
సాక్షి, అమరావతి: కరోనా పాజిటివ్ కేసుల నేపథ్యంలో పల్లెటూళ్లు జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. మే 7వ తేదీ నుంచి 14వ తేదీ వరకూ గణాంకాలను తీసుకుంటే పట్టణాల్లో కంటే గ్రామీణ ప్రాంతాల్లో పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగింది. కానీ మరణాలు మాత్రం ఇప్పటికీ పట్టణాల్లోనే ఎక్కువగా ఉన్నాయి. రికవరీ శాతం కూడా పల్లెటూళ్లలోనే ఎక్కువగా ఉన్నట్టు వెల్లడైంది.
మే 7 నుంచి 14వ తేదీ నాటికి 355 క్లస్టర్లను ఏర్పాటు చేయగా.. ప్రస్తుతం మొత్తం 4,792 క్లస్టర్లున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఫీవర్ సర్వే జరగనుండటంతో ముందస్తుగా బాధితులను గుర్తించి ఐసొలేషన్ చేసేందుకు వీలు కలుగుతుంది. రాష్ట్రవ్యాప్తంగా ఫీవర్ సర్వే కోసం 19 వేల మంది ఏఎన్‌ఎంలు, 40 వేల ఆశా కార్యకర్తలు పనిచేయనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment