allparty meeting
-
‘బంగ్లా’ సంక్షోభంతో ప్రమాదం లేదు: అఖిలపక్ష భేటీలో కేంద్రం
న్యూఢిల్లీ: బంగ్లాదేశ్ పరిస్థితులపై కేంద్రం ఏర్పాటుచేసిన అఖిలపక్ష సమావేశం కొనసాగుతోంది. మంగళవారం(ఆగస్టు 6) పార్లమెంట్ భవనంలో జరుగుతున్న ఈ సమావేశంలో అఖిలపక్షనేతలకు బంగ్లాదేశ్‌లోని పరిస్థితులను విదేశాంగశాఖ మంత్రి జైశంకర్ వివరించారు. బంగ్లాదేశ్‌లో ఉన్న 12 వేల మంది దాకా భారతీయులను ఇప్పటికిప్పుడు తీసుకురావాల్సినంత ప్రమాదమేమీ లేదని తెలిపారు. దేశ సరిహద్దుల వద్ద అప్రమత్తంగా ఉన్నామని, అయినా సరిహద్దుల వద్ద పెద్ద ముప్పేమీ లేదని చెప్పారు. పదవి నుంచి తప్పుకుని భారత్ వచ్చిన ప్రధాని షేక్‌హసీనాతో మాట్లాడామని పరిస్థితులను ఎప్పటికప్పుడు గమనిస్తున్నామన్నారు. బంగ్లాదేశ్‌లో చదువుకుంటున్న భారత విద్యార్థులు 8 వేల మంది ఇప్పటికే తిరిగి వచ్చారన్నారు. ఈ సమావేశంలో ప్రభుత్వం తరపున కేంద్ర మంత్రులు అమిత్‌షా, రాజ్‌నాథ్‌సింగ్, జైశంకర్, కిరణ్‌రిజిజు, లోక్‌సభ, రాజ్యసభల్లో ప్రతిపక్షనేతలు రాహుల్‌గాంధీ, మల్లికార్జున్‌ఖర్గే వివిధ పార్టీలకు చెందిన నేతలు హాజరయ్యారు. బంగ్లాదేశ్‌లో ఆందోళనల కారణంగా ప్రధాని షేక్‌హసీనా దేశం వీడి భారత్‌కు వచ్చిన విషయం తెలిసిందే. హసీనా బంగ్లాదేశ్‌ను వీడిన తర్వాత అక్కడ ఆందోళనలు తగ్గుముఖం పట్టినట్లు కనిపిస్తోంది. ప్రస్తుతం బంగ్లాదేశ్‌లో ఖర్ఫ్యూ ఎత్తేశారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటు దిశగా సన్నాహాలు జరుగుతున్నాయి. -
సభ సజావుగా జరగనివ్వండి
న్యూఢిల్లీ: సోమవారం నుంచి ప్రారంభం కానున్న పార్లమెంటు శీతాకాల సమావేశాలు సజావుగా జరిగేందుకు సహకరించాలని లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లా సభ్యులకు పిలుపునిచ్చారు. శనివారం జరిగిన అఖిల పక్ష భేటీలో ఈ మేరకు ఆయన సభ్యులను కోరారు. ప్రధాని మోదీ ఈ భేటీలో పాల్గొన్నారు. సభలో చర్చ జరగాలని, చర్చ జరిగేందుకే సభ ఉన్నదన్న విషయాన్ని గుర్తు చేశారు. సభ ప్రజలకు జవాబుదారీగా ఉండాలని, అందుకే ప్రజా సమస్యలను లేవనెత్తాల్సిందిగా సభ్యులను కోరారు. 17వ లోక్ సభ మొదటి సమావేశాల్లాగే ఈ సమావేశాలు కూడా ఫలప్రదం అవుతాయని పార్టీలన్నీ తనకు మాటిచ్చాయని చెప్పారు. భేటీ అనంతరం తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ బంధోపాధ్యాయ్ మాట్లాడుతూ.. పశ్చిమబెంగాల్లో గవర్నర్ సమాంతర పాలన నడుపుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటివి జరగకూడదని అన్నారు. సభలో నిరుద్యోగం, ఆర్థిక స్థితి వంటి వాటిపై చర్చలు జరుగుతాయని చెప్పారు. ఉత్తర భారతంలో ఉన్న కాలుష్యం గురించి సభ మాట్లాడాలని బీఎస్పీ నేత కున్వార్ చెప్పారు. -
నేడు అన్ని పార్టీల అధినేతలతో మోదీ సమావేశం
-
లోకేష్ కోసమే పట్టి సీమ: దేవినేని
విజయవాడ : లోకేష్‌కు దోచిపెట్టేందుకే ముఖ్యమంత్రి చంద్రబాబు పట్టిసీమ ప్రాజెక్ట్ చేపట్టారని మాజీమంత్రి, ఏపీసీసీ ఉపాధ్యక్షుడు దేవినేని రాజశేఖర్ (నెహ్రూ) ఆరోపించారు. దమ్ముంటే పట్టిసీమ ప్రాజెక్ట్‌పై అఖిలపక్షంతో బహిరంగ చర్చ నిర్వహించి చంద్రబాబు తన నిజాయితీని నిరూపించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. విజయవాడలోని ఆంధ్రరత్న భవన్లో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ హయాంలో సాగునీటి ప్రాజెక్టులు చేపడితే ధనయజ్ఞం కోసం అంటూ అనుచిత వ్యాఖ్యలు చేసిన చంద్రబాబు ఇప్పుడు తన కుమారుడు లోకేష్ కోసం పట్టిసీమ చేపట్టారా? అని ప్రశ్నించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో వెలిగొండ, పోతిరెడ్డిపాడు ప్రాజెక్టులపై ఆరోపణలు వస్తే ఇంజినీరింగ్ అధికారులు, మంత్రులను ప్రాజెక్టుల వద్దకు పంపి విపక్షాలతో బహిరంగ చర్చ నిర్వహించిన విషయాన్ని గుర్తుచేశారు. రూ.1,300 కోట్లతో పట్టిసీమను చేపడుతున్నట్లు ప్రకటించిన ప్రభుత్వం లోకేష్ స్నేహితుడు కృష్ణారెడ్డికి 22 శాతం అధిక మొత్తానికి టెండర్‌ను కట్టబెట్టిందన్నారు. ప్రస్తుతం దీని విలువ రూ.2వేల కోట్లకు చేరిందని చెప్పారు.