Centre
-
మస్క్ గ్రోక్‌పై భారత ప్రభుత్వం సీరియస్!
న్యూఢిల్లీ: ఈశ్వరుడు నోరు ఇచ్చాడు కదా అని ఏది పడితే అది మాట్లాడితే.. ప్రతిచర్య తీవ్రంగానే ఉంటుంది. మనిషికే కాదు.. మనిషి తెచ్చిన సాంకేతికతకూ అందుకు మినహాయింపు లేకుండా పోయింది. తాజాగా.. ఇలాన్ మస్క్‌కు చెందిన ఏఐ చాట్‌బోట్ గ్రోక్(Grok) వ్యవహారం ఇప్పుడు ఇలాగే మారింది. ఎక్స్ నుంచి సోషల్ మీడియాలో అటు ఇటు తిగిరి.. చివరకు ప్రభుత్వం దృష్టికి చేరింది. అన్‌ఫిల్టర్ భాష.. సెన్సార్‌లేని పదజాలంతో గ్రోక్ యూజర్లకు సమాచారం అందిస్తుండడాన్ని కేంద్రం తీవ్రంగా పరిగణించింది. ఈ నేపథ్యంలో స్క్రూటినీ(పరిశీలన)కి దిగింది. రెచ్చగొట్టే తరహా సమాచారాన్ని గ్రోక్ యూజర్లకు ఎందుకు అందిస్తోందంటూ ఎక్స్‌ను తాజాగా కేంద్ర సమాచార, సాంకేతిక మంత్రిత్వశాఖ ఆరా తీసింది. మరీ ముఖ్యంగా హిందీ భాషను అలా దుర్వినియోగపర్చడంపై ఆరా తీసింది. అయితే.. ఇలా ఎందుకు జరుగుతుందో తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నామని, తమ వివరణకు కొంత సమయం ఇవ్వాలని అవతలి నుంచి సమాధానం వచ్చినట్లు సమాచారం. ఆ వివరణ ఆధారంగా.. భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా చర్యలు చేపట్టాలని హెచ్చరించి సరిపెట్టడమా? లేదంటే చర్యలు తీసుకోవడమా? ఉంటుందని మంత్రిత్వ శాఖ వర్గాలు చెబుతున్నాయి. ఇలాన్ మస్క్(Elon Musk)కు చెందిన ఏఐ స్టార్టప్ ఎక్స్ఏఐ గ్రోక్ చాట్‌బాట్ సేవల్ని అందిస్తోంది. అయితే భారతీయ కొందరు యూజర్లు అడిగిన ప్రశ్నలకు గ్రోక్ హిందీ యాసలో సమాధానాలు ఇస్తోంది. అలాగే కొన్ని అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తుండడం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది. చాట్‌జీపీటీ సహా చాలావరకు ఏఐ చాట్బాట్లు వివాదాస్పద అంశాల జోలికి పోవడం లేదు. అలాగే.. భాష విషయంలోనూ సెన్సార్డ్గా ఉంటున్నాయి. కానీ, గ్రోక్ అందుకు విరుద్ధంగా ఉండడమే ఇప్పుడు వివాదానికి కారణమైంది. Grok 3 Voice Mode, following repeated, interrupting requests to yell louder, lets out an inhuman 30-second scream, insults me, and hangs up pic.twitter.com/5GtdDtpKce— Riley Goodside (@goodside) February 24, 2025ఏఐ రీసెర్చర్ రిలే గూడ్సైడ్(Riley Goodside)కు గ్రోక్తో ఎదురైన చేదు అనుభవం ఆ మధ్య వైరల్ అయ్యింది. పదే పదే ఆయన గ్రోక్‌ను వాయిస్ మోడ్‌లో ప్రశ్నలతో విసిగించారు. దీంతో అది ఓపిక నశించి.. మనిషి తరహాలోనే అరుస్తూ ఆయన్ని బూతులు తిట్టి.. ఆ సంభాషణను అక్కడితోనే ముగించింది. -
దురభిమానం ఎలా ఉంటుందంటే.. విమర్శలకు స్టాలిన్ కౌంటర్
చెన్నై: కేంద్ర నూతన జాతీయ విద్యావిధానాన్ని(National Educational Policy) వ్యతిరేకిస్తూ.. తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ మరోసారి సోషల్ మీడియా వేదికగా స్పందించారు. తాము కోరుకునేది భాషా సమానత్వం మాత్రమేనని.. అంత మాత్రానికే తమను విమర్శించడం తగదని అన్నారాయన. ఈ క్రమంలో.. డీఎంకే ప్రభుత్వంపై వస్తున్న విమర్శలకు ఆయన ఓ కొటేషన్‌తో కౌంటర్ ఇచ్చారు. మేం కోరుకునేది భాషా సమానత్వం. తమిళనాడులో తమిళం భాషకు ప్రాధాన్యం కల్పించమని అడుగుతున్నాం. అంతమాత్రానికే దురభిమానం, పక్షపాతం అనే ముద్రలు మాపై వేస్తున్నారు. మీరు ప్రత్యేక హక్కులకు అలవాటుపడటంతో మేం కోరుకునే సమానత్వం కూడా అణచివేతలా కనిపిస్తుంది(కొటేషన్‌ను పోస్ట్ చేశారు). దురభిమానం ఎలా ఉంటుందంటే.. తమిళులు అర్థం చేసుకోలేని భాషలో మూడు నేర చట్టాలకు పేర్లు పెట్టడంలా ఉంటుంది. దేశాభివృద్ధిలో కీలక పాత్ర పోషించే రాష్ట్రానికి ప్రాముఖ్యత ఇవ్వకపోవడం, ఎన్ఈపీని నిరాకరించినందుకు విద్యకు వెచ్చించాల్సిన నిధులను ఆపేయడం దాని కిందికే వస్తుంది. .. గాడ్సే భావజాలాన్ని కీర్తించే వ్యక్తులు.. చైనా దురాక్రమణ, కార్గిల్ యుద్ధం, బంగ్లాదేశ్ విముక్తి కోసం జరిపిన యుద్ధాల్లో అత్యధిక నిధులు అందించిన డీఎంకే, ఆ పార్టీ నేతృత్వంలో ప్రభుత్వానికి ఉన్న దేశభక్తిని ప్రశ్నిస్తున్నారు అంటూ కేంద్రంలోని బీజేపీకి పరోక్షంగా చురకలంటించారాయన. 👉🏾 "When you are accustomed to privilege, equality feels like oppression." I am reminded of this famous quote when some entitled bigots brand us chauvinists and anti-nationals for the 'crime' of demanding Tamil’s rightful place in Tamil Nadu.👉🏾 The very people who glorify… pic.twitter.com/MOzmUSEyia— M.K.Stalin (@mkstalin) March 6, 2025ఇదిలా ఉంటే.. జాతీయ విద్యావిధానంలో భాగమైన త్రిభాషా సూత్రం అమలుపై తమిళనాడు కేంద్ర ప్రభుత్వాల మధ్య వివాదం కొనసాగుతోంది. హిందీని బలవంతంగా హిందీయేత ప్రాంతాలకు రుద్దే ప్రయత్నం చేస్తున్నారంటూ కేంద్రం స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే ప్రభుత్వం మండిపడుతోంది. ఈ క్రమంలో.. రాష్ట్రానికి రావాల్సిన నిధులను నిలిపివేశారని స్టాలిన్ ప్రభుత్వం కేంద్రంపై సంచలన ఆరోపణలు చేసింది. అయితే ఈ ఆరోపణలను, డీఎంకే ప్రభుత్వ ప్రచారాలను కేంద్రం తోసిపుచ్చుతూ వస్తోంది. -
వాళ్ల కల హిందీయా.. కేంద్రంపై కమల్ హాసన్ విసుర్లు
ప్రముఖ నటుడు.. తమిళనాడు రాజకీయ నేత కమల్ హాసన్(Kamal Haasan) కేంద్రంలోని బీజేపీపై భగ్గుమన్నారు. హిందీయేతర రాష్ట్రాలపై బలవంతంగా భాషను రుద్దే ప్రయత్నం ఏమాత్రం సహించరానిదని.. అన్ని రాష్ట్రాలను హిందీ రాష్ట్రాలుగా మార్చేసి లబ్ధి పొందాలని బీజేపీ ప్రయత్నిస్తోందని తీవ్ర ఆరోపణలు చేశారాయన.బుధవారం తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ అధ్యక్షతన అఖిలపక్ష పార్టీల సమావేశం జరిగింది. ఈ భేటీకి మక్కల్ నీది మయ్యం తరఫున కమల్ హాసన్ పాల్గొన్నారు. జాతీయ విద్యా విధానం హిందీ భాషను తప్పించడంతో పాటు.. 1971 జనాభాల లెక్కల ఆధారంగానే నియోజకవర్గాల పునర్విభజన (Delimitation) చేపట్టాలని కేంద్రానికి వ్యతిరేకంగా డిమాండ్లతో ఈ భేటీలో ఓ తీర్మానం చేశారు. అనంతరం.. జరిగిన ఎంఎన్ఎం పార్టీ మీటింగ్‌లో కమల్ కీలక వ్యాఖ్యలు చేశారు.‘‘మన కల ఇండియా. కానీ వాళ్ల కల హిందీయా. బలవంతంగా హిందీని హిందీయేతర ప్రాంతాలకు రుద్దాలన్నదే వాళ్ల ప్రయత్నం. తద్వారా ఎన్నికల్లో లబ్ధి పొందాలని చూస్తున్నారు. అది నెరవేరకుండా తమిళులంతా ఏకమై పోరాడాలి’’ అని పార్టీ శ్రేణులను ఉద్దేశించి ప్రసంగించారాయన. అయితే హిందీయా కామెంట్లు గతంలో తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ చేయడం గమనార్హం. 2019లో హిందీ దివస్ సందర్భంగా కేంద్ర మంత్రి అమిత్ షా.. సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేశారు. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉన్న ఉన్న ఏకైక భారతీయ భాష హిందీనేనని పేర్కొన్నారాయన. అయితే.. ఈ పోస్టుకి నాడు డీఎంకే అధ్యక్షుడిగా ఉన్న స్టాలిన్ కౌంటర్ ఇచ్చారు. ఇది ఇండియా అని.. హిందీయా కాదని కౌంటర్ పోస్ట్ చేశారు. ఇదిలా ఉంటే.. లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన ద్వారా తక్కువ జనాభా ఉన్న రాష్ట్రాల్లో పార్లమెంట్ స్థానాలు తగ్గుతాయంటూ తమిళనాడు కొంతకాలంగా చెబుతోంది. ఈ వ్యాఖ్యలను కేంద్ర హోంమంత్రి అమిత్‌షా కొట్టిపడేశారు. అయినప్పటికీ దీనిపై పలు రాష్ట్రాల తమ ఆందోళనను వ్యక్తంచేస్తున్నాయి. లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజనపై కేంద్రలోని బీజేపీ, ఇతర రాష్ట్రాల్లోని పార్టీల మధ్య మాటల యుద్ధం జరుగుతున్న సంగతి తెలిసిందే. దీనిపై మరో ప్రముఖ నటుడు, తమిళగ వెట్రి కళగం పార్టీ అధినేత విజయ్ (Vijay) కీలక వ్యాఖ్యలు చేశారు. ఇది పార్లమెంటులో దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యాన్ని తగ్గిస్తుందదని.. ఎట్టి పరిస్థితుల్లో దీన్ని అంగీకరించమని ఓ ప్రకటనలో తెలిపారాయన. -
డీలిమిటేషన్ హీట్.. యూటర్న్ తీసుకున్న స్టాలిన్
చెన్నై: నియోజకవర్గ పునర్వవ్యస్థీకరణపై రాజకీయ దుమారం కొనసాగుతున్న వేళ.. తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్(MK Stalin) కీలక వ్యాఖ్యలు చేశారు. గతంలో కొత్తగా పెళ్లైన జంటలను ఆలస్యంగా పిల్లలను కనాలని సూచించిన ఆయన.. ఇప్పుడు స్టాండ్‌పై యూటర్న్ తీసుకున్నారు. అందుకు నియోజకవర్గాల పునర్విభజన రాజకీయం వేడెక్కడమే కారణం. సోమవారం నాగపట్నంలో డీఎంకే నేత కుటుంబ వివాహ వేడుకకు హాజరైన సీఎం స్టాలిన్ మాట్లాడుతూ.. గతంలో కొత్తగా పెళ్లైన వాళ్లను పిల్లల విషయంలో కొంత సమయం తీసుకోవాలని నేనే చెప్పాను. ఫ్యామిలీ ప్లానింగ్ విషయంలో మనం విజయవంతం అయ్యాం కూడా. కానీ, ఇప్పుడు.. నియోజకవర్గాల పునర్విభజన(Delimitation)పై కేంద్రం కొత్త పాలసీలు తీసుకొస్తున్న వేళ అలా చెప్పను. కొత్తగా పెళ్లైన జంటలు వీలైనంత త్వరగా పిల్లలను కనండి. వాళ్లకు మంచి తమిళ పేర్లు పెట్టండి అని స్టాలిన్ అన్నారు. అయితే.. జనాభా ప్రతిపాదికన కేంద్రం నియోజకవర్గాలను పునర్విభజించబోతోందని స్టాలిన్ చెప్పడం ఇదేం కొత్త కాదు. ఇంతకు ముందూ ఆయన ఇలాగే మాట్లాడారు. అలా జనాభా ప్రకారం చూసుకుంటే.. తమిళనాడుకు 8 స్థానాలు తగ్గే అవకాశం ఉందని.. ఇది మరికొన్ని రాష్ట్రాలపైనా ప్రభావం చూపెడుతుందని ఆందోళన వ్యక్తం చేశారాయన.దేశ సంక్షేమం, ఆర్థిక అభివృద్ధిలో దక్షిణాది రాష్ట్రాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. అయితే.. కుటుంబ నియంత్రణ ద్వారా గత కొన్ని సంవత్సరాలుగా విజయం సాధించాయని అనుకుంటున్నాయి. రేపు ఒకవేళ జనాభా ప్రతిపాదికన గనుక కేంద్రం నియోజకవర్గాలను విభజిస్తే.. ఆ రాష్ట్రాలకే తీవ్ర నష్టం అని అంటున్నారాయన.అయితే స్టాలిన్ చేసిన ఈ వ్యాఖ్యలపై బీజేపీ(BJP) కౌంటర్ ఇచ్చింది. తమిళనాడు సీఎం వ్యాఖ్యలు నిరాశవాదంతో కూడుకున్నవని, నిజాయితీలేని రాజకీయాలకు సంకేతమని బీజేపీ అధికార ప్రతినిధి సీఆర్ కేశవన్ చెబుతున్నారు. జనాభాకు తగ్గట్లుగా హక్కులు ఉంటాయా? అని గతంలో మీ మిత్రపక్ష నేత రాహుల్ గాంధీ చేసిన చేసిన వ్యాఖ్యలకు వివరణ ఇవ్వాలని స్టాలిన్‌ను ఉద్దేశించి కేశవన్ అన్నారు. పాలనాపరమైన వైఫల్యాల నుంచి ప్రజలను తప్పుదోవ పట్టించేందుకే ఈ డ్రామాలని డీఎంకేపై మండిపడ్డారాయన. మరోవైపు.. డీలిమిటేషన్‌తో దక్షిణాది రాష్ట్రాలకు ఎలాంటి అన్యాయం జరగబోదని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఇదివరకే ఓ ప్రకటన చేశారు. -
అడ్వకేట్ బిల్లుపై స్టాలిన్ ఫైర్.. కేంద్రానికి వార్నింగ్
చెన్నై: ఇప్పటికే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ(ఎన్ఈపీ)పై ఫైరవుతున్న తమిళనాడు సీఎం స్టాలిన్ తాజాగా అడ్వకేట్ బిల్లుపై కేంద్రాన్ని హెచ్చరించారు. కేంద్రం తీసుకువస్తున్న అడ్వకేట్ బిల్లు న్యాయవాద వృత్తిపై దాడి అని అన్నారు. ఈ మేరకు స్టాలిన్ ఎక్స్(ట్విటర్)లో ఒక పోస్టు చేశారు.‘బార్ కౌన్సిల్ ఆఫ్ తమిళనాడు,పుదుచ్చేరిని బార్ కౌన్సిల్ ఆఫ్ మద్రాస్‌గా కేంద్రం మార్చాలనుకుంటోంది. తమిళనాడు అనేది కేవలం పేరు కాదు. మా గుర్తింపు. తమిళులపై బీజేపీ వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తోంది. 2014లో తొలిసారి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి బీజేపీ న్యాయవ్యవస్థ స్వయంప్రతిపత్తిని తొలగించే ప్రయత్నం చేస్తోంది. ఈ క్రమంలోనే గతంలో ఎన్‌జేఏసీని తీసుకురావడానికి ప్రయత్నించి విఫలమైంది. ఇప్పుడు మళ్లీ అడ్వకేట్ బిల్లు ద్వారా బార్ కౌన్సిళ్లపై పెత్తనం చెలాయించాలనుకుంటోంది. అడ్వకేట్ బిల్లును కేంద్ర ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలి’అని స్టాలిన్ డిమాండ్ చేశారు. కాగా, బిల్లుపై తీవ్ర వ్యతిరేకత రావడంతో ముసాయిదాను కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసకుంది. ముసాయిదాలో సవరణలు చేయనున్నట్లు ప్రకటించింది. -
మాతో ఆటలొద్దు: కమల్‌హాసన్ వార్నింగ్
చెన్నై:తమిళులు భాష కోసం ప్రాణాలు వదిలారని, ఈ విషయంలో తమతో ఆటలొద్దని ప్రముఖ నటుడు మక్కల్ నీది మయ్యమ్ (ఎంఎన్ఎమ్) అధినేత కమల్‌హాసన్ కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఎమ్ఎన్ఎమ్ పార్టీ 8వ వ్యవస్థాపక దినం సందర్భంగా కమలహాసన్ మాట్లాడారు.‘తమిళులకు భాష చాలా ముఖ్యమైనది. మాతో ఈ విషయంలో ఆలలొద్దు.భాష కోసం ప్రాణాలు కూడా వదిలేశాం.మా పిల్లలకు కూడా ఏ భాష కావాలో తెలుసు.ఏ భాష కావాలో ఎంపిక చేసుకునే జ్ఞానం వారికి ఉంది’అని పరోక్షంగా కేంద్రం తీసుకువచ్చిన నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ(ఎన్ఈపీ)ని ఉద్దేశించి కమల్ వ్యాఖ్యానించారు.తమిళనాడులో రెండు భాషల విధానం అమలులో ఉండగా ఎన్ఈపీ కింద హిందీతో కలిపి మూడు భాషల విధానాన్ని అమలు చేయాలని కేంద్రం భావిస్తోంది. దీనిని అధికార డీఎంకే తీవ్రంగా వ్యతిరేకిస్తోంది.ఎన్ఈపీ అమలు చేయకపోతే తమిళనాడుకు రావాల్సిన రూ.2152 కోట్ల సమగ్రశిక్షాఅభియాన్ నిధులు నిలిపివేస్తామని కేంద్ర మంత్రి ధర్మేంద్రప్రదాన్ ఇప్పటికే హెచ్చరించారు. ప్రదాన్ చేసిన వ్యాఖ్యలపై ఆందోళన వ్యక్తం చేస్తూ సీఎం స్టాలిన్ ఇప్పటికే ప్రధాని మోదీకి లేఖ కూడా రాశారు. ఈ లేఖపై ప్రదాన్ తిరిగి స్పందించారు. తమిళనాడు ప్రభుత్వం రాజకీయాలు వదిలేసి విద్యార్థుల భవిష్యత్తు కోసం ఆలోచించాలని సూచించారు.ఈ విషయమై తాజాగా ప్రధాని మోదీ కూడా పరోక్షంగా స్పందించారు. దేశంలో భాషల పట్ల శత్రుత్వం సృష్టించొద్దని కోరారు. -
న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ తొక్కిసలాట.. కేంద్రంపై ఢిల్లీ హైకోర్టు ఆగ్రహం
ఢిల్లీ : కుంభమేళాకు వెళ్లే ప్రయాణికులు పోటెత్తడంతో గత శనివారం న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లో (New Delhi Railway Station Stampede) తొక్కిసలాట జరిగింది. ఆ దుర్ఘటనపై కేంద్రం, భారతీయ రైల్వే శాఖపై ఢిల్లీ హైకోర్టు (Delhi High Court) ఆగ్రహం వ్యక్తం చేసింది. రైల్వే కోచ్‌లో నిర్ధిష్ట ప్రయాణికుల సంఖ్య కంటే ఎక్కువ మందిని ఎందుకు అనుమతిస్తున్నారని ప్రశ్నించింది. ట్రైన్ టికెట్లు ఎందుకు ఎక్కువగా అమ్ముతున్నారని మండిపడింది. ఇదే అంశంపై వివరణ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ తొక్కిసలాట దుర్ఘటనపై దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (PIL)పై ఇవాళ (ఫిబ్రవరి 19) విచారణ చేపట్టింది. విచారణ సమయంలో పైవిధంగా స్పందించింది. కుంభమేళాకు వెళ్లే ప్రయాణికులు పోటెత్తడంతో గత శనివారం (ఫిబ్రవరి 17,2025) రాత్రి జరిగిన తొక్కిసలాటలో 18 మంది మరణించారు. పదుల సంఖ్యలో గాయపడ్డారు. ఈ దుర్ఘటనపై దాఖలైన పిల్‌పై ఢిల్లీ హైకోర్టు చీఫ్ జస్టిస్ డీకే ఉపాధ్యాయ్, జస్టిస్ తుషార్ రావు ధర్మాసనం ఇవాళ విచారణ చేపట్టింది. విచారణ సమయంలో పరిమితికి మించి టికెట్లను ఎందుకు అమ్ముతున్నారని అటు కేంద్రాన్ని, ఇటు రైల్వే శాఖను ప్రశ్నించింది.ఈ సందర్భంగా రైల్వే ప్రమాదాల్ని నివారించేందుకు ఢిల్లీ హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం కేంద్రం,రైల్వే శాఖకు పలు సూచనలు ఇచ్చింది.రైల్వే చట్టం సెక్షన్ 147 ప్రకారం, ఒక కోచ్‌లో ప్రయాణికుల సంఖ్య పరిమితి ఉండాలి. ఈ చట్టం ప్రకారం పరిమితికి మించి ప్రయాణికుల్ని అనుమతిస్తే 1,000 రూపాయల జరిమానా,అలాగే ఆరు నెలల జైలు శిక్ష విధించవచ్చు.ఈ చర్యలు తీసుకోకపోతే ప్రస్తుతం ఉన్న చట్టాల్ని అమలు చేయండి. టిక్కెట్లు అమ్మే ప్రక్రియను కట్టుదిట్టం చేయండి. భవిష్యత్‌లో రైల్వే ప్రమాదాల్ని నివారించవచ్చు. జస్టిస్ ఉపాధ్యాయ్ మాట్లాడుతూ.. రద్దీ సమయాల్లో కొంతమేర పరిమితి మించినా, ఆ స్థాయిలో ప్రయాణికులకు సౌకర్యాలు కల్పించాలి. ఈ అంశంపై నిర్లక్ష్యం చేస్తే ఈ తరహా దుర్ఘటనకు దారి తీస్తుంది’ అని అన్నారు. రైల్వే శాఖ తరుఫున ప్రముఖ అడ్వకేట్, సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోర్టులో తన వాదనల్ని వినిపించారు. ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు తదుపరి విచారణను మార్చి 26కి వాయిదా వేసింది. -
మరోసారి ఉదయనిధి వివాదాస్పద వ్యాఖ్యలు
చెన్నై:తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కేంద్ర ప్రభుత్వంపై తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. తమిళనాడుకు రావాల్సిన సమగ్రశిక్ష అభియాన్ రూ.2190 కోట్ల రూపాయల నిధులు తామేమీ అడుక్కోవడం లేదన్నారు. మీ తండ్రి సొమ్ము అడగడం లేదని ఫైరయ్యారు.‘మేమేమీ మీ తండ్రి సంపాదించిన సొమ్ము అడగడం లేదు. మాకు హక్కుగా రావాల్సిన నిధులే మేం అడుగుతున్నాం. తమిళనాడు ప్రజలు కట్టే పన్ను డబ్బులనే మేం అడుతున్నాం. బీజేపీ బెదిరింపులకు భయపడేదే లేదు. తమిళనాడుపై హిందీని రుద్దాలని చూస్తున్నారు. రాష్ట్రంలోని రెండు భాషల పాలసీ ప్రస్తుతం ప్రమాదంలో పడింది. ఫాసిస్టు బీజేపీపై ఈ విషయంలో పోరాడేందుకు ప్రతిపక్షం అన్నాడీఎంకే మాతో కలిసి రావాలి. తమిళనాడు ప్రజలను బీజేపీ రెండో శ్రేణి పౌరులుగా మార్చాలని చూస్తోంది’అని ఉదయనిధి మండిపడ్డారు. కాగా, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ(ఎన్ఈపీ) కింద మూడు భాషల పాలసీని అమలు చేసేదాకా తమిళనాడుకు సమగ్ర శిక్ష అభియాన్ కింద నిధులు ఇచ్చేది లేదని కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ ఇటీవలే స్పష్టం చేసిన నేపథ్యంలో ఉదయనిధి స్పందించారు. గతంలోనూ ఉదయనిధి సనాతన ధర్మంపై చేసిన వ్యాఖ్యలు దుమారం రేపిన విషయం తెలిసిందే. -
‘పద్మ’ అవార్డు గ్రహీతలు వీరే.. ప్రకటించిన కేంద్రం
సాక్షి,ఢిల్లీ: గణతంత్ర దినోత్సవం (Republic Day ) సందర్భంగా కేంద్ర ప్రభుత్వం శనివారం(జనవరి25) ‘పద్మ’ పురస్కారాలను (Padma Awards 2025) ప్రకటించింది. వివిధ రంగాల్లో విశేష సేవలు అందించినవారిని ఈ ప్రతిష్ఠాత్మక అవార్డులకు ఎంపిక చేసింది. ఏడుగురిని పద్మ విభూషణ్, 19 మందిని పద్మ భూషణ్, 113 మందిని పద్మ శ్రీ పురస్కారాలకు ఎంపిక చేసింది. తెలంగాణకు చెందిన దువ్వూరి నాగేశ్వర్ రెడ్డిని వైద్య విభాగంలో పద్మ విభూషణ్ పురస్కారం దక్కింది. పద్మ విభూషణ్ వరించింది వీరికే దువ్వూరి నాగేశ్వర్ రెడ్డి (వైద్యం) - తెలంగాణ జస్టిస్ జగదీశ్ ఖేహర్ (రిటైర్డ్) (ప్రజా వ్యవహారాలు) - చండీగఢ్ కుముదిని రజినీకాంత్ లాఖియా (కళలు) - గుజరాత్ లక్ష్మీనారాయణ సుబ్రమణియం (కళలు) - కర్ణాటక ఎం.టి.వి.వాసుదేవన్ నాయర్ (మరణానంతరం) (సాహిత్యం, విద్య) - కేరళ ఓసాము సుజుకీ (మరణానంతరం) (వాణిజ్యం, పరిశ్రమలు) - జపాన్ శారదా సిన్హా (కళలు) - బిహార్ ‘పద్మభూషణులు’ వీరే..నందమూరి బాలకృష్ణ (కళలు) - ఏపీఎ.సూర్యప్రకాశ్ (సాహిత్యం, విద్య, జర్నలిజం) కర్ణాటక అనంత్ నాగ్ (కళలు) - కర్ణాటకబిబేక్ దెబ్రాయ్ (మరణానంతరం) (సాహిత్యం, విద్య) - ఎన్సీటీ ఢిల్లీ జతిన్ గోస్వామి (కళలు) - అస్సాం జోస్ చాకో పెరియప్పురం (వైద్యం) - కేరళ కైలాశ్ నాథ్ దీక్షిత్ (ఇతర- ఆర్కియాలజీ) - ఎన్సీటీ ఢిల్లీ మనోహర్ జోషీ (మరణానంతరం) (ప్రజావ్యవహారాలు) - మహారాష్ట్ర నల్లి కుప్పుస్వామి చెట్టి (వాణిజ్యం, పరిశ్రమలు) - తమిళనాడుపీఆర్ శ్రీజేశ్ (క్రీడలు) - కేరళ పంకజ్ పటేల్ (వాణిజ్యం, పరిశ్రమలు) - గుజరాత్ పంకజ్ ఉదాస్ (మరణానంతరం) (కళలు) - మహారాష్ట్ర రామ్బహదుర్ రాయ్ (సాహిత్యం, విద్య, జర్నలిజం) - ఉత్తర్ప్రదేశ్సాధ్వీ రీతంభర (సామాజిక సేవ) - ఉత్తర్‌ప్రదేశ్ ఎస్.అజిత్ కుమార్ (కళలు) - తమిళనాడుశేఖర్ కపూర్ (కళలు) - మహారాష్ట్ర శోభన చంద్రకుమార్ (కళలు) - తమిళనాడు సుశీల్ కుమార్ మోదీ (మరణానంతరం) (ప్రజావ్యవహారాలు) - బిహార్ వినోద్ ధామ్ (సైన్స్ అండ్ ఇంజినీరింగ్) - అమెరికాపద్మశ్రీ అవార్డు గ్రహీతలు..అద్వైత చరణ్ గడనాయక్ (కళలు) - ఒడిషా అచ్యుత్ రామచంద్ర పలవ్ (కళలు) - మహారాష్ట్ర అజయ్ వి.భట్ (సైన్స్ అండ్ ఇంజినీరింగ్) - అమెరికా అనిల్ కుమార్ బోరో (సాహిత్యం, విద్య) - అస్సాం అరిజిత్ సింగ్ (కళలు) - బెంగాల్ అరుంధతి భట్టాచార్య (ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ) - మహారాష్ట్ర అరుణోదయ్ సాహా (సాహిత్యం, విద్య) - త్రిపుర అర్వింద్ శర్మ (సాహిత్యం, విద్య) - కెనడా అశోక్‌కుమార్ మహాపాత్ర (వైద్యం) - ఒడిషా అశోక్ అక్ష్మణ్ షరఫ్ (కళలు) - మహారాష్ట్ర అశుతోష్ శర్మ (సైన్స్ అండ్ ఇంజినీరింగ్) - ఉత్తర్‌ప్రదేశ్ అశ్విని బిడే దేశ్‌పాండే (కళలు) - మహారాష్ట్ర బైజ్యనాథ్ మహారాజ్ (ఆధ్యాత్మికం) - రాజస్థాన్ బర్రే గాడ్ఫ్రే జాన్ (కళలు) - ఎన్సీటీ ఢిల్లీ బేగమ్ బతోల్ (కళలు) - రాజస్థాన్భరత్ గుప్త్ (కళలు) - ఎన్సీటీ ఢిల్లీ బేరు సింగ్ చౌహాన్ (కళలు) - మధ్యప్రదేశ్ భీమ్‌సింగ్ భవేశ్ (సామాజిక సేవ) - బిహార్ భీమవ్వ దొడ్డబాలప్ప (కళలు) - కర్ణాటక బుదేంద్ర కుమార్ జైన్ (వైద్యం) - మధ్యప్రదేశ్ సి.ఎస్.వైద్యనాథన్ (ప్రజా సంబంధాలు) - ఎన్సీటీ ఢిల్లీ చైత్రమ్ దియోచంద్ పవార్ (సామాజిక సేవ) - మహారాష్ట్ర చంద్రకాంత్ సేత్ (మరణానంతరం) (సాహిత్యం, విద్య) - గుజరాత్ చంద్రకాంత్ సోంపుర (ఆర్కిటెక్చర్) - గుజరాత్ చేతన్ ఇ చిట్నిస్ (సైన్స్ అండ్ ఇంజినీరింగ్) - ఫ్రాన్స్ డేవిడ్ ఆర్ సిమ్లీహ్ (సాహిత్యం, విద్య) - మేఘాలయ దుర్గాచరణ్ రణ్‌బీర్ (కళలు) - ఒడిశా ఫరూక్ అహ్మద్ మిర్ (కళలు) - జమ్ముకశ్మీర్ గణేశ్వర్ శాస్త్రి ద్రావిడ్ (సాహిత్యం, విద్య) - ఉత్తర్‌ప్రదేశ్ గీతా ఉపాధ్యాయ్ (సాహిత్యం, విద్య)- అస్సాం గోకుల్ చంద్ర దాస్ (కళలు)- పశ్చిమబెంగాల్ గురువయూర్ దొరాయ్ (కళలు) - తమిళనాడు హర్చందన్ సింగ్ భాఠీ (కళలు) మధ్య ప్రదేశ్ హరిమన్ శర్మ (వ్యవసాయం) - హిమాచల్ ప్రదేశ్ హర్జిందర్ సింగ్ శ్రీనగర్ వాలే (కళలు) - పంజాబ్ హర్వీందర్ సింగ్ ( క్రీడలు) -హరియాణా హస్సన్ రఘు ( కళలు) - కర్ణాటక హేమంత్ కుమార్ (వైద్యం) - బిహార్ హృదయ్ నారాయణ్ దీక్షిత్ ( సాహిత్యం, విద్య) - ఉత్తర్ ప్రదేశ్ హ్యూగ్ అండ్ కొల్లీన్ గాంట్జర్ (మరణానంతరం) (జర్నలిజం) - ఉత్తరాఖండ్ ఇనివలప్పి మని విజయన్ (క్రీడలు) - కేరళ జగదీశ్ జోషిల ( సాహిత్యం, విద్య) - మధ్య ప్రదేశ్ జస్పీందర్ నారుల (కళలు) - మహారాష్ట్ర జోనస్ మాసెట్టి (ఆధ్యాత్మికం) - బ్రెజిల్ మందకృష్ణ మాదిగ (ప్రజా వ్యవహారాలు) - తెలంగాణ కె.ఎల్.కృష్ణ (సాహిత్యం, విద్య) - ఏపీ మాడుగుల నాగఫణిశర్మ (కళలు) - ఏపీ మిరియాల అప్పారావు (మరణానంతరం) (కళలు) - ఏపీ జోయ్‌నాంచారన్ బతారీ (కళలు) - అస్సాం జుమ్దే యోమ్గామ్ గామ్లిన్ (సామాజిక సేవ) - అరుణాచల్ ప్రదేశ్ కె.దామోదరన్ (పాకశాస్త్రం) - తమిళనాడు కె.ఓమనకుట్టి అమ్మ (కళలు) - కేరళ కిశోర్ కునాల్ (మరణానంతరం) (పౌర సేవ) - బిహార్ ఎల్.హాంగ్‌థింగ్ (వ్యవసాయం) - నాగాలాండ్ లక్ష్మీపతి రామసుబ్బఅయ్యర్ (సాహిత్యం, విద్య, జర్నలిజం) - తమిళనాడు లలిత్ కుమార్ మంగోత్ర (సాహిత్యం, విద్య) - జమ్మూకశ్మీర్ లాలా లోబ్‌జంగ్ (మరణానంతరం) (ఆధ్యాత్మికం) - లద్దాఖ్ లిబియా లోబో సర్దేశాయ్ (సామాజిక సేవ) - గోవా ఎం.డి.శ్రీనివాస్ (సైన్స్ అండ్ ఇంజినీరింగ్) - తమిళనాడు మహాబీర్ నాయక్ (కళలు) - ఝార్ఖండ్ మమతా శంకర్ (కళలు) - పశ్చిమ బెంగాల్ మారుతి భుజంగరావు చితంపల్లి (సాహిత్యం, విద్య) - మహారాష్ట్ర నాగేంద్ర నాథ్ రాయ్ (సాహిత్యం, విద్య) - పశ్చిమ బెంగాల్ నారాయణ్ (భులయ్ భాయ్) (మరణానంతరం) (ప్రజావ్యవహారాలు) - ఉత్తర్‌ప్రదేశ్ నరేన్ గురుంగ్ (కళలు) - సిక్కిం నీర్జా భాట్ల (వైద్యం) - ఎన్సీటీ ఢిల్లీ నిర్మలా దేవీ (కళలు) - బిహార్ నితిన్ నొహ్రియా (సాహిత్యం, విద్య) - అమెరికా ఓంకార్ సింగ్ పహ్వా (వాణిజ్యం, పరిశ్రమలు) - పంజాబ్ పి.దచనమూర్తి (కళలు) - పుదుచ్చేరి పాండీ రామ్ మందవీ (కళలు) - ఛత్తీస్‌గఢ్ పార్మర్ లావ్జీభాయ్ నాగ్జీభాయ్ (కళలు) - గుజరాత్ పవన్ గొయెంక (వాణిజ్యం, పరిశ్రమలు) - పశ్చిమ బెంగాల్ ప్రశాంత్ ప్రకాశ్ (వాణిజ్యం, పరిశ్రమలు) - కర్ణాటక -
5, 8 తరగతులకు డిటెన్షన్ విధానం
న్యూఢిల్లీ: ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే 5, 8 తరగతుల విద్యార్థులకు నో డిటెన్షన్ విధానాన్ని కేంద్రం రద్దు చేసింది. ఈ రెండు తరగతుల్లో ఫైనల్ పరీక్షలో ఫెయిలైనప్పటికీ విద్యార్థులు తదుపరి తరగతుల్లో కొనసాగేందుకు ఇప్పటిదాకా వీలుండేది. ఇకపై అలా కాదు.. ‘5వ తరగతిలో ఫెయిలైన విద్యార్థులకు ఫైనల్ పరీక్షా ఫలితాలు వెలువడిన రెండు నెలల్లోగా మళ్లీ పరీక్షలు రాసేందుకు అవకాశం కలి్పంచాలి. ఆ పరీక్షలోనూ ఫెయిలైతే వారిని తిరిగి 5వ తరగతిలోనే కొనసాగించడం తప్పనిసరి. 8వ తరగతి ఉత్తీర్ణత సాధించని వారికీ ఇదే వర్తిస్తుంది. రెండోసారి పరీక్ష రాసే విద్యారి్థని క్లాస్ టీచర్, తల్లిదండ్రులు మార్గదర్శకత్వంలో పరీక్షలకు సమాయత్తం చేయాలి. విద్యార్థి ఏ విషయంలో వెనుకబడి ఉన్నాడో గుర్తించి, ఆయా అంశాల్లో ప్రావీణ్యం సాధించేందుకు ప్రోత్సహించాలి’అని కేంద్రం విడుదల చేసిన గజెట్ పేర్కొంది. అయితే, ఎలిమెంటరీ విద్యను పూర్తి చేయకుండా ఏ ఒక్కరినీ స్కూల్ నుంచి తొలగించే ప్రసక్తే లేదని కూడా కేంద్రం స్పష్టం చేసింది. విద్యా హక్కు చట్టానికి 2019లో చేపట్టిన సవరణతో ఇప్పటికే 16 రాష్ట్రాలు, 2 రెండు కేంద్ర పాలిత ప్రాంతాలు 5, 8 తరగతులకు ‘నో డిటెన్షన్ విధానం’రద్దు చేశాయి. విద్య రాష్ట్రాల పరిధిలోని అంశమైనందున, గజెట్‌ను అనుసరించి రాష్ట్రాలు ఈ విషయంలో తగు చర్యలు చేపట్టాలని కోరింది. 𝐔𝐧𝐢𝐨𝐧 𝐄𝐝𝐮𝐜𝐚𝐭𝐢𝐨𝐧 𝐌𝐢𝐧𝐢𝐬𝐭𝐫𝐲 𝐚𝐛𝐨𝐥𝐢𝐬𝐡𝐞𝐬 𝐭𝐡𝐞 '𝐍𝐨 𝐃𝐞𝐭𝐞𝐧𝐭𝐢𝐨𝐧 𝐏𝐨𝐥𝐢𝐜𝐲':Students in classes 5 and 8 who fail the annual exam can retake it within two months. If they fail again, they won't be promoted, but the school will not expel a… pic.twitter.com/AW4KRz8ch3— All India Radio News (@airnewsalerts) December 23, 2024 -
సుప్రీంకోర్టు జడ్జిగా మన్మోహన్.. ఆమోదించిన కేంద్రం
న్యూఢిల్లీ: ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి మన్మోహన్‌ను సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి కల్పిస్తూ కేంద్రం ఆమోదం తెలిపింది. ఈ మేరకు న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ మంగళవారం ఎక్స్‌లో ట్వీట్ చేశారు. ‘ప్రధాన న్యాయమూర్తితో సంప్రదించిన అనంతరం రాష్ట్రపతి ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ మన్మోహన్‌ను భారత సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమించడం సంతోషంగా ఉంది’ అని ఆయన పేర్కొన్నారు.కాగా నాలుగు రోజుల క్రితం ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి మన్మోహన్‌ను సుప్రీంకోర్టు జడ్జిగా నియమించాలని కొలీజియం కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు భారత ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల కొలీజియం సమావేశమై జస్టిస్ మన్మోహన్ పేరును సిఫారసు చేసింది. ఇక సుప్రీంకోర్టులో మొత్తం జడ్జిల సంఖ్య 34 కాగా.. ప్రస్తుతం 32 మందే ఉన్నారు. మాజీ సీజేఐ డి.వై.చంద్రచూడ్, జస్టిస్ హిమా కోహ్లీల పదవీ విరమణతో ఈ రెండు ఖాళీలు ఏర్పడ్డాయి. మన్మోహన్ సుప్రీం న్యాయమూర్తిగా ప్రమాణం స్వీకారం చేస్తే.. సర్వోన్నత న్యాయస్థానంలో సీజేఐతో జడ్జిల సంఖ్య 33కు చేరనుంది. జస్టిస్ మన్మోహన్ డిసెంబరు 17, 2009లో ఢిల్లీ హైకోర్టు జడ్జిగా నియమితులయ్యారు. ఈ ఏడాది సెప్టెంబరు 29న ఢిల్లీ సీజేగా పదోన్నతి పొందారు. -
మాతృత్వం.. ఓ మధురానుభూతి!
సాక్షి, హైదరాబాద్: మాతృత్వం.. ఓ మధురానుభూతి అని ప్రముఖ నటి రమ్యకృష్ణ పేర్కొన్నారు. పిల్లలు వద్దనుకుంటున్న వారి సంఖ్య పెరిగిపోతోందని, పిల్లల్ని కనడం, పెంచడం భారంగా భావిస్తున్నారని చెప్పారు. అలా అనుకోవద్దని తాము కూడా వృత్తితో పాటు కుటుంబాన్ని బ్యాలెన్స్ చేసుకున్నామని తెలిపారు. నగరంలోని ఓ హోటల్లో ఒయాసిస్ ఫెర్టిలిటీ సెంటర్ 15వ వార్షికోత్సవం బుధవారం జరిగింది. ముఖ్య అతిథిగా ప్రముఖ నటి రమ్యకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఒయాసిస్ ఫెర్టిలిటీ సెంటర్ వ్యవస్థాపకురాలు డాక్టర్ దుర్గారావును ఫరి్టలిటీ, ఐవీఎఫ్‌కు సంబంధించి ఆమె పలు ప్రశ్నలను అడిగి నివృత్తి చేసుకున్నారు. జపాన్‌లో కొన్నేళ్లుగా యువ జనాభా విపరీతంగా తగ్గిపోతోందని, పూర్తిగా వృద్ధుల జనాభా పెరుగుతోందని, ఈ నేపథ్యంలో అక్కడి ఆర్థిక వ్యవస్థ దారుణంగా దెబ్బతింటోందని డాక్టర్ దుర్గారావు పేర్కొన్నారు. మన దేశంలో కూడా సంతానోత్పత్తి రేటు 1.8 ఉందని, అది 2కు పైగా ఉండాల్సిన అవసరం ఉందని వివరించారు. ఈ సందర్భంగా ఒయాసిస్ ఫెర్టిలిటీ సెంటర్ ద్వారా జని్మంచిన పలువురు పిల్లలకు స్కాలర్షిప్లు అందజేశారు. వీరంతా రేపటి చాలెంజర్లని, రేపటి రోజును తీర్చిదిద్దే వారిని సమాజానికి అందించినందుకు గర్వంగా ఉందని వివరించారు. -
ఢిల్లీలో కాలుష్య కట్టడికి అదొక్కటే మార్గం: కేంద్రానికి మంత్రి లేఖ
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరిన నేపథ్యంలో.. పర్యావరణశాఖ మంత్రి గోపాల్ రాయ్ కేంద్రానికి ఓ లేఖ రాశారు. వాయు కాలుష్యాన్ని కట్టడి చేసేందుకు కృత్రిమ వర్షం కురిపించడం ఒక్కటే ఏకైక పరిష్కారమని ఆయన పేర్కొన్నారు.రాజధానిలో కృత్రిమ వర్షం కురిపించేలా ప్రధాన మంత్రి నరేంద్ర మోది జోక్యం చేసుకోవాలని కోరారు.కేంద్రానికి రాసిన లేఖను చూపుతూ విలేఖరుల సమావేశంలో మంత్రి మాట్లాడారు. ‘ఉత్తర భారతాన్ని పొగ పొరలు కమ్మేశాయి. దీని నుంచి విముక్తికి కృత్రిమ వర్షమే ఏకైక పరిష్కారం. ఇది మెడికల్ ఎమర్జెన్సీ. ఈ విషయమై కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్‌కు అనేక సార్లు లేఖలు రాశాను. అయినా వారు పట్టించుకోలేదు. కాలుష్య నియంత్రణకు కేంద్రం చర్యలు తీసుకోవాలి. ఈ విషయంలో ప్రధాన మంత్రి మోదీ జోక్యం చేసుకోవాలి. వాయు కాలుష్యాన్ని కట్టడి చేయడానికి ఓ అత్యవసర సమావేశం ఏర్పాటు చేయాలి. ఇది ఆయన నైతిక బాధ్యత.ఢిల్లీలో కృత్రిమ వర్షంపై కృత్రిమ వర్షంపై గత ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్‌లోనూ లేఖలు రాశాం. ఈ రోజు వరకు నాలుగు లేఖలు పంపినప్పటికీ కేంద్ర పర్యావరణ మంత్రి భూపేంద్ర యాదవ్ఒక్క సమాశం కూడా ఏర్పాటు చేయలేదు. ఈ సమస్యకు స్పష్టమైన పరిష్కారం చూపాలి. లేనిపక్షంలో మంత్రి పదవికి రాజీనామా చేయాలి’ అని డిమాండ్ చేశారు.కాగా దేశ రాజధాని ఢిల్లీ తీవ్రమైన వాయుకాలుష్యం, పొగమంచుతో ఉక్కిరిబిక్కిరవుతోంది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (ఏక్యూఐ) 494కు పడిపోయింది. చాలా ప్రాంతాల్లో ఇది ఏకంగా 500 మార్క్‌ను దాటిపోయింది. ఆరేళ్లలో కాలుష్యం ఈస్థాయికి చేరడం ఇది రెండోసారి మాత్రమే. తీవ్రమైన వాయుకాలుష్యంతో కళ్లలో మంటలు, గొంతులో గరగర, శ్వాస ఆడకపోవడం తదితర సమస్యలతో ఢిల్లీ వాసులు అవస్థలు పన్నారు. పొగమంచు కారణంగా ఎదురుగా వస్తున్న వాహనాలు కన్పించని పరిస్థితి నెలకొంది.కృత్రిమ వర్షం అంటే..?కృత్రిమ వర్షాన్ని క్లౌడ్ సీడింగ్ అని కూడా అంటారు. ఈ విధానంతో వాతావరణంలో మార్పును తీసుకువస్తారు. గాలిలో నీటి బిందువులు ఏర్పడేలా ఈ ప్రక్రియను కొనసాగిస్తారు. సిల్వర్ ఐయోడైడ్, పొటాషియం ఐయోడైడ్ లాంటి పదార్థాలను గాలిలోకి వదులుతారు. దీని కోసం విమానాన్ని కానీ హెలికాప్టర్‌ను కానీ వాడే అవకాశం ఉంటుంది. అయితే ఈ ప్రక్రియ సక్సెస్ కావాలంటే, ఆ పరీక్ష సమయంలో వాతావరణంలో తేమ చాలా అవసరం అవుతుంది. గాలి కూడా అనుకూలంగా ఉంటేనే ఈ ప్రయోగం సక్సెస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కృత్రిమ వర్షం వల్ల గాలిలో ఉన్న దుమ్ము, ధూళి సెటిల్ అవుతుంది. నీటితో ఆ డస్ట్ కొట్టుకుపోయి.. పర్యావరణం క్లీన్ అవుతుంది. -
అనిల్ అంబానీ భారీ ప్లాన్..
న్యూఢిల్లీ: అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ గ్రూప్ .. 2030 నాటికి భారీ లక్ష్యాల సాధన దిశగా వృద్ధి ప్రణాళికలు రూపొందించుకుంటోంది. ఇందులో భాగంగా రిలయన్స్ గ్రూప్ కార్పొరేట్ సెంటర్‌ని (ఆర్జీసీసీ) ఏర్పాటు చేసింది. కొత్త అవకాశాలను, సాంకేతిక పురోగతులను అందిపుచ్చుకోవడంలో గ్రూప్ కంపెనీలకు మార్గదర్శకత్వం వహించేందుకు ఇది వ్యూహాత్మక హబ్‌గా ఉపయోగపడనుంది.సతీష్ సేథ్, పునీత్ గార్గ్, కె. రాజగోపాల్.. ఆర్జీసీసీ కీలక టీమ్ సభ్యులుగా ఉంటారు. గార్గ్ ప్రస్తుతం రిలయన్స్ ఇన్ఫ్రాకు సీఈవోగా వ్యవహరిస్తుండగా, రాజగోపాల్ గత ఆరేళ్లుగా రిలయన్స్ పవర్‌కు సారథ్యం వహిస్తున్నారు. గ్రూప్ కంపెనీలకు చెందిన ఇతర సీనియర్స్ కూడా ఈ టీమ్‌లో భాగమవుతారు. కంపెనీలను సుస్థిర అభివృద్ధి సాధన దిశగా ముందుకు తీసుకెళ్లడంలో ఆర్జీసీసీ కీలక పాత్ర పోషించగలదని రిలయన్స్ గ్రూప్ అధికార ప్రతినిధి తెలిపారు. విస్తరణ ప్రణాళికల కోసం రూ. 17,600 కోట్ల నిధులను సమీకరిస్తున్నట్లు గ్రూప్ ఒక ప్రకటనలో తెలిపింది.ఆర్‌కామ్ ఖాతాలు ’ఫ్రాడ్’గా వర్గీకరణ.. రిలయన్స్ కమ్యూనికేషన్ (ఆర్‌కామ్), దాని అనుబంధ సంస్థ రిలయన్స్ టెలికాం అకౌంట్లను కెనరా బ్యాంక్ ’ఫ్రాడ్’ ఖాతాలుగా వర్గీకరించింది. ఈ మేరకు బ్యాంకు నుంచి లేఖ అందినట్లుగా ఆర్‌కామ్ ఎక్స్చేంజీలకు తెలిపింది.ఇదీ చదవండి: అనిల్ అంబానీకి అంతలోనే మళ్లీ భారీ ఎదురుదెబ్బ! -
ప్రభుత్వం నుంచి మాకు ఎలాంటి నోటీసులు రాలేదు: వికీపీడియా
భారత ప్రభుత్వం నుంచ తమకు ఎలాంటి నోటీసులు అందలేదని వికీపీడియా తాజాగా వెల్లడించింది. వికీపీడియాలో ఎడిటింగ్ పద్దతులు, కంటెంట్‌లో ఖచ్చితత్వానికి సంబంధించి భారత ప్రభుత్వం నుంచి గత రెండు రోజుల్లో ఎలాంటి అధికారిక నోటీసులు అందలేదని వికీపిడియా ఫౌండేషన్ పేర్కొంది. ఈ మేరకు వికీపీడియా ఫౌండేషన్ ప్రతినిధి మాట్లాడుతూ.. వికీపీడియా లాభాపేక్ష లేని సంస్థ అని,ా ప్రపంచ వ్యాప్తంగా ఎలాంటి ఖర్చు లేకుండా లక్షలాది మందికి అవసరమైన సమాచారాన్ని అందిస్తుందన తెలిపారు.‘ప్రపంచవ్యాప్తంగా 2 లక్షల మందికి పైగా వాలంటీర్లు మా సైట్‌కు కంటెంట్‌ను అందిస్తున్నారు. ప్రతి నెల దాదాపు 850 మిలియన్లకు పైగా భారతీయులకు మా సైట్ ఉపయోగపడుతోంది. ప్రపంచంలోనే అత్యధిక వీక్షకుల్లో భారత్ అయిదో స్థానంలో ఉంది. ఇందులో వాలంటీర్లు వారికి తెలిసిన సమాచారాన్ని సైట్లో అప్లోడ్ చేయరు. విశ్వసనీయ వార్తాసంస్థలు, ప్రముఖ ప్రచురణ సంస్థల నుంచి మాత్రమే సమాచారాన్ని సేకరిస్తారు. అందుకే మా ఆర్టికల్స్లోను విశ్వసిస్తారు. వికీపీడియాలోని ఎడిటింగ్ పద్ధతులు, కంటెంట్‌లోని కచ్చితత్వానికి సంబంధించి భారత ప్రభుత్వం నుంచి ఎలాంటి నోటీసులు అందలేదు. మా సంస్థలోని తటస్థ నిబంధనలను సంపాదకీయులు ఆచరిస్తారు. రాజకీయ నేపథ్యం ఉన్న అనేకమంది వాలంటీర్లు మా సంస్థలో భాగమై ఉన్నారు. ఏ ఆర్టికల్ అయినా విస్తృత సమాచారంతోనే రాస్తాం. ఆ సమాచారానికి సంబంధించిన సోర్సుల వివరాలు కూడా ఆర్టికల్ పేజీల్లో పేర్కొంటాం’ అని తెలిపారు. కాగా ప్రముఖ ఉచిత సమాచార సంస్థ వికీపీడియాకు కేంద్ర ప్రభుత్వం నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. వికీపీడియాలో పక్షపాతంగా సమాచారం ఉంటుందని, కొన్ని తప్పుడు సమాచారాలు కూడా ఉంటున్నాయని పలువురి నుంచి ఫిర్యాదులు అందాయి. వీటిపై కేంద్రం తాజాగా చర్యలు చేపట్టింది. కేంద్రం రాసిన లేఖలో చిన్న సంపాదకులకు, సంస్థలకు కూడా కంటెంట్‌పై ఎడిటోరియల్ నియంత్రణ ఉంటుందని.. వికీపీడియాలో ఆ వ్యవస్థ ఎందుకు లేదని ప్రశ్నించింది. వికీపిడియాను కేవలం మధ్యవర్తిగా కాకుండా పబ్లిషర్‌గా(ప్రచురణకర్త) ఎందుకు పరిగణించకూడదని ప్రశ్నించింది. -
పంట వ్యర్థాలు దహనం చేస్తే భారీ జరిమానా
సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధానిలో కాలుష్యాన్ని అరికట్టే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఢిల్లీ చుట్టుపక్కల రాష్ట్రాల్లోని రైతులు పంట వ్యర్థాలను కాల్చడం వల్లే గాలి కాలుష్యం ఎక్కువైందన్న ఆరోపణలొస్తుండటం తెలిసిందే. దీనిని కట్టడి చేసేందుకు రైతులపై జరిమానాలను భారీగా విధించాలని గురువారం కేంద్రం నిర్ణయించింది. పంట వ్యర్థాలకు నిప్పుపెట్టే రైతులకు జరిమానాలను భూ విస్తీర్ణం ఆధారంగా రూ.5 వేల నుంచి రూ.30 వేల వరకు విధించనున్నట్లు కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ శాఖలు తెలిపాయి. తాజా నిబంధనల ప్రకారం.. రెండెకరాల కంటే తక్కువ భూమి ఉన్న రైతు తన పొలంలోని వ్యర్థాల్ని కాలిస్తే రూ.5వేలు పెనాల్టీ కట్టాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు ఇది రూ.2,500 మాత్రమే ఉంది. అదేవిధంగా, 2 నుంచి 5 ఎకరాల భూమి గల రైతు ఇదే పనిచేస్తే రూ.5 వేలు బదులు ఇకపై రూ.10వేలు కట్టాల్సిందే. అయిదెకరాల కంటే ఎక్కువ భూమి ఉన్న రైతు పంట వ్యర్థాలకు నిప్పుపెడితే రూ.30వేల వరకు వసూలు చేయనున్నట్లు స్పష్టం చేసింది. ఈ నిబంధనలు గురువారం నుంచే అమల్లోకి వచ్చాయని కేంద్రం ప్రకటించింది. ఇవి ‘కమిషన్ ఆఫ్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ చట్టం–2021’లో భాగమని పేర్కొంది. దేశ రాజధాని ఢిల్లీలో గాలి నాణ్యత సూచీ (ఏక్యూఐ) 400 మార్క్‌ను దాటడంతో జనం పలు ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో కాలుష్యం కట్టడికి తీసుకుంటున్న చర్యలు ఏమిటంటూ గత నెలలో సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. పర్యావరణ పరిరక్షణకు కేంద్రం సరైన చట్టాలను రూపొందించలేకపోతోందని న్యాయస్థానం అభిప్రాయపడింది. ఈ క్రమంలోనే జరిమానాలను విధించేందుకు ఉద్దేశించిన నిబంధనలను కేంద్రం ప్రకటించింది. పంజాబ్ రైతు సంఘాల నిరసన పంట వ్యర్థాల నిర్వహణకు అవసరమైన యంత్రాలను అందించడానికి బదులుగా కేంద్రం జరిమానాలను భారీగా పెంచడంపై పంజాబ్‌లోని రైతు సంఘాలు నిరసన తెలుపుతున్నాయి. వ్యర్థాల నిర్వహణకు యంత్రాలు అందుబాటులో లేకపోవడంతో మరోమార్గం లేక దహనం చేస్తున్నామే తప్ప, ఉద్దేశపూర్వకంగా కాదని వారంటున్నారు. కాలుష్యానికి కారణమంటూ రైతుల వైపు వేలెత్తి చూపుతున్న కేంద్ర ప్రభుత్వం, పర్యావరణాన్ని కలుషితం చేస్తున్న పరిశ్రమలపై ఎలాంటి చర్యలు కూడా తీసుకోవడం లేదని భారతీయ కిసాన్ యూనియన్(ఏక్తా ఉగ్రహన్) ప్రధాన కార్యదర్శి సుఖ్‌దేవ్ సింగ్ విమర్శించారు. ప్రభుత్వ నిర్ణయాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. ఇప్పటి వరకు ప్రభుత్వం 30 శాతం మంది రైతులకు మాత్రమే పంట వ్యర్థాల నిర్వహణ యంత్రాలను అందజేసిందని వివరించారు. పంట వ్యర్థాల వల్ల జరిగే కాలుష్యం కంటే పరిశ్రమలు, రవాణా రంగం వల్లే గాలి కాలుష్యం ఎక్కువని పర్యావరణ నిపుణురాలు సునీతా నారాయణ్ తెలిపారు. -
బాంబు బెదిరింపులు: సోషల్‌మీడియా సంస్థలపై కేంద్రం ఆగ్రహం
న్యూఢిల్లీ: దేశీయ, అంతర్జాతీయ విమాన సర్వీసులకు బాంబు బెదిరింపు హెచ్చరికలకు తెరపడటం లేదు. గతంలో ఎన్నడూ లేనివిధంగా కొద్దిరోజులుగా విమానయాన సంస్థలకు వస్తున్న బాంబు బెదిరింపులు అందరినిషాక్ గురిచేస్తున్నాయి. దాదాపు 10 రోజుల్లో 170కి పైగా విమాన సర్వీసులకు హెచ్చరికలు వచ్చాయి. వీటిపై విమానయానశాఖ విచారణ చేపడుతున్ప్పటికీ, ఎయిర్‌లైన్స్ యాజమాన్యం తనిఖీలు చేస్తున్నా బెదిరింపులు మాత్రం ఆగం లేదు.అయితే బెదిరింపులు ఎక్కువగా సామాజిక మాధ్యమాల ద్వారా వస్తుండటంతో తాజాగా కేంద్ర ఎలక్ట్రానిక్, ఐటీ మంత్రిత్వశాఖ.. సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ‘ఎక్స్’పై ఆగ్రహం వ్యక్తం చేసింది. మంత్రిత్వశాఖ సంయుక్త కార్యద్శి సంకేత్ ఎస్ భోంద్వే.. విమానయానసంస్థ అధికారులు, ఎక్స్, మెటా వంటిఇ సోషల్ మీడియా ప్రతినిధితులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సామాజిక మాధ్యమాల పనితీరుపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. ఎక్స్ వంటి మాధ్యమాల్లో వస్తున్న పుకార్లను నియంత్రించడంలో ఎలాంటి చర్యలు తీసుకున్నారని ప్రశ్నించారు.కాగా గత కొన్ని రోజులుగా భారతీయ విమానయాన సంస్థలు నిర్వహిస్తున్న 120కి పైగా విమానాలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. నిన్న కూడా ఇండిగో, విస్తారా, ఎయిర్ ఇండియాకు చెందిన 30 విమానాలకు ఇలాంటి బెదిరింపులు అందాయి. అయితే అధికారులు అప్రమత్తమై భద్రతా ప్రోటోకాల్‌లను అనుసరించారు. ఈ పరిస్థితిపై పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ.. ఇలాంటి బాంబు బెదిరింపులకు పాల్పడేవారిపై కఠినంగా వ్యవహరిస్తామని తెలిపారు. ప్రయాణీకుల భద్రతపై రాజీ పడకుండా ప్రభుత్వం దీనిని పరిష్కరించడానికి ప్రయత్నిస్తోందని అన్నారు. ఇలాంటి బూటకపు బెదిరింపులను ప్రసారం చేసే వారిపై నో ఫ్లై లిస్ట్‌తో సహా కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. అదేవిధంగా ప్రస్తుత విమానయాన భద్రతా నిబంధనల సవరణకు ప్రయత్నిస్తున్నట్లు వెల్లడించారు.ఇవి బూటకపు బెదిరింపులే అయినప్పటికీ వాటిని సీరియస్‌గా తీసుకోవాల్సి ఉంటుందని ఆయన ఉద్ఘాటించారు. బెదిరింపుల దాడి వెనుక కుట్ర దాగి ఉంటుందా అని ప్రశ్నించగా.. దీనిపై సమగ్ర విచారణ జరుగుతోందని మంత్రి చెప్పారు.ఇప్పుడే ఏ విషయం చెప్పలేమని, దర్యాప్తు పూర్తయ్యే వరకు వేచి ఉండాలని కోరారు. -
జమ్ముకశ్మీర్‌కు త్వరలో రాష్ట్రహోదా !
సాక్షి,న్యూఢిల్లీ: త్వరలో జమ్ముకశ్మీర్‌కు త్వరలో రాష్ట్ర హోదా పునరుద్ధరించే అవకాశాలున్నాయి. జమ్ముకశ్మీర్‌కు రాష్ట్ర హోదా కోరుతూ కొత్తగా ఏర్పడ్డ సీఎం ఒమర్ అబ్దుల్లా నేతృత్వంలోని ప్రభుత్వం ఇటీవలే అసెంబ్లీలో తీర్మానం చేసింది.ఈ తీర్మానాన్ని రాష్ట్ర లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్‌సిన్హా ఆమోదం తెలిపారు. దీంతో కేంద్ర ప్రభుత్వం జమ్ముకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ ప్రకారం రాష్ట్రహోదా ఇవ్వనుందన్న ప్రచారం జరుగుతోంది. గతంలో ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్ముకశ్మీర్‌కు రాష్ట్ర హోదా రద్దైన విషయం తెలిసిందే. ఇదీ చదవండి: తమిళనాడు గవర్నర్ వర్సెస్ స్టాలిన్ -
అప్రమత్తంగా ఉందాం... కాపాడుకుందాం
‘‘సైబర్ నేరస్తులు మనల్ని టార్గెట్ చేయడానికి ఎప్పుడూ రెడీగా ఉంటారు. మనం అప్రమత్తంగా ఉండి, మనల్ని మనం కాపాడుకోవాలి’’ అంటున్నారు రష్మికా మందన్నా. గత నవంబరులో రష్మికా మందన్నా డీప్‌ఫేక్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం గుర్తుండే ఉంటుంది. బ్రిటిష్–ఇండియన్ ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ జరా పటేల్ శరీరానికి రష్మికా ముఖాన్ని పెట్టినట్లు ప్రచారం జరిగింది. ఆ వీడియో రష్మికతో పాటు చాలామందిని షాక్‌కి గురి చేసింది. ఆ తర్వాత కూడా పలువురు తారల ఫేక్ వీడియోలు వైరల్ అయ్యాయి.కాగా, తన గురించి వచ్చిన డీప్‌ఫేక్ వీడియో గురించి స్పందిస్తూ... ‘‘నేను స్కూల్లో, లేదా కాలేజీలో ఉన్నప్పుడు ఇలా జరిగి ఉంటే ఆ పరిస్థితిని ఎదుర్కొని ఉండగలనా? అని ఊహించుకుంటేనే భయంగా ఉంది’’ అని రష్మిక అప్పట్లో ట్వీట్ చేశారు. అలాగే ‘‘అందరం కలిసి ఈ ధోరణికొక విరుగుడు కనిపెడదాం’’ అని మహిళలకు పిలుపునిచ్చారు కూడా. ఇప్పుడా పిలుపునకు ఒక సాధికారత లభించింది. ఇండియన్ సైబర్ క్రైమ్ కో ఆర్డినేషన్ సెంటర్ (14సి)కు బ్రాండ్ అంబాసిడర్‌గా కేంద్ర ప్రభుత్వం రష్మికా మందన్నాని నియమించింది. కేంద్ర హోమ్ మంత్రి ఆధ్వర్యంలో ఈ కో ఆర్డినేషన్ సెంటర్ పని చేస్తుంది. రష్మికా మందన్నాని రాయబారిగా ఎంపిక చేసినట్లు మంగళవారం కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.సైబర్ సేఫ్టీ జాతీయ ప్రచారోద్యమ రాయబారిగా తాను నియమితమైన విషయాన్ని సోషల్ మీడియా ద్వారా పేర్కొని, ఓ వీడియో విడుదల చేశారు రష్మిక. ఆ వీడియోలో ‘‘మనం డిజిటల్ యుగంలో బతుకుతున్నాం. సైబర్ క్రైమ్ అనేది చాలా భారీ స్థాయిలో ఉంది. దాని ప్రభావం ఎంత ఉంటుందో స్వయంగా అనుభవించిన వ్యక్తిగా మన ఆన్లైన్ ప్రపంచాన్ని కాపాడుకోవడానికి కఠినమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని భావిస్తున్నాను. మనందరం కలిసి మన కోసం, భవిష్యత్తు తరాల కోసం సురక్షితమైన సైబర్ స్పేస్‌ని రూపొందించుకుందాం. సైబర్ క్రైమ్స్ గురించి వీలైనంత ఎక్కువమందికి అవగాహన కల్పించి, రక్షించాలని అనుకుంటున్నాను.సైబర్ క్రైమ్ కో ఆర్డినేషన్ సెంటర్ బ్రాండ్ అంబాసిడర్‌గా ఈ నేరాలపై అవగాహన పెంచుతాను. మన దేశాన్ని సైబర్ నేరాల నుంచి కాపాడడానికి నా వంతు కృషి చేస్తాను’’ అని పేర్కొన్నారు రష్మికా మందన్నా. ఇక దాదాపు ఏడాది క్రితం (నవంబరు 6) రష్మిక సైబర్ క్రైమ్ బాధితురాలు... ఏడాది తిరక్క ముందే ప్రజల్ని బాధితులు కానివ్వకుండా జాగృతం చేయనున్న సైబర్ యోధురాలు. ఇదిలా ఉంటే... కెరీర్ పరంగా ‘దేవదాస్’ (2018) చిత్రంలో ఇన్స్పెక్టర్ పూజగా నటించారు‡రష్మిక. తెరపై తన బాధ్యతను నిర్వర్తించడానికి కృషి చేశారు. ఇప్పుడు నిజ జీవితంలో సైబర్ సెక్యూరిటీ అంబాసిడర్‌గా తన బాధ్యతను చాలా సిన్సియర్‌గా నిర్వర్తించాలని బలంగా నిర్ణయించుకున్నారు. -
తమిళనాడు రైలు ప్రమాదం.. కేంద్రంపై రాహుల్ మండిపాటు
తమిళనాడులో శుక్రవారం రాత్రి ఘోర రైలు ప్రమాదం జరిగింది. మైసూర్-దర్భంగా భాగమతి ఎక్స్‌ప్రెస్ గూడ్స్ రైలును ఢీకొట్టడంతో ఏకంగా 12 కోచ్‌లు పట్టాలు తప్పాయి.రైలు ప్రమాద ఘటన నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే 18 రైళ్లను రద్దు చేసింది. తిరువళ్లూరు జిల్లాలోని కవరైపెట్లై రైల్వే ష్టేషన్ వద్ద రాత్రి 8.30 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది.తాజాగా బాగమతి ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదంపై కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ స్పందించారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. దాదాపు 300 మంది ప్రయాణికుల ప్రాణాలను బలిగొన్న బాలాసోర్ దుర్ఘటనను ప్రస్తావిస్తూ.. గత సంఘటనల నుంచినేర్చుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని మండిపడ్డారు.“మైసూరు-దర్భంగా రైలు ప్రమాదం భయంకరమైన బాలాసోర్ ప్రమాదానికి అద్దం పడుతుంది. ఒక ప్యాసింజర్ రైలు ఆగి ఉన్న గూడ్స్ రైలును ఢీకొట్టింది. అనేక ప్రమాదాల్లో వందలాది మంది ప్రాణాలు కోల్పోయినప్పటికీ, గుణపాఠాలు నేర్చుకోలేదు. జవాబుదారీతనం లోపించింది. ఈ ప్రభుత్వం మేల్కోకముందే ఇంకా ఎన్ని కుటుంబాలు నాశనం కావాలి?’ అని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు.#WATCH | Tamil Nadu: Latest drone visuals from Chennai-Guddur section between Ponneri- Kavarappettai railway stations (46 km from Chennai) of Chennai Division where Train no. 12578 Mysuru-Darbhanga Express had a rear collision with a goods train, last evening. 12-13 coaches… pic.twitter.com/F7kp7bgLdV— ANI (@ANI) October 12, 2024కాగా ఈ ఘటనలో 19 గాయాలవ్వగా, వారిని సమీపంలోని ఆసుప్రతికి తరలించినట్లు రైల్వే అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఘటనా స్థలంలో పునరుద్ధరణ పనులు జరుగుతున్నాయి. రైలు సేవలను పునరుద్ధరించడానికి మరో 18 గంటలు సమయం పడతుందని పేర్కొన్నారు. ప్రమాద స్థలంలో చెల్లాచెదురుగా దెబ్బతిన్న కోచ్‌లు డ్రోన్ ఫుటేజీలో కనిపిస్తున్నాయి. సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయని, ఇప్పటివరకు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని తమిళనాడు ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ ధృవీకరించారు. -
TG: ఆమ్రపాలికి కేంద్రం షాక్
సాక్షి,హైదరాబాద్: గ్రేటర్హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) కమిషనర్ ఆమ్రపాలికి కేంద్రం షాక్ ఇచ్చింది. ఆమ్రపాలితో పాటు తెలంగాణ కేడర్ కావాలన్న 11 మంది ఐఏఎస్‌ల విజ్ఞప్తిని కేంద్రం తిరస్కరించింది. వీరందరినీ వెంటనే ఆంధ్రప్రదేశ్‌లో రిపోర్టు చేయాలని ఆదేశించింది. ఈ 11 మంది ఐఏఎస్‌లలో జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలితో పాటు విద్యుత్ శాఖ కార్యదర్శి రోనాల్డ్‌రోస్ కూడా ఉన్నారు. వీరందరూ తమకు తెలంగాణ కేడర్ కావాలని కేంద్రంలోని డీవోపీటీ శాఖకు గతంలో దరఖాస్తు చేసుకున్నారు. తాజాగా వీరి విజ్ఞప్తిని కేంద్రం తోసిపుచ్చింది. ఇదీ చదవండి: ఉద్యోగాలిచ్చి కూడా చెప్పుకోలేకపోయాం: వినోద్‌కుమార్ -
‘వైవాహిక అత్యాచారం’ నేరంగా పరిగణించాల్సిన అవసరం లేదు’
న్యూఢిల్లీ: వైవాహిక అత్యాచారాన్ని నేరంగా పరిగణించాల్సిన అవసరం లేదని కేంద్రం సుప్రీంకోర్టుకు తెలియజేసింది. వైవాహిక అత్యాచారాన్ని నేరంగా పరిగణించడం సర్వోన్నత న్యాయస్థానం పరిధిలో లేదని కేంద్రం అభిప్రాయం వ్యక్తం చేసింది. వైవాహిక అత్యాచారం అనేది చట్టపరమైనదాని కంటే సమాజానికి సంబంధించిన సమస్య అని, ఇది సమాజంపై ప్రత్యక్ష ప్రభావం చూపుతుందని కేంద్రం పేర్కొంది. దీనికి చట్టంలో వేరే విధమైన శిక్షలు ఉన్నాయని తెలిపింది.ఈ మేరకు వైవాహిక అత్యాచారాన్ని నేరంగా పరిగణించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లను వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో కేంద్రం గురువారం కౌంటర్ దాఖలు చేసింది. ఈ అంశానికి సంబంధించి అన్ని పక్షాలతో సంప్రదింపులు లేకుండా, అన్ని రాష్ట్రాల అభిప్రాయాలనుపరిగణలోకి తీసుకోకుండా సరైన నిర్ణయానికి రాలేమని తెలిపింది. అయితే ప్రతీ వివాహం మహిళ సమ్మతితో జరగడం లేదని విషయాన్ని కేంద్రం అంగీకరించింది. ఒకవేళ ఏదైనా ఉల్లంఘనలకు పాల్పడితే వారు చట్టపరంగా శిక్షలు ఎదుర్కొవాల్సి ఉంటుందని తెలిపింది. కానీ వివాహంలో జరిగే ఇలాంటి ఉల్లంఘన పరిణామాలు, బయట జరిగే ఉల్లంఘనలకు తేడా ఉంటుందని పేర్కొంది.వివాహంలో తమ జీవిత భాగస్వామి నుంచి శారీరక సంబంధాన్ని కోరుకోవడం సహజం కానీ.. తన భార్య ఇష్టానికి వ్యతిరేకంగా ఆమెను లైంగిక సంబంధానికి ఒత్తిడి చేసే హక్కు భర్తకు లేదు. అలాంటి చర్యకు పాల్పడిన వ్యక్తిపై అత్యాచార నిరోధక చట్టాల కింద శిక్ష విధించడం మితిమీరినది(అవసరమైన దానికంటే ఎక్కువ). వివాహంలో మహిళ సమ్మతిని రక్షించేందుకు పార్లమెంట్ ఇప్పటికే చర్యలు తీసుకుంది. ఇందులో వివాహితలపై క్రూరత్వానికి పాల్పడే వారిని శిక్షించే చట్టాలు ఉన్నాయి’ అని కేంద్రం పేర్కొంది.కాగా భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 375లోని 2వ మినహాయింపున సవాల్ చేస్తూ గతంలో ఢిల్లీ హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. సెక్షన్ 375లోని రెండో మినహాయింపు 18 ఏళ్లు లేదా అంతకంటే పైబడిన భార్యతో భర్త శారీరక సంబంధంలో పాల్గొనడాన్ని అనుమతిస్తుంది. దీనికి వ్యతిరేకంగా వేసిన పిటిషన్లపై ఢిల్లీ హైకోర్టు విభజన తీర్పు వెల్లడించింది. జస్టిస్ రాజీవ్ శక్ధేర్ ఈ నిబంధన రాజ్యాంగ విరుద్ధమని ప్రకటించగా, జస్టిస్ సి హరిశంకర్ దీనిని సమర్థించారు. అయితే హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టు స్టే విధించింది. తాజాగా దీనిపై విచారణ చేపట్టింది. -
కేంద్రానికి టీడీపీ మద్దతు ఉపసంహరించుకోవాలి: ఎంపీ గొల్లబాబురావు
సాక్షి,విశాఖపట్నం: చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఎన్నికలకు ముందు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపుతామని హామీ ఇచ్చిన విషయాన్ని వైఎస్ఆర్సీపీ ఎంపీ గొల్లబాబురావు గుర్తు చేశారు. ఈ విషయమై ఆయన మంగళవారం (సెప్టెంబర్ 16) మీడియాతో మాట్లాడారు. ‘ఇచ్చిన మాటను పవన్, బీజేపీ నేతలు చంద్రబాబు నిలబెట్టుకోవాలి. పార్లమెంట్లో నేను అడిగిన ప్రశ్నకు సమాధానంగా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగదని చెప్పారు.స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వైఖరి స్పష్టం చేయాలి. టీడీపీ నేతల రాజీనామాలతో ఎటువంటి ప్రయోజనం లేదు.కేంద్ర ప్రభుత్వంపై చంద్రబాబు ఒత్తిడి తేవాలి. లేదా కేంద్ర ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకోవాలి. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరిగితే లక్షలాదిమంది రోడ్డున పడతారు’అని బాబురావు అన్నారు. ఇదీ చదవండి.. తిరుమలలో మంత్రి ఆనంను నిలదీసిన భక్తులు -
ఎలక్ట్రిక్ వాహనాలకు రూ.10,900 కోట్లు.. కేంద్రం ఆమోదం
దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వాడకాన్ని పెంచడానికి ‘ఫేమ్’ పథకం స్థానంలో రెండు సంవత్సరాలకు రూ.10,900 కోట్లతో పీఎం ఈ-డ్రైవ్ స్కీమ్‌కు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో పీఎం ఎలక్ట్రిక్ డ్రైవ్ రివల్యూషన్ ఇన్నోవేటివ్ వెహికల్ ఎన్హాన్స్మెంట్ (పీఎం ఈ-డ్రైవ్) పథకంపై నిర్ణయం తీసుకున్నట్లు సమాచార, ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు.ఏయే వాహనాలకు ఎంతెంత?పీఎం ఈ-డ్రైవ్ పథకం 24.79 లక్షల ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు, 3.16 లక్షల ఈ-త్రీ వీలర్లు, 14,028 ఈ-బస్సులకు మద్దతు ఇస్తుంది. అలాగే 88,500 ఛార్జింగ్ సైట్లకు కూడా ఈ స్కీమ్ ప్రోత్సాహం అందిస్తుందని మంత్రి అశ్విని వైష్ణవ్ చెప్పారు.ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు, ఎలక్ట్రిక్ త్రీ-వీలర్లు, ఈ-అంబులెన్స్‌లు, ఈ-ట్రక్కులు, ఇతర అభివృద్ధి చెందుతున్న ఎలక్ట్రిక్ వాహనాల (EVలు) వాడకాన్ని ప్రోత్సహించడానికి ఈ పథకం కింద రూ.3,679 కోట్ల విలువైన సబ్సిడీలు/డిమాండ్ ప్రోత్సాహకాలను ప్రభుత్వం అందిస్తుంది.ఇదీ చదవండి: న్యూ లాంచ్: ఎలక్ట్రిక్ యుటిలిటీ కారు ఎంజీ విండ్సర్14,028 ఈ-బస్సుల కొనుగోలు కోసం ప్రభుత్వ, ప్రజా రవాణా సంస్థలకు రూ.4,391 కోట్లు అందిస్తారు. రోగుల తరలింపు కోసం ఈ-అంబులెన్స్ వినియోగాన్ని ప్రోత్సహించడానికి ప్రభుత్వం కొత్త చొరవను తీసుకుంది. ఈ-అంబులెన్స్‌ల విస్తరణకు రూ.500 కోట్లు కేటాయించింది. అలాగే ఈ-ట్రక్కుల వినియోగాన్ని ప్రోత్సహించడానికి రూ.500 కోట్లు అందించనుంది. -
భారత్‌లో అనుమానిత మంకీపాక్స్ కేసు.. కేంద్రం కీలక ఆదేశాలు
ఢిల్లీ: దేశంలో అనుమానిత మంకీపాక్స్ కేసు నమోదైన నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ రాష్ట్రాలకు కీలక ఆదేశాలు జారీచేసింది. మంకీపాక్స్ లక్షణాలుంటే వెంటనే పరీక్షలు నిర్వహించాలని, వారి కాంటాక్ట్ లిస్ట్‌ను తయారు చేయాలని సూచించింది. ఈ మేరకు సోమవారం కీలక అడ్వైజరీ జారీ చేసింది.కాంటాక్ట్ ట్రేసింగ్ కోసం ఇంటిగ్రేటెడ్ డిసీజ్ సర్వైలెన్స్ ప్రోగ్రామ్ (IDSP) కింద వ్యాధిపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ హైలైట్ చేసింది.మంకీపాక్స్ సాధారణ సంకేతాలు, లక్షణాలు, రోగనిర్ధారణ తర్వాత తీసుకోవలసిన చర్యల గురించి తెలుసుకోవాలని అన్నీ రాష్ట్రాలకు జారీచేసిన ఆదేశాల్లో పేర్కొంది. ముఖ్యంగా చర్మ సంబంధిత సమస్యల విషయంలో శ్రద్ధ వహించాలని తెలిపింది. 99,176 కేసులు.. 208 మరణాలు యూరప్, ఆఫ్రికా దేశాల్లో ఇటీవల మంకీపాక్స్ వైరస్ కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. దాంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ మంకీపాక్స్‌ను ‘అంతర్జాతీయ ఆరోగ్య విపత్తు’గా ఆగస్టు 14న ప్రకటించింది. ఈ వైరస్ వ్యాప్తి 2022లో వెలుగులోకి వచ్చింది. ఇటీవల ఆఫ్రికాలో కొత్త రకం ఎంపాక్స్ పుట్టుకొచ్చినట్లు తేలింది. 2022 వైరస్ కంటే ఇది మరింత ప్రాణాంతకమని తేలింది. కొత్త వైరస్ లైంగిక సంబంధాల ద్వారా కూడా వ్యాప్తి చెందుతుందని నిపుణులు చెబుతున్నారు. 2022 నుంచి 2023 దాకా 116 దేశాల్లో 99,176 ఎంపాక్స్ కేసులు నమోదయ్యాయి. 208 మంది మరణించారు. 2024లో 15,600కు పైగా కేసులు నమోదయ్యాయి. 537 మంది మృతిచెందారు. 2022 నుంచి భారత్‌లో కనీసం 30 ఎంపాక్స్ కేసులు నమోదయ్యాయి. చివరిసారిగా ఈ మార్చి నెలలో ఒక కేసు బయటపడింది. -
కేంద్ర ప్రభుత్వాన్ని రూ.6,880 కోట్లు అడిగాం
సాక్షి, అమరావతి: వరద నష్టాలను ప్రాథమికంగా అంచనా వేసి కేంద్రానికి నివేదిక పంపినట్టు సీఎం చంద్రబాబు తెలిపారు. వరద వల్ల రాష్ట్రానికి రూ.6,880 కోట్ల నష్టం కలిగినట్టు ప్రాథమికంగా అంచనా వేశామని, ఈ మేరకు తక్షణ సాయం అందించాల్సిందిగా కేంద్రాన్ని కోరినట్టు తెలిపారు. ఆదివారం విజయవాడ కలెక్టరేట్లో మీడియాతో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ వినాయక చవితి రోజు బుడమేరు మూడో గండిని ఆర్మీ సాయంతో విజయవంతంగా పూడ్చినట్టు చెప్పారు. వరద వచ్చి వారం రోజులైనా తగ్గకపోవడంతో ప్రజలు ఆవేశంగా ఉన్నారని, శనివారం కూడా రాజరాజేశ్వరిపేటలో 4 అడుగుల నీరు ఉందని వ్యాఖ్యానించారు. రెండు రోజుల వర్షాలపై అప్రమత్తం చేశాంరానున్న రెండు రోజుల్లో శ్రీకాకుళం నుంచి ప్రకాశం జిల్లా వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో అప్రమత్తంగా ఉండాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించినట్టు సీఎం చెప్పారు. ముఖ్యంగా ఉత్తరాంధ్రలోని ఏజెన్సీ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురవనుండటంతో ఏలేరు రిజర్వాయర్ నిండి దిగువ ప్రాంతమైన పిఠాపురం పరిసర ప్రాంతాలకు వరద ప్రమాదం ఉందని హెచ్చరించారు.ఏలేరు నదికి సోమ, మంగళ వారాల్లో 10 వేల నుంచి 20 వేల క్యూసెక్కుల నీటి ప్రవాహం వచ్చే అవకాశం ఉందని ఇప్పటికే ఏలేరు రిజర్వ్యర్లో 21 టీఎంసీల నీరు ఉండటంతో దిగువ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. బుడమేరు నుంచి వరద కొల్లేరుకు చేరుతుండటంతో నందివాడ మండలం ముంపునకు గురయ్యే అవకాశం ఉందన్నారు. విజయవాడ ముంపు ప్రాంతాల్లో వరద నీరు క్రమేపీ తగ్గుతోందని, వర్షాలు లేకపోతే సోమవారం సాయంత్రానికి మొత్తం నీరు లాగేస్తుందని అంచనా వేస్తున్నట్టు తెలిపారు. రానున్న 36 గంటల్లో ఎంత వర్షం నీరు వస్తుందన్న అంచనాలు వేసుకుని దానికి అనుగుణంగా కార్యాచరణ రూపొందిస్తున్నట్టు తెలిపారు.ఆపరేషన్ బుడమేరుభవిష్యత్లో విజయవాడకు వరద భయం లేకుండా ఆపరేషన్ బుడమేరు చేపడుతున్నట్టు చంద్రబాబు ప్రకటించారు. బుడమేరు చుట్టుపక్కల ఆక్రమణలు తొలగించి నీరు వేగంగా వెళ్లే విధంగా చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. బుడమేరు సామర్థ్యాన్ని 10–15 వేల క్యూసెక్కులకు పెంచే విధంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు తెలిపారు. -
‘ ఇన్ఫోసిస్ సంగతేంటో చూడండి’.. రంగంలోకి ప్రభుత్వం
ఫ్రెషర్లను ఆన్‌బోర్డ్ చేయడంలో జాప్యం చేస్తున్న ఐటీ సంస్థ ఇన్ఫోసిస్ విషయంలో ప్రభుత్వం స్వయంగా రంగంలోకి దిగింది. ఈ సంగతేంటో చూడాలని కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ కర్ణాటక ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది.ఈ మేరకు కర్ణాటక రాష్ట్ర లేబర్ కమిషనర్ కార్యాలయానికి ప్రభుత్వం సూచనలను అందించింది. ఇన్ఫోసిస్ ఫ్రెషర్లను ఆన్‌బోర్డ్ చేయడంలో జాప్యం చేస్తున్న వ్యవహారాన్ని పరిశీలించి తమకు, అభ్యర్థులకు అప్డేట్లను అందించాలని కర్ణాటక ప్రభుత్వాన్ని కేంద్ర కార్మిక శాఖ కోరింది.ఇన్ఫోసిస్ 2022లో ఆఫర్ లెటర్ ఇచ్చిన 2,000 మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లను ఆన్‌బోర్డింగ్ చేయడంలో ఆలస్యం చేస్తోందన్న ఆందోళనల నేపథ్యంలో ఈ చర్య వచ్చింది. ఆన్‌బోర్డింగ్ తేదీలలో సర్దుబాటు చేసినప్పటికీ, ఫ్రెషర్లకు ఇచ్చిన ఆఫర్లను గౌరవిస్తామని, అందిరినీ ఉద్యోగాల్లోకి చేర్చుకుంటామని ఇన్ఫోసిస్ సీఈవో సలీల్ పరేఖ్ హామీ ఇచ్చారు. 2024 జూన్ నాటికి 315,000 మంది ఉద్యోగులతో ఐటీ రంగంలో ఇన్ఫోసిస్ ఒక ప్రధానమైన శక్తిగా ఉంది.2,000 మంది గ్రాడ్యుయేట్లను ఇన్ఫోసిస్ ఆలస్యంగా ఆన్‌బోర్డింగ్ చేయడంపై ఐటీ, ఐటీఈఎస్ ఉద్యోగుల యూనియన్ అయిన నాసెంట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎంప్లాయీస్ సెనేట్ (NITES) నుండి కేంద్ర కార్మిక, ఉపాధి శాఖకు ఫిర్యాదు అందింది.ఈ వారం ప్రారంభంలో వచ్చిన నివేదికల ప్రకారం.. ఇన్ఫోసిస్ ఆన్‌బోర్డ్‌లో చేరడానికి సిద్ధంగా ఉన్న కొంతమంది గ్రాడ్యుయేట్లకు కన్ఫర్మేషన్ ఈమెయిల్‌లను పంపడం ప్రారంభించింది. మైసూర్లో చేరడానికి అక్టోబర్ 7ను షెడ్యూల్ తేదీగా పేర్కొంది. -
Puja Khedkar: పూజా ఖేద్కర్‌కు బిగ్ షాక్
న్యూఢిల్లీ: మాజీ ట్రైనీ ఐఏఎస్ అధికారిణి పూజా ఖేద్కర్ వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. తాజాగా ఆమెకు కేంద్రం షాకిచ్చింది. ఆమెను ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ నుంచి తొలిగిస్తున్నట్లు ప్రకటించింది. తక్షణమే ఆమెపై వేటు నిర్ణయం అమల్లోకి వస్తుందని వెల్లడించింది. ఐఏఎస్ రూల్స్ 1954 ప్రకారం ఆమెపై చర్యలు తీసుకున్నట్లు అధికార ఉత్తర్వుల్లో పేర్కొంది.కాగా పుణెలో ఐఏఎస్ ప్రొబేషనరీ సమయంలో అధికార దుర్వినియోగానికి పాల్పడినట్లు గత జూన్‌లో ఖేద్కర్‌పై ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. ట్రైనింగ్ సమయంలో అధికారిక ఐఏఎస్ నెంబర్ ప్లేట్ కలిగిన కారు, కార్యాలయం వినియోగించడంతో ఆమెపై పుణె కలెక్టర్ మహారాష్ట్ర సీఎస్‌కు లేఖ రాశారు. దీంతో ఆమెపై బదిలీ వేటు పటింది. అక్కడి నుంచి పూజా అక్రమాల చిట్టా బయటపడింది.సివిల్ సర్వీసెస్‌కు ఎంపిక అయ్యేందుకు ఓబీసీ, వికలాంగుల కోటాలో నకిలీ దృవీకరణ పత్రాలు సర్పించినట్లు సైతం తేలింది. అంతేగాక నిబంధనలకు మించి సివిల్ సర్వీసెస్ పరీక్షలు రాసినట్లు తెలిసింది. దీంతో ఈ వ్యవహారంపై దర్యాప్తు చేపట్టిన యూపీఎస్సీ... ఆమెను ముస్సోరిలోని లాల్‌బహదూర్ శాస్త్రి జాతీయ అకాడమీకి తిరిగి రావాలని ఆదేశించింది. నకిలీ పత్రాలతో పరీక్షలో ఉత్తీర్ణత సాధించినట్లు గుర్తించిన యూపీఎస్సీ దానిపై వివరణ ఇవ్వాలని షోకాజ్ నోటీసులిచ్చింది. ఆమెపై ఫోర్జరీ కేసు నమోదు చేయడంతో పాటు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అభ్యర్థిత్వాన్ని రద్దు చేసింది. -
వరద సాయంపై వదిన-మరిది.. తలోమాట!
అమరావతి, సాక్షి: తెలుగు రాష్ట్రాలకు కేంద్ర సాయం విషయంలో తీవ్రమైన గందరగోళం నెలకొంది. తక్షణ సాయం కింద కేంద్రం మూడు వేల కోట్ల రూపాయలు ప్రకటించిందని ఓ ప్రచారం జరగ్గా.. కాసేపటికే అతి ఉత్తదని చంద్రబాబు ప్రకటనతో తేలిపోయింది. భారీ వర్షాలు, వరదల కారణంగా అతలాకుతలమైన తెలుగు రాష్ట్రాలకు విపత్తు నిర్వహణ నిధి (ఎస్డీఆర్ఎఫ్) నుంచి రూ.3,448 కోట్లు ఇవ్వాలని కేంద్రం నిర్ణయించిందని, తక్షణ సహాయక చర్యల కోసం ఈ నిధులు కేటాయిస్తున్నట్టు ఒక ప్రచారం మొదలైంది. తెలుగు రాష్ట్రాల్లో కేంద్ర బృందాలతో పాటు పర్యటించిన కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ ఈ మేరకు ప్రకటన చేశారన్నది ఆ ప్రచారసారాంశం. అయితే..ఒకవైపు.. కేంద్రం ఆ సాయాన్ని విడుదల చేసిందంటూ తన ఎక్స్ ఖాతాలో ఏకంగా ఓ పోస్ట్ చేశారు ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి. త్వరగతిన సాయం విడుదల చేసినందుకుగానూ ఏపీ ప్రజల తరఫున నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్రానికి కృతజ్ఞతలు తెలియజేశారామె. మరోవైపు.. ఏపీ తెలంగాణకు తక్షణ సహాయం కింద ఎస్డీఆర్ఎఫ్ నుంచి 3,448 కోట్ల రూపాయల నిధులు విడుదల చేస్తున్నామని, ఈ నిధులలో కేంద్ర ప్రభుత్వ వాటా ఉంటుందని, తెలుగు రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం సంపూర్ణంగా సహకరిస్తుందని, వరద నష్టం పై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యవేక్షిస్తున్నారని శివరాజ్ సింగ్ పేరిట ఒక ప్రకటన విడుదలైంది. అయితే కాసేపటికే అది ఉత్తప్రచారం అని తేలింది.కేంద్రం ఇంకా సాయం ప్రకటించలేదు. అదంతా రూమర్ మాత్రమే. అసలు ఇంకా నష్టంపై నివేదికను కేంద్రానికి పంపనే లేదు. రేపు(శనివారం) ఆ రిపోర్టును పంపుతాం అని స్పష్టత ఇచ్చారు చంద్రబాబు. అధికారులపై మళ్లీ చిందులువరద బాధితులకు రేషన్ పంపిణీ విషయంలో సీఎం చంద్రబాబు.. మరోసారి అధికారులపై చిందులు తొక్కారు. ‘‘ఎక్కువ వాహనాలు పెట్టారు. మా వాళ్ళు పద్ధతి లేకుండా చేశారు.ప్యాకింగ్ కూడా సక్రమంగా చెయ్యలేదు. ఈరోజు రేషన్ పంపిణీ చేయలేకపోయాం అని యంత్రాంగంపై ఆక్రోశం ప్రదర్శించారు. ఇవాళ 80 వేలు కుటుంబాలకు ఇవ్వాలి అనుకున్నాం. ఈరోజు కేవలం 15 వేలు కుటుంబాలకే ఇచ్చాం. రేపు మరో 40 వేల కుటుంబాలకు అందించే ప్రయత్నం చేస్తాం. ఎల్లుండి నుండి సరుకులను రేషన్ షాపుల్లో మాత్రమే పంపిణీ చేస్తాం అని చంద్రబాబు వెల్లడించారు. -
కోల్‌కతా ఘటనపై ప్రధానికి మమతా లేఖ.. కేంద్రం ఘాటు రిప్లై
న్యూఢిల్లీ: వైద్య విద్యార్థినిపై హత్యాచార ఘటన నేపథ్యంలో మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడే నిందితులను శిక్షించేందుకు కఠినమైన చట్టం తీసుకురావాలని డిమాండ్ చేస్తూ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాసిన విషయం తెలిసిందే. తాజాగా సీఎం లేఖపై కేంద్రం ఘాటుగా స్పందించింది. ఈ మేరకు కేంద్ర మహిళా, శిశుసంక్షేమశాఖ మంత్రి అన్నపూర్ణ దేవి సీఎం మమతా బెనర్జీకి సోమవారం లేఖ రాశారు.మహిళలు, చిన్నారులపై వేధింపులు, అత్యాచారాలకు సంబంధించిన కేసులను విచారించేందుకు పశ్చిమబెంగాల్‌కు కేంద్ర ప్రభుత్వం 123 ఫాస్ట్‌ట్రాక్ ప్రత్యేక కోర్టులను కేటాయించినప్పటికీ.. వీటిలో ఇప్పటికీ చాలా వరకు ప్రారంభించలేదని మండిపడ్డారు. మమత సర్కార్ మహిళల భద్రత విషయంలో వైఫల్యం చెందిందని,మహిళలు, చిన్నారులపై వివక్ష, హింసను నియంత్రించేందుకు తక్షణమే సమర్థమంతమైన చర్యలు తీసుకోవాలని విమర్శలు గుప్పించారు. ‘కోల్‌కతాలో హత్యాచారానికి గురైన డాక్టర్ తల్లిదండ్రులకు నా సంతాపం. గత నెలలో దేశ వ్యాప్తంగా అమల్లోకి వచ్చిన భారతీయ న్యాయ సంహిత చట్టం ద్వారా కఠినమైన శిక్షలను అమలు చేస్తున్నాం. దీని ద్వారా మహిళలు, చిన్నారులపై జరుగుతున్న నేరాలను అడ్డుకుంటున్నాం. ఇక ఫాస్ట్ ట్రాక్ కోర్టుల విషయానికొస్తే.. ఈ కోర్టులను ఏర్పాటు చేసేందుకు 2019లో కేంద్రం పథకం ప్రారంభించింది. దేశ వ్యాప్తంగా 30 జూన్ 2024 నాటికి, 409 ప్రత్యేకమైన పోక్సో కోర్టులతో సహా 752 ఎఫ్టీఎస్సీలు పని చేస్తున్నాయి. వీటి కింద 2,53,000 కంటే ఎక్కువ కేసులు పరిష్కరం పపొందాయి. ఇక పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి మొత్తం 123 ఎఫ్టీఎస్సీల కేటాయింపు జరిగింది. ఇందులో 20 ప్రత్యేక పోక్సో కోర్టులు 103 ఎఫ్టీఎస్సీలు ఉన్నాయి. అయితే వీటిలో ఏవి కూడా 2023 జూన్ వరకు పనియలేదు. రాష్ట్రంలో 48,600 అత్యాచారం, పోక్సో కేసులు పెండింగ్‌లో ఉన్నప్పటికీ.. ఇంకా 11 ఫాస్ట్ ట్రాక్ ప్రత్యేక కోర్టులను ప్రారంభించేందుకు ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. ఉమెన్ హెల్ప్ లైన్ 181, ఎమర్జెన్సీ రెస్పాన్స్ సపోర్ట్ సిస్టమ్ 112, చైల్డ్ హెల్ప్‌లైన్ 1098లను సమర్థంగా అమలు చేయడంలో విఫలమయ్యారు. బాధిత మహిళలకు తక్షణ సాయం అందించడంలో ఈ సేవలు ఎంతో అవసరం. కేంద్ర ప్రభుత్వం పలుమార్లు గుర్తు చేస్తున్నా.. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం వీటిని ఇంకా ఏకీకృతం చేయలేదు. ఈ లోపం కారణంగా రాష్ట్రంలోని మహిళలు, చిన్నారులు ఆపద సమయంలో అవసరమైన సహాయాన్ని కోల్పోతున్నారు’ అని మండిపడ్డారుకాగా దేశంలో మహిళలపై అత్యాచార ఘటనలు ఎక్కువైపోతున్నాయని ఆరోపిస్తూ గతవారం మమతా బెనర్జీ ప్రధానినరేంద్ర మోదీకి లేఖ రాశారు. దేశంలో రోజుకు 90 అత్యాచార కేసులు నమోదవుతున్నాయని, వీటిలో చాలా సందర్భాల్లో బాధితులు హత్యకు గురవతున్నారని తెలిపారు. ఇదంతా చూస్తుంటే భయంకరంగా ఉంది. ఇది సమాజం విశ్వాసాన్ని, మనస్సాక్షిని కదిలిస్తుందని అన్నారు.మహిళలు సురక్షితంగా ఉండేలా వారికి రక్షణ కల్పించడం మన కర్తవ్యం. ఇటువంటి తీవ్రమైన, సున్నితమైన సమస్యను పరిష్కరించాల్సిన అవసరం ఉంది. ఈ క్రూరమైన నేరాలకు పాల్పడిన వారికి కఠినమైన శిక్షలు విధించేలా కేంద్రంచ ట్టం తీసుకుకురావాలి’ అని పేర్కొన్నారు. అదే విధంగా అటువంటి కేసులను త్వరగా పరిష్కరించడానికి ఫాస్ట్ ట్రాక్ ప్రత్యేక కోర్టులను ఏర్పాటు చేయాలని కోరారు. సత్వర న్యాయం జరగాలంటే 15 రోజుల్లోగా విచారణ పూర్తి చేయాలని ఆమె సూచించారు. -
ఒక్క క్లిక్‌తో ఆధార్ సెంటర్ లొకేషన్ తెలుసుకోండిలా
మీకు దగ్గరలో ఆధార్ కేంద్రం ఎక్కడ ఉందో తెలియక ఇబ్బంది పడుతున్నారా? గూగుల్ మ్యాప్‌లో ఆధార్ సెంటర్ లొకేషన్ కనిపించడం లేదా? అయితే ఇప్పుడు దీనికి పరిష్కారం లభించింది. గూగుల్ మ్యాప్ నావిగేష్ను తలదన్నేలాంటి టెక్నాలజీ మనముందుకొచ్చింది. దీనిని యూనిక్ ఐడెంటిటీ అథారిటీ ఆఫ్ ఇండియా(యూఐడీఏఐ) రూపొందించింది. దీని సాయంతో ఒక్క క్లిక్‌తో సమీపంలో ఆధార్ కేంద్రం ఎక్కడుందో సులభంగా తెలుసుకోవచ్చు. ఈ పోర్టల్‌కు ‘భువన్ ఆధార్’ అని పేరు పెట్టారు.దీనిని యూఐడీఏఐ డివైన్ నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ ఆఫ్ ఇండియా స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఇస్రో(ఎన్ఆర్ఎస్సీ) సహాయంతో రూపొందించింది. ఇది వెబ్ ఆధారిత పోర్టల్. ఇది ఆధార్ వినియోగదారులకు ఎంతో ఉపయోగకరంగా ఉండనున్నదని యూఐడీఏఐ చెబుతోంది.సాధారణంగా వినియోగదారులు సమీపంలోని ఆధార్ కేంద్రాన్ని గుర్తించేందుకు గూగుల్ మ్యాప్ సహాయం తీసుకుంటారు. అయితే అన్ని సమయాల్లోనూ గూగుల్ మ్యాప్ ఖచ్చితమైన సమాచారం అందించలేదు. లేదా అప్డేట్ను అందించదు. ఈ సమస్యకు పరిష్కారం చూపేందుకే యూఐడీఏఐ ‘భువన్ ఆధార్’ పోర్టల్‌ను అందుబాటులోకి తెచ్చింది. దీని సాయంతో వినియోగదారులు ఆధార్ కేంద్రాన్ని సులభంగా గుర్తించవచ్చు. ఈ పోర్టల్‌ను ప్రతీ 15 రోజులకు అప్డేట్ చేస్తుంటామని యూఐడీఏఐ తెలిపింది. #BhuvanAadhaarPortal #EaseOfLivingBhuvan Aadhaar Portal is facilitating Ease of Living by routing easy navigation to your nearest #authorized #Aadhaar Centre.To locate your nearest #AadhaarCentre visit: https://t.co/3Kkp70Kl23 pic.twitter.com/e7wEar5WXi— Aadhaar (@UIDAI) August 21, 2024 -
ల్యాటరల్ ఎంట్రీ దుమారం.. కేంద్ర ప్రభుత్వం యూటర్న్
న్యూఢిల్లీ: వివిధ మంత్రిత్వ శాఖలలో ‘లేటరల్ ఎంట్రీ’ ద్వారా పోస్టుల భర్తీపై కేంద్ర ప్రభుత్వం యూటర్న్ తీసుకుంది. కేంద్ర ప్రభుత్వంలోని 45 కీలక పదవుల్లోకి కాంట్రాక్టు పద్ధతిలో ప్రైవేటు వారిని నియమించడానికి యూపీఎస్సీ జారీ చేసిన ‘ల్యాటరల్ ఎంట్రీ’పై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో బీజేపీ సర్కార్ వెనక్కి తగ్గింది.ఈ మేరకు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్.. కీలక ఉత్తర్వులు జారీ చేశారు. యూపీఎస్సీ నిర్ణయం సామాజిక న్యాయంతో ముడిపడి ఉండాలని పేర్కొన్నారు. యూపీఎస్సీ ఇచ్చిన నోటిఫికేషన్‌ను రద్దు చేయాలని యూపీఎస్సీ ఛైర్మన్‌కు లేఖ రాశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు లేఖలో పేర్కొన్నారు.కాగా గతవారం కేంద్ర ప్రభుత్వంలోని వివిధ ఉన్నత స్థానాల్లో ‘ల్యాటరల్ ఎంట్రీ’ద్వారా నియమాకాల కోసం ప్రతిభావంతులైన భారతీయులు కావాలంటూ యూపీఎస్సీ ఓ ప్రకటన విడుదల చేసింది. మొత్తం 24 మంత్రిత్వ శాఖలలో 45 పోస్టులు ఉన్నాయి. వీటిలో జాయింట్ సెక్రటరీ, డైరెక్టర్ మరియు డిప్యూటీ సెక్రటరీ ఉన్నారు. ఈ పోస్టుల నియామకం కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఉంటుంది. ప్రైవేట్ రంగానికి చెందిన వ్యక్తులు కూడా ప్రభుత్వంతో కలిసి పనిచేసే అవకాశం ఉంటుంది. అయితే ఈ పథకంపై వ్యతిరేక వ్యక్తమవుతుండటంతో కేంద్ర మంత్రి ఈ కీలక ఉత్తర్వులు జారీ చేశారు.కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో మధ్య స్థాయి, సీనియర్ స్థాయి పదవులను సాధారణంగా ఐఏఎస్ వంటి సివిల్ సర్వీసుల అధికారులతో భర్తీ చేస్తారు. అయితే ఈ పదవులను సివిల్ సర్వీసులతో సంబంధం లేని బయటి వ్యక్తులు, నిపుణులను కాంట్రాక్టు పద్ధతిలో భర్తీ చేయడాన్నే ‘ల్యాటరల్ ఎంట్రీ’అంటారు. మూడేళ్లు, అయిదేళ్ల ఒప్పందంతో వీరిని నియమిస్తారు. ఈ పద్ధతిని ప్రధానిగా మోదీ తొలి హయాంలో 2018లో అమలు చేశారు.ఈ ప్రకటనను కేంద్రమంత్రి, ఎన్డీఏ భాగస్వామ్య లోక్ జనశక్తి పార్టీ(రామ్ విలాస్) అధ్యక్షుడు చిరాగ్ పాశ్వాన్‌తో పాటు ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. కాంగ్రెస్ ఎంపీ, లోక్‌సభలో విపక్ష నేత రాహుల్‌గాంధీ ఈ పద్దతిని తప్పుపట్టారు. దానిని జాతి వ్యతిరేక చర్యగా అభివర్ణించారు. సమాజ్‌వాదీ, బీఎస్పీ సైతం ఈ విధానాన్ని వ్యతిరేకించాయి. -
దేశంలో వైద్య సిబ్బంది భదత్ర కోసం కేంద్ర కమిటీ
న్యూఢిల్లీ: కోల్‌కతా యువవైద్యురాలిపై హత్యాచార ఘటన తర్వాత.. దేశవ్యాప్తంగా వైద్యులు ఆందోళన బాట పట్టారు. తమపై దాడుల్ని అరికట్టాలంటూ నిరసనలతో రోడ్డెక్కారు. దేశవ్యాప్తంగా ఓపీ సేవలు నిలిపేసి 24 గంటల సమ్మె చేపట్టారు. ఈ నేపథ్యంలో డాక్టర్ల భద్రత కోసం ఓ కమిటీ ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది.రెసిడెంట్ డాక్టర్స్ అసోషియేషన్ ఫెడరేషన్,ఇండియన్ మెడికల్ అసోషియేషన్, ఢిల్లీ రెసిడెంట్ డాక్టర్స్ అసోషియేషన్ ప్రతినిధులు, కేంద్ర వైద్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ అధికారుల్ని కలిశారు. ఈ నేపథ్యంలోనే ఈ భద్రతా హామీ ప్రకటన వెలువడింది. ‘‘వైద్య రంగానికి చెందిన ప్రతినిధులు మమ్మల్ని కలిశారు. తమపై జరుగుతున్న దాడులపై వాళ్లు ఆందోళన వ్యక్తం చేశారు. భద్రత, రక్షణ కల్పన ప్రధానాంశాలుగా ప్రస్తావించారు. కేంద్రం ఈ విషయంలో అలసత్వం ప్రదర్శించదు. ఇందుకోసం ఓ కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. వైద్య వృత్తిలో ఉన్న వాళ్ల భద్రత కోసం ఎలాంటి ప్రమాణాలు పాటించాలి? అనేది ఆ కమిటీ మాకు సూచిస్తుంది. దానిని బట్టి విధివిధానాలను రూపొందిస్తాం. ఇప్పటికే దేశంలో 26 రాష్ట్రాలు వైద్య సిబ్బంది రక్షణ చట్టాల్ని రూపొందించినట్లు మా దృష్టికి వచ్చింది. డాక్టర్లు, ఇతర వైద్య సిబ్బంది భద్రత కోసం అన్ని విధాల కృషి చేస్తామని హామీ ఇస్తున్నాం’’ అని తన ప్రకటనలో ఆరోగ్య మంతత్రిత్వ శాఖ తెలిపింది. అదే సమయంలో.. ఒకవైపు దేశంలో డెంగీ, మలేరియా కేసులు పెరిగిపోతున్నాయని, ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని నిరసనలకు దిగిన వైద్యులు తమ విధులకు హాజరు కావాలని తన ప్రకటనలో విజ్ఞప్తిచేసింది. వారం కిందట పశ్చిమ బెంగాల్ కోల్‌కతా ఆర్జీ కర్ మెడికల్ ఆస్పత్రిలో యువ వైద్యురాలిని అత్యంత కిరాతంగా లైంగిక దాడి జరిపిన హతమార్చిన ఘటన దేశవ్యాప్తంగా దుమారం రేపింది. వైద్య రంగ సిబ్బంది నేరుగా నిరసనలు తెలుపుతుండగా.. ప్రముఖులు తమ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో పోస్టుల ద్వారా ఘటనను ఖండిస్తూ వస్తున్నారు. -
ఆస్పత్రులపై దాడులు.. కేంద్రం కీలక ఆదేశాలు
న్యూఢిల్లీ: బెంగాల్‌లోని కోల్‌కతాలో వైద్యురాలి హత్యచార ఘటనపై ఆందోళనలు తీవ్రతరమవుతున్న నేపథ్యంలో కేంద్రం ప్రభుత్వం.. అన్నీ అసుపత్రులకు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఆసుపత్రి వైద్యులపై, వైద్య సిబ్బంది, ఆరోగ్య కార్యకర్తలపై దాడి జరిగితే.. ఆరు గంటల్లోగా పోలీసు కేసు కావాల్సిందేని పేర్కొంటూ.. అన్ని ఆసుపత్రులకు మెమో జారీ చేసింది. ఒకవేళ నిర్ణీత గడువులోగా ఫిర్యాదు అందకపోతే.. సంబంధిత ఆసుపత్రి, ఇన్స్టిట్యూట్ అధిపతి దీనికి బాధ్యత వహించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ‘ఇటీవల ప్రభుత్వ ఆసుపత్రులలో వైద్యులు, ఇతర ఆరోగ్య సిబ్బందిపై దాడులు ఎక్కువైనట్లు మా దృష్టికి వచ్చింది. అనేక మంది ఆరోగ్య కార్యకర్తలు తమ విధి నిర్వహణలో శారీరక హింసకు గురవుతున్నారు. మరికొందరికి బెదిరింపులు, వస్తున్నాయి.ఇందులో ఎక్కువ శాతం రోగి, వారి వెంట వచ్చిన అటెండర్ల వల్ల ఎదుర్కొన్నవే.. దీనిని పరిగణనలోకి తీసుకొని ఆసుపత్రులకు ఆదేశాలు ఇచ్చాం. విధుల్లో ఉండగా వైద్య సిబ్బంది హింసను ఎదుర్కొంటే.. ఆరు గంటల్లోగా ఆసుపత్రి హెడ్ పోలీసులకు ఫిర్యాదు చేయాలి’ అని కేంద్రం వెల్లడించింది. In the event of any violence against any healthcare worker while on duty, the Head of Institution shall be responsible for filing an Institutional FIR within a maximum of 6 hours of the incident: Ministry of Health and Family Welfare pic.twitter.com/2YGDZVRx8O— ANI (@ANI) August 16, 2024కాగా కోల్‌కతాలోని ఆర్జి కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్లో వైద్యురాలిపై అత్యాచారం, హత్య ఘటనపై దేశవ్యాప్తంగా తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఆసుపత్రిలో పనిచేసే వారికి మెరుగైన రక్షణ, సురక్షితమైన పని వాతావరణం కల్పించాలని కోరుతూ దేశవ్యాప్తంగా వైద్యులు, వైద్య విద్యార్ధులు సమ్మెకు దిగారు. ఈ క్రమంలోనే కేంద్రం ఈ ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. -
లోక్‌సభలో వక్ఫ్ సవరణ బిల్లు
ఢిల్లీ: ముస్లిం మతపరమైన, ధార్మిక ప్రయోజనాల కోసం దానంగా వచ్చిన ఆస్తుల్ని పర్యవేక్షించే వక్ఫ్ బోర్డ్‌ల్లో మరింత పారదర్శకత సాధించే లక్ష్యంతో సంబంధిత చట్టాల్లో కీలక మార్పులు చేసేందుకు కేంద్రం నడుంబిగించింది. ఇందులో భాగంగా వక్ఫ్ సవరణ బిల్లును ఇవాళ (ఆగస్ట్8న) కేంద్రం పార్లమెంట్లో ప్రవేశపెట్టింది. కేంద్ర మైనారిటీ మంత్రి కిరణ్ రిజిజు ఈ బిల్లును సభలో ప్రవేశపెట్టారు. ఇది కూరమైన బిల్లు అని, రాజ్యాంగంపై దాడి చేయడమేనని కాంగ్రెస్ ఎంపీ కేసీ వేణుగోపాల్ అన్నారు. కేంద్రం మత స్వేచ్ఛ ఉల్లంగిస్తోందని తెలిపారు. వక్ఫ్ చట్టసవరణ బిల్లును కాంగ్రెస్, టీఎంసీ, మజ్లిస్, ఎస్పీ, కమ్యూనిస్ట్ పార్టీలు వ్యతిరేకించగా.. టీడీపీ, జేడీయూ, అన్నాడీఎంకే పార్టీలు మద్దతు ఇచ్చాయి. వక్ఫ్ బోర్డులో మహిళలు, ఓబిసి ముస్లింలు, షియా, బోహ్ర తదితర ముస్లింలకు చోటు కల్పిస్తూ చట్ట సవరణ చేసింది. ఈ చట్టానికి దాదాపు 40 సవరణలు ప్రతిపాదిస్తూ కొత్త బిల్లును తీర్చిదిద్దింది.దీంతో పాటు సరైన ఆధారాలు లేకుండానే ఆస్తులు తమ వేనని ప్రకటించే వక్ఫ్ బోర్డు ఏకపక్ష అధికారాలకు స్వస్తి పలకనుంది. కాగా, ఒకవైపు ఈ బిల్లును ఆమోదించేందుకు ఎన్డీయే అన్ని విధాలా ప్రయత్నిస్తుండగా మరోవైపు విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. BIG BREAKING NEWS 🚨 Union Minister Kiren Rijiju will withdraw the Waqf Properties 2014 Bill, tomorrow at 12 pm.The Bill was introduced in Rajya Sabha on 18th February 2014 during UPA-2 Govt.This will allow Modi Govt to pass new Waqf bill that strips the Board of powers to… pic.twitter.com/xOrbdA1bBg— Times Algebra (@TimesAlgebraIND) August 7, 2024 -
కేంద్రం ఏపీకి ఇచ్చింది అప్పే.. గ్రాంట్ కాదు : మహవా
ఢిల్లీ : లోక్‌సభలో బడ్జెట్‌పై పశ్చిమ బెంగాల్ టీఎంసీ ఎంపీ మహవా మోయిత్ర మాట్లాడారు.కేంద్ర బడ్జెట్‌పై ఏపీ ప్రజలను ఫూల్స్ చేయొద్దన్నారు. ఏపీకి ఇచ్చేది అప్పేనని గ్రాంట్ కాదని అన్నారు. డాలర్ల లోను కట్టాల్సిన బాధ్యత ఏపీ భవిష్యత్తు తరాలదేనని అన్నారు టీఎంసీ ఎంపీ మహవా మోయిత్ర.ఇక ఉత్తరాంధ్ర,రాయలసీమ, ప్రకాశం వంటి వెనుకబడి జిల్లాలకు గ్రాంట్లు ఇస్తామని, కానీ బడ్జెట్లో ఎలాంటి కేటాయింపులు లేవని సూచించారు. తెలివైన ఏపీ ప్రజల్ని ఫూల్స్ చేస్తున్నారంటూ ఫైరయ్యారు. -
యూకే వెళ్లాలనుకునే భారతీయులకు కేంద్రం అడ్వైజరీ
బ్రిటన్‌లోని భారతీయులను కేంద్రం అప్రమత్తం చేసింది. ఇటీవల యూకేలో నెలకొన్న నిరసనలు హింసాత్మకంగా మారిన నేపథ్యంలో బ్రిటన్ వెళ్లాలనుకునే వారు అప్రమత్తంగా ఉండాలని భారత పౌరులకు సూచించింది. ఈ మేరకు లండన్‌లోని భారత హైకమిషన్ మంగళవారం భారతీయులకు ట్రావెల్ అడ్వైజరీని జారీ చేసింది.‘యూకేలోని పలు ప్రాంతాల్లో ఇటీవల జరిగిన అల్లర్ల గురించి భారత ప్రయాణికులకు తెలిసే ఉంటుంది. లండన్‌లోని భారత హైకమిషన్ పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తోంది. భారత్ నుంచి యూకేకు వచ్చే సందర్శకులు అప్రమత్తంగా ఉండాలి. అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలి. స్థానిక భద్రతా సంస్థలు, మీడియా సంస్థలు జారీ చేసే సూచనలను అనుసరించాలి. నిరసనలు జరుగుతున్న ప్రాంతాలకు దూరంగా ఉండటం మంచిది’ అని పేర్కొంది. మీ వ్యక్తిగత భద్రత కోసం నిరసనలు జరుగుతున్న ప్రాంతాలకు దూరంగా ఉండాలని సూచించింది.Advisory for Indian Citizens visiting the UK.@VDoraiswami @sujitjoyghosh @MEAIndia pic.twitter.com/i2iwQ7E3Og— India in the UK (@HCI_London) August 6, 2024కాగా వలస వ్యతిరేక గ్రూప్‌లు బ్రిటన్‌లోని పలు నగరాలు, పట్టణాల్లో నిరసనలు చేపట్టాయి. ఇవి దేశమంతా విస్తరించిన క్రమంలో హింసాత్మకంగా మారాయి. గతవారం ఓ డ్యాన్స్ క్లాస్‌లో చిన్నారులపై దుండగులు కత్తితో దాడి చేశారు. ఈ ఘటనలో ముగ్గురు పిల్లలు మృతి చెందారు. దేశవ్యాప్త ఆందోళనలకు కారణమైన ఈ ఘటన మెల్లమెల్లగా వలస వ్యతిరేక నిరసనలకు దారి తీసింది. పలు నగరాల్లో నిరసనకారులు, పోలీసుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఆందోళనకారులు రాళ్లు రువ్వడం, బాణసంచా కాల్చి విసరడం, శరణార్థులకు ఆశ్రయం కల్పిస్తున్న హోటల్స్‌పై దాడి వంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. ఆందోళనకారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రధాని కీర్ స్మార్టర్ అధికారులను ఆదేశించారు. -
‘బంగ్లా’ సంక్షోభంతో ప్రమాదం లేదు: అఖిలపక్ష భేటీలో కేంద్రం
న్యూఢిల్లీ: బంగ్లాదేశ్ పరిస్థితులపై కేంద్రం ఏర్పాటుచేసిన అఖిలపక్ష సమావేశం కొనసాగుతోంది. మంగళవారం(ఆగస్టు 6) పార్లమెంట్ భవనంలో జరుగుతున్న ఈ సమావేశంలో అఖిలపక్షనేతలకు బంగ్లాదేశ్‌లోని పరిస్థితులను విదేశాంగశాఖ మంత్రి జైశంకర్ వివరించారు. బంగ్లాదేశ్‌లో ఉన్న 12 వేల మంది దాకా భారతీయులను ఇప్పటికిప్పుడు తీసుకురావాల్సినంత ప్రమాదమేమీ లేదని తెలిపారు. దేశ సరిహద్దుల వద్ద అప్రమత్తంగా ఉన్నామని, అయినా సరిహద్దుల వద్ద పెద్ద ముప్పేమీ లేదని చెప్పారు. పదవి నుంచి తప్పుకుని భారత్ వచ్చిన ప్రధాని షేక్‌హసీనాతో మాట్లాడామని పరిస్థితులను ఎప్పటికప్పుడు గమనిస్తున్నామన్నారు. బంగ్లాదేశ్‌లో చదువుకుంటున్న భారత విద్యార్థులు 8 వేల మంది ఇప్పటికే తిరిగి వచ్చారన్నారు. ఈ సమావేశంలో ప్రభుత్వం తరపున కేంద్ర మంత్రులు అమిత్‌షా, రాజ్‌నాథ్‌సింగ్, జైశంకర్, కిరణ్‌రిజిజు, లోక్‌సభ, రాజ్యసభల్లో ప్రతిపక్షనేతలు రాహుల్‌గాంధీ, మల్లికార్జున్‌ఖర్గే వివిధ పార్టీలకు చెందిన నేతలు హాజరయ్యారు. బంగ్లాదేశ్‌లో ఆందోళనల కారణంగా ప్రధాని షేక్‌హసీనా దేశం వీడి భారత్‌కు వచ్చిన విషయం తెలిసిందే. హసీనా బంగ్లాదేశ్‌ను వీడిన తర్వాత అక్కడ ఆందోళనలు తగ్గుముఖం పట్టినట్లు కనిపిస్తోంది. ప్రస్తుతం బంగ్లాదేశ్‌లో ఖర్ఫ్యూ ఎత్తేశారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటు దిశగా సన్నాహాలు జరుగుతున్నాయి. -
లోపాల్ని సరిదిద్దుకోవాల్సిందే.. ఎన్టీఏకు సుప్రీం అక్షింతలు
న్యూఢిల్లీ: నీట్ యూజీ పరీక్ష విధానానికి సంబంధించిన లోపాలను (సరిదిద్దాలని) నివారించాలని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ)ను సుప్రీంకోర్టు శుక్రవారం హెచ్చరించింది. మున్ముందు ఇలాంటి లీకేజీలు జరగకుండా చర్యలు తీసుకోవాలని అటు కేంద్రంతోపాటు ఎన్టీఏను మందలించింది. ఈ మేరకు నీట్ యూజీ పేపర్‌లీక్‌పై దాఖలైన వివిధ పిటిషన్లను విచారించిన సుప్రీంకోర్టు.. శుక్రవారం తుది తీర్పు వెలువరించింది.పేపర్‌లీకేజీలో వ్యవస్థీకృత ఉల్లంఘన జరగలేదని, కేవలం పాట్నా, హజారీబాగ్‌కే పరిమితమని సుప్రీం వ్యాఖ్యానించింది. అందుకే నీట్ పరీక్షను రద్దు చేసి, మళ్లీ నిర్వహించేందుకు నిరాకరిస్తున్నట్లు తెలిపింది. ఈ మేరకు సీజేఐ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని త్రిసభ ధర్మాసంన సమగ్ర తీర్పు వెల్లడించింది.నీట్ వంటి జాతీయ పరీక్షలో ఇలాంటి 'ఫ్లిప్ ఫ్లాప్స్'ను నివారించాలని, ఇవి విద్యార్థుల ప్రయోజనాలను దెబ్బతిస్తాయని అత్యున్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. నీట్ యూజీ పేపర్ లీక్‌పై ఆరోపణలు, ఇతర అవకతవకలపై వివాదం చెలరేగినప్పటికీ పరీక్షను రద్దు చేయకపోవడానికి గల కారణాలను వెలువరిస్తూ, అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేసిందిపరీక్షా విధానంలో లోపాలను నిపుణుల కమిటీ సరిచేయాలని పేర్కొంది. ఎన్టీఏ స్ట్రక్చరల్ ప్రాసెస్‌లోని లోపాలన్నింటినీ తమ తీర్పులో ఎత్తిచూపినట్లు అత్యున్నత న్యాయస్థానం తెలిపింది. విద్యార్థుల శ్రేయస్సు కోసం లోపాలను భరించలేమని స్పష్టం పేర్కొంది. తాజాగా తలెత్తిన సమస్యలు పునరావృతం కాకుండా ఈ ఏడాదే కేంద్రం పరిష్కరించాలని సుప్రీంకోర్టు సూచించింది.ఈసందర్భంగా ఎన్టీఏ పనితీరు, పరీక్షల్లో సంస్కరణల కోసం కేంద్రం నియమించిన ఇస్రో మాజీ చీఫ్ కె.రాధాకృష్ణన్ నేతృత్వంలోని ఏడుగురు సభ్యుల కమిటీకి సుప్రీంకోర్టు పలు ఆదేశాలు జారీ చేసింది.కేంద్రం నియమించిన కమిటీ తన నివేదికను సెప్టెంబర్ 30 లోపు కోర్టుకు సమర్పించాలి. ఈ కమిటీ మొత్తం పరీక్ష ప్రక్రియను విశ్లేషించి, పరీక్ష విధానంలో లోపాలను సరిచేసి, ఎన్టీఏ మరింత సమర్థవంతంగా చేయడానికి అవసరమయ్యే మార్పులను సూచించాలి. పరీక్షా వ్యవస్థను బలోపేతం చేసేందుకు అంతర్జాతీయ సాంకేతిక సంస్థల సాయం తీసుకోవాలని సూచించింది. ఈ నివేదిక అందిన తర్వాత అందులోని అంశాలను అమలుచేసే విషయంపై కేంద్రం, విద్యాశాఖ రెండు వారాల్లోగా నిర్ణయం తీసుకోవాలి.అర్హత పరీక్షల నిర్వహణకు ప్రామాణిక ఆపరేటింగ్ విధానం లేదా ప్రోటోకాల్‌ను రూపొందించడం,పరీక్షా కేంద్రాల కేటాయింపు, మార్పు ప్రక్రియను సమీక్షించాలి.అభ్యర్థుల గుర్తింపును ధృవీకరించడానికి కఠినమైన విధానాలను సిఫార్సు చేయాలి.అన్ని పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాల ఏర్పాటు సాధ్యాసాధ్యాలను అంచనా వేయాలి.ట్యాంపరింగ్ ప్రూఫ్ ప్రశ్నపత్రాల కోసం యంత్రాంగాలను సమీక్షించాలి. సూచనలు ఇవ్వాలి.పరీక్షా కేంద్రాల్లో క్రమం తప్పకుండా ఆడిట్లు, తనిఖీలు నిర్వహించాలి. -
ఒక్క ఏడాదిలో 30 లక్షల మందికి కుక్కకాటు
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 2023 ఒక్క ఏడాదిలోనే 286 మంది కుక్కకాటుకు బలయ్యారని కేంద్రం పార్లమెంటులో వెల్లడించింది. 2023లో మొత్తంగా 30 లక్షలకుపైగా కుక్కకాటు కేసులు నమోదయ్యాయని తెలిపింది. ఈ మేరకు మంగళవారం(జులై 30) కేంద్ర మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ లోక్‌సభకు రాతపూర్వకంగా తెలిపారు. 2023లో 46లక్షల 54వేల98మందికి యాంటీ రేబిస్ వ్యాక్సిన్లు ఇచ్చినట్లు వెల్లడించారు. రేబిస్ నియంత్రణకు అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో జాతీయ రేబీస్ నియంత్రణ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు.కుక్కల నియంత్రణకు స్థానిక సంస్థలు చర్యలు తీసుకుంటున్నాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా రేబిస్ టీకాకు నిధులు కేటాయిస్తున్నాయని తెలిపారు. -
కేంద్రంపై రైతులకు విశ్వాసం లేనట్లుంది: సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: రైతులకు, కేంద్ర ప్రభుత్వానికి మధ్య అపనమ్మక(విశ్వాసంలేని) పరిస్థితులున్నట్లు సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. రైతుల డిమాండ్ల పరిష్కారం కోసం కేంద్రం కొన్ని చర్యలు చేపట్టాలని కోర్టు అభిప్రాయపడింది. రాజధాని ఢిల్లీ, హర్యానాకు సరిహద్దుగా ఉన్న శంభూ ప్రాంతంలో రైతుల ఆందోళన సమయంలో బారికేడ్లు తొలగించాలని పంజాబ్-హర్యానా హైకోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ హర్యానా ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు బుధవారం(జులై 24) ఈ వ్యాఖ్యలు చేసింది.రైతుల సమస్యలను తీర్చేందుకు కేంద్రప్రభుత్వం కొన్ని చర్యలు చేపట్టాలని సూచించింది. అసలు రైతులు ఢిల్లీకి ఎందుకు రావాలనుకుంటారని ప్రశ్నించింది. మీపై వారికి విశ్వాసం లోపించినట్లు కన్పిస్తోందని కేంద్ర ప్రభుత్వాన్ని ఉద్దేశించి సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఇలాంటి పరిస్థితుల్లో రైతులు, ప్రభుత్వం మధ్య విశ్వాసం కలిగించే అంపైర్‌లాంటి వ్యక్తి కావాలని కోర్టు పేర్కొంది. రైతుల డిమాండ్ల పరిష్కారం కోసం ఓ స్వతంత్ర కమిటీని ఏర్పాటు చేయాలని సుప్రీం కోర్టు ప్రతిపాదించింది.దీనిపై వారం రోజుల్లోగా నిర్ణయం తీసుకోవాలని, అప్పటిదాకా శంభూ సరిహద్దుల్లో యథాతథ స్థితిని కొనసాగించాలని కోరింది. సరిహద్దులోని బారికేడ్లను తొలగించి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని రెండు రాష్ట్రాలను ఆదేశించింది. కాగా, రైతుల ఉద్యమం సందర్భంగా హర్యానాలోని అంబాలాకు సమీపంలోని శంభూ సరిహద్దు వద్ద ఏర్పాటుచేసిన బారికేడ్లను వారంలోగా తొలగించాలని ఇటీవల పంజాబ్-హర్యానా హైకోర్టు ఆదేశించింది. దీన్ని సవాల్ చేస్తూ హర్యానా ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. -
భారత్‌లోనే కోవిడ్-19 మరణాలు ఎక్కువ.. ఖండించిన కేంద్రం
న్యూఢిల్లీ: కోవిడ్-19 సమయంలో భారత్‌లో అధిక మరణాలు సంభవించాయని ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ పరిశోధకుల అధ్యయనం తెలిపింది. సైన్స్ అడ్వాన్సెస్ జర్నల్‌లో పేర్కొన్న అధ్యయనాన్ని కేంద్రం కొట్టిపారేసింది. భారత్‌లో అధికారిక కోవిడ్-19 మరణాల కంటే ఎనిమిది రెట్లు ఎక్కువ. ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనాల కంటే 1.5 రెట్లు ఎక్కువ అని ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు నివేదించారు. సైన్స్ అడ్వాన్సెస్ జర్నల్‌లో ప్రచురించబడిన అధ్యయనం ప్రకారం, అధిక-ఆదాయ దేశాలలో కనిపించే నమూనాలతో పోలిస్తే, మహమ్మారి సమయంలో మహిళల కంటే పురుషులలో అధిక మరణాలు ఎక్కువగా ఉన్నాయని తెలిపింది. అయితే,ఆ రిపోర్ట్‌పై ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఖండించింది. సైన్స్ అడ్వాన్సెస్ పేపర్లో నివేదించబడిన అదనపు మరణాలు తప్పుదారి పట్టించేలా ఉన్నాయి. జర్నల్స్ లోపభూయిష్టంగా ఉందని, ఆమోదయోగ్యం కాని ఫలితాలను చూపుతుందని మంత్రిత్వ శాఖ తెలిపింది. -
చైనాలో భారీ అగ్నిప్రమాదం.. 16 మంది మృతి
బీజింగ్: చైనాలోని జిగాంగ్ నగరంలోని ఓ షాపింగ్ సెంటర్లో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో 16 మంది మృతిచెందారు. పలువురు గాయపడ్డారు. అధికారిక వార్తా సంస్థ జిన్హువా నుండి అందిన సమాచారం ప్రకారం 14 అంతస్తుల వాణిజ్య భవనంలో అగ్నిప్రమాదం సంభవించింది.అగ్నిమాపక దళంతో పాటు రెస్క్యూ సిబ్బంది ప్రమాదం జరిగిన భవనంలో చిక్కుకున్నవారిని బయటకు తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ముందుగా భవనం దిగువన ఉన్న షాపింగ్ సెంటర్లో మంటలు చెలరేగాయి. అవి చుట్టుపక్కల దుకాణాలకు వ్యాపించాయి. మంటలు చెలరేగడానికి కారణమేమిటి? ప్రమాద సమయంలో భవనంలో ఎంతమంది ఉన్నారనేది ఇంకా తెలియరాలేదు. అగ్నిప్రమాదానికి కారణానికి సంబంధించి అధికారిక ప్రకటన ఇంకా వెలువడలేదు.ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. చైనాలో అగ్ని ప్రమాదాలు, ఇతర విపత్తలు తరచూ జరగుతుంటాయి. ఈ ఏడాది మే 20 నాటికి 947 మంది వివిధ విపత్తుల కారణంగా మృతి చెందారు. నేషనల్ ఫైర్ అండ్ రెస్క్యూ అడ్మినిస్ట్రేషన్ ప్రతినిధి మాట్లాడుతూ హోటళ్లు, రెస్టారెంట్లు వంటి ప్రదేశాల్లో ఇటీవలి కాలంలో అగ్ని ప్రమాదాలు 40 శాతం మేరకు పెరిగాయన్నారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్, లేదా గ్యాస్ లైన్ల లీకేజీ, నిర్లక్ష్యం మొదలైనవి అగ్ని ప్రమాదాలకు ప్రధాన కారణమన్నారు. A MASSIVE fire in China leaves 8 dead and many trapped in a Zigong shopping mall.More confirmation of Hanke’s School Boy’s Theory of History: It’s just one damn thing after another.pic.twitter.com/7OCuGbnNKZ— Steve Hanke (@steve_hanke) July 17, 2024 -
పూజా ఖేద్కర్ ఎపిసోడ్లో మరో ట్విస్ట్
ఢిల్లీ: వివాదాస్పదంగా మారిన ట్రెయినీ ఐఏఎస్ పూజా మనోరమ దిలీప్ ఖేద్కర్‌కు ఝలక్ తగిలింది. తప్పుడు ధ్రువీకరణలు సమర్పించిందని ఆమెపై వస్తున్న ఆరోపణలపై విచారణ జరపాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు ఏకపక్ష సభ్య కమిటీని నియమించింది. ఆమె ఉద్యోగంలో చేరేందుకు తప్పుడు ధ్రువీకరణ పత్రాలు సమర్పించినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఆమె తనకు నేత్ర, మానసిక సంబంధమైన కొన్ని సమస్యలున్నట్లు అఫిడవిట్ ఇచ్చిందని, కానీ, వాటిని నిర్ధారించేందుకు తప్పనిసరి వైద్య పరీక్షలకు మాత్రం ఆమె డుమ్మా కొట్టినట్లు కథనాలు వచ్చాయి. దీంతో.. నిజనిర్ధారణ కోసం కేంద్రం సింగిల్ మెంబర్ కమిటీని నియమించింది. ఈ కమిటీ దర్యాప్తు జరిపి.. రెండు వారాల్లో నివేదిక ఇస్తుందని డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్(DoPT) పేర్కొంది. వివాదం ఇదే..గొంతెమ్మ కోర్కెలతో మహారాష్ట్ర ప్రభుత్వ ఆగ్రహానికి గురైన ట్రెయినీ ఐఏఎస్ అధికారిణి పూజా ఖేద్కర్ వార్తల్లోకి ఎక్కింది. పుణెలో అసిస్టెంట్ కలెక్టర్‌గా విధులు నిర్వహిస్తూ.. ఉన్నతాధికారుల అనుమతి తీసుకోకుండానే తన ఆడి కారుకు రెడ్-బ్లూ బీకన్ లైట్లు, వీఐపీ నంబర్‌ప్లేటు ఏర్పాటుచేసుకున్నారు. ‘మహారాష్ట్ర ప్రభుత్వం’ అనే స్టిక్కర్ అమర్చారు. తనకు ప్రత్యేక వసతి సౌకర్యాలు కల్పించాలని, తగినంత సిబ్బందితోపాటు ఓ కానిస్టేబుల్‌తో అధికారిక ఛాంబర్‌ను కేటాయించాలని పట్టుబట్టారు. అదనపు కలెక్టర్ అజయ్ మోర్ లేని సమయంలో.. ఎలాంటి అనుమతి తీసుకోకుండా ఆయన గదిలో తన నేమ్‌ప్లేట్ పెట్టుకొని దాన్నే తన ఛాంబర్‌గా వినియోగించుకొన్నారు. వాస్తవానికి ప్రొబేషన్‌లో రెండేళ్లపాటు ఉండే జూనియర్ అధికారులకు ఈ సౌకర్యాలు లభించవు. వాస్తవానికి ఆమె ఈ సౌకర్యాల కోసం కిందిస్థాయి అధికారులపై ఒత్తిడి తెస్తూ జరిపిన వాట్సాప్ సంభాషణల స్క్రీన్ షాట్లు కూడా తాజాగా వైరల్ అయ్యాయి. తనకు ఉన్నతాధికారి నుంచి ఈ సిబ్బంది నంబర్ లభించినట్లు ఆమె వాటిల్లో పేర్కొన్నారు. ఈసందర్భంగా ఆమె కొన్ని డిమాండ్లు చేసి.. తాను వచ్చే నాటికి వాటిని పూర్తిచేయాలన్నారు. అయితే పూజ వ్యవహారాన్ని పుణె కలెక్టర్ డాక్టర్ సుహాస్ దివాసే చీఫ్ సెక్రటరీ దృష్టికి తీసుకువెళ్లడంతో ఆమెను పుణె నుంచి వాసిమ్ జిల్లాకు బదిలీ చేశారు. ప్రొబేషన్ కాలం పూర్తయ్యేవరకు అక్కడే సూపర్ న్యూమరరీ అసిస్టెంట్ కలెక్టర్‌గా పూజ వ్యవహరిస్తారని ఉన్నతాధికారులు వెల్లడించారు.నియామకమే వివాదం.. 2022 ఏప్రిల్‌లో తొలిసారి దిల్లీలోని ఎయిమ్స్‌లో వైద్య పరీక్షలకు పిలువగా ఆమె కొవిడ్ సాకుగా చూపించి వెళ్లలేదు. ఆ తర్వాత కూడా కొన్ని నెలలపాటు వైద్య పరీక్షలకు హాజరు కాలేదు. చివరికి ఆరోసారి పిలుపురాగా.. పాక్షికంగా పరీక్షలు చేయించుకొన్నారు. దృష్టి లోపాన్ని అంచనావేసే కీలకమైన ఎమ్మారై పరీక్షకు ఆమె హాజరుకాలేదు. కానీ, ఆమె సివిల్ సర్వీసెస్ అపాయింట్మెంట్ ఏదోరకంగా పూర్తయింది. ఆ తర్వాత కమిషన్ ఆమె ఎంపికను ట్రైబ్యూనల్‌లో సవాలు చేసింది. 2023 ఫిబ్రవరిలో ఆమెకు వ్యతిరేకంగా తీర్పు వచ్చింది. అయినా.. తన నియామకాన్ని కన్ఫర్మ్ చేసుకొంది. ఇక పూజా ఓబీసీ ధ్రువీకరణపైనా వివాదాలున్నాయి. దాని ఆధారంగానే ఆమెకు 841వ ర్యాంక్ వచ్చినా ఐఏఎస్ హోదాను పొందగలిగింది. నాకు అనుమతి లేదు.. వివాదాల నేపథ్యంలో.. ఐఏఎస్ పూజా ఖేద్కర్ తొలిసారి మీడియా వద్ద స్పందించారు. ‘‘నాకు ఈ అంశంపై మాట్లాడటానికి ప్రభుత్వ అనుమతి లేదు. నిబంధనలు అనుమతించవు క్షమించండి. మహారాష్ట్రలోని వాసిమ్‌లో కొత్త పాత్ర పోషించడం సంతోషంగానే ఉంది’’ అని పేర్కొన్నారు. -
సివిల్ సర్వీస్ హిస్టరీలో ఇదే తొలిసారి.. ఆమె పేరు మారింది..జెండర్ మారింది
సాక్షి,హైదరాబాద్ : ఇండియన్ సివిల్ సర్వీస్ హిస్టరీలో తొలిసారి కీలక పరిణామం చోటు చేసుకుంది. ఓ సివిల్ సర్వీస్ (సీనియర్ ఐఆర్ఎస్)ఉద్యోగి తన పేరుతో పాటు జెండర్‌ను మార్చుకునేందుకు కేంద్ర ఆర్ధిక శాఖ అనుమతివ్వడం ఆసక్తికరంగా మారింది. కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో అన్నీ రికార్డ్స్‌లలో సదరు ఉద్యోగి పేరు,జెండర్ ఇతర వివరాలు మారిపోనున్నాయి.హైదరాబాద్ కేంద్రంగా కస్టమ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అప్పిలేట్ ట్రిబ్యూనల్ (సీఈఎస్‌టీఏటీ) విభాగంలో 35ఏళ్ల అనసూయ సీనియర్ జాయింట్ కమిషనర్‌గా విధులు నిర్వహిస్తున్నారు.అయితే తన పేరును అనుసూయకు బదులు తన పేరును ఎం అనుకతిర్ సూర్యగా, జెండర్‌ను సైతం మార్చాలని కేంద్రానికి అభ్యర్ధించారు.అందుకు కేంద్రం సానుకూలంగా స్పందించింది. అనుసూర్య పేరును ఎం.అనుకతిర్ సూర్యగా మార్చడంతో పాటు జెండర్ సైతం మార్చేందుకు అంగీకరిస్తూ అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. చెన్నైలో అసిస్టెంట్ కమీషనర్గాఅనుకతిర్ సూర్య లింక్డ్ఇన్ ప్రొఫైల్ ప్రకారం.. సూర్య 2013 డిసెంబర్లో చెన్నైలో అసిస్టెంట్ కమీషనర్‌గా తన వృత్తిని ప్రారంభించారు. 2018లో డిప్యూటీ కమీషనర్‌గా పదోన్నతి పొందారు. గతేడాది హైదరాబాద్‌కు ట్రాన్స్ఫర్ అయ్యారు. అనుకతిర్ సూర్య చదువుఅతను చెన్నైలోని మద్రాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుండి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్లో బ్యాచిలర్ డిగ్రీని,2023లో భోపాల్‌లోని నేషనల్ లా ఇన్స్టిట్యూట్ యూనివర్సిటీ నుండి సైబర్ లా అండ్ సైబర్ ఫోరెన్సిక్స్‌లో పీజీ డిప్లొమా పూర్తి చేశారు. -
జికా వైరస్ కలకలం.. రాష్ట్రాలకు కేంద్రం సూచనలు
మహారాష్ట్రలో జికా వైరస్ కేసులో ఆందోళన రేపుతున్నాయి. పుణెలో ఇప్పటి వరకు ఆరు కేసులు నమోదయ్యాయి. ఈ వైరస్ సోకిన వారిలో ఇద్దరు గర్బిణీలు కూడా ఉన్నారు. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. మహారాష్ట్రలో జికా వైరస్ కేసుల పెరుగుల దృష్ట్యా అన్ని రాష్ట్రాలకు మార్గదర్శకాలను జారీ చేసింది.గర్భిణీ స్త్రీలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్రాలను కోరింది. నిరంతరం వైరస్ పరీక్షలు నిర్వహించాలని తెలిపింది. జికా వైరస్ పాజిటివ్‌గా పరీక్షించిన తల్లుల పిండాల పెరుగుదలను పర్యవేక్షించడం ద్వారా నిరంతరం అప్రమత్తంగా ఉండాలని కోరింది.బాధిత గర్భిణీ స్త్రీ పిండంలో జికా మైక్రోసెఫాలీ నాడీ సంబంధిత పరిణామాలతో సంబంధం కలిగి ఉన్నందున, పర్యవేక్షణ కోసం వైద్యులను అప్రమత్తం చేయాలని సూచించింది. ఇంటి ఆవరణలో ఏడిస్ దోమలు లేకుండా చూసేందుకు నోడల్ అధికారిని గుర్తించి చర్యలు తీసుకోవాలని సూచించింది. నివాస ప్రాంతాలు, కార్యాలయాలు, పాఠశాలలు, నిర్మాణ స్థలాలు, సంస్థలు, ఆరోగ్య సౌకర్యాల్లో కీటకాలు లేకుండా నిఘా పెంచాలని, నియంత్రణ కార్యకలాపాలను తీవ్రతరం చేయాలని రాష్ట్రాలను కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆదేశించింది.ప్రజల్లో భయాందోళనలను తగ్గించడానికి సోషల్ మీడియా, ఇతర ఫ్లాట్ఫారమ్లలో ముందు జాగ్రత్తగా సందేశాలు పంపి అవగాహన కల్పించాలని రాష్ట్రాలు కోరింది. కాగా జులై 1న పూణెలో ఇద్దరు గర్భిణులు సహా ఆరుగురికి జికా వైరస్ పాజిటివ్ తేలిన విషయం తెలిసిందే. అరంద్వానే ప్రాంతంలో నాలుగు, ముండ్వా ప్రాంతంలో రెండు కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు.జికా వైరస్ సోకిన ఆడ ఎడిస్ దోమ కుట్టడం వల్ల వ్యాధి సంక్రమిస్తుంది. ఈ వైరస్‌ను తొలిసారి 1947లో ఉగాండా అడవుల్లోని ఓ కోతిలో గుర్తించారు. ఆ తర్వాత ఆఫ్రికన్ దేశాలతోసహా భారత్, ఇండోనేషియా, మలేషియా, ఫిలిప్పీన్స్, థాయ్‌లాండ్, వియత్నాం లాంటి ఆసియా దేశాలకూ ఈ వ్యాధి వ్యాప్తి చెందింది. ఈ వైరస్ సోకినవారిలో జ్వరం, చర్మంపై దద్దుర్లు, కండరాలు, కీళ్ల నొప్పులు, తలనొప్పి, జీర్ణకోశ సంబంధ సమస్యలు, గొంతు నొప్పి, దగ్గు వంటి లక్షణాలు కనిపిస్తాయి. -
‘నీట్’ అక్రమాలు.. కేంద్రంపై కేటీఆర్ ఫైర్
సాక్షి,హైదరాబాద్: నీట్ యూజీ ఎగ్జామ్ వ్యవహారంలో కేంద్రం తీరుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. ఈ విషయమై ఆయన ఆదివారం(జూన్16) కేటీఆర్ ఒక బహిరంగ లేఖ రాశారు. లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు ప్రమాదంలో పడినా కేంద్రం పట్టించుకోవడం లేదని లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు.ఓవైపు గ్రేస్ మార్కుల గందరగోళం.. మరోవైపు పేపర్ లీకేజీల వ్యవహారంతో తల్లిదండ్రుల్లో ఆందోళన చెందుతున్నారని తెలిపారు. పరీక్షా పే చర్చ నిర్వహించే ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు ఇప్పటికైనా నీట్ వ్యవహారంపై స్పందించాలన్నారు. మొత్తం వ్యవహారంలో సమగ్ర విచారణ చేసి వెంటనే బాధ్యులను శిక్షించాలని కోరారు. … pic.twitter.com/agUwEuiaG8— BRS Party (@BRSparty) June 16, 2024 కష్టపడి చదివిన విద్యార్థులకు నష్టం జరగకుండా చూడాలని లేఖలో కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా నీట్ ఎగ్జామ్ లో ఏకంగా 67 మందికి ఫస్ట్ ర్యాంక్ రావడం ఎన్నోరకాల అనుమానాలకు తావిస్తోందని ధ్వజమెత్తారు. అందులో కూడా ఒకే సెంటర్ నుంచి ఎనిమిది మంది విద్యార్థులు ఏకంగా 720 మార్కులు సాధించడం చూస్తే.. పేపర్ లీకేజీ వ్యవహారం ఏ స్థాయిలో జరిగిందో అర్థమవుతోందన్నారు. ఒక్క మార్కు తేడాతోనే విద్యార్థుల ర్యాంకులు మారిపోతాయని, ఎంతోమంది అవకాశాలు కోల్పోతారని గుర్తుచేశారు. అలాంటిది.. ఇంత ఒకే సెంటర్ లో ఇంతమంది విద్యార్థులకు పెద్దమొత్తంలో మార్కులు రావడం ఎలా సాధ్యమైందని ప్రశ్నించారు. అలాగే ఫలితాలను 10 రోజులు ముందుకు జరిపి సరిగ్గా ఎన్నికల ఫలితాల రోజే ప్రకటించటం కూడా అనేక సందేహాలకు తావిచ్చిందన్నారు.అసలు ఈ వ్యవహారం బయటకు రాగానే పూర్తిస్థాయిలో విచారణకు ఆదేశించాల్సిన కేంద్రం ప్రభుత్వం ఎందుకు ఈ అంశాన్ని ఇప్పటిదాకా పట్టించుకోలేదని నిలదీశారు. పైగా కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రదాన్ అంతా సవ్యంగానే జరిగిందంటూ కప్పిపుచ్చే ప్రయత్నం చేయటం విడ్డూరంగా ఉందని విమర్శించారు.నీళ్ల కోసం ‘‘క్యూ సెరా.. సెరా’’భారతదేశంలో రాజకీయ విజయం అంటే నీరు, విద్యుత్, రోడ్లు, ఉద్యోగాలు, నిత్యావసర వస్తువుల ధరలు లాంటి వాస్తవ సమస్యలను పరిష్కరించగల సామర్థ్యం గురించి కాదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్(ట్విటర్)లో పేర్కొన్నారు. Political success in India is no more about the ability to solve real issues like water, electricity, roads, jobs and prices of essential commodities etc Where is the incentive for political parties to work on these real issues when elections are won on imaginary issues &… https://t.co/W8XYTqpZji— KTR (@KTRBRS) June 16, 2024ఊహాజనిత సమస్యలు & ఉత్పాదక అవగాహనలతో ఎన్నికలు గెలిచినప్పుడు ఈ వాస్తవ సమస్యలపై పని చేయడానికి రాజకీయ పార్టీలకు ప్రోత్సాహం ఎక్కడ ఉందన్నారు. వారు చెప్పినట్లు ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో నీళ్ల కోసం "క్యూ సెరా, సెరా"నే అని కేటీఆర్ ట్వీట్లో పేర్కొన్నారు. -
హైదరాబాద్‌లో ఫిన్‌టెక్ కంపెనీ విస్తరణ.. భారీగా జాబ్స్!
ఫిన్ టెక్ కంపెనీ క్యాష్ఈ (CASHe) ఈ ఏడాది చివరి నాటికి 300 మందిని నియమించుకోవాలని, డిజిటల్ ఇంజనీరింగ్ సామర్థ్యాలను విస్తరించడానికి కొత్త టెక్నాలజీ ఎక్సలెన్స్ సెంటర్‌ను ఏర్పాటు చేయాలని యోచిస్తోంది.హైదరాబాద్‌లో ఏర్పాటు చేయనున్న ఈ ప్లాంట్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ గా పనిచేస్తుందని, కంపెనీ సాంకేతిక అవసరాలకు తోడ్పడుతుందని క్యాష్ఈ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ ఫెసిలిటీ ప్రస్తుతం కంపెనీ లెండింగ్, ఇన్సూరెన్స్, వెల్త్ మేనేజ్మెంట్ విభాగాలను నిర్వహిస్తుంది.టెక్నాలజీ, డేటా సైన్సెస్, మెషిన్ లెర్నింగ్, డెవ్ఆప్స్, టెక్ఆప్స్, ప్రొడక్ట్ డెవలప్మెంట్, క్రెడిట్, కలెక్షన్స్ వంటి ఎక్స్పీరియన్స్ లెవల్స్, డొమైన్లలో నియామకాలు ఉంటాయి. క్యాష్ఈ హైదరాబాద్, ముంబై కేంద్రాల్లో 550 మందికి ఉపాధి కల్పిస్తోంది. కొత్తగా నియమించుకోనున్న 300 మందిలో 150 మందిని సంస్థ ప్రణాళికాబద్ధమైన టాలెంట్ అక్విజిషన్ స్ట్రాటజీకి అనుగుణంగా నియమించనున్నారు.'ఫిన్ టెక్ పరిశ్రమ గణనీయమైన మార్పులకు లోనవుతోంది. లెండింగ్, ఇన్సూరెన్స్, వెల్త్ టెక్ స్పేప్లో మా ఫిన్‌టెక్ సొల్యూషన్స్‌కు పెరుగుతున్న డిమాండ్‌ను తీర్చడానికి మేము మా బృందాలు, మౌలిక సదుపాయాలను వేగంగా విస్తరిస్తున్నాము" అని క్యాష్ఈ సీఈవో యశోరాజ్ త్యాగి పేర్కొన్నారు. -
ఏబీ వెంకటేశ్వర్రావుకు కేంద్రం షాక్
న్యూఢిల్లీ: ఏపీ మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావుకు కేంద్ర ప్రభుత్వం షాక్ ఇచ్చింది. ఏబీవీ పదవిలో ఉన్నపుడు పాల్పడిన అవినీతిపై ఏపీ ప్రభుత్వం సమర్పించిన వివరాలు పరిశీలించిన తర్వాత ఆయన ప్రాసిక్యూషన్‌కు కేంద్రం అనుమతిచ్చింది.దీంతో త్వరలో అవినీతి కేసులో ఏబీవీ ప్రాసిక్యూషన్ ప్రారంభం కానుంది. టీడీపీ ప్రభుత్వంలో ఇంటెలిజెన్స్ చీప్‌గా పనిచేస్తున్నప్పుడు సెక్యూరిటీ పరికరాల కొనుగోలులో అవినీతికి పాల్పడ్డాడంటూ ఏబీపై అవినీతి కేసు నమోదైంది. ఐపీఎస్ అధికారి కావడంతో ప్రాసిక్యూషన్‌కు కేంద్రం అనుమతి తప్పనిసరైంది. ఇప్పుడు అనుమతి రావడంతో విచారణకు లైన్ క్లియరైంది. -
ఎలుగుబంట్లలో రకాలెన్ని? ఏ ఎలుగుబంటి ప్రమాదకరం?
ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం మార్చి 23న ‘వరల్డ్ బేర్ డే’ అంటే ప్రపంచ ఎలుగుబంటి దినోత్సవం నిర్వహిస్తారు. ఈ సందర్భంగా ప్రజలకు ఎలుగుబంట్ల జీవన విధానంపై అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తారు. ఎలుగుబంటి దినోత్సవాన్ని తొలిసారిగా 1992లో నిర్వహించారు. ఎలుగుబంట్ల దుస్థితిపై అవగాహన కల్పించేందుకు దీనిని ప్రారంభించారు. ప్రపంచ ఎలుగుబంటి దినోత్సవాన్ని వివిధ ప్రాంతాలలో వివిధ రకాలుగా జరుపుకుంటారు. ఎలుగుబంట్ల అభయారణ్యాన్ని సందర్శించడం, ఎలుగుబంటి పాత్ర ఉన్న సినిమా చూడటం, ఎలుగుబంటి వివరాలు కలిగిన పుస్తకాన్ని చదవడం లాంటి కార్యకలాపాలు చేస్తారు. ఎలుగుబంట్లు క్షీరద జాతికి చెందినవి. ఇవి మాంసాహార స్వభావాన్ని కలిగి ఉంటాయి. ఎలుగుబంటి జాతులు ప్రధానంగా ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, ఆసియా ఐరోపాలలో కనిపిస్తాయి. గోధుమ లేదా నలుపు రంగులో ఇవి ఉంటాయి. స్వచ్ఛమైన తెలుపు రంగులో పోలార్ ఎలుగుబంట్లు ఉంటాయి. ఎలుగుబంటి ఒంటరి జంతువు. ఎలుగుబంట్లు శీతాకాలంలో ఎక్కువసేపు నిద్రావస్థలో ఉంటాయి. ఈ కాలంలో అవి గుహలలో ఆశ్రయం పొందుతాయి. ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం ఎనిమిది రకాల ఎలుగుబంట్లు ఉన్నాయి. అమెరికన్ బ్లాక్ బేర్ అమెరికన్ బ్లాక్ బేర్ అనేది ప్రపంచవ్యాప్తంగా అత్యంత సాధారణంగా కనిపించే ఎలుగుబంటి జాతి. ఈ రకమైన ఎలుగుబంటి ఎక్కువగా ఉత్తర అమెరికాలోని అటవీ, పర్వత ప్రాంతాలలో కనిపిస్తుంది. ఇది మధ్యస్థ పరిమాణంతో ఉంటుంది. దట్టమైన నల్లని బొచ్చుతో శారీరకంగా చాలా బలంగా ఉంటుంది. ఆసియన్ బ్లాక్ బేర్ దాని పేరులో సూచించినట్లుగా ఇది ఆసియాలో కనిపించే ఎలుగుబంటి జాతి. ఇది భారతదేశం, కొరియా, ఈశాన్య చైనా, రష్యా, జపాన్, తైవాన్లలో కనిపిస్తుంది. దీనిని మూన్ బేర్ అని కూడా అంటారు. స్పెక్టాక్లెడ్ బేర్ ఇది ఛాతీ పైభాగంలో లేత గోధుమరంగు రంగును కలిగి ఉంటుంది. దీని ఆకారంలో కళ్లకు అద్దాలు పెట్టుకున్నట్లు కనిపిస్తున్నందున దీనిని స్పెక్టాక్లెడ్ బేర్ అని అంటారు. దీనిని ఆండియన్ బేర్, పర్వత ప్రాంత ఎలుగుబంటి అని కూడా పిలుస్తారు. దీని శాస్త్రీయ నామం ట్రెమార్క్టోస్ ఆర్నాటస్. ఇది దక్షిణ అమెరికాలో కనిపిస్తుంది. మధ్యస్థ పరిమాణంలో ఉంటుంది. ఇవి చెట్లపై ఎక్కువ సమయం గడుపుతాయి. ఇవి ఒంటరిగా తిరుగుతాయి. జెయింట్ పాండా జెయింట్ పాండా ఎలుగుబంటికి కళ్ళ చుట్టూ నల్లటి గుర్తులు కనిపిస్తాయి. నలుపు, తెలుపు రంగుల మృదువైన బొచ్చుతో కూడిన శరీరంతో విభిన్నంగా కనిపిస్తాయి. జెయింట్ పాండా బేర్ దక్షిణ మధ్య చైనాలో కనిపిస్తుంది. జెయింట్ పాండాకు రెండు ఉపజాతులు ఉన్నాయి. సన్ బేర్ ఎలుగుబంటి జాతులలో సన్ బేర్ చిన్నగా కనిపిస్తుంది. ఇది ఆగ్నేయాసియాలోని ఉష్ణమండల వర్షారణ్యాలలో ఉంటుంది. తేనెను విపరీతంగా ఇష్టపడే దీనిని హనీ బేర్ అని కూడా పిలుస్తారు. దాని మెడపై ప్రత్యేకమైన గుర్రపుడెక్క ఆకారంలో ఆరెంజ్ రంగు గుర్తు ఉంటుంది. సన్ ఎలుగుబంటికి రెండు ఉపజాతులు ఉన్నాయి. ఇవి అన్ని రకాల ఎలుగుబంట్లలో అత్యంత ప్రమాదకరమైనవని చెబుతారు. స్లాత్ బేర్ స్లాత్ బేర్ శాస్త్రీయ నామం మెలుర్సస్ ఉర్సినస్. ఇది ప్రధానంగా భారతదేశం, నేపాల్, శ్రీలంకలో కనిపిస్తుంది. దీని పొడవాటి దిగువ పెదవి కారణంగా దీనిని లాబియేట్ బేర్ అని కూడా అంటారు. ఈ రకమైన ఎలుగుబంట్ల చెవులు పొడవాటి జుట్టును కలిగి ఉంటాయి. ఈ ఎలుగుబంట్లు జంటగా తిరుగుతాయి. బ్రౌన్ బేర్ బ్రౌన్ బేర్ భారీ పరిమాణం కలిగిన ఎలుగుబంటి జాతి. దీనిని గ్రిజ్లీ బేర్ అని కూడా పిలుస్తారు. దీని శాస్త్రీయ నామం ఉర్సస్ ఆర్క్టోస్. ఉత్తర యురేషియా, ఉత్తర అమెరికాలో ఇవి కనిపిస్తాయి. బ్రౌన్ బేర్ ఉపజాతులు అనేకం ఉన్నాయి. వీటి మెడ వెనుక భాగంలో పొడవైన మందపాటి బొచ్చు ఉంటుంది. బ్రౌన్ బేర్ అనేక యూరోపియన్ దేశాలకు జాతీయ జంతువు. పోలార్ బేర్ పోలార్ బేర్ అనేది భారీ పరిమాణం కలిగిన ఎలుగుబంటి జాతి. దీని శాస్త్రీయ నామం ఉర్సస్ మారిటిమస్. ఇది ప్రధానంగా ఆర్కిటిక్ సర్కిల్ చుట్టూ కనిపిస్తుంది. దీనికి తెల్లటి బొచ్చు కింద నల్లని చర్మం ఉంటుంది. దీనికి రెండు ఉపజాతులు. అవి అమెరికన్ పోలార్ బేర్, సైబీరియన్ పోలార్ బేర్. సముద్రపు మంచు ఘనీభవించిన శీతాకాలంలో ఈ ధృవపు ఎలుగుబంట్లు మరింత చురుకుగా ఉంటాయి. ప్రాణాలు తీస్తున్న ఎలుగుబంట్లు గత రెండు దశాబ్దాలో స్లాత్ ఎలుగుబంట్లు వేలాది మందిని పొట్టన పెట్టుకున్నాయి. ఇవి మన దేశంలో వందల మందిని చంపాయి. భారత ప్రభుత్వం అధికారికంగా ఎలుగుబంట్ల దాడులను లెక్కించనప్పటికీ, స్లాత్ ఎలుగుబంటి మన దేశంలోని అత్యంత ప్రాణాంతక జంతువులలో ఒకటని పలు నివేదికలు చెబుతున్నాయి. ఇతర రకాల ఎలుగుబంటి కంటే ఈ స్లాత్ ఎలుగుబంటి మనుషులపై అధికంగా దాడులు చేస్తోంది. మరోవైపు మనదేశంలో ఈ రకపు ఎలుగుబంట్ల సంఖ్య పెరుగుతున్న కారణంగా అవి అనేక సమస్యలను ఎదుర్కొంటున్నాయి. మన దేశంలోని అడవులలో కేవలం 10 శాతం మాత్రమే ఎలుగుబంట్లకు అనువైనవిగా ఉన్నాయి. ఎవరైనా ఈ అడవుల్లోకి ప్రవేశించినప్పుడు లేదా అవి (ఎలుగుబంట్లు) ఆహారం, నీటి కోసం మానవ నివాసాలలోకి ప్రవేశించినప్పుడు అవి మనుషులపై దాడులకు పాల్పడుతున్నాయి. ఆగ్రాలో ఎలుగుబంట్ల రక్షిత కేంద్రం యూపీలోని ఆగ్రాలో ప్రపంచంలోనే అతిపెద్ద రక్షిత బేర్ సెంటర్ ఉంది. ఇక్కడ 100 ఎలుగుబంట్లు ఉన్నాయి. 20 సంవత్సరాల క్రితం ఈ ప్రాంతంలో వీటి సంఖ్య 500కు పైగానే ఉండేది. వైల్డ్‌లైఫ్ ఎస్ఏఓస్కు చెందినప్రత్యేక బృందం ఆగ్రా బేర్ కన్జర్వేషన్ సెంటర్లో ఎలుగుబంట్లను సంరక్షిస్తోంది. తాజ్ సిటీలోని సుర్ సరోవర్ ప్రాంతంలో ఈ బేర్ కన్జర్వేషన్ సెంటర్ ఉంది. 1995లో స్థాపితమైన వైల్డ్‌లైఫ్ ఎస్ఓఎస్.. ఎలుగుబంట్లతో కొందరు ఫీట్స్ చేయించడాన్ని అరికట్టేందుకు ఉద్యమించింది. యూపీలోని ‘కలందర్’ తెగ ప్రజలు ఎలుగుబంటి పిల్లలను వేటాడి, వాటి చేత గారడీ చేయించేవారు. ఈ వ్యవహారాలను వైల్డ్‌లైఫ్ ఎస్ఓఎస్ అరికట్టింది. వన్యప్రాణి సంరక్షణ చట్టం 1972 ప్రకారం జంతువులను హింసించడం చట్టవిరుద్ధం. వైల్డ్‌లైఫ్ సంస్థ ఇప్పటివరకూ 628 ఎలుగుబంట్లను రక్షించింది. ఈ సంస్థ నాలుగు ఎలుగుబంట్ల పునరావాస కేంద్రాలను నిర్వహిస్తోంది. వీటిలో ఆగ్రా బేర్ కన్జర్వేషన్ సెంటర్ ప్రముఖమైనది. ఆగ్రా బేర్ కన్జర్వేషన్ సెంటర్ సహ వ్యవస్థాపకుడు కార్తీక్ సత్యనారాయణ మాట్లాడుతూ ఎలుగుబంట్లకు తాము ఉదయం వేళ పండ్లు, సాయంత్రం గంజి అందిస్తామన్నారు. వాటికి పలువిధాలుగా ఉపయోగపడేలా ఎన్క్లోజర్లు ఏర్పాటు చేశామన్నారు. -
కేంద్రానికి ఎన్నికల సంఘం షాక్
న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల ముందు కేంద్ర ప్రభుత్వానికి భారత ఎన్నికల సంఘం షాక్ ఇచ్చింది. ‘వికసిత్ భారత్’ పేరుతో బీజేపీ ప్రభుత్వం నిర్వహిస్తున్న క్యాంపెయిన్ వెంటనే నిలిపివేయాలని ఈసీ ఆదేశాలిచ్చింది. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న నేపథ్యంలో పౌరుల వాట్సాప్‌కు వికసిత్ భారత్ మెసెజ్‌లు పంపడం తక్షణమే పేయాలని కేంద్ర ఐటీ శాఖకు ఈసీ నోటీసులు జారీ చేసింది. ఇకనుంచి ఎలాంటి మెసేజ్ డెలివరీ చేయొద్దని ఆదేశించింది. అయితే ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినప్పటికీ కేంద్ర ప్రభుత్వ కార్యక్రమాల సందేశాలు పౌరుల ఫోన్లకు వస్తుండటంతో అనేక ఫిర్యాదులు అందినట్లు ఈసీ పేర్కొంది. తమకు వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. ఈసీ ఆదేశాలపై స్పందించిన ఐటీ శాఖ.. ఎన్నికల కోడ్‌కు ముందుగానే మెసెజ్‌లు పంపినప్పటికీ వాటిలో కొన్ని నెట్వర్క్ కారణంగా ఆలస్యంగా డెలివరీ అవుతున్నట్లు తెలిపింది. కాగా వచ్చే లోక్‌సభ ఎన్నికలకు ఈసీ షెడ్యూల్ ప్రకటించడంతో మార్చి 17 నుంచి దేశ వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. ప్రతిఒక్కరూ ఎన్నికల నియమావళి ప్రకారం నడుచుకోవాల్సిందే. ఇక ఏప్రిల్ 19 నుంచి జూన్ 1 వరకు ఏడు విడుతల్లో పార్లమెంట్, పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. జూన్ 4న ఫలితాలు వెల్లడి కానున్నాయి. చదవండి: డబ్బుల్లేవ్.. ప్రచారం చేసుకోలేకపోతున్నాం: కాంగ్రెస్ ఆవేదన -
అంతా నిబంధనల మేరకే
న్యూఢిల్లీ: ఇద్దరు నూతన కేంద్ర ఎన్నికల కమిషనర్ల నియామకం నిబంధనల మేరకే జరిగిందని కేంద్రం పేర్కొంది. ఈ ప్రక్రియ హడావుడిగా జరిగిందన్న ఆరోపణలను తోసిపుచి్చంది. ఈసీల ఎంపిక కమిటీలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి లేకపోవడాన్ని సమరి్థంచుకుంది. ఎంపిక కమిటీలో న్యాయవ్యవస్థ ప్రాతినిధ్యమే ఈసీ స్వతంత్ర ప్రతిపత్తికి ప్రాతిపదిక కాదని స్పష్టం చేసింది. ఈ మేరకు కేంద్ర న్యాయ శాఖ సుప్రీంకోర్టులో బుధవారం అఫిడవిట్ దాఖలు చేసింది. ఈసీల ఎంపిక కమిటీ నుంచి సీజేఐని మినహాయించడాన్ని సవాలు చేస్తూ కోర్టులో ఈ కేసులో తదుపరి విచారణ గురువారం జరగనుంది. -
23 జాతుల పెంపుడు శునకాలపై కేంద్రం బ్యాన్!
న్యూఢిల్లీ: పెంపుడు కుక్కల పెంపకం విషయంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. తరుచూ ప్రజలపై దాడులకు ప్రాడుతూ మరణాలకు కారణమవుతున్న 23 జాతులకు చెందిన పెంపుడు శునకాల అమ్మకాలపై నిషేధం విధించాలని రాష్ట్రాలను ఆదేశించింది. ఈ 23 బ్రీడ్స్ అత్యంత ప్రమాదకరమైనవిగా కేంద్రం పేర్కొంది. బ్యాన్ విధించిన వాటిలో పిట్ బుల్ టెర్రియర్, అమెరికన్ బుల్డాగ్, రోట్ వీలర్, మస్టిఫ్స్, టొసా ఇను, అమెరికన్ స్టాఫర్డ్‌షైర్ టెర్రియర్, డోగో అర్జెంటీనో, సెంట్రల్ ఆసియన్ షెఫర్డ్, సౌత్ రష్యన్ షెఫర్డ్, వూల్ఫ్ డాగ్స్, మాస్కో గార్డ్ తదితర జాతుల శునకాలు ఈ జాబితాలో ఉన్నాయి. వీటి సంతాన వృద్ధి(బ్రీడింగ్)ని కూడా అడ్డుకొనేలా చర్యలు చేపట్టాలని కేంద్రం స్పష్టం చేసింది. ఈ మేరకు అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రధాన కార్యదర్శులకు కేంద్ర పశుసంవర్ధక శాఖ లేఖలు రాసింది. పౌరులు, పౌర సంస్థలు, జంతు సంరక్షణ సంస్థల నుంచి వచ్చిన వినతులను పరిశీలించి నిపుణుల కమిటీ ఇచ్చిన నివేదిక మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. -
Farmers Protest: ‘రైల్‌రోకో’కు దిగిన రైతులు
న్యూఢిల్లీ: ఢిల్లీ ఛలో నిరసన మార్చ్‌లో భాగంగా నాలుగు గంటల పాటు నిర్వహించే రైతుల రైల్‌రోకో ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభమైంది. ఇందులో భాగంగా పంజాబ్‌లోని అమృత్‌సర్‌తో పాటు హర్యానాలోని పలు ప్రాంతాల్లో రైతులు రైల్‌రోకోకు దిగారు. సాయంత్రం 4 గంటల వరకు రైల్‌రోకో జరగనుంది. సంయుక్త కిసాన్ మోర్చా, కిసాన్ మజ్దూర్ మోర్చా సంయుక్తంగా రైల్‌రోకోకు పిలుపునిచ్చాయి. పంటలకు కనీస మద్దతు ధర(ఎంఎస్పీ) సహా తమ ఇతర డిమాండ్లను కేంద్రం ఆమోదించాల్సిందేనని రైతులు డిమాండ్ చేస్తున్నారు. #WATCH | Punjab: Farmers organisations hold 'Rail Roko' protest, in Amritsar. pic.twitter.com/kqmSYjd1z9 — ANI (@ANI) March 10, 2024 రైల్‌రోకోలో భాగంగా వందలాది మంది రైతులు రైల్వే ట్రాక్‌లపై కూర్చొని నిరసన తెలుపుతారని కిసాన్ మజ్దూర్ మోర్చా సర్వన్ సింగ్ పందేర్ చెప్పారు. రైతులు చేపట్టిన రైల్‌రోకో కార్యక్రమంతో పంజాబ్, హర్యానాల్లో 60 చోట్ల రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడనుంది. మరోవైపు మార్చ్ 6వ తేదీ నుంచి రైతులు చేపట్టిన ‘ఢిల్లీ ఛలో’ ర్యాలీ కొనసాగుతుండటంతో ఢిల్లీ సరిహద్దుల వద్ద పోలీసులు భద్రత పెంచారు. హర్యానాలోని అంబాల జిల్లాలో పోలీసులు 144 సెక్షన్ విధించారు. ఫిబ్రవరిలో రైతులు ఢిల్లీ ఛలో నిరసన ర్యాలీ చేపట్టిన సందర్భంగా వారితో కేంద్ర ప్రభుత్వం చర్చలు జరిపింది. పలు పంటలకు ఐదేళ్లపాటు మద్దతు ధర ఇస్తామని ఈ చర్చల్లో కేంద్రం ప్రతిపాదించింది. కేంద్రం తీసుకువచ్చిన ఈ ప్రతిపాదన రైతులకు నచ్చకపోవడంతో వారు ఢిల్లీ ఛలో నిరసన ర్యాలీని మళ్లీ పునరుద్ధరించారు. ఇందులో భాగంగా రాస్తారోకోలు, రైల్‌రోకోలకు పిలుపునిచ్చి దశల వారిగా నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇదీ చదవండి.. హిట్లర్ అధికారం పదేళ్లకే ముగిసింది -
ఆ దేశంలో ఉద్యోగాల పేరిట దారుణ మోసం: కేంద్రం కీలక ప్రకటన
ఢిల్లీ: మంచి జీతం అనగానే ట్రావెల్ ఏజెంట్ మాటలు నమ్మి హైదరాబాద్‌కు చెందిన అస్వాన్.. రష్యాలో ఉద్యోగం కోసం వెళ్లాడు. తీరా అక్కడికి వెళ్లాక బలవంతంగా సైన్యం చేర్పించారు. ఆపై ఉక్రెయిన్‌తో జరుగుతున్న యుద్ధంలో ఆ యువకుడు ప్రాణం విడిచాడు. రష్యాలో ఉద్యోగాల పేరుతో జరుగుతున్న మానవ అక్రమరవాణాను గుర్తించిన కేంద్రం.. తాజాగా కీలక ప్రకటన చేసింది. ఉక్రెయిన్-రష్యా యుద్ధంలో భారతీయులు పలువురు చిక్కుకున్నట్లు విదేశీ వ్యవహారాల శాఖ ప్రకటించింది. ‘‘రష్యాలో ఉద్యోగాల పేరుతో భారీ మోసాలు జరుగుతున్నాయి. ఉద్యోగాల పేరిట ప్రైవేట్ సైన్యంలో చేరుస్తున్నారు. అలాంటి వాళ్లను గుర్తించి వెనక్కి రప్పించే ప్రయత్నంలో ఉన్నాం’’ అని విదేశీ వ్యవహారాల శాఖ పేర్కొంది. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో జరిపిన సోదాల్లో ఈ మానవ అక్రమ రవాణా నెట్వర్క్ గుర్తించినట్లు తెలిపింది కేంద్రం. మోసకారి మాటలతో రష్యా ప్రైవేట్ సైన్యంలో భారతీయుల్ని చేరుస్తున్న ఏజెంట్లను సీబీఐ గుర్తించిందని.. పలువురిపై కేసులు కూడా నమోదు చేసిందని కేంద్రం తెలిపింది. రష్యాలో ఉద్యోగాల పేరిట.. ఏజెంట్ల ఇచ్చే మోసపూరిత ప్రకటనలు నమ్మొద్దంటూ అప్రమత్తం చేసింది కేంద్రం. ఈ ముఠాలు 35 మంది భారతీయుల్ని రష్యాకు తరలించినట్లు తెలుస్తోంది. అయితే ఇందులో ఎంతమంది ఉక్రెయిన్ యుద్ధంలో ఉన్నారన్నది స్పష్టత రావాల్సి ఉంది. -
Delhi Chalo: ఢిల్లీలో ‘మహా పంచాయత్’కు రైతుల పిలుపు
న్యూఢిల్లీ: పంటలకు మద్దతుధర కోసం రైతులు చేపట్టిన నిరసన మార్చ్ ఢిల్లీ ఛలో బుధవారం(మార్చ్ 6) ఉదయం మళ్లీ మొదలైంది. పలు రాష్ట్రాల నుంచి ర్యాలీగా వచ్చిన రైతులు ఢిల్లీలో కలుసుకోవడానికి రైతు సంఘాలు ప్లాన్ చేశాయి. అయితే తమ డిమాండ్లపై మార్చ్ 14న ఢిల్లీలో మహా పంచాయత్ కార్యక్రమం చేపట్టనున్నట్లు రైతుసంఘాలు ప్రకటించాయి. పంటలకు కనీస మద్దతు ధర, రైతులకు పెన్షన్, రుణమాఫీ, కరెంటు ఛార్జీలు యథాతథంగా కొనసాగించడం లాంటి డిమాండ్లతో రైతులు ఢిల్లీ ఛలో నిరసన మార్చ్‌ను ఫిబ్రవరిలోనే ప్రారంభించారు. అయితే కేంద్ర ప్రభుత్వంతో చర్చల కోసం తొలి విడత విరామం ప్రకటించారు. చర్చలు విఫలమవడంతో రెండో విడత మార్చ్ కూడా ఫిబ్రవరిలోనే నిర్వహించారు. అనంతరం మూడవ విడత నిరసన మార్చ్‌ను బుధవారం నుంచి పునరుద్ధరించారు. రైతుల తాజా ఢిల్లీ ఛలో పిలుపుతో ఢిల్లీ చుట్టుపక్కల ఉత్తరప్రదేశ్, పంజాబ్, హర్యానా రాష్ట్రాల నుంచి ఢిల్లీలోకి వచ్చే టిక్రీ,సింగు, ఘాజీపూర్ సరిహద్దుల వద్ద పోలీసులు భద్రత పెంచారు. VIDEO | Farmers' protest: Security remains tightened at Delhi's Ghazipur border. Earlier this week, the farmers had called to march towards Delhi from March 6 to press the government to fulfill their demands.#FarmersProtest pic.twitter.com/qkperoHULm — Press Trust of India (@PTI_News) March 6, 2024 ఈ సరిహద్దుల వద్ద రైతులు ఫిబ్రవరి 13 నుంచి క్యాంపులు వేసుకుని నిరసన తెలుపుతున్నారు. ఫిబ్రవరి 18న కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఐదు సంవత్సరాల పాటు కనీస మద్దతు ధర ఆఫర్‌ను రైతుసంఘాలు తిరస్కరించడంతో ప్రభుత్వంతో రైతుల చర్చలు విఫలమయ్యాయి. దీంతో ఢిల్లీ ఛలో మార్చ్‌ను రైతు సంఘాలు మళ్లీ పునరుద్ధరించాయి. ఇదీ చదవండి.. రాహుల్ గాంధీకి ఊహించని అనుభవం -
ఆగిన ఢిల్లీ ఛలో! 5 పాయింట్లలో..
కీలక డిమాండ్ల సాధనలో నిన్నటి వెనక్కి తగ్గని అన్నదాతలు.. ఇప్పుడు చల్లబడ్డారా? లేకుంటే.. తమ ఆందోళనలను తీవ్ర తరం చేయబోతున్నారా? అసలు ఢిల్లీ ఛలోకి విరామం ఎందుకు ప్రకటించారు?. అయితే తాజా పరిస్థితుల దృష్ట్యా.. ఫిబ్రవరి 29వ తేదీ వరకు ఢిల్లీ ఛలో మార్చ్‌ను నిలిపివేస్తున్నట్లు రైతు సంఘాల నేతలు ప్రకటించారు. అప్పటిదాకా ఏం చేయబోతున్నారనేది కూడా చెప్పేశారు. 1. పంజాబ్-హర్యానా సరిహద్దుల్లోని శంభూ, ఖనౌరీల వద్ద భారీ సంఖ్యలో రైతులు మోహరించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో శుక్రవారం సైతం భాష్పవాయువు ప్రయోగం.. లాఠీ ఛార్జీతో ఆ ప్రాంతాలు రణరంగాన్ని తలపించాయి. అయితే ఆ వెంటనే ఢిల్లీ ఛలోను వాయిదా వేస్తున్నట్లు రైతు సంఘాల నేతలు ప్రకటించాయి. తమ నిర్ణయం ఏంటన్నది ఆరోజునే(29న) ప్రకటిస్తామని చెప్పారు. తదుపరి కార్యాచరణ ప్రకటించేదాకా.. అక్కడే వివిధ రూపాల్లో నిరసనలను తెలపాలని రైతులకు.. రైతు సంఘాల నేతలు పిలుపు ఇచ్చారు. దీంతో ఉద్రిక్తతలు కొనసాగే అవకాశాలే కనిపిస్తున్నాయి. 2. ఇవాళ క్యాండిల్ మార్చ్.. రేపు రైతుల సమస్యల మీద సెమినార్ల నిర్వహణతో పాటు ప్రపంచ వాణిజ్య సంస్థ-కేంద్రం దిష్టిబొమ్మల దహనం కార్యక్రమాలకు పిలుపు ఇచ్చారు. ఆపై రెండు రోజుల్లో రైతు సంఘాల ఆధ్వర్యంలో వరుస సమావేశాలు జరుగుతాయన్నారు. రానున్న ఐదురోజుల్లో సంయుక్త కిసాన్ మోర్చాతో పాటు కిసాన్ మజ్దూర్ మోర్చా, మరికొన్ని సంఘాలు భేటీ అయ్యి సంయుక్తంగా తదుపరి కార్యాచరణను రూపొందిస్తాయని ఆ సంఘాల నేతలు మీడియాకు వెల్లడించారు. 3. కనీస మద్దతు ధరకు చట్టబద్ధత, రుణమాఫీ, స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల అమలు.. తదితర డిమాండ్లతో ఆందోళన నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. దేశ రాజధానివైపు వైపు రైతులు కదం తొక్కేందుకు యత్నిస్తుండగా.. గత 11 రోజులుగా భద్రతా బలగాలు వాళ్లను నిలువరిస్తూ వస్తున్నారు. ఇనుప కంచెలు, బారికేడ్లతో బలగాలు.. ట్రాక్టర్లు, వాటికి రక్షణ కవచాలతో రైతులు పోటాపోటీ ప్రదర్శనలతో యుద్ధవాతావరణాన్ని తలపించారు. ఈ క్రమంలోనే ముందుకొచ్చిన రైతులపై బలగాలు భాష్పవాయుగోళాలు ప్రయోగంతో పాటు లాఠీ ఛార్జీ చేయడం చేశాయి. అయినా రైతులు మాత్రం వెనక్కి తగ్గలేదు. 4. ఇదిలా ఉంటే.. బుధవారం జరిగిన ఘర్షణల్లో యువ రైతు శుభ్‌కరణ్ సింగ్ మృతి చెందిన తర్వాత ఆందోళనను రెండు రోజులు నిలిపివేసినట్లు రైతు సంఘాలు ప్రకటించాయి. శుక్రవారం శుభ్‌కరణ్ మృతికి నిరసనగా బ్లాక్ డే నిర్వహించాయి. అయితే.. నిరసనలో పాల్గొంటున్న దర్శన్ సింగ్(62) అనే రైతు గుండెపోటుతో శుక్రవారం ప్రాణాలు విడిచినట్లు రైతు నాయకులు తెలిపారు. దీంతో రైతుల నిరసనలు మొదలయ్యాక ఇప్పటిదాకా ఐదుగురు చనిపోయారని రైతు సంఘాలు చెబుతున్నాయి. 5.ఒకవైపు చర్చల ద్వారానే సమస్యలకు పరిష్కారం లభిస్తుందని కేంద్రం చెబుతుండగా.. మరోవైపు రైతు సంఘాలు మాత్రం నిర్ణీత కాల వ్యవధితో తమకు డిమాండ్లపై స్పష్టమైన హామీ ఇవ్వాలని.. లేకుంటే ఆందోళనలను కొనసాగిస్తామని అంటున్నాయి. ఇంకోవైపు రైతులకు మద్దతుగా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. శాంతియుతంగా ఆందోళన నిర్వహిస్తున్న అన్నదాతల హక్కులను కేంద్రం, కొన్ని రాష్ట్రాలు ఉల్లంఘిస్తున్నాయని అందులో పిటిషనర్ పేర్కొన్నారు. -
కమ్యూనిటీ కిచెన్ల ఏర్పాటుపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: చిన్నారుల్లో పోషకాహారలోపం నివారించేందుకు కమ్యూనిటీ కిచెన్ల స్కీమ్‌ను తీసుకురావడంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఎలాంటి ఆదేశాలివ్వలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. పథకాలను సమీక్షించడంపై తమకున్న అధికారాలు పరిమితమని జస్టిస్ బేలా ఎమ్ త్రివేది, పంకజ్ మిట్టల్‌లతో కూడిన ధర్మాసనం తెలిపింది. నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్(ఎన్ఎఫ్ఎస్ఏ) చట్టం కింద కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే అమలు చేస్తున్న స్కీమ్‌లకు ప్రత్యామ్నాయంగా మరో స్కీమ్ తీసుకురావాలని తాము ఆదేశించలేమని సుప్రీంకోర్టు తెలిపింది. కాగా, గతంలో కమ్యూనిటీ కిచెన్లు ఏర్పాటు చేసి పిల్లల్లోపోషకాహార లోపాన్ని, ఆకలి చావులను నివారించేందుకు అవసరమైన చర్చలు జరపాలని సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి సూచించింది. ఆకలి, పోషకాహార లోపాన్ని ఎదుర్కోవడానికి కమ్యూనిటీ కిచెన్ల స్కీమ్ రూపొందించడానికి రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ సామాజిక కార్యకర్తలు అనున్ ధావన్, ఇషాన్ సింగ్, కునాజన్ సింగ్ ప్రజా పయోజన వ్యాజ్యం(పిల్) దాఖలు చేశారు. ఆకలి, పోషకాహారలోపం కారణంగా రోజూ వందల సంఖ్యలో ఐదేళ్లలోపు పిల్లలు మరణిస్తున్నారని, ఈ పరిస్థితి పౌరులు జీవించే హక్కును ఉల్లంఘిస్తోందని పిటిషన్లో పేర్కొన్నారు. ఇదీ చదవండి.. రష్యాలోని భారతీయులకు కేంద్రం కీలక సూచన -
నిరసనకు రైతుల బ్రేక్! అసలేం జరిగిందంటే..
కనీస మద్ధతు ధరతో సహా 23 డిమాండ్లతో మళ్లీ ఆందోళన ప్రారంభించిన రైతన్నల్ని పోలీసులు అడ్డుకునే క్రమంలో బుధవారం ఢిల్లీ సరిహద్దు అట్టుడికి పోయింది. భాష్పవాయివు ప్రయోగంతో పాటు ఓ యువరైతు మరణించాడన్న ప్రచారంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. ఈ తరుణంలో తమది రైతుపక్ష ప్రభుత్వమని, మరోసారి చర్చలకు సిద్ధమని కేంద్రం ప్రకటించుకోగా.. ఆందోళనలకు రెండ్రోజులు విరామం ప్రకటించాయి రైతు సంఘాలు. తమ తదుపరి కార్యచరణ రూపకల్పన కోసమే రెండ్రోజులు విరామం ప్రకటించినట్లు పంజాబ్ కిసాన్ మజ్దూర్ జనరల్ సెక్రటరీ శర్వాన్ సింగ్ పంథేర్ ప్రకటించారు. ఈలోగా కేంద్రం నుంచి ఏదైనా పురోగతి కనిపించకపోతే.. శుక్రవారం సాయంత్రం తర్వాయి ప్రకటన చేస్తామని చెప్పారాయన. కనీస మద్దతు ధరపై చట్టం తీసుకువచ్చేందుకు కేంద్రం ఒకరోజు పార్లమెంట్‌ను సమావేశపర్చాలని ఆయన తొలి నుంచి డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మరోసారి అదే డిమాండ్ వినిపించారాయన. బుధవారం ఉదయం ఢిల్లీ వైపు వెళ్లేందుకు శంభు వద్ద 14వేల మంది రైతులు, 1200 ట్రాక్టర్లు, 300 కార్లు, 10 మినీ బస్సుల్లో కదిలారు. శంభూ-కనౌరీ సరిహద్దు వద్ద బుధవారం ఉదయం రైతులు బారికేడ్లను దాటే యత్నం చేశారు. వారిని నిలువరించేందుకు హర్యానా పోలీసులు మూడు రౌండ్ల టియర్ గ్యాస్ ప్రయోగం జరిపారు. ఈ క్రమంలో ఘర్షణ వాతావరణం నెలకొనగా.. శుభ్‌కరణ్ సింగ్(22) అనే యువకుడు మృతి చెందినట్లు, పలువురు రైతులకు గాయాలు అయినట్లు రైతు సంఘాలు ప్రకటించాయి. యువరైతు మృతి ఘటనపై పంజాబ్ ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. శుభ్‌కరణ్ మృతదేహానికి పోస్ట్‌మార్టం తర్వాత కేసు నమోదు చేస్తామని పంజాబ్ సీఎం భగవంత్ సింగ్ మాన్ చెబుతున్నారు. ఘటనపై కఠిన చర్యలు తప్పవని చెబుతూనే.. బాధిత కుటుంబాన్ని పంజాబ్ ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని తెలిపారు. ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌లో బుధవారం రైతులు భారీ ధర్నా చేపట్టారు. ఈ క్రమంలో ఓ వ్యక్తి ఆత్మహత్యకు యత్నించాడు. వెంటనే అప్రమత్తమైన రైతులు అతన్ని ఆస్పత్రికి తరలించారు. అతని పేరు బ్రిజ్‌పాల్ అని.. అతనూ ఓ రైతేనని రైతు సంఘాల నేతలు వెల్లడించారు. బ్రిజ్‌కు ప్రాణాపాయం తప్పిందని డాక్టర్లు వెల్లడించారు. అయితే హర్యానా పోలీసులు మాత్రం శుభ్‌కరణ్ సింగ్ ఘర్షణలోనే మరణించారన్న వాదనను తోసిపుచ్చారు. దాన్నొక రూమర్‌గా కొట్టిపారేశారు. ఈ విషయంలో పంజాబ్ ప్రభుత్వం మొదటి నుంచి తమకు సహకరించడం లేదని హర్యానా సర్కార్ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. బారికేడ్లను ధ్వంసం చేసే పరికరాలను వారు తమ వెంట తీసుకెళ్తున్నారని.. వాటిని స్వాధీనం చేసుకోవాలని పంజాబ్ బలగాలను అభ్యర్థించినా ఆ పని చేయలేదని హర్యానా పోలీసులు చెబుతున్నారు. కేంద్ర హోం శాఖ సైతం ముందుగా పంజాబ్ ప్రభుత్వానికి లేఖ రాసిన విషయాన్నీ ఈ సందర్భంగా హర్యానా ప్రభుత్వం గుర్తు చేస్తోంది. ‘మేం చేసిన నేరం ఏమిటి..? మిమ్మల్ని ప్రధానిని చేశాం. మమ్మల్ని అణచివేసేందుకు ఈ విధంగా బలగాలను ఉపయోగిస్తారని అనుకోలేదు. మేము అసలు డిమాండ్ల నుంచి వెనక్కి తగ్గేలా కేంద్రం ప్రతిపాదనలు చేసింది. ఇప్పుడు ఏం జరిగినా దానికి కేంద్రమే బాధ్యత వహించాల్సి ఉంటుంది’ అని పంజాబ్ కిసాన్ మజ్దూర్ జనరల్ సెక్రటరీ శర్వాన్ సింగ్ పంథేర్ అన్నారు. డిమాండ్ల సాధనకు రైతులు మళ్లీ ఆందోళనకు దిగడంపై కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి అర్జున్ ముండా బుధవారం స్పందించారు. రైతు నేతలతో ఐదో విడత చర్చలకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. నాలుగో విడత చర్చల తర్వాత.. నాలుగు ప్రధాన డిమాండ్లపై చర్చించేందుకు కేంద్రం సిద్ధంగా ఉంది. ఈ మేరకు రైతు సంఘాల నేతలకు ఆహ్వానం పంపాం. శాంతియుత వాతావరణం నెలకొల్పాల్సిన అవసరం అందరికీ ఉంది’’ అని ట్వీట్ చేశారాయన. మరోవైపు నిన్న జరిగిన కేబినెట్ భేటీలో చెరుకు రైతులకు శుభవార్త చెప్పింది కేంద్రం. 2024-25 సీజన్లో చక్కెర ఎఫ్ఆర్పి(గిట్టుబాటు) ధర క్వింటాల్ కు రూ.340 రూపాయలు పెంచుతున్నట్లు ప్రకటించింది. భేటీ అనంతరం కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ మీడియాతో మాట్లాడుతూ.. తాము రైతుపక్ష ప్రభుత్వమని అన్నారు. ఇంకోవైపు తమ నిరసనలపై ప్రభుత్వాలు అవలంభిస్తున్న వైఖరిపై రైతు సంఘాలు మండిపడుతున్నాయి. రైతులను ఢిల్లీకి వెళ్లనివ్వకపోతే ఎన్నికల సమయంలో రాజకీయ నాయకులను గ్రామాల్లోని రానివ్వబోమని భారతీయ కిసాన్ యూనియన్(బీకేయూ) అధికార ప్రతినిధి రాకేశ్ తికాయత్ హెచ్చరించారు. డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ మీరట్‌లో రైతులు బుధవారం ట్రాక్టర్ల ర్యాలీ నిర్వహించారు. ఈ క్రమంలో.. కలెక్టరేట్‌కు వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు ఆయన్ని అడ్డుకున్నారు. పంజాబ్‌లోని రైతులు తమ ఢిల్లీ చలో మార్చ్‌ను పునఃప్రారంభించడం.. సరిహద్దులో బలగాల మోహరింపుతో ఢిల్లీకి వెళ్లే రోడ్లన్నీ వాహనాలతో నిండిపోయాయి. ఈ క్రమంలో ట్రాఫిక్ ఆంక్షల్ని ప్రకటించారు. మరోవైపు ఢిల్లీ-మీరట్ ఎక్స్‌ప్రెస్‌వే, NH-9లో వాహనాల రద్దీ కనిపించింది. ఇంకోపక్క.. హర్యానాతో సింగు-టిక్రీ సరిహద్దులు మూసివేత గురువారం కూడా అమల్లో ఉంటుందని అధికారులు ప్రకటించారు. రైతుల నిరసన-బలగాల మోహరింపుతో తీవ్ర ఉద్రిక్తతల నడము.. హర్యానా-పంజాబ్ సరిహద్దులో ఈ నెల 23వ తేదీ వరకు ఇంటర్నెట్ సర్వీసులను రద్దును హర్యానా ప్రభుత్వం పొడిగించింది. అలాగే.. రైతులు విరామం ప్రకటించినా.. ముందు జాగ్రత్తగా సరిహద్దులో బలగాల మోహరింపును కొనసాగించనున్నట్లు వెల్లడించింది. -
కాసేపట్లో రైతుల ‘ఢిల్లీ ఛలో’.. కేంద్రం స్పందిస్తుందా?
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో రైతుల నిరసన ర్యాలీ ఢిల్లీ ఛలో ఇవాళ(ఫిబ్రవరి 21) మళ్లీ మొదలవనుంది. పలు పంటలకు కనీస మద్దతు ధర(ఎంఎస్పీ)పై కేంద్ర ప్రభుత్వంతో చర్చలు విఫలం కావడంతో రైతు సంఘాలు బుధవారం నుంచి మళ్లీ నిరసనకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. వందలాది ట్రాక్టర్లు, జేసీబీలతో రాజధాని నగరంలోకి చొచ్చుకు వచ్చేందుకు రైతులు సిద్ధమయ్యారు. అయితే రైతు నాయకులు కేంద్రానికి బుధవారం ఉదయం 11 గంటల దాకా సమయమిచ్చారు. ఈ లోపు ఏదో ఒకటి తేల్చకపోతే ఢిల్లీ ఛలో యథావిధిగా జరుగుతుందని తెలిపారు. దీంతో ఢిల్లీ పోలీసులు అప్రమత్తమయ్యారు. టిక్రీ, సింగు సరిహద్దులను పోలీసులు పూర్తిగా మూసేశారు. ఈ సరిహద్దుల వద్ద భారీగా భద్రతా బలగాలను మోహరించడమే కాక కాంక్రీట్ బారికేడ్లను అడ్డుగా ఉంచారు. రైతుల నిరసన ర్యాలీ ఢిల్లీలోకి ప్రవేశిస్తే నగరంలో ట్రాఫిక్ గ్రిడ్‌లాక్‌కు దారి తీస్తుందని పోలీసులు ఆందోళన చెందుతున్నారు. అవసరమైతే ఘాజీపూర్ సరిహద్దును కూడా మూసివేస్తామని పోలీసులు తెలిపారు. నోయిడా, గురుగ్రామ్‌లలోనూ ట్రాఫిక్ ఆంక్షలు పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు గ్రేటర్ నోయిడాలోని నాలెడ్జ్ పార్క్‌లో మార్చ్ చేసేందుకు రైతులు ఇప్పటికే డిసైడయ్యారు. దీంతో ఇక్కడ ట్రాఫిక్‌ను మళ్లించనున్నారు. కీలకమైన పంజాబ్, హర్యానాల సరిహద్దు అయిన శంభు బోర్డర్లో భారీగా పోలీసులు మోహరించారు. హర్యానాలోని 7 జిల్లాలో బల్క్ ఎస్ఎమ్ఎస్లతో పాటు ఇంటర్నెట్ సర్వీసులను ప్రభుత్వం ఇప్పటికే నిలిపివేసింది. ర్యాలీ చేసే రైతుల వద్ద ఉన్న జేసీబీ వంటి యంత్రాలను సీజ్ చేయాలని పంజాబ్ ప్రభుత్వాన్ని హర్యానా ప్రభుత్వం ఇప్పటికే కోరింది. కాగా, ఈ నెల 13న రైతులు మొదటిసారి ఢిల్లీ ఛలోకు పిలుపునిచ్చారు. ఆ తర్వాత కేంద్రం వారితో చర్చలు జరిపింది. ఈ చర్చలు ఫెయిల్ అవడంతో రైతు సంఘాలు మళ్లీ బుధవారం నుంచి ఛలో ఢిల్లీ ర్యాలీ పునరుద్ధరిస్తామని ప్రకటించారు. బీజేపీ, ఎన్డీఏ ఎంపీల ఇళ్ల ముందు నల్ల జెండాలు.. ఢిల్లీ ఛలోతో పాటు బీజేపీ, ఎన్డీఏ ఎంపీల ఇళ్ల ముందు నల్ల జెండాలతో నిరసన తెలపాలని రైతుల ఐక్య వేదిక సంయుక్త కిసాన్ మోర్చా(ఎస్కేఎమ్) పిలపునిచ్చింది. ఇక పంజాబ్‌లోని బీజేపీ నేతల ఇళ్లను ముట్టడిస్తామని ఎస్కేఎమ్ ఇప్పటికే ప్రకించింది. దీంతో బీజేపీ నేతల ఇళ్ల ముందు పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. #WATCH | Farmer leader Sarwan Singh Pandher says, "...We have told the govt that you can kill us but please don't oppress the farmers. We request the Prime Minister to come forward and put an end to this protest by announcing a law on the MSP guarantee for the farmers...The… pic.twitter.com/pwBEiPH9RX — ANI (@ANI) February 21, 2024 ఇదీ చదవండి.. మరాఠాల రిజర్వేషన్‌కు ఓకే -
కేంద్రం ఆఫర్.. ఇక రైతు సంఘాలదే నిర్ణయం
ఢిల్లీ, సాక్షి: పలు డిమాండ్ల సాధనకై ఆందోళన చేపట్టిన రైతు సంఘాలతో కేంద్రం నాలుగో దఫా చర్చలు ముగిశాయి. ముగ్గురు కేంద్ర మంత్రులు కమిటీ గతంలోనూ మూడుసార్లు(8, 12, 15 తేదీల్లో) రైతు సంఘాలతో చర్చించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో.. ఆదివారం రాత్రి 8:15 గం. నుంచి సోమవారం తెల్లవారుజామున ఒంటి గంట వరకు చర్చలు సాగాయి. ఈ చర్చల్లో కీలక ప్రతిపాదనను రైతు సంఘాల ముందు ఉంచినట్లు కేంద్రం ప్రకటించింది. ప్రభుత్వం తరఫున వ్యవసాయశాఖ మంత్రి అర్జున్ ముండా, వాణిజ్య మంత్రి పీయూష్ గోయెల్, హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ రైతు నేతలతో చర్చలు జరిపారు. పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ సైతం ఈ సమావేశంలో పాల్గొన్నారు. సమావేశం అనంతరం కేంద్ర మంత్రి పీయూష్ గోయెల్ సమావేశం వివరాలను మీడియాకు వెల్లడించారు. ‘‘.. రైతులతో ఒప్పందం కుదుర్చుకున్న తర్వాత ఐదేళ్లపాటు పప్పుధాన్యాలు, మొక్కజొన్న, పత్తి పంటలను ప్రభుత్వ ఏజెన్సీలు కనీస మద్దతు ధర (MSP)కు కొనుగోలు చేస్తాయని మా బృందం ప్రతిపాదించింది. ఒప్పందం కుదిరాక ఐదేళ్ల పాటు ఇది అమలులో ఉంటుంది. కందులు, మినుములు, మైసూర్ పప్పు, మొక్కజొన్న పండించే సాగుదారులతో ఎన్సీసీఎఫ్, ఎన్ఏఎఫ్ఈడీ వంటి సహకార సంఘాలు ఒప్పందం కుదుర్చుకుంటాయి.. On meeting farmer leaders in connection with the ongoing protest, Union Minister Piyush Goyal says, "With new ideas and thoughts, we had a positive discussion with farmer leaders. We have together proposed a very innovative, out-of-the-box idea...The govt promoted cooperative… pic.twitter.com/KRRQR566gv — Gagandeep Singh (@Gagan4344) February 18, 2024 .. కొనుగోలు చేసే పరిమాణంపై ఎటువంటి పరిమితి ఉండబోదు. దీని కోసం ఒక పోర్టల్ కూడా అభివృద్ధి చేస్తాం. మా ప్రతిపాదనలతో పంజాబ్‌లో వ్యవసాయానికి రక్షణ లభిస్తుంది. భూగర్భ జలమట్టాలు మెరుగవుతాయి. సాగు భూములు నిస్సారంగా మారకుండా ఉంటాయి’’ అని మంత్రి పీయూష్ గోయెల్ తెలిపారు. ‘‘కేంద్రాన్ని.. పప్పు ధాన్యాలపై కనీస మద్ధతు ధర హామీ అడిగామ’’ని పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్‌సింగ్ మాన్ మీడియాకు తెలిపారు. ఇక.. ప్రభుత్వ ప్రతిపాదనలపై రైతు నేత శర్వాన్ సింగ్ పంథేర్ స్పందించారు. సోమ, మంగళవారాల్లో తమ రైతు సంఘాలతో చర్చిస్తామన్నారు. నిపుణుల అభిప్రాయాలు కూడా తీసుకొని ఒక నిర్ణయానికి వస్తామని తెలిపారు. రుణమాఫీ వంటి డిమాండ్లు ఇంకా అపరిష్కృతంగానే ఉన్నాయన్నారు. దీనిపై రెండు రోజుల్లో స్పష్టత వస్తుందని చెప్పారు. ప్రస్తుతానికి ‘దిల్లీ చలో’ కార్యక్రమాన్ని నిలిపివేశామని.. ఒకవేళ తమ డిమాండ్లన్నింటికీ పరిష్కారం లభించకపోతే ఫిబ్రవరి 21న తిరిగి ప్రారంభిస్తామని వెల్లడించారు. అయితే.. కేంద్ర ప్రభుత్వం కాలయాపన విధానాలు మానుకొని, లోక్‌సభ ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చే కంటే ముందే ఎంఎస్పీకి చట్టబద్ధతతో సహా రైతుల ఇతర డిమాండ్లను పరిష్కరించాలని రైతు నేత జగ్జిత్ సింగ్ దల్లేవాల్ డిమాండ్ చేశారు. పంజాబ్-హర్యానా సరిహద్దు శంభు వద్ద ఆయన మీడియాతో మాట్లాడుతూ రైతుల సమస్యలను పరిష్కరించే ఉద్దేశంతో కేంద్రం చర్చలు చేస్తున్నట్టు కనిపించడం లేదని అన్నారు. ఎంఎస్పీకి చట్టబద్ధతకు ఒక ఆర్డినెన్స్, స్వామినాథన్ కమిషన్ సిఫారసుల అమలుకు ఒక నోటిఫికేషన్ ఇవ్వడం ద్వారా కేంద్రం పరిష్కారం చూపొచ్చని అభిప్రాయపడ్డారు. డిమాండ్లు నెరవేర్చే వరకు రైతులు వెనక్కు వెళ్లేది లేదని స్పష్టం చేశారు. 21న నల్ల జెండాలతో ఘెరావ్ గతంలో నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా సాగిన ఉద్యమ విరమణ సందర్భంగా ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ సంయుక్త కిసాన్ మోర్చా(ఎస్కేఎం) ఆందోళనకు పిలుపునిచ్చింది. దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో ఈ నెల 21న బీజేపీతో సహా అధికార ఎన్డీయే పక్ష ఎంపీలకు వ్యతిరేకంగా నల్లజెండాలతో నిరసనలు తెలుపాలని రైతులకు సూచించింది. మరోవైపు పంజాబ్‌లో బీజేపీ ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ జిల్లా అధ్యక్షుల ఇండ్ల ముందు ఈనెల 20 నుంచి 22 వరకు మూడు రోజుల పాటు 24 గంటల ఆందోళన కార్యక్రమం నిర్వహించనున్నట్టు ఎస్కేఎం ఓ ప్రకటనలో పేర్కొన్నది. ఇంటర్నెట్పై నిషేధం కొనసాగింపు రైతుల ఆందోళన నేపథ్యంలో ఆంక్షలు కొనసాగుతున్నాయి. హర్యానాలోని ఏడు జిల్లాల్లో మొబైల్ ఇంటర్నెట్ సేవలపై నిషేధాన్ని ఈనెల 19 వరకు పొడిగించారు. కేంద్ర హోంశాఖ ఆదేశాల మేరకు పంజాబ్‌లో పటియాలా, సంగ్రూర్, ఫతేగఢ్ సాహిబ్ తదితర జిల్లాల్లోని పలు ప్రాంతాల్లోనూ ఇంటర్నెట్ సేవల రద్దును 24 వరకు పొడిగించారు. -
ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు.. మధ్యప్రదేశ్ హైకోర్టు కీలక నిర్ణయం
భోపాల్: ఆర్థికంగా వెనుకబడిన జనరల్ కేటగిరీ కులాల వారికే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు వర్తిస్తాయా అనే అంశాన్ని మధ్యప్రదేశ్ హైకోర్టు విచారించింది. ఈ విషయంలో చీఫ్ జస్టిస్ రవి విజయ మలిమత్, జస్టిస్ విశాల్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. ఆరు వారాల్లో స్పందనను తెలియజేయాలని ఆదేశించింది. అడ్వకేట్ యూనియన్ ఫర్ డెమొక్రసీ అండ్ సోషల్ జస్టిస్ సంస్థ ఈ పిటిషన్ దాఖలు చేసింది. ఇతర కులాల్లోని ఆర్థికంగా వెనుకబడిన వారిని ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు వర్తించడం లేదని కోర్టుకు తెలిపింది. పేదలపై కులం పేరుతో ప్రభుత్వం వివక్ష చూపిస్తోందని, ఈ డబ్ల్యూఎస్ రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధంగా భావించి కొట్టి వేయాలని పిటిషనర్ కోరారు. ఇదీ చదవండి.. కాంగ్రెస్‌పై అమిత్ షా ఫైర్ -
సానుకూలంగా చర్చలు.. సరిహద్దులోనే రైతులు!
తమ డిమాండ్ల సాధన కోసం ఢిల్లీ ఛలో యాత్ర చేపట్టిన రైతులు.. తమ నిరసనల్ని కొనసాగించాలనే నిర్ణయించారు. గురువారం అర్ధరాత్రి దాకా కేంద్రంతో జరిగిన చర్చలు ఓ కొలిక్కి రాలేదు. అయితే సానుకూలంగానే జరిగినట్లు ఇటు కేంద్రం, అటు పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ సింగ్ మాన్ మీడియాకు తెలియజేశారు. కానీ, రైతు సంఘాలు మాత్రం కాలపరిమితితో కూడిన హామీ కోరుతున్నాయి. దీంతో ఇరువర్గాలు ఆదివారం సాయంత్రం మరోసారి భేటీ కావాలని నిర్ణయించాయి. అయితే.. తమ నిరసనలను మాత్రం కొనసాగించి తీరతామని, ఢిల్లీ మార్చ్ కొనసాగిస్తామని రైతు సంఘాలు స్పష్టం చేశాయి. మంగళ, బుధవారాల్లో అట్టుడికిన పంజాబ్, హర్యానా సరిహద్దులు.. చర్చల నేపథ్యంలో గురువారం కాస్త శాంతించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో నేడు గ్రామీణ భారత్ బంద్‌కు పిలుపు ఇచ్చాయి. అలాగే.. ఢిల్లీ సరిహద్దుల నుంచి తాము వెనక్కి వెళ్లబోమని.. శాంతియుతంగానే నిరసనలు కొనసాగిస్తామని రైతు సంఘాల నేతలు చెబుతున్నారు. చర్చలపై ఎవరేమన్నారంటే.. .. ఛండీగఢ్‌లో గురువారం రాత్రి కేంద్ర మంత్రులు అర్జున్ ముండా, పీయూష్ గోయల్, నిత్యానంద రాయ్‌తో రైతు సంఘాలు భేటీ అయ్యాయి. ఈ సమావేశంలో పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ కూడా పాల్గొన్నారు. రైతుల డిమాండ్లలో ముఖ్యమైన అంశాలపై వివరంగా చర్చించామని.. సానుకూలంగా చర్చలు జరిగాయని మంత్రి అర్జున్ ముండా మీడియాకు తెలియజేశారు. ఆదివారం సాయంత్రం జరగబోయే చర్చలతో ఇరువైపుల నుంచి సమస్యకు పరిష్కారం దొరుకుతుందని ఆశిస్తున్నట్లు తెలిపారాయన. రైతు సంఘాల నేతలతో జరిగిన చర్చలపై పంజాబ్ సీఎం భగవంత్ మాన్ మాట్లాడుతూ.. చర్చలు మంచి వాతావరణంలో జరిగాయని, శాంతియుతంగా నిరసనలు కొనసాగిస్తామని రైతు సంఘాల నేతలు హామీ ఇచ్చారని తెలిపారు. అదే సమయంలో హర్యానా ప్రభుత్వం సరిహద్దులో వ్యవహరిస్తున్న తీరును ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. #WATCH | Union Ministers Piyush Goyal, Arjun Munda, Nityanand Rai and Punjab CM Bhagwant Mann hold a meeting with farmer leaders, in Chandigarh. (Video: CM Bhagawant Mann PRO) pic.twitter.com/3mCx30DXbd — ANI (@ANI) February 15, 2024 ఇక రైతు సంఘాల నేతలు మీడియాతో మాట్లాడుతూ.. కనీస మద్దతు ధర(MSP), రైతుల రుణమాఫీ లాంటి అంశాలపై చర్చించినా.. కాలపరిమితితో కూడిన హామీ దొరికితేనే తాము నిరసనలు విరమిస్తామని తెలిపారు. ‘‘కేవలం చర్చల కోసమే మేం లేం. పరిష్కారం కూడా కావాలి. అందుకు సమయం కావాలి అని వాళ్లు(కేంద్ర మంత్రుల్ని ఉద్దేశిస్తూ..) కోరారు అని రైతు సంఘాల నేత ఒకరు తెలిపారు. అదే సమయంలో.. శాంతియుతంగా నిరసనలు కొనసాగిద్దామని రైతులకు సంఘాల నేతలు పిలుపుఇచ్చారు. ఇక తమ సోషల్ మీడియా అకౌంట్లపై ఆంక్షలు విధించడం..రైతులపై భద్రతా సిబ్బంది వ్యవహరించిన తీరును వాళ్లు కేంద్రం దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. అదే సమయంలో.. #WATCH | Chandigarh: After the meeting between the central government and the farmer unions concluded, farmer leader Jagjit Singh Dallewal says, "The protest will continue peacefully... We will not do anything else. We will appeal to the farmers too. When meetings are underway… pic.twitter.com/YJOZIZ8Nlm — ANI (@ANI) February 15, 2024 నేడు బంద్‌కి పిలుపు రైతు సంఘాలు శాంతియుతంగా ఢిల్లీకి యాత్ర నిర్వహిస్తామంటున్నాయి. ఇక సంయుక్త్ కిసాన్ మోర్చా ఇచ్చిన గ్రామీణ భారత్ బంద్ నేపథ్యంలో పలు చోట్ల భద్రతను కట్టుదిట్టం చేశారు. ఈరోజు వ్యవసాయ పనులు మాని.. రైతులంతా రోడ్డు ఎక్కి నిరసనలు తెలిపాలని పిలుపు ఇచ్చింది కిసాన్ మోర్చా. ఎమ్ఎస్పీ, కనీస పెన్షన్, కనీస వేతనం.. ఇలా 21 డిమాండ్ల సాధన కోసం తొమ్మిది యూనియన్ల సీనియర్ నేతలు ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద సంయుక్త నిరసన తెలిపేందుకు సిద్దం అయ్యారు. రైతుల సంఘాలుఇచ్చిన భారత్ బంద్ పిలుపు నేపథ్యంలో.. పలు రాష్ట్రాలు అప్రమత్తం అయ్యాయి. ముఖ్యంగా ఢిల్లీ చుట్టుపక్కల రాష్ట్రాల్లో అవాంఛనీయ ఘటనలు జరగకుండా భద్రత కట్టుదిట్టం చేశారు. నోయిడాలో 144 సెక్షన్ విధించారు. -
ఎన్నికల బాండ్ల స్కీమ్‌పై సంచలన తీర్పు
రాజకీయ పార్టీలకు నిధులు సమకూర్చేందుకు తీసుకొచ్చిన ఎన్నికల బాండ్ల చెల్లుబాటుపై దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ప్రాథమిక హక్కుల ఆర్టికల్ 19(1)(ఎ)ను అనుసరించి.. ఈ పథకం సమాచార హక్కును ఉల్లంఘిస్తుందని.. ఇది రాజ్యాంగ విరుద్ధమని ధర్మాసనం పేర్కొంది. అలాగే.. నల్లధనాన్ని అరికట్టేందుకు సమాచార హక్కును ఉల్లంఘించడం సమంజసం కాదని సర్వోన్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. ఈ మేరకు ఎలక్టోరల్ బాండ్స్ చెల్లుబాటు కాదంటూ ఏకగ్రీవ తీర్పును రాజ్యాంగ ధర్మాసనం వెల్లడించింది . ‘‘ఎలక్టోరల్ బాండ్స్ రాజ్యాంగ విరుద్ధం. ఇది ప్రాథమిక హక్కుల ఉల్లంఘనే. బ్లాక్ మనీ నిర్మూలనకు ఈ స్కీమ్ ఒక్కటే మార్గం కాదు. ఇంకా అనేక మార్గాలు ఉన్నాయి. రాజకీయ పార్టీలకు విరాళాలు అనేది క్విడ్ ప్రోకో కు దారి తీస్తుంది. విరాళాలు ఇచ్చిన వారి వివరాలు రహస్యంగా ఉంచడం తగదు. ఇది సమాచార హక్కు ఉల్లంఘన కిందకే వస్తుంది. రహస్య విరాళాలు ప్రాథమిక హక్కుల ఉల్లంఘన. కాబట్టి ఎలక్టోరల్ బాండ్స్ స్కీమ్‌ను రద్దు చేయాల్సిన అవసరం ఉంది’’ అని ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఏకగ్రీవ తీర్పు వెల్లడించింది. అదే సమయంలో ఎలక్టోరల్ బాండ్స్‌ను వెంటనే నిలిపివేయాలని.. వాటిని అమ్మకూడదని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. 2019 నుంచి ఇప్పటిదాకా జారీ చేసిన ఎలక్టోరల్ బాండ్స్ వివరాలను మూడు వారాల్లో(మార్చి 6వ తేదీలోగా) కేంద్ర ఎన్నికల సంఘానికి అందించాలని ఎస్బీఐను సుప్రీం ఆదేశించింది. అలాగే పార్టీలకు వచ్చిన ఫండ్ ఎవరిచ్చారో తెలియ పర్చాల్సిన అవసరం ఉందని.. ఆ వివరాలను బహిర్గత పర్చాల్సిన అవసరమూ ఉందని.. ఎలక్టోరల్ బాండ్స్ ఏ రాజకీయ పార్టీకి ఎంత వచ్చాయన్న వివరాలు మార్చి 13వ తేదీ లోగా తన వెబ్సైట్లో పొందుపర్చాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని సుప్రీం ఆదేశించింది. మరోవైపు.. ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో తీసుకున్న విరాళాలను వెనక్కి ఇచ్చేయాల్సిందేనని(ఇంకా ఎన్‌క్యాష్ అవ్వని బాండ్లను) రాజకీయ పార్టీలకు సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. ఇందుకోసం 15 రోజుల గడువు విధించింది. తీర్పుపై పిటిషనర్ల లాయర్ స్పందన ఎన్నికల బాండ్స్‌ను సుప్రీం కోర్టు ఆపేసింది పిటిషనర్ల వాదనతో పూర్తిస్థాయిలో కోర్టు ఏకీభవించింది ఇన్కమ్ ట్యాక్స్, కంపెనీల చట్టాల్లో చేసిన సవరణలను కొట్టేసింది సమాచార చట్టం ఉల్లంఘన కింద సుప్రీం కోర్టు పరిగణించింది విరాళాలు ఇచ్చేవారి వివరాలు గోప్యంగా ఉంచడాన్ని తీవ్రంగా తప్పుబట్టింది పిటిషనర్ల తరఫు వాదించిన సీనియర్ లాయర్ ప్రశాంత్ భూషణ్ పిటిషన్ల నేపథ్యం.. రాజకీయ పార్టీలకు అందే నిధుల్లో పారదర్శకత తీసుకువచ్చే ప్రయత్నాల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని 2018 జనవరి 2న అమల్లోకి తెచ్చింది. ఈ పథకాన్ని సవాల్ చేస్తూ ఏడీఆర్, కాంగ్రెస్ నాయకురాలు జయా ఠాకుర్, సీపీఎం, మరో పిటిషనర్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. 2024 సార్వత్రిక ఎన్నికల కోసం ఎన్నికల బాండ్లను ప్రారంభించడానికి ముందే ఈ పథకంపై సమగ్ర విచారణ అవసరమని అక్టోబరు 10న సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్(ఏడీఆర్ తరఫున) చేసిన విజ్ఞప్తిని సుప్రీంకోర్టు పరిగణనలోకి తీసుకుంది. దీంతో కిందటి ఏడాది అక్టోబర్ 31న వాదనలు ప్రారంభమయ్యాయి. ఈ పిటిషన్లపై మూడు రోజులపాటు విచారణ జరిపిన రాజ్యాంగ ధర్మాసనం.. నవంబర్ 2వ తేదీన తీర్పు రిజర్వ్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ కానిస్టిట్యూషన్ బెంచ్‌లో జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ జేబీ పార్దీవాలా, జస్టిస్ మనోజ్ మిశ్రా ఈ ధర్మాసనంలో సభ్యులుగా ఉన్నారు. ఈ పిటిషన్లపై విచారణ జరిపిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలో రాజ్యాంగ ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసిన సంగతి తెలిసిందే. అదే సమయంలో.. సీల్డ్ కవర్లో 2023 సెప్టెంబర్ 30 వరకు ఎలక్టోరల్ బాండ్ల ద్వారా రాజకీయ పార్టీలకు అందిన నిధుల వివరాలు ఇవ్వాలని ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది కూడా. ఏంటీ ఎన్నికల బాండ్లు..? ఎన్నికల బాండ్లు ఒక ప్రామిసరీ నోట్ లాంటివి. ఇవి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI)లో లభ్యం అవుతాయి. వ్యక్తులు, కంపెనీలు వీటిని కొనుగోలు చేయవచ్చు. అలా కొనుగోలు చేసిన వాటిని నచ్చిన రాజకీయ పార్టీలకు విరాళంగా ఇవ్వొచ్చు. రాజకీయ పార్టీలు తమకు వచ్చిన బాండ్లను నగదుగా మార్చుకొని పార్టీ కార్యక్రమాల కోసం వినియోగించుకుంటాయి. రాజకీయ పార్టీల విరాళాల విషయంలో పారదర్శకత తీసుకురావాలనే ఉద్దేశంతో కేంద్రంలోని అధికార బీజేపీ ప్రభుత్వం 2018లో ఈ ఎన్నికల బాండ్ల పథకాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. అయితే, రాజకీయ పార్టీలు తాము స్వీకరించిన విరాళాల గురించి బహిర్గతం చేయాల్సిన అవసరం లేదని కేంద్ర ప్రభుత్వం ఆర్థిక చట్టం-2017 సవరణ చేసింది. దాంతో ఎన్నికల బాండ్ల విధానంలో పారదర్శకత లోపించిందని పలువురు విమర్శించారు. ఈ క్రమంలోనే ఈ పథకాన్ని సవాల్ చేస్తూ పిటిషన్లు దాఖలయ్యాయి. ఇదీ చదవండి: విరాళాల సేకరణలో బీజేపీ టాప్.. ఆరేళ్లలో వేల కోట్లు పోగు! పిటిషనర్ల వాదన ఇదే.. కేంద్రం తీసుకొచ్చిన ఎన్నికల బాండ్ల పథకం పారదర్శకత కొరవడంతో పాటు ప్రజాస్వామ్యాన్ని విధ్వంసం చేస్తోంది అధికారప్రతిపక్ష పార్టీలకు సమాన అవకాశాలను కల్పించకపోగా అవినీతిని ప్రోత్సహిస్తోంది ఎన్నికల బాండ్ల ద్వారా ఇప్పటి వరకూ సమకూరిన నిధుల్లో అత్యధిక భాగం కేంద్రంలో, రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న పార్టీలకే వెళ్లాయి విపక్ష పార్టీలకు స్వల్ప మొత్తంలోనే విరాళాలు వచ్చాయి ఈ మేరకు గణాంకాలతో సహా వివరించారు సీనియర్ లాయర్ ప్రశాంత్ భూషణ్ కేంద్రం వాదన.. ప్రపంచంలోని అనేక దేశాలు ఎన్నికల్లో నల్లధనం ప్రభావాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి. మన దేశంలో నల్లధనాన్ని అరికట్టడానికి డిజిటల్ చెల్లింపుల విధానం అమలు, 2.38 లక్షల డొల్ల కంపెనీలపై చర్యలు వంటివి కేంద్రం తీసుకుంది. స్వచ్ఛమైన డబ్బే రాజకీయ పార్టీలకు విరాళాలుగా అందేలా చేయడానికి ఎన్నికల బాండ్ల పథకం రూపంలో కేంద్రం మరో ప్రయత్నం చేసింది ఒక దశలో సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ జోక్యం చేసుకుంటూ...‘‘అధికార పార్టీకే అధిక విరాళాలు ఎందుకు వెళ్తున్నాయి. దీనికి కారణమేమిటి’’ అని ప్రశ్నించారు. ఎన్నికల బాండ్ల ద్వారా సమకూరిన మొత్తం నిధులను ఎన్నికల సంఘం వద్ద ఉంచి, దాని ద్వారా అన్ని పార్టీలకు సమానంగా పంపిణీ చేయవచ్చు కదా అని ఆయన సూచించారు. కేంద్రం తరఫున వాదించిన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా బదులిస్తూ....‘అప్పుడు అసలు విరాళాలే రావ’ని అభిప్రాయపడ్డారు. అంతకుముందు ఈ పిటిషన్లపై కేంద్ర ప్రభుత్వం తరఫున అటార్నీ జనరల్ ఆర్.వెంకటరమణి సుప్రీంకోర్టుకు అఫిడవిట్ సమర్పించారు. ఎన్నికల బాండ్ల నిధుల మూలాలకు సంబంధించిన సమాచారాన్ని తెలుసుకునే హక్కు దేశ పౌరులకు లేదని అందులో పేర్కొన్నారు. ధర్మాసనం కీలక వ్యాఖ్యలు రాజకీయ పార్టీల నిధుల సమీకరణలో పారదర్శకత కోసం తీసుకొచ్చిన ఎన్నికల బాండ్ల పథకం లక్ష్య సాధనలో కొన్ని సమస్యలున్నాయి గోప్యత, విశ్వసనీయత కొందరికే పరిమితమవుతోంది ఎస్బీఐ వద్ద ఉన్న వివరాలను దర్యాప్తు సంస్థల ద్వారా ఏ రాజకీయ పార్టీకి, ఎవరు ఎంత విరాళం ఇచ్చారన్నది అధికారంలో ఉన్న వారు తెలుసుకోగలరు అదే విపక్షంలో ఉన్న వారికి అటువంటి అవకాశం లేదు అన్ని రాజకీయ పార్టీలకు సమాన అవకాశాలు కల్పించలేనప్పుడు పథకం నిష్పాక్షికత, పారదర్శకత ప్రశ్నార్థకమవుతుంది ఇదీ చదవండి: 2023 డిసెంబర్ నాటికి రూ.15 వేల కోట్ల ఎలక్టోరల్ బాండ్ల అమ్మకం రాజకీయ అభ్యంతరాలు అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్ వెల్లడించిన వివరాల ప్రకారం.. 2016-17 ఆర్థిక సంవత్సరం నుంచి 2021-22 ఆర్థిక సంవత్సరం మధ్య ఎలక్టోరల్ బాండ్ల రూపంలో భారతీయ జనతా పార్టీకి రూ.5,127.97 కోట్ల మేర విరాళాలు వచ్చాయి. మిగతా అన్ని జాతీయ పార్టీలకు కలిసి కేవలం రూ.1,783.93 కోట్లు మాత్రమే వచ్చాయి. దీని ప్రకారం ఎలక్టోరల్ బాండ్లతో అధికార పార్టీకి ఎంతమేర ప్రయోజనం కలుగుతుందో అర్థం చేసుకోవచ్చని విపక్షాలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి. -
రాజకీయ ప్రలోభాలకు లోనుకావొద్దు: రైతు సంఘాలకు కేంద్రం హితవు
ఢిల్లీ, సాక్షి: ఢిల్లీ ఛలో పేరిట ఆందోళనలను తీవ్రతరం చేయాలని రైతు సంఘాలు భావిస్తున్న తరుణంలో కేంద్రం స్పందించింది. మరోసారి చర్చలకు రావాలని రైతు సంఘాల్ని ఆహ్వానించింది. తమతో కేంద్రం అవలంభిస్తున్న వైఖరికి నిరసనగా.. ఈ నెల 16వ తేదీన భారత్ బంద్‌కు కిసాన్ మోర్చా పిలుపు ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే.. భారత్ బంద్ ప్రకటించిన కాసేపటికే కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి అర్జున్ ముండా మీడియాతో మాట్లాడారు. ‘‘చర్చల ద్వారా రైతు సంఘాలు సమస్యల పరిష్కారానికి ముందుకు రావాలి. అంతేగానీ.. రాజకీయ పార్టీల ప్రలోభాలకు రైతు సంఘాలు గురి కావొద్దు. ప్రభుత్వం రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉందని గుర్తించాలి’’ అని కోరారాయన. అలాగే.. రైతుల మార్చ్ నేపథ్యంలో దేశ రాజధాని ప్రాంతంలో.. శివారుల్లో భారీగా ట్రాఫిక్ ఝామ్ ఏర్పడుతోంది. ఈ పరిణామంపైనా మంత్రి అర్జున్ ముండా స్పందించారు. ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించవద్దని రైతుల్ని కోరారాయన. మరోవైపు చర్చల పిలుపుపై రైతు సంఘాలు స్పందించాల్సి ఉంది. ఇదిలా ఉంటే.. ఢిల్లీ సరిహద్దులో ఉద్రిక్తత పరిస్థితులు కొనసాగుతున్నాయి. నిన్నటి నుంచే పంజాబ్, హర్యానా, యూపీ నుంచి ఢిల్లీ వెళ్లే సరిహద్దులోనే ఉండిపోయారు. మంగళవారం ఉదయం నుంచే ఢిల్లీ వైపు వెళ్లేందుకు రైతులు ప్రయత్నిస్తున్నారు. అయితే ఢిల్లీకి రెండు వంద కిలోమీటర్ల పరిధిలోనే వాళ్లను నిలువరించేందుకు పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. సరిహద్దులో బారికేడ్లు, ముళ్ల కంచెలు ఏర్పాటు చేసి అడ్డుకునేందుకు యత్నిస్తున్నారు. ఈ క్రమంలో పలు ప్రాంతాల్లో యుద్ధ వాతావరణం కనిపిస్తోంది. #WATCH | Farmers' protest | Tear gas shells fired to disperse the agitating farmers who were approaching the Police barricade. Visuals from Shambhu Border. pic.twitter.com/AnROqRZfTQ — ANI (@ANI) February 14, 2024 -
భారత రత్న.. కేంద్రం సరికొత్త రికార్డు
న్యూఢిల్లీ: దేశ చరిత్రలో తొలిసారి ఈ ఏడాదిలోనే ఐదుగురికి భారతరత్న ప్రకటించి కేంద్ర ప్రభుత్వం సరికొత్త రికార్డు సృష్టించింది. దీంతో ఒకే సంవత్సరంలో ఎక్కువమందికి దేశ అత్యున్నత పురస్కారం ప్రకటించినట్లయింది. గతంలో 1999లో నలుగురికి భారతరత్న ప్రకటించడమే ఇప్పటివరకు రికార్డు. ఈ ఏడాది భారతరత్న దక్కించుకున్నవారితో కలిపి భారతరత్నాల జాబితాలో ఇప్పటివరకు చోటు దక్కించుకున్న వారి సంఖ్య మొత్తం 53కు చేరింది.కేంద్ర ప్రభుత్వం 1954లో అత్యున్నత పౌర పురస్కారాలైన భారతరత్న, పద్మవిభూషణ్‌లను ఏర్పాటుచేసింది. ఏదైనా రంగంలో అసాధారణ సేవలు అందించి అత్యున్నత స్థాయి పనితీరు కనబరిచిన వారికి భారతరత్న ఇస్తారు. ఈ పురస్కారానికి సంబంధించిన సిఫార్సులను ప్రధాని రాష్ట్రపతికి అందజేస్తారు. ప్రధాని చేసే సిఫారసు తప్ప ఎలాంటి కేంద్ర ప్రభుత్వం ఇతర అధికారిక సిఫారసులేవి రాష్ట్రపతికి వెళ్లవు. అవార్డు కింద రాష్ట్రపతి సంతకం చేసిన ధ్రువపత్రం, భారతరత్న పతకం అందిస్తారు. ఎలాంటి నగదు ఇవ్వరు. ఇదీ చదవండి.. 8 మంది ఎంపీలతో ప్రధాని లంచ్.. స్వయంగా బిల్లు చెల్లింపు -
యూపీఏ పాలనపై వైట్‌పేపర్.. లోక్‌సభలో రిలీజ్
న్యూఢిల్లీ: యూపీఏ పదేళ్ల పాలన(2004-2014)ను తూర్పార పడుతూ కేంద్ర ప్రభుత్వం గురువారం సాయంత్రం లోక్‌సభలో శ్వేతపత్రం ప్రవేశపెట్టింది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వైట్‌పేపర్‌ను టేబుల్ చేశారు. వైట్‌పేపర్‌లోని మొదటి 24 పేజీల్లో పదేళ్ల యూపీఏ పాలనలో జరిగిన వైఫల్యాలను, అవినీతిని వివరించారు. అప్పట్లో వెలుగు చూసిన 2జీ, కామన్వెల్త్, శారదా చిట్‌ఫండ్ తదితర కుంభకోణాలను ప్రస్తావించారు.1991లో ఆర్థిక సంస్కరణలు తీసుకువచ్చింది తామేనని చెప్పే యూపీఏ నేతలు 2004లో పవర్లోకి వచ్చిన తర్వాత వాటిని పూర్తిగా మరిచిపోయారని వైట్‌పేపర్‌లో కేంద్రం విమర్శించింది. కేవలం పదేళ్లలో దేశాన్ని ‘ఫ్రాజైల్ ఫైవ్’ స్థితి నుంచి టాప్ ఫైవ్‌లోకి ఎన్డీఏ ప్రభుత్వం తీసుకువచ్చిందని తెలిపింది. కొవిడ్, పలు దేశాల మధ్య యుద్ధాలు లాంటి పరిస్థితులను కూడా అధిగమించి దేశ ప్రగతిని పరుగులు పెట్టించామని పేర్కొంది. ఇదీ చదవండి.. ఇండియా కూటమికి మరో షాక్ -
పేపర్ లీక్ చేస్తే కోటి ఫైన్.. లోక్‌సభలో కేంద్రం బిల్లు
న్యూఢిల్లీ: పోటీ పరీక్షల్లో అక్రమాలకు పాల్పడేవారికి కేంద్రం ఇక చెక్ పెట్టనుంది. ప్రశ్నాపత్రాల లీకేజీల వంటి వ్యవస్థీకృత నేరాలను అడ్డుకునేందుకు ఉద్దేశించిన పబ్లిక్ ఎగ్జామినేషన్(ప్రివెన్షన్ ఆఫ్ అన్‌ఫెయిర్ మీన్స్) బిల్లును కేంద్రం సోమవారం లోక్‌సభలో ప్రవేశపెట్టింది. కేంద్రమంత్రి జితేందర్‌సింగ్ ఈ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టారు. ప్రశ్నాపత్రాల లీకేజీలో పాలు పంచుకునే అధికారులు, లీకేజీకి పాల్పడే ముఠాల ఆగడాలకు ఈ బిల్లుతో కళ్లెం వేయనున్నారు. ఈ బిల్లు చట్టంగా మారిన తర్వాత దీని కింద నేరం రుజువైన వారికి గరిష్టంగా పదేళ్ల జైలు శిక్ష,రూ. కోటి వరకు జరిమానా విధించనున్నారు. రాజస్థాన్, హరియాణా, గుజరాత్, బిహార్‌లో పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్ష ప్రశ్నపత్రాల లీకేజీల కారణంగా కేంద్రం ఈ బిల్లు తీసుకువచ్చింది. ఈ బిల్లు తీసుకురానున్నట్లు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉభయసభలను ఉద్దేశించి ఇటీవల చేసిన ప్రసంగంలోనూ ప్రస్తావించారు. ఇదీచదవండి.. పేటీఎంపై సీబీఐ,ఈడీల మౌనం దేనికి: కాంగ్రెస్ -
‘పొగాకు నియంత్రణ’ అంతంతే
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ‘పొగాకు నియంత్రణ చర్యలు’అంత సంతృప్తిగా లేవని కేంద్రం స్పష్టం చేసింది. పొగాకు ఉత్పత్తుల అమ్మకాలపై నియంత్రణ, బహిరంగ ప్రదే శాల్లో పొగతాగడం నిషేధంపై 2003లో ‘కోట్తా’చట్టాన్ని కేంద్రం తీసుకొచ్చిన విషయం తెలిసిందే. 2020 నవంబర్ నుంచి 2021 అక్టోబర్ వరకు దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన చోట్ల చట్టం ఎలా అమలవుతుందనే దానిపై, ఇంకెలా చేయొచ్చన్న దానిపై పొగాకు వినియోగం, దాని నియంత్రణపై ఒక కార్యక్రమాన్ని ప్రభుత్వం అమలు చేసింది. దాని ఆధారంగా ఓ నివేదిక రూపొందించింది. అమలుపై పాండిచ్చేరిలోని జిప్మర్, చండీగఢ్‌కు చెందిన పీజీఐఎంఈఆర్లు పరిశోధన చేశా యి. 2020 నవంబర్‌లో ఒకసారి, అక్టోబర్ 2021 తర్వాత ఒకసారి తెలంగాణ, పాండిచ్ఛేరి, మేఘాలయలో ఈ అధ్యయనం చేశారు. ఒక్కో రాష్ట్రంలో 9 జిల్లాల్లో పరిశీలించారు. అనంతరం వాటి ఫలితాలను ఐసీఎంఆర్ అనుబంధ జర్నల్ ఐజీఎంఆర్లో తాజాగా ప్రచురించారు. తెలంగాణలో 2020లో మొదటి విడతలో 2,029 మందిని సర్వే చేశారు. రెండో విడత 2021లో 1,097 మందిపై చేశారు. ‘పొగాకు నియంత్రణ చర్యలు తెలంగాణలో పెరిగాయి. అయితే కొన్నింటిలో మాత్రం తగ్గుదల ఉన్నట్టు నివేదిక చెబుతోంది. పొగాకు ఉత్పత్తుల వినియోగానికి సంబంధించి ప్రకటనల నిలుపుదలపై పురోగతి ఉందని’డాక్టర్ కిరణ్ మాదల (సైంటిఫిక్ కమిటీ కన్వినర్, ఐఎంఏ) అభిప్రాయపడ్డారు. పొగాకు బాక్సులపై స్థానిక భాషలో హెచ్చరికలు ఏవీ? బహిరంగ ప్రదేశాల్లో పొగాకు వినియోగ నియంత్రణ చర్యల్లో మాత్రమే తెలంగాణలో పురోగతి ఉంది. ఉత్పత్తిదారులను నియంత్రించడంలోనూ...హెచ్చరికల్లోనూ నిర్లక్ష్యం కనిపిస్తుందని తెలిపింది. ♦ పొగాకు ఉత్పత్తుల ప్యాక్‌పై వార్నింగ్ సింబల్ విషయంలో మొదటి దశలో 75 శాతంగా ఉండగా, రెండో దశలో అది 83 శాతానికి పెరిగింది. ♦ పొగాకు ఉత్పత్తుల బాక్స్‌పై వార్నింగ్ సింబల్ 85 శాతం కవరయ్యేలా ఉండాలి. ఆ విషయంలో మొదటి విడతలో 75 శాతం ఉండగా, రెండో విడతలో 91 శాతంగా ఉంది. ♦ స్థానిక భాషలో ముద్రించే విషయంలో మొదటి విడత 45 శాతం ఉంటే, రెండో విడత 13 శాతానికి దిగజారింది. ♦ 18 ఏళ్లలోపు వారికి పొగాకు వాడకం, అమ్మకాలపై నిషేధం ఉండాలి. నిషేధం తీరు మొదటి విడతలో 95 శాతం ఉండగా, రెండో విడతలో 99 శాతం పెరిగింది. ♦ 18 ఏళ్లలోపు పిల్లలు పొగాకు ఉత్పత్తులను ఇతరులకు అమ్మటాన్ని నిరోధించడంలో తెలంగాణలో మొదటి విడతలో 97 శాతం ఉండగా, రెండో విడతలో అది ఏకంగా 100 శాతానికి చేరింది. బహిరంగ ప్రదేశాల్లో పొగాకు వాడకం తగ్గింది తెలంగాణలో బహిరంగ ప్రదేశాల్లో పొగాకు తాగకపోవడం అధ్యయనంలో మొదటి విడత 86.9 శాతం ఉండగా, రెండోసారి 98.5 శాతానికి పెరిగింది. ఆ మేరకు మార్పు కనిపించింది. ♦ బహిరంగ ప్రదేశాల్లో తాగొద్దన్న బోర్డులు పెట్టారు. మొదటి దశలో 45.2 శాతంగా ఉంటే, రెండో విడతలో 54.1 శాతానికి పెరిగింది. అయితే నిబంధనల ప్రకారం బోర్డులు పెట్టలేదని తేలింది. ♦ నిబంధనల ప్రకారం బోర్డులను ఏమేరకు పెట్టారో చూస్తే... మొదటి దశలో రెండు శాతం, రెండో దశలో 15 శాతానికి పెరిగింది. ♦ పొగాకు తాగొద్దని పెట్టే బోర్డుపై సంబంధిత అధికారి ఫోన్ నంబర్ పొందుపరచడం అనేది మొదటి దశలో 1.6 శాతం ఉంటే, రెండో దశలో 1.5 శాతానికి తగ్గింది. పొగాకు తాగకుండా ఉండే పరిస్థితులు కల్పించడంలో మొదటి దశలో 86.9 శాతం ఉండగా, రెండో దశలో 97.7 శాతానికి పెరిగింది. ♦ సగటున చూస్తే బహిరంగ ప్రదేశాల్లో పొగాకు తాగకపోవడం అనేది మొదట విడత 53.9 శాతం నుంచి రెండో విడతలో 66 శాతానికి పెరిగింది. -
భారత్‌లోకి మయన్మార్ సైనికులు.. కేంద్రానికి మిజోరం అభ్యర్థన
గౌహతి: మయన్మార్‌లో కొన్ని రోజులుగా దేశ సైనిక ప్రభుత్వం, అక్కడి ప్రజాస్వామ్య సాయుధ దళాలకు మధ్య ఉద్రిత్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. తాజాగా ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున మయన్మార్ ఆర్మీ(జుంటా) సైనికులు భారత సరిహద్దులు దాటి భారత్‌లోని మీజోరంకి వరుసకడుతున్నారు. దీంతో మిజోరం ప్రభుత్వం అప్రమత్తమైంది. మీజోరం భూభాగంలోకి చొచ్చుకువస్తున్న జుంటా సైనికులను వెంటనే మయన్మార్‌కు తిరిగి పంపిచాలని కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. సుమారు 600 మంది మయన్మార్ ఆర్మీ సైనికులు సరిహద్దు దాటి మిజోరం రాష్ట్రంలోకి వచ్చారు. జుంటా ఆర్మీ స్థావరాలను ఆ దేశ అంతర్గత ఘర్షణలో భాగంగా ప్రజాస్వామ్య అనుకూల తిరుగుబాటు సంస్థ అరకన్ ఆర్మీ (AA) స్వాధీనం చేసుకున్నాయి. దీంతో ఆర్మీ సైనికులు మిజోరంలోని సరిహద్దు లాంగ్ట్లై జిల్లాలోకి వచ్చారు. ప్రస్తుతం మయన్మార్ ఆర్మీ సైనికులు అస్సాం రైఫిల్స్ సైనిక క్యాంప్‌లో ఆశ్రయం పొందుతున్నారు. పెద్ద ఎత్తున సరిహద్దు దాటుకొని మిజోరం వైపు వస్తున్న మయన్మార్ సైనికులను వెనక్కి పంపిచాలని మిజోరం సీఎం లాల్దుహోమ.. కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కోరినట్లు మిజోరం ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. సరిహద్దులో పెరుగుతున్న ఉద్రిత్త పరిస్థితుల నేపథ్యంలో తిరిగి స్థిరత్వం నెలకొల్పడానికి మయన్మార్ సైనికులు వెనక్కి పంపించాలని అభ్యర్థించినట్లు తెలుస్తోంది. ఇక.. ఇటీవల తరచూ మయన్మార్ సైనికలు భారత సరిహద్దులు దాటుకొని మిజోరం రాష్ట్రంలోకి వస్తున్నారని మిజోరం సీఎం లాల్దుహోమ తెలిపారు. మనవతా సాయం కింద మయన్మార్ సైనికులకు తాము సైనిక క్యాంప్‌లో సాయం అందిస్తున్నామని పేర్కొన్నారు. ఇప్పటివరకు ఇలా 450 మంది జుంటా సైనికులను వెనక్కి పంపించినట్లు తెలిపారు. 2021 నుంచి మయన్మార్‌లో సైనిక ప్రభుత్వం.. ఇక్కడి ప్రజాస్వామ్య అనుకూల తిరుగుబాటు సంస్థల నుంచి తీవ్రమైన తిరుగుబాటును ఎదుర్కొంటోంది. ఇప్పటికే పలు నగరాల్లోని సైనిక స్థావరాలను తిరుగుబాటు సంస్థలు స్వాధీనం చేసుకున్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. చదవండి: గాంధీలను మించిన అవినీతి పరులు ఎవరైనా ఉంటారా? -
Ram Mandir Ayodhya: పాలనలో రాముడే స్ఫూర్తి: మోదీ
షోలాపూర్/: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం శ్రీరాముని స్ఫూర్తితో నిజాయితీతో కూడిన పారదర్శక పాలన అందిస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. సోమవారం అయోధ్యలో జరగనున్న రామ్‌లల్లా ప్రాణప్రతిష్ఠను చరిత్రాత్మక సందర్భంగా అభివరి్ణంచారు. ఆ రోజున దేశమంతటా ఇంటింటా రామజ్యోతిని వెలిగించాలని మరోసారి పిలుపునిచ్చారు. అది పేదరిక నిర్మూలనకు స్ఫూర్తిగా నిలుస్తుందని ఆశాభావం వెలిబుచ్చారు. ప్రధానిగా తాను మూడోసారి విజయం సాధించాక ‘మోదీ హామీ’ల దన్నుతో భారత్‌ను ప్రపంచంలో మూడో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దుతానని ప్రకటించారు. శుక్రవారం మహారాష్ట్రలోని షోలాపూర్‌లో రూ.2,000 కోట్ల విలువైన 8 అమృత్ ప్రాజెక్టులకు మోదీ శంకుస్థాపన చేశారు. పీఎం ఆవాస్ యోజన పథకం కింద రాష్ట్రంలో నిర్మాణం పూర్తయిన 90 వేలకు పైగా ఇళ్లను లాంఛనంగా పేదలకు అందజేశారు. పీఎం స్వానిధి పథకం కింద 10 వేల మంది లబ్ధిదారులకు ఒకటో, రెండో వాయిదాల చెల్లింపుకు శ్రీకారం చుట్టారు. అనంతరం బహిరంగ సభలో మాట్లాడారు. ‘‘దేశమంతటా గొప్ప ఆధ్యాతి్మక వాతావరణం నెలకొని ఉంది. నాసిక్‌లో గత వారం అనుష్టానం మొదలు పెట్టాను. మీ ఆశీస్సులతో అయోధ్య వెళ్తున్నా’’ అని ప్రకటించారు. ఇళ్లు పొందిన లబ్ధిదారులను చూస్తుంటే తన హృదయం ఆనందంతో నిండిపోతోందంటూ భావోద్వేగానికి లోనయ్యారు. బాల్యంలో తనకిలాంటి ఇంట్లో ఉండే అవకాశం లేకపోయిందని చెమర్చిన కళ్లతో గుర్తు చేసుకున్నారు. ‘‘ప్రజల కలలు నెరవేరినప్పుడే నిజమైన ఆనందం. వారి ఆశీస్సులే నాకు అతి పెద్ద పెట్టుబడి. గత ప్రభుత్వాల్లో పేదల సంక్షేమానికి కావాల్సిన నియత్ (ఉద్దేశం), నీతి (విధానం), నిష్ట (చిత్తశుద్ధి) లోపించాయి. పేదల సంక్షేమం, శ్రామికుల గౌరవం కోసం 4 కోట్లకు పైగా పక్కా ఇళ్లు, 10 కోట్లకు పైగా టాయ్లెట్లు నిర్మించాం’’ అని చెప్పారు. బోయింగ్ క్యాంపస్ ప్రారంభం దొడ్డబళ్లాపురం/సాక్షి, చెన్నై: భారత్ శరవేగంగా సాధిస్తున్న ప్రగతిని అందిపుచ్చుకోవాల్సిందిగా అంతర్జాతీయ పెట్టుబడిదారులకు మోదీ పిలుపునిచ్చారు. పాతికేళ్లలో సంపన్న భారత నిర్మాణమే ప్రతి భారతీయుని లక్ష్యంగా మారిందన్నారు. ఆ దిశగా 25 కోట్ల భారతీయులను గత తొమ్మిదేళ్లలో పేదరికం నుంచి బయటికి తీసుకొచి్చనట్టు చెప్పారు. వైమానిక రంగంలోనూ దేశం శరవేగంగా ప్రగతి సాధిస్తోందని హర్షం వెలిబుచ్చారు. బెంగళూరు శివార్లలో దేవనహల్లి హైటెక్ డిఫెన్స్, ఏరోస్పేస్ పార్క్ క్యాంపస్‌లో రూ.1,600 కోట్లతో నిర్మించిన బోయింగ్ నూతన గ్లోబల్ ఇంజనీరింగ్, టెక్నాలజీ కేంద్రాన్ని మోదీ ప్రారంభించారు. భారత సామర్థ్యంపై ప్రపంచం పెట్టుకున్న నమ్మకానికి ఈ క్యాంపస్ తాజా నిదర్శనమన్నారు. భారత్ గత కొన్నేళ్లలో ప్రపంచంలో మూడో అతి పెద్ద దేశీయ వైమానిక మార్కెట్‌గా ఎదిగిందని గుర్తు చేశారు. అనంతరం మూడు రోజుల తమిళనాడు పర్యటన నిమిత్తం మోదీ చెన్నై చేరుకున్నారు. అభిమానులు, బీజేపీ మద్దతుదారుల స్వాగతం నడుమ నెహ్రూ స్టేడియం దాకా 4 కిలోమీటర్ల మేర రోడ్ షో జరిపారు. అక్కడ ఖేలో ఇండియా యూత్ గేమ్స్–2023ను ప్రారంభించారు. 2029 యూత్ ఒలింపిక్స్, 2036 ఒలింపిక్స్ నిర్వహణకు వేదికగా భారత్‌ను తీర్చిదిద్దుతామని ప్రధాని ప్రకటించారు. మహిళలే వృద్ధి సారథులు భారత్‌లో ప్రతి రంగంలోనూ మహిళల సారథ్యానికి పెద్దపీట వేస్తున్నట్టు మోదీ చెప్పారు. వైమానిక రంగంలోనూ మహిళలకు నూతన అవకాశాలు కలి్పంచేందుకు కేంద్రం కట్టుబడి ఉందన్నారు. ఇందుకుద్దేశించిన ‘బోయింగ్ సుకన్య’ పథకాన్ని ఈ సందర్భంగా మోదీ ప్రారంభించారు. భారత పైలట్లలో 15 శాతం మహిళలేనని మోదీ గుర్తు చేశారు. అంతర్జాతీయ సగటు కంటే ఇది మూడు రెట్లు ఎక్కువన్నారు. సుకన్య పథకం కింద సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్ (స్టెమ్) తదితరాల్లో విద్యాభ్యాసానికి అమ్మాయిలకు అవకాశం కలి్పంచి వైమానిక రంగ ఉద్యోగాలకు అర్హులుగా తీర్చిదిద్దుతామని బోయింగ్ ప్రకటించింది. పైలట్ శిక్షణకు మహిళలకు స్కాలర్íÙప్లు ఇస్తామని పేర్కొంది. సిద్ధూ, అది సహజం! ‘మోదీ.. మోదీ’ నినాదాలపై ప్రధాని బెంగళూరు బోయింగ్ క్యాంపస్ ప్రారం¿ోత్సవం అనంతరం జరిగిన సభలో ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. ప్రధాని ప్రసంగిస్తుండగా సభికులంతా మోదీ, మోదీ అంటూ పెద్దపెట్టున నినాదాలతో హోరెత్తించారు. దాంతో ఆయన కాసే పు ప్రసంగాన్ని ఆపేసి వింటూ ఉండిపోయారు. వేదికపై కూర్చు ని దీనంతటినీ తిలకిస్తున్న కర్ణాటక సీఎం సిద్ధరామయ్య వైపు తిరిగి, ‘‘ముఖ్యమంత్రీ జీ! ఐసా హోతా రహతా హై (అలా జరుగుతూంటుంది) అంటూ చమత్కరించారు. దాంతో సీఎంతో పాటు వేదికపై ఉన్న గవర్నర్ తదితరులు చిరునవ్వులు చిందించారు. -
Republic Day: జెండాల గౌరవం కాపాడండి : కేంద్రం
న్యూఢిల్లీ: రిపబ్లిక్ డే సమీపిస్తుండటంతో మువ్వన్నెల జెండాల వాడకం పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కేంద్ర హోంశాఖ ప్రత్యేకంగా సూచనలు చేసింది. ఈ మేరకు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు శుక్రవారం ఒక సర్క్యులర్ జారీ చేసింది. జెండా వందన కార్యక్రమాలు పూర్తయ్యాక కాగితపు జెండాలను ఇష్టం వచ్చినట్లుగా నేలపై పారేయకూడదని కోరింది. జెండా గౌరవానికి భంగం కలగకుండా వాటిని గౌరవ ప్రదంగా, రహస్యంగా డిస్పోజ్ చేయాలని సూచించింది. ఈ విషయంపై అవగాహన కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వాలను కోరింది. అన్ని ఇతర ఈవెంట్లలో వాడే జెండాలకు కూడా ఇవే నిబంధనలు వర్తిస్తాయని తెలిపింది. జనవరి 26న దేశం 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలను నిర్వహించనుంది. ఢిల్లీలో జరిగే రిపబ్లిక్ డే వేడుకలకు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్ ముఖ్యఅతిథిగా హాజరవనున్నారు. గణతంత్ర వేడుకల కోసం ఢిల్లీలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇదీచదవండి.. సభలో మోదీ నినాదాలు.. అసౌకర్యానికి గురైన సిద్ధరామయ్య -
‘పశ్చిమ బెంగాల్’ పేరు మార్చండి: సీఎం మమతా డిమాండ్
తమ రాష్ట్రం పేరును ‘బంగ్లా’గా మార్చాలని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కేంద్ర ప్రభుత్వాన్ని మరోసారి డిమాండ్ చేశారు. బొంబాయి పేరును ముంబయిగా ఒరిస్సా పేరును ఒడిశాగా మార్చేస్తే లేని తప్పు.. పశ్చిమ బెంగాల్‌ను బంగ్లాగా మారిస్తే తప్పేముందని ప్రశ్నించారు. ఈ మేరకు కల్కత్తాలో నిర్వహించిన మీడియా సమావేశంలో సీఎం మమతా మాట్లాడుతూ.. రాష్ట్రం పేరు మార్చేందుకు గతంలోనే అసెంబ్లీలో బిల్లు పాస్ చేశామని తెలిపారు. దీనిపై కేంద్ర ప్రభుత్వానికి అన్ని రకాల వివరణలు ఇచ్చామని, అయినా చాలా కాలంగా రాష్ట్ర పేరును బంగ్లాగా మార్చలేదని మండిపడ్డారు. బొంబాయి, ఒరిస్సా పేర్లను మార్చినప్పుడు.. పశ్చిమ బెంగాల్ పేరు మార్చడానికి అభ్యంతరం ఏంటని కేంద్రాన్ని నిలదీశారు. ఇంగ్లీష్ అక్షరమాల ప్రకారం జాబితాలో తమ రాష్ట్రం పేరు చివరగా ఉంటుందని, దాంతో సమావేశాలకు హాజరైన తమ ప్రతినిధులు ఆఖరివరకు వేచి ఉండాల్సి వస్తుందని అన్నారు. రాష్ట్ర పేరును పశ్చిమ బెంగాల్ కంటే అక్షర క్రమంలో ముందున్న బంగ్లాగా మార్చడం వల్ల కలిగే ప్రయోజనాలకు మమతా వివరించారు. రాష్ట్ర విద్యార్థులు వివిధ పోటీల్లో పాల్గొనేందుకు, ఉన్నత విద్యలు అభ్యసించేందుకు ప్రాధాన్యత లభిస్తుందన్నారు. ప్రతి సందర్భంలోనూ చివరి వరకు వేచి చూడాల్సి వస్తుందని(ఇంగ్లీష్ అక్షరమాల క్రమంలో W, X, Y, Z), దీని వల్ల బంగ్లా ప్రాముఖ్యత తగ్గుతోందన్నారు. రాష్ట్రం పేరులో ‘పశ్చిమ’ అని చేర్చాల్సిన అవసరం లేదని అన్నారు. పశ్చిమ బెంగాల్‌ను బంగ్లాగా మార్చడం వల్ల నష్టం ఏం లేదని తెలుపుతూ ఓ ఉదాహణ చెప్పారు. ‘ పాకిస్థాన్‌లో పంజాబ్ అనే ప్రావిన్స్ ఉంది. భారత్‌లోనూ పంజాబ్ పేరుతో రాష్ట్రం ఉంది. ఇందులో ఏ సమస్యల ఏదు. అలాంటప్పుడు బంగ్లాదేశ్ పేరుతో ఓ దేశం ఉంటే.. పశ్చిమ బెంగాల్ బంగ్లాగా ఎందుకు మారకదు’ అని తెలిపారు. -
ఎన్నికల కమిషనర్ల నియామకంపై కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసులు
ఢిల్లీ: ఎన్నికల ప్రధాన కమిషనర్ (సీఈసీ), ఇతర ఎన్నికల కమిషనర్ల నియామకంపై కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. కొత్త చట్టంపై స్టే ఇచ్చేందుకు నిరాకరించింది. కేంద్రం ఇటీవల తీసుకొచ్చిన కొత్త చట్టాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు ఈ మేరకు స్పందించింది. కొత్త చట్టాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లను పరిశీలించేందుకు న్యాయమూర్తులు జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తాలతో కూడిన ధర్మాసనం అంగీకరించి కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. ఏప్రిల్‌లోగా కేంద్రం సమాధానం ఇవ్వాలని కోరింది. కొత్త చట్టంపై స్టే కోరిన కాంగ్రెస్ నాయకురాలు జయ ఠాకూర్ తరఫు సీనియర్ న్యాయవాది వికాస్ సింగ్.. కేంద్రం తీసుకువచ్చిన చట్టం అధికార విభజనకు విరుద్ధమని తెలిపారు. ఈ చట్టంపై స్టే విధించాల్సిందిగా కోరారు. అయితే.. కేంద్రం వాదనలు వినకుండా స్టే విధించలేదమని తెలుపుతూ ధర్మాసనం నోటీసులు జారీ చేసింది. పిటిషన్ కాపీని కేంద్రం తరఫు న్యాయవాదికి అందజేయాల్సిందిగా ధర్మాసనం కోరింది. ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ), ఎన్నికల కమిషనర్లు (ఈసీ)లను ఎన్నుకునే అధికారం కలిగిన ప్యానెల్ నుంచి భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ)ని తొలగించడంపై రాజకీయ వివాదం చెలరేగింది. దీనిపై కాంగ్రెస్ నాయకురాలు జయ ఠాకూర్‌తో సహా పలు పిటిషన్లు సుప్రీంకోర్టులో దాఖలయ్యాయి. ఎన్నికల సంఘానికి నియామకాలు చేయడానికి కేంద్ర ప్రభుత్వానికి విస్తృత అధికారాలను కల్పించే కొత్త చట్టాన్ని రద్దు చేయాలని కోరుతూ న్యాయవాది గోపాల్ సింగ్ కూడా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఎన్నికల ప్రధాన కమిషనర్ (సీఈసీ), ఇతర ఎన్నికల కమిషనర్ల నియామకంపై కేంద్ర ప్రభుత్వం నూతన చట్టాన్ని తీసుకువచ్చిన విషయం తెలిసిందే. దీని ప్రకారం ప్రధాన మంత్రి, ప్రతిపక్ష నాయకుడు, కేబినెట్ సభ్యునితో కూడిన స్వతంత్య్ర ప్యానెల్ ఎన్నికల కమిషనర్లను నియమిస్తుంది. ఈ చట్టం ఎన్నికల కమిషనర్ల నియామకంలో సుప్రీంకోర్టు పాత్రను కేంద్రం తొలగించింది. సీఈసీలు, ఈసీలపై క్రిమినల్ చర్యలు తీసుకునే అధికారం నుంచి సుప్రీంకోర్టును తప్పించింది. ఇదీ చదవండి: బంగ్లా ప్రధానిగా అయిదోసారి హసీనా ప్రమాణం -
ట్రక్కు డ్రైవర్ల ఆందోళనపై స్పందించిన కేంద్రం
ఢిల్లీ: ట్రక్ డ్రైవర్ల ఆందోళనపై కేంద్రం స్పందించింది. రాత్రి 7 గంటలకు డ్రైవర్ల యూనియన్ తో చర్చలు జరుపనున్నట్లు కేంద్ర హోంశాఖ కార్యదర్శి తెలిపారు. భారతీయ న్యాయ సంహితలో హిట్ అండ్ రన్ కేసుల్లో కఠిన శిక్షలు విధించడంపై ట్రక్కు డ్రైవర్లు సోమవారం నుంచి ఆందోళన చేపడుతున్నారు. మంగళవారం ఆ నిరసనలు తీవ్రరూపం దాల్చాయి. దేశంలో వివిధ రాష్ట్రాల్లో జాతీయ రహదారులను ట్రక్కు డ్రైవర్లు దిగ్బంధించారు. రోడ్లపై రాస్తారోకోలు, ర్యాలీలు నిర్వహిస్తున్నారు. ట్రక్కులు, ప్రైవేట్ బస్సుల రాకపోకలను నిలిపివేశారు. ఇంధన కొరత.. ట్రక్కు డ్రైవర్ల ఆందోళనలతో దేశవ్యాప్తంగా ఇంధన సరఫరా చేసే ట్రక్కులు కూడా రాకపోకలను నిలిపివేశాయి. పెట్రోల్, డీజిల్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. దేశవ్యాప్తంగా పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డులు వెలిశాయి. బంకుల ముందు వాహనదారులు వందల మీటర్ల బారులు తీరిన దృశ్యాలు సోషల్ మీడియాలో దర్శనమిచ్చాయి. చట్టంలో మార్పులేంటి..? భారతీయ శిక్షా స్మృతి స్థానంలో కేంద్రం ఇటీవల భారత న్యాయ సంహితను తీసుకొచ్చింది. ఇందులో హిట్ అండ్ రన్ కేసుల్లో కఠిన నిబంధనలు రూపొందించింది. చట్టం ప్రకారం.. రోడ్డు ప్రమాదాలకు కారణమైన ట్రక్కు డ్రైవర్లు పోలీసులకు సమాచారం అందించాలి. లేదంటే పదేళ్ల జైలు శిక్షతో పాటు రూ.7 లక్షల జరిమానా విధించే అవకాశాన్ని కల్పించారు. ఇంతకుముందు ఐపీసీ(భారతీయ శిక్షా స్మృతి) ప్రకారం రెండేళ్లే జైలు శిక్ష ఉండేది. కొత్త నిబంధనలపై ట్రక్కు డ్రైవర్లు రెండు రోజులుగా ఆందోళన చేపడుతున్నారు. ఈ కఠిన నిబంధనలకు భయపడి కొత్తవారు ఈ వృత్తిలోకి రావడంలేదని నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇదీ చదవండి: ఎన్నికల వేళ.. చేరికలపై బీజేపీ నూతన కమిటీ -
కరోనా కొత్త వేరియంట్‌పై రాష్ట్రాలకు కేంద్రం అలర్ట్
-
అతి పెద్ద ధ్యాన మందిరం ప్రారంభించిన ప్రధాని
వారణాసి:దేశంలోనే అతిపెద్ద ధాన్య మందిరం స్వర్వేద్ మహా ధ్యాన మందిరాన్ని ప్రధాని మోదీ సోమవారం వారణాసిలో ప్రారంభించారు. ఈ మెడిటేషన్ సెంటర్ ప్రపంచంలోనే అతిపెద్దదిగా ఖ్యాతికెక్కింది. 20 వేల మంది ఒకేసారి ధ్యానం చేసుకునేలా ఏడు అంతస్తుల్లో స్వర్వేద్ మహా ధాన్య మందిరాన్ని నిర్మించారు. ధ్యాన మందిరాన్ని ప్రారంభించిన సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. సాంస్కృతిక చిహ్నాలను పునర్నిర్మించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. కాశీలో గడిపిన ప్రతిక్షణం మరిచిపోలేనిదని చెప్పారు. కాశీ అంటే అభివృద్ధికి పర్యాయపదంగా మారిందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధానితో పాటు ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ తదితరులు పాల్గొన్నారు. ప్రధాని రెండు రోజుల పర్యటనలో భాగంగా ఆది, సోమ వారాల్లో వారణాసిలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. #WATCH | PM Modi inaugurates the newly built Swarved Mahamandir in Umaraha, Varanasi Uttar Pradesh CM Yogi Adityanath also present pic.twitter.com/ISNPEBJAt1 — ANI (@ANI) December 18, 2023 ఇదీచదవండి..‘హలాల్ మాంసం’పై కేంద్ర మంత్రి సంచలన వ్యాఖ్యలు -
రోడ్డు ప్రమాద బాధితులకు ఉచిత చికిత్స..! కేంద్రం కీలక నిర్ణయం
ఢిల్లీ: రోడ్డు ప్రమాద బాధితుల విషయంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. రోడ్డు ప్రమాదాల్లో గాయపడ్డవారికి ఉచిత వైద్యం అందేలా నూతన విధానాన్ని రూపొందించింది. మరో మూడు నెలల్లో దేశవ్యాప్తంగా అందుబాటులోకి తీసుకురావాలని కేంద్ర రోడ్డు రవాణా రహదారుల మంత్రిత్వ శాఖ యోచిస్తోంది. “ప్రమాదంలో గాయపడిన బాధితులకు నగదు రహిత వైద్య చికిత్స అందించడం మోటారు వాహన చట్టం 2019 సవరణలో భాగం. కొన్ని రాష్ట్రాలు దీనిని ఇప్పటికే అమలు చేశాయి. అయితే ఇప్పుడు ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖతో కలిసి రోడ్ల మంత్రిత్వ శాఖ దీనిని దేశవ్యాప్తంగా పూర్తిగా అమలు చేయనుంది” అని రోడ్డు రవాణా, హైవేస్ సెక్రటరీ అనురాగ్ జైన్ చెప్పారు. సుప్రీం కోర్టు తీర్పునకు అనుగుణంగా ప్రమాదం జరిగిన వెంటనే సమీప ఆసుపత్రిలో ఉచిత వైద్య సాయం కల్పించడమే దీని ఉద్దేశమని అనురాగ్ జైన్ తెలిపారు. గోల్డెన్ అవర్ (ప్రమాదం జరిగిన గంటలోపే)తో సహా రోడ్డు ప్రమాద బాధితులందరికీ దీన్ని వర్తింపజేస్తామన్నారు. వచ్చే మూడు, నాలుగు నెలల్లో ఇది అందుబాటులోకి రానుందన్నారు. ఇదీ చదవండి: మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఖరారు!? -
ఎంపీ మహువా లోక్‌సభ సభ్యత్వం రద్దుకు కేంద్రం చర్యలు!
డబ్బులు తీసుకొని పార్లమెంట్లో ప్రశ్నలు అడిగారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా లోక్‌సభ సభ్యత్వాన్ని రద్దు చేసేందుకు కేంద్రం సిద్ధమైనట్లు తెలుస్తోంది. వ్యాపారవేత్త దర్శన్ హీరానందానీ నుంచి డబ్బులు తీసుకొని పార్లమెంట్లో ప్రధాని మోదీ, అదానీకి వ్యతిరేకంగా ప్రశ్నలు అడిగారంటూ నమోదైన కేసులో ఎథిక్స్ ప్యానెల్ తన నివేదికను లోక్‌సభలో సమర్పించనున్న నేపథ్యంలో కేంద్రం ఈ చర్య చేపట్టనున్నట్లు సమాచారం. ఈ కేసులో ఎథిక్స్ ప్యానెల్ తన రిపోర్టును డిసెంబర్ 4న లోక్‌సభ ముందు ప్రవేశపెట్టనుంది. ఎథిక్స్ కమిటీ చైర్పర్సన్ వినోద్ కుమార్ సోంకర్ వచ్చే సోమవారం ప్యానెల్ నివేదికను కేంద్రానికి సమర్పించే అవకాశం ఉంది. గత నెల నవంబర్ 9న ఎథిక్స్ ప్యానల్సమావేశమై కమిటీ.. మహువాను లోక్‌సభ సభ్యత్వం నుంచి బహిష్కరించాలంటూ చేసిన సిఫార్సును ప్యానెల్ ఆమెదించింది. లోక్‌సభ స్పీకర్‌కు ఈ నివేదికను సమర్పించింది. పార్లమెంట్ మెంబర్‌గా మొయిత్రా చర్యలు అత్యంత అభ్యంతరకరమైనవి, అనైతికమైనవి, హేయమైనవి, నేరపూరితమైనవని ఎథిక్స్ కమిటీ తన నివేదికలో పేర్కొంది. కాగా వ్యాపారవేత్త దర్శన్ హీరానందానీకి మేలు చేసేలా అదానీ గ్రూప్‌పై లోక్‌సభలో మొయిత్రా పలుమార్లు ప్రశ్నలు అడిగారంటూ గత నెలలో దుబే ఆరోపించడం తెలిసిందే. వ్యాపారవేత్త హీరానందానీ కూడా పార్లమెంట్‌కు సమర్పించిన అఫిడవిట్లో తన నుంచి మోయిత్రా గిఫ్టులు తీసుకున్నట్లు పేర్కొన్నాడు. హీరానందనీ నుంచి డబ్బులు తీసుకొని మోదీ, అదానీ టార్గెట్‌గా లోక్‌సభలో ప్రశ్నలు అడిగారని విమర్శిస్తూ లోక్‌సభ స్పీకర్‌కు దూబే ఫిర్యాదు చేశారు. దాంతో 15 మంది ఎంపీలతో కూడిన లోక్‌సభ నైతిక విలువల కమిటీ ఈ ఉదంతంపై దర్యాప్తు చేస్తోంది. ఈ కేసులో నిషికాంత్ దూబే, న్యాయవాది జై అనంత్ దేహాద్రాయ్‌లు ఇప్పటికే కమిటీ ముందు హాజరై.. తమ వాంగ్మూలాలను నమోదు చేశారు. నవంబర్ రెండున లోక్‌సభ ఎథిక్స్ ముందు విచారణకు హాజరైన మహువా.. ప్యానెల్ సభ్యులు అసభ్యకరమైన, చెత్త ప్రశ్నలు అడిగుతున్నారంటూ ఆగ్రహించి విచారణ మధ్యలోనే బయటకు వచ్చేశారు. అనంతరం మహువా కేసులో ఎథిక్స్ కమిటీ 500 పేజీలతో కూడిన నివేదికను రూపొందించింది. ఈ క్రమంలోనే బీజేపీ ఎంపీ వినోద్ కుమార్ సోన్కర్ నేతృత్వంలోని లోక్‌సభ నైతిక విలువల కమిటీ సమావేశమై ఈ నివేదికను పరిశీలించింది. అనంతరం 6:4తో ఈ నివేదికను కమిటీ ఆమోదించింది. పదిమందిలో ఆరుగురు సభ్యులు సిఫార్సుకు అనుకూలంగా, నలుగురు వ్యతిరేకంగా ఓటు వేసినట్లు కమిటీ తెలిపింది. మొయిత్రా అనధికారిక వ్యక్తులతో పార్లమెంట్ లాగిన్ ఐడిని షేర్ చేసుకున్నారని, దర్శన్ హీరానందానీ నుంచి నగదు, గిఫ్ట్‌లు తీసుకున్నారని కమిటీ నిర్ధారించిందని సోన్కర్ పేర్కొన్నారు. ఆమె చర్య తీవ్రమైన శిక్షకు కారణమని తెలిపారు. మహువా అనైతిక వ్యవహారంపై చట్టపరమైన, సంస్థాగత, కాలపరిమితితో కూడిన దర్యాప్తు చేపట్టాలని సిఫార్సు చేసినట్లు చెప్పారు. -
పార్లమెంట్ సమావేశాల్లో 18 బిల్లులను ప్రవేశపెట్టనున్న కేంద్రం
న్యూఢిల్లీ: పార్లమెంట్ శీతాకాల సమావేశాలు డిసెంబర్ 4 నుంచి 22 వరకు కొనసాగనున్నాయి. ఈ సమావేశాల్లో 18 బిల్లులను ప్రవేశ పెట్టాలని కేంద్రం నిర్ణయించింది. ఇందులో రెండు జమ్మూకశ్మీర్, పుదుచ్చేరిలలో మహిళా రిజర్వేషన్ల వర్తింపు బిల్లులు, ఐపీసీ స్థానంలో తెచ్చే మూడు నేర శిక్షాస్మృతి బిల్లులు ఉన్నాయి. ఈ మేరకు లోక్‌సభ సెక్రటేరియట్ బులెటిన్ విడుదల చేసింది. శీతాకాల సమావేశాల్లో జమ్మూకశ్మీర్ అసెంబ్లీలో ఉన్న సీట్ల సంఖ్యను 107 నుంచి 114కు పెంచే బిల్లు పార్లమెంట్ ముందుకు రానుంది. దీనివల్ల కశ్మీర్ నుంచి వలస వెళ్లినవారికి, శరణార్థులకు, ఎస్టీలకు చట్టసభలో ప్రాతినిథ్యం లభించనుంది. ఈ బిల్లులతోపాటు 2023-24కు సంబంధించి సప్లిమెంటరీ గ్రాంట్లపై సమావేశాల్లో చర్చ, ఓటింగ్ జరగనుంది. ఐపీసీ చట్టాల స్థానంలో ద భారతీయ న్యాయ సంహిత, ద భారతీయ నాగరిక సురక్ష సంహిత, ద భారతీయ సాక్ష్య బిల్లును కేంద్రం తీసుకొస్తుంది. మరోవైపు సమావేశాల ప్రారంభానికి ముందు డిసెంబర్ 2న అఖిల పక్ష సమావేశాన్ని నిర్వహించనున్నట్లు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. చదవండి: దంపతుల పోట్లాట దెబ్బకు.. దారి మళ్లిన విమానం! -
చైనాలో మళ్లీ కేసులు.. రాష్ట్రాలకు కేంద్రం అలర్ట్
న్యూఢిల్లీ: చైనాలో మళ్లీ ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. ఉత్తర చైనాలో కొవిడ్ తొలిరోజుల్లో ఉన్న దృశ్యాలు మళ్లీ కనిపిస్తున్నాయి. చాలా స్కూళ్లలో చిన్నపిల్లల్లో న్యుమోనియా తరహ లక్షణాలు బయటపడుతున్నాయి. అంతేగాక ఈ వ్యాధి అత్యంత వేగంగా వ్యాప్తిచెందుతోంది. ఈ నేపథ్యంలో భారత ఆరోగ్య శాఖ అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు అలర్ట్ జారీ చేసింది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో సిబ్బంది, బెడ్లు, పీపీఈ కిట్లు, వెంటిలేటర్లు, టెస్టింగ్ కిట్లు, రీ ఏజెంట్స్ ఇతర సౌకర్యాలు ఎలా ఉన్నాయనేదానిపై సమీక్షించుకోవాలని రాష్ట్రాలను కోరింది. ఈ వసతులన్నీ సరిపడేలా ఉండేలా చూసుకోవాలని కోరింది. ఇవేగాక ఆక్సిజన్ సిలిండర్లు అందుబాటులో ఉంచుకోవాలని సూచించింది. ఇన్ఫెక్షన్ కంట్రోల్ ప్రోటోకాల్ పకడ్బందీగా అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని కోరింది. చిన్నారుల్లో తలెత్తే శ్వాస సంబంధిత వ్యాధుల వివరాలనుఎప్పటికప్పుడు పర్యవేక్షించడంతో పాటు నమోదయ్యే కేసుల డేటా ఎప్పటికప్పుడు జిల్లా, స్టేట్ సర్విలెన్స్ యూనిట్లలో అప్లోడ్ చేయాలని ఆరోగ్యశాఖ సూచించింది. డేటా కరక్టుగా ఉంటే పరిస్థితిని పక్కాగా పర్యవేక్షించడానికి వీలవుతుందని తెలిపింది. కొవిడ్ మహమ్మారితో ఇప్పటికీ దేశంలో ఎక్కడో ఒక చోట బాధపడుతున్న చైనా తాజాగా నమోదవుతున్న ఎనీమాటిక్ నుమోనియా కేసులతో బెంబేలెత్తుతోంది. స్కూలు పిల్లల్లో నమోదవుతున్న ఈ కేసులు వేగంగా వ్యాప్తి చెందుతున్నాయి. అయితే ఈ నుమోనియా కేసులకు ఎలాంటి కొత్త వైరస్ కారణం కాదని చైనా హెల్త్ కమిషన్ క్లారిటీ ఇచ్చింది. అయినా ఈ కేసులపై మరింత సమాచారం అందజేయాలని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషేన్(డబ్ల్యూహెచ్‌వో) చైనా ప్రభుత్వాన్ని కోరడం గమనార్హం. ఇదీచదవండి..ప్రధాని భద్రతలో లోపాలు..ఏడుగురు పోలీసుల సస్పెన్షన్ -
డీప్‌ఫేక్‌ల అడ్డుకట్టకు ప్రత్యేక అధికారులు: కేంద్రం
న్యూఢిల్లీ: డీప్‌ఫేక్‌ల పరిశీలనలకు ఫిర్యాదులకు ప్రత్యేక అధికారిని నియమించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. సోషల్‌మీడియా సంస్థలతో సమావేశం తరువాత కేంద్రం ఈ నిర్ధారణకు వచ్చింది. రెండు రోజుల కీలక సమావేశాల సందర్భంగా కేంద్ర ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి శుక్రవారం ఈ విషయాన్ని ప్రకటించారు. భారతీయ చట్టాలు, నిబంధనలకు అనుగుణంగా విధి విధానాల రూపకల్పనకు సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లకు ఏడు రోజుల సమయం ఇస్తున్నట్లు కేంద్రమంత్రి ప్రకటించారు. డీప్‌ఫేక్ కంటెంట్‌పై చర్య తీసుకునేలా అధికారిని నియమిస్తామని సోషల్ మీడియా కంపెనీలను కలిసిన తర్వాత రాజీవ్ చంద్రశేఖర్ ఈ అంశాన్ని చెప్పారు. ఏఐ ద్వారా సృష్టిస్తున్న డీప్‌ఫేక్ వీడియోలు చాలా ప్రమాదకరమని, నకిలీ సమాచారంతో ప్రజలను ఇవి తప్పుదారి పట్టిస్తున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. తప్పుడు సమాచారాన్ని నిరోధించేందుకు ఆన్లైన్ ప్లాట్‌ఫారమ్‌లు కఠినంగా వ్యవహించాలని లేదంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. ‘‘ఐటి రూల్స్ 2021 ప్రకారం నిర్దేశించిన వ్యవధిలోపు , లేదా రిపోర్టింగ్ చేసిన 36 గంటలలోపు ఆ కంటెంట్‌ను తొలగించాలి. లేదంటే చర్యలు తప్పవు’’ అని స్పష్టం చేశారు. డీప్‌ఫేక్‌లను సృష్టించినా, వ్యాప్తి చేసినట్టు రుజువైనా లక్ష రూపాయల దాకా జరిమానా, మూడేళ్ల జైలు శిక్ష తప్పదని ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. కాగా దేశవ్యాప్తంగా చర్చకు దారి తీసిన డీప్ ఫేక్ వీడియోల వ్యవహారాన్ని కేంద్రం సీరియస్‌గా స్పందిస్తోంది. డీప్‌ఫేక్‌ను సృష్టించి వ్యాప్తి చేసే వారితోపాటు, సోషల్ మీడియా సంస్థలపై కూడా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించిన కేంద్రం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ డొమైన్లో పనిచేస్తున్న కంపెనీల సాయంతో డీప్‌ఫేక్ వీడియోల కట్టడికి వివరణాత్మక మార్గదర్శకాలను తీసుకొచ్చేందుకు కీలక సమావేశాన్ని నిర్వహించింది. ఈ సందర్భగా ప్రజాస్వామ్యానికి కొత్త ముప్పుగా పుట్టుకొస్తున్న డీప్‌ఫేక్‌లను వ్యాప్తి చేసే వాళ్లపై కఠిన చర్యలు తీసుకునేలా కొత్త నిబంధనలు తీసుకువస్తామని, అలాంటి వారిపై కఠినంగా వ్యవహరిస్తామని అశ్విని వైష్ణవ్ గురువారం ప్రకటించారు. -
డీప్‌ఫేక్‌లపై కేంద్రం హెచ్చరిక : త్వరలో కఠిన నిబంధనలు
న్యూఢిల్లీ: ఇటీవల కొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా చర్చకు దారి తీసిన డీప్ ఫేక్ వీడియోలపై కేంద్రం సీరియస్ చర్యలకు సిద్ధమవుతోంది. డీప్‌ఫేక్‌ను సృష్టించి వ్యాప్తి చేసే వారితోపాటు, సోషల్ మీడియా సంస్థలపై కూడా కఠిన చర్యలు తీసుకుంటామని కేంద్రం తాజాగా హెచ్చరించింది. డీప్‌ఫేక్‌ల సమస్యపై చర్చించేందుకు సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లతో నిర్వహించిన సమావేశానికి కేంద్ర కమ్యూనికేషన్లు, ఎలక్ట్రానిక్స్ & ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ అధ్యక్షత వహించారు. డీప్‌ఫేక్ సమాజంలో కొత్త ముప్పుగా మారిందని వైష్ణవ్ అన్నారు. అనంతరం అశ్విన్ వైష్ణవ్ మీడియాతో మాట్లాడుతూ, ప్రజాస్వామ్యానికి కొత్త ముప్పుగా డీప్‌ఫేక్‌లు ఉద్భవించాయన్నారు. వీటిన సృష్టించి, వ్యాప్తి చేసే వాళ్లపై కఠిన చర్యలు తీసుకునేలా కొత్త నిబంధనలు తీసుకువస్తామని చెప్పారు. డీప్‌ఫేక్‌ను తీవ్రంగా పరిగణిస్తున్నామని వీటి నియంత్రణలో ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని వెల్లడించారు. అంతేకాదు సంఘవిద్రోహ శక్తులు వీటిని ఉపయోగించుకునే అవకాశం ఉందని కేంద్ర మంత్రి తెలిపారు. రానున్న పదిరోజుల్లోనే నిబంధనల ముసాయిదాను పూర్తి చేసేందుకు కృషి చేస్తామని తెలిపారు. ప్రభుత్వం, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ డొమైన్లో పనిచేస్తున్న కంపెనీల సాయంతో డీప్‌ఫేక్ డీడియోల కట్టడికి వివరణాత్మక మార్గదర్శకాలను తీసుకురానున్నట్టు తెలిపారు. (ఐఆర్సీటీసీ డౌన్: మండిపడుతున్న వినియోగదారులు ) కాగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గార్బా నృత్యం చేస్తున్నట్టు వచ్చిన నకిలీ వీడియోతోపాటు, సినీ హీరోయిన్లు రష్మికా మందాన, కాజోల్ పేరుతో కొన్ని అభ్యంతర వీడియోలు నెట్టింట హల్ చేసిన నేపథ్యంలో ఐటీ శాఖ కఠిన చర్యలకు ఉపక్రమిస్తోంది. -
జగనన్న గోరుముద్దకు జాతీయ పురస్కారం ఇచ్చిన కేంద్రం
-
ధరల తీరుపై కేంద్రం, ఆర్బీఐ హై అలర్ట్
న్యూఢిల్లీ: ఎకానమీపై ద్రవ్యోల్బణం ప్రభావం ఇంకా తీవ్రంగానే ఉందని, ధరల కట్టడి విషయంలో కేంద్రం, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) హై అలర్ట్‌లో ఉన్నాయని ఆర్థిక మంత్రిత్వశాఖ విడుదల చేసిన అక్టోబర్ నెలవారీ ఆర్థిక నివేదిక పేర్కొంది. అయితే అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు ఇటీవల తగ్గుముఖం పట్టడం, వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణంలో నియంత్రణ కొనసాగడం వంటి అంశాల నేపథ్యంలో ధరల ఒత్తిడిని అవకాశం ఉందని నివేదిక పేర్కొంది. ద్రవ్యోల్బణం కట్టడికి అవసరమైతే ఆర్బీఐ రేటు మరింత కఠినతరం చేస్తుందనీ ఆర్థికశాఖ నివేదిక అభిప్రాయపడింది. నివేదికలో మరికొన్ని అంశాలను పరిశీలిస్తే.. ♦భారత్ ముడి చమురు బాస్కెట్ ధర నవంబర్‌లో ఇప్పటివరకు బ్యారెల్‌కు సగటున 83.93 డాలర్లుగా ఉంది. అక్టోబర్‌లో బ్యారెల్ 90.08 డాలర్లతో పోల్చితే ఇది పోలిస్తే, ప్రభుత్వ డేటా చూపిస్తుంది. ♦ప్రభుత్వం తీసుకున్న పలు చర్యల ఫలితంగా ఫలితంగా, ‘ఎంపిక’ చేసిన కొన్ని కీలక ఆహార పదార్థాల ద్రవ్యోల్బణం అక్టోబర్‌లో 53.6 శాతానికి తగ్గింది. జూలైలో ఈ రేటు 60.6 శాతం. కూరగాయల ధరల తీవ్రతా తగ్గింది. ఇక ఆర్బీఐ తీసుకుంటున్న ద్రవ్య పరమైన చర్యలు ఒకవైపు ద్రవ్యోల్బణం కట్టడికి మరోవైపు వృద్ధిక పురోగతికి తోడ్పాటును అందిస్తున్నాయి. ♦రూపాయి విలువ, పేమెంట్ల సమతౌల్యతలపై ప్రభావం చూపే విదేశీ మారకద్రవ్య ఇన్‌ఫ్లో, అవుట్‌ఫ్లో పరిస్థితులను జాగ్రత్తగా పరిశీలించడం జరుగుతోంది. ♦అక్టోబర్‌లో వాణిజ్యలోటు (ఎగుమతులు–దిగుమతుల మధ్య నికర వ్యత్యాసం) ఆల్‌టైమ్ గరిష్టం 31.46 బిలియన్ డాలర్లకు చేరినప్పటికీ, కరెంట్ అకౌంట్‌లోటు కట్టడిలోనే ఉంది. ఇప్పటికి దీనిపై ఆందోళన పడాల్సింది ఏదీ లేదు. ♦ఆర్బీఐ ద్రవ్య, పరపతి చర్యలు పూర్తిగా వ్యవస్థలోకి బదలాయింపులు జరిగితే, డిమాండ్ కొంత మందగించే వీలుంది. ♦సవాళ్లు ఉన్పప్పటికీ, భారత్ ఎకానమీ 2023–24లో సానుకూల బాటలోనే కొనసాగుతుంది. మౌలిక, డిజిటల్ రంగాలపై జరుగుతున్న పెట్టుబడులు వృద్ధికి ఊతమిస్తున్నాయి. ♦అంతర్జాతీయ మందగమన పరిస్థితుల్లోనూ భా రత్ ఎకానమీ గణనీయమైన పురోగతిని సా ధిస్తోంది. దేశీయ పటిష్ట డిమాండ్ దీనికి కారణం 4 శాతం లక్ష్యం... ఉక్రేయిన్‌పై రష్యా యుద్ధం, క్రూడ్ ధరల తీవ్రత, అంతర్జాతీయంగా పెరిగిన క్రూడ్ ధరలు, దీనితో ప్రపంచ వ్యాప్తంగా ద్రవ్యోల్బణం భయాల నేపథ్యంలో ఈ సవాలును అధిగమించడానికి ఆర్బీఐ 2022 మే నుంచి 2023 ఫిబ్రవరి నాటికి రెపో రేటును 250 బేసిస్ పాయింట్లు పెంచింది. దీనితో ఈ రేటు 6.5 శాతానికి చేరింది. అయితే ద్రవ్యోల్బణం కొద్దిగ అదుపులోనికి వస్తుందన్న సంకేతాల నేపథ్యంలో గత నాలుగు సమావేశాల్లో యథాతథ రేటు కొనసాగింపునకే ఆర్బీఐ పెద్దపీట వేసింది. జూలైలో నమోదయిన 15 నెలల గరిష్ట స్థాయి (7.44 శాతం) రిటైల్ ద్రవ్యోల్బణం, అక్టోబర్ నాటికి నాలుగు నెలల కనిష్ట స్థాయి 4.87 శాతానికి దిగివచ్చింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ద్రవ్య పరపతి విధానానికి ప్రాతిపదిక అయిన రిటైల్ ద్రవ్యోల్బణం 2 ప్లస్ లేదా మైనస్‌తో 4 శాతం వద్ద (మినహాయింపులకు లోబడి ఎగవముఖంగా 6 శాతం) ఉండాలన్నది సెంట్రల్ బ్యాంక్‌కు కేంద్రం నిర్దేశం. సెప్టెంబర్, అక్టోబర్లలో ఆర్బీఐకి నిర్దేశిత పరిధిలో రిటైల్ ద్రవ్యోల్బణం నమోదయినప్పటికీ, తమ లక్ష్యం 4 శాతమేనని గవర్నర్ శక్తికాంతదాస్ పలు సందర్భాల్లో స్పష్టం చేస్తున్న సంగతి తెలిసిందే. 2022–2023 ఆర్థిక సంవత్సరంలో సగటు రిటైల్ ద్రవ్యోల్బణం 6.7 శాతంకాగా, 2023–24లో రేటు 5.4 శాతానికి తగ్గుతుందన్నది ఆర్బీఐ అంచనా. క్యూ2లో వృద్ధి 7 శాతం లోపే... నవంబర్ 30వ తేదీన ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండవ త్రైమాసిక (జూలై–సెప్టెంబర్) జీడీపీ గణాంకాలు వెలువడుతున్న నేపథ్యంలో పలువురు దీనిపై తమ అంచనాలను వెల్లడిస్తున్నారు. వృద్ధి రేటు 6.8 శాతం నుంచి 7 శాతం వరకూ ఉంటుందని పలు రేటింగ్, విశ్లేషణా సంస్థల అంచనా. 7 శాతం వృద్ధి రేటు నమోదవుతుందని దేశీయ రేటింగ్ ఏజెన్సీ ఇక్రా అంచనావేస్తుండగా, 6.8 శాతంగా బ్రిటిష్ బ్రోకరేజ్ బార్క్లేస్ భావిస్తోంది. గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో వృద్ధి రేటు 7.8 శాతం కన్నా తాజా అంచనాలు తక్కువగా ఉండడం గమనార్హం. 2023–24లో వృద్ధి రేటు 6.5 శాతంగా ఉంటుందని ఆర్బీఐ అంచనావేస్తోంది. -
పోలవరం, ప్రత్యేక హోదా అంశాలపై కూడా సమావేశంలో దృష్టిపెట్టాలి
-
జడ్జీలను ‘ఎంచు’కుంటోంది: కేంద్రంపై సుప్రీం మండిపాటు
న్యూఢిల్లీ: ఉన్నత న్యాయస్థానాల్లో ఖాళీల భర్తీకి కొలీజియం సిఫార్సు చేసిన జాబితా నుంచి కొంతమందిని మాత్రమే న్యాయమూర్తులుగా కేంద్రం ఎంపిక చేసుకుంటోందని సుప్రీంకోర్టు ఆరోపించింది. కొలీజియం సిఫారసులన్నింటినీ పరిగణనలోకి తీసుకోవడం లేదని ఆక్షేపించింది. ఈ విషయంలో కేంద్రం వ్యవహార శైలి చాలా ఇబ్బందికరంగా ఉందంటూ తీవ్ర అసహనం వెలిబుచ్చింది. న్యాయమూర్తులు జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ సుధాన్షు ధూలియా ధర్మాసనం ఈ మేరకు పేర్కొంది. ఒక హైకోర్టు నుంచి మరో హైకోర్టుకు న్యాయమూర్తుల బదిలీకి కొలీజియం చేసిన పలు సిఫార్సులను కూడా పెండింగ్‌లో పెట్టడం ఆందోళనకరమని వ్యాఖ్యానించింది. ‘‘ఈ పరిస్థితి చివరికి సర్వోన్నత న్యాయస్థానమో, కొలీజియమో దీనిపై కేంద్రానికి రుచించని నిర్ణయం తీసుకునేందుకు దారి తీయదనే మేం ఆశిస్తున్నాం’’ అంటూ సుతిమెత్తగా హెచ్చరించింది. న్యాయమూర్తుల నియామకం, బదిలీలకు సంబంధించి కొలీజియం చేసిన సిఫార్సుల ఆమోదంలో కేంద్రం ఆలస్యం చేస్తోందంటూ దాఖలైన పిటిషన్లపై ధర్మాసనం విచారణ జరిపింది. కేంద్రం ఈ తీరుగా చేయడం చాలా సమస్యలకు దారి తీస్తోందని జస్టిస్ కౌల్ ఆందోళన వెలిబుచ్చారు. చదవండి: సుప్రీంకోర్టుకు ముగ్గురు కొత్త జడ్జీలు ‘‘ఇది పదేపదే సమస్యగా మారుతోంది. దీన్ని మేం గతంలోనూ అటార్నీ జనరల్ దృష్టికి తీసుకొచ్చాం. కొన్ని సిఫార్సులను ఆమోదించి మరికొన్నింటిని పెండింగ్‌లో పెట్టడం న్యాయమూర్తుల సీనియారిటీ తదితర కీలక విషయాల్లో అనవసర సమస్యలకు తావిస్తోంది’’ అంటూ ఆయన మండిపడ్డారు. కేంద్రం వ్యవహార శైలిని చూసి సీనియర్ న్యాయవాదులు న్యాయమూర్తులుగా బాధ్యతలు తీసుకునేందుకు ఇష్టపడటం కూడా లేదన్నారు. ‘‘కొన్ని సిఫార్సులను కేంద్రం వెంటనే ఆమోదిస్తోంది. అది అభినందనీయమే. కానీ చాలాసార్లు కొలీజియం సిఫార్సుల్లో కొన్నింటిని మాత్రమే ఎంచుకుని ఆమోదిస్తుండటం ఆందోళనకరం. దయచేసి దీనికి అడ్డుకట్ట వేయండి’’ అని ఆటార్నీ జనరల్ వెంకట రమణికి సూచించారు. ఏ న్యాయమూర్తి ఏ హైకోర్టులో పని చేయాలన్నది న్యాయవ్యవస్థ నిర్ణయానికే వదిలేయడం సబబన్నారు. ఈ అంశంపై కేంద్రం తీరుపై సుప్రీంకోర్టు ఇప్పటికే ఎంతో సహనంతో వ్యవహరించిందని పిటిషనర్ తరఫున వాదించిన ప్రశాంత్ భూషణ్ అన్నారు. ఇక దీనిపై కోర్టే కేంద్రాన్ని ఆదేశించాల్సిన సమయం వచ్చిందన్నారు. లేదంటే తామేం చేసినా చెల్లుతుందని అలుసుగా తీసుకునే ఆస్కారముందని చెప్పారు. దీనిపై గతంలోనే ఏజీని హెచ్చరించామని, కేంద్రం దృష్టికి తీసుకెళ్లానని ఆయన హామీ ఇచ్చారని జస్టిస్ కౌల్ గుర్తు చేశారు. కేంద్రంతో లోతైన చర్చలకు మరింత సమయం కోరారన్నారు. కానీ ఆ తర్వాత కూడా కొలీజియం చేసిన ఇటీవలి సిఫార్సుల నుంచి కూడా కేంద్రం కొన్ని పేర్లనే ఎంచుకుని ఆమోదించిందంటూ అభ్యంతరం వెలిబుచ్చారు. దీనిపై విచారణను నవంబర్ 20కి ధర్మాసనం వాయిదా వేసింది. చదవండి: అభ్యంతరాలను అపోహలుగా తోసిపుచ్చలేం -
రష్మిక ఫేక్ వీడియో : సోషల్ మీడియా సంస్థలకు కేంద్రం మరోసారి రెడ్ సిగ్నల్
న్యూఢిల్లీ: తప్పుడు సమాచార వ్యాప్తికి సంబంధించి నటి రష్మిక మందన్నకు చెందినడీప్‌ఫేక్ వీడియో వైరల్ కావడంతో కేంద్రం సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లకు మరోసారి హెచ్చరికలు జారీ చేసింది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్, 2000లోని సెక్షన్ 66డీ ప్రకారం నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన శిక్ష, జరిమానా తప్పదంటూ రిమైండర్ జారీ చేసింది. ఈ వ్యవహారంపై కేంద్ర ఐటీ మంత్రిత్వ శాఖ దర్యాప్తునకు ఆదేశించినట్టు తెలుస్తోంది. ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాయంతో డీప్‌ఫేక్‌లకు సంబంధించిన చట్టపరమైన నిబంధనలను, ఉల్లంఘిస్తే ఎదురయ్యే పరిణామాలను తాజా సర్క్యులేషన్లో మరోసారి గుర్తు చేసింది. ఐటీ యాక్ట్ 2000 సెక్షన్ 66డీ ప్రకారం కంప్యూటర్ వనరులను ఉపయోగించి ఎవరైనా వ్యక్తుల పట్ల మోసపూరితంగా వ్యవహరించినా, వ్యక్తిత్వ హననానికి పాల్పడినా నేరం రుజువైతే మూడేళ్ల దాకా జైలు శిక్ష, లక్ష రూపాయల దాకా జరిమానా ఉంటుంది. ప్రభుత్వం, లేదా బాధిత వ్యక్తులు కోరిన వెంటనే సోషల్ మీడియా వెబ్ సైట్లు ఆయా కంటెంట్ వివరాలను 36 గంటల్లోగా తొలగించాల్సి ఉంటుంది. IT మధ్యవర్తి నియమాల ప్రకారం, సోషల్ మీడియా సంస్థలు 10 రకాల కంటెంట్‌కి సంబంధించిన పోస్టులను తప్పక తొలగించాలి. ముఖ్యంగా దేశ సమగ్రత, శాంతి భద్రతలు, సార్వభౌమత్వం, విదేశాలతో సంబంధాలు, ఇతర దేశాలను అవమానించడం, నేరాలకు పాల్పడేందుకు ప్రోత్సహించే చర్యలు, ఒక వ్యక్తి లేదా ప్రభుత్వాన్ని కించపర్చేలా మాట్లాడడం నేరంగా పరిగణిస్తారు. అలాగే అసభ్యకరమైన కంటెంట్, లింగ విద్వేషం రెచ్చగొట్టే పోస్టులు, ఇతరుల ప్రైవసీని దెబ్బ తీసే కంటెంట్, చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడేలా ప్రోత్సహించడం, జాతి, మతం, రంగును అవమానించడం, భారతీయ చట్టాలలో నేరంగా వెల్లడించిన పనులను ప్రోత్సహించే కంటెంట్ వంటివి ఎవరైనా పోస్ట్ చేస్తే వాటిని వెంటనే తొలగించాల్సి ఉంటుంది. అలాగే ఒకవేళ ప్రభుత్వం కోరితే ఆ సమాచారాన్ని ముందుగా పోస్ట్ చేసిన వ్యక్తి వివరాలను కూడా వెల్లడించాల్సి ఉంటుంది. కాగా రష్మిక డీప్ ఫేక్ వీడియో వైరల్ కావడంతో స్పందించిన కేంద్ర ఐటీ శాఖ సహాయమంత్రి రాజీవ్ చంద్రశేఖర్ ఫేక్ న్యూస్, డీప్‌ఫేక్ వీడియోలపై ఆందోళన వ్యక్తం చేశారు. భారతీయులకు భద్రత, విశ్వాసం కల్పించేందుకు నరేంద్ర మోదీ ప్రభుత్వం కట్టుబడి ఉందని భరోసా ఇవ్వడం తోపాటు ఇలాంటి ఫేక్ వీడియోపై సోషల్ మీడియా సంస్థలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కూడా హెచ్చరించిన సంగతి తెలిసిందే. -
ఎన్నికల తర్వాత కేంద్రంలో బీఆర్ఎస్ది కీలక పాత్ర: హరీశ్‌రావు
సాక్షి,హైదరాబాద్ : పార్లమెంట్ ఎన్నికల తర్వాత జాతీయ స్థాయిలో బీఆర్ఎస్ పార్టీ కీలక పాత్ర పోషిస్తుందని మంత్రి హరీశ్‌రావు అన్నారు. అప్పుడు ఎస్సీ వర్గీకరణ సాధించి తీరుతామని చెప్పారు. ఇందిరాపార్క్‌లో ఆదివారం జరిగిన మాదిగల యుద్ధభేరి సభలో హరీశ్‌రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మాదిగల పై ప్రధాని మోదీకి చిత్తశుద్ది లేదన్నారు. ఎన్నికల ప్రచారం కోసం తెలంగాణకు వస్తున్న మోదీ ఎస్సీ వర్గీకరణపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఎస్సీ వర్గీకరణ కోసం తెలంగాణ ఏర్పాటయ్యాక అసెంబ్లీలో రెండు సార్లు తీర్మానం చేసి కేంద్రానికి పంపించామని హరీశ్ చెప్పారు. కేంద్రంలో ఉన్న మోదీ ప్రభుత్వం తొమ్మిదిన్నర ఏళ్లుగా ఎస్సీ వర్గీకరణపై తాత్సారం చేస్తోందన్నారు. మాదిగల పై మోదీకి చిత్తశుద్ది లేదన్నారు. ఎస్సీ వర్గీకరణపై కేసీఆర్ ఎన్నోసార్లు అడిగినా మోదీ పట్టించుకోవడం లేదని విమర్శించారు. తెలంగాణ వచ్చిన తర్వాత కేసిఆర్ రాష్ట్రంలో 33 దళితస్టడీ సర్కిల్స్ ఏర్పాటు చేశారని తెలిపారు. ఎస్సీల్లో అర్హులకు రూ.10లక్షలిచ్చి సాయం చేయాలనే ఉద్దేశంతోనే దళితబంధు ప్రారంభించినట్లు చెప్పారు. -
సుస్థిర ప్రభుత్వం వల్లే దేశ ప్రగతి, ప్రపంచ కితాబు: మోదీ
మెహసానా: దేశమంతటా ప్రస్తుతం కనిపిస్తున్న శరవేగమైన ప్రగతి, ప్రపంచవ్యాప్తంగా కురుస్తున్న ప్రశంసలకు కేంద్రంలో సుస్థిర ప్రభుత్వం ఉండటమే కారణమని ప్రధాని నరేంద్ర మోదీ అభిప్రాయపడ్డారు. సోమవారం గుజరాత్‌లోని మెహసానా జిల్లా ఖెరాలు వద్ద రూ.5,950 కోట్ల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులకు ఆయన శంకుస్థాపనలు చేశారు. అనంతరం భారీ జన సమూహాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. అంతకుముందు ఓపెన్ టాప్‌కార్‌లో రోడ్ షో చేశారు. తర్వాత మాట్లాడారు. సుదీర్ఘ కాలం పాటు ఒకే పార్టీ అధికారంలో ఉంటే ఎన్నెన్ని అభివృద్ధి కార్యకలాపాలు చేపట్టవచ్చో, ఎంతటి ప్రగతి సాధించవచ్చో చెప్పేందుకు గుజరాతే ఉదాహరణ అన్నారు. ‘‘మీ నరేంద్ర బాయ్ ఎలాంటివారో మీకు బాగా తెలుసు. మీరు నన్ను ప్రధానిగా కాకుండా మీ సొంత నరేంద్ర బాయ్‌గా చూస్తారు. నేనేదైనా వాగ్దానం చేస్తే దాన్ని నెరవేర్చి తీరతానని కూడా మీకు తెలుసు’’ అన్నారు. -
'రాజకీయ పార్టీల విరాళాలపై.. ప్రజలకు ఆ హక్కు లేదు'
ఢిల్లీ: రాజకీయ పార్టీలకు నిధుల కోసం ఉద్దేశించిన ఎలక్టోరల్ బాండ్ల పథకంలో ఎలాంటి అవకతవకలు జరగడం లేదని కేంద్రం స్పష్టం చేసింది. ఈ నిధులు ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలుసుకునే హక్కు ప్రజలకు ఉండదని తెలిపింది. అటార్నీ జనరల్ ఆర్ వెంకటరమణి సుప్రీంకోర్టుకు లిఖితపూర్వకంగా పేర్కొన్నారు. ఎలక్టోరల్ బాండ్ల పథకాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై మంగళవారం (అక్టోబర్ 31న) సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. ఈ నేపథ్యంలో న్యాయస్థానానికి కేంద్రం తన వాదనను సమర్పించింది. "ఎలక్టోరల్ బాండ్ల విధానంలో విరాళాలు సమర్ఫించే దాతల గోప్యతను కాపాడాల్సి ఉంటుంది. ఈ పథకం స్వచ్ఛమైన డబ్బును రాజకీయ పార్టీలకు అందిస్తుంది. ఈ విరాళాలు పన్ను బాధ్యతలకు కట్టుబడి ఉండేలా చేస్తుంది. అందువల్ల ఇది ఏ హక్కుకు కూడా భంగం కలిగించదు" అని అటార్ని జనరల్ సుప్రీంకోర్టుకు తెలిపారు. ఎన్నికల బాండ్ల సమాచారం పబ్లిక్ డొమైన్లలో ఉండబోదని అటార్ని జనరల్ తెలిపారు. అభ్యర్థుల వివరాలకు సంబంధించి ప్రతిదీ తెలుసుకునే హక్కు ప్రజలకు ఉండదని వెల్లడించారు. రాజకీయ నిధులలో పారదర్శకతను తీసుకొచ్చే ప్రయత్నాల్లో భాగంగా రాజకీయ పార్టీలకు ఇచ్చే నగదు విరాళాలకు జనవరి 2, 2018న ప్రభుత్వం ఈ పథకాన్ని రూపొందించింది. ఈ ఎన్నికల బాండ్లు ఓ ప్రామిసరీ నోట్ లాంటిది. వ్యక్తులు, కంపెనీలు వీటిని కొనుగోలు చేయవచ్చు. వీటిని రాజకీయ పార్టీలకు విరాళంగా ఇవ్వవచ్చు. ఈ బాండ్లను పార్టీలు నగదుగా మార్చుకుని ప్రచారాల కోసం వాడుకోవచ్చు. ఇదీ చదవండి: ఈడీ ముందు హాజరైన రాజస్థాన్ సీఎం అశోక్ గహ్లోత్ కుమారుడు -
‘మేడిగడ్డ ఆనకట్ట నిర్మాణంలో లోపాలు లేవు’
సాక్షి, జయశంకర్ భూపాలపల్లి: మేడిగడ్డ బ్యారేజీ కుంగిన వ్యవహారంపై కేంద్ర బృందం పర్యటన కొనసాగుతోంది. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఛైర్మన్ అనిల్ జైన్ నేతృత్వంలో ఏర్పాటైన కమిటీ బుధవారం రాష్ట్ర నీటిపారుదల శాఖ ఇంజినీర్లతో భేటీ అయింది. ఆనకట్ట కుంగిన వ్యవహారంపై ఇంజినీర్లతో కేంద్ర బృందం చర్చించింది. ఆనకట్టకు సంబంధించిన సాంకేతిక అంశాలపై విస్తృతంగా చర్చించింది. భేటీ అనంతరం తెలంగాణ ఇంజినీర్ ఇన్ చీఫ్ మురళీధర్ మాట్లాడుతూ.. ‘‘మేడిగడ్డ ఆనకట్ట నిర్మాణంలో లోపాలు లేవు. లోపాలు ఉంటే మూడు సీజన్లు తట్టుకునేది కాదు కదా!. ఏడో బ్లాక్‌లో సమస్య వల్ల సెంటర్ పియర్ కుంగింది. ఎక్కడో చిన్న పొరపాటు జరిగింది. ఇసుక కారణంగా సమస్య వచ్చిందని భావిస్తున్నాం. బ్యారేజీకి సంబంధించి క్వాలిటీ ఆఫ్ శాండ్, క్వాలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్ అనుమతులు ఉన్నాయి. కాపర్ డ్యామ్‌కు వరద తగ్గాక నవంబర్ చివరలో ఘటనపై సమగ్ర పరిశీలన చేస్తాం’’ అని ఈఎన్సీ పేర్కొన్నారు. ఈ భేటీలో తెలంగాణ ఈఎన్సీలు మురళీధర్, నాగేంద్రరావు, వెంకటేశ్వర్లు, ఓఎస్డీ శ్రీధర్ దేశపాండే, ఎల్ అండ్ టీ ప్రతినిధులు పాల్గొన్నారు. పెద్ద శబ్దంతో కుంగుబాటు.. కాళేశ్వరం ఎత్తిపోతల్లో మొదటిదైన మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీ శనివారం రాత్రి భారీ శబ్దంతో కుంగిపోయింది. మేడిగడ్డ బ్యారేజీ 20వ పిల్లర్ కుంగిపోవడం ఆందోళన రేకెత్తించింది. కాంక్రీట్ నిర్మాణానికి క్రస్ట్ గేట్ల మధ్య పగుళ్లు వచ్చాయి. 7వ బ్లాక్‌లోని 18, 19, 20, 21 పిల్లర్ల వద్ద వంతెన కుంగింది. దీంతో బ్యారేజీకి నష్టం వాటిల్లకుండా అధికారులు యుద్ధప్రాతిపదికన గేట్లు ఎత్తి.. జలాశంయలోని నీటిని దిగువకు విడుదల చేశారు. ఆపై కేంద్రం తరపున నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఛైర్మన్ అనిల్ జైన్ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల బృందం.. మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీ వంతెన కుంగుబాటును మంగళవారం క్షేత్రస్థాయిలో పరిశీలించింది. మేడిగడ్డ ఆనకట్ట, కుంగిన ప్రాంతాన్ని పరిశీలించి ఇంజనీర్ల ద్వారా వివరాలు తీసుకున్నారు. -
వచ్చేసారి ఊరుకోం!.. కేంద్రంపై సుప్రీం అసహనం
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా న్యాయమూర్తుల నియామకాల్లో జరుగుతున్న జాప్యంపై సుప్రీం కోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. గత ఏడాది నవంబర్ నుంచి సుప్రీం కోర్టు కొలీజియం సిఫార్సులు 70 వరకు కేంద్రం దగ్గర పెండింగ్‌లో ఉన్నాయని వెల్లడించింది. వాటిని ఇన్నాళ్లు ఎందుకు పెండింగ్‌లో ఉంచారని కేంద్రాన్ని ప్రశ్నించింది. న్యాయమూర్తులు జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ సుధాంశు ధూలియాలతో కూడిన సుప్రీం కోర్టు బెంచ్ ఈ సమస్య పరిష్కారానికి అటార్నీ జనరల్ కార్యాలయం చొరవ తీసుకోవాలని పేర్కొంది. దీనికి అటార్నీ జనరల్ ఆర్. వెంకటరమణి ఏడు రోజులు సమయం అడిగారు. దీనిపై జస్టిస్ సంజయ్ కిషన్ స్పందిస్తూ ’’ నేను ఎన్నో చెప్పాలనుకున్నాను. కానీ నన్ను నేను నియంత్రించుకుంటున్నాను. సమస్య పరిష్కారానికి అటార్నీ జనరల్ ఏడు రోజులు మాత్రమే సమయం అడిగారు. నేను ఇప్పటికి మౌనంగా ఉంటున్నారు. వచ్చేసారి ఇక ఊరుకోను. చదవండి: అయోధ్య శ్రీరాముడి విగ్రహ ప్రతిష్టకి జనవరి 22 ముహూర్తం..? అటార్నీ జనరల్ కార్యాలయమే కేంద్రం దగ్గరున్న పెండింగ్ సిఫార్సుల సమస్యను పరిష్కరించాలి. ఎందుకంటే న్యాయమూర్తుల కొరత అన్నది అతి పెద్ద సమస్య’’ అని జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్ కుండబద్దలు కొట్టారు. జడ్జీల నియామకం జాప్యం అవుతున్న కొద్దీ చాలా మంది లాయర్లు తమ దరఖాస్తుల్ని వెనక్కి తీసుకుంటున్నారని, అత్యంత ప్రతిభ కలిగిన లాయర్లు న్యాయమూర్తుల పదవుల్లోకి రాకుండా ఉండడం ఆందోళన కలిగించే అంశమని అన్నారు. ‘‘కిందటి వారం వరకు 80 సిఫార్సులు పెండింగ్‌లో ఉన్నాయి. ఆ తర్వాత 10 మంది నియామకం జరిగింది. ఇప్పుడు పెండింగ్‌లో 70 ఉన్నాయి. వాటిలో 26 న్యాయమూర్తుల బదిలీలకు సంబంధించినవి. ఒక సమస్మాత్మక హైకోర్టుకు సంబంధించిన ప్రధాన న్యాయమూర్తి నియామకం కూడా ఇంకా పెండింగ్‌లో ఉంది’’ అని జస్టిస్ కౌల్ వివరించారు. న్యాయమూర్తుల నియామకం అంశంలో కేంద్రం ఎందుకు మీనమేషాలు లెక్కిస్తుందో అర్థం కావడం లేదన్నారు. -
ఈ నెల 17న అఖిలపక్ష భేటీకి కేంద్రం పిలుపు..
ఢిల్లీ: పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలకు కేంద్రం సన్నద్ధమౌతోంది. స్పెషల్ మీటింగ్ ఎజెండాపై చర్చించేందుకు కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ నివాసంలో నేడు కీలక సమావేశం నిర్వహించారు. కేంద్ర మంత్రి అమిత్ షా, అనురాగ్ ఠాకూర్లు హాజరయ్యారు. సెప్టెంబర్ 18 నుంచి 22 వరకు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు జరగనున్న నేపథ్యంలో ఈ నెల 17న అఖిల పక్ష సమావేశం నిర్వహించనున్నారు. ఈ భేటీ అనంతరం ఎజెండాపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలపై కొన్ని రోజులుగా దేశంలో రాజకీయంగా వివాదం నెలకొంది. ఈ ప్రత్యేక సమావేశంలోనే దేశం పేరును ఇండియా నుంచి భారత్‌గా మార్చనున్నారనే ఊహాగానాలు వెలుగులోకి వచ్చాయి. పాత పార్లమెంట్ భవనం నుంచి కొత్త పార్లమెంట్‌లోకి అధికారికంగా మారనున్నారనే మరికొందరు చెప్పుకొచ్చారు. ఈ క్రమంలోనే ఈ నెల17న అఖిలపక్ష భేటీ ఉంటుందని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి చెప్పారు. 17న సాయంత్రం 4:30కి నేతలందర్ని మీటింగ్‌కు ఆహ్వానించారు. Ahead of the parliament session from the 18th of this month, an all-party floor leaders meeting has been convened on the 17th at 4.30 PM. The invitation for the same has been sent to concerned leaders through email. Letter to follow ಇದೇ ಸೆಪ್ಟೆಂಬರ್ 18 ರಿಂದ ಆರಂಭವಾಗಲಿರುವ ವಿಶೇಷ… — Pralhad Joshi (@JoshiPralhad) September 13, 2023 ఇప్పటికే ఈ స్పెషల్ సెషన్ ఎజెండా తెలపాలని కాంగ్రెస్ ఛైర్పర్సన్ సోనియా గాంధీ ప్రధాని మోదీకి లేఖ కూడా రాశారు. ఏ రాజకీయ పార్టీతో చర్చించకుండానే ప్రత్యేక సమావేశాలు నిర్వహించడంపై ఆమె మండిపడ్డారు. ప్రధాన ఉద్ధేశం ఏంటో తెలిపాలని కోరారు. ప్రత్యేక సమావేశాలను వినాయక చవితి రోజున నిర్వహించడంపై శివ సేన (యూబీటీ) నేత సుప్రీయా సూలే కేంద్రంపై మండిపడ్డారు. హిందువుల పవిత్ర పండగ రోజున పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ఎలా నిర్వహిస్తారని దుయ్యబట్టారు. Just read about the upcoming Special Parliament Session (13th Session of 17th Lok Sabha & 261st Session of Rajya Sabha) happening from Sep 18-22. Whilst we all look forward towards meaningful discussions and dialogue, the dates coincide with the Ganpati Festival, a major… — Supriya Sule (@supriya_sule) August 31, 2023 ఇటీవల జీ20 డిన్నర్ మీటింగ్ ఆహ్వానంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్మును ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ అని పిలవడంతో దేశం పేరును మార్చనున్నారనే పుకార్లు మొదలయ్యాయి. ఈ నెల నిర్వహించనున్న ప్రత్యేక సమావేశాల్లోనే ఈ బిల్లును చర్చకు తీసుకువస్తారని ఊహాగానాలు ప్రారంభం అయ్యాయి. ఇదీ చదవండి: నేడు ఇండియా కూటమి సమన్వయ కమిటీ భేటీ.. ప్రధాన సవాళ్లు ఇవే.. -
జీ20 కేంద్రం వద్ద వర్షం నీరు.. విపక్షాల వ్యాఖ్యలపై కేంద్రం క్లారిటీ..
ఢిల్లీ: జీ20 వేదిక భారత మండపం వద్ద వర్షపు నీరు వరదలుగా పారుతోందని విపక్షాలు చేసిన వ్యాఖ్యలను కేంద్రం తప్పుబట్టింది. ప్రతిపక్షాల వ్యాఖ్యలు అవాస్తవాలని, తప్పుదోవ పట్టించేవిగా ఉన్నాయని స్పష్టం చేసింది. శనివారం అర్ధరాత్రి కురిసిన వర్షానికి తేలికపాటి వర్షం నీరు భారత మండపం బయట నిలిచిందని పేర్కొంది. వెంటనే ఆ నీటిని మోటర్లను ఉపయోగించి బయటకు పంపినట్లు వెల్లడించింది. ‘జీ20 ఏర్పాట్ల కోసం రూ.2,700 కోట్లు కేంద్రం ఖర్చు చేసింది. ఇప్పుడు ఒక్క వర్షానికే భారత మండపం నీటితో నిండిపోయింది. పంపులతో సిబ్బంది నీటిని బయటకు పంపుతున్నారు. అభివృద్ధిలో డొల్లతనం బయటపడింది..’ అంటూ కాంగ్రెస్ ‘ఎక్స్’లో వ్యంగ్యంగా పేర్కొంది. ఈ వీడియోను షేర్ చేస్తూ ‘దేశ వ్యతిరేక అంతర్జాతీయ కుట్రలో వానలు కూడా భాగమే’అంటూ ఆ పార్టీ ప్రతినిధి సుప్రియ వ్యాఖ్యానించారు. ‘జీ20 సదస్సు సాగుతుండగానే భారత్ మండపంలోని వరదనీరు చేరిందన్న విషయాన్ని మీడియా ప్రస్తావించనేలేదు. మోదీజీ, దేశాన్ని ఎలా పాలించాలో మా నుంచి మీరు నేర్చుకోలేదు. కానీ, మీడియాను ఎలా మేనేజ్ చేయాలో మిమ్మల్ని చూసి మేం నేర్చుకోవాలి’అంటూ ఆ కాంగ్రెస్ పార్టీ నేత పవన్ ఖేరా పేర్కొన్నారు. అటు టీఎంసీ నేత సాకేత్ గోఖలే కూడా కేంద్రాన్ని విమర్శించారు. రూ.4000 కోట్లు ఖర్చు చేసినప్పటికీ వర్షం నీరు వరదలుగా పారుతోందని విమర్శించారు. నిధులను మోదీ ప్రభుత్వం ఏ విధంగా దుర్వినియోగం చేసిందో తెలుస్తోందని అన్నారు. ఈ పరిణామాల అనంతరం కేంద్రం స్పందించింది. ప్రతిపక్షాలు తప్పుదోవ పట్టిస్తున్నాయని మండిపడింది. అవాస్తవాలను ప్రచారం చేస్తున్నారని తెలిపింది. ఇదీ చదవండి: జీ20 తదుపరి అధ్యక్ష బాధ్యతలను బ్రెజిల్‌కు అప్పగింత -
కేంద్రానికి మద్దతు నిలిచిన మన్మోహన్ సింగ్
ఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వానికి మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మద్దతుగా నిలిచారు. ఉక్రెయిన్-రష్యా యుద్ధంపై భారత్ అవలంభించిన విధానం సరైనదేనని అన్నారు. భారత్ తన సార్వభౌమాధికారాన్ని, ఆర్ధిక ప్రయోజనాలను కాపాడుకోవడంలో ప్రధాన పాత్ర పోషించిందని కొనియాడారు. అదే క్రమంలో ప్రపంచ శాంతికి విజ్ఞప్తి చేసినట్లు చెప్పారు. జీ-20 సమావేశాలకు ఆహ్వానాలు అందిన వారిలో మన్మోహన్ సింగ్ కూడా ఒకరు. ఓ ఇంటర్వ్యూలో ఈ మేరకు సమాధానమిచ్చారు. విదేశాంగ విధానం దేశీయ రాజకీయాల్లో ప్రస్తుతం ప్రధాన పాత్ర పోషిస్తున్నట్లు మన్మోహన్ సింగ్ తెలిపారు. దౌత్య సంబంధాలను రాజకీయాల కోసం వాడుకోవడంలో సమన్వయం పాటించాలని కోరారు. జీ20కి ఇండియా ఆతిథ్యం ఇచ్చే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పారు. ఈ క్రమంలోనే ఉక్రెయిన్-రష్యా యుద్ధంలో భారత్ పాత్రకు మద్ధతుగా నిలిచారు. సరైన పనే చేసిందని అన్నారు. Former PMs Manmohan Singh and HD Deve Gowda invited to G20 dinner#G20India2023 #G20SummitDelhi #G20 #ManmohanSingh #HDDeveGowda #G20Summit pic.twitter.com/7Dbe7XV3o4 — Mr. Nitish (@Nitishvkma) September 8, 2023 జీ20 సమ్మిట్‌కు చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ రాకపోవడం, చైనా-భారత్ సంబంధాలపై ఆయన స్పందించారు. దేశ సార్యభౌమాధికారాన్ని కాపాడటంలో ప్రధాని మోదీ ప్రభుత్వం కావాల్సినన్ని చర్యలు తీసుకుంటుందని చెప్పారు. క్లిష్టమైన దౌత్య వ్యవహారాలను ఎలా నిర్వహించాలో ప్రధానమంత్రికి సలహా ఇవ్వడం సరికాదని చెప్పారు. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్.. G20 శిఖరాగ్ర సమావేశానికి హాజరుకాకపోవడం దురదృష్టకరమని అన్నారు. స్వాతంత్య్రం సాధించి 75 ఏళ్లు పూర్తయినప్పటికీ ఇంకా దేశంలో ఉన్న సవాళ్లపై ప్రశ్నించినప్పుడు.. తాను ఆశావాదంతో ఉన్నట్లు చెప్పారు. దేశంలో అభివృద్ధికి ఆశావాద స్వభావమే నాంది అని అన్నారు. చంద్రయాన్ 3 విజయంపై కూడా ఆయన స్పందించారు. ఇస్రో సాధించిన విజయంపై ఆయన అభినందనలు తెలిపారు. ప్రపంచంలో భారత్ మరింత ముందుకు వెళుతోందని అన్నారు. ఇదీ చదవండి: ఢిల్లీకి చేరిన ఐఎంఎఫ్ చీఫ్.. ఫోక్ సాంగ్‌కు డ్యాన్సులు.. -
విద్యుత్ కొరతపై రాష్ట్రాలకు హెచ్చరిక
సాక్షి, అమరావతి: దేశవ్యాప్తంగా ఏర్పడ్డ విద్యుత్ కొరత పరిస్థితులు సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లోనూ కొనసాగుతాయని, ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ అన్ని రాష్ట్రాలను హెచ్చరించింది. రానున్న గడ్డు పరిస్ధితుల కోసం ఇప్పుడే అప్రమత్తం కావాలని, థర్మల్ విద్యుత్ ఉత్పత్తిని పెంచుకోవడానికి ఈ నెలాఖరు నాటికి బొగ్గును దిగుమతి చేసుకోవాలని సూచించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శికి తాజాగా ఓ లేఖ పంపింది. ఈ ఏడాది ఆగస్టులో గరిష్ట డిమాండ్‌లో కొరత 23 శాతంగా ఉందని, ఇది ప్రపంచంలోనే అత్యధికమని కేంద్రం తెలిచ్చింది. కొన్ని రాష్ట్రాలు విద్యుత్ డిమాండ్‌ను తీర్చలేకపోయాయని చెప్పింది. నిజానికి ఈ ఏడాది ఆగస్టు 15 తరువాత బొగ్గు ఆధారిత విద్యుత్ ఉత్పత్తి యూనిట్లను నిషేధించామని, పరిస్థితులు చక్కబడకపోవడంతో నిషేధాన్ని పక్కనపెట్టి అందుబాటులో ఉన్న అన్ని వనరులను వినియోగించుకోవాలని వివరించింది. ఈ ఏడాది రుతుపవనాలు ఇప్పటివరకు సాధాౄరణం కంటే తక్కువగా ఉన్నందున సెప్టెంబర్‌లోనూ వర్షాలు ఆశించినంతగా లేనందున రిజర్వాయర్లలో నీటి మట్టాలు క్షీణించాయని, దానివల్ల గత ఏడాది 45 గిగావాట్లుగా ఉన్న గరిష్ట హైడ్రో పవర్ ఉత్పత్తి ఈ ఏడాది 40 గిగావాట్ల కంటే తక్కువగా ఉందని వెల్లడించింది. పవన ఉత్పత్తిలో కూడా ఇదే ధోరణి కనిపిస్తోందని, సెప్టెంబర్–అక్టోబర్ కాలంలో రుతుపవనాల ఉపసంహరణతో జల, గాలి ఉత్పత్తి మరింత క్షీణిస్తుందని అంచనా వేసినట్టు కేంద్రం తెలిపింది. థర్మల్ ప్లాంట్లు కూడా పూర్తి సామర్థ్యంతో నడవకపోవడం వల్ల 12–14 గిగావాట్ల థర్మల్ విద్యుత్ అందుబాటులో లేదన్నారు. వెంటనే వాటిని అందుబాటులోకి తేవాలని ఆదేశించింది. అలాగే థర్మల్, సోలార్, విండ్ వంటి కొత్త యూనిట్లను త్వరితగతిన ప్రారంభించాలని కోరింది. విద్యుత్ డిమాండ్ తీర్చేందుకు కొనుగోలు ఒప్పందాలు(పీపీఏ)లు కుదుర్చుకోవాలని, స్వల్పకాలిక టెండర్ల ద్వారా విద్యుత్‌ను బహిరంగ మార్కెట్ ద్వారా సమకూర్చుకోవాలని సూచించింది. -
మిల్లెట్ ఫుడ్స్‌కు పీఎల్ఐ: కేంద్ర ఆహార శుద్ధి శాఖ కార్యదర్శి
మిల్లెట్ ఆధారిత ఆహార ఉత్పత్తుల శుద్ధి పరిశ్రమకు కేంద్ర సర్కారు రెండో విడత ఉత్పత్తి అనుసంధానిత ప్రోత్సాహక పథకాన్ని (పీఎల్ఐ) ప్రకటించనుంది. ఈ విషయాన్ని కేంద్ర ఆహార శుద్ధి శాఖ కార్యదర్శి అనితా ప్రవీణ్ తెలిపారు. ఈ పథకం ఆమోదం దశలో ఉందని, దీని కింద రూ.1,000 కోట్ల ప్రోత్సాహకాలు కల్పించనున్నట్టు చెప్పారు. కోల్‌కతాలో ఓ కార్యక్రమం సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు. (ఇషా అంబానీకి కొత్త బాధ్యతలు: కుమార్తెపై నీతా నమ్మకం అలాంటిది!) ఆహారోత్పత్తుల శుద్ధి పరిశ్రమకు మొదటి దశ పీఎల్ఐ కింద రూ.800 కోట్లు ప్రకటించగా, గత ఆర్థిక సంవత్సరం నుంచి ఇది ఆరంభమైనట్టు చెప్పారు. మొదటి దశలో 30 సంస్థల నుంచి దరఖాస్తులు వచ్చాయని, పూర్తి స్థాయిలో సబ్స్క్రయిబ్ అయినట్టు వెల్లడించారు. ఇప్పుడు రెండో విడత కింద మరో రూ.1,000 కోట్ల ప్రోత్సాహకాలు ఇవ్వనున్నట్టు చెప్పారు. ఆహార శుద్ధి యూనిట్లకు సాయం అందించేందుకు వీలుగా కేంద్రం నుంచి రూ.10,900 కోట్ల నిధులకు ఆమోదం లభించినట్టు చెప్పారు. దీన్నుంచి రూ.800 కోట్లను మొదటి దశ పీఎల్ఐ కింద మిల్లెట్ ఆధారిత ఉత్పత్తులకు ఇస్తున్నట్టు తెలిపారు. ప్రధానమంత్రి ఫార్మలైజేషన్ ఆఫ్ మైక్రోఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం కింద ఆహార శుద్ధి పరిశ్రమలోని చిన్న యూనిట్లకు సాయం చేస్తున్నట్టు అనితా ప్రవీణ్ వెల్లడించారు. -
Bharat vs India: ‘ఇండియా’ కూటమి పేరు మార్చితే ఏం చేస్తారు?
ఇండియా పేరు మార్పు వివాదం రాజకీయంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ అంశం కేంద్రలోని అధికార బీజేపీ, ప్రతిపక్షాల మధ్య పరస్పర తీవ్ర ఆరోపణలకు కేంద్రబిందువుగా మారింది. జీ20 సదస్సు కోసం విచ్చేస్తున్నదేశ, విదేశీ నేతలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అందించిన ఆహ్వాన పత్రాలపై ‘ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా’ బదులు ‘ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ పేరు’ అని ముంద్రించి ఉండటంతో ఈ వివాదం తెరపైకి వచ్చింది. After Non-BJP forces united to dethrone the fascist BJP regime and aptly named their alliance #INDIA, now the BJP wants to change 'India' for 'Bharat.' BJP promised to TRANSFORM India, but all we got is a name change after 9 years! Seems like the BJP is rattled by a single term… — M.K.Stalin (@mkstalin) September 5, 2023 ఇప్పటికే ఇండియా పేరును మార్చాలంటూ కొన్ని రోజులుగా ఓ వర్గం డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా పరిణామంతో త్వరలోనే కేంద్రం దేశం పేరును ఇండియా నుంచి భారత్‌గా మార్చనున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. దేశానికి భారత్ పేరు పెట్టే కీలక బిల్లులకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. వచ్చే ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల్లో బిల్లు పెట్టేందుకు మోదీ సర్కార్ యోచిస్తోంది. అయితే ఇండియా కూటమికి చెక్ పెట్టేందుకు మోదీ సర్కార్ ఈ చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది. Mr. Modi can continue to distort history and divide India, that is Bharat, that is a Union of States. But we will not be deterred. After all, what is the objective of INDIA parties? It is BHARAT—Bring Harmony, Amity, Reconciliation And Trust. Judega BHARAT Jeetega INDIA! https://t.co/L0gsXUEEEK — Jairam Ramesh (@Jairam_Ramesh) September 5, 2023 ప్రతిపక్షాల విమర్శలు.. ప్రతిపక్షాలు తమ కూటమికి ఇండియా అని పేరు పెట్టిన విషయం తెలిసిందే. వచ్చే ఏడాది జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీయే సర్కార్‌ను ఓడించే లక్ష్యంతో ఏర్పడిన ఈ కూటమిలో 28 పార్టీలు ఉన్నాయి. దీంతో . ఇండియాను భారత్‌గా మార్చడాన్ని కాంగ్రెస్‌తో సహా ప్రతిపక్షాలు ఖండిస్తున్నాయి. ఇప్పటికిప్పుడు పేరు మార్పు చేయాల్సిన అవసరం ఏముందని ప్రశ్నిస్తున్నారు. విపక్ష కూటమికి భయపడి, కేవలం ఎన్నికల స్టంట్ కోసమే మోదీ సర్కార్ దేశం పేరు మార్చేందకు ప్రయత్నిస్తుందని విమర్శలు గుప్పిస్తున్నాయి. కూటమికి మోదీ భయపడ్డారు. ఈ క్రమంలోనే తాజాగా ఢిల్లీ సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్.. ఇండియాపేరు భారత్‌గా అని మారుస్తున్నట్లు వస్తున్న వార్తలపై స్పందించారు. విపక్షాలన్నీ కలిసి ఏర్పడిన కూటమికి ఇండియా అని పేరును పెట్టుకుంటే ప్రధాని నరేంద్ర మోదీ భయపడ్డారని విమర్శించారు. ఈ క్రమంలోనే దేశం పేరును ఇండియా నుంచి భారత్‌గా మార్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. అదే ఒక వేళ.. విపక్ష కూటమి పేరును ఇండియా నుంచి భారత్ అని మార్చితే అప్పుడు ఇండియా పేరును బీజేపీగా మారుస్తుందని సెటైర్లు వేశారు. చదవండి: ఇండియా పేరు మార్పుపై సోషల్ మీడియాలో రచ్చ.. బిగ్‌బీ, సెహ్వాగ్, మమతా ట్వీట్లు ఇండియా కూటమి పేరు భారత్‌గా మార్చితే? ఈ మేరకు మంగళవారం ఢిల్లీలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. దేశం పేరును మార్చుతున్నట్లు తమకు అధికారిక సమాచారం లేదని అన్నారు. బీజేపీని వ్యతిరేచించే చాలా ప్రతిపక్ష పార్టీలు కూటమిగా ఏర్పడి ‘ఇండియా’గా పేరు పెట్టుకున్నందుకు కేంద్రం దేశం పేరును మార్చుతోందా అని ప్రశ్నించారు. దేశం 140 కోట్ల ప్రజలదని, ఒక పార్టీకి సంబంధించినది కాదని అన్నారు. ఒకవేళ విపక్ష కూటమి పేరును భారత్‌గా మారితే.. దేశం పేరును భారత్ నుంచి బీజేపీగా మారుస్తారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. విపక్ష కూటమి పేరును ఇండియా అని పెట్టుకోవడంతో బీజేపీ ఆందోళనలో ఉందని అరవింద్ కేజ్రీవాల్ పేర్కొన్నారు. దేశం పేరు మార్చడం ద్రోహమని మండిపడ్డారు. విపక్ష కూటమి వల్ల బీజేపీలో ఏదో తెలియని కలవరం నెలకొందని.. అందుకే ఒకే దేశం ఒకే ఎన్నిక ప్రతిపాదనతో ప్రజల దృష్టిని మళ్లించేందుకు మోదీ సర్కార్ తీవ్ర ప్రయత్నాలు చేస్తోందని మండిపడ్డారు. -
ఇండియా Vs భారత్.. సెహ్వాగ్, బిగ్ బీ, ప్రముఖుల స్పందన ఇదే..
ఇండియా పేరు మార్పుపై సోషల్ మీడియాలో తీవ్ర చర్చ నడుస్తోంది. మన దేశం పేరు ‘భారత్’ లేక ‘ఇండియా’ అనే అంశం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఇండియా పేరు మార్పుపై ప్రముఖులు ట్వీట్ చేస్తున్నారు. కొంతమంది ‘భారత్’ పేరును సమర్ధిస్తుంటే.. ఇండియాను భారత్‌గా మార్చడాన్ని కాంగ్రెస్‌తో సహా ప్రతిపక్షాలు ఖండిస్తున్నాయి. ఇప్పటికిప్పుడు పేరు మార్పు చేయాల్సిన అవసరం ఏముందని ప్రశ్నిస్తున్నారు. ఇండియా కూటమికి భయపడి, కేవలం ఎన్నికల స్టంట్ కోసమే కేంద్రలోని బీజేపీపేరు మార్చేందకు ప్రయత్నిస్తుందని ఆరోపిస్తున్నారు. తాజాగా ఇండియా పేరు మార్పుపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పందించారు. ‘ఇండియా పేరును భారత్‌గా మార్చబోతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. జీ 20 సదస్సు కోసం ప్రెసిడెంట్ డిన్నర్ ఆహ్వాన పత్రికపై భారత్ అని ముద్రించారు. ఇందులో కొత్త ఏముంది. మనం తరుచుగా భారత్ అనే పదాన్ని ఉచ్చరిస్తుంటాం. భారత రాజ్యంగం లేదా భారత్ కా సంవిధాన్ అనే పదాన్ని ఉపయోగిస్తూనే ఉన్నాం. ప్రపంచానికి దేశం పేరు ఇండియాగానే తెలుసు. ఇంత అత్యవసరంగా దేశం పేరు మార్చాలని అవసరం ఏముంది? అని ప్రశ్నించారు. సంబంధిత వార్త: ఇండియా కాదు భారత్, దేశం పేరు మార్పు దిశగా కేంద్రం West Bengal CM @MamataOfficial reacts on ‘Bharat’ replacing ‘India’. “I heard they are now changing the name of #India. The President’s dinner invite for #G20 mentions #Bharat. What is new here? We always use Bharat. We say India’s constitution or Bharat ka Sanvidhan.… pic.twitter.com/Pq3Z3ZBvbJ — Mahua Moitra Fans (@MahuaMoitraFans) September 5, 2023 కాంగ్రెస్ నేత జయరామ్ రమేశ్ స్పందింస్తూ.. ఈ పరిణామం వెనుక కొంతైనా నిజం ఉందా అని ప్రశ్నించారు. రాష్ట్రపతి భవన్ సెప్టెంబరు 9న విందుకు ఆహ్వానాన్ని పంపిందని, అందులో ‘ప్రెసిడెంట్ ఆఫ్ ది రిపబ్లిక్ ఆఫ్ ఇండియా’ అని కాకుండా ‘ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా’ అని తెలిపింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 1లో ‘భారతదేశం, అంటే భారత్, రాష్ట్రాల యూనియన్‌గా ఉంటుంది. కానీ యూనియన్ ఆఫ్ స్టేట్స్’ అనే పదం కూడా ఇప్పుడు దాడికి గురవుతోంది" అని ఆయన ఆరోపించారు. Mr. Modi can continue to distort history and divide India, that is Bharat, that is a Union of States. But we will not be deterred. After all, what is the objective of INDIA parties? It is BHARAT—Bring Harmony, Amity, Reconciliation And Trust. Judega BHARAT Jeetega INDIA! https://t.co/L0gsXUEEEK — Jairam Ramesh (@Jairam_Ramesh) September 5, 2023 ప్రధాని మోదీ చరిత్రను వక్రీకరిస్తూ, దేశాన్ని విడగొట్టే ప్రయత్నం చేస్తున్నారని జైరామ్ రమేశ్ విమర్శించారు. ఇది భారతదేశం. రాష్ట్రాల యూనియన్. ఇండియా పార్టీల లక్ష్యం కూడా( Bharat- Bring Harmony, Amity, Reconciliation And Trust) సామరస్యం, స్నేహం, సయోధ్య , నమ్మకాన్ని తీసుకురావడమే. జూడేగా భారత్.. జీతేగా ఇండియా! అని పేర్కొన్నారు. మరోవైపు విపక్షాల కూటమిని చూసి బీజేపీ భయపడుతోందని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఆరోపించారు. I have always believed a name should be one which instills pride in us. We are Bhartiyas ,India is a name given by the British & it has been long overdue to get our original name ‘Bharat’ back officially. I urge the @BCCI @JayShah to ensure that this World Cup our players have… https://t.co/R4Tbi9AQgA — Virender Sehwag (@virendersehwag) September 5, 2023 ఇక బాలీవుడ్ బిగ్‌బీ అమితాబ్ బచ్చాన్ దేశం పేరు మార్పును సమర్ధించారు. ఈ మేరకు ‘ భారత్ మాతాకీ జై’ అంటూ ట్వీట్ చేశారు. ఇండియాను భారత్‌గా మార్చాడాన్ని స్వాగతిస్తున్నానని మాజీ క్రికెటర్ సెహ్వాగ్ ట్వీట్ చేశారు. జెర్సీపై కూడా భారత్ అని ముంద్రించాలని కోరారు. T 4759 - 🇮🇳 भारत माता की जय 🚩 — Amitabh Bachchan (@SrBachchan) September 5, 2023 కాగా సార్వత్రిక ఎన్నికల ముందు కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇండియా కూటమికి చెక్ పెట్టేందుకు మోదీ సర్కార్ చర్యలు చేపట్టింది. త్వరలో మనదేశం పేరు మారనుంది. ఇండియా పేరును భారత్‌గా మార్చేందుకు కేంద్రం యోచిస్తోంది. దేశానికి భారత్ పేరు పెట్టే కీలక బిల్లులకు సన్నాహాలు చేస్తోంది. ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల్లో బిల్లు పెట్టేందుకు పావులు కదుపుతోంది. ఈ క్రమంలోనే మరికొద్ది రోజుల్లో దేశ రాజధాని ఢిల్లీలో జరగబోయే జీ20 సదస్సు.. ఆహ్వాన పత్రాల్లోప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా బదులు.. ప్రెసిడెంట్ ఆఫ్ భారత్‌గా కేంద్రం ముద్రించింది. REPUBLIC OF BHARAT - happy and proud that our civilisation is marching ahead boldly towards AMRIT KAAL — Himanta Biswa Sarma (@himantabiswa) September 5, 2023 మరోవైపు అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ సంకేతాలిస్తూ ఓ ట్వీట్ కూడా చేశారు. రిపబ్లిక్ అఫ్ భారత్.. మన నాగరికత అమృత్ కాల్ వైపు ముందుకు సాగుతున్నందుకు సంతోషంగా ఉందంటూ ట్వీట్లో పేర్కొన్నారాయన. కాగా ఇండియా పేరును మార్చాలని కొన్ని రోజులుగా ఓ వర్గం డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. దేశం పేరును ఇండియానుంచి భారత్‌గా మార్చాలని తక్షణమే భారత రాజ్యాంగంల నుంచి దాన్ని తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇండియా అనే పదాన్ని బ్రిటిష్ వారు ఉపయోగించేవారని,.. ‘భారత్’ అనే పదం మన దేశ సంస్కృతికి ప్రతీక అని వాదిస్తున్నారు. అంతేగాక దేశం పేరును ఇండియా అని కూకుండా భారత్ అని పిలవాలని ఆర్ఎస్ఎస్ నాయకుడు మోహన్ భగవత్ రెండ్రోజుల క్రితం పిలుపునిచ్చారు. అదే విధంగా ఇటీవల ప్రతిపక్షాలు తమ కూటమికి ఇండియా అని పేరు పెట్టిన విషయం తెలిసిందే. వచ్చే ఏడాది జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీయేతో తలపడాలని యోచిస్తున్న 28 పార్టీలు ఈ కూటమిలో ఉన్నాయి. -
జమిలి లాభనష్టాలపై కేంద్రం వివరణ
ఢిల్లీ: ఒకే దేశం-ఒకే ఎన్నిక విధానరూపకల్పనకు సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని కేంద్ర ప్రభుత్వం కమిటీని నియమించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జమిలీ ఎన్నికలపై లాభనష్టాలను పేర్కొంటూ గత పార్లమెంట్ సెషన్లో కేంద్ర న్యాయ శాఖ మంత్రి విడుదల చేసిన రిపోర్టు తాజాగా తెరమీదకు వచ్చింది. పార్లమెంట్లో కిరోడీ లాల్ మీనా అడిగిన ప్రశ్నకు కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ మేఘావాల్ సమాధానం ఇది.. సవాళ్లు.. ►జమిలి ఎన్నికలకు రాజ్యాంగంలోని ఐదు ఆర్టికల్స్‌లో సవరణలు అవసరమని న్యాయ శాఖా మంత్రి తెలిపారు. 1) పార్లమెంటు సభల వ్యవధిపై ఆర్టికల్ 83, 2) లోక్‌సభను రాష్ట్రపతి రద్దు చేయడంపై ఆర్టికల్ 85, 3) రాష్ట్ర శాసనసభల వ్యవధిపై ఆర్టికల్ 172, 4) రాష్ట్రాల శాసనసభలను రద్దు చేయడంపై ఆర్టికల్ 174 5) రాష్ట్రాల్లో రాష్ట్రపతి పాలనపై ఆర్టికల్ 356 ► ఇది కాకుండా జమిలీ ఎన్నికల నిర్వహణకు దేశం సమాఖ్య నిర్మాణాన్ని దృష్టిలో ఉంచుకుని అన్ని రాష్ట్ర ప్రభుత్వాల ఏకాభిప్రాయాన్ని పొందడం తప్పనిసరి అని అర్జున్ మేఘావాల్ తెలిపారు. ► అదనపు ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్లు, ఓటర్ వెరిఫైయబుల్ పేపర్ ఆడిట్ ట్రయల్ (EVMలు/VVPATలు) అవసరమవుతాయి. వీటి ఖర్చు వేల కోట్ల వరకు ఉంటుంది. ► EVM మెషీన్ జీవితకాలం కేవలం 15 సంవత్సరాలు మాత్రమే అని పరిగణనలోకి తీసుకుంటే.. ఈ యంత్రాన్ని దాని జీవిత కాలంలో మూడు లేదా నాలుగు సార్లు ఉపయోగించవచ్చు. ప్రతి 15 సంవత్సరాలకు దాని స్థానంలో మరోటి బర్తీ చేయాలంటే ఒకేసారి భారీ వ్యయం అవుతుందని అర్జున్ మేఘావాల్ చెప్పారు. ► ఇదీగాక అదనపు పోలింగ్ సిబ్బంది, భద్రతా బలగాలు కూడా అవసరమవుతాయని ఆయన స్పష్టం చేశారు. లాభాలు.. ► జమిలీ ఎన్నికల వల్ల ఒకరకంగా ప్రభుత్వ వ్యయం భారీగా తగ్గుతుందని న్యాయ శాఖ మంత్రి అర్జున్ మేఘావాల్ తెలిపారు. ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం వల్ల రాజకీయ పార్టీలకు, అభ్యర్థులకు ప్రచార ఖర్చులు భారీగా ఆదా అవుతాయని పేర్కొన్నారు. ► జాతీయ, రాష్ట్ర ఎన్నికలతో పాటు ఉప ఎన్నికల వల్ల ఎలక్షన్ ప్రవర్తనా నియమావళి అమలులో ఉంటుంది. ఇది అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది. ► దక్షిణాఫ్రికాలో జమిలీ ఎన్నికలే జరుగుతాయి. ప్రతి ఐదేళ్లకు ఒకేసారి జాతీయ, రాష్ట్ర స్థాయిలో ఎన్నికలు జరుగుతాయి. రెండేళ్లకు ఒకసారి మున్సిపల్ ఎన్నికలు నిర్వహిస్తారు. ► యూకేలోనూ ఎన్నికలు స్థిరమైన కాలవ్యవధుల్లో జరుగుతున్నాయి. పార్లమెంట్ చట్టం 2011 ప్రకారం నిర్ణీత కాలవ్యవధి ప్రకారమే స్థిరంగా నిర్వహిస్తారు. ► స్వీడన్లో కూడా జమిలీ తీరు ఎన్నికలే నిర్వహిస్తారు. నాలుగేళ్లకు ఒకసారి సెప్టెంబర్ రెండవ ఆదివారం ఒకేసారి ఎన్నికలు నిర్వహిస్తారు. ఇదీ చదవండి: ఉదయనిధి ‘సనాతన ధర్మం’ వ్యాఖ్యల దుమారం.. స్టాలిన్ ఏమన్నారంటే.. -
మాది స్లోగన్ సర్కార్ కాదు.. సొల్యూషన్ సర్కార్
లక్డీకాపూల్: మాది స్లోగన్ సర్కార్ కాదు.. సొల్యూషన్ సర్కార్ అని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు వ్యాఖ్యానించారు. కాంగ్రెస్, బీజేపీలు కేవలం నినాదాల పార్లు .. బీఆర్ఎస్ మాత్రమే నినాదాలను నిజం చేసే పార్టీ అని పేర్కొన్నారు. గురువారం –నిమ్స్‌లో ఏర్పాటు చేసిన ఆయుష్ ఇంటిగ్రేటెడ్ వెల్నెస్ సెంటర్‌ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. నకిలీ హామీలు, వెకిలి చేష్టలతో ఆ రెండు పార్లు ప్రజలను తప్పు దోవ పట్టిస్తున్నాయని విమర్శించారు. అమిత్ షా, ఖర్గేలు పర్యాటకుల్లా వచ్చి.. అవగాహన లేమితో ఇక్కడి నేతలు రాసిచ్చిన స్క్రిప్ట్ చదివి వెళ్లిపోయారన్నారు. గుజరాత్లో బీజేపీ గుడ్డి పాలనను దారిలో పెట్టడం చేతగాని అమిత్ షా ఇక్కడికి వచ్చి అర్థం పర్థం లేని ఆరోపణలు చేసి వెళితే ఎవరు నమ్ముతారని ఎద్దేవా చేశారు. కర్ణాటకలో మూడు నెలలకే కాంగ్రెస్ తీరేమిటో తేలిపోయిందని, ముందుగా ఖర్గే తన సొంత రాష్ట్రాన్ని చక్కదిద్ది ఇక్కడ కొచ్చి మాట్లాడాలని సూచించారు. వివిధ పార్టీల డిక్లరేషన్లు నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరని..బీఆర్ఎస్కు మూడోసారి అధికారం ఇవ్వాలని ఎపుడో సెల్ఫ్ డిక్లరేషన్ చేసుకున్నారని మంత్రి పేర్కొన్నారు. నిమ్స్‌లో ఆయుష్ ఏర్పాటు రాష్ట్రంలోనే తొలిసారి నిమ్స్‌లో ఆయుష్ హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్‌ను ఏర్పాటు చేసుకోవడం సంతోషంగా ఉందంటూ.. ఈ విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపిన సీఎస్ శాంతి కుమారికి హరీశ్‌రావు అభినందనలు తెలిపారు. ఈ తరహా వెల్నెస్ సెంటర్ ఏర్పాటు చేసుకోవడం రాష్ట్రంలోనే తొలిసారన్నారు. ఆయుర్వేదం, యునాని, హోమియోపతి, సిద్ధ, ప్రకృతి వైద్యం.. అన్ని వైద్య విధానాలు ఇక్కడ ఒకే వేదికగా అందుబాటులో ఉంటాయని చెప్పారు. వికారాబాద్, భూపాలపల్లి, సిద్ధిపేటల్లో 50 పడకల కొత్త ఆయుష్ ఆసుపత్రుల నిర్మాణాలు జరుగుతున్నాయని చెప్పారు. వచ్చే నెల రెండో వారంలో మరో 9 మెడికల్ కాలేజీల్లో తరగతులు ప్రారంభం కానున్నాయని మంత్రి హరీశ్‌రావు వెల్లడించారు. దీంతో కొత్తగా 900 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులోకి వస్తాయని వివరించారు. త్వరలో మరో 8 మెడికల్ కాలేజీలు ప్రారంభించి.. ప్రతి జిల్లాకూ ఒక మెడికల్ కాలేజీ ఉన్న రాష్ట్రంగా తెలంగాణ రికార్డ్ సృష్టించబోతుందని హరీశ్ స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఎంపీ నామా నాగేశ్వరరావు, నిమ్స్ సంచాలకులు నగరి బీరప్ప, ఆయుష్ సెంటర్ కోఆర్డినేటర్ డాక్టర్ నాగలక్ష్మి పాల్గొన్నారు. -
జమ్ములో ఎన్నికల నిర్వహణకు సిద్ధం: కేంద్రం
ఢిల్లీ: జమ్ము కశ్మీర్ స్వయంప్రతిపత్తికి సంబంధించిన ఆర్టికల్ 370 రద్దుకు వ్యతిరేకంగా దాఖలైన పలు పిటిషన్లపై గురువారం సుప్రీంకోర్టులో విచారణ జరుగుతోంది. జమ్ముకు రాష్ట్ర హోదా ఎప్పుడు పునరుద్దరిస్తుందనే అంశంపై ఇవాళ సుప్రీంకు కేంద్రం ఒక స్పష్టత ఇవ్వాల్సి ఉంది. ఈ క్రమంలో వాదనలు వినిస్తున కేంద్రం.. అక్కడ ఎన్నికల నిర్వహణకు సిద్ధమని కేంద్రం స్పష్టం చేసింది. జమ్మూకశ్మీర్‌లో ఎన్నికల నిర్వహణ పూర్తిగా ఎన్నికల సంఘం, రాష్ట్ర ఎన్నికల సంఘం చేతుల్లో ఉందని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా చెప్పారు. మొత్తం మూడు దశల్లో ఎన్నికలు జరగాల్సి ఉందని ధర్మాసనానికి తెలిపారు. పంచాయతీ, మున్సిపల్, అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగాలని చెప్పారు. అలాగే.. జమ్మూ కశ్మీర్‌కు రాష్ట్ర హోదా కల్పించే అంశానికి కాల వ్యవధిని నిర్ణయించలేమని తుషార్ మెహతా సుప్రీంకోర్టు ధర్మాసనానికి స్పష్టం చేస్తూనే.. కేంద్ర పాలిత ప్రాంతంగా తాత్కాలికమేనని పేర్కొన్నారు. పూర్తి రాష్ట్రంగా మార్చడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు. జమ్మూ కశ్మీర్‌ని గణనీయమైన స్థాయిలో అభివృద్ధి చేసినట్లు సుప్రీంకోర్టుకు సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా తెలిపారు. కొత్త ప్రాజెక్టులు భారీ స్థాయిలో వస్తున్నాయని చెప్పారు. ఉగ్రవాద చర్యలు 42.5 తగ్గాయని వెల్లడించారు. చొరబాటు ఘటనలు 90.20 శాతం తగ్గాయని తెలిపారు. 2023లోనే ఏకంగా కోటి మంది పర్యటకులు కశ్మీర్ లోయను సందర్శించారని పేర్కొన్నారు. Petitions challenging the abrogation of Article 370 in SC | Solicitor General Tushar Mehta, appearing for Centre, tells Supreme Court that it is ready for elections in Jammu and Kashmir at any time now. pic.twitter.com/mhiqqWPBbf — ANI (@ANI) August 31, 2023 జమ్మూకశ్మీర్‌కు రాష్ట్ర హోదా కల్పించే అంశంలో కేంద్రం నేడు కీలక ప్రకటన చేయనుంది. నాలుగేళ్లుగా కేంద్ర పాలిత ప్రాంతంగా ఉన్న జమ్మూకశ్మీర్‌కు ఎప్పుడు రాష్ట్ర హోదా కల్పించనున్నారనే సమాచారాన్ని నేడు సుప్రీంకోర్టుకు నివేదించనుంది. ఆర్టికల్ 370 రద్దును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారణ జరుపుతున్న విషయం తెలిసిందే. మంగళవారం పిటీషనర్ల వాదనలు విన్న తర్వాత సీజేఐ చంద్రచూడ్.. జమ్మూ కశ్మీర్లో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించాలని కేంద్రాన్ని కోరారు. ఈ మేరకు ఎప్పటివరకు ఈ ప్రక్రియను పూర్తి చేస్తారో కూడా తెలపాలని ప్రశ్నించారు. #BREAKING Supreme Court asks when the Statehood of Jammu and Kashmir will be restored. Asks when elections will be allowed. Asks SG to get instructions on a definition timeline.#JammuKashmir #Article370 https://t.co/SK9wl5B5Ia — Live Law (@LiveLawIndia) August 29, 2023 ఈ క్రమంలో వాదనలు వినిపించిన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా.. జమ్మూ కశ్మీర్‌కు రాష్ట్ర హోదాపై సానుకూల అంశాన్ని గురువారం తెలుపుతామని ధర్మాసనానికి విన్నవించారు. జమ్మూ కశ్మీర్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా తాత్కాలికంగానే ఉంచనున్నామని, లఢక్ మాత్రం యూనియన్ టెరిటరీగానే ఉంటుందని కోర్టుకు ఆయన స్పష్టం చేశారు. Justice Kaul: suppose you carve out portion of assam into a union territory and also make assam into a UT.. SG: Too extreme an example..... but one state cannot be declared a UT under article 3... but there needs to be separation... CJI: creation of UTs post independence..… — Bar & Bench (@barandbench) August 29, 2023 జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక రాష్ట్ర హోదాను కల్పిస్తున్న ఆర్టికల్ 370ని రద్దు చేస్తూ 2019లో కేంద్రం నిర్ణయం తీసుకుంది. ప్రతిపక్ష నాయకులు విమర్శలను పక్కకు పెట్టి ఆ రాష్ట్రాన్ని లఢక్, జమ్మూ కశ్మీర్ రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించింది. ప్రతిపక్షాల ప్రశ్నలకు సమాధానమిస్తూ.. అక్కడ పరిస్థితులు సాధారణ స్థితికి వచ్చాక మళ్లీ రాష్ట్ర హోదా కల్పిస్తామని అప్పట్లో ప్రభుత్వం తెలిపింది. ఇదీ చదవండి: రక్షా బంధన్ రోజున ఇలాంటి తీర్పు ఇస్తాననుకోలేదు -
Jammu Kashmir: 2 రోజుల్లో జమ్మూ కశ్మీర్‌కు శుభవార్త, రాష్ట్ర హోదా..?
ఢిల్లీ:జమ్మూ కశ్మీర్‌పై కేంద్రం కీలక నిర్ణయం తీసుకోనుంది. రాష్ట్ర హోదా కల్పించడంపై మరో రెండు రోజుల్లో ప్రకటన చేయనున్నట్లు తెలుస్తోంది. ఆర్టికల్ 370 రద్దును సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు అయ్యాయి. వీటిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం.. జమ్మూ కశ్మీర్‌కు రాష్ట్ర హోదా కల్పించడానికి గడువును నిర్ణయించాలని కేంద్రాన్ని కోరింది. ప్రజాస్వామ్యాన్ని పునరుద్దరించాల్సిన అవసరాన్ని గుర్తుచేసింది. సుప్రీంకోర్టులో కేంద్రం ఏం చెప్పిందంటే : "కేంద్ర పాలిత ప్రాంతం అనేది శాశ్వతం కాదు. ఎల్లుండి (సెప్టెంబర్ 1 2023న) కేంద్రం ఒక ప్రకటన చేయనుంది. ఇది జమ్మూ కశ్మీర్ ప్రాంతానికి పూర్తిగా పాజిటివ్ గా ఉంటుంది. ఇక ముందు కూడా లఢక్ కేంద్ర పాలిత ప్రాంతంగా కొనసాగుతుంది. ఇప్పటికే అక్కడ స్థానిక సంస్థల ఎన్నికలు కూడా పూర్తయ్యాయి. లఢక్ లో రెండు యూనిట్లు ఉన్నాయి. ఒకటి లేహ్.. మరొకటి కార్గిల్. లేహ్ లో ఎన్నికలు పూర్తయ్యాయి. కార్గిల్ లో సెప్టెంబర్ లో ముగుస్తాయి" అని సొలిసిటర్ జనరల్ ధర్మాసనానికి తెలిపారు. జమ్మూ కశ్మీర్‌కు రాష్ట్ర హోదా కల్పించాలనే అంశం ప్రస్తుతం పార్లమెంట్లో ఉందని చెప్పారు. కశ్మీర్లో పరిస్థితులు చక్కబడ్డాక ఆ ప్రయత్నాలు మొదలవుతాయని ధర్మాసనానికి విన్నవించారు. #BREAKING Supreme Court asks when the Statehood of Jammu and Kashmir will be restored. Asks when elections will be allowed. Asks SG to get instructions on a definition timeline.#JammuKashmir #Article370 https://t.co/SK9wl5B5Ia — Live Law (@LiveLawIndia) August 29, 2023 జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక రాష్ట్ర హోదాను కల్పిస్తున్న ఆర్టికల్ 370ని రద్దు చేస్తూ 2019లో కేంద్రం నిర్ణయం తీసుకుంది. ప్రతిపక్ష నాయకులు విమర్శలను పక్కకు పెట్టి ఆ రాష్ట్రాన్ని లఢక్, జమ్మూ కశ్మీర్ అనే రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించింది. ప్రతిపక్షాల ప్రశ్నలకు సమాధానమిస్తూ.. అక్కడ పరిస్థితులు సాధారణ స్థితికి వచ్చాక మళ్లీ రాష్ట్ర హోదా కల్పిస్తామని ప్రభుత్వం తెలిపింది. SG: I have taken instructions and the instructions are that the UT is not a permanent feature and I will make a positive statement day after tomorrow. Ladakh would remain a UT.. but here we are only on Jammu and Kashmir. AG and I will make the statement. In terms of local body… — Bar & Bench (@barandbench) August 29, 2023 ఇదీ చదవండి: ఆర్టికల్ 35ఏ వారి ప్రాథమిక హక్కులను లాగేసుకుంది: సీజేఐ చంద్రచూడ్ -
మిస్టర్ స్పోర్టెక్స్ క్లాసిక్ ఇండియా విజేతగా రాహుల్..
హైదరాబాద్: నగరంలోని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్ వేదికగా భాగ్యనగర్ బాడీబిల్డింగ్ అసోసియేషన్, హైటెక్స్ సంయుక్త ఆధ్వర్యంలో మిస్టర్ స్పోర్టెక్స్ క్లాసిక్ ఇండియా 2023 పోటీలను నిర్వహించారు. ఆదివారం జరిగిన ఈ పోటీల్లో మిస్టర్ స్పోర్టెక్స్ క్లాసిక్ ఇండియా టైటిల్‌ను తెలంగాణాకు చెందిన రాహుల్ గెలుచుకున్నారు. ఈ సందర్భంగా బీబీఏ ప్రెసిడెంట్ కె సంపత్ రెడ్డి మాట్లాడుతూ., పురుషుల ఫిజిక్, బాడీ బిల్డింగ్ ఛాంపియన్షిప్ విభాగాల్లో పోటీలు జరిగాయని తెలిపారు. టైటిల్ విజేతకు రూ. లక్ష నగదు బహుమతి, మొత్తం టోర్నీ పేరిట రూ.6 లక్షల నగదు అవార్డులు అందుకుంటారన్నారు. 55 కిలోలు, 55–60 కిలోలు, 60–65 కిలోలు, 65–70 కిలోలు 70–75 కిలోలు, 75–80 కిలోలు, 80–85 తదితర విభాగాల్లో బాడీబిల్డింగ్ పోటీలు, 85 కిలోల పైన పురుషుల ఫిజిక్ పోటీలు 170 సెంటీమీటర్ల లోపు, 170 సెంటీమీటర్ల పైన తదితర విభాగాల్లో నిర్వహించామన్నారు. -
చంద్రయాన్–3లో ఈసీఐఎల్ కీలక భూమిక
కుషాయిగూడ (హైదరాబాద్): చంద్రయాన్–3లో కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ ఎల్రక్టానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఈసీఐఎల్) కీలక భూమిక పోషించింది. చంద్రయాన్ కమ్యూనికేషన్‌కు కీలకమైన 32 మీటర్ డీప్ స్పేస్ నెట్వర్క్ (డీఎస్ఎన్) యాంటెన్నాను సరఫరా చేసిందని సంస్థ వర్గాలు గురువారం ఓ ప్రకటనలో తెలిపాయి. 300 టన్నుల ఈ యాంటెన్నా వ్యవస్థను బాబా అటామిక్ రీసెర్చ్, యూఆర్ రావు శాటిలైట్ సెంటర్, ఐఎస్టీఆర్ఏసీలతో కలిసి పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించినట్లు చెప్పాయి. చంద్రుడి ఉపరితలంపై 0.3 మిల్లీమీటర్ల పరిమాణం కలిగిన వాటినీ క్షుణ్ణంగా చూపించేలా వీల్ అండ్ ట్రాక్ మౌంట్, బీమ్ వేవ్ గైడ్, ఫీడ్ సిస్టమ్‌తో కూడిన అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని యాంటెన్నాలో అమర్చినట్లు చెప్పాయి. చంద్రుడిపై తీసే చిత్రాలు, డేటాను స్వాదీనం చేసుకోవడంలోనూ ఈ యాంటెన్నా కీలక పాత్ర పోషిస్తుంది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో కూడిన యాంటెన్నా సిస్టమ్‌తో పాటుగా సేఫ్ అండ్ సెక్యూర్ ప్రోగ్రామబుల్ లాజిక్ కంట్రోల్ (పీఎల్సీ)ని అందిస్తూ ఇస్రోతో ఈసీఐఎల్ సన్నిహితంగా పనిచేస్తోందని ఆ వర్గాలు చెప్పాయి. రాబోయే ఆదిత్య, గగన్‌యాన్, మంగళ్యాన్–2 మిషన్లకు కూడా ఈసీఐఎల్ పనిచేస్తుందని పేర్కొన్నాయి. -
ఉల్లి విక్రయాలపై కేంద్రం కీలక నిర్ణయం - రేపటి నుంచే అమలు!
గత కొన్ని రోజులకు ముందు టమాటా ధరలు ఆకాశాన్నంటాయి.. ఇక ఇప్పుడిప్పుడే ధరలు తగ్గుతున్నాయనుకుంటున్న తరుణంలో ఉల్లి ఘాటెక్కిపోతోంది. భారతీయ మార్కెట్లో ధరల నియంత్రణతో పాటు, సరఫరా మెరుగుపరచడానికి కేంద్రం నిన్న 40 శాతం టాక్స్ విధించింది. ఢిల్లీ ప్రజలకు ఉల్లి ధరల నుంచి ఉపశమనం కల్పించడానికి తక్కువ ధరకే విక్రయించాలని నేషనల్ కోఆపరేటివ్ కన్స్యూమర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (NCCF) నిర్ణయించింది. కావున రేపటి నుంచి దేశ రాజధానిలో ఉల్లి కేజీ రూ. 25కి విక్రయించనున్నారు. 2023-24 ఆర్థిక సంవత్సరానికి ప్రభుత్వం 3 లక్షల టన్నుల ఉల్లి బఫర్ స్టాక్‌ను రూపొందించింది. ఈ ఏడాది బఫర్ కోసం అదనంగా 2 లక్షల టన్నుల ఉల్లిని సేకరించాలని నిర్ణయించింది. ఇప్పుడు ప్రారంభంలో ఢిల్లీలో బఫర్ ఉల్లిపాయలను రిటైల్ చేయడం ప్రారంభమవుతుంది. ఇదీ చదవండి: ఊసరవెల్లిలా రంగులు మార్చే కారు! అంబానీ కారు అదిరిపోలా.. ఢిల్లీలో రేపు సుమారు 10 మొబైల్ వ్యాన్లు దీని కోసం ప్రత్యేకంగా కేటాయిస్తారు. ఆ తరువాత క్రమంగా వీటిని మరిన్ని ప్రాంతాలకు కూడా విస్తరించే అవకాశం ఉంది. రానున్న రోజుల్లో దేశంలోని ఇతర రాష్ట్రాల్లో కూడా తక్కువ ధరకే ఉల్లి విక్రయించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం. -
వృద్ధి వేగవంతం.. ధరలే దారుణం
ముంబై: భారత ఆరి్థక వ్యవస్థ రెండో త్రైమాసికంలో ఊపందుకుంటోందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఆర్టికల్ ఒకటి పేర్కొంది. అయితే వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం కేంద్రం ఆర్బీఐకి నిర్దేశిస్తున్న స్థాయికి మించి (6 శాతం) సగటున కొనసాగుతుండడమే ఆందోళన కరమైన అంశమని ఆర్బీఐ నెలవారీ బులెటిన్‌లో వెలువడిన ఒక కథనం పేర్కొంది. జూన్‌లో 4.87 శాతంగా ఉన్న రిటైల్ ద్రవ్యోల్బనం జూలైలో 15 నెలల గరిష్ట స్థాయి 7.44 శాతానికి ఎగసిన నేపథ్యంలో తాజా కథనం వెలువడ్డం గమనార్హం. సమీక్షా నెల్లో టమాటా, కూరగాయలు, ఇతర ఆహార ఉత్పత్తుల ధరలు తీవ్ర స్థాయికి చేరిన సంగతి తెలిసిందే. ధరల తీవ్రత విషయాన్ని స్వయంగా ప్రధాని నరేంద్రమోదీ తన స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలోసైతం ప్రస్తావిస్తూ, సమస్యను తగ్గించడానికి తగిన మరిన్ని చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఆర్బీఐ అభిప్రాయాలు కావు... రిజర్వ్ బ్యాంక్ డిప్యూటీ గవర్నర్ మైఖేల్ దేబబ్రత పాత్ర నేతృత్వంలోని బృందం ఈ కథనాన్ని రచించింది. అయితే, ఆరి్టకల్‌లో వ్యక్తీకరించిన అభిప్రాయాలు రచయితలవి మాత్రమేనని, వీటిని రిజర్వ్ బ్యాంక్ అభిప్రాయాలుగా పరిగణించరాదని సెంట్రల్ బ్యాంక్ పేర్కొంది. వెలువడిన ఆరి్టకల్లోని కొన్ని అంశాలు పరిశీలిస్తే.. మొదటి త్రైమాసికంలో పటిష్టమైన పనితీరు తర్వాత ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కూడా మందగించింది. ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ, భారత్‌లో వినియోగ డిమాండ్ బాగుంది. పెట్టుబడుల పరిస్థితి ప్రోత్సాహకరంగా కొనసాగుతోంది. ఆయా అంశాలు భారత్‌కు లాభిస్తున్నాయి. అంతర్జాతీయ మందగమన పరిస్థితులతో కుంటుపడిన ఎగుమతుల క్షీణబాట ప్రతికూలతలను అధిగమించగలుగుతున్నాం. -
తెలంగాణపై కేంద్రం కక్ష సాధిస్తోంది: బీఆర్ఎస్ ఎంపీ నామా
న్యూఢిల్లీ: తెలంగాణపై కేంద్ర కక్ష సాధిస్తోందని బీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వర్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. విభజన చట్టం ప్రకరాం దక్కాల్సినవి కూడా దక్కలేదని తెలిపారు. ఈ మేరకు పార్లమెంట్ ప్రాంగణంలో బీఆర్ఎస్ ఎంపీ ప్రెస్‌మీట్ పెట్టారు. ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రాలన్నింటిని కేంద్రం సమానంగా చూడట్లేదని విమర్శించారు. గడిచిన 9 ఏళ్లలో తెలంగాణకు ఒక్క మెడికల్ కాలేజీగానీ, నవోదయ స్కూల్ గానీ ఇవ్వలేదని మండిపడ్డారు. ‘కాళేశ్వరం ప్రాజెక్ట్‌కు జాతీయ హోదా ఇవ్వలేదు. పార్లమెంట్ ప్రశ్నోత్తరాలలో కూడా కాళేశ్వరం ప్రాజెక్ట్ కు రాష్ట్ర ప్రభుత్వమే ఖర్చు చేసిందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం క్షమాపణ చెప్పాలి. కోటి రూపాయలు ఇచ్చినట్లు చూపితే 9 మంది ఎంపీలు రాజీనామాలు చేస్తాం. దమ్ము ధైర్యం ఉంటే కాళేశ్వరనికి ఎంత ఇచ్చారో చెప్పాలి. ఒక్క పైసా ఇచ్చి నట్లు చూపిస్తే మేము దేనికైనా రెడీ. అవిశ్వాసం పై చర్చ సందర్భంగా తెలంగాణకు అన్యాయం చేశారని చర్చ సందర్భంగా అన్ని వివరాలు చెప్పాము. తెలంగాణ రాక ముందు తాగు నీరు సాగు నీరు ఉండేది కాదు. 9 ఏళ్లలో కేసీఆర్ తాగు నీటికి సాగు నీటి కోసం మిషన్ కాకతీయ, మిషన్ భగీరద ద్వారా నీరందించారు. కేంద్రం తెలంగాణ పట్ల కక్షతో ఉన్నారు. విభజన చట్టం ప్రకారం చేయాల్సినవి కూడా చేయలేదు. అన్ని రాష్ట్రాలను సమానంగా చూడాల్సిన అవసరం కేంద్రం పై ఉంది. తెలంగాణకి ఒక్క మెడికల్ కళాశాల,ఒక్క నవోదయ స్కూల్ కూడా ఇవ్వలేదు. తెలంగాణ పట్ల కేంద్రం ఎలా వ్యవహరిస్తుందో అన్ని అవిశ్వాసం పై చర్చ సందర్భంగా ప్రస్తావించా. నా మైక్ కట్ చేసి నిషికాంత్ దుబేకి పాయింట్ ఆఫ్ ఆర్డర్ కింద అవకాశం ఇచ్చారు. 86 వేల కోట్లు కాళేశ్వరం ప్రాజెక్టుకు ఇచ్చామని నిషికాంత్ దుబే అబద్ధాలు చెప్పారు. తెలంగాణ అభివృద్ధిని చూడలేక ఓర్వ లేక ఆ అభివృద్ధికి మేమే నిధులిచ్చాం అంటున్నారు. రూల్ 222 ప్రకారం నిషికాంత్ దుబే పై సభను తప్పుడోవ పట్టించినందుకు స్పీకర్ కు ప్రివిలేజ్ మోషన్ ఇచ్చాం. కాళేశ్వరం ప్రాజెక్ట్ కు అనుమతులు, క్లియరెన్స్ ఇవ్వలేదు. కాళేశ్వరం ప్రాజెక్ట్ ను మూడు సంవత్సరాలలో మొత్తం పూర్తి చేశారు. ప్రపంచంలో పెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ఇది. సిడబ్ల్యుసి డిపిఆర్ ప్రకారం 80 వేల కోట్లు .కానీ 86 వేల కోట్లు ఇచ్చాం అంటున్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ అయిన ఖర్చు రాష్ట్ర ప్రభుత్వమే పెట్టుకుంది..కేంద్రం ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. కులాలు మతాల మధ్య చిచ్చులు పెట్టె వారిని ప్రజలు తెలంగాణ దరిదాపులకు రానియవద్దు. తెలంగాణ నెంబర్ వన్ గా ఉందన్నది నచ్చక తప్పుడు మాటలు మాట్లాడారు చదవండి: No Confidence Motion: అవిశ్వాస తీర్మానంపై చర్చ.. -
ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ ఏజ్ పెంచనున్నారా..? కేంద్రం క్లారిటీ..
ఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును పెంచనున్నారనే నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. రిటైర్మెంట్ వయస్సును మార్చబోమని స్పష్టం చేసింది. లోక్‌సభలో ప్రతిపక్ష సభ్యులు అడిగిన ప్రశ్నలుకు కేంద్రం లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చింది. 'కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును పెంచడం గానీ, తగ్గించడం గానీ ఉండదు' అని కేంద్ర సిబ్బంది వ్వవహారాల శాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు. అయితే.. లోక్‌సభలో నేడు ఉద్యోగులకు గరిష్ఠంగా 30 ఏళ్ల సర్వీసు కాలం పూర్తి చేసి రిటైర్మెంట్ ఇచ్చే ప్రతిపాదన ఉందా? అని కేంద్రాన్ని ప్రతిపక్షాలు ప్రశ్నించాయి. దీనిపై కేంద్రం సమాధానం ఇచ్చింది. గత మూడేళ్లలో 122 మంది ఉద్యోగులు నిర్బంధ పదవీవిరమణ చేశారని లోక్‌సభ సభ్యులు అడిగిన ప్రశ్నలకు కేంద్రం ఈ మేరకు సమాధానం ఇచ్చింది. యంత్రాంగాన్ని బలోపేతం చేసే దిశగా డిజిటలైజేషన్, ఎలక్ట్రానిక్ వినియోగం, రూల్స్‌ను సరళించడం వంటి మార్పులు చేసినట్లు పేర్కొంది. 730 రోజుల చైల్డ్ కేర్ సెలవులు.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల్లో ఒంటరి మహిళలు, ఒంటరి పురుషులు తమ పిల్లల సంరక్షణ కోసం మొత్తం సర్వీసులు గరిష్ఠంగా 730 రోజుల సెలవులు తీసుకోవచ్చని కేంద్ర సహాయ మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు. పిల్లల్లో మొదటి సంతానం 18 ఏళ్లు వచ్చే వరకు ఈ సెలవులకు అర్హత ఉంటుందని స్పష్టం చేశారు. ఇదీ చదవండి: పేరు మార్చుకోనున్న కేరళ! -
120 టీఎంసీలు తరలించేలా ‘పాలమూరు’ పనులు!
సాక్షి, హైదరాబాద్: ప్రతిష్టాత్మక పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కింద తాగునీటి అవసరాలకు కేవలం 7.15 టీఎంసీలు అవసరం కాగా, శ్రీశైలం జలాశయం నుంచి రోజుకు 2 టీఎంసీలు చొప్పున 60 రోజుల్లో 120 టీఎంసీల తరలింపునకు వీలుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భారీ ఎత్తున నిర్మాణ పనులు కొనసాగిస్తోందని కృష్ణా బోర్డు సుప్రీంకోర్టుకు నివేదించింది. శ్రీశైలం నుంచి తరలించుకోవడానికి ప్రతిపాదించిన నీటి పరిమాణంతో పోల్చితే తాగునీటి అవసరాలు చాలా స్వల్పమేనని పేర్కొంది. 7.15 టీఎంసీల తాగునీటిని తరలించుకోవాలనుకున్నా ప్రాజెక్టులో అంతర్భాగంగా నిర్మించిన అన్ని జలాశయాల్లోకి కలిపి 67.97 టీఎంసీలను ఎత్తిపోయాల్సి ఉంటుందని పేర్కొంది. వాస్తవ తాగునీటి అవసరాల కంటే తరలించే జలాలు ఎక్కువ అని తెలియజేసింది. ఈ మేరకు తనతో పాటు కేంద్ర జలశక్తి శాఖ తరఫున కృష్ణా బోర్డు తాజాగా అఫిడవిట్ దాఖలు చేసింది. 3.4 టీఎంసీలకే 65 టీఎంసీలు నింపాలి పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టులో భాగంగా మొత్తం 6 రిజర్వాయర్లను ప్రతిపాదించగా, చివరి కేపీ లక్ష్మీదేవి పల్లి రిజర్వాయర్ పనులను ఇంకా ప్రారంభించలేదు. తొలి 5 రిజర్వాయర్లలో పూర్తి నిల్వ సామర్థ్యం మేరకు మొత్తం 65.17 టీఎంసీలను నింపిన తర్వాతే, ఈ ఐదింటి కింద తాగునీటి అవసరాలకు ప్రతిపాదించిన మొత్తం 3.4 టీఎంసీలను (కేపీ లక్ష్మీదేవిపల్లి కింద తాగునీటి అవసరాలు 4.11 టీఎంసీలు) తరలించుకోవడానికి వీలు కలిగే రీతిలో ప్రాజెక్టుకు రూపకల్పన చేశారని సుప్రీంకోర్టుకు బోర్డు తెలిపింది. ఈ విషయాలను పరిగణనలోకి తీసుకుని ప్రాజెక్టు విషయంలో సరైన నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేసింది. అఫిడవిట్‌లోని ప్రధానాంశాలు.. పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతలను రూ.55,086 కోట్లతో ప్రభుత్వం చేపట్టింది. దీని కింద అంజనగిరి (8.51 టీఎంసీలు), వీరాంజనేయ (6.55 టీఎంసీలు), వెంకటాద్రి (16.74 టీఎంసీలు), కరుమూర్తిరాయ (17.34 టీఎంసీలు), ఉద్దండాపూర్ (16.03 టీఎంసీలు), కేపీ లక్ష్మీదేవిపల్లి (2.80 టీఎంసీల) రిజర్వాయర్లను ప్రతిపాదించింది. ఈ ఎత్తిపోతల ద్వారా తరలించే 120 టీఎంసీల్లో తాగునీటికి కేటాయించింది 7.15 టీఎంసీలు. ఇప్పటికే 65.17 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో అంజనగిరి, వీరాంజనేయ, వెంకటాద్రి, కరుమూర్తిరాయ, ఉద్దండాపూర్ రిజర్వాయర్లను.. 120 టీఎంసీలు తరలించేలా ఎత్తిపోతలు, కాలువల వ్యవస్థను పూర్తి చేసింది. ఆరో రిజర్వాయర్ కేపీ లక్ష్మీదేవిపల్లి వద్ద ఇప్పటిదాకా పనులు చేపట్టలేదు. ఇప్పటిదాకా పూర్తయిన ఐదు రిజర్వాయర్ల కింద తాగునీటి అవసరాల కోసం కేటాయించింది 3.40 టీఎంసీలే. పోలవరం ద్వారా కృష్ణా డెల్టాకు మళ్లించే గోదావరి జలాలకుగానూ కృష్ణా జలాల్లో అదనంగా దక్కే 45 టీఎంసీలకు, చిన్న నీటిపారుదల విభాగంలో మిగులుగా ఉన్న 45 టీఎంసీలను జతచేసి.. 90 టీఎంసీలతో పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతలను చేపట్టామంటూ తెలంగాణ ప్రభుత్వం డీపీఆర్‌ను సమరి్పంచింది. కానీ ఈ ప్రాజెక్టుకు నీటి కేటాయింపులు లేవు. నీటి కేటాయింపులపై బ్రిజే‹Ùకుమార్ ట్రిబ్యునల్ విచారణ చేస్తున్న నేపథ్యంలో ప్రాజెక్టు డీపీఆర్‌ను మదింపు చేయలేమని గతంలోనే తిప్పి పంపాం. పనులు ఆపాలని గతంలో బోర్డు సమావేశాల సందర్భంగా తెలంగాణను కోరాం. కేసు నేపథ్యం ఇదీ...: పర్యావరణ అనుమతి తీసుకోకుండా చేపట్టిన పాలమూరు, డిండి ఎత్తిపోతల పనులను ఆపాలంటూ ఎన్జీటీ గతంలో ఆదేశించింది. అయినా ప్రభుత్వం పనులు ఆపకపోవడంతో ఎన్టీటీ రూ.920.85 కోట్ల జరిమానా విధించింది. దీనిపై రాష్ట్రం సుప్రీంను ఆశ్రయించగా ఎన్జీటీ ఉత్తర్వులపై స్టే ఇచ్చింది. అలాగే తాగునీటి కోసం 7.15 టీఎంసీలను తరలించేలా పాలమూరు ఎత్తిపోతల పనులకు 2023 ఫిబ్రవరి 17న అనుమతిస్తూ మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. అదే సమయంలో ఎత్తిపోతలను తమ అనుమతి ప్రకారమే తెలంగాణ ప్రభుత్వం చేపట్టిందో లేదో చెప్పాలని కేంద్రాన్ని, కృష్ణా బోర్డును ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే కేంద్రం, బోర్డు అఫిడవిట్ దాఖలు చేశాయి. వాస్తవానికి ఈ నెల 4న కేసు విచారణ జరగాల్సి ఉండగా అక్టోబర్ 6కి వాయిదా పడింది. -
కేంద్రం కీలక నిర్ణయం: టీసీఎస్‌కు బంపర్ ఆఫర్
టెక్ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) బంపర్ ఆఫర్ దక్కించుకుంది. ప్రభుత్వ ఇ-మార్కెట్‌ప్లేస్ (GeM) భారత ప్రభుత్వం టీసీఎస్‌ను పార్టనర్‌గా ఎంచుకుంది. ఈ మేరకు టీసీఎస్ మంగళవారం ఒక ప్రకటన జారీ చేసింది. దీనికి ప్రకారం ప్రభుత్వ పబ్లిక్ ప్రొక్యూర్మెంట్కి ఆన్ఇన్క్లూజివ్ ప్లాట్‌ఫారమ్‌గా ఉండనుంది. క్లౌడ్ న్యూట్రాలిటీ, ఇంటర్ ఆపెరాబిలిటీ వంటి కొత్త టెక్నాలజీ సాయంతో, కొత్త GeM ప్లాట్‌ఫారమ్‌ను బహుభాషల్లో,ఓపెన్ సోర్స్-ఆధారితంగా సరికొత్తగా తీర్చిదిద్దనుంది. ప్రస్తుత ఆన్లైన్ మార్కెట్‌ప్లేస్‌ను మెరుగైన సామర్థ్యం, పారదర్శకత, సమగ్రతతో అత్యాధునిక ప్రజా సేకరణ వేదికగా మార్చాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. GeM అనేది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రభుత్వ రంగ సంస్థలకు (PSUలు) ఎండ్-టు-ఎండ్ మార్కెట్ ప్లేస్. సాధారణ వినియోగ వస్తువులు సేవలను పారదర్శకంగా, సమర్ధవంతంగా సేకరించేందుకు ఎంటిటీలు దీనిని ఉపయోగిస్తాయి. (అమ్మకోసం... భళా బుడ్డోడా! వైరల్ వీడియో) ఈ ఇ-మార్కెట్‌ప్లేస్ ప్రస్తుత వ్యాపార విలువ రూ. 2 ట్రిలియన్లకు పైగా ఉంది. 70,000 కంటే ఎక్కువ కొనుగోలుదారుల సంస్థలు, 6.5 మిలియన్ సెల్లర్స్, సర్వీస్ ప్రొవైడర్స్ఉన్నారు. వీరిలో 800,000 కంటే ఎక్కువ మధ్యస్థ ,చిన్న సంస్థలతో సహా 6.5 మిలియన్లకు పైగా అమ్మకందారులున్నారని టీసీఎస్ తెలిపింది. ప్రస్తుత ప్లాట్‌ఫారమ్ విజయ వంతమైనప్పటికీ. వినియోగదారుల అవసరాలను తీర్చడంలో నిర్మాణపరమైన సవాళ్లను కలిగి ఉందని పేర్కొంది. (టెస్లాలో కీలక పదవికి భారత సంతతికి చెందిన వైభవ్ తనేజా, ఆసక్తికర విషయాలు) ఈ నేపథ్యంలో తాజా భాగస్వామ్యంతో ప్రస్తుత ప్లాట్‌ఫారమ్‌ను కొనసాగిస్తూనే, డిజైన్, కొత్త టెక్నాలజీలను ప్రభావితం చేసే కొత్త ఆధునిక పరిష్కారాన్ని నిర్మిస్తుందని కూడా టీసీఎస్ పబ్లిక్ సర్వీసెస్ ఇండియా బిజినెస్ హెడ్ తేజ్ పాల్ భట్ల వెల్లడించారు. (స్మార్ట్ఫోనే కొంపముంచిందా? పాపులర్ పబ్లిషింగ్ హౌస్ సీఈవో దుర్మరణం) జీఈఎం కొత్త వెర్షన్‌ను రీడిజైనింగ్,రూపకల్పనకు ప్రభుత్వ కాంట్రాక్టు టీసీఎస్ దక్కించుకోవడంపై జీఈఎం సీఈవోపీకే సింగ్ మాట్లాడుతూ కొత్త అవతార్‌లో తమ జీఈఎం, మెరుగైన వ్యాపార సౌలభ్యాన్ని, పారదర్శకతను అందిస్తుందన్నారు. సిస్టమ్ ఇంటిగ్రేషన్ పార్టనర్‌గా టీసీఎస్ ఎంపిక ద్వారా, వరల్డ్ క్లాస్ సొల్యూషన్స్ అభివృద్ధి చేసి,యూజర్లకు సరికొత్త అనుభవాన్ని అందిస్తామనే హామీ ఇస్తున్నామన్నారు. -
తప్పుడు పత్రాలను జతచేసిన ఫలితం.. పడిన వేటు..
ఆదిలాబాద్: జిల్లాలోని ఐదు ఆధార్ కేంద్రాలపై యూనిక్ ఐడేంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యూఐడీఏఐ) వేటు వేసింది. ఆ కేంద్రాల ద్వారా అందించే సేవలను నిలిపివేస్తూ నిర్వాహకుల ఆథరైజేషన్‌ను సస్పెండ్ చేసింది. దీంతో ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఐదు కేంద్రాల నిర్వాహకులు ఆధార్ సంబంధిత సేవలందించేందుకు దూరమవాల్సిన దుస్థితి నెలకొంది. అడ్రస్ మార్పునకు సంబంధించి తప్పుడు వివరాలతో కూడిన ధృవీకరణ పత్రాలను జత చేసినందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ చర్యల ద్వారా ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో కలెక్టరేట్ కార్యాలయం, భుక్తాపూర్‌లోని సెంటర్‌తో పాటు, తలమడుగు, బేల, ఇంద్రవెల్లి మండల కేంద్రాల్లోని ఆధార్ కేంద్రాలపై వేటు పడింది. ఇందులో ఇంద్రవెల్లి మండల కేంద్రంలోని ఆధార్ సెంటర్‌ను ఇది వరకే సస్పెన్షన్ వేటు వేయగా తాజాగా మిగతా సెంటర్లపై చర్యలు చేపట్టింది. ఆధార్ సంస్థ చేపట్టిన చర్యల విషయం తెలియకపోవడంతో నిత్యం ఆధార్ సంబంధిత సేవల కోసం వస్తున్న ప్రజలు ఆ సెంటర్లు మూసి ఉండటంతో గంటల తరబడి నిరీక్షించాల్సి వస్తుంది. కేంద్రాలపై చర్యలు చేపట్టిన విషయాన్ని ప్రజలకు సమాచారమందించాల్సిన సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడం ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తోంది. ఏమరుపాటుగా ఉంటే వేటు తప్పదు... ఆధార్ కేంద్రాల నిర్వాహకులు ఏమాత్రం ఎమరుపాటుగా వ్యవహరించినా శాఖపరంగా చర్యలు ఎదుర్కొనక తప్పదని తెలుస్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందించే సంక్షేమ, అభివృద్ధి పథకాలు పొందాలన్నా, పోటీ పరీక్షలు, విద్యా, ఉద్యోగాలకు దరఖాస్తు చేయాలన్న ప్రభుత్వాలు ఆధార్ కార్డును తప్పనిసరి చేశాయి. అంతటి కీలకమైన ఆధార్ కార్డుల జారీలో తప్పుడు సమాచారం పొందుపరిచినట్లు తేలితే ఆధార్ సేవ కేంద్రాలనే బాధ్యులను చేస్తూ ఆధార్ సంస్థ వారిపై చర్యలు చేపడుతోంది. -
రాష్ట్రంలో విద్యపై కేంద్రం వివక్ష!
సాక్షి, హైదరాబాద్: విద్య విషయంలో రాష్ట్రంపై కేంద్రం వివక్ష చూపిస్తోందని విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ధ్వజమెత్తారు. జాతీయ సంస్థల కేటాయింపులో ప్రతి సారీ రాష్ట్రానికి మొండిచేయి చూపుతోందన్నారు. ‘విద్య, వైద్య రంగాల బలోపేతం కోసం ప్రభుత్వం చేపట్టిన చర్యలు, పురోగతి’పై శుక్రవారం శాసనసభలో జరిగిన చర్చకు ఆమె బదులిచ్చారు. ‘రాష్ట్ర ప్రభుత్వం 2014 నుంచి 2020 వరకూ విద్యపై రూ.96 వేల కోట్లు ఖర్చు చేసిందని కాగ్ వెల్లడించింది. ఈ ఏడాది రూ.29 వేల కోట్లు ఖర్చు చేశాం. తెలంగాణ వచ్చాక 1,342 గురుకులాలు ఏర్పాటు చేశాం. ఉన్నత విద్యకు రూ.17 వేల కోట్లు ఖర్చు చేశాం. ఫలితంగా రాష్ట్రంలో విద్యార్థుల ప్రవేశాల రేటు 36.2 శాతం ఉంది. ఇది జాతీయ సగటు కన్నా ఎక్కువ..’అని సబిత తెలిపారు. -
వర్షాలు, వరదల్లో దెబ్బతిన్న ఇళ్లకు ‘గృహలక్ష్మి’
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదలతో పూర్తిగా ధ్వంసమైన 419 ఇళ్లకు గృహలక్ష్మి పథకం వర్తింపజేయాలని, పాక్షికంగా దెబ్బతిన్న 7,505 ఇళ్లకు తగిన విధంగా పరిహారం ఇవ్వాలని సీఎం కేసీఆర్ ఆదేశించారని రాష్ట్ర శాసనసభ వ్యవహారాలు, రోడ్లు–భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి చెప్పారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో భారీ వర్షాలు, వరదలతో మృతిచెందినవారి కుటుంబాలకు రూ.4 లక్షల చొప్పున పరిహారం అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని తెలిపారు. గురువారం శాసనమండలిలో ‘భారీ వర్షాల పర్యవసానాలు, ప్రభుత్వం చేపడుతున్న చర్యల’పై నిర్వహించిన లఘు చర్చకు మంత్రి ప్రశాంత్‌రెడ్డి సమాధానమిచ్చారు. వరదల సమయంలో ప్రతిపక్షాలు బురద రాజకీయాలు చేస్తున్నాయని మండిపడ్డారు. కేంద్రం ఆదుకోకున్నా.. 2020లో, తర్వాత రాష్ట్రం వరదలతో నష్టపోతే కేంద్ర ప్రభుత్వం ఏమాత్రం ఆదుకోలేదని.. అయినా సీఎం కేసీఆర్ ధైర్యం కోల్పో కుండా పకడ్బందీగా సహాయ, పునరావాస కార్యక్రమాలు చేపట్టారని వేముల ప్రశాంత్‌రెడ్డి పేర్కొన్నారు. గతంలో ఇళ్లు నీట మునిగిన వారికి రూ.10 వేల చొప్పున రాష్ట్ర సర్కారే ఆర్థిక సాయం చేసిందని చెప్పారు. గతంలో భారీ వర్షాలకు నాలుగున్నర లక్షల ఎకరాల్లో పంటనష్టం వాటిల్లితే.. రాష్ట్ర ప్రభుత్వం ఎకరానికి రూ.10వేల ఆర్థిక సా యాన్ని ప్రకటించిందని గుర్తు చేశారు. అందులో ఇప్పటివరకు రూ.150 కోట్లు చెల్లించిందని, త్వరలోనే మిగతా రూ.300 కోట్ల ను చెల్లించనున్నామని తెలిపారు. ప్రస్తుత వరదల నేపథ్యంలోనూ సీఎం కేసీఆర్ ప్రజలకు భరోసానిచ్చేలా రూ.500 కోట్ల తక్షణ సాయాన్ని ప్రకటించారని చెప్పారు. సీఎం కేసీఆర్ నిరంతర సమీక్ష తెలంగాణలో ఎన్నడూ లేనంత భారీ వర్షా లు నమోదయ్యాయని, ఈ వానలు, వరదలపై సీఎం కేసీఆర్ నిరంతరం సమీక్షించార ని వేముల ప్రశాంత్‌రెడ్డి చెప్పారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఉన్నతాధికారులతో అర్ధరాత్రి దాకా గంటలకొద్దీ సమీక్షలు, ప్రాజెక్టుల వారీగా పరిశీలనలతో ఆస్తి, ప్రాణనష్టం తగ్గించగలిగామని వివరించా రు. వరద ప్రాంతాలకు సీఎం రాలేదన్న వి మర్శలు సరికాదని.. సీఎం కేసీఆర్ ఫొటోల కవరేజీ కోసం ఫోజులిచ్చే నాయకుడు కాద ని, ఆయన ప్రజల కోసం పనిచేసే నాయకుడని పేర్కొన్నారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, అగి్నమాపక బృందాలను పురమాయించి. మంత్రులు, కలెక్టర్లు, అధికారులను సహాయ, పునరావాస కార్యక్రమాల్లో నిమగ్నం చేయడంలో కేసీఆర్ కీలకపాత్ర పోషించారని చెప్పారు. వరదలతో కోతకు గురైన భూములపై సర్వే చేయాలని ఆదేశించారని తెలిపారు. నష్టంపై పూర్తి అంచనాలు అందాక ఆర్థిక సాయంపై సీఎం తగిన నిర్ణయం ప్రకటిస్తారని వివరించారు. సీఎం కేసీఆర్ ముందుచూపుతో చేపట్టిన మిషన్ కాకతీయ పనులతో చెరువుల అలుగులు పటిష్టమై, కాలువల కట్టలు బలపడటంతో ఎక్కువ నష్టం జరగలేదని పేర్కొన్నారు. వరదలు, వానల నష్టం ఇదీ.. రాష్ట్రంలో వరంగల్ కార్పొరేషన్, నిర్మల్, పరకాల, కోరుట్ల, భూపాలపల్లి, జమ్మి కుంట, ఖమ్మం కార్పొరేషన్, మహబూ బాబాద్, భైంసా, నిజామాబాద్ కార్పొరేషన్, పెద్దపల్లి, నర్సంపేటలలో అధిక నష్టం సంభవించిందని మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి శాసన మండలిలో చెప్పారు. 141 పురపాలికల్లో ముందస్తు, సహాయ చర్యలు చేపట్టామని, తాత్కాలిక మరమ్మతులకు రూ.76 కోట్లు అవసరమని అంచనా వేశామని తెలిపారు. దెబ్బతిన్న రోడ్లు, డ్రెయిన్లు, కల్వర్టులు, వీధి దీపాల శాశ్వత పునరుద్ధరణకు మొత్తం రూ.304 కోట్లు, యూఎల్బీల పునరుద్ధరణ పనులకు రూ.380 కోట్లు అవసరమన్నారు. ఇక గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో రోడ్ల పునరుద్ధరణ కోసం రూ.255.66 కోట్లతో ప్రతిపాదనలు పంపామని, అవి మంజూరు దశలో ఉన్నాయని మంత్రి తెలిపారు. సహాయ చర్యల్లో భాగంగా 1,500 మందిని కాపాడామని మంత్రి చెప్పారు. 139 గ్రామాలకు చెందిన 27,062 మందికి 157 సహాయ శిబిరాల్లో ఆశ్రయం కలి్పంచామని.. తాగునీరు, ఆహారం, దుప్పట్లు, మందులు సరఫరా చేశామని వివరించారు. ములుగు జిల్లా కొండాయి గ్రామానికి హెలికాప్టర్ ద్వారా ఆహారం, మందులు పంపామన్నారు. 64 గ్రామాలు/ప్రదేశాలలో నీటిపైపులు దెబ్బతిని.. 1,199 జనావాసాలు 25,418 కుటుంబాలపై ప్రభావం పడగా.. వందశాతం తాగునీటి పునరుద్ధరణ జరిగిందని చెప్పారు. 773 గ్రామాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడగా.. 769 గ్రామాల్లో పునరుద్ధరించామని మంత్రి తెలిపారు. 23,075 స్తంభాలు, 3,405 డీటీఆర్లు దెబ్బతిని దాదాపు రూ.62.98 కోట్ల నష్టం జరిగిందని వివరించారు. -
అప్పటిదాకా లోక్‌సభకు రాను: స్పీకర్ ప్రకటన
ఢిల్లీ: మణిపూర్ అంశంతో పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ముందుకు సాగడం లేదు. ఈ తరుణంలో ఇవాళ(బుధవారం) కూడా ఆందోళనలు కొనసాగాయి. అయితే లోక్‌సభ జరుగుతున్న తీరుపై స్పీకర్ ఓం బిర్లా ఆవేదన వ్యక్తం చేశారు. సభ్యుల ప్రవర్తనలో మార్పు వచ్చేంత వరకు తాను సభలో అడుగుపెట్టబోనంటూ ప్రకటించారాయన. ఓవైపు అధికార పక్షం, మరోవైపు విపక్ష సభ్యులపైనా స్పీకర్ ఓం బిర్లా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సభ కార్యకలాపాలు జరగకుండా ఇరు పక్షాలు వ్యవహరిస్తున్నాయని మండిపడ్డారాయన. ఈ క్రమంలో ఇవాళ్టి సెషన్‌కు సైతం ఆయన హాజరు కాలేదు. అధ్యక్ష స్థానంలో మరొకరు బాధ్యతలు నిర్వహించారు కూడా. అయితే.. ఎంపీలు సభ గౌరవానికి అనుగుణంగా నడుచుకున్నప్పుడే తాను తిరిగి సభలో అడుగుపెడతానంటూ ప్రకటించారాయన. ఇక మణిపూర్ నినాదాల నడమే ఇవాళ్టి లోక్‌సభ జరగలేదు. రేపటికి సభ వాయిదా పడింది. మణిపూర్ అంశంపై సుదీర్ఘ చర్చ జరగాలనిRule 267.. ప్రధాని మోదీ మాట్లాడాలని విపక్ష సభ్యులు డిమాండ్ చేస్తుండగా.. స్వల్పకాలిక చర్చతోRule 176 సరిపెడతామని, అదీ కేంద్ర హోం మంత్రి అమిత్ షా మాట్లాడతారంటూ కేంద్రం చెబుతోంది. Lok Sabha Speaker Om Birla has expressed deep displeasure with both the ruling party and the opposition over the functioning of the House. Birla told both sides that he will not come to Lok Sabha until MPs behave according to the dignity of the House. Even today, when the… — ANI (@ANI) August 2, 2023 -
‘ఏపీకి తెలంగాణ ఇవ్వాల్సిన విద్యుత్ బకాయిలను RBI ద్వారా ఇప్పిస్తాం’
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్టానికి తెలంగాణ ఇవ్వాల్సిన విద్యుత్ బకాయిలను ఆర్బీఐ ద్వారా ఇప్పిస్తామని కేంద్రం వెల్లడించింది. రాజ్యసభలో ఎంపీలు విజయసాయి రెడ్డి, జీవీఎల్ నరసింహారావు ప్రశ్నకు కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్కే సింగ్ సమాధానం చెప్పారు. రూ. 6 వేల కోట్ల పైచిలుకు విద్యుత్ బకాయిలను తెలంగాణ నుంచి ఇప్పించే ప్రయత్నం చేస్తున్నామని పేర్కొన్నారు. ఈ అంశంపై కేంద్ర న్యాయశాఖ, ఆర్థిక శాఖతో చర్చిస్తున్నామని తెలిపారు. ఆర్బీఐలో తెలంగాణ ప్రభుత్వ ఖాతా నుంచి ఈ బకాయిల మొత్తాన్ని చెల్లింపచేసేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు కేంద్ర మంత్రి. విభజన సమయంలో తెలంగాణకు ఏపీ విద్యుత్తు సరాఫరా చేసిందని..కానీ తెలంగాణ నుంచి చెల్లింపులు జరగలేదని పేర్కొన్నారు. బకాయిలను వెంటనే చెల్లించాలని కేంద్ర ప్రభుత్వం తెలంగాణను ఆదేశించిందని.. అయితే రాష్ట్ర సర్కార్ కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకుందని చెప్పారు. ఇప్పుడు ఆ స్టే గడువు తీరిందని.. అయినప్పటికీ తెలంగాణ ప్రభుత్వం చెల్లింపులకు ముందుకు రావడం లేదని తెలిపారు. ఈ నేపథ్యంలో ఆర్బీఐ వద్ద ఉన్న తెలంగాణ ఖాతా నుంచి బకాయిలను ఏపీకి ఇప్పించేందుకు ప్రయత్నిస్తున్నామని.. కేంద్ర న్యాయ శాఖ, ఆర్థిక శాఖ సహకారంతో త్వరలోనే ఏపీ బకాయిలు ఇప్పిస్తామని వెల్లడించారు. చదవండి: టీడీపీ నేత రాయపాటి సాంబశివరావు ఇంట్లో ఈడీ సోదాలు -
సీబీఐ చేతికి.. మణిపూర్ మహిళలను ఊరేగించిన కేసు..!
ఢిల్లీ: మణిపూర్‌లో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ అంశంపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ కేసును సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వేస్టిగేషన్(సీపీఐ)కి అప్పగించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ మేరకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఈ కేసును సీబీఐకి బదిలీ చేశారని చెప్పారు. గత మూడు నెలలపాటు మణిపూర్‌లో జరిగిన హింసాకాండకు సంబంధించిన పలు కేసులను రాష్ట్రం వెలుపల కూడా విచారణ జరపడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. మణిపూర్‌లో రెండు జాతుల మధ్య అల్లర్లు హింసాత్మకంగా మారాయి. గత మూడు నెలలుగా అల్లర్లలో అమానవీయ ఘటనలు ఎన్నో జరిగాయి. మహిళలపై అత్యాచారాలు, లూఠీలు, దొంగతనాలు, సహా దారిదోపిడీల వరకు అనేక కేసులు పలు పోలీసు స్టేషన్లలో నమోదయ్యాయి. ఈ క్రమంలోనే అల్లర్లలో ఆందోళనకారులు దేశమంతా తలదించుకునే సంఘటన మే 3న జరిగింది. దీనికి సంబంధించిన వీడియో కూడా బయటకొచ్చింది. ఇద్దరు మహిళలను అల్లరిమూకలు నగ్నంగా ఊరేగించారు. అనంతరం వారిపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటనతో దేశం ఉలిక్కిపడింది. అటు రాజకీయంగా కూడా దుమారాన్ని రేపింది. ప్రతిపక్షాలు కేంద్రాన్ని నిందించాయి. కేంద్ర ప్రభుత్వ వైఖరి వల్లే మణిపూర్ ఈ దుస్థితికి చేరిందని ఆరోపించాయి. పార్లమెంట్ సమావేశాల్లోనూ ఈ అంశంపై ప్రత్యేకంగా చర్చించాలని పట్టుబడుతున్నాయి. గత వారం రోజులుగా ఈ అంశంపైనే పార్లమెంట్ సమావేశాలు ప్రతిపక్షాల ఆందోళనలతో వాయిదా పడుతూ వస్తున్నాయి. ఇదీ చదవండి: కెమెరా సాక్షిగా మణిపూర్‌లో జవాన్ వికృత చేష్టలు.. మహిళను బయటకు లాగి.. -
జమిలి ఎన్నికలపై కేంద్రం కీలక వ్యాఖ్యలు..
ఢిల్లీ: జమిలి ఎన్నికలు అనే అంశం ప్రస్తుతం లా కమిషన్ పరిశీలనలో ఉన్నట్లు కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ తెలిపారు. లోక్ సభకు, రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు జరిపే అంశంపై సాధ్యాసాధ్యాలను లా కమిషన్ పరిశీలిస్తోందని స్పష్టం చేశారు. జమిలీ ఎన్నికల కోసం ఆచరణాత్మక రోడ్ మ్యాప్, ఫ్రేమ్ వర్క్‌ను తయారు చేస్తున్నట్లు చెప్పారు. ఈ మేరకు జమిలి ఎన్నికల అంశంపై ప్రతిపక్షాలు అడిగిన ప్రశ్నకు కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ సమాధానమిచ్చారు. న్యాయ శాఖ స్టాండింగ్ కమిటీ కూడా జమిలి ఎన్నికల అంశంపై పరిశీలన చేసిందని అర్జున్ రామ్ స్పష్టం చేశారు. ఎన్నికల సంఘం సహా వివిధ భాగస్వాములతో చర్చలు జరిపిందని పేర్కొన్నారు. జమిలీ ఎన్నికలు అనే అంశం దేశాన్ని భాజపా నేతృత్వంలోని కేంద్రం తెరమీదకు తీసుకువచ్చింది. ఎన్నికలను దేశమంతా ఒకేసారి జరపాలనే ప్రతిపాదన ఎంత వరకు సాధ్యమవుతుంది? అనే అంశంపై పరిశీలన చేస్తున్నారు. అయితే.. ఈ అంశం గతంలోనూ రాజకీయ వివాదానికి తెరతీసింది. ఒకేసారి ఎన్నికలు జరిపితే.. పలు ప్రాంతీయ పార్టీల భవితవ్యం ప్రశ్నార్థకం అవుతుందని మేధావులు గతంలో అభిప్రాయపడ్డారు. ఇదీ చదవండి: శుభకార్యాల్లో సినిమా పాటలు.. కాపీ రైట్ కిందకు వస్తుందా..? కేంద్రం ఏం చెప్పింది..? -
మణిపూర్‌పై ఆరని మంటలు .. ప్రతిపక్షాలకు అమిత్ షా కీలక లేఖ
న్యూఢిల్లీ: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలను మణిపుర్ అల్లర్ల అంశం కుదిపేస్తోంది. మణిపూర్‌లో జరుగుతున్న హింసాకాండపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటన చేయాల్సిందేనని ప్రతిపక్షాల కూటమి పట్టుబడుతుండటంతో ఉభయ సభల్లో వాయిదాల పర్వం కొనసాగుతోంది. మణిపూర్ ఘటనపై చర్చించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని కేంద్రం తరపున మంత్రులు పదేపదే విజ్ఞప్తి చేస్తున్నా.. విపక్షాలు శాంతించడం లేదు. ప్రతిపక్ష పార్టీలన్నీ ఏకమై ఉమ్మడిగా నిరసన వ్యక్తం చేస్తూ.. సభా కార్యకలాపాలకు అడ్డుపడ్డుతున్నాయి. తాజాగా పార్లమెంట్ సమావేశాల్లో మణిపూర్ సమస్యపై విపక్షాలు చేస్తున్న ఆందోళనపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా తీవ్ర అగ్రహం వ్యక్తం చేశారు. మణిపూర్ అంశంపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని మరోసారి స్పష్టం చేస్తూ.. పార్లమెంట్ ఉభయసభలకు చెందిన పత్రిపక్ష నేతలకు మంగళవారం ఆయన లేఖ రాశారు. (పార్లమెంట్లో మణిపూర్ రగడ.. ప్రతిపక్షాలపై మోదీ సంచలన వ్యాఖ్యలు) ఈ మేరకు లోక్‌సభలో అమిత్ షా మాట్లాడుతూ..‘ప్రతిపక్షాలకు ప్రభుత్వానికి సహకరించాలనే ఆసక్తి లేదు. దళితులపైనా, మహిళల సంక్షేమంపైనా వారికి ధ్యాస లేదు. వారి చర్యలతో విపక్షాల నినాదాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. మణిపూర్‌పై సమగ్ర చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఉభయ సభల్లోని ప్రతిపక్ష నేతలకు లేఖ రాశాను.ఈ విషయంపై మాట్లాడేందుకు ప్రభుత్వానికి ఎలాంటి భయం లేదు. చర్చించాలనుకునే వారెవరికైనా స్వాగతం. ఇందులో దాచాల్సింది ఏది లేదు. ఏం జరుగుతుందో ప్రజలందరూ చూస్తున్నారు. ఈ సున్నితమైన అంశంపై చర్చకు అనువైన వాతావరణం కల్పించండి’ అని కేంద్రమంత్రి పేర్కొన్నారు. చదవండి: చంద్రయాన్-3 ప్రయాణంలో కీలక దశ.. భూకక్ష్య నుంచి చంద్రుడి వైపునకు.. #WATCH | I have written to the Leaders of Opposition in both Houses that the government is ready for a discussion on Manipur and urged them to create a conducive atmosphere for a discussion on this sensitive matter: Union Home Minister Amit Shah in Lok Sabha pic.twitter.com/5HsWj6K8MU — ANI (@ANI) July 25, 2023 అదే విధంగా ఏఐసీసీ మల్లికార్జున ఖర్గే(రాజ్యసభ ప్రతిపక్షనేత), కాంగ్రెస్‌నేత అధిర్ రంజన్ చౌదరికి(లోక్‌సభ ప్రతిపక్ష నేత) రాసిన లేఖను ట్విటర్లో షేర్ చేశారు అమిత్ షా.. ‘మణిపూర్ అల్లర్లపై చర్చించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీల నుంచి సహకారం కోరుతున్నాం. ఈ ముఖ్యమైన సమస్యను పరిష్కరించడంలో అన్ని పార్టీలు సహకరిస్తాయని ఆశిస్తున్నాను’ సదరు లేఖలో పేర్కొన్నారు. Today, I wrote to the opposition leaders of both houses, Shri @adhirrcinc Ji of Lok Sabha, and Shri @kharge Ji of Rajya Sabha, appealing to them for their invaluable cooperation in the discussion of the Manipur issue. The government is ready to discuss the issue of Manipur and… pic.twitter.com/IpGGtYSNwT — Amit Shah (@AmitShah) July 25, 2023 కాగా మణిపూర్ హింసాకాండపై ప్రధాని నరేంద్ర మోదీ పార్లమెంటులో మాట్లాడాలని ప్రతిపక్ష ‘ఇండియా’ కూటమిలోని పార్టీలు పట్టుబడుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో లోక్‌సభలో ప్రభుత్వంపై బుధవారం అవిశ్వాస తీర్మానం పెట్టే అవకాశం ఉందని వార్తలు వెలుడిన కొన్ని గంటలకే అమిత్ షా ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఇక మణిపూర్‌లో మే 3న రెండు జాతుల మధ్య చెలరేగిన హింసా నానాటికీ తీవ్రతరం అవుతూ వినాశకరమైన పరిస్థితికి దారితీసింది. ఈ అల్లర్లలో ఇప్పటి వరకు 160 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. -
ఏపీలో లక్షా 20 వేల కోట్లతో సాగరమాల ప్రాజెక్ట్‌లు
న్యూఢిల్లీ: సాగరమాల కింద ఆంధ్రప్రదేశ్‌లో లక్షా 20 వేల కోట్ల రూపాయలతో 113 ప్రాజెక్టులు చేపట్టినట్లు కేంద్ర పోర్టులు, షిప్పింగ్, వాటర్ వేస్ శాఖ మంత్రి సర్భానంద సోనోవాల్ పేర్కొన్నారు. రాజ్యసభలో మంగళవారం విజయసాయి రెడ్డి ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా జవాబిస్తూ ఈ విషయం తెలిపారు. సాగరమాల ప్రోగ్రాం కింద ప్రస్తుతం ఉన్న పోర్టులు, టెర్మినల్స్, రోల్ ఆన్, రోల్ ఆఫ్, టూరిజం జెట్టీల ఆధునీకరణ, పోర్టుల కనెక్టివిటీ, విస్తరణ, ఇన్ ల్యాండ్ వాటర్ వేస్ అభివృద్ధి, స్కిల్ డెవలప్మెంట్ టెక్నాలజీ సెంటర్ల ఏర్పాటు వంటి ప్రాజక్టులు చేపడుతున్నట్లు మంత్రి తెలిపారు. సంబంధిత కేంద్ర మంత్రిత్వ శాఖలు, స్టేట్ మారిటైం బోర్డులు, మేజర్ పోర్టులు, పబ్లిక్ రంగం ప్రైవేటు భాగస్వామ్యంతో స్పెషల్ పర్పస్ వెహికల్ సమన్వయంతో ప్రాజెక్టులను అమలు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. విశాఖ పోర్ట్ అథారిటీ, ఎన్హెచ్ఏఐ, రాష్ట్ర రోడ్ విభాగం, పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్, ఇండియన్ రైల్వే, ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ మంత్రిత్వ శాఖ, గ్రామీణ అభివృద్ధి మంత్రిత్వ శాఖ, విద్యుత్ శాఖ, ఐఆర్ ఎస్, ఏపీ టూరిజం అభివృద్ధి కార్పొరేషన్, ఏపీ మారిటైం బోర్డు మెదలగు సంస్థలు ఇంప్లిమెంటింగ్ ఏజన్సీలుగా వ్యవహరిస్తున్నట్లు మంత్రి తెలిపారు. రాష్ట్రంలో చేపట్టిన మొత్తం ప్రాజెక్టుల్లో ఇప్పటికే 32 వేల కోట్లతో చేపట్టిన 36 ప్రాజక్టులు పూర్తి చేశామని, మిగిలిన రూ.91వేల కోట్లతో చేపట్టిన 77 ప్రాజక్టులు వివిధ దశల్లో ఉన్నట్లు మంత్రి వివరించారు. పోర్టు ఆధునీకరణ, కనెక్టివిటీ పెంపు,పరిసర ప్రాంతాల్లో పరిశ్రమల అభివృద్ధి, కోస్టల్ కమ్యూనిటీ డెవలప్మెంట్, కోస్టల్ షిప్పింగ్, ఇన్ ల్యాండ్ వాటర్ ట్రాన్స్ పోర్ట్ కు సంబంధించి రూ.32210 కోట్లతో చేపట్టిన 36 ప్రాజెక్టులు పూర్తయ్యాయని తెలిపారు. అలాగే రూ.17,741 కోట్లతో చేపట్టిన 27 ప్రాజెక్టులు పురోగతి దశలోనూ, రూ.73527 కోట్లతో చేపట్టిన మిగిలిన 50 ప్రాజెక్టులు అమలు దశలోనూ ఉన్నట్లు మంత్రి తెలిపారు. రైతులకు అందుబాటులో నానో డీఏపీ న్యూఢిల్లీ: నానో డీఏపీని మార్కెట్లోకి ప్రవేశపెట్టి రైతులకు అందుబాటులో ఉంచినట్లు కేంద్ర ఎరువులు, రసాయనాల శాఖ సహాయ మంత్రి భగవంత్ ఖూబా వెల్లడించారు. రాజ్యసభలో శ్రీ విజయసాయి రెడ్డి ప్రశ్నకు ఆయన రాతపూర్వకంగా బదులిస్తూ ఈ విషయం తెలిపారు. ఇఫ్కో సమాచారం ప్రకారం నానో డీఏపీ ద్రవరూపంలో ఉండగా, సాంప్రదాయ డీఏపీ కణికల రూపంలో ఉంటుందని తెలిపారు. నానో డీఏపీ విత్తనాలు, వేర్లు, ఆకులకు అందేలా వినియోగించగా, సాంప్రదాయ డీఏపీ మట్టిలో మాత్రమే వినియోగిస్తారని తెలిపారు. వినియోగ సామర్థ్యం 20%-30%గా ఉన్న సాంప్రదాయ డీఏపీతో పోలిస్తే నానో డీఏపీ వినియోగ సామర్థ్యం 80%-90% ఉంటుందని అన్నారు. సాంప్రదాయ డీఏపీకి రాయితీ అందిస్తుండగా, నానో డీఏపీకి మాత్రం సబ్సిడీ లేదని తెలిపారు. -
కేంద్రానికి సుప్రీంకోర్టు మొట్టికాయలు
న్యూఢిల్లీ: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై సుప్రీంకోర్టు తీవ్రస్థాయిలో మండిపడింది. బీజేపీ పాలిత రాష్ట్ర ప్రభుత్వాలపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని కేంద్రాన్ని ప్రశ్నించింది. నాగాలాండ్‌లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమవడంపై సర్వోన్నత న్యాయస్థానం స్పందిస్తూ.. కేంద్రానికి చీవాట్లు పెట్టింది. కాగా నాగాలాండ్ స్థానిక సంస్థల ఎన్నికల్లో మహిళలకు 33% రిజర్వేషన్ కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వంతోపాటు రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు సుప్రీంకోర్టు గతంలో ఆదేశాలు ఇచ్చింది. అయితే వీటిని పాటించడం లేదంటూ దాఖలైన ధిక్కార పిటిషన్ విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు తాజాగా ఈ వ్యాఖ్యలు చేసింది. సొంత పార్టీ అధికారంలో రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ఎందుకు వ్యవహరించడం లేదని ప్రశ్నించింది అత్యున్నత న్యాయస్థానం. ఇతర రాష్ట్ర ప్రభుత్వాలపై తీవ్ర నిర్ణయాలు తీసుకుంటారు. అదే రాష్ట్రంలో మీ(బీజేపీ) ప్రభుత్వం అధికారంలో ఉంటే ఏ చర్యలు ఉండవని సుప్రీం ఘాటు వ్యాఖ్యలు చేసింది. రిజర్వేషన్ అనేది నిశ్చయాత్మక చర్య అని, దీని ఆధారంగా మహిళా రిజర్వేషన్ ఉంటుందని కోర్టు పేర్కొంది. రాజ్యాంగ నిబంధనను ఉల్లఘించి ఎలా వ్యవహరిస్తారనేది అర్థం కావడం లేదని జస్టిస్ ఎస్కే కౌల్ అన్నారు. నాగాలాండ్ మహిళల విద్య, ఆర్థిక, సామాజిక స్థితిగతులు అత్యుత్తమంగా ఉన్న రాష్ట్రం అని.. మహిళలకు రిజర్వేషన్లు ఎందుకు అమలు చేయలేకపోతున్నారనేది అర్థం కావడం లేదని అన్నారు. విచారణ సందర్భంగా బీజేపీ పాలిత మణిపూర్‌లో జరిగిన హింసాకాండను కూడా ఆయన ప్రస్తావించారు. చదవండి: మణిపూర్‌లో మరోసారి ఇంటర్నెట్ వినియోగంపై ఆంక్షలు -
మణిపూర్ అంశంపై తెరమీదకు రూల్ నెం.176 Vs 267.. అసలేంటివి?
ఢిల్లీ: మణిపూర్ అంశంపై నేడు పార్లమెంట్ ఉభయ సభల్లో గందరగోళం నెలకొంది. ఈ అంశంపై చర్చించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేయగా కేంద్రం కూడా అందుకు సమ్మతించింది. కానీ రూల్ నెంబర్ 267 కింద మణిపూర్ అంశాన్ని చర్చించాలని ప్రతిపక్షాలు కోరగా.. కేంద్రం మాత్రం రూల్ నెంబర్ 176 కింద చర్చిస్తామని స్పష్టం చేసింది. మణిపూర్ అంశంపై అరగంట చర్చ సరిపోదని, రూల్ 267 కింద చర్చ జరపాలని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే డిమాండ్ చేశారు. కేంద్రం ఇందుకు అంగీకరించడం లేదని ఆరోపించారు. అయితే.. ప్రతిపక్షాలు పదే పదే తమ నిర్ణయాన్ని మారుస్తున్నాయని కేంద్రం మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ అన్నారు. కేవలం ప్రధాని మోదీ వచ్చి ప్రకటన ఇవ్వాలని కోరుతున్నాయని చెప్పారు. మణిపూర్ అంశంపై చర్చించే ఆసక్తి ప్రతిపక్షాలకు లేదని కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆరోపించారు. అసలు ఈ రూల్ నెంబర్ 176, 267 రెండు నిబంధనల మధ్య ఉన్న తేడా ఏంటీ? #WATCH | Defence Minister Rajnath Singh on the Manipur violence says, "I feel the opposition is not serious about the discussion on the Manipur issue. The government wants to discuss the Manipur issue. PM Modi himself said that the country is ashamed of whatever has happened in… pic.twitter.com/GlTZ3sj9uM — ANI (@ANI) July 21, 2023 ఇదీ చదవండి: మణిపూర్ ఘటన:. ప్రధాన నిందితుడి ఇంటిని తగలబెట్టి.. కుటుంబాన్ని బహిష్కరించిన గ్రామస్తులు రూల్ 267 ప్రకారం.. రాజ్య సభ నిబంధనల ప్రకారం రూల్ 267కు ప్రత్యేక వెసులుబాటు ఉంటుంది. దేశం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య మీద ప్రత్యేకంగా చర్చ జరపాలని సభ్యులు కోరవచ్చు. ఇందుకు ఆ రోజు సభలో చర్చించాల్సిన అంశాలకు సంబంధించి ఇతర సభ్యులు ఇచ్చిన నోటీసులు తాత్కాలికంగా రద్దు చేయాలని కోరుబడతాయి. ప్రత్యేక చర్చకు సభ్యుడు నోటీసు ఇస్తే.. స్పీకర్ అనుమతించాల్సి ఉంటుంది. సభ్యులు అడిగిన ప్రశ్నలకు తప్పనిసరిగా సమాధానాన్ని రాతపూర్వకంగా కానీ, ఓరల్గానీ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ చర్చలో సభ్యులు ఏ అంశంపైనైనా అడగవచ్చు. 1990 నుంచి 2016 వరకు కేవలం 11 సార్లు మాత్రమే ఈ రూల్ కింద చర్చ జరిగింది. రూల్ 176 ప్రకారం.. ఈ రూల్ ప్రకారం చర్చ అరగంట నుంచి రెండున్నర గంటలపాటు మాత్రమే ఉంటుంది. సభలోని ప్రతి సభ్యుడు ప్రజా ప్రాముఖ్యత కలిగిన అంశంపై చర్చించేందుకు నోటీసు ఇస్తున్నట్లు రాజ్యసభ సెక్రటరీ జనరల్‌కు లేఖ రాయాల్సి ఉంటుంది. ఆ నోటీసుకు మద్దతుగా ఇద్దరు సభ్యులు సంతకాలు చేయాలి. ఈ నోటీసు ఇచ్చిన కొద్ది గంటల వ్యవధిలో లేదా మరుసటి రోజు స్పీకర్ పరిగణనలోకి తీసుకోవచ్చు. ఇదీ చదవండి: సుప్రీంలో రాహుల్ గాంధీ పిటిషన్.. పలువురికి నోటీసులు.. బెంచ్ ఆసక్తికర వ్యాఖ్యలు -
చీతాల మరణాలపై సుప్రీంకోర్టు ఆందోళన.. కేంద్రానికి ప్రశ్నల వర్షం
న్యూఢిల్లీ: కునో నేషనల్ పార్కులో చీతాల వరుస మరణాలపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. విదేశాల నుంచి తీసుకొచ్చిన చీతాలు ఒక్కొక్కటిగా మృత్యువాత పడుతుండటంతో వాటి పరిరక్షణకు సానుకూల చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని కోర్టు ఆదేశించింది.. చీతాల మృతికి సంబంధించి దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు జడ్జీలు.. బీఆర్ గవాయ్, జేబీ పార్దివాలా, ప్రశాంత్ కుమార్ మిశ్రాలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. ఈ మేరకు కేంద్రంపై న్యాయస్తానం పలు ప్రశ్నలు సంధించింది. కాగా ప్రాజెక్ట్ చీతాలో భాగంగా దక్షిణాఫ్రికా, నమీబియా నుంచి రెండు విడతల్లో మొత్తం 20 చీతాలను తీసుకొచ్చి మధ్యప్రదేశ్‌లోని కునో జాతీయ పార్కులో విడిచిపెట్టిన విషయం తెలిసిందే. ఇందులో ఓ చీత నాలుగు పిల్లలకుజన్మనివ్వడంతో వీటి సంఖ్య 24కు చేరింది. వీటిలో గత నాలుగు నెల్లలో మూడు కూన చీతాలు సహా 8 మరణించాయి. ప్రస్తుతం 18 చీతాలు ఉండగా వీటిలో మరో రెండిటి ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు సమాచారం. గత వారం రోజుల్లో రెండు చీతాలు మరణించడంపై ధర్మాసనం స్పందిస్తూ.. దీన్ని ఎందుకు ప్రతిష్టాత్మక అంశంగా మారుస్తున్నారని అడిషినల్ సొలిసిటర్ జనరల్ ఐశ్వర్య భాటిని ప్రశ్నించింది. అయితే చీతాలు మృత్యువాత పడుతున్నప్పటికీ వాటిని ఇంకా కునో నేషనల్ పార్క్‌లోనే ఎందుకు ఉంచారని.. వేరే చోటుకు తరలించే ప్రయత్నాలు ఎందుకు చేయడం లేదని ప్రశ్నించింది. చదవండి: వర్ష బీభత్సం.. కొండచరియలు విరిగిపడి 13 మంది మృతి 20 చీతాల్లో 8 మరణించాయి.. అంటే ఏడాదిలో 40శాతం చీతాలు మృత్యువాత పడ్డాయి. ఇది మంచి సంకేతం కాదు. ఎందుకు నివారణ చర్యలు చేపట్టడం లేదని ప్రశ్నించింది. వాటిని రాజస్థాన్‌కు తరలించే మార్గాలను పరిశీలించాలని సూచించింది. అయితే వాతావరణ పరిస్థితులు (ట్రాన్స్‌లోకేషన్) కారణంగా 50 శాతం మరణాలు సాధారణమేనని కేంద్రం ముందుగానే ఊహించిందని కేంద్రం తరఫున ఏసీజీ వాదనలు వినిపించారు. దీనిపై జస్టిస్ పార్దివాలా స్పందిస్తూ.. మరి సమస్య ఏంటి? ఇక్కడి వాతావరణం వాటికి అనుకూలంగా లేదా? కిడ్నీ,శ్వాసకోశ సమస్యలు తలెత్తుతున్నాయా అని ప్రశ్నించారు. అయితే ఇన్ఫెక్షన్లు చీతాల మణాలకు దారి తీస్తున్నాన్నాయని ASG ధర్మాసనానికి తెలియజేశారు. లాగే ప్రతీ చీతా మరణంపై వివరణాత్మక విశ్లేషణ జరుగుతోందని ఆమె పేర్కొన్నారు. అయితే రాజస్థాన్‌లోని అభయారణ్యాలలో ఒకటి చిరుతపులికి ప్రసిద్ధి చెందిందని.. ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకోవాలని కోర్టు కేంద్రానికి సూచించింది. చీతాల మరణానికి గల కారణాలపై పూర్తి వివరాలను సమర్పించాలని కేంద్రాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను ఆగస్టు 1కు వాయిదా వేసింది. -
టమాటల కోసం ఏపీ వైపు కేంద్రం చూపు
ఢిల్లీ: సెంచరీతో మొదలైన ధరల పరుగు.. కిందకు దిగి రావడం లేదు. ఎప్పుడో నెల కిందట.. వారం, పదిరోజుల్లో ధరలు నియంత్రణకు వస్తాయని కేంద్రం ప్రకటించింది. సరిగ్గా అదే సమయంలో భారీ వర్షాలు పెద్ద దెబ్బే వేశాయి. ప్రియమైన టమాటతో పాటు ఇతర కూరగాయల రవాణా నిలిచిపోయి.. ధరల మంట ఇంకా రుగులుతోనే ఉంది. ఈ టైంలో ప్రత్యామ్నాయాల వైపు కేంద్రం అడుగులు వేస్తోంది. టమాట ధరల నియంత్రణలో భాగంగా కేంద్రం ఓ ఆలోచన చేసింది. ఆంధ్రప్రదేశ్‌తో పాటు కర్ణాటక, మహారాష్ట్రల నుంచి టమాటాలను సేకరించి.. అధిక ధరల ప్రాంతాలకు సరఫరా చేయాలని నేషనల్ అగ్రికల్చర్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్, నేషనల్ కో ఆపరేటివ్ కన్జూమర్స్ ఫెడరేషన్లను వినియోగదారుల వ్యవహారాల శాఖ కోరింది. మన దేశంలో ప్రతీ రాష్ట్రంలో టమాట పండిస్తారు. డిసెంబర్-ఫిబ్రవరి టమాటకు మాంచి సీజన్‌కాగా.. జులై-ఆగష్టు, అక్టోబర్-నవంబర్ మధ్య పంట ఉత్పత్తి కాస్త తక్కువే ఉంటుంది. అయితే.. దేశం మొత్తం ఉత్పత్తిలో 60 శాతం దక్షిణ, పశ్చిమ భారతం నుంచే అవుతుంటుంది. ఇక్కడి నుంచే ఇతర రాష్ట్రాలకూ ఒక్కోసారి సరఫరా అవుతుంటుంది కూడా. ప్రస్తుతం గుజరాత్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ నుంచి టమాటలు దేశానికి ఎక్కువగా సరఫరా అవుతున్నాయి. ఢిల్లీ.. సమీప ప్రాంతాలకు హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక నుంచి సరఫరా అవుతున్నాయి. ఏపీలో మదనపల్లె మార్కెట్ టమాట ఉత్పత్తికి ప్రధాన కేంద్రంగా ఉంది. అలాగే ఏపీలో ప్రభుత్వ సబ్సిడీ మీద టమాటలు తక్కువ ధరకే లభిస్తున్నాయి. అంతేకాదు.. బ్లాక్ మార్కెట్‌ను కట్టడి చేయడంలోనూ ఏపీ ప్రభుత్వం విజయవంతమవుతోంది. అధిక ధరలతో పాటు వినియోగదారుల ఉత్పత్తిని సైతం పరిగణనలోకి తీసుకుని.. ఆయా కేంద్రాలకు టమాటాలను తరలించాలని ఆయా ఫెడరేషన్లకు వినియోగదారుల వ్యవహారాల శాఖ సూచించింది. ఇక ఢిల్లీ-ఎన్సీఆర్ పరిధిలో టమాటా ఉత్పత్తులు చేరుకోవడంతో.. శుక్రవారం నుంచి ధరలు అదుపులోకి రానున్నట్లు కేంద్రం అంచనా వేస్తోంది. -
ఆప్‌కు షాక్.. కేంద్రానికి సుప్రీం నోటీసులు
ఢిల్లీ: ప్రభుత్వ అధికారులపై నియంత్రణ విషయంలో కేంద్రం, ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వానికి మధ్య జరుగుతున్న పంచాయితీలో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. కేంద్రం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ విషయంలో.. ఆప్ ప్రభుత్వానికి భారీ షాక్ తగిలింది. ఆర్డినెన్స్ నిలుపుదలకై ఆదేశాలు ఇవ్వలేమని సుప్రీం కోర్టు సోమవారం స్పష్టం చేసింది. అదే సమయంలో ఆప్ పిటిషన్ ఆధారంగా కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. ఐఏఎస్‌లు సహా ప్రభుత్వాధికారుల బదిలీలు, నియామకాలపై స్థానిక ప్రభుత్వానికి అనుకూలంగా ఇది వరకే సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. పాలనాధికారం ఢిల్లీ సర్కార్‌దేనని మే 11ద తేదీ తీర్పులో స్పష్టం చేసింది. ఆపై. కేంద్రం ఆ తీర్పుపై రివ్యూకు వెళ్లడం, ఆ ఆర్డినెన్స్‌ను ఆప్ ప్రభుత్వం సుప్రీంలో సవాల్ చేసింది. ఈ గ్యాప్‌లో లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా 400 మంది రీసెర్చ్ ఆఫీసర్లు, ఇతరులను తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో.. కేంద్రం ఆదేశాలపై రాజ్యాంగ చెల్లుబాటును సవాల్ చేస్తూ సుప్రీంలో మరో పిటిషన్ వేసింది ఆప్ ప్రభుత్వం. సోమవారం ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన సీజేఐ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం.. కేంద్రం ఆదేశాలపై నిలుపుదల ఇవ్వలేమని, అయితే ఈ పిటిషన్లో లెఫ్టినెంట్ గవర్నర్‌ను ఇంప్లీడ్ చేయడానికి నోటీసులు కేంద్రానికి మాత్రం జారీ చేయగలమని పేర్కొంది. అలాగే.. వచ్చే సోమవారం ఈ పిటిషన్‌పై వాదనలు వింటామని తెలిపింది. అంతకు ముందు.. పిటిషనర్ తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ ‘లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ ఓ సూపర్ సీఎంలా వ్యవహరిస్తున్నారని కోర్టుకు తెలిపింది. ► అధికారుల బదిలీలు, నియామకాల విషయంలో లెఫ్టినెంట్ గవర్నర్‌ను తుది మధ్యవర్తిగా చేస్తూ మే 19వ తేదీన ప్రత్యేక ఆర్డినెన్స్‌ను తీసుకొచ్చింది కేంద్రం. ► అయితే.. ఎన్నికైన ప్రభుత్వానికి పరిపాలనపై నియంత్రణ అధికారాలను ఈ ఆర్డినెన్స్ దూరం చేస్తుందని ఢిల్లీ ప్రభుత్వం వాదిస్తూ వస్తోంది. కార్యనిర్వాహక వ్యవస్థ విషయంలో రాజ్యాంగ విరుద్ధమైన చర్యగా ఈ ఆర్డినెన్స్‌ను అభివర్ణించింది. ► ఈ మధ్యలోనే సుప్రీం కోర్టు ఆప్ ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు ఇచ్చింది. అయినప్పటికీ ఎల్జీ సాయంతో కేంద్రం తాను అనుకున్నది చేసుకుంటూ పోతోంది. ► మరోవైపు ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా బీజేపీ వ్యతిరేకా పార్టీల మద్దతు కూడగట్టే పని సైతం చేశారు ఆప్ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్. పలు రాష్ట్రాలు తిరిగి.. ఆయా సీఎంలతో భేటీ అయ్యి మద్దతు కోరారు. అయితే ఈ వ్యవహారంలో కాంగ్రెస్ మాత్రం ఎటూ స్పందించలేదు. ► ఇక.. దీన్నొక చీకటి ఆర్డినెన్స్‌గా పేర్కొంటూ ఆప్.. ఢిల్లీ వ్యాప్తంగా నిరసనలు కొనసాగిస్తూ వస్తోంది. ఇదీ చదవండి: ఆయనే ప్రధాని కావాలని అంతా కోరుకుంటున్నారు! -
‘లాయిడ్స్’ సీఈవోగా శిరీష ఓరుగంటి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఫైనాన్షియల్ సర్వీసుల్లో ఉన్న యూకే సంస్థ లాయిడ్స్ బ్యాంకింగ్ గ్రూప్ హైదరాబాద్‌లోని లాయిడ్స్ టెక్నాలజీ సెంటర్ సీఈవో, ఎండీగా శిరీష ఓరుగంటిని నియమించింది. స్థాపన, దీర్ఘకాలిక వృద్ధి వ్యూహాన్ని ఆమె పర్యవేక్షిస్తారని కంపెనీ తాజాగా ప్రకటించింది. ఇప్పటివరకు ఆమె జేసీపెన్నీ ఎండీగా, కంపెనీ బోర్డ్ మెంబర్‌గా పనిచేశారు. పలు అంతర్జాతీయ సంస్థల్లో కీలక విధులను నిర్వర్తించారు. ఐటీ ఆర్కిటెక్చర్, డేటా ఇంజనీరింగ్, ఫిన్‌టెక్ ఆవిష్కరణలలో విస్తృత అనుభవాన్ని తీసుకు వస్తారని లాయిడ్స్ ఆశాభావం వ్యక్తం చేసింది. -
Tomato price: టమాటో ధర దిగొచ్చేది అప్పుడేనంట!
ఢిల్లీ: సామాన్యుడితో ‘వామ్మో’ అనిపిస్తున్న టమాటో ధర.. ప్రస్తుతం దేశంలోని చాలా చోట్ల సెంచరీ దాటేసింది. కేజీకి మినిమమ్ రూ. 50 నుంచి మొదలై.. కొన్ని ప్రాంతాల్లో అయితే ఏకంగా రూ.120 నుంచి రూ.160 కేజీకి అమ్ముడు పోతూ బెంబేలెత్తిస్తోంది. పోను పోను రేటు పెరుగుతోందే తప్ప.. తగ్గడం లేదు. దీంతో ఈ పరిస్థితి సాధారణం ఎప్పుడవుతుందనే సామాన్యుడు ఆందోళన చెందుతున్నాడు. ఈ నేపథ్యంలో కేంద్రం స్పందించింది. మరో పది, పదిహేను రోజుల తర్వాత ధరలు సాధారణ స్థితికి చేరుకోవచ్చని కేంద్రం అంచనా వేస్తోంది. టమాటో ధరలపై కేంద్ర వినియోగదారుల వ్యవహారాల కార్యదర్శి రోహిత్ కుమార్ మీడియాతో స్పందించారు. ‘‘ప్రజలకు చెబుతోంది ఒక్కటే.. పది, పదిహేను రోజుల్లో ధరలు సాధారణ స్థితికి చేరుకుంటాయి. టమాటో తాజా లోడ్లు ఇతర ప్రాంతాలకు చేరుకోవడానికి కొంత టైం పడుతుంది. ఆ సమయం రెండు వారాలకు మించి ఉండదు. కాబట్టి, పదిహేను రోజుల తర్వాత.. పరిస్థితి మామూలుగా ఉంటుంది. ధరలు కచ్చితంగా దిగొస్తాయని అంటున్నారాయన. ప్రతీ ఏడాది ఈ సమయానికి టమాటో ధరల్లో పెరుగుదల సాధారణంగా ఉండేదేనని.. కానీ, ఈసారి పరిస్థితి ఘోరంగా ఉండడమే అడ్డగోలు ధరలకు కారణమని చెబుతున్నారాయన. ప్రతికూల వాతావరణం, సరఫరాపై పరిమితుల వల్లే ఈసారి ఇలాంటి పరిస్థితి నెలకొందని చెప్పారాయన. కొన్ని రాష్ట్రాల్లో వర్షాల వల్ల పంట దెబ్బ తిందని.. తెగులు సమస్యతో పాటు మరికొన్ని చోట్ల టమాటో లోడ్లు గమ్యస్థానాలకు చేరుకోలేదని చెబుతున్నారాయన. టమాటో విషయంలోనే కాదు.. చాలా వరకు కూరగాయల విషయంలో ఇదే జరుగుతోందని చెప్తున్నారాయన. ఈ తరుణంలో.. ధరల నియంత్రణకు సరైన చర్యలు చేపట్టాలని రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు సూచిస్తున్నారాయన. ఇదీ చదవండి: మార్కెట్లో ఏది ముట్టుకున్నా.. మంటే! -
AP: ఎట్టకేలకు సీఆర్డీఏలో పేదలకు ఇళ్లు
సాక్షి, అమరావతి: న్యాయస్థానాల్లో పోరాటం చేసి సీఆర్డీఏ పరిధిలో పేదలకు ఇళ్ల స్థలాల పట్టాలు ఇచ్చినప్పటికీ.. ఆ ఇళ్లు మంజూరు చేయవద్దని ఎంపీ రఘురామకృష్ణరాజుతో పాటు టీడీపీ నేతలు కేంద్రానికి లేఖలు రాసినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం కృషితో సీఆర్డీఏ పరిధిలో పేదలకు 47 వేలకుపైగా ఇళ్లను కేంద్రం మంజూరు చేసింది. కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాలశాఖ ఆధ్వర్యంలోని కేంద్ర మంజూరు, పర్యవేక్షణ కమిటీ (సెంట్రల్ సాంక్షనింగ్ అండ్ మానిటరింగ్ కమిటీ) సోమవారం సమావేశమై సీఆర్డీఏ పరిధిలో 47 వేలకుపైగా పేదల గృహాలను మంజురు చేసింది. ఈ విషయాన్ని రాష్ట్ర గృహనిర్మాణ శాఖ ప్రత్యేక సీఎస్ అజయ్ జైన్ వెల్లడించారు. న్యాయస్థానాల్లో కేసులున్నాయని, సీఆర్డీఏ పరిధిలో పేదలకు ఇళ్లు మంజూరు చేయవద్దని ఓ పార్టీ ఎంపీలు కొందరు కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాలశాఖకు లేఖలు రాశారని చెప్పారు. ఈ నేపథ్యంలో ఈ రోజు సమావేశ అజెండాలో ఈ ఇళ్ల మంజూరు ఉంటుందా ఉండదా? అనే అనుమానాలు కూడా కలిగాయన్నారు. కొంతమంది ఎంపీలు చేసిన వాదనల్లో వాస్తవం లేదని, ఎటువంటి కోర్టు కేసులు లేవని రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాలశాఖ దృష్టికి తీసుకెళ్లి ప్రత్యేకంగా కృషిచేసిందని చెప్పారు. దీంతో సోమవారం జరిగిన కమిటీ సమావేశంలో సీఆర్డీఏ పరిధిలోని 47 వేలకుపైగా పేదల ఇళ్లను మంజూరు చేసిందని తెలిపారు. ఇంకా మూడువేల ఇళ్లకు కేంద్రం నుంచి మంజూరు రావాలని, వాటికి కూడా త్వరగా వచ్చేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు సీఆర్డీఏ పరిధిలో పేదల ఇళ్ల నిర్మాణాలను జూలై 8వ తేదీన ప్రారంభిస్తామని తెలిపారు. తొలినుంచి సీఆర్డీఏ పరిధిలో పేదలకు ఇళ్లస్థలాలు ఇస్తే సామాజిక సమతుల్యత దెబ్బతింటుందని టీడీపీ నేతలు న్యాయస్థానాల్లో కేసులు వేసి అడ్డుపడుతూ వచ్చారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం సీఆర్డీఏ పేదల కోసం చట్టసవరణ కూడా చేసి, న్యాయస్థానాల్లో పోరాటం చేసి న్యాయస్థానాల అనుమతితోనే సీఆర్డీఏ పరిధిలోని పేదలకు ఇళ్లస్థలాల పట్టాలను పంపిణీ చేసింది. గత నెల 26న 50,793 ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన సీఎం జగన్ న్యాయస్థానాల్లో పోరాటం అనంతరం గత నెల 26వ తేదీన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఆర్డీఏ పరిధిలోని 50,793 మంది అక్కచెల్లెమ్మలకు ఇళ్ల పట్టాలను పంపిణీ చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ ఇదే అమరావతి ఇకమీదట ఒక సామాజిక అమరావతి అవుతుందని, ఇకపై మనందరి అమరావతి అవుతుందని వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. మంగళగిరి, తాడికొండ నియోజకవర్గాల పరిధిలో 1,400 ఎకరాల్లో 25 లే అవుట్లు వేసి ఈ పట్టాలు పంపిణీ చేశారు. ఇదీ చదవండి: చర్యలు తీసుకుంటే వేధింపులేనా రామోజీ? -
పని ఒత్తిడి తట్టుకోలేక ఏడ్చేసిన మహిళా ఉద్యోగి
-
వణికిస్తున్న వడగాల్పులు.. పిట్టల్లా రాలుతున్న జనం.. కేంద్రం అలర్ట్..!
ఢిల్లీ: ఉత్తర భారతంలో వడగాల్పులు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఉత్తరప్రదేశ్, బిహార్ వంటి రాష్ట్రాల్లో ఎండల తీవ్రతకు మరణాల సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతోంది. దీంతో కేంద్రం అప్రమత్తమైంది. వడగాల్పులపై కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవీయ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఆయా రాష్ట్రాలకు ఐదుగురు సభ్యుల బృందాన్ని పంపిస్తున్నట్లు పేర్కొన్నారు. వడగాల్పుల తీవ్రత నుంచి బయటపడటానికి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ఇప్పటికే తగు సూచనలు చేసినట్లు చెప్పారు. ప్రజలను రక్షించడానికి కావాల్సిన తగు చర్యలు తీసుకుంటున్నట్లు స్పష్టం చేశారు. వడదెబ్బతో ఎవరూ మరణించకుండా జాగ్రత్తలు తీసుకుంటామని చెప్పారు. ఉత్తరప్రదేశ్, బిహార్, హర్యానా తమిళనాడు, మధ్యప్రదేశ్, జార్ఖండ్, విదర్భ, ఒడిశా, పశ్చిమ బెంగాల్, ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణల్లో విపరీతంగా వడగాల్పులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. గత కొన్ని రోజులుగా దేశంలో వడగాల్పుల తీవ్రత చాలా ఎక్కువగా ఉంటోంది. చాలా రాష్ట్రాల్లో మోతాదుకు మించి ఎండలు నమోదవుతున్నాయి. ఉత్తరప్రదేశ్‌లో మూడు రోజుల్లోనే ఒకే జిల్లాలో 54 మంది మృతి చెందారు. 400 మంది అస్వస్థతకు గురయ్యారు. ఉత్తరప్రదేశ్, బిహార్, ఒడిశాల్లో ఎండల దృష్ట్యా వేసవి సెలవులను కూడా ప్రభుత్వం పొడిగించింది. ఇదీ చదవండి: రాజకీయ వివాదాల నడుమ.. ‘అందరికీ ఉచితంగా గుర్బానీ’ బిల్లు ఆమోదం -
తెలంగాణకు 2,486 కోట్లు.. ఏపీకి 4,787 కోట్లు
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక శాఖ రాష్ట్ర ప్రభుత్వాలకు మూడో విడత పన్నుల వాటాను సోమ వారం విడుదల చేసింది. అన్ని రాష్ట్రాలకు కలిపి మొత్తంగా రూ.1,18,280 కోట్ల మేర నిధులను విడుదల చేసినట్లు ఆర్థిక శాఖ ప్రకటించింది. ఇందులో తెలంగాణకు రూ.2,486 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌కు రూ.4,787 కోట్ల నిధు లను విడుదల చేసింది. రాష్ట్రాలు తమ మూలధనం, అభివృద్ధి వ్యయాలను వేగవంతం చేసేందుకు, ప్రాధాన్యతా ప్రాజెక్టులకు నిధులు అందుబాటులో ఉంచేందుకు కేంద్ర ప్రభుత్వ నిబద్ధతకు అనుగుణంగా ఈ నిధులను విడుదల చేసినట్లు ఆర్థిక శాఖ తెలిపింది. చదవండి: అలర్ట్: ప్రపంచంలో టాప్–20 వాయు కాలుష్య పట్టణాల్లో 14 భారత్‌లోనే.. -
స్టార్ క్యాన్సర్ సెంటర్‌ను ప్రారంభించిన మెగాస్టార్ చిరంజీవి (ఫొటోలు)
-
సామాన్యులకు భారీ ఊరట..తగ్గనున్న వంట నూనె ధరలు!
న్యూఢిల్లీ: అంతర్జాతీయ విపణికి అనుగుణంగా వంట నూనెల ధరలను తక్షణమే తగ్గించాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. ప్రధాన వంట నూనెల గరిష్ట రిటైల్ ధరను లీటరుకు రూ.8–12 తగ్గించాలని స్పష్టం చేసింది. సాల్వెంట్ ఎక్స్‌ట్రాక్టర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా, ఇండియన్ వెజిటబుల్ ఆయిల్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ సహా పరిశ్రమ ప్రతినిధులతో ఫుడ్ సెక్రటరీ సంజీవ్ చోప్రా అధ్యక్షతన జరిగిన సమావేశం అనంతరం ఈ విషయాలను ఆహార మంత్రిత్వ శాఖ తెలిపింది. తయారీదారులు, రిఫైనర్ల ద్వారా పంపిణీదారులకు ఇచ్చే ధర కూడా తక్షణమే తగ్గించాల్సిన అవసరం ఉందని వివరించింది. తయారీదారులు, రిఫైనర్ల ద్వారా పంపిణీదారులకు ధర తగ్గింపు జరిగినప్పుడల్లా.. విక్రేతల ద్వారా వినియోగదారులకు ప్రయోజనం అందడంతోపాటు మంత్రిత్వ శాఖకు ఎప్పటికప్పుడు సమాచారం చేరవేయాలి అని వెల్లడించింది. భారతీయ వినియోగదారులు తినే నూనెల కోసం తక్కువ ఖర్చు చేయాలని ఆశిస్తారు. దిగొస్తున్న వంట నూనెల ధరలు ద్రవ్యోల్బణ భయాలను తగ్గించేందుకు సాయపడతాయి అని ఆహార మంత్రిత్వ శాఖ వివరించింది. అధిక తయారీ వ్యయం, రవాణా ఖర్చుతో సహా అనేక భౌగోళిక రాజకీయ కారణాలతో 2021–22లో అంతర్జాతీయ, దేశీయంగా తినే నూనెల ధరలకు రెక్కలొచ్చాయి. 2022 జూన్ నుంచి అంతర్జాతీయ మార్కెట్లో వీటి ధరలు తగ్గుముఖం పట్టాయి. -
ఆర్డినెన్స్ వివాదం.. ఆప్‌కు షాక్ ఇవ్వనున్న కాంగ్రెస్?
న్యూఢిల్లీ: ఢిల్లీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కేంద్రం తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌పై వివాదం మరింత ముదురుతోంది. దేశ రాజధాని ప్రాంతంలో ప్రభుత్వ అధికారుల బదిలీలు, నియామకాల విషయంలో కేంద్రం తెచ్చిన ఆర్డినెన్స్‌ను పార్లమెంట్లో అడ్డుకునేందుకు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ గట్టిగా ప్రయత్నిస్తున్నారు. బీజేపీయేతర పార్టీలను నేతలను వరుసగా కలుస్తూ మద్దతు కూడగడుతున్నారు. గత వారం రోజులుగా బీహార్ సీఎం నితీష్ కుమార్, తేజస్వీ యాదవ్, మమతా బెనర్జీ, ఉద్ధవ్ ఠాక్రే, శరద్ పవార్, కేసీఆర్ వంటి నేతలతో సమావేశమయ్యారు. అయితే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ విషయంలో ఆమ్ఆద్మీ పార్టీకి మద్దతివ్వాలా? వద్దా? అనే అంశంపై కాంగ్రెస్ తీవ్రంగా యోచిస్తోంది. ఈ మేరకు డిల్లీ, పంజాబ్ కాంగ్రెస్ నేతలతో జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేత రాహుల్ గాంధీ సోమవారం కీలక సమావేశం నిర్వహించారు. వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. అయితే ఢిల్లీ ప్రభుత్వ అధికారాలను కుదిస్తూ కేంద్రం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ విషయంలో ఆమ్ ఆద్మీ పార్టీకి మద్దతు ఇవ్వకూడదనే సూచించినట్లు తెలుస్తోంది. ఢిల్లీ, పంజాబ్‌లో కాకుండా ఇతర రాష్ట్రాల్లోనూ కేజ్రీవాల్ కాంగ్రెస్‌ను దెబ్బతీశారని పార్టీ నేతలు హైకమాండ్‌కు తెలిపినట్లు సమాచారం. కేజ్రీవాల్‌కు మద్దతివ్వడం వల్ల పార్టీకి ఎలాంటి ప్రయోజనం ఉండబోదని పేర్కొన్నట్లు తెలుస్తోంది. కేజ్రీవాల్ బీజేపీకి చెందిన ‘బీ-టీమ్’గా అభివర్ణించిన నేతలు ఆ పార్టీకి మద్దతిస్తే బీజేపీకి ఇచ్చినట్లేనని అభిప్రాయం వ్యక్తం చేసినట్లు సమాచారం. చదవండి: పొంగులేటి, తుమ్మల బీజేపీలో చేరికపై ఈటల సంచలన వ్యాఖ్యలు! కాగా కేంద్రం తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా కేజ్రీవాల్ కాంగ్రెస్ మద్దతు కూడా కోరారు. దీనిపై సమావేశమై చర్చించేందుకు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ సమయం కూడా కోరారు. అయితే పార్టీ నేతలతో మాట్లాడిన తర్వాత ఈ విషయంపై నిర్ణయం తీసుకుంటానని అరవింద్ కేజ్రీవాల్‌కు మల్లికార్జున్ ఖర్గే తెలియజేసినట్లు సమాచారం. ఈ క్రమంలోనే నేడు ఢిల్లీ, పంజాబ్ కాంగ్రెస్ నేతలతో ఖర్గే భేటీ జరగడం విశేషం. అంతేగాక కాంగ్రెస్ తన నిర్ణయం ప్రకటించేముందు ఇతర రాష్టాలకు చెందిన తమ పార్టీ నేతలతో సమావేశమై, వారి అభిప్రాయాలను కూడా పరిగణలోకి తీసుకోనుంది. ఖర్గేతో భేటీ అనంతరం పంజాబ్ కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ సింగ్ రాజా వారింగ్ మాట్లాడుతూ.. తమ అభిప్రాయాలను పార్టీ హైకమాండ్ ముందు ఉంచామని తెలిపారు. తుది నిర్ణయం పార్టీ అధినేతకే వదిలేసినట్లు పేర్కొన్నారు. పార్టీ నాయకులందరూ ఇదే విషయంపై కట్టుబడి ఉన్నారని వెల్లడించారు. ఈ భేటీలో ఏం జరిగిందనేది అంతర్గత విషయాలకు సంబంధించిందని, కాంగ్రెస్ చీఫ్ లేదా రాహుల్ గాంధీ మాత్రమే వివరాలు వెల్లడిస్తారని మరో నేత నవజ్యోత్ సిద్ధూ అన్నారు. భారత రాజ్యాంగాన్ని ఓ పవిత్ర గ్రంథంగా అభివర్ణించిన సిద్ధూ.. ప్రస్తుతం రాజ్యాంగ విలువలు అధోగతి పాలయ్యాయని నమ్ముతున్నట్లు తెలిపారు. చదవండి: కరెంట్ బిల్లులు చెల్లించకపోతే నెక్స్ట్ జరిగేది ఇదే: విద్యుత్ శాఖ వార్నింగ్! -
ముగిసిన మ్యాచ్‌కు కొత్తగా రూల్స్ ఏంటో?
న్యూఢిల్లీ: దేశ రాజధానిలో బ్యూరోక్రాట్ల నియామకం, బదిలీల నియంత్రణపై అక్కడి ప్రభుత్వానికే సర్వాధికారం ఉందంటూ సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుపై కేంద్రం సమీక్షకు వెళ్లింది. ఈ మేరకు సుప్రీం కోర్టులో ఇవాళ ఓ పిటిషన్ దాఖలు చేసింది. అదే సమయంలో ఢిల్లీ వ్యవహారాలు తన అదుపులో ఉండేలా కేంద్రం తాజాగా పాస్ చేసిన ఓ ఆర్డినెన్స్‌ను సవాల్ చేయాలని ఢిల్లీ ప్రభుత్వం నిర్ణయించుకుంది. కేంద్రం శుక్రవారం ఓ ప్రత్యేక ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. దాని ప్రకారం.. బ్యూరోక్రాట్ల నియామకం, ట్రాన్స్ఫర్లకు సంబంధించిన వ్యవహారాలను చూసుకునేందుకు నేషనల్ క్యాపిటల్ సివిల్ సర్వీసెస్ అథారిటీని ఏర్పాటు చేసింది. ఈ వ్యవహారంలో కేంద్రం తరపున చివరి మధ్యవర్తిగా లెఫ్టినెంట్ గవర్నర్‌ను నియమించింది. అంతేకాదు.. అథారిటీ చైర్పర్సన్ హోదాలో ముఖ్యమంత్రిని, చీఫ్ సెక్రటరీని, అలాగే హోం శాఖ ప్రధాన కార్యదర్శిని ఈ అథారిటీలో స్థానం కల్పించింది. అథారిటీలో మెజార్టీ ఓటింగ్‌ల ఆధారంగా అన్ని వ్యవహారాలను పర్యవేక్షిస్తారు. ఒకవేళ ఓటింగ్‌లో ఏదైనా భిన్నాభిప్రాయాలు వ్యక్తం అయితే.. అప్పుడు లెఫ్టినెంట్‌గవర్నర్ నిర్ణయాన్ని తుది నిర్ణయంగా తీసుకుంటారు. అయితే.. పోస్టింగులు, ట్రాన్స్ఫర్లపై ఎల్జీకే తుది అధికారం కట్టబెడుతూ కేంద్రం దొడ్డిదారిన తీసుకొచ్చిన ఈ ఆర్డినెన్స్‌ను సర్వోన్నత న్యాయస్థానంలో సవాల్ చేయాలని అరవింద్ కేజ్రీవాల్ సర్కార్ నిర్ణయించింది. ఇది రాజ్యాంగ విరుద్ధమని, కోర్టు ఇచ్చిన అధికారాన్ని సైతం లాక్కునేందుకు కేంద్రం సిద్ధపడిందని ఆరోపిస్తోంది. సుప్రీం కోర్టు ఢిల్లీ ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు ఇచ్చేసింది. ఆట ముగిశాక.. రూల్స్ మార్చేసినట్లుంది ఇప్పుడు కేంద్రం తీరు.. అని ఢిల్లీ ప్రభుత్వం తరపున వాదనలు వినిపించనున్న సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వీ పేర్కొన్నారు. అలాగే ఆ ఆర్డినెన్స్ ఇంకా పార్లమెంట్లో పాస్ కాలేదన్న విషయాన్ని గుర్తు చేస్తున్నారాయన. ఈ ఆర్డినెన్స్ పార్లమెంట్ ఉభయ సభల్లో పాస్ కావాల్సి ఉంది. కానీ, రాజ్యసభలో బీజేపీకి సరిపడా సంఖ్యా బలం లేదు. దీంతో ప్రతిపక్షాలు ఈ ఆర్డినెన్స్‌ను అడ్డుకునే యత్నం చేయొచ్చు. కేంద్ర వర్గాలు మాత్రం.. రాజ్యాంగ ధర్మాసనం తీర్పులో తలెత్తిన వైరుధ్యాన్ని తొలగించేందుకే ఈ ఆర్డినెన్స్‌ను ఆమోదించినట్లు చెబుతున్నాయి. ఇదిలా ఉంటే.. మే 11వ తేదీన ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం బ్యూరోక్రాట్ల నియామకం, బదిలీల విషయంలో సర్వాధికారాలు ఢిల్లీ ప్రభుత్వానికే ఉంటుందని తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. పోలీస్, పబ్లిక్ ఆర్డర్, ప్రభుత్వానికి భూకేటాయింపులను మాత్రం మినహాయించి.. మిగతా అన్నింట్లో అధికారం ఢిల్లీ ప్రభుత్వానిదేనని తేల్చి చెప్పింది కోర్టు. -
మణిపూర్ హింసపై సుప్రీంకోర్టు ఆందోళన.. ప్రభుత్వాలకు ఆదేశం
న్యూఢిల్లీ: మణిపూర్‌లో జాతుల మధ్య హింసాకాండలో ఆస్తి, ప్రాణనష్టం భారీగా సంభవించడంపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. హింసాత్మక ఘటనల బాధితులకు భద్రత, సాయం, పునరావాస చర్యలను వేగవంతం చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. మణిపూర్‌లోని మైతీ వర్గం వారికి ఎస్టీ హోదాపై దాఖలైన పలు పిటిషన్లపై సుప్రీంకోర్టు ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది. ‘బాధితుల కోసం ఎన్ని సహాయక శిబిరాలు ఏర్పాటు చేశారు? వాటిల్లో ఎందరున్నారు? ఆహారం, వైద్యం, భద్రత అందించేందుకు ఏం చర్యలు తీసుకుంటున్నారు? సహాయక శిబిరాల నిర్వాహకులెవరు? నీడ కోల్పోయిన వారెవరు? వారిని తిరిగి తీసుకువచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నారా?’అంటూ ధర్మాసనం ప్రశ్నల వర్షం కురిపించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న పలు చర్యలను సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ధర్మాసనానికి నివేదించారు. ‘‘బాధితులు తలదాచుకుంటున్న ప్రార్థనాస్థలాలకు రక్షణ కల్పించాలి. సహాయక శిబిరాల్లో ఆహారం, రేషన్, వైద్యం వంటి కనీస సౌకర్యాలు ఏర్పాటు చేయాలి’ అని ధర్మాసనం సూచించింది. హైకోర్టులకు ఆ అధికారం లేదు రిజర్వేషన్లు కల్పించే అధికారం హైకోర్టులకు లేదని ధర్మాసనం ఈ సందర్భంగా స్పష్టం చేసింది. మణిపూర్ హైకోర్టులో మైతీలకు రిజర్వేషన్ల కోసం వాదించానంటూ ఒక లాయర్ ముందుకు రాగా.. రిజర్వేషన్లను సిఫారసు చేసే అధికారం హైకోర్టుకు లేదని తెలిపే రెండు రాజ్యాంగ ధర్మాసన తీర్పులను హైకోర్టుకు చూపించాలని ఆయన్ను కోరింది. రిజర్వేషన్లు కల్పించే అధికారాలు రాష్ట్రపతికే తప్ప హైకోర్టులకు లేవని మీరెన్నడూ హైకోర్టుకు తెలపలేదా అని ప్రశ్నించింది. మరోవైపు మణిపూర్ నుంచి జనం ఎలాగైనా బయటపడాలని తొందరపడుతున్నారు. ఇదే అవకాశంగా ఇండిగో, ఎయిర్ఏసియా వంటి సంస్థలు టికెట్ ధరలను పెంచేశాయి. చదవండి: Karnataka Assembly election 2023: భారమంతా మోదీపైనే.. -
ఎలక్ట్రిక్ వెహికల్ వాహనదారులకు ముఖ్య గమనిక!
ఎలక్ట్రిక్ వాహనదారులకు ముఖ్య గమనిక. ఇప్పటికే ఈవీ వెహికల్‌ను కొనుగోలు చేశారా? అదనంగా ఛార్జర్లతో పాటు వెహికల్‌కు సంబంధించిన ఎక్విప్మెంట్ కోసం డబ్బులు ఖర్చు చేశారా? అయితే మీకో శుభవార్త. దేశంలో ఆటోమొబైల్ దిగ్గజ సంస్థలైన ఎథేర్ ఎనర్జీ, టీవీఎస్ మోటార్స్, ఓలా, హీరో మోటో కార్ప్ కంపెనీలు డబ్బుల్ని రిఫండ్ చేస్తున్నట్లు ప్రకటించాయి. ద్విచక్ర వాహనం తయారు చేసే సంస్థలకు ఫేమ్ పథకం కింద కేంద్రం కొన్ని రాయితీలు కల్పిస్తున్న విషయం తెలిసిందే. వాహన తయారీ సంస్థలు వాహనదారులకు విక్రయించే వెహికల్ ధర రూ.1.5 లక్షలు మించకూడదు. ధర మించితే ఫేమ్ పథకం సదరు తయారీ సంస్థలకు వర్తించదు. అయినప్పటికీ దేశంలోని కొన్ని ఆటోమొబైల్ సంస్థలు నిబంధనలు ఉల్లంఘించి ఛార్జర్లు, వాహనానికి వినియోగించే ఇతర వస్తువులకు అదనంగా డబ్బులు వసూలు చేస్తున్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. దీంతో కేంద్రం రాయితీ కింద చెల్లించాల్సిన రూ.800 కోట్లను ప్రభుత్వం నిలిపివేసింది. ఆయా ఆటోమొబైల్ సంస్థలకు నోటీసులు జారీ చేసింది. తాజాగా కేంద్రం నిర్ణయంతో ఓలా ఎలక్ట్రిక్‌కు అతిపెద్ద ఎదురుదెబ్బ తగిలిందంటూ నివేదికలు పేర్కొన్నాయి. 2021 నుంచి ఓలా ఎలక్ట్రిక్ వెహికల్స్‌ను తయారు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఓలా ఎస్1, ఎస్1 ప్రో విక్రయాలు జరిపే సమయంలో హోం ఛార్జర్లకు అదనంగా డబ్బులు వసూలు చేసింది. ఆ మొత్తం విలువ రూ.131 కోట్లుగా ఉంది. తాజాగా కేంద్రం నిర్ణయంతో ఆ భారీ మొత్తాన్ని ఓలా తన వాహన దారులకు చెల్లించాల్సి ఉందని సమాచారం. రీఫండ్‌పై ఓలా ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. అటు ఏథర్ ఎనర్జీ, టీవీఎస్ మోటార్, హీరో మోటోకార్ప్ సైతం స్పందించలేదు. చదవండి👉 ‘ఎలివేట్’ పేరిట హోండా కొత్త కారు.. మూడేళ్ల నుంచి ఊరిస్తూ.. చివరికి ఇలా -
చింతపల్లి ఫిష్ ల్యాండింగ్ సెంటర్ కు శంకుస్థాపన చేసిన సీఎం వైఎస్ జగన్
-
ఆర్ బీకేలతో ఏపీలో వ్యవసాయరంగం కొత్త పుంతలు
-
కేంద్రం కీలక నిర్ణయం.. ఆ 14 యాప్స్ బ్లాక్
ఢిల్లీ: అనుమానిత మొబైల్ యాప్స్ విషయంలో కేంద్రం మరోసారి దూకుడు ప్రదర్శించింది. దేశంలో అందుబాటులో ఉన్న 14 మొబైల్ మెసేజింగ్ యాప్‌లను బ్లాక్ చేస్తున్నట్లు సోమవారం ప్రకటించింది. ఉగ్రవాద కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపేందుకు ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఈ యాప్‌ల ద్వారా ఉగ్రవాదుల, ఉగ్రవాదుల మద్దతుదారులకు నడుమ కమ్యూనికేషన్, క్షేత్రస్థాయిలో దాడుల ప్రణాళికల చేరవేత, మరీ ముఖ్యంగా పాకిస్తాన్ నుంచి సూచనల రాకపోకలు జరుగుతున్నాయని నిఘా వర్గాలు గుర్తించాయి. ప్రత్యేకించి జమ్ముకశ్మీర్‌లో ఈ యాప్‌ల వినియోగం ఎక్కువగా ఉంటోందని తేల్చింది. ఈ నేపథ్యంలో.. కేంద్రం 14 మెసేజింగ్ యాప్‌లను బ్లాక్ చేస్తున్నట్లు తెలిపింది. క్రిప్వైజర్, ఎనిగ్మా, సేఫ్స్విస్, విక్రమ్Wickrme, మీడియాఫైర్, బ్రియార్, బీఛాట్, నంద్‌బాక్స్, కోనియన్, ఏఎంవో, ఎలిమెంట్, సెకండ్ లైన్, జాంగి, త్రీమా యాప్‌లను బ్లాక్ చేస్తున్నట్లు ప్రకటించింది కేంద్రం. భద్రతా, నిఘా వర్గాల రికమండేషన్ మేరకు.. ఐటీ యాక్ట్ 2000 సెక్షన్ 69ఏ ప్రకారం ఈ నిషేధం అమలు చేస్తున్నట్లు కేంద్రం వెల్లడించింది. అంతేకాదు.. ఆయా యాప్స్ ప్రతినిధులెవరూ భారత్‌లో లేరని నిర్ధారించుకుంది. మెసేజింగ్ యాప్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రజలను ఓ ప్రకటనలో కేంద్రం కోరింది. ఇదీ చదవండి: మన్‌కీ బాత్ టైంలో పురిటి నొప్పులు, ఆపై.. -
స్వలింగ వివాహాల చట్టబద్ధత అంశం.. కేంద్రాన్ని ప్రశ్నించిన సుప్రీంకోర్టు
సాక్షి, న్యూఢిల్లీ: స్వలింగ సంపర్కుల వివాహా అంశం సుప్రీంకోర్టులో ఎటూ తేలడం లేదు. స్వలింగ జంటలకు వివాహా చట్టబద్దత, రక్షణ కల్పించాలని కోరుతూ దాఖలైన పలు పిటిషన్లపై సీజేఐ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని అయిదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం గత వారం రోజులుగా వాదనలు వింటోంది. తాజాగా ఈ కేసులో విచారణ చేపట్టిన అత్యున్నత న్యాయస్థానం కేంద్రానికి పలు కీలక సూచనలు చేసింది. స్వలింగ జంటలకు ప్రాథమిక సామాజిక హక్కులను కల్పించే విషయంలో ప్రభుత్వం ఏదో ఒక మార్గాన్ని కనుక్కోవాలని స్పష్టం చేసింది. గే జంటలకు ఉమ్మడి బ్యాంక్ అకౌంట్లు కల్పించడం, లేదా బీమా పాలసీల్లో భాగస్వామిని నామినేట్ చేసే అంశాలపై కేంద్రం స్పష్టత ఇవ్వాలని సుప్రీంకోర్టు తెలిపింది. అంతేగాక స్వలింగ సంపర్కుల వివాహాలకు చట్టబద్దత అంశంపై పార్లమెంటులో ప్రత్యేక చర్చ జరగడమే కీలకమని అంగీకరిస్తున్నట్లు పేర్కొంది. చదవండి: రెచ్చగొట్టే వ్యాఖ్యలు.. అమిత్ షా ప్రసంగంపై కాంగ్రెస్ సీరియస్ స్వలింగ జంటలకు వివాహా చట్టబద్దత కల్పించకుండా.. వాళ్ల సమస్యలను ఎలా పరిష్కరిస్తారో చెప్పాలని ప్రభుత్వాన్ని కోర్టు ప్రశ్నించింది. ఈ అంశాలపై ప్రభుత్వ వివరణ ఇవ్వాలని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాను ఆదేశించింది. ‘స్వలింగ సంపర్కుల వివాహాలకు చట్టబద్దత కల్పించే అంశాన్ని పార్లమెంటుకు వదిలిపెట్టాలన్న మీ (కేంద్రం) విజ్ఙప్తిని పరిగణలోకి తీసుకుంటున్నాం. అయితే అలాంటి జంటలకు భద్రత, సామాజిక సంక్షేమం ఎలా కల్పిస్తారు? అలాగే ఈ సంబంధాలు బహిష్కరించబడకుండా కేంద్రం ఏం చేయాలనుకుంటోంది’ అని సీజేఐ చంద్రచూడ్ ప్రశ్నించారు. వచ్చే బుధవారం ఆ వివరణలతో కోర్టుకు రావాలని ఆదేశించారు. అయితే స్వలింగ సంపర్కుల వివాహ అంశంపై చర్చ జరపడానికి పార్లమెంట్ ఏం న్యాయస్థానం కాదంటూ కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు బుధవారం పేర్కొన్నారు. ఈ వ్యవహారాన్ని ‘ప్రభుత్వం వర్సెస్ న్యాయవ్యవస్థ’ సమస్యగా మార్చకూడదనిపేర్కొన్నారు. కేంద్రమంత్రి వ్యాఖ్యల మరుసటి రోజు సీజేఐ ఈ విధంగా వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. చదవండి: పులికి కోపం వస్తే అలా ఉంటది.. టూరిస్ట్‌లు పరుగో పరుగు! -
Covid-19: 'మహమ్మారి ఇంకా ముగియలేదు' అంటూ కేంద్రం లేఖ
దేశంలో గత కొద్ది నెలలుగా కరోనా కేసుల తోపాటు మరణాలు సంభవిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే కేంద్రం అప్రమత్తంగా ఉండాలంటూ విజ్ఞప్తి చేస్తూ.. ఎనిమిది రాష్ట్రాలకు లేఖలు రాసింది. ఈ మేరకు లేఖలో కేంద్ర ఆరోగ్య కార్యదర్శి రాజేష్ భూషణ్.. దేశంలో కరోనా మహమ్మారి ఇంకా ముగిసిపోలేదు, అప్రమత్తంగా ఉండాలి. ఇప్పటికే మహమ్మారి నిర్వహణలో మనం సాధించిన విజయ నిర్వీర్యం కాక మునుపే మేల్కోవాలి. ఏ స్థాయిలోనైన అలసత్వం వహించకూడదని ఆ లేఖలో తెలిపారు. కోవిడ్ కారణంగా ఆస్పత్రుల్లో చేరే వారి సంఖ్య, మరణాల సంఖ్య తక్కువే అయినప్పటికీ రాష్టాలు, జిల్లాల్ల వారిగా పెరుగుతున్న కేసులు వైరస్ సంక్రమణని సూచిస్తోందన్నారు. అందువల్ల రోజువారిగా రాష్ట్రాలు, జిల్లాలోని పెరుగుతున్న కేసులు, పాజిటివిటీ రేటుని నిశితంగా పరిశీలించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రారంభ దశలోనే కేసుల పెరుగుదలను నియంత్రించేలా అవసరమైన ప్రజారోగ్య చర్యలను చేపట్టాలని రాజేష్ భూషణ్ నొక్కి చెప్పారు. ఈ మేరకు ఉత్తరప్రదేశ్, తమిళనాడు, రాజస్తాన్, మహారాష్ట్ర, కేరళ, కర్ణాటక, హర్యాన, ఢిల్లీతో సహా ఎనిమిది రాష్ట్రాలు ఈ లేఖలను అందుకున్నాయి. ఆయా రాష్ట్రాల్లోని జిల్లాలో యూపీ(1), తమిళనాడు(11), రాజస్తాన్(6), మహారాష్ట్ర(8), కేరళ(14), హర్యానా(12), ఢిల్లీ(11) తదితరాల్లో మొత్తంగా 10%కి పైగా పాజిటివిటి రేటు ఉంది. ఆయ జిల్లాలోని కోవిడ్ నిఘాను పటిష్టం చేస్తూ.. ఇన్ఫ్లుఎంజా లాంటి అనారోగ్యం (ILI), తీవ్రమైన అక్యూట్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ (SARI) వంటి కేసుల పర్యవేక్షించాలని కేంద్రం రాష్ట్రాలను కోరింది. ఇదిలా ఉండగా, దేశంలో తాజగా కొత్తగా 11,692 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో యాక్టివ్ కేసుల సంఖ్య 66,170కి చేరుకుందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. కాగా ఢిల్లీ ఆరోగ్య మంత్రి సౌరభ్ భరద్వాజ్ మాట్లాడుతూ..దేశ రాజధానిలో కోవిడ్ కేసులు స్థిరంగా ఉన్నాయన్నారు. ఐతే ఇటీవల కొద్దిరోజులుగా మాత్రం కేసులు పెరుగుతున్నాయని, కాని రాబేయే రోజుల్లో తగ్గే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కేసుల్లో చాలా వరకు తీవ్రమైన అనారోగ్యాలు ఉన్నవారే కావడం యాదృచ్చికం అన్నారు. ఏదైనా మరణాలు సంభవించడం అనేది దురదృష్టకరమని, ఇలా జరగకూడదన్నారు ఆరోగ్య మంత్రి భరద్వాజ్. (చదవండి: సూడాన్‌లోని భారతీయుల పరిస్థితిపై మోదీ అత్యవసర సమీక్ష!) -
Bilkis Bano Case: సుప్రీం కోర్టు తీవ్ర వ్యాఖ్యలు
ఢిల్లీ: బిలిస్క్ బానో రేపిస్టుల విడుదలకు సంబంధించిన ఫైల్స్ సమర్పించాలంటూ సుప్రీం కోర్టు ఆదేశించిన తరుణంలో.. కేంద్రం, గుజరాత్ ప్రభుత్వాలు సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాల్ని సవాల్ చేస్తూ సమీక్షకు వెళ్లే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈలోపు ఇవాళ సుప్రీం కోర్టు గుజరాత్ ప్రభుత్వాన్ని ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఆ పదకొండు మందిని ఎందుకు రిలీజ్ చేశారో స్పష్టం చేయాలంటూ గుజరాత్ ప్రభుత్వాన్ని సుప్రీం కోర్టు నిలదీసింది. మార్చి 27వ తేదీన సుప్రీం కోర్టు ‘ఇదొక భయంకరమైన ఘటన’ అని, నిందితుల్ని రెమిషన్ మీద ఎందుకు విడుదల చేశారో వివరణ ఇస్తూనే.. ఆ రిలీజ్‌కు సంబంధించిన ఫైల్స్‌ను సమర్పించాలంటూ కేంద్రం, గుజరాత్ ప్రభుత్వాలను ఆదేశించింది. అయితే.. 11 మంది దోషుల శిక్ష ఉపశమనానికి సంబంధించిన పత్రాలను సమర్పించకూడదని గుజరాత్ ప్రభుత్వం భావించింది. ఇదే విషయాన్ని ఇంతకు ముందు సుప్రీంకు స్పష్టం చేసింది. అంతేకాదు ఒక సాధారణ హత్య కేసులో ఎలాగైతే దోషులకు రెమిషన్ కింద ముందస్తు విడుదల చేస్తామో.. అలాగే ఈ కేసులోనూ చేశామంటూ తన నిర్ణయాన్ని సమర్థించుకుంది. కానీ, జస్టిస్ కేఎం జోసెఫ్, జస్టిస్ బీవీ నాగరత్నలతో కూడిన ధర్మాసనం ఇవాళ రెమిషన్ ఇవ్వడంపై తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఈ క్రమంలో.. దోషులను ముందస్తుగా ఎందుకు రిలీజ్ చేసిందో తెలపాలంటూ గుజరాత్ ప్రభుత్వాన్ని వివరణ కోరింది. ‘‘ఇవాళ ఈమె. రేపు మరొకరు. దేశంలోని నా సోదర సోదరీమణులకు ఏమి జరుగుతుందో అనే ఖచ్చితమైన ఆందోళన కలుగుతోంది’’ అని జస్టిస్ జోసెఫ్ వ్యాఖ్యానించారు. అయితే.. గుజరాత్, కేంద్రం తరఫున వాదనలు వినిపిస్తున్న అదనపు సొలిసిటర్ జనరల్.. సుప్రీం ఆదేశాలపై రివ్యూ పిటిషన్‌కు ఆలోచన చేస్తున్నామని, అది దాఖలు చేయాలా వద్దా అన్నది పూర్తిగా నిర్ణయించలేదని కోర్టుకు తెలిపారు. వెంటనే.. బిల్కిస్ బానో కేసు ఘోరమైన నేరమన్న బెంచ్, రెమిషన్ ప్రకటించేముందు మరో వైపు కూడా ఆలోచించాల్సి ఉండాల్సిందని, ఇది సరైన పద్ధతి కాదని గుజరాత్ ప్రభుత్వం తీరును తప్పు బట్టింది. ఫైల్స్ గనుక కోర్టుకు సమర్పించకపోతే.. అది కోర్టు ధిక్కరణ కిందకే వస్తుందని స్పష్టం చేసింది. ప్రభుత్వాలు అంతా పక్కాగా చేసినప్పుడు.. భయపడాల్సిన అవసరం ఏముందని బెంచ్ వ్యాఖ్యానించింది. ఒక గర్భవతిని(బిల్కిస్ బానో) గ్యాంగ్ రేప్ చేశారు. మరికొందరిని చంపేశారు. అలాంటప్పుడు ఈ కేసును సాధారణమైన హత్య కేసుగా పోల్చడానికి వీల్లేదు. యాపిల్స్‌ను బత్తాయిలతో పోల్చలేం.. అలాగే ఇంతటి మారణకాండను సింగిల్ మర్డర్‌గా పోల్చడానికి వీల్లేదు. నేరాలు అనేవి సాధారణంగా సమాజానికి, కమ్యూనిటీకి వ్యతిరేకంగా జరుగుతుంటాయి. అసమానతలను సమానంగా చూడలేము అని కోర్టు అభిప్రాయపడింది. ఇవాళ బిల్కిస్.. రేపు ఇంకెవరో?. అది మీరైనా కావొచ్చు.. నేనైనా కావొచ్చు. రెమిషన్ ఇవ్వడానికి గల కారణాలను చూపించకపోతే, ఫైల్స్ సమర్పించపోతే.. న్యాయవ్యవస్థ తన స్వంత తీర్మానాన్ని తీసుకోవలసి ఉంటుందని గుజరాత్ ప్రభుత్వానికి స్పష్టం చేసింది సుప్రీం ధర్మాసనం. బిల్కిస్ బానో కేసులో పదకొండు మంది దోషులకు ఉపశమనం కల్పించడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పలు అభ్యర్థనలను మే 2వ తేదీన సుప్రీంకోర్టు విచారించనుంది. నోటీసు అందుకోని దోషులందరూ తమ ప్రత్యుత్తరాలు పంపాలని ఆదేశించింది. -
విగ్రహాలు కాదు.. దళితులకు చేసిందేమిటి..?
కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందని కొందరు విమర్శిస్తున్నారు. రాజ్యాంగ రచనలో అంబేడ్కర్‌తో కలసి నెహ్రూ పనిచేశారు. రాజ్యాంగ పరిరక్షణకు తోడ్పడ్డారు. నాడు కాంగ్రెస్ తెచి్చన సంస్కరణలతోనే నేడు మోదీ ప్రధాని అయ్యారు. –ఖర్గే సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: ‘‘ఒకరు 20 అడుగులు, మరొకరు 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహాలు ఏర్పాటు చేస్తున్నారు. కానీ పేద దళితులకు చేసిందేమీ లేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దళితులను మోసం చేస్తున్నాయి. కేవలం ప్రకటనలు చేస్తే సరిపోదు. పేద దళితుల కోసం చేసిందేమిటో చెప్పాలి..’’ అని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే డిమాండ్ చేశారు. నేటి ప్రభుత్వాలు భావ ప్రకటనా స్వేచ్ఛను, హక్కులను హరిస్తున్నాయని మండిపడ్డారు. శుక్రవారం మంచిర్యాల జిల్లా నస్పూర్‌లో జరిగిన ‘జైభారత్ సత్యాగ్రహ సభ’లో మల్లికార్జున ఖర్గే ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. దళితుల పేరు చెప్పి మోసం.. కేంద్రంలోని మోదీ, రాష్ట్రంలోని కేసీఆర్ దళితుల పేరు చెబుతూ మోసం చేస్తున్నారని ఖర్గే విమర్శించారు. ఉమ్మడి రాష్ట్రంలో దళితుల కోసం ప్రత్యేక నిధులు కేటాయించినది కాంగ్రెస్ ప్రభుత్వమేనన్నారు. రాష్ట్రంలో కేసీఆర్ డబుల్ బెడ్రూం ఇళ్లు, మూడెకరాల భూమి ఇవ్వకుండా దళితులను మోసం చేశారని ఆరోపించారు. తెలంగాణ ఏర్పడ్డాక దళితుల కోసం ఎన్ని నిధులు కేటాయించారు? ఎంత ఖర్చు చేశారో చెప్పగలరా? అని ప్రశ్నించారు. కేవలం పేపర్లలో ప్రకటనలు ఇస్తే సరిపోదన్నారు. ప్రమాదంలో ప్రజాస్వామ్యం దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని.. భావ ప్రకటన స్వేచ్ఛను, హక్కులను హరిస్తున్నారని ఖర్గే ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ దేశానికి ఎంతో సేవ చేసిందని.. కానీ ఆగమేఘాలపై రాహుల్‌గాంధీ లోక్‌సభ సభ్యత్వంపై అనర్హత వేటు వేశారని విమర్శించారు. తమ ప్రభుత్వ హయాంలో ఏనాడూ ప్రతిపక్షాలపై కక్షగట్టలేదన్నారు. కానీ తమ పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తూ బలహీనపర్చే కుట్ర చేస్తున్నారని విమర్శించారు. మీరు చేసిందేంటో చెప్పండి.. కాంగ్రెస్ ఏం చేసిందని కొందరు విమర్శిస్తున్నారని, నాడు చేసిన కాంగ్రెస్ తెచి్చన సంస్కరణలతోనే నేడు మోదీ ప్రధాని అయ్యారని, అమిత్‌షా హోంమంత్రి అయ్యే అవకాశం వచి్చందని ఖర్గే చెప్పారు. రాజ్యాంగ రచనలో అంబేడ్కర్‌తో కలిసి నెహ్రూ పని చేశారని, రాజ్యాంగ పరిరక్షణకు తోడ్పడ్డారని గుర్తుచేశారు. బీజేపీ నేతలు దేశానికి చేసినదేమిటో చెప్పాలన్నారు. దేశ సేవలో వారి పాత్ర ఏమిటని ప్రశ్నించారు. పైగా ఈడీ, సీబీఐ వంటి దర్యాప్తు సంస్థలతో బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తానన్న మోదీ.. అదేమీ చేయకపోగా ఎయిర్‌పోర్టులు, రైల్వే, ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మేస్తున్నారని మండిపడ్డారు. సింగరేణిలో ప్రైవేటీకరణతో నేడు ఉద్యోగాల సంఖ్య 40వేలకు తగ్గిందని చెప్పారు. కాగా.. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్‌రావు ఠాక్రే మాట్లాడుతూ.. ఎస్సీ, ఎస్టీ, బీసీల కోసం కాంగ్రెస్ పార్టీ పోరాడుతుందన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసమే రేవంత్‌రెడ్డి, భట్టి పాదయాత్రలు చేపట్టారన్నారు. -
పెరుగుతున్న కేసులు.. కోవిడ్ వ్యాక్సిన్ సరఫరాపై చేతులెత్తేసిన కేంద్రం
న్యూఢిల్లీ: కరోనా కట్టడిలో అతి ముఖ్యమైన వ్యాక్సినేషన్ కార్య క్రమాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఒకవైపు కరోనా కేసులు పెరుగుతున్నాయంటూ రాష్ట్రాలను అప్రమత్తం చేస్తున్న కేంద్రం.. వ్యాక్సిన్ సరఫరాలో మాత్రం నిర్లక్ష్యం చూపిస్తోంది. తమకు వ్యాక్సిన్లు సరఫరా చేయాలని కోరిన పలు రాష్ట్రాల మంత్రులకు వ్యా క్సిన్ సరఫరా చేసేది లేదని, రాష్ట్రాలే సొంతంగా కొనుగోలు చేసుకోవాలని సూచించింది. దీంతో వ్యాక్సిన్ సరఫరాపై కేంద్రం చేతులెత్తేసినట్లయింది. శుక్రవారం వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో కరోనా పరిస్థితులు, సంసిద్ధతపై కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుక్ మాండవీయ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వివిధ దేశాలు, పలు రాష్ట్రాల్లో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. టెస్టింగ్, ట్రేసింగ్, ట్రీటింగ్, వ్యాక్సినేషన్, అప్రాప్రియేట్ బిహేవియర్ వంటి 5 అంచెల వ్యూహాన్ని పక్కాగా అమలు చేయాలని తెలిపారు. ఈ సందర్భంగా తెలంగాణ ఆర్థిక, వైద్యారోగ్య మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ.. కరోనా కట్టడిలో, వ్యాక్సినేషన్లో తెలంగాణ ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచిందన్నారు. కరోనా పరిస్థితులు రాష్ట్రంలో పూర్తిగా అదుపులో ఉన్నాయని, ప్రభుత్వం అన్ని విధాలుగా సిద్ధంగా ఉందన్నారు. ప్రికాషనరీ డోసులో తెలంగాణ దేశంలోనే నెంబర్ 1 స్థానంలో ఉన్నట్లు చెప్పారు. అయితే కేంద్రం నుంచి రాష్ట్రానికి వ్యాక్సిన్ల సరఫరా నిలిచిపోవడంతో రాష్ట్రంలో నిల్వలు లేకుండా పోయినట్లు చెప్పారు. దీంతో వ్యాక్సినేషన్ నిలిచిపోయిందన్నారు. రాష్ట్రానికి అవసరమైన వ్యాక్సిన్ డోసులను తక్షణం సరఫరా చేయాలని మంత్రి హరీష్ రావు కోరారు. ఈ విషయంలో ఇప్పటికే కేంద్రానికి లేఖ రాసినట్లు గుర్తు చేశారు. తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాలు సైతం తమకు వ్యాక్సిన్ సరఫరా నిలిచిపోయిందని, దీంతో వ్యాక్సినేషన్ కార్యక్రమానికి అంతరాయం కలుగుతున్నట్లు కేంద్ర మంత్రి దృష్టికి తెచ్చారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మన్సుక్ మాండవీయ మాట్లాడుతూ.. కావాల్సిన వ్యాక్సిన్లు ఆయా రాష్ట్రాలు కొనుగోలు చేసుకోవచ్చని, బహిరంగా మార్కెట్లో పుష్కలంగా వ్యాక్సిన్ నిల్వలు ఉన్నాయని చెప్పారు. ఇదిలా ఉంటే, రాష్ట్ర ప్రజల శ్రేయస్సు దృష్ట్యా హైదరాబాద్ ఫార్మా సంస్థ బయోలాజికల్ ఇ సహకారంతో 15 లక్షల డోసులు సరఫరా చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. వ్యాక్సిన్ సరఫరా చేసేందుకు ముందుకు వచ్చిన బయోలాజిక్ ఇ ఎండీ మహిమా ధాట్లకు ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు ధన్య వాదాలు తెలిపారు. కాగా భారత్‌లో కొత్తగా ఆరు వేలకుపైగా కేసులు నమోదు అయ్యాయి. నానాటికీ కేసుల సంఖ్య ముందుకే పోతోంది. నిన్నటితో పోలిస్తే ఇది 13 శాతం ఎక్కువ. కేరళ, మహారాష్ట్ర, కర్ణాటకతో పాటు యూపీ, ఢిల్లీలో కేసుల సంఖ్య పెరుగుతోంది. देश में कोविड-19 की स्थिति को लेकर राज्यों एवं UTs के स्वास्थ्य मंत्रियों के साथ समीक्षा बैठक की। इस दौरान कोविड टेस्टिंग एवं जीनोम सीक्वेंसिंग के साथ कोविड नियमों के पालन का प्रसार बढ़ाने पर बात हुई। हमें सतर्क रहना है और अनावश्यक भय नहीं फैलाना है। pic.twitter.com/vSmOV9qr80 — Dr Mansukh Mandaviya (@mansukhmandviya) April 7, 2023 -
కేంద్రం కీలక నిర్ణయం..తగ్గనున్న పీఎన్జీ,సీఎన్జీ గ్యాస్ ధరలు!
సహజ వాయివు (నేచురల్ గ్యాస్) ధరల విషయంలో భారత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నేచురల్ గ్యాస్ ధరల్ని నియంత్రించేందుకు కొత్త పద్దతిని అమలు చేసింది. చమురు క్షేత్రాల నుంచి ఉత్పత్తి చేసే గ్యాస్‌ను ఇంధనం ధరల్ని ఇక నుంచి ముడిచమురు ధరలతో అనుసంధానం చేసినట్లు కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు. దీంతో పీఎన్జీ, సీఎన్జీ గ్యాస్ ధరలు మరింత తగ్గన్నాయి. సాధారణంగా కేంద్రం యూఎస్, కెనడా, రష్యాతో పాటు మిగిలిన దేశాల్లో గ్యాస్ ట్రేడింగ్ హబ్ల్లోని ధరలకు అనుగుణంగా సహజ వాయివు ధరల్ని ప్రతి 6 నెలలకు ఒకసారి మార్చుతూ వచ్చేది. కానీ ఇంధనం ధరల్ని ముడిచమురు ధరలతో అనుసంధానం చేయడంతో.. ధరల్లో ప్రతినెలా మార్పులు ఉండబోతున్నాయి.. #Cabinet approves revised domestic gas pricing guidelines price of natural gas to be 10% of the monthly average of Indian Crude Basket, to be notified monthly Move to ensure stable pricing in regime and provide adequate protection to producers from adverse market fluctuation pic.twitter.com/NRONPAOzzK — Rajesh Malhotra (@DG_PIB) April 6, 2023 తాజాగా కేంద్రం తీసుకున్న నిర్ణయంతో పైప్డ్ నేచురల్ గ్యాస్ (పీఎన్జీ) 10 శాతం చౌకగా మారుతుందని, కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ (సీఎన్జీ) ధర 6 శాతం నుండి 9 శాతానికి తగ్గుతుందని చమురు కార్యదర్శి పంకజ్ జైన్ తెలిపారు. సహజవాయు ఇంధన ధరలను నిర్ణయించటంలో కేంద్రం కొత్త విధానానికి ఆమోదంపై శనివారం నోటిఫికేషన్‌ను విడుదల చేయనుంది. -
ఛానల్ బ్యాన్.. కేంద్రానికి షాక్ ఇచ్చిన సుప్రీంకోర్టు..
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టులో కేంద్ర ప్రభుత్వానికి భారీ షాక్ తగిలింది. మలయాళం న్యూస్ ఛానల్ ‘మీడియావన్’పై కేంద్రం విధించిన నిషేధాన్ని రద్దు చేస్తూ సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. మీడియావన్ ఛానల్ వల్ల జాతీయ భద్రతకు ముప్పు ఉన్నట్లు సీల్డ్ కవర్లో పేర్కొన్న కేంద్ర ప్రభుత్వ వాదనను ధర్మాసనం తప్పుపట్టింది. జాతీయ భద్రత పేరుతో పౌరుల హక్కులను హరించరాదని స్పష్టం చేసింది. మీడియా వన్ ఛానెల్‌కు బ్రాడ్‌కాస్టింగ్ లైసెన్స్‌ను నాలుగు వారాల్లో పునరుద్ధరించాలని ఆదేశించింది. భద్రతా కారణాల రీత్యా మీడియావన్ ప్రసారాలను నిలిపివేస్తూ, ఆ ఛానెల్ లైసెన్సును రద్దుచేస్తూ కేంద్ర ప్రభుత్వం గతేడాది జనవరి 31 ఆదేశాలు ఇచ్చింది. కేంద్రం నిర్ణయాన్ని కేరళ హైకోర్టు కూడా సమర్థించింది. కాగా ఛానల్‌పై విధించిన నిషేధంపై మధ్యమం బ్రాడ్‌కాస్టింగ్ లిమిటెడ్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. కేంద్ర హోంశాఖ నుంచి సెక్యూరిటీ క్లియరెన్స్ వచ్చేంతవరకు ప్రసార లైసెన్స్‌ను పునరుద్ధరించకూడదన్న సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ నిర్ణయాన్ని సమర్థిస్తూ కేరళ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై గతేడాది మార్చిలో విచారణ చేపట్టిన అత్యున్నత న్యాయస్థానం ఛానల్ నిషేధంపై స్టే విధించింది. తాజాగా దీనిపై మరోసారి విచారణ చేపట్టిన భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ హిమా కోహ్లీలతో కూడిన ధర్మాసనం మీడియా స్వతంత్రతపై కీలక వ్యాఖ్యలు చేసింది. విమర్శనాత్మక అభిప్రాయాలను వ్యక్తం చేయడం ప్రభుత్వ వ్యతిరేకత కాదని తెలిపింది. ఈ కేసులో మీడియా సంస్థకు ఉగ్రవాదులతో సంబంధమున్నట్లు ఎలాంటి ఆధారాలు లేవని పేర్కొంది. కేవలం ఊహాగానాలను ఆధారంగా చేసుకుని పత్రికా రంగంపై అసమంజసమైన ఆంక్షలను విధించకూడదని, దీనివల్ల పత్రికా స్వేచ్ఛపై ప్రభావం పడుతుందని పేర్కొంది. వాస్తవాలను ప్రజలకు తెలియజేయడం పత్రికల కర్తవ్యమని గుర్తు చేసింది. ఛానల్ ప్రసారాల వల్ల జాతీయ భద్రతకు ముప్పు ఉందని గాలి మాటలతో చెప్పలేమని, దానికి సరైన ఆధారాలు తప్పనిసరిగా ఉండాలని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. మీడియావన్ లైసెన్సులను పునరుద్ధరించకుండా కేంద్ర సమాచార, ప్రసారశాఖ ఇచ్చిన ఆదేశాలను కోర్టు కొట్టివేసింది. ఈ కేసులో హోం మంత్రిత్వ శాఖ సీల్డ్ కవర్లో డాక్యుమెంట్లు కేరళ హైకోర్టుకు సమర్పించడంపై సుప్రీంకోర్టు తప్పుబట్టింది. కోర్టులో విచారణ జరుగుతున్నప్పుడు ఇతర పక్షాలకు సమాచారాన్ని బహిర్గతం చేయకుండా ప్రభుత్వానికి ఎలాంటి మినహాయింపులు ఉండవని, అన్ని దర్యాప్తు నివేదికలను రహస్యంగా ఉంచడం కుదరదని తెలిపింది. ఇది పౌరుల హక్కులు, స్వేచ్ఛను ప్రభావితం చేసే అంశాలను బయటకు వెల్లడించాలని ధర్మాసనం అభిప్రాయపడింది. -
మైక్ పట్టుకొని పాట పాడిన మమతా బెనర్జీ.. వీడియో వైరల్!
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పాట పాడారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేపట్టిన ధర్నాలో గురువారం తన నిరసనను సీఎం ఓ పాట రూపంలో వ్యక్తపరిచారు. రవింద్రనాథ్ ఠాగూర్ స్వరపరిచిన ఓ బెంగాలీ పాటను మైక్ పట్టుకొని స్వయంగా ఆలపించారు. ధర్నా సమయంలో స్టేజ్ మీదున్న ఇతర నేతలు, కళాకారులతో కలిసి ‘ఎబార్ తోర్ మోరా గంగే’ అనే పాటను పాడారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా రాష్ట్రానికి రావాల్సిన నిధులను కేంద్రం విడుదల చేయడం లేదని ఆరోపిస్తూ కోల్‌కతాలో రెండు రోజులుగా మమతా ఆందోళన చేపట్టిన విషయం తెలిసిందే. గ్రామీణ ఉపాధి హామీ పథకంతో సహా రాష్ట్రానికి రావాల్సిన నిధుల విషయంలో కేంద్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, వాటిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ సీఎం స్వయంగా ఈ ధర్నా చేపట్టారు. ఈ దీక్షలో మమతతో పాటు టీఎంసీ సీనియర్ నేతలు పాల్గొన్నారు. ఈ నిరసన దీక్ష ఈ రోజు రాత్రి 7 గంటలకు ముగియనుంది. చదవండి: అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యే పాడుపని.. ఆ వీడియో చూస్తూ అడ్డంగా బుక్..! #WATCH | West Bengal CM Mamata Banerjee sings a Bengali song on the second day of her Dharna in Kolkata, against the Central government for not clearing funds for several schemes including 100 days work. pic.twitter.com/r6CRXCuqty — ANI (@ANI) March 30, 2023 -
ఏపీ సమస్యలను తక్షణమే పరిష్కరించాలి: ఎంపీ వంగా గీత
న్యూఢిల్లీ: ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని వైఎస్సార్సీపీ ఎంపీ వంగా గీత డిమాండ్ చేశారు. లోక్‌సభలో రూల్ 377 కింద ఈ విషయాన్ని ఆమె ప్రస్తావించారు. పార్లమెంట్లో ఇచ్చిన విభజన హామీలను నిలబెట్టుకోవాలని గుర్తుచేశారు. ఏపీలో గ్యాస్ ఆధారిత పరిశ్రమల ఏర్పాటు మద్దతివ్వాలని కోరారు. పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన ప్రోత్సాహకాలు, రాయితీలు ఇవ్వాలని ఎంపీ తెలిపారు. విభజన జరిగి ఏళ్లు గడిచినా మెజార్టీ హామీలు కేంద్రం నిలబెట్టుకోలేదని విమర్శించారు. తక్షణమే కేంద్ర ప్రభుత్వం ఏపీ సమస్యలను పరిష్కరించాలని వంగా గీత డిమాండ్ చేశారు.