న్యూఢిల్లీ: బంగ్లాదేశ్ పరిణామాలపై రాజ్యసభలో విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ ప్రకటన చేశారు. బంగ్లాదేశ్‌లో పరిస్థితులు వేగంగా మారుతున్నాయని, ఢాకాలోని భారత్ దౌత్య కార్యాలయం ద్వారా పరిస్థితులను నిశితంగా గమనిస్తున్నామని తెలిపారు. దేశంలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని ఆర్మీ చీఫ్ ప్రకటించిన నేపథ్యంలో అక్కడ త్వరలోనే పరిస్థితులు సాధారణ స్థితికి వస్తాయని భావిస్తున్నట్లు చెప్పారు.
బంగ్లాదేశ్‌లో 19,000 మంది భారతీయులు ఉన్నారని జైశంకర్ వెల్లడించారు. వీరిలో 8,000 మంది విద్యార్థులు ఇప్పటికే భారత్ చేరుకున్నారని తెలిపారు. బంగ్లాదేశ్‌లో మైనార్టీల వ్యాపారాలపై దాడులు జరుగుతున్నాయని, మైనార్టీల రక్షణకు అక్కడున్న సంస్థలు చర్యలు తీసుకుంటున్నాయని పేర్కొన్నారు. ఢాకాలోని అధికారులతో ఎప్పటికప్పుడు సంప్రదించి అన్ని వివరాలు అడిగి తెలుసుకుంటున్నామని చెప్పారు.
‘బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా ప్రస్తుతం ఢిల్లీలోనే ఉన్నారు.ఆమె షార్ట్ నోటీసుతో ఇండియాకు వచ్చారు. బంగ్లాదేశ్‌లో అల్లర్లు చెలరేగడంతో షేక్ హసీనా రాజీనామా చేయాల్సి వచ్చింది. బంగ్లాదేశ్‌లో భారతీయ యువకులు వెనక్కి రావాలనుకుంటున్నారు. భారతీయ యువకులను వెనక్కి రప్పించేందుకు అన్ని చర్యలు చేపడుతున్నాం. బంగ్లాదేశ్‌లోని భారతీయులు, మైనారిటీల భద్రతపై అక్కడి ఆర్మీతో మేము టచ్‌లో ఉన్నాం. అక్కడి శాంతి భద్రతనలు ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నాం’ అని తెలిపారు
Comments
Please login to add a commentAdd a comment