న్యూఢిల్లీ: బంగ్లాదేశ్ పరిస్థితులపై కేంద్రం ఏర్పాటుచేసిన అఖిలపక్ష సమావేశం కొనసాగుతోంది. మంగళవారం(ఆగస్టు 6) పార్లమెంట్ భవనంలో జరుగుతున్న ఈ సమావేశంలో అఖిలపక్షనేతలకు బంగ్లాదేశ్‌లోని పరిస్థితులను విదేశాంగశాఖ మంత్రి జైశంకర్ వివరించారు. బంగ్లాదేశ్‌లో ఉన్న 12 వేల మంది దాకా భారతీయులను ఇప్పటికిప్పుడు తీసుకురావాల్సినంత ప్రమాదమేమీ లేదని తెలిపారు. దేశ సరిహద్దుల వద్ద అప్రమత్తంగా ఉన్నామని, అయినా సరిహద్దుల వద్ద పెద్ద ముప్పేమీ లేదని చెప్పారు.
పదవి నుంచి తప్పుకుని భారత్ వచ్చిన ప్రధాని షేక్‌హసీనాతో మాట్లాడామని పరిస్థితులను ఎప్పటికప్పుడు గమనిస్తున్నామన్నారు. బంగ్లాదేశ్‌లో చదువుకుంటున్న భారత విద్యార్థులు 8 వేల మంది ఇప్పటికే తిరిగి వచ్చారన్నారు. ఈ సమావేశంలో ప్రభుత్వం తరపున కేంద్ర మంత్రులు అమిత్‌షా, రాజ్‌నాథ్‌సింగ్, జైశంకర్, కిరణ్‌రిజిజు, లోక్‌సభ, రాజ్యసభల్లో ప్రతిపక్షనేతలు రాహుల్‌గాంధీ, మల్లికార్జున్‌ఖర్గే వివిధ పార్టీలకు చెందిన నేతలు హాజరయ్యారు.
బంగ్లాదేశ్‌లో ఆందోళనల కారణంగా ప్రధాని షేక్‌హసీనా దేశం వీడి భారత్‌కు వచ్చిన విషయం తెలిసిందే. హసీనా బంగ్లాదేశ్‌ను వీడిన తర్వాత అక్కడ ఆందోళనలు తగ్గుముఖం పట్టినట్లు కనిపిస్తోంది. ప్రస్తుతం బంగ్లాదేశ్‌లో ఖర్ఫ్యూ ఎత్తేశారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటు దిశగా సన్నాహాలు జరుగుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment