Isolation Center
-
అసద్ భార్యకు లుకేమియా
సిరియా తాజా మాజీ అధ్యక్షుడు బషర్ అల్ అసద్ భార్య అస్మా లుకేమియా (బ్లక్ క్యాన్సర్)తో పోరాడుతున్నారు. వ్యాధి తీవ్రత దృష్ట్యా ఆమె బతికే అవకాశాలు సగమేనని సమాచారం. ఇన్ఫెక్షన్ ముప్పును తగ్గించేందుకు ఆమెను ఐసోలేషన్‌లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఆస్మా 2019లో రొమ్ము కేన్సర్ బారిన పడ్డారు. వ్యాధి నుంచి పూర్తిగా బయట పడ్డట్టు ఏడాది చికిత్స తరువాత ప్రకటించారు. కానీ కొంతకాలానికే ఆమెకు బ్లడ్ కేన్సర్ ఉన్నట్టు తేలింది. అస్మా తల్లిదండ్రులు సిరియావాసులు. ఆమె 1975లో లండన్‌లో జన్మించారు. ఆమెకు బ్రిటిష్–సిరియా పౌరసత్వముంది. లండన్‌లోని కింగ్స్ కాలేజీలో కంప్యూటర్ సైన్స్, ఫ్రెంచ్ సాహిత్యం చదివారు. 2000 డిసెంబర్లో బషర్‌ను పెళ్లాడారు. వారికి ముగ్గురు పిల్లలు సిరియాలో తిరుగుబాటు మొదలైనప్పటి నుంచే ఆస్మా తన పిల్లలతో కలిసి లండన్ వెళ్లిపోవడానికి ప్రయత్నించారు. ఇటీవల తిరుగుబాటు సేనలు దేశాన్ని ఆక్రమించుకోవడంతో అసద్ పదవీచ్యుతుడవడం తెలిసిందే. కుటుంబంతో సహా ఆయన రష్యాలో దలదాచుకుంటున్నారు. అయితే మాస్కో జీవితంపై అస్మా అసంతృప్తితో ఉన్నట్టు చెబుతున్నారు. దేశం వీడి వెళ్లేందుకు ప్రత్యేక అనుమతి కోరుతూ రష్యా కోర్టుకు ఆమె పెట్టుకున్న దరఖాస్తును అధికారులు పరిశీలిస్తున్నారు. అసద్ నుంచి విడాకుల కోసం కూడా అస్మా దరఖాస్తు చేసుకున్నట్లు వార్తలొచ్చినా వాటిని రష్యా ఖండించింది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
మంకీపాక్స్ పాజిటివ్ కేసు నిర్ధారణ
న్యూఢిల్లీ: ‘అనుమానిత’ కేసు మంకీపాక్స్(ఎంపాక్స్) కేసుగానే నిర్ధారణ అయ్యింది. ఎంపాక్స్ వ్యాప్తి అధికంగా ఉన్న ఓ దేశం నుంచి వచి్చన యువకుడిలో వైరస్ లక్షణాలు ఉన్నట్లు గుర్తించిన సంగతి తెలిసిందే. అతడికి పరీక్షలు నిర్వహించగా ఎంపాక్స్ పాజిటివ్‌గా తేలిందని కేంద్ర ఆరోగ్య శాఖ సోమవారం వెల్లడించింది. బాధితుడు ప్రస్తుతం ఆసుపత్రిలో ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నాడని, అతడి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని, ఇతర అనారోగ్య లక్షణాలేవీ లేవని ఆసుపత్రి వర్గాలు తెలియజేశాయి. సదరు యువకుడు ప్రయాణంలో ఉండగా ఎంపాక్స్ వైరస్ సోకినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ పేర్కొంది. అతడిలో వెస్ట్ ఆఫ్రికన్ క్లేడ్–2 ఎంపాక్స్ వైరస్ ఉన్నట్లు గుర్తించామని వివరించింది. ఇది 2022 జూలై నుంచి మన దేశంలో నమోదైన 30 కేసుల్లాంటిదేనని తెలియజేసింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) ప్రజారోగ్య అత్యవసర పరిస్థితిగా ప్రకటించిన క్లేడ్–1 రకం వైరస్ కాదని స్పష్టంచేసింది. క్లేడ్–2 రకం వైరస్ అంతగా ప్రమాదకారి కాదని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సూచించింది. బాధితుడు ఐసోలేషన్‌లో ఉన్నాడు కాబట్టి అతడి నుంచి వైరస్ ఇతరులకు సోకే అవకాశం లేదని తెలిపింది. హరియాణాలోని హిసార్ పట్టణానికి చెందిన 26 ఏళ్ల యువకుడు ఇటీవలే విదేశాల నుంచి తిరిగొచ్చాడు. అతడిలో ఎంపాక్స్ లక్షణాలు కనిపించడంతో శనివారం ఢిల్లీలోని లోక్‌నాయక్ జయప్రకాశ్ నారాయణ్ ప్రభుత్వ ఆసుపత్రిలో చేరి్పంచారు. అనుమానిత ఎంపాక్స్ కేసుగా కేంద్ర ఆరోగ్య శాఖ ఆదివారం ప్రకటించింది. పరీక్షల అనంతరం ఎంపాక్స్ పాజిటివ్‌గా తేలింది. అదే ఆసుపత్రిలో చికిత్స కొనసాగిస్తున్నారు. మరోవైపు అనుమానిత, నిర్ధారిత ఎంపాక్స్ బాధితుల కోసం ఢిల్లీలో మూడు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఐసోలేషన్ గదులు సిద్ధం చేశారు. ఎంపాక్స్ కేసుల చికిత్స విషయంలో లోక్‌నాయక్ జయప్రకాశ్ నారాయణ్ ఆసుపత్రి నోడల్ సెంటర్‌గా సేవలందిస్తోంది. ఇందులో 20 ఐసోలేషన్ గదులు ఉన్నాయి. అప్రమత్తంగా ఉండాలన్న కేంద్ర ఆరోగ్య శాఖ ఎంపాక్స్ వైరస్ వ్యాప్తిపై ప్రజ ల్లో ఆందోళన నెలకొన్న నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి అపూర్వ చంద్ర అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను అప్రమత్తం చేశారు. అనుమానిత ఎంపాక్స్ కేసుల విషయంలో స్క్రీనింగ్, టెస్టింగ్ నిర్వహించాలని సూచించారు. ఆసుపత్రుల్లో ఐసోలేషన్ రూమ్‌లు ఏర్పాటు చేయాలని చెప్పారు. ఈ మేరకు సోమవా రం అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు లేఖ రాశారు. ఎంపాక్స్‌పై ప్రజల్లో అనుమానాలు తొలగించాలని పేర్కొన్నారు. వైరస్ సోకినా ప్రాణాలకు ముప్పు ఉండదన్న సంగతి తెలియజేయాలని కోరారు. -
వామ్మో మంకీపాక్స్!.. భారత్‌లో అనుమానిత కేసు
ప్రపంచ దేశాలను వణికిస్తున్న ప్రాణాంతక మంకీపాక్స్ (ఎంపాక్స్) వైరస్ సెగ భారత్‌కూ తాకింది. మన దేశంలో తాజాగా ‘అనుమానిత’ ఎంపాక్స్ కేసు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఎంపాక్స్ వ్యాప్తి అధికంగా ఉన్న ఓ దేశం నుంచి వచి్చన యువకుడిలో వైరస్ లక్షణాలను గుర్తించినట్లు ఆదివారం ప్రకటన విడుదల చేసింది. ‘‘బాధితుడిని ఆసుపత్రిలో చేర్చి ఐసోలేషన్‌లో ఉంచాం. అతడి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. అతడితో కలిసి ప్రయాణించిన వ్యక్తులను గుర్తిస్తున్నాం. అతనికి నిజంగా ఎంపాక్స్ సోకిందీ లేనిదీ నిర్ధారించడానికి నమూనాలు సేకరించి పరీక్షిస్తున్నాం’’ అని పేర్కొంది. ‘‘ఇది అనుమానిత కేసే. ఇంకా నిర్ధారణ కాలేదు. ఆందోళన చెందాల్సిన అవసరం లేదు’’ అని తెలిపింది. వైరస్ విషయంలో ఏ పరిణామాలనైనా ఎదుర్కొనేందుకు సర్వసన్నద్ధంగా ఉన్నట్లు వివరించింది. 99,176 కేసులు.. 208 మరణాలు యూరప్, ఆఫ్రికా దేశాల్లో ఇటీవల మంకీపాక్స్ వైరస్ కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. దాంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ మంకీపాక్స్‌ను ‘అంతర్జాతీయ ఆరోగ్య విపత్తు’గా ఆగస్టు 14న ప్రకటించింది. ఈ వైరస్ వ్యాప్తి 2022లో వెలుగులోకి వచి్చంది. ఇటీవల ఆఫ్రికాలో కొత్త రకం ఎంపాక్స్ పుట్టుకొచి్చనట్లు తేలింది. 2022 వైరస్ కంటే ఇది మరింత ప్రాణాంతకమని తేలింది. కొత్త వైరస్ లైంగిక సంబంధాల ద్వారా కూడా వ్యాప్తి చెందుతుందని నిపుణులు చెబుతున్నారు. 2022 నుంచి 2023 దాకా 116 దేశాల్లో 99,176 ఎంపాక్స్ కేసులు నమోదయ్యాయి. 208 మంది మరణించారు. 2024లో 15,600కు పైగా కేసులు నమోదయ్యాయి. 537 మంది మృతిచెందారు. 2022 నుంచి భారత్‌లో కనీసం 30 ఎంపాక్స్ కేసులు నమోదయ్యాయి. చివరిసారిగా ఈ మార్చి నెలలో ఒక కేసు బయటపడింది.ఏమిటీ ఎంపాక్స్? 1958లో తొలిసారిగా కోతుల్లో ఈ వైరస్‌ను కనుగొన్నారు. అందుకే దీనికి మంకీపాక్స్ పేరు స్థిరపడిపోయింది. అప్పట్లో పరిశోధన కోసం డెన్మార్క్‌కు తరలించిన కోతుల్లో కొత్త రకం వ్యాధి లక్షణాలు కనిపించడంతో ల్యాబ్ పరీక్షలు జరిపి ఈ వైరస్ ఉనికి కనిపెట్టారు. మనుషుల్లో దీన్ని 1970లో తొలిసారిగా గుర్తించారు. కాంగోలో తొమ్మిదేళ్ల బాలుడికి ఈ వైరస్ సోకింది. మనుషులు, చిట్టెలుకలకూ వైరస్ సోకుతుండటంతో ఎంపాక్స్ అనే పొట్టిపేరు ఖరారుచేశారు. దశాబ్దాల క్రితం లక్షలాది మందిని పొట్టనబెట్టుకున్న మశూచి కారక వైరస్, ఎంపాక్స్ ఒకే జాతికి చెందినవి. గోవులకు సోకే గో మశూచి, వసీనియా వంటి వ్యాధులను కల్గించే వైరస్ కూడా ఈ రకానిదే.ఇలా సోకుతుంది→ అప్పటికే వైరస్ సోకిన మనుషులు లేదా జంతువులను తాకినా, వారితో దగ్గరగా గడిపినా వైరస్ సోకుతుంది. → కుక్క లేదా ఇతరత్రా పెంపుడు జంతువులకు వైరస్ సోకితే అవి మనుషులను కరిచినా, తాకినా, వాటి లాలాజలం, రక్తం, ఇతర స్రావాలు అంటుకున్నా సోకుతుంది. → చర్మంపై గాయాలు, శరీర స్రావాలు, తుమ్మినపుడు పడే తుంపర్లు, నోటి లాలాజలం ఇలా వైరస్‌కు ఆవాసయోగ్యమైన ప్రతి తడి ప్రాంతం నుంచీ సోకుతుంది. → రోగి వాడిన దుస్తులు, వస్తువులను ముట్టుకున్నా, వాడినా, ముఖాన్ని ముఖంతో తాకినా, కరచాలనం చేసినా, ముద్దుపెట్టుకున్నా సోకొచ్చు. → తల్లి నుంచి బిడ్డకు సంక్రమించవచ్చు.వ్యాధి లక్షణాలు ఏమిటీ?→ ఎంపాక్స్ సోకితే చర్మం ఎర్రగా మారి పొక్కులొస్తాయి. సొన చేరి పొక్కులు ఇబ్బంది పెడతాయి. → చర్మంపై దద్దుర్లతోపాటు జ్వరం, భరించలేని తలనొప్పి, కండరాల నొప్పి, వెన్ను నొప్పి వస్తాయి. → 90 శాతం కేసుల్లో ముఖంపై, 75 శాతం కేసుల్లో అరచేతులు, పాదాల మీద, 30 శాతం కేసుల్లో జననాంగాల మీద పొక్కులొస్తాయి. → నీటి బొడిపెలుగా పెద్దవై సొన చేరి ఎర్రగా, నల్లగా మారి పగులుతాయి. → నీరసంగా ఉంటుంది. గొంతెండిపోతుంది.వ్యాక్సిన్ ఉందా? స్వల్ప లక్షణాలు కనిపిస్తే వ్యాధి దానంతట అదే తగ్గిపోతుంది. ప్రస్తుతానికి ఎంపాక్స్‌కు నిర్దిష్టమైన చికిత్స విధానం, వ్యాక్సిన్ లేవు. మశూచికి వాడే టికోవిరమాట్ (టీపీఓఎక్స్ ఎక్స్) యాంటీ వైరల్‌నే దీనికీ వాడుతున్నారు. అమెరికాలో మశూచికి వాడే జెనియోస్ (ఇమ్వామ్యూన్, ఇంవానెక్స్) డ్రగ్స్‌నే 18 ఏళ్ల పై బడిన రోగులకు ఇస్తున్నారు. కోవిడ్ దెబ్బకు సంపన్న దేశాల్లో మాదిరిగా నివారణ చర్యలు, నిర్ధారణ పరీక్షల వంటివి లేక ఆఫ్రికా దేశాల్లో వైరస్ విజృంభిస్తోంది.అప్రమత్తంగా ఉండండి: కేంద్రం పాకిస్తాన్, బంగ్లాదేశ్‌ల్లో ఎంపాక్స్ కేసులు పెరిగిపోతుండటంతో సరిహద్దులతోపాటు ఎయిర్‌పోర్టులు, ఓడరేవుల్లో అప్రమత్తంగా ఉండాలని కేంద్రం సర్క్యులర్ జారీ చేసింది. ఎంపాక్స్ లక్షణాలు గుర్తించడానికి విదేశాల నుంచి వచ్చేవారికి పరీక్షలు నిర్వహించాలని సూచించింది. ఎంపాక్స్ సన్నద్ధతపై ప్రధాని ముఖ్య కార్యదర్శి పి.కె.మిశ్రా తాజాగా ఉన్నతస్థాయి సమీక్ష జరిపారు. ఈ కేసుల్లో సమర్థ చికిత్స కోసం ఆసుపత్రులను ఇప్పట్నుంచే సిద్ధం చేసుకోవాలని రాష్ట్రాలకు కేంద్రం సూచించింది.– సాక్షి, నేషనల్ డెస్క్ -
కేరళలో నిఫా వైరస్ కలకలం.. బాలుడు మృతి
కేరళ: కేరళలో నిఫా వైరస్ కలకలం రేపుతోంది. నిఫా ఇన్ఫెక్షన్తో చికిత్స పొందుతున్న 14 ఏళ్ల బాలుడు ఆదివారం మరణించాడు. ఆదివారం ఉదయం బాలుడికి గుండెపోటు వచి్చందని, అతడిని బతికించేందుకు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయని, 11.30 గంటలకు మృతి చెందాడని రాష్ట్ర ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ తెలిపారు. బాలుడు చికిత్స పొందుతున్న కోజికోడ్ మెడికల్ కాలేజీలో ప్రస్తుతం ముగ్గురు వ్యక్తులు ఐసోలేషన్‌లో ఉన్నారని తెలిపారు. అయితే 246 మంది బాలుడితో కాంటాక్ట్ అయ్యారని, వారిలో 63 మంది హై–రిస్క్ కేటగిరీ కింద ఉన్నారని తెలిపింది. నిఫా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో కేరళకు తమ పూర్తి సహాయ సహకారాలు ఉంటాయని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. -
బైడెన్‌కు కరోనా
మిల్వాకీ: ఓవైపు అమెరికా అధ్యక్ష ఎన్నికలు శరవేగంగా సమీపిస్తున్నాయి. ప్రత్యర్థి అసలే డొనాల్డ్ ట్రంప్. ఆదినుంచీ దూకుడుగా దూసుకెళ్తున్నారు. అది చాలదన్నట్టు హత్యా యత్నంతో ఆయన గ్రాఫ్ మరింత పెరిగింది. దాన్ని వీరోచితంగా ఎదుర్కొన్న తీరుతో మరింత ఫేవరెట్‌గా మారారు. అలాంటి ట్రంప్‌ను దీటుగా ఎదుర్కోవాల్సిన డెమొక్రాట్లు మాత్రం ఇంకా కాలూ చెయ్యీ కూడదీసుకునే ప్రయత్నంలోనే ఉన్నారు. వయోభారం, మతిమరుపుతో రోజుకో రకంగా తడబడుతున్న అధ్యక్షుడు జో బైడెన్ ఎలా చూసినా ట్రంప్‌కు పోటీ ఇవ్వలేరని దాదాపుగా తేలిపోయింది. అయినా పోటీ నుంచి తప్పుకునేందుకు, మరొకరికి చాన్సిచ్చేందుకు 81 ఏళ్ల బైడెన్ ససేమిరా అంటున్నారు. ఇవి చాలవన్నట్టు బైడెన్ తాజాగా కరోనా బారిన పడ్డారు! దాంతో కీలక దశలో ఎన్నికల ప్రచారానికి విరామం ఇవ్వాల్సి వచ్చింది. ఈ వరుస పరిణామాలతో డెమొక్రాట్లు తల పట్టుకుంటున్నారు. పోటీకి ముందే ఓటమి ఖాయమయ్యేలా ఉందని వాపోతున్నారు. బైడెన్‌ను ఎలాగోలా బుజ్జగించి తప్పించేందుకు చివరి నిమిషం ప్రయత్నాలను ముమ్మరం చేశారు. లాస్‌వెగాస్‌లో ప్రచార ఈవెంట్లో మాట్లాడాల్సి ఉండగా బైడెన్‌కు కరోనా సోకినట్టు తేలింది. దాంతో డెలావెర్ నివాసంలో ఐసోలేషన్‌లో ఉన్నారు.ట్రంప్‌ను మీరు ఓడించలేరు: పెలోసీ బైడెన్ తప్పుకోవాలంటున్న డెమొక్రాట్ల సంఖ్య నానాటికీ పెరిగిపోతోంది. పార్టీ కీలక నేత, ప్రతినిధుల సభ మాజీ స్పీకర్ నాన్సీ పెలోసీ ఇటీవల బైడెన్‌తో ఫోన్లో మాట్లాడినట్టు సీఎన్ఎస్ వార్తా సంస్థ వెల్లడించింది. ట్రంప్‌ను ఓడించడం ఆయన వల్ల కాదని ఆమె స్పష్టం చేసినట్టు చెప్పుకొచి్చంది. ‘‘పోల్స్ కూడా మీరు గెలవలేరనే చెబుతున్నాయి. కనుక తప్పుకుంటే మంచిది. కాదని మొండికేస్తే మీరు ఓడటమే గాక ప్రతినిధుల సభలో డెమొక్రాట్ల విజయావకాశాలను కూడా చేజేతులా నాశనం చేసిన వారవుతారు’’ అంటూ పెలోసీ కుండబద్దలు కొట్టారట. -
అరుదైన వింత వ్యాధి: ఆ వృద్ధుడు 55 ఏళ్లుగా స్వీయ నిర్బంధంలోనే..!
కరోనా టైంలో లాక్డౌన్, హోం క్యారంటైన్ వంటి పదాలని విని హడలిపోయాం. ఆ కరోనా మహమ్మారికి భయపడి అంతా స్వీయనిర్బంధంలో బిక్కుబిక్కుమని గడిపాం. అయిన వారితో సహా ఒకరితో ఒకరికి సంబంధాలు లేకుండా గడపాల్సిన దారుణమైన దుస్థితితో ఎన్నో అవస్థలు పడ్డాం. హమ్మయ్యా! అని ఇప్పుడిప్పుడే హాయిగా ఊపిరి పీల్చుకుంటున్నాం. చాలా వరకు పరిస్థితి మళ్లీ సాధారణ స్థితికి వచ్చింది. ఆ గడ్డు రోజులు తల్చుకుంటునే వామ్మో! అని హడలిపోతాం. అలాంటిది ఈ వృద్ధుడు నెల, రెండు నెలలు కాదు ఏకంగా 55 ఏళ్లుగా స్వీయ నిర్బంధంలోనే జీవిస్తున్నాడు. అది కూడా అతనికి ఎలాంటి అంటు రోగం లేకపోయిన ఎవ్వరితోనూ సంబంధం లేకుండా ఒంటరిగా తనను తాను నిర్బంధించుకుని ఎందుకు ఉంటున్నాడంటే.. వివరాల్లోకెళ్తే..71 ఏళ్ల ఆఫ్రికన్ వ్యక్తి తనను తాను నిర్బంధించుకుని ఎవ్వరితోనూ సంబంధాలు లేకుండా ఏకాకిగా బతుకుతున్నాడు. అతను ఎందుకిలా జీవిస్తున్నాడో వింటే ఇలాంటి భయాలు కూడా ఉంటాయా అని ఆశ్చర్యపోతారు. జంతువులు, నీళ్లు, నిప్పు తదితర భయాలు గురించి వాటి తాలుకా ఫోబియాల గురించి విన్నాం. కానీ ఇలాంటి అత్యంత అరుదైన ఫోబియా గురించి విన ఉండే అవకాశమే లేదు. ఐతే ఇక్కడ ఈ వ్యక్తికి ఉన్న విచిత్రమైన భయం ఏంటంటే ఆడవాళ్లు. మహిళలా!.. అని ఆశ్చర్యపోకండి. ఎందుకంటే అతడికి మహిళలంటేనే చచ్చేంత భయం. మహిళ గాలి సైతం తనను తాకకూడదని ఇలా 55 ఏళ్లుగా ఒంటరిగా జీవిస్తున్నాడు. పైగా ఇంటి చుట్టూ కంచె కూడా వేసుకున్నాడు. ఇలా ఆ వృద్ధుడు 16 ఏళ్ల ప్రాయం నుంచి స్వీయ నిర్బంధంలో ఉంటున్నాడు. విచిత్రం ఏంటంటే అతడికి మహిళలంటే భయం కానీ అతడు ఆ మహిళల సాయంతోనే జీవనం సాగిస్తున్నాడు. ఎందుకంటే అతడికి సాయం చేసేది ఇరుగుపొరుగు మహిళలే. అ వ్యక్తి తన చిన్నతనం నుంచి ఇలా ఇంట్లోనే ఒంటరిగా ఉంటాడని, బయటకు అస్సలు రాడని చెబుతున్నారు చుట్టుపక్కల మహిళలు. పొరపాటున ఏ మహిళ అయినా అతడి ఇంటి ఆవరణలోకి వచ్చి మాట్లాడేందుకు ప్రయత్నించిన నిమిషం ఆలస్యం చేయకుండా తలుపువేసేసుకుంటాడని తెలిపారు. అతనికి మహిళలంటే చచ్చేంత భయం అని చెబుతున్నారు స్థానికులు. ఈ భయం కారణంగా ఆ వ్యక్తి 77 ఏళ్ల వచ్చినా బ్రహ్మచారిగానే ఉండిపోయాడు. చివరికి అతడు ఏ పని చేయలేని స్థితికి వచ్చేశాడు. అతడి దుస్థితిని చూసి చుట్టుపక్కల మహిళలు తమకు తోచిన రీతలో ఆహారపదార్థాలను అతడి వాకిట్లో ఉంచి వెళ్లిపోతారు. అతడు మాత్రం వారు వెళ్లిపోయాక మెల్లిగా వాటిని తీసుకుంటాడు. ఇలా వేరొక జెండర్‌ని చూస్తే భయపడే మానసిక స్థితిని గైనోఫోబియా అంటారు. అతడు తీవ్రమైన గైనోఫోబియాతో బాధపడుతున్నాడు. దీన్ని వైద్య పరిభాషలో డయాగ్నోస్టిక్ అండ్ స్టాటిస్టికల్ మాన్యువల్ ఆఫ్ మెంటల్ డిజార్డర్‌గా పిలుస్తారు. దీన్ని క్లినికల్ పరంగా ఓ నిర్ధిష్ట భయంగా చెబుతారు వైద్యులు. ఈ ఫోబియ ఉన్నవాళ్లు స్త్రీల పట్ల అహేతుకమైన భయంతో ఉంటారట. తరుచుగా వారి గురించి ఆలోచించడంతో ఒక విధమైన ఆందోళనకు దారితీసి క్రమంగా మరింత తీవ్రమైపోతుంది. ఫలితంగా ఆయా వ్యక్తులు పొరపాటున మహిళలను చూడగానే చెమటలు పట్టేసి, శ్వాస ఆడనట్లుగా అయిపోయి ప్రాణాలు కోల్పేయే పరిస్థితికి వచ్చేస్తారని చెబుతున్నారు వైద్యులు. (చదవండి: అత్యంత ఘాటైన మిరపగా గిన్నిస్ రికార్డు..ఒక్కటి తిన్నా ఇక అంతే!) -
జనాన్ని పట్టిపీడిస్తున్న.. ‘హికికోమొరి’ పరిస్థితి.. కోవిడ్‌తో మరింత తీవ్రం
చలాకీగా ఉండే ఓ 35 ఏళ్ల సాఫ్ట్వేర్ ఇంజనీర్.. ఉన్నట్టుండి ముభావంగా మారిపోయాడు.బంధువులు, స్నేహితులు, కుటుంబ సభ్యులు..ఎవరితోనూ పెద్దగా మాట్లాడటం లేదు.ఎవరితోనూ కలవడం లేదు. అసలు ఇల్లు వదిలి బయటికి రావడం లేదు. డిగ్రీ చదువుతున్న ఓ అమ్మాయి..కాలేజీకి వెళ్లడం మానేసింది.. అలాగనిస్నేహితులతో షికార్లు, కబుర్లు వంటివి కూడా లేవు.. ఎప్పుడు చూసినా ఇంట్లోనే ఓ గదిలో కూర్చుండి పోతోంది.. ఏమిటని అడిగితేబాగానే ఉన్నానంటోంది.. .. ఏమైంది ఈ ఇద్దరికి? వారు దారుణమైన ఘటనలేమీ ఎదుర్కోలేదు.. తీర్చలేని ఇబ్బందేమీఎదురుకాలేదు.. కానీ ‘హికికోమొరి’బారినపడ్డారు. అందరికీ దూరంగా ఏకాంతంగా గడిపేస్తున్నారు. అసలు ఏమిటీ ‘హికికోమొరి’? అదేమైనా మానసిక సమస్యా? దానికి కారణాలేమిటి?నిపుణులు ఏం చెప్తున్నారో తెలుసుకుందామా.. జపాన్‌లో 15లక్షల మందికి.. జపాన్ ఆరోగ్య శాఖ ఇటీవల ఓ సర్వే చేసింది. దాదాపు 15 లక్షల మంది ‘హికికోమొరి’పరిస్థితిలో ఉంటున్నారని గుర్తించింది. నెలలు, సంవత్సరాలుగా వారు ఎవరితోనూ కలవడం లేదని తేల్చింది. వారి మానసిక, శారీరక ఆరోగ్యంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. దీన్ని చక్కదిద్దడానికి చర్యలు చేపట్టాలని ప్రభుత్వానికి సూచించింది. దానిపై స్పందించిన పలు స్థానిక సంస్థలు.. ‘హికికోమొరి’లతో మెటావర్స్ వేదిగా సమావేశాలు నిర్వహించనున్నట్టు ప్రకటించాయి. దీనికి సంబంధించి భారత్ సహా పలు దేశాల ఆంగ్ల మీడియాలో కథనాలు వచ్చాయి. ఏమిటీ హికికోమొరి? సామాజిక జీవనానికి దూరంగా దాదా పు ఒంటరితనంతో కూడిన జీవితాన్ని గడపడమే ‘హికికోమొరి’. 1980వ దశకంలో ఏర్పడిన ఆర్థిక మాంద్యం, ఉద్యోగాలు, ఉపాధి దెబ్బతినడంతో.. తొలిసారిగా ఇలాంటి పరిస్థితిని గుర్తించారు. దానికి ‘హికికోమొరి (అంతర్ముఖులుగా మారిపోవడం)’అని పేరుపెట్టారు. దీనిబారిన పడినవారు తమచుట్టూ తామే గిరి గీసుకుని బతికేస్తుంటారు. అలవాట్లను మార్చుకుంటారు. మానసిక ఆందోళన (యాంగ్జైటీ), కుంగుబాటు (డిప్రెషన్), అందరి మధ్య ఉన్నా ముభావంగా ఉండటం వంటి లక్షణాలు కనిపిస్తుంటాయి. కొందరిలో అయితే ఆత్మహత్య చేసుకోవాలన్న ఆలోచనలు కూడా వస్తుంటాయని నిపుణులు చెప్తున్నారు. అయితే ఇప్పటివరకు అధికారికంగా దీనిని మానసిక సమస్యగా ప్రకటించలేదు. దీనికి కారణాలేమిటి? సామాజిక, విద్య, ఉద్యోగ పరమైన ఒత్తిళ్లు, కుంగుబాటు, ఆర్థికపరమైన సమస్యలతో ఆందోళన, వివిధ రకాల వేధింపులు వంటివి ‘హికికోమొరి’పరిస్థితికి దారితీస్తాయని నిపుణులు చెప్తున్నారు. ‘‘ఉమ్మడి కుటుంబాలు, సామాజిక సంబంధాలు తగ్గిపోవడం, విద్య, ఉద్యోగాల్లో తీవ్రమైన పోటీ వంటివి కూడా హికికోమొరి సిండ్రోమ్‌కు దారితీస్తాయి. ఇది వారిపై వ్యక్తిగతంగా, పరోక్షంగా సమాజంపైనా వ్యతిరేక ప్రభావం చూపుతుంది’’అని కౌన్సెలింగ్ సైకాలజిస్ట్ విష్ణుప్రియ భగీరథ్ తెలిపారు. బయటపడేందుకు డబ్బులిస్తూ.. దక్షిణకొరియాలో 19 ఏళ్ల నుంచి 39 ఏళ్ల మధ్య వయసున్న మూడున్నర లక్షల మంది ‘హికికోమొరి’ సమస్యతో బాధపడుతున్నట్టు ఆ దేశ ఆరోగ్యశాఖ ఇటీవల గుర్తించింది. ముఖ్యంగా తొమ్మిదేళ్ల నుంచి 24 ఏళ్ల మధ్య వయసున్న విద్యార్థులు, ఉద్యోగులపై ప్రభావం ఎక్కువగా ఉందని తేలి్చంది. వారిని ఈ సమస్యనుంచి బయటపడేలా ప్రోత్సహించేందుకు నెలకు సుమారు రూ.40 వేలు (490 డాలర్లు) లివింగ్ అలవెన్స్‌గా ఇవ్వనున్నట్టు ఆ దేశ ప్రభుత్వం తాజాగా ప్రకటించింది. కుటుంబం,దగ్గరివారితో పరిష్కారం! ‘హికికోమొరి’బారినపడినవారు అందరికీ దూరంగా, ఏకాంతంగా గడపడం వల్ల మరింతగా మానసిక, శారీరక సమస్యలు చుట్టుముడతాయని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఒక్కోసారి ఇవి తీవ్ర పరిణామాలకు దారితీస్తాయని హెచ్చరిస్తున్నారు. దీని బాధితులు మందుల కంటే.. కౌన్సెలింగ్, కుటుంబ సభ్యుల సాంత్వన వంటి మార్గాల ద్వారానే త్వరగా కోలుకుంటారని స్పష్టం చేస్తున్నారు. ఇదే సమయంలో అవసరమైతే డిప్రెషన్ వంటి కొన్ని సమస్యలకు మందులు వాడితే సరిపోతుందని అంటున్నారు. సంస్థలు, కార్యాలయాలు తమ ఉద్యోగుల్లో, విద్యా సంస్థలు తమ విద్యార్థులలో ఒత్తిడి తగ్గించేలా చర్యలు చేపట్టాలని సూచిస్తున్నారు. భారత్ సహా అన్ని దేశాల్లోనూ.. అన్ని రంగాల్లో పోటీ విపరీతంగా పెరిగిపోయిన ప్రస్తుత పరిస్థితులకు తోడు కరోనా మహమ్మారి దెబ్బతో ‘హికికోమొరి’పరిస్థితి పెరిగిపోయిందని నిపుణులు చెప్తున్నారు. ‘‘ఆర్థిక మాంద్యం, ఉద్యోగాలు పోవడం, ఉపాధి దెబ్బతినడం, నెలలకు నెలలు లాక్డౌన్, కోవిడ్ బారినపడి ఆరోగ్యం దెబ్బతినడం వంటివాటి నుంచి కోలుకోవడానికి చాలా మంది ఇంకా ఇబ్బంది పడుతున్నారు. అలాంటి వారు హికికోమొరి బారినపడుతున్నారు..’’అని ఢిల్లీకి చెందిన లైఫ్ కోచ్, సైకాలజిస్ట్ నిఖిలా దేశ్‌పాండే వివరించారు. వర్క్ ఫ్రం హోం, అన్నిరకాల సరుకుల హోం డెలివరీ వంటివి దీనికి తోడ్పడుతున్నాయని పేర్కొన్నారు. ఒక్క జపాన్ అనే కాకుండా ప్రపంచదేశాలన్నిటా ఇలాంటి పరిస్థితి కనిపిస్తోందని వెల్లడించారు. భారతదేశంలో మానసిక ఆరోగ్యంపై దృష్టిపెట్టడం చాలా తక్కువకావడంతో.. ‘హికికోమొరి’సమస్య తలెత్తినా గుర్తించడం కష్టమని పేర్కొన్నారు. 8% 2017 నాటి ఆస్పెన్ అధ్యయనం ప్రకారం..భారతదేశంలో ఒంటరితనంతో బాధపడుతున్న యువత – సాక్షి సెంట్రల్ డెస్క్ -
హై రిస్క్ దేశాల నుంచి వచ్చినవారికి అక్కడ వారం రోజుల క్వారంటైన్
బెంగళూరు: దేశంలో కరోనా కొత్త వేరియంట్ వ్యాప్తి చెందుతున్న తరుణంలో కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వైరస్ ఉద్ధృతి అధికంగా ఉన్న హై రిస్క్ దేశాల నుంచి వచ్చే ప్రయాణికులను వారం రోజులు క్వారంటైన్లో ఉంచనున్నట్లు తెలిపింది. చైనా, హాంకాంగ్, జపాన్, దక్షిణ కొరియా, సింగపూర్, థాయ్‌లాండ్ నుంచి వచ్చే ప్రయాణికులకు వైరస్ లక్షణాలు కన్పిస్తే వెంటనే ఐసోలేషన్‌కు తరలించనున్నట్లు కర్ణాటక ఆరోగ్య మంత్రి డా.కే శివకుమార్ శనివారం తెలిపారు. నాలుగు రకాల కరోనా వేరియంట్ల విజృంభణతో చైనా విలవిల్లాడుతోంది. రోజుకు వేల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. పదుల సంఖ్యలో మరణిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే చైనా నుంచి వచ్చే ప్రయాణికులపై అమెరికా, భారత్ సహా పలు దేశాలు ఆంక్షలు విధించాయి. చదవండి: న్యూ ఇయర్ రోజు విషాదం.. టూర్‌కు వెళ్లి తిరిగివస్తుండగా బస్సు బోల్తా.. -
చైనాను టెన్షన్ పెడుతున్న కరోనా.. ఆంక్షలు కఠినం, మళ్లీ లాక్డౌన్!
కరోనా వైరస్ మరోసారి డ్రాగన్ కంట్రీ చైనాను వణికిస్తోంది. చైనాలో మరోసారి రికార్డు స్థాయిలో కరోనా పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. దీంతో, చైనాలో మరోసారి కొన్ని ప్రాంతాల్లో లాక్డౌన్ విధించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇదిలా ఉండగా.. చైనాలో బుధవారం ఒక్కరోజే 31,454 కేసులు నమోదయ్యాయి. వీటిలో 27,517 కేసులు అసింప్టొమేటిక్ అని చైనా నేషనల్ హెల్త్ బ్యూరో వెల్లడించింది. ఇదే సమయంలో 5వేల మరణాలు కూడా నమోదు అయినట్టు సమాచారం. కాగా, పాజిటివ్ కేసులు పెరుగుతున్న తరుణంలో కరోనా సోకిన నగరాల్లో కఠిన ఆంక్షలు విధిస్తున్నారు. ఆఫీసులు, రెస్టారెంట్లను అధికారులు మూసివేశారు. అనవసరంగా బయటకు రావద్దని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇక, ఏదైనా నగరంలో చిన్న ఔట్ బ్రేక్ వచ్చినా ఆ నగరం మొత్తాన్ని అధికారులు షట్ డౌన్ చేస్తున్నారు. Violent protests aren't stopping in China. Again started at #Foxconn's #Apple plant in #China's Zhengzhou Workers have engaged in violent clashes with security personnel & police protesting against corona virus restrictions and unpaid wages.#resurrection#TiananmenSquare2_0 pic.twitter.com/OX72l1LpvG — Zaira Mirza (@ZairaMirza1) November 24, 2022 మరోవైపు.. ఎక్కువ సంఖ్యలో కరోనా పరీక్షలు, ప్రయాణ పరిమితులు, లాక్ డౌన్ విధించి కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు చైనా ఆరోగ్య శాఖ అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఇక, ప్రభుత్వం అమలు చేస్తున్న కోవిడ్ నిబంధనలు, ఆంక్షలపై ఉద్యోగుల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పలు కంపెనీల్లో పనిచేసే ఉద్యోగులు బయటకు రాకుండా ఉండేందుకు చర్యలు తీసుకుంటున్నారు. వారి కోసం ప్రత్యేక క్వారంటైన్ గదులను సైతం ఏర్పాటు చేస్తున్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) On Wed night, another quarantine facility or Fangcang hospital was put into operation in Beijing, where asymptomatic and mild patients will be isolated and treated. At present, 6 patients have been admitted, which is still short of the utilization rate of the designed 200 beds. pic.twitter.com/ekalQTUSTH — FrontSource (@FrontSource) November 24, 2022 Pekings Messezentrum im Norden der Stadt ist jetzt ein Corona-Quarantänezentrum. 🇨🇳 China hält stur an seiner Null-Covid-Politik fest und will jeden einzelnen Fall isolieren. Trotzdem gibt es im ganzen Land gerade eine Rekord-Welle neuer Infektionen. pic.twitter.com/ICHzPeMGVV — miriam steimer (@miriamsteimer) November 24, 2022 -
వామ్మో.. ఈ కోవిడ్ ఐసోలేషన్ వార్డ్ కంటే జైలు నయం!
కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు చైనా జీరో కోవిడ్ పాలసీని అవలంభిస్తున్న విషయం తెలిసిందే. ఒక్క కేసు నమోదైనా.. లక్షల మందిని ఐసోలేషన్‌కు పరిమితం చేస్తోంది. ఇంకా వైరస్ లక్షణాలు కనిపించిన వారి పరిస్థితి మరీ దారుణంగా ఉందనేందుకు ప్రముఖ పారిశ్రామికవేత్త హర్ష గోయెంకా ట్విటర్లో షేర్ చేసిన వీడియోనే నిదర్శనం. చైనాలోని కోవిడ్ ఐసోలేషన్ వార్డులో పరిస్థితులు జైలును తలపిస్తున్నట్లు సూచిస్తూ వీడియో షేర్ చేశారు. ప్రస్తుతం ఆ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ‘ఇది జైలు అనుకుంటే మీరు ఆశ్చర్యపోక తప్పదు. అది చైనాలోని కోవిడ్ ఐసోలేషన్ వార్డు’ అని రాసుకొచ్చారు గోయెంకా. అయితే, ఈ వీడియోను ముందుగా వాల్ స్ట్రీట్ సిల్వర్ షేర్ చేసింది. ‘చైనాలోని కోవిడ్ ఐసోలేషన్ క్యాంపుల్లో జీవన విధానం ఇలా ఉంది. చిన్న పిల్లలు, మహిళలు, గర్భవతులను సైతం ఇక్కడ నిర్బంధించినట్లు తెలిసింది. ఇది నిజంగా కోవిడ్ కోసమేనా? నిజంగా నియంత్రించేందుకేనా?’ అంటూ పేర్కొంది వాల్ స్ట్రీట్ సిల్వర్. జైలులో కన్నా దారుణంగా ప్రజలను నిర్బంధించటంపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. If you are wondering if it’s a prison- no, it’s a COVID isolation ward in China! pic.twitter.com/3SSnCI4dfi — Harsh Goenka (@hvgoenka) October 15, 2022 ఇదీ చదవండి: ఆఫీస్‌కు రమ్మని చెప్పేది ఇందుకే: హర్ష గోయెంకా వైరల్ ట్వీట్ -
చస్తే చావండి.. బయటకు మాత్రం పోనివ్వం!
వైరల్: ఈ వీడియో చూస్తే ఇంత దుర్మార్గమా? అని ఎవరైనా అనకుండా ఉండలేరు. ఒకవైపు ప్రకంపనలు వస్తుంటే.. భయంతో జనాలు పరుగులు తీయకుండా ఉంటారా?. కానీ, ఏం జరిగినా బయటకు పంపేదే లేదని వాళ్లను అడ్డుకోవడం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కరోనా విషయంలో ప్రపంచ దేశాలు ఊపిరి పీల్చుకుని చాలాకాలమే అవుతోంది. అయితే.. చైనాలో జీరో-కొవిడ్ పాలసీ కఠినాతీకఠినంగా అమలు అవుతోంది. ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షించడంతో పాటు టెస్టింగ్.. ఐసోలేషన్‌ను ఇంకా కొనసాగిస్తున్నారు అక్కడ. ఆ దెబ్బకు జనాలు పిచ్చెక్కిపోతున్నారు. తాజాగా.. మరో దారుణం బయటపడింది. చైనాలో సోమవారం రిక్టర్ స్కేల్‌పై 6.8 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది. 2017 తర్వాత సిచువాన్ ప్రావిన్స్‌లో సంభవించిన భారీ భూకంపం ఇదే. కొండచరియలు ఉండే ప్రాంతం కావడంతో భారీగానే నష్టం వాటిల్లింది. కనీసం 50 మంది దాకా మరణించగా.. 100 మందికి పైగా గాయాలయ్యాయి. At least 46 people killed after strong earthquake hits China's Sichuan province - Xinhua#Chinaearthquake pic.twitter.com/WWADoioVrX — Rani joshi (@RaniJoshi16) September 5, 2022 成都一小区志愿者阻拦因地震跑出屋的市民,居民:我们就该等死? 求生逃生是本能,中共的体制已经让这些人没有了本能,只有服从。#四川 #四川地震 #成都 #防疫 pic.twitter.com/OeHnZa2fdj — Sylvia (@Sylvia9988777) September 6, 2022 樱花【时事要闻】 #四川 大白拦着,不给出去 #地震 https://t.co/ozQg4DQZ7K pic.twitter.com/FDa2LOL8Ee — 荣耀678(意农🇭🇺) (@Antonio55184671) September 6, 2022 అయితే భూకంపం సమయంలోనూ లాక్డౌన్, ఐసోలేషన్‌లో ఉన్నవాళ్లను బయటకు వదల్లేదు ఆరోగ్య సిబ్బంది. పైగా బిల్డింగ్ కూలితే ఇందులోనే చావాలే తప్ప.. బయటకు వెళ్లకూడదంటూ అడ్డుకున్న వీడియోలు కొన్ని నెట్లో వైరల్ అవుతోంది ఇప్పుడు. ఈ క్రమంలో కొందరితో సిబ్బంది దురుసుగా సైతం వ్యవహరించినట్లు తెలుస్తోంది. ఈ వీడియోలు చైనా ట్విటర్ హ్యాండిల్స్ నుంచే వైరల్ అవుతుండడం గమనార్హం. అయితే వీటిపై చైనా అధికారులు స్పందించాల్సి ఉంది. అంతేకాదు భూకంప బాధితులకు సాయాన్ని సైతం కరోనా టెస్టుల క్లియరెన్స్ తర్వాత ఇస్తామని అధికారులు చెప్తున్నారంటే.. పరిస్థితి ఎంత ఘోరమో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం చైనాలో పలు నగరాల్లో లక్షల మంది ఇంకా కరోనా కట్టడిలోనే ఉండిపోయారు. ఇదీ చదవండి: మీజిల్స్ విజృంభణ.. 700 మంది చిన్నారుల మృతి -
అమెరికా అధ్యక్షునికి కరోనా
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కరోనా వైరస్ బారినపడ్డారు. ఆయనకు గురువారం పరీక్షలు నిర్వహించగా, పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. బైడెన్‌కు స్వల్ప లక్షణాలే ఉన్నాయని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైట్‌హౌస్ ప్రెస్ సెక్రెటరీ కెరైన్ జీన్–పియర్రీ ప్రకటించారు. కరోనా లక్షణాల తీవ్రతను తగ్గించే యాంటీ వైరల్ డ్రగ్ ‘పాక్స్లోవిడ్’ను తీసుకుంటున్నారని వెల్లడించారు. అధ్యక్షుడు ప్రస్తుతం శ్వేతసౌధంలో ఐసోలేషన్‌లో ఉంటూ విధులు నిర్వర్తిస్తున్నారని చెప్పారు. అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్‌కు నెల రోజుల క్రితం కరోనా సోకింది. ఆమె త్వరగానే కోలుకున్నారు. -
ఫీవర్’లో మంకీ పాక్స్ ఐసోలేషన్ వార్డు
నల్లకుంట: దేశంలో మంకీ పాక్స్ కేసులు నమోదవుతున్నట్లు వస్తున్న వార్తల నేపథ్యంలో ఆ వ్యాధిని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు తెలంగాణ ప్రభుత్వం అవసరమైన ఏర్పాట్లు చేసిందని నల్లకుంట ఫీవర్ ఆస్పత్రి సూపరింటెండెంట్, మంకీ పాక్స్ నోడల్ ఆఫీసర్ డాక్టర్ కె. శంకర్ అన్నారు. ఇందు కోసం నల్లకుంట ఫీవర్ ఆస్పత్రిలో 36 పడకలతో మంకీ పాక్స్ ఐసోలేషన్ వార్డును సిద్ధం చేశామన్నారు. మంగళవారం మీడియాతో కలిసి ఫీవర్‌లో మంకీ పాక్స్ వార్డుని(7వ వార్డు) పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ విదేశాల నుంచి వచ్చే వారిలో ఒకరికైనా మంకీ పాక్స్ లక్షణాలు కనిపిస్తే నేరుగా విమానాశ్రయం నుంచి నల్లకుంట ఫీవర్ ఆస్పత్రికి తీసుకు వస్తారన్నారు. అనంతరం ఇక్కడి వైద్యుల సూచనల మేరకు అనుమానితుల నుంచి బ్లడ్, యూరిన్, క్కిన్ లీసెన్స్ (నీటి), గొంతు నుంచి శాంపిల్స్ తదితర ఐదు రకాల శాంపిళ్లను సేకరించి పరీక్షల కోసం గాంధీ ఆస్పత్రికి పంపుతామన్నారు. రిజల్ట్స్‌లో ఏమైనా అనుమానాలు ఉంటే మరోసారి శాంపిళ్లు సేకరించి వ్యాధి నిర్ధారణ పరీక్షల కోసం పుణేకు పంపిస్తామన్నారు. ఈ పరీక్షల్లో వ్యాధి నిర్ధారణ అయిన వారికి ప్రత్యేక చికిత్సలు అందించనున్నట్లు తెలిపారు. సాధారణంగా ఈ వ్యాధి గాలి ద్వారా సోకదని, ఈ వ్యాధి సోకిన వ్యక్తి దగ్గరికి పీపీఈ కిట్లు ధరించకుండా వెళ్లినప్పుడు ఆ రోగి దగ్గినా, తుమ్మినా వచ్చే తుంపర్ల ద్వారా ఇతరులకు సోకుతుందన్నారు. ఈ వైరస్ ఒకరినుంచి మరొకరికి వేగంగా వ్యాప్తి చెందుతుందన్నారు. మంకీ పాక్స్ కొత్తది కాదని, పలు దేశాల్లో ఇప్పటికే ఉందన్నారు. ఈ వ్యాధి సోకిన వ్యక్తి కాళ్లు, చేతులు, ముఖంపై, శరీరంపై దద్దుర్లు(గుళ్లలు) ఏర్పడడం, గొంతులో వాపు రావడం తదితర లక్షణాలు ఉంటాయన్నారు. సోమవారం డీఎంఈ కార్యాలయంలో గాంధీ ఆస్పత్రి çసూపరింటెండెంట్ డాక్టర్ రాజారావు, మైక్రో బయాలజిస్టు డాక్టర్లతో కలిసి రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఆస్పత్రుల వైద్యులతో ఏర్పాటు చేసిన జూమ్ మీటింగ్‌లో పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా(సెన్సటైజేషన్) వివరించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా మంకీ పాక్స్ వచ్చిన రోగిని వేరే ఆసుపత్రికి ఎలా తరలించాలి, రోగికి చికిత్స, శాంపిల్స్ సేకరణ, రోగికి వైద్యం అందించే వైద్యులు ఇతర సిబ్బంది తీసుకోవాల్సిన జాగ్రత్తలపై శిక్షణ ఇచి్చనట్లు ఆయన పేర్కొన్నారు. (చదవండి: 111 రోజులు చికిత్స.. ప్రభుత్వాసుపత్రి ప్రాణం పోసింది.. మంత్రి హరీశ్‌రావు అభినందనలు) -
మమ్మల్ని బంధించకండి!: చైనా ప్రజల గగ్గోలు
Why Lock Us In A Cage?: చైనా గత కొన్ని నెలలుగా కరోనా మహమ్మారితో చిగురుటాకులా వణికిపోయింది. జీరో కోవిడ్ పాలసీని విచ్చిన్నం చేస్తూ అనుహ్యంగా పెరుగుతున్న కేసులతో చైనా బెంబేలెత్తిపోయింది. బాబోయ్ హోం క్వారంటైన్లో ఉండమని ప్రజలు గగ్గోలు పెడుతున్నా కఠిన ఆంక్షలు కొరడాని ఝళిపించి మరీ ప్రజలను నిర్భంధించింది. ఐతే గత కొన్ని రోజులుగా చైనాలో కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టడంతో చైనా వాసులు ఇప్పుడిప్పుడే కాస్త ఊపిరి పీల్చుకుంటున్నారు. అసలే వరుస లాక్డౌన్లతో మగ్గిపోయిన చైనా వాసులను ఆ పేరు వింటేనే హడలిపోతున్నారు. ఇక తమ వల్ల కాదని తేల్చి చేప్పేశారు కూడా. కానీ చైనా అధికారులు మాత్రం కరోనా తగ్గిందని బహిరంగా ప్రదేశాల్లో తిరిగేతే ఊరుకోమని గట్టిగా చెప్పేశారు. ఈ మేరకు చైనా కరోనా తీవ్రత తక్కువ ఉన్న ప్రాంతాల్లో ఆంక్షలు సడలించినప్పటికీ ఇంకా వేలాది మంది నిర్బంధంలోనే ఉన్నారు. 'ఇక మా వల్ల కాదు, ఇంకా ఎన్నాళ్లు మేము ఇలా బోనుల్లోని జంతువుల మాదిరి ఉండాలంటూ' ప్రజలు ఆగ్రహంతో ప్రశ్నిస్తున్నారు. కేసులు పెరగకూడదంటే ఆంక్షలు తప్పదనే నొక్కి చెబుతోంది. ప్రస్తుతం చైనాలో అధికారులు కొన్నిచోట్ల ఆంక్షలు సడలించటంతో ఉద్యోగులు కార్యాలయాలకు తిరిగి వెళ్తున్నారు. అలాగే పాఠశాలలను కూడా దశల వారీగా తిరిగి ప్రారంభించారు. ఐతే కేసుల శాతం తక్కువగా ఉన్నప్రాంతాల్లోనే ఈ ఆంక్షలను సడలించారు. కానీ షాంఘైలోని చాలా ప్రాంతాల్లో తీవ్ర కరోనా ఆంక్షలు అమలు చేస్తోంది. ఒక పక్క ప్రజలు భరించలేమని చెబుతున్నా...చైనా మాత్రం కేసులు పెరగకూడదనే ఇలా చేస్తున్నామంటూ బలవంతంగా లాక్డౌన్ ఆంక్షలు రుద్దుతోంది. (చదవండి: నూపుర్ కామెంట్లతో ముదురుతున్న వివాదం.. ‘భారత ఉత్పత్తులు మాకొద్దు!’) -
ఎలక్ట్రిక్ వెహికల్స్‌కు భారీ డిమాండ్, మారిపోతున్న ఇళ్ల రూపురేఖలు!
సాక్షి, హైదరాబాద్: కరోనా మహమ్మారి గృహ కొనుగోలుదారుల అభిరుచులను మార్చేసింది. విశాలమైన గృహాలతో పాటు ఐసోలేషన్ కోసం ప్రత్యేకంగా ఒక గది, ఆన్లైన్ క్లాస్‌లు, ఆఫీస్ పని చేసుకునేందుకు వీలుగా వర్క్ స్పేస్, భవిష్యత్తు అవసరాల కోసం ఎలక్ట్రిక్ చార్జింగ్ పాయింట్లు వంటివి కావాలని కోరుకుంటున్నారు. అందుకు తగ్గట్టుగానే నిర్మాణ సంస్థలు ప్రాజెక్ట్‌లను డిజైన్ చేస్తున్నాయి. గతంలో క్లబ్‌హౌస్‌లలో బాంక్వెట్ హాల్, ఇండోర్ గేమ్స్, గెస్ట్ రూమ్స్, యోగా, జిమ్, స్పా, క్రచ్ వంటి వసతులు ఉండేవి. కానీ, ఇప్పుడు వీటితో పాటు ఆఫీస్ వర్క్ స్టేషన్లు, ప్రత్యేక క్యాబిన్స్, సమావేశ గదులను ఏర్పాటు చేస్తున్నారు. ఇండోర్ గేమ్స్‌లలో కూడా షటిల్, స్క్వాష్ వంటి లగ్జరీ గేమ్స్‌కు చోటు కల్పిస్తున్నారు. బిల్టప్ ఏరియాలో 3 శాతం క్లబ్‌హౌస్ ఉండాలనే నిబంధనలను పాటిస్తూనే ఆయా అదనపు వసతులను ఏర్పాటు చేస్తున్నారు. ► వర్క్ ఫ్రం హోమ్‌తో ఉత్పాదకత పెరగడంతో చాలా వరకు కంపెనీలు కూడా దీన్నే కొనసాగిస్తున్నాయి. కొన్ని కంపెనీలు హైబ్రిడ్ మోడల్లో పనిని కేటాయిస్తున్నాయి. దీంతో గృహాలతో పాటు ఆఫీస్ స్పేస్‌కు కూడా డిమాండ్ తగ్గడం లేదు. కరోనా మహమ్మారి నేపథ్యంలో ఐసోలేషన్ అనేది అనివార్యమైన పరిస్థితి. దీంతో ఒకటే ఫ్లోర్లో నాలుగైదు ఫ్లాట్లు, ఎక్కువ మంది నివాసితులు ఉండే అపార్ట్మెంట్లకు బదులుగా ప్రధాన నగరానికి దూరమైన సరే శివారు ప్రాంతాలలో విల్లాలను కోరుకునేవారి సంఖ్య పెరిగింది. అపార్ట్మెంట్లు, గేటెడ్ కమ్యూనిటీలలో అయితే పెద్ద సైజు ఫ్లాట్లను కొనుగోలుదారులు కోరుకుంటున్నారు. గతంలో రెండు పడక గదులలో నివసించే వాళ్లు కరోనా రెండో దశ తర్వాత మూడు పడక గదులకు మారేందుకు ఇష్టపడుతున్నారు. 1,100 చ.అ. నుంచి 1,200 చ.అ.లలోని 2 బీహెచ్‌కే నివాసితులు 1,600 నుంచి 1,800 చ.అ.లకు ఫ్లాట్లకు, 2 వేల చ.అ. నుంచి 2,200 చ.అ.లోని 3 బీహెచ్‌కే వాళ్లు 2,400 నుంచి 2,500 చ.అ. పైన అపార్ట్మెంట్లకు మారాలని కోరుకుంటున్నారు. రేటు కాస్త ఎక్కువైనా సరే పెద్ద సైజు గృహాలే కావాలంటున్నారు. లిఫ్ట్, జనరేటర్ వంటి పనిచేస్తాయో లేదో అనే అపోహ కారణంగా గతంలో హైరైజ్ అపార్ట్మెంట్లు అంటే పెద్దగా కొనుగోలుదారులు ఇష్టపడేవాళ్లు కాదు. కానీ, ఇప్పుడు హైరైజ్ భవనాలపై అవగాహన పెరిగింది. దీంతో డిమాండ్ ఏర్పడింది. ► కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహిస్తుండటంతో నిర్మాణ సంస్థలు కూడా వాటికి తగ్గట్టుగా నిర్మాణ డిజైన్లలో మార్పులు చేస్తున్నాయి. భవిష్యత్తులో ఎలక్ట్రిక్ వాహనాల సంఖ్య పెరగనున్న నేపథ్యంలో వాటికి అవసరమైన మౌలిక వసతులను గృహ, వాణిజ్య సముదాయాలలో ఏర్పాటు చేస్తున్నారు. నివాస సముదాయాల పార్కింగ్ స్పేస్‌లలో ఎలక్ట్రిక్ చార్జింగ్ పాయింట్లు, గేటెడ్ కమ్యూనిటీలలో ప్రత్యేకంగా స్థలం కేటాయించి ఈవీ స్టేషన్లను ఏర్పాటు చేస్తున్నాయి. ► గతంలో పెద్ద గేటెడ్ కమ్యూనిటీలో ఏటీఎంలను ఏర్పాటు చేసిన తరహాలోనే ప్రైవేట్ వెండర్లకు ఈవీ స్టేషన్ల కోసం స్థలాన్ని కేటాయిస్తున్నాయి. పెద్ద ప్రాజెక్ట్‌లలో సెక్యూరిటీ లాబీ దగ్గరే బ్యాటరీ కార్లను ఏర్పాటు చేస్తున్నారు. దీంతో ఎవరైనా అతిథులు వస్తే అందులో ఎక్కి ప్రయాణించవచ్చు. అలాగే స్కూల్ విద్యార్థుల కోసం పికప్ డ్రాప్ కోసం వినియోగించుకోవచ్చు. -
మంకీపాక్స్ అలర్ట్.. WHO సీరియస్ వార్నింగ్
జెనీవా: కరోనా కొత్త వేరియంట్లతో ఆందోళన చెందుతున్న ప్రపంచానికి మంకీపాక్స్ రూపంలో మరో వైరస్ కొత్త సవాల్ విసురుతోంది. ప్రపంచవ్యాప్తంగా మంకీపాక్స్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) హెచ్చరించింది. మంకీపాక్స్ పాజిటివ్ కేసుల సంఖ్యల గణనీయంగా పెరుగుతోంది. ప్రజారోగ్యానికి మంకీపాక్స్ ముప్పు పొంచి ఉన్నదని డబ్ల్యూహెచ్‌వో ఆందోళన వ్యక్తం చేసింది. తాజాగా ప్రపంచ వ్యాప్తంగా వైరస్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయని, ఇప్పటివరకు 23 దేశాల్లో 257 కేసులు నమోదు అయినట్టు పేర్కొంది. మరో 120 మందిలో లక్షణాలను గుర్తించామని వెల్లడించింది. కొన్ని దేశాల్లో బయటపడిన మంకీపాక్స్ వేగంగా వ్యాప్తిచెందుతున్నదని స్పష్టం చేసింది. మరోవైపు.. ప్రభుత్వాలు కూడా మంకీపాక్స్‌ను సీరియస్‌గా తీసుకోవాలని సూచించింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వాలు వెంటనే వ్యాక్సిన్లను సమకూర్చుకోవాలని తెలిపింది. మంకీపాక్స్‌పై అందరికి అవగాహన కల్పించాలని, వ్యాధి లక్షణాలను తెలియజేయాలని పేర్కొన్నది. ఒకవేళ.. వైరస్ సమూహ వ్యాప్తి కనుక ప్రారంభమైతే.. చిన్నారులు, రోగ నిరోధక శక్తి లేనివారు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారిపై తీవ్ర ప్రభావం చూపుతుందని హెచ్చరించింది. ఇదిలా ఉండగా.. మంకీ పాక్స్‌పై తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమయ్యింది. జాతీయ వ్యాధి నియంత్రణ కేంద్రం అధికారుల ఇచ్చిన సూచనల మేరకు జిల్లా వైద్యాధికారులను అప్రమత్తం చేస్తూ ప్రజారోగ్య శాఖ సంచాలకులు శ్రీనివాసరావు ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలోని అన్ని ఆస్పత్రుల్లో మంకీపాక్స్‌కు చికిత్స అందించేందుకు తగిన ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. జ్వరం, తీవ్రమైన దద్దుర్లు, చర్మంపై బుడగలు వంటివి ఏర్పడటం మంకీ పాక్స్ లక్షణాలు. ఇక, అకస్మాత్తుగా తీవ్రమైన దద్దుర్లు వచ్చినవారు, మంకీపాక్స్ కేసులు నమోదవుతున్న దేశాల నుంచి గత 21 రోజుల్లో వచ్చినవారు, మంకీపాక్స్ సోకినవారితో సన్నిహితంగా మెలిగినవారు, వైరస్ అనుమానిత లక్షణాలు ఉన్న వారు వెంటనే ఆసుపత్రిలో చేరాలి. ఐసొలేషన్‌లో ఉండి చర్మంపై బుడగలు తొలిగిపోయి, పైపొర పూర్తిగా ఊడిపోయి, కొత్త పొర ఏర్పడే వరకు చికిత్సలు తీసుకోవాలి. ఈ వైరస్ ఇతరులకు సోకకుండా తప్పనిసరిగా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. As of May 26, a total of 257 confirmed cases and 120 suspected cases have been reported from 23 member states that are not endemic for the virus, the health agency said in a statement. Read More: https://t.co/fXxedn66zx#Monkeypox #WHO pic.twitter.com/cSwwY9z51w — The Daily Star (@dailystarnews) May 30, 2022 ఇది కూడా చదవండి: ప్రజలకు మరో ముప్పు.. కొత్త వైరస్ కలకలం -
యోగాతో కోవిడ్ పేషెంట్లలో సత్ఫలితాలు!
న్యూఢిల్లీ: ఐసోలేషన్ కాలంలో ఆన్లైన్ యోగా క్లాసులకు హాజరైన కోవిడ్ పేషెంట్లలో 92 శాతంమందికి సత్ఫలితాలు కనిపించాయని ఢిల్లీ ఫార్మాసైన్సెస్ అండ్ రిసెర్చ్ యూనివర్సిటీ నివేదిక తెలిపింది. కోవిడ్ లక్షణాల నుంచి వీరిలో అత్యధికులు తక్షణ మెరుగుదల చూపారని తెలిపింది. కోవిడ్ హోమ్ ఐసోలేషన్‌లో ఉన్న పేషెంట్లకు ఢిల్లీ ప్రభుత్వం ఉచిత ఆన్లైన్ యోగా క్లాసుల సదుపాయం కల్పిస్తోంది. వీరిలో 88.9 శాతం మంది తమకు శ్వాస సమస్యల నుంచి విముక్తి లభించినట్లు చెప్పారని నివేదిక తెలిపింది. ఐసోలేషన్‌లో తాము చేపట్టిన ఆన్లైన్ యోగా తరగతులు దాదాపు 4,600మంది పేషెంట్లకు ఉపకరించాయని ఢిల్లీ డిప్యుటీ సీఎం మనీశ్ సిసోడియా చెప్పారు. మూలికా వ్యాక్సిన్ భేష్.. టొరెంటో: కరోనా వేరియంట్లకు వ్యతిరేకంగా మెడికాగో కంపెనీ రూపొందించిన మూలికాధార కోవిడ్ టీకా 70 శాతం ప్రభావవంతంగా పనిచేస్తోందని క్లినికల్ గణాంకాలు వెల్లడించాయి. మొక్కల్లో ఉత్పత్తయ్యే కరోనా వైరస్ లాంటి రేణువు (సీవోవీఎల్‌పీ)లను ఎఎస్‌ఓ3 అనే సహాయ ఔషధంతో కలిపి ఈ టీకాను తయారు చేశారు. 24వేల మందిపై ఫేజ్3 ట్రయిల్స్ జరపగా 69.5 శాతం ప్రభావం చూపినట్లు తేలింది. మోస్తరు నుంచి తీవ్ర లక్షణాలున్న వారిలో 74–78.8 శాతం ప్రభావం చూపింది. రోగుల్లో వైరల్ లోడు బాగా తగ్గినట్లు నివేదిక తెలిపింది. టీకా సైడ్ ఎఫెక్టులు స్వల్పం నుంచి మోస్తరుగా ఉన్నట్లు తెలిపింది. -
చైనాలో భయానక పరిస్థితులు.. కంటతడి పెట్టిస్తున్న వీడియో
బీజింగ్: కరోనా వైరస్ కారణంగా డ్రాగన్ దేశం చైనాలో భయానక వాతావరణం నెలకొంది. చైనాలోని అతిపెద్ద నగరం షాంఘైలో పరిస్థితులు భయానకంగా మారాయి. జీరో కోవిడ్ విధానంలో భాగంగా అమలవుతున్న కఠిన ఆంక్షలతో జనం ఆహారం తెచ్చుకునేందుకు కూడా అవకాశం లేకుండాపోతోంది. దీంతో, షాంఘై ప్రజలు తిరగబడుతున్నారు. వివరాల ప్రకారం.. కరోనా వైరస్ కారణంగా షాంఘైలో కఠిన ఆంక్షలు అమలవుతున్నాయి. ఈ నేపథ్యంలో కోవిడ్ పేషెంట్లు లొంగిపోవాలని పోలీసులు చేసిన ఆదేశాలు షాంఘైలో ఘర్షణకు దారి తీశాయి. పీపీఈ కిట్ ధరించి ఓ వీధికి వచ్చిన పోలీసులు.. అక్కడ ఉన్న నివాసితుల ఇండ్లను సరెండర్ చేయాలని కోరారు. ఆ సమయంలో పోలీసులను స్థానికులు అడ్డుకోవడంతో వారి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. కరోనా బాధితులను ఆ ప్రాంతంలో ఉన్న ఓ అపార్ట్మెంట్లలో పెట్టేందుకు పోలీసులు ముందస్తుగా కాంపౌండ్‌ను ఖాళీ చేయించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఓ మహిళ.. తమ కాంపౌండ్‌ను క్వారెంటైన్ కేంద్రంగా మారుస్తున్నారని ఆరోపించింది. దీంతో తమ ఆహారం దొరకకుండా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. INSANE: The CCP is cracking down hard to enforce quarantine orders in Shanghai This video is wild pic.twitter.com/EjiXm5qwO4 — Drew Hernandez (@DrewHLive) April 14, 2022 ఇదిలా ఉండగా.. కరోనా బారిన పడిన వారి ఇళ్లలోని పెంపుడు జంతువులను సిబ్బంది కొట్టిచంపుతున్నారు. ఇటువంటి దారుణాలకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న తాత్కాలిక ఆస్పత్రుల్లో అరకొర వసతులు, చెత్తాచెదారంతో ఇబ్బందులు పడుతున్నామని బాధితులు చెబుతున్నట్లు సోషల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ప్రజలు ఆకలితో అలమటిస్తూ చనిపోవడం కంటే ఆత్మహత్యే శరణ్యమంటూ ఆక్రందనలు చేస్తున్నా రు. జైలుకెళ్తే అయినా కడుపు నిండుతుందనే ఆశతో తమను అరెస్ట్ చేయండంటూ పోలీసులకు విజ్ఞప్తులు చేస్తున్నారు. -
హోంక్వారంటైన్‌కు బ్రిటన్ గుడ్‌బై
లండన్: కరోనాతో సహజీవనం అనే ప్రణాళికకు బ్రిటన్ ప్రభుత్వం కసరత్తు ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా కోవిడ్–19 సోకితే 10 రోజులు హోంక్వారంటైన్ ఉండాలన్న నిబంధనలను ఎత్తివేసింది. దీనిపై సోమవారం అధికారిక ప్రకటన వెలువడనుంది. బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ గత కొద్ది రోజులుగా కరోనాతో సహజీవనం అనే ప్రణాళికపైనే దృష్టిసారించారు. కొద్ది రోజుల క్రితం మాస్కులు తప్పనిసరి కాదని చెప్పిన ఆయన ఇప్పుడు సెల్ఫ్ ఐసొలేషన్ నిబంధనల్ని కూడా ఎత్తేశారు. బోరిస్ జాన్సన్ ఆదివారం ఒక వార్తా సంస్థతో మాట్లాడుతూ కోవిడ్‌పై వ్యాక్సినే బ్రహ్మాస్త్రమని, గత రెండేళ్లలో టీకాలు తీసుకుంటూ కరోనా వైరస్‌ను ఎదుర్కొనే రోగనిరోధకతను సాధించామన్నారు. ప్రజ లందరిలోనూ వైరస్ పట్ల శాస్త్రీయపరమైన అవగాహన రావడంతో ఇకపై కోవిడ్‌తో సహజీవనం చేసే విధంగా ప్రణాళికలను రూపొందించాల్సిన అవసరం ఉందన్నారు. ‘‘కోవిడ్ హఠాత్తుగా అదృశ్యమైపోదు. ఈ వైరస్‌తో కలిసి బతుకుతూ దాని నుంచి అనుక్షణం మనల్ని మనం కాపాడుకునే ప్రయత్నాలు చేయాలి. మన స్వేచ్ఛకు అడ్డంకిగా మారిన ఆంక్షల్ని సడలించాలి’’ అని జాన్సన్ పేర్కొన్నారు. దేశ జనాభాలో 12 ఏళ్లకు పైబడిన వారిలో 91 శాతం మందికి మొదటి డోసు పూర్తయితే, 85 శాతం మంది రెండు డోసులు తీసుకున్నారు. నిబంధనలు ఎత్తివేయడంపై ఆరోగ్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తుంటే, ప్రతిపక్ష లేబర్ పార్టీ యుద్ధం ముగిసే ముందు జాన్సన్ విజయాన్ని ప్రకటించుకున్నట్టుగా వ్యవహరిస్తున్నారని విమర్శిస్తోంది. క్వీన్ ఎలిజబెత్‌కు కరోనా బ్రిటన్ రాణి క్వీన్ ఎలిజబెత్‌కు కోవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణైంది. ఆమెకి లక్షణాలు స్వల్పంగా ఉన్నాయని బకింగ్హమ్ ప్యాలెస్ వెల్లడించింది. రాణి ఆరోగ్యాన్ని వైద్యులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారని తెలిపింది. ఆమె రెండు డోసులతో పాటు బూస్టర్ డోసు కూడా తీసుకున్నారు. -
ఫ్లైట్ ఎక్కేముందు కరోనా నెగెటివ్.. దిగాక పాజిటివ్!!
భారత సంతతికి చెందిన ఓ వ్యక్తి భారత్‌లో నిర్వహిస్తున్న కరోనా టెస్టులపై చేసిన ఆరోపణలు పెను దుమారం రేపుతున్నాయి. ముంబై ఎయిర్‌పోర్ట్‌లో ఎదురైన అనుభవం దృష్ట్యా.. కరోనా టెస్టులు, ఐసోలేషన్‌లో ఉంచడం.. ఇదంతా పెద్ద స్కామ్ అంటూ వీడియోలో వ్యాఖ్యానించాడా వ్యక్తి. ప్రస్తుతం ఈ వీడియో ఫేస్బుక్ ద్వారా వైరల్ అవుతోంది. మనోజ్ లాద్వా యూకేలో సెటిల్ అయిన వ్యక్తి. తన మామ అంత్యక్రియల కోసం భార్యతో పాటు లండన్ ‘హీథ్రో ఎయిర్పోర్ట్’ నుంచి విమానంలో వచ్చాడు. విమానం ఎక్కే ముందు ఆయనకు నిర్వహించిన పరీక్షల్లో నెగెటివ్ రిపోర్ట్ వచ్చింది. డిసెంబర్ 30న వర్జిన్ అట్లాంటిక్ ఫ్లయిట్లో ముంబై ఎయిర్‌పోర్ట్‌కి చేరుకున్నారు. అక్కడ ఆయనకు కరోనా సోకినట్లు నిర్ధారణ అయ్యింది. దీంతో అనుమానం వ్యక్తం చేసిన అయిన.. మరోసారి పరీక్ష నిర్వహించాలని ఎయిర్పోర్ట్ సిబ్బందిని కోరారు. అయితే అందుకు నిరాకరించిన సిబ్బంది.. ఆయన్ని ప్రభుత్వం నిర్వహించే ఓ క్వారంటైన్ సెంటర్‌కు షిఫ్ట్ చేశారు. దీంతో ఆయన అంత్యక్రియలకు హాజరుకాలేకపోయాడు. ఈ అనుభవంపై ఫేస్బుక్ లైవ్‌లో ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఓ వీడియోను అప్లోడ్ చేశాడు. ముంబై ఎయిర్‌పోర్ట్‌లో అంతా మాయగా ఉంది. విమానంలో గట్టిగా పదిహేను మంది కంటే ఎక్కువమంది లేం. దిగగానే.. అదీ గంటల వ్యవధిలో పాజిటివ్ ఎలా నిర్ధారణ అవుతుంది? లండన్ ఎయిర్‌పోర్టులు రిపోర్టులు చూపించినా నమ్మకపోతే ఎలా? ఇండిపెండెంట్ పరీక్షలకు అంగీకరించకపోవడంలో ఆంతర్యం ఏమిటో అర్ధం కావడం లేదు. ఇదో పెద్ద కుంభకోణంలా ఉంది అంటూ ఆరోపించాడాయన. నాతో పాటు మరికొందరు ప్రయాణికులు గట్టిగా సిబ్బందిని నిలదీశాం.ఇక్కడి మార్గదర్శకాలు ఇష్టం లేకపోతే.. బయట డబ్బులు కట్టి అయినా క్వారంటైన్ సెంటర్లో ఉండాలంటూ బీఎంసీ అధికారులు(Brihanmumbai Municipal Corporation) బెదిరిస్తున్నారు’’ అంటూ మనోజ్ లాద్వా ఆరోపించారు. ఇదిలా ఉంటే లాద్వా వీడియో తీసిన టైంలో.. వెనకాల మరికొంతమంది ప్రయాణికులు సెంటర్ నిర్వాహకులతో గొడవ పడుతున్నట్లు వాయిస్ వినిపించింది. అయితే ఎయిపోర్ట్ సిబ్బంది మాత్రం తాము అంతా పక్కాగా రూల్స్ ప్రకారమే ముందుకు పోతున్నట్లు చెబుతున్నారు. చదవండి: కరోనాకు రెడ్ కార్పెట్ వేసి మరీ ఘన స్వాగతం?? ఎక్కడంటే.. -
Omicron: ‘ఆస్పత్రుల సామర్థ్యాన్ని తక్షణమే పెంచండి... ఏ క్షణాన ఏం జరుగుతుందో చెప్పలేం!’
Highest ever surge in world న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా ఒమిక్రాన్ కేసులు శర వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో తమ ఆరోగ్య సంరక్షణ మౌలిక సదుపాయాలను తక్షణమే సమీక్షించాలని కోరుతూ అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్రం శనివారం లేఖలు రాసింది. ఆసుపత్రుల్లో పడకల సామర్థ్యం, హెల్త్ కేర్ సౌకర్యాలను పెంచడంతోపాటు ఆక్సిజన్ లభ్యతను క్షుణ్ణంగా పరిశీలించాలని సెక్రెటరీ రాజేష్ భూషణ్ లేఖల్లో పేర్కొన్నారు. కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో కేవలం నిన్న ఒక్క రోజులోనే (డిసెంబర్ 31న) అత్యధికంగా 16,764 కేసులు దేశంలో నమోదయ్యాయి. గత 70 రోజులతో పోల్చితే పెద్ద మొత్తంలో నమోదు కావడం ఇదే తొలిసారి. మరోవైపు ఐరోపా, అమెరికా దేశాలు గత కొన్ని వారాల్లో కొత్త కేసులు గణనీయంగా పెరిగినట్లు నివేదించాయి. తాజా పరిణామాలన్నీ కూడా వైరస్ అధిక వ్యాప్తినే సూచిస్తున్నాయని సెక్రెటరీ లేఖలో ఉటంకించారు. చదవండి: 12,580 ఎన్జీవోల లైసెన్సులు రద్దు! ఇక నో ఫారిన్ ఫండ్స్.. శనివారం ఉదయం నాటికి దేశంలో మిక్రాన్ సంఖ్య 1,431 మార్క్‌ను దాటింది. 5 రాష్ట్రాల్లో 100 కంటే ఎక్కువ కేసులు నమోదయ్యాయి. అలాగే 22,775 కోవిడ్ కేసులు నమోదుకాగా, 406 మరణాలు సంభవించాయని ఆరోగ్య శాఖ వెల్లడించింది. కేసులు అకస్మాత్తుగా పెరుగుతున్నందువల్ల హెల్త్ కేర్ ఫెసిలీటీస్ కొరత ఏర్పడవచ్చని కేంద్రం హెచ్చరించింది. ఈ నేపథ్యంలో తాత్కాలిక ఆసుపత్రులను కూడా ఏర్పాటు చేయాలని రాష్ట్రాలను కోరింది. తేలికపాటి నుండి మితమైన లక్షణాలున్న రోగుల కోసం రాష్ట్రాలు హోటల్ వసతిని కూడా వినియోగించుకోవచ్చని పేర్కొంది.హోమ్ ఐసోలేషన్‌లో ఉన్న రోగులను పర్యవేక్షించడానికి ప్రత్యేక బృందాలు, కాల్ సెంటర్లు, కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేయాలి రాష్ట్రాలను కోరింది. గ్రామీణ ప్రాంతాలు, పీడియాట్రిక్ కేసులపై కూడా స్పెషల్ ఫోకస్ పెట్టాలన్నారు. జ్వరాలు, ఒళ్లు నొప్పులతో వస్తున్న రోగులందరికీ కోవిడ్ టెస్ట్లుచేయాలని కోరింది. అంతేకాకుండా చాలా మంది ఒమిక్రాన్ రోగులు లక్షణరహితంగా ఆసుపత్రిలో చేరకుండానే కోలుకుంటున్నారు. ఐతే రోగులను సకాలంలో గుర్తించకపోతే, కుటుంబ సభ్యులకు సంక్రమణ ప్రమాదం ఎక్కువని తెల్పింది. ఈ మేరకు కోవిడ్ కేసులు ఆకస్మికంగా పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలని కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. చదవండి: మైనింగ్ జోన్లో విరిగిపడ్డ కొండ చిరియలు.. 20 మంది కార్మికులు గల్లంతు! -
ఏపీలో 16కి చేరిన ఒమిక్రాన్ కేసులు
సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌లో తాజాగా మరో పది ఒమిక్రాన్ కేసులు బయటపడ్డాయి. దీంతో ఇప్పటిదాకా ఈ కరోనా వేరియెంట్ బారినపడ్డ వారి సంఖ్య 16కి చేరింది. ఇటీవల విదేశాల నుండి వచ్చిన ప్రయాణికులకు ఒమిక్రాన్ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. తూర్పుగోదావరి లో ముగ్గురు, పశ్చిమగోదావరి, గుంటూరు, చిత్తూరు లో ఒక్కొక్కరు వేరియెంట్ బారినపడ్డారు. ఇక అనంతపురం, కర్నూల్ జిల్లాల్లో ఇద్దరి చొప్పున ఒమిక్రాన్ బారినపడ్డారు. ఈ పది మందిని ప్రస్తుతం ఐసోలేషన్ లో ఉంచి మెరుగైన చికిత్స అందిస్తున్నారు వైద్యులు. -
క్లబ్‌హౌస్‌లలో వర్క్ స్టేషన్లు
సాక్షి, హైదరాబాద్: కరోనా మహమ్మారి గృహ కొనుగోలుదారుల అభిరుచులను మార్చేసింది. విశాలమైన గృహాలతో పాటు ఐసోలేషన్ కోసం ప్రత్యేకంగా ఒక గది, ఆన్లైన్ క్లాస్‌లు, ఆఫీస్ పని చేసుకునేందుకు వీలుగా వర్క్ స్పేస్, భవిష్యత్తు అవసరాల కోసం ఎలక్ట్రిక్ చార్జింగ్ పాయింట్లు వంటివి కావాలని కోరుకుంటున్నారు. అందుకు తగ్గట్టుగానే నిర్మాణ సంస్థలు ప్రాజెక్ట్‌లను డిజైన్ చేస్తున్నాయి. గతంలో క్లబ్‌హౌస్‌లలో బాంక్వెట్ హాల్, ఇండోర్ గేమ్స్, గెస్ట్ రూమ్స్, యోగా, జిమ్, స్పా, క్రచ్ వంటి వసతులు ఉండేవి. కానీ, ఇప్పుడు వీటితో పాటు ఆఫీస్ వర్క్ స్టేషన్లు, ప్రత్యేక క్యాబిన్స్, సమావేశ గదులను ఏర్పాటు చేస్తున్నారు. ఇండోర్ గేమ్స్‌లలో కూడా షటిల్, స్క్వాష్ వంటి లగ్జరీ గేమ్స్‌కు చోటు కల్పిస్తున్నారు. బిల్టప్ ఏరియాలో 3 శాతం క్లబ్‌హౌస్ ఉండాలనే నిబంధనలను పాటిస్తూనే ఆయా అదనపు వసతులను ఏర్పాటు చేస్తున్నారు. ► వర్క్ ఫ్రం హోమ్‌తో ఉత్పాదకత పెరగడంతో చాలా వరకు కంపెనీలు కూడా దీన్నే కొనసాగిస్తున్నాయి. కొన్ని కంపెనీలు హైబ్రిడ్ మోడల్లో పనిని కేటాయిస్తున్నాయి. దీంతో గృహాలతో పాటు ఆఫీస్ స్పేస్‌కు కూడా డిమాండ్ తగ్గడం లేదు. కరోనా మహమ్మారి నేపథ్యంలో ఐసోలేషన్ అనేది అనివార్యమైన పరిస్థితి. దీంతో ఒకటే ఫ్లోర్లో నాలుగైదు ఫ్లాట్లు, ఎక్కువ మంది నివాసితులు ఉండే అపార్ట్మెంట్లకు బదులుగా ప్రధాన నగరానికి దూరమైనా సరే శివారు ప్రాంతాలలో విల్లాలను కోరుకునేవారి సంఖ్య పెరిగింది. అపార్ట్మెంట్లు, గేటెడ్ కమ్యూనిటీలలో అయితే పెద్ద సైజు ఫ్లాట్లను కొనుగోలుదారులు కోరుకుంటున్నారు. గతంలో రెండు పడక గదులలో నివసించే వాళ్లు కరోనా రెండో దశ తర్వాత మూడు పడక గదులకు మారేందుకు ఇష్టపడుతున్నారు. 1,100 చ.అ. నుంచి 1,200 చ.అ.లలోని 2 బీహెచ్‌కే నివాసితులు 1,600 నుంచి 1,800 చ.అ.ల ఫ్లాట్లకు, 2 వేల చ.అ. నుంచి 2,200 చ.అ.లోని 3 బీహెచ్‌కే వాళ్లు 2,400 నుంచి 2,500 చ.అ. పైన అపార్ట్మెంట్లకు మారాలని కోరుకుంటున్నారు. రేటు కాస్త ఎక్కువైనా సరే పెద్ద సైజు గృహాలే కావాలంటున్నారు. లిఫ్ట్, జనరేటర్ వంటివి పనిచేస్తాయో లేదో అనే అపోహ కారణంగా గతంలో హైరైజ్ అపార్ట్మెంట్లు అంటే పెద్దగా కొనుగోలుదారులు ఇష్టపడేవాళ్లు కాదు. కానీ, ఇప్పుడు హైరైజ్ భవనాలపై అవగాహన పెరిగింది. ► కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహిస్తుండటంతో నిర్మాణ సంస్థలు కూడా వాటికి తగ్గట్టుగా నిర్మాణ డిజైన్లలో మార్పులు చేస్తున్నాయి. భవిష్యత్తులో ఎలక్ట్రిక్ వాహనాల సంఖ్య పెరగనున్న నేపథ్యంలో వాటికి అవసరమైన మౌలిక వసతులను గృహ, వాణిజ్య సముదాయాలలో ఏర్పాటు చేస్తున్నారు. నివాస సముదాయాల పార్కింగ్ స్పేస్‌లలో ఎలక్ట్రిక్ చార్జింగ్ పాయింట్లు, గేటెడ్ కమ్యూనిటీలలో ప్రత్యేకంగా స్థలం కేటాయించి ఈవీ స్టేషన్లను ఏర్పాటు చేస్తున్నాయి. గతంలో పెద్ద గేటెడ్ కమ్యూనిటీలో ఏటీఎంలను ఏర్పాటు చేసిన తరహాలోనే ప్రైవేట్ వెండర్లకు ఈవీ స్టేషన్ల కోసం స్థలాన్ని కేటాయిస్తున్నాయి. పెద్ద ప్రాజెక్ట్‌లలో సెక్యూరిటీ లాబీ దగ్గరే బ్యాటరీ కార్లను ఏర్పాటు చేస్తున్నారు. దీంతో ఎవరైనా అతిథులు వస్తే అందులో ఎక్కి ప్రయాణించవచ్చు. అలాగే స్కూల్ విద్యార్థుల కోసం పికప్ డ్రాప్ కోసం వినియోగించుకోవచ్చని ఆర్వీ నిర్మాణ్ ఎండీ సీహెచ్ రామచంద్రా రెడ్డి తెలిపారు. -
అంటువ్యాధి వస్తే.. గుర్రపు బండొచ్చేది!
సాక్షి సెంట్రల్ డెస్క్: కరోనా మహమ్మారి దాడి మొదలై ఏడాదిన్నర దాటింది. వైరస్ వ్యాప్తి మొదలైన కొత్తలో పాజిటివ్ రిపోర్టు రాగానే.. అంబులెన్సుల్లో పేషెంట్లను ఐసోలేషన్ సెంటర్లకు తరలించడం.. వారి ఇళ్లు, చుట్టు పక్కల ప్రాంతాల్లో శానిటైజేషన్ వంటివి చేశారు. ఆఫీసులు, అపార్ట్మెంట్లు, షాపింగ్ మాల్స్ ముందు డిసిన్ఫెక్షన్ టన్నెళ్లు పెట్టారు. మొదట్లో మనకు ఇదంతా కొత్తగా, వింతగా అనిపించినా.. ఇంగ్లండ్‌లోని లండన్ నగరంలో సుమారు 150 ఏళ్లకు ముందే ఇలాంటివి మొదలయ్యాయి. ఎవరి కైనా, ఏదైనా అంటువ్యాధి సోకిందంటే చాలు.. అంతా హడావుడే. ఇందుకోసం ఓ భారీ ఐసోలేషన్–డిసిన్ఫెక్షన్ కేంద్రాన్నే ఏర్పాటు చేశారు. ఈ విశేషాలు ఏమిటో తెలుసుకుందామా.. ఆవిరి యంత్రాల్లో.. అందుబాటులో ఉన్న రికార్డుల ప్రకారం అంటు వ్యాధులకు సంబంధించి 1866 నుంచే లండన్‌లో డిసిన్ఫెక్షన్ చర్యలు చేపట్టేవారు. దీనికి సంబంధించి 1891లో ఏకంగా ఓ చట్టమే చేసేశారు. స్మాల్‌పాక్స్, డిఫ్తీరియా, టీబీ, స్కార్లెట్ ఫీవర్, తట్టు వంటి అంటువ్యాధులు వచ్చినా.. తీవ్రమైన దగ్గు వంటి సమస్యలు ఉన్నా.. సదరు రోగుల ఇంటికి ప్రభుత్వ గుర్రపు బగ్గీ వచ్చేది. పేషెంట్లను ఆస్పత్రులకు తరలించి, వారి ఇంటిని, వాడిన వస్తువులను డిసిన్ఫెక్ట్ చేసేవారు. అయితే వ్యాధుల తీవ్రత పెరుగుతుండటంతో.. 1893లో ఓ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. తీవ్ర ఒత్తిడితో కూడిన వేడి నీటిఆవిరిని వినియోగించి.. రోగుల బట్టలు, దుప్పట్లు, ఇతర వస్తువులను డిసిన్ఫెక్ట్ చేసేవారు. గంధకంతో స్నానం ఏదైనా అంటువ్యాధితో బాధపడుతున్న వారికి సంబంధించి మూడు దశల్లో డిసిన్ఫెక్షన్ ప్రక్రియ జరిగేది. ►బాధితులను గుర్రపు బండిలో హక్నీబరో సెంటర్‌కు తరలించేవారు. వారి దుస్తు లు, దుప్పట్లు, ఇతర సామగ్రిని కూడా తీసుకొచ్చేవారు. పేలు, ఫంగస్, ఇతర క్రిములు నాశనం అవుతాయన్న ఉద్దేశంతో.. రోగుల దుస్తులన్నీ తొలగించి వారికి సల్ఫర్ స్నానం చేయించేవారు. శుభ్రమైన ఇతర వస్త్రాలు ఇచ్చి.. స్టేషన్‌లోని ప్రత్యేక గదుల్లో వారిని ఉంచేవారు. ►రోగులకు సంబంధించిన దుస్తులు, దుప్పట్లు, ఇతర వస్తువులను ‘హైప్రెషర్ స్టీమ్ (తీవ్ర ఒత్తిడితో కూడిన నీటిఆవిరి)’యంత్రాల్లో పెట్టి.. ఫార్మాల్డిహైడ్ రసాయనం స్ప్రే చేసి డిసిన్ఫెక్ట్ చేసేవారు. డిసిన్ఫెక్షన్ చేసే వీలులేని వాటిని కొలిమిలో పడేసి కాల్చేసేవారు. ►ఇదే సమయంలో రోగి ఇల్లు, పరిసరాల్లో ఫార్మాల్డిహైడ్ రసాయనం స్ప్రే చేసి డిసిన్ఫెక్ట్ చేసేవారు. హక్నీబరో సెంటర్‌తో.. అంటువ్యాధులు విజృంభిస్తుండటంతో 1897 బ్రిటన్ ప్రభుత్వం మరో చట్టం చేసింది. ఎలుకలు, ఇతర జంతువుల ద్వారా అంటు వ్యాధులు విస్తరించిన ప్రాంతాలను డిసిన్ఫెక్ట్ చేయాలని.. ఇందుకోసం స్థానిక ప్రభుత్వాలు నిధులు ఖర్చు చేయవచ్చని ప్రకటించింది. లండన్ శివార్లలోని హక్నీ పట్టణానికి చెందిన వైద్యాధికారి జాన్కింగ్ ఈ చట్టాన్ని ఆసరాగా తీసుకుని.. 1901లో హక్నీబరో డిసిన్ఫెక్షన్ స్టేషన్‌ను ఏర్పాటు చేశాడు. అంటువ్యాధులు సోకినవారిని, వారి బట్టలు, దుప్పట్లు, ఇతర సామగ్రిని ఈ స్టేషన్‌కు తరలించేవారు. ఐసోలేషన్ తరహాలో ఒకట్రెండు రోజులు అక్కడే ఉంచుకుని పంపేవారు. సామగ్రిని డిసిన్ఫెక్ట్ చేసి ఇచ్చేవారు. వేల మందికి ట్రీట్మెంట్.. హక్నీబరో స్టేషన్ ఏర్పాటైన తొలి ఏడాది 2,800 ఇళ్లను, 24 వేలకుపైగా రకరకాల సామగ్రిని డిసిన్ఫెక్ట్ చేశారు. ఐతే ఈ స్టేషన్లో క్వారంటైన్ కావడానికి మాత్రం జనం పెద్దగా ఆసక్తి చూపలేదు. దీంతో రోగుల కోసం ఏర్పాటు చేసి న గదులను వైద్య సిబ్బందికి బసగా మార్చారు. సైనైడ్‌తో శుభ్రం చేసి.. 1934లో హక్నీబరో స్టేషన్‌ను మరో చిత్రమైన పనికి వాడారు. అంటువ్యాధులను నివారించడానికి లండన్‌లోని ఓ మురికివాడ ప్రజలను ఇతర చోటికి తరలించారు. ఈ క్రమంలో వారి ఇళ్లలోని సామగ్రి అంతటినీ ట్రక్కుల్లో నింపి.. స్టేషన్లో కొత్తగా నిర్మించి సీల్డ్ షెడ్లకు తరలించారు. షెడ్లలోకి ‘హైడ్రోజన్ సైనైడ్’వాయువును నింపి.. సామగ్రి అంతటినీ డిసిన్ఫెక్ట్ చేసి యజమానులకు అందజేశారు. ►‘హైడ్రోజన్ సైనైడ్’ విషపూరితమైనవాయువు. జర్మన్ నాజీలు రెండో ప్రపంచ యుద్ధ సమయంలో యూదులను, శత్రు సైనికులను ఇలాంటి గ్యాస్ నింపిన షెడ్లలోకి పంపి చంపేయడం గమనార్హం. ►హక్నీబరో స్టేషన్‌ను తర్వాత విదేశాల నుంచి వచ్చిన వస్త్రాలను డిసిన్ఫెక్ట్ చేయడానికి వాడారు. ►చివరిగా 1984లో స్కూలు పిల్లల తలలో పేలను డిసిన్ఫెక్ట్ చేయడానికి ఈ స్టేషన్‌ను వినియోగించారు. తర్వాత మూసేశారు. శిథిలావస్థకు చేరిన ఆ స్టేషన్ ఇప్పటికీ నిలిచే ఉంది. -
khammam: కరోనాతో ఉపాధ్యాయురాలి కన్నుమూత
సాక్షి, జూలూరుపాడు(ఖమ్మం): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం పడమటనర్సాపురం జెడ్పీ ఉన్నత పాఠశాలలో కరోనా కలకలం నెలకొంది. పాఠశాల ఉపాధ్యాయురాలు విజయలక్ష్మి.. చుంచుపల్లి మండలం ఎస్.కె.నగర్లో నివాసముంటున్నారు. శనివారం వరకు విధులు నిర్వర్తించిన ఆమెకు ఆదివారం కరోనా పాజిటివ్‌గా తేలింది. హోం ఐసోలేషన్‌లో ఉన్న విజయలక్ష్మి సోమవారం తీవ్ర అస్వస్థతకు గురికావడంతో ఆస్పత్రిలో చేరారు. చికిత్స పొందుతూ రాత్రి మృతి చెందారు. సహచర ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొంది. మెడికల్ ఆఫీసర్ డాక్టర్ భూక్యా వీరబాబు, ఎంఈవో గుగులోత్ వెంకట్ ఆధ్వర్వంలో 124 మంది విద్యార్థులు, 16 మంది ఉపాధ్యాయులు, ఇద్దరు మధ్యాహ్న భోజన వర్కర్లకు మంగళవారం కరోనా పరీక్షలు నిర్వహించారు. అందరికీ నెగెటివ్ రావడంతో ఊపిరి పీల్చుకున్నారు. చదవండి: రెండేళ్ల క్రితం ప్రేమ వివాహం.. బంగారం ఇవ్వడం ఆలస్యమైందని.. -
టోక్యో ఒలింపిక్స్: ఐసోలేషన్‌లో 63 మంది ఆస్ట్రేలియా అథ్లెట్లు...
టోక్యో: టోక్యో ఒలింపిక్స్ లో కరోనా కలకలం రేపుతుంది. నిర్వహకులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నా ఒలింపిక్ గ్రామంలో రోజు రోజుకూ కేసులు పెరుగుతున్నాయి. ఇప్పటికే కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 193కి చేరింది. యూఎస్ పోల్ వాల్టర్ సామ్ కెండ్రిక్స్‌కి కరోనా పాజిటివ్ వచ్చింది. ఆస్ట్రేలియన్ పోల్ వాల్టర్ కుర్టిస్ మార్సల్ కేన్డ్రిక్స్తో సన్నిహితంగా ఉన్నట్లు తెలిసింది. దీంతో 63 మంది ఆస్ట్రేలియా ట్రాక్ అండ్ ఫీల్డ్ అథ్లెట్ల టీమ్ మొత్తం ఐసోలేషన్‌కి వెళ్లింది. వీరందరికీ కరోనా పరీక్షలు నిర్వహించిన తర్వాతే ఒలిపింక్స్‌లో పాల్గొంటారా? లేదా? అనే విషయంపై క్లారిటీ వస్తుంది. అయితే రెండుసార్లు వరల్డ్ ఛాంపియన్ అయిన కెండ్రిక్స్, కరోనా బారిన పడడంలో టోక్యో ఒలింపిక్స్ నుంచి తప్పుకున్నాడు. ఒలింపిక్స్ జరుగుతున్న టోక్యోలో గురువారం కొత్తగా 3,865 కరోనా కేసులు నమోదైయ్యాయి. జూలై 23న మొదలైన ఒలిపింక్స్ క్రీడలు ఆగస్టు 8 వరకూ జరగనున్నాయి. -
టీమిండియా ప్లేయర్‌కు కరోనా.. బీసీసీఐ అలర్ట్!
లండన్: విరాట్ కోహ్లీ సారథ్యంలో టీమిండియా జట్టు ఇంగ్లండ్‌లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే 23 మంది ఆటగాళ్ల బృందంలో ఒకరికి కరోనా సోకింది. ఆటగాడి పేరు బయటకు వెల్లడించకపోగా.. ప్రస్తుతం అతను తన బంధువుల ఇంట్లో ఐసోలేషన్‌లో ఉన్నట్లు కథనాలు వెలువడుతున్నాయి. ఇదిలా ఉంటే స్వల్ఫ గొంతు నొప్పిగా ఉండడంతో ఆ ఆటగాడికి పరీక్షలు చేయగా కరోనా సోకినట్లు నిర్ధారణ అయ్యింది. ఆ ఆటగాడితో సన్నిహితంగా ఉన్న జట్టు సభ్యులను, సిబ్బందిని మూడురోజుల పాటు ఐసోలేషన్ వెళ్లమని వైద్య సిబ్బంది సూచించగా.. ఆ గడువు ముగిసింది. దీంతో గురువారం ఆ ఆటగాడు మినహా.. మిగతా వాళ్లంతా డర్హమ్‌కు బయలుదేరనున్నారు. ఇక బుధవారం బీసీసీఐ ప్రెసిడెంట్ గంగూలీ, చీఫ్ సెలక్టర్ చేతన్ శర్మ కోల్‌కతాలో సమావేశంకాగా, ఏం చర్చించారనే విషయంపై గోప్యతను ప్రదర్శించారు. మరోవైపు 20 రోజుల బ్రేక్ దొరికినప్పటికీ టీమిండియా ఆటగాళ్లను బయటకు వెళ్లొద్దని బీసీసీఐ సూచించినప్పటికీ.. కొందరు ఏకంగా వింబుల్డన్ టోర్నీకి హాజరయ్యారు కూడా. ఇక ఆటగాడు వైరస్ బారినపడ్డ(అసింప్టోమెటిక్ లక్షణాలు) విషయం తెలిశాక.. బీసీసీఐ సెక్రెటరీ జై షా అప్రమత్తంగా ఉండాలని మిగతా ఆటగాళ్లను ఉద్దేశించి ఓ మెయిల్ లేఖను పంపారు. ప్రస్తుతం ఇంగ్లండ్‌లో డెల్టా వేరియెంట్ కేసులు పెరుగుతుండడంతోనే ఇలా సూచించినట్లు తెలుస్తోంది. ఇంకోవైపు ఆ ఆటగాడికి వైరస్ ఎలా సోకిందనేది తేలాల్సి ఉంది. ఇదిలా ఉంటే ఆగష్టు 5వ తేదీ నుంచి టీమిండియా ఇంగ్లండ్‌తో ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ ఆడాల్సి ఉంది. ఈమధ్య పాకిస్థాన్‌లో సిరీస్ సందర్భంగా ఇంగ్లండ్ క్యాంప్‌లో కరోనా వైరస్ కలకలం చెలరేగిన విషయం తెలిసిందే. -
కొవిడ్ వార్డులో ఘోర ప్రమాదం.. ఆహుతైన 52 మంది!
Iraq Covid Ward Fire బాగ్దాద్: ఇరాక్‌లో ఓ ఆస్పత్రి కొవిడ్ వార్డులో ఘోర అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ దుర్ఘటనలో 52 మంది చనిపోగా, 22 మంది తీవ్రంగా గాయపడ్డారు. చనిపోయినవాళ్లంతా కరోనా పేషెంట్లేనని అధికారులు ధృవీకరించారు. కాగా, మంటలు, పొగ దట్టంగా అలుముకోవడంతో ప్రమాద తీవ్రత మరింతగా ఉండే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇరాక్ నస్రీయా నగరంలోని అల్ హుస్సేయిన్ ఆస్పత్రిలో సోమవారం అర్ధరాత్రి దాటాక ఈ ఘటన చోటు చేసుకుంది. ఆక్సిజన్ ట్యాంకర్లు పేలడంతోనే ఈ ఘటన జరిగిందని అధికారులు వెల్లడించారు. ఆ సమయంలో ఐసోలేషన్ వార్డులో ఉన్న పేషెంట్లంతా మంటల్లో చిక్కుకుని హాహా కారాలు చేశారు. అర్ధరాత్రి సమయం కావడంతో ఒకరిద్దరు నర్సులు తప్ప విధులు ఎవరూ లేరు. దీంతో వాళ్లను రక్షించే ప్రయత్నాలు ఫలించలేదు. కాగా, ఆ వార్డులో కెపాసిటీ 70 పడకలుగా తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఇరాక్‌లో గత మూడునెలల్లో ఇలాంటి ఘటన రెండోది ఇది. ఏప్రిల్‌లో రాజధాని బాగ్దాద్‌లో జరిగిన అగ్ని ప్రమాద ఘటనలో 82 మంది మరణించగా.. 110 మంది గాయపడ్డారు. ఇక నస్రీయా ఘటన తర్వాత భారీగా ఆస్పత్రి ముందుకు చేరుకున్న జనాలు.. ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేశారు. ప్రజల ప్రాణాలు కాపాడలేని ప్రభుత్వం అంటూ నిరసన వ్యక్తం చేశారు. -
పదేళ్లుగా ఇంట్లోనే.. బయటకు రావాలంటే సిగ్గట..!
టోక్యో: కరోనా వ్యాప్తి ప్రారంభమైన నాటి నుంచి సామాజిక దూరం, ఐసోలేషన్ మన జీవితాల్లో భాగమైంది. ఏదైనా ముఖ్యమైన పని ఉండి వేరే ప్రాంతానికి వెళ్తే.. తిరిగి వచ్చాక స్నానం చేయడం.. రెండు, మూడు రోజుల పాటు ఐసోలేషన్‌లో ఉండటం తప్పనిసరిగా మారింది. అయితే మనం కరోనా వ్యాప్తి మొదలైన తర్వాత ఇలా ఐసోలేషన్‌లో ఉంటుంటే.. కొందరు మాత్రం ఎప్పటినుంచో ఈ సామాజిక దూరాన్ని పాటిస్తున్నారు. ఏళ్ల తరబడి జనాలకు దూరంగా.. ఇంటికే పరిమితమవుతున్నారు. జపాన్‌కు చెందిన నిటో సౌజీ ఈ కోవకు చెందిన వ్యక్తే. గత పదేళ్లుగా ఇతడు ఇంట్లోనే ఉంటున్నాడు. కేవలం కటింగ్ చేయించుకోవడం కోసం మాత్రమే బయటకు వస్తున్నాడు. ఆ వివరాలు.. ప్రొఫెషనల్ ఇండీ గేమ్ డెవలపర్ అయిన సౌజీ 10 సంవత్సరాల క్రితం తన స్వస్థలమైన టోక్యోకు తిరిగి వచ్చాడు. అప్పటి నుంచి బయటకు వెళ్లడం మానేశాడు. రెండు, మూడు నెలలకోసారి కేవలం కటింగ్ చెయించుకోవడం కోసం మాత్రమే బయటకు వస్తాడు. ఇంట్లోకి కావాల్సిన వస్తువులు, దుస్తులు, ఇతరాత్ర వాటి కోసం ఆన్లైన్ షాపింగ్ మీద ఆధారపడతాడు. తనకు కావాల్సిన వాటిని ఆన్లైన్లో బుక్ చేసి.. డోర్ డెలివరీ చేయించుకుంటాడు. బయటకు వెళ్లడానికి చాలా సిగ్గుపడతాడు.. భయపడతాడు సౌజీ. సౌజీ ఒక యూట్యూబ్ చానెల్ని కూడా రన్ చేస్తున్నాడు. దీనిలో తన రోజువారి జీవితానికి సంబంధించిన వీడియోలను పోస్ట్ చేస్తాడు. మన జీవితం తెల్లవారుజాము నుంచి ప్రారంభమైతే.. సౌజీ మాత్రం రాత్రి ఎనిమిద గంటలకు తన కార్యకాలపాలను ప్రారంభించి తెల్లవారుజామున 4 గంటలకు నిద్రపోతాడు. మొదటి రెండు మూడు సంవత్సారాలు ఈ విధానం తనకు బాగా మేలు చేసిందని.. ఎంతో ఏకాగ్రతగా పని చేసుకునేవాడినన్నాడు. కానీ రాను రాను బయటకు వెళ్లాలంటే సిగ్గుగా, భయంగా అనిపించేది అన్నాడు సౌజీ. సౌజీ పాటించే జీవన విధానాన్ని ‘‘హికికోమోరి’’ అని పిలుస్తారు. అంటే సమాజం నుంచి పూర్తిగా వైదొలగి సామాజిక ఒంటరితనం, నిర్బంధంలో తీవ్ర స్థాయిని కోరుకోవడం. సాధారణంగా జపాన్‌లో సగానికి పైగా యువత, వృద్ధులు ఈ విధానాన్ని పాటిస్తున్నారు.. కానీ సౌజీ అంత కఠినంగా మాత్రం కాదు. చదవండి: Coronavirus: శ్మశానవాటికలోనే ఐసోలేషన్ -
భళారే బాలుడా..
రొంపిచెర్ల (చిత్తూరు జిల్లా): కరోనా సోకగానే సహజంగా భయపడిపోతాం. ఏమవుతుందో ఎప్పటికి కోలుకుంటామోనని కలత చెందుతాం. కానీ ఆ బాలుడుకి ఆ భయం ఏమాత్రం లేదు. ఎంచక్కా పాఠ్య పుస్తకాలు చదివేస్తూ.. ఐసొలేషన్‌లో ఉన్న సమయాన్ని అలా సద్వినియోగం చేసుకుంటున్నాడు. ఎంతో ఏకాగ్రతతో ఓ తరగతి గదిలో కూర్చుని చదువుతున్నట్టుగా ఆ పిల్లవాడు పైతరగతి పుస్తకాలు చదవడాన్ని చూసి అధికారులు సైతం ఆశ్చర్యపోతున్నారు. చిత్తూరు జిల్లా పెద్దమల్లెల పంచాయతీ నాయునిఓడ్డు దళితవాడకు చెందిన మహేష్ కుమారుడు శివమణి(13) కరోనాతో రొంపిచెర్ల ఐసొలేషన్ కేంద్రంలో చేరాడు. పెద్దమల్లెల ఉన్నత పాఠశాలలో 7వ తరగతి పూర్తిచేసిన శివమణి.. ఈ ఏడాది 8వ తరగతిలో చేరాల్సి ఉంది. అయితే విద్యార్థి ఇప్పటి నుంచే చదువుపై దృష్టి మళ్లించాడు. ఐసొలేషన్ కేంద్రానికి వెళ్లేటప్పుడు పాఠ్య పుస్తకాలు వెంట తీసుకెళ్లాడు. అంతేకాదు నిద్రలేచింది మొదలు.. పుస్తకాలు తీసి చదువుకోవడాన్ని చూసి అక్కడున్న వైద్య సిబ్బంది సైతం ముచ్చటపడుతున్నారు. ఈ సందర్భంగా ఎంపీడీవో రాజేంద్ర తదితరులు విద్యార్ధిని అభినందించారు. -
కరోనా పేషెంట్ల మరుగుదొడ్లు కడిగిన చిన్నారి.. వీడియో వైరల్
ముంబై(బుల్దానా): కరోనా పేషంట్లకు ఉపయోగిస్తున్న మరుగుదొడ్లను 8 ఏళ్ల చిన్నారితో కడిగించిన అవమానీయ ఘటన మహారాష్ట్రలో ఆలస్యంగా వెలుగు చూసింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. విషయంలోకి వెళితే.. మహారాష్ట్రలోని బుల్దానా జిల్లాలోని సంగ్రామ్పూర్ గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో మరోడ్ గ్రామంలో ఉన్న జిల్లా పరిషద్ పాఠశాలను కొద్ది రోజల క్రితం కోవిడ్ ఐసోలేషన్ సెంటర్‌గా మార్చారు. ప్రస్తుతం ఈ ఐసోలేషన్ సెంటర్లో 15 మంది కోవిడ్ పాజిటివ్ పేషెంట్లు ఉన్నారు. కాగా మే 29న ఐసోలేషన్ సెంటర్ నిర్వహణ ఎలా ఉందో చూడడానికి డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ వస్తున్నట్లు గ్రామ పంచాయతీ సిబ్బందికి సమాచారం అందింది. ఈ నేపథ్యంలో సంగ్రామ్పూర్ పంచాయతీ డెవలప్మెంట్ ఆఫీసర్లు ఇన్స్పెక్షన్ నేపథ్యంలో పాఠశాలను, పరిసరాలను శుభ్రంగా ఉంచాలని అక్కడి సిబ్బందికి ఆదేశాలు ఇచ్చారు. అయితే పనిచేయడానికి పారిశుధ్య కార్మికులు రాకపోవడంతో సెంటర్ నిర్వాహకుడు.. ఊరిలో బంధువులను చూడడానికి వచ్చిన 8 ఏళ్ల చిన్నారిని బలవంతంగా పాఠశాలకు తీసుకెళ్లాడు. కరోనా పేషంట్ల మరుగుదొడ్లను శుభ్రం చేయాలని.. లేకపోతే కట్టెతో కొడతానని బెదిరించాడు.దీంతో భయపడిన ఆ చిన్నారి మరుగుదొడ్లను ఏడుస్తూనే శుభ్రం చేశాడు. పని పూర్తయ్యాకా 50 రూపాయలు ఆ పిల్లాడి చేతిలో పెట్టి ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించి అక్కడినుంచి పంపిచేశాడు. కాగా దీనిని ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఆ వీడియోలో పిల్లాడు మరుగుదొడ్లు శుభ్రం చేస్తుంటే నిర్వాహకుడు అతనికి మరాఠిలో సూచనలు ఇవ్వడం కనిపించింది. విషయం తెలుసుకున్న అధికారులు సదరు వ్యక్తిని విధుల నుంచి తొలగించి పోలీసులకు అప్పజెప్పారు. కాగా పోలీసులు ఆ వ్యక్తిపై బాలకార్మిక చట్టం కింద కేసు నమోదు చేశారు. చదవండి: కరోనా సెకండ్ వేవ్: 624 మంది డాక్టర్లు మృతి 8 yr old school kid was forced to clean toilet of quarantine centre with 15 covid +ve patients in it; in buldhana, maharashtra. This is world's best CM @OfficeofUT 's maharashtra model. pic.twitter.com/sJXCt5aNAP — आलू बोंडा (@ek_aalu_bonda) June 1, 2021 -
కరోనా సోకిన భార్య.. భర్త చేసిన పనికి నెటిజన్లు ఫిదా..
ఐజ్వాల్: కరోనా సోకిన తన భార్యను ఆమె భర్త ఐసోలేషన్ వార్డుకు తీసుకెళ్తున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వివరాలు.. మిజోరాంకు చెందిన దంపతులలో , సదరు వ్యక్తి భార్యకు కరోనా సోకింది. సాధారణంగా కరోనా సోకిన వారికి దూరంగా ఉండాలి. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్న మహమ్మారి వెంటనే సోకుతుంది. అయితే, తన భార్యను ఐసోలేషన్ సెంటర్‌కు తీసుకెళ్లాటానికి ఆమె భర్త వినూత్నంగా ఆలోచించాడు. అతని జీప్‌కు, వెనుకల ఒక చిన్న ట్రాలీని ఏర్పాటు చేశాడు. అందులో ఆమె కూర్చివేసుకొని హాయిగా కూర్చుంది. ఇలా ఐసోలేషన్ వార్డుకు తరలించాడు. అయితే, ఈ వీడియోను ఐపీఎస్ అధికారి రిపున్ శర్మ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు. ఇప్పుడిది వైరల్‌గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు ‘వావ్.. మీ భార్య అదృష్ట వంతురాలు’, ‘ మీ తెలివికి హ్యాట్సాఫ్’, అంటూ కామెంట్లు పెడుతున్నారు. అయితే, తాజాగా మిజోరాంలో వైరస్ ఉధృతి కొనసాగుతుంది. గడచిన 24 గంటలలో 312 కొత్త కేసులు నమోదైయ్యాయి. 41 మంది చనిపోయారు. అదే విధంగా రాష్ట్రంలో 3,144 కేసులు ఆక్టివ్ గా ఉన్నాయని తెలుస్తుంది. ఇప్పటి వరకు 9,214 మంది ఈ మహమ్మారి బారినుంచి కోలుకున్నారు. చదవండి: నదిలో దూకి ఆత్మహత్యకు ప్రయత్నించిన మహిళ.. కారణం అదేనా.. చదవండి: బ్రిడ్జిపై వింత ఆకారం: పోలీసులు ఏమన్నారంటే.. -
ప్రతి గ్రామంలో కరోనా ఐసోలేషన్ సెంటర్లు
సాక్షి, అమరావతి: అవసరం మేరకు రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో కరోనా ఐసోలేషన్ సెంటర్లు ఏర్పాటు చేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సోమవారం ఆదేశాలు జారీ చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో కరోనా సోకి.. ఇంటిలో ఉండి చికిత్స పొందడానికి తగిన వసతి లేనివారి కోసం ఈ సెంటర్లను ఏర్పాటు చేయాలని పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ గిరిజాశంకర్.. అన్ని జిల్లాల కలెక్టర్లు, జెడ్పీ సీఈవోలు, డీపీవోలను ఆదేశించారు. ప్రతి చోటా పురుషులకు, మహిళలకు వేర్వేరు గదులు ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ప్రస్తుతం గ్రామాల్లో సాధారణ లక్షణాలు ఉన్నవాళ్లు ఇళ్లల్లోనే ఉండి చికిత్స పొందుతున్నారు. అయితే.. ఎక్కువ శాతం మందికి ఒకే పడక గది, ఒకే టాయిలెట్ ఉన్నాయి. దీంతో ఆ ఇంటిలో ఎవరైనా కరోనా బారినపడితే.. మిగిలిన కుటుంబ సభ్యులు దూరంగా ఉండటానికి అవకాశం ఉండటం లేదు. ఈ నేపథ్యంలో వారికి కూడా కరోనా సోకే ప్రమాదం ఉందని ప్రభుత్వం గుర్తించింది. ఈ ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని గ్రామాల్లో ప్రభుత్వ పాఠశాలలు లేదా ఇతర ప్రభుత్వ భవనాల్లో అవసరం మేరకు వెంటనే ఐసొలేషన్ సెంటర్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. గ్రామ సర్పంచ్ల పర్యవేక్షణలో.. – కరోనా ఐసోలేషన్ కేంద్రాల ఏర్పాటు, వాటిలో మౌలిక వసతుల ఏర్పాటు బాధ్యతలను ఆయా గ్రామాల సర్పంచ్‌లకు అప్పగించారు. – కరోనా లక్షణాలను గుర్తించిన వెంటనే నిర్ధారణ పరీక్ష కోసం వేచి చూడకుండా వెంటనే ఐసోలేషన్ కేంద్రానికి తరలిస్తారు. రోగులు తమ ఇంటిలోనే వేరుగా ఒక గదిలో ఉండడానికి ఇష్టపడితే అందుకు ప్రాధాన్యత ఇస్తారు. – ఐసొలేషన్ సెంటర్లో చేరేవారు ఆహారం, దుప్పట్లు, సబ్బు, బ్రష్, మందులు వంటివాటిని వారే తెచ్చుకోవాల్సి ఉంటుంది. – దాతలు, స్వచ్ఛంద సంస్థలు ముందుకొచ్చే చోట రోగులకు పౌష్టికాహారం అందజేస్తారు. – రోగుల ఆరోగ్య పరిస్థితిని ఏఎన్ఎంలు నిరంతరం పర్యవేక్షిస్తారు. ప్రతి ఒక్కరి ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు ఒక రిజిస్టర్లో నమోదు చేసుకొని.. స్థానిక పీహెచ్సీ వైద్యుడికి సమాచారం అందిస్తారు. – పీహెచ్సీ వైద్యుడు వారంలో రెండు రోజులు ఐసొలేషన్ కేంద్రాన్ని సందర్శించి రోగుల ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుంటారు. – ఎవరికైనా అత్యవసర చికిత్స అందించాల్సిన పరిస్థితి ఏర్పడితే అప్పటికప్పుడు అంబులెన్స్ ద్వారా వారిని సమీపంలోని ఆస్పత్రిలో చేర్చుతారు. – కాగా.. ఇంటిలోనే ఉంటూ చికిత్స పొందుతున్న వారి ఇళ్లకు హోం ఐసోలేషన్ స్టిక్కర్లను ఏర్పాటు చేస్తారు. – ఐసొలేషన్ కేంద్రాల్లో రోజూ సోడియం హైపోక్లోరైట్ ద్రావణాన్ని పిచికారీ చేస్తారు. – గ్రామంలో కరోనా కేసుల సంఖ్య జీరోకు చేరే వరకు ఐసోలేషన్ కేంద్రాలను కొనసాగించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. – ఐసోలేషన్ కేంద్రాల పర్యవేక్షణకు పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ కార్యాలయంలో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేశారు. జిల్లా, మండలాల వారీగా ఎన్ని గ్రామాల్లో ఐసోలేషన్ కేంద్రాలు ఏర్పాటు చేశారు.. వాటిలో ఎంత మంది చేరారు వంటి వివరాలను వారానికి రెండుసార్లు కమిషనర్ కార్యాలయానికి పంపాలి. -
Isolation centre: ఊరు బాగుండాలని..
ఆత్మకూరు: గ్రామం బాగుండాలి.. అందరూ ఆరోగ్యంగా ఉండాలనే సంకల్పంతో వరంగల్ రూరల్ జిల్లా ఆత్మకూరు సర్పంచ్ పర్వతగిరి రాజు కోవిడ్ బాధితుల కోసం సొంతంగా ఐసోలేషన్ సెంటర్ ఏర్పాటు చేశాడు. గ్రామంలో యాక్టివ్ కేసులను తగ్గించడానికి ఇదే సరైన మార్గమని భావించిన ఆయన.. స్థానిక సెయింట్ థెరిస్సా స్కూల్లో ఐసోలేషన్ కేంద్రం ఏర్పాటు చేశాడు. ఆదివారం రాత్రి నుంచి ఈ కేంద్రంలో పూర్తి సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఇక్కడ ఉండే వారికి ఉదయం పాలు, అల్పాహారం, మధ్యాహ్నం చికెన్‌తో, రాత్రికి శాఖాహారంతో భోజనం అందించనున్నారు. కాగా, కోవిడ్ వచ్చినవారి ఇళ్లలో ఐసోలేషన్ సదుపాయం లేక ఇబ్బందిపడుతున్నారని సర్పంచ్ రాజు తెలిపారు. చదవండి: కరోనా బాధితుల కోసం ఉచిత అంబులెన్సులు -
Coronavirus: శ్మశానవాటికలోనే ఐసోలేషన్
సాక్షి ప్రతినిధి మహబూబ్‌నగర్/నవాబుపేట: మహబూబ్‌నగర్ జిల్లా నవాబుపేట మండలం కిష్టంపల్లి తండావాసులు అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. కోవిడ్ మహమ్మారి వ్యాప్తి చెందకుండా కొత్తగా నిర్మించిన వైకుంఠధామాన్ని ఐసోలేషన్ కేంద్రంగా ఉపయోగించుకోవాల ని నిర్ణయించారు. తండావాసులంతా మూకుమ్మడిగా నిర్ణయం తీసుకొని పకడ్బందీగా అమలు చేస్తున్నారు. మొత్తం 360 మంది జనాభా ఉన్న ఈ తండాలో మొదట ఇద్దరికి కరోనా పాజిటివ్‌గా తేలింది. వైరస్ వాప్తి చెందితే.. మరింత ప్రమాదం ముంచుకొస్తుందని భావించారు. దీంతో అందరూ కోవిడ్ నిర్ణారణ పరీక్షలు చేయించుకున్నారు. ఇందులో ఆరుగురు వైరస్ బారిన పడ్డారు. ప్రస్తుతం వీరందరూ ఆ వైకుంఠధామంలోనే ఉంటూ చికిత్స తీసుకుంటున్నారు. నాలుగు రోజులుగా అక్కడే ఐసోలేషన్‌లో ఉండగా.. మొదట్లో తండావాసులు రెండు పూటలా భోజనం సమకూర్చారు. ప్రస్తుతం రుద్రారానికి చెందిన యువత వీరికి నిత్యం ఆహారం సమకూరుస్తూ సేవలందిస్తోంది. వైకుంఠధామంలో ఉంటున్న పాజిటివ్ బాధితులకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టినట్లు కిష్టంపల్లి సర్పంచ్ శ్రీనివాస్ తెలిపారు. చదవండి: కరోనా: ఆ కళ్లు మమ్మల్ని నిలదీస్తున్నాయి -
పల్లెల్లోనే ఎక్కువగా కరోనా పాజిటివ్
సాక్షి, అమరావతి: కరోనా పాజిటివ్ కేసుల నేపథ్యంలో పల్లెటూళ్లు జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. మే 7వ తేదీ నుంచి 14వ తేదీ వరకూ గణాంకాలను తీసుకుంటే పట్టణాల్లో కంటే గ్రామీణ ప్రాంతాల్లో పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగింది. కానీ మరణాలు మాత్రం ఇప్పటికీ పట్టణాల్లోనే ఎక్కువగా ఉన్నాయి. రికవరీ శాతం కూడా పల్లెటూళ్లలోనే ఎక్కువగా ఉన్నట్టు వెల్లడైంది. మే 7 నుంచి 14వ తేదీ నాటికి 355 క్లస్టర్లను ఏర్పాటు చేయగా.. ప్రస్తుతం మొత్తం 4,792 క్లస్టర్లున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఫీవర్ సర్వే జరగనుండటంతో ముందస్తుగా బాధితులను గుర్తించి ఐసొలేషన్ చేసేందుకు వీలు కలుగుతుంది. రాష్ట్రవ్యాప్తంగా ఫీవర్ సర్వే కోసం 19 వేల మంది ఏఎన్ఎంలు, 40 వేల ఆశా కార్యకర్తలు పనిచేయనున్నారు. -
హైదరాబాద్‌లో కిక్కిరిసిపోతున్న ఐసోలేషన్ కేంద్రాలు
సాక్షి, సిటీబ్యూరో: బాలాపూర్ సమీపంలోని బడంగ్పేట్లో ఓ ఇంటి పెద్దకు కొద్ది రోజుల క్రితం కరోనా సోకింది. ఇల్లు చిన్నది కావడంతో కొద్దిపాటి జాగ్రత్తలు పాటిస్తూ కుటుంబ సభ్యులంతా ఒక్కచోటే ఉన్నారు. వ్యాధి తీవ్రం కావడంతో బాధితుడిని ఆస్పత్రికి తరలించారు. కొద్ది రోజుల వ్యవధిలోనే అతని తల్లితో పాటు, భార్య, ఇద్దరు పిల్లలు కూడా కోవిడ్ బారిన పడ్డారు. మొదట్లోనే అతన్ని ఏదైనా ఐసోలేషన్ కేంద్రానికి తరలిస్తే మిగతా వాళ్లకు వైరస్ ముప్పు తప్పేది. గ్రేటర్లో చాలా వరకు మహమ్మారి ఇదే విధంగా విస్తరిస్తోంది. తగినన్ని సెంటర్లు లేకపోవడంతో.. గతేడాది కోవిడ్ బాధితులను కుటుంబ సభ్యుల నుంచి వేరు చేసి ఐసోలేషన్ కేంద్రాలకు తరలించడంతో ఉద్ధృతి కొంత వరకు తగ్గుముఖం పట్టింది. కానీ ఈసారి కోవిడ్ విజృంభణకు తగిన విధంగా ఐసోలేషన్ కేంద్రాలు లేకపోవడంతో వైరస్ బారిన పడిన వాళ్లంతా ఇళ్లలోనే ఉండిపోవాల్సి వస్తోంది. ఇళ్లలో ప్రత్యేక గదులు ఉన్నవాళ్లు హోం ఐసోలేషన్‌లో ఉండి స్వస్థత పొందుతున్నారు. రెండు గదుల ఇళ్లు, సింగిల్ బెడ్రూం ఇళ్లలో నివసించే కుటుంబాల్లో ఏ ఒక్కరికి వైరస్ సోకినా ఇంటిల్లిపాదికీ వేగంగా వ్యాపిస్తోంది. సెకండ్ వేవ్‌లో కేసులు భారీగా పెరగడానికి తగినన్ని ఐసోలేషన్ కేంద్రాలు అందుబాటులో లేకపోవడమే కారణమని వైద్యులు కూడా స్పష్టం చేస్తున్నారు. బస్తీల్లో మహమ్మారి.. నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న మురికివాడలు, బస్తీల్లో మహమ్మారి ఆక్టోపస్‌లా విస్తరిస్తోంది. బస్తీల్లో నివసించే పేద ప్రజలంతా చిన్న చిన్న ఇళ్లలో ఉండడం, కోవిడ్ సోకిన వారిని విడిగా ఉంచేందుకు ఎలాంటి సదుపాయం లేకపోవడమే కారణమని స్వచ్ఛంద సంస్థలు విశ్లేషిస్తున్నాయి. మలక్‌పేట్, చాదర్‌ఘాట్, నల్లకుంట, టోలిచౌకి, ఫలక్‌నుమా, సికింద్రాబాద్, బేగంపేట్ తదితర ప్రాంతాల్లోని వందలాది బస్తీల్లో జనం సరైన గాలి, వెలుతురు లేని ఇళ్లలో నివసిస్తున్నారు. ఇవే కోవిడ్‌కు అడ్డాలుగా మారుతున్నాయి. సుమారు 1,450కి పైగా బస్తీల్లో నివసిస్తున్న 60 శాతం ఇళ్లలో కోవిడ్ బాధితులు ఉన్నట్లు మానవ హక్కుల వేదిక ఆందోళన వ్యక్తం చేసింది. ‘వాళ్లంతా పేద ప్రజలు. ఏ రోజుకు ఆ రోజు పని చేసుకొని బతికేవాళ్లు. వైరస్ సోకితే ఎక్కడికి వెళ్లాలో.. ఏం చేయాలో కూడా తెలియదు’ అని మానవ హక్కుల వేదిక ప్రతినిధి ఎస్.జీవన్‌కుమార్ విస్మయం వ్యక్తం చేశారు. డిమాండ్ అనూహ్యం.. కోవిడ్ బాధితులకు ప్రత్యేక గదులు అందుబాటులో లేనప్పుడు వారిని వెంటనే ఐసోలేషన్ కేంద్రాలకు తరలించడంతో ఇంటిల్లిపాదికీ వైరస్ సోకకుండా చూడవచ్చు. ప్రస్తుతం రామంతాపూర్ ప్రభుత్వ హోమియో కళాశాల, ఎర్రగడ్డ ఆయుర్వేద ఆస్పత్రి, బల్కంపేట్ నేచర్‌క్యూర్ ఆస్పత్రుల్లోని ఐసోలేషన్ కేంద్రాలు నిండిపోయాయి. ప్రభుత్వ, ప్రైవేట్ దవాఖానాలు కిక్కిరిసిపోతున్నాయి. మరోవైపు రోజు రోజుకూ ఐసోలేషన్ కేంద్రాలకు డిమాండ్ పెరుగుతూనే ఉంది. స్థానికంగా ఉంటేనే మేలు... ఈ పరిస్థితుల్లో ఎక్కడికక్కడ ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లు, హాస్టళ్లు, ఫంక్షన్ హాళ్లు, కమ్యూనిటీ హాళ్లలో ఐసోలేషన్ కేంద్రాలు ఏర్పాటు చేయవచ్చు. దీనివల్ల కోవిడ్ బాధితులు తమకు సమీపంలోని ఐసోలేషన్ సెంటర్‌కు వెళ్లి చికిత్స పొందవచ్చు. అదే సమయంలో అతని నుంచి ఇతరులకు వ్యాపించకుండా నిరోధించినట్లవుతుంది. పైగా ఇంటికి కొద్ది దూరంలోనే ఐసోలేషన్ సదుపాయం ఉండడంతో ఎక్కడో దూరంగా ఉన్నామనే భయాందోళనలు ఉండవు. ప్రభుత్వం చర్యలు చేపట్టాలి.. కోవిడ్ బాధితుల అవసరాలకు సరిపడా ఐసోలేషన్ కేంద్రాలను స్థానికంగా ఉన్న స్కూళ్లు, హాస్టళ్లలో ఏర్పాటు చేయాలి. ఇందుకోసం చర్యలు తీసుకోవాలి. ఏ మాత్రం ఆలస్యం చేసినా మహమ్మారి అంతంతకు విజృంభిస్తూనే ఉంటుంది. – ఎస్.జీవన్‌కుమార్, హెచ్ఆర్ఎఫ్ సేవలు సులభతరం.. కోవిడ్ బాధితులకు ఆహారం, మందులు అందజేసేందుకు ఇంటింటికీ వెళ్లడం కష్టంగా ఉంది. ఎక్కడికక్కడ స్థానికంగా ఐసోలేషన్ కేంద్రాలు ఉంటే నేరుగా అక్కడికే వెళ్లి వాళ్లకు కావాల్సినవి అందజేయవచ్చు. – ప్రశాంత్ మామిడాల, ఫీడ్ ద నీడ్ పర్యవేక్షణ బాగుంటుంది.. స్వచ్ఛంద సంస్థల సేవలతో పాటు డాక్టర్లు, ఆరోగ్య కార్యకర్తలు, ఇతర సిబ్బంది ఒకేచోట ఎక్కువ మందిని పర్యవేక్షించేందుకు అవకాశం లభిస్తుంది. పేషెంట్లు త్వరగా కోలుకొని ఇళ్లకు వెళ్లగలుగుతారు. – వినయ్ వంగాల -
తెలంగాణలో రెండు వారాల్లో లక్ష కేసులు
రంగారెడ్డి జిల్లా యాచారానికి చెందిన ఎం.కృష్ణయ్య రెండ్రోజులుగా తీవ్ర జ్వరం, తలనొప్పితో బాధపడుతూ శుక్రవారం స్థానిక పీహెచ్సీలో కరోనా నిర్ధారణ పరీక్షకు వెళ్లాడు. ఉదయం 11 గంటలకు వెళ్ళిన అతనికి అప్పటికే పరీక్షలు పూర్తయినట్లు సిబ్బంది చెప్పారు. కిట్లు తక్కువగా ఉన్నందున 25 మందికి మాత్రమే పరీక్షలు చేస్తున్నామని, రేపు ఉదయం 9 గంటల కల్లా వస్తే పేరు నమోదు చేసుకుని పరీక్ష చేస్తామని చెప్పడంతో తిరుగుముఖం పట్టాడు. చైతన్యపురికి చెందిన పి.శ్రీనివాస్‌కు మూడు రోజులుగా జ్వరంతో పాటు దగ్గు వస్తోంది. దీంతో పక్కనే ఉన్న సరూర్‌నగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పరీక్షకు వెళ్ళాడు. ఉదయం 10 గంటలకే అక్కడ రెండొందల మందికి పైగా పరీక్షల కోసం నిరీక్షిస్తున్నారు. కొంతసేపటికి వైద్య సిబ్బందిలో ఒకరు బయటకు వచ్చి ఈ రోజు 50 మందికి మాత్రమే పరీక్షలు చేస్తున్నామని, ఇప్పటికే పేర్లు నమోదు చేసుకున్నామని చెప్పారు. మిగిలినవాళ్లు రేపు రావాల్సిందిగా సూచించడంతో శ్రీనివాస్ దిల్‌సుఖ్‌నగర్‌లోని ఓ ప్రైవేటు ల్యాబ్‌లో టెస్ట్ కోసం ఆన్లైన్లో బుక్ చేసుకున్నాడు. చదవండి: (వైరస్‌కు శక్తి పెరిగింది.. ఎయిర్ బోర్న్‌గా రూపాంతరం చెందింది) సాక్షి, హైదరాబాద్: కరోనా రాష్ట్రంలో విస్తృతంగా వ్యాపిస్తోంది. గడచిన రెండు వారాల్లోనే లక్షకు పైబడి కేసులు నమోదు కావడం వైరస్ వ్యాప్తి వేగాన్ని స్పష్టం చేస్తోంది. కరోనాకు కళ్ళెం వేసేందుకు పెద్దసంఖ్యలో పరీక్షలు నిర్వహించాలని కేంద్రం సూచిస్తుండగా... రాష్ట్రంలో మాత్రం కోవిడ్–19 నిర్ధారణ టెస్టులు రోజురోజుకూ తగ్గిపోతున్నాయి. కిట్ల కొరతే ఇందుకు కారణమని వైద్య, ఆరోగ్య శాఖ చెబుతోంది. ఈ నేపథ్యంలో టెస్టుల కోసం వందల సంఖ్యలో పరీక్షా కేంద్రాల వద్ద ప్రజలు పడిగాపులు కాస్తున్నా.. ఒక్కో కేంద్రంలో కేవలం పదుల సంఖ్యలో మాత్రమే పరీక్షలు చేసి చేతులెత్తేస్తున్నారు. దీంతో లక్షణాలున్న వారు సైతం సకాలంలో పరీక్షలు చేయించుకోలేకపోతున్నారు. వైరస్ సోకిందీ లేనిదీ నిర్ధారణ కాక కొందరు సాధారణ జీవనాన్ని కొనసాగించడం.. కుటుంబసభ్యులకు, ఇతరులకు వ్యాపించేందుకు కారణమవుతోంది. ఏప్రిల్ 23వ తేదీ నుంచి ఈనెల 6వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా 1,148 పరీక్షా కేంద్రాల్లో 11,42,096 కోవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. ఇందులో 1,01,966 మందికి వైరస్ నిర్ధారణ అయ్యింది. పాజిటివిటీ రేటు 8.927 శాతంగా నమోదయ్యింది. చదవండి: (చైనాకు కలిసొస్తున్న కరోనా..!) కిట్ల కొరతతో సతమతం వైద్య, ఆరోగ్య శాఖకు కోవిడ్–19 నిర్ధారణ కిట్ల కొరత ఇబ్బందిగా మారింది. ప్రస్తుతం వైరస్ వ్యాప్తి తీవ్రం కావడంతో పరీక్షల కోసం వందల సంఖ్యలో కేంద్రాల వద్ద అనుమానితులు బారులు తీరుతున్నారు. శుక్రవారం హైదరాబాద్‌లోని సరూర్‌నగర్ పరీక్షా కేంద్రానికి 200 మందికి పైగా పరీక్షల కోసం రాగా.... కేవలం 50 మందికి మాత్రమే పరీక్షలు నిర్వహించారు. కిట్లు లేవని, మిగతావారు రేపు రావాలని సూచించారు. రంగారెడ్డి జిల్లా యాచారం పరీక్షా కేంద్రంలో కేవలం 25 మంది నుంచి మాత్రమే నమూనాలు తీసుకున్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో కూడా 25–50 పరీక్షలకు మాత్రమే పరిమితమవుతున్నారు. ప్రభుత్వ పరీక్షా కేంద్రాల్లో అన్నిచోట్లా ర్యాపిడ్ టెస్టులే చేస్తున్నారు. ఆర్టీపీసీఆర్ పరీక్షలు దాదాపు నిలిచిపోయాయి. వారం క్రితం వరకు అన్ని ప్రభుత్వ కేంద్రాల్లో ఆవశ్యకతను బట్టి ఆర్టీపీసీఆర్ శాంపుల్స్ తీసుకుని ప్రభుత్వ కేంద్రాలకు పంపి పరీక్షలు నిర్వహిస్తుండగా... ఇప్పుడు 21 కేంద్రాలతో పాటు అన్నిచోట్లా ఈ నమూనాల స్వీకరణకు మంగళం పాడారు. మరోవైపు సెలవు దినాల్లో పరీక్షల సంఖ్య గణనీయంగా తగ్గుతోంది. రోజూ నిర్వహిస్తున్న పరీక్షల్లో సగటున సగం మాత్రమే చేస్తున్నారు. గణనీయంగా తగ్గిన పరీక్షలు రెండు వారాల క్రితం రోజుకు లక్షకు పైబడి నమూనాలను పరీక్షించి ఫలితాలను ప్రకటించిన వైద్య, ఆరోగ్య శాఖ... ప్రస్తుతం 70 వేల నమూనాలను మాత్రమే సేకరిస్తోంది. అందులో కూడా 5 నుంచి 8 శాతం నమూనాల ఫలితాలను పెండింగ్‌లో ఉంచుతోంది. రాష్ట్రవ్యాప్తంగా 1,148 కేంద్రాల్లో కోవిడ్–19 నిర్ధారణ పరీక్షలకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఇందులో ప్రభుత్వ కేంద్రాలు 1,085 ఉండగా.. మరో 63 ప్రైవేటు సంస్థలకు చెందినవి. ప్రభుత్వం నిర్వహిస్తున్న వాటిలో 21 కేంద్రాల్లో ఆర్టీపీసీఆర్ పరీక్షలు నిర్వహిస్తుండగా... 1,064 కేంద్రాల్లో ర్యాపిడ్ యాంటిజన్ పరీక్ష (ర్యాట్)లు చేస్తున్నారు. ఇక ప్రైవేటు కేంద్రాల్లో దాదాపు ఆర్టీపీసీఆర్ పరీక్షలే చేస్తున్నారు. ఏప్రిల్ నెలలో మూడో వారం నాటికి రోజుకు లక్షకు పైగా నమూనాలను తీసుకుని పరీక్షించి ఫలితాలు ప్రకటించగా.. ఆ తరువాత నుంచి 50 వేల నుంచి 70 వేల నమూనాలను మాత్రమే తీసుకుని అందులో 95 శాతానికి సంబంధించి ఫలితాలు ప్రకటిస్తున్నారు. గడిచిన రెండు వారాల్లో ప్రభుత్వ పరీక్షా కేంద్రాల్లో 8,89,902, ప్రైవేటు కేంద్రాల్లో 2,52,194 పరీక్షలు నిర్వహించారు. దీనిని బట్టి చూస్తే ఒక్కో కేంద్రంలో రోజుకు సుమారు 70 నమూనాలను మాత్రమే స్వీకరిస్తున్నట్లు స్పష్టమవుతోంది. -
కరోనా కాదు.. ముందు భయాన్ని వీడండి.. థింక్ పాజిటివ్
సాక్షి, గాంధీఆస్పత్రి( హైదరాబాద్): మనోధైర్యంతో కరోనా మహమ్మారిని జయించారు.. నాలుగు గోడల మధ్య ఒంటరిగా హోంక్వారంటైన్లో ఉంటూ పాజిటివ్ దృక్పథంతో ఆలోచించడంతో కోవిడ్ నెగిటివ్ వచ్చింది. ప్రైవేటు, కార్పొరేట్ ఆస్పత్రుల చుట్టూ తిరిగి లక్షల రూపాయలు ఖర్చు చేయకుండా చిన్న చిట్కాలతో కరోనాను చిత్తు చేశారు. ప్రతిరోజూ ప్రాణాయామం, యోగాతోపాటు బ్రీతింగ్ ఎక్సర్సైజ్లు చేసి శ్వాస సంబంధ సమస్యలు అధిగమించారు. కుటుంబసభ్యులు, బంధువులతో వీడియో కాలింగ్, ఛాటింగ్ చేస్తూ ఒంటరితనాన్ని దూరం చేస్తూ ఆనందంగా గడిపారు. తేలికపాటి వ్యాయామాలు చేస్తూ ఆక్సిజన్ సాచ్యురేషన్ లెవల్స్ తగ్గకుండా చూసుకున్నారు. వేడినీళ్లు మాత్రమే తాగుతూ, ఉప్పు, పసుపు వేసిన నీటిని గొంతులో పోసుకుని గార్గిల్ చేస్తూ, రెండు పూటలా ఆవిరిపట్టారు. గదిలో ఒంటరిగా ఉన్నామనే భావన మనసులోకి రానీయకుండా, ఒత్తిడి కలిగించే అంశాలను ఆలోచించకుండా, కుటుంబసభ్యుల సహాయ సహకారాలతో క్వారంటైన్‌ను మామూలు రోజుల్లాగే కామన్‌గా గడిపారు. గడువు ముగిసిన తర్వాత నిర్వహించిన వైద్యపరీక్షల్లో నెగిటివ్ రావడంతో కరోనాను జయించి సంపూర్ణ ఆరోగ్యవంతులుగా మారారు. హోంఐసోలేషన్లో ఉంటూ కరోనాపై విజయం సాధించిన పలువురు సలహాలు, సూచనలతోపాటు తమ అభిప్రాయాలను ‘సాక్షి’తో పంచుకున్నారు. ధైర్యమే బతికించింది నా వయసు 65 ఏళ్లు.. మాది ఉమ్మడి కుటుంబం. స్వల్ప అస్వస్థతకు గురికావడంతో కుటుంబసభ్యులు ఆందోళనకు గురయ్యారు. టెస్ట్ చేయిస్తే కరోనా పాజిటివ్ వచ్చింది. ఆస్పత్రిలో జాయిన్ చేస్తామంటే వద్దని, హోంఐసోలేషన్లో ఉంటానని చెప్పాను. తర్వాత కుటుంబ సభ్యుల్లో ముగ్గురికి పాజిటివ్ వచ్చింది. నలుగురం కలిసి అపార్ట్మెంట్ ఫ్లాట్‌లో ఉన్నాం. పల్స్ ఆక్సిమీటర్ తెప్పించుకున్నా. ప్రతిరోజు ఉదయం ప్రాణాయామం, యోగా సాధన. కుటుంబసభ్యులు, బంధుమిత్రులతో వీడియో కాలింగ్, చాటింగ్ చేసుకుంటూ ఆనందంగా గడిపాను. 14 రోజుల తర్వాత టెస్ట్ చేయించుకుంటే అందరికీ నెగిటివ్ వచ్చింది. – మణెమ్మ, శ్రీనివాసనగర్, సీతాఫల్మండి భయాందోళన వద్దు కరోనా పాజిటివ్ వస్తే భయాందోళన వద్దు. గతనెల 5వ తేదీన నాకు, మానాన్న నర్సింగ్‌రావుకు ఒకేరోజు జ్వరం వచ్చింది. ట్యాబ్లెట్లు వేసుకున్నాక జ్వరం తగ్గింది. వైద్యుల సూచన మేరకు కరోనా ర్యాపిడ్ టెస్ట్ చేయించుకుంటే పాజిటివ్ వచ్చింది. హోంక్వారంటైన్లో ఉండాలని నిర్ణయించుకున్నాం. మా నాన్న అందించిన ధైర్యంతో భయాన్ని పోగొట్టింది. ఆవిరి పట్టడం, కషాయం తాగడం, పోషకాహారం తినడంతోపాటు మనసుకు ఉత్సాహాన్ని ఇచ్చే సంగీతం, పాటలు వింటూ ఆనందంగా గడిపాం. అమ్మ సహకారంతో హోంక్వారంటైన్ పూర్తిచేశాం. తర్వాత నిర్వహించిన పరీక్షల్లో నెగిటివ్ వచ్చింది. – లక్ష్మీప్రియ, ప్రైవేటు ఎంప్లాయి, న్యూబోయిగూడ జాగ్రత్తలు పాటించా.. నేను కోవిడ్ నోడల్ కేంద్రమైన గాంధీ ఆస్పత్రిలో నాల్గవ తరగతి కాంట్రాక్ట్ ఉద్యోగిని. కరోనా బాధితుల మధ్యే సేవలు అందిస్తుంటాను. ఈ క్రమంలో స్వల్ప అస్వస్థతకు గురికావడంతో టెస్ట్ చేయించుకుంటే పాజిటివ్ వచ్చింది. ఇంట్లో భార్యతోపాటు ముగ్గురు చిన్నపిల్లలు, వృద్ధురాలైన అమ్మ ఉన్నారు. గాంధీ సూపరింటెండెంట్ రాజారావు, నోడల్ అధికారి ప్రభాకర్‌రెడ్డి ఇతర వైద్యులు ఆస్పత్రిలో బాధితులకు ఇచ్చే కౌన్సిలింగ్ గుర్తుకు వచ్చింది. అవసరమైతేనే ఆస్పత్రికి రావాలి. జాగ్రత్తలు పాటిస్తే సులభంగా తగ్గిపోతుంది. ఆ మాటలు గుర్తొచ్చి 14 రోజులు హోంక్వారంటైన్లో ఉన్నాను. ఇప్పుడు కరోనా నెగిటివ్ వచి్చంది. – గణపతి, గాంధీఆస్పత్రి స్టాఫ్ మెదడులో హార్మోన్ల సంఖ్య తగ్గి.. తీవ్రమైన భయాందోళనకు గురికావడం వల్లే కరోనా మృతుల సంఖ్య నానాటికీ పెరుగుతోంది. ఒత్తిడి పెంచే అంశాలు వలన మెదడులోని హార్మోన్ల సంఖ్య తగ్గి శరీర అవయవాలు సక్రమంగా పనిచేయవు. సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న వాటిని గుడ్డిగా నమ్మవద్దు. ముక్కులో నిమ్మరసం పిండుకుంటే కరోనా తగ్గుతుందని వీడియోను చూసిన ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. కరోనా బాధితులు మధుర క్షణాలను మాత్రమే గుర్తుచేసుకుని ఆనందంగా ఉండాలి. గాంధీ ఆస్పత్రిలో ప్రతిరోజూ వందలాది మంది బాధితులకు కౌన్సిలింగ్ నిర్వహించి వారి ఆలోచన విధానంలో మార్పు తెచ్చి స్వస్థత చేకూర్చేందుకు కృషి చేస్తున్నాం. – జూపాక అజయ్‌కుమార్, సైకియాట్రిస్ట్ ( చదవండి: ఆక్సిజన్ కొరత లేదు.. కరోనా కంట్రోల్లోనే: సీఎస్ ) -
Home Isolation: హోం ఐసొలేషన్‌లోనే లక్ష మందికి పైగా
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో తాజా గణాంకాల ప్రకారం.. లక్ష మందికిపైగా కోవిడ్ బాధితులు హోం ఐసొలేషన్‌లో చికిత్స పొందుతున్నారు. వీళ్లందరినీ ఆశా కార్యకర్తలు, ఏఎన్ఎంలు నిత్యం పర్యవేక్షిస్తున్నారు. వీరితోపాటు 104 కాల్‌సెంటర్ వైద్యులు కూడా ఫోన్ ద్వారా ఆరోగ్య సమాచారం తెలుసుకుంటున్నారు. అంతేకాకుండా సూచనలు, సలహాలు అందిస్తున్నారు. మరోవైపు కోవిడ్ కేర్ సెంటర్లకు వచ్చేవారి సంఖ్య పెరుగుతోంది. ప్రస్తుతం 9,937 మంది బాధితులు కోవిడ్ కేర్ సెంటర్లలో ఉన్నారు. ప్రస్తుతమున్న 1.50 లక్షల యాక్టివ్ కేసుల్లో 37,760 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. కోవిడ్ కేర్ సెంటర్లకు వచ్చే వారి సంఖ్య పెరిగితే.. ఆస్పత్రులపై భారం తగ్గుతుందని వైద్యులు చెబుతున్నారు. కోవిడ్ లక్షణాలు బయటపడగానే జాప్యం చేయకుండా 104కు కాల్ చేసి మందుల వివరాలు తెలుసుకోవడం లేదంటే కోవిడ్ కేర్ సెంటర్‌కు రావాలని సూచిస్తున్నారు. మానసిక ఆందోళనతోనే చాలామంది ఆస్పత్రులకు వస్తున్నారని అంటున్నారు. తాజా గణాంకాల ప్రకారం రాష్ట్రంలో 558 ఆస్పత్రులు కోవిడ్ చికిత్స అందిస్తుండగా.. 44,559 పడకలు అందుబాటులో ఉన్నాయి. ఆయాసం ఎక్కువ ఉంటేనే ఆస్పత్రులకు.. సాధారణ మందులు వాడి చాలా మంది కరోనా నుంచి కోలుకున్నారు. కరోనా గురించి ఎక్కువగా ఆందోళన చెందొద్దు. మానసికంగా కుంగిపోవద్దు. ఆయాసం ఎక్కువగా ఉంటేనే ఆస్పత్రులకు వెళ్లండి. –డా.సి.ప్రభాకర్‌రెడ్డి, హృద్రోగ నిపుణులు, కర్నూలు ప్రభుత్వాస్పత్రి -
వంద పడకలు.. ముగ్గురే బాధితులు
రామంతాపూర్: ఉప్పల్ సర్కిల్లోని రామంతాపూర్, ఉప్పల్, హబ్సిగూడ, చిలుకానగర్ డివిజన్లకు చెందిన వందలాది మంది ప్రతిరోజు స్థానికంగా ఉన్న ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, పట్టణ ఆరోగ్య కేంద్రంతో పాటు బస్తీ దవాఖానాలో కరోనా పరీక్షలు చేసుకుంటున్నారు. చాలా మంది కోవిడ్ బాధితులు హోం ఐసోలేషన్‌లో ఉంటే ఇతర కుటుంబ సభ్యులకు కూడా కోవిడ్ సోకే అవకాశం ఉందని రామంతాపూర్ ప్రభుత్వ హోమియో ఆస్పత్రిలో వంద పడకలతో ఏర్పాటు చేసిన ఐసోలేషన్ కేంద్రంలో చేరుదామని ఆశగా వస్తున్నారు. కానీ ఈ కేంద్రంలో ఎలాంటి సౌకర్యాలు లేకపోవడంతో నిరాశగా వెనుదిరుగుతున్నారు. వంద పడకలతో ఏర్పాటుచేసిన ఈ ఐసోలేషన్ కేంద్రంలో సరైన సౌకర్యాలు లేకపోవడంతో ఇప్పటివరకు ముగ్గురే చేరారు. దీంతో ఐసోలేషన్ కోసం ఏర్పాటు చేసిన పడకలు నిరుపయోగంగా మారాయి. ఐసోలేషన్ కేంద్రంలో అపరిశుభ్ర వాతావరణంతో పాటు పల్స్ యాక్సిలేటర్, ఆక్సిజన్ సిలిండర్లు వంటి సౌకర్యాలు లేకపోవడంతో ఇక్కడ చేరేందుకు ఆసక్తి చూపడం లేదు. గత ఆదివారం మేడ్చల్ జిల్లా కలెక్టర్ శ్వేతా మహంతి ఐసోలేషన్ సెంటర్‌ను ఆకస్మికంగా తనిఖీ చేయగా బెడ్లు ఖాళీగా ఉండటంపై అసహనం వ్యక్తం చేశారు. అపరిశుభ్రంగా ఉన్న ఐసోలేషన్ సెంటర్‌ను చూసి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేసి రోగులకు ఇబ్బందులు కలగకుండా చూడాలని ఆదేశించించా ఇప్పటి వరకు ఎలాంటి సౌకర్యాలు కల్పించలేదు. ప్రజాప్రతినిధులు, అధికారులు చొరవ తీసుకొని సెంటర్లో కావాల్సిన సౌకర్యాలు కల్పించాలని స్థానికులు కోరుతున్నారు. ( చదవండి: కరోనా విజృంభిస్తోంది.. ఇకనైనా మారండి సారు ) -
హోం ఐసోలేషన్‌లో ఉన్నారా? ఈ గైడ్‌లైన్స్ తెలుసుకోండి
న్యూఢిల్లీ: కరోనా స్వల్ప లక్షణాలు కనిపించేవారు లేదా ఎసింప్టమాటిక్ (కోవిడ్ పాజిటివ్ వచ్చినా, ఎలాంటి లక్షణాలు చూపనివారు) పేషెంట్ల హోం ఐసోలేషన్‌కు సంబంధించి కేంద్ర హోం శాఖ సవరించిన గైడ్‌లైన్స్‌ను విడుదల చేసింది. ఇంట్లో ఐసోలేషన్ గడుపుతున్నవారు రెమ్డేసివిర్ తీసుకోవద్దని, ఈ ఇంజక్షన్‌ను ఆస్పత్రుల్లోనే ఇవ్వాలంది. సిస్టమిక్ ఓరల్ స్టిరాయిడ్స్‌ను స్వల్ప లక్షణాలున్న కేసుల్లో వాడవద్దని, లక్షణాలు ఏడు రోజులకు మించి ఉంటేనే డాక్టర్ సూచన మేరకు తీసుకోవాలని వెల్లడించింది. సవరించిన నిబంధనలివే.. ► 60 సంవత్సరాలు పైబడిన లేదా బీపీ, షుగర్, గుండె, ఊపిరితిత్తులు, కిడ్నీ వ్యాధులతో బాధపడే పేషెంట్లను మెడికల్ అధికారి పరిశీలించాకే హోం ఐసోలేషన్‌కు అనుమతిస్తారు. ► హోం ఐసోలేషన్‌లో ఉన్న పేషెంట్ల ఆక్సిజన్ స్థాయిలు తగ్గినా, ఊపిరి తీసుకోవడంలో సమస్యలు తలెత్తినా డాక్టర్‌ను సంప్రదించి వెంటనే ఆస్పత్రిలో చేర్చాలి. ► గృహ స్వీయ నిర్భంధంలో ఉన్న పేషెంట్లు రోజుకు రెండుసార్లు ఉప్పునీళ్లతో పుక్కిలించడం, రెండుమార్లు ఆవిరి పట్టడం చేయాలి. ► రోజుకు నాలుగుమార్లు 650 ఎంజీ పారాసిటమాల్ మాత్రలు ఇచ్చినా జ్వరం తగ్గకుంటే వైద్యుడిని సంప్రదించి నాన్ స్టిరాయిడల్ యాంటి ఇన్ఫ్లమేటరీ డ్రగ్‌ని వాడవచ్చు. ► ఐవర్‌మెక్టిన్ మాత్రను పరిగడుపున 3–5 రోజుల పాటు వాడే విషయాన్ని పరిగణించవచ్చు. ► ఆక్సిజన్ స్థాయిలు 94 శాతం పైన ఉండి, ఎలాంటి లక్షణాలు చూపకపోయినా, టెస్టుల్లో పాజిటివ్ వచ్చినవారిని ఎసింప్టమాటిక్ అని, స్వల్ప లక్షణాలు చూపుతూ, ఆక్సిజన్ స్థాయిలు 94 శాతంపైచిలుకు ఉన్నవారిని స్వల్పలక్షణాలున్నవారని గుర్తిస్తారు. ► వ్యాధిగ్రస్తుడి కేర్టేకర్లు హైడ్రాక్సీక్లోరోక్విన్ ప్రొఫైలాక్సిస్ను డాక్టర్ సలహా తీసుకోవాలి. ఎన్–95 మాస్క్‌ను ధరించాలి ► ఐసోలేషన్ గదిలోకి గాలి వెలుతురు బాగా వచ్చేలా ఏర్పాటు చేసుకొని, ట్రిపుల్ లేయర్ మెడికల్ మాస్కును ధరిస్తూ ఉండాలి. 8 గంటల తర్వాత మాస్కు మారుస్తుండాలి. ► రోగనిరోధకత తక్కువగా ఉన్న పేషెంట్లకు హోం ఐసోలేషన్ పనికిరాదు. ► సుమారు పదిరోజులు పైబడి ఐసోలేషన్‌లో ఉన్నవారు లక్షణాలు తగ్గగానే(మూడురోజుల పాటు జ్వరం రాకుండా ఉండడం లాంటివి) డిశ్చార్జ్ కావచ్చు. హోం ఐసోలేషన్ పూర్తి చేసుకొని, లక్షణాలు కనిపించని వారు తిరిగి కోవిడ్ టెస్ట్ చేయించుకోవాల్సిన అవసరం లేదు. అధిక కేసులున్న జిల్లాల్లో కఠిన ఆంక్షలు రాష్ట్రాలకు సూచించిన హోం శాఖ కేసులు విపరీతంగా పెరిగిపోతున్న జిల్లాల్లో కంటైన్మెంట్ ఆంక్షలను కఠినతరం చేయాలని ఆయా రాష్ట్రాలకు కేంద్ర హోంశాఖ గురువారం సూచించింది. కోవిడ్ పాజిటివిటీ రేటు 10శాతం కంటే ఎక్కువగా ఉన్న జిల్లాలు, గత వారం రోజుల్లో 60శాతానికిపైగా పడకల ఆక్యుపెన్సీ ఉన్న జిల్లాలో కొత్త కంటైన్మెంట్ ఆంక్షలను అమలుచేయాలని సూచించింది. ఈ మేరకు కొత్త మార్గదర్శకాలు విడుదలచేసింది. మే నెలలో దేశంలో కోవిడ్ తీవ్రత ఎక్కువ ఉన్న ప్రాంతాల్లో లాక్డౌన్ పెట్టేదీ లేనిదీ తాజా మార్గదర్శకాల్లో ఎక్కడా పేర్కొనలేదు. -
Helping Hands: మానవసేవే మాధవ సేవ!
ఒక్కసారి రిపోర్టులో.. ‘కరోనా పాజిటివ్’ వచ్చిందంటే ఆ వ్యక్తి హోం ఐసోలేషన్ లో ఉండాల్సిన పరిస్థితి. వీరి దగ్గరకు వెళ్లాలన్న భయపడే రోజులివి. ఇంతటి విపత్కర పరిస్థితుల్లో పాజిటివ్ పేషంట్లకు స్వయంగా వంటచేసి అందిస్తున్నారు పాట్నాకు చెందిన తల్లీకూతుళ్లు. పాట్నాలోని రాజేంద్రనగర్‌లో నివసిస్తోన్న కుందన్ దేవి తన కూతుర్లతో కలిసి కోవిడ్ పాజిటివ్ పేషంట్ల ఆకలి తీరుస్తున్నారు. కుందన్ దేవి పెద్దకూతురు 32 ఏళ్ల అనుపమ సింగ్ తల్లికి ఫుడ్ తయారీలో సాయం చేస్తుంటే.. చిన్నకూతురు 26 ఏళ్ల నీలిమ సింగ్ ఫుడ్ ప్యాకెట్లను కరోనా పేషంట్ల వద్దకు చేరుస్తోంది. ఇటీవలే కుందన్ కుటుంబ సభ్యుల్లో ఒకరికి కోవిడ్ పాజిటివ్ వచ్చింది. దీంతో ఆ వ్యక్తిని ఐసోలేషన్ లో ఉంచారు. సెల్ఫ్ ఐసోలేషన్‌లో ఉన్నవారికి ఆహారం అందించడం చాలా కష్టంగా ఉండేది. ఈ ఇబ్బందిని దగ్గర నుంచి గమనించిన తల్లీ కూతుళ్లు.. పాజిటివ్ వచ్చి సెల్ఫ్ ఐసోలేషన్‌లో ఉంటోన్న పేషంట్లకు స్వయంగా వండి ఫుడ్ అందించాలనుకున్నారు. ఈ క్రమంలోనే నందన్ దేవి, అనుపమలు వంటచేసి జాగ్రత్తగా ప్యాక్ చేసి నీలిమ సింగ్‌కు ఇస్తారు. నీలిమ రోజూ 15 కిలోమీటర్ల పరిధిలోని కోవిడ్ పేషంట్లకు ఫుడ్ ప్యాకెట్స్ అందిస్తోంది. దీని కోసం వీరు వివిధ అవసరాలకోసం దాచుకున్న డబ్బులను వాడుతుండడం విశేషం. ఎవరి సాయం లేకుండా వీరు ఫుడ్ ప్యాకెట్లను అందిస్తున్నారు. అయితే నందన్ దేవీ కూతుళ్ల సాయం గురించి తెలుసుకున్న చాలామంది వారికి సాయం చేయాలని ముందుకొచ్చినప్పటికీ వారు డబ్బు విరాళంగా ఇవ్వొద్దు! మీరు మాకు ఇవ్వాలనుకుంటున్న డబ్బులతో మీరే దగ్గర్లోని కరోనా పేషంట్లకు ఫుడ్ వండిపెట్టండి అని సున్నితంగా తిరస్కరిస్తున్నారు. ‘‘మానవ సేవే మాధవ సేవ అన్నారు. సేవ చేయడం అంటే దేవుణ్ణి ఆరాధించడంతో సమానం. అందుకే కష్టాల్లో ఉన్నవారికి కాస్త మానవత్వంతో మేము చేయగలిగిన సాయం చేస్తున్నాం. కొన్నిసార్లు నా స్నేహితులు ఫుడ్ ప్యాకెట్స్ డెలివరీ చేయడంలో నాకు సాయం చేసేందుకు వస్తున్నారు. ఒకపక్క నేను యూపీఎస్సీకి ప్రిపేర్ అవుతూ ఫుడ్ ప్యాకెట్స్‌ను పేషంట్లకు అందిస్తున్నాను’’ అని నీలిమ చెప్పింది. -
గుడ్‌న్యూస్: 64 వేల బెడ్లతో రైల్వే శాఖ సిద్ధం
సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ విజృంభణతో వైద్య సేవలు, బెడ్ల కొరత తీవ్రంగా ఉంది. ఆస్పత్రులు నిండుకున్నాయి. ఈ నేపథ్యంలో రైల్వే శాఖ స్పందించి కరోనా బాధితులకు సేవ చేసేందుకు ముందుకు వచ్చింది. ప్రస్తుతం రైల్వే సేవలు అంతంతమాత్రంగా ఉండడంతో ఖాళీగా ఉన్న రైళ్లను కరోనా చికిత్స కోసం వినియోగించనున్నారు. ఈ మేరకు రైళ్ల ద్వారా 64,000 బెడ్లను రైల్వే శాఖ అందుబాటులోకి తీసుకువచ్చింది. 4 వేల కోచ్‌లను కరోనా చికిత్సకు కేటాయించింది. ఈ విషయాన్ని రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. దేశంలో కరోనా క్లిష్ట పరిస్థితుల్లో ఐసోలేషన్ బెడ్ల కోసం 4 వేల కరోనా కేర్ కోచ్‌లను రైల్వే శాఖ ఏర్పాటు చేసిందని, వాటిలో దాదాపు 64 వేల బెడ్లు రైల్వే శాఖ అందుబాటులోకి తెచ్చిందని కేంద్ర మంత్రి పీయూశ్ గోయల్ ప్రకటించారు. ప్రస్తుతం 169 కోచ్‌లు పలు రాష్ట్రాల్లో అందుబాటులో ఉన్నాయని మంత్రి గుర్తుచేశారు. కరోనా అధికంగా ఉన్న రాష్ట్రాలకు ఆ రైల్వే కోచ్‌లను కేటాయించే అవకాశం ఉంది. ఈ రైల్వే కోచ్‌లకు సంబంధించిన వీడియోను కూడా మంత్రి పీయూశ్ గోయల్ ట్విటర్లో పంచుకున్నారు. చదవండి: ‘బరాత్’లో పీపీఈ కిట్‌తో చిందేసిన అంబులెన్స్ డ్రైవర్ చదవండి: 25 రోజుల్లో 23 లక్షల కరోనా టెస్టులు कोरोना संकट में Isolation Beds की आवश्यकता को देखते हुए भारतीय रेल ने देश भर में 4,000 COVID Care Coaches में 64,000 Beds तैयार किये हैं। 169 कोचेस के माध्यम से 2,700 से अधिक बेड्स राज्यों को हुए अब तक हुए उपलब्ध। 📒 https://t.co/R7UGlare84 pic.twitter.com/hFCxKckBHR — Piyush Goyal (@PiyushGoyal) April 27, 2021 -
కరోనా సోకకుండా జాగ్రత్తపడటం ఎలా..?
ఒకవేళ కుటుంబంలో ఎవరికైనా అనుమానిత లక్షణాలు కన్పించగానే, టెస్టుల కన్నా ముందే లక్షణాలున్న వ్యక్తి మిగతా కుటుంబసభ్యులకు దూరంగా ఐసోలేషన్‌లో ఉండాలి. సాధారణ జ్వరం, లక్షణాలే కదా అని నిర్లక్ష్యంగా ఉండకూడదు. ప్రత్యేకంగా ఒక గదిలో ఉంటే చాలా మంచిది. లక్షణాలున్న వ్యక్తితో సహా కుటుంబసభ్యులందరూ తప్పనిసరిగా మాస్కులు ధరించాలి. ప్రతి ఒక్కరూ చేతులు తరచూ శుభ్రం చేసుకుంటుండాలి. ముఖ్యంగా వృద్ధులు, దీర్ఘకాలిక జబ్బులున్న వారిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. చిన్నపిల్లలను సాధ్యమైనంత దూరంగా ఉంచాలి. అత్యవసరమైతే తప్ప ఎవరూ బయటకు వెళ్లకూడదు. ఎక్కువమంది గుమిగూడే ప్రాంతాలకు, వేడుకలకు అస్సలు వెళ్లకూడదు. ఇలా చేయడం వల్ల లక్షణాలున్న వ్యక్తికి టెస్టుల అనంతరం పాజిటివ్‌గా నిర్ధారణ అయినా, చాలావరకు మిగతా కుటుంబసభ్యులకు, ఇతరులకు సోకకుండా ఉంటుంది. కరోనా సోకిందని తేలిన తర్వాత, స్వల్ప లక్షణాలే ఉన్నా.. ఇంట్లో ప్రత్యేకంగా ఒక గదిలో ఉంచే వెసులుబాటు, దూరంగా ఉండే అవకాశం లేకపోతే ప్రభుత్వ లేదా ప్రైవేట్ కోవిడ్ కేర్ కేంద్రాలకు పంపించడం మంచిది. కోవిడ్ 19 సెకండ్ వేవ్‌లో వేగంగా విస్తరిస్తోంది. ముఖ్యంగా ముందు జాగ్రత్తలు పాటించకపోవడం వల్లే ఒకరికి వస్తే అందరికీ సోకే ప్రమాదం తలెత్తుతోంది. ప్రస్తుతమున్న వైరస్ వేరియంట్ల వ్యాప్తి వేగం గతంలో కంటే 50% నుండి 150 % ఎక్కువగా ఉంది. గాలి, వెలుతురు లేని ప్రాంతాల్లో ఇది మరింత వేగంగా విస్తరిస్తుంది. కాబట్టి ముందుగానే అప్రమత్తం కావడం అనేది చాలా ముఖ్యం. పై జాగ్రత్తలు పాటిస్తే కరోనా వ్యాప్తి చెందకుండా నిరోధించవచ్చు. - డా. రాజేంద్ర క్రిటికల్ కేర్ మెడిసిన్ విభాగాధిపతి, మమత మెడికల్ కాలేజీ, హైదరాబాద్ చదవండి: కరోనా భయాన్ని జయించడం ఎలా..? కరోనా రోగులు ఏ మందులు వాడాలో తెలుసా? కరోనా నుంచి కోలుకున్న వెంటనే టీకా వేయించుకోవచ్చా? -
ఎక్కడపడితే అక్కడ పీపీఈ కిట్లు, మాస్కులు, గ్లౌజులు
సాక్షి, సిటీబ్యూరో: హోం ఐసోలేషన్‌లోని కరోనా బాధితుల వ్యర్థాలు ప్రజల పాలిట శాపంగా మారుతున్నాయి. వీటిని ప్రత్యేకంగా సేకరించే వ్యవస్థ లేకపోవడంతో బాధితులు ఎక్కడ పడితే అక్కడ వాటిని వదిలేస్తుండటంతో తెలియక వాటిని తాకిన ఇతరులు వైరస్ బారిన పడుతున్నారు. ప్రస్తుతం వ్యాప్తంగా 39,154 పాజిటివ్ కేసులు ఉండగా, వీటిలో ప్రభుత్వ ఆస్పత్రుల్లో 3,487 మంది చికిత్స పొందుతుండగా, ప్రైవేటు ఆస్పత్రుల్లో 10,214 మంది చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం హోం ఐసోలేషన్‌లో 25,453 మంది చికిత్స పొందుతున్నారు. వీరిలో అత్యధికంగా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల పరిధిలోనే ఉన్నారు. వీరు వాడిన పీపీఈ కిట్లు, మాస్క్‌లు, గ్లౌజులు సహా కోవిడ్ బాధితులు తాకిన ఇతర వస్తువులు.. ఆహార పదార్థాలు సాధారణ వ్యర్థాల్లో కలుపుతున్నారు. ప్రమాదకరమైన ఈ వ్యర్థాలను ఇళ్ల మధ్యే వదిలేస్తున్నారు. వాటిని ముట్టుకోవడంతో పారిశుద్ధ్య కార్మికులు, చెత్త నుంచి ప్లాస్టిక్‌ను వేరు చేసే వారు వైరస్ బారిన పడుతున్నారు. కంటైన్మెంట్ జోన్లేవీ? మొదట్లో అనుమానం ఉంటే చాలు పోలీసులు, వైద్య ఆరోగ్యశాఖ, జీహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తమయ్యేవారు. పోలీసులు పాజిటివ్ కేసు ఉన్న పరిసరాలకు ఇతరుల రాకపోకలను బంద్ చేస్తే.. వైద్య సిబ్బంది బాధితులను ఆస్పత్రులకు తరలించేవారు. హోం ఐసోలేషన్‌లో ఉన్నవారికి ఆశాలు, నర్సింగ్ స్టాఫ్ స్వయంగా ఇంటికి వెళ్లి మందుల కిట్లు అందజేసేవారు. ఆరోగ్య సమస్యలపై ఆరా తీసేవారు. జీహెచ్ఎంసీ సిబ్బంది వెంటనే ఆ ఇంటికి కోవిడ్– 19 పేరుతో హెచ్చరికల బోర్డులు ఏర్పాటు చేయడంతో పాటు ఆ ఇంటి పరిసరాలను పూర్తిగా హైడ్రోక్లోరిన్ చల్లేవారు. ప్రస్తుతం ఇవేవీ చేయడంలేదు. బాధితులను ఇంటిì నుంచి బయటికి రావొద్దని సూచిస్తుందే కానీ.. కిట్లు, ఇతర నిత్యావసరాలు సరఫరా చేయడం లేదు. ఫలితంగా రోగులే స్వయంగా వాటిని సమకూర్చుకోవాల్సి వస్తోంది. బాధితులు వినియోగించిన వస్తువులు, తినగా మిగిలిపోయిన ఆహార పదార్థాలు, ఇతర వ్యర్థాలు కవర్లో చుట్టి వీధి చివర్లో పడేస్తుండటం, ఈ విషయం తెలియక పారిశుద్ధ్య కారి్మకులు వాటిని ముట్టుకుని వైరస్ బారిన పడుతుండటం ఆందోళనకు గురి చేస్తోంది. కొత్తగా 1404 కేసులు.. తాజాగా ఆదివారం తెలంగాణ వ్యాప్తంగా 4,009 పాజిటివ్ కేసులు నమోదు కాగా, హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల పరిధిలోనే 1,404 కేసులు నమోదయ్యాయి. 14 మంది మృతి చెందగా.. వీరిలో తొమ్మిది మంది నగరవాసులే. పాజిటివ్ కేసులతో పాటు మరణాలు కూడా పెద్ద సంఖ్యలో నమోదవుతున్నప్పటికీ.. సిటీజన్ల వైఖరిలో మాత్రం మార్పు రావడం లేదు. మాస్‌్కలు లేకుండా, భౌతిక దూరం పాటించడం లేదు. విందులు, వినోదాల పేరుతో బయట తిరుగుతూ వైరస్ బారినపడుతున్నారు. -
కరోనా సెకండ్‌వేవ్; మళ్లీ తెరపైకి రైల్వేకోచ్‌లు
ముంబై సెంట్రల్: ముంబైలో పెరుగుతున్న కరోనా రోగుల వల్ల ఆసుపత్రులు, కరోనా కేర్ సెంటర్లలో పడకల కొరత ఏర్పడుతున్న నేపథ్యంలో రైల్వేలో సిద్ధంగా ఉన్న కోవిడ్ కేర్ కోచ్‌లను ఉపయోగించుకునే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. గత సంవత్సరం కోవిడ్ రోగులు పెరిగినప్పుడు రైల్వే బోర్డు అదేశాల ప్రకారం మొత్తం 17 జోన్లలో దాదాపు 5 వేల కోచ్‌లను ఐసోలేషన్ వార్డులుగా మార్చివేశారు. ముంబై సెంట్రల్, వెస్ట్రన్ రైల్వేలు కూడా పెద్ద సంఖ్యలో రైలు కోచ్‌లను ఐసోలేషన్ వార్డులుగా తీర్చిదిద్దాయి. మధ్య రైల్వే దాదాపు రూ.3.80 కోట్ల వ్యయంతో 482 కోచ్‌లను కోవిడ్ కేర్ కోచ్‌లుగా బదలాయించాయి. పశ్చిమ రైల్వే కూడా సుమారు రూ.2 కోట్లు వ్యయం చేసి 410 కోచ్‌లను ఐసోలేషన్ వార్డులుగా మార్చాయి. తదుపరి కరోనా తీవ్రత తగ్గడం వల్ల క్రమక్రమంగా ఈ కోచ్‌లను సాధారణ కోచ్‌లుగా మార్చివేశారు. ఇప్పటికీ కొన్ని కోచ్‌లు సిద్ధంగా ఉన్నాయి. మహారాష్ట్రలోని ఆదివాసి బహుళ ప్రాంతమైన నందూర్బార్ జిల్లాలో ప్రప్రథమంగా రైల్వే కోవిడ్ కేర్ కోచ్‌లను ఉపయోగించారు. అత్యవసర వినియోగానికి 128 కోచ్‌లు.. ముంబై డివిజన్లో ఇప్పటికీ 128 కోచ్‌లు అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగించడానికి సకల సదుపాయాలతో సిద్ధంగా ఉన్నాయని, వీటిని ఐసోలేషన్ వార్డులుగా ఉపయోగించుకోవచ్చని పశ్చిమ రైల్వే సీపీఆర్వో సుమీత్ ఠాకూర్ అన్నారు. ఒకవేళ వైద్య విభాగం, రైల్వే మంత్రిత్వ శాఖలు అదేశాలు ఇస్తే ముంబైతో పాటు అన్ని డివిజన్లలో అత్యవసర పరిస్థితుల్లో రైల్వే కోచ్‌లను ఐసోలేషన్ పడకలుగా మార్చేందుకు సిద్ధంగా ఉన్నామని సెంట్రల్ రైల్వే సీపీఆర్ఓ శివాజీ సుతార్ తెలిపారు. గతంలో ఐసోలేషన్ వార్డులుగా మార్చిన కోచ్‌లను సాధారణ కోచ్‌లుగా మార్చి ప్రయాణాలకు ఉపయోగించామని, మళ్ళీ రైల్వే కోవిడ్ కోచ్‌లుగా మార్చేందుకు అన్ని ఏర్పాట్లు ఉన్నాయని శివాజీ సుతార్ తెలిపారు. అయితే, ముంబైలో రైల్వే ద్వారా తయారు చేసిన రైల్వే కోవిడ్ కోచ్‌లను గతంలో కూడా వినియోగించలేదని ఇప్పుడు కూడా ఎలాంటి ప్రస్తావన రాలేదని సెంట్రల్–వెస్టర్న్ రైల్వే అధికారులు అన్నారు. ముంబైలో ప్రధానంగా ఎమ్ఎమ్ఆర్ ప్రాంతంలో పెరుగుతున్న కరోనా రోగులతో అసుపత్రులు నిండిపోతున్న నేపథ్యంలో రైల్వే కోవిడ్ కేర్ కోచ్‌ల అవసరం పడొచ్చు. మెడికల్ పరికరాలతో యుక్తమైన జనరల్, స్లీపర్ సెకండ్ క్లాస్ కోచ్‌లను ఐసోలేషన్ వార్డులుగా మార్చే అవకాశం ఉంది. ఒక కోచ్‌లో 16 పడకల్ని ఏర్పాటు చేయవచ్చని అధికారులు తెలిపారు. ఇక్కడ చదవండి: ఆస్పత్రిలో బెడ్ అయినా ఇవ్వండి లేదా చంపేయండి కోవిడ్-19 ఎఫెక్ట్ మహారాష్ట్రలో కిక్కిరిసిన రైల్వే స్టేషన్లు -
లాక్డౌన్ విధించే ప్రసక్తే లేదు: ఈటల రాజేందర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం కరోనా వైరస్‌ను ఎదుర్కోవడానికి అన్నిరకాలుగా సిద్ధంగా ఉందని, లాక్డౌన్ విధించే ప్రసక్తే లేదని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. ఇప్పటికే లక్షయాభైవేల మందికి వ్యాక్సిన్ ఇచ్చేలా ఏర్పాట్లు చేశామని తెలిపారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలోని 33 జిల్లాల పరిధిలో ప్రత్యేక ఐసోలేషన్ కేంద్రాలు ఏర్పాటు చేశామని వెల్లడించారు. గ్రామాల్లోని పీహెచ్సీ( PHC) స్థాయి వరకు కూడా ర్యాపిడ్ యాంటీజెన్ టెస్టులను అందుబాటులో ఉంచామని పేర్కొన్నారు. కరోనా వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉన్నవారిని గాంధీ ఆస్పత్రికి తరలించే ఏర్పాట్లు చేశామన్నారు. 11 వేల బెడ్స్ని ఆక్సిజన్ బెడ్స్‌గా మళ్లీ పునరుద్ధరించామని చెప్పారు. అత్యవసర సమయంలో ప్రైవేటు మెడికల్ కాలేజీలు, ఆసుపత్రుల సేవలను ఉపయోగించుకుంటామని తెలిపారు. ఆరోగ్య శాఖలో ఇప్పటికే అన్ని విభాగాల్లోని అధికారులు సెలవులు తీసుకోకుండా పనిచేస్తున్నారని అన్నారు. కరోనాతో సహజీవనం తప్పదని పేర్కొన్నారు. ప్రజలు కూడా వారి వంతుగా మాస్క్ ధరించడం, సామాజిక దూరం పాటించడం వంటి కోవిడ్ నిబంధనలను పాటించాలని కోరారు. చదవండి: ఢిల్లీ నైట్ కర్ఫ్యూ: ఎవరికి సడలింపు..? -
ఐసోలేషన్‌లో రోహిత్ శర్మ
మెల్బోర్న్: భారత క్రికెటర్లపై అభిమానంతో ఒక వీరాభిమాని చేసిన పని వారికి కొత్త చిక్కులు తెచ్చి పెట్టింది. ఈ అభిమానం కారణంగా భారత జట్టు టెస్టు వైస్ కెప్టెన్ రోహిత్‌శర్మ సహా నలుగురు క్రికెటర్లు ఐసోలేషన్‌లో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. కొత్త సంవత్సరం రోజున బయటకు వెళ్లి అల్పాహారం చేసిన కారణంగా రోహిత్ శర్మ, యువ ఓపెనర్లు శుబ్‌మన్ గిల్, పృథ్వీ షా, వికెట్‌కీపర్ రిషభ్ పంత్, పేసర్ నవదీప్ సైనీలను ఐసోలేషన్‌కు తరలించినట్లు క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) శనివారం వెల్లడించింది. ఆటగాళ్లు బయో బబుల్ ప్రొటోకాల్‌ను ఉల్లంఘించారా లేదా అని తెలుసుకునేందుకు బీసీసీఐ, సీఏ సంయుక్తంగా దర్యాప్తు చేపడుతున్నట్లు చెప్పింది. ► సీఏ ప్రొటోకాల్ ప్రకారం ఆటగాళ్లు ఇన్డోర్ ప్రదేశాల్లో భోజనం చేయకూడదు. ప్రజా రవాణా వ్యవస్థను వాడకుండా సామాజిక దూరాన్ని పాటిస్తూ కాలిబాటన వారికి సమీపంలోని అవుట్డోర్ వేదికలకు మాత్రమే వెళ్లేందుకు అనుమతి ఉంటుంది. ► అయితే శుక్రవారం కొత్త సంవత్సరం సందర్భంగా మెల్బోర్న్లోని సమీప రెస్టారెంట్‌కు వెళ్లి భారత క్రికెటర్లు అల్పాహారం చేస్తుండగా... అక్కడే ఉన్న భారత అభిమాని ఒకరు వారికి తెలియకుండా క్రికెటర్ల బిల్లు చెల్లించాడు. ఇది తెలుసుకున్న రోహిత్ శర్మ తనను వారించినట్లు, రిషభ్ పంత్ తనను ఆలింగనం చేసుకున్నట్లు, ఆ తర్వాత క్రికెటర్లతో కలిసి ఫొటో తీసుకున్నానని ఆ అభిమాని ట్విట్టర్ వేదికగా పంచుకోవడంతో ఈ సంగతి సీఏ దృష్టికి వచ్చింది. ► బయో బబుల్ దాటి వచ్చారనే ఆరోపణలతో తాజాగా సీఏ ఈ ఐదుగురిని ఐసోలేషన్‌లో ఉంచింది. దీంతో వీరు ప్రయాణాల్లో, ప్రాక్టీస్ సమయాల్లో... మిగతా భారత జట్టుతో పాటు ఆస్ట్రేలియా ఆటగాళ్లకు దూరంగా ఉండాల్సి ఉంటుంది. 7 నుంచి జరుగనున్న మూడో టెస్టు కోసం ఇరు జట్లు 2 రోజుల ముందుగా సిడ్నీకి వస్తాయి. ► ‘ఉద్దేశపూర్వకంగా ఎలాంటి ఉల్లంఘన జరగలేదు. మన వాళ్లకు నిబంధనల గురించి బాగా తెలుసు. వారిపై బీసీసీఐ ఎలాంటి దర్యాప్తు చేపట్టడం లేదు. రెండో టెస్టు లో భారత్ చేతిలో ఓటమి అనంతరం ఆస్ట్రేలియాలోని ఓ వర్గం మీడియా ఇలాంటి ద్వేషపూరిత వార్తలను ప్రచారం చేస్తోంది. మూడో టెస్టు ముందర భారత జట్టును కలవరపెట్టేందుకు ఇది ఓ ప్రయత్నమైతే, ఇది చాలా చెడ్డ కుట్ర అని భావించవచ్చు. ఇప్పుడు ఈ వివాదం 2007–08లో జరిగిన ‘మంకీ గేట్’ నాటి పరిస్థితులను తలపిస్తోంది’ అని బీసీసీఐకి చెందిన ఓ అధికారి వివరణ ఇచ్చారు. రెస్టారెంట్లో భారత క్రికెటర్లు -
ఆర్టీపీసీఆర్లో చిక్కని బ్రిటన్ స్ట్రెయిన్..!
సాక్షి, హైదరాబాద్: సాధారణ కరోనా వైరస్ సోకినవారు 7 రోజులు ఐసోలేషన్‌లో ఉండాలని, బ్రిటన్ స్ట్రెయిన్ కరోనా వైరస్‌కు 14 రోజులు ఐసోలేషన్ తప్పనిసరని వైద్య, ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. ఈ మేరకు మంగళవారం కార్యాచరణ ప్రణాళికను రూపొందించింది. సాధారణ వైరస్ నుంచి కోలుకున్నవారికి ప్రస్తుతం 7 రోజులు దాటాక లక్షణాలు ఏమీ లేకుంటే ఎలాంటి టెస్టులు చేయకుండానే సాధారణ వ్యక్తులుగా పరిగణిస్తున్నారు. వారి ఐసోలేషన్ కాలం పూర్తయినట్లుగా గుర్తిస్తున్నారు. అయితే బ్రిటన్ స్ట్రెయిన్ విషయంలో 14 రోజులపాటు ఐసోలేషన్‌లో ఉంచాక వారికి మరోసారి కరోనా పరీక్ష చేస్తారు. అందులో నెగటివ్ వచ్చాకే బాధితులను ఆసుపత్రి నుంచి డిశ్చార్జి చేస్తారు. పాజిటివ్ వస్తే మరికొన్ని రోజులు ఉంచుతారు. ఇక బ్రిటన్ స్ట్రెయిన్ కరోనా వచ్చిన వారిని తప్పనిసరిగా ఆసుపత్రిలోనే ఉంచి వైద్యుల పర్యవేక్షణలో ఉంచుతారు. హోం ఐసోలేషన్‌కు అనుమతివ్వరు. అయితే ప్రస్తుత సాధారణ కరోనా వైరస్ మాదిరిగానే బ్రిటన్ వైరస్ సోకినవారికి చికిత్స చేస్తారు. బ్రిటన్ వైరస్‌కు ప్రత్యేక వైద్యం లేదని వైద్య, ఆరోగ్యశాఖ వెల్లడించింది. అలాగే సాధారణ కరోనా వైరస్ వార్డుల్లో బ్రిటన్ వైరస్ బాధితులను ఉంచకూడదని నిర్ణయించారు. బ్రిటన్ వైరస్ సాధారణ వైరస్ రోగులకు వ్యాపించే ప్రమాదం ఉందని ఈ నిర్ణయం తీసుకున్నారు. దీనికోసం రాష్ట్రంలో 12 ఆసుపత్రులను బ్రిటన్ నుంచి వచ్చిన కరోనా బాధితులకు కేటాయించాలని వైద్య, ఆరోగ్య శాఖ నిర్ణయించింది. ప్రతీ ఉమ్మడి జిల్లా కేంద్రంలో ఒకటి, మిగిలినవి హైదరాబాద్‌లో ఆయా ఆసుపత్రులను అందుబాటులో ఉంచుతారు. ఉదాహరణకు ప్రస్తుతం బ్రిటన్ నుంచి వచ్చిన కరోనా పాజిటివ్ బాధితుల్లో 14 మందిని హైదరాబాద్ టిమ్స్‌లో ఉంచారు. మిగిలిన వారిని వివిధ జిల్లాల్లో ఉంచారు. టిమ్స్‌లో బ్రిటన్ నుంచి వచ్చిన కరోనా బాధితుల కోసం మూడు ఫ్లోర్లు సిద్ధం చేశారు. (చదవండి: కొత్త వైరస్కూ పాత జాగ్రత్తలే ) పోలీస్, రెవెన్యూల సహకారం... బ్రిటన్ నుంచి వచ్చే వారి వివరాలను ఎప్పటికప్పుడు గుర్తించేందుకు పోలీసు, రెవెన్యూ సహా ఇతర శాఖల సహకారం తీసుకోవాలని వైద్య, ఆరోగ్యశాఖ కార్యాచరణ ప్రణాళికలో పేర్కొంది. కరోనా వైరస్ వచ్చిన మొదట్లో ఎలాంటి ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నారో ఇప్పుడు కూడా బ్రిటన్ వైరస్ పట్ల అలాగే వ్యవహరించాలని నిర్ణయించింది. బ్రిటన్ స్ట్రెయిన్ వచ్చిన బాధితులు ఎవరెవరిని కలిశారో వారి మొదటి, రెండు, మూడు కాంట్రాక్టు వ్యక్తులను గుర్తిస్తారు. ఒకవేళ కేసులు పెరిగితే మొదట్లో మాదిరిగానే కంటైన్మెంట్ జోన్లను ఏర్పాటు చేసే అవకాశాలు లేకపోలేదని అంటున్నారు. వైరస్‌కు వేగంగా విస్తరించే గుణం ఉన్నందున అంతే వేగంగా బాధితులను గుర్తించాల్సి ఉందని కార్యాచరణ ప్రణాళికలో వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. ఆర్టీపీసీఆర్లో చిక్కని బ్రిటన్ స్ట్రెయిన్... బ్రిటన్ వైరస్ ప్రస్తుత సాధారణ పరీక్షల్లో కనుగొనే వీలే లేదని తేలిపోయింది. ఆర్టీపీసీఆర్, ర్యాపిడ్ యాంటిజెన్ పరీక్షలు సాధారణ కరోనాను నిర్ధారించడానికే పరిమితమని అధికారులు స్పష్టం చేస్తున్నారు. బ్రిటన్ స్ట్రెయిన్ ఉందా.. లేదా.. తెలుసుకోవాలంటే ముందుగా వారిలో సాధారణ కరోనా వైరస్ ఉందా.. లేదా.. తెలుసుకునేందుకు ఆర్టీపీసీఆర్ పరీక్ష చేస్తారు. అందులో పాజిటివ్ వస్తే బ్రిటన్ స్ట్రెయిన్ వైరస్ ఉందో.. లేదో.. తెలుసుకునేందుకు సీసీఎంబీ వంటి ప్రతిష్టాత్మక పరిశోధనాత్మక సంస్థల్లో జీనోమ్ సీక్వెన్సీ (జన్యు విశ్లేషణ) చేయాల్సిందేనని వైద్య, ఆరోగ్యశాఖ తెలిపింది. ఒకవేళ బ్రిటన్ స్ట్రెయిన్ వైరస్ విస్తరిస్తే దాన్ని గుర్తించేందుకు రాష్ట్రంలో నిమ్స్‌లో జీనోమ్ సీక్వెన్సీ టెస్టింగ్ మెషీన్‌ను నెలకొల్పాలని భావిస్తున్నారు. దీనిపై ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. బ్రిటన్ స్ట్రెయిన్ కరోనా వైరస్‌ను గుర్తించాలంటే జీనోమ్ సీక్వెన్సీతోపాటు ఆర్టీపీసీఆర్ టెస్ట్ కిట్లలో మార్పులు చేయాల్సి ఉంటుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. బ్రిటన్ స్ట్రెయిన్ కరోనా వైరస్ విస్తరించకుండా జిల్లాల్లో అన్ని రకాల ఏర్పాట్లు చేయాలని వైద్య, ఆరోగ్యశాఖ జిల్లాల అధికారులను ఆదేశించింది. -
హోం ఐసొలేషన్‌లోనే 61% మంది
సాక్షి, అమరావతి: కోవిడ్ నియంత్రణ చర్యల అమల్లో రాష్ట్రం వేగంగా ముందుకు దూసుకుపోతోంది. పాజిటివిటీ రేటు నుంచి మరణాల రేటు వరకు అన్నీ తగ్గుముఖం పడుతుండటమే దీనికి నిదర్శనం. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ తాజాగా వెల్లడించిన కోవిడ్ గణాంకాల ప్రకారం.. అక్టోబర్ 3 – 9 మధ్య మొత్తం కోవిడ్ బాధితుల్లో 61 శాతం మందికి ఆస్పత్రుల అవసరమే పడలేదు. వీరంతా వారి ఇళ్లల్లోనే హోం ఐసొలేషన్‌లో ఉన్నారు. ఆస్పత్రులకు వెళ్లిన మరో 39 శాతం మందిలో కేవలం ఏడు శాతం మందికే ఆక్సిజన్ అవసరమైంది. ప్రభుత్వం కోవిడ్ నియంత్రణకు పటిష్ట చర్యలు తీసుకోవడంతో మరణాల రేటు బాగా తగ్గి 0.68 శాతానికే పరిమితమైంది. మృతుల సంఖ్య రోజురోజుకు తగ్గుతుండటంతో కోవిడ్ పాజిటివ్ బాధితులు ధైర్యంగా ఉంటున్నారు. దీనికి తోడు ప్రభుత్వాస్పత్రుల్లో ఆక్సిజన్ సదుపాయం అవసరానికి మించి ఏర్పాటు చేయడంతో ఆస్పత్రులకు వెళ్లిన బాధితులకు ఎనలేని భరోసా లభిస్తోంది. వైద్య ఆరోగ్య శాఖ గణాంకాలను పరిశీలిస్తే రాష్ట్రంలో కోవిడ్ నియంత్రణ చర్యలు ఎలాంటి సత్ఫలితాలనిచ్చాయో తెలుస్తోంది. తగ్గిన మరణాలు ఇప్పటివరకు మృతి చెందిన వారిలో 87.30 శాతం మంది కోవిడ్‌తోపాటు ఇతర రకాల జబ్బులున్నవారే. సెప్టెంబర్ 18 నాటికి రాష్ట్రంలో 0.77 శాతంగా ఉన్న మరణాల రేటు తాజా గణాంకాల ప్రకారం 0.68 శాతానికి తగ్గింది. గతంలో ఆర్టీపీసీఆర్ టెస్టులు 45 శాతం చేయగా అక్టోబర్ 9 నాటికి 55 శాతానికి పెరిగాయి. అంటే.. కరోనా నిర్ధారణలో గోల్డెన్ స్టాండర్డ్‌గా చెప్పుకునే ఆర్టీపీసీఆర్ టెస్టుల సంఖ్యను భారీగా పెంచారు. -
ఇకపై అన్ని జిల్లాల్లో కోవిడ్ కేర్ సెంటర్లు
సాక్షి, హైదరాబాద్ : అంతకంతకూ కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ప్రభుత్వం కోవిడ్ కేర్ సెంటర్లను ఏర్పాటు చేసింది. ఇంతకుముందు హైదరాబాద్‌లోనే అధికంగా కోవిడ్ కేర్ సెంటర్లుండగా ప్రస్తుతం అన్ని జిల్లాల్లో నెలకొల్పినట్లు వైద్య, ఆరోగ్యశాఖ వర్గాలు తెలిపాయి. కరీంనగర్ మంథనీలోని జేఎన్టీయూ కాలేజి, వరంగల్ పరకాలలోని పాలిటెక్నిక్ కాలేజి, ఖమ్మంలోని శారద ఇంజనీరింగ్ కాలేజీ సహా పలు స్కూళ్లు, కాలేజీలు, హాస్టళ్లలో ప్రభుత్వం కోవిడ్ కేంద్రాలను ఏర్పాటు చేసింది. స్వల్ప కరోనా లక్షణాలు ఉన్నవారు, ఇంట్లో సరైన వసతి లేనివారు కోవిడ్ కేంద్రాల్లో ఉండొచ్చని అధికారులు తెలిపారు. అంతేకాకుండా నొవాటెల్, రెడిసిన్, ది మనోహర సహా పలు స్టార్ హటళ్లు ఇప్పటికే కోవిడ్ కేంద్రాలుగా ఏర్పాటయ్యాయి. ఒక్క హైదరాబాద్‌లోనే 14 ప్రభుత్వ కోవిడ్ కేర్ సెంటర్లుండగా, 13 ప్రైవేట్ కేంద్రాలున్నాయి. అయితే ఈ రెండింటిలోనూ వైద్యులు ఎప్పటికప్పుడూ పర్యవేక్షిస్తూనే ఉంటారు. అంబులెన్స్ సౌకర్యం సైతం అందుబాటులో ఉన్నట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 31,699 యాక్టివ్ కరోనా కేసులుండగా వారిలో 24,598 మంది హోం ఐసోలేషన్‌లోనే ఉంటున్నారు. -
వాళ్లకు హోమ్ ఐసోలేషన్‌లో వద్దు
చిత్తూరు కలెక్టరేట్: జిల్లాలో కరోనా వైరస్ సోకి 50 ఏళ్లు పైబడిన వారు హోమ్ ఐసోలేషన్‌లో ఉండకూడదని కలెక్టర్ నారాయణభరత్‌గుప్తా తెలిపారు. మంగళవారం కలెక్టరేట్ నుంచి వైద్యశాఖ అధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ పాజిటివ్ కేసు నమోదైన వెంటనే కాంటాక్ట్‌ల గుర్తింపుపై దృష్టి పెట్టాలన్నారు. ప్రైమరీ, సెకండరీ కాంటాక్ట్‌లను త్వరితగతిన గుర్తించాలన్నారు. జిల్లాలో హోమ్ ఐసోలేషన్‌లో ఉన్న వారి వివరాలను ప్రతి మండలంలో ఉన్న కంట్రోల్ రూమ్‌కు తెలియజేయాలన్నారు. ఈ సమాచారాన్ని పంచాయతీ సెక్రటరీ మానిటరింగ్ చేయాలని ఆదేశించారు. హోమ్ ఐసోలేషన్‌లో ఉన్న వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఏఎన్ఎంలు అవగాహన కల్పించాలన్నారు. కేసుల తీవ్రతలను బట్టి స్విమ్స్, రుయాకు పంపే ముందు సంబంధిత అధికారులకు సమాచారం ఇవ్వాలన్నారు. బాధితులకు వెంటనే వైద్యం అందించి ప్రాణాలను కాపాడేందుకు కృషి చేయాలన్నారు. ప్రతి పీహెచ్సీ పరిధిలో ఇప్పటివరకు జరిగిన కోవిడ్ మరణాల పూర్తి స్థాయి నివేదికలను పంపాలని ఆదేశించారు. ఈ టెలీకాన్ఫరెన్స్‌లో జాయింట్ కలెక్టర్ (అభివృద్ధి) వీరబ్రహ్మం, జిల్లా నోడల్ అధికారి చంద్రమౌళి, డీఎంఅండ్‌హెచ్‌ఓ పెంచలయ్య స్విమ్స్, రుయా సూపరింటెండెంట్లు డాక్టర్ రామ్, డాక్టర్ భారతి పాల్గొన్నారు. -
‘ఇప్పటికే రూ.10 కోట్లు.. ఇంటికి పంపించండి’
సాక్షి, హైదరాబాద్: కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడం కోసం ప్రపంచ దేశాలు లాక్డౌన్ విధించాయి. దాంతో భారత్ నుంచి ఉపాధి నిమిత్తం విదేశాలకు వెళ్లిన ఎందరో కార్మికులు తిరిగి ఇండియాకు వచ్చారు. ఈ క్రమంలో గల్ఫ్ దేశాల నుంచి సుమారు 20 వేల మంది తెలంగాణ వాసులు హైదరాబాద్ చేరుకున్నారు. కరోనా వ్యాప్తిని దృష్టిలో పెట్టుకుని వీరందరిని స్వస్థలాలకు పంపించకుండా హైదరాబాద్‌లోనే క్వారంటైన్లో ఉంచింది ప్రభుత్వం. ఈ క్రమంలో తొలుత వచ్చిన 5,500 మందికి తెలంగాణ ప్రభుత్వం ఉచిత క్వారంటైన్ సదుపాయం కల్పించింది. అయితే జూన్ 7 ‘వందే భారత్ మిషన్’లో భాగంగా దాదాపు 14,500 వేల మంది తెలంగాణ వాసులు గల్ఫ్ దేశాల నుంచి తిరిగి వచ్చారు. వీరందరికి ఉచిత క్వారంటైన్ కల్పించడం కష్టంగా భావించిన సర్కార్ ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. ఒక్కొక్కరి దగ్గర నుంచి 8,000 రూపాయలు వసూలు చేసి హోటల్స్‌లో క్వారంటైన్ ఏర్పాటు చేసింది. ఇలా ప్రభత్వం వీరి దగ్గర నుంచి సుమారు 10 కోట్ల రూపాయలు వసూలు చేసింది. (ప్రభుత్వానికంటే ప్రైవేటు ఆస్పత్రులే బలమైనవా?) తాజాగా హోటల్ సిబ్బంది మరోసారి డబ్బులు కట్టాల్సిందిగా వీరిని డిమాండ్ చేస్తున్నారు. అసలే ఉద్యోగాలు కోల్పోయి స్వదేశం వచ్చారు. ఇంకా ఇళ్లకు కూడా వెళ్లలేదు. చేతిలో ఉన్న కొద్ది మొత్తం క్వారంటైన్ పేరుతో హోటల్‌కే ఖర్చయ్యింది. ప్రస్తుతం జేబులో రూపాయి లేదు. ఇలాంటి పరిస్థితుల్లో వేలకు వేలు పోసి హోటల్లో క్వారంటైన్లో ఉండలేము.. మమ్మల్ని హోం ఐసోలేషన్‌కు అనుమతించండి అంటూ గల్ఫ్ కార్మికులు తెలంగాణ ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఈ సందర్భంగా వలసకార్మికుల సంక్షేమ సంఘం సభ్యుడు ఎం. బాల్‌రెడ్డి మాట్లాడుతూ.. ‘కరోనా సంక్షోభ సమయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గల్ఫ్ కార్మికుల నుంచి లక్షల రూపాయలు వసూలు చేస్తున్నాయి. 14,500 మంది దగ్గర నుంచి ఎనిమిది వేల చొప్పున 10 కోట్ల రూపాయలు వసూలు చేశారు. గల్ఫ్ దేశాలైన సౌదీ అరేబియా, యూఏఈ, ఒమన్, ఖతార్, కువైట్, బహ్రెయిన్ నుంచి హైదరాబాద్‌కు రావడానికి ఒక్కొక్కరి దగ్గర నుంచి సగటున 1,000 యూఏఈ దిర్హామ్స్, సౌదీ / ఖతారి రియాల్స్ (సుమారు రూ .20,000) ’వసూలు చేశారని తెలిపారు. (క్వారంటైన్ నుంచి భార్యాభర్తల పరార్) ఈ లెక్క ప్రకారం, 20,000 మంది వలసదారులు ఉంటే ఒక వ్యక్తి నుంచి 20,000 రూపాయల చొప్పున మొత్తం 40 కోట్ల రూపాయలు వసూల చేశారని తెలిపారు బాల్‌రెడ్డి. అంతేకాక ‘కేరళ, మహారాష్ట్రల్లో విదేశాల నుంచి తిరిగి వచ్చినవారిని ‘హోం క్వారంటైన్’కు అనుమతిస్తున్నారు. ఇక ఏపీ, ఢిల్లీలో గల్ఫ్ ప్రాంతం నుంచి వస్తోన్న పేద వలస కార్మికుల కోసం ప్రభుత్వాలే ఉచిత క్వారంటైన్ సదుపాయాలు కల్పిస్తున్నాయి’ అని తెలిపారు బాల్‌రెడ్డి. కానీ తెలంగాణ ప్రభుత్వం మాత్రం ఈ సంక్షోభాన్ని వ్యాపార అవకాశంగా మార్చుకుంటుందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ రికార్డుల ప్రకారం, ఆగస్టు 13 వరకు 46,488 మంది ప్రయాణికులు వందే భారత్ మిషన్‌లో భాగంగా హైదరాబాద్‌కు తిరిగి వచ్చారు. వీరంతా 30 దేశాల నుంచి 285 విమానాల్లో హైదరాబాద్ చేరుకున్నారు. -
కరోనా వస్తే ఆగం కావొద్దు
సిరిసిల్ల: ప్రపంచమంతా కరోనా వైరస్ విస్తరిస్తుంటే కొందరు పనికి మాలిన విమర్శలు చేస్తున్నారని, వాటిని పట్టించుకోబోమని ఐటీ, మున్సిపల్‌శాఖ మంత్రి కె.తారకరామారావు అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వాస్పత్రిలో కరోనా ప్రత్యేక వార్డును, ఐసోలేషన్ కేంద్రాన్ని సోమవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. కరోనాపై ప్రతిపక్షాలది విజ్ఞత లేని విమర్శలని పేర్కొన్నారు. ఇలాంటి కష్టకాలంలో రాజకీయాలు మాట్లాడటం బాధాకరమన్నారు. ఇంతటి క్లిష్ట సమయంలో ఎందుకు తిరుగుతున్నారని పలువురు అంటున్నారని, కానీ ప్రజల్లో విశ్వాసం నింపేందుకే తాను పర్యటనలు చేస్తున్నట్లు స్పష్టం చేశారు. ప్రైవేటు ఆస్పత్రుల్లో కరోనా సోకిన వారికి వైద్యం చేయడం లేదని, ప్రభుత్వ ఆస్పత్రుల్లో డాక్టర్లు మాత్రమే ధైర్యంగా సేవలు అందిస్తున్నారని, అలాంటి వారికి అందరూ అండగా ఉండాలని కోరారు. మీడియా కూడా నెగెటివ్ కోణాన్ని వీడి పాజిటివ్‌గా ఆలోచించాలని సూచించారు. కరోనా కట్టడికి లాక్డౌన్ చేయడం పరిష్కారం కాదని తేలిపోయిందని చెప్పారు. కరోనాతో సహజీవనం చేయాల్సిందేనని స్పష్టం చేశారు. కరోనా సోకిన వారి పట్ల మానవతా కోణంలో స్పందించి సాయం అందించాలని, వారిని వెలివేసినట్లుగా చూడొద్దని కోరారు. వృద్ధుల ఆత్మహత్య కలచివేసింది హైదరాబాద్‌లో ఇద్దరు వృద్ధులకు కరోనా సోకడంతో మానసిక వేదనకు గురై ఆత్మహత్య చేసుకోవడం తనను ఎంతో కలచివేసిందని మంత్రి పేర్కొన్నారు. నిజానికి కరోనాకు మందే లేదని, నివారణ ఒక్కటే మార్గమని చెప్పారు. ఎంతో మంది కరోనా నుంచి కోలుకుంటున్నారని వివరించారు. వయసులతో సంబంధం లేకుండా.. బాగయ్యారని ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, కాంగ్రెస్ నేత వి.హన్మంతరావును ఉదహరించారు. మరణాలు చాలా తక్కువ దేశంలో ఇతర రాష్ట్రాలతో పోల్చితే.. తెలంగాణలో కరోనా మరణాలు చాలా తక్కువని, ఒక్క శాతం మాత్రమే మరణాలు ఉన్నాయని స్పష్టం చేశారు. కరోనా వస్తే.. భయపడి బెంబేలెత్తాల్సిన పని లేదన్నారు. అలాగని నిర్లక్ష్యం తగదన్నారు. ఎవరికి వారు ధీమాగా ఉంటూనే.. వ్యాక్సిన్ వచ్చే వరకు ఆరు నుంచి తొమ్మిది నెలల పాటు జాగ్రత్తలు పాటించాలని కేటీఆర్ సూచించారు. నాకు కరోనా వస్తే కోలుకుని ప్లాస్మా ఇస్తా.. తనకు కరోనా వస్తే కోలుకున్నాక ప్లాస్మా ఇచ్చి ఆదర్శంగా ఉంటానని కేటీఆర్ స్పష్టం చేశారు. కరోనా సోకి కోలుకున్న టీఆర్ఎస్ నాయకులు ప్లాస్మా ఇచ్చేందుకు ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. అందుబాటులో ఉన్న నిధులను వినియోగించుకొని ఆగస్టు నుంచి సిరిసిల్ల జిల్లా ఆస్పత్రిలోని శానిటేషన్ సిబ్బంది వేతనాలు పెంచి ఇవ్వాలని కోరారు. జిల్లాలో మెరుగైన వైద్యం, మౌలిక వసతుల కోసం తాను సొంతంగా రూ.20 లక్షలు ఇస్తున్నానని, సీఎస్ఆర్లో మరో రూ.2.28 కోట్లు సమకూర్చుతున్నామని మంత్రి వెల్లడించారు. కొత్తగా మంజూరైన ఐదు అంబులెన్స్‌లను మంత్రి ప్రారంభించారు. నూలు పౌర్ణమి సందర్భంగా సిరిసిల్లలోని నేతన్న విగ్రహానికి పూల మాల వేశారు. -
ఐసోలేషన్ వార్డులో డాక్టర్ దుర్బుద్ధి
న్యూఢిల్లీ: కరోనా బారిన పడి చికిత్స పొందుతున్న యువతిపై ఓ డాక్టర్ అఘాయిత్యానికి ఒడిగట్టాడు. ఐసోలేషన్ వార్డులో ఆమెపై లైంగిక దాడికి యత్నించాడు. ఈ దారుణ ఘటన నోయిడాలోని ప్రైవేట్ ఆస్పత్రిలో సోమవారం చోటుచేసుకుంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. వివరాలు.. ఇరవై ఏళ్ల యువతికి ఇటీవల కరోనా పాజిటివ్‌గా నిర్దారణ అయ్యింది. దీంతో ఆమె నోయిడాలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరింది. ఈ క్రమంలో కోవిడ్ పేషెంట్లకు చికిత్స అందిస్తున్న డాక్టర్‌కు సైతం మహమ్మారి సోకగా... బాధితురాలితో కలిపి అతడిని ఒకే ఐసోలేషన్ వార్డులో ఉంచారు.(క్వారంటైన్ సెంటర్లో దారుణం) ఈ నేపథ్యంలో సదరు డాక్టర్ సోమవారం తనను లైంగిక వేధింపులకు గురి చేసినట్లు బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ విషయం గురించి అడిషనల్ డీసీపీ మాట్లాడుతూ.. ఈ ఘటనకు ఆస్పత్రి యాజమాన్య వ్యవహార శైలి కూడా కారణమని, బాధ్యతారాహిత్యంగా వ్యవహరించారని పేర్కొన్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఇద్దరు కోవిడ్ పేషెంట్లను ఒకే వార్డులో ఉంచి సేవలు అందించినందుకు చర్యలు తీసుకునే అవకాశం ఉందన్నారు. బాధితురాలి ఫిర్యాదుకు తాము సత్వరమే స్పందించి ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు వెల్లడించారు. నిందితుడు ప్రస్తుతం ఆస్పత్రిలోనే ఉన్నాడని, కోవిడ్ నిబంధనల ప్రకారం అతడి వాంగ్మూలం నమోదు చేస్తామని పేర్కొన్నారు. -
క్వారంటైన్ ఎన్నాళ్లు..?
వాషింగ్టన్: కరోనా వైరస్ గురించి మాట్లాడకుండా ఎవరికీ ఒక గంట కూడా గడవడం లేదు. ఒకప్పుడు కరోనా సోకిన వారు 14 రోజులు ఐసోలేషన్‌లో ఉన్నా సరిపోయేది కాదు. వారికి పరీక్ష చేసినా పాజిటివ్ వచ్చేది. కానీ ఇప్పుడలా కాదు. అంతగా లక్షణాలు కనిపించడం లేదు. మూడు రోజులకే నెగెటివ్ వస్తోంది. వైరస్ బలహీన పడుతోందనడానికి ఇదో నిలువెత్తు నిదర్శనం. అలాంటప్పుడు ఎన్నాళ్లు క్వారంటైన్లో ఉండాలన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఎలాంటి రోగ లక్షణాలు లేకుండా ఇంటికే పరిమితం కావడం చాలా మందికి దుర్భరంగా మారింది. మరోవైపు లక్షణాలున్న వారు తాము బయటకి వస్తే, మిగిలిన వారికి ఎక్కడ వైరస్ వ్యాప్తి చెందుతుందేమోనన్న ఆందోళనలో ఉన్నారు. ఇలాంటి సమయంలో అమెరికాలోని సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్స్(సీడీసీ) తాను గతంలో జారీ చేసిన మార్గదర్శకాలను సవరించింది. (వాడిన మాస్క్‌లను ఎలా పడేయాలంటే..) లక్షణాలు లేకపోయినా పాజిటివ్ వచ్చినవారు వారికి పరీక్ష నిర్వహించిన దగ్గర్నుంచి 10 రోజులు ఐసోలేషన్‌లో ఉంటే సరిపోతుంది. అంతకు ముందు వరకు రెండు సార్లు నెగెటివ్ వచ్చాక కోవిడ్ రోగులకి స్వేచ్ఛ లభించేది. అయితే ప్రపంచ దేశాల్లో జరిగిన అధ్యయనాల్లో ఎవరి శరీరంలోనూ తొమ్మిది నుంచి 11 రోజులకు మించి వైరస్ జీవించి ఉండదని తేలింది. దీంతో సీడీసీ తన నిబంధనల్ని మార్చి 10 రోజులు ఇంటిపట్టున ఉంటే సరిపోతుందని పేర్కొంది. ఎవరు ఏం చెప్పారంటే... ► డబ్ల్యూహెచ్ఓ జూన్‌లో సిఫారసు చేసిన మార్గదర్శకాల ప్రకారం.. లక్షణాలు లేకపోయినా కరోనా పాజిటివ్ వస్తే 10 రోజులు, స్వల్ప లక్షణాలుంటే 13 రోజులు, తీవ్రత ఎక్కువగా ఉండి ఆస్పత్రి పాలైతే డిశ్చార్జ్ అయిన దగ్గర్నుంచి రెండు వారాలు ఐసోలేషన్‌లో ఉండాలి. ► యూకేలో లిసెస్టర్ యూనివర్సిటీ వైరాలజిస్ట్ జూలియాన్ తాంగ్ కరోనా రోగులు 10 రోజుల ఐసలేషన్‌లో ఉంటే సరిపోతుందన్నారు. పది రోజుల తర్వాత వారి శరీరంలో వైరస్ ఉన్నప్పటికీ అది బలహీనపడిపోయి వ్యాప్తి చెందదని తాము నిర్వహించిన క్లినికల్ పరీక్షల్లో తేలిందన్నారు. ► నేచర్ పత్రిక చేసిన అధ్యయనంలో కరోనా శరీరంలోకి ప్రవేశించాక ఉత్పత్తి అయ్యే యాంటీ బాడీలు అయిదో రోజు నుంచి వైరస్‌ను నిర్వీర్యం చేయడం మొదలు పెడతాయని తేలింది. ఎనిమిది లేదా తొమ్మిదో రోజూ ఎవరి శరీరంలోనూ వైరస్ జీవించి ఉండదు. మరొకరికి సంక్రమించే అవకాశం లేదని ఆ పత్రిక వెల్లడించింది. ► సింగపూర్‌లోని నేషనల్ సెంటర్ ఫర్ ఇన్ఫెక్షసియల్ వేయబుల్ నిర్వహించిన అధ్యయనంలో 11 రోజుల తర్వాత వైరస్ బలహీనపడుతుందని తేలింది. ► మన దేశంలో నిబంధనల ప్రకారం వరుసగా మూడు రోజుల పాటు జ్వరం రాకుండా ఉంటే కోవిడ్ రోగుల్ని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేస్తారు. ఆ తర్వాత 14 రోజులు హోం క్వారంటైన్లో ఉండాలి. అది ముగిశాక ఇంట్లో వారితో కలిసిమెలిసి ఉండొచ్చు కానీ మరో ఏడు రోజులు ఇంటికే పరిమితం కావాలి. మొత్తంగా 17 రోజుల తర్వాత వారు బయటకి రావచ్చు. ► కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉన్న రష్యాలో కరోనా రోగులు ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత 14 రోజుల పాటు సెల్ఫ్ ఐసోలేషన్‌లో ఉండాలి. ఆ తర్వాత పరీక్షలో నెగిటివ్ వచ్చాక ఇల్లు దాటి బయటకి అడుగుపెట్టొచ్చు. -
కోవిడ్ అడ్డుకట్టకు సర్కార్ సిద్ధం
సాక్షి, సిద్దిపేట: ప్రపంచాన్ని వణికిస్తున్న కోవిడ్–19 వైరస్‌కు రాష్ట్రంలో అడ్డుకట్ట వేసేందుకు సీఎం కేసీఆర్ సర్కార్ సిద్ధంగా ఉందని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఇందులోభాగంగా జిల్లాల్లో కరోనా బాధితుల చికిత్స కోసం ఆసుపత్రులను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. బుధవారం సిద్దిపేట జిల్లా ములుగు మండలం లక్ష్మక్కపల్లి గ్రామంలోని ఆర్వీఎం ఆసుపత్రిలో 100 పడకల సామర్థ్యం గల కోవిడ్ ఐసోలేషన్ బ్లాక్, ల్యాబ్‌ను మంత్రి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్, వైద్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ సంబంధిత శాఖ ఉన్నతాధికారులతో రాష్ట్రంలోని కరోనా పరిస్థితులపై నిరంతరం సమీక్షిస్తున్నారని తెలిపారు. ప్రభుత్వాస్పత్రుల ద్వారా కరోనా బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందించేలా సర్కార్ పనిచేస్తుందన్నారు. కరోనా పోరాటంలో ఫ్రంట్‌లైన్ వారియర్స్‌గా పనిచేస్తున్న డాక్టర్లు, స్టాఫ్ నర్సులు, పోలీసులు, పారిశుధ్య సిబ్బందికి ప్రజలు మద్దతు ప్రకటించాల్సిన అవసరముం దని, వారి నైతిక స్థైర్యం దెబ్బతిసేలా విమర్శలు చేయొద్దని రాజకీయ పార్టీలకు మంత్రి విజ్ఞప్తి చేశారు. మహమ్మారి కట్టడికి ప్రభుత్వానికి ప్రజలు సహకరించాలని, అనవసరంగా బయటకు రాకుండా స్వీయ నిర్బంధం పాటించాలని కోరారు. కరోనా నిర్ధారణ పరీక్షలు త్వరితగతిన చేసేందుకు జిల్లాల వారీగా కోవిడ్ బ్లాక్‌లను, నిర్ధారణ కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేస్తోందని తెలిపారు. కాగా, సిద్దిపేట జిల్లాలోని రాజీవ్ రహదారి హరిత గ్రీన్ వాల్ తరహాలో ఉందని మంత్రి కితాబిచ్చారు. జిల్లాలోని వంటిమామిడి నుంచి సిద్దిపేట జిల్లా సరిహద్దులోని తోటపల్లి గ్రామం వరకు 91 కిలోమీటర్ల పొడవునా రోడుకిరువైపుల హరితహారం మొక్కలు ఒక పచ్చని గోడలా కనిపిస్తున్నాయని పేర్కొన్నారు. ఉపాధి హామీ పథకం కింద 91 కిలోమీటర్ల పొడవునా జరుగుతున్న పనులతో సిద్దిపేట జిల్లా దేశానికే ఆదర్శంగా నిలవడం ఖాయమన్నారు. అనంతరం సిద్దిపేట పట్టణంలో జరిగిన పలు కార్యక్రమాల్లో మంత్రి పాల్గొన్నారు. -
ఈ-పాస్ లేక.. ఐసోలేషన్‌కి ప్రేమజంట
సాక్షి, చెన్నై: ఈ–పాస్ లేకుండా ప్రియురాలిని వెతుక్కుంటూ చెన్నై నుంచి తిరువణ్ణామలైకు వచ్చిన యువకుడిని ప్రియురాలితో పాటు అధికారులు ఐసోలేషన్‌లో ఉంచారు. కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు గత మార్చి 24వ తేదీ నుంచి కర్ఫ్యూ ఉత్తర్వులు అమలులో ఉన్న విషయం తెలిసిందే. జిల్లా నుంచి మరో జిల్లా వెళ్లేందుకు ఈ–పాస్ తప్పనిసరి. వివాహం, మరణం, అత్యవసర వైద్య చికిత్సలు వంటి కారణాలకు మాత్రమే ఈ–పాస్ అందజేస్తున్నారు. అనుమతి లేకుండా సరిహద్దులు దాటే వారిపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకుంటున్నారు. ఇలా ఉండగా తన ప్రియురాలిని కలుసుకోలేక నాలుగు నెలలుగా అవస్థలు పడుతూ వచ్చిన చెన్నై యువకుడు ఈ–పాస్ లేకుండా చెక్‌పోస్టులను రహస్యంగా అధిగమించి తిరువణ్ణామలైకు చేరుకున్నాడు. ఆపై అధికారులకు పట్టుబడ్డాడు. ఇతన్ని ప్రియురాలితోపాటు ఐసోలేషన్ వార్డులో ఉంచారు. ప్రియురాలిని కలిసేందుకు చెన్నై నుంచి వచ్చిన యువకుడు రెండు రోజులుగా తిరువణ్ణామలైలోని వివిధ ప్రాంతాలకు, దుకాణాలకు వెళ్లి వస్తున్నట్లు కార్పొరేషన్ అధికారులకు సమాచారం అందింది. రెట్టైపిళ్లయార్ ఆలయం సమీపంలోని ఒక దుకాణంలో ప్రియురాలు, ప్రియుడు మాట్లాడుకోవడాన్ని అధికారులు కనుగొన్నారు. విచారణలో యువకుడు కన్యాకుమారికి చెందిన వాడని, చెన్నైలోని సాఫ్ట్వేర్ సంస్థలో పనిచేస్తున్నట్లు తెలిసింది. ప్రతినెలా తిరువణ్ణామలైకు గిరిప్రదక్షిణ కోసం రాగా ప్రేమ చిగురించినట్లు సమాచారం. నాలుగు నెలలుగా ప్రియురాలిని చూడకుండా అవస్థలు పడ్డాడు. చెక్‌పోస్టు అడ్డంకులను దాటుకుని వచ్చినట్లు యువకుడు తెలిపాడు. ఈ ప్రేమికులను తిరువణ్ణామలైలోని ఐసోలేషన్ వార్డుకు తరలించారు. అక్కడ వారికి కరోనా పరీక్షలు జరిపారు. ఈ ఘటన స్థానికంగా సంచలనం కలిగించింది. చదవండి: ప్రియురాలి కోసం వెళ్లిన యువకుడిపై.. -
ఆక్సిజన్ పెట్టకుండానే బిల్లు!
సాక్షి, సిటీబ్యూరో: చాదర్‌ఘాట్‌లోని ఓ కార్పొరేట్ ఆస్పత్రి నిర్వాకం ఇంకా మరిచిపోకముందే... తాజాగా గచ్చిబౌలిలోని మరో కార్పొరేట్ ఆస్పత్రి వైద్యం పేరుతో ఎన్నారై వైద్యురాలికి షాక్ ఇచ్చింది. ఆస్పత్రిలో లేని స్పెషాలిటీ వైద్యులు వచ్చి రోగికి చికిత్సలు అందించినట్లు, ఖరీదైన మందులు వాడినట్లు, వెంటిలేటర్ అమర్చినట్లు...ఇలా ఇష్టం వచ్చినట్లు బిల్లు వేశారు. చేతికందిన బిల్లు చూసి..సదరు వైద్యురాలు షాక్‌కు గురైంది. ఇదెక్కడి ఘోరం అంటూ సెల్ఫీ వీడియో తీసి బయటికి వదలడంతో అది వైరల్ అయింది. అసలేమైందంటే... మూత్రనాళ సంబంధిత కేన్సర్‌తో బాధపడుతున్న నగరానికి చెందిన యాదగిరిరావు కేసరిని చికిత్స కోసం జూన్ 25న గచ్చిబౌలిలోని ఏసియన్ ఇన్స్టి ట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంటరాలజీ ఆస్పత్రిలో అడ్మిట్ చేశారు. ఆయనతో పాటే ఆయన కుమార్తె , ఎన్నారై డాక్టర్ విజయకేసరి కూడా ఉన్నారు. వైద్య పరీక్షల్లో భాగంగా ఆయనకు టెస్టులు నిర్వహించగా, కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయింది. ఆయనకు సన్నిహితంగా ఉన్న ఆయన కుమార్తె డాక్టర్ విజయకేసరి కూడా టెస్టు చేయించుకోగా, ఆమెకు కూడా పాజిటివ్ నిర్ధారణ అయింది. దీంతో ఆమె కూడా ఇదే ఆస్పత్రి ఐసోలేషన్ వార్డులో అడ్మిటయింది. నిజానికి వీరిద్దరికి దగ్గు, జలుబు, జ్వరం వంటి లక్షణాలు లేవు. కానీ ఆస్పత్రి సిబ్బంది వారికి మెడికేషన్ ఇచ్చినట్లు, ఆక్సిజన్ పెట్టినట్లు బిల్లు వేశారు. గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్‌కు బదులు ఫల్మొనాలజీ వైద్యుడిగా పేరు మార్చి అదనంగా మళ్లీ బిల్లు వేశారు. అదేమని అడిగితే.. నాలుగు రోజుల నుంచి మమ్మల్ని మానసికంగా వేధిస్తున్నారు. బలవంతంగా ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేస్తున్నారు. ఇదెక్కడి న్యాయం? వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటెల రాజేందర్‌గారు దయచేసి కాపాడండి!.. అంటూ సెల్పీ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో సదరు వీడియో వైరలైంది. ఇది అనైతికంః డాక్టర్ విజయకేసరి, బాధితురాలు మా నాన్నకే కాదు నాక్కూడా ఒక్క సింప్టమ్ కూడా లేదు. నాకు ఇంజక్షన్ ఇచ్చినట్లు, ఐవీ ఇచ్చినట్లు, ఆక్సిజన్ ఇచ్చినట్లు బిల్లు వేశారు. నిజానికి విటమిన్ సి, మల్టీవిటమిన్, యాంటి బయోటిక్ టాబ్లెట్స్ మినహా మరే ఇతర మందులు కానీ, ఇంజక్షన్లు కానీ ఇవ్వలేదు. రాని డాక్టర్ల పేరుతో రూ.లక్షల్లో బిల్లు వేశారు. అదేమని ప్రశ్నిస్తే...నిర్లక్ష్యం చేస్తున్నారు. ఎందుకు చెల్లించాలో అర్థం కావడం లేదు. ఇండియాలో ఇదెక్కడి ఘోరం? ఇంత దారుణమా? అంటూ ఆమె కన్నీటి పర్యంతమయ్యారు. ఇద్దరికీ..14 రోజులకు రూ.2.96 లక్షలేః ఏఐజీ ఆస్పత్రి తండ్రితో పాటు డాక్టర్ విజయ కూడా కోవిడ్ పాజిటివ్‌తో ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యారు. ఐసోలేషన్‌లో భాగంగా తండ్రి కుమార్తెలిద్దరూ వేర్వేరు రూమ్‌లను ఎంచుకున్నారు. తాను ఎన్నారై డాక్టర్‌నని, తనకు ప్రత్యేక రూమ్ కావాలని చెప్పిరోజుకు రూ.12 వేలు అద్దె ఉన్న గదిని ఎంచుకున్నారు. తండ్రికి రూ.ఆరు వేలు ఉన్న గదిని ఎంచుకున్నారు. వీరిద్దరి రూమ్‌రెంట్, మందులు, వైద్యుల ఛార్జీ ఇలా 14 రోజులకు మొత్తం రూ.2.96 లక్షల బిల్లు మాత్రమే వచ్చింది. ఆ బిల్లు చెల్లించడం ఇష్టం లేకే ఆమె ఆస్పత్రిపై ఆరోపణలు చేస్తోందని ఏఐజీ ఆస్పత్రి యాజమాన్యం స్పష్టం చేసింది. -
మాల్లో కరోనా రోగి : భారీ జరిమానా
అక్లాండ్ : భారత్ నుంచి ఇటీవల తిరిగివచ్చి కోవిడ్-19 పాజిటివ్‌గా నిర్ధారణ అయిన వ్యక్తి (32) సూపర్ మార్కెట్‌కు వెళ్లేందుకు అక్లాండ్‌లోని ఐసోలేషన్ కేంద్రం నుంచి అదృశ్యమైన ఘటన వెలుగుచూసింది. ఐసోలేషన్ కేంద్రం ఫెన్సింగ్‌ను దాటుకుని ఈ వ్యక్తి మంగళవారం ఉదయం అదృశ్యమయ్యాడని న్యూజిలాండ్ హెరాల్డ్ వెల్లడించింది. జులై 3న ఢిల్లీ నుంచి వచ్చిన ఈ వ్యక్తికి కరోనా వైరస్ పాజిటివ్‌గా తేలిన అనంతరం క్వారంటైన్‌కు తరలించారు. కాగా ఈ వ్యక్తికి ఎలాంటి లక్షణాలు లేవని, ఏ ఒక్కరితోనూ సన్నిహితంగా మెలగలేదని వెల్లడించినట్టు అధికారులు తెలిపారని ఆ కథనం పేర్కొంది. కోవిడ్-19 పాజిటివ్‌గా తేలిన వ్యక్తి ఐసోలేషన్ కేంద్రం నుంచి అదృశ్యమవడం తీవ్రమైన విషయమని ఆరోగ్య మంత్రి క్రిస్ హిప్కిన్స్ అన్నారు. అతడి చర్యలు స్వార్థపూరితమని, ఆ వ్యక్తిపై చర్యలు చేపడతామని స్పష్టం చేశారు. కాగా సూపర్ మార్కెట్లో ఆ వ్యక్తి 20 నిమిషాలు గడిపాడని, 70 నిమిషాల తర్వాత అతడు స్వయంగా ఐసోలేషన్ కేంద్రానికి తిరిగి చేరుకున్నాడని హిప్కిన్స్ చెప్పారు. ఐసోలేషన్ కేంద్రం నుంచి వెళ్లినందుకు అతడికి ఆరు నెలల జైలు శిక్ష లేదా రూ 2.8 లక్షల జరిమానా విధిస్తారని న్యూజిలాండ్ హెరాల్డ్ పేర్కొంది. కాగా కరోనా పాజిటివ్‌గా తేలిన వ్యక్తి తమ స్టోర్‌కు వచ్చాడని తెలియడంతో సూపర్‌మార్కెట్ సిబ్బంది స్వీయ నియంత్రణలోకి వెళ్లారు. వారందరికీ కరోనా వైరస్ పరీక్షలు నిర్వహించేందుకు అధికారులు సిద్ధమయ్యారు. న్యూజిలాండ్‌లో ఇప్పటివరకూ 1187 కరోనా పాజిటివ్ కేసులు వెలుగుచూడగా 23 యాక్టివ్ కేసులున్నాయి. వీరంతా ఐసోలేషన్ కేంద్రాల్లోనే ఉంటున్నారు.చదవండి : కరోనా చీకటిలో ధారవి -
కరోనా: తిరుగుతున్నారు..!
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లోని ఐసోలేషన్ వార్డులన్నీ దాదాపుగా రోగులతో నిండిపోయాయి. కొత్తగా కరోనా వైరస్ నిర్ధారణ అయిన వారికి ఆయా ఆస్పత్రుల్లో పడకలు దొరకని దుస్థితి. ప్రభుత్వం కూడా ఏమీ చేయలేని పరిస్థితి. లక్షణాల తీవ్రత ఎక్కువగా ఉన్న వారిని ఆస్పత్రిలో అడ్మిట్ చేస్తున్నారు. ఏ లక్షణాలు లేకపోయినా పాజిటివ్ నిర్ధారణై ఇంట్లో ప్రత్యేక గది ఉన్న కోవిడ్ బాధితులకు హోం ఐసోలేషన్ సిఫార్సు చేస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం రాష్ట్రంలో 10,487 యాక్టివ్ కేసులు ఉండగా, వీటిలో 60 శాతం అంటే 6,556 కేసులు హోం ఐసోలేషన్‌లోనే ఉన్నాయి. వీటిలో 90 శాతం కేసులు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే ఉన్నాయి. ప్రభుత్వ ఆస్పత్రుల్లో పడకల నిష్పత్తికి మించి రోగులు ఉండటంతో ప్రస్తుతం హోం ఐసోలేషన్‌లో ఉన్నవారి ఆరోగ్య పర్యవేక్షణ బాధ్యతను క్షేత్రస్థాయి వైద్యులకు అప్పగించింది.(10 వేల పడకల కోవిడ్ సెంటర్) వీరు బాధితుల ఇంటికి వెళ్లి.. ఐసీఎంఆర్ నిబంధనల మేరకు హోం ఐసోలేషన్ సదుపాయం ఉందో..లేదో పరిశీలించాలి. సంతృప్తి చెందిన తర్వాత వారికి అవసరమైన మాస్కులతో పాటు శానిటైజర్, మల్టీవిటమిన్ టాబ్లెట్ కిట్లను అందజేయాలి. అయితే ఎవరూ పట్టించుకోకపోవడంతో బాధితులే స్వయంగా మెడికల్ షాపులకు వెళ్లి మందులు, మార్కెట్లకు వెళ్లి కూరగాయలు, పండ్లు, ఇతర నిత్యవసరాలు కొనుగోలు చేస్తున్నారు. వారి చేతికి స్టాంపు లేకపోవడం, వైరస్ ఉన్నట్లు కూడా ఇతరులకు తెలియక పోవడంతో వారి నుంచి ఇతరులకు వైరస్ విస్తరిస్తోంది. ఇటీవల కేసుల సంఖ్య పెరగడానికి ఇది కూడా ఓ కారణమని వైద్యనిపుణులు అభిప్రాయపడుతున్నారు. (మిలియన్ మార్క్) నిలిచిన ట్రేసింగ్.. గ్రేటర్లో మార్చి నుంచి మే చివరి నాటికి 1,616 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. జూన్‌లో 11, 080 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. జులైలో కేవలం నాలుగు రోజుల్లోనే 5,109 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటిలో 60 శాతానికిపైగా కేసులు హోం ఐసోలేషన్‌లో ఉన్నాయి. మిగిలిన కేసులు కేసులు గాంధీ, కింగ్‌కోఠి, చెస్ట్, నేచర్‌క్యూర్, యునానీ సహా పలు కార్పొరేట్ ఆస్పత్రుల్లోని ఐసోలేషన్ వార్డుల్లో ఉన్నాయి. నిజానికి మొదట్లో కోవిడ్ లక్షణాలు ఉన్నట్లు ఎవరైనా 104కు ఫోన్ చేస్తే చాలు వెంటనే వైద్యులు సహా పోలీసులు, జీహెచ్ఎంసీ సిబ్బంది ప్రత్యేక వాహనంలో ఇంటిముందు వాలిపోయేవారు. లక్షణాలు ఉన్న వారిని స్వయంగా అంబులెన్స్‌లో తీసుకెళ్లి వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయించేవారు. బాధితులకు సన్నిహితంగా మెలిగిన వారిని క్వారంటైన్ చేసి, ఆ బస్తీలోకి రాకపోకలను పూర్తిగా నిలిపివేసేవారు. వీధుల్లో సోడియం హైపోక్లోరైడ్ చల్లేవారు. కేసుల సంఖ్య రోజురోజుకూ పెగుతుండటంతో కంటైన్మెంట్ జోన్ల పరిధిని కూడా కుదిస్తూ రావడంతో పాటు సోడియం హైపోక్లోరైడ్ పిచికారిని కూడా పూర్తిగా నిలిపివేశారు.. ఆ తర్వాత పాజిటివ్ వచ్చిన వ్యక్తి ఇంటిని మాత్రమే కంటైన్మెంట్ చేసి, నోటీసు బోర్డు ఏర్పాటు చేసేవారు. ప్రస్తుతం గ్రేటర్లో రోజుకు సగటున 1500 నుంచి 1650 పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఇదే సమయంలో క్షేత్రస్థాయిలో పనిచేసే వైద్యులు, పోలీసులు, జీహెచ్ఎంసీ ఉద్యోగులు కూడా వైరస్ బారిన పడుతుండటం, ఒకే ఏరియాలో రోజూ వందకుపైగా కేసులు నమోదవుతుండటంతో ట్రేసింగ్ను పూర్తిగా నిలిపివేశారు. దగ్గు, జలుబు, జ్వరంతో బాధపడుతున్నాం. మాకు టెస్టులు చేయండి! అని వేడుకున్నా.. స్పందించే వారు లేరు. స్పందించని 108 గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 108 వాహనాలు 60 ఉన్నాయి. తొలుత వీటిలో 40 వాహనాలను కేవలం కోవిడ్ పేషంట్ల తరలింపు కోసమే కేటాయించారు. ఒక్కో వాహనం రోజుకు సగటున ఆరు నుంచి ఏడు కేసులను మాత్రమే తరలించే అవకాశం ఉంది. ప్రస్తుతం వాహనాల నిష్పత్తికి మించి పాజిటివ్ కేసులు నమోదువుతుండటంతో రోగుల తరలింపు విషయంలో ఇవి కూడా చేతులెత్తేశాయి. అత్యవసర పరిస్థితుల్లో ఫోన్ చేసినా స్పందించడం లేదు. దీంతో బాధితులే స్వయంగా సొంత వాహనాల్లో టెస్టింగ్ సెంటర్లకు చేరుకుని, శాంపిల్స్ ఇచ్చి వెళ్తున్నారు. మూడు రోజులైనా రిపోర్టులు రాకపోవడంతో నమూనాలు ఇచ్చిన వారు కూడా సాధారణ సిటిజనుల్లా బయట తిరుగుతున్నారు. వీరిలో చాలా మందికి వైరస్ ఉండటం, అది వారికి కూడా తెలియక పోవడంతో వారి నుంచి ఇతరులకు వైరస్ విస్తరిస్తుంది. -
హోం ఐసోలేషన్‌లో ఒంటరి కావద్దు!
సాక్షి, హైదరాబాద్: దేశంలో కోవిడ్–19 బారిన పడుతున్న వారి సంఖ్య రోజురోజుకూ భారీగా పెరుగుతోంది. ఇటు రాష్ట్రంలో రోజుకు సగటున వెయ్యికి మించి పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. కరోనా పాజిటివ్ వచ్చిన వారిలో ఎక్కువ మందికి లక్షణాలు పెద్దగా కనిపించడం లేదు. లక్షణాలు ఎక్కువగా ఉన్న వారిని ఆస్పత్రుల్లో చేరుస్తుండగా.. లక్షణాలు లేని వారు, అతి తక్కువ లక్షణాలున్న వారందర్నీ హోం ఐసోలేషన్‌కే పరిమితం కావాలని వైద్యాధికారులు సూచిస్తున్నారు. దీంతో ఆస్పత్రులపై ఒత్తిడి తగ్గడంతో పాటు పేషెంట్ సైతం ఇంట్లో మరింత స్వేచ్ఛగా ఉండే అవకాశముంటుంది. హోం ఐసోలేషన్‌లో ఉన్న వారు తప్పకుండా పది రోజుల పాటు ఇంట్లో ప్రత్యేక గదిలో ఒంటరిగా (కుటుంబ సభ్యులకూ దూరంగా) ఉండాల్సిందే. హోం ఐసోలేషన్‌లో నిర్దేశించిన జాగ్రత్తలు పాటించకుంటే ఈ వైరస్ కుటుంబ సభ్యులకు సైతం వ్యాప్తి చెందే అవకాశముంటుంది. ఇదే సందర్భంలో హోం ఐసోలేషన్‌లో ఉంటున్న పేషెంట్ భయాందోళన చెంది పూర్తి ఏకాంతంగా గడిపితే ఇతర ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుందని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సైన్సెస్ (ఎన్‌ఐఎంహెచ్‌ఎన్) చెబుతోంది. కరోనా పాజిటివ్‌గా ఉన్న వ్యక్తి తీవ్రమైన ఒత్తిడికి గురి కావడంతో పాటు తన ఆరోగ్యంపై సందేహాల వెల్లువ, కుటుంబ సభ్యుల ఆలోచనలు, ఉద్యోగం, తదితర అంశాలను తీవ్రంగా ఆలోచించడంతో ఇతర అనారోగ్య సమస్యలకు దారితీసే అవకాశముంటుంది. ఈక్రమంలో హోం ఐసోలేషన్ జాగ్రత్తలు పాటించడంతో పాటుగా ఒంటరితనాన్ని అనుభవించకుండా నిర్దేశిత ప్రణాళిక ప్రకారం అనువైన ఇతర కార్యకలాపాలతో గడిపితే కరోనాను విజయవంతంగా జయించవచ్చని చెబుతోంది. ఈ మేరకు ఎన్‌ఐఎంహెచ్‌ఎన్ తాజాగా మార్గదర్శకాలను విడుదల చేసింది. ఆందోళనకు చెక్ పెడితే.. హోం ఐసోలేషన్‌లో ఉన్న వారు ముందుగా ఆందోళనను వీడాలని ఎన్‌ఐఎంహెచ్‌ఎన్ చెబుతోంది. ఏ విషయంలో కూడా తొందర పాటు, గాబరా పడకుండా ఏకాగ్రతతో ఆలోచించాలి. అందుకు యోగా, ప్రాణాయామం, మెడిటేషన్ చేయాలని చెబుతోంది. రోజువారీ పనుల్లో బిజీగా ఉండే వారికి హోం ఐసోలేషన్ కాస్త ఇబ్బందే.. ఈ సమయంలో తమ ఉద్యోగం, ఇతర విధులు ఎలా జరుగుతున్నాయో అర్థం కాని పరిస్థితి తలెత్తి ఒత్తిడికి గురయ్యే అవకాశముంది. ఈ పరిస్థితి తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఫోన్ లేదా ఇంటర్నెట్ ఆధారంగా పరిస్థితిని తెలుసుకోవడంతో పాటు శారీరక వ్యాయామంపైనా దృష్టి పెట్టాలి. హోం ఐసోలేషన్ సమయంలో క్రమపద్ధతిలో భోజనం, అందుబాటులో ఉన్న పరిధిలో శారీరక శ్రమ చేయడం, ఇతర వ్యాపకాలున్న వారు వాటికి సమయం వెచ్చించడంతో రిలీఫ్ దొరుకుతుందని చెబుతోంది. మానసిక ఆరోగ్యంతో రోగ నిరోధక శక్తి వేగంగా పెరుగుతుందని పలు పరిశోధనలు స్పష్టం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో మానసికంగా దృఢంగా ఉండేలా చూడాలని ఎన్‌ఐఎంహెచ్‌ఎన్ సూచిస్తోంది. హోం ఐసోలేషన్‌లో ఉన్నప్పటికీ.. కొందరికి వర్క్ ఫ్రం హోం చేసుకునే వీలుంటుంది. అలాంటి వారు తమ పనులను యథావిధిగా చక్కబెట్టుకుంటే ఎలాంటి ఇబ్బందులు ఉండవు. అవగాహన అవసరం.. కోవిడ్ బారిన పడిన వాళ్లలో ఎక్కువగా ఆందోళన పడుతున్నవారున్నారు. ఈ వ్యాధి వల్ల తన పరిస్థితి ఏంటనే దానిపైనే ఎక్కువ ఆలోచిస్తున్నారు. దీంతోనే ఇతర మానసిక సమస్యలొస్తున్నాయి. ఈ పరిస్థితిని అధిగమిస్తేనే వ్యాధి నుంచి త్వరగా కోలుకుంటారు. అందుకు సరైన అవగాహన పెంచుకోవాలి.అలాగే కోవిడ్ బాధితుల పట్ల వివక్ష చూపిస్తే వారు మరింత డిప్రెషన్లోకి వెళ్లే ప్రమాదముంది. ఫోన్లో మాట్లాడటంతో వారికి రిలీఫ్ దొరుకుతుంది. పేషెంట్ల పట్ల పాటించాల్సిన పద్ధతులపై మరింత అవగాహన కల్పించాల్సిన అవసరముంది. –డాక్టర్ అజయ్‌కుమార్ జూపాక, అసిస్టెంట్ ప్రొఫెసర్ సైకియాట్రి విభాగం, గాంధీ మెడికల్ కాలేజీ -
హామీపత్రం ఉంటేనే..హోం ఐసోలేషన్
సాక్షి, హైదరాబాద్: కరోనా వైరస్ తీవ్రత రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో రోగుల సంరక్షణపై ప్రభుత్వం మరింత దృష్టి సారించింది. బాధతుల సంఖ్య ఎక్కువైతే అందరికీ ఆస్పత్రుల్లో చికిత్స సాధ్యం కానందున లక్షణాలు తక్కువగా ఉన్నవారు, ఇంట్లో వసతులు ఉన్న వారంతా హోం ఐసోలేషన్‌లో ఉండేందుకు అవకాశం కల్పించింది. ఈ క్రమంలో హోం ఐసోలేషన్ విధానాన్ని కట్టుదిట్టం చేస్తూ కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ పలు మార్పులు చేసింది. బాధితుల ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించేలా, ప్రతిరోజూ వైద్యుల పరిశీలన ఉండేలా చర్యలు చేపట్టింది. ఈ మేరకు కొత్తగా కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. (మూడు నెలలు ముప్పుతిప్పలే!) పర్యవేక్షకుడి ఆధ్వర్యంలో... ప్రస్తుతం హోం ఐసోలేషన్‌లో ఉన్న వాళ్లకు ఆన్లైన్లో వైద్యుల సలహాలు, సూచనలు అందుతున్నాయి. అయితే కేంద్రం తాజా ఆదేశాల ప్రకారం హోం ఐసోలేషన్‌లో ఉన్న ప్రతి బాధితుడిని వైద్యులు లేదా వైద్య సహాయకుడు తప్పకుండా పరిశీలించాలి. రోగి శరీర ఉష్ణోగ్రత, ఆక్సిజన్ శాతంతోపాటు గుండె వేగం ఎంత ఉందో పరీక్షించి ఆ వివరాలను కోవిడ్–19 పోర్టల్‌లో అప్లోడ్ చేయాలి. అలాగే బాధితుడితో ఎవరైనా కాంటాక్ట్ అయ్యారా లేదా అని చెక్ చేస్తూ అలాంటి వారుంటే వైద్యుడి సలహా మేరకు పరీక్షలు నిర్వహించి జాగ్రత్తలు తీసుకోవాలి. ఇదివరకు కేవలం లక్షణాలు లేని వాళ్లకు మాత్రమే హోం ఐసోలేషన్‌కు అనుమతివ్వగా తాజాగా సవరించిన నిబంధనల ప్రకారం దీర్ఘకాలిక వ్యాధులున్నప్పటికీ వాటిని నియంత్రణలో ఉంచుకొనే వారు కూడా వైద్యల సలహా మేరకు హోం ఐసోలేషన్‌లో ఉండొచ్చు. హోం ఐసోలేషన్‌లో ఉండేందుకు సుముఖుత తెలిపిన బాధితుడు ప్రభుత్వానికి అండర్‌టేకింగ్ ఇవ్వాలి. తనకు వైద్య పరీక్షలు నిర్వహించి సూచనలిచ్చే డాక్టర్ కూడా అందులో సంతకం (కౌంటర్ సైన్) చేయాల్సి ఉంటుంది. అవయవ మార్పిడి, కేన్సర్, హెచ్ఐవీ రోగులకు మాత్రం హోం ఐసోలేషన్‌కు అనుమతి లేదు. 10 రోజులకు కుదింపు... కరోనా బాధితుడి హోం ఐసోలేషన్ గడువు ఇప్పటిదాకా 17 రోజులుగా ఉంది. తాజాగా ఈ కాలాన్ని మరింత కుదించారు. కేవలం పది రోజులు ఉంటే హోం ఐసోలేషన్ నుంచి డిశ్చార్జి చేయాలని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇందులో వరుసగా మూడు రోజులపాటు ఎలాంటి లక్షణాలు ఉండకూడదు. అయితే హోం ఐసోలేషన్ నుంచి డిశ్చార్జి అయినప్పటికీ మరో వారంపాటు రోగి తప్పకుండా ఇంట్లోనే ఉండాలని కేంద్రం స్పష్టం చేసింది. మరిన్ని లక్షణాలు జోడింపు... కరోనా వైరస్ సోకిన వారికి జ్వరం, దగ్గు, జలుబు, గొంతు నొప్పితోపాటు ఒళ్లు నొప్పులు తదితర లక్షణాలను కేంద్ర నిర్ధారించింది. తాజాగా ఈ లక్షణాల జాబితాలో మరో రెండు అంశాలను జోడించింది. చేతులు, కాళ్లలో తిమ్మిర్లు రావడం, ఫిట్స్ రావడం, మాటలు నత్తిగా రావడం లాంటి వాటిని కూడా లక్షణాల జాబితాలో చేర్చింది. తాజా నిబంధనలతో హోం ఐసోలేషన్‌లో ఉన్న వారిపై ప్రభుత్వం ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంటోందని, దీంతో రిస్క్ కూడా తగ్గుతోందని నిజామాబాద్ ప్రభుత్వ వైద్య కళాశాల క్రిటికల్ కేర్ విభాగాధిపతి డాక్టర్ మాదల కిరణ్ ‘సాక్షి’కి వివరించారు. -
భర్త కోసం
భర్త ప్రాణాల కోసం భార్యలు అపర శక్తి స్వరూపిణులు అవుతారు. ఒక్కోసారి యముని మహిషంపై కొమ్ములు కూడా విసురుతారు. వారి నిశ్శబ్ద సంగ్రామాలు చాలా మటుకు లోకానికి తెలియవు. తెలిసినవి విస్మయం కలిగించకమానవు. చెన్నైకి చెందిన 66 ఏళ్ల లలిత తన భర్త కోసం మృత్యువు సమక్షంలో 8 రోజులు గడపడం సామాన్యం కాదు. జూన్ 19. చెన్నై. రెడ్‌హిల్స్‌లో ఆ ఇంట్లోని 76 ఏళ్ల భర్త మదనగోపాల్ తన భార్య లలితను పిలుద్దామనుకున్నాడు. కాని మాట జారిపోయింది. మళ్లీ పిలుద్దామనుకున్నాడు. గొంతు పెగల్లేదు. కుడి చేత్తో సైగ చేసి పిలుద్దామనుకున్నాడు. చేయి కదలడం లేదు. అయితే వంట గదిలో ఉన్న ఆయన భార్య లలితకు మనసులో ఏదో ఆరాటంగా అనిపించింది. బయటకొచ్చి చూసింది. భర్త పరిస్థితి ఆందోళనగా ఉందని అర్థమైంది. ఆమె భయపడలేదు. వెంటనే భర్త బంధువు ఒకరికి ఫోన్ చేసింది. అతను డాక్టర్. ‘అది స్ట్రోక్‌లా ఉంది. వెంటనే హాస్పిటల్‌కు తీసుకొచ్చేయండి’ అని చెప్పాడతను. లలిత తన భర్తను ఆఘమేఘాల మీద హాస్పిటల్‌కు తీసుకెళ్లి జాయిన్ చేసింది. వైద్యులు ఆ మైల్డ్ స్ట్రోక్‌కి వెంటనే వైద్యం చేశారు. ఇది కోవిడ్ సమయం కనుక ఆ టెస్ట్ కూడా చేశారు. పాజిటివ్ వచ్చింది. కంగారు పడి లలితకు కూడా చేశారు. నెగెటివ్ వచ్చింది. ‘ఇప్పుడేం చేద్దాం’ అన్నారు లలితతో. ‘ఇంటికి తీసుకెళ్లి జాగ్రత్తగా చూసుకుంటాను’ అందామె. ‘అది క్షేమం కాదు. ఆయన హాస్పిటల్లో ఉండాలి’ అని చెప్పారు. వెంటనే మదన గోపాల్ని పొన్నేరిలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ మదన గోపాల్ ఐసొలేషన్‌లో ఉండాలి. కాని మదన గోపాల్‌కు అప్పటికే బి.పి, షుగర్ వంటి సమస్యలు ఉన్నాయి. దానికితోడు ఆయనకు మతి స్థిమితం సరిగా ఉండదు. ‘ఆయన నేను లేకపోతే ఉండడు. ఉండలేడు’ అంది లలిత. ‘నేను కూడా ఆయనతో పాటే ఉంటాను’ అని కూడా అంది. ఆయనతో పాటు ఉండటం అంటే కోవిడ్‌ను కొని తెచ్చుకోవడం. మృత్యువుకు గడపదాకా ఆహ్వానం పలకడం. ఎందుకంటే ఆమె కూడా రిస్క్ ఏజ్ గ్రూప్‌లోనే ఉంది. కాని డాక్టర్లకు వేరే దారి కనిపించలేదు. ‘సరే ఉండండి’ అన్నారు. లలిత ఆ వయసులో తన భర్త కోసం నిలబడింది. అతనితోపాటు 8 రోజుల పాటు ఐసొలేషన్‌వార్డులో ఉండి పోయింది. ప్రతి క్షణం మాస్క్ ధరించి తనను తాను కాపాడుకుంటూ భర్తను కాపాడుకుంది. ‘అక్కడ మా బట్టలు నేనే ఉతుక్కున్నాను. రాత్రంతా అతని పక్కనే కూచుని కాపు కాచాను’ అంది లలిత. డాక్టర్లు ఎందుకైనా మంచిదని లలితకు కూడా మల్టీ విటమిన్ టాబ్లెట్లు, కొన్ని బూస్టర్లు ఇచ్చారు. ‘అలా ఉండటం కష్టం కాలేదా?’ అని లలితను అడిగితే ‘పెద్ద కాలేదు. కాని ఆయనకు టీ అలవాటు. టైమ్‌కు టీ అందకపోతే విసుక్కుంటారు. ఆయన అడిగినప్పుడు టీ ఏర్పాటు చేయడం కష్టమైంది’ అని మెల్లగా నవ్విందామె. ‘మీకు కోవిడ్ వచ్చి ఉంటే?’ అనడిగితే ‘వస్తే ఏం చేస్తాం? ఎన్నోసార్లు అతనిని కాపాడుకున్నాను. ఈసారి అది వచ్చినా కాపాడుకోవాలనుకున్నాను. కాని నాకు రాలేదు’ అందామె. మదనగోపాల్ అసింప్టమేటిక్ కావడం వల్ల డాక్టర్లు ఇంటికి పంపించారు. ఇంట్లో క్వారంటైన్లో ఉండాలని చెప్పారు. మదనగోపాల్‌కు ఏం భయం... ఏం బెంగ? అలాగే ఉంటాడు. లలిత ఉందిగా. – సాక్షి ఫ్యామిలీ -
గొప్ప మనసు చాటుకున్న గౌతం గంభీర్
ఢిల్లీ : బీజేపీ ఎంపీ, టీమిండియా మాజీ క్రికెటర్ గౌతం గంభీర్ మరోసారి వార్తల్లో నిలిచారు. కరోనా వైరస్ విజృంభిస్తోన్న నేపథ్యంలో గంభీర్ 50 పడకల గల ఐసోలేషన్ సెంటర్‌ను సిద్ధం చేసి గురువారం ఢిల్లీ ప్రభుత్వానికి అప్పగించి తన ఉదారతను చాటుకున్నారు. గంభీర్ ఫౌండేషన్ సెంటర్ ద్వారా తూర్పు ఢిల్లీలోని గాంధీనగర్ ప్రాంతంలో కోవిడ్-19 ఐసోలేషన్ కేంద్రాన్ని సిద్ధం చేశారు. మొత్తం 50 పడకలతో రూపొందించిన ఐసోలేషన్ సెంటర్లో ప్రతి బెడ్‌కు ఆక్సిజన్ సౌకర్యం కూడా కల్పించారు. (2 రోజులపాటు ఐస్‌క్రీం ఫ్రీజర్‌లో కరోనా డెడ్‌బాడీ) గంభీర్ మాట్లాడుతూ..' కరోనా సోకినవారు ఎవరైనా సరే ఇంట్లో ఉండడానికి ఇబ్బందిగా అనిపిస్తే ఇక్కడికి రావచ్చు. ఇక్కడకు వచ్చే కరోనా బాధితులకు మా సెంటర్లో అన్ని వసతులు ఏర్పాటు చేశారు. మానవతాదృక్పథంలో ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నా తప్ప ఇందులో ఎలాంటి రాజకీయం లేదు. అందుకే నేను ఏర్పాటు చేసిన ఐసోలేషన్ సెంటర్‌ను ఢిల్లీ ప్రభుత్వానికి అప్పగించాను. గౌతమ్ గంభీర్ ఫౌండేషన్ త్వరలో ఇతర ప్రాంతాలలో కూడా ఐసోలేషన్ కేంద్రాలను నిర్మిస్తోంది. ' ప్రతి జీవితానికి మనమే బాధ్యత!'' అంటూ సందేశాన్నిచ్చారు. ఢిల్లీలో కరోనా కేసులు పెరుగుతున్న దృష్యా కరోనా బాధితులను దృష్టిలో ఉంచుకొని కేజ్రీవాల్ ప్రభుత్వం పలు పంక్షన్ హాళ్లను ఐసోలేషన్ సెంటర్‌గా మార్చి కోవిడ్ ఆసుపత్రులకు అనుసంధానించింది. ఇప్పటివరకు ఢిల్లీలో 87,360 కరోనా కేసులు నమోదవ్వగా.. మృతుల సంఖ్య 2,742గా ఉంది. -
కరోనా: ఇకపై 5 రోజులపాటు ఆస్పత్రిలోనే
ఢిల్లీ : కరోనా సోకిన వారిని హోం క్వారంటైన్‌కి తరలించే ముందు ఆస్పత్రిలోనే తప్పనిసరిగా అయిదు రోజుల పాటు ఐసోలేషన్ వార్డులోనే ఉంచాలని ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజల్ ఉత్తర్వులు జారీ చేశారు. అంతేకాకుండా ఇంటి వద్దే స్వీయ నిర్భంధంలో ఉన్నవారిపై తప్పనిసరిగా నిఘా ఉంచాలని అధికారులను ఆదేశించారు. హోం క్వారంటైన్లో ఉన్నవారు భౌతిక దూరం పాటించకపోవడం వల్లే రాజధానిలో కేసులు మరిన్ని పెరగడానికి కారణమై ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. అంతేకాకుండా సెల్ఫ్ ఐసోలేషన్‌లో ఉన్నా సమస్య తీవ్రమైతే వెంటనే హాస్పిటల్‌కి తరలించాలని పేర్కొన్నారు. ఈ మేరకు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ సహా ఇతర ఉన్నతాధికారులకు లేఖ రాశారు. (రాహుల్-అమిత్ షా మధ్య ట్విటర్ వార్ ) అయితే కేంద్రం జారీ చేసిన ఉత్తర్వులపై ఢిల్లీ ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. ఇప్పటికే వైద్యులు, నర్సుల కొరత ఉందని ఇలాంటి పరిస్థితుల్లో అందరికి ఆస్పత్రిలో సేవలందించడం సాధ్యమేనా అని సూటిగా ప్రశ్నించింది. ప్రస్తుతానికి వేలాది మంది కరోనా రోగులు ఇంట్లోనే చికిత్స పొందుతున్నారని, తాజా ఉత్తర్వుల వల్ల పెద్ద సంఖ్యలో క్వారంటైన్ కేంద్రాలు, పడకలను ఏర్పాటు చేయాల్సి ఉంటుందని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పేర్కొన్నారు. కేంద్రం తీసుకున్న నిర్ణయం ఏకపక్షంగా ఉందని దీని ద్వారా స్వతహాగా పరీక్షలు చేయించుకోవాలనుకునే వారి సంఖ్య తగ్గుతుందని అన్నారు. ఫలితంగా కరోనా వైరస్ మరింత వేగంగా వ్యాప్తి చెందుతుందని అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం దేశ రాజధానిలో 8,400 కరోనా బాధితులు ఇంట్లోనే చికిత్స పొందుతున్నారు. ఎన్ని కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నా కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. ఇటీవలే ఢిల్లీ ఆరోగ్యశాఖ మంత్రి సత్యేంద్ర జైన్‌కు కోవిడ్ నిర్ధారణ అయిన సంగతి తెలిసిందే. ఇక దేశ వ్యాప్తంగా 24 గంటల్లోనే 14,516 కొత్త కరోనా కేసులు నమోదుకాగా, 375 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 3,95,048కి చేరినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. (భారత్: మరోసారి రికార్డు స్థాయిలో కేసులు ) -
కరోనా సోకిన వ్యక్తి ఫోన్ చోరీ చేశాడు..
గువాహటి : కరోనా రోగులున్న హాస్పిటల్ దగ్గర్లో కానీ, పాజిటివ్ వచ్చిన వ్యక్తుల దరిదాపుల్లోకి వెళ్లాలన్నా సాధారణంగా భయపడతాం . అలాంటిది ఓ దొంగ మాత్రం ఏకంగా ఐసోలేషన్ వార్డుకే వెళ్లి కోవిడ్ సోకిన వ్యక్తి ఫోన్‌ను దొంగిలించాడు. ఈ ఘటన అసోంలోని చిరాంగ్ జిల్లా జెఎస్‌ఎస్‌బి సివిల్ హాస్పిటల్లో సోమవారం చోటుచేసుకోగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నిందితుడుని 22 ఏళ్ల బర్మన్‌గా గుర్తించిన పోలీసులు వెంటనే అదుపులోకి తీసుకొని క్వారంటైన్ సెంటర్‌కు తరలించారు. ఐసోలేషన్ వార్డ్ లోపలికి వెళ్ళడానికి ఎవరైనా ధైర్యం చేస్తారని మేము ఎప్పుడూ అనుకోలేదు అని ఆసుపత్రి సూపరింటెండెంట్ మనోజ్ దాస్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. హాస్పిటల్లో మరింత కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపడతామని తెలిపారు. (60వేల తేనెటీగలు.. దాదాపు 4గంటలకు పైగా.. ) పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..బర్మాన్ చిన్న చిన్న చోరీలకు పాల్పడుతూ జల్సాలకు అలవాటు పడ్డాడు. అయితే కరోనా కారణంగా చేతిలో సరిగ్గా డబ్బు చాలకపోవడంతో ఏకంగా ఐసోలేషన్ వార్డుకే గురిపెట్టాడు. కరోనా కాలంలోనూ వృత్తి ధర్మాన్ని విస్మరించకూడదనుకున్నాడో కానీ దర్జాగా వెళ్లి స్మార్ట్ ఫోన్ దొంగిలించాడు. ఈ తతంగం అంతా సీసీటీవీ ఫుటేజ్‌లో రికార్డు అయ్యింది. హాస్పిటల్‌కి 15 కిలోమీటర్ల దూరంలోనే బర్మాన్ నివసిస్తున్నట్లు కనుగొన్న పోలీసులు వెంటనే అదుపులోకి తీసుకొని క్వారంటైన్ సెంటర్‌కు తరలించారు. రక్త నమూనాలు సేకరించగా, ఫలితాలు ఇంకా వెలువడాల్సి ఉంది. అయితే అతను ఎవరెవరిని కలిశాడు అన్న వివరాలను సేకరిస్తున్నామని పోలీసులు తెలిపారు. (ప్రభుత్వ ఉపాధ్యాయులతో ఇసుక మాఫియాపై నిఘా ) -
4 రాష్ట్రాల్లో 204 ఐసోలేషన్ కోచ్‌లు
న్యూఢిల్లీ: కరోనాను ఎదుర్కొనేందుకు రైల్వే శాఖ దేశంలోని నాలుగు రాష్ట్రాల్లో 204 ఐసోలేషన్ కోచ్‌లను ఏర్పాటుచేసింది. అందులో 54 కోచ్ లను ఢిల్లీలోని షకుర్బస్తి రైల్వే స్టేషన్ లో ఏర్పాటు చేసింది. రానున్న రోజుల్లో ఢిల్లీలో 500 కోచ్‌లను ఏర్పాటు చేస్తామని అధికారులు తెలిపారు. ఉత్తర ప్రదేశ్‌లో 70 కోచ్‌లు, తెలంగాణలో 60 కోచ్‌లు (సికింద్రాబాద్, కాచిగూడ, ఆదిలాబాద్‌లలో 20 చొప్పున), ఆంధ్రప్రదేశ్ (విజయవాడ)లో 20 కోచ్‌లను ఏర్పాటు చేసింది. ఉత్తరప్రదేశ్ 240 కోచ్‌లు కావాలని, తెలంగాణ 60 కోచ్‌లు కావాలని గతంలో రైల్వే శాఖను కోరాయి. -
ఐసోలేషన్ ఆవరణలో వైద్యుల చిందులు
బెల్లంపల్లి: రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని కొందరు వైద్యులు బాధ్యతారహితంగా వ్యవహరించారు. ఏకంగా ఐసోలేషన్ కేంద్రం ఆవరణలో సౌండ్ సిస్టమ్ ఏర్పాటు చేసి మరీ చిందులేశారు. వివరాలు.. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి సింగరేణి ఏరియా ఆస్పత్రిలోని కరోనా వైరస్ అనుమానితులను అబ్జర్వేషన్లో ఉంచడానికి ఐసోలేషన్ వార్డు ఏర్పాటు చేశారు. తెలంగాణ రాష్ట్రావతరణ వేడుకలను పురస్కరించుకొని మంగళవారం ఏరియా ఆస్పత్రి ఆవరణలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన అనంతరం వైద్యులు, సిబ్బంది ఐసోలేషన్ కేంద్రం ఆవరణలో పాటలు, నృత్యాలతో హోరెత్తించారు. ఈ వ్యవహారాన్ని కొందరు సెల్ఫోన్లలో చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో అది కాస్త వైరల్ అయింది. మనస్పర్ధలే కారణమా?: సింగరేణి ఏరియా ఆస్పత్రి వైద్యులు, సిబ్బంది నృత్యాలు చేసిన విషయాన్ని కొందరు ఉద్దేశపూర్వకంగానే సెల్ఫోన్లలో చిత్రీకరించినట్లు తెలుస్తోంది. దీని వెనుక కుట్ర దాగి ఉన్నట్లు సిబ్బంది అనుమానిస్తున్నారు. ఇటీవల నర్సుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏరియా ఆస్పత్రిలో కేక్ కట్ చేయడానికి ఓ ప్రజా ప్రతినిధి వెళ్లినట్లు సమాచారం. ఐసోలేషన్ వార్డు ఏర్పా టు చేసినందువల్ల వేడుకలు నిర్వహించరాదని ఓ వైద్యుడు నిరాకరించినట్లు తెలిసింది. దీంతో సదరు ప్రజాప్రతినిధి నర్సుల వేడుకల్లో పాల్గొనకుండానే వెనుదిరిగినట్లు సమాచారం. దీన్ని కొందరు సిబ్బంది అవమానకరంగా భావించడంతోనే వైద్యులు, సిబ్బందిలో మనస్పర్థలు చోటుచేసుకున్నాయని చెబుతున్నారు. -
వెదురు చక్రం కరోనా హీరో
కోవిడ్‌తో ప్రపంచం యుద్ధం చేస్తోంది. ఈ యుద్ధానికి సాధనాలుగా, ఆయుధాలుగా కొత్త ఆవిష్కరణలెన్నో పుట్టుకొస్తున్నాయి. అలాంటిదే ఈ వెదురు ఫర్నిచర్. హాస్పిటల్లో ఐసోలేషన్‌లో ఉన్న వాళ్ల కోసం ఇది బాగా పని కొస్తుందని ఈశాన్య రాష్ట్రాల హాస్పిటళ్లు ఈ ఫర్నిచర్ మీద ఆసక్తి చూపిస్తున్నాయి. వెదురు మంచం, వీల్ చెయిర్, కంప్యూటర్ టేబుల్, రైటింగ్ టేబుల్, ఐవీ ఫ్లూయిడ్స్ స్టాండ్... మొదలైన వస్తువులను వెదురుతో చేస్తున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఐసోలేషన్‌లో ఉన్న పేషెంట్‌కు అవసరమైన ఫర్నిచర్ అంతటినీ వెదురుతోనే చేస్తున్నారు. ఒక పేషెంట్‌కు వాడిన వస్తువులను మరొకరికి వాడాల్సిన పని ఉండదు. ఒకసారి వాడిన తర్వాత వీటిని కాల్చేయవచ్చు. ఈ ఫర్నిచర్ రూపకర్త ఓ ప్రొఫెసర్. పేరు రవి మోకాశి పూనేకార్. అతడు గువాహటిలో ఐఐటీలో ప్రొఫెసర్. పదేళ్ల నాటి ప్రయోగం ఈశాన్య రాష్ట్రాల్లో 140 రకాల వెదురు చెట్లు పెరుగుతాయి. చాలా త్వరగా పెరిగే జాతులున్నాయి. నరికిన కొద్దీ పక్కన పిలకలు వేస్తూ పెరుగుతాయి. కాబట్టి సహజ వనరులను వృథా చేయడమనేది ఉండదు. వెదురు కలపతో పేషెంట్లకు అవసరమైన ఫర్నిచర్‌ను తయారు చేయడం ద్వారా పర్యావరణ హితమైన వస్తువులను వాడడం, ఒకసారి వాడిన వాటిని మరొకరికి వాడకుండా శుభ్రత పాటించడం సాధ్యమవుతుంది... అన్నారు రవి మోకాశి పూనేకార్. నిజానికి అతడు పదేళ్ల కిందట హాస్పిటళ్లలో వినియోగానికి ఇది మంచిదనే ఉద్దేశంతో వెదురు ఫర్నిచర్‌కు రూపకల్పన చేశాడు. వాటిని పరిశీలించిన నిపుణులు బాగా ఉపయోగపడతాయని, మంచి ప్రయత్నం అని ప్రశంసలైతే ఇచ్చారు. వాటిని హాస్పిటళ్ల కోసం తయారు చేయించుకోవడం మాత్రం జరగలేదు. ఇప్పుడు కోవిడ్ కష్టకాలంలో ఒకరికి వాడిన వస్తువులను మరొకరు వాడడానికి పేషెంట్లు ఏ మాత్రం ఇష్టపడకపోవడంతో హాస్పిటళ్లు, ప్రభుత్వ క్వారంటైన్ సెంటర్లు కూడా ఒకసారి వాడి కాల్చి పడేసే వెదురు ఫర్నిచరే బెస్ట్ అంటున్నారు. తన ఫార్ములా ఇప్పుడు ఉపయోగపడుతోందనే సంతోషం కంటే కోవిడ్ కారణంగా వడ్రంగులకు చేతి నిండా పని దొరుకుతోందని సంతోషిస్తున్నారు ప్రొఫెసర్. -
కరోనా.. కమ్మేస్తోంది!: నీతి ఆయోగ్
సాక్షి, హైదరాబాద్: కరోనా మహమ్మారి సామూహిక వ్యాప్తి దశలో ఉందని నీతి ఆయోగ్ వెల్లడించింది. ఈ పరిస్థితి దేశానికి సవాల్‌గా మారింద ని పేర్కొంది. దేశంలో కరోనా పరిస్థితిపై, దానిని ఎదుర్కోవడంలో మన దేశానికి ఉన్న బలాలు, బలహీనతలు, అవకాశాలు, సవాళ్లపై నీతి ఆయోగ్ చేసిన అధ్యయన నివేదిక తాజాగా విడుదలైంది. వైరస్ కట్టడికి కేంద్రం లాక్‌డౌన్‌ను విధించిందని, భౌతికదూరాన్ని పాటిం చాలని పిలుపునిచ్చిందని, కానీ అమలులో ఉల్లంఘన జరిగిందని నీతి ఆయోగ్ కుండబద్దలు కొట్టింది. కరోనా పాజిటివ్‌లతో కాంటాక్ట్ అయినవారిని వెతికి పట్టుకోవడంలో వైఫల్యం ప్రస్తుత పరిస్థితిని మరింత దిగజార్చడానికి దారితీస్తుందని ఆందోళన వ్యక్తంచేసింది. ఈ పరిస్థితితో కరోనా సామూహిక వ్యాప్తి (కమ్యూనిటీ స్ప్రెడింగ్)కి దారి తీసే ప్రమాదం నెలకొందని తెలిపింది. కరోనాతో పోరాడటానికి సమర్థవంతమైన వ్యూహాన్ని రూపొందించడానికి, అంతర్గత, బాహ్య కారణాలను గుర్తించడం ముఖ్యమని తెలిపింది. ఇలా చేయాలి.. ► ప్రజల్లో అవగాహన కల్పించడం, కేసులను పర్యవేక్షించడం కోసం గ్రామీణ స్థాయిలో పటిష్టమైన వ్యవస్థను ఏర్పాటు చేసుకోవచ్చు. ► కరోనాతో పోరుకు వినూత్న పరిష్కారాలను అందించడానికి స్టార్టప్‌లు, ఎంఎస్ఎంఈలు, కార్పొరేట్, పరిశోధన, విద్యాసంస్థలు ముందుకు రావాలి. ► విద్యాసంస్థలు నడిపించడం, కార్యాలయాల్లో పనుల నిర్వహణకు వీడియో కాన్ఫరెన్సింగ్ వంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవాలి. కరోనాను ఎదుర్కొనే బలాలివే.. ► పాఠశాలలు, రైల్వే కోచ్‌లు, హోటళ్లు, కార్యాలయాలు మొదలైన మౌలిక సదుపాయాలను ఐసోలేషన్ వార్డులుగా మార్చారు. ► కరోనా చికిత్సకు అవసరమైన హైడ్రాక్సీ క్లోరోక్విన్ మాత్రల ఉత్పత్తిలో భారతదేశమే టాప్. ► అన్ని దేశీయ, అంతర్జాతీయ విమానాశ్రయాలు, రైల్వే స్టేషన్లలో, కార్యాలయాల్లో తప్పనిసరిగా థర్మల్ స్క్రీనింగ్ తనిఖీ నిర్వహించారు. ► కొత్త సవాలును స్వీకరించడానికి వైద్య, ఆరోగ్య వ్యవస్థ క్రమంగా సన్నద్ధమవుతోంది. ఇవి మన బలహీనతలు.. ► కరోనా నిర్ధారణ పరీక్షకు అవసరమైన వస్తు సామగ్రి లేదు. వైద్య పరికరాలు, పీపీఈ కిట్లు, మాస్క్‌లు, వెంటిలేటర్లు తదితరాల కొరత. ► టెస్టింగ్ కిట్లు, రిలీఫ్ మెటీరియల్స్‌ను దేశీయంగా తయారు చేయడంలో సమస్యలు.. ఈ విషయంలో దిగుమతులపై ఆధారపడాల్సిన దుస్థితి. ► సమాజంలోని నిర్దిష్ట వర్గాలలో కరోనా వైరస్‌పై అవగాహన లేదు. ► ఐసోలేషన్‌లో ఉండటానికి ప్రజలు ఇష్టంగా లేరు. ఇది ఒక మానసిక అవరోధంగా మారింది. ► దేశంలో పేదల రోగనిరోధక శక్తి అత్యం త తక్కువ. ప్రపంచంలో రోగనిరోధక శక్తిలో దేశం 135వ స్థానంలో ఉంది. ► అత్యవసర వైద్య ఆరోగ్య మౌలిక సదుపాయాలు, నిపుణుల కొరత వేధిస్తోంది. ► దేశంలో 1,445 మంది రోగులకు ఒక డాక్టర్ మాత్రమే ఉన్నారు...ప్రతీ వెయ్యి జనాభాకు పడకల సంఖ్య 0.7 మాత్రమే. ► దేశ జనాభా 130 కోట్లు.. కానీ వెంటిలేటర్ల సంఖ్య 40 వేలు మాత్రమే. ► ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లో ఉ ద్యోగులకు సౌకర్యవంతమైన పని ఏర్పాట్లు లేవు. కరోనా కట్టడిలో వివిధ దేశాలు ఇలా.. కరోనాను కట్టడికి వివిధ దేశాలు పలు పద్ధతులను పాటించాయి. కొన్ని విఫలం కాగా, కొన్ని విజయవంతంగా నియంత్రించగలిగాయి. ► దక్షిణ కొరియా మొదట్లోనే వేగంగా స్పందించింది. అక్కడ ఆసుపత్రుల్లో పడకల సంఖ్య ఎక్కువ. సార్వత్రిక ఆరోగ్య సంరక్షణ కవరేజీ ఉంది. పాజిటివ్ వచ్చినవారు, వారి కాంటాక్టులను వెతికి పట్టుకోవడంలో మంచి సామర్థ్యం చూపింది. వర్క్ ఫ్రం హోంను అమలు చేసింది. ► రష్యాకు కరోనా వైద్య నిర్ధారణ పరీక్షలు, ఇతరత్రా వైద్య పరికరాల సామర్థ్యం ఎక్కువ. ప్రారంభంలో వైరస్‌ను తక్కువ అంచనా వేసింది. దీంతో ప్రజల్లో భయం, అపనమ్మకం ఏర్పడింది. ► ఇటలీ మొదట్లో పెద్దగా పట్టించుకోలేదు. దీంతో వైద్య ఆరోగ్య రంగంపై తీవ్రమైన ఒత్తిడి పెరిగింది. దీంతో కరోనా సృష్టించిన సంక్షోభాన్ని సరిగ్గా ఎదుర్కోలేని దుస్థితి ఏర్పడింది. ► అమెరికాలో బలమైన ఆరోగ్య మౌలిక సదుపాయాలున్నాయి. మొదట్లో వైరస్‌పై అవగాహన కల్పించలేదు. పైగా లాక్‌డౌన్‌పై జాతీయ స్థాయిలో వ్యతిరేకత నెలకొంది. ► చైనా దూకుడుగా వ్యవహరించి వైరస్‌ను నియంత్రించింది. క్వారంటైన్, సామూహిక నిఘా వ్యవస్థలను ఏర్పాటు చేసింది. కరోనా వైరస్ పరీక్షలను సులభంగా, ఉచితంగా చేసింది. పెద్దఎత్తున కాంటాక్ట్ ట్రేసింగ్ నిర్వహించింది. కొత్త ఆసుపత్రులను ఉన్నపళంగా నిర్మించింది. ► న్యూజిలాండ్‌లో బలమైన నాయకత్వం.. కరోనా నియంత్రణలో సరైన వ్యూహం రచించింది. జాతీయ సరిహద్దులను పూర్తిగా మూసివేసింది. భౌతికదూరాన్ని పాటించడం ద్వారా సమాజంలో వైరస్ వ్యాప్తిని బాగా అడ్డుకుంది. -
స్వల్ప లక్షణాలుంటే హోం ఐసోలేషన్
న్యూఢిల్లీ: స్వల్ప లక్షణాలున్న కరోనా రోగులను చికిత్స అనంతరం పరీక్షించకుండానే డిశ్చార్జ్ చేస్తే.. వారు వైరస్‌ను వ్యాప్తి చేస్తారనేందుకు ఆధారాలేవీ లేవని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. ఆ పేషెంట్లు డిశ్చార్జ్ అయిన తరువాత వారం పాటు కచ్చితంగా ఇంట్లోనే ఉండాలని ‘డిశ్చార్జ్ విధానం’లో పేర్కొంది. తీవ్ర స్థాయిలో వైరస్ ఇన్ఫెక్టన్కు గురైనవారిని, ఇతర సీరియస్ వ్యాధులున్నవారిని ఆర్టీపీసీఆర్ పరీక్షలో నెగెటివ్ వచ్చాకే డిశ్చార్జ్ చేయాలని స్పష్టం చేసింది. స్వల్పంగా ఇన్ఫెక్షన్కు గురైనవారిని వారిలో మూడురోజుల్లో జ్వరం సహా ఎలాంటి కోవిడ్ లక్షణాలు లేనట్లయితే డిశ్చార్జ్ చేయవచ్చని సూచించింది. స్వల్ప లక్షణాలున్న పేషెంట్లు ఇంట్లోనే వేరుగా ఉండే సౌకర్యం ఉంటే హోం ఐసోలేషన్‌లో ఉండవచ్చని సూచించింది. -
ఆశాజనకంగా కరోనా రికవరీ రేటు
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి విజృంభణకు అడ్డు అదుపు లేకుండా పోతోంది. రోజు రోజుకు పెరుగుతున్న కేసులు సంఖ్య ఆందోళన కలిగిస్తోంది. గడిచిన 24 గంటల్లో 4,213 కరోనా పాజిటివ్ కేసలు నమోదు కాగా, 97 మంది దేశవ్యాప్తంగా మరణించారు. అయితే భారతదేశంలో కరోనా బారిన పడి కోలుకుంటున్న వారి సంఖ్య మాత్రం ఆశాజనకంగా ఉంది. కరోనా పాజిటివ్ వచ్చిన వారిలో కోలుకుంటున్న వారి శాతం 31.15శాతంగా ఉంది. గడిచిన 24 గంటల్లో 1559 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇక ఇప్పటి వరకు దేశం మొత్తం మీద 67,125 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా 20,197 మంది కోలుకోగా, 2,206 మంది మరణించారు. ఇక దేశంలో ప్రస్తుతం 44,029 యాక్టివ్ కేసులు ఉన్నట్లు సోమవారం కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులిటెన్‌లో పేర్కొంది. (ముగ్గురిలో ఒకరికి స్వస్థత) కరోనా బాధితులు హాస్పటల్ నుంచి డిశార్జ్ అయ్యాక హోం క్వారంటైన్లో 10 రోజుల పాటు ఉండాలి ఆరోగ్య మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ లవ్ అగర్వాల్ తెలిపారు. అప్పటికి వారిలో ఎటువంటి లక్షణాలు లేకపోతే క్వారంటైన్ నుంచి బయటకి రావొచ్చని పేర్కొన్నారు. కొత్తగా రూపొందించిన కరోనా డిశార్జ్ పాలసీలో ఈ నిబంధనలు ఉన్నాయన్నారు. హోం ఐసోలేషన్ పూర్తయ్యాక లక్షణాలు లేకుంటే పరీక్షలు చేయాల్సిన అవసరం లేదని లవ్ అగర్వాల్ తెలిపారు. అదేవిధంగా స్వల్ప లక్షణాలు ఉన్న కారణంగా హాస్సటల్లో చేరిన వారిని కూడా ఆసుపత్రిలో ఉంచి మూడు రోజుల పాటు జ్వరం రాకుండా ఉంటే డిశార్జ్ చేస్తామని వారికి డిశార్జ్ చేసే సమయంలో కరోనా పరీక్షలు చేయాల్సిన అవసరం లేదన్నారు. అయితే వారు 10 రోజుల పాటు హోం ఐసోలేషన్‌లో ఉంటే మంచిదని పేర్కొన్నారు. విదేశాల్లో చిక్కుకున్న 4 వేల మందిని స్వదేశానికి తీసుకొచ్చామని తెలిపారు. ఇక దేశంలోని వివిధ రాష్ట్రాల్లో కరోనా కారణంగా చిక్కుకుపోయిన 5 లక్షల మంది వలస కార్మికులను రైళ్ల ద్వారా సొంత రాష్ట్రాలకు తరలిస్తున్నామని వెల్లడించారు. (72 గంటలపాటు పార్శిల్స్ తాకొద్దు!) -
కరోనాపై పోరుకు రైల్వే రెడీ!
సాక్షి, హైదరాబాద్: వచ్చే మరికొద్ది రోజుల్లో దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా పెరుగుతుందని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. గత కొన్ని రోజులుగా నిత్యం సగటున 3 వేలకు పైగా కొత్త పాజిటివ్ కేసులు వస్తుండటం, దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాల్లో లాక్డౌన్ ఆంక్షలను క్రమంగా సడలిస్తుండటంతో కేసుల సంఖ్య ఒక్కసారిగా పెరుగుతుందన్న భావన వ్యక్తమవుతోంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఆసుపత్రులు సరిపోని పరి స్థితి ఉత్పన్నమయ్యే ప్రమాదం ఉండటంతో ముందు జాగ్రత్త చర్యగా ఐసోలేషన్ వార్డులుగా మార్చిన రైల్వే కోచ్‌లను వాడకానికి వీలుగా సిద్ధం చేస్తోంది. ఈ మేరకు కేంద్ర వైద్య శాఖ డీజీ అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతాలను అప్రమత్తం చేశారు. ఆయా రాష్ట్రాల్లో పెరుగుతున్న కేసులకు తగ్గట్టుగా వినియోగించాల్సిన రైళ్లతో కూడిన తొలి విడత జాబితాను సిద్ధం చేసింది. దేశవ్యాప్తంగా 215 రైల్వే స్టేషన్లలో.. దేశవ్యాప్తంగా తొలి విడతగా 215 రైల్వే స్టేషన్లలో ఐసోలేషన్ వార్డులుగా మార్చిన రైళ్లను సిద్ధంగా ఉంచుతున్నారు. ఈ మేరకు కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ రైల్వే శాఖను అప్రమత్తం చేసి, కరోనా రైళ్లను ఉంచాల్సిన స్టేషన్ల వివరాలను అందజేసింది. ఇం దులో భాగంగా తెలంగాణలో సికింద్రాబాద్, కాచి గూడ, ఆదిలాబాద్ స్టేషన్లలో ఒక్కో కరోనా రైలు చొప్పున ఉంచాల్సిందిగా ఆదేశించింది. ఆంధ్రప్రదేశ్ పరిధిలో కేసుల సంఖ్య ఎక్కువగా ఉండటంతో 9 స్టేషన్లలో రైళ్లను సిద్ధం చేయాలని సూచించింది. విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, పలాస, విజయనగరం, రేణిగుంట, మంత్రాలయం రోడ్డు, కొండాపురం, దిగువమెట్ట స్టేషన్లలో ఈ రైళ్లను అందుబాటులో ఉంచుతోంది. వైద్యులు.. ఆక్సిజన్.. ఇతర పరికరాలు.. పాజిటివ్ కేసు రాగానే సమీపంలో ఉన్న ఆసుపత్రికి వేగంగా తరలించాలి. ఆసుపత్రి అందుబాటులో లేకుంటే ఈ రైల్వే కోచ్‌లను వాడుకోవాలని కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ రాష్ట్రాలకు సూచించింది. ఒక రైలులో 22 కోచ్‌లుంటాయి. ప్రతి కోచ్‌లో 9 కూపేలుంటాయి. ఒక కూపేను సిబ్బంది కోసం వదిలేసి మిగతా 8 కూపేలను కరోనా బాధితుల చికిత్సకు కేటాయించారు. ప్రతి కూపేలో రెండు చొప్పున బెడ్లుంటాయి. కోచ్‌లో రెండు టాయిలెట్లు, ఒక స్నానాల గది ఉంటుంది. ప్రతి కోచ్‌లో ఆక్సిజన్ సిలిండర్, విద్యుత్తు వసతి, ఇతర వైద్య పరికరాలు ఉంచాలని రైల్వేను కేంద్ర వైద్య శాఖ కోరింది. ఇప్పటికే ఆ మేరకు ఏర్పాట్లు జరిగాయి. ఈ ప్రత్యేక రైలు ఉన్న స్టేషన్లో ఆక్సిజన్ వసతి ఉన్న అంబులెన్స్‌ను సిద్ధంగా ఉంచాలని రాష్ట్రాలను కోరింది. అందుబాటులో రైల్వే వైద్యులు, సిబ్బంది ఉంటే ఏర్పాటు చేయాలని, లేని చోట రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం చేయాలని కోరింది. తెలంగాణలో సికింద్రాబాద్‌లో ఏర్పాటు చేసిన రైలులో రైల్వే వైద్యులున్నారు. కాచి గూడ, ఆదిలాబా ద్‌లలో మాత్రం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఏపీలో విశాఖ, విజయవాడల్లో మాత్రం రైల్వే వైద్యులుండగా, మిగతా ఏడు చోట్ల రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇక నిరంతరం ఆ రైళ్లలో నీళ్లు అందుబాటులో ఉంచాలి. విద్యుత్ సరఫరాకు ఇబ్బంది లేకుండా చూడాలి, ఐఆర్సీటీసీ ఆధ్వర్యంలో భోజన వసతి కల్పించాలి అని పేర్కొంది. కేసుల సంఖ్య మరింతగా పెరిగితే మరిన్ని స్టేషన్లలో ఇలాంటి రైళ్లను ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే దక్షిణ మధ్య రైల్వే 486 కోచ్‌లను సిద్ధం చేసి ఉంచింది. -
రిమోట్‌తో కరోనా రోగుల పర్యవేక్షణ
కుషాయిగూడ (హైదరాబాద్): ఇకపై కరోనా రోగులకు నేరుగా చికిత్స అందించాల్సిన పనిలేదు. చికిత్స సమయంలో రోగులకు సమీపంలో ఉండి సేవలందిస్తున్న హెల్త్‌కేర్ సిబ్బందికి వైరస్ బా రిన పడతామనే ఆందోళన అవసరం లేదు. ఆసుపత్రిలో, ఐసోలేషన్‌లో ఉన్న రోగుల వద్దకు వెళ్లకుండానే రిమోట్‌తో వైద్యసేవలు అందించే పరికరం అందుబాటులోకి వచ్చింది. నగరంలోని కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఈసీఐఎల్), రిషీకేశ్‌లోని ఆల్ ఇండియా మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్)తో కలిసి కరోనా రోగులకు రిమోట్‌తో వైద్యం అందించే పరికరాన్ని రూపొందించింది. దీనికి రిమోట్ హెల్త్ మా నిటరింగ్ సొల్యూషన్‌గా నామకరణం చేశారు. దీనిని ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి త్రివేంద్రసింగ్ రావత్, ఎయిమ్స్ డైరెక్టర్ పద్మ శ్రీ ప్రొఫెసర్ రవికాంత్‌తో కలిసి ఎయిమ్స్‌లో వీడియో కాన్ఫరెన్స్‌లో ప్రారంభించి నట్లు ఈసీఐఎల్ సంస్థ వర్గాలు బుధవారం ఓ ప్రకటనలో పేర్కొన్నాయి. చేతి గడియారం మాదిరిగా ఉన్న ఈ పరికరాన్ని పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించారు. ఐసోలేషన్‌లో ఉన్నవారిని 24 గంటల పాటుగా పర్యవేక్షించడానికి ఉపయోగపడటంతో పాటు, పీపీఈ కిట్ల డిమాండ్‌ను కూడా ఇది తగ్గించే అవకాశం ఉంది. ఈ అధునాతన పరికరం రోగి శరీర ఉష్ణోగ్రత, ఆక్సిజన్ శాతం, హృదయ స్పందన, ఏ జోన్లో ఉన్నాడన్న అంశాలనూ తెలియజేస్తుంది. దీనిని రిషీ కే‹శ్ వైద్యులు కరోనా రోగులపై విజయవంతంగా పరీక్షిం చారు. ప్రస్తుతం వినియోగానికి సిద్ధంగా ఉందని చెప్పారు. -
135 మంది సీఆర్పీఎఫ్ జవాన్లకు కోవిడ్
సాక్షి, న్యూఢిల్లీ: సెంట్రల్ రిజర్వు పోలీస్ ఫోర్స్(సీఆర్పీఎఫ్)లో కరోనా వైరస్ కలకలం రేపింది. ఢిల్లీలోని 31వ బెటాలియన్‌కు చెందిన 135 మంది జవాన్లకు ట్రూపర్లకు కరోనా సోకింది. మరో 22 మందికి సంబంధించిన రిపోర్టులు అందాల్సి ఉంది. రాజధానిలోని మయూర్‌విహార్ ప్రాంతంలో ఉండే ఈ బెటాలియన్‌లో సుమారు వెయ్యి మంది జవాన్లుంటారు. ఈ బెటాలియన్‌కు చెందిన సబ్ ఇన్స్పెక్టర్(55) ఒకరు ఇటీవల కరోనా వైరస్ సోకి సప్థర్ జంగ్ ఆసుపత్రిలో చనిపోయారు. తాజా పరిణామంతో బెటాలియన్ కార్యాలయాన్ని మూసివేసి, అందులోని వారందరినీ ఐసొలేషన్ సెంటర్‌కు తరలించినట్లు అధికారులు తెలిపారు. -
కరోనా: ఐసోలేషన్ నుంచి పారిపోయి..
పుణె: కరోనా అనుమానితులు ఐసోలేషన్ కేంద్రాల నుంచి పారిపోతున్న ఘటనలు అక్కడక్కడా వెలుగు చూస్తున్నాయి. తాజాగా మహారాష్ట్రలోని బలేవాడీ ప్రాంతంలో ఇలాంటి ఘటన వెలుగులోకి వచ్చింది. 70 ఏళ్ల కరోనా బాధితుడు ఐసోలేషన్ కేంద్రం నుంచి తప్పించుకుని 17 కిలోమీటర్లు నడుచుకుంటూ ఎరవాడలోని తన ఇంటికి వెళ్లిపోయారు. ఐసోలేషన్ సెంటర్లో సరైన సదుపాయాలు కల్పించకపోవడంతో పారిపోయానని అతడు మీడియాతో చెప్పాడు. సరైన ఆహారం పెట్టలేదని, మరుగుదొడ్లు శుభ్రంగా లేవని వెల్లడించాడు. కుటుంబ సభ్యులందరినీ క్వారంటైన్‌కు తరలించడంతో తాళం వేసివున్న ఇంటి ముందు దీనంగా కూర్చుని వున్న వృద్ధుడిని మంగళవారం సాయంత్రం స్థానికులు గుర్తించారు. ఎరవాడ ప్రాంత కార్పొరేటర్‌కు వారు సమాచారం అందించడంతో అతడు అంబులెన్స్‌లో తిరిగి ఐసోలేషన్ కేంద్రానికి వృద్ధుడిని తరలించాడు. అతడి కుమారుడు రెండు గంటల పాటు నచ్చజెప్పిన తర్వాత ఐసోలేషన్‌లో ఉండేందుకు వృద్ధుడు అంగీకరించాడు. ‘నేను సమాచారం ఇచ్చే వరకు వృద్ధుడు పారిపోయాడన్న విషయం కూడా అధికారులు గుర్తించలేదు. కరోనా అనుమానిత లక్షణాలతో ఏప్రిల్ 24న అతడిని రక్షక్నగర్ క్వారైంటన్ సెంటర్‌కు తరలించారు. తర్వాత రోజు కోవిడ్-19 నిర్థారణ కావడంతో అతడిని బలేవాడీలోని ఎన్ఐసీఎంఏఆర్కు తరలించార’ని కార్పొరేటర్ సిద్ధార్ట్ దండే తెలిపారు. ఐసోలేషన్ కేంద్రంలో తగిన సౌకర్యాలు కల్పించాలని ఉన్నతాధికారులను ఆయన కోరారు. కాగా, ఐసోలేషన్ నుంచి పారిపోయిన వృద్ధుడు ఎవరినీ కలవకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. మృతదేహంతో 3 వేల కి.మీ. ప్రయాణం.. -
కరోనా తీవ్రత తక్కువగా ఉన్నవారికి ఊరట..
సాక్షి, హైదరాబాద్ : ఎవరికైనా కరోనా వస్తే చికిత్స కోసం ఇక ఆస్పత్రులకు వెళ్లక్కర్లేదు. రోజుల తరబడి ఆస్పత్రుల్లోని ఐసోలేషన్ వార్డుల్లో ఉండాల్సిన అవసరం అంతకంటే లేదు. కరోనా రోగులకు చికిత్స చేసే విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా పాజిటివ్ నిర్ధారణ అయి, వ్యాధి తీవ్రత తక్కువగా ఉన్నవారు తమ ఇంట్లోనే చికిత్స పొందే అవకాశం కల్పించింది. అలాంటివారు ఇంట్లోనే ప్రత్యేక ఐసోలేషన్‌లో ఉంటూ వైద్యులు సూచించిన మందులు వాడితే సరిపోతుంది. ఇందుకోసం ముందుగా స్వీయ ధ్రువీకరణ పత్రం ఇవ్వాల్సి ఉంటుంది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ తాజాగా మార్గదర్శకాలు జారీచేసింది. అయితే, ఇరుకుపాటి ఇళ్లున్నవారికి ఈ వెసులుబాటు వర్తించదు. మిగతా కుటుంబ సభ్యులతో కలవకుండా ప్రత్యేక గదిలో ఉండటానికి వీలున్నవారికే ఇది వర్తిస్తుంది. ఒకవేళ వైద్యుల పర్యవేక్షణలో ఆస్పత్రుల్లోనే ఉంటామని చెబితే.. వారికి అలాగే చికిత్స అందజేస్తారు. ప్రస్తుతం కరోనా పాజిటివ్ రోగులందరినీ ప్రభుత్వ ఆస్పత్రిలోనే ఉంచి చికిత్స చేస్తున్నారు. ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స చేయడానికి కూడా అనుమతి ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో కరోనా రోగులు ఇంట్లోనే ఉంటూ చికిత్స పొందే వెసులుబాటు ఇవ్వడం సంచలనంగా మారింది. అయితే, ఇది ఆచరణ సాధ్యమేనా అని పలువురు వైద్య నిపుణులు సందేహం వ్యక్తం చేస్తున్నారు. చదవండి: తగ్గని కరోనా ప్రకోపం వైద్యుడి సలహా మేరకే ఇంట్లో చికిత్స కరోనా పాజిటివ్ లక్షణాలుండి, తీవ్రత తక్కువ ఉన్న రోగి ఇంట్లో ఐసోలేషన్‌లో ఉంటూ చికిత్స తీసుకోవాలంటే, సంబంధిత వైద్యుడి అనుమతి ఉండాలి. అలా ఉంచడం వల్ల వైద్యపరంగా ఎటువంటి ఇబ్బందులుండవని సదరు వైద్యుడు నిర్ధారించాలి. అలాగే స్వీయ దిగ్బంధంలో ఉండే పరిస్థితులు రోగికి ఉన్నాయా లేదా డాక్టర్ తెలుసుకోవాలి. రోగి సంరక్షణ బాధ్యతలు తీసుకునేవారు తప్పనిసరిగా ప్రొటోకాల్ ప్రకారం హైడ్రాక్సీక్లోరోక్విన్ మందులు, రోగనిరోధక శక్తినిచ్చే ఆహారం తీసుకోవాలి. రోగి మొబైల్లో తప్పనిసరిగా ఆరోగ్య సేతు యాప్ ఉండాలి. అది ఎల్లప్పుడూ బ్లూటూత్ లేదా వైఫై ద్వారా యాక్టివ్‌లో ఉండాలి. వైద్య నిఘా బృందాలు ఆ రోగి కదలికలను ఎప్పటికప్పుడూ పర్యవేక్షిస్తుంటాయి. ఇవన్నీ సక్రమంగా పాటించేవారు మాత్రమే ఇంట్లో ఉండి చికిత్స తీసుకోవడానికి అర్హులని కేంద్రం స్పష్టంచేసింది. ఒకవేళ ఈ నిబంధనలను ఉల్లంఘిస్తే తక్షణమే ఆసుపత్రికి తరలిస్తారు. చదవండి: లాక్డౌన్ సమస్యలపై సుప్రీం విచారణ రోగి ఇంట్లో ఎలా ఉండాలంటే? ►ఎప్పుడూ ట్రిపుల్ లేయర్ మెడికల్ మాస్క్ వాడాలి. 8 గంటలు ఉపయోగించిన తర్వాత దానిని మార్చాలి. ఒక్కోసారి అంతకంటే ముందుగానే తడిగా ఉన్నా, ఏదైనా మురికిగా ఉన్నా వెంటనే తీసేయాలి. ►మాస్క్‌ను సోడియం హైపోక్లోరైట్‌తో క్రిమిసంహారకం చేసిన తర్వాత తగిన జాగ్రత్తలు తీసుకుని పారేయాలి. ►రోగి తప్పనిసరిగా ఇతర వ్యక్తుల నుంచి దూరంగా ఉండాలి. ముఖ్యంగా వృద్ధులు, బీపీ, షుగర్, గుండె, మూత్రపిండ వ్యాధులు ఇతరత్రా అనారోగ్యంగా ఉన్న వారికి దగ్గరగా ఉండకూడదు. ►రోగి తప్పనిసరిగా విశ్రాంతి తీసుకోవాలి, అవసరమైనంత నీరు, పళ్ల రసాలు తాగాలి. శ్వాసకోశ సమస్యలు రాకుండా చూసుకోవాలి. ►చేతులను తరచుగా సబ్బు, నీటితో 40 సెకన్ల పాటు కడుక్కోవాలి. లేదంటే ఆల్కహాల్ ఆధారిత శానిటైజర్‌తో శుభ్రం చేసుకోవాలి. ►వ్యక్తిగత వస్తువులను ఇతర వ్యక్తులతో పంచుకోవద్దు. రోగి తాకిన ప్రదేశాలను, వస్తువులను, మందులను, తలుపు హ్యాండిళ్లను హైపోక్లోరైట్ ద్రావణంతో కడగాలి. ►తప్పనిసరిగా వైద్యుడి సూచనల మేరకు మందులు వాడాలి. రోగి సహాయకుడికి సూచనలు... ►రోగితో ఒకే గదిలో ఉంటూ సాయపడే వ్యక్తి ట్రిపుల్ లేయర్ మెడికల్ మాస్క్ ధరించాలి. దాన్ని మరోసారి ఉపయోగించకూడదు. ►తినడానికి ముందు, టాయిలెట్‌కు వెళ్లొచ్చాక కనీసం 40 సెకన్లపాటు చేతులు కడుక్కోవాలి. చేతులు కడుక్కోవడానికి సబ్బు, నీరు వాడాలి. లేకుంటే ఆల్కహాల్ ఆధారిత హ్యాండ్ రబ్ ఉపయోగించవచ్చు. ► రోగికి దగ్గరగా ఉండకూడదు. అతడు/ఆమె శరీర ద్రవాలు, ముఖ్యంగా నోటి ద్వారా వచ్చే తుంపర్లకు దూరంగా ఉండాలి. ►రోగికి సపర్యలు చేసేప్పుడు గ్లౌజులు ధరించాలి. వాటిని తొలగించిన తర్వాత చేతిని శుభ్రంగా కడుక్కోవాలి. ►రోగి వాడే వస్తువులను సహాయకుడు ఉపయోగించకూడదు. సిగరెట్లు పంచుకోవడం, పాత్రలు, వంటకాలు, పానీయాలు, ఉపయోగించిన తువ్వాళ్లను ఎట్టిపరిస్థితుల్లోనూ వాడకూడదు. రోగి వాడిన సబ్బును కూడా వినియోగించకూడదు. ►రోగి దుస్తులు, వాడే వస్తువులను శుభ్రపరిచేటప్పుడు ట్రిపుల్ లేయర్ మెడికల్ మాస్క్‌తోపాటు, గ్లౌజ్‌లు వేసుకోవాలి. ►రోగి రోజువారీ ఉష్ణోగ్రత చూస్తుండాలి. జ్వరం, దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే వెంటనే డాక్టర్‌కు తెలియజేయాలి. -
ఐసోలేషన్ వార్డులుగా నాన్ఏసీ కోచ్‌లు
-
రైల్వే ఐసోలేషన్ కోచ్‌లు సిద్ధం
సాక్షి, హైదరాబాద్: కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఆసుపత్రులకు సహాయకంగా ఉండేలా రైల్వేశాఖ నాన్ ఏసీ కోచ్‌లను ఐసోలేషన్ వా ర్డులుగా మార్చేసింది. దేశవ్యాప్తంగా 5 వేల కోచ్‌లను సిద్ధం చేయాలని లక్ష్యం గా పెట్టుకుంది. ఇందులో దక్షిణ మధ్య రైల్వేకు 486 అప్పగించింది. తాజాగా జోన్ పరిధిలో అన్ని కోచ్‌లు ఐసోలేషన్ వార్డులుగా సిద్ధమయ్యాయి. ఇలా డివి జన్ల వారీగా..సికింద్రాబా ద్ డివిజన్ 120 కోచ్‌లు, హైదరాబాద్ డివిజన్ 40 కోచ్‌లు, లాలాగూడ వర్క్‌షాప్ 76 కోచ్‌లు, విజయవాడ డివిజన్ 50 కోచ్‌లు, గుంతకల్లు డివి జన్ 61 కోచ్‌లు, గుంటూ రు డివిజన్ 25, నాంథేడ్ డివిజన్ 30 కోచ్‌లు, తిరుపతి వర్క్‌షాప్ 84 కోచ్‌లు ఐసోలేషన్ గదులుగా రెడీ అయ్యాయి. ఆసుపత్రులు సరిపోని పక్షంలో ప్రత్యామ్నాయంగా వీటిని ఉపయోగిస్తారు. ఒక కోచ్‌లో 9 కూపేలుంటాయి. ఇందులో 8 కూపేలను ఐసో లేషన్ వార్డులుగా, ఒక కూపేను సిబ్బంది కోసం కేటాయించారు. ప్రతి కోచ్‌లో స్నానాల గది, మూడు టాయిలెట్లు ఉంటాయి. ప్రతి కూపేలో రెండు బెర్తులు బెడ్లుగా మార్చారు. కూపే కూపేకు మధ్య తెరలను ఏర్పాటు చేశారు. ఆక్సిజన్ సిలిండర్లు, వైద్య పరికరాలు, విద్యుత్తుపరమైన ఏర్పాట్లు సిద్ధం చేశారు. -
ఐసోలేషన్ కోచ్‌లు రెడీ
సాక్షి, హైదరాబాద్: కరోనా కట్టడిలో భాగంగా భారతీయ రైల్వే బహుముఖ వ్యూహాలను అమలు చేస్తోంది. అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగించుకునేందుకు వీలుగా 5000 నాన్ ఏసి కోచ్‌లను ఐసోలేషన్ వార్డులుగా మార్చాలనే ఆలోచనలో భారతీయ రైల్యే ఉంది. ఇందులో భాగంగా 486 కోచ్‌లను తయారు చేయాలని దక్షిణ మధ్య రైల్వే జోన్‌కు లక్ష్యాన్ని నిర్దేశించింది. తదనుగుణంగా, సికింద్రాబాద్ డివిజన్ 120 కోచ్‌లు, హైదరాబాద్ డివిజన్ 40 కోచ్‌లు, విజయవాడ డివిజన్ 50 కోచ్‌లు, గుంతకల్లు డివిజన్ 61 కోచ్‌లు, నాందేడ్ డివిజన్ 30 కోచ్‌లు, గుంటూరు డివిజన్ 25 కోచ్‌లు, లాలాగూడ వర్క్‌షాప్ 76 కోచ్‌లు, తిరుపతి వర్క్‌షాప్ 84 కోచ్‌లను ఐసోలేషన్ కోచ్‌లుగా మార్చాయి. ఇందుకు సంబంధించి దక్షిణమధ్య రైల్వే ప్రెస్‌నోట్‌ను విడుదల చేసింది. (బోగీల్లో 20 వేల ఐసోలేషన్ పడకలు!) ప్రతి ఐసోలేషన్ వార్డులో కరోనా బాధితుల కోసం 8 కూపేలు, వైద్య సిబ్బంది కోసం ఒక కూపే ఉంటాయని నోట్లో తెలిపారు. రైల్వే బోర్డు మార్గదర్శకాలకు అనుగుణంగా అన్ని కోచ్‌లలో స్నానాల గది, 3 టాయిలెట్లు, కూపేల మధ్య తెరలు, అవసరమైన ఎలక్ట్రిక్, వైద్య పరికరాలు అమర్చడం జరిగిందని ఆ నోట్లో దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. నిర్దేశించిన లక్ష్యంలోగా ఐసోలేషన కోచ్‌లను తయారు చేసిన దక్షిణ మధ్య రైల్వే అధికారులను, సిబ్బందిని జనరల్ మేనేజర్ శ్రీగజానన్ మాల్యా అభినందించారు. (రైల్వే బుకింగ్‌లు షురూ!) -
కరోనా: హమ్మయ్య .. బయటపడ్డాం!
సాక్షి, మచిలీపట్నం: స్వీయ నిర్బంధం ముగిసింది. వారంతా బంధవిముక్తులయ్యారు. విదేశాల నుంచి వచ్చిన వారితో పాటు వారి కుటుంబ సభ్యులకు కూడా ఎట్టకేలకు గృహ నిర్బంధం నుంచి విముక్తి లభించింది. ఇంటిల్లిపాదికి ఒకటి, రెండుసార్లు నిర్వహించిన టెస్టుల్లో నెగిటివ్ రిపోర్టులు రావడంతో కరోనా మహమ్మారి నుంచి బయట పడ్డామంటూ వారంతా సంబరపడిపోతున్నారు. జిల్లా అంతటా జల్లెడ విదేశాల నుంచి వచ్చిన వారి నుంచే కరోనా వ్యాప్తి చెందుతుందన్న ప్రచారంతో తొలుత జిల్లా అంతటా జల్లెడ పట్టారు. వలంటీర్ల ద్వారా ఇంటింటి సర్వే చేసి విదేశాల నుంచి వచ్చిన వారిని గుర్తించారు. ఈ విధంగా జిల్లా వ్యాప్తంగా 2,443 మందిని గుర్తించి హోం ఐసోలేషన్‌లో పెట్టారు. వారి భార్య, బిడ్డలు, తల్లిదండ్రులను కూడా కలవకుండా 28రోజుల గృహనిర్బంధంలో ఉంచారు. 24గంటలు వీరి కదలికలపై నిఘా ఉంచారు. ఇళ్ల ముందు పోలీస్ పహారా పెట్టారు. పావుగంట పాటు బయట కొచ్చారనే కారణంతో మచిలీపట్నం, నూజివీడు, మైలవరం, పెదపారుపూడి, ఇనుగుదురు ప్రాంతాలకు చెందిన ఆరుగురిపై క్రిమినల్ కేసులు కూడా పెట్టారు. ఆంక్షలు సడలించిన వేళల్లో కూడా ఈ కుటుంబాల నుంచి ఏ ఒక్కర్ని బయట తిరగ నివ్వలేదు. 28 రోజుల గృహ నిర్బంధం.. విదేశాల నుంచి వచ్చిన వారిలో ముగ్గురికి పాజిటివ్ రావడంతో వారిని ఆస్పత్రికి, వారి కుటుంబ సభ్యులను క్వారంటైన్ కేంద్రాలకు తరలించారు. అయితే పాజిటివ్ వచ్చిన వారు అదృష్టవశాత్తు పూర్తిగా కోలుకున్నారు. వారి కుటుంబ సభ్యులందరికీ నెగిటివ్ రిపోర్టులు రావడంతో జిల్లా యంత్రాంగం ఊపిరిపీల్చుకుంది. ఇక హోం ఐసోలేషన్‌లో ఉన్న 2,443 మందికి నిర్ధేశించిన గడువు ముగిసిందని జిల్లా కలెక్టర్ ఏఎండీ ఇంతియాజ్ ప్రకటించడంతో ఇక తాము కరోనాను జయించామన్న ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎట్టకేలకు 28 రోజుల గృహ నిర్బంధం నుంచి బయటపడడంతో వారంతా ఊపిరి పీల్చుకుంటున్నారు. చాలా ఆనందంగా ఉంది.. నేను ఇటలీ రాజధాని రోమ్‌లో మాస్టర్ సైన్స్ చదవుతున్నా. కుటుంబ సభ్యులను చూసేందుకు గత నెలలో ఇంటికొచ్చాను. కరోనా కట్టడి కోసం విదేశాల నుంచి వచ్చిన వారిని వలంటీర్ల ద్వారా గుర్తించి హోం క్వారంటైన్లో పెట్టి ఎప్పటికప్పుడు పరీక్షలు చేయడం వలన వ్యాధి వ్యాప్తి కాకుండా కొంతవరకు అడ్డుకట్ట వేయగలిగారు. హోం క్వారంటైన్లో ఉన్న నన్ను ప్రతి రోజు వైద్యులు పరీక్షించేవారు. నాతో పాటు నా కుటుంబ సభ్యుల ఆరోగ్య పరిస్థితిని కూడా ఎప్పటికప్పుడు తెలుసుకునే వారు. నాకు రెండుసార్లు కరోనా టెస్ట్ చేశారు. నెగిటివ్ వచ్చింది. మా కుటుంబ సభ్యులకు మంగళవారం ర్యాపిడ్ టెస్టులు చేశారు. ఎలాంటి ఇబ్బంది లేదు. 28 రోజుల గృహనిర్భందం ముగియడంతో ఆనందంగా ఉంది. –పైరాడ రాజు, తుర్రకుంటపాలెం, జగ్గయ్యపేట మండలం గృహ నిర్బంధం ముగిసింది విదేశాల నుంచి 2,443 మంది జిల్లాకు వచ్చినట్టుగా గుర్తించి వారిని 28 రోజుల పాటు గృహ నిర్బంధంలో ఉంచాం. వారి గృహనిర్బంధం ముగిసింది. ముగ్గురికి పాజిటివ్ రాగా, వారు కోలుకున్నారు. –కె.మోహనకుమార్, జేసీ–2 -
ఐసోలేషన్‌కు కాదు.. జైలుకు వెళ్లాడు
న్యూఢిల్లీ: బీసీసీఐ అనుబంధ రాష్ట్ర క్రికెట్ సంఘాల్లో ప్రధాన కార్యదర్శి అనేది ప్రతిష్టాత్మక పదవి. అందులోనూ దేశ రాజధానికి చెందిన ఢిల్లీ అండ్ డిస్ట్రిక్ట్స్ క్రికెట్ అసోసియేషన్ (డీడీసీఏ)లో ఆ హోదాకు ఉండే విలువే వేరు. అలాంటి వ్యక్తి, డీడీసీఏ ప్రధాన కార్యదర్శిగా పని చేస్తున్న వినోద్ తిహారా నెలరోజులుగా కనిపించకుండా పోయాడు. కొందరు సన్నిహితులు చెప్పిన సమాచారం మేరకు ఆయనకు కరోనా సోకినట్లు అసోసియేషన్ సహచరులు భావించారు. ప్రస్తుతం ఐసోలేషన్‌లో ఉన్నట్లు కూడా కుటుంబసభ్యులు ఖరారు చేయడంతో అంతా అలాగే అనుకున్నారు. డీడీసీఏలో జరిగిన అవినీతి గురించి ఇటీవల విచారణ జరిగిన సమయంలో కూడా ఒక లాయర్ ఇదే విషయాన్ని చెప్పారు. అయితే అసలు సంగతి బయటపడటంతో అంతా అవాక్కయ్యారు. జీఎస్టీకి సంబంధించి ఒక కేసులో తిహారాను పోలీసులు అరెస్టు చేయడంతో ప్రస్తుతం ఆయన మీరట్ జైల్లో ఉన్నారు. నేరం తీవ్రత స్పష్టత తెలియకపోయినా... జీఎస్టీ నిబంధనలు ఉల్లంఘించడంతోనే మార్చి 17న తిహారాను అరెస్టు చేసినట్లు పోలీసు ఉన్నతాధికారులు నిర్ధారించారు. మరోవైపు అసోసియేషన్‌కు సంబంధించిన ఒక కీలక పత్రంపై కూడా తిహారా సంతకం చేసినట్లు ఉండగా, అది అతను జైల్లో ఉన్న తేదీతో విడుదల కావడంతో డీడీసీఏ సభ్యులకు షాక్ తగిలింది. లాక్డౌన్ కారణంగా ఇప్పటి వరకు తిహారాకు బెయిల్ తీసుకునే అవకాశం లభించలేదు. -
ఇంటి వద్దే ‘కరోనా’ శాంపిళ్ల సేకరణ
సాక్షి, హైదరాబాద్: ఇకపై కరోనా లక్షణాలున్న అనుమానితులు తమ శాంపిళ్లు ఇవ్వడానికి నిర్ధేశించిన ఆసుపత్రులకు రావాల్సిన అవసరంలేదు. వారి ఇళ్ల వద్దకే వెళ్లి శాంపిళ్లు సేకరించాలని వైద్య, ఆరోగ్యశాఖ నిర్ణయించింది. దీనికోసం ప్రత్యేకంగా ఒక వాహనాన్ని సిద్ధం చేస్తోంది. దీన్ని కరోనా శాంపిళ్ల సేకరణ సంచార వాహనంగా పిలుస్తారు. ఎక్కువ కేసులు హైదరాబాద్‌లో నమోదవుతున్నందున, ఇక్కడి నుంచే ఈ వాహన సేవలు ప్రారంభించాలని యోచిస్తున్నారు. నేరుగా అనుమానితుడి ఇంటికెళ్లి, అక్కడే శాంపిళ్లను సేకరిస్తారు. ఆ శాంపిళ్లను ప్రత్యేకంగా భద్రపరిచి ఈ వాహనంలో నిర్ధారణ పరీక్షా కేంద్రానికి తీసుకెళ్తారు. ఇందుకోసం అత్యాధునిక రిఫ్రిజిరేటర్లు, ఇతర పరికరాలను కొనుగోలు చేస్తున్నారు. ఫలితాలు వచ్చేదాకా హోం క్వారంటైన్‌లోనే... సేకరించిన శాంపిళ్ల నిర్ధారణ పరీక్షలు వచ్చేదాకా అనుమానిత వ్యక్తులను హోం క్వారంటైన్లో ఉంచుతారు. ఒకవేళ వారికి పాజిటివ్ వస్తే నిర్ధేశించిన ఆ సుపత్రికి తరలిస్తారు. ఇలా ఇంటికే వచ్చి నమూనాలను సేకరించి పరీక్షలకు పంపడం వల్ల సమయం ఆదాతో పాటు తక్కువ సమయంలో ఎక్కువ శాంపిళ్లను సేకరించవచ్చని అధికారులు అంటున్నారు. ఆసుపత్రుల్లో ఐసోలేషన్‌కు స్వస్తి: అనుమానితులందరినీ ఒకేచోట ఉంచడం వల్ల, వాళ్లలో ఒకరి నుంచి ఒకరికి వైరస్ సోకే ప్రమాదం ఉంది. పరీక్షా ఫలితాలు ఆలస్యం అవుతున్న కొద్దీ ఆసుపత్రుల్లో ఐసోలేషన్‌లో ఉన్న అనుమానితులు అసహనానికి లోనవుతున్నారు. ఇంటి వద్దే శాంపిళ్లను సేకరించడం వల్ల ఇలాంటి సమస్యలను అధిగమించొచ్చని అధికారులు భా విస్తున్నారు. కంటైన్మెంట్ జోన్లలో ఒకేసారి భారీగా శాంపిళ్లను సేకరించాల్సి వచ్చినా, ఈ విధా నం ఉపయోగకరంగా ఉంటుందని చెబుతున్నారు. ఇంటింటి సర్వేలో 2,200 అనుమానితులు.. కంటైన్మెంట్ ఏరియాల్లో ఇంటింటి సర్వే ద్వారా లక్ష లాది మందిని వైద్య బృందాలు కలిసి వివరాలు సే కరించాయి. ఇంటింటి సర్వేలో ఇప్పటివరకు 2,200 మంది కరోనా లక్షణాలున్న అనుమానితులను గుర్తించినట్లు వైద్య, ఆరోగ్యశాఖ వర్గాలు తెలిపాయి. అయితే వారందరికీ పరీక్షలు నిర్వహించగా నెగటివ్ వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. -
ఆస్పత్రికా? ఇంటికా?
లక్ష కిట్లను ఏపీ సర్కారు దక్షిణ కొరియా నుంచి రప్పించింది. దీంతో ఎక్కువ మందికి కరోనా టెస్టులు చేసే అవకాశం వచ్చింది. సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ర్యాపిడ్ యాంటీబాడీస్ టెస్టులు అందుబాటులోకి వచ్చాయి. లక్ష కిట్లను ఏపీ సర్కారు దక్షిణ కొరియా నుంచి రప్పించింది. దీంతో ఎక్కువ మందికి కరోనా టెస్టులు చేసే అవకాశం వచ్చింది. ఈ టెస్టులు కరోనా లక్షణాలు ఉన్నవారికి, రెడ్‌జోన్‌లో ఉన్నవారికి, హైరిస్క్ గ్రూపులకు మాత్రమే చేస్తారు. ఈ టెస్టులతో బాధితులను గుర్తించి చికిత్సకు పంపడమా, లేదా ఐసొలేషన్‌లో ఉంచడమా అనేది ప్రాథమిక దశలోనే తేల్చవచ్చు. పది నిముషాల్లో ఫలితాలు వస్తున్నందున ఎక్కువ మందికి టెస్టులు చేసి లక్షణాలను గుర్తించే అవకాశాలు ఉంటాయి. అయితే ర్యాపిడ్ టెస్టుల్లో ఐజీఎం (ఇమ్యునోగ్లోబులిన్ మ్యూ) అనేది ఒకటి, ఐజీజీ (ఇమ్యునోగ్లోబులిన్ గామా) అనేది మరొకటి ఉంటుంది. ఐజీఎం పాజిటివ్ వస్తే వీరిని వైరాలజీ టెస్టుకు పంపి.. అనంతరం చికిత్స కోసం ఆస్పత్రికి తరలిస్తారు. ఐజీఎం, ఐజీజీ రెండూ పాజిటివ్ వస్తే వీరికి ఇన్ఫెక్షన్ ఉన్నా దానికి తగ్గట్టు యాంటీ బాడీస్ కూడా వృద్ధి అయి నట్టని నిపుణులు చెబుతున్నారు. టెస్టుల ఫలితాలు పరిశీలిస్తే... ► ఐజీఎం పాజిటివ్ వచ్చి ఐజీజీ నెగిటివ్ వస్తే వారిని వెంటనే ఆర్టీపీసీఆర్ (వైరాలజీ ల్యాబొరేటరీ టెస్టు)కు పంపిస్తారు. ► ఆర్టీపీసీఆర్ టెస్టులో కూడా పాజిటివ్ వస్తే వారిని ఆస్పత్రిలో చేరుస్తారు. నెగిటివ్ వస్తే హోం ఐసొలేషన్‌లో ఉంచుతారు. ► ఐజీఎం, ఐజీజీ రెండూ నెగిటివ్‌వస్తే వారిని ఇంటికి పంపిస్తారు. వారు హోం ఐసొలేషన్‌లో ఉంటే మంచిది. ► ఐజీఎం నెగిటివ్ వచ్చి, ఐజీజీ పాజిటివ్ వస్తే రెండు వారాలు హోం ఐసొలే షన్లో ఉండాలి. వీరినే కోవిడ్ వారియర్స్‌గా పిలు స్తారు. అంటే వైరస్ సోకినా దాన్నుంచి బయటపడి యాంటీబాడీస్ అభివృద్ధి అయిన వారి కింద లెక్క. ► ఐజీఎం పాజిటివ్ వచ్చి, ఐజీజీ కూడా పాజిటివ్ వస్తే.. కరోనా లక్షణాలున్న వారు, 60 ఏళ్లు దాటిన వారు, దీర్ఘకాలిక జబ్బులతో బాధపడుతున్న వారిని ఆస్పత్రికి పంపిస్తారు. ► వైరస్ ఉన్నా లక్షణాలు కనిపించక పోతే (ఎసిం ప్టమాటిక్) వారిని సింగి ల్ రూమ్ ఐసొలేషన్‌లో ఉంచుతారు. కరోనా వైరస్ నియంత్రణకు ‘ఫ్లాస్మా థెరపీ’ మంగళగిరి ఎయిమ్స్‌లో ఏర్పాటుకు కేంద్రానికి వినతి మంగళగిరి: కరోనా వైరస్ నియంత్రణకు మంగళగిరిలోని ఆల్ ఇండియా మెడికల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ (ఎయిమ్స్)లో కొత్తగా ఫ్లాస్మా థెరపీ అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఎయిమ్స్ డైరెక్టర్ రవికుమార్ తెలిపారు. ఏపీలో తొలిసారిగా ఫ్లాస్మాథెరపీ నిర్వహించడంతో పాటు వైరస్ వ్యాధుల నివారణకు పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని కోరుతూ కేంద్రానికి లేఖ రాసినట్లు శనివారం తెలిపారు. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఫ్లాస్మాథెరపీ ప్రాధాన్యం పెరిగిందన్నారు. ఫార్మాకో ఇమ్యూనో సెంటర్‌ఫర్ ఎక్స్‌లెన్స్ ఏర్పాటుతో థెరపీ చాలా సులువుగా ఉంటుందన్నారు. -
ఒకే ఇంట్లో వేరు వేరుగా ఉన్నాం
రష్యాకు చెందిన క్రీడాకారుడు ఆండ్రీ కొశ్చివ్‌ను రెండేళ్ల క్రితం శ్రియ వివాహం చేసుకున్న సంగతి గుర్తుండే ఉంటుంది. ఈ దంపతులు స్పెయిన్‌లోని బార్సిలోనాలో ఉంటున్నారు. కోవిడ్ 19 (కరోనా వైరస్) మహమ్మారి తీవ్రస్థాయిలో ఉన్న ప్రపంచదేశాల్లో స్పెయిన్ ఒకటి. తన భర్త ఆండ్రూలో కోవిడ్ 19 లక్షణాలు కనిపించడంతో చాలా కంగారుపడ్డానని శ్రియ పేర్కొన్నారు. ఈ విషయం గురించి శ్రియ చెబుతూ– ‘‘పొడి దగ్గు, జ్వరంతో ఆండ్రీ బాధపడుతున్నాడని హాస్పిటల్‌కు వెళ్లాం. కానీ అక్కడి వైద్యులు మమ్మల్ని వెంటనే వెళ్లిపొమ్మన్నారు. ఆండ్రీకు కరోనా లక్షణాలు లేవని, ఇక్కడే (హాస్పిటల్లో) ఉంటే నిజంగా వచ్చే అవకాశాలు ఉన్నాయని అక్కడి డాక్టర్స్ అన్నారు. దాంతో మేం వెంటనే ఇంటికి వచ్చేశాం. మా అంతట మేం ‘ఐసోలేషన్’లో ఉండిపోయాం. వేరే వేరు గదుల్లో ఉండటం మొదలుపెట్టాం. ఇంట్లో ఉండి ఆండ్రూ చికిత్స చేయించుకున్నాడు. తను కోలుకున్నాడు’’ అని పేర్కొన్నారు. ఇంకా అక్కడి పరిస్థితుల గురించి శ్రియ మాట్లాడుతూ – ‘‘మా వివాహ వార్షికోత్సవాన్ని (ఈ నెల 13) సెలబ్రేట్ చేసుకోవడానికి మేం ఓ రెస్టారెంట్లో రిజర్వ్ చేయించుకున్నాం. తీరా అక్కడికి వెళ్లిన తర్వాత అది క్లోజ్ చేసి ఉంది. బయటి పరిస్థితులను చూసిన తర్వాత కరోనా ప్రభావం ఏ స్థాయిలో ఉందో అర్థమైంది. పోలీసులు మమ్మల్ని అడ్డుకున్నారు. ఆండ్రూ తెల్లగా, నేను బ్రౌన్ కలర్లో ఉండటం వల్ల మేం ఒకే ఫ్యామిలీ కాదనుకుని విడిచిపెట్టారు. అంటే... నిత్యావసరాల కోసం కుటుంబం నుంచి ఒక్కరే బయటకు వెళ్లాలనేది రూల్. ఇలా చూస్తుండగానే మన చుట్టూ ఉన్న పరిస్థితులను కరోనా వైరస్ ఒక్కసారిగా ఎంత మార్చివేసిందో కదా అని మేమిద్దరం అనుకున్నాం’’ అని చెప్పుకొచ్చారు. -
క్వారంటైన్లు ఖాళీ!
సాక్షి, సిటీబ్యూరో: కరోనా ఐసోలేషన్ సెంటర్లు క్రమంగా ఖాళీ అవుతున్నాయి. విదేశాల నుంచి వచి్చన వారితో పాటు మర్కజ్‌కు వెళ్లి వచ్చిన వారి గుర్తింపు, వారి క్వారంటైన్ సహా వైరస్ ఇంకుబేషన్ పీరియడ్ కూడా ముగియడంతో ఇప్పటి వరకు ఆయా సెంటర్లలో చేరి్పంచిన వారిని ఇంటికి పంపిస్తున్నారు. సరోజినీదేవి కంటి ఆస్పత్రి సహా నేచర్‌క్యూర్, చారి్మనార్‌లోని నిజామియా ఆస్పత్రి కార్వంటైన్ సెంటర్లు ఖాళీ అయ్యాయి. రాజేంద్రనగర్‌లో ఐదు క్వారంటైన్ సెంటర్లు ఉన్నాయి. వీటిలో ప్రస్తుతం 160 మంది ఉన్నారు. మేడ్చల్ జిల్లాలో 152 మంది, రంగారెడ్డి జిల్లాలో 135 మంది మాత్రమే ఉన్నారు. గాం«దీ, కింగ్‌కోఠి, ఫీవర్ ఆస్పత్రి ఐసోలేషన్ వార్డుల్లో మరో 364 మంది కరోనా అనుమానిత లక్షణాలతో బాధపడుతున్న వారు ఉన్నారు. వ్యాధి నిర్ధారణ పరీక్షల్లో వీరిలో ఎవరికైనా పాజిటివ్ వస్తే.. ఐసీయూకి తరలించి చికిత్స అందిస్తున్నారు. నెగిటివ్ రిపోర్టు వచి్చన వారిని హోం కార్వంటైన్‌కు తరలించి, వారు ఇంటి నుంచి బయటికి రాకుండా చూస్తున్నారు. కుటుంబసభ్యుల మధ్య వారు.. మార్చి 22 వరకు వివిధ దేశాల నుంచి సుమారు 74 వేల మంది శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. వీరిలో 25,937 వేల మందికిపైగా ప్రభుత్వ క్వారంటైన్ సెంటర్లలో ఉంచారు. వీరిలో 30 మందికి ప్రైమరీ కాంటాక్ట్ ద్వారా కరోనా వైరస్ సోకగా, వీరి నుంచి మరో 20 మంది కుటుంబ సభ్యులకు వైరస్ విస్తరించింది. ఇప్పటికే వీరందరినీ గుర్తించి, చికిత్సలు కూడా అందించారు. కోలుకున్న వారిని ఇంటికి పంపించారు. ఇకపై వీరినుంచి వైరస్ సోకే ముప్పు లేదనే స్పష్టత ప్రభుత్వానికి వచి్చంది. పోలీసు నిఘాలో వీరు.. మార్చి 13 నుంచి 15 వరకు జరిగిన జమాత్‌కు తెలంగాణ నుంచి 1089 మంది వెళ్లినట్లు ప్రభుత్వం గుర్తించింది. వీరిలో జీహెచ్ఎంసీ నుంచి 603 మంది ఉన్నట్లు గుర్తించింది. వీరితో పాటు వీరికి సన్నిహితంగా 3015 మంది ఉండగా, వారందరినీ క్వారంటైన్ సెంటర్లకు తరలిం చింది. వైరస్ కేవలం బాధితులు, వారి కుటుంబ సభ్యుల వరకే పరిమితమైందా? లేక కమ్యూనిటీ ట్రాన్స్మిషన్ ఏమైనా జరిగిందా? అనేది కూడా రెండు మూడు రోజుల్లో తేలనుంది. ఏ ఐసోలేషన్‌లో ఎంత మంది? ప్రస్తుతం గాంధీ ఆస్పత్రి కరోనా నోడల్ సెంటర్లో శనివారం ఉదయం వరకు 295 పాజిటివ్ కేసులు ఉండగా, కరోనా అనుమానిత లక్షణాలతో బాధపడుతున్న వారు మరో 250 మంది ఆస్పత్రి ఐసోలేషన్‌లో ఉన్నారు. ఎర్రగడ్డ ఛాతీ ఆస్పత్రిలో 29 పాజిటివ్ కేసులు ఉండగా, ఆస్పత్రి ఐసోలేషన్ వార్డుల్లో మరో 10 మంది అనుమానితులు ఉన్నారు. కింగ్‌కోఠి జిల్లా ఆస్ప త్రిలో 12 పాజిటివ్ కేసులు ఉండగా, ఐసోలేషన్ వార్డులో మరో 74 మంది అనుమానితులు ఉన్నారు. ఇక ఫీవర్ ఆస్పత్రిలో ఐసోలేషన్ వార్డులో 30 మంది అనుమానితులు ఉన్నారు. -
ఒంటరి నక్షత్రం
కోయంబత్తూరులోని గవర్నమెంట్ ఇ.ఎస్.ఐ. ఆసుపత్రి కోవిడ్ వార్డులో కరోనా కంటే కూడా స్నేహను (అసలు పేరు కాదు) ఎక్కువగా భయపెట్టింది.. తొలిరోజు ఒంటరితనం! 26 ఏళ్ల అమ్మాయి. దేనికీ భయపడని అమ్మాయి. తనే ఆసుపత్రికి వచ్చి, తనే టెస్ట్ చేయించుకుని, తనే అడ్మిట్ అయిన అమ్మాయి. రెండు రోజులు చూసి మూడో రోజు మామూలైపోయింది! తనతో పాటు తెచ్చుకున్న ల్యాప్‌ట్యాప్, కొన్ని పుస్తకాలు.. వాటిలో పడిపోయింది స్నేహ. స్పెయిన్‌లో ఎంబీయే చేస్తోంది ఆమె. రెండో సెమిస్టర్ ఫైనల్ పరీక్షలకు ముందు ఇండియా వచ్చింది. తిరిగి వెళ్దామనుకునే లోపు కరోనా పాజిటివ్‌తో మార్చి 16న హాస్పిటల్లో చేరింది. కరోనా నెగిటివ్‌తో ఏప్రిల్ 6న డిశ్చార్జ్ అయింది. మధ్యలో మూడు వారాల ఒంటరితనం. ఒకరోజుకే ఒణికిపోయిన స్నేహ ఇన్నిరోజుల ఒంటరితనంతో ఎలా ఫైట్ చేసింది. ఫైట్ చెయ్యలేదు. స్నేహం చేసింది! ఒంటరితనంతో స్నేహం ఎవరైనా చేయగలిగిందే. ఐసొలేషన్ ఒంటరితనంలోకి వెళ్లే సాహసాన్ని చేసింది స్నేహ. అందుకు ఆశ్చర్యపోవాలి. స్పెయిన్ నుంచి మొదట ఢిల్లీకి, ఢిల్లీ నుంచి కోయంబత్తూర్‌కి వచ్చింది స్నేహ. నేరుగా ఇంటికి వెళ్లకుండా ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి కరోనా పరీక్షకు శాంపిల్స్ ఇచ్చింది. రిపోర్టులు వచ్చేవరకు ఇంట్లో ఎవరితోనూ కలవకుండా వేరుగా ఉంది. రిపోర్ట్స్‌లో నెగటివ్ అని వచ్చాక కూడా మూడు రోజులు వేరుగా ఉండి మళ్లీ టెస్ట్‌లకు వెళ్లింది. స్పెయిన్‌లో తన క్లాస్‌మేట్‌కు కరోనా పాజిటివ్ వచ్చింది. అదీ అనుమానం స్నేహకు. చివరికి ఆమె అనుమానం నిజమైంది. తనకూ పాజిటివ్! వెంటనే ఆసుపత్రిలో అడ్మిట్ అయింది. మళ్లీ ఇంకో అనుమానం. అమ్మకు, నాన్నకు వచ్చి ఉంటుందా అని! వాళ్లకు టెస్ట్ చేయించింది. నెగటివ్ అని రావడంతో ఆమె మనసులోని భారం దిగిపోయింది. ఈలోగా స్నేహ గురించి వాట్సాప్ గ్రూపులలో వదంతులు! ఫలానా ఏరియాలో, ఫలానా వాళ్ల అమ్మాయి ఫారిన్ నుంచి వచ్చిందనీ.. ఇక్కడ మాల్స్‌లో, మార్కెట్లో తిరిగిందనీ, ఆసుపత్రి నుంచి పారిపోయిందనీ, పట్టుకొచ్చి మళ్లీ హాస్పిటల్లో పెట్టారనీ.. ఇలాంటివి. వాళ్లుండే అపార్ట్మెంట్లో స్నేహ తల్లికీ అంతా దూరంగా జరిగారు. స్నేహకు ఎలా ఉంది అని దగ్గరగా వచ్చి అడగడానికి కూడా వాళ్లు సంశయించారు. బయట స్నేహ తండ్రిని కొందరు ఆపి అడిగేవారు.. ‘పాపకు ఇలాగయిందట కదా’ అని. ఇంత జరిగిందని ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయ్యాక తెలిసింది స్నేహకు. మనిషి పక్కన లేకపోతేనే ఐసొలేషన్లా ఉంటుందే.. ఇక మనుషులే ఉండని ఐసొలేషన్ అంటే.. అంతరిక్ష ద్వీపంలో మినుకు మినుకుమనే ఒంటరి నక్షత్రమే. స్వప్న అనే ఈ నక్షత్రం చివరికి ఒక నిర్ణయానికి వచ్చింది. ఐసోలేషన్ నుంచే ఎంబీయే పరీక్షలకు ప్రిపేర్ అవ్వాలని! పైపైన చదువుదామని పుస్తకాలు తెచ్చుకున్న అమ్మాయి పరీక్షల కోసం స్పెయిన్ కాలమానాలకు అనుగుణంగా రేయింబళ్లు చదివింది. ఆన్లైన్లో పరీక్షలు రాసింది. రాసిన నాలుగు సబ్జెక్టులూ పాస్ అయింది. ఆరోగ్యం పూర్తిగా నయమై బయటికి వచ్చేనాటికి స్నేహ సెకండ్ సెమిస్టర్ కూడా పూర్తయింది. ఒక్కోసారి ఆమె తెల్లవారు జామున 3 గంటల వరకు చదువుతూ కూర్చునేది. ఊరికే చదివితే కాదు. క్లాసులూ వినాలి. అక్కడ స్పెయిన్‌లో మధ్యాహ్నం క్లాసులు మొదలయ్యే సమయానికి ఇక్కడ సిస్టమ్‌లో తను లాగ్ అయ్యేది. వాళ్లు పెట్టిన గడువు సమయానికి అసైన్మెంట్లు పూర్తి చేసి పంపడానికి ఇక్కడ తన టైమ్‌ని సర్దుబాటు చేసుకునేది. ఆసుపత్రి నుంచి వచ్చేసే రోజైతే అక్కడి ఇంటెర్న్షిప్ ఇంటర్వూ్యకి కూడా ఆన్లైన్లోనే హాజరైంది స్నేహ. డిశ్చార్జి అయి ఆపార్ట్మెంట్కి రాగానే ముప్పైమంది వరకు స్నేహకు ఎదురొచ్చి చప్పట్లతో స్వాగతం పలికారు. కొందరు గేటు దగ్గర, కొందరు లిఫ్టు దగ్గర, కొందరు బాల్కనీలలో పూలగుత్తులతో నిలుచున్నారు. పక్కన మనుషులు లేనప్పుడు మాత్రమే కాదు.. చుట్టూ ఎందరున్నా మనకు మనం లేకుండా పోయినప్పుడు మిగిలేది కూడా ఒంటరితనమే. మనకు మనం ఉండటమంటే.. మన లక్ష్యాల వైపు, గమ్యాలవైపు ఒంటరిగానైనా ప్రయాణించగలగడం. ఒంటరితనంలోనూ జీవించగలగడం. -
‘కరోనా’ ప్యాకేజీ 15 వేల కోట్లు
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారిపై పోరాటంలో భాగంగా దేశవ్యాప్తంగా ఆరోగ్య వ్యవస్థను పూర్తిస్థాయిలో బలోపేతం చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ‘భారత్ కోవిడ్–19 అత్యవసర ప్రతిస్పందన, ఆరోగ్య వ్యవస్థ సన్నద్ధత’ ప్యాకేజీకి గురువారం ఆమోదం తెలిపింది. ఈ ప్యాకేజీలో భాగంగా కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు దశల వారీగా మొత్తం రూ.15,000 కోట్లు అందజేయనుంది. వచ్చే నాలుగేళ్లలో మూడు దశల్లో ఈ ప్రాజెక్టును అమలు చేయనున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఈ మేరకు అన్ని రాష్ట్రాల ఆరోగ్య శాఖల ముఖ్య కార్యదర్శులు, కమిషనర్లకు లేఖ రాసింది. మొదటి దశ కింద రూ.7,774 కోట్లు 2020 జనవరి నుంచి జూన్ వరకు మొదటి దశ, 2021 జూలై నుంచి మార్చి వరకు రెండో దశ, 2021 ఏప్రిల్ నుంచి 2024 మార్చి వరకు మూడో దశ అమలవుతుంది. మొదటి దశ అమలు కోసం కేంద్రం అతి త్వరలో అన్ని రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు రూ.7,774 కోట్లు విడుదల చేయనుంది. తొలి దశ కింద ఇచ్చే నిధులను కరోనా బాధితులకు చికిత్స అందించేందుకు ఖర్చు చేయాలని కేంద్ర ఆరోగ్య శాఖ సూచించింది. ప్రత్యేక ఆసుపత్రులు, ఐసోలేషన్ యూనిట్లు ఏర్పాటు చేయాలి. వెంటిలేటర్లతో కూడిన ఐసీయూలు నెలకొల్పాలి. ల్యాబ్‌ల్లో అదనపు సౌకర్యాలు కల్పించాలి. అదనంగా ఉద్యోగులను నియమించుకోవాలి. ఔషధాలు, వ్యక్తిగత రక్షణ పరికరాలు(పీపీఈ), ఎన్–95 మాస్కులు, వెంటిలేటర్ల కొనుగోలుకు ఈ నిధులను ఉపయోగించుకోవచ్చు. ఆసుపత్రులు, ప్రభుత్వ కార్యాలయాలు, ప్రజోపయోగ స్థలాలు, అంబులెన్స్‌లను శుద్ధి చేయడానికి కూడా వెచ్చించవచ్చు. కరోనా కేసుల తీవ్రత రోజురోజుకూ పెరిగిపోతుండడం ఆందోళన కలిగిస్తోంది. కరోనా నిర్ధారణ పరీక్షలు చేయడం, బాధితులకు వైద్య సేవలందించడం రాష్ట్ర ప్రభుత్వాలకు తలకు మించిన భారంగా మారింది. ఈ నేపథ్యంలో కరోనాపై పోరాటానికి ఆర్థిక ప్యాకేజీ ప్రకటించాలని రాష్ట్ర ప్రభుత్వాలు కోరడంతో కేంద్రం సుముఖత వ్యక్తం చేసింది. ‘భారత్ కోవిడ్–19 అత్యవసర ప్రతిస్పందన, ఆరోగ్య వ్యవస్థ సన్నద్ధత’ ప్యాకేజీకి తాజాగా ఆమోదం తెలిపింది. మరో 20 మరణాలు ఒక్క రోజులో 591 పాజిటివ్‌లు న్యూఢిల్లీ: కరోనా వైరస్ పంజా విసురుతూనే ఉంది. దేశవ్యాప్తంగా బుధవారం నుంచి గురువారం వరకు.. ఒక్కరోజులో 591 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 20 మంది మృతి చెందారు. మహారాష్ట్రలో 8 మంది, గుజరాత్లో ముగ్గురు, మధ్యప్రదేశ్‌లో ముగ్గురు, జమ్మూకశ్మీర్‌లో ఇద్దరు, పంజాబ్, ఉత్తరప్రదేశ్, కర్ణాటక, తమిళనాడులో ఒక్కొక్కరు చొప్పున కన్నుమూశారు. దీంతో దేశంలో మొత్తం మృతుల సంఖ్య 169కు చేరిందని, ఇప్పటిదాకా 5,865 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ గురువారం మీడియా సమవేశంలో ప్రకటించారు. కరోనా నిర్ధారణ పరీక్షల్లో భాగంగా ఇప్పటిదాకా 1,30,000 నమూనాలను పరీక్షించినట్లు భారత వైద్య పరిశోధనా మండలి(ఐసీఎంఆర్) వెల్లడించింది. రాష్ట్ర ప్రభుత్వాల గణాంకాల ప్రకారం కరోనాతో దేశవ్యాప్తంగా 196 మంది మృతి చెందగా, పాజిటివ్ కేసులు 6,500కు చేరాయి. కరోనా వ్యాప్తి నానాటికీ పెరుగుతుండడంతో రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి. నిఘాను తీవ్రతరం చేశాయి. పీపీఈల లభ్యతపై ఆందోళన వద్దు కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో వ్యక్తిగత రక్షణ పరికరాల(పీపీఈ) లభ్యతపై ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని లవ్ అగర్వాల్ స్పష్టం చేశారు. ఈ విషయంలో వదంతులను నమ్మొద్దని కోరారు. ప్రస్తుతం సరిపడా పరికరాలు అందుబాటులో ఉన్నాయని, వాటిని అవసరం మేరకు పొదుపుగా వాడుకోవాలని సూచించారు. దేశంలో 20 సంస్థలు పీపీఈలను తయారు చేస్తున్నాయని, 1.7 కోట్ల పరికరాలు సరఫరా చేయాలంటూ ఆయా సంస్థలకు ఆర్డర్ ఇచ్చామని తెలిపారు. 49,000 వెంటిలేటర్లు త్వరలో అందనున్నాయని చెప్పారు. కరోనా బాధితుల కోసం 10 వైద్య బృందాలను 9 రాష్ట్రాలకు పంపించామని పేర్కొన్నారు. రైల్వే శాఖ 3,250 కోచ్‌లను ఐసోలేషన్ యూనిట్లుగా మార్చిందన్నారు. రైల్వే శాఖ 6 లక్షల ఫేస్ మాస్కులను ఉత్పత్తి చేసిందని, వీటిని మళ్లీ మళ్లీ ఉపయోగించుకోవచ్చని, అలాగే 4,000 లీటర్ల శానిటైజర్‌ను తయారు చేసిందని తెలిపారు. ‘ఆరోగ్య సేతు’ను డౌన్లోడ్ చేసుకోండి: మోదీ న్యూఢిల్లీ: కరోనా వైరస్‌పై పోరులో ఎంతో ఉపయుక్తంగా ఉండే ఆరోగ్యసేతు యాప్‌ను మొబైల్‌లలో డౌన్లోడ్ చేసుకోవాలని ప్రధాని మోదీ ప్రజలను కోరారు. ‘కోవిడ్‌ను చూసి భయపడితే ఎలాంటి లాభం ఉండదు. జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. ఈ దిశగా కీలకమైన మొదటి అడుగు ఆరోగ్య సేతు. ఇది మీ చుట్టూ కోవిడ్ వైరస్ బాధితులెవరైనా ఉంటే కనిపెడుతుంది. అన్ని రాష్ట్రాల్లోని హెల్ప్‌డెస్క్‌ల ఫోన్ నంబర్లు ఇందులో ఉన్నాయి’అని ట్విట్టర్లో తెలిపారు. -
కరోనా: ‘క్వారెంటైన్’ ఎలా వచ్చింది?
న్యూఢిల్లీ : ప్రపంచ ప్రజల పాలిట ప్రాణాంతకంగా మారిక కరోనా వైరస్ బారిన పడకుండా ప్రజలను రక్షించడానికి నేడు ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలు ‘క్వారెంటైన్’ పాటిస్తున్నాయి. ఈ పదం ఎప్పుడు ? ఎక్కడి నుంచి, ఎలా వచ్చింది? ఆసలు దీని అర్థం ఏమిటీ ? ఇటాలియన్ పదం ‘క్వారెంటీనా జియోర్ని’ నుంచి వచ్చింది. దానర్థం ‘40 రోజులు’ అని. అంటే 40 రోజులపాటు ప్రజలను నిర్బంధంగా ఇంటికే పరిమితం చేస్తే అంటు రోగాల బారిన పడకుండా రక్షించవచ్చని ఆ నాటి ప్రజల అభిప్రాయమా?. (కరోనా: పురుషుల సంఖ్యే అధికం.. కారణమిదే!) ప్రపంచ దేశాలను ముఖ్యంగా, యూరప్, ఆసియా దేశాలను మొదటిసారి ‘ప్లేగ్’ కుదిపేసినా 14వ శతాబ్దంలోనే ఈ ‘క్వారెంటైన్’ అనే పదం అమల్లోకి వచ్చింది. అప్పట్లో 40 రోజుల్లో ఏ అంటురోగమైనా తగ్గుతుందన్న విషయం ప్రజలెవరికీ తెలియదు. ఆ మాటకొస్తే బ్యాక్టీరియా, వైరస్ లాంటి మైక్రోబ్స్ ఉంటాయని, వాటి ద్వారా అంటు రోగాలు వస్తాయన్న అవగాహన లేదు. మైక్రోబ్స్‌ను 16వ శతాబ్దంలో కనుగొన్నారు. కాకపోతే ఎలుకల నుంచి మనుషులకు, మనుషుల నుంచి మనుషులకు అంటురోగాలు వస్తాయని తెలుసు. అందుకని ఇళ్లు కదలకుండా 40 రోజుపాటు స్వీయ నిర్బంధంలో ఉంటే రోగం బారిన పడకుండా తప్పించుకోవచ్చన్న అభిప్రాయం వారికి ఎలా వచ్చింది?. అయితే 40 రోజులనే పదం ఎలా పుట్టింది? జుడాయియన్ ఎడారిలో దెయ్యానికి వ్యతిరేకంగా జీసస్ 40 రోజుల పాటు యుద్ధం చేశారు కనుక దెయ్యం లాంటి అంటురోగాలు మటుమాయం కావాలంటే 40 రోజులు అవసరమని భావించి ఉండవచ్చు! లేదా గ్రీకు తత్వవేత్త పైథాగరస్‌కు నాలుగు అంకే ఇష్టం కనుక నాలుగు నుంచి 40 రోజుల పదం తీసుకొని ఉండవచ్చు అనే ఊహాగానాలు ఉన్నాయి. వాటికి కచ్చితమైన ఆధారాలు మాత్రం చరిత్ర పుటల్లో లేవు. అప్పుడు చలికాలం 40 రోజులపాటు ఉండేది. అప్పుడే సముద్ర తీరాల్లో అంటురోగాలు విస్తరిస్తాయి కనుక 40 రోజులనే పదం అక్కడి నుంచి వచ్చి ఉండవచ్చనే మరో వాదన ఉంది. ఈ వాదన వాస్తవానికి కొంత దగ్గరగా ఉన్నట్లు అనిపించినప్పటికీ అప్పట్లో శాస్త్ర విజ్ఞానం పట్ల అంత అవగాహన లేదు. ఏదిఏమైన సముద్ర తీరాల్లోనే అంటురోగాలతో మనుషులు జబ్బు పడటాన్ని గుర్తించిన ప్రజలు ఇతర తీరాల నుంచి పడవల ద్వారా జబ్బులను తీసుకొస్తున్నారని భావించి ముందుగా నావికులపై ‘క్వారెంటైన్’ను విధించారు. అంటే వారు సముద్ర తీరాన్ని వదిలి గ్రామాల్లోకి వెళ్ల కూడదని. వారిపై నిఘాను ఉంచాల్సిన బాధ్యత నౌకల కెప్టెన్లది. అయినప్పటికీ వారి కెప్టెన్ల కళ్లుకప్పి నావికులు గ్రామల్లోకి వెళ్లి వచ్చేవారు. ఆ విషయాన్ని కెప్టెన్లు సంబంధిత అధికారులకు తెలియకుండా దాచేవారు. ఆ తర్వాత క్వారెంటైన్ విధానం అంటురోగుల బారిన పడ్డవారికి, పడకుండా ప్రజలను రక్షించడానికి అమల్లోకి వచ్చింది. అంటే రోగులందరిని ఒక్క చోట చేర్చి వారికి వైద్య సదుపాయం అందించడం. ఆ క్వారెంటైన్‌ను తెలుగులో నిర్బంధ వైద్య శిబిరం అనవచ్చు. ప్రజలను ఇళ్లు కదలకుండా చేయడం లేదా విశాలమైన ప్రాంగణంలో బయటకు రాకుండా ఉంచడం రెండోరకమైన క్వారెంటైన్. దీన్ని తెలుగులో ప్రజా నిర్బంధం లేదా స్వీయ నిర్బంధం అని పిలవచ్చు. ‘సెల్ప్ ఐసోలేషన్’ అనే ఆంగ్ల పదం నుంచి స్వీయ ఏకాంతం లేదా స్వీయ నిర్బంధం వచ్చింది. మొదటిసారి ప్లేగ్ 14వ శతాబ్దంలోరాగా, మూడవసారి ప్లేగ్ 19వ శతాబ్దంలో వచ్చింది. ఇటలీ 1830లో క్వారెంటైన్‌ను అమలు చేసేందుకు సైన్యాన్ని రంగంలోకి దింపింది. ‘బ్రిటీష్ పాలకులు 1825లో క్వారెంటైన్ యాక్ట్‌ను తీసుకొచ్చారు. ఆ తర్వాత 1875లో పబ్లిక్ హెల్త్ యాక్ట్‌ను తీసుకొచ్చారు. ఈ రెండు చట్టాల కింద బ్రిటన్ ప్రభుత్వం క్వారెంటైన్‌ను అమలు చేసేది. అప్పట్లో యూరప్‌లో క్వారెంటైన్ చక్కగా అమలు జరిగేది. భారత్‌లో దానికి వ్యతిరేకంగా అల్లర్లు చెలరేగేవి. కుల, మత, లింగ వివక్షతలే అందుకు కారణమని చరిత్రకారులు చెబుతున్నారు. ప్రజలను స్వచ్ఛందంగా క్వారెంటైన్లో ఉండుమని చెప్పాలిగానీ, వారిపై నిర్బంధంగా ఒత్తిడి తీసుకురావద్దని, అది ప్రజలను మానసికంగా దెబ్బతీస్తుందని ‘ది టైమ్స్ లీడర్’ 1892, నవంబర్ రెండవ తేదీ సంచికలో అధికారులను హెచ్చరించింది. అదే ఏడాది వెనిస్లో జరిగిన ఐరోపా దేశాల సదస్సు బ్రిటిష్ ప్రభుత్వం పాటిస్తున్న క్వారెంటైన్ విధానం బాగుందని, అన్ని దేశాలు దాన్ని ఆదర్శంగా తీసుకోవాలని తీర్మానించింది. నర్సింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చి ప్రపంచ ప్రఖ్యాతి చెందిన ఫ్లోరెన్స్ నైటింగేల్ ఆచరించిన ‘ఏకాంత వాసమే’ బ్రిటిష్ క్వారెంటైన్ విధానం. ఓసారి విదేశీ ప్రయాణం నుంచి వచ్చి జబ్బు పడిన నైటింగేల్ తోటి నర్సులనే కాకుండా, సొంత తండ్రిని కూడా దరిచేరనీయకుండా గదిలో ఒంటరిగా గడిపారు. (కరోనా కల్లోలం.. 11 మంది భారతీయుల మృతి) -
కరోనా కేసులు పెరిగితే...
-
ఐసోలేషన్ కేంద్రాలుగా రైల్వే కోచ్‌లు
న్యూఢిల్లీ: కరోనాను ఎదుర్కొనేందుకు రైల్వే శాఖ 2,500 కోచ్‌లను ఐసోలేషన్ వార్డులుగా మార్చింది. మొత్తం 5 వేల కోచ్‌లను ఐసోలేషన్ కేంద్రాలుగా మార్చేందుకు రైల్వే శాఖ నిర్ణయం తీసుకోగా మొదటి దశలో భాగంగా 2,500 కోచ్ లను ఐసోలేషన్ కేంద్రాలుగా మార్చినట్లు రైల్వే శాఖ స్పష్టం చేసింది. వీటితో కొత్తగా 50 వేల ఐసోలేషన్ బెడ్లు అందుబాటులోకి వచ్చినట్లు తెలిపింది. 133 ప్రాంతాల్లో రోజుకు 375 కోచ్ లను బెడ్లుగా మారుస్తున్నట్లు రైల్వేశాఖ పేర్కొంది. వైద్యుల సూచనల మేరకు పూర్తి స్థాయిలో వైద్య పరికరాలతో రూపొందించినట్లు వెల్లడించింది. -
మిస్సింగ్ కాదు.. వార్డు మారాడంతే!
గాంధీ ఆస్పత్రి: సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో కరోనా అనుమానితుడు కొద్దిసేపు కనిపించకుండాపోయిన ఘటన కలకలం సృష్టించిం ది. అతడి సెల్‌ఫోన్ స్విచ్చాఫ్ రావడంతో వార్డు నుంచి పరారైనట్టు భావించారు. చివరకు ఆస్పత్రి ఐదో అంతస్తులోని ఐసోలేషన్ వార్డు లో బెడ్‌పై ఆదమరచి నిద్రిస్తున్న అతడిని గుర్తించిన వైద్యాధికారులు, పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. పొరపాటున ఐదో అంతస్తులోకి.. ఢిల్లీ మర్కజ్ ప్రార్థనలకు వెళ్లొచ్చి న గద్వాలకు చెందిన వ్యక్తి (35)ని ఈనెల 2న గాంధీ ఆస్పత్రిలో చేర్చారు. కరోనా నిర్ధారణ పరీక్షల్లో నెగెటివ్ రావడంతో హోం క్వారంటైన్లో ఉండాలని సూచి స్తూ పంపించేశారు. కా గా, హోం క్వారంటైన్ పరిశీలనకు వెళ్లిన వైద్యసిబ్బంది, పోలీ సులు.. అతడు కరోనా పాజిటివ్ వ్యక్తులతో కలిసి కొన్నిరోజులు గడిపినట్లు గుర్తిం చారు. ప్రస్తుతం నెగెటివ్ వచ్చినా తర్వాత పాజిటివ్ వచ్చే అవకాశం ఉందని భావించి, అతడిని గాంధీ ఆస్పత్రిలోనే క్వారంటైన్ చే యాలని భావించారు. దీంతో అతడిని ఈ నెల 5న తిరిగి ఆస్పత్రికి తీసుకొచ్చి, ఆరో అంతస్తులోని ఐసోలేషన్ వార్డులో బెడ్ కేటా యించారు. కొంతసేపటికి అతడు వార్డు నుం చి బయటికొచ్చి నమాజ్ చేసుకుని, ఆరో అం తస్తు అనుకుని ఐదో అంతస్తులోని ఐసోలేషన్ వార్డులోకి వెళ్లి ఖాళీగా ఉన్న బెడ్‌పై పడుకుని సెల్‌ఫోన్ స్విచ్చాఫ్ చేసుకున్నాడు. ఆచూకీ కనిపెట్టారిలా.. ఆదివారం రాత్రి పది గంటల సమయంలో ఆరో అంతస్తు వార్డులో సదరు వ్యక్తి లేకపోవడం గుర్తించిన సిబ్బంది వైద్యాధికారులకు, పోలీసులకు తెలిపారు. సెల్‌ఫోన్ కాల్‌డేటా లో చివరి కాల్ గాంధీ ఆస్పత్రి టవర్ లొకేషన్ చూపించడం, తర్వాత స్విచ్చాఫ్ కావడంతో పరారయ్యాడనే అంచనాకు వచ్చారు. ఒక పోలీస్ బృందం గద్వాల వెళ్లగా, మరి కొన్ని బృందాలు ఆస్పత్రి పరిసరాలను జల్లెడ పట్టాయి. సీసీ కెమెరాల ఫుటేజ్ పరి శీలించగా ఆస్పత్రి ప్రాంగణంలో అతడు తిరిగిన దాఖలాలు కనిపించలేదు. దీంతో ఆస్పత్రిలోనే ఎక్కడో ఉంటాడని భావించిన పోలీసులు, వైద్యసిబ్బంది అణువణువూ గాలించగా, ఐదో అంతస్తులోని ఐసోలేషన్ వార్డు బెడ్‌పై పడుకుని కనిపించాడు. అన్ని అంతస్తులు, బెడ్లు ఒకేలా ఉండడంతో పొరబడి ఇక్కడే పడుకున్నానని అతడు పోలీసులకు చెప్పినట్టు తెలిసింది. అనంతరం అతడిని ఆరో అంతస్తులోని ఐసోలేషన్ వార్డుకు తరలించారు. మరోమారు నిర్ధారణ పరీక్షలు నిర్వహించి, వైద్యాధికారుల ఆదేశాలతో నగరంలోని క్వారంటైన్ కేంద్రానికి తరలిస్తామని ఆస్పత్రి అధికారులు తెలిపారు. కాగా, ప్రస్తుతం గాంధీ ఆస్పత్రి ఐసీయూలో 138 మంది బాధితులకు, ఐసోలేషన్ వార్డుల్లో 350 మంది అనుమానితులకు వైద్యసేవలు అందిస్తున్నారు. -
అమ్మా.. బాగున్నారా!
కృష్ణా జిల్లా మచిలీపట్నంలో కరోనా పాజిటివ్ కేసు నమోదైన నేపథ్యంలో రెడ్ జోన్‌గా ప్రకటించిన ప్రాంతంలో ఆశా వర్కర్లతో కలసి పర్యటిస్తున్న మంత్రి పేర్ని నాని. ఈ సందర్భంగా ఇంటింటికీ వెళ్లి ప్రజల ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్న మంత్రి ఎవరూ భయపడవద్దని, కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ప్రభుత్వం అన్ని రకాల చర్యలూ తీసుకుంటోందని ధైర్యం చెప్పారు. సాక్షి, అమరావతి: విదేశాలకు వెళ్లి వచ్చిన వారు.. ఢిల్లీ ప్రార్థనలకు వెళ్లొచ్చిన వాళ్లు.. వీరితో సన్నిహితంగా మెలిగిన వాళ్లు.. కరోనా వైరస్ అనుమానితులు.. ఇలా గత కొన్ని రోజులుగా హోం ఐసోలేషన్‌లో ఉంటున్న వారికి ఆశా కార్యకర్తలు, ఏఎన్ఎంలు, పీహెచ్సీ వైద్యులు ఎంతో ఊరట కల్పిస్తున్నారు. వారికి నిత్యం ధైర్యం చెబుతూ, వారి యోగక్షేమాలు తెలుసుకుంటూ ప్రతిరోజూ వారి ఇంటికే వెళ్లి పలకరిస్తున్న తీరు బాధితులకు కొండంత భరోసానిస్తోంది. వీరు ఇంటింటికీ వెళ్లి ఏం చేస్తున్నారంటే.. ► ఉదయం 8 గంటల నుంచి ఆశా కార్యకర్తలు, ఏఎన్ఎంలు హోం ఐసొలేషన్‌లో ఉన్న వారి ఇంటి వద్దకు వెళ్లి భౌతిక దూరం పాటిస్తూ వారిని పేరుపేరునా పలకరిస్తారు. ► అమ్మా బాగున్నారా.. అయ్యా బాగున్నారా.. దగ్గు జలుబు ఏమైనా ఉన్నాయా అంటూ వివరాలు సేకరిస్తున్నారు. ► దగ్గు, జలుబు, జ్వరం తదితర లక్షణాలు ఉంటే తెలుసుకోవడం, ఆ లక్షణాలున్న వారి పేర్లు నమోదు చేసుకుని పీహెచ్సీ డాక్టరుకు సమాచారమిస్తారు. ► చిన్నచిన్న వ్యాధులకైతే ఏఎన్ఎంలే మందులు అందజేస్తారు. ► విదేశీ ప్రయాణీకులకు సంబంధించి రోజూ 29 వేల ఇళ్లకు వెళ్లి వాకబు చేస్తున్నారు. ► మరో 2500 ఇళ్లకు పైగా ఢిల్లీ వెళ్లి వచ్చిన వారు, వారి తరఫు బంధువుల ఇళ్లకు వెళ్లి సలహాలు, సూచనలు ఇస్తున్నారు. ► ఇలా రాష్ట్రవ్యాప్తంగా 40వేల మంది ఆశా కార్యకర్తలు, మరో 15వేల మంది ఏఎన్ఎంలు పనిచేస్తున్నారు. ► వార్డు, గ్రామ సచివాలయ సిబ్బంది వీరికి అదనం. నేటి సాయంత్రానికి గణన పూర్తి రాష్ట్రంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకునేందుకు వీలుగా ప్రభుత్వం ఆది, సోమవారాల్లో రాష్ట్రవ్యాప్తంగా ఇంటింటికీ వెళ్లి గణన నిర్వహిస్తోంది. సోమవారం సాయంత్రానికల్లా వయసుల వారీగా అందరి వివరాలు ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలు సేకరిస్తారు. మధుమేహం, రక్తపోటు తదితర దీర్ఘకాలిక రోగాలున్న వారి సమాచారం తీసుకుని ప్రభుత్వానికి నివేదిక అందజేస్తారు. అలాగే, ఎలాంటి ఆరోగ్య సమస్యలున్నా 108, 104కు ఫోన్ చేయాలని ప్రభుత్వం సూచిస్తోంది. -
‘కరోనా’ కోసం రైల్వే ఆసుపత్రులు
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య వేగంగా పెరుగుతుండటంతో కేంద్రం అప్రమత్తమైంది. పాజిటివ్ కేసులకు సంబంధించి వైద్య సాయం, అనుమానితుల క్వారంటైన్ కోసం రాష్ట్రాలతో పాటు రైల్వే శాఖకు ప్రత్యేక ఆదేశాలు జారీ చేసింది. ఆ మేరకు రైల్వే ఆసుపత్రుల్లో ఐసోలేషన్ వార్డుల ఏర్పాటు, రైలు బోగీలను ఐసోలేషన్, క్వారంటైన్ సెంటర్లుగా మార్చే ప్రక్రియ ప్రారంభమైన విషయం తెలిసిందే. గతంలో ప్రయోగాత్మకంగా వాటిపై దృష్టి సారించగా, ఇప్పుడు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేయాలని రైల్వే శాఖ నిర్ణయించింది. దీనికి సంబంధించి అన్ని జోన్లకు ప్రత్యేక ఆదేశాలు జారీ చేసింది. ఇందులో భాగంగా దక్షిణమధ్య రైల్వే పరిధిలో తొలుత 63 పడకలతో కూడిన ఐసోలేషన్ వార్డు, వేయి పడకలతో కూడిన క్వారంటైన్ సెంటర్ ఏర్పాటుకు చర్యలు ప్రారంభించింది. ఇప్పటికే మౌలాలిలోని రైల్వే ఆసుపత్రితోపాటు అన్ని డివిజన్ కేంద్రాల్లో ఉన్న ఆసుపత్రులు, ఆరోగ్య కేంద్రాల్లో వీటి ఏర్పాటుకు చర్యలు మొదలుపెట్టింది. మరో ఐదారు రోజుల్లో ఇవి అందుబాటులోకి తెచ్చే ప్రయత్నం చేస్తోంది. దీంతోపాటు ఎక్కడికైనా తరలించేలా బోగీలను కూడా సిద్ధం చేసే పనిని వేగిరం చేసింది. 486 కోచ్‌లను క్వారంటైన్, ఐసోలేషన్ వార్డులుగా మార్చబోతోంది. ఒక్కో కోచ్‌లో 16 బెడ్లు ఉంటాయి. మొత్తంగా 7,776 బెడ్లు అందుబాటులోకి వస్తాయి. ప్రతి కోచ్‌లో 9 కూపేలుంటాయి. ఇందులో మొదటి కూపేను పారా మెడికల్ సిబ్బందికి, మిగతా 8 కూపేలను బాధితులకు కేటాయిస్తారు. ప్రతి కూపేలో రెండు బెర్తులను బెడ్లుగా మారుస్తారు. కాంట్రాక్టుపై పారా మెడికల్ సిబ్బంది.. కరోనా బాధితులు ఎంతమందితో కాంటాక్ట్ అయ్యారో గుర్తించి వారిని వెంటనే క్వారంటైన్ చేయాల్సి ఉంటుంది. ప్రభుత్వ అధీనంలోని క్వారం టైన్ కేంద్రాలు, ఆసుపత్రులు చాలని పక్షంలో రైల్వే ఏర్పాటు చేసిన కోచ్‌లను వినియోగిస్తారు. ఇందు కు రైల్వే శాఖకు అందుబాటులో ఉన్న వైద్య సిబ్బం ది సరిపోరు. దీన్ని దృష్టిలో ఉంచుకుని పెద్ద మొత్తం లో పారా మెడికల్ స్టాఫ్‌ను కాంట్రాక్టు పద్ధతిలో తీçసుకోవాలని రైల్వేశాఖ నిర్ణయించింది. ఈ మేరకు ఇప్పటికే పత్రిక ప్రకటన, ఆన్లైన్ నోటిఫికేషన్ జారీ చేసింది. -
లైఫ్ లైన్ కరోనా..!
-
రైల్వే కోచ్‌లను ఐసోలేషన్ వార్డులుగా..
-
రైల్వే కోచ్ లలో ఐసోలేషన్ వార్డులు సిద్ధం
-
హోం ఐసొలేషన్‌కు మార్గదర్శకాలు జారీ
సాక్షి, అమరావతి: విదేశాల నుంచి వచ్చిన వారు, వారితో సన్నిహితంగా ఉన్న వారు విధిగా ఐసొలేషన్‌లో ఉండాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇందుకు సంబంధించి ప్రపంచ ఆరోగ్య సంస్థ నిబంధనల మేరకు మార్గదర్శకాలను జారీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. మార్గదర్శకాలు ఇలా.. ► విదేశాల నుంచి వచ్చిన వారు, వారితో సంబంధం ఉన్న వారు.. జ్వరం, పొడి దగ్గు, గొంతు నొప్పి, శ్వాస తీసుకోలేక పోవడం వంటి లక్షణాలు కనిపించిన వారు హోం ఐసొలేషన్‌లో ఉండాలి. ► వైరస్ సోకిన వ్యక్తిని ఆరోగ్యవంతుడు కలిసినప్పుడు ఇది అతనికీ వర్తిస్తుంది. ► ఒక ఇంట్లో పాజిటివ్ వ్యక్తి ఉన్నప్పుడు మిగతా వారికి హోం ఐసొలేషన్ వర్తిస్తుంది. ► పాజిటివ్ ఉన్న వ్యక్తి ఎవరినైనా భౌతికంగా తాకినా ఇది వర్తిస్తుంది. ► హోం ఐసొలేషన్‌లో ఉన్న వారు లైజాల్ లేదా హైపోక్లోరైడ్ ద్రావణంతో శుభ్రం చేసి, గాలి వెలుతురు ఉన్న ఇంట్లో ఉండాలి. ఎక్కువగా నీళ్లు తాగుతుండాలి. ► పదే పదే చేతులను సబ్బుతో శుభ్రంగా కడుక్కోవాలి. ఉమ్మి వేయడం, ఎదురుగా వచ్చి దగ్గడం చేయరాదు. కుటుంబంలో ఇతరులతో కలవ రాదు. ప్లేట్లు, గ్లాసులు విడిగా ఉంచుకోవాలి. ► దగ్గు, జలుబు, జ్వరం వస్తే వెంటనే 104కు కాల్ చేయాలి. హోం ఐసొలేషన్‌లో 14 రోజులు ఉన్న తర్వాత తిరిగి నమూనాలు పరీక్షించాలి. నెగిటివ్ అని తేలితేనే బయటకు రావాలి. ► ఫిబ్రవరి 10 తర్వాత ఇతర దేశాల నుంచి వచ్చిన వారందరికీ ఈ నిబంధనలు వర్తిస్తాయి. ► ఈ మార్గదర్శకాలను పాటిస్తున్నారా లేదా అనేది జిల్లా కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, పోలీస్ కమిషనర్లు, హెల్త్ అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, తహసిల్దార్లు, ఎంపీడీఓలు పర్యవేక్షించాలి. -
ఐసోలేషన్ గదులుగా రైలు కేబిన్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా వైరస్ లక్షణాలతో బాధపడుతున్న వారి సంఖ్య పెరుగుతుండటంతో రైళ్లను ఐసోలేషన్, క్వారంటైన్ వార్డులుగా మార్చే ప్రక్రియ ప్రారంభమైంది. తొలుత లాలాగూడ వర్క్‌షాపులో ఓ రైలు బోగీలోని రెండు కేబిన్లను ఐసోలేషన్ గదులుగా మార్చారు. డిమాండ్ ఆధారంగా ఇలాంటి మరిన్ని కేబిన్లను రూపొందించనున్నట్టు రైల్వే అధికారులు పేర్కొన్నారు. కేబిన్‌లో అప్పర్, మిడిల్, సైడ్ బెర్తులను తొలగించి 2 లోయర్ బెర్తులను మాత్రమే ఉంచా రు. ప్రత్యేకంగా లైటింగ్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. దోమ లు రాకుండా కిటికీలకు మెష్‌లు ఏర్పాటు చేశారు. ఒకవైపు ఉన్న టాయిలెట్‌ను తొలగించి బాత్రూమ్గా మార్చారు. -
దుబాయ్ నుంచి వచ్చిన ముగ్గురిపై కేసు నమోదు
కోనేరుసెంటర్(మచిలీపట్నం): కరోనా వైరస్ ప్రబలకుండా ఇతర దేశాల నుంచి వచ్చిన వ్యక్తులను బహిరంగ ప్రదేశాల్లో సంచరించకుండా తీసుకుంటున్న చర్యలకు వ్యతిరేకంగా నగరంలో తిరుగుతున్న ముగ్గురు వ్యక్తులపై ఇనగుదురుపేట పోలీసులు ఆదివారం రాత్రి కేసు నమోదు చేశారు. సీఐ అఖిల్‌జమ తెలిపిన వివరాల ప్రకారం మచిలీపట్నం వర్రేగూడెంకు చెందిన ఒకే కుటుంబంలోని ముగ్గురు వ్యక్తులు ఈ నెల 9వ తేదీన మచిలీపట్నం వచ్చారు. కరోనా వైరస్ ప్రబలుతున్న నేపథ్యంలో 14 రోజుల పాటు గృహంలోనే ఉండాలంటూ పోలీసులు నోటీసులు ఇచ్చినప్పటికీ జన సంచారం ఉండే ప్రాంతాల్లో ముగ్గురు తిరుగుతున్నారు. విషయం తెలుసుకున్న వలంటీర్లు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఇనగుదురుపేట పోలీసులు వారిపై కేసు నమోదు చేసి గృహ నిర్బంధం చేసినట్లు సీఐ తెలిపారు. (ధైర్యంగా పోరాడదాం కరోనాను ఓడిద్దాం) ఎన్ఆర్ఐపై.. హౌస్ ఐసోలేషన్‌లో ఉండాల్సిన ఓ ఎన్ఆర్ఐ రోడ్లపై సంచరిస్తుండటంతో విషయం తెలుసుకున్న పోలీసులు అతడిపై కేసు నమోదు చేశారు. ఇంటిలో ఉంచి స్టేషన్ సిబ్బందిని కాపలా పెట్టారు. రూరల్ ఎస్ఐ లక్ష్మీనరసింహమూర్తి తెలిపిన వివరాలు.. బందరు మండలం నెలకుర్రు గ్రామానికి చెందిన ఓ వ్యక్తి పదిహేను రోజుల క్రితం యూఎస్ నుంచి సొంత గ్రామానికి వచ్చాడు. విషయం తెలుసుకున్న రూరల్ పోలీసులు అతడిని హౌస్ ఐసోలేషన్‌లో ఉండాలని సూచించారు. సదరు వ్యక్తి గ్రామంలో తిరుగుతున్నాడు. కరోనా వైరస్ వ్యాప్తి ఆందోళనలో ఉన్న గ్రామస్తులు విషయాన్ని పోలీసులకు ఫిర్యాదు చేశారు. గ్రామానికి వెళ్లి హౌస్ ఐసోలేషన్‌లో ఉంచి, కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. (షాదీ.. 'కరోనా') కల్లుగీత కారి్మకుడిపై.. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో మందుబాబులకు కల్లు విక్రయిస్తున్న ఓ వ్యక్తిపై బందరు రూరల్ పోలీసులు సోమవారం కేసు నమోదు చేశారు. ఎస్ఐ మూర్తి తెలిపిన వివరాలు.. బందరు మండలం గుండుపాలేనికి చెందిన రాజు గ్రామంలో కల్లు గీస్తుంటాడు. సోమవారం కల్లు గీసి గ్రామస్తులకు విక్రయిస్తున్నాడు. విషయం తెలుసుకున్న పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి అరెస్ట్ చేసినట్లు ఎస్ఐ తెలిపారు. (కరోనాకు 35,349 మంది బలి) -
బోగీల్లో 20 వేల ఐసోలేషన్ పడకలు!
న్యూఢిల్లీ: కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యలో దేశవ్యాప్తంగా కనీసం 20 వేల రైల్వే బోగీలను ఐసోలేషన్ వార్డులుగా మార్చేందుకు సిద్ధంగా ఉండాలని∙రైల్వే బోర్డు ప్రాంతీయ కార్యాలయాలకు ఆదేశాలు జారీ చేసింది. జోనల్ రైల్వే మేనేజర్లందరికీ సోమవారం రాసిన ఒక లేఖ ప్రకారం కోవిడ్ బాధితులకు చికిత్స అందించేందుకు ముందుగా 5000 రైల్వే బోగీలను ఐసోలేషన్ వార్డులుగా మార్చాల్సి ఉంటుందని రైల్వే బోర్డు తెలిపింది. ఇందుకు తగిన ఏర్పాట్లు చేయాల్సిందిగా ఆదేశించింది. ఈ నిర్ణయం తీసుకునే ముందు ఆర్మ్డ్ ఫోర్స్ మెడికల్ సర్వీసెస్‌తోపాటు వేర్వేరు రైల్వే జోన్లు, ఆయుష్మాన్ భారత్ వర్గాలతో సంప్రదింపులు జరిపినట్లు బోర్డు తెలిపింది. దేశం మొత్తమ్మీద ఐదు రైల్వే జోన్లు ఇప్పటికే నమూనా ఐసోలేషన్ వార్డులను సిద్ధం చేశాయని బోర్డు తెలిపింది. కోవిడ్‌ను ఎదుర్కొనే చర్యల్లో భాగంగా మార్చి 25న జరిగిన ఒక వీడియో సమావేశంలో కొన్ని బోగీలను క్వారంటైన్, ఐసోలేషన్ వార్డులుగా మార్చాల్సి ఉంటుందని నిర్ణయించాం. ఇందులో భాగంగా నాన్ ఏసీ, స్లీపర్ బోగీలను వాడాలని తీర్మానించాం అని ఈ లేఖలో పేర్కొన్నారు. ఐసోలేషన్ వార్డులో ఏమేం ఉండాలన్న విషయాలను కూడా ఈ లేఖలో విపులీకరించారు. చెక్క పలక ఒకదాన్ని పరచడం ద్వారా ఒక టాయిలెట్‌ను స్నానాలగదిగా మారుస్తారు. దీంతో అడుగుభాగం మొత్తం చదునుగా ఉంటుంది. ఇందులోనే ఒక బకెట్, మగ్, సోప్ డిస్పెన్సర్ ఉంచుతారు. వాష్‌బేసిన్లలోని కుళాయిలను మారుస్తారు. బాత్రూమ్ సమీపంలోని తొలి కేబిన్ వద్ద ఆసుపత్రుల్లో వాడే తెరలను ఉపయోగిస్తారు. తొలి కేబిన్‌లో వైద్యులు, పారామెడికల్ సిబ్బంది సామాగ్రి ఉంటుంది. ఇదే కేబిన్‌లో ఆక్సిజన్ సిలిండర్లను బిగించాల్సి ఉంటుంది. మధ్యలో ఉండే బెర్త్‌లను తొలగిస్తారు. ప్రతి కేబిన్‌లోనూ అదనంగా బాటిల్ హోల్డర్లను ఏర్పాటు చేస్తారు. కిటికీలపై దోమతెరలు ఏర్పాటవుతాయి. ప్రతి కేబిన్‌లో డస్ట్‌బిన్స్, బయటి వేడి తగలకుండా వెదురు లేదా వట్టివేళ్లవంటివి కేబిన్ పైన, కింద అమరుస్తారు. ల్యాప్‌టాప్, మొబైల్ చార్జింగ్ పాయింట్లన్నీ పని చేస్తాయి. -
ఐసోలేషన్ బెడ్ల సామర్ధ్యాన్ని పెంచేందుకు..
-
బోగీలే ఐసోలేషన్ వార్డులు
న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు పెరిగిపోతూ ఉండడంతో ఆస్పత్రి సదుపాయాలు లేకపోవడం అందరినీ ఆందోళనకు గురిచేస్తోంది. ఈ నేపథ్యంలో రైల్వే శాఖ ఒక వినూత్న ఆలోచనతో ముందుకొచ్చింది. దేశవ్యాప్తంగా లాక్డౌన్ నేపథ్యంలో ప్రయాణికుల రైళ్లు రద్దు కావడంతో ఆ రైలు బోగీలను కరోనా బాధితులకు చికిత్సనందించే వార్డులుగా రూపొందించాలని ముందుకొచ్చింది. ఇందుకోసం ఒక నమూనా బోగీని కూడా తయారు చేసింది. దీనికి కేంద్రం ఆమోదం తెలిపితే మరికొద్ది రోజుల్లోనే వారానికి 10 బోగీలు తయారు చేయనున్నట్టు ఉత్తర రైల్వే అధికార ప్రతినిధి దీపక్ కుమార్ వెల్లడించారు. బోగీలను ఐసీయూ కేంద్రాలుగా ఎలా మార్చారంటే ► ఒక కూపేలో ఒకవైపు లోయర్ బెర్త్‌నే మంచం మాదిరి గా రూపొందించి అన్ని బెర్త్‌లను తొలగించారు. ► ఆ బెర్త్ ఎదురుగా రోగుల సామాన్లు, వైద్య పరికరాలు ఉంచడానికి ఏర్పాట్లు చేశారు. ► ప్రతీ కోచ్‌లో ఉండే 4 టాయిలెట్ల స్థానంలో రెండు వాష్‌రూమ్‌లుగా మార్చి ఫ్లోరింగ్ మార్చారు. ప్రతీ బాత్రూమ్లో హ్యాండ్ షవర్, బక్కెట్, మగ్ ఉంచారు. ► ప్రతీ కోచ్‌లోనూ 220 ఓల్టుల ఎలక్ట్రికల్ పాయింట్లను ఏర్పాటు చేశారు. ► బోగీ వెలుపల 415 ఓల్టుల విద్యుత్ సరఫరా. ► బోగీకి 10చొప్పున ఇలా వార్డులు తయారు చేశారు. ► ఇక రోగులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఐసీయూలు, మెడికల్ స్టోర్లు, పాంట్రీలు, అధికారుల కోసం గదులు వంటివి కూడా ఏర్పాటు చేశారు. ► ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాల ప్రకారం ప్రతీ వెయ్యి మంది జనాభాకి కనీసం మూడు పడకలైనా ఉండాలి. కానీ, 2011 జనాభా లెక్కల ప్రకారం దేశంలో ప్రతీ వెయ్యి మందికి 0.7 పడకలు ఉన్నట్టుగా అంచనా. -
ఐసోలేషన్ సెంటర్‌కు అడిగితే ఇవ్వండి
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా ఉన్న కేంద్రీయ విద్యాలయాలను కరోనా ఐసోలేషన్ సెంటర్లకు అడిగితే ఇవ్వాలని కేంద్రీయ విద్యాలయ సంఘటన్ (కేవీఎస్) ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుత పరిస్థితుల్లో రక్షణ శాఖ అధికారులు లేదా జిల్లా యంత్రాంగం లేఖ/ ఈమెయిల్ ద్వారా అడిగితే ఇవ్వాలని ఆదేశాల్లో పేర్కొంది. కేంద్రీయ విద్యాలయాల డిప్యూటీ కమిషనర్ లేదా ప్రాంతీయ కార్యాలయం సీనియర్ అధికారి, సంబంధిత కేవీల ప్రిన్సిపాళ్లు తరగతి గదులను కరోనా కేసులను ఉంచేందుకు అనుమతించాలని వెల్లడించింది. ఆ వివరాలను తమకు ఈమెయిల్ (్జఛిp.జుఠిటఃజఝ్చజీ.ఛిౌఝ) ద్వారా తెలియజేయాలని వివరించింది. -
కరోనా: రైళ్లలో ఐసోలేషన్ వార్డులు
సాక్షి, హైదరాబాద్: యావత్ భారత దేశం లాక్డౌన్లో ఉండటంతో వేలకొద్ది రైళ్లు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. కరోనా మహమ్మారి వేగంగా విజృంభిస్తుండటంతో బాధితుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. దీంతో ఆస్పత్రుల కొరత పెద్ద సమస్యగా మారిపోయింది. ఈ నేపథ్యంలో కరోనా వైరస్‌పై పోరాటం చేసేందుకు ఖాళీగా ఉన్న రైళ్లను కోరోనా బాధితుల కోసం ఉపయోగించుకోవాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు కొన్ని రైళ్లలోని బోగీలను రైల్వే శాఖ ఐసోలేషన్ వార్డులుగా మార్చింది. వైద్య సదుపాయాలు లేని ప్రాంతాల్లో వాటిని కరోనా బాధితుల కోసం ఉపయోగించుకోవాలని నిర్ణయించింది. ఒక్కో బోగిలో 9 మందిని ఉంచేలా ఏర్పాట్లు చేశారు. బోగీల్లో ఉన్న బెర్త్‌ల్లో ఒకరికొకరు ఇబ్బంది పడకుండా.. 9 మంది సులభంగా, సురక్షితంగా ఉండేలా ఏర్పాట్లు చేశారు. ఈ బోగీల్లో ఉండేవారికి ఆయా రైళ్లలోనే ఉండే పాంట్రీ కార్లలో భోజనం తయారు చేసే ఏర్పాట్లు చేశారు. పాంట్రీ కార్లు లేని రైళ్లలో భోజనం బయటినుంచి తెచ్చి ఇస్తారు. మొత్తానికి ఖాళీగా ఉన్న బోగీలు క్వారంటైన్‌కు ఉపయోగించుకోవడం వల్ల ఒకే సమయంలో ఎక్కువమంది ఐసోలేషన్‌లో ఉండే ఏర్పాట్లు కల్పించినట్టయింది. -
ప్రేయసితో ‘కరోనా’ ప్రియుడు పరార్
సాక్షి, చెన్నై: కరోనా వైరస్ భయపెట్టినా ప్రేమకు అడ్డులేదని ఒక జంట నిరూపించింది. కరోనా వైరస్ ఉందా లేదా అన్న నిర్ధారణ చేసేందుకు ఆస్పత్రిలో ఉన్న యువకుడు తన ప్రేయసి కోసం అక్కడి నుంచి పరారై ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. పోలీసుల కథనం మేరకు.. శివగంగైకు చెందిన విజయ్ విదేశాల్లో ఉంటున్నాడు. అతను మదురైకి చెందిన ఒక యువతిని ప్రేమిస్తున్నాడు. విదేశాల నుంచి రాగానే ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఆ యువతి కుటుంబ సభ్యులు వారి ప్రేమను అంగీకరించలేదు. అయితే ఆ యువతికి వివాహ ఏర్పాట్లు చేస్తున్నారు. (మహమ్మారి కోరల్లో 724 మంది) ఈ విషయం తెలుసుకున్న యువకుడు తన ప్రేయసిని దక్కించుకునేందుకు విదేశాల నుంచి మదురై వచ్చాడు. విమానాశ్రయంలో థర్మల్ స్క్రీనింగ్ రూపంలో వైద్యాధికారులకు చిక్కాడు. అతన్ని వైద్యులు మదురైలోని ఆస్పత్రిలో ప్రత్యేక వార్డులో ఉంచారు. కరోనా నిర్ధారణ నిమిత్తం అతని రక్త నమూనాలను పరిశోధనకు పంపించారు. ఈ సమయంలో తన ప్రేయసిని ఎలాగైనా దక్కించుకోవాలని అనుకున్న విజయ్ గురువారం రాత్రి ఆస్పత్రి నుంచి తప్పించుకుని తిరుపరంగుండ్రంలో ఉన్న ప్రేయసిని చేరుకున్నాడు. అక్కడి నుంచి ఇద్దరూ పరారయ్యారు. (ఆరోగ్యం... క్యూబా భాగ్యం!) ఆస్పత్రిలో ఉన్న విజయ్ కనిపించకుండా పోవడంతో శుక్రవారం ఉదయాన్నే అధికారుల్లో ఆందోళన నెలకొంది. అతని కోసం గాలింపు ముమ్మరం చేశారు. చివరకు శివగంగైకు వెళ్లేందుకు విజయ్ ప్రయత్నాల్లో ఉండడంతో అదుపులోకి తీసుకున్నారు. అతడి ప్రియురాలిని సైతం కరోనా పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. తమ కుమార్తె కనిపించకుండా పోవడంతో ఆ యువతి కుటుంబ సభ్యులు ఆగ్రహంతో విజయ్ తల్లి, సోదరుడిపై దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన వారిని స్థానికులు ఆస్పత్రికి తరలించారు. -
పాస్‌పోర్టులు స్వాధీనం
నిజామాబాద్ అర్బన్: విదేశాల నుంచి వచ్చి జిల్లాలో ఐసోలేషన్‌లో ఉంటున్న వారి పాస్‌పోర్టులను అధికారులు స్వాధీనం చేసుకుంటున్నారు. బుధవారం 235 మంది పాస్‌పోర్ట్‌లు తీసుకున్న రెవెన్యూ, వైద్యశాఖ అధికారులు నాలుగు నెలల వరకు విదేశాలకు వెళ్లవద్దని వారికి సూచించారు. మరో 2,460 మంది పాస్‌పోర్టులను స్వాధీనం చేసుకోనున్నట్లు తెలిపారు. యువకుడికి అనుమానిత లక్షణాలు డిచ్పల్లి : డిచ్పల్లి మండలం నక్కలగుట్ట తండా గ్రామ పంచాయతీ పరిధిలోని నడిమితండాకు చెందిన యువకుడికి కరోనా అనుమానిత లక్షణాలు కన్పించాయి. అప్రమత్తమైన అధికారులు అతడిని వెంటనే జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఇటీవల గల్ఫ్ నుంచి వచ్చిన యువకుడి నుంచి పాస్‌పోర్టు స్వాధీనం చేసుకునేందుకు తహసీల్దార్ వేణుగోపాల్ తదితరులు వెళ్లగా యువకుడు జ్వరంతో ఉండి కరోనా లక్షణాలు కనిపించాయి. -
ఉప్పల్ స్టేడియంను ఉపయోగించుకోండి
సాక్షి, హైదరాబాద్: కోవిడ్–19 నుంచి తెలంగాణ ప్రజలను రక్షించుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నంలో తాము కూడా భాగం అయ్యేందుకు సిద్ధంగా ఉన్నామని హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ) వెల్లడించింది. ఉప్పల్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంను కరోనా బాధితుల కోసం ఐసోలేషన్ సెంటర్‌గా ఉపయోగించునేందుకు ఇస్తామని హెచ్‌సీఏ అధ్యక్షుడు మొహమ్మద్ అజహరుద్దీన్ ప్రకటించారు. వ్యాధిగ్రస్తులకు ఉపయోగపడేలా స్టేడియంలో 40 పెద్ద గదులు ఉన్నాయని, అతి పెద్ద పార్కింగ్ సదుపాయం ఉండటం వల్ల కూడా ఎంతో ప్రయోజనం కలుగుతుందని హెచ్‌సీఏ పేర్కొంది. కరోనాను ఎదుర్కొనే క్రమంలో సామాజిక బాధ్యతగా తాము స్టేడియాన్ని ఇచ్చేందుకు ముందుకు వచ్చామని అసోసియేషన్ స్పష్టం చేసింది. -
బ్రిటన్ యువరాజు చార్లెస్‌కూ కరోనా
లండన్: బ్రిటన్ రాజకుమారుడు చార్లెస్‌కూ కరోనా వైరస్ సోకింది. ఛార్లెస్‌లో వ్యాధి లక్షణాలు పెద్దగా లేవని, స్వీయ నిర్బంధం పాటిస్తున్నట్లు ఆయన కార్యాలయ అధికారులు బుధవారం తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ మరణాల సంఖ్య ఏమాత్రం తగ్గకపోగా అంతకంతకూ పెరిగిపోతూనే ఉంది. అధికార వర్గాలు తెలిపిన దాని ప్రకారం బుధవారం నాటికి ప్రపంచవ్యాప్తంగా 20వేలమందికిపైగా మరణించారు. మొత్తం 181 దేశాల్లో 4.45 లక్షల మంది ఈ వ్యాధి బారిన పడ్డారు. బాధితులు సంఖ్య పెరిగిపోతున్న నేపథ్యంలో చాలా చోట్ల ఆసుపత్రిలో చేర్చాల్సిన అవసరమున్న వారికి మాత్రమే పరీక్షలు నిర్వహిస్తూండటం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ఇటలీలో ఫిబ్రవరిలో తొలి కోవిడ్ మరణం నమోదు కాగా, నెల తిరక్కుండానే ఆ దేశంలో సుమారు 6,820 మంది ప్రాణాలు కోల్పోవడం, వ్యాధి పుట్టిన చైనా కంటే ఎక్కువ మరణాలు స్పెయిన్‌లోనూ సంభవించడం ప్రపంచాన్ని ఆందోళనకు గురి చేస్తోంది. తాజా లెక్కల ప్రకారం చైనాలో 3281 మరణాలు సంభవించగా స్పెయిన్‌లో ఈ సంఖ్య 3434కు చేరుకుంది. వ్యాప్తి కట్టడికి స్పెయిన్ అనేక కఠిన చర్యలు చేపట్టినప్పటికీ సుమారు 47,610 మంది వ్యాధి బారిన పడ్డారని అధికారులు చెబుతున్నారు. ఆఫ్రికా దేశం కామరూన్, నైజర్‌లో మంగళవారం తొలి కరోనా మరణాలు నమోదయ్యాయి. బ్రిటన్ రాజకుటుంబానికి పరీక్షలు బ్రిటన్ రాజకుటుంబానికి సోమవారం కోవిడ్ పరీక్షలు నిర్వహించగా చార్లెస్‌కు వ్యాధి సోకినట్లు నిర్ధారణ అయింది. దీంతో ఆయన భార్య కెమిల్లాతో కలిసి స్కాట్లాండ్లో స్వీయ నిర్బంధం పాటిస్తున్నారు. కెమిల్లాకు వ్యాధి లేనట్లు తేలింది. ఇరాన్లో రెండువేలకు పైమాటే ఇరాన్లో బాధితుల సంఖ్య 2077కు చేరుకుంది. తాజాగా 24 గంటల్లో 143 మరణాలు సంభవించినట్లు ఆరోగ్య శాఖ అధికార ప్రతినిధి తెలిపారు. దేశంలో కోవిడ్ బారిన పడ్డ వారి సంఖ్య 27,017గా ఉన్నట్లు తెలిపారు. -
బారులు తీరిన పౌరులు
న్యూఢిల్లీ: ప్రధాని మోదీ ఇచ్చిన మూడు వారాల దేశవ్యాప్త లాక్డౌన్ ప్రకటన కొన్నిచోట్ల ప్రజలు కిరాణా కొట్ల ముందు బారులు తీరేలా చేసింది. దేశం మొత్తమ్మీద కోవిడ్ బాధితుల సంఖ్య బుధవారానికి 612 దాటిపోగా, పది మంది మరణించినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. 40 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. మహారాష్ట్రలో మరో వ్యక్తి కోవిడ్‌కు బలికాగా, తమిళనాడులో బుధవారం తొలి కరోనా మరణం నమోదైంది. మంగళవారం ఢిల్లీలో ఒక వ్యక్తి ఇతర కారణాల వల్ల మరణించినా కోవిడ్ మరణాల జాబితాలో చేర్చారు. తాజాగా ఈ తప్పును సవరించడంతో మొత్తం మరణాల సంఖ్య పది అయ్యింది. లాక్డౌన్ సమయంలో నిత్యావసరాల కొరత లేకుండా చూసేందుకు కేంద్రం అన్ని చర్యలు తీసుకుంటోందని కేంద్ర ఆహార శాఖ మంత్రి రాం విలాస్ పాశ్వాన్ స్పష్టం చేయగా.. మందులు, నిత్యావసరాలను అమ్మే దుకాణాలు లాక్డౌన్ సమయంలోనూ తెరిచే ఉంటాయని మంత్రి జవడేకర్ తెలిపారు. మిలటరీ ఆసుపత్రులు సిద్ధం ఆర్మీ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీతోపాటు కేంద్ర పారామిలటరీ దళాలకు చెందిన 32 ఆసుపత్రులను కోవిడ్ చికిత్స కోసం కేంద్రం సిద్ధంచేస్తోంది. వీటిద్వారా సుమారు 2000 వరకూ పడకలు అందుబాటులోకి రానుండగా హిమాచల్ ప్రదేశ్‌లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి చెందిన రెండు వేల గదులను ఐసోలేషన్ కేంద్రంగా మార్చేందుకు హమీర్పూర్ జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ చేపట్టిన ఉన్నత స్థాయి సమావేశంలో ఈ మేరకు నిర్ణయం జరిగినట్లు అధికారులు తెలిపారు. ఈ ఆసుపత్రులు గ్రేటర్ నోయిడా, హైదరాబాద్, గువాహటి, జమ్మూ, గ్వాలియర్‌లోని టేకన్పూర్, డిమాపూర్, ఇంఫాల్, నాగ్‌పూర్, సిల్చార్, భోపాల్, అవడి, జోధ్‌పూర్, కోల్‌కతా, పుణె, బెంగళూరులతోపాటు కొన్ని ఇతర ప్రాంతాల్లో ఉన్నాయి. కోల్‌కతాలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఇతర రోగాలతో వచ్చే రోగులను చేర్చుకోవడాన్ని నిలిపివేయగా పరిస్థితి చక్కబడ్డ వారిని డిశ్చార్జ్ చేస్తూ ఐసోలేషన్ కేంద్రం కోసం వీలైనన్ని పడకలను అందుబాటులోకి తెస్తున్నారు. మందులు నిత్యావసర దుకాణాలు తెరిచే ఉంటాయి : జవదేకర్ మూడు వారాల లాక్డౌన్ సమయంలోనూ దేశం మొత్తమ్మీద నిత్యావసర, మందుల దుకాణాలు తెరిచే ఉంటాయని కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ బుధవారం తెలిపారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం ఏమాత్రం లేదని, బ్లాక్‌మార్కెటింగ్ చేసేవారిపై, అక్రమంగా నిల్వ చేసే వారిని కట్టడి చేసేందుకు తగిన చట్టాలు ఉన్నాయని అన్నారు. బుధవారం జరిగిన కేబినెట్ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను ఆయన విలేకరులకు వివరించారు. లాక్‌డౌన్‌ను పకడ్బందీగా, ప్రజలకు ఏమాత్రం ఇబ్బంది లేకుండా నిర్వహించేందుకు కేంద్రం అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలతో కలిసి పనిచేస్తోందని చెప్పారు. హౌసింగ్ సొసైటీలు కొన్ని వైద్యులను, జర్నలిస్టులను ఇళ్లు ఖాళీ చేయాల్సిందిగా చెప్పడం ఏమాత్రం సరికాదని మంత్రి స్పష్టం చేశారు. సమాజం పరిస్థితులను అర్థం చేసుకోవాలని అన్నారు. స్వస్థత చేకూరిన వారికి స్వాగతం పుణేలో బుధవారం ఒక హృద్యమైన సంఘటన చోటు చేసుకుంది. కోవిడ్ బారిన పడి ఆసుపత్రిలో చికిత్స తరువాత స్వస్థత చేకూరిన దంపతులను వారు నివాసముండే హౌసింగ్ సొసైటీ సాదరంగా స్వాగతం పలికింది. సిన్హ్గఢ్ రోడ్డులో ఉండే ఈ సొసైటీలోని కుటుంబాలన్నీ బాల్కనీల్లో నుంచుని చప్పట్లతో ప్లేట్లతో శబ్దాలు చేస్తూ 51 ఏళ్ల పురుషుడు, 43 ఏళ్ల మహిళకు స్వాగతం పలికారు. కోవిడ్ పరిస్థితి స్థూలంగా.. దేశం మొత్తమ్మీద బుధవారం ఉదయం నాటికి మొత్తం 612 కోవిడ్ కేసులు ఉన్నాయి. కేరళలో అత్యధికంగా 109 కేసులు ఉండగా ఇందులో ఎనిమిది మంది విదేశీయులు ఉన్నారు. మహారాష్ట్రలో ముగ్గురు విదేశీయులు సహా 116 కేసులు ఉన్నాయి. కర్ణాటకలో 41 మంది కోవిడ్ బాధితులు ఉంటే. తెలంగాణలో ఈ సంఖ్య 35 (10 మంది విదేశీయులు)గా ఉంది. ఉత్తరప్రదేశ్‌లో 35 మంది కరోనా బారిన పడ్డారు. ఢిల్లీలో మొత్తం కేసుల సంఖ్య 31 కాగా. తమిళనాడులో 18, బెంగాల్, ఆంధ్రప్రదేశ్‌లో తొమ్మిది మంది చొప్పున కోవిడ్ బారిన పడ్డారు. -
ఉప్పల్ క్రికెట్ స్టేడియంలో ఐసోలేషన్ వార్డులు!
సాక్షి, హైదరాబాద్ : కరోనా వైరస్ నివారణ చర్యలకు తమ వంతు సాయం అందించడానికి పులువురు ముందుకొస్తున్న సంగతి తెలిసిందే. తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఉప్పల్ రాజీవ్ గాంధీ స్టేడియంలో ఐసోలేషన్ వార్డులు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ను హెచ్‌సీఏ అధ్యక్షుడు మహ్మద్ అజహరుద్దీన్ కోరారు. స్టేడియంలో 40 పెద్ద రూమ్‌లు ఉన్నాయని, పార్కింగ్ సదుపాయం కూడా ఉందని తెలిపారు. ఇది ఐసోలేషన్ కేంద్రంగా ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పారు. ఈ మేరకు హెచ్‌సీఏ సెక్రటరీ ఆర్ విజయానంద్ బుధవారం సీఎం కేసీఆర్‌కు లేఖ రాశారు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ తరఫున కరోనా నియంత్రణకు తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను అభినందించారు. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనాపై పోరాటానికి తమ వంతు సేవలు అందించడం చాలా సంతోషంగా ఉందని పేర్కొన్నారు. -
జనావాసాల్లో ఐసోలేషన్ కేంద్రాలు వద్దు
సాక్షి, ఎచ్చెర: ప్రభుత్వ ఆదేశానుసారం అధికార యంత్రాంగం ఐసోలేషన్ కేంద్రాల ఏర్పాటుకు ముందుకు సాగుతోంది. ఈ మేరకు డాక్టర్ అంబేడ్కర్ యూనివర్సిటీ, ట్రిపుల్ ఐటీ వసతి గృహాల్లో ఐసోలేషన్ కేంద్రాల ఏర్పాటుకు సిద్ధమయ్యారు. ఆయా కేంద్రాల్లో సదుపాయా లు పరిశీలించి, కనీసం 500 మంది ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లాకు విదేశాల నుంచి వచ్చి గృహ నిర్బంధంలో ఉన్న వారిని ఆయా ఐసోలేషన్ కేంద్రాల్లో తరలించి వైద్యుల పర్యవేక్షణలో ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. వర్సిటీ, ట్రిపుల్ ఐటీల్లో ఐసోలేషన్ కేంద్రాలు ఏర్పాటు చేయవద్దని స్థానికులు ఆందోళన చేపడుతున్నారు. శ్రీకాకుళం ఆర్డీవో వెంకటరమణ, డీఎస్పీ మూర్తి, తహసీల్దార్ సుధాసాగర్, ఎంపీడీవో పావని, ఎస్ఐ రాజేష్ స్థానికులతో చర్చలు జరిపినా స్థానికులు అంగీకరించలేదు. అధికారులు మాట్లాడుతూ పాజిటివ్ కేసులు తరలిండం లేదని, కేవలం అనుమానితులను పర్యవేక్షణలో ఉంచుతున్నట్టు చెబుతున్నారు. వర్సిటీ వీసీ ప్రొఫెసర్ కూన రామ్‌జీ, ట్రిపుల్ ఐటీ డైరెక్టర్ డాక్టర్ జి.భానుకిరణ్ మాట్లాడుతూ జిల్లా యంత్రాంగం కోరితే వసతికి అంగీకరించినట్టు తెలిపారు. ఈ నేపథ్యంలో యంత్రాంగం ఎటువంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సిందే. ఈ సందర్భంగా ఆర్డీవో ఎం.వి.రమణ మాట్లాడుతూ విదేశాల నుంచి వచ్చిన వారు బయట తిరగొద్దని, ఐసోలేషన్ కేంద్రాల్లోనే ఉండాలని సూచించారు. ప్రజల సహకారంతోనే కరోనా నియంత్రణ సాధ్యమనానరు.