సాక్షి ప్రతినిధి, చెన్నై: ప్రధాని మోదీ, ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ తమిళనాడులో ఒకే ఊరిలో వెంట వెంటనే ఎన్నికల ప్రచార సభలు పెట్టుకోవడం చిత్రమైన పరిస్థితికి దారితీసింది. తమ తమ కూటముల అభ్యర్థుల గెలుపుకోసం ప్రచార నిమిత్తం మోదీ, రాహుల్ శుక్రవారం తమిళనాడుకు చేరుకున్నారు. 12న రాహుల్, 13న మోదీ తేని జిల్లాలోని వేర్వేరుచోట్ల ఏర్పాటు చేసిన సభల్లో ప్రసంగించేందుకు ఏర్పాట్లు జరిగాయి. తేనీ అన్నింజిలో వేదిక పక్కనే రాహుల్‌ను తీసుకొచ్చే హెలికాప్టర్ కోసం హెలిపాడ్ సిద్ధంచేశారు. తేనీ ఎస్‌ఎస్‌పురంలో 13న మోదీ సభ నేపథ్యంలో ఆండిపట్టిలో హెలిపాడ్ సిద్ధమైంది.
మోదీ మదురైకి వచ్చి అక్కడి నుంచి ఆండిపట్టికు హెలికాప్టర్‌లో రావాల్సిఉంది.ప్రధాని భద్రతపై సమీక్షలో భాగంగా 11న వైమానికదళానికి చెందిన హెలికాప్టర్ ట్రయల్‌రన్‌కు బయల్దేరింది. మదురై ఎయిర్‌పోర్టులో ఉదయం 11 గంటలకు బయల్దేరిన వైమానికదళ హెలికాప్టర్ ఆండిపట్టిలో మోదీ మాట్లాడాల్సిన సభావేదిక పక్కనున్న హెలిపాడ్‌లో దిగకుండా అన్నింజిలో రాహుల్ మాట్లాడాల్సిన సభావేదిక వద్దనున్న హెలిపాడ్‌లో దిగింది. రాహుల్ కోసం సిద్ధం చేసిన హెలిపాడ్‌లో హెలికాప్టర్‌ను పొరపాటున దించానని గ్రహించిన పైలట్ హెలికాప్టర్‌ను టేకాఫ్ చేసి తీసుకెళ్లాడు.
రాహుల్ హెలిపాడ్‌పై వైమానికదళ హెలికాప్టర్
Comments
Please login to add a commentAdd a comment