొన్ని గంటల వ్యవధిలోనే తీవ్ర ప్రభావం చూపుతుందని వైద్యులు చెప్పారు. త్సుట్సుగామూషి కీటకం కుట్టిన వారిలో జ్వరం అకస్మాత్తుగా రావడం, తీవ్రమైన తలనొప్పి, చలి, కండరాల నొప్పి, దగ్గు వంటి లక్షణాలు ఉంటాయి. కళ్లు తిరగడం, మగత, వాంతులు కూడా అవుతుంటాయి. ఇలాంటి వారి శరీరంపై పరిశీలిస్తే కీటకం కుట్టిన ప్రాంతంలో నల్లటి మచ్చ కనిపిస్తుంది. ఈ వ్యాధిని నిర్దారించేందుకు ఎలిసా పరీక్షలు సైతం నగరంలో అందుబాటులో ఉన్నాయి. వ్యాధి ప్రభావం.... స్క్రబ్ టైఫస్ సోకిన వారిలో అధిక జ్వరంతో పాటు, న్యూమోనైటీస్, తీవ్రమైన ఊపిరితిత్తుల గాయం, ఎక్యుట్ రెస్పిరేటరీ డిస్ట్సెస్ సిండ్రోమ్ వంటి వాటికి గురవుతుంటారు. అంతేకాకుండా కిడ్నీలు ఫెయిల్యూర్ కావడం, హృదయ కండరాల వాపు, సెప్టిక్ షాక్, అంతర్గత రక్తస్రావం , తెల్లరక్తకణాలు తగ్గిపోవడం వంటి అనారోగ్య సమస్యలు తలెత్తుతుంటాయి. కాలేయం, మూత్ర పిండాల పనితీరు అసాధారణ స్థితికి చేరుకోవచ్చు. వ్యాధిని సకాలంలో గుర్తించి వైద్యం పొందడం ద్వారా ఎలాంటి ప్రభావం చూపకుండా బయటపడొచ్చు. ఎవరికి ప్రమాదకరం.... స్క్రబ్ టైఫస్ వ్యాధి, మధుమేహం, హైపర్ టెన్షన్ ఉన్న వారికి సోకితే ప్రమాదకరంగా మారే అవకాశం ఉంది. అంతేకాకుండా హెచ్ఐవీ రోగులకు సోకితే ప్రాణాంతకమే. చిన్న పిల్లలు, వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారికి వ్యాధి సోకితే ప్రమాదకరంగా మారుతుంది. స్క్రబ్ టైఫస్ కేసులు వస్తున్నాయి స్క్రబ్ టైఫస్ వ్యాధికి గురైన వారు మూడేళ్లుగా తమ ఆస్పత్రికి వస్తున్నారు. గత ఏడాది కూడా ఇద్దరు చిన్నారులకు స్క్రబ్ టైఫస్ పాజిటివ్ వచ్చింది. వ్యాధిని నిర్ధారించేందుకు ఎలీసా పరీక్ష„ý అందుబాటులో ఉంది. స్క్రబ్ టైఫస్ వచ్చిన వారికి కచ్చితమైన యాంటిబయోటిక్ ఇవ్వడం ద్వారా నివారించవచ్చు. వ్యాధిని ఆశ్రద్ధ చేస్తే ఊపిరితిత్తులు, ఇతర అవయవాలపై ప్రభావం చూపి, ఒక్కోసారి ప్రాణాంతకంగా కూడా మారవచ్చు. ఈ వ్యాది వచ్చిన వారి శరీరంపై నల్లటి మచ్చలు ఉండటాన్ని గుర్తించవచ్చు.డాక్టర్ పాతూరి వెంకట రామారావు,పీడియాట్రిక్ చీఫ్, ఆంధ్రా హాస్పిటల్స్ -
గ్రామాల్లో విజృంభిస్తున్న విష జ్వరాలు
-
కిచ్చాడలో జ్వరాల పంజా
కురుపాం : మండలంలోని కిచ్చాడ గ్రామంలో జ్వరాలు పంజా విసిరాయి. గ్రామంలోని పలువురు మలేరియా, టైఫాయిడ్ జ్వరాలతో మంచమెక్కారు. ఇంటికొక్కరు, ఇద్దరు చొప్పున జ్వరంతో బాధపడుతున్నారు. వారం రోజులుగా మలేరియా, టైఫాయిడ్ జ్వరాలతో పాటు విష జ్వరాల బారిన పడ్డారు. ప్రస్తుతం గ్రామంలో గవర రాజ్యలక్ష్మి, బాలాజీ, గవర హేమంత్, జి.హర్షవర్ధన్, వరుణ్‌తేజ్, శారద, బెవర రమణ, ఎట్టి గంగ, పామల సోములు, టి.సింహాచలం, పి.చైతన్య, ఎ.సాయితో పాటు మరో పది మంది మలేరియా, విష జ్వరాల బారిన పడి బాధపడుతున్నారు. ప్రభుత్వ వైద్య సిబ్బంది ఎవరూ పట్టించుకునే పరిస్థితి లేకపోవడంతో పలువురు ప్రైవేటు ఆస్పత్రులకు పరుగులు తీస్తున్నారు. పేదలు అందుబాటులో ఉన్న సంచి వైద్యులను ఆశ్రయించి జేబులు ఖాళీ చేసుకుంటున్నారు. ఇద్దరికి డెంగీ... గ్రామంలో వారం రోజుల కిందట ఒకరికి తీవ్ర జ్వరం రాగా మెరుగైన వైద్యం కోసం పార్వతీపురం తీసుకువెళ్లగా డెంగీ అని వైద్యులు గుర్తించినట్టు తెలిసింది. మరో మహిళ డి.సునీత తీవ్ర జ్వరంతో బాధపడుతూ ఎప్పటికీ తగ్గుముఖం పట్టకపోవడంతో పాటు ప్లేట్లెట్స్ స్థాయి తగ్గిపోవడంతో వెంటనే స్పందించిన కుటుంబ సభ్యులు మెరుగైన వైద్యం కోసం విశాఖ తరలించగా ఆమెకు కూడా డెంగీ ఉన్నట్టు వైద్యాధికారులు గుర్తించారని కుటుంబ సభ్యులు తెలిపారు. మలేరియా వచ్చిందా.... ఇదిలా ఉండగా వారం రోజులుగా కిచ్చాడ గ్రామంలో పలువురు వ్యక్తులు మలేరియా జ్వరాల బారిన పడి జియ్యమ్మవలస మండలం పెదమేరంగి కూడలిలో ఉన్న ఓ ప్రైవేటు వైద్యుడును ఆశ్రయించగా ఆ మలేరియా జ్వరం వస్తే చాలు నయం చేయటానికి రూ.3000 వసూలు చేస్తున్నట్టు ఇదివరలో చికిత్స పొందిన బాధితులు చెబుతున్నారు. అసలే పేదరికంతో ఉన్న వీరు ఆర్థికంగా చితికిపోతున్నారు. ఇదిలా ఉండగా వైద్యాధికారులు తక్షణమే స్పందించి గ్రామంలో వైద్య శిబిరం ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు. గ్రామంలో పారిశుద్ధ్యం మెరుగుపరిచే చర్యలు వెంటనే చేపట్టాలని వారు కోరుతున్నారు. లేకుంటే మరింత మంది జ్వరాల బారిన పడడం ఖాయమని ఆందోళన చెందుతున్నారు. -
పూరీ జగన్నాథ స్వామికి జ్వరం..!
-
జ్వరం వచ్చిన రోజు
జ్వరం వచ్చిన రోజు గదిలోకి వచ్చి కిటికీలు వేసేశాడు. చలివచ్చినట్టు వణుకుతున్నాడు. జబ్బుపడ్డట్టు కనిపించాడు. మొహం కందిపోయింది. ఒళ్లంతా నొప్పిగా ఉందేమో, నెమ్మదిగా నడిచాడు. పడుకున్నాడు గాని యింకా నిద్ర పోలేదు. ‘‘ఏమైందిరా బుజ్జీ?’’ ‘‘తలనొప్పిగా ఉంది.’’ ‘‘నిద్రపోదువు గాని దా’’‘‘ఫరవాలేదులే. బాగానే ఉంది.’’ తొమ్మిదేళ్ల కుర్రాడు. ఫైర్ ప్లేస్ ఎదురుగా కూర్చుని మంట కాచుకుంటున్నాడు. ఒంట్లో నలతగా ఉందని తెలుస్తూనే ఉంది. నుదురుతాకి చూశాను. వేడిగా ఉంది. ‘‘జ్వరంగా ఉంది. వెళ్లి పడుకో’’ ‘‘బాగానే ఉంది.’’ డాక్టర్ వచ్చి, చెక్ చేసి టెంపరేచర్ చూశాడు. ‘‘ఎంతుంది?’’ ‘‘నూట రెండు’’ డాక్టరు రెండు రకాల క్యాప్సుల్స్ రాసిచ్చి ఎలా వేసుకోవాలో చెప్పాడు. ఒకటి జ్వరం తగ్గటానికి. రెండవది అసిడిటీ తగ్గించటానికి. కడుపులో అసిడిటీ ఉన్నప్పుడే ఇన్ఫ్లుయెంజా క్రిములు పెరుగుతాయట. ఆయన ఉపన్యాసం వింటే ఫ్లూ గురించి బాగా అధ్యయనం చేసినట్టు అనిపించింది. టెంపరేచర్ నూటనాలుగు దాటనంత వరకూ భయపడవలసిందేమీ లేదన్నాడు. ఇది ఫ్లూ సీజనట. ‘‘ఊళ్లో చాలామందికి ఉంది. న్యుమోనియా రాకుండా జాగ్రత్త పడండి’’. ఓ నోట్‌బుక్‌లో టెంపరేచర్, మందిచ్చిన టైమూ రాసి పెట్టుకున్నాను. ‘‘కథలు చదివి చెప్పనా?’’ అనడిగాను. ‘‘ఓకే. నీ ఇష్టం’’ అన్నాడు వాడు. ఆ కాసేపట్లోనే మొహం పాలిపోయింది. కళ్ల కిందిభాగాలు నల్లబడ్డాయి. ప్రపంచంతో తనకు సంబంధం ముగిసినట్టుగా చూరు వైపు చూస్తూ పడుకున్నాడు. దొంగల కథ ప్రారంభించాను. కానీ వాడు వినటం లేదు. ‘‘ఎలాగుంది నాన్నా?’’ ‘‘అలాగే ఉంది, ఫర్వాలేదు..’’ వాడి బెడ్ అంచు మీద కూర్చుని కాసేపు చదివాను. మరో క్యాప్సుల్‌కు టైమైంది. పడుకున్న తర్వాత ఇంతసేపు నిద్రపోకుండా ఉండడు వాడు. కానీ ఇప్పుడు రెప్ప వేయకుండా దిగులుగా దిక్కులు చూస్తున్నాడు. ‘‘కళ్లు మూసుకుని పడుకో నాన్నా. మందు వేయాల్సినప్పుడు లేపుతాను లే’’ ‘‘నిద్ర పోను’’. మరికాసేపటికి, ‘‘నువ్విక్కడ కూర్చోనక్కర్లేదు నాన్నా. విసుగ్గా ఉంటే వెళ్లు’’ అన్నాడు నా వైపు చూస్తూ. ‘‘నాకు విసుగేమిటమ్మా. నీతోనే ఉంటాను.’’ ‘‘ఊరికే కూర్చుంటే విసుగొస్తుందిలే వెళ్లు’’ పిల్లలతో వాదించడం కష్టం. ఈ పరిస్థితిలో అస్సలు మంచిది కాదు. పదకొండింటికి మందేసి బయటికి వచ్చాను. చల్లగా ఉంది. నేలంతా మంచు కప్పేసింది. చెట్లు, పొదలు నరికి కింద పేర్చిన కలప. ఎటు చూసినా తెల్లటి గుట్టలు. గడ్డి కనిపించడం లేదు. వెంట కుక్కను తీసుకెళ్లాను. ఆ నున్నటి పేవ్మెంట్ మీద అది కూడా జారింది. రెండుసార్లు నేను తూలాను. భుజానికి తగిలించుకున్న గన్ ఒకసారి కిందపడింది. కాలువకు అటుపక్కన చెట్టు మీద కొంగలు కనిపించాయి. రెంటిని గురిచూసి కొట్టగలిగాను. మిగతా పక్షులు కొన్ని ఆకుల్లో కనిపించకుండా దాక్కున్నాయి గాని చాలా మట్టుకు ఎగిరి మరింత దూరాన నేలమీద వాలాయి.గన్ గురి పెట్టాలంటే స్థిరంగా నిల్చోగలగాలి. అదే కుదరలేదు. మళ్లీ కింద పడతానని భయం. ఐదు షాట్లు మిస్ అయ్యాయి. ఎక్కడికి పోతాయి? మరో రోజుదాకా వాటిని బతకనిస్తాను. ఇంటికి చేరాను. ‘‘బాబు గదిలోకెవ్వర్నీ రానివ్వటం లేదు.’’ అంటూ కంప్లెయింట్ చేశారు పొరుగువాళ్లు. ‘‘లోపలికి వస్తే ఈ జబ్బు మీకూ వస్తుంది. ఎవరూ రావొద్దు.’’ అన్నాడట.వెళ్లి చూశాను. నేను ఎలా పడుకోబెట్టానో అదే పొజిషన్లో ఉన్నాడు. కనీసం పక్కకు కూడా తిరగలేదు. జ్వరంతో బుగ్గలు ఎరుపెక్కాయి. టెంపరేచర్ మళ్లీ చూశాను. ‘‘ఎంత?’’ ‘‘వంద ఉన్నట్లుంది.’’ నిజానికి నూట రెండు పాయింట్ నాలుగుంది. ‘‘నూట రెండు’’ అన్నాడు వాడు. ‘‘ఎవరు చెప్పారు?’’ ‘‘డాక్టరు.’’ ‘‘టెంపరేచర్ పరవాలేదులే! వర్రీ కావలసిందేమీ లేదు.’’ ‘‘వర్రీ లేదుగాని ఆలోచనలు ఆగడం లేదు.’’ ‘‘ఎందుకన్ని ఆలోచనలు? టేకిటీజీ!’’ ‘‘ఈజీగానే తీసుకుంటున్నాను’’. ఆ మాటల్లో కొత్తర్థం ధ్వనించింది. ఏదో దాస్తున్నాడు. ‘‘ఈ మందేసుకో’’ ‘‘ఉపయోగం ఉంటుందంటావా?’’ ‘‘భలే వాడివే! తప్పకుండా ఉంటుంది.’’ దొంగల కథ మళ్లీ చదివాను. కానీ వాడు వినందే! పుస్తకం మూసి వాడికేసి చూశాను. ‘‘ఎప్పుడు చచ్చిపోతానంటావు?’’ ‘‘ఏంటీ?’’ ‘‘ఎంతసేపట్లో చస్తాను?’’ ‘‘అవేం మాటలురా నాన్నా. నీకేమైందని?’’ ‘‘డాక్టరు చెప్పాడుగా నూటరెండని.’’ ‘‘ఆ మాత్రం టెంపరేచర్కెవరూ చావరు. పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకోకు.’’ ‘‘నాకు తెలుసు. ఇంత ఎక్కువగా ఉంటే మనుషులు తప్పక చస్తారు. ఫ్రాన్స్‌లో ఉన్నప్పుడు క్లాస్మేట్స్ చెప్పారు. టెంపరేచర్ నలభై నాలుగు దాటితే మనుషులు బతకలేరని. నాకేమో నూట రెండుంది.’’ అదన్నమాట. ఉదయం తొమ్మిదింటి నుండీ రోజంతా ఇలా బుర్ర పాడు చేసుకున్నాడు. పిచ్చి నాన్న. ‘‘నా బుజ్జీ! నా బంగారు కొండా!! మైళ్లకు, కిలోమీటర్లకూ తేడా తెలుసా లేదా? అలాగే ఇది. నీకేమీ కాదు. వాళ్లు వాడే థర్మామీటర్ వేరు. అక్కడ ముప్ఫై ఏడుంటే నార్మల్. మన థర్మామీటర్లో తొంబై ఎనిమిదన్నట్టు.’’ ‘‘నిజంగా? ఆర్ యూ ష్యూర్?’’ ‘‘అవున్రా నాయనా! మైళ్లకూ, కిలోమీటర్లకు తేడా ఉన్నట్టే ఇదీ. డెబ్బై మైళ్లంటే ఎన్ని కిలోమీటర్లో చెప్పు?’’ ‘‘ఓహ్! అలాగా’’ అప్పుడుగాని కాస్త స్థిమిత పడలేదు. మళ్లీ అల్లరిచేస్తూ ఇల్లు పీకి పందిరెయ్యటానికి మరో రెండు రోజులు పట్టింది. ఎర్నెస్ట్ హెమింగ్వే (1899–1961) అమెరికన్ సాహిత్య చరిత్రలో ఒక ధ్రువ తార అమెరికన్ సాహిత్య చరిత్రలో నూతన శకాన్ని ప్రారంభించిన ఎర్నెస్ట్ హెమింగ్వే చికాగో సమీపంలో జన్మించాడు. తండ్రి ప్రముఖ డాక్టరు, క్రీడాకారుడు. 1917లో ‘కాన్సాస్ సిటీస్టార్’ పత్రికలో రిపోర్టర్‌గా చేరి రచనా జీవితం ప్రారంభించాడు హెమింగ్వే. మరుసటి సంవత్సరం మొదటి ప్రపంచయుద్ధంలో పాలుపంచుకుని ఇటలీలో అంబులెన్స్ డ్రైవర్‌గా పనిచేశాడు. క్షతగాత్రుడై, అమెరికా తిరిగివచ్చి టొరంటో స్టార్ అనే వార పత్రికకోసం ఫీచర్లు రాశాడు. మరికొన్నాళ్లకు ఫారిన్ కరస్పాండెంట్‌గా యూరోప్ వచ్చి పారిస్‌లో స్థిరపడ్డాడు. 1922లో గ్రీసు, టర్కీ యుద్ధాన్ని గురించి రిపోర్ట్ చేశాడు. మరుసటి సంవత్సరం తొలి పుస్తకం ‘త్రీ స్టోరీస్ అండ్ టెన్ పోయమ్స్’ వెలువడింది. ఆ తరువాతి జీవితమంతా బుల్ ఫైటింగ్, ఆఫ్రికా అడవుల్లో వేట, సముద్రం మీద ఫిషింగ్‌లో గడిచింది. స్పానిష్ అంతర్యుద్ధం గురించి కూడా రాశాడు. క్యూబాలో చాలా కాలం గడిపాడు. 1961లో ఆత్మహత్య చేసుకున్నాడు. కథా రచన గురించి, ముఖ్యంగా శైలి, వాక్య నిర్మాణం గురించి హెమింగ్వే చాలా కృషి చేశాడు. తొలి కథలు ‘ఇన్ అవర్ టైమ్’ (1925), ‘ఎ ఫేర్వెల్ టు ఆర్మ్స్’ (1929)తో ఒక గొప్ప స్టైలిష్టుగా సాహితీలోకం అతణ్ని గుర్తించింది. ఇరవైయవ శతాబ్ది పూర్వార్థంలో ఇంగ్లిష్ సాహిత్యశైలిని ఇంతగా ప్రభావితం చేసిన రచయిత మరొకరు లేరు. (చైతన్య స్రవంతితో జేమ్స్ జాయిస్ కూడా ధ్రువ తారగా అవతరించాడు గాని అది వేరు). 1940 నాటి ‘ఫర్ హూమ్ ది బెల్ టోల్స్’ (1940) యుద్ధ వాతావరణం నేపథ్యంలో జరిగిన ప్రేమ కథ. 1932లో బుల్ ఫైటింగ్ గురించి ‘డెత్ ఇన్ ది ఆఫ్టర్నూన్’, 1935లో వేట గురించి ‘గ్రీన్ హిల్స్ ఆఫ్ ఆఫ్రికా’ రాశాడు. సముద్రంలో చేపల వేట గురించిన అద్భుత తాత్విక నవల ‘ది ఓల్డ్ మేన్ అండ్ ది సీ’ (1952) తర్వాత 1954లో హెమింగ్వేను నోబెల్ బహుమతి వరించింది. ‘‘పాఠకుడు, ‘మరెంత ఉందో కథ’ అనుకోవడమే రచయిత ప్రతిభకు గీటురాయి’’ అంటాడు హెమింగ్వే తన శైలి గురించి. కథా వస్తువు కోసం, ఉద్వేగ భరితమైన సన్నివేశాల కోసం అనితర సాధ్యమైన అతని కథలు మళ్లీ చదువుతారు. - ఆంగ్లమూలం : ఎర్నెస్ట్ హెమింగ్వే - అనువాదం: ముక్తవరం పార్థసారథి