సిద్దిపేట జోన్: ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ నెల 10న సిద్దిపేటలో పర్యటిస్తున్న నేపథ్యంలో ఆదివారం మంత్రి హరీష్‌రావు సిద్దిపేటలో పలు ప్రాంతాలను పరిశీలించారు. సాయంత్రం స్థానిక పత్తి మార్కెట్, మినీ స్టేడియంను సందర్శించి హెలిప్యాడ్ నిర్మాణానికి అనువైన స్థలాన్ని ఆర్‌అండ్‌బీ అధికారులతో కలిసి పరిశీలించారు. అనంతరం కోమటి చెరువు వద్ద గల ఫిల్టర్ బెడ్‌ను మంత్రి సందర్శించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తన పర్యటనలో భాగంగా ఫిల్టర్ బెడ్‌ను పరిశీలించి సమావేశం నిర్వహించనున్న నేపథ్యంలో అందుకు అవసరమైన ఏర్పాట్లు, పరిసరాల స్థితి గతులను మంత్రి హరీష్‌రావు అడిగి తెలుసుకున్నారు.
ఫిల్టర్‌బెడ్ పరిసర ప్రాంతాల్లో వృథాగా ఉన్న స్క్రాప్‌ను వెంటనే తొలగించాలని ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులను ఆదేశించారు. అదే విధంగా ఈ నెల 10న ఫిల్టర్ బెడ్‌లో గ్రిడ్‌కు సంబంధించిన ప్రత్యేక సదస్సు నిర్వహించనున్నందున అనువైన వేదిక, ఫిల్టర్ బెడ్ పవర్‌పాయింట్ ప్రజంటేషన్ గురించి తెలుసుకున్నారు. త్వరితగతిన పనులను పూర్తి చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. మంత్రి వెంట కలెక్టర్ రాహుల్ బొజ్జా, సిద్దిపేట ఆర్డీఓ ముత్యంరెడ్డి, ఆర్‌అండ్‌బీ ఈఈ బాల్‌నర్సయ్య, ఆర్‌డబ్ల్యూఎస్ డిప్యూటీ ఈఈ చారి, మంత్రి ఓఎస్‌డీ బాలరాజు, తహశీల్దార్ ఎన్‌వై గిరి, మున్సిపల్ కమిషనర్ రమణాచారి, సిద్దిపేట డీఎస్పీ శ్రీధర్, మున్సిపల్ మాజీ చైర్మన్ రాజనర్సు, శేషుకుమార్ తదితరులున్నారు.
సీఎం పర్యటన ఏర్పాట్ల పరిశీలన
Published Sun, Dec 7 2014 11:10 PM | Last Updated on Wed, Aug 15 2018 9:04 PM
Advertisement