తమిళనాడులో శుక్రవారం రాత్రి ఘోర రైలు ప్రమాదం జరిగింది. మైసూర్-దర్భంగా భాగమతి ఎక్స్‌ప్రెస్ గూడ్స్ రైలును ఢీకొట్టడంతో ఏకంగా 12 కోచ్‌లు పట్టాలు తప్పాయి.రైలు ప్రమాద ఘటన నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే 18 రైళ్లను రద్దు చేసింది. తిరువళ్లూరు జిల్లాలోని కవరైపెట్లై రైల్వే ష్టేషన్ వద్ద రాత్రి 8.30 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది.
తాజాగా బాగమతి ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదంపై కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ స్పందించారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. దాదాపు 300 మంది ప్రయాణికుల ప్రాణాలను బలిగొన్న బాలాసోర్ దుర్ఘటనను ప్రస్తావిస్తూ.. గత సంఘటనల నుంచినేర్చుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని మండిపడ్డారు.
“మైసూరు-దర్భంగా రైలు ప్రమాదం భయంకరమైన బాలాసోర్ ప్రమాదానికి అద్దం పడుతుంది. ఒక ప్యాసింజర్ రైలు ఆగి ఉన్న గూడ్స్ రైలును ఢీకొట్టింది. అనేక ప్రమాదాల్లో వందలాది మంది ప్రాణాలు కోల్పోయినప్పటికీ, గుణపాఠాలు నేర్చుకోలేదు. జవాబుదారీతనం లోపించింది. ఈ ప్రభుత్వం మేల్కోకముందే ఇంకా ఎన్ని కుటుంబాలు నాశనం కావాలి?’ అని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు.
#WATCH | Tamil Nadu: Latest drone visuals from Chennai-Guddur section between Ponneri- Kavarappettai railway stations (46 km from Chennai) of Chennai Division where Train no. 12578 Mysuru-Darbhanga Express had a rear collision with a goods train, last evening.
12-13 coaches… pic.twitter.com/F7kp7bgLdV— ANI (@ANI) October 12, 2024
కాగా ఈ ఘటనలో 19 గాయాలవ్వగా, వారిని సమీపంలోని ఆసుప్రతికి తరలించినట్లు రైల్వే అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఘటనా స్థలంలో పునరుద్ధరణ పనులు జరుగుతున్నాయి. రైలు సేవలను పునరుద్ధరించడానికి మరో 18 గంటలు సమయం పడతుందని పేర్కొన్నారు. ప్రమాద స్థలంలో చెల్లాచెదురుగా దెబ్బతిన్న కోచ్‌లు డ్రోన్ ఫుటేజీలో కనిపిస్తున్నాయి. సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయని, ఇప్పటివరకు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని తమిళనాడు ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ ధృవీకరించారు.
Comments
Please login to add a commentAdd a comment