Heli-pad
-
రాహుల్ సభలో మోదీ హెలికాప్టర్!
సాక్షి ప్రతినిధి, చెన్నై: ప్రధాని మోదీ, ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ తమిళనాడులో ఒకే ఊరిలో వెంట వెంటనే ఎన్నికల ప్రచార సభలు పెట్టుకోవడం చిత్రమైన పరిస్థితికి దారితీసింది. తమ తమ కూటముల అభ్యర్థుల గెలుపుకోసం ప్రచార నిమిత్తం మోదీ, రాహుల్ శుక్రవారం తమిళనాడుకు చేరుకున్నారు. 12న రాహుల్, 13న మోదీ తేని జిల్లాలోని వేర్వేరుచోట్ల ఏర్పాటు చేసిన సభల్లో ప్రసంగించేందుకు ఏర్పాట్లు జరిగాయి. తేనీ అన్నింజిలో వేదిక పక్కనే రాహుల్‌ను తీసుకొచ్చే హెలికాప్టర్ కోసం హెలిపాడ్ సిద్ధంచేశారు. తేనీ ఎస్ఎస్పురంలో 13న మోదీ సభ నేపథ్యంలో ఆండిపట్టిలో హెలిపాడ్ సిద్ధమైంది. మోదీ మదురైకి వచ్చి అక్కడి నుంచి ఆండిపట్టికు హెలికాప్టర్లో రావాల్సిఉంది.ప్రధాని భద్రతపై సమీక్షలో భాగంగా 11న వైమానికదళానికి చెందిన హెలికాప్టర్ ట్రయల్‌రన్‌కు బయల్దేరింది. మదురై ఎయిర్‌పోర్టులో ఉదయం 11 గంటలకు బయల్దేరిన వైమానికదళ హెలికాప్టర్ ఆండిపట్టిలో మోదీ మాట్లాడాల్సిన సభావేదిక పక్కనున్న హెలిపాడ్‌లో దిగకుండా అన్నింజిలో రాహుల్ మాట్లాడాల్సిన సభావేదిక వద్దనున్న హెలిపాడ్‌లో దిగింది. రాహుల్ కోసం సిద్ధం చేసిన హెలిపాడ్‌లో హెలికాప్టర్‌ను పొరపాటున దించానని గ్రహించిన పైలట్ హెలికాప్టర్‌ను టేకాఫ్ చేసి తీసుకెళ్లాడు. రాహుల్ హెలిపాడ్‌పై వైమానికదళ హెలికాప్టర్ -
సీఎం పర్యటన ఏర్పాట్ల పరిశీలన
సిద్దిపేట జోన్: ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ నెల 10న సిద్దిపేటలో పర్యటిస్తున్న నేపథ్యంలో ఆదివారం మంత్రి హరీష్‌రావు సిద్దిపేటలో పలు ప్రాంతాలను పరిశీలించారు. సాయంత్రం స్థానిక పత్తి మార్కెట్, మినీ స్టేడియంను సందర్శించి హెలిప్యాడ్ నిర్మాణానికి అనువైన స్థలాన్ని ఆర్అండ్బీ అధికారులతో కలిసి పరిశీలించారు. అనంతరం కోమటి చెరువు వద్ద గల ఫిల్టర్ బెడ్‌ను మంత్రి సందర్శించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తన పర్యటనలో భాగంగా ఫిల్టర్ బెడ్‌ను పరిశీలించి సమావేశం నిర్వహించనున్న నేపథ్యంలో అందుకు అవసరమైన ఏర్పాట్లు, పరిసరాల స్థితి గతులను మంత్రి హరీష్‌రావు అడిగి తెలుసుకున్నారు. ఫిల్టర్‌బెడ్ పరిసర ప్రాంతాల్లో వృథాగా ఉన్న స్క్రాప్‌ను వెంటనే తొలగించాలని ఆర్డబ్ల్యూఎస్ అధికారులను ఆదేశించారు. అదే విధంగా ఈ నెల 10న ఫిల్టర్ బెడ్లో గ్రిడ్‌కు సంబంధించిన ప్రత్యేక సదస్సు నిర్వహించనున్నందున అనువైన వేదిక, ఫిల్టర్ బెడ్ పవర్‌పాయింట్ ప్రజంటేషన్ గురించి తెలుసుకున్నారు. త్వరితగతిన పనులను పూర్తి చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. మంత్రి వెంట కలెక్టర్ రాహుల్ బొజ్జా, సిద్దిపేట ఆర్డీఓ ముత్యంరెడ్డి, ఆర్అండ్బీ ఈఈ బాల్‌నర్సయ్య, ఆర్డబ్ల్యూఎస్ డిప్యూటీ ఈఈ చారి, మంత్రి ఓఎస్డీ బాలరాజు, తహశీల్దార్ ఎన్వై గిరి, మున్సిపల్ కమిషనర్ రమణాచారి, సిద్దిపేట డీఎస్పీ శ్రీధర్, మున్సిపల్ మాజీ చైర్మన్ రాజనర్సు, శేషుకుమార్ తదితరులున్నారు. -
బైకలాలో హెలీప్యాడ్‌కు స్థలం లభ్యం
సాక్షి, ముంబై: హెలిప్యాడ్ నిర్మాణానికి అవసరమైన స్థలం బైకలా రైల్వే స్టేషన్లో లభించింది. ఈ స్థలాన్ని నేవీ అధికారులు సందర్శించి, అందుకు అవసరమైన ప్రతిపాదన నేవి చీఫ్‌కు పంపించారు. ఇది కార్యరూపం దాలిస్తే గాయపడిన వారిని వెంటనే సమీప ఆస్పత్రికి తీసుకెళ్లడం సులభతరం కానుంది. నగరం, శివారు ప్రాంతాల్లో నిత్యం రైలు పట్టాలు దాటుతూ, నడిచే రైలులోంచి కిందపడుతూ ఇలా ఎక్కడో ఒక చోటా, ఏదో ఒక స్టేషన్లో ప్రయాణికులు ప్రమాదాలకు లోనవుతూనే ఉంటారు. ఇలాంటి ప్రమాదాల వల్ల నగరంలోని అన్ని రైల్వే స్టేషన్ల పరిధిలో ప్రతీరోజు సరాసరి ముగ్గురు లేదా నలుగురు చనిపోతుండగా, పది మంది వరకుగాయపడుతున్నారు. ఇలా తీవ్రంగా గాయపడిన వారికి సత్వరమే వైద్య సేవలు అందితే వారి ప్రాణాలు దక్కే అవకాశముంటుంది. కాగా, వారిని సమీప ఆస్పత్రిలో తరలించడానికి ఏర్పాటుచేసిన అంబులెన్సులు నగర ట్రాఫిక్‌లో తప్పించుకుంటూ సరైన సమయానికి బాధితుడిని ఆస్పత్రికి తరలించడంలో విఫలమవుతున్నాయి. దీంతో సమయానికి సరైన వైద్యం అందక సదరు బాధితుడు ప్రాణాలు కోల్పోవాల్సి వస్తోంది. ఇక వీటికి అడ్డుకట్ట వేసేందుకు రైల్వే విభాగంగా హెలికాప్టర్ల సాయం తీసుకోవాలని నిర్ణయించింది. ఏదైనా ప్రమాదం జరిగిన వెంటనే హెలికాప్టర్‌ను రప్పిస్తారు. కాగా, హెలికాప్టర్‌ను ల్యాండ్ చేయడానికి అవసరమైన హెలిప్యాడ్లను నగరంలోని కీలకమైన స్టేషన్ల ఆవరణల్లో నిర్మించాలని రైల్వే పరిపాలనా విభాగంగా నిర్ణయించింది. అందుకు 14 స్టేషన్లను ఎంపిక చేసింది. అందులో బైకలా ఒకటి. ఇక్కడ స్టేషన్ బయట రైల్వే సొంత స్థలం ఉంది. అందులో హెలిప్యాడ్ నిర్మించేందుకు అవసరమైన స్థలాన్ని చూపించడంతో నేవీ అధికారులు సందర్శించి వెళ్లారు. ప్రతిపాదనలు కూడా పంపడంతో త్వరలో అక్కడ హెలిప్యాడ్ నిర్మాణం కార్యరూపం దాల్చే అవకాశాలున్నాయి. ఇదిలాఉండగా రైలు ప్రమాదంలో గాయపడినవారిని వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు సమయానికి అంబులెన్స్‌లు, ఆటో, ట్యాక్సీలు, ఇతర వాహనాలు దొరకడం లేదు. దీంతో కొన్ని ప్రముఖ స్టేషన్ల బయట అంబులెన్స్‌లను అందుబాటులో ఉంచిన విషయం తెలిసిందే. కాని ట్రాఫిక్ జాంలో ఇవి కూడా ముందుకు వెళ్లలేని పరిస్థితి ఉంది. దీంతో హెలికాప్టర్ ద్వారా బాధితులను వెంటనే ఆస్పత్రికి చేరవేయవచ్చని రైల్వే భావించింది. అందుకు అవసరమైన హెలిప్యాడ్ల నిర్మాణానికి అవసరమైన స్థలం వేటలో పడింది.