Quarantine
-
Operation Kaveri: సూడాన్ నుంచి వచ్చిన వారిలో ఎల్లో ఫివర్
బనశంకరి: సూడాన్ నుంచి వెనక్కి వస్తున్న భారతీయులకు ప్రమాదకరమైన ఎల్లో ఫివర్ భయం పట్టుకుంది. సూడాన్ నుంచి ఇటీవల బెంగళూరుకు చేరుకున్న 362 మందిలో 45 మంది ఎల్లో ఫివర్‌తో బాధపడుతున్నట్లు తేలింది. అధికారులు వీరిని బెంగళూరులోని రాజీవ్‌గాంధీ ఆసుపత్రిలో క్వారంటైన్‌కు తరలించారు. చర్మం, కళ్లు పచ్చగా మారడం, జ్వరం, తలనొప్పి, గొంతునొప్పి, వాంతులు ఈ జ్వరం లక్షణాలు. పరిస్థితి విషమిస్తే 15 రోజుల్లో అంతర్గత రక్తస్రావం సంభవించి, అవయవాలు పనిచేయడం మానేస్తాయి. ఒక్కోసారి మరణానికి కూడా దారితీయవచ్చు. మరోవైపు, ‘ఆపరేషన్ కావేరి’లో భాగంగా సూడాన్ నుంచి మరో 365 మంది భారతీయులను శనివారం తీసుకువచ్చినట్లు విదేశాంగ మంత్రి జై శంకర్ ట్వీట్ చేశారు. దీంతో, ఇప్పటి వరకు 1,725 మంది స్వదేశానికి తరలించినట్లయిందని పేర్కొన్నారు. -
చైనాలో కోవిడ్ కేసుల విజృంభణ.. జనవరి 21 తర్వాత పరిస్థితేంటో!
చైనాలో పెరుగుతున్న కోవిడ్ కేసుల ప్రభావం ఇతర దేశాలపై ఏ మేరకు ఉంటుంది? ప్రతి దేశాన్ని కలవరపరుస్తున్న సమస్య. ఏ దేశానికి ఆ దేశం దీనిపై చర్చించుకుంటోంది. తగినన్ని ముందు జాగ్రత్తలు తీసుకుంటోంది. ప్రభుత్వం, ఆరోగ్యరంగ నిపుణులు దీనిపై అధ్యయనాలు సాగిస్తున్నారు. చైనాలో పరిస్థితి ఏమిటి? ‘జీరో కోవిడ్ పాలసీ’ పేరుతో, గత మూడేళ్లుగా చైనా ప్రభుత్వం కఠిన నిబంధనలను అమలు చేస్తోంది. లాక్ డౌన్, కేంద్రీకృత క్వారంటైన్ విధానం అమలు చేస్తోంది. పెద్ద ఎత్తున టెస్టింగ్, కాంట్రాక్టు ట్రేసింగు విధానాలను చేపట్టింది. దీంతో రోజువారీ కార్యకలాపాల్లో ప్రతిష్టంభన ఏర్పడింది. వ్యాపార వాణిజ్య వ్యవహారాలు స్తంభించిపోయాయి. దీనిపైన ప్రజల నుంచి ఆందోళన వ్యక్తం కావటంతో, డిసెంబరు మొదటి వారం నుంచి నిబంధనలను సడలించింది. వ్యాక్సినేషన్ ను వేగవంతం చేయటం, ఆసుపత్రుల్లో ఐసీయూ సేవలను మెరుగుపరచటం, యాంటీవైరల్ మందులను పెద్ద ఎత్తున నిల్వ చేయటం వంటి ముందస్తు ఏర్పాట్లు చేసుకోకుండా, నిబంధనలన్నింటిని సడలించటంతో పరిస్థితి అదుపుతప్పింది. ఒక్కసారిగా కోవిడ్ కేసులు పెరిగిపోయాయి. ఆస్పత్రులపైన ఒత్తిడిపెరిగిపోయింది. వైద్యసేవలు అందుబాటులో లేకుండా పోయాయి. ఫార్మశీలు, ఆన్ లైన్ షాపింగ్ ప్లాట్ ఫారాలల్లో మందుల కొరతను ఏర్పడింది. ఫీవర్ హాస్పిటళ్లలో రద్దీ.. యాంటీవైరల్ డ్రగ్ అందుబాటులో లేకుండా పోయింది. స్మశానాలు మృతులతో కిక్కిరిసిపోయాయి. అయినా కేసుల విషయంలోగానీ, మరణాల విషయంలోగానీ, వాస్తవసమాచారాన్ని చైనా బాహ్య ప్రపంచానికి తెలియనివ్వలేదు. కోవిడ్-19కి సంబంధించిన రియల్ టైం సమాచారాన్ని అందించాలని ప్రపంచ ఆరోగ్యసంస్థ అనేక మార్లు విజ్గప్తి చేసింది. ప్రపంచదేశాలు దీనిపై గగ్గోలు చేశాయి. చైనాలో దాదాపు 90 శాతం మంది కోవిడ్ బారిన పడ్డారని అంచనా. అన్ని దేశాల్లో భయాలు చైనాలో జనవరి 21న వచ్చే ‘లూనార్ న్యూఇయర్ హాలిడే’కు ప్రత్యేకత ఉంది. వృత్తి వ్యాపార ఉద్యోగాల రీత్యా వివిధ ప్రాంతాల్లో స్థిరపడిన వారంతా స్వగ్రామాలకు వచ్చి కుటుంబాలను కలుసుకోవటం ఆనవాయితీ. ‘లార్జెస్ట్ యాన్యువల్ మైగ్రేషన్’ గా దీనిని చెబుతారు. బస్సులు, రైళ్లు, విమానాలు ప్రయాణికులతో కిటకిటలాడతాయి. కుటుంబాలతో గడిపిన వీళ్లంతా ఆయా ప్రాంతాలకు తిరిగివచ్చేటప్పుడు వైరస్ ను వెంటతెస్తారన్న ఆందోళన సర్వత్రా వ్యక్త మవుతోంది. అదే జరిగితే చాలా దేశాలు ప్రభావితమయయ్యే అవకాశాలున్నాయి. చైనాకు వచ్చేవారు క్వారంటన్‌లో ఉండవలసిన పనిలేదని కూడా చైనా చెప్పడం ఈ భయాలకు మరో కారణం. ముందు జాగ్రత్త చర్యలు చైనా నుంచి వచ్చే యాత్రికుల విషయంలో అనేక దేశాలు ఆంక్షలు విధిస్తున్నాయి. భారత్ పాటు, అమెరికా, ఆస్ట్రేలియా, కెనాడా, జపాన్, దక్షిణ కొరియా, యూకె, అనేక యూరోపియన్ దేశాలు ఇందులో ఉన్నాయి. బ్రిటన్, ఫ్రాన్స్ కొత్తగా జత కలిశాయి. కోవిడ్ నెగెటివ్ నివేదిక ఉంటేనే ప్రయాణానికి అనుమతిస్తామని చెబుతున్నాయి. మరి యూరప్ మాటేమిటి? పెరుగుతున్న కోవిడ్ కేసుల ప్రభావం యూరోపియన్ రీజయన్ పైన అంతగా ఉండకపోవచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది. యూరోపియన్ రీజియన్ అంటే.. 53 దేశాలు. రష్యాతో పాటు మధ్య ఆసియాలోని దేశాలు అన్నీ ఇందులోకి వస్తాయి. ప్రస్తుత పరిస్థితిపై డబ్ల్యు హెచ్ ఓ యూరోపియన్ డైరక్టర్ హాన్స్ క్లంగ్ మాట్లాడుతూ, ‘‘ ప్రస్తుతానికి యూరోపియన్ దేశాలు ఆందోళన చెందవలసిన పనిలేదు. అలాగని అలసత్వంతో ఉండటానికి వీల్లేదు’’ అని పేర్కొన్నారు. ప్రపంచంలో దాదాపు డజను వరకూ దేశాలు చైనా నుంచి వచ్చే ప్రయాణికులపైన ఆంక్షలు విధించటంలో తప్పు లేదని, అది వివక్ష కిందకు రాదని సమర్థించారు. ఆయా దేశాలు నిఘా ప్రయత్నాలను ముమ్మరం చేయాలని, ఆయా వేరియంట్ల సీక్వెన్సింగ్ ను కొనసాగించాలని చెప్పారు. -
హై రిస్క్ దేశాల నుంచి వచ్చినవారికి అక్కడ వారం రోజుల క్వారంటైన్
బెంగళూరు: దేశంలో కరోనా కొత్త వేరియంట్ వ్యాప్తి చెందుతున్న తరుణంలో కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వైరస్ ఉద్ధృతి అధికంగా ఉన్న హై రిస్క్ దేశాల నుంచి వచ్చే ప్రయాణికులను వారం రోజులు క్వారంటైన్లో ఉంచనున్నట్లు తెలిపింది. చైనా, హాంకాంగ్, జపాన్, దక్షిణ కొరియా, సింగపూర్, థాయ్‌లాండ్ నుంచి వచ్చే ప్రయాణికులకు వైరస్ లక్షణాలు కన్పిస్తే వెంటనే ఐసోలేషన్‌కు తరలించనున్నట్లు కర్ణాటక ఆరోగ్య మంత్రి డా.కే శివకుమార్ శనివారం తెలిపారు. నాలుగు రకాల కరోనా వేరియంట్ల విజృంభణతో చైనా విలవిల్లాడుతోంది. రోజుకు వేల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. పదుల సంఖ్యలో మరణిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే చైనా నుంచి వచ్చే ప్రయాణికులపై అమెరికా, భారత్ సహా పలు దేశాలు ఆంక్షలు విధించాయి. చదవండి: న్యూ ఇయర్ రోజు విషాదం.. టూర్‌కు వెళ్లి తిరిగివస్తుండగా బస్సు బోల్తా.. -
పీక్స్‌లో కరోనా..? చైనా నిర్ణయంతో ప్రపంచ దేశాలకు గుబులు!
బీజింగ్: చైనాలో ఒకవైపు కరోనా కల్లోలం విచ్చలవిడిగా కొనసాగుతూనే ఉన్నా సరిహద్దులను తెరవాలన్న ప్రభుత్వ నిర్ణయం ప్రజల్లో కొత్త జోష్ నింపుతోంది. కరోనా వెలుగు చూసిన మూడేళ్ల తర్వాత తొలిసారిగా విదేశీ ప్రయాణాలకు వీలు చిక్కేలా కన్పిస్తుండటంతో వారు సంబరపడుతున్నారు. జనవరి చివర్లో వచ్చే చైనా న్యూ ఇయర్ సంబరాల కోసం విదేశాలకు వెళ్లేందుకు ఇప్పట్నుంచే ప్లాన్ చేసుకుంటున్నారు. చైనా బుకింగ్ వెబ్సైట్ ట్రిప్.కామ్ తదితర సైట్లలో పలు దేశాల్లోని ప్రముఖ పర్యాటక ప్రాంతాలకు మామూలు కంటే ఏకంగా పది రెట్లు ఎక్కువగా బుకింగ్‌లు జరుగుతున్నాయి! విదేశాల నుంచి వచ్చేవారికి జనవరి 8 నుంచి క్వారంటైన్ నిబంధనను చైనా ఎత్తేస్తుండటంతో పలు దేశాల్లోని చైనీయులు కూడా స్వదేశానికి వెళ్లడానికి సిద్ధపడుతున్నారు. మరోవైపు ఈ పరిణామం ప్రపంచ దేశాలకు గుబులు పుట్టిస్తోంది. చైనా పర్యాటకులతో పాటు కరోనా కూడా మరోసారి వచ్చిపడుతుందేమోనని బెంబేలెత్తుతున్నాయి. దాంతో చైనా నుంచి ప్రయాణికుల రాకపై నిషేధం విధించే అంశాన్ని అమెరికా, భారత్‌తో పాటు పలు దేశాలు చురుగ్గా పరిశీలిస్తున్నాయి. భారత్‌తో పాటు జపాన్, దక్షిణ కొరియా, తైవాన్ ఇప్పటికే చైనా ప్రయాణికులకు కరోనా పరీక్షలను తప్పనిసరి చేశాయి. కరోనాకు ముందు వరకూ అమెరికాతో పాటు పలు ఆసియా, యూరప్ దేశాలను సందర్శించే విదేశీ పర్యాటకుల్లో చైనీయుల సంఖ్యే ఎక్కువగా ఉండేది. అంతమయ్యే లక్షణాలే! చైనాలో కరోనా విలయం తాండవం చేస్తున్నా వైరస్ అంతమయ్యే ముందు అలాగే విధ్వంసం సృష్టిస్తుందని అక్కడి వైద్య నిపుణులుంటున్నారు. ఇక కరోనా ముగిసిపోయే దశకు వచ్చేసినట్టేనని చెబుతున్నారు. దేశంలో కరోనా పరీక్షలను బాగా తగ్గించేశారని చైనా జెజాంగ్ ప్రావిన్స్‌లో ప్రాక్టీస్ చేస్తున్న భారతీయ డాక్టర్ అభిషేక్ కుందు చెప్పారు. ఆస్పత్రికి వెళ్లే పరిస్థితి వచ్చిన వారు, ఇళ్లల్లో కోవిడ్–19 కిట్ కొనుక్కొని చేసుకుంటున్నవారే తప్ప ప్రభుత్వం చేసే పరీక్షలు తగ్గిపోయాయని అన్నారు. కరోనా పాజిటివ్ వచ్చిన వారిలో అత్యధికులు కోలుకుంటున్నారని, ఇతరత్రా అనారోగ్య సమస్యలున్నవారు, వృద్ధులు మాత్రమే ప్రాణాలు కోల్పోతున్నారని డాక్టర్ కుందు వివరించారు. -
కరోనాపై చైనా కీలక నిర్ణయం.. వాళ్లకు బిగ్ రిలీఫ్..
బీజింగ్: కరోనా నిబంధనలపై చైనా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులు తప్పనిసరిగా క్వారంటైన్లో ఉండాల్సిన అవసరం లేదని సోమవారం అధికారిక ప్రకటనలో పేర్కొంది. జనవరి 8 నుంచి ఇది అమల్లోకి రానుంది. దీంతో మూడేళ్ల తర్వాత విదేశీ ప్రయాణికులకు విముక్తి లభించింది. ఇకపై చైనాకు వెళ్లేవారు కరోనా నెగిటివ్ ద్రువపత్రం చూపిస్తే సరిపోతుంది. 48 గంటలకు ముందు ఈ పరీక్ష చేయించుకుని ఉండాలి. అలాగే కరోనా బాధితులతో సన్నిహితంగా మెలిగిన విదేశీయులను ట్రాక్ చేయడాన్ని కూడా చైనా నిలిపివేస్తోంది. సరకు దిగుమతికి ఇబ్బందులు ఎదురవుతున్న కారణంగా ఈ నిర్ణయం తీసుకుంది. కరోనా వెలుగు చూసిన కొత్తలో విదేశీ ప్రయాణికులు కచ్చితంగా 14 రోజులు ప్రభుత్వ కారంటైన్ కేంద్రంలో ఉండాలని చైనా రూల్ తీసుకొచ్చింది. ఆ తర్వాత కొన్ని నెలలకు దీన్ని 21 రోజులకు పెంచింది. అయితే కేసులు తగ్గాక ఐదు రోజులకు తగ్గించింది. కోవిడ్ జీరో పాలసీ పేరుతో దాదాపు మూడేళ్లుగా కఠిన ఆంక్షలు అమలు చేస్తోంది డ్రాగన్ దేశం. అయితే ప్రజల నుంచి పెద్దఎత్తున నిరసనలు వెల్లువెత్తడంతో డిసెంబర్ మొదటి వారంలో ఆంక్షలు సడలించింది. కానీ ఆ తర్వాత కేసులు, మరణాలు విపరీతంగా పెరిగాయి. చదవండి: పక్క సీట్లో సీరియల్ కిల్లర్.. భయంతో వణికిపోయిన మహిళ.. ఫొటో వైరల్.. -
చైనా మంకుపట్టుతో అల్లాడుతున్న జనాలు.. బలవంతంగా ఈడ్చుకెళ్తూ..
కరోనా పుట్టినిల్లు అయినా చైనాలో కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. అలాగే ఏళ్ల తరబడి క్వారంటైన్, లాక్డౌన్లతో మగ్గిపోయిన ప్రజలు ఆగ్రహంతో తిరబడే స్థాయికి వచ్చినా.. చైనా ఏ మాత్రం తగ్గేదేలే అంటూ మంకుపట్టు పడుతూనే ఉంది. ఇప్పుడుప్పుడే ప్రపంచ దేశాలన్నీ ఆ మహమ్మారి నుంచి స్వేచ్ఛ వాయువులను పీల్చుకుంటూ హాయిగా ఉంటున్నా...ఇంకా చైనా మాత్రం జీరో కోవిడ్ అంటూ కఠిన ఆంక్షలు విధిస్తూనే ఉంది. ప్రజల్లో ఓపిక చచ్చి వీధల్లోకి వచ్చి నిరసనలు చేసినా... సైన్యంతో కట్టడి చేసింది. వారిని ఒక జంతువుల్లా బలవంతంగా నిర్బంధంలో ఉంచేందుకే యత్నించింది. దీంతో ప్రజాగ్రహం కట్టలు తెంచుకుని జిన్‌పింగ్ రాజీనామా చేయాలంటూ దేశ వ్యాప్తంగానే గాక సోషల్ మీడియాల్లో సైతం నిరసన సెగలు ఊపందుకోవడంతో వెనక్కి తగ్గేంది. ఆఖరికి ప్రపంచ దేశాలు సైతం ఇంతలా కఠినా ఆంక్షలు విధించొద్దు అని సూచించినా.. తగ్గని చైనా లాక్డౌన్ ఆంక్షలను సడలించే ప్రయత్నం చేసింది. చైనా ప్రభుత్వం అనుహ్యంగా ఈ నిర్ణయం తీసుకున్న తరుణంలోనే కేసులు ఘోరంగా పెరగడం ప్రారంభించింది. ప్రజలు ప్రయాణించేలా ఆంక్షలు సడలించిన తర్వాత కేసులు పెరగడంతో చైనా గుట్టుచప్పుడూ కాకుండా తన పాలసీని తనదైన శైలిలో అమలు చేయడం ప్రారంభించింది. ఈ మేరకు ఆరోగ్య అధికారులు గట్టి నిఘా ఉంచారు. ఏ వ్యక్తి అయినా కరోనా బారిన పడినట్లు తెలిస్తే చాలు అతని ఇంటి వద్దకు వచ్చేయడం క్యారంటైన్‌కి తీసుకుపోవడం వంటివి చేస్తున్నారు. అందులో భాగంగానే ఒక వ్యక్తిని బలవంతంగా క్వారంటైన్‌కి తీసుకువెళ్తున్న వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. ఆ వీడియోలో హోం క్వారంటైన్లో ఉంటానన్న వినకుండా అదికారులు అతన్ని ఎలా బలవంతంగా ఈడ్చుకెళ్తున్న దృశ్యాలు కనిపించాయి. మూడేళ్లు అయినా కరోన మహమ్మారీ కంటే అక్కడి ఆంక్షలతోనే చైనా ప్రజలు చిగురుటాకులా వణికిపోతున్నారు. (చదవండి: ఉక్రెయిన్ ఎంబసీలకు నెత్తుటి ప్యాకేజీలు...రష్యాపై ఫైర్) -
క్వారంటైన్ ముగిసింది.. 24 గంటల్లోనే మట్టుపెట్టాయ్
షియోపూర్: నమీబియా నుంచి మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్ పార్కుకు తీసుకువచ్చిన చీతాలు వేట మొదలుపెట్టాయి. క్వారంటైన్ నుంచి పెద్ద ఎన్‌క్లోజర్‌లోకి విడుదల చేసిన ఫ్రెడ్డీ, ఆల్టన్ అనే రెండు మగ చీతాలు 24 గంటల్లోనే మచ్చల జింకను విజయవంతంగా వేటాడాయి. ఆదివారం రాత్రి లేదా సోమవారం వేకువ జామున వేటాడి ఉంటాయని అధికారులు చెప్పారు. అనంతరం రెండు గంటల్లోనే ఆహారాన్ని తినేశాయని చెప్పారు. వేటలోనూ ఇవి సత్తా చాటాయని చీఫ్ ఫారెస్ట్ కన్జర్వేటర్ ఉత్తమ్ కుమార్ శర్మ సోమవారం చెప్పారు. సెప్టెంబర్ 17న నమీబియా నుంచి భారత్‌కు తీసుకు వచ్చిన 8 చీతాల మొట్టమొదటి వేట ఇదేనన్నారు. ఫ్రెడ్డీ, ఆల్టన్‌లను వదిలిన ఎన్‌క్లోజర్ విస్తీర్ణం 98 హెక్టార్ల వరకు ఉంటుందని చెప్పారు. మిగతా వాటిని కూడా దశల వారీగా విడుదల చేస్తామని చెప్పారు. ఇదీ చదవండి: ఎంతో ఉల్లాసంగా ఉన్నాయ్- ప్రధాని మోదీ -
జనంలోకి జిన్‌పింగ్
బీజింగ్: చైనాలో సైనిక కుట్ర అంటూ సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టిన వార్తలను పటాపంచలు చేస్తూ దేశాధ్యక్షుడు జిన్‌పింగ్ మంగళవారం జనబాహుళ్యంలో ప్రత్యక్షమయ్యారు. ఉబ్బెకిస్తాన్‌లో సమర్కండ్లో షాంఘై సహకార సంస్థ(ఎస్సీఓ) సమావేశాల తర్వాత 16న చైనాకు తిరిగొచ్చిన అధ్యక్షుడు జిన్‌పింగ్‌ను గృహనిర్బంధంలో ఉంచి సైన్యం అధికార పగ్గాలు చేపట్టిందనే వార్తలు నాలుగైదు రోజులుగా అన్ని సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్న విషయం విదితమే. ఈ వార్తలన్నీ ఉట్టి కాకమ్మ కథలే అని రుజువుచేస్తూ జిన్‌పింగ్ మంగళవారం బీజింగ్‌లో అధికార కమ్యూనిస్ట్ పార్టీ ఏర్పాటుచేసిన ఒక ఎగ్జిబిషన్లో పాల్గొన్నారు. దశాబ్దకాలంలో కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా సాధించిన విజయాలు, దేశ పురోగతిని ప్రతిబింబించేలా ఉన్న ప్రదర్శనను అధ్యక్షుడు జిన్‌పింగ్ తిలకించారని చైనా అధికార వార్త సంస్థ జిన్హువా తెలిపింది. జిన్‌పింగ్ వెంట దేశ ప్రధాని లీ క్వెకియాంగ్, పార్టీ కీలక నేతలు ఉన్నారు. జిన్‌పింగ్ నుంచి అధికారాన్ని సైన్యం కైవసం చేసుకుందనే వార్తలు అబద్ధమని దీంతో తేలిపోయింది. జీరో కోవిడ్ పాలసీలో భాగంగా విదేశాల నుంచి వచ్చిన ప్రతీ ఒక్కరూ ఏడు రోజులపాటు క్వారంటైన్లో ఉండాలనే నిబంధనను జిన్‌పింగ్ కూడా పాటించారని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. -
చైనాలో ‘సైనిక కుట్ర’పై... అదే అస్పష్టత
బీజింగ్: చైనాలో సైనిక కుట్ర జరిగిందనీ, అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ను నిర్బంధించారని వచ్చిన వార్తల్లో నిజానిజాలపై సందిగ్ధత కొనసాగుతూనే ఉంది. ఇవన్నీ వదంతులే కావచ్చని పరిశీలకులు అంటున్నారు. ఎస్సీవో శిఖరాగ్రం కోసం రెండేళ్ల తర్వాత దేశం దాటిన నేపథ్యంలో జిన్‌పింగ్ తిరిగి రాగానే క్వారంటైన్లో ఉండి ఉంటారని అంటున్నారు. 2021లోనూ జిన్‌పింగ్ కొన్ని రోజులు కనిపించకపోయేసరికి ఇలాగే పుకార్లు వచ్చాయని గుర్తు చేస్తున్నారు. కాకపోతే శనివారమంతా ఇంటర్నెట్ ‘కుట్ర’ వార్తలతో హోరెత్తినా ఇలాంటి వాటిపై చురుగ్గా ఉండే చైనా సోషల్ మీడియా ఇప్పటిదాకా స్పందించకపోవడం ఆశ్చర్యమేనంటున్నారు. బహుశా అక్టోబర్ 16వ తేదీన అధ్యక్ష ఎన్నిక నాటికే దీనిపై స్పష్టత వస్తుందని కొందరు అభిప్రాయపడుతున్నారు. -
ఢిల్లీలో వెయ్యి కరోనా కేసులు
న్యూఢ్లిల్లీ/సాక్షి ప్రతినిధి, చెన్నై: దేశంలో కరోనా కలకలం కొనసాగుతోంది. వరసగా మూడో రోజు 2 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో 2,451 కేసులు నమోదయ్యాయి. క్రియాశీల కేసులు 14,241కి చేరాయి. 54 మంది మరణించారు. ఢిల్లీలో ఒక్క రోజే 1,042 కేసులు నమోదయ్యాయి. ఇద్దరు మరణించారు. ఢిల్లీలో స్కూళ్లో ప్రత్యేక క్వారంటైన్ గదులు సిద్ధం చేశారు. విద్యార్థులు లంచ్ బాక్స్‌లను షేర్ చేసుకోద్దని సూచించారు. మరోవైపు తమిళనాడునూ కరోనా వణికిస్తోంది. ఐఐటీ మద్రాసులో 30 మంది విద్యార్థులు కరోనా బారినపడ్డారు. శుక్రవారం 700 మందికి పరీక్షలు నిర్వహించగా 30 మందికి పాజిటివ్ వచ్చినట్లు తమిళనాడు రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి రాధాకృష్ణన్ తెలిపారు. స్వల్ప లక్ష్యణాలు ఉన్న విద్యార్థులను కళాశాల ప్రాంగణంలోనే హోం క్వారంటైన్లో ఉంచినట్లు చెప్పారు. క్యాంపస్‌లోని 19 హాస్టళ్లలో కరోనా నిర్మూలన చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఢిల్లీ, తమిళనాడుల్లో శుక్రవారం నుంచి బహిరంగ ప్రదేశాల్లో మాస్క్‌ను మళ్లీ తప్పనిసరి చేశారు. లేదంటే రూ.500 జరిమానా తప్పదని ప్రభుత్వాలు హెచ్చరించాయి. షాంఘైలో లాక్డౌన్ పొడిగింపు బీజింగ్: చైనాలోని షాంఘైలో కరోనా కలకలం కొనసాగుతోంది. దాంతో కోవిడ్ లాక్‌డౌన్‌ను ఏప్రిల్ 26 దాకా పొడిగించారు. నాలుగు వారాలుగా లాక్డౌన్ అమలు చేస్తూ కఠినమైన ఆంక్షలు విధిస్తుండటంతో అక్కడ ప్రజల్లో తీవ్రమైన అసంతృప్తి నెలకొనడం తెలిసిందే. చైనాలో గురువారం 2,119 కేసులు నమోదయ్యాయి. వాటిలో 1,931 షాంఘైలో వెలుగు చూశాయి. 11 మంది మరణించారు. దాంతో తాజా వేవ్ మృతుల సంఖ్య 36కి చేరింది. -
చైనాలో భయానక పరిస్థితులు.. కంటతడి పెట్టిస్తున్న వీడియో
బీజింగ్: కరోనా వైరస్ కారణంగా డ్రాగన్ దేశం చైనాలో భయానక వాతావరణం నెలకొంది. చైనాలోని అతిపెద్ద నగరం షాంఘైలో పరిస్థితులు భయానకంగా మారాయి. జీరో కోవిడ్ విధానంలో భాగంగా అమలవుతున్న కఠిన ఆంక్షలతో జనం ఆహారం తెచ్చుకునేందుకు కూడా అవకాశం లేకుండాపోతోంది. దీంతో, షాంఘై ప్రజలు తిరగబడుతున్నారు. వివరాల ప్రకారం.. కరోనా వైరస్ కారణంగా షాంఘైలో కఠిన ఆంక్షలు అమలవుతున్నాయి. ఈ నేపథ్యంలో కోవిడ్ పేషెంట్లు లొంగిపోవాలని పోలీసులు చేసిన ఆదేశాలు షాంఘైలో ఘర్షణకు దారి తీశాయి. పీపీఈ కిట్ ధరించి ఓ వీధికి వచ్చిన పోలీసులు.. అక్కడ ఉన్న నివాసితుల ఇండ్లను సరెండర్ చేయాలని కోరారు. ఆ సమయంలో పోలీసులను స్థానికులు అడ్డుకోవడంతో వారి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. కరోనా బాధితులను ఆ ప్రాంతంలో ఉన్న ఓ అపార్ట్మెంట్లలో పెట్టేందుకు పోలీసులు ముందస్తుగా కాంపౌండ్‌ను ఖాళీ చేయించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఓ మహిళ.. తమ కాంపౌండ్‌ను క్వారెంటైన్ కేంద్రంగా మారుస్తున్నారని ఆరోపించింది. దీంతో తమ ఆహారం దొరకకుండా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. INSANE: The CCP is cracking down hard to enforce quarantine orders in Shanghai This video is wild pic.twitter.com/EjiXm5qwO4 — Drew Hernandez (@DrewHLive) April 14, 2022 ఇదిలా ఉండగా.. కరోనా బారిన పడిన వారి ఇళ్లలోని పెంపుడు జంతువులను సిబ్బంది కొట్టిచంపుతున్నారు. ఇటువంటి దారుణాలకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న తాత్కాలిక ఆస్పత్రుల్లో అరకొర వసతులు, చెత్తాచెదారంతో ఇబ్బందులు పడుతున్నామని బాధితులు చెబుతున్నట్లు సోషల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ప్రజలు ఆకలితో అలమటిస్తూ చనిపోవడం కంటే ఆత్మహత్యే శరణ్యమంటూ ఆక్రందనలు చేస్తున్నా రు. జైలుకెళ్తే అయినా కడుపు నిండుతుందనే ఆశతో తమను అరెస్ట్ చేయండంటూ పోలీసులకు విజ్ఞప్తులు చేస్తున్నారు. -
చైనాలో భారత్ కొత్త రాయబారికి క్వారంటైన్
బీజింగ్: చైనాలో రాయబారిగా ఇటీవల నియమితులైన ప్రదీప్‌కుమార్ రావత్‌ను అధికారులు కోవిడ్–19 నిబంధనల పేరుతో నిర్బంధ క్వారంటైన్లో ఉంచినట్లు బీజింగ్‌లోని భారత రాయబార కార్యాలయం శుక్రవారం ట్విట్టర్లో తెలిపింది. ఆయన్ను తప్పనిసరి క్వారంటైన్ కోసం షాంగైకి తరలించిన అక్కడి అధికారులు.. ఇటువంటి కోవిడ్ నిబంధనపై ముందుగా భారత అధికారులకు సమాచారం అందించలేదని తెలుస్తోంది. ఇప్పటి వరకు చైనాకు రాయబారిగా పనిచేసిన విక్రమ్ మిస్రిని ఇటీవల ప్రభుత్వం డిప్యూటీ జాతీయ భద్రతా సలహాదారుగా నియమించి, ఆయన స్థానంలో రావత్‌ను ఎంపిక చేసింది. 1990 బ్యాచ్ ఐఎఫ్ఎస్ అధికారి అయిన రావత్, గతంలో ఇండోనేసియా, నెదర్లాండ్స్‌లలో రాయబారిగా పనిచేశారు. మాండరిన్ అనర్గళంగా మాట్లాడగలిగిన ఆయన హాంకాంగ్, బీజింగ్‌లలో కూడా పనిచేశారు. (చదవండి: నాటో’లో ప్రతి అంగుళం కాపాడుకుంటాం) -
హోంక్వారంటైన్‌కు బ్రిటన్ గుడ్‌బై
లండన్: కరోనాతో సహజీవనం అనే ప్రణాళికకు బ్రిటన్ ప్రభుత్వం కసరత్తు ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా కోవిడ్–19 సోకితే 10 రోజులు హోంక్వారంటైన్ ఉండాలన్న నిబంధనలను ఎత్తివేసింది. దీనిపై సోమవారం అధికారిక ప్రకటన వెలువడనుంది. బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ గత కొద్ది రోజులుగా కరోనాతో సహజీవనం అనే ప్రణాళికపైనే దృష్టిసారించారు. కొద్ది రోజుల క్రితం మాస్కులు తప్పనిసరి కాదని చెప్పిన ఆయన ఇప్పుడు సెల్ఫ్ ఐసొలేషన్ నిబంధనల్ని కూడా ఎత్తేశారు. బోరిస్ జాన్సన్ ఆదివారం ఒక వార్తా సంస్థతో మాట్లాడుతూ కోవిడ్‌పై వ్యాక్సినే బ్రహ్మాస్త్రమని, గత రెండేళ్లలో టీకాలు తీసుకుంటూ కరోనా వైరస్‌ను ఎదుర్కొనే రోగనిరోధకతను సాధించామన్నారు. ప్రజ లందరిలోనూ వైరస్ పట్ల శాస్త్రీయపరమైన అవగాహన రావడంతో ఇకపై కోవిడ్‌తో సహజీవనం చేసే విధంగా ప్రణాళికలను రూపొందించాల్సిన అవసరం ఉందన్నారు. ‘‘కోవిడ్ హఠాత్తుగా అదృశ్యమైపోదు. ఈ వైరస్‌తో కలిసి బతుకుతూ దాని నుంచి అనుక్షణం మనల్ని మనం కాపాడుకునే ప్రయత్నాలు చేయాలి. మన స్వేచ్ఛకు అడ్డంకిగా మారిన ఆంక్షల్ని సడలించాలి’’ అని జాన్సన్ పేర్కొన్నారు. దేశ జనాభాలో 12 ఏళ్లకు పైబడిన వారిలో 91 శాతం మందికి మొదటి డోసు పూర్తయితే, 85 శాతం మంది రెండు డోసులు తీసుకున్నారు. నిబంధనలు ఎత్తివేయడంపై ఆరోగ్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తుంటే, ప్రతిపక్ష లేబర్ పార్టీ యుద్ధం ముగిసే ముందు జాన్సన్ విజయాన్ని ప్రకటించుకున్నట్టుగా వ్యవహరిస్తున్నారని విమర్శిస్తోంది. క్వీన్ ఎలిజబెత్‌కు కరోనా బ్రిటన్ రాణి క్వీన్ ఎలిజబెత్‌కు కోవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణైంది. ఆమెకి లక్షణాలు స్వల్పంగా ఉన్నాయని బకింగ్హమ్ ప్యాలెస్ వెల్లడించింది. రాణి ఆరోగ్యాన్ని వైద్యులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారని తెలిపింది. ఆమె రెండు డోసులతో పాటు బూస్టర్ డోసు కూడా తీసుకున్నారు. -
అతని శరీరంలో కరోనా శాశ్వతంగా ఉండిపోతుందట.. ఇదే తొలికేసు!
కరోనా మహమ్మారీ ప్రపంచ దేశాలను ఎలా గజగజలాడించిందో చూశాం. అంతేకాదు చాలామంది కరోనా బారిన పడినవారు ఉన్నారు. అయితే కొంతమంది త్వరితగతిన కోలుకుంటే మరీ కొంతమందికి ప్రాణాంతకంగా మారి చనిపోవడం కూడా జరిగింది. మరి కొద్దిమంది ఈ కరోనా నుంచి ప్రాణాలతో బయటపడ్డప్పటికీ దుష్ప్రభావాలతో పోరాడుతున్నవారు కూడా ఉన్నారు. కానీ ఇక్కడోక వ్యక్తికి మాత్రం ఒకటి రెండుసార్లు కాదు ఏకంగా 78 సార్లు కరోనా బారిన పడ్డాడు . అసలు విషయంలోకెళ్తే... టర్కీకి చెందిన 56 ఏళ్ల ముజఫర్ కయాసన్‌కి గతేడాది నవంబర్ 2020న తొలిసారిగా కరోనా సోకింది. దీంతో కయాసన్ ఆస్పత్రిలో చేరాడు. అప్పటి నుంచి అతను నిర్భంధంలోనే ఉంటున్నాడు. నిజానికి కొన్ని రోజుల తర్వాత కరోనా నుంచి కోలుకోవడంతో అతనికి వైద్యులు కరోనా పరీక్షలు నిర్వహించారు. అయితే రిపోర్ట్‌లో కయాసన్‌కి కరోనా పాజిటివ్‌గా రిపోర్టు వచ్చింది. ఇలా ఒకటి రెండుసార్లు కాదు ఏకంగా 78 సార్లు కరోనా పాజిటివ్‌గా రిపోర్ట్ వచ్చింది. దీంతో వైద్యులు ఒక్కసారిగా షాక్‌కి గురయ్యారు. కయాసన్ ఆరోగ్య పరిస్థితిపై పూర్తిగా విచారించగా..అతను లూకేమియాతో బాధపడుతున్నాడని తేలింది. ఇది ఒకరకమైన బ్లడ్ కేన్సర్. ఈ వ్యాధి వల్ల ఆ వ్యక్తులకు వ్యాధులతో పోరాడటానికే సహాయపడే తెల్లరక్తకణాలు తగ్గిపోవడమే కాక వ్యాధినిరోధక శక్తి కూడా తగ్గిపోదంతుందని వైద్యులు తెలిపారు. అందువల్లే కయాసన్ శరీరం నుంచి కరోనా వైరస్ శాస్వతంగా నిర్మూలించలేమని వైద్యులు వెల్లడించారు. కానీ కయాసన్ ఏడాదిగా అంటే సుమారు 14 నెలలు నుంచి నిర్భంధంలోనే ఉన్నాడు. పైగా కుటుంబ సభ్యులకు, స్నేహితులకు దూరంగా చాలా దుర్భరమైన జీవితాన్ని గడుపుతున్నాడు. అంతేకాదు అతను కరోనా పాజిటివ్ కారణంగా వ్యాక్సిన్ వేయించుకోలేని దుర్భర స్థితిలో ఉండటంబాధకరం. ఇది ప్రపంచంలోనే తొలి కేసుగా పేర్కొన్నారు. (చదవండి: విదేశాల నుంచి వచ్చిన వారు క్యారంటైన్లో ఉండక్కర్లేదు!) -
గుడ్ న్యూస్: విదేశాల నుంచి వచ్చిన వారు క్యారంటైన్లో ఉండక్కర్లేదు!
ఒమిక్రాన్ వేరియంట్‌తో ప్రమాదం అంచున ఉన్న దేశాలను తప్పించి మిగతా దేశాల నుంచి రాకపోకలు సాగించే వారికి కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. ఇక నుంచి విదేశాల నుంచి వచ్చేవాళ్లు క్యారంటైన్లో ఉండాల్సిన అవసరం లేదని, కేవలం 14 రోజుల స్వీయ పర్యవేక్షణ సరిపోతుందని పేర్కొంది. అయితే ఈ మార్గదర్శకాలు ఫిబ్రవరి 14 నుంచి అమలులోకి వస్తాయని తెలిపింది. అంతేకాదు నిరంతరం మార్పు చెందుతున్న ఈ కోవిడ్ -19 వైరస్‌ని పర్యవేక్షించాల్సిన అవసరం ఉందని నొక్కిచెప్పింది. కానీ ఆర్థిక కార్యకలాపాలకు ఎలాంటి అంతరాయం ఏర్పడకుండా తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరింది. కొత్త మార్గదర్శకాలు... విదేశీయులందరూ తప్పనిసరిగా గత 14 రోజుల ప్రయాణ చరిత్రతో సహా ఆన్లైన్లో స్వీయ-డిక్లరేషన్ ఫారమ్‌ను సమర్పించాలి తప్పనిసరిగా ప్రయాణ తేదీ నుండి 72 గంటలలోపు నిర్వహించబడిన ప్రతికూల ఆర్టీ-పీసీఆర్ పరీక్షను కూడా అప్లోడ్ చేయాలి. రెండు డోసుల వ్యాక్సిన్లు వేయించుకున్నట్లు ధృవీకరించే ధృవీకరణ పత్రాన్ని కూడా అప్లోడ్ చేయాలి. వ్యాక్సిన్ ప్రోగ్రాంలో భాగంగా భారత్ నిర్దేశించిన 72 దేశాల వారికి మందికి మాత్రమే ఈ మార్గనిర్దేశకాలు అందుబాటులోకి ఉంటాయి. ఆయా దేశాల్లో కెనడా, హాంకాంగ్, యునైటెడ్ స్టేట్స్, యునైటెడ్ కింగ్డమ్, బహ్రెయిన్, ఖతార్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌తో సహా కొన్ని యూరోపియన్ దేశాలు కూడా ఉన్నాయి. "ఈ మేరకు సెల్ఫ్ డిక్లరేషన్ ఫారమ్‌లో మొత్తం సమాచారాన్ని నింపి... ప్రతికూల ఆర్టీ-పీసీఆర్ పరీక్ష నివేదిక లేదా కోవిడ్-19 వ్యాక్సిన్ సర్టిఫికేట్‌ను అప్లోడ్ చేసిన ప్రయాణికులను మాత్రమే ఎయిర్‌లైన్స్ (విమానయాన సంస్థలు) బోర్డింగ్‌కి అనుమతిస్తాయి. ఫ్లైట్ సమయంలో తప్పనిసరిగా కోవిడ్ ప్రోటోకాల్‌ని పాటించాలి " అని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ నొక్కి చెప్పింది. (చదవండి: కేంద్రం కీలక నిర్ణయం.. డ్రోన్ల దిగుమతిపై నిషేధం.. కారణం ఇదే) -
తొలి వన్డే ముందు భారత్‌కు బిగ్ షాక్.. స్టార్ బ్యాటర్ దూరం!
న్యూజిలాండ్ మహిళలతో తొలి వన్డేకు మందు భారత జట్టుకు బిగ్ షాక్ తగిలింది. జట్టు స్టార్ బ్యాటర్ స్మృతి మంధాన క్వారంటైన్ నిభంధనల కారణంగా శనివారం జరిగి తొలి వన్డేకు మంధాన దూరం కానుంది. ఇప్పటికే క్వారంటైన్లో ఉన్న మంధాన.. బుధవారం న్యూజిలాండ్‌తో జరిగిన ఏకైక టీ20 మ్యాచ్‌కు దూరమైంది. ఈ మ్యాచ్‌లో భారత్ 18 పరుగుల తేడాతో ఓటమి చెందింది.మంధానతో పాటు పేసర్లు మేఘనా సింగ్,రేణుకా సింగ్ కూడా తొలి వన్డేకు దూరం కానున్నారు. కాగా మంధాన స్ధానంలో యస్తిక భాటియాను ఎంపిక చేశారు. కాగా న్యూజిలాండ్‌తో జరిగిన టీ20 మ్యాచ్‌లో షఫాలీ వర్మతో కలిసి భాటియా ఇన్నింగ్స్‌ను ప్రారంభించింది. అయితే ఆ మ్యాచ్‌లో 26 పరుగులు చేసి యస్తిక భాటియా పర్వాలేదు అనిపించింది.ఇక న్యూజిలాండ్‌తో భారత మహిళల జట్టు 5 వన్డేల సిరీస్ ఆడనుంది. ఇరు జట్లు మధ్య తొలి వన్డే శనివారం జరగనుంది. మొత్తం ఐదు వన్డేలు క్వీన్స్టౌన్ వేదికగానే జరగనున్నాయి. చదవండి: Aus Vs Nz Cancelled: న్యూజిలాండ్- ఆస్ట్రేలియా టీ20 సిరీస్ రద్దు.. కారణం అదేనా? -
కరోనా బారిన పడ్డ కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్
న్యూఢిల్లీ: దేశంలో కరోనా థర్డ్‌వేవ్ ఉధృతి కొనసాగుతుంది. ఈ మహమ్మారి వీఐపీల నుంచి సామాన్యుల వరకు ఏ ఒక్కరిని వదలడం లేదు. ఎన్ని జాగ్రత్త చర్యలు తీసుకున్నప్పటికీ.. సాధారణ ప్రజల నుంచి సెలబ్రిటీలు, ప్రజాప్రతినిధులు, రాజకీయ నేతల వరకు అందరూ కరోనా బారిన పడుతున్నారు. ఇప్పటికే పలువురు కేంద్ర మంత్రులు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. తాజాగా, కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్ కూడా ఆ జాబితాలో చేరిపోయారు. తాను కరోనా బారిన పడినట్లు జైశంకర్ ట్విటర్ ద్వారా వెల్లడించారు. ‘కొన్ని రోజులుగా తాను.. స్వల్ప అస్వస్థతగా ఉండటంతో.. కరోనా ఉండటంలో పరీక్షలు చేసుకున్నానని.. దీనిలో కోవిడ్‌గా నిర్ధారణ అయినట్లు తెలిపారు. వైద్యుల సూచన మేరకు ప్రస్తుతం ఐసోలేషన్‌లో ఉన్నట్లు ప్రకటించారు’. అదే విధంగా తనను కలిసిన వారంతా కరోనా పరీక్షలు చేసుకోవాలని సూచించారు. External Affairs Minister Dr S Jaishankar tested #COVID19 positive. pic.twitter.com/H3pYqDECBV — ANI (@ANI) January 27, 2022 చదవండి: ఉత్తరాఖండ్‌లో కాంగ్రెస్‌కు షాక్.. బహిష్కరణకు గురైన మరుసటి రోజే -
ఆందోళన చెందాల్సిన అవసరం లేదు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు సూచిస్తున్నారు. కేసులు పెరుగుతున్నప్పటికీ తీవ్రజబ్బుకు లోనై ఆస్పత్రుల్లో చేరుతున్న వారి సంఖ్య తక్కువేనని స్పష్టం చేస్తున్నారు. ఆదివారం ఉదయం 9 గంటల వరకు అందుబాటులో ఉన్న వైద్య ఆరోగ్యశాఖ లెక్కల ప్రకారం రాష్ట్రంలో 4,774 యాక్టివ్ కేసులున్నాయి. వీరిలో కేవలం 9.04 శాతం అంటే 434 మంది మాత్రమే ఆస్పత్రుల్లో చేరారు. 1.75 శాతం మంది అంటే 84 మంది క్వారంటైన్ సెంటర్లలో ఉన్నారు. మిగిలిన 89.14 శాతం అంటే 4,256 మంది వైద్యసిబ్బంది పర్యవేక్షణలో హోమ్ ఐసొలేషన్‌లో ఉన్నారు. ఆస్పత్రుల్లో చేరిన వారిలో సుమారు 40 మంది మాత్రమే వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నారు. వీరు వయసు పైబడి, వివిధ వ్యాధులతో బాధపడుతున్నవారు కావడం గమనార్హం. సాధారణ దగ్గు, జలుబు, జ్వరం వంటి లక్షణాలే ఎక్కువమందిలో ఉంటున్నాయి. రెండోదశలో మాదిరిగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ఆక్సిజన్ శాచురేషన్ తగ్గిపోవడం వంటి సమస్యలు తక్కువమందిలో కనిపిస్తున్నాయి. దేశంలో 20వ స్థానంలో.. యాక్టివ్ కేసుల పరంగా పరిశీలిస్తే మన రాష్ట్రం.. దేశంలో 20వ స్థానంలో ఉంది. మహారాష్ట్ర, పశ్చిమబెంగాల్, ఢిల్లీ రాష్ట్రాలు తొలి మూడుస్థానాల్లో ఉన్నాయి. రాష్ట్రంతో పోలిస్తే తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, ఒడిశా రాష్ట్రాల్లోనే యాక్టివ్ కేసులు ఎక్కువ ఉన్నాయి. మరణాల రేటులో మన రాష్ట్రం.. దేశంలో 31వ స్థానంలో రాష్ట్రం ఉంది. నమోదైన పాజిటివ్ కేసుల్లో 0.70 శాతం మంది మాత్రమే రాష్ట్రంలో మృత్యువాతపడ్డారు. పంజాబ్, నాగాలాండ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలు తొలి మూడుస్థానాల్లో ఉన్నాయి. -
సుప్రీంకోర్టులో కరోనా కలకలం.. నలుగురు న్యాయమూర్తులకు పాజిటీవ్
న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. రోజువారి కేసులు పెరుగుతూనే ఉన్నాయి. సుప్రీం కోర్టులో నలుగురు న్యాయమూర్తులు కరోనా బారినపడ్డారు. అదే విధంగా సుప్రీం కోర్టు రిజిస్ట్రీకి చెందిన 150 మంది ఉద్యోగులకు పాజిటీవ్‌గా నిర్ధారణ అయ్యింది. ఈ న్యాయమూర్తులంతా గత మంగళవారం.. జస్టిస్ సుభాషన్ రెడ్డి రిటైర్మెంట్ కార్యక్రమానికి హజరయ్యారు. ఈ తర్వాత ఆయనకు పాజిటీవ్‌గా నిర్ధారణ అయ్యింది. ఆ తర్వాత.. చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ మరో నలుగురు న్యాయమూర్తులతో కలిసి గత గురువారం కోవిడ్ వ్యాప్తిపై సమావేశంలో పాల్గొన్నారు. ప్రస్తుతం సర్వోన్నత న్యాయస్థానంలో సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణతో కలిసి మొత్తం 32 జడ్జిలున్నారు. వీరిలో నలుగురికి వైరస్ సోకినట్టు నిర్దారణ అయ్యింది. సుప్రీం కోర్టుకు చెందిన 150 మంది ఉద్యోగులు క్వారంటైన్‌కి వెళ్లినట్లు తెలుస్తోంది. ఢిల్లీతో సహా దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో.. సుప్రీంలో వారానికి మూడు రోజులు మాత్రమే వర్చువల్ మోడ్‌లో కేసుల విచారణ జరుగుతుంది. పార్లమెంట్లో నిర్వహించిన ర్యాండమ్ టెస్టుల్లో కూడా 400 మంది సిబ్బందికి కరోనా సోకినట్లు తెలింది. ఈ మహమ్మారి బారిన పడిన వారిలో సెక్రటేరియట్ స్టాఫ్‌తోపాటు సెక్యురిటీ సిబ్బంది ఉన్నారు. దేశంలో ప్రస్తుతం గడిచిన 24 గంటల్లో లక్షా 59 వేల 632 కేసులు నమోదు కాగా..327 మరణాలు సంభవించాయి. ప్రస్తుతం 5 లక్షల 90 వేల 611 యాక్టివ్ కేసులున్నాయి. కొవిడ్ పాజిటివిటీ రేటు 10శాతానికి పెరిగింది. ఇక దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 3623కు చేరింది. చదవండి: ‘కుప్పం ప్రజల దెబ్బకు చంద్రబాబు కళ్లు నేలకు దిగాయి’ -
omicron variant: విదేశాల నుంచి వస్తే మార్గదర్శకాలివే..
న్యూఢిల్లీ: కరోనా కేసులు ఉధృతరూపం దాలుస్తూ ఉండడంతో కేంద్ర ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలకు నడుం బిగించింది. విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు సంబంధించి ఇప్పటివరకు అమల్లో ఉన్న మార్గదర్శకాలను సవరించింది. కరోనా కేసులు ప్రమాదకరస్థాయిలో ఉన్న ఎట్ రిస్క్ దేశాలతో పాటు ఇతర దేశాల నుంచి భారత్‌కు వచ్చే ప్రయాణికులందరూ వారం పాటు తప్పనిసరిగా హోం క్వారంటైన్లో ఉండాలంటూ శుక్రవారం సవరించిన మార్గదర్శకాలను విడుదల చేసింది. జనవరి 11 నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి వస్తాయని, తదుపరి ఆదేశాలు అందేవరకు అమల్లో ఉంటాయని స్పష్టం చేసింది. ఇటలీ నుంచి అమృత్‌సర్‌కి వచ్చిన ఎయిరిండియా విమానంలో 125 మందికి కరోనా పాజిటివ్‌గా తేలడంతో ఈ నిబంధన విధించింది. మార్గదర్శకాలివే.. ► ప్రయాణికులు తమ వివరాలను, 14 రోజుల కిందట వరకు చేసిన ప్రయాణాలను ఎయిర్ సువిధ పోర్టల్‌లో అప్లోడ్ చేయాలి ► ప్రయాణానికి 72 గంటల ముందు ఆర్టీ–పీసీఆర్ పరీక్షలో నెగెటివ్ రిపోర్ట్ ఇవ్వాలి ► విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులందరూ విమానాశ్రయంలో దిగిన వెంటనే కరోనా పరీక్ష చేయించుకోవాలి. ఫలితం వచ్చిన తర్వాతే బయటకు వెళ్లాలి. ఈ పరీక్ష కోసం ముందుగానే సువిధ పోర్టల్‌లో బుక్ చేసుకోవచ్చు. ► పరీక్షల్లో పాజిటివ్ వస్తే ఐసోలేషన్కుపంపిస్తారు. ► నెగెటివ్ వచ్చినప్పటికీ వారం పాటు క్వారంటైన్ తప్పనిసరి. 8వ రోజు ఆర్టీ–పీసీఆర్ పరీక్ష చేయించుకొని రిపోర్ట్‌ని సువిధ వెబ్‌పోర్టల్‌లో అప్లోడ్ చేయాలి. ఆ పరీక్షలో నెగిటివ్ వస్తే మరో వారం పాటు తమ ఆరోగ్యాన్ని స్వయంగా పర్యవేక్షించుకోవాలి. ► ఎట్ రిస్క్ కాని దేశాల నుంచి వచ్చిన వారు (అంతర్జాతీయ ప్రయాణికుల్లో 2% మంది) కూడా విమానాశ్రయంలో రాండమ్ పరీక్షలు చేయించుకొని నెగెటివ్ వచ్చినా హోంక్వారంటైన్ ఉండాలి ► అయిదేళ్లలోపు చిన్నారులకు పరీక్షల నుంచి మినహాయింపు. పెరిగిన ఎట్ రిస్క్ దేశాల జాబితా ఒమిక్రాన్ కేసులు ప్రమాదకరంగా విజృంభిస్తున్న ఎట్‌రిస్క్ దేశాల జాబితాలో మరికొన్నింటిని చేర్చింది. అవి..యూకే సహా అన్ని యూరప్ దేశాలు, దక్షిణాఫ్రికా, బ్రెజిల్, బోట్స్వానా, చైనా, ఘనా, మారిషస్ న్యూజిలాండ్, జింబాబ్వే, టాంజానియా, హాంకాంగ్, ఇజ్రాయెల్, కాంగో, ఇథియోపియా, కజకిస్తాన్, కెన్యా, నైజీరియా, ట్యునీషియా, జాంబియా. -
హోం క్వారంటైన్ ఇక ఏడు రోజులే
న్యూఢిల్లీ: కరోనా ఒమిక్రాన్ వేరియెంట్ కేసులు విస్తృతంగా వ్యాపిస్తూ థర్డ్ వేవ్ ముంచుకొస్తున్న నేపథ్యంలో హోం క్వారంటైన్‌కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది. ఈ వేరియెంట్ ప్రమాదకారి కాకపోవడంతో హోం క్వారంటైన్ వ్యవధిని 10 రోజుల నుంచి ఏడు రోజులకు తగ్గించింది. కోవిడ్–19 స్వల్ప లక్షణాలు కలిగిన వారు, ఏ లక్షణాలు లేకుండా పాజిటివ్ వచ్చిన వారికి హోం క్వారంటైన్ కాల పరిమితిని తగ్గిస్తూ బుధవారం కేంద్ర ఆరోగ్య శాఖ కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది. కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిన దగ్గర్నుంచి ఏడు రోజులు ఐసోలేషన్‌లో ఉంటే సరిపోతుందని స్పష్టం చేసింది. ప్రజలెవరూ సొంత వైద్యం చేసుకోవద్దని సూచించింది. వైద్యుడిని సంప్రదించకుండా సీటీ స్కాన్, ఎక్స్‌రేలు, రక్త పరీక్షలు చేయించుకోవద్దని హితవు చెప్పింది. వైద్యులు చెప్పకుండా సొంతంగా స్టెరాయిడ్స్ వంటివి తీసుకుంటే ఇతర అనారోగ్య సమస్యలు వస్తాయని హెచ్చరించింది. ► ఎవరికైనా కరోనా పాజిటివ్‌గా నిర్ధారణై స్వల్ప లక్షణాలు, లేదంటే అసలు లక్షణాలు లేకపోతే వారు హోం క్వారంటైన్ ఉంటే సరిపోతుంది. ► కరోనా సోకిన తర్వాత వరుసగా మూడు రోజులు జ్వరం రాకపోతే మాస్కులు ధరించి వారు బయట తిరగవచ్చు. ► స్వల్ప లక్షణాలున్న వారు హోం క్వారంటైన్ ముగిసిన తర్వాత తిరిగి కరోనా పరీక్ష చేయించుకోవాల్సిన అవసరం లేదు. కోవిడ్–19 నెగెటివ్‌గానే వారిని పరిగణిస్తారు. ► 60 ఏళ్ల వయసు పైబడి గుండె, కిడ్నీ వంటి వ్యాధులున్న వారు వైద్యుల పర్యవేక్షణలో హోం క్వారంటైన్లో ఉండాలి. ► హెచ్ఐవీ, కేన్సర్ రోగులు మాత్రం కరోనా సోకిన వెంటనే ఆస్పత్రిలో చేరాలి ► జిల్లా యంత్రాంగం ఎప్పటికప్పుడు హోం క్వారంటైన్ కేసుల్ని పర్యవేక్షించాలి. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా దీనికి బాధ్యత వహించాలి. ► క్షేత్ర స్థాయిలో ఎఎన్ఎం, శానిటరీ ఇన్స్పెక్టర్, మల్టీపర్పస్ హెల్త్‌వర్కర్‌తో కూడిన కోవిడ్ బృందాలు హోం క్వారంటైన్ రోగుల్ని పర్యవేక్షిస్తూ ఉండాలి. ► రాష్ట్ర ప్రభుత్వాల విధానాల ఆధారంగా ఈ బృందాలు రోగులకు కరోనా కిట్లను అందించాలి. డేంజర్ బెల్స్ భారత్‌లో కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయని కేంద్రం తెలిపింది. వైరస్ వ్యాప్తిని సూచించే ఆర్–వాల్యూ ప్రస్తుతం ఏకంగా 2.69కు చేరింది. డెల్టా వేరియెంట్ కారణంగా సెకండ్ వేవ్ అత్యంత ఉధృతంగా ఉన్నపుడు సైతం గరిష్ట ఆర్– వాల్యూ 1.69 శాతమేనని ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ బలరాం భార్గవ తెలిపారు. నగరాల్లో వ్యాప్తి ఎక్కువగా ఉందని, ఒమిక్రానే ప్రధాన వేరియెంట్‌గా అవతరించిందని పేర్కొన్నారు. ప్రజలు పెద్ద సంఖ్యలో గుమిగూడటాన్ని నివారించాలన్నారు. -
మూడు రోజుల క్వారంటైన్లో టీమిండియా.. డుమ్మా కొట్టిన కోహ్లి..!
Virat Kohli Yet To Begin Quarantine: డిసెంబర్ 16న దక్షిణాఫ్రికా పర్యటనకు బయల్దేరనున్న భారత క్రికెట్ జట్టు ప్రస్తుతం ముంబైలో బీసీసీఐ ఏర్పాటు చేసిన మూడు రోజుల క్వారంటైన్ క్యాంప్‌లో ఉంది. అయితే, టీమిండియా టెస్ట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లి ఒక్కడు ఈ క్వారంటైన్‌కు డుమ్మా కొట్టడం ప్రస్తుతం క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. భారత వన్డే జట్టు కెప్టెన్‌గా రోహిత్ శర్మను ప్రకటించిన నాటి నుంచి కోహ్లి తన ఫోన్‌ను సైతం స్విచ్ ఆఫ్ చేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. వన్డే కెప్టెన్సీపై తాను ఏ నిర్ణయం తీసుకోకముందే బీసీసీఐ రోహిత్‌కు టీమిండియా వన్డే పగ్గాలు అప్పజెప్పడం సహించకే కోహ్లి ఇలా ప్రవర్తిస్తుంటాడని అభిమానులు గుసగుసలాడుకుంటున్నారు. జొహనెస్‌బర్గ్ ఫ్లయిట్ ఎక్కేందుకు మరో రెండు రోజుల సమయం మాత్రమే ఉండడం.. కోహ్లి ఆచూకీ ఇంతవరకు తెలియకపోవడంతో బీసీసీఐ వర్గాలతో పాటు టీమిండియా అభిమానుల్లో సైతం కలవరం మొదలైంది. అయితే, కోహ్లి ఎట్టి పరిస్థితుల్లో జట్టుతో చేరతాడని అతని సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. కాగా, డిసెంబర్ 26న ప్రారంభమయ్యే బాక్సింగ్ డే టెస్టుతో టీమిండియా.. దక్షిణాఫ్రికా పర్యటన మొదలవుతోంది. 3 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ అనంతరం టీమిండియా వన్డే, టీ20 సిరీస్‌లలో పాల్గొంటుంది. టెస్ట్ జట్టుకు కోహ్లి సారధ్యం వహించనుండగా.. పరిమిత ఓవర్ల ఫార్మాట్‌కు రోహిత్ శర్మ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. చదవండి: ఆ విషయమై మెక్‌గ్రాత్ నన్ను విష్ కూడా చేశాడు, కానీ..! -
Omicron Variant: హోం క్వారంటైన్‌లోనే...ఒమిక్రాన్ తగ్గింది
సాక్షి, అమరావతి/ విజయ నగరం టౌన్/ ఎస్.కోట రూరల్: విజయనగరం జిల్లాలో ఒమిక్రాన్ బారిన పడ్డ వ్యక్తి హోం క్వారంటైన్‌లోనే వైరస్‌ను జయించాడని రాష్ట్ర ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ హైమావతి ఆదివారం ‘సాక్షి’కి తెలిపారు. ఒమిక్రాన్ వేరియంట్ యాక్టివ్ కేసులు రాష్ట్రంలో ఒక్కటి కూడా లేవన్నారు. ఐర్లాండ్ నుంచి వచ్చిన వ్యక్తికి కోవిడ్ పాజిటివ్‌గా తేలడంతో ఈ నెల మొదటి వారంలో హైదరాబాద్‌లోని జీనోమ్ సీక్వెన్సింగ్ ల్యాబ్‌కు అతడి నమూనాలు పంపామన్నారు. ఈ ఫలితం శనివారం రాత్రి అందిందని చెప్పారు. అయితే హోమ్ క్వారంటైన్ అనంతరం శనివారం నిర్వహించిన వైద్యపరీక్షల్లో అతడికి నెగెటివ్‌గా తేలిందన్నారు. అతడితో కాంటాక్ట్ అయిన 40 మందికి కూడా పరీక్షలు చేశామని.. అందరికీ నెగెటివ్ వచ్చిందని తెలిపారు. విదేశాల నుంచి 15 వేల మంది రాష్ట్రానికి రాగా వీరిలో 12,900 మందిని గుర్తించామన్నారు. వీరిలో 15 మందికి పాజిటివ్‌గా తేలిందని చెప్పారు. వీరి నమూనాలను కూడా హైదరాబాద్ ల్యాబ్‌కు పంపామన్నారు. 10 మంది ఫలితాలు వెలువడగా కేవలం ఒక్కరికి మాత్రమే పాజిటివ్‌గా నిర్ధారణ అయిందన్నారు. ఫేక్ వార్తలు నమ్మొద్దు.. డాక్టర్ హైమావతి తిరుపతిలో ఓ వ్యక్తికి ఒమిక్రాన్‌గా తేలిందని జరుగుతున్న ప్రచారాన్ని హైమావతి తీవ్రంగా ఖండించారు. చిత్తూరు జిల్లాలో ఒమిక్రాన్ కేసులు నమోదు కాలేదన్నారు. ప్రజలు ఆందోళన చెందవద్దని కోరారు. ప్రతి ఒక్కరూ మాస్కు ధరించాలని, భౌతిక దూరం.. ఇతర నిబంధనలు పాటించాలన్నారు. విదేశాల నుంచి వచ్చిన ప్రతి ఒక్కరినీ గుర్తించి వారికి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు. నెగెటివ్ వచ్చినప్పటికీ వారం పాటు క్వారంటైన్లో ఉంచి, అనంతరం వైద్య పరీక్షలు చేస్తున్నామని చెప్పారు. వాట్సాప్, ఫేస్బుక్, ఇతర సామాజిక మాధ్యమాల్లో వచ్చే అనధికారిక వార్తలను ప్రజలు నమ్మొద్దని విజ్ఞప్తి చేశారు. కాగా, విజయనగరం జిల్లాలో ఒమిక్రాన్ సోకిన వ్యక్తి ఆరోగ్యంగా ఉన్నారని విజయనగరం జిల్లా వైద్యఆరోగ్యశాఖ అధికారిణి డాక్టర్ ఎస్వీ రమణకుమారి ఆదివారం తెలిపారు. ప్రస్తుతం ఆయనకు వైద్య పరీక్షల్లో నెగెటివ్‌గా తేలిందన్నారు. ఒమిక్రాన్ ప్రభావం జిల్లాలో లేదని స్పష్టం చేశారు. ఒమిక్రాన్ తగ్గింది ఇతర నిబంధనలు పాటించాలన్నారు. విదేశాల నుంచి వచ్చిన ప్రతి ఒక్కరినీ గుర్తించి వారికి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు. నెగెటివ్ వచ్చినప్పటికీ వారం పాటు క్వారంటైన్లో ఉంచి, అనంతరం వైద్య పరీక్షలు చేస్తున్నామని చెప్పారు. వాట్సాప్, ఫేస్బుక్, ఇతర సామాజిక మాధ్యమాల్లో వచ్చే అనధికారిక వార్తలను ప్రజలు నమ్మొద్దని విజ్ఞప్తి చేశారు. కాగా, విజయనగరం జిల్లాలో ఒమిక్రాన్ సోకిన వ్యక్తి ఆరోగ్యంగా ఉన్నారని విజయనగరం జిల్లా వైద్యఆరోగ్యశాఖ అధికారిణి డాక్టర్ ఎస్వీ రమణకుమారి ఆదివారం తెలిపారు. ప్రస్తుతం ఆయనకు వైద్య పరీక్షల్లో నెగెటివ్‌గా తేలిందన్నారు. ఒమిక్రాన్ ప్రభావం జిల్లాలో లేదని స్పష్టం చేశారు. -
ముంబై మీదుగా వచ్చే ఎన్నారైలకు అలెర్ట్ ! మహా సర్కారు కొత్త నిబంధనలు
ఒమిక్రాన్ వేరియంట్ భయంతో అంతర్జాతీయ ప్రయాణాలపై మళ్లీ ఆంక్షలు మొదలయ్యాయి. ముఖ్యంగా ఎయిర్‌పోర్టులలో తనిఖీలు కట్టుదిట్టం చేశారు. విదేశాల నుంచి వచ్చే ప్రయాణికుల విషయంలో ఇప్పటికే కేంద్రం మార్గదర్శకాలు జారీ చేయగా తాజాగా మహారాష్ట్ర సర్కారు మరికొన్నింటీని వాటికి జత చేసింది. ముంబై మీదుగా హైదరాబాద్ ఎయిర్‌పోర్టుతో పోల్చితే ఢిల్లీ, ముంబైల నుంచి ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ ఎక్కువగా ఉంటాయి. చాలా మంది విదేశాల నుంచి వచ్చే ఎన్నారైలు ముంబై, ఢిల్లీల మీదుగా హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడలకు విమానాల్లో చేరుకుంటుంటారు. అయితే ఒమిక్రాన్ నేపథ్యంలో ముంబై ఎయిర్‌పోర్టులో కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చాయి. క్వారంటైన్ తప్పనిసరి అట్ రిస్క్ జాబితాలో ఉన్న దేశాల నుంచి ముంబై ఎయిర్‌పోర్టుకి చేరుకునే ప్రయాణికులు విధిగా ఏడు రోజుల పాటు ఇన్స్టిట్యూషనల్ క్వారంటైన్‌కి వెళ్లాల్సి ఉంటుంది. ఎయిర్‌పోర్టులో దిగిన వెంటనే ఆ తర్వాత రెండు, నాలుగు, ఏడో రోజున ప్రయాణికులకు ఆర్టీపీసీఆర్ టెస్టులు చేస్తారు. ఇక్కడ నెగటీవ్ వస్తే గమ్యస్థానాలకు చేరుకుని మరో ఏడు రోజుల పాటు హోం క్వారంటైన్ నిబంధనలు పాటించాలి. ఒక వేళ పరీక్షల్లో పాజిటివ్‌గా తేలితే ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తారు. నెగటీవ్ ఉంటేనే ఇక ముంబై నుంచి దేశంలోని ఇతర ప్రాంతాలైన బెంగళూరు, హైదరాబాద్, విశాఖపట్నం తదితర ప్రాంతాలకు కనెక్టింగ్ ఫ్లైట్‌లో వెళ్లే ఎన్నారైలు, విదేశీయులు సైతం ముంబై ఎయిర్‌పోర్టులో దిగిన వెంటనే ఆర్టీపీసీఆర్ టెస్ట్ చేయించుకోవాల్సి ఉంటుంది. అక్కడ నెగటీవ్ వస్తేనే కనెక్టింగ్ ఫ్లైట్‌కి అనుమతి ఇస్తారు. లేదంటే ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తారు. ఇక ఇతర రాష్ట్రాల నుంచి ముంబైకి వాయుమార్గంలో ప్రయాణం చేయాలన్నా ఆర్టీపీసీఆర్ టెస్టును తప్పనిసరి చేసింది మహా సర్కారు. కేంద్ర నిబంధనలు అట్ రిస్క్ జాబితాలో ఉన్న దేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు 14 రోజుల హోం క్వారంటైన్‌ని కేంద్రం విధించగా మహా సర్కాను ఏడు రోజుల ఇన్స్టిట్యూషనల్ క్వారంటైన్ నిబంధన అమలు చేస్తోంది. దేశీయంగా చేసే ప్రయాణాలకు సైతం కోవిడ్ నెగటీవ్ రిపోర్టు తప్పనిసరిగా చేస్తూ నిబంధనలు రూపొందించింది. చదవండి: ఒమిక్రాన్ భయం..డిసెంబర్ 1 నుంచి కొత్త రూల్స్ -
కరోనా ఆంక్షలు ఎత్తివేయడం అసాధ్యం!..హెచ్చరిస్తున్న అధ్యయనాలు
బీజింగ్: ఇతర దేశాల మాదిరిగా కాకుండా ఇప్పటికీ కోవిడ్ ఆంక్షలు కొనసాగిస్తూ కోవిడ్ రహిత దేశంగా చైనా తగు జాగ్రత్తలతో ఉందని ప్రపంచవ్యాప్తంగా భావించారు. కానీ వాస్తవానికి అక్కడ పరిస్థితి రోజు రోజుకి దిగజారుతోందనే చెప్పాలి. అంతేకాదు తాజా అధ్యయనాలు సైతం చైనాలో కరోనా వేగంగా వ్యాప్తి చెందే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని, పైగా రోజుకి సుమారు ఆరు లక్షల కేసులు నమోదయ్యే అవకాశం ఉందంటూ హెచ్చరిస్తున్నాయి. (చదవండి: ఆ దేశంలో అట్టహాసంగా కోతుల పండగ!) పెకింగ్ యూనివర్శిటీ గణిత శాస్త్రవేత్తల నివేదిక ప్రకారం జీరో కరోనా కేసుల లక్ష్యాన్ని వదిలేసి ఇతర దేశాల మాదిరి కరోనా ఆంక్షలను ఎత్తివేస్తే చైనాలో రోజుకి సుమారు ఆరు లక్షల కేసులు నమోదయ్యే అవకాశం ఉందని స్పష్టం చేసింది. పరిస్థితి ఇలానే కొనసాగితే అక్కడి వైద్యావ్యవస్థకు భరించలేని భారంగా తయారవుతోందని నివేదికలో పేర్కొంది. అంతేకాదు ప్రస్తుతం చైనాలో 23 కొత్త కరోనా కేసుల నమోదయ్యాయని నివేదిక తెలిపింది. అయితే చైనా ఈ మహమ్మారి బారిన పడటానికి ముందు 2019 చివరిలో వ్యూహాన్లో కరోనాకి సంబంధించిన తొలి కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఈ మేరకు ఇప్పటివరకు చైనాలో సుమారు లక్ష కేసులు నమోదవ్వగా, 4వేల మందికి పైనే మరణించినట్లు నివేదిక తెలిపింది. అయితే ఇందులో 785 మంది రోగులు ఇంకా చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) చెప్పినట్లుగా దక్షిణాఫ్రికా నివేదించిన ఈ కొత్త కరోనా వైరస్ వేరియంట్ ఒమిక్రాన్ పెద్ద సంఖ్యలో ఉత్పరివర్తనాలను కలిగి ఉండటంవల్ల ప్రపంచదేశాలకు ఈ వైరస్‌ని ఎదుర్కోవడం పెద్ద సవాలుగా మారుతుందంటూ చైనా ప్రముఖ శ్వాసకోశ నిపుణుడు జాంగ్ నాన్షాన్ హెచ్చరించారు. అయితే చైనాలో ఇప్పటివరకు 76% వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తైయిందని, ఈ ఏడాది చివరి కల్లా 80% లక్ష్యాన్ని చేరుకోగలందంటూ జాంగ్ విశ్వాసం వ్యక్తం చేశారు. పైగా చైనాలో ప్రధానంగా వ్యాక్సిన్లను ఉత్పత్తి చేసే కంపెనీ అయిన సినోవాక్ బయోటెక్ కంపెనీ ఒమిక్రాన్ వైరస్‌పై ప్రత్యేక దృష్టి సారించడమేకాక ఆ వైరస్ ఉత్పరివర్తనలకు సంబంధించిన నమూనాలను సేకరించి పరిశోధలను చేస్తోందని అన్నారు. ఈ మేరకు భారత్‌తో సహా మిగతా దేశాలకు సైతం విమాన రాకపోకలను చైనా నిషేధించిందన్నారు. అంతేకాదు చైనా 23 వేలమంది భారత్ విద్యార్థులతో సహా వేలాదిమంది విదేశీ విద్యార్థులను సైతం చైనా విశ్వవిద్యాలయాలలో చదవడానికి అనుమతించలేదని చెప్పారు. పైగా చైనాకు జీరో కరోనా ఇన్ఫెక్షన్లను లక్ష్యంగా చేసుకోవడం తప్ప మరోమార్గం లేదని కూడా జాంగ్ అన్నారు. అయితే ఏది ఏమైన చైనా సమర్థవంతమైన వ్యాక్సిన్లు ఉత్పత్తి చేయడం లేదా నిర్దిష్ట చికిత్స లేకుండా ఇప్పట్లో ఎటువంటి ఎంట్రీ-ఎగ్జిట్ క్వారంటైన్ చర్యలను ఎత్తివేయడం సాధ్యం కాదని పెకింగ్ యూనివర్శిటీకి చెందిన నలుగురు గణిత శాస్త్రవేత్తలు అభిప్రాయపడ్డారు. ఈ మేరకు చైనా ఈ సరికొత్త కరోనా వేరియంట్ నుంచి మరింత సురక్షితంగా బయటపడాలి అంటే అన్ని రకాలు చర్యలు తీసుకోక తప్పదంటూ పరిశోధకులు వక్కాణించారు. (చదవండి: దగ్గు మందు అక్రమ రవాణ.. వైద్యుడితో సహా ఆరుగురు అరెస్ట్) -
ఆ దేశంలో విదేశీయుల రాకపై 14 రోజుల పాటు ఆంక్షలు..!
జెరూసలేం: కోవిడ్ మహమ్మారి ఉధృతి పెరుగుతున్న కారణంగా ఇజ్రాయెల్ ప్రభుత్వం విదేశీయుల రాకపై తాజాగా ఆంక్షలను విధించింది. అర్ధరాత్రి కాబినెట్ సమావేశం తర్వాత ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. మీడియా కథనాల ప్రకారం.. ఆదివారం నుంచి మొత్తం14 రోజుల పాటు ఈ ఆంక్షలు కొనసాగుతాయని, ఫోన్-ట్రాకింగ్ ద్వారా క్వారంటైన్లో ఉన్న వ్యక్తులను గుర్తిస్తామని ఆ దేశ ప్రభుత్వం వెల్లడించింది. ఐతే దక్షిణాఫ్రికాలో వెలుగుచూసిన కొత్త వేరియంట్ ఓమిక్రాన్ కారణంగా 50 ఆఫ్రికన్ దేశాలను ఇప్పటికే రెడ్ లేబుల్ కింద గుర్తించబడ్డాయి. ఆంక్షల్లో భాగంగా ఆయా దేశాలకు ఇజ్రాయెల్ ప్రజలు ప్రయాణించడాన్ని నిషేధించడం జరిగింది. ఆఫ్రికా ఖండం నుండి వచ్చే ఇజ్రాయెలీయులను కూడా క్యారంటైన్లో ఉండాలని తెల్పింది. దీంతో మూసివేసిన క్వారంటైన్ హోటళ్లన్నీ తిరిగి తెరచుకోనున్నాయి. ఈ మేరకు ఇజ్రాయెల్ ప్రధానమంత్రి నఫ్తాలి బెన్నెట్ మీడియాకు తెలిపారు. కాగా ఇప్పటికే కొత్తవేరియంట్ తాలూకు కేసులు యూకే, యూరోపియన్ దేశాలలో వెలుగుచూసిన సంగతి తెలిసింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా మహమ్మారి ఉధృతిని అరికట్టడానికి అనేక దేశాలు అంక్షలు విధిస్తున్నాయి. ఇప్పుడు అదేబాటను ఇజ్రాయెల్ దేశం కూడా అనుసరిస్తోంది. -
మరోసారి బిగ్ బాస్ హోస్ట్‌గా...రమ్యకృష్ణ
కమల్‌హాసన్ కరోనాతో క్వారంటైన్లో ఉంటున్నందున ఆయన హోస్ట్‌గా చేస్తున్న ‘బిగ్ బాస్ 5’ పరిస్థితి ఏంటి? అనే చర్చ కోలీవుడ్‌లో జరుగుతోంది. ఈ నేపథ్యంలో తాత్కాలిక హోస్ట్ లిస్ట్‌లో కమల్ కుమార్తె శ్రుతీహాసన్, రమ్యకృష్ణల పేర్లు వినిపించాయి. అయితే శ్రుతి తన సినిమా షూటింగ్స్‌తో బిజీగా ఉండటంవల్ల ‘బిగ్ బాస్’కి డేట్స్ సర్దుబాటు చేయలేని పరిస్థితి అట. అందుకే నిర్వాహకులు రమ్యకృష్ణను ఖరారు చేశారు. గతంలో తెలుగు ‘బిగ్ బాస్ 3’ అప్పుడు హోస్ట్ నాగార్జున కొన్ని రోజులు బ్రేక్ తీసుకుంటే, ఆ స్థానంలో రమ్యకృష్ణ కొన్నాళ్ల పాటు షోను నడిపారు. ఇప్పుడు ఆమె తమిళ ‘బిగ్ బాస్’కి హోస్ట్‌గా ఎంట్రీ ఇచ్చారు. రమ్యకృష్ణను స్వాగతిస్తూ.. కమల్ సోషల్ మీడియా ద్వారా ఓ వీడియోను షేర్ చేశారు. -
భారతీయులు సౌదీకి రావచ్చు.. కానీ ఈ రూల్ పాటించాల్సిందే?
కోవిడ్ ఆంక్షల నుంచి పలు దేశాల పౌరులకు సౌదీ అరేబియా మినహయింపు ఇచ్చింది. అయితే విదేశాల నుంచి సౌదీ అరేబియా వచ్చే పౌరులు తప్పకుండా కొన్ని నిబంధనలు పాటించాలంటూ ఆదేశాలు జారీ చేసింది. భారత్‌తో పాటు కోవిడ్ సంక్షోభం తలెత్తిన తర్వాత అంతర్జాతీయ ప్రయాణాలపై సౌదీ అరేబియా నిషేధం విధించింది. తమ రాజ్యంలోకి బయటి దేశాల వ్యక్తులను అనుమతించడం లేదు. అయితే ఇటీవల వ్యాక్సినేషన్ పెరగడంతో కోవిడ్ తగ్గుముఖం పట్టింది. దీంతో భారత్ , పాకిస్తాన్, ఇండోనేషియా, ఈజిప్టు, బ్రెజిల్, వియత్నాం దేశాల పౌరులు సౌదీలో అడుగు పెట్టేందుకు అనుమతి ఇచ్చింది. క్వారంటైన్ అనుమతి పొందిన ఆరు దేశాల నుంచి సౌదీ వచ్చే పౌరులు తప్పని సరిగా 5 రోజుల పాటు క్వారంటైన్లో ఉండాల్సిందేనంటూ సౌదీ ప్రభుత్వం తేల్చి చెప్పింది. ఆయా దేశాలలో రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్నప్పటికీ తమ దేశంలో క్వారంటైన్లో ఉండాలని సూచించింది. డిసెంబరు 1 నుంచి తమ దేశంలోకి విదేశీ ప్రయాణికులను అనుమతిస్తామని తెలిపింది. చదవండి: Saudi Arabia: రెసిడెన్సీ పర్మిట్లపై కొత్త చట్టం -
ఈ సౌకర్యం ఉంటేనే విమాన టికెట్ !
మోర్తాడ్ (బాల్కొండ): ఖతర్‌కు వెళ్లాలనుకునే వలసకార్మికులకు క్వారంటైన్ చిక్కులు వచ్చిపడ్డాయి. అక్కడి హోటళ్లలో క్వారంటైన్‌కు అవసరమైన గది ఖాళీగా ఉంటేనే వీరి ప్రయాణానికి అనుమతి లభిస్తోంది. ఇతర గల్ఫ్దేశాలకంటే ఖతర్‌కు విమాన సర్వీసులు ఎక్కువగానే ఉన్నా అక్కడకు వెళ్లిన తరువాత ఏడు రోజులపాటు క్వారంటైన్ చేయడానికి అవసరమైన హోటల్ గదులు దొరకడం లేదు. ఫలితంగా ప్రయాణాలను వాయిదా వేసుకోవాల్సి వస్తోంది. ఖతర్ ప్రభుత్వ నిబంధనల ప్రకారం తమ దేశానికి వచ్చే విదేశీయులు ఎవరైనా వారంపాటు హోటళ్లలో సెల్ఫ్ క్వారంటైన్ ఉండాల్సిందే. కోవిడ్–19 సెకండ్ వేవ్ తరువాత పరిస్థితి కాస్త కుదుటపడటంతో గల్ఫ్ దేశాల్లో వివిధ కంపెనీల కార్యకలాపాలు గాడినపడుతున్నాయి. 2022లో ప్రపంచ ఫుట్‌బాల్ క్రీడాటోర్నీకి ఖతర్ ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ నేపథ్యంలో ఖతర్‌లో ఉపాధి అవకాశాలు విస్తృతమయ్యాయి. ఇతర గల్ఫ్‌దేశాల కంటే ఖతర్ నుంచే వీసాలు ఎక్కువగా జారీ అవుతున్నాయి. అయితే ఖతర్ నుంచి సెలవుపై వచ్చి తిరిగి వెళ్లాలనుకునేవారు, కొత్తగా వెళ్లేవారు తప్పనిసరిగా వారంపాటు హోటల్ గదిలో క్వారంటైన్ ఉండాలి. శంషాబాద్ ఎయిర్‌పోర్టుతోపాటు మనదేశంలోని ఇతర అంతర్జాతీయ విమానాశ్రయాల నుంచి ఖతర్‌కు షెడ్యూల్ విమానాలు నడుస్తున్నాయి. హోటల్ గదిని బుక్ చేసుకున్నట్లు రసీదు చూపితేనే విమానయాన సంస్థలు టికెట్ జారీ చేస్తున్నాయి. కానీ, ఖతర్‌లోని హోటల్ గదులు నిండిపోవడంతో 20 రోజులకు మించి వెయిటింగ్లో ఉండాల్సివస్తోంది. ఒకవేళ ఖతర్ క్వారంటైన్ నిబంధన ఎత్తేస్తే సులభంగా ప్రయాణం చేసే అవకాశం ఏర్పడుతుంది. -
రష్యాలో కరోనా విస్ఫోటం.. ఒక్క రోజులోనే..
మాస్కో: రష్యాలో కరోనా మహమ్మారి విశ్వరూపం కొనసాగుతోంది. వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతోంది. గురువారం ఒక్కరోజే 40,096 పాజిటివ్ కేసులు నమోదుకాగా 1,159 మంది కరోనా కాటుకు బలయ్యారు. దేశంలో రోజువారీ కేసులు, మరణాల్లో ఇప్పటిదాకా ఇవే అత్యధికం. వైరస్ ఉధృతిని అరికట్టడానికి జనమంతా ఇళ్లకే పరిమితం కావాలని ప్రభుత్వం ఆదేశించింది. రాజధాని మాస్కోలో గురువారం నుంచి నాన్ వర్కింగ్ పీరియడ్ (అత్యవసర విధుల్లో ఉన్నవారు మినహాయించి ఇతర ఉద్యోగులు ఎవరూ విధులకు హాజరు కాకూడదు) ప్రారంభమయ్యింది. రష్యాలో కరోనాతో ఇప్పటిదాకా 2,35,057 మంది మృతిచెందారు. ఒకవైపు కరోనా వ్యాప్తి పెరుగుతున్నా మరోవైపు జనం నిర్లక్ష్యం వీడడం లేదు. రష్యా నుంచి ఈజిఫ్టు, టర్కీకి ప్యాకేజీ టూర్ల సంఖ్య భారీగా పెరిగింది. రష్యాలో 14.6 కోట్ల జనాభా ఉండగా, ఇప్పటిదాకా4.9 కోట్ల మంది మాత్రమే టీకా రెండు డోసులు తీసుకున్నారు. (చదవండి: సెనోలిటిక్స్.. వయసుపై యుద్ధం!) -
భారత్ సహా 5 దేశాలపై ప్రయాణ ఆంక్షలు ఎత్తివేత
సింగపూర్: కోవిడ్–19 నేపథ్యంలో వివిధ దేశాలపై విధించిన ప్రయాణ ఆంక్షలను సింగపూర్ సడలిస్తోంది. తాజాగా, భారత్ సహా ఐదు దక్షిణాసియా దేశాలను బుధవారం నుంచి ఆంక్షల జాబితా నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించింది. భారత్‌తోపాటు బంగ్లాదేశ్, నేపాల్, మయన్మార్, పాకిస్తాన్, శ్రీలంకకు చెందిన అన్ని రకాల ప్రయాణికులు తమ దేశానికి రావచ్చు, ఇక్కడి నుంచి వేరే దేశాలకు వెళ్లవచ్చని సింగపూర్ ఆరోగ్య శాఖ పేర్కొంది. అయితే, ఈ ప్రయాణికులు 10 రోజులపాటు తమ ఇళ్లలోనే క్వారంటైన్లో గడపాల్సి ఉంటుందని తెలిపింది. మరో ఆరు దక్షిణా సియా దేశాలకు సంబంధించిన ప్రయాణ ఆం క్షలను సమీక్షిస్తున్నట్లు కూడా వివరించింది. -
కోవిషీల్డ్‌కు యూకే ఓకే!
లండన్: కోవిడ్ టీకా రెండు డోసులు తీసుకున్నా సరే భారత్ నుంచి బ్రిటన్‌కు వచ్చే ప్రయాణికులు తప్పనిసరిగా క్వారంటైన్లో ఉండాలన్న నిబంధన నుంచి యూకే వెనక్కు తగ్గింది. వ్యాక్సిన్ అర్హత ఉన్న దేశాల జాబితాలో భారత్ పేరును చేర్చింది. తాజా నిబంధనల ప్రకారం అక్టోబర్ 11 నుంచి యూకే వచ్చే భారత ప్రయాణికులు కోవిïÙల్డ్(లేదా బ్రిటన్ అనుమతించిన ఏదైనా టీకా) పూర్తి డోసులు తీసుకున్నట్లైతే క్వారంటైన్ తప్పనిసరి కాదు. భారత్, పాక్‌తో కలిపి 37 దేశాల పేర్లను వ్యాక్సిన్ అర్హత ఉన్న దేశాల జాబితాలో యూకే చేర్చింది. వ్యాక్సినేషన్ పూర్తి చేసుకున్న యూకే పౌరులతో సమానంగా ఈ దేశాల నుంచి వచ్చే అర్హులైన ప్రయాణికులను(టీకా డోసులు పూర్తి చేసుకున్నవారు) పరిగణిస్తారు. సదరు ప్రయాణికులు బ్రిటన్ ప్రయాణానికి పదిరోజుల ముందు యూకే ప్రకటించిన రెడ్ లిస్ట్ జాబితాలోని దేశాలను సందర్శించి ఉండకూడదు. అలాగే ప్రయాణానికి కనీసం 14 రోజుల ముందు నిరి్ధష్ట టీకా డోసులు పూర్తి చేసుకొని ఉండాలి. వీరికి క్వారంటైన్ మినహాయింపుతో పాటు యూకేలో కాలుమోపాక చేసే తప్పనిసరి టెస్టుల నుంచి మినహాయింపు లభిస్తుంది. భారత టీకా సరి్టఫికేషన్‌ను యూకే అక్టోబర్ 11 నుంచి గుర్తించనుందని, ఇరు దేశాల మంత్రిత్వశాఖల చర్చల అనంతరం ఈ కీలక నిర్ణయం తీసుకున్నారని బ్రిటీష్ హైకమిషనర్ అలెక్స్ తెలిపారు. ఈ అంశంపై నెలరోజులుగా సహకారమందించినందుకు భారత ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. -
యాషెస్ సిరీస్‌పై మెలిక పెట్టిన ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు
England To Decide On Ashes Series This Week: ఆస్ట్రేలియా-ఇంగ్లండ్ జట్ల మధ్య ఈ ఏడాది చివర్లో జరగాల్సిన ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్‌పై సందిగ్ధత కొనసాగుతూనే ఉంది. సిరీస్ సాధ్యాసాధ్యాలపై సోమవారం సమావేశమైన ఇంగ్లండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) కీలక ప్రకటన చేసింది. ఆస్ట్రేలియాలో పర్యటించేందుకు సంసిద్ధత వ్యక్తం చేస్తూనే ఓ మెలిక పెట్టింది. తమ ప్రధాన ఆటగాళ్లు ఉంటేనే సిరీస్ ఆడతామని ప్రకటించింది. ఈ విషయమై జట్టు సభ్యులతో సంప్రదింపులు జరిపి వారంలోగా తుది నిర్ణయం వెల్లడిస్తామని పేర్కొంది. కాగా, ఇంగ్లండ్ జట్టులోని కొందరు సీనియర్ సభ్యులు ఆసీస్ పర్యటనకు ససేమిరా అంటున్నారని తెలుస్తోంది. కుటుంబ సభ్యులను తమతో పాటు అనుమతిస్తేనే ఆస్ట్రేలియాలో అడుగుపెడతామని వారు ఈసీబీకి స్పష్టం చేశారని సమాచారం. మరోవైపు కోవిడ్ నిబంధనలను సడలించేందుకు ఆసీస్ ప్రభుత్వం సైతం వెనక్కు తగ్గకపోవడంతో సిరీస్ సాధ్యపడడం అనుమానంగా మారింది. కాగా, ఆస్ట్రేలియాలో కఠిన క్వారంటైన్ నిబంధనల నేపథ్యంలో ఇంగ్లండ్ ఆటగాళ్లు ఆ దేశంలో పర్యటించేందుకు నిరాసక్తత ప్రదర్శిస్తున్నారు. ఈ విషయమై ఇరు దేశాల ప్రధానులు స్కాట్ మోరిసన్(ఆసీస్), బోరిస్ జాన్సన్(యూకే)లు జోక్యం చేసుకున్నప్పటికీ సమస్య కొలిక్కివచ్చినట్లు కనబడలేదు. ఆసీస్-ఇంగ్లండ్ జట్ల మధ్య ఐదు టెస్టుల యాషెస్ సిరీస్ డిసెంబర్ 18 నుంచి జరగాల్సి ఉన్న సంగతి తెలిసిందే. చదవండి: కోహ్లి సేనకు అంత సీన్ లేదు.. మాకు అసలు పోటీనే కాదు: పాక్ మాజీ ప్లేయర్ -
యూకేకు ఆంక్షలతో బదులిచ్చిన భారత్
న్యూఢిల్లీ: భారత్‌కు వచ్చే బ్రిటిష్ ప్రయాణికులు టీకా తీసుకున్నా, తీసుకోకున్నా 10 రోజులు తప్పక క్వారంటైన్లో గడపాలని భారత్ నిర్ణయించింది. బ్రిటన్‌కు వచ్చే భారతీయులు టీకా తీసుకున్నా సరే క్వారంటైన్లో గడపాలన్న నిర్ణయంపై తీవ్రంగా మండిపడ్డ భారత్ అందుకు ప్రతిచర్యగా ఈనిర్ణయం తీసుకుంది. బ్రిటన్ విధించిన గడువు అక్టోబర్ 4నుంచే భారత్ ఆదేశాలు కూడా అమల్లోకి రానున్నాయి. దీంతో బ్రిటన్ అనాలోచిత చర్యలకు భారత్ బదులిచ్చినట్లయింది. నిజానికి గడువులోపు ఈ విషయంలో బ్రిటన్ దిద్దుబాటు చర్యలు తీసుకుంటుందని భారత్ ఆశించింది. కానీ యూకే నుంచి తగిన స్పందన రాకపోవడంతో ప్రతిచర్య నిర్ణయం తీసుకుంది. భారత నిర్ణయంపై యూకే స్పందించాల్సి ఉంది. ఇండియాకు వచ్చే బ్రిటన్ దేశీయులు 72 గంటలకు ముందే కరోనా ఆర్టీపీసీఆర్ టెస్టు చేయించుకోవాలని తాజా ఆదేశాల్లో భారత్ స్పష్టం చేసింది. భారత్‌కు వచి్చన తర్వాత వారికి మరోమారు ఈ టెస్టు చేస్తారు. ఫలితం ఎలాఉన్నా, టీకా తీసుకున్నా, తీసుకోకున్నా 8రోజుల అనంతరం మళ్లీ టెస్టు చేస్తారు. ఈలోపు వారు తప్పనిసరి క్వారంటైన్ గడపాల్సిఉంటుంది. అక్టోబర్ 4నుంచి బ్రిటన్ కొత్త నిబంధనలు కూడా అమల్లోకి వస్తాయి. వీటి ప్రకారం ఇండియన్స్ కరోనా టీకా తీసుకున్న సర్టిఫికెట్ చూపినా యూకే రాగానే హోం క్వారంటైన్లో పదిరోజులుండాలి. యత్నిస్తున్నాం: ప్రయాణ నిబంధనలపై ఇండో– యూకే మధ్య చర్చలు ఎలాంటి ఫలితాలనివ్వలేదు. కోవిïÙల్డ్ టీకాతో సమస్య లేదని, సర్టిఫికెట్‌తోనే సమస్యని బ్రిటన్ అధికారులు అర్థంలేని వాదన వినిపించారు. దీంతో భారత్ తగిన ప్రతిస్పందనకు సిద్ధమైంది. భారత ప్రతిచర్యపై భారత్‌లో బ్రిటిష్ హైకమిషన్ ప్రతినిధి స్పందించారు. భారత ప్రభుత్వంతో సంప్రదింపులు కొనసాగిస్తున్నామని, తమ ప్రయాణ పాలసీ పరిధిలోకి మరిన్నిదేశాలను తెచ్చే యత్నాలు కొనసాగుతున్నాయని చెప్పారు. యూకేకు చాలామంది భారతీయులు వస్తున్నారని, ఇప్పటివరకు 62,500 స్టూడెంట్ వీసాలను జారీ చేశామని, గతేడాదితో పోలిస్తే ఇవి 30 శాతం అధికమని చెప్పారు. -
Tit For Tat: ఇంగ్లండ్‌కు దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన భారత్
న్యూఢిల్లీ: వ్యాక్సిన్ రేసిజం చూపిస్తున్న ఇంగ్లండ్‌కు భారత్ ప్రభుత్వం షాక్ ఇచ్చింది. ఇక మీదట ఇంగ్లాండ్ నుంచి భారత్‌కు వచ్చే యూకే సిటిజన్స్‌కు పదిరోజుల క్వారంటైన్ నిబంధనను తప్పినిసరి చేసింది. రెండు డోసులు వ్యాక్సినేషన్ వేసుకున్నప్పటికీ ఈ నిబంధనను పాటించాల్సిందేనని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. వచ్చే సోమవారం నుంచి భారత్ పర్యటనకు వచ్చే యూకే సిటిజన్లందరికీ క్వారంటైన్ నిబంధన అమలులోకి వస్తుందని కేంద్రం ఉత్తర్వులను జారీచేసింది. అదేవిధంగా.. భారత్‌కు వచ్చే ఇంగ్లండ్ పౌరులు తమ ప్రయాణానికి 72 గంటల ముందు మూడు సార్లు ఆర్టీపీసీఆర్ టెస్టులు చేయించుకోవాలని సూచించింది. భారత్‌కు చేరుకున్న తర్వాత యూకే సిటిజన్లు తాము వెళ్లదలుచుకున్న డెస్టినేషన్‌కు ముందు పదిరోజుల పాటు హోం క్వారంటైన్ ఉండాల్సిందేనని అధికార వర్గాలు తెలిపాయి. ఇంగ్లండ్‌లో వ్యాక్సిన్ తప్పనిసరి నిబంధనను సడలించాలని భారత ప్రధాని నరేంద్ర మోదీతో పాటు పలువురు అధికారులు విజ్జప్తి చేసినప్పటికీ యూకే పెడచెవిన పెట్టింది. దీంతో కేంద్రం కూడా అదే తరహాలో ఇంగ్లండ్‌కు గట్టి షాక్ ఇస్తూ ఈ నిర్ణయం తీసుకుంది. చదవండి: ‘మా పెన్నులు విరగ్గొట్టకండి’.. అఫ్గన్ మహిళల వినూత్నంగా.. -
బ్రిటన్‌కు ‘తగిన’ జవాబిస్తాం!
న్యూఢిల్లీ: యూకే జారీ చేసిన నూతన రవాణా నిబంధనలపై భారత్ తీవ్రంగా ప్రతిస్పందించింది. కరోనా టీకా తీసుకున్నట్లు సర్టిఫికెట్ ఉన్నా సరే బ్రిటన్‌కు వచ్చే భారతీయులు క్వారంటైన్లో ఉండాలంటూ బ్రిటన్ కొత్త ప్రయాణ నిబంధనలు తెచ్చిన సంగతి తెలిసిందే! ఈ నిబంధనలు వివక్షపూరితమైనవంటూ కేంద్ర విదేశాంగ శాఖ కార్యదర్శి హర్ష వర్ధన్ శ్రింగ్లా మండిపడ్డారు. మరోవైపు విదేశాంగ మంత్రి జైశంకర్ ఈ విషయాన్ని న్యూయార్క్ సందర్శనలో యూకే విదేశాంగ కార్యదర్శి ఎలిజబెత్ ట్రస్ దృష్టికి తెచ్చారు. కోవిషీల్డ్ టీకాను యూకే కంపెనీనే రూపొందించిందని, అదే టీకాను భారత్‌లో ఉత్పత్తి చేసి బ్రిటన్ ప్రభుత్వ అభ్యర్థన మేరకు 50లక్షల డోసులు పంపించామని శ్రింగ్లా గుర్తు చేశారు. అలాంటి టీకానే గుర్తించమనే నిబంధనలు నిజంగానే వివక్షాపూరితమని, యూకేకు ప్రయాణించే లక్షలాది ప్రయాణికులకు ఇబ్బంది కలిగిస్తాయని ఆయన దుయ్యబట్టారు. అక్టోబర్ 4(యూకేలో కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చే తేదీ)లోపు ఈ సమస్యను పరిష్కరించకుంటే భారత్ నుంచి ప్రతిచర్య తప్పదని సంబంధిత వర్గాలు అభిప్రాయపడ్డాయి. సమస్యను గుర్తించామని, తగు చర్యలు తీసుకుంటామని యూకే అధికార వర్గాల నుంచి ప్రస్తుతానికి హామీ లభించినట్లు షి్రంగ్లా చెప్పారు. అయితే హామీలు నిజం కాకుంటే భారత్ తనకున్న హక్కుల పరిధిలో తగిన చర్యలు తీసుకుంటుందని హెచ్చరించారు. ఏమిటీ నిబంధనలు? బ్రిటన్‌కు వచ్చే విదేశీ ప్రయాణికుల కోసం నూతన ప్రయాణ నిబంధనలను యూకే ప్రభుత్వం రెండు రోజుల క్రితం ప్రకటించింది. వీటి ప్రకారం అక్టోబర్4 నుంచి భారత్‌తో పాటు మరికొన్ని దేశాల నుంచి వచ్చే ప్రయాణికులు కోవిషీల్డ్ రెండు డోసుల టీకా తీసుకున్నా సరే, వారిని టీకా తీసుకోనివారిగానే పరిగణిస్తామని పేర్కొంది. సదరు జాబితాలోని దేశాల ప్రయాణికులు, యూకేకు చేరుకున్న తర్వాత పీసీఆర్ పరీక్షలు చేయించుకోవాలని, పది రోజుల పాటు స్వీయ నిర్బంధంలో ఉండాలని తెలిపింది. నిజానికి యూకేకు చెందిన ఆస్ట్రాజెనెకా కోవిషీల్డ్‌ను రూపొందించింది. దీన్ని భారత్‌లోని సీరమ్ ఇన్స్టిట్యూట్ ఉత్పత్తి చేస్తోంది. అలాంటి టీకానే గుర్తించమనే కొత్తనిబంధనలపై భారత్‌లోని అన్ని పక్షాలు మండిపడ్డాయి. బ్రిటన్ తీరుపై కాంగ్రెస్ సీనియర్ నేతలు జైరామ్ రమేశ్, శశిథరూర్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. బ్రిటన్ నిబంధనలు జాతి వివక్ష చూపేలా ఉన్నాయన్నారు. వెంటనే భారత ప్రభుత్వం తగిన స్పందన చూపాలని కోరారు. ట్రస్‌తో జైశంకర్ భేటీ పరిణామాలపై భారత్ తన స్పందనను బ్రిటన్‌కు తెలిపింది. మరోవైపు విదేశాంగ మంత్రి జైశంకర్ తన న్యూయార్క్ పర్యటనలో బ్రిటన్ కార్యదర్శి ట్రస్‌ను కలిశారు. రెండు దేశాల పరస్పర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ఈ సమస్యకు సత్వర పరిష్కారం చూపాలని కోరినట్లు జైశంకర్ తెలిపారు. కొత్త నిబంధనల ప్రకారం భారత్ నుంచి వచ్చే ప్రయాణికులను రెడ్‌లిస్టులో పెడతారు. అంటే భారత్‌లో వేస్తున్న టీకాలను బ్రిటన్ గుర్తించదని పేర్కొన్నట్లయింది. భారత్‌తో తలెత్తిన ఇబ్బందిని సత్వరం పరిష్కరించే యత్నాల్లో ఉన్నామని ఇండియాలో బ్రిటిష్ హైకమిషన్ కార్యాలయం ప్రకటించింది. ట్రస్‌తో పాటు పర్యటనలో భాగంగా నార్వే, ఇరాక్ విదేశాంగ మంత్రులతో జైశంకర్ భేటీ అయ్యారు. ఆయా దేశాలతో వాణిజ్యపరమైన అంశాలను చర్చించారు. ఇండో పసిఫిక్, అఫ్గాన్ అంశాలు కూడా చర్చకు వచ్చినట్లు తెలిసింది. -
వ్యాక్సిన్ వేసుకున్నా పరిగణనలోకి తీసుకోరు
లండన్: భారత్ సహాకొన్ని దేశాల వారు కోవిడ్–19 వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్నా సరే వ్యాక్సినేషన్ అయినట్లుగా పరిగణించబోమని యూకే తెలిపింది. తమ దేశానికి వచ్చే ఆయా దేశాల వారు 10 రోజుల క్వారంటైన్ తప్పనిసరిగా పాటించాలంటూ యూకే కొత్త ప్రయాణ నిబంధనలను తీసుకువచ్చింది. ఆఫ్రికా, దక్షిణ అమెరికా ప్రాంత దేశాలతోపాటు యూఏఈ, భారత్, టర్కీ, జోర్డాన్, థాయ్‌లాండ్, రష్యాకు చెందిన వారు తమ దేశాల్లో వ్యాక్సిన్ వేయించుకున్నట్లయితే, వారిని టీకా తీసుకున్నట్లుగా పరిగణించట్లేదని తెలిపింది. ఈ దేశాల వారు క్వారంటైన్ నిబంధనలను పాటించాల్సి ఉంటుందని తెలిపింది. ఇప్పటి వరకు దేశాలను మూడు కేటగిరీ(గ్రీన్, అంబర్, రెడ్)లుగా విభజించి యూకే ప్రయాణ నిబంధనలను అమలు చేస్తోంది. ఇందులో భారత్ అంబర్ కేటగిరీలో ఉంది. తాజా, నిబంధనల ప్రకారం కేవలం ఒకే కేటగిరీ–రెడ్ మాత్రమే ఉంది. ఈ నిబంధనలు అక్టోబర్ 4వ తేదీ ఉదయం 4 గంటల నుంచి అమల్లోకి వస్తాయని ప్రకటించింది. మిగతా దేశాలకు మాత్రం ప్రయాణ ఆంక్షలను సడలిస్తున్నట్లు యూకే ప్రభుత్వం తెలిపింది. ఇది జాతి వివక్షే: కాంగ్రెస్ కోవిషీల్డ్ టీకా వేసుకున్న భారతీయ ప్రయాణికులకు యూకే ప్రభుత్వం క్వారంటైన్ ఆంక్షలు విధించడం జాతి వివక్షేనని కేంద్ర మాజీ మంత్రులు జైరాం రమేశ్, శశిథరూర్ పేర్కొన్నారు. ఆక్స్ఫర్డ్ వర్సిటీ తయారు చేసిన టీకానే సీరం ఇన్స్టిట్యూట్ కోవిషీల్డ్‌గా ఉత్పత్తి చేస్తోందని, దీనినే దేశవ్యాప్త వ్యాక్సినేషన్లో వాడుతున్న విషయాన్ని జైరాం రమేశ్ గుర్తు చేశారు. యూకే నిబంధనల కారణంగా కేంబ్రిడ్జి యూనియన్ డిబేటింగ్ సొసైటీ చర్చా కార్యక్రమంతోపాటు తన పుస్తకం ‘ది బ్యాటిల్ ఆఫ్ బిలాంగింగ్’యూకే ఎడిషన్ ఆవిష్కరణ కార్యక్రమం నుంచి వైదొలిగానని థరూర్ చెప్పారు. యూకే వెళ్లాల్సిన భారతీయులు.. ►ప్రయాణానికి మూడు రోజుల ముందుగా కోవిడ్–19 పరీక్ష చేయించుకోవాలి. ►అక్కడికి చేరుకున్న 2వ, 8వ రోజున జరిపే కోవిడ్ పరీక్షలకు ముందుగానే ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ►ఇంగ్లండ్ చేరుకునేందుకు 48 గంటల ముందుగా ప్యాసింజర్ లొకేటర్ ఫాంను పూర్తి చేయాలి. ఇంగ్లండ్ చేరుకున్న తర్వాత చేయాల్సినవి.. ►ఇంట్లో గానీ, 10 రోజులపాటు మీరు ఉండాల్సిన ప్రాంతంలో గానీ క్వారంటైన్ పాటించాలి. ►2వ రోజు ముందు, 8వ రోజుగానీ, ఆ తర్వాత గానీ కోవిడ్ టెస్ట్ చేయించుకోవాలి. ►యూకేలో రెండు డోసుల టీకా వేయించుకున్న వారు అక్కడి నుంచి బయలుదేరే ముందు టెస్ట్ చేయించుకోవాల్సిన పనిలేదు. -
క్వారంటైన్లోకి పుతిన్
మాస్కో: రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్ సన్నిహితులు చాలా మంది కరోనా బారిన పడ్డారు. దీంతో ముందు జాగ్రత్త చర్యగా పుతిన్ స్వీయ నిర్బంధంలోకి వెళ్లిపోయారు. పుతిన్ ఇప్పటికే స్పుత్నిక్–వీ టీకా రెండు డోసులు తీసుకున్నారు. పుతిన్ ఆరోగ్యంతో ఉన్నారని ప్రభుత్వ అధికారి ప్రతినిధి మిట్రీ పెస్కోవ్ చెప్పారు. క్వారంటైన్లో ఉన్నాగానీ అధికారిక కార్యకలాపాలు అన్నీ చేస్తారని తెలిపారు. మరోవైపు పుతిన్ కరోనా పరీక్ష చేయించుకుంటే నెగెటివ్ వచ్చింది.vladimir putin అయితే ఈ విషయాన్ని తొలుత ప్రభుత్వం స్పష్టంగా చెప్పలేదు. పుతిన్ కరోనా పరీక్ష చేయించుకున్నారని, ఆరోగ్యంతో ఉన్నారని మాత్రమే వెల్లడించింది. అయితే పెస్కోవ్‌ను విలేకరులు పుతిన్‌కు కరోనా పరీక్షలో నెగెటివ్ వచ్చిందా అని ప్రశ్నించగా ఆయన అవును అని మాత్రమే బదులిచ్చారు. అయితే పుతిన్‌కి సన్నిహితంగా వ్యవహరించిన వారిలో ఎవరెవరు కరోనా బారిన పడ్డారో వివరించలేదు. సోమవారం పుతిన్ ఎన్నో బహిరంగ సమావేశాలకు హాజరయ్యారు -
దుబాయ్‌లో ప్రేమపక్షుల క్వారంటైన్
-
దుబాయ్‌లో క్వారంటైన్‌ను ఎంజాయ్ చేస్తున్న బుమ్రా కపుల్
సాక్షి, ముంబై: ఐపీఎల్ సందడి తిరిగి ప్రారంభం కానున్న నేపథ్యంలో టీమిండియా పేసర్ జస్ప్రీత్ బుమ్రా, తన భార్య, టీవీ స్పోర్ట్స్ ప్రెజెంటర్ సంజన గణేశన్‌తో దుబాయ్‌లో వాలిపోయాడు. ప్రస్తుతం ఒక హోటల్ గదిలో ఈ ప్రేమ పక్షులు క్వారంటైన్ అయ్యారు. ఈ సందర్బంగా సంజన తన హోటల్ గది నుంచి కొన్ని అందమైన చిత్రాలను పోస్ట్ చేసింది. అటు ముంబై ఇండియన్స్ కూడా ఒక వీడియోను షేర్ చేసింది. Our boys in 𝔹𝕝𝕦𝕖 are back in 🇦🇪 to add some 𝔾𝕠𝕝𝕕 💙#OneFamily #MumbaiIndians #KhelTakaTak #IPL2021 @MXTakaTak MI TV pic.twitter.com/IBn9FBpp9g — Mumbai Indians (@mipaltan) September 11, 2021 -
టెస్టు ఆడలేం... ఐపీఎల్‌కు సిద్ధం!
మాంచెస్టర్/దుబాయ్: ఐపీఎల్ రెండో దశ పోటీ ల్లో పాల్గొనేందుకు భారత క్రికెటర్లు యూఏఈ చేరుకున్నారు. ముంబై ఇండియన్స్ జట్టు తమ ఆటగాళ్లు రోహిత్ శర్మ, బుమ్రా, సూర్య కుమార్ కోసం ప్రత్యేక విమానం ఏర్పాటు చేయగా... రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కూడా కోహ్లి, సిరాజ్ కోసం ఇదే తరహా ఏర్పాటు చేసింది. టెస్టు సిరీస్‌లో భాగంగా ఉండి ఐపీఎల్ కోసం యూఏఈ వెళ్లాల్సిన మిగిలిన భారత క్రికెటర్లతో (16 మంది)పాటు ఇంగ్లండ్ ప్లేయర్ స్యామ్ కరన్ మాంచెస్టర్ నుంచి కమర్షియల్ ఫ్లయిట్ ద్వారా యూఏఈకి వెళ్లారు. వీరి కోవిడ్ పరీక్షలన్నీ ‘నెగెటివ్’గా తేలాయి. యూఏఈ దేశపు నిబంధనల ప్రకారం క్రికెటర్లంతా ఆరు రోజుల పాటు తమ హోటల్ గదుల్లో క్వారంటైన్లో గడపాల్సి ఉం టుంది. ఆ తర్వాత తమ జట్ల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బయో బబుల్‌లో వీరు చేరతారు. ఏదైనా జరగవచ్చని... శుక్రవారం నుంచి ఓల్డ్‌ట్రాఫోర్డ్ మైదానంలో జరగాల్సిన భారత్, ఇంగ్లండ్ చివరి టెస్టు అనూహ్యంగా రద్దయింది. గురువారం రాత్రి భారత క్రికెటర్లందరి కోవిడ్ రిపోర్టులు ‘నెగెటివ్’గా వచి్చనా... మ్యాచ్ మధ్యలో ఏదైనా జరగవచ్చనే భయమే టీమిండియా ఆటగాళ్లను బరిలోకి దిగకుండా చేసింది. సహజంగానే కరోనా ప్రభావం కొంత ఆలస్యంగా కనిపించే అవకాశం ఉంది కాబట్టి ఆడకపోవడమే మంచిదని కోహ్లి బృందం భావించింది. మ్యాచ్ జరగాల్సిన రోజు ఉదయం సుదీర్ఘ సమయం పాటు చర్చించాక ఇరు బోర్డులు టెస్టును రద్దు చేయాలని నిర్ణ యించాయి. భారత జట్టు పూర్తి జట్టును బరిలోకి దింపే పరిస్థితిలో లేదని ఇంగ్లండ్ బోర్డు ప్రకటించగా... ప్లేయర్ల ఆరోగ్యభద్రతే తమకు అన్నింటి కంటే ముఖ్యమని బీసీసీఐ ప్రకటించింది. విమర్శలు, ప్రతివిమర్శలు... ఐపీఎల్లో ఒక్క మ్యాచ్‌కు కూడా ఇబ్బంది రాకుండా ఉండాలనే భారత క్రికెటర్లు టెస్టు నుంచి తప్పుకున్నారని, వారికి టెస్టులకంటే ఐపీఎల్ అంటేనే ప్రాధాన్యత అని ఇంగ్లండ్ మాజీ క్రికెటర్లు, మీడియా భారత జట్టుపై విరుచుకుపడ్డారు. రెండో కోవిడ్ ‘నెగెటివ్’ రిపోర్టు వచ్చాకే యూఏఈ బయల్దేరిన వీరు అదే రిపోర్టుతో ఒక రోజు ఆలస్యంగా టెస్టు ఆడితే ఏమయ్యేదని వారు ప్రశి్నంచారు. టెస్టు సిరీస్‌లో భారత్, ఇంగ్లండ్ కాకుండా చివరకు ‘డబ్బు’ గెలిచిందని వారు వ్యాఖ్యానించారు. అయితే దీనిపై భారత అభిమానులు ‘డబ్ల్యూటీసీ ఫైనల్ తర్వాత భారత జట్టు నలభై రోజులు ఖాళీగా కూర్చుంది. టెస్టు సిరీస్‌ను కాస్త ముందుగా జరపమన్నా వినలేదు. పైగా పనికిమాలిన ‘హండ్రెడ్’ కోసం రెండో, మూడో టెస్టుల మధ్య 9 రోజుల విరామం ఇచ్చారు. అలాంటిది ఇప్పుడు ఐపీఎల్‌ను విమర్శించడంలో అర్థం లేదు’ అని ఘాటుగా స్పందించారు. సిరీస్ ఫలితం ఏమిటి? ఐదో టెస్టు రద్దుతో సిరీస్ ఫలితంపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దీనిపై అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ఇంకా స్పష్టతనివ్వాల్సి ఉంది. వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) నిబంధనల ప్రకారం కోవిడ్ కారణంగా మ్యాచ్ జరిగే అవకాశం లేకపోతే మ్యాచ్‌ను రద్దు చేయవచ్చు. అలా చూస్తే భారత్ 2–1తో సిరీస్ గెలుచుకున్నట్లే. అయితే ఇంగ్లండ్ బోర్డు (ఈసీబీ) దీనిని అంగీకరించడం లేదు. మధ్యే మార్గంగా ఈ టెస్టును రాబోయే రోజుల్లో మళ్లీ ఎప్పుడైనా ఆడేందుకు తాము సిద్ధమని బీసీసీఐ ప్రకటించింది. వచ్చే ఏడాది జూన్‌లో భారత జట్టు పరిమిత ఓవర్ల సిరీస్‌ల కోసం ఇంగ్లండ్‌కు వెళ్లాల్సి ఉంది. అప్పుడు ఏమైనా ఈ టెస్టు కోసం తేదీలు సర్దుబాటు చేయవచ్చు. అయితే ఈసీబీ సీఈఓ టామ్ హారిసన్ మాత్రం దానిని ప్రస్తుత సిరీస్‌లో భాగంగా కాకుండా ‘ఏౖకైక టెస్టు’గా ప్రచారం చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. -
క్వారంటైన్ ఉల్లంఘించినందుకు వియత్నంవాసికి ఐదేళ్ల జైలుశిక్ష
హనోయి: కోవిడ్ నిబంధనలను ఉల్లంఘించినందుకుగాను వియత్నాంకి చెందిన లెవాన్ ట్రై అనే వ్యక్తికి అక్కడి ప్రాంతీయ కోర్టు ఐదు సంవత్సరాల జైలు శిక్ష విధించింది. ట్రై.. హోచి మిన్ సిటీ నుంచి తన సొంత ఊరు కా మౌకి వెళ్లి చాలా మందికి ఈ వైరస్‌ను అట్టించాడంటూ వియత్నాం ప్రాంతీయ కోర్టు తన నివేదికలో తెలిపింది. ట్రై క్వారంటైన్ నిబంధలను ఉల్లంఘించి.. బయట తిరగి వైరస్‌ని వ్యాప్తి చేయడం వల్ల ఒకరు చనిపోవడం, మరికొంతమంది రకరకాల వ్యాధుల భారినపడినట్లు నివేదిక పేర్కొంది. హోచి మిన్ సిటీలో కరోనా కేసులు తక్కువగానే ఉన్నాయనని, ట్రై కారణంగా కేసులు అధికమైనట్లు నివేదిక వెల్లడించింది. (చదవండి: 41 ఏళ్లుగా అడవిలోనే.. స్త్రీలంటే ఎవరో తెలియదు) ఆగస్టు 7న ట్రైకి కరోనా పాజిటివ్ వచ్చిందని.. కానీ అతడు 21 రోజులపాటు హోం క్వారంటైన్లో ఉండకుండా బహిరంగప్రదేశాల్లో తిరగడం వల్ల చాలా మందికి వైరస్‌ని వ్యాప్తి చేశాడని నివేదిక పేర్కొంది. గత నెలలో ట్రై మాదిరిగా చేసిన మరికొంతమందికి కూడా వియత్నాం ప్రాంతీయ కోర్టుల ఇలాంటి శిక్షే విధించడం గమనార్హం. వియత్నాంలో సంకర కరోనా మ్యూటెంట్ ( హైబ్రిడ్ మ్యూటెంట్)కి సంబంధించిన ఏడు రకాల వేరియంట్లను శాస్త్రవేత్తలు గుర్తించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇలాంటి కఠిన చర్యలతో కరోనాకు అడ్డుకట్టవేయడానికి వియాత్నం శతవిధాలా ప్రయత్నిస్తోంది. చదవండి: కోవిడ్ నెగిటివ్.. అయినా క్వారంటైన్.. ఏకంగా బెడ్షీట్లతో.. -
కేరళ నుంచి వస్తే క్వారంటైన్
యశవంతపుర: కరోనా నియంత్రణ కోసం కర్ణాటక రాష్ట్ర సరిహద్దు ప్రాంతాలలో గట్టి చర్యలు తీసుకున్నట్లు ఆ రాష్ట్ర ఆరోగ్య, వైద్యవిద్యా మంత్రి సుధాకర్ తెలిపారు. మంగళవారం బెంగళూరులో మాట్లాడుతూ కేరళ నుంచి కర్ణాటకకు వచ్చే వ్యక్తులు తప్పనిసరిగా వారంపాటు క్వారంటైన్లో ఉండాలని చెప్పారు. విమానాశ్రయాల ద్వారా వచ్చే ప్రయాణికులు కూడా క్వారంటైన్ పెట్టాలని అధికారులను ఆదేశించారు. జనం గుంపులుగా చేరటం వల్ల కరోనా వ్యాప్తి చెందుతోందని, కాబట్టి సభలు, సమావేశాలను నిర్వహించవద్దని సూచించారు. దక్షిణకన్నడ, ఉడుపి, చామరాజనగర జిల్లాల్లో కరోనా అధికంగా ఉందన్నారు. చదవండి: US Study: ఆయుః ప్రమాణం తొమ్మిదేళ్లకు పైగా పడిపోతోంది! కరోనా డిశ్చార్జిల్లో క్షయ వ్యాధి కరోనా నుంచి కోలుకున్న 104 మందిలో క్షయ (టీబీ) జబ్బు బయట పడింది. ఆరోగ్యశాఖ ఆగస్ట్ 16 నుంచి 29 వరకు, డిశ్చార్జి అయిన 5.37 లక్షల మందికి పరీక్షలు చేయగా ఈ విషయం వెల్లడైంది. కరోనా వల్ల మొత్తంగా 24,598 మంది క్షయకు గురై ఉంటారని అనుమానిస్తున్నారు. చదవండి: GST On Papad: అప్పడాలపై జీఎస్టీ !.. ట్విట్టర్లో రచ్చ రచ్చ -
రాష్ట్రాల మధ్య ప్రయాణాలపై ఆంక్షల్లేవ్
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా నేపథ్యంలో అంతర్ రాష్ట్ర ప్రయాణాలపై కేంద్రం ఎలాంటి ఆంక్షలు సిఫారసు చేయలేదు. క్వారంటైన్, ఐసోలేషన్‌లకు సంబంధించి రాష్ట్రాలు సొంత ప్రొటోకాల్ ఏర్పాటు చేసుకోవడానికి అనుమతించింది. కొన్ని రాష్ట్రాలు తమ రాష్ట్రాల్లో ప్రవేశాలకు ఆర్టీపీసీఆర్ నెగెటివ్ రిపోర్టు కావాలని కోరుతున్నట్లు కేంద్రం దృష్టికి వచ్చింది. సెకండ్‌వేవ్‌లో దేశవ్యాప్తంగా కేసులు క్షీణిస్తున్న విషయాన్ని పరిగణనలోకి తీసుకొని అంతర్ రాష్ట్ర ప్రయాణాలు సులభతరం చేసే ఉద్దేశంతో తగిన జాగ్రత్తలు పాటిస్తూ దేశీయ ప్రయాణాలకు ఒకే తరహా ప్రోటోకాల్ ఉండేలా దేశీయ ప్రయాణ (రైలు, బస్సు , విమానం) మార్గదర్శకాలు సవరిస్తున్నట్లు తెలిపింది. ఈ మార్గదర్శకాలు అన్ని రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలకు వర్తిస్తాయని, తద్వారా అంతర్ రాష్ట్ర ప్రయాణాలు సులభతరం చేస్తుందని కేంద్ర ఆరోగ్య సంక్షేమ శాఖ పేర్కొంది. ప్రయాణాల్లో పాటించాల్సిన ఆరోగ్య ప్రొటోకాల్ ► ప్రయాణాల సమయంలో ప్రయాణికులు తమ ఆరోగ్యాన్ని స్వయంగా పర్యవేక్షించుకోవాలి. కోవిడ్–19 లక్షణాలు లేనప్పుడే ప్రయాణం చేయాలి. ► ప్రయాణికులు మాస్క్, ఫేస్ కవర్, ఆరు అడుగుల భౌతికదూరం పాటిం చాలి. ► ప్రయాణ సమయాల్లో బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మి వేయరాదు. ► మొబైల్లో ఆరోగ్య సేతు యాప్ డౌన్లోడ్ తప్పనిసరిగా చేసుకోవాలి. ► ప్రయాణ సమయంలో జలుబు, దగ్గు, జ్వరం వచ్చినట్లైతే విమాన/బస్సు/రైలు సిబ్బందికి తెలియజేయాలి. ► గమ్యస్థానం చేరిన తర్వాత లక్షణాలు కనిపిస్తే జిల్లా నిఘా అధికారి లేదా జాతీయ కాల్ సెంటర్ 1075కు తెలపాలి. విమానాశ్రయాలు/రైల్వే స్టేషన్లు/బస్ స్టేషన్లకు సూచనలు ► కరోనాకు సంబంధించి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ప్రకటన చేయాలి ► థర్మల్ స్క్రీనింగ్ చేసిన తర్వాతే ప్రయాణికులను అనుమతించాలి. వెలుపలికి పంపాలి. ► ప్రయాణ సమయంలో వినియోగించిన మాస్కులు, గ్లౌజులు, పీపీఈ కిట్లు పారవేయడానికి తగిన ఏర్పాట్లు చేయాలి. ► విమానాశ్రయాలు, రైల్వేస్టేషన్లు, బస్స్టేషన్లు తరచుగా శుభ్రపరచాలి. ► లక్షణాలు లేని వారు 14 రోజులపాటు స్వీయ పరిరక్షణ హామీతో బయటకు వెళ్లడానికి అనుమతించాలి. ► ఒకవేళ లక్షణాలు బయటపడితే వారిని ఆరోగ్య కేంద్రాలకు తరలించడానికి తగిన ఏర్పాట్లు చేయాలి. ► ప్రయాణికులకు అందుబాటులో మాస్కులు, పీపీఈకిట్లు, గ్లౌజులు ఉంచాలి. రాష్ట్రాలకు సూచనలు ► రైలు, రహదారి, విమానయానం, నీటి మార్గాల ద్వారా అంతర్ రాష్ట్ర ప్రయాణాలపై ఎలాంటి ఆంక్షలు లేవు. ► ఒకవేళ రాష్ట్రంలో ప్రవేశించాలంటే ఆర్టీపీసీఆర్ పరీక్ష తప్పనిసరి అని నిబంధన పెడితే ఆ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం విస్తృతంగా ప్రచారం చేయాలి. ► రెండు డోసుల టీకా తీసుకున్నవారు, రెండో డోసు తీసుకున్నా ధ్రువపత్రం ఇంకా అందని వారు రాష్ట్రంలోకి ప్రవేశిస్తే వారిని ఆర్టీపీసీఆర్ పరీక్ష నుంచి మినహాయించాలి. ► ప్రయాణం తర్వాత లక్షణాలు కనిపిస్తే వారికి రాపిడ్ యాంటిజెన్ పరీక్ష చేయడానికి ఆయా ప్రాంతాల్లో తగిన ఏర్పాట్లు చేయాలి. ► స్థానిక ప్రయోజనాల నిమిత్తం రాష్ట్రాలు అవసరమైతే అదనంగా ఆంక్షలు విధించొచ్చు. -
కోవిడ్ నెగిటివ్.. అయినా క్వారంటైన్.. ఏకంగా బెడ్షీట్లతో..
బ్రిస్బేన్ : క్వారంటైన్లో ఉండటం ఇష్టం లేని ఓ వ్యక్తి మాస్టర్ ప్లాన్ వేశాడు. బెడ్ షీట్లను తాడుగా చేసి, నాల్గవ అంతస్తు మీదనుంచి కిందకు దిగి జంప్ అయ్యాడు. వివరాలు.. ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్‌కు చెందిన 39 ఏళ్ల ఓ వ్యక్తి గత సోమవారం పశ్చిమ ఆస్ట్రేలియాకు వచ్చాడు. అయితే, కరోనా నేపథ్యంలో సరిహద్దు ప్రాంతాలలో కఠిన ఆంక్షలు ఉన్నాయి. సదరు వ్యక్తి 48 గంటల్లోగా పశ్చిమ ఆస్ట్రేలియాను వదిలి వెళ్లిపోవాలని అధికారులు ఆదేశించారు. అతడ్ని హుటాహుటిన క్వారంటైన్ హోటల్‌కు పంపారు. అక్కడ పరీక్షలు నిర్వహించగా అతడికి నెగిటివ్ వచ్చింది. అయినప్పటికి క్వారంటైన్‌లోనే ఉంచారు. క్వారంటైన్లో ఉండటం ఇష్టం లేని ఆ వ్యక్తి బయటకు వెళ్లటానికి ఓ ప్లాన్ వేసుకున్నాడు. బెడ్ షీట్ సహాయంతో ఓ తాడు తయారు చేసుకున్నాడు. తనుంటున్న నాల్గవ అంతస్తు మీదనుంచి కిందకు దిగి పారిపోయాడు. కానీ, మంగళవారం ఉదయం పోలీసులు అతడ్ని వెతికి పట్టుకున్నారు. తప్పుడు సమాచారం ఇచ్చాడని కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి. -
దిగొచ్చిన ఈయూ.. కొవిషీల్డ్‌కు ఆ దేశాల అనుమతి!
న్యూఢిల్లీ: యూరప్ దేశాలకు వెళ్లే భారత ప్రయాణికులకు గుడ్ న్యూస్. గ్రీన్ పాసుల జారీ విషయంలో ఈయూకు భారత్‌కు మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత్ పైచేయి సాధించింది. ఈయూలో సభ్యత్వం ఉన్న ఏడు దేశాలు భారతీయ ప్రయాణికులకు ఊరట ఇచ్చాయి. కొవిషీల్డ్ పేరును అప్రూవ్డ్ వ్యాక్సిన్ల లిస్ట్‌లో చేర్చినట్లు హడావిడిగా ప్రకటించాయి. స్విట్జర్లాండ్‌తో పాటు జర్మనీ, స్లోవేనియా, ఆస్ట్రియా, గ్రీస్, ఐల్యాండ్,, ఐర్లాండ్, స్పెయిన్, దేశాలు కొవిషీల్డ్‌ను అంగీకరించాయి. దీంతో ఆయా దేశాలకు వెళ్లే కొవిషీల్డ్ తీసుకున్న భారత ప్రయాణికులకు మార్గం సుగమం కానుంది. కాగా, తమ వ్యాక్సిన్ల(కొవాగ్జిన్, కొవిషీల్డ్) డిజిటల్ సర్టిఫికేట్ అనుమతించకపోతే.. ఈయూ దేశాల ప్రయాణికుల సర్టిఫికేట్లను ఒప్పుకోమని, పైగా కఠిన క్వారంటైన్ నిబంధనలను అమలు చేస్తామని భారత్ హెచ్చరించిన విషయం తెలిసిందే. ఈ పరిణామాల నేపథ్యంలో ఈయూ ఎనిమిది దేశాలు కొవిషీల్డ్‌కు అనుమతి ఇవ్వడం విశేషం. తాజా పరిణామాలతో ఈయూ ఏజెన్సీ(27 దేశాల సమాఖ్య)లోని మిగతా దేశాలు కూడా త్వరగతిన స్పందించే అవకాశం ఉంది. ఏమిటి గ్రీన్‌పాస్ ఈయూ దేశాలకు వెళ్లే ప్రయాణికులకు జులై ఒకటి నుంచి గ్రీన్ పాస్ తప్పనిసరి చేశారు. దీనిని ఈయూ డిజిటల్ కొవిడ్ సర్టిఫికేట్ అని కూడా పిలుస్తారు. ఇది ఇమ్యూనిటీ డాక్యుమెంట్‌గా భావిస్తారు. ఇది ఉన్నవాళ్లకు(రెండు డోసులు తీసుకున్నవాళ్లు) తప్పనిసరి క్వారంటైన్ నుంచి మినహాయింపు ఇస్తారు. చదవండి: గ్రీన్ పాస్‌పై ఈయూ వివరణ.. భారత్ ఫైర్ -
పదేళ్లుగా ఇంట్లోనే.. బయటకు రావాలంటే సిగ్గట..!
టోక్యో: కరోనా వ్యాప్తి ప్రారంభమైన నాటి నుంచి సామాజిక దూరం, ఐసోలేషన్ మన జీవితాల్లో భాగమైంది. ఏదైనా ముఖ్యమైన పని ఉండి వేరే ప్రాంతానికి వెళ్తే.. తిరిగి వచ్చాక స్నానం చేయడం.. రెండు, మూడు రోజుల పాటు ఐసోలేషన్‌లో ఉండటం తప్పనిసరిగా మారింది. అయితే మనం కరోనా వ్యాప్తి మొదలైన తర్వాత ఇలా ఐసోలేషన్‌లో ఉంటుంటే.. కొందరు మాత్రం ఎప్పటినుంచో ఈ సామాజిక దూరాన్ని పాటిస్తున్నారు. ఏళ్ల తరబడి జనాలకు దూరంగా.. ఇంటికే పరిమితమవుతున్నారు. జపాన్‌కు చెందిన నిటో సౌజీ ఈ కోవకు చెందిన వ్యక్తే. గత పదేళ్లుగా ఇతడు ఇంట్లోనే ఉంటున్నాడు. కేవలం కటింగ్ చేయించుకోవడం కోసం మాత్రమే బయటకు వస్తున్నాడు. ఆ వివరాలు.. ప్రొఫెషనల్ ఇండీ గేమ్ డెవలపర్ అయిన సౌజీ 10 సంవత్సరాల క్రితం తన స్వస్థలమైన టోక్యోకు తిరిగి వచ్చాడు. అప్పటి నుంచి బయటకు వెళ్లడం మానేశాడు. రెండు, మూడు నెలలకోసారి కేవలం కటింగ్ చెయించుకోవడం కోసం మాత్రమే బయటకు వస్తాడు. ఇంట్లోకి కావాల్సిన వస్తువులు, దుస్తులు, ఇతరాత్ర వాటి కోసం ఆన్లైన్ షాపింగ్ మీద ఆధారపడతాడు. తనకు కావాల్సిన వాటిని ఆన్లైన్లో బుక్ చేసి.. డోర్ డెలివరీ చేయించుకుంటాడు. బయటకు వెళ్లడానికి చాలా సిగ్గుపడతాడు.. భయపడతాడు సౌజీ. సౌజీ ఒక యూట్యూబ్ చానెల్ని కూడా రన్ చేస్తున్నాడు. దీనిలో తన రోజువారి జీవితానికి సంబంధించిన వీడియోలను పోస్ట్ చేస్తాడు. మన జీవితం తెల్లవారుజాము నుంచి ప్రారంభమైతే.. సౌజీ మాత్రం రాత్రి ఎనిమిద గంటలకు తన కార్యకాలపాలను ప్రారంభించి తెల్లవారుజామున 4 గంటలకు నిద్రపోతాడు. మొదటి రెండు మూడు సంవత్సారాలు ఈ విధానం తనకు బాగా మేలు చేసిందని.. ఎంతో ఏకాగ్రతగా పని చేసుకునేవాడినన్నాడు. కానీ రాను రాను బయటకు వెళ్లాలంటే సిగ్గుగా, భయంగా అనిపించేది అన్నాడు సౌజీ. సౌజీ పాటించే జీవన విధానాన్ని ‘‘హికికోమోరి’’ అని పిలుస్తారు. అంటే సమాజం నుంచి పూర్తిగా వైదొలగి సామాజిక ఒంటరితనం, నిర్బంధంలో తీవ్ర స్థాయిని కోరుకోవడం. సాధారణంగా జపాన్‌లో సగానికి పైగా యువత, వృద్ధులు ఈ విధానాన్ని పాటిస్తున్నారు.. కానీ సౌజీ అంత కఠినంగా మాత్రం కాదు. చదవండి: Coronavirus: శ్మశానవాటికలోనే ఐసోలేషన్ -
India vs Sri Lanka: రేపటి నుంచి ధవన్ సేన క్వారంటైన్ షురూ
న్యూఢిల్లీ: శ్రీలంక పర్యటనకు ఎంపికైన భారత జట్టు..14 రోజుల క్వారంటైన్ సోమవారం నుంచి ప్రారంభం కానుంది. జూన్ 14 నుంచి 28 వరకు ఆటగాళ్లు, సహాయ సిబ్బంది ముంబైలోని ఓ హోటల్లో క్వారంటైన్లో ఉండనున్నారు. ఈ సమయంలో భారత బృందానికి ఆరుసార్లు ఆర్టీపీసీఆర్ టెస్ట్‌లు నిర్వహిస్తారు. ఈ టెస్ట్లన్నింటిలో నెగటివ్ రిపోర్ట్ వచ్చిన వారు మాత్రమే ప్రత్యేక విమానంలో కొలంబో వెళ్తారని బీసీసీఐ స్పష్టం చేసింది. ఇంగ్లండ్ పర్యటనలో కోహ్లీ సేన పాటిస్తున్న నిబంధనలే ధవన్ సేనకు కూడా వర్తిస్తాయని బీసీసీఐ పేర్కొంది. ఈ 14 రోజుల క్వారంటైన్లో తొలి ఏడు రోజులు కఠిన నిబంధనలు పాటించాల్సి ఉంటుందని, ఆ తర్వాత.. బయో బుడగలో మిగిలిన ఆటగాళ్లతో కలుసుకునే వీలు ఉంటుందని, జిమ్ సెషన్లకు కూడా హాజరు కావచ్చని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. ఇదిలా ఉంటే, జులై 13న ప్రారంభమయ్యే లంక పర్యటనలో శిఖర్ ధవన్ సారథ్యంలోని టీమిండియా మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడనుంది. ఈ పర్యటనలో భారత జట్టుకు మ్యాచ్ సిమ్యులేషన్ ప్రాక్టీస్ కూడా ఉండనుంది. వ్యక్తిగత సెషన్ తర్వాత ఈ సెషన్ ఉండే అవకాశం ఉంది. ఇక కొలంబో చేరిన తర్వాత క్రికెటర్లు మూడు రోజులు క్వారంటైన్లో ఉంటారు. ఆ తర్వాత ప్రాక్టీస్ చేసుకునే అవకాశం కల్పిస్తారు. టీమిండియా గత కొన్నేళ్లుగా కొలంబోలో హోటల్ తాజా సముద్రలో బస చేస్తోంది. ఇప్పుడు కూడా ఆటగాళ్లకు అదే హోటల్ కేటాయించినట్లు లంక క్రికెట్ బోర్డ్ వెల్లడించింది. భారత జట్టు: శిఖర్ ధవన్ (కెప్టెన్), భువనేశ్వర్ కుమార్ (వైస్ కెప్టెన్), పృథ్వీ షా, దేవదత్ పడిక్కల్, హార్దిక్ పాండ్యా, రుతురాజ్ గైక్వాడ్, సూర్యకుమార్ యాదవ్, మనీష్ పాండే, నితీష్ రాణా, ఇషాన్ కిషన్, సంజు శాంసన్, యుజ్వేంద్ర చహల్, రాహుల్ చాహర్, కృష్ణప్ప గౌతమ్, కృనాల్ పాండ్యా, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, దీపక్ చహర్, నవ్‌దీప్ సైనీ, చేతన్ సకారియా. చదవండి: గొప్ప గౌరవంగా భావిస్తున్నాను: శిఖర్ ధవన్ -
Sri Lanka: కోవిడ్ నిబంధనల ఉల్లంఘన.. 24 గంటల్లో 1,047 మంది అరెస్ట్
కొలంబో(శ్రీలంక): చైనాలోని వుహాన్ నగరంలో పుట్టిన కరోనా వైరస్.. ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా ప్రతి రోజు భారీ సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. పెద్ద, చిన్న అనే తేడాలేకుండా ప్రతి దేశం కోవిడ్‌ను అరికట్టడానికి కఠిన నిబంధనలను అమలు చేస్తున్నాయి. అయితే తాజాగా శ్రీలంకలో క్యారంటైన్ నిబంధనలు ఉల్లంఘించినందుకు సోమవారం 1,047 మందిని అరెస్ట్ చేసినట్టు పోలీసు మీడియా ప్రతినిధి డీఐజీ అజిత్ రోహనా వెల్లడించారు. మాతలేలో 160 మందిని, నికవేరటియాలో 119 మందిని, కాండీలో 98 మందిని అరెస్టు చేసినట్లు ఆయన తెలిపారు. గత ఏడాది అక్టోబర్ 31 నుంచి ఇప్పటి వరకు క్యారంటైన్ నిబంధనలు ఉల్లంఘించినందుకు19,102 మందిని అరెస్ట్ చేసినట్టు పేర్కొన్నారు. కరోనా కట్టడికి సంబంధించి పర్యవేక్షణ కోసం 23,000 మంది పోలీసు అధికారులను నియమించినట్లు తెలిపారు. ఇక ఇప్పటి వరకు శ్రీలంకలో 1,83,452 కోవిడ్-19 కేసులు నమోదు కాగా.. 1,441 మంది కరోనా బాధితులు మరణించినట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) పేర్కొంది. (చదవండి: Archaeology Dept.: ఈ ఆయుధం 7 వేల సంవత్సరాల క్రితం నాటిది!) -
ప్రేయసిని హత్తుకుని భావోద్వేగానికి లోనైన ఆసీస్ క్రికెటర్..
కాన్బెర్రా: రెండు నెలల విరామం అనంతరం కడుపుతో ఉన్న ప్రేయసిని కలుసుకున్న ఆసీస్ స్టార్ ఆటగాడు పాట్ కమిన్స్ భావోద్వేగానికి లోనయ్యాడు. సిడ్నీలో 14 రోజుల కఠిన క్వారంటైన్‌ను ముగించుకుని సోమవారం స్వస్థలానికి చేరుకున్న కమిన్స్.. ఎయిర్ పోర్ట్‌లో ప్రేయసి బెక్కీ బోస్టన్‌ను హత్తుకుని ముద్దులతో ముంచెత్తాడు. ఈ సందర్భంగా ఇరువురు భావోద్వేగానికి లోనై ఆనంద బాష్పాలు కార్చారు. ఈ సన్నివేశానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నెట్టింట 'వీడియో ఆఫ్ ద డే'గా ట్రెండ్ అవుతూ తెగ హల్చల్ చేస్తుంది. కాగా, కోవిడ్ కారణంగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021 వాయిదా పడటంతో లీగ్‌లో పాల్గొన్న ఆసీస్ ఆటగాళ్లంతా రెండు వారాలు మాల్దీవుల్లో గడిపి అనంతరం ఆస్ట్రేలియాకు చేరుకున్నారు. ఆతరువాత వీరు సిడ్నీలో 14 రోజులు కఠిన క్వారంటైన్లో గడిపారు. Video of the day! After eight weeks away for the IPL, Pat Cummins finally leaves hotel quarantine and reunites with his pregnant partner Becky. All the feels! pic.twitter.com/YA3j98zJId — Chloe-Amanda Bailey (@ChloeAmandaB) May 31, 2021 ఇదిలా ఉంటే, కమిన్స్.. కడుపుతో ఉన్న ప్రేయసితో సమయాన్ని గడిపేందుకు ఐపీఎల్ సెకండాఫ్ మ్యాచ్‌లతో పాటు వెస్టిండీస్ పర్యటన కూడా దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాడు. ఈ మేరకు క్రికెట్ ఆస్ట్రేలియాకు సందేశాన్ని కూడా పంపాడు. కమిన్స్ బాటలోనే ఆసీస్ స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ కూడా వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. చాలా కాలంగా బయో బబుల్‌లో ఉన్న కారణంగా.. ఒత్తిడి నుంచి ఉపశమనం పొందేందుకు కుటుంబంతో గడిపాలని ఈ క్రికెటర్లు నిర్ణయించుకున్నట్లు తెలిపారు. వీరితో పాటు మరి కొంత మంది ఆసీస్ ఆటగాళ్లు కూడా విండీస్ పర్యటనతో పాటు ఐపీఎల్‌కు డుమ్మా కొట్టే ఉద్ధేశంలో ఉన్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే, ఐపీఎల్ 14వ ఎడిషన్‌లో మిగిలిన 31 మ్యాచ్‌లను యూఏఈ వేదికగా సెప్టెంబరు 18 నుంచి అక్టోబరు 10 మధ్యలో నిర్వహిస్తామని బీసీసీఐ ప్రకటించిన విషయం తెలిసిందే. చదవండి: కేకేఆర్‌కు భారీ షాక్.. ఐపీఎల్ నుంచి స్టార్ ఆటగాడు ఔట్ -
ఇంగ్లండ్‌లోనూ కఠిన క్వారంటైన్
ముంబై: స్వదేశంలో రెండు వారాల హార్డ్ క్వారంటైన్ తర్వాత ఇంగ్లండ్‌లో అడుగు పెట్టే భారత క్రికెట్ జట్టు అక్కడ కూడా కొన్ని రోజులు అదే తరహా వాతావరణంలో ఉండాల్సి రావచ్చు. టీమిండియా రాకకు సంబంధించి ఐసీసీ కీలక ప్రకటన చేసింది. ‘డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్ విషయంలో ఇంగ్లండ్ ప్రభుత్వం కొన్ని సడలింపులు ఇచ్చింది. భారత ఆటగాళ్లు ఇంగ్లండ్‌లో అడుగు పెట్టగానే నేరుగా హాంప్‌షైర్ మైదానం పక్కన ఉన్న హోటల్‌కు వెళ్లిపోతారు. వారికి అక్కడే కరోనా పరీక్షలు నిర్వహిస్తాం. ఆ తర్వాత కొన్ని ఆంక్షలు, నిబంధనలతో కూడిన ఐసోలేషన్ మొదలవుతుంది. ఐసోలేషన్ సమయంలోనూ పరీక్షలు కొనసాగుతాయి’ అని ఐసీసీ పేర్కొంది. దీనిని బట్టి చూస్తే టీమిం డియా హార్డ్ క్వారంటైన్లో గడపడం ఖాయంగా కనిపిస్తోంది. అయితే ఎన్ని రోజులు అనే విష యంపై మాత్రం ఐసీసీ స్పష్టతనివ్వలేదు. న్యూజి లాండ్ జట్టు విషయంలో మాత్రం దీనిని మూడు రోజులకే పరిమితం చేశారు. పురుషులతోపాటు ఇంగ్లండ్‌కు ప్రయాణించే భారత మహిళల జట్టు విషయంలో కూడా ఇవే నిబంధనలు వర్తిస్తాయి. -
ఈ యాప్స్‌తో ఒత్తిడి పరార్..!
డిజిటల్ వరల్డ్ ఐసోలేషన్లు, అంబులెన్స్ చప్పుళ్లు... స్ట్రెస్‌గా ఫీలవుతున్నారా? జోష్ మిస్సయిందా?అల్లావుద్దీన్ అద్భుతదీపంలాంటి ‘యాప్స్’ మీ దగ్గరే ఉన్నాయి. మీ మనసులో మాట చెప్పండి చాలు...‘జీ హుజూరు’ అని ఒత్తిడిని మాయం చేస్తాయి. మాయాతివాచీ మీద మిమ్మల్ని కూర్చోబెట్టుకొని రాగాల ప్రపంచంలోకి తీసుకువెళతాయి. రంగులతో బొమ్మలు వేయిస్తాయి. సవాల్ దూసే ఆటలకు సై అనేలా చేస్తాయి. టోటల్‌గా జోష్‌ను టన్నుల కొద్దీ ఇస్తాయి... జోరుగా....హాయి హాయిగా! ‘కరెంటు తీగలా ఎనర్జిటిక్‌గా ఉండేవాడివి...అదేంటి బ్రో ఇలా కనిపిస్తున్నావు!’ అనే పలకరింపుకు అటు నుంచి ఒక నవ్వు అయితే వినిపించిందిగానీ అది జీవం లేని నవ్వు. జోష్‌లేని జీరో నవ్వు! పైకి ఎంత గంభీరంగా కనిపించినా ఒత్తిడి, ఆందోళన, ఒంటరితనం, నిద్రలేమి...మొదలైన సమస్యలతో డీలా పడిపోతున్న కుర్రకారు సంఖ్య తక్కువేమీ లేదు. డీలా పడిపోకుండా సమస్యను ఢీ కొట్టాడానికి అందుబాటులో ఉన్న ఫీల్‌గుడ్ యాప్స్‌లో ఒకటి ‘ఎన్స్మైల్స్’ ఇప్పుడు మనం ఎదుర్కుంటున్న కనిపించే, కనిపించని మానసిక సమస్యలపై కత్తిదూసే సెల్ఫ్–హెల్ప్ టూల్స్ ఇందులో ఉన్నాయి. నిద్ర లేమి నుంచి కెరీర్ మెనేజ్మెంట్ వరకు నిపుణుల సలహాలు, సూచనలు ఇందులో కనిపిస్తాయి. ‘ఖాళీగా ఉన్న బుర్ర దెయ్యాల కార్ఖానా’ అంటారు కదా! ఈ సమయంలో మెదడుకు ఎంత పని కలిపిస్తే అంత మంచిది. దీనికి కొత్త భాష నేర్చుకుంటే మరీ మంచిది. మోస్ట్ పాప్లర్ లాంగ్వేజ్ లెర్నింగ్ యాప్‌గా పేరున్న ‘డ్యుయో లింగో’లో స్పానీష్, జర్మన్, ఫ్రెంచ్, ఇటాలియన్, జపనీస్....మొదలైన భాషలు నేర్చుకోవచ్చు. అకాడమిక్ పాఠాల మాదిరిగా కాకుండా గేమ్–లైక్ ట్రిక్స్‌తో కొత్త భాష నేర్చుకోవచ్చు. అలా కళ్లు మూసుకొని, రిలాక్స్ అవుతూ పుస్తకం చదవాలని...సారీ వినాలని ఉందా? అందుకు ‘ఆడిబుల్’ యాప్ ఉంది. అమెజాన్ వారి ఈ ఆడియోబుక్ సర్వీస్‌లో ఎన్నో పుస్తకాలు వినవచ్చు. కాస్త ఎంటర్టైన్మెంట్ కావాలంటారా? అయితే ఇదే కంపెనీ వారి ‘ఆడిబుల్ సునో’ ఉంది. బాలీవుడ్ నుంచి టీవి సెలబ్రిటీల వరకు ఎన్నో గొంతులు వినొచ్చు. కామెడీతో కడుపుబ్బా నవ్వుకోవచ్చు. ఆసక్తి కలిగించే సినిమా, ఆటల కబుర్లు హాయిగా వినవచ్చు. గూగుల్ ప్లేస్టోర్‌లో హైయెస్ట్–రేటెడ్ యాప్‌లలో ఒకటైన ‘కలర్ఫై’ రిలాక్స్ కావడానికి ఉపకరించే యాప్. మనల్ని వేలు పట్టుకొని బాల్యంలోకి తీసుకువెళుతుంది. పూలతోటలు, జంతుజాలం, ప్రముఖ చిత్రాలు, ప్రముఖుల చిత్రాలకు రకరకాల రంగులు వేయవచ్చు. స్ట్రెస్, అకారణ ఆందోళల నుంచి బయటపడడానికి కలరింగ్ యాప్స్ బెస్ట్ అని సూచిస్తున్నారు మెంటల్ హెల్త్ ప్రొఫెషనల్స్. ప్రపంచవ్యాప్తంగా పేరున్న సోషల్ గేమింగ్ యాప్‌లలో ‘హగో’ ఒకటి. మనదేశంలో కూడా ప్రాచుర్యం పొందింది. ‘ప్లే విత్ ఫ్రెండ్స్ అండ్ మేక్ ఫ్రెండ్స్’ అని ఆహ్వానిస్తోంది. బ్రెయిన్ క్విజ్ (బ్రెయిన్ పవర్‌ను చెక్ చేసుకునే గేమ్) మొదలు క్రేజీ ట్యాక్సీలాంటి మైండ్ బ్లోయింగ్ గేమ్స్ వరకు ఎన్నో గేమ్స్ ఇందులో ఉన్నాయి. పాత గేమ్స్‌నే పదేపదే ఆడనక్కర్లేదు. ప్రతిరోజూ కొత్త గేమ్స్ లైబ్రరీలో చేరుతుంటాయి. ప్రపంచవ్యాప్తంగా మీలాగే గేమ్స్ ఆడేవారితో కనెక్ట్ కావచ్చు. బొమ్మలు వేయాలని ఎవరికి మాత్రం ఉండదు! మీ ఐఫోన్‌నే కాన్వాస్‌గా చేసుకొని ఆయిల్ పెయింటింగ్ నుంచి డిజిటల్ ఆర్ట్ వరకు కుంచెలను కదిలించడానికి ‘ఇన్స్పైర్ ప్రో’ ఉంది. ఉదాహరణ కోసం గ్యాలరీలో బోలెడు చిత్రాలు ఉన్నాయి. ఎయిర్ బ్రషెస్ నుంచి గ్రాఫిటీ పెన్సిల్స్ వరకు ఎన్నో టూల్స్ ఉన్నాయి. ఇక ఇల్లే చిత్రశాల అవుతుంది. లాక్డౌన్, ఐసోలేషన్‌లతో బాహ్య ప్రపంచం దూరమైపోయిందని బాధ అక్కర్లేదు. యాప్ ప్రపంచంలోకి అడుగుపెడితే ఒకటి కాదు ఎన్నో ప్రపంచాలు స్వాగతం పలుకుతాయి. నిరుత్తేజ క్షణాల్లో కొత్త ఉత్సాహాన్ని ఇస్తాయి. -
రోజురోజుకు రాటుదేలుతున్నారు..
ముంబై: ఇంగ్లండ్ పర్యటన నేపథ్యంలో ఎనిమిది రోజుల కఠిన క్వారంటైన్ నిమిత్తం ముంబై చేరుకున్న టీమిండియా క్రికెటర్లు జిమ్ లో కఠోరంగా శ్రమిస్తున్నారు. అవుట్ డోర్ ప్రాక్టీస్ లేకపోవడంతో ఎక్కువ సమయం జిమ్ లోనే కసరత్తులు చేస్తూ, రోజురోజుకు రాటుదేలుతున్నారు. ఈ క్రమంలో క్రికెటర్లంతా శారీరకంగా ధృడంగా మారుతున్నారు. ఇషాంత్ శర్మ, శుభ్‌మన్ గిల్, రిషబ్ పంత్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, రహానే, ఉమేశ్ యాదవ్, మయాంక్ అగర్వాల్ తదితరులు జిమ్‌లో గంటల కొద్దీ చెమటోడుస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియోను బీసీసీఐ ట్విటర్లో షేర్ చేసింది. Getting stronger each day! 💪💪#TeamIndia pic.twitter.com/0bZFml1gxL — BCCI (@BCCI) May 26, 2021 కాగా, క్రికెటర్లతో పాటు ఇంగ్లండ్ కు బయల్దేరనున్న కుటుంబ సభ్యులు, సహాయ సిబ్బంది కూడా బయో బబుల్‌లోకి అడుగుపెట్టారు. వారు కూడా ఎనిమిది రోజుల పాటు కఠిన క్వారంటైన్లో ఉంటారు. అనంతరం జూన్ 2న భారత బృందం ప్రత్యేక విమానంలో లండన్ కు బయల్దేరుతుంది. ఈ టూర్లో న్యూజిలాండ్ తో ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్‌తో పాటు ఆతిథ్య ఇంగ్లీష్ జట్టుతో ఐదు టెస్టుల సిరీస్‌లో భారత జట్టు తలపడుతుంది. జూన్ 8న డబ్ల్యూటీసీ ఫైనల్, ఆగస్ట్ 4 నుంచి సెప్టెంబర్ 14 మధ్యలో ఇంగ్లండ్ తో టెస్ట్ మ్యాచ్ లు ఆడనుంది. చదవండి: ఆ బౌలర్ ఎప్పటికీ టీమిండియాకు ఆడలేడు.. -
క్వారంటైన్: చెట్టుకింద కరోనా రోగి..
జయపురం: కరోనా పాజిటివ్ నమోదైన ఓ బాధితుడు నవరంగపూర్ జిల్లా చందాహండి సమితి గంభారిగుడ పంచాయతీ మెడిగాం గ్రామంలో చెట్టు కింద ఆశ్రయం పొందడంతో గ్రామస్తులు భయాందోళన చెందుతున్నారు. సమితికి చెందిన ఒక వ్యక్తికి కరోనా పాజిటివ్ నమోదు కావడంతో హోం క్వారెంటైన్లో ఉండమని వైద్యులు సూచించారు. అయితే ఆ వ్యక్తికి హోం క్వారంటైన్ అవకాశం లేకపోవడంతో మెడిగాం గ్రామంలో చెట్టు కింద ఆశ్రయం పొందాడు. దీంతో మెడిగాం గ్రామస్తులు వణికిపోతున్నారు. వైద్యాధికారులు కరోనా పరీక్షలు చేసి పాజిటివ్ నమోదైన వారిని గాలికి వదిలేస్తున్నారని హోం క్వారంటైన్లో ఉండే అవకాశం లేని వారికి తగిన ఏర్పాట్లు చేయాలి కానీ గాలికి వదిలేయకూయడదని మండిపడుతున్నారు. కరోనా రోగులు చెట్ల కింద ఉంటే ఇతరులకూ కరోనా సంక్రమించే ప్రమాదం ఉందని భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. సమితిలోని హలదిగ్రామంలో 100 పడకల కోవిడ్ కేర్ హాస్పిటల్, పనాబెడ డిగ్రీ కళాశాల, సాలెబిడి ఆశ్రమంలో రెండు టీఎంసీ (తాత్కాలిక వైద్య కేంద్రం) లు ఉన్నా తమ గ్రామంలో చెట్టు కింద కరోనా రోగి ఉండడానికి కారణం ఏమిటని గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. దీనిపై ఉన్నతాధికారులు దర్యాప్తు చేసి వాస్తవాలు వెల్లడించాలని డిమాండ్ చేస్తున్నారు. సహాయం చేస్తున్న గ్రామ యువత చెట్టు కింద ఉంటున్న కరోనా రోగికి తిండి, మందులు ఎవరూ సమకూర్చడం లేదు. ఆ రోగి పరిస్థితి చూసి చలించిన మెడిగాం గ్రామానికి చెందిన యువకులు తినేందుకు, తాగేందుకు సమకూర్చారు. అలాగే రోగికి దూరంగా ఉండి ఆరోగ్య పరిస్థితి తెలుసుకుంటూ అవసరమైన మందులు తెచ్చి ఇస్తున్నారు. -
BCCI Success: టీమిండియాకు ఊరట
సాక్షి, న్యూఢిల్లీ: టీమిండియాకు భారీ ఊరట లభించింది. ఇంగ్లాండ్ సిరీస్ ముందు క్వారంటైన్ రోజుల్ని కుదించేందుకు ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డ్ ఒప్పుకుంది. పదిరోజులను మూడు రోజులకు కుదిస్తున్నట్లు బీసీసీఐకి అంగీకారం తెలిపింది. ఇంగ్లాండ్ టూర్ కోసం పురుషుల, మహిళల టీంలు జూన్ 2న ఇంగ్లాండ్‌కు ఒకే విమానంలో బయలుదేరాల్సి ఉంది. అయితే పదిరోజుల కఠిన క్వారంటైన్‌కు రెడీగా ఉండాలని ఇంగ్లాండ్, వేల్స్ క్రికెట్ బోర్డు(ఈసీబీ) ముందు కండిషన్ పెట్టింది. ఈ మేరకు భారత్ క్రికెట్ కంట్రోల్ బోర్డ్ ఈసీబీతో సంప్రదింపులు జరిపింది. చివరికి బీసీసీఐ రిక్వెస్ట్‌తో కొవిడ్ ప్రొటోకాల్స్‌ను ఇంగ్లాండ్ బోర్డు సవరించింది. ఈ నిర్ణయంతో నాలుగో రోజు నుంచే జట్లు ప్రాక్టీస్ చేసుకోవడానికి వీలు దొరుకుతుంది. అయితే క్రికెటర్లకు క్వారంటైన్ నుంచి మినహాయింపు ఇచ్చిన ఈసీబీ.. ఆటగాళ్ల కుటుంబ సభ్యుల క్వారంటైన్ విషయంలోనే ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌లో భాగంగా జూన్ 18న న్యూజిలాండ్‌తో కోహ్లీ సేన తలపడనుంది. ఇక ఉమెన్ టీం.. జూన్ 16న ఇంగ్లాండ్‌తో బ్రిస్టల్‌లో టెస్ట్ మ్యాచ్ ఆడనుంది. చదవండి: పుజారా ఆస్ట్రేలియన్ మాదిరిగానే బ్యాటింగ్ చేశాడు -
రెండు వారాలు ముంబైలో... పది రోజులు సౌతాంప్టన్‌లో...
ముంబై: మూడున్నర నెలల ఇంగ్లండ్ పర్యటన కోసం బయల్దేరనున్న భారత క్రికెట్ జట్టు ప్రయాణం మొదటి మజిలీ ముంబైకి చేరుకుంది. జూన్ 2న ఇంగ్లండ్ ఫ్లయిట్ ఎక్కడానికి రెండు వారాల ముందునుంచే ముంబైలోని ఒక హోటల్లో జట్టు సభ్యులంతా హార్డ్ క్వారంటైన్లో గడపనున్నారు. కరోనా నేపథ్యంలో బీసీసీఐ విధించిన నిబంధనల ప్రకారం వీరంతా తమ హోటల్ గదులు దాటి ఎట్టి పరిస్థితుల్లోనూ బయటకు రావడానికి వీల్లేదు. కరోనా కారణంగానే ఐపీఎల్‌ను వాయిదా వేయాల్సి రావడంతో ఈ విషయంలో కఠినంగా వ్యవహరించేందుకు బోర్డు సన్నద్ధమైంది. ఆటగాళ్ల క్వారంటైన్ బుధవారం నుంచే ప్రారంభమైంది. ముంబైలో క్వారంటైన్లోకి అడుగు పెట్టే ముందు క్రికెటర్లు కనీసం మూడుసార్లు కరోనా నెగెటివ్‌గా తేలిన రిపోర్టులతో రావాలి. క్వారంటైన్ సమయంలో కూడా కనీసం మరో మూడుసార్లు ఆటగాళ్లకు పరీక్షలు నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయించింది. ఈ టూర్లో భాగంగా వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్ (డబ్ల్యూటీసీ)తో పాటు ఇంగ్లండ్‌తో భారత జట్టు ఐదు టెస్టులు ఆడుతుంది. మరోవైపు పురుషుల జట్టుతో పాటే ఇంగ్లండ్ వెళ్లనున్న భారత మహిళల జట్టుకు కూడా క్వారంటైన్ విషయంలో ఇవే ప్రొటోకాల్ వర్తింపజేస్తున్నారు. ఈ పర్యటనలో మహిళల టీమ్ ఒక టెస్టు, 3 వన్డేలు, 3 టి20ల్లో ఇంగ్లండ్‌తో తలపడుతుంది. రెండు ప్రత్యేక విమానాల్లో... టీమిండియా జట్టు సభ్యులు సురక్షితంగా ముంబైకి చేరుకునేందుకు బీసీసీఐ రెండు ప్రత్యేక విమానాలు ఏర్పాటు చేసింది. ఢిల్లీ, చెన్నైల నుంచి ఈ విమానాలు బయలుదేరాయి. ఇషాంత్ శర్మ, రిషభ్ పంత్, శుబ్‌మన్ గిల్, ఉమేశ్ యాదవ్, అవేశ్ ఖాన్, అభిమన్యు ఈశ్వరన్ ఢిల్లీ నుంచి ముంబైకి చేరారు. చెన్నై నుంచి బయలుదేరిన విమానంలో అశ్విన్, వాషింగ్టన్ సుందర్ ఎక్కగా... రోడ్డు మార్గాన బెంగళూరు నుంచి చెన్నై వెళ్లిన మయాంక్ అగర్వాల్ కూడా వీరితో జత కలిశాడు. ఇదే ఫ్లయిట్ హైదరాబాద్‌కు వెళ్లింది. మహిళల టీమ్ కెప్టెన్ మిథాలీ రాజ్, మీడియం పేస్ బౌలర్ అరుంధతి రెడ్డిలతోపాటు సిరాజ్, ఫీల్డింగ్ కోచ్ ఆర్.శ్రీధర్ దీంట్లో ప్రయాణించి ముంబై చేరారు. ఇతర ప్రాంతాలకు చెందిన క్రికెటర్లు పుజారా, జడేజా, అక్షర్, షమీ మాత్రం తమ ‘నెగెటివ్ రిపోర్ట్’లతో కమర్షియల్ ఫ్లయిట్ల ద్వారా విడిగా ముంబై చేరారు. అలా అయితే ఎలా... తొలిసారి నిర్వహిస్తున్న డబ్ల్యూటీసీ ఫెనల్‌కు సంబంధించిన నిబంధనలపై ఐసీసీ ఇంకా పూర్తి స్పష్టతనివ్వలేదు. టెస్టులో ఇరు జట్ల ఒక్క ఇన్నింగ్స్ కూడా పూర్తికాని సమయంలో వర్షం కారణంగా ఆట రద్దయిపోతే ఎలా... మ్యాచ్ ‘డ్రా’ లేదా ‘టై’ అయితే ఎలా... వీటిపై ఇంకా ఐసీసీ మరిన్ని వివరాలు ప్రకటించాల్సి ఉంది. మరోవైపు ఫైనల్ మ్యాచ్‌ను వీక్షించేందుకు 4 వేల మంది ప్రేక్షకులను అనుమతించాలని ఐసీసీ భావిస్తోంది. వారికి కాస్త సడలింపు... ముంబై, సమీప ప్రాంతాల్లో ఉంటున్న క్రికెటర్లకు మాత్రం బీసీసీఐ కాస్త సడలింపు ఇచ్చింది. వారంతా క్వారంటైన్లో చేరేందుకు మే 24 వరకు అవకాశం ఇచ్చింది. ఇందులో కెప్టెన్ విరాట్ కోహ్లితోపాటు అజింక్య రహానే, రోహిత్ శర్మ, శార్దుల్ ఠాకూర్, కోచ్ రవిశాస్త్రి ఉన్నారు. అపెండిసైటిస్‌కు చికిత్స అనంతరం రాహుల్ కూడా ముంబైలోనే ఉంటున్నాడు. అయితే వీరు కూడా బుధవారం నుంచే తమ ఇళ్ల వద్ద హోం క్వారంటైన్లో ఉండాలని ఆదేశించింది. ఐపీఎల్ సమయంలో కరోనా బారిన పడి కోలుకున్న పేసర్ ప్రసిధ్ కృష్ణ, వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహాలకు కూడా బోర్డు మరి కొంత సమయం ఇచ్చింది. వీరిద్దరు కూడా కాస్త ఆలస్యంగా ముంబైలో జట్టుతో కలుస్తారు. మరోవైపు ఐపీఎల్‌లోనే కరోనా పాజిటివ్‌గా తేలిన సీనియర్ లెగ్ స్పిన్నర్ అమిత్ మిశ్రా (ఢిల్లీ క్యాపిటల్స్) కూడా కోలుకున్నాడు. స్టేడియం పక్కనే... లండన్ చేరిన తర్వాత భారత జట్టు నేరుగా డబ్ల్యూటీసీ ఫైనల్ వేదిక అయిన సౌతాంప్టన్‌కు వెళ్లిపోతుంది. ఇంగ్లండ్, న్యూజిలాండ్ సిరీస్ కొనసాగుతుండగానే టీమిం డియా క్వారంటైన్ మొదలవుతుంది. అయితే మ్యాచ్ జరిగే ఏజియస్ బౌల్ మైదానానికి ఆనుకునే ఉన్న హోటల్లోనే ఉండాల్సి రావడం కొంత వెసులుబాటు. ఇక్కడ భారత్ 10 రోజుల పాటు సాఫ్ట్ క్వారంటైన్లో ఉండాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి ఇంగ్లండ్ ప్రభుత్వం నుంచి అన్ని అనుమతులు తీసుకున్నట్లు ఈసీబీ ప్రకటించింది. ఇక్కడ ఏర్పాటు చేయబోయే బయో బబుల్ నిబంధనల ప్రకారం భారత క్రికెటర్లు తమ సహచరులతో కలిసి ప్రాక్టీస్ చేసుకునేందుకు అవకాశం ఉం టుంది. హోటల్, గ్రౌండ్, ప్రాక్టీస్ నెట్స్ పరిధి దాటకుండా ఈ 10 రోజులు ఆటగాళ్లు గడపాల్సి ఉంటుంది. మరోవైపు ఇంగ్లండ్‌లో అమ ల్లో ఉన్న ప్రభుత్వ నిబంధనల నేపథ్యంలో ఈ సిరీస్ సందర్భంగా క్రికెటర్ల కుటుంబ సభ్యులను అనుమతించే విషయంలో ఇంకా స్పష్టత రాలేదు. ప్రస్తుతానికి ముంబై క్వారంటైన్ వరకైతే భార్యా, పిల్లలను అనుమతించింది. -
ఎట్టకేలకు సొంతగడ్డపై...
సిడ్నీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) అనూహ్యంగా వాయిదా పడిన రోజునుంచి ఎప్పుడెప్పుడు ఇళ్లకు చేరుదామా అని ఎదురు చూసిన ఆస్ట్రేలియా క్రికెటర్లకు ఊరట లభించింది. భారత్‌నుంచి వచ్చే విమానాలపై తమ దేశం విధించిన ఆంక్షల నేపథ్యంలో మాల్దీవులలో కొన్ని రోజులు గడిపిన అనంతరం వీరంతా సొంతగడ్డపై అడుగు పెట్టారు. లీగ్‌లో పాల్గొన్న ఆటగాళ్లు, సహాయక సిబ్బందితో పాటు ఇతర సాంకేతిక నిపుణులు అందరూ సోమవారం ఉదయం స్వదేశంలోకి ప్రవేశించారు. ‘ఎయిర్ సీషెల్స్’ ఫ్లయిట్ ద్వారా వీరంతా సిడ్నీ నగరానికి చేరుకున్నట్లు ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు (సీఏ) వెల్లడించింది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం క్రికెటర్లు ఇప్పుడే తమ ఇంటికి వెళ్లేందుకు వీలు లేదు. రెండు వారాల పాటు వీరంతా స్థానిక మారియట్ హోటల్లో క్వారంటైన్లో ఉండనున్నారు. ఆ తర్వాత తమ స్వస్థలాలకు వెళ్లిపోతారు. కోవిడ్ బారిన పడి కోలుకున్న చెన్నై కోచ్ మైక్ హస్సీ కూడా విడిగా ఖతర్ మీదుగా ఆస్ట్రేలియాకు వెళ్లాడు. ఐపీఎల్‌ను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు మే 4న బీసీసీఐ ప్రకటించగా... అందరికంటే చివరగా ఆసీస్ క్రికెటర్లు సొంత దేశానికి వెళ్లగలిగారు. తమ ఆటగాళ్లు క్షేమంగా తిరిగి రావడం పట్ల సంతోషం వ్యక్తం చేసిన సీఏ చీఫ్ ఎగ్జిక్యూటివ్ నిక్ హాక్లీ...అందుకు తగిన ఏర్పాట్లు చేసిన బీసీసీఐకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపాడు. -
కోవిడ్‌తో ఆస్పత్రిలో చేరితే ఇల్లు దోచేశారు
పెదకూరపాడు: కరోనా రక్కసి నుంచి ప్రాణాలు కాపాడుకునేందుకు ఓ కుటుంబం ఆస్పత్రిలో చేరగా, ఇదే అదునుగా భావించిన దొంగలు.. వారి ఇంట్లో చోరీకి పాల్పడ్డారు. గుంటూరు జిల్లా పెదకూరపాడు మండలం పాటిబండ్ల గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. పెదకూరపాడు సీఐ గుంజి తిరుమలరావు కథనం ప్రకారం.. పాటిబండ్ల గ్రామస్తుడు గార్లపాటి పూర్ణచంద్రరావు తన ఇంట్లో చిల్లర కొట్టు వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ నెల రెండో తేదీన పూర్ణచంద్రరావు కోవిడ్‌తో మృతిచెందాడు. దీంతో ఆయన భార్య నాగచంద్రిక, వారి ఇద్దరు కుమార్తెలు, తల్లి కోవిడ్ పరీక్షలు చేయించుకోగా, పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఈనెల 6న గుంటూరులోని అడవితక్కెళ్లపాడు క్వారంటైన్ సెంటర్లో చేరి చికిత్స పొందుతున్నారు. చికిత్స అనంతరం నిర్వహించిన పరీక్షల్లో వారికి నెగిటివ్‌గా తేలడంతో ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు ఇంటికి చేరుకున్నారు. తాళం తీసి ఇంట్లోకి వెళ్లగా, చోరీ జరిగిన విషయం వెల్లడైంది. బీరువాను ఇనుప బద్దతో తెరిచి, అందులోని 20 సవర్ల బంగారం, రూ.2 లక్షల నగదు దుండగులు దోచుకెళ్లినట్లు గుర్తించారు. గార్లపాటి నాగచంద్రిక ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. కోవిడ్ బారినపడి కుటుంబ పెద్దను కోల్పోయి, తల్లడిల్లుతున్న తమకు ఈ చోరీతో ఆర్థికంగానూ తీవ్ర నష్టం వాటిల్లిందని బాధితులు కన్నీరుమున్నీరవుతున్నారు. -
వైరల్: క్వారంటైన్లో ఎమ్మెల్యే చిందులు
సాక్షి, మండ్య: కరోనా వైరస్ సెకండ్ వేవ్‌తో దేశవ్యాప్తంగా కోవిడ్ పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. అయితే కోవిడ్ కేర్ సెంటర్లు, ప్రభుత్వ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న కరోనా బాధితుల్లో ఉల్లాసం నింపడానికి డాక్టర్లు, నర్సులు వినూత్న కార్యక్రమాలు చేపడుతున్న విషయం తెలిసిందే. తాజాగా కోవిడ్ రోగుల్లో ఉల్లాసం నింపేందుకు కర్ణాటక ఎమ్మెల్యే కె.అన్నదాని ఆడి పాడారు. మండ్య పట్టణంలోని రవాణా సంస్థ శిక్షణ కేంద్రం క్వారంటైన్ కేంద్రంలో కోవిడ్ రోగుల కోసం సాంస్కృతిక ప్రదర్శనను నిర్వహించారు. ఈ సమయంలో ఎమ్మెల్యే వేదిక మీద సరదాగా చిందులేశారు. స్వతహాగా జానపద గాయకుడు, కళాకారుడు అయిన అన్నదాని మాట్లాడుతూ కోవిడ్ కేర్ సెంటర్లో రోగులు ఉల్లాసంగా ఉండాలని తెలిపారు. -
నెగెటివ్ వస్తేనే క్వారంటైన్‌కు...
న్యూఢిల్లీ: ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్‌తో పాటు ఇంగ్లండ్‌తో ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో పాల్గొనేందుకు ఇంగ్లండ్‌కు బయలుదేరే భారత జట్టుకు బీసీసీఐ మార్గదర్శకాలను విడుదల చేసింది. ప్రస్తుతం భారత్‌లో కరోనా సెకండ్ వేవ్ ఉధృతంగా ఉండటంతో ఆటగాళ్లు కరోనా బారిన పడకుండా ఉండేందుకు బీసీసీఐ కట్టుదిట్టమైన చర్యలకు సిద్ధమైంది. ఇందులో భాగంగా ముంబైలో ఏర్పాటు చేసిన బయో బబుల్‌లో టీమిండియా 14 రోజుల కఠిన క్వారంటైన్‌ను పూర్తి చేయాల్సి ఉంది. అయితే అంతకంటే ముందు వీరంతా తమ ఇంటి వద్దే మూడుసార్లు ఆర్టీ–పీసీఆర్ టెస్టులు చేయించుకోవాల్సిందిగా బీసీసీఐ ఆదేశించింది. అందులో ప్రతీసారి నెగెటివ్ అని తేలితేనే ఈ నెల 19 నుంచి ఆరంభమయ్యే క్వారంటైన్‌కు అనుమతి లభిస్తుందని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు. క్వారంటైన్ పూర్తయ్యాక జూన్ 2న ఇంగ్లండ్‌కు భారత జట్టు పయనం కానుంది. ఈ పర్యటనలో పాల్గొనే భారత ఆటగాళ్లందరూ ఇప్పటికే కోవిడ్–19 వ్యాక్సిన్ తొలి డోస్ వేయించుకోగా... రెండో డోస్‌ను ఇంగ్లండ్‌లో తీసుకునేలా బీసీసీఐ ఏర్పాట్లు చేయనుంది. సాహా, ప్రసి«ధ్ కృష్ణల పరిస్థితేంటి? ఐపీఎల్ బయో బబుల్‌లో ఉంటూ కరోనా పాజిటివ్‌గా తేలిన సన్‌రైజర్స్ ఆటగాడు వృద్ధిమాన్ సాహా, తన ఇంటికి చేరుకున్నాక వైరస్ బారిన పడ్డ ప్రసి«ధ్ కృష్ణల పరిస్థితి అయోమయంగా ఉంది. అందుకు కారణం వారికి ఇంకా నెగెటివ్ రిపోర్టు రాకపోవడమే. సాహా రెండో వికెట్ కీపర్‌గా ఇంగ్లండ్‌కు వెళ్లే జట్టులో స్థానం పొందగా... స్టాండ్ బై బౌలర్‌గా ప్రసిధ్ ఎంపికయ్యాడు. తాజాగా సాహాకు నిర్వహించిన రెండు కరోనా పరీక్షల్లో ఒక దాంట్లో నెగెటివ్ అని మరో దాంట్లో పాజిటివ్ అని తేలింది. దాంతో అతను క్వారంటైన్‌లోనే మరికొన్ని రోజులు ఉండాల్సి ఉంది. ప్రసి«ధ్ కూడా ఇంకా తన క్వారంటైన్‌ను పూర్తి చేయలేదు. మే 25లోపు వీరిద్దరూ ముంబైలో రిపోర్ట్ చేయాల్సి ఉంది. లేకపోతే ఇంగ్లండ్ పర్యటనకు దూరమయ్యే అవకాశం ఉంది. వ్యాక్సిన్ వేసుకునేందుకు భయపడ్డారు ఐపీఎల్‌కు సంబంధించిన మరో విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వ్యాక్సిన్‌పై అపో హలతో పలువురు భారత క్రికెటర్లు వ్యాక్సిన్ తీసుకోవడానికి భయపడ్డారని సమాచారం. సీజన్ ఆరంభానికంటే ముందుగా పలు ఫ్రాంచైజీలు వ్యాక్సిన్ డోస్‌లను ఏర్పాటు చేస్తామని తమ ఆటగాళ్లకు తెలియజేసినా... వాటిని వేయించుకోవడానికి నిరాకరించినట్లు తెలిసింది. టీకా తీసుకుంటే జ్వరం వస్తుందనే భావనలో కొందరు... బయో బబుల్‌లో ఉండగా వ్యాక్సిన్ ఎందుకని మరి కొందరు వాటికి దూరంగా ఉన్నట్లు తెలిసింది. ప్లేయర్లు వ్యాక్సిన్‌పై అయిష్టతతో ఉండటంతో... తప్పనిసరిగా వ్యాక్సిన్ తీసుకోవాలంటూ వారిపై ఫ్రాంచైజీ యాజమాన్యాలు కూడా ఒత్తిడి చేయలేకపోయాయని సమాచారం. మైక్ హస్సీకి ఊరట... కరోనా నుంచి కోలుకున్న చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటింగ్ కోచ్ మైక్ హస్సీకి ఊరట లభించింది. కరోనా నేపథ్యంలో భారత్ నుంచి వచ్చే విమానాలపై ఆస్ట్రేలియా ప్రభుత్వం విధించిన నిషేధం ఈ నెల 15వ తేదీతో ముగిసింది. దాంతో హస్సీ ఆస్ట్రేలియాకు ఇక్కడి నుంచి నేరుగా వెళ్లే అవకాశం ఉంది. -
విదేశాల నుంచి వచ్చేవారికి కోవిడ్ టెస్ట్ తప్పనిసరి
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని అన్ని ఎయిర్‌పోర్టుల్లో కోవిడ్ నిర్ధారణకు ఆర్టీపీసీఆర్ పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు కోవిడ్ పరీక్షలు తప్పనిసరిగా చేయాలన్న నిబంధన విధించింది. ఎయిర్‌పోర్టు అథార్టీ ఆఫ్ ఇండియా ఆదేశాల మేరకు రాష్ట్ర స్థాయి క్వారంటైన్ గైడ్‌లైన్స్‌ను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. దీని ప్రకారం కోవిడ్ లక్షణాలతో విదేశాల నుంచి వచ్చిన ప్రయాణికులు విధిగా 14 రోజుల పాటు క్వారంటైన్ కేంద్రాల్లో ఉండాలి. మిగిలిన వారు హోమ్ క్వారంటైన్లో ఉండాల్సి ఉంటుంది. అలాగే రాష్ట్రం నుంచి విదేశాలకు వెళ్లే ప్రయాణికులు 72 గంటల ముందు కోవిడ్ నెగెటివ్ ధ్రువీకరణ పత్రాన్ని ఇవ్వాల్సి ఉంటుంది. దేశీయ ప్రయాణికులకు థర్మల్ స్క్రీనింగ్ తప్పనిసరిగా నిర్వహించాలని నిబంధనల్లో ప్రభుత్వం పేర్కొంది. చదవండి: ఆటలే అస్త్రాలు: కరోనాతో ‘ఆడుకుంటున్నారు..’ కరోనా కట్టడికి ఏపీ బాటలో ఇతర రాష్ట్రాలు -
WTC FInal: భారత్‌కు ‘సన్నద్ధతలేమి’ సమస్య కాదు
న్యూఢిల్లీ: న్యూజిలాండ్‌తో జూన్ 18 నుంచి జరిగే వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్‌కు ముందు సరైన రీతిలో సన్నద్ధమయ్యేందుకు భారత జట్టుకు తగినంత సమయం లభించడం లేదు. ఇంగ్లండ్ గడ్డపై అడుగు పెట్టిన తర్వాత ఉండే క్వారంటైన్ నిబంధనలు, ఆంక్షలే అందుకు కారణం. అయితే ఇది మరీ పెద్ద సమస్య ఏమీ కాదని జట్టు ఫీల్డింగ్ కోచ్ ఆర్.శ్రీధర్ అభిప్రాయపడ్డాడు. మన ఆటగాళ్లకు ఉన్న అనుభవంతో దానిని అధిగమించవచ్చని అతను చెప్పాడు. ‘ఇంగ్లండ్ వెళ్లిన తర్వాత హార్డ్ క్వారంటైన్ ఎన్ని రోజులు? సాఫ్ట్ క్వారంటైన్ ఎన్ని రోజులు? ఇలా అన్ని అంశాలు చూసిన తర్వాతే సన్నద్ధతపై స్పష్టత రావచ్చు. అయితే మాకు ఎంత సమయం దొరికినా దానిని పూర్తిగా వినియోగించుకోవడానికి ప్రయత్నిస్తాం. మాకు ఎన్ని సెషన్లు ప్రాక్టీస్‌కు అవకాశం లభిస్తుందో చెప్పలేం. ఇంతకుమించి మరో ప్రత్యామ్నాయం కూడా లేదు. అయితే మన జట్టులో ఆటగాళ్లంతా అనుభవజ్ఞులే. ఇలాంటి స్థితిలో అదే అవసరం. వారంతా పరిస్థితులకు తగినట్లుగా తమను తాము మార్చుకోగలరు. వారంతా న్యూజిలాండ్‌లోనూ ఇంగ్లండ్‌లోనూ కూడా ఆడారు’ అని శ్రీధర్ విశ్లేషించాడు. అయితే ఎక్కువగా సన్నద్ధం కాకపోవడం కూడా కొన్నిసార్లు మేలు చేస్తుందని శ్రీధర్ అభిప్రాయం వ్యక్తం చేశాడు. ఆటగాళ్లు మానసికంగా ప్రశాంతంగా ఉండేందుకు ఇది ఉపకరిస్తుందని అతను చెప్పాడు. వారికి కొంత అనుకూలత: భరత్ అరుణ్ భారత్‌తో డబ్ల్యూటీసీ ఫైనల్‌కు ముందు ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌లో తలపడనుండటం న్యూజిలాండ్‌కు అదనపు ప్రయోజనాన్ని ఇస్తుందనడంలో సందేహం లేదని టీమిండియా బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్ అన్నాడు. అయితే తాము దేనికైనా సిద్ధంగా ఉండాలని అతను చెప్పాడు. ‘ఇంగ్లండ్‌లోని పరిస్థితులకు అలవాటు పడతారు కాబట్టి కచ్చితంగా వారికి కొంత అనుకూలత ఉంటుంది. షెడ్యూల్ అలా ఉంది కాబట్టి మనమేమీ చేయలేం. దాని ప్రకారమే ప్రణాళిక రూపొందించుకోవాలి. ఇంగ్లండ్‌తో సిరీస్‌లో న్యూజిలాండ్ ఎలా ఆడుతుందో చూడటం ఎంతో అవసరం. దానిని బట్టే మన వ్యూహాలు తయారు చేసుకోవాల్సి ఉంది’ అని అరుణ్ వ్యాఖ్యానించాడు. చదవండి: WTC Final: అతడు ఫాంలో ఉంటే భారత్‌దే గెలుపు! -
సకుటుంబ సమేతంగా...
ముంబై: సుమారు మూడున్నర నెలల సుదీర్ఘ ఇంగ్లండ్ పర్యటన కోసం భారత క్రికెట్ జట్టు జూన్ 2న బయలుదేరనుంది. దానికి ముందు ముంబైలో ఆటగాళ్లంతా ఎనిమిది రోజులపాటు ‘హార్డ్ క్వారంటైన్’లో ఉంటారు. ఇంగ్లండ్ చేరిన తర్వాత పది రోజులు తమను ‘సాఫ్ట్ క్వారంటైన్’కు అనుమతించాలని ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు (ఈసీబీ)కి విజ్ఞప్తి చేయనున్న బీసీసీఐ... దీనిపై ఇంకా చర్చలు కొనసాగిస్తోంది. హార్డ్ క్వారంటైన్లో ఆటగాళ్లు పూర్తిగా తమ హోటల్ గదులకే పరిమితం కావాల్సి ఉంటుంది. సహచర ఆటగాళ్లను కూడా కలిసేందుకు వీలుండదు. సాఫ్ట్ క్వారంటైన్లో ఆటగాళ్లంతా కలిసి సాధన చేసుకునేందుకు (ఆస్ట్రేలియా సిరీస్ తరహాలో) అవకాశం ఉంటుంది. ‘భారత్‌లోనే మనవాళ్లు హార్డ్ క్వారంటైన్లో ఉండబోతున్నారు. రెండో, నాలుగో, ఏడో రోజుల్లో ఆర్టీ–పీసీఆర్ పరీక్షల్లో నెగెటివ్‌గా తేలితేనే వారిని విమానం ఎక్కనిస్తాం. ఇలా అయితే బబుల్లోంచి మరో బబుల్‌లోకి ప్రవేశిస్తాం కాబట్టి క్వారంటైన్ రోజులను తగ్గించే విషయంపై కూడా సంప్రదింపులు జరుపుతున్నాం. ఎలాగూ ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్ మ్యాచ్ వేదిక అయిన ఏజియన్ బౌల్లో భాగంగానే హోటల్ హిల్టన్ ఉంది కాబట్టి సమస్య లేదు’ అని బీసీసీఐ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. క్వారంటైన్ ముగిసిన తర్వాతే జూన్ 13 నుంచి క్రికెటర్లు బయటకు వెళ్లేందుకు అనుమతిస్తారు. మరోవైపు సుదీర్ఘ పర్యటన కాబట్టి క్రికెటర్ల కుటుంబ సభ్యులను అనుమతించాలని బోర్డు నిర్ణయించింది. అయితే జూన్ 18 నుంచి జరిగే డబ్ల్యూటీసీ ఫైనల్‌కు ముందునుంచే ఆటగాళ్ల భార్యాపిల్లలను అనుమతిస్తారా లేక ఆగస్టు 4 నుంచి ఇంగ్లండ్‌తో జరిగే టెస్టు సిరీస్‌కు ముందు మాత్రమే వారిని అనుమతిస్తారా అనే విషయంపై ఇంకా స్పష్టత లేదు. డబ్ల్యూటీసీ ఫైనల్‌కు బీసీసీఐ అధ్యక్ష, కార్యదర్శులు సౌరవ్ గంగూలీ, జై షా హాజరయ్యే అవకాశం ఉంది. ఐపీఎల్లో మిగిలిన 31 మ్యాచ్‌ల నిర్వహణ విషయంలో ఈసీబీతో వీరిద్దరు చర్చించే అవకాశం కూడా ఉంది. శ్రీలంకలో అవకాశం ఉందా? ఐపీఎల్‌ను తమ దేశంలో నిర్వహించేందుకు గత ఏడాది కూడా తీవ్రంగా ప్రయత్నించి శ్రీలంక క్రికెట్ బోర్డు విఫలమైంది. ఈసారైనా మిగిలిన మ్యాచ్‌లు నిర్వహించాలని ఆసక్తిగా ఉంది. అధికారికంగా బీసీసీఐకి ఇంకా ఎలాంటి విజ్ఞప్తి చేయకపోయినా... బోర్డు మేనేజ్మెంట్ కమిటీ చైర్పర్సన్ అర్జున డిసిల్వా మాత్రం తాము సెప్టెంబర్‌లో నిర్వహించగలమని నమ్మకంగా చెబుతున్నాడు. ప్రస్తుతం శ్రీలంకతో లీగ్ టోర్నీ నిర్వహణకు అవసరమైన ఫ్లడ్‌లైటింగ్‌తో నాలుగు మైదానాలు (ఖెట్టరమా, పల్లెకెలె, సూర్యవేవా, దంబుల్లా) అందుబాటులో ఉన్నాయి. అయితే అనూహ్యంగా ఇటీవలే లంకలో కూడా కరోనా కేసులు పెరుగుతుండటం ప్రతికూలాంశం. నెలరోజుల క్రితం అక్కడ రోజుకు 300 కేసులు రాగా... ఇప్పుడు రోజుకు 2 వేల కేసులు నమోదవుతున్నాయి. ఇంగ్లండ్‌లో నిర్వహించండి: పీటర్సన్ ఐపీఎల్–2021లో మిగిలిన మ్యాచ్‌లను యూఏఈలో నిర్వహించడంకంటే ఇంగ్లండ్ సరైన వేదిక అని ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ కెవిన్ పీటర్సన్ అభిప్రాయపడ్డాడు. ‘సెప్టెంబర్ చివర్లో ఐపీఎల్ నిర్వహించేందుకు యూఏఈ సరైన వేదిక అని చాలా మంది చెబుతున్నారు. కానీ ఆ సమయంలో ఇంగ్లండ్‌లో వాతావరణం చాలా బాగుంటుంది. మాంచెస్టర్, లీడ్స్, బర్మింగ్‌హామ్, లార్డ్స్, ఓవల్ మైదానాలను ఉపయోగించుకోవచ్చు. ప్రేక్షకులను కూడా అనుమతిస్తే అద్భుతంగా ఉంటుంది. ఐపీఎల్ ఇప్పటికే యూఏఈ, దక్షిణాఫ్రికాలలో జరిగింది కాబట్టి ఈసారి ఇంగ్లండ్‌లో నిర్వహిస్తే బాగుంటుంది. ఒక్కసారి భారత్, ఇంగ్లండ్ సిరీస్ ముగిసిందంటే అగ్రశ్రేణి ఆటగాళ్లంతా అక్కడే అందుబాటులో ఉంటారు కూడా’ అని పీటర్సన్ విశ్లేషించాడు. -
ఇక్కడే బబుల్ ఏర్పాటు చేద్దాం: బీసీసీఐ
ముంబై: ఇంగ్లండ్‌లో అడుగు పెట్టిన తర్వాత నిబంధనల ప్రకారం భారత జట్టు రెండు వారాల తప్పనిసరిగా కఠిన క్వారంటైన్లో ఉండాల్సిందే. దీని ప్రకారం ఎవరూ సహచర ఆటగాళ్లను కూడా కలవరాదు. అయితే ఈ విషయంలో ఏదైనా సడలింపులు కోరాలని బీసీసీఐ భావిస్తోంది. ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లినప్పుడు సిడ్నీలో టీమిండియా సభ్యులు క్వారంటైన్లో ఉన్నా కలిసి ఆడుకునేందుకు అనుమతినిచ్చారు. ఇంగ్లండ్‌లో ఒక వారం మాత్రమే క్వారంటైన్ ఉండేలా అనుమతించాలని బోర్డు కోరనుంది. దానికంటే ముందు భారత్‌లోనే ఒక వారం రోజుల పాటు ‘ప్రత్యేక బయో బబుల్’ ఏర్పాటు చేయాలని అనుకుంటోంది. ఎలాగూ విమానాలు లేవు కాబట్టి క్రికెటర్లంతా ప్రత్యేక విమానంలోనే వెళ్లాల్సి ఉంది. అలాంటప్పుడు ఇక్కడి బబుల్ నుంచి మరో బబుల్‌లోకి మారడం సులువవుతుంది. ఆటగాళ్లకు దీనివల్ల కొంత అదనపు సమయం లభిస్తుందని బీసీసీఐ చెబుతోంది. అయితే గత ఏడాదితో పోలిస్తే ఇప్పుడు పరిస్థితులు మరింత తీవ్రంగా ఉండటంతో పాటు ఐపీఎల్ బబుల్ బద్దలైన తీరు చూస్తే బీసీసీఐకి అంత సులువుగా అనుమతి లభించకపోవచ్చు. -
Hyderabad: కరోనా రోగుల ఇంటి వద్దకే ఫ్రీ ఫుడ్ డెలివరీ
సాక్షి, హైదరాబాద్: కరోనా మొదటివేవ్ లాక్డౌన్ సమయంలో అవసరమైన ప్రతి ఒక్కరికీ ఆహారం, సరుకులు పంపిణీ చేసిన రాష్ట్ర పోలీసులు, మరో బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కరోనా సోకి హోం ఐసో లేషన్‌లో ఉన్న వ్యక్తుల ఇంటి వద్దకే ఆహారం ఉచిత సరఫరా చేపట్టారు. సేవా ఆహార్ పేరుతో సత్యసాయి సేవా సంస్థ, హోప్ స్వచ్ఛంద సంస్థతో కలిసి గురువారం నుంచి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. స్విగ్గీ, బిగ్ బాస్కెట్ వంటి ఫుడ్ డెలివరీ సంస్థలు ఇందుకు సహకారం అందిస్తున్నాయి. ప్రస్తుతానికి ఈ సేవలు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే కొనసాగించనున్నారు. దాతలు, ఫుడ్ డెలివరీ సంస్థలు ముందుకు వస్తే త్వరలోరాష్ట్రవ్యాప్తంగా విస్తరించనున్నారు. కరోనా బారినపడి ఇంటికే పరిమితమై, బయటికి రాలేని వారికోసం ఈ సేవలు అందిస్తున్నారు. రెండు విధాలుగా ఆర్డర్ ఈ సేవా ఆహార్ పథకంలో రెండు రకాలుగా ఉచిత ఆహారం కోసం ఆర్డర్ చేయవచ్చు. మొదటిది 7799616163 ఫోన్ నంబర్‌కు వాట్సాప్‌లో ఉదయం 7 గంటల్లోగా ఆర్డర్ చేయాలి. ఏడింటి తరువాత చేస్తే దాన్ని మరుసటి రోజు ఆర్డర్ కింద పరిగణిస్తారు. సేవా ఆహార్ యాప్ ద్వారా కూడా ఆర్డర్ చేయవచ్చు. ఈ యాప్‌ను ఆండ్రాయిడ్, ఐఓఎస్ ఫోన్ల వినియోగదారులు ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ యాప్ రెండురోజుల్లో అందుబాటులోకి రానుంది. ఆర్డర్ సమయంలో రోగి పేరు, నివసిస్తున్న ప్రాంతం, కాంటాక్ట్ నంబర్, ఇంట్లో ఎందరు పాజిటివ్ అయ్యారు? తదితర వివరాలను పంపాలి. వీరికి ఐదురోజుల పాటు ఉచితంగా ఆహారం అందజేస్తారు. ఇలా రోజుకు 1,000 నుంచి గరిష్టంగా 2,000 మందికి నాణ్యమైన ఆహారాన్ని సరఫరా చేస్తారు. ఇందులో వృద్ధులు, చిన్నారులకు ప్రాధాన్యం ఇస్తారు. గతేడాది డీజీపీ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసిన పోలీసు ఉన్నతాధికారులు రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మందికి సరుకులు, ఆహారం అందజేశారు.కాగా సేవా ఆహార్ కార్యక్రమాన్ని సత్యసాయిసేవా సంస్థతో పాటు విమెన్ సేఫ్టీ వింగ్ చీఫ్, ఏడీజీ స్వాతీ లక్రా, డీఐజీ బడుగుల సుమతి పర్యవేక్షిస్తున్నారు. ఇందుకు సంబంధించిన పోస్టర్ విమెన్ సేఫ్టీ వింగ్ కార్యాలయంలో గురువారం ఆవిష్కరించారు. -
యుగానికి ఒక్కడు హీరోయిన్‌కు కరోనా
కరోనా సెకండ్ వేవ్‌లో ఇప్పటికే పలువురు తారలకు పాజిటివ్ వచ్చింది. తాజాగా నటి ఆండ్రియా కరోనా బారిన పడ్డారు. వైద్యుల సలహా మేరకు ఆమె ప్రస్తుతం హోమ్ క్వారంటైన్లో ఉన్నారు. ‘యుగానికి ఒక్కడు, విశ్వరూపం, తడాఖా, గృహం’ వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల్లోనూ మంచి గుర్తింపు పొందారు ఆండ్రియా. నటిగానే కాదు.. గాయనిగా కూడా ఆండ్రియాకి మంచి గుర్తింపు ఉంది. చదవండి: తండ్రి ఓటమిపై శృతిహాసన్ కామెంట్స్ వైరల్ -
భార్యను కలిసేందుకు క్వారంటైన్ నుంచి పరార్.. చివరికి!
ముంబై: కరోనా మొదటి దశ కంటే రెండో దశ తీవ్రంగా హడలెత్తిస్తోంది. దేశంలోని పాజిటివ్ కేసుల సంఖ్య, మరణాలు చూస్తుంటే మరింత ఆందోళన రేకెత్తిస్తోంది. ఆస్పత్రుల్లో బెడ్లు దొరక్క ఆక్సిజన్ అందుబాటులో లేక కరోనా బాధితులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరికొంతమందైతే క్వారంటైన్ సెంటర్ లేదా ఇళ్లల్లోనే చికిత్స తీసుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వ్యక్తి భార్యను కలుసుకునేందుకు క్వారంటైన్ కేంద్రం నుంచి తప్పించుకున్నాడు. వివరాల్లోకి వెళితే.. మహారాష్ట్రకు చెందిన షాబుల్లా ఖాన్ అనే వివిధ దొంగతనం కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. ఇటీవల పోలీసులు ఇతన్ని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం కోవిడ్ టెస్టులు నిర్వహించగా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో అతన్నిబొరివలిలోని సాయినగర్ ప్రాంతంలోని క్వారంటైన్ కేంద్రానికి తరలించారు. రెండు రోజుల్లో తాను దిగ్బంధం కేంద్రం నుంచి తప్పించుకుంటామని నిందితులు పోలీసులను సవాలు చేశారు. అన్నట్టుగానే క్వారంటైన్ సెంటర్లో వైర్లు కత్తిరించి అక్కడి నుంచి పరారయ్యాడు. వెంటనే అప్రమత్తమైన కండివాలి పోలీసులు 24 గంట్లోనే నిందితుడిని ముంబైలోని ఒషివర ప్రాంతంలో అరెస్ట్ చేశారు. భార్యను కలుసుకునేందుకే తాను పారిపోయానని నిందితుడు చెప్పుకొచ్చాడు. ఇక నిందితుడిపై ఫార్మసీల నుంచి రెమిడిసివిర్ మందులను చోరీ చేశాడనే ఆరోపణలున్నాయి. చదవండి: కరోనా: బాధను పంచుకుంటే తప్పేంటి? సుప్రీం ఫైర్ -
కరోనా నుంచి కోలుకున్న కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం క్వారంటైన్లో భాగంగా ఫామ్‌హౌస్‌లో ఉంటున్నారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ వ్యక్తిగత వైద్యులు డాక్టర్ ఎంవీ రావు రాపిడ్ టెస్ట్‌లో ముఖ్యమంత్రికి కోవిడ్ నెగిటివ్ వచ్చినట్లు తెలిపారు. ఫామ్‌హౌస్‌లో ఐసోలేషన్‌లో ఉన్న కేసీఆర్‌కు బుధవారం ఎంవీ రావు అధ్వర్యంలో వైద్య పరీక్షలు నిర్వహించారు. రాపిడ్ యాంటీజెన్‌తో పాటు ఆర్టీపీసీఆర్ టెస్ట్‌లు చేశారు. ఈ క్రమంలో రాపిడ్ టెస్ట్‌లో కోవిడ్ నెగిటివ్‌గా రిపోర్టు వచ్చినట్లు వైద్యం బృందం వెల్లడించింది. ఆర్టీపీసీఆర్ పరీక్షా ఫలితాలు గురువారం రానున్నట్లు తెలిపారు. చదవండి: కరోనా మరణాలన్నీ ప్రభుత్వ హత్యలే: బండి సంజయ్ -
క్వారంటైన్లో మహేశ్‌బాబు, ప్రభాస్, రామ్‌చరణ్
హోమ్ క్వారంటైన్లో ఉంటున్నారు హీరో మహేశ్‌బాబు, ప్రభాస్, రామ్‌చరణ్. ఫ్యాన్స్ కంగారుపడాల్సిన అవసరంలేదు. ఇంతకీ విషయం ఏంటంటే... ‘సర్కారువారి పాట’ సినిమా షూటింగ్ సమయంలో చిత్రబృందంలోని ఐదుగురికి కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో ఈ సినిమా షూటింగ్‌ను నిలిపివేశారు. అయితే కోవిడ్ బారినపడ్డ ఐదుగురిలో మహేశ్‌బాబు వ్యక్తిగత సహాయకుడు ఉన్నారట. దీంతో ఫ్యామిలీ డాక్టర్ సూచన మేరకు మహేశ్ క్వారంటైన్లోకి వెళ్లారని తెలిసింది. కేవలం మహేశ్ మాత్రమే కాదు.. ప్రభాస్, రామ్‌చరణ్‌లు కూడా హోమ్ క్వారంటైన్లో ఉన్నారు. మొన్నటివరకు ‘రాధేశ్యామ్’ సినిమా షూటింగ్లో పాల్గొన్నారు ప్రభాస్. కాగా ప్రభాస్ మేకప్‌మ్యాన్‌కు కూడా కరోనా పాజిటివ్. దీంతో ఆయన హోమ్ క్వారంటైన్లోకి వెళ్లారని తెలిసింది. అలాగే ఇటీవల సోనూ సూద్‌కు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిన విషయం తెలిసిందే. ఈ మధ్య ఆయన ‘ఆచార్య’ షూటింగ్లో పాల్గొన్నారు. రామ్‌చరణ్, సోనూలపై సన్నివేశాలను చిత్రీకరించారు. అలాగే చిరంజీవి, చరణ్ సహాయకుల్లో ఒకరికి కరోనా అట. దీంతో వైద్యుల సూచన మేరకు రామ్‌చరణ్ కూడా క్వారంటైన్లో ఉంటున్నారని సమాచారం. ఇలా ముగ్గురు టాప్ హీరోలు హోమ్ క్వారంటైన్లో ఉండటం తెలుగు పరిశ్రమలో చర్చనీయాంశమైంది. -
స్వీయ నిర్బంధంలోకి ఢిల్లీ సీఎం కేజ్రీవాల్
-
స్వీయ నిర్బంధంలోకి ఢిల్లీ సీఎం: ఎందుకంటే?
సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధాని నగరం ఢిల్లీలో రెండో దశలో కరోనా తీవ్రంగా వ్యాపిస్తోంది. రోజుకు 25వేలకు పైగా కేసులతో నగరవాసులను బెంబేలెత్తిస్తోంది. ఈ నేపథ్యంలోనే కరోనా విస్తరణను అడ్డుకునేందుకు ఏప్రిల్ 26 వరకు ఢిల్లీలో లాక్డౌన్ విధించింది అక్కడి ఆప్ సర్కార్. అయితే ఢిల్లీలో కరోనా మహమ్మారి పరిస్థితులను ఎప్పటికపుడు సమీక్షిస్తూ, ప్రజలకు భరోసా ఇస్తున్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ స్వయంగా స్వీయం నిర్బంధంలోకి వెళ్లిపోయారు. ఎందుకంటే కేజ్రీవాల్ సతీమణి సునీత తాజాగా కోవిడ్-19బారిన పడ్డారు. దీంతో ఢిల్లీ సీఎం హోం క్వారంటైన్లోకి వెళ్లారు. (కరోనా విలయం: ఢిల్లీలో లాక్డౌన్) కాగా కరోనా ఉధృతి నేపథ్యంలో ప్రస్తుతం ఢిల్లీలో వారం రోజులు లాక్డౌన్ కొనసాగుతోంది. ఢిల్లీ ప్రజల ఆరోగ్యం, రక్షణ కోసమే లాక్డౌన్ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని ఢిల్లీసీఎ ప్రకటించారు. గత ఏడాది జూన్‌లో జ్వరం, గొంతు నొప్పి లాంటి లక్షణాలతో కేజ్రీవాల్ కరోనా పరీక్షలు చేయించుకోగా నెగిటివ్ వచ్చిన సంగతి తెలిసిందే. -
తల్లి రొయ్యలకూ.. ఓ క్వారంటైన్ సెంటర్
సాక్షి, అమరావతి: రొయ్యల కోసం క్వారంటైన్ కేంద్రం ఏర్పాటు కాబోతుంది. విశాఖ జిల్లా నక్కపల్లి మండలం బంగారమ్మపేట వద్ద ఏర్పాటు చేయతలపెట్టిన ఆక్వాటిక్ క్వారంటైన్ ఫెసిలిటీ సెంటర్ కోసం రంగం సిద్దమైంది. 2023 నాటికి ఈ కేంద్రం సేవలు అందుబాటులోకి తీసుకొచ్చేలా ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. రొయ్యల సాగు చేపట్టాలంటే నాణ్యమైన సీడ్ (రొయ్య పిల్ల) చాలా ముఖ్యం. నాణ్యమైన సీడ్ కావాలంటే జన్యుపరమైన సమస్యలు, రోగాల్లేని బ్రూడర్స్ (తల్లి రొయ్యలు) అవసరం. ఆర్గనైజేషన్ ఫర్ ఇంటర్నేషనల్ ఎపిడ్యూజిస్ (ఓఐఈ) గుర్తించిన 8 రకాల వ్యాధులు బ్రూడర్స్ ద్వారా వాటి సంతతికి సంక్రమించవని నిర్ధారించేందుకు నిర్వహించే పరీక్షల్లో నెగిటివ్ అని వస్తేనే బ్రూడర్స్‌ను సీడ్ ఉత్పత్తికి అనుమతిస్తారు. దేశం మొత్తం చెన్నైకి క్యూ యానిమల్ ఇంపోర్ట్ యాక్ట్–1898 ప్రకారం విదేశాల నుంచి ఏ రకం లైవ్ స్టాక్ (జీవాల)ను దిగుమతి చేసుకున్నా.. వాటిద్వారా వాటి సంతతికి, మానవాళి సహా ఇతర జీవ రాశులకు ఎలాంటి రోగాలు సోకవని నిర్ధారించుకునేందుకు వాటిని క్వారంటైన్ చేయాల్సిందే. అదేవిధంగా విదేశాల నుంచి దిగుమతి చేసుకునే తల్లి రొయ్యలను కూడా క్వారంటైన్లో ఉంచి పరీక్షిస్తారు. ఇలా పరీక్షించేందుకు ఇప్పటివరకు దేశవ్యాప్తంగా చెన్నైలో మాత్రమే ఆక్వా క్వారంటైన్ ఫెసిలిటీ సెంటర్ ఉంది. దీన్ని మెరైన్ ప్రోడక్స్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ (ఎంపెడా), రాజీవ్‌గాంధీ సెంటర్ ఫర్ ఆక్వాకల్చరిక్స్ (ఆర్జీసీఏ) నిర్వహిస్తున్నాయి. ఏపీతో సహా దేశంలోని ఆక్వా హేచరీలన్నీ ఈ కేంద్రానికి క్యూ కట్టాల్సిందే. ఇక్కడ 400 తల్లి రొయ్యలను ఒక క్యారంటైన్ క్యూబికల్లో ఉంచి ఐదారురోజుల పాటు వివిధ రకాల పరీక్షలు నిర్వహిస్తారు. ఒక క్వారంటైన్ క్యూబికల్‌కి డిమాండ్‌ను బట్టి రూ.95 వేల నుంచి రూ.1.25 లక్షల వరకు వసూలు చేస్తారు. ఏటా 1.50 లక్షల బ్రూడర్స్ దిగుమతి రొయ్య పిల్లల్ని ఉత్పత్తి చేసే హేచరీలు దేశవ్యాప్తంగా మొత్తం 560 ఉంటే.. వాటిలో 389 హేచరీలు ఒక్క ఏపీలోనే ఉన్నాయి. ఇక్కడ ఏటా 65 వేల మిలియన్ల సీడ్ ఉత్పత్తి అవుతోంది. ఇందుకోసం ఏటా సింగపూర్, హవాయ్, ఫ్లోరిడా తదితర ప్రాంతాల నుంచి 1.50 లక్షల బ్రూడర్స్‌ను హేచరీలు దిగుమతి చేసుకుంటాయి. వీటిని క్వారంటైన్ చేసేందుకు ఏటా రూ.కోట్లలో ఖర్చు చేస్తుంటారు. దేశం మొత్తమ్మీద ఒకే ఒక్క క్యారంటైన్ కేంద్రం ఉండటంతో సకాలంలో క్వారంటైన్ పూర్తికాక, సీజన్‌కు నాణ్యమైన సీడ్ ఉత్పత్తి చేయలేని పరిస్థితి నెలకొంది. మరోవైపు అదును దాటిపోతుందన్న ఆందోళనతో నాసిరకం సీడ్‌పై ఆధారపడి ఆక్వా రైతులు తీవ్ర నష్టాల పాలవుతున్నారు. ఈ పరిస్థితికి చెక్ పెట్టేందుకు విశాఖ జిల్లా నక్కపల్లి మండలం బంగారమ్మపేట వద్ద ఆక్వాటిక్ క్వారంటైన్ ఫెసిలిటీ సెంటర్ ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. ఇందుకోసం 30 ఎకరాలను సేకరించారు. దీని నిర్మాణానికి రూ.36.55 కోట్లను కేటాయించి ఇటీవలే టెండర్లు ఖరారు చేశారు. దీనిని 2023 నాటికి అందుబాటులోకి తీసుకురానున్నారు. నాణ్యమైన సీడ్ ఉత్పత్తే లక్ష్యం నాణ్యమైన సీడ్ ఉత్పత్తి చేయడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తోంది. దేశంలో ఇది రెండో క్వారంటైన్ కేంద్రం. ఏడాదికి 1,23,750 బ్రూడర్స్‌ను పరీక్షించే సామర్ధ్యం ఈ కేంద్రానికి ఉంటుంది. ఒకేసారి 625 తల్లి రొయ్యలను పరీక్షించవచ్చు. వీటిద్వారా 10 బిలియన్ల సీడ్‌ను ఉత్పత్తి చేయొచ్చు. ఆక్వా సాగు విస్తరణకు ఈ కేంద్రం ఎంతగానో దోహదపడుతుంది. – కె.కన్నబాబు, కమిషనర్, మత్స్యశాఖ -
హోమ్ క్వారంటైన్‌కు పవన్‌కల్యాణ్
సాక్షి, అమరావతి: జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ వ్యక్తిగత, భద్రతా సిబ్బందిలో ఎక్కువ మంది కరోనా బారిన పడడంతో ముందు జాగ్రత్తగా డాక్టర్ల సూచనలతో ఆయన హోమ్ క్వారంటైన్‌కు వెళ్లినట్టు ఆ పార్టీ మీడియా విభాగం ఒక ప్రకటనలో పేర్కొంది. డాక్టర్ల సూచనతో ఆయన ప్రశాంత వాతావరణంలో ఉంటున్నారని, రోజువారీ విధులు నిర్వహిస్తూనే పార్టీ కార్యక్రమాలను పరిశీలిస్తున్నారని పేర్కొంది. టెలీకాన్ఫరెన్స్ ద్వారా పార్టీ నాయకులతో మాట్లాడుతున్నారని వివరించింది. -
కరీంనగర్లో అమానుషం: పగవాడికి కూడా ఈ కష్టం వద్దు
సాక్షి, కరీంనగర్: జిల్లాలోని జమ్మికుంటలో అమానుష సంఘటన చోటుచేసుకుంది. కరోనా పాజిటివ్ వచ్చిన మహిళను ఇంట్లోకి రానివ్వలేదు యజమాని. దాంతో మార్కెట్ యార్డ్‌లో తలదాచుకున్నది. ఈ విషయం తెలిసిన మార్కెట్ యార్డు అధికారులు ఆ మహిళను అక్కడి నుంచి వెళ్లగొట్టడంతో ఆదిరించేవారు లేక.. ఎక్కడికి వెళ్లాలో తెలియక.. రోడ్డుపై ఉన్న తోపుడు బండిపై సేదతీరే దుస్థితి ఏర్పడింది. ఈ విషాధకర ఘటన వివరాలు.. జమ్మికుంట అంబేడ్కర్ కాలనీలో అద్దె ఇంట్లో నివాసం ఉంటూ కూరగాయలు విక్రయించి జీవనం సాగించే మహిళ కరోనా బారిన పడింది. విషయం తెలిసిన ఇంటి యజమాని ఆమెను ఇంట్లోకి రానివ్వకపోవడంతో స్థానిక మార్కెట్ యార్డులో రాత్రంతా జాగరణ చేసింది. సదరు మహిళ కోవిడ్ బాధితురాలు అని తేలడంతో మార్కెట్ అధికారులు ఆమెను ఉదయం అక్కడి నుంచి బయటకు పంపేశారు. ఇక ఉండటానికి స్థలం లేక పాత అంబేడ్కర్ చౌరస్తా ప్రాంతంలో సులబ్ కాంప్లెక్స్ ముందు తోపుడు బండి మీద నిస్సహాయ స్థితిలో ఉండిపోయింది. బాధితురాలి గురించి తెలుసుకున్న స్థానిక కాంగ్రెస్ నాయకుడు దిలీప్ ఆమె గురించి వైద్యాధికారులకు సమాచారం అందించడంతో.. వైద్య సిబ్బంది అంబులెన్సులో కరీంనగర్ ఐసోలేషన్ సెంటర్‌కు తరలించారు. రెండు రోజులుగా రోడ్డుపై అవస్థ పడిన మహిళను చూసి చలించిపోయిన స్థానికులు, స్థానికంగా ఐసోలేషన్ హోం క్వారంటైన్ ఏర్పాటు చేయకపోవడం పట్ల విచారం వ్యక్తం చేశారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ ఇలాకలో ఇలాంటి సంఘటన చోటు చేసుకోవడం పట్ల ఆవేదన చెందుతున్నారు. చదవండి: లాక్డౌన్ విధించే ప్రసక్తే లేదు: ఈటల రాజేందర్ -
క్వారంటైన్ పూర్తయిన ఆనందంలో గేల్ ఏం చేశాడో తెలుసా..
ముంబై: విండీస్ విధ్వంసకర యోధుడు, పంజాబ్ కింగ్స్ బ్యాట్స్‌మెన్ క్రిస్ గేల్.. ఏడు రోజుల తప్పనిసరి క్వారంటైన్‌ను పూర్తి చేసుకున్న సందర్భంగా అదిరిపోయిన స్టెప్పులతో అలరించాడు. క్వారంటైన్ పూర్తైన ఆనందంలో అతను మైఖేల్ జాక్సన్ సూపర్ హిట్ 'మూన్ వాక్' సాంగ్‌కు డ్యాన్స్ చేశాడు. యూనివర్సల్ బాస్ చిందేస్తుండగా తీసిన వీడియోను పంజాబ్ కింగ్స్ ట్విటర్లో షేర్ చేయగా, కొద్ది నిమిషాల్లోనే వైరల్‌గా మారింది. కాగా, గేల్.. క్వారంటైన్ సమయంలో కూడా పలు పంజాబీ పాటలకు స్టెప్పులేస్తూ కాలక్షేపం చేశాడు. Quarantine da khatam khel, bahar aa gaye tuhadde favourite - Chris Gayle 🕺🥰#IPL2021 #SaddaPunjab #PunjabKings @henrygayle pic.twitter.com/rrDHPZ3lvQ — Punjab Kings (@PunjabKingsIPL) April 7, 2021 అతను క్వారంటైన్ సమయంలో ఎక్కువ శాతం డ్యాన్స్‌లేస్తూ, జిమ్‌లో వర్కౌట్లు చేస్తూ గడిపాడు. గతేడాది ఐపీఎల్లో లేట్‌గా బరిలోకి దిగినా సూపర్ ఫామ్‌ను కనబర్చిన గేల్.. 7 మ్యాచ్‌ల్లో 137.14 స్ట్రయిక్ రేట్‌తో 288 పరుగులు సాధించాడు. ఇందులో 3 హాఫ్ సెంచరీలు కూడా ఉన్నాయి. ఏప్రిల్ 9 నుంచి ప్రారంభంకానున్న ఐపీఎల్ 14వ సీజన్లో అతను పంజాబ్ కింగ్స్ తరఫున మూడో స్థానంలో బరిలోకి దిగే అవకాశాలున్నాయి. ఏప్రిల్ 12న ముంబై వేదికగా జరిగే మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్‌ను ఢీకొంటుంది. చదవండి: వివో బ్రాండ్ అంబాసిడర్‌గా టీమిండియా కెప్టెన్.. -
పడిక్కల్‌కు పాజిటివ్
బెంగళూరు: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) కష్టకాలం వచ్చింది. ఈ లీగ్‌పై కరోనా వైరస్ పడగ విప్పినట్లుంది. అందుకే ఆటగాళ్లు, గ్రౌండ్ సిబ్బంది, ఈవెంట్ మేనేజర్లు వరుసగా కోవిడ్–19 వైరస్ బారిన పడుతున్నారు. తాజా పరిణామాలు, పాజిటివ్ రిపోర్టులు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. తాజాగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) ఓపెనర్ దేవ్‌దత్ పడిక్కల్‌కి ఈ మహమ్మారి సోకింది. గత నెల 22న అతని నుంచి సేకరించిన నమూనాలను పరీక్షించగా కోవిడ్ పాజిటివ్ రిపోర్టు వచ్చింది. దీంతో 20 ఏళ్ల యువ బ్యాట్స్‌మన్‌ను బెంగళూరులోని తన స్వగృహంలో క్వారంటైన్లో ఉంచారు. క్వారంటైన్ గడువు ముగిశాక వరుసగా రెండు ఆర్టీ–పీసీఆర్ పరీక్షల్లో నెగెటివ్ అని తేలితే అతన్ని బయో బబుల్‌లోకి తీసుకుంటామని ఫ్రాంచైజీ ఒక ప్రకటనలో తెలిపింది. ఆర్సీబీ మెడికల్ టీమ్ అతనితో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతూనే ఉందని అందులో పేర్కొంది. క్వారంటైన్ నేపథ్యంలో పడిక్కల్ ఈ నెల 9న జరిగే సీజన్ తొలి మ్యాచ్‌కు దూరం కానున్నాడు. చెన్నైలో మొదలయ్యే మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌తో ఆర్సీబీ తలపడుతుంది. లీగ్ ప్రారంభం కాకముందే కరోనా బారిన పడ్డ క్రికెటర్ల సంఖ్య మూడుకి చేరింది. నితీశ్ రాణా (కోల్‌కతా నైట్‌రైడర్స్) కరోనా నుంచి కోలుకోగా... అక్షర్ పటేల్ (ఢిల్లీ క్యాపిటల్స్) ఐసోలేషన్‌లో ఉన్నాడు. ముంబై వేదికని మార్చలేదు: రాజీవ్ శుక్లా మహారాష్ట్రలో కోవిడ్ కేసులు పెరుగుతున్నప్పటికీ కట్టుదిట్టమైన ముందు జాగ్రత్తలతో ముందుకెళ్తామని బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా అన్నారు. ‘ముంబై వేదికని మార్చే నిర్ణయం తీసుకోలేదు. షెడ్యూల్ ప్రకారం అక్కడే మ్యాచ్‌లు జరుగుతాయి. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. బయో బబుల్ కూడా ఉంది. కేసుల తీవ్రత పెరిగితే తప్ప స్టాండ్‌బై వేదికలు (హైదరాబాద్, ఇండోర్) పరిశీలించం’ అని శుక్లా తెలిపారు. -
స్మిత్ వచ్చేశాడు...
ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) తాజా సీజన్లో పాల్గొనేందుకు ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ శనివారం ముంబై చేరుకున్నాడు. ప్రొటోకాల్ ప్రకారం ‘బయో బబుల్’లో అడుగు పెట్టిన అతడు ఏడు రోజుల తప్పనిసరి క్వారంటైన్‌ను ముగించుకోవాల్సి ఉంది. అనంతరం స్మిత్ ఢిల్లీ క్యాపిటల్స్ (డీసీ) జట్టుతో చేరతాడు. ‘డీసీ కుటుంబంలోకి స్మిత్‌కు స్వాగతం’ అంటూ స్మిత్ ఉన్న ఫోటోను తమ అధికారిక ట్విట్టర్ ఖాతాలో డీసీ ఫ్రాంచైజీ ట్వీట్ చేసింది. 2020 ఐపీఎల్ ముగిసిన అనంతరం 31 ఏళ్ల స్మిత్‌ను రాజస్తాన్ రాయల్స్ విడుదల చేయగా... ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన వేలంలో అతడిని రూ. 2.2 కోట్లకు డీసీ దక్కించుకుంది. ఈ నెల 10న చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగే తమ తొలి మ్యాచ్‌తో డీసీ ఐపీఎల్ టైటిల్ వేటను ఆరంభించనుంది. -
రెండుసార్లు క్వారంటైన్‌కు వెళ్లిన స్టార్ హీరోయిన్
డబుల్ హోమ్ క్వారంటైన్‌ను ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు హీరోయిన్ ఆలియా భట్. సంజయ్‌లీలా భన్సాలీ దర్శకత్వంలో ఆలియా భట్ టైటిల్ రోల్ చేస్తున్న సినిమా ‘గంగూబాయి కతియావాడి’. ఈ సినిమా షూటింగ్లో దర్శకుడు సంజయ్‌కు కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడంతో ఆలియా కూడా క్వారంటైన్లోకి వెళ్లారు. ఇలా హోమ్ క్వారంటైన్‌ను పూర్తి చేశారో లేదో అలా మరోసారి క్వారంటైన్‌కి వెళ్లారు ఆలియా. ఈసారి ఆలియాకు కరోనా సోకింది. ‘ ‘నాకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. ప్రస్తుతం క్వారంటైన్లో ఉంటున్నాను. అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాను. వైద్యుల సలహాలు పాటిస్తున్నాను. నేను కోలుకోవాలని ఆశిస్తున్న అందరికీ ధన్యవాదాలు’’ అని పేర్కొన్నారు ఆలియా. ఇలా డబుల్ హోమ్ క్వారంటైన్లోకి వెళ్లారు ఆలియా. ఈ సంగతి ఇలా ఉంచితే.. ఆలియా ప్రియుడు రణ్‌బీర్ కపూర్‌కు కూడా ఆ మధ్య కరోనా సోకిన విషయం తెలిసిందే. ఇటీవలే రణ్‌బీర్‌కు నెగటివ్ వచ్చింది. చదవండి : మలైకాకు కోవిడ్ వ్యాక్సిన్ -
వాద్రాకు పాజిటివ్.. క్వారంటైన్లో కుటుంబం
న్యూఢిల్లీ: కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రాకు కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయ్యింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం తామిద్దరు ఢిల్లీలోని వారి నివాసంలో సెల్ఫ్ ఐసోలేషన్‌లో ఉన్నామని ప్రియాంక గాంధీ ట్వీట్ చేశారు. అంతకు ముందు తనకు కోవిడ్ పాజిటివ్‌గా తేలిందని రాబర్ట్ వాద్రా ఫేస్బుక్ వేదికగా ప్రకటించారు. ఎలాంటి లక్షణాలు లేనప్పటికి తనకు పాజిటివ్ వచ్చిందని తెలిపాడు వాద్రా. ఆ తర్వాత ప్రియాంక తన ట్విట్టర్లో ఓ వీడియో పోస్ట్ చేశారు. ‘‘నా భర్తకు కరోనా పాజిటివ్‌గా తేలింది. నేను కూడా టెస్ట్‌లు చేయించుకున్నాను. నాకు నెగిటివ్ అని వచ్చింది. ప్రస్తుతం మేం హోం క్వారంటైన్లో ఉంటున్నాం. అసెంబ్లీ ఎన్నికల దృష్టా నేను అస్సాం, తమిళనాడులో పర్యటించాల్సి ఉంది. అభ్యర్థుల తరఫున ప్రచారం చేయాల్సి ఉంది. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఎక్కడికి రాలేను. ఇందుకు నేను చింతిస్తున్నాను. కాంగ్రెస్ పార్టీ విజయం కోసం మీరు కృషి చేస్తారని ఆశిస్తున్నాను’’ అని ప్రియాంక వీడియోలో తెలిపారు. हाल में कोरोना संक्रमण के संपर्क में आने के चलते मुझे अपना असम दौरा रद्द करना पड़ रहा है। मेरी कल की रिपोर्ट नेगेटिव आई है मगर डॉक्टरों की सलाह पर मैं अगले कुछ दिनों तक आइसोलेशन में रहूँगी। इस असुविधा के लिए मैं आप सभी से क्षमाप्रार्थी हूँ। मैं कांग्रेस विजय की प्रार्थना करती हूँ pic.twitter.com/B1PlDyR8rc — Priyanka Gandhi Vadra (@priyankagandhi) April 2, 2021 ‘‘పిల్లలు కూడా గత కొద్ది కాలంగా మాతోనే ఉంటున్నారు.. అదృష్టం కొద్ది ప్రియాంకకు, పిల్లలకు నెగిటివ్‌గా తేలింది’’ అని రాబర్ట్ వాద్రా ప్రకటించారు. ఇక ప్రియాంక మంగళవారం కేరళలో రోడ్ షోలో పాల్గొన్నారు. అంతకు ముందు అస్సాం అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా అక్కడ ప్రచారం చేశారు. చదవండి: క్వారంటైన్ కలిపింది ఆ ఇద్దరినీ... -
క్వారంటైన్ కలిపింది ఆ ఇద్దరినీ...
ముంబై: గత రెండేళ్లుగా ఇద్దరు భారత టాప్ క్రికెటర్లు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ మధ్య విభేదాలు ఉన్నట్లు పలుమార్లు కథనాలు ప్రచారంలోకి వచ్చాయి. సోషల్ మీడియాలో కూడా అభిమానుల మధ్య చాలాసార్లు రచ్చ జరిగింది. అయితే ఈ విషయాన్ని వీరిద్దరు అంగీకరించడం కానీ ఖండించడం గానీ ఎప్పుడూ చేయలేదు. మైదానంలో, జట్టు కోసం ఆడుతున్న సమయంలో కూడా అలాంటిది ఉన్నట్లు ఎప్పుడూ కనిపించలేదు. వ్యక్తిగత అంశాల గురించి ఆలోచనే రాకుండా టీమ్ గెలుపు కోసం పరస్పర గౌరవంతోనే ఆడుతూ వచ్చారు. అయితే ‘విభేదాలు’ వాస్తవమేనని తేలింది. పైగా హెడ్ కోచ్ రవిశాస్త్రి జోక్యం చేసుకొని దీనిని చక్కబెట్టినట్లు కూడా తెలిసింది. ముఖ్యంగా కరోనా కాలంలో క్వారంటైన్‌లోనే ఎక్కువ సమయం గడపాల్సి రావడంతో కోహ్లి, రోహిత్ శర్మ పరస్పరం పలు అంశాలపై మాట్లాడుకునేందుకు తగినంత తీరిక దొరిగింది. తమ మధ్య పెరుగుతున్న అంతరానికి కారణమైన వేర్వేరు విషయాలపై వీరిద్దరు చర్చించుకున్నారని... ఈ విషయంలో రవిశాస్త్రిదే కీలకపాత్ర అని సమాచారం. ‘రెండు పెద్ద సిరీస్‌లలో విజయం సాధించడంతోపాటు టీమిండియా డ్రెస్సింగ్ రూమ్‌కు సంబంధించి మరో మేలు జరిగింది. కొన్ని వారాలుగా కోహ్లి, రోహిత్ మధ్య వ్యక్తిగత బంధం దృఢంగా మారింది. జట్టు గురించి, తమ బాధ్యతలు, రాబోయే సవాళ్ల గురించి వారు బాగా చర్చించుకున్నారు. తామిద్దరం పరస్పరం సమన్వయంతో కలిసి పని చేస్తే జట్టుకు ఎలాంటి మంచి జరుగుతుందో వారికి అర్థమైంది. గత నాలుగు నెలల్లో జట్టుకు దీనివల్ల ఎంతో ప్రయోజనం కలిగింది. తామిద్దరి గురించి బయట ప్రచారం ఉన్న పలు విషయాలు వారి మధ్య దూరాన్ని పెంచాయి. చదవండి: (ఐపీఎల్ 2021: పంజాబ్ పదునెంత?) జట్టులో నేను ఎవరికంటే తక్కువ కాదు అనే భావనతో ఇద్దరూ ఉన్నారు. ఇద్దరు ఆటగాళ్ల మధ్య విభేదాలు ఉంటే మిగతావారు దానిని దుర్వినియోగం చేయడం ఎన్నో ఏళ్లుగా భారత క్రికెట్లో ఉన్నదే. ఒకేచోట పని చేసే ఇద్దరు వ్యక్తుల మధ్య విభేదాలు ఏ రంగంలోనైనా ఉంటాయి. అవి అభిప్రాయభేదాలు మాత్రమే. అయితే ఇంతకాలం కలిసి కూర్చొని మాట్లాడుకోవాలని వారు అనుకోలేదు. ఇప్పుడు ఇద్దరికీ చాలా స్పష్టత వచ్చింది. ఇటీవల జరిగిన మ్యాచ్‌లు చూస్తే వీరి మధ్య బంధం బలపడినట్లు మనందరికీ అర్థమవుతుంది. బయో బబుల్ చేసిన మేలు ఇది’ అని బీసీసీఐలోని కీలక వ్యక్తి ఒకరు ఈ పరిణామాలను వెల్లడించారు.