
ముంబై : మహమ్మారి వ్యాప్తితో ఉక్కిరిబిక్కిరవుతున్న దేశ ఆర్థిక రాజధాని ముంబైలో అగ్నిప్రమాదం జరిగింది. కరోనా వైరస్ రోగులకు క్వారంటైన్ సెంటర్‌గా వినియోగిస్తున్న దక్షిణ ముంబైలోని నగ్పదా ప్రాంతంలోని రిప్పన్ హోటల్‌లో మంగళవారం సాయంత్రం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఘటనా ప్రాంతానికి చేరుకున్న రెండు అగ్నిమాపక యంత్రాలు మంటలను ఆర్పివేస్తున్నాయి. మూడు అంతస్తుల ఈ భవనంలోని లాడ్జింగ్ రూం వరకే మంటలు పరిమితమవడంతో పెను ప్రమాదం తప్పింది. రోగులందరినీ అక్కడి నుంచి సురక్షితంగా ఖాళీచేయించామని అధికారులు తెలిపారు. భవనంలో ఎవరైనా చిక్కుకున్నారా అనేది గుర్తించేందుకు గాలింపు చర్యలు చేపట్టామని వెల్లడించారు.
చదవండి : జర్నలిస్టులు జాగ్రత్తలు పాటించాలి : కేంద్ర మంత్రి
Comments
Please login to add a commentAdd a comment