
బెంగళూరు: దేశంలో కరోనా కొత్త వేరియంట్ వ్యాప్తి చెందుతున్న తరుణంలో కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వైరస్ ఉద్ధృతి అధికంగా ఉన్న హై రిస్క్ దేశాల నుంచి వచ్చే ప్రయాణికులను వారం రోజులు క్వారంటైన్‌లో ఉంచనున్నట్లు తెలిపింది.
చైనా, హాంకాంగ్, జపాన్, దక్షిణ కొరియా, సింగపూర్, థాయ్‌లాండ్ నుంచి వచ్చే ప్రయాణికులకు వైరస్ లక్షణాలు కన్పిస్తే వెంటనే ఐసోలేషన్‌కు తరలించనున్నట్లు కర్ణాటక ఆరోగ్య మంత్రి డా.కే శివకుమార్ శనివారం తెలిపారు.
నాలుగు రకాల కరోనా వేరియంట్ల విజృంభణతో చైనా విలవిల్లాడుతోంది. రోజుకు వేల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. పదుల సంఖ్యలో మరణిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే చైనా నుంచి వచ్చే ప్రయాణికులపై అమెరికా, భారత్ సహా పలు దేశాలు ఆంక్షలు విధించాయి.
చదవండి: న్యూ ఇయర్ రోజు విషాదం.. టూర్‌కు వెళ్లి తిరిగివస్తుండగా బస్సు బోల్తా..
Comments
Please login to add a commentAdd a comment