
సాక్షి, విశాఖపట్నం : విశాఖలోని ఓ క్వారెంటైన్ కేంద్రంలో అగ్ని ప్రమాదం సంభవించింది. మదురవాడ సమీపంలోని కొమ్మాది శ్రీ చైతన్య వాల్మీకి కేంద్రంలో సోమవారం సాయంత్రం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో భారీగా కంప్యూటర్స్, ఎలక్ట్రానిక్ వస్తువులు దగ్దం అయ్యాయి. షార్ట్ సర్క్యూట్‌తో ప్రమాదం జరిగి ఉండొచ్చని యాజమాన్యం భావిస్తోంది. తాజా ప్రమాదంతో కరోనా బాధితులను మరో బ్లాక్‌కు తరలిస్తున్నారు. అయితే సకాలంలో ఫైర్ సిబ్బంది, పోలీసులు స్పందించడంతో పెను ప్రమాదం తప్పిందని స్థానికులు చెబుతున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే ఫైర్ సిబ్బందికి సమాచారం చేరవేశామని నిముషాల వ్యవధిలోనే సిబ్బంది వచ్చి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చిందని స్థానికులు తెలిపారు. దీంతో ఆస్పత్రి సిబ్బంది, రోగులు ఊపిరి పీల్చుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment