cm tour
-
రేపు వైఎస్సార్ జిల్లాలో సీఎం జగన్ పర్యటన
కడప సెవెన్ రోడ్స్: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ నెల 11 తేదీ జిల్లా పర్యటనకు వస్తున్నారు. పులివెందులలో ముఖ్యమంత్రి వివిధ అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవం చేస్తారు. అధికారికంగా ఖరారైన సీఎం పర్యటన వివరాలు ఇలా.. ► సోమవారం ఉదయం 10.20 కడప ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. –అక్కడి నుంచి 10.25కు హెలికాప్టర్లో బయలు దేరి 10.40 పులి వెందులలోని భాకరాపురం హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. ► 10.45కు అక్కడి నుంచి రోడ్డు మార్గాన బయలు దేరి 10.55కు డాక్టర్ వైఎస్ఆర్ గవర్నమెంట్ హాస్పిటల్ వద్దకు చేరుకుంటారు. 11.35 వరకు డాక్టర్ వైఎస్ఆర్ ప్రభుత్వ ఆసుపత్రి ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు. ► 11.35 రోడ్డు మార్గాన బయలు దేరి 11.45కు బనాన ఇంటి గ్రేటెడ్ ప్యాక్ హౌస్ వద్దకు చేరుకుంటారు. మధ్యాహ్నం 12 గంటల వరకు ప్యాక్ హౌస్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో గడుపుతారు. ► అనంతరం అక్కడి నుంచి బయలు దేరి 12.10 డాక్టర్ వైఎస్ఆర్ మినీ సెక్రటేరియట్ కాంప్లెక్స్ వద్దకు చేరుకుంటారు. 12.25 వరకు కాంప్లెక్స్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో గడుపుతారు. ► 12.25కు అక్కడ బయలుదేరి 12.30 డాక్టర్ వైఎస్ఆర్ జంక్షన్ వద్దకు చేరుకొని 12.35 వరకు ఆ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు. ► 12.35 నుంచి 12.40 వరకు సెంట్రల్బోలే వార్డు ప్రారంభిస్తారు. –అనంతరం అక్కడ బయలు దేరి 12.50కి వైఎస్ జయమ్మ షాపింగ్ కాంప్లెక్స్ వద్దకు చేరుకొని ఒంటి గంట వరకు కాంప్లెక్స్ ప్రారం భోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు. ► అనంతరం అక్కడ బయలు దేరి 1.05కు గాంధీ జంక్షన్ చేరుకొని 1.10 వరకు జంక్షన్ ప్రారంభోత్సవంలో పాల్గొంటారు. అనంతరం అక్కడి నుంచి బయలు దేరి 1.15 డాక్టర్ వైఎస్ఆర్ ఉలిమెల్ల లేక్ ఫ్రంట్ వద్దకు చేరుకొని 1.40 వరకు దాన్ని ప్రారంభోత్సవ కార్యక్రమంలో గడుపుతారు. –అనంతరం అక్కడ బయలు దేరి 1.50కి ఆదిత్య బిర్లా యూనిట్ వద్దకు చేరుకుంటారు. 2.05 వరకు ఆదిత్య బిర్లా యూనిట్ ఫేస్–1ప్రారంభోత్సవంలో గడుపుతారు. ► అనంతరం అక్కడ బయలు దేరి సమ్యూ గ్లాస్ హెలిప్యాడ్ వద్దకు చేరుకుంటారు. ► 2.15కు హెలిక్టాపర్లో బయలు దేరి 2.25కు ఇడుపులపాయ హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. ► 2.30కి రోడ్డు మార్గాన బయలు దేరి 2.35కు వైఎస్ఆర్ మెమోరియల్ పార్క్ వద్దకు చేరుకుంటారు. 2.55 వరకు పార్క్ ప్రారంభోత్సవంలో గడుపుతారు. ► అ తర్వాత అక్కడి నుంచి బయలు దేరి 3.00 గెస్ట్ హౌస్ చేరుకుంటారు. సాయంత్రం 4 గంటల వరకు రిజర్వ్ ► సాయంత్రం 4 గంటలకు గెస్ట్ హౌస్ బయలే దేరి 4.05 ఇడుపుల పాయ హెలిప్యాడ్ వద్దకు చేరుకుంటారు. ► 4.10కి అక్కడి నుంచి హెలికాప్టర్లో బయలు దేరి 4.25కు కడప ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. ► 4.35కు కడప ఎయిర్ పోర్ట్ నుంచి విమానంలో బయలు దేరి 5.25కు గన్నవరం ఎయిర్ పోర్ట్ చేరుకుంటారు. ► 5.30 అక్కడి నుంచి రోడ్డు మార్గాన 5.50కి ముఖ్యమంత్రి అధికార నివాసానికి చేరుకుంటారు. -
సాధికార నినాదానికి జన నీరాజనం
సాక్షి, అమరావతి: బడుగు, బలహీన వర్గాలు విజయ యాత్ర చేస్తున్నాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అందించిన చేయూతతో ఎలా అభ్యున్నతి చెంది, సాధికారత సాధించాయో రాష్ట్రమంతా చాటి చెబుతున్నాయి. వైఎస్సార్సీపీ చేపట్టిన ఈ సామాజిక సాధికార బస్సు యాత్ర రాష్ట్రమంతా విజయవంతంగా సాగుతోంది. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు సంక్షేమ పథకాల ద్వారా ఆర్థికంగా చేయూతనిస్తూ, కేబినెట్ నుంచి నామినేటెడ్ పోస్టుల వరకూ సింహభాగం పదవులివ్వడం ద్వారా పరిపాలనలో భాగస్వామ్యం కల్పిస్తూ సీఎం వైఎస్ జగన్ చేసిన సామాజిక న్యాయం ఆ వర్గాల ప్రజల్లో చైతన్యాన్ని రగల్చింది. సామాజిక సాధికార యాత్రలు జగన్నినాదమై ప్రతిధ్వనిస్తున్నాయి. సామాజిక సాధికార యాత్ర శుక్రవారం అన్నమయ్య జిల్లాలో తంబళ్లపల్లె, పల్నాడు జిల్లాలో పెదకూరపాడు, పార్వతీపురం మన్యం జిల్లాలో పార్వతీపురం నియోజకవర్గాల్లో జరిగింది. మూడు నియోజకవర్గాల్లో యాత్రకు జనం నీరాజనాలు పలికారు. ఆ నియోజకవర్గాల్లో నిర్వహించిన సభలకు ప్రజలు కడలిలా తరలివచ్చారు. నేతల ప్రసంగాల్లో సీఎం వైఎస్ జగన్ పేరును ప్రస్తావించినప్పుడల్లా ‘మా నమ్మకం నువ్వే జగన్.. జగనన్నే మా భవిష్యత్తు’ అంటూ ప్రజలు ప్రతిస్పందించారు. ఇదీ చదవండి: అమలు గ్యారంటీ -
CM Jagan YSR District Tour: ప్రణాళిక మేరకే సంక్షేమాభివృద్ధి
సాక్షి ప్రతినిధి, కడప: రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రణాళిక ప్రకారం అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టం చేశారు. గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా ప్రభుత్వ సేవలు, సంక్షేమ పథకాలను సంతృప్తికరంగా ప్రజల గడప వద్దకే అందిస్తున్నామని చెప్పారు. ఈ వ్యవస్థ సక్రమంగా నడవాలంటే ఎక్కడా వివక్షకు తావివ్వకూడదని, పరిపాలన పారదర్శకంగా సాగినపుడే ప్రజా వ్యవస్థ పటిష్టంగా ఉంటుందన్నారు. వైఎస్సార్ జిల్లాలో రెండు రోజుల పర్యటనకు గాను శుక్రవారం సతీమణి భారతితో కలిసి మధ్యాహ్నం 12 గంటలకు సీఎం కడపకు చేరుకున్నారు. అనంతరం లింగాల మండలం పార్నపల్లె పరిధిలోని చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ (సీబీఆర్) వద్ద పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు గావించి, పులివెందుల నియోజకవర్గ అభివృద్ధిపై సమీక్ష నిర్వహించారు. తొలుత సీబీఆర్ వద్ద పర్యాటక శాఖ రూ.4.1 కోట్ల పాడా (పులివెందుల ఏరియా డెవలప్మెంట్ అథారిటీ) నిధులతో అధునాతనంగా నిర్మించిన వైఎస్సార్ లేక్ వ్యూ రెస్టారెంట్, అందులోని అతిథి గృహాలు, పార్కుతోపాటు రూ.1.5 కోట్లతో ఏర్పాటు చేసిన నాలుగు సీట్ల స్పీడ్ బోటు, 18 సీట్ల ఫ్లోటింగ్ జెట్టి, పర్యాటక బోటింగ్ సిస్టమ్‌ను ప్రారంభించారు. ఇందుకు సంబంధించిన శిలా ఫలకాలను, లేక్ వ్యూ పార్కులో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించారు. రిజర్వాయర్‌లో జలకళను, చుట్టూ ఆహ్లాదకరమైన పచ్చటి కొండల అందాలను తిలకిస్తూ కొద్దిసేపు సేద తీరారు. పాంటున్ బోటులో కూర్చొని కాసేపు రిజర్వాయర్‌లో షికారు చేశారు. లేక్ వ్యూ రెస్టారెంట్లో జిల్లా నీటి పారుదల శాఖ ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను తిలకించారు. ఆ శాఖ అధికారులు జిల్లాలోని మేజర్ రిజర్వాయర్లు, ఇతర ప్రాజెక్టుల పరిస్థితిని ముఖ్యమంత్రికి వివరించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. వైఎస్సార్ జిల్లా పులివెందుల నియోజకవర్గం లింగాల మండలం పార్నపల్లెలోని చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ (సీబీఆర్)ను సుప్రసిద్ధ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని తెలిపారు. పర్యాటకానికి అత్యంత అనువైన ఈ ప్రాంతంలో అన్ని రకాల వనరులు పుష్కలంగా ఉన్నాయని చెప్పారు. జాతీయ స్థాయిలో పర్యాటకులను ఆకర్షించేలా పర్యాటక శాఖ ద్వారా మరింత అభివృద్ధి చేస్తామన్నారు. దివంగత సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించిన సీఎం వైఎస్ జగన్ పేరు పేరున పలకరింపు.. పులివెందుల నియోజకవర్గ అభివృద్ధిపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజాప్రతినిధులు, అధికారులు, లింగాల మండల నాయకులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం నేతలను పేరుపేరునా ఆప్యాయంగా పలకరించారు. వారి నుంచి వినతులను స్వీకరించారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా పాడా ఓఎస్డీ అనిల్‌కుమార్‌రెడ్డి నియోజకవర్గ అభివృద్ధి గురించి వివరించారు. అవినీతి ఆశ్రిత పక్షపాతానికి తావు లేకుండా.. కుల, మత, వర్గ, ప్రాంతాలకు అతీతంగా ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా పని చేస్తున్న స్థానిక నేతలు, ప్రజాప్రతినిధులు, అధికారులను ఈ సందర్భంగా సీఎం అభినందించారు. ఆ తర్వాత అందరితో ఫొటోలు దిగారు. సాయంత్రం 5.40 గంటలకు అక్కడి నుంచి ఇడుపులపాయకు చేరుకున్నారు. అక్కడికి విచ్చేసిన ప్రజాప్రతినిధులు, నేతలను పేరుపేరునా పలకరించారు. పలువురి నుంచి వినతి పత్రాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి అంజాద్‌బాషా, జిల్లా ఇన్చార్జి మంత్రి ఆదిమూలపు సురేష్, కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, కలెక్టర్ విజయరామరాజు, ఎస్పీ కేకేఎన్ అన్బురాజన్ తదితరులు పాల్గొన్నారు. చిన్నారి లివర్ మార్పిడికి సీఎం భరోసా ఎదుటి వారి కష్టం వినాలే కానీ, వెంటనే స్పందించడంలో తన తర్వాతే ఎవరైనా అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మరోమారు నిరూపించుకున్నారు. అనంతపురం జిల్లా ధర్మవరం మండలం చిగిచర్లకు చెందిన దివాకర్‌రెడ్డి దంపతుల మూడున్నరేళ్ల కుమారుడు యుగంధర్‌రెడ్డికి లివర్ దెబ్బతింది. చాలా మంది వైద్యుల వద్దకు తిరిగారు. ఈ క్రమంలో బెంగుళూరులోని సెయింట్ జాన్ ఆస్పత్రికి వెళ్లగా.. లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేయాలని, పెద్ద మొత్తంలో ఖర్చవుతుందని వైద్యులు తెలిపారు. దివాకర్‌రెడ్డి కుటుంబం అంత పెద్ద మొత్తంలో డబ్బు వెచ్చించలేని పరిస్థితి. ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డిని కలిశారు. ఆయన శుక్రవారం వైఎస్సార్ జిల్లా లింగాల మండలం పార్నపల్లెకు వచ్చిన సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి వద్దకు బాధిత కుటుంబాన్ని తీసుకుని వచ్చారు. వీరి కష్టం విన్న సీఎం.. వైద్యానికి ఎంత ఖర్చయినా ప్రభుత్వమే భరిస్తుందని భరోసా ఇచ్చారు. తక్షణమే బాలుడికి వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ విజయరామరాజును ఆదేశించారు. దీంతో దివాకర్‌రెడ్డి దంపతులు ఆనంద బాష్పాలతో ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. – సాక్షి ప్రతినిధి, కడప నేడు వివాహ వేడుకకు హాజరు కానున్న ముఖ్యమంత్రి తొలిరోజు పర్యటన అనంతరం శుక్రవారం రాత్రి ఇడుపులపాయలో బస చేసిన సీఎం వైఎస్ జగన్.. శనివారం ఉదయం పులివెందులలోని ఎస్పీఎస్ఆర్ కల్యాణ మండపంలో తన వ్యక్తిగత కార్యదర్శి రవిశేఖర్ యాదవ్ కుమార్తె వివాహానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదిస్తారు. -
సీఎం జగన్ వైఎస్సార్ కడప జిల్లా పర్యటన ఖరారు.. రెండు రోజుల పాటు..
సాక్షి, కడప: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి జిల్లా పర్యటన షెడ్యూల్ ఖరారైంది. ఈ మేరకు పర్యటన వివరాలను కలెక్టర్ విజయరామరాజు మంగళవారం వెల్లడించారు. ముఖ్యమంత్రి డిసెంబరు 2, 3 వ తేదీల్లో పలు కార్యక్రమాల్లో పాల్గొంటారన్నారు. ముఖ్యమంత్రి పర్యటన వివరాలు ఇలా ఉన్నాయి ►డిసెంబర్ 2న ఉదయం సీఎం వైఎస్ జగన్ తన నివాసం నుంచి 10.20 గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. అక్కడ నుంచి బయలుదేరి 11.15 గంటలకు కడప ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. ►11.15 నుంచి స్థానిక నేతలతో మాట్లాడతారు. ►11.30 గంటలకు ప్రత్యేక విమానంలో బయలుదేరి 11.50 గంటలకు లింగాల మండలంలోని సీబీఆర్ రిజర్వాయర్ వద్దకు చేరుకుంటారు. ►మధ్యాహ్నం 12.00 గంటలకు అక్కడ బోటింగ్ జెట్టిని ప్రారంభిస్తారు. ►12.35 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి డాక్టర్ వైఎస్సార్ లేక్ వ్యూ పాయింట్‌కు బయలుదేరుతారు. ►12.40 గంటలకు అక్కడికి చేరుకుని వైఎస్సార్ లేక్ వ్యూ రెస్టారెంట్‌ను ప్రారంభిస్తారు. ►1.00 నుంచి 1.30 గంటల వరకు విశ్రాంతి తీసుకుంటారు. ►1.30 నుంచి 4.30 గంటల వరకు ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తారు. ►4.35 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి 5.00 గంటలకు హెలికాఫ్టర్‌లో ఇడుపులపాయ హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. ►5.00 నుంచి 5.10 గంటల వరకు స్థానిక నేతలతో మాట్లాడతారు. అనంతరం 5.20 గంటలకు ఇడుపులపాయలోని గెస్ట్‌హౌస్ చేరుకుని రాత్రికి అక్కడ బస చేస్తారు. ►డిసెంబర్ 3వ తేదీ ఉదయం 8.30 గంటలకు వైఎస్సార్ ఎస్టేట్ నుంచి బయలుదేరి 8.35 గంటలకు అక్కడ ఉన్న హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. ► 8.40 గంటలకు అక్కడి నుంచి హెలికాఫ్టర్‌లో బయలుదేరి 8.55 గంటలకు పులివెందుల భాకరాపురంలోని హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. ►అక్కడి నుంచి 9.00 గంటలకు రోడ్డు మార్గాన బయలుదేరి కదిరిరోడ్డులోని ఎస్సీఎస్ఆర్ గార్డెన్స్‌కు చేరుకుంటారు. ►అక్కడ 9.15 నుంచి 9.30 గంటల వరకు సీఎం వ్యక్తిగత కార్యదర్శి డి.రవిశేఖర్ కుమార్తె వివాహ వేడుకలకు హాజరై వధూవరులను ఆశీర్వదిస్తారు. ►9.35 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి భాకరాపురంలోని హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. ►అక్కడి నుంచి 9.45 గంటలకు హెలికాఫ్టర్‌లో బయలుదేరి 10.10 గంటలకు కడప ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. ►10.15 గంటలకు అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం విమానాశ్రయానికి చేరుకుని 11.30 గంటలకు తన నివాసానికి చేరుకుంటారు. -
సీఎం జగన్ మదనపల్లె పర్యటన వాయిదా
మదనపల్లె: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మదనపల్లె పర్యటన వాయిదా పడిందని రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, మదనపల్లె ఎమ్మెల్యే నవాజ్‌బాషా ప్రకటించారు. మిథున్‌రెడ్డి, నవాజ్‌బాషా మంగళవారం స్థానిక విలేకరులతో మాట్లాడుతూ ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం ఈ 25వ తేదీన సీఎం జగన్ మదనపల్లెలో పర్యటించాల్సి ఉందని చెప్పారు. బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం ప్రభావంతో రానున్న నాలుగు రోజులు వర్షాలు కురుస్తాయని, ఈదురు గాలులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు, భద్రతా కారణాల వల్ల సీఎం పర్యటన వాయిదా పడినట్లు వివరించారు. తిరిగి ముఖ్యమంత్రి పర్యటన ఈ నెల 29 లేదా 30న ఉండవచ్చని, సీఎం కార్యాలయం నుంచి ఆదేశాలు వచ్చాక అధికారికంగా ప్రకటిస్తామన్నారు. -
రేపు శ్రీకాకుళం జిల్లాలో సీఎం జగన్ పర్యటన
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో పర్యటించనున్నారు. వైఎస్సార్ జగనన్న శాశ్వత భూ హక్కు, భూరక్ష (రీసర్వే) పథకం కింద సర్వే పూర్తి అయిన గ్రామాలకు సంబంధించిన రైతులకు భూ హక్కు పత్రాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ఉదయం 8.30 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి 11 గంటలకు నరసన్నపేట ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానానికి చేరుకుంటారు. 11.00 నుంచి 12.55 వరకు బహిరంగ సభలో సీఎం ప్రసంగిస్తారు. లబ్ధిదారులకు పత్రాల పంపిణీ కార్యక్రమం అనంతరం మధ్యాహ్నం 1.25 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి 3.25 గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు. -
CM Jagan: నరసాపురం పర్యటనకు సీఎం జగన్
సాక్షి, పశ్చిమగోదావరి: నరసాపురంలో ఈనెల 18న జరుగనున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పర్యటన ఏర్పాట్లను వేగంగా పూర్తి చేయాలని కలెక్టర్ పి.ప్రశాంతి ఆదేశించారు. సోమవారం ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లపై మున్సిపల్ కౌన్సిల్ హాల్లో అధికారులతో ఆమె సమావేశం నిర్వహించారు. ముఖ్యమంత్రి ఆక్వా యూనివర్సిటీ, బియ్యపుతిప్ప ఫిషింగ్‌హార్బర్, కాళీపట్నం రెగ్యులేటర్ల నిర్మాణం, వాటర్‌గ్రిడ్ ప్రాజెక్ట్, సబ్‌స్టేషన్ నిర్మాణం వంటి ప్రాజెక్టులకు శంకుస్థాపన, బస్టాండ్, 100 పడకల ఆస్పత్రి ప్రారంభోత్సాలు చేస్తారన్నారు. ఈ మేరకు ఏర్పాట్లు పకడ్బందీగా ఉండాలన్నారు. పట్టణంలోని 25వ వార్డు వీవర్స్‌కాలనీలో బహిరంగసభ నిర్వహించే ప్రాంతంలో ఏర్పాట్లను వెంటనే పూర్తిచేయా లని ఆదేశించారు. చినమామిడిపల్లి లేఅవుట్ వద్ద హెలీప్యాడ్ పనులు పూర్తి చేయాలన్నారు. ముఖ్యమంత్రి రోడ్డు మార్గం మీదుగా వెళ్లే ప్రాంతాలను సుందరంగా తీర్చిదిద్దాలన్నారు. సీఎం పర్యటన ఏర్పాట్లలో ఉన్న సిబ్బందికి పాస్‌లు జారీ చేయాలని, అవసరమైన చోట్ల వైద్య శిబిరాలు ఏర్పాటుచేయాలని సూచించారు. అనంతరం ఆమె సీఎం పర్యటించనున్న ప్రాంతాలు బస్టాండ్, ప్రభుత్వాస్పత్రి, సభావేదిక స్థలాన్ని పరిశీలించారు. జాయింట్ కలెక్టర్ మురళి, నరసాపురం సబ్‌కలెక్టర్ ఎం.సూర్యతేజ ఆమె వెంట ఉన్నారు. చదవండి: (CM Jagan: రేపు హైదరాబాద్‌కు సీఎం జగన్) 92 అర్జీల స్వీకరణ : నరసాపురం మున్సిపల్ కార్యా లయంలో కలెక్టర్ పి.ప్రశాంతి ఆధ్వర్యంలో జిల్లాస్థాయి స్పందన కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లాలోని పలు ప్రాంతాలకు చెందిన 92 మంది అర్జీలు అందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అర్జీలను తక్షణం పరిష్కరించి బాధితులకు న్యాయం చేయాలని అధికారులను ఆదేశించారు. ఫిర్యాదుల పరిష్కార అంశానికి అధిక ప్రాధాన్యమివ్వాలని, స్పందన దరఖాస్తుల పరిష్కారంపై ఎప్పటికప్పుడు నివేదిక ఇవ్వాలని సూచించారు. వృద్ధుల వద్దకు నేరుగా వెళ్లి కలెక్టర్ వినతులు స్వీకరించారు. చదవండి: (విశాఖ నార్త్ నియోజకవర్గ పార్టీ శ్రేణులతో సీఎం జగన్ భేటీ) -
YSR Kadapa: మూడు రోజుల పాటు సీఎం జగన్ పర్యటన.. షెడ్యూల్ ఇదే
సాక్షి, కడప సిటీ : ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి జిల్లాలో మూడు రోజులపాటు పర్యటించనున్నారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ విజయరామరాజు.. పర్యటన వివరాలను వెల్లడించారు. వైఎస్సార్ జిల్లాలో సెప్టెంబరు 1 నుంచి 3వ తేదీవరకు ముఖ్యమంత్రి వివిధ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. సెప్టెంబరు 1వ తేదీ సాయంత్రం వేముల మండలంలోని వేల్పుల గ్రామ సచివాలయ కాంప్లెక్స్‌ను ప్రారంభించనున్నారు. 2వ తేదీన మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతి సందర్బంగా వైఎస్సార్ ఘాట్‌లో ప్రత్యేక పార్థనలు నిర్వహిస్తారు. అదేరోజు పులివెందుల నియోజకవర్గంలోని అభివృద్ధి పనులపై సమీక్ష నిర్వహించనున్నారు. 3వ తేది ఇడుపులపాయ ఎస్టేట్ నుంచి బయలుదేరి ప్రత్యేక హెలికాఫ్టర్‌లో కడప విమా నాశ్రయానికి చేరుకుంటారు. ఉదయం 9.20 గంటలకు ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్లనున్నారు. ముఖ్యమంత్రి పర్యటన వివరాలు సెప్టెంబరు 1న ►మధ్యాహ్నం 2.00 గంటలకు ముఖ్యమంత్రి తన నివాసం నుంచి బయలుదేరి 2.20 గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. ►అక్కడి నుంచి విమానంలో 2.30 గంటలకు బయలుదేరి 3.20 గంటలకు కడప ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. ►3.30 గంటలకు ఇక్కడి నుంచి బయలుదేరి 3.50 గంటలకు వేముల మండలంలోని వేల్పుల గ్రామానికి చేరుకుంటారు. ►అక్కడ 3.50 నుంచి 4.05 గంటల వరకు స్థానిక నాయకులతో మాట్లాడతారు. ►4.10 నుంచి 5.10 గంటల వరకు వేల్పులలోని సచివాలయ కాంప్లెక్స్‌ను ప్రారంభిస్తారు. ►అనంతరం అక్కడి నుంచి 5.35 గంటలకు హెలికాఫ్టర్‌లో వేంపల్లె మండలంలోని ఇడుపులపాయ గెస్ట్‌హౌస్‌కు చేరుకుని రాత్రికి అక్కడే బస చేస్తారు. 2వ తేదీన ►ఉదయం 8.50 గంటలకు ఇడుపులపాయలోని వైఎస్సార్ గెస్ట్‌హౌస్ నుంచి రోడ్డు మార్గాన బయలుదేరి 9 గంటలకు వైఎస్సార్ ఘాట్‌కు చేరుకుంటారు. ►9 నుంచి 9.40 గంటల వరకు వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళులర్పించి ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొంటారు. ►ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, 1.30 నుంచి 3 గంటల వరకు, 3.30 నుంచి 5 గంటల వరకు ఇడుపులపాయలో పులివెందుల నియోజకవర్గ అభివృద్ధి పనులపై సమీక్ష నిర్వహిస్తారు. ►5.10 గంటలకు గెస్ట్‌హౌస్ చేరుకుని రాత్రికి అక్కడే బస చేస్తారు. 3వ తేదీన ►ఉదయం 8.50 గంటలకు ఇడుపులపాయ ఎస్టేట్‌లోని గెస్ట్‌హౌస్ నుంచి రోడ్డు మార్గాన బయలుదేరి అక్కడే ఉన్న హెలిప్యాడ్ వద్దకు 9 గంటలకు చేరుకుంటారు. ►అక్కడి నుంచి హెలికాఫ్టర్‌లో బయలుదేరి 9.15 గంటలకు కడప ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. ►9.20 గంటలకు ప్రత్యేక విమానంలో కడప నుంచి బయలుదేరి 10.10 గంటలకు గన్నవరం విమానాశ్రయం చేరుకుని తన నివాసానికి బయలుదేరి వెళతారు. -
రాష్ట్రంలో ప్రతి విద్యార్థి ప్రపంచ స్థాయిలో పోటీ పడేలా శిక్షణ: సీఎం జగన్
-
‘సాఫ్ట్ స్కిల్స్’ సర్టిఫికెట్లు అందజేసిన సీఎం జగన్
CM Jagan Vizag Visit.. అప్డేట్స్ ►మైక్రోసాఫ్ట్ ద్వారా సాఫ్ట్ స్కిల్స్ శిక్షణ పొందిన విద్యార్థులకు సర్టిఫికెట్లు అందజేసిన సీఎం వైఎస్ జగన్ ఏయూ కాన్వోకేషన్ హాల్లో సీఎం జగన్ స్పీచ్ ►సాఫ్ట్ స్కిల్స్‌లో కొత్త అధ్యాయానికి తెరతీశాం ►సాఫ్ట్ స్కిల్స్‌లో శిక్షణ ద్వారా యువతకు ఉపాధి అవకాశాలు ►సాఫ్ట్ స్కిల్స్ శిక్షణ కోసం రూ. 32 కోట్లు ఖర్చు చేశాం ►రాష్ట్రంలో ప్రతి విద్యార్థి ప్రపంచ స్థాయిలో పోటీ పడేలా శిక్షణ ►విద్యారంగంలో ఇవాళ ఓ గర్వకారణం ►మైక్రోసాఫ్ట్ ద్వారా దేశంలోనే తొలిసారిగా సాఫ్ట్ స్కిల్స్ శిక్షణ ►1.62 లక్షల మందికి సాఫ్ట్ స్కిల్స్‌లో శిక్షణ ►40 విభాగాల కోర్సుల్లో విద్యార్థులకు శిక్షణ ►శిక్షణ పూర్తి చేసుకున్న విద్యార్థులకు శుభాకాంక్షలు ►విద్యారంగంలో ఇప్పటికే అనేక కీలక మార్పులు తీసుకొచ్చాం ►నాడు-నేడు, జగనన్న విద్యాదీవెన, వసతి దీవెన, జగనన్న విద్యాకానుక, ఇంగ్లిష్ మీడియా వంటి విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాం ►ఏయూ కన్వెన్షన్ సెంటర్లో సీఎం జగన్ ప్రసంగం ►ఏపీలో ప్లాసిక్ ఫ్లెక్సీలపై నిషేధం ► ఫ్లెక్సీలు పెట్టాలంటే గుడ్డతో తయారుచేసినవే పెట్టాలి ►ఈరోజు విశాఖలో ప్రపంచలోనే అతిపెద్ద బీచ్ క్లీనింగ్ కార్యక్రమం జరిగింది ► ఇవాళ 76 టన్నుల ప్లాస్టిక్‌ను సముద్రం నుంచి తొలగించారు ►పర్యావరణ పరిరక్షణ, ఆర్థిక పురోగతి నాణేనికి రెండు వైపులు ► పర్యావరణాన్ని పరిరక్షిస్తూనే ఆర్థికపురోగతి సాధించాలి ►ఏపీ పౌరులుగా సముద్ర తీరాన్ని కాపాడుకునే బాధ్యత మనందరిది ► సముద్రతీర స్వచ్ఛత, ప్టాస్టిక్ రహిత నదీ జలాల అంశంపై పార్లే ఫర్ ది ఓషన్ సంస్థతో ప్రభుత్వం ఎంవోయూ ► సీఎం జగన్ సమక్షంలో పార్లే ఫర్ ది ఓషన్ సంస్థతో ఎంవోయూ ► ప్లాస్టిక్ వ్యర్థాలను రీసైకిల్ చేసి షూస్, గాడ్జెట్స్ వంటివి తయారుచేస్తోంది ► విశాఖ చేరుకున్న సీఎం జగన్.. ఘన స్వాగతం ► సీఎం జగన్ విశాఖ పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను.. ముఖ్యమంత్రి ప్రోగ్రామ్స్ కమిటీ కోఆర్డినేటర్ తలశిల రఘురాం, మంత్రి గుడివాడ అమర్నాథ్, కలెక్టర్ డా.మల్లికార్జున, సీపీ శ్రీకాంత్ గురువారం పరిశీలించారు. ► విశాఖపట్నం పర్యటన కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. తాడేపల్లిలోని నివాసం నుంచి బయలుదేరారు. షెడ్యూల్ ఉదయం గన్నవరం నుంచి విశాఖ విమానాశ్రయానికి సీఎం జగన్ చేరుకుంటారు. అక్కడి నుంచి బీచ్‌రోడ్డులోని ఏయూ కన్వెన్షన్ హాల్‌కు చేరుకొని.. ‘పార్లే ఫర్ ది ఓషన్’ సంస్థ ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ స్టాల్స్, బీచ్ పరిరక్షణకు నిర్వహించిన కార్యక్రమాలు, ప్లాస్టిక్ నియంత్రణకు సంబంధించి జీవీఎంసీ ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను సీఎం సందర్శిస్తారు. పార్లే ఫర్ ది ఓషన్ సంస్థ గిన్నిస్ రికార్డు నెలకొల్పేలా శుక్రవారం బీచ్ పరిశుభ్రత కార్యక్రమాన్ని చేపడుతోంది. జీవీఎంసీ, జిల్లా కలెక్టరేట్, ఇతర స్వచ్ఛంద సంస్థల సహకారంతో శుక్రవారం ఉదయం 6 నుంచి 8 గంటల వరకు సాగరతీరాన్ని పరిశుభ్రం చేయనుంది. ఆర్కే బీచ్ నుంచి భీమిలి వరకు సుమారు 28 కిలోమీటర్ల పొడవునా సాగరతీరంలో ప్లాస్టిక్, ఇతర వ్యర్థాల్ని సేకరించే కార్యక్రమాన్ని చేపట్టనుంది. మొత్తం 20 వేల మంది వలంటీర్లు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం సీఎం జగన్ సమక్షంలో పార్లే సంస్థ ప్రతినిధులతో రాష్ట్ర ప్రభుత్వ అధికారులు బీచ్ పరిరక్షణపై ఎంవోయూ కుదుర్చుకుంటారు. సిరిపురంలోని ఏయూ కన్వకేషన్ హాల్‌కు చేరుకుని.. మైక్రోసాఫ్ట్ సంస్థ అందించిన డిప్లొమా కోర్సును పూర్తి చేసుకున్న 5 వేల మంది విద్యార్థుల్లో కొందరికి సీఎం జగన్ సర్టిఫికెట్లు ప్రదానం చేస్తారు. అక్కడి విద్యార్థులను ఉద్దేశించి.. సీఎం జగన్ ప్రసంగిస్తారు. ఈ కార్యక్రమం అనంతరం తిరిగి తాడేపల్లికి ఆయన తిరుగుపయనం అవుతారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
వైఎస్సార్, బూచేపల్లి విగ్రహాలను ఆవిష్కరించిన సీఎం జగన్
ప్రకాశం చీమకుర్తి పర్యటన అప్డేట్స్ ►ఉమ్మడి ప్రకాశం జిల్లాలో రైతులకు మేలుచేసే ప్రాజెక్టు వెలిగొండ: సీఎం జగన్ ►వెలిగొండ మొదటి టన్నెల్ ఇప్పటికే పూర్తయ్యింది: సీఎం జగన్ ►మొగిలిగుండ్ల చెరువును మినీ రిజర్వాయర్‌గా మారుస్తాం: సీఎం జగన్ ►పేదలు, రైతులు సంక్షేమం అంటే గుర్తుకొచ్చే పేరు మహానేత వైఎస్సార్: సీఎం జగన్ ►రైతులకు ఉచిత విద్యుత్ ఇచ్చిన ఘనత మహానేత వైఎస్సార్‌కే దక్కుతుంది: సీఎం జగన్ ►ఆరోగ్యశ్రీ పేరు చెప్పగానే గుర్తుకొచ్చే పేరు మహానేత వైఎస్సార్: సీఎం జగన్ ►ఫీజు రీయింబర్స్మెంట్ ద్వారా పేదలకు చదువు అందించారు వైఎస్సార్: సీఎం జగన్ ► దివంగత నేతలకు పూల నివాళి అర్పించి.. సభను ప్రారంభించిన సీఎం జగన్. ► చీమకుర్తి బహిరంగ సభ వేదిక వద్దకు సీఎం జగన్.. నేతలో ఆప్యాయ పలకరింపు. ► కాసేపట్లో బహిరంగ సభలో పాల్గొనున్న సీఎం జగన్. ► మహానేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి, దర్శి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి సుబ్బారెడ్డి కాంస్య విగ్రహాలను ఆవిష్కరించిన సీఎం జగన్. ► కాసేపట్లో మెయిన్‌రోడ్డులోని బూచేపల్లి సుబ్బారెడ్డి కల్యాణ మండపం వద్దకు చేరుకోనున్న సీఎం జగన్. ► చీమకుర్తి చేరుకున్న సీఎం వైఎస్ జగన్ ► ప్రకాశం జిల్లా చీమకుర్తి పర్యటన కోసం సీఎం జగన్ తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరారు. --- ► విగ్రహాల ఆవిష్కరణ అనంతరం.. బీవీఎస్ఆర్ ఇంజినీరింగ్ కాలేజ్ వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన పాల్గొంటారు. ► బుధవారం ప్రకాశం జిల్లా పర్యటనలో భాగంగా.. చీమకుర్తి మెయిన్‌రోడ్డులోని బూచేపల్లి సుబ్బారెడ్డి కల్యాణ మండపం వద్ద దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి సుబ్బారెడ్డి కాంస్య విగ్రహాలను ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆవిష్కరిస్తారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
CM Jagan: చీమకుర్తిలో పర్యటించనున్న సీఎం జగన్
సాక్షి, ప్రకాశం జిల్లా: సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈనెల 24న చీమకుర్తిలో పర్యటించనున్న నేపథ్యంలో వైఎస్సార్ సీపీ రీజినల్ కోఆర్డినేటర్ బాలినేని శ్రీనివాసరెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాదరెడ్డి ఆధ్వర్యంలో కలెక్టర్ దినేష్ కుమార్, ఎస్పీ మలికాగార్గ్ భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. జాయింట్ కలెక్టర్ అభిషిక్త్ కిషోర్, ఏఎస్పీ నాగేశ్వరరావు ఏర్పాట్ల పరిశీలనలో పాల్గొన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి, మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి సుబ్బారెడ్డి విగ్రహాలను ఆవిష్కరించనున్నట్లు తెలిపారు. దానితో పాటు బహిరంగ సభ కూడా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. సీఎం హెలికాప్టర్ దిగేందుకు అనువైన ప్రదేశాన్ని పరిశీలించారు. బూచేపల్లి ఇంజినీరింగ్ కాలేజీ, ప్రభుత్వ జూనియర్ కాలేజీ ఆవరణలను పరిశీలించారు. బూచేపల్లి కల్యాణ మండపం పక్కనే చీమకుర్తి మెయిన్‌రోడ్డులో ఇప్పటికే నిర్మాణం పూర్తి కావస్తున్న వైఎస్ రాజశేఖరరెడ్డి, బూచేపల్లి సుబ్బారెడ్డి విగ్రహాలను సీఎం జగన్మోహన్రెడ్డి ప్రారంభిస్తారు. అనంతరం బీవీఎస్ఆర్ ఇంజినీరింగ్ కాలేజీలో బహిరంగ సభ నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు పరిశీలించారు. అనంతరం బీవీఎస్ఆర్ ఇంజినీరింగ్ కాలేజీలో అధికారులతో బాలినేని, బూచేపల్లి ఆధ్వర్యంలో సీఎం జగన్ పర్యటనను విజయవంతం చేసేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సమీక్షించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ యద్దనపూడి శ్రీనివాసరావు, జెడ్పీటీసీ సభ్యులు వేమా శ్రీనివాసరావు, క్రిష్టిపాటి శేఖరరెడ్డి, స్థానిక కౌన్సిలర్లు, వైఎస్సార్ సీపీ నాయకులు పాల్గొన్నారు. చదవండి: (సోనియాగాంధీ వద్దకు కోమటిరెడ్డి, మర్రి శశిధర్‌రెడ్డి!) -
CM Jagan: శ్రీకాకుళం జిల్లా పర్యటనకు సీఎం జగన్
సాక్షి, శ్రీకాకుళం: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ నెల 27న శ్రీకాకుళం రాను న్నారు. అమ్మఒడి పథకం మూడో విడత పంపిణీ కార్యక్రమాన్ని ఇక్కడి నుంచే సీఎం చేపట్టనున్నా రు. ఇదే సందర్భంలో శ్రీకాకుళం–ఆమదాలవలస రోడ్డు నాలుగు లైన్ల విస్తరణ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ఈ మేరకు సీఎం పర్యటన కోసం ఏర్పాట్లు సమీక్షించేందుకు సీఎం ప్రోగ్రాం కో ఆర్డినేటర్, ఎమ్మెల్సీ తలశిల రఘురామ్ మంగళవారం శ్రీకాకుళం వచ్చారు. వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్‌తో కలిసి కోడి రామ్మూర్తి స్టేడియం, ఆర్ట్స్ కళాశాల ప్రాంగణాలను పరిశీలించారు. అనంతరం అధికారులకు పలు సూచనలు చేశారు. సీఎం పర్యటన సాగేదిలా.. ఈ నెల 27న సోమవారం ఉదయం 11 గంటల కు శ్రీకాకుళంలో బహిరంగ సభ జరగనుంది. ఈ కార్యక్రమానికి అమ్మ ఒడి లబ్ధిదారులు హాజరు కానున్నారు. మూడో విడత పంపిణీ కార్యక్రమం ఇక్కడి నుంచే జరుగుతుంది. అంతకుముందు ఆమదాలవలస–శ్రీకాకుళం రోడ్డు నాలుగు లైన్ల విస్తరణ పనులకు శంకుస్థాపన చేస్తారు. అమ్మ ఒడి లబ్ధిదారులతో మమేకమవుతారు. తిత్లీ, వంశధార ప్రాజెక్టుకు అదనపు పరిహారం పొందుతున్న లబ్ధిదారులతో కూడా కాసేపు ముచ్చటిస్తారు. ఈ సందర్భంగా ఆ లబ్ధిదారులు సీఎంకు ధన్యవాదాలు తెలియజేయనున్నారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పర్యటన సందర్భంగా కోడి రామ్మూర్తి స్టేడియంను పరిశీలించిన సీఎం ప్రోగ్రాం కో ఆర్డినేటర్, ఎమ్మెల్సీ తలశిల రఘురాం, పార్టీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్, కలెక్టర్ శ్రీకేష్ బి.లాఠకర్, ఎస్పీ రాధిక తదితరులు ఏర్పాట్లపై సమీక్ష.. సీఎం హాజరవుతున్న ఈ కార్యక్రమాలకు సంబంధించి, పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లపై తలశిల రఘురాం, ధర్మాన కృష్ణదాస్, కలెక్టర్ శ్రీకేష్ బి.లాఠకర్, ఎస్పీ రాధిక సమీక్షించారు. ముందు గా కోడి రామ్మూర్తి స్టేడియం, ఆర్ట్ కళాశాల మైదా నం పరిశీలించారు. అనంతరం హెలీపాడ్ స్థలి, సీఎం పయనించే మార్గం, బహిరంగ సభ, లబ్ధిదారులతో ముఖాముఖీ తదితర వాటిపై చర్చించారు. అనంతరం ఆర్అండ్బీ బంగ్లాకు చేరుకుని జిల్లా స్థాయి అధికారులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. సీఎం పర్యటనకు సంబంధించి పలు సూచన, సలహాలు చేశారు. కార్యక్రమంలో ధర్మా న రామ్ మనోహర్‌నాయుడు, తూర్పు కాపు కార్పొరేషన్ అధ్యక్షుడు మామిడి శ్రీకాంత్, కళింగ వైశ్య కార్పొరేషన్ చైర్మన్ అంధవరపు సూరిబాబు, డీఆర్డీఎ పీడీ బి.శాంతిశ్రీ, ఆర్డీవో బి.శాంతి, శ్రీకాకుళం కార్పొరేషన్ కమిషనర్ ఓబులేసు, డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ వడ్డి సుందర్, ఆర్అండ్బి ఎస్ఈ కాంతిమతి, డీఈవో పగడాలమ్మ, సమగ్ర శిక్ష అభియాన్ పీఓ జయప్రకాష్, డీఎస్పీ మహేంద్ర, వైఎస్సార్సీపీ నాయకులు మెంటాడ స్వరూప్, జలుమూరు ఎంపీపీ వాన గోపి, శిమ్మ రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. చదవండి: (28న ప్యారిస్‌కు సీఎం జగన్) సీఎం పర్యటన విజయవంతం చేయాలి అమ్మ ఒడి మూడో విడత పంపిణీ, మరికొన్ని సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు జిల్లాకొస్తున్న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పర్యటన విజయవంతం చేయాలని ధర్మాన కృష్ణదాస్ పిలుపునిచ్చారు. అమ్మ ఒడి లబ్ధిదారులు, పార్టీ శ్రేణు లు హాజరై జయప్రదం చేయాలని కోరారు. -
సీఎం జగన్ పులివెందుల పర్యటన.. పూర్తి షెడ్యూల్ ఇదే..
కడప సిటీ: రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈనెల 17వ తేదీ శుక్రవారం ఒకరోజు జిల్లా పర్యటనకు రానున్నారని జిల్లా కలెక్టర్ విజయరామరాజు తెలిపారు. తొలుత ప్రొద్దుటూరు పట్టణంలో డీసీసీబీ మాజీ చైర్మన్ ఇరగంరెడ్డి తిరుపాల్‌రెడ్డి మనవడి వివాహ వేడుక కార్యక్రమంలో పాల్గొంటారన్నారు. అలాగే పులివెందుల పట్టణంలోని ఆర్అండ్బీ అతిథి గృహంలో పులివెందుల నియోజకవర్గానికి చెందిన ముఖ్య నాయకులతో సీఎం సమావేశం కానున్నారని ఆయన పేర్కొన్నారు. అనంతరం పర్యటన ముగించుకుని సాయంత్రం కడప ఎయిర్‌పోర్టు నుంచి తాడేపల్లిలోని తన నివాసానికి బయలుదేరి వెళతారని కలెక్టర్ వివరించారు. సీఎం పర్యటన షెడ్యూల్ ఇలా! ►ఈనెల 17వ తేదీ ఉదయం 9.30 గంటలకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తన నివాసం నుంచి బయలుదేరి 9.50 గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. ►10.00 గంటలకు అక్కడి నుంచి విమానంలో బయలుదేరి 10.40 గంటలకు కడప ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. ►10.45 గంటలకు ప్రత్యేక హెలికాప్టర్లో బయలుదేరి 11.00 గంటలకు ప్రొద్దుటూరుకు చేరుకుంటారు. ►11.00 నుంచి 11.15 గంటల వరకు స్థానిక నేతలతో ముచ్చటిస్తారు. ►అక్కడి నుంచి బయలుదేరి 11.25 గంటలకు ప్రొద్దుటూరు పట్టణంలోని శ్రీదేవి ఫంక్షన్ హాలుకు చేరుకుంటారు. ►11.25 నుంచి 11.40 గంటల వరకు డీసీసీబీ మాజీ చైర్మన్ ఇరగంరెడ్డి తిరుపాల్‌రెడ్డి మనవడి వివాహ వేడుకల్లో పాల్గొంటారు. ►11.50 గంటలకు వివాహ వేదిక నుంచి బయలుదేరి హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. ►ఇక్కడి నుంచి బయలుదేరి మధ్యాహ్నం 12.10 గంటలకు పులివెందుల హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. ►12.20 గంటలకు రోడ్డు మార్గాన ఆర్అండ్బీ గెస్ట్‌హౌస్‌కు వెళతారు. ►12.20 నుంచి 12.30 గంటల వరకు విశ్రాంతి తీసుకుంటారు. ►12.30 నుంచి 4.00 గంటల వరకు పులివెందుల నియోజకవర్గ ముఖ్య నాయకులతో సమావేశమవుతారు. ►4.00 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి 4.10 గంటలకు పులివెందులలోని హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. ►అక్కడినుంచి 4.15 గంటలకు బయలుదేరి 4.30 గంటలకు కడప ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. ►కడప ఎయిర్‌పోర్టు నుంచి 4.40 గంటలకు బయలుదేరి గన్నవరం విమానాశ్రయానికి వెళతారు. ►5.45 గంటలకు తాడేపల్లిలోని తన నివాసానికి చేరుకుంటారు. చదవండి: (సచివాలయాలు సూపర్) సీఎం పర్యటన ఏర్పాట్ల పరిశీలన పులివెందుల రూరల్ : రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈనెల 17వ తేదీన జిల్లా పర్యటనలో భాగంగా పులివెందులకు రానున్న నేపథ్యంలో బుధవారం స్థానిక ఆర్అండ్బీ అతిథి గృహంలో సీఎం పర్యటన ఏర్పాట్లపై కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, జిల్లా కలెక్టర్ విజయరామరాజు, ఎస్పీ అన్బురాజన్‌లు ఇతర అధికారులతో చర్చించారు. పటిష్ట బందోబస్తు: సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పులివెందులలో పర్యటించే ప్రాంతాల వద్ద గట్టి బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ అన్బురాజన్ తెలిపారు. బుధవారం స్థానిక ఆర్అండ్బీ అతిథి గృహం వద్ద ఆయన డీఎస్పీ శ్రీనివాసులు, సీఐ రాజు, ఎస్ఐలకు ఏర్పాట్లపై దిశా నిర్దేశం చేశారు. ఎస్పీ మాట్లాడుతూ ముఖ్యమంత్రి పర్యటనలో ఎలాంటి అవాంతరాలు తలెత్తకుండా కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. అనంతరం పులివెందులలోని హెలీప్యాడ్ స్థలాన్ని, ఆర్అండ్బీ అతిథి గృహాన్ని ఆయన పరిశీలించారు. కార్యక్రమంలో జేసీ సాయికాంత్ వర్మ, ఓఎస్డీ అనిల్‌కుమార్‌రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు. సమస్యలపై కలెక్టర్ ఆరా పులివెందుల నియోజకవర్గంలోని సమస్యలపై కలెక్టర్ విజయరామరాజు ఆరా తీశారు. బుధవారం స్థానిక ఏపీ కార్ల్ భవనంలో ఆయన జేసీ సాయికాంత్ వర్మ, ఓఎస్డీ అనిల్‌కుమార్‌రెడ్డిలతో కలిసి పులివెందుల, తొండూరు, వేంపల్లె మండలాల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పులివెందుల, తొండూరు, వేంపల్లె మండలాలకు సంబంధించిన వైఎస్సార్సీపీ నాయకులతో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈనెల 17వ తేదీన స్థానిక ఆర్అండ్బీ అతిథి గృహంలో సమావేశం నిర్వహిస్తారన్నారు. మండలాల్లోని గ్రామాల్లో సీఎం దృష్టికి తీసుకొచ్చే సమస్యల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. మండలాల్లో నెలకొన్న సమస్యలు ప్రస్తావించిన వెంటనే సమాధానం చెప్పే విధంగా అధికారులు ఉండాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు. హెలిప్యాడ్‌ను పరిశీలించిన కలెక్టర్, ఎస్పీ ప్రొద్దుటూరు: సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పర్యటన సందర్భంగా ఏర్పాటు చేస్తున్న హెలిప్యాడ్‌ను బుధవారం కలెక్టర్ విజయరామరాజు, ఎస్పీ అన్బురాజన్‌లు పరిశీలించారు. శ్రీదేవి ఫంక్షన్‌హాల్ ఎదురుగా హెలిప్యాడ్‌ను ఏర్పాటు చేస్తున్నారు. బుధవారం వేకువ జామున భారీ వర్షం పడిన నేపథ్యంలో తగు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. వర్షం పడినా ఇబ్బందులు తలెత్తకుండా రహదారిని ఎత్తుగా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ప్రత్యామ్నాయంగా ఆర్టీఓ కార్యాలయం సమీపంలో హెలిప్యాడ్‌ను కూడా అధికారులు సిద్ధం చేస్తున్నారు. వారి వెంట జేసీ సాయికాంత్‌వర్మ, రిజర్వ్ అడిషనల్ ఎస్పీ మహేష్‌కుమార్, ఐఎస్‌డబ్ల్యూ డీఎస్పీ కృపాకర్, ప్రొద్దుటూరు డీఎస్పీ ప్రసాద్‌రావు, తదితరులు ఉన్నారు. -
YS Jagan: పులివెందుల పర్యటనకు సీఎం జగన్
పులివెందుల: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈనెల 17వ తేదీన పులివెందులలో పర్యటన దృష్ట్యా అందుకు సంబంధించిన ఏర్పాట్లను మంగళవారం కడప ఎస్పీ అన్బురాజన్ పరిశీలించారు. భాకరాపురంలో గల హెలీప్యాడ్‌ను, ఆర్అండ్బీ గెస్ట్‌హౌస్‌ను పరిశీలించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆర్అండ్బీ అతిథి గృహంలో పులివెందుల నియోజకవర్గానికి చెందిన నేతలు, నాయకులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ మేరకు ఆర్అండ్బీ గెస్ట్‌హౌస్‌లో ఎలాంటి ఏర్పాట్లు చేయాలో పోలీసు అధికారులకు ఎస్పీ సూచించారు. అలాగే హెలీప్యాడ్ నుంచి ఆర్అండ్బీ గెస్ట్ హౌస్ వరకు ముఖ్యమంత్రి రోడ్డు మార్గాన రానుండటంతో ఆయా ప్రాంతాలలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని సూచించారు. కార్యక్రమంలో పులివెందుల డీఎస్పీ శ్రీనివాసులు, సీఐలు రాజు, బాలమద్దిలేటి, ఎస్ఐలు గోపినాథరెడ్డి, చిరంజీవి, హాజివల్లి, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. చదవండి: (YSR: గుర్తుందా నాటి విజయ గాథ) ప్రొద్దుటూరులో... ప్రొద్దుటూరు క్రైం /ప్రొద్దుటూరు: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ నెల 17న ప్రొద్దుటూరుకు వస్తున్న నేపథ్యంలో కలెక్టర్ విజయరామరాజు, జిల్లా ఎస్పీ అన్బురాజన్ ఏర్పాట్లను వేరు వేరుగా పరిశీలించారు. బైపాస్‌రోడ్డులోని శ్రీదేవి ఫంక్షన్హాల్లో జరిగే వివాహ వేడుకల్లో సీఎం వైఎస్ జగన్ పాల్గొననున్నారు. ►మంగళవారం ఎస్పీ, ప్రొద్దుటూరు డీఎస్పీ ప్రసాదరావు హెలిప్యాడ్ స్థలంతో పాటు కల్యాణమండపాన్ని పరిశీలించారు. హెలిప్యాడ్ వద్ద, ఫంక్షన్హాల్లో చేపట్టాల్సిన భద్రతా ఏర్పాట్ల గురించి ఎస్పీ స్థానిక పోలీసు అధికారులకు సూచనలు ఇచ్చారు. మాజీ డీసీసీబీ చైర్మన్ ఇరగంరెడ్డి తిరుపాలరెడ్డి పాల్గొన్నారు. ►కొత్తపల్లె పంచాయతీ పరిధిలోని జమ్మలమడుగు బైపాస్ రోడ్డులో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ పనులను జిల్లా కలెక్టర్ విజయరామరాజు, జాయింట్ కలెక్టర్ సాయికాంత్‌వర్మ పరిశీలించారు. ఈ సందర్భంగా వారు అధికారులకు పలు సూచనలు, సలహాలు అందజేశారు. ఏర్పాట్లు పక్కాగా చేపట్టాలన్నారు. ►ఈ కార్యక్రమంలో మైదుకూరు ఎమ్మెల్యే శెట్టిపల్లె రఘురామిరెడ్డి, ఆర్డీఓ శ్రీనివాసులు, తహసీల్దార్ నజీర్ అహ్మద్, మున్సిపల్ కమిషనర్ వెంకటరమణయ్య, కొత్తపల్లె సర్పంచ్ కొనిరెడ్డి శివచంద్రారెడ్డి, కార్యదర్శి పుల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
మే 16న గణపవరం పర్యటనకు సీఎం జగన్
సాక్షి, గణపవరం (పశ్చిమగోదావరి): ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈనెల 16వ తేదీన గణపవరం రానున్నారు. రైతుభరోసా పథకం కింద రైతులకు చెక్కులు పంపిణీ చేస్తారు. ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను పరిశీలించేందుకు బుధవారం ఉదయం 9.30 గంటలకు ముఖ్యమంత్రి కార్యక్రమాల కో–ఆర్డినేటర్ తలశిల రఘురాం, మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని, కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ గణపవరం రానున్నట్టు ఉంగుటూరు ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు మంగళవారం తెలిపారు. సభాస్థలి, హెలీప్యాడ్, ముఖ్యమంత్రి ప్రయాణించే రోడ్డు మార్గాలని వారు పరిశీలిస్తారని చెప్పారు. చదవండి: (తుపాను అలజడి: ఏపీ ప్రభుత్వం అప్రమత్తం) -
వైఎస్సార్, కర్నూలు జిల్లాల్లో సీఎం పర్యటన
కడప సిటీ/కర్నూలు: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ నెల 15, 16వ తేదీల్లో వైఎస్సార్, కర్నూలు జిల్లాల్లో పర్యటించనున్నారు. 15వ తేదీ సాయంత్రం గన్నవరం నుంచి బయలుదేరి కడప ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో వెళ్లి.. ఒంటిమిట్టలో జరిగే శ్రీ సీతారాముల కల్యాణోత్సవానికి హాజరవుతారు. పట్టు వస్త్రాలను సమర్పించి కల్యాణోత్సవాన్ని తిలకిస్తారు. రాత్రికి కడప నగరానికి చేరుకుని, ఆర్అండ్బీ గెస్ట్ హౌస్‌లో బస చేస్తారు. 16వ తేదీ ఉదయం రెండు వివాహ వేడుకల్లో పాల్గొంటారు. అనంతరం ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లి.. అక్కడి నుంచి కర్నూలు జిల్లాలోని ఓర్వకల్లు ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. అనంతరం ఓ వివాహ వేడుకకు హాజరై వధూవరులను ఆశీర్వదిస్తారు. -
కర్నూలు జిల్లా పర్యటనకు సీఎం జగన్
సాక్షి, కర్నూలు(సెంట్రల్): సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ నెల 16న కర్నూలుకు వస్తున్నట్లు కలెక్టర్ పి.కోటేశ్వరరావు తెలిపారు. పత్తికొండ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి బావ, వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి ప్రదీప్‌కుమార్‌రెడ్డి కుమారుడు వివాహానికి హాజరవుతారని చెప్పారు. అయితే పెళ్లి 17వ తేదీ కాగా, 16న సీఎం కర్నూలు చేరుకుని కృష్ణానగర్‌లో ఉన్న ఎమ్మెల్యే నివాసంలో వధూవరులను ఆశీర్వదిస్తారన్నారు. సీఎం పర్యటనపై మంగళవారం కలెక్టర్ కాన్ఫరెన్స్ హాలులో జిల్లా అధికారులు, పోలీసులతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం పర్యటనను విజయవంతం చేసేందుకు అధికారులు, పోలీసులు సమన్వయంతో పని చేయాలన్నారు. ముఖ్యమంత్రి ఓర్వకల్లు ఎయిర్‌పోర్టుకు ప్రత్యేక విమానంలో వచ్చి అక్కడి నుంచి హెలికాప్టర్ ద్వారా బెటాలియన్ చేరుకుంటారన్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో కృష్ణానగర్‌లోని ఎమ్మెల్యే ఇంటికి చేరుకొని అక్కడ నూతన వధూవరులను ఆశీర్వదించే అవకాశం ఉందన్నారు. చదవండి: (దేవుడా...జేసీకి మంచి బుద్ధి ప్రసాదించు!) సమీక్షా సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్ కోటేశ్వరరావు, చిత్రంలో జేసీ రామసుందర్‌రెడ్డి ఈ నేపథ్యంలో సీఎం పర్యటన ప్రాంతాల్లో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని పోలీసులను ఆదేశించారు. సీఎం పర్యటించే ప్రాంతాల్లో ప్రత్యేకంగా శానిటేషన్ చేపట్టాలని మునిసిపల్ కమిషనర్ భార్గవ్తేజ్ను ఆదేశించారు. సీఎం కాన్వాయ్ వాహనాలను ఏర్పాటు చేయాలని డీటీసీని, సీఎం వెళ్లే మార్గంలో ట్రాఫిక్‌కు అంతరాయం లేకుండా చూసుకోవాలని పోలీసులను ఆదేశించారు. హెలిపాడ్, ఎమ్మెల్యే నివాసం వద్ద బారికేడ్లను ఏర్పాటు చేయాలని, అగ్నిమాపక వాహనాలను సమకూర్చాలని సూచించారు. సీఎం పర్యటన ఏర్పాట్లలో ఎవరైనా అలసత్వం వహిస్తే వేటు తప్పదని అధికారులను హెచ్చరించారు. సమీక్షలో జేసీ ఎస్.రామసుందర్‌రెడ్డి, డీఆర్ఓ ఎస్వీ నాగేశ్వరరావు పాల్గొన్నారు. సీఎం పర్యటన ఇలా.. ►ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కర్నూలు జిల్లా పర్యటన ఖరారైంది. 16వ తేదీ ఉదయం 10.40 నుంచి 01.05 గంటల మధ్య కర్నూలులో పర్యటిస్తారు. ►10.40 గంటలకు కడప నుంచి ప్రత్యేక విమానంలో ఓర్వకల్లు ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. ►10.50 గంటలకు హెలికాప్టర్లో కర్నూలు ఏపీఎస్పీ బెటాలియన్‌లోని హెలిపాడ్‌కు చేరుకుంటారు. ►11.10 గంటలకు కర్నూలులోని పత్తికొండ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి ఇంటికి రోడ్డు మార్గంలో బయలు దేరుతారు. ►11.20 గటంలకు ఎమ్మెల్యే ఇంటికి చేరుకుని 11.35 వరకు ఎమ్మెల్యే కుటుంబ సభ్యుల పెళ్లి వేడుకల్లో పాల్గొంటారు. ►11.45 గంటలకు ఏపీఎస్పీ బెటాలియన్ నుంచి హెలికాప్టర్ ద్వారా ఓర్వకల్లు ఎయిర్‌పోర్టుకు బయలు దేరుతారు. ►12.05 గంటలకు ఓర్వకల్లు ఎయిర్‌పోర్టు చేరుకుని గన్నవరానికి విమానంలో వెళ్తారు. -
నంద్యాల జిల్లా పర్యటనకు సీఎం జగన్.. పకడ్బందీ ఏర్పాట్లు
సాక్షి, నంద్యాల: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి జగనన్న వసతి దీవెన కార్యక్రమంలో భాగంగా ఈనె 8వ తేదీన నంద్యాల జిల్లాకు వస్తున్నారు. ఈసందర్భంగా సీఎం పర్యటన వివరాలను జిల్లా కలెక్టర్ మనజీర్‌జిలానీ శామూన్ బుధవారం రాత్రి వెల్లడించారు. విజయవాడ నుంచి కర్నూలు జిల్లా ఓర్వకల్లు ఎయిర్‌పోర్టుకు శుక్రవారం ఉదయం 10.50 గంటలకు సీఎం చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాప్టర్లో 11.10 గంటలకు నంద్యాల ప్రభుత్వ డిగ్రీ కాలేజీకి చేరుకుంటారు. అక్కడ ప్రజాప్రతినిధులు, నాయకులతో మాట్లాడి 11.35గంటలకు బహిరంగ సభ జరిగే ఎస్పీజీ మైదానానికి చేరుకుని అక్కడ ఏర్పాటు చేసిన జగనన్న వసతి దీవెన కార్యక్రమం, పబ్లిక్ మీటింగ్‌లో పాల్గొంటారు. కార్యక్రమం ముగిసిన తర్వాత మధ్యాహ్నం 12.40కు తిరుగు ప్రయాణమవుతారు. ప్రభుత్వ డిగ్రీ కాలేజీ వద్ద ఉన్న హెలిప్యాడ్ నుంచి మధ్యాహ్నం 1 గంటకు ఓర్వకల్లు ఎయిర్‌పోర్టుకు చేరుకుని అక్కడి నుంచి గన్నవరానికి వెళ్తారు. ఏర్పాట్ల పరిశీలన నంద్యాల ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో హెలిప్యాడ్, ఎస్పీజీ గ్రౌండ్లో బహిరంగ సభ వేదిక వద్ద ఏర్పాట్లను నంద్యాల జిల్లా కలెక్టర్ మనజీర్‌జిలానీ శామూన్, కర్నూలు జిల్లా రేంజ్ డీఐజీ సెంథిల్‌కుమార్, ఎస్పీ రఘువీరారెడ్డి, ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిశోర్‌రెడ్డి బుధవారం పరిశీలించారు. అధికారులకు పలు సూచనలు చేశారు. చదవండి: (మంత్రుల రాజీనామా: సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు) ఎయిర్‌పోర్టులో పటిష్ట బందోబస్తు కర్నూలు(సెంట్రల్): సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈనెల 8వ తేదీన నంద్యాల రానున్న నేపథ్యంలో ఓర్వకల్లు ఎయిర్‌పోర్టులో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని అధికారులను కలెక్టర్ పి.కోటేశ్వరరావు ఆదేశించారు. ఎస్పీ సుధీర్‌కుమార్‌రెడ్డి, జేసీ ఎస్.రామసుందర్‌రెడ్డి, ఎయిర్‌పోర్టు ఇన్చార్జ్ డైరెక్టర్ మధుసూదన్‌తో కలసి ఎయిర్‌పోర్టులో ఏర్పాట్లను బుధవారం కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం గన్నవరం నుంచి విమానంలో ఓర్వకల్లు చేరుకొని హెలికాప్టర్ ద్వారా నంద్యాల వెళ్లనున్నారన్నారు. అలాగే తిరిగి నంద్యాల నుంచి హెలికాప్టర్లో ఓర్వకల్లు ఎయిర్‌పోర్టు చేరుకొని విమానంలో గన్నవరం వెళ్లనున్నారని పేర్కొన్నారు. -
పలు అభివృద్ధి కార్యక్రమాల్లో సీఎం జగన్
-
ఆదిత్య బిర్లా ఫ్యాషన్ అండ్ రిటైల్ కంపెనీకి సీఎం జగన్ శంకుస్థాపన
-
వైఎస్ఆర్ ఘాట్‌లో మహానేతకు సీఎం వైఎస్ జగన్ నివాళులు
-
ప్రభుత్వం ఒక్కో ఇంటిపై రూ. 6 లక్షలు ఖర్చు పెడుతోంది: సీఎం జగన్
3.35PM 8042 మంది లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు పంపిణీ కార్యక్రమం ఇళ్ల పట్టాల పంపీణీ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం జగన్ 3.00PM పులివెందులలో 323 ఎకరాల్లో జగనన్న కాలనీ: సీఎం జగన్ ప్రభుత్వం ఒక్కో ఇంటిపై రూ. 6 లక్షలు ఖర్చు పెడుతోంది: సీఎం జగన్ రూ. 147 కోట్లతో రూపాయలతో జగనన్న కాలనీ అభివృద్ధి.. ఒక్కో ఇంటి పట్టా విలువ కనీసం రెండు లక్షల రూపాయలు ఉంటుంది: సీఎం జగన్ 2.40 జగనన్న హౌసింగ్ కాలనీకి చేరుకున్న సీఎం జగన్. అక్కడ హౌసింగ్ లబ్ధిదారులకు ఇళ్ల పట్టాల పంపిణీ చేయనున్న సీఎం జగన్ 2.25PM దీనిలో భాగంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. పులివెందులలో ఆదిత్యా బిర్లా పెట్టుబడులు చారిత్రాత్మక ఘటనగా అభివర్ణించారు. ప్రస్తుతం ఈ కంపెనీ ద్వారా సుమారు రెండువేల మందికి ఉద్యోగావకాశాల లభించినున్నట్లు తెలిపారు..ఒక్క పులివెందులలోనే భవిష్యత్తులో 10వేల మందికి ఉద్యోగ అవకాశాలు ఉంటాయన్నారు. ప్రపంచంలోని ప్రముఖ సంస్థల్లో ఆదిత్య బిర్లా ఒకటి. ఆదిత్య బిర్లా ఫ్యాషన్ అండ్ రిటైల్ కంపెనీకి శంకుస్థాపన చేయడం సంతోషంగా ఉందన్నారు. రాష్ట్రంలోని ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో స్కిల్ డెవలప్మెంట్ కాలేజీ ఏర్పాటు:చేయనున్నట్లు సీఎం జగన్ పేర్కొన్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) 2.20PM పులివెందుల ఇండస్ట్రియల్ పార్క్‌లో ఆదిత్య బిర్లా ఫ్యాషన్ అండ్ రిటైల్ లిమిటెడ్ కంపెనీకి సీఎం జగన్ శంకుస్థాపన. ఆదిత్య బిర్లా గ్రూప్ రూ. 110 కోట్ల పెట్టుబడులు.. 2112 మందికి ఉపాధి. మహానేతకు ఘన నివాళి 11.00 AM ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళులర్పించిని వైఎస్ భారతి 9.30 AM ఇడుపులపాయ వైఎస్సార్ ఘాట్ వద్ద ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డికి నివాళులర్పించారు. సీఎం జగన్ వెంట మంత్రులు అంజాద్ భాషా, ఆదిమూలపు సురేష్, అప్పలరాజు ఉన్నారు. 09:25AM ►వైఎస్సార్ ఘాట్ వద్ద మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డికి వైఎస్ విజయమ్మ నివాళులర్పించారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) 08:50AM సాక్షి, కడప: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కడప జిల్లాలో పర్యటిస్తున్నారు. మూడు రోజుల పర్యటనలో భాగంగా శుక్రవారం పులివెందుల నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. అనంతరం పులివెందులలోని జగనన్న హౌసింగ్ కాలనీకి చేరుకుని అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. సీఎం వైఎస్ జగన్ నేటి పర్యటన వివరాలు ఇలా.. ►24వ తేదీ శుక్రవారం ఉదయం 9.10 గంటల నుంచి 9.40 గంటల వరకు ఇడుపులపాయ వైఎస్సార్ ఘాట్ వద్ద కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక ప్రార్థనలలో పాల్గొంటారు. ►10 గంటలనుంచి 12.00 గంటలవరకు ఇడుపుపాయ వైఎస్సార్ గెస్ట్‌హౌస్‌లో నిర్వహించే ప్రార్థనలలో పాల్గొంటారు. ►మధ్యాహ్నం 2గంటలకు పులివెందులలోని ఏపీఐఐసీ భూముల వద్దకు చేరుకుంటారు. ►2.10 గంటలకు ఆదిత్య బిర్లా ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ యూనిట్‌కు శంకుస్థాపన చేస్తారు. ►2.40 గంటలకు జగనన్న హౌసింగ్ కాలనీకి చేరుకుని అక్కడ హౌసింగ్ లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలను పంపిణీ అనంతరం బహిరంగ సభలో పాల్గొంటారు. ►3.35నుంచి 3.50గంటలవరకు పులివెందుల టీటీడీ కల్యాణ మండపం ఎదురుగా ఉన్న వ్యవసాయ మార్కెట్ యార్డును ప్రారంభిస్తారు. ►3.55 గంటలకు పులివెందులలోని నూతన మోడల్ పోలీస్ స్టేషన్‌ను ప్రారంభిస్తారు. ►4.15గంటలకు అంబకపల్లె రోడ్డులోని రాణితోపు పార్కు ఎదురుగా ఉన్న ఆంధ్ర ఆక్వా హబ్‌ను ప్రారంభిస్తారు. ►5.05 గంటలకు ఇడుపులపాయ హెలీప్యాడ్వద్ద వైఎస్సార్సీపీ నాయకులతో కాసేపు మాట్లాడి వైఎస్సార్ గెస్ట్‌హౌస్‌కు చేరుకుంటారు. -
వైఎస్సార్ జిల్లాలో సీఎం జగన్ పర్యటన(ఫోటోలు)
-
పేదల పాలిట పెన్నిధి జగనన్న ప్రభుత్వం: ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి
-
రాబోయే రోజుల్లో రాయలసీమ రూపురేఖలు మారతాయి: సీఎం జగన్
05.05PM ► కొప్పర్తిలో ఇండస్ట్రీయల్ పార్కులను ప్రారంభించిన అనంతరం సీఎం జగన్ మాట్లాడుతూ.. కొప్పర్తిలో మెగా పారిశ్రామికపార్కు ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందన్నారు. ఇండస్ట్రీయల్ హబ్ నిర్మాణం కోసం రూ. 1585 కోట్లు వెచ్చించినట్లు తెలిపారు. ఈ హబ్‌లో ప్రస్తుతం 6 కంపెనీలు పెట్టుబడులు పెడుతున్నాయన్నారు. ఇప్పటికే రూ. 100 కోట్లు ఖర్చుచేశామని పేర్కొన్నారు. మరో 6 నెలల్లో 7,500 ఉద్యోగాలు కంపెనీల ద్వారా రానున్నాయని సీఎం జగన్ తెలిపారు. ఎలక్ట్రానిక్ హబ్‌తో దాదాపు 75 వేల మంది యువతకు.. ఉద్యోగాలు లభిస్తాయని సీఎం జగన్ తెలిపారు. ఇక్కడ ట్రైనింగ్ పూర్తి చేసుకున్న ఉద్యోగులు ఇదే చోట పనిచేస్తారని సీఎం జగన్ పేర్కొన్నారు. కాగా, ఈ మెగా పారిశ్రామిక హబ్‌లతో రాబోయే రోజుల్లో రాయలసీమ రూపురేఖలు మారిపోతాయని సీఎం జగన్ అన్నారు. 04.38PM ► కొప్పర్తిలో ఇండస్ట్రీయల్ పార్కులను సీఎం జగన్ ప్రారంభించారు. కొప్పర్తి సెజ్‌లో ఇండస్ట్రియల్ పార్క్‌లను అభివృద్ధి చేసిన ప్రభుత్వం. 6914 ఎకరాల్లో ఇండస్ట్రియల్ పార్క్. 3164 ఎకరాల్లో వైఎస్ఆర్ జగనన్న మెగా ఇండస్ట్రియల్ పార్క్. 801 ఎకరాల్లో వైఎస్సార్ ఎలక్ట్రానిక్ మ్యానిఫ్యాక్చరింగ్ క్లస్టర్. 104 ఎకరాల్లో ఎంఎస్ఎంఈ పార్క్‌లు అభివృద్ధి. ఎలక్ట్రానిక్ మ్యానిఫ్యాక్చరింగ్ హబ్‌లో కంపెనీలు రూ. 1052 కోట్లు పెట్టుబడులను పెట్టనున్నాయి. ఎలక్ట్రానిక్ మ్యానిఫ్యాక్చరింగ్ హబ్‌తో దాదాపు 14,100 మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. 03.25PM ► వైఎస్సార్ జిల్లాలో సీఎం వైఎస్ జగన్ పర్యటన కొనసాగుతుంది. కాసేపట్లో సీకే దిన్నె(మ) కొప్పర్తికి సీఎం వైఎస్ జగన్ చేరుకుంటారు. కొప్పర్తిలో ఇండస్ట్రీయల్ పార్క్‌లను సీఎం జగన్ ప్రారంభించనున్నారు. అదే విధంగా వైఎస్సార్ జగనన్న ఇండస్ట్రీయల్ హబ్‌లను ప్రారంభించనున్నారు. వైఎస్సార్ ఎలక్ట్రానిక్ మ్యానిఫాక్చరింగ్ క్లస్టర్‌ను సీఎం జగన్ ప్రారంభిస్తారు. 03.05PM ►సెంచరీ ప్లైబోర్డ్స్ చైర్మన్ సజ్జన్ భజాంకా మాట్లాడుతూ.. ఈ ప్లాంట్ ముందు చెన్నైలో ఏర్పాటు చేద్దామనుకున్నామన్నారు. సీఎం జగన్ బద్వేలులో ఏర్పాటు చేయమని కోరారు. అన్ని సౌకర్యాలు కల్పించారు. ఇక్కడి పారిశ్రామిక విధానం మమ్మల్ని ఎంతగానో ఆకట్టుకుందని తెలిపారు. మౌలిక వసతులు కల్పించేందుకు ప్రభుత్వం వేగంగా అనుమతులు ఇచ్చిందన్నారు. రూ. 600 కోట్టు పెట్టుబడి పెడదామనుకున్నాం. ఇప్పుడు 3 దశల్లో రూ. 2600 కోట్లు వెచ్చించబోతున్నామని తెలిపారు. 02.50PM ► ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. బద్వేలులో సెంచనీ ప్లైబోర్డ్స్ ఏర్పాటు చేయటం సంతోషంగా ఉందన్నారు. బద్వేలు లాంటి వెనుకబడిన ప్రాంతంలో ఇలాంటి సంస్థ రావడం అభినందనీయమన్నారు. ఈ సంస్థకు ప్రభుత్వం తరపున పూర్తి సహకారం ఉంటుందన్నారు. యూకలిప్టస్ రైతులకు ఈ ప్లాంట్ ద్వారా ఎంతో మేలు జరుగుతుందన్నారు. దీంతో స్థానిక యువకులకు ఉపాధి అవకాశాలు కూడా లభిస్తాయని పేర్కొన్నారు. 02.40PM ► బద్వేలు రెవెన్యూ డివిజన్ కొత్త కార్యాలయానికి సీఎం వైఎస్ జగన్ శంకుస్థాపన చేశారు. మెస్సర్స్ సెంచరీ ప్లైబోర్డ్స్ పరిశ్రమకు శంకుస్థాపన చేశారు. 02.30PM ► బద్వేలు చేరుకున్న సీఎం వైఎస్ జగన్ ► బద్వేలు రెవెన్యూ డివిజన్ కొత్త కార్యాలయానికి శంకుస్థాపన చేయనున్న సీఎం జగన్ 01:10PM ప్రొద్దుటూరులో రూ.515.90 కోట్ల అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శంకుస్థాపన చేశారు. అనంతరం బహిరంగసభలో సీంఎ జగన్ మాట్లాడుతూ.. 'వైఎస్సార్ కడప జిల్లా నన్ను గుండెల్లో పెట్టుకుని చూసుకుందన్నారు. ప్రొద్దుటూరులో 30 నెలల కాలంలో లబ్దిదారులకు రూ.326 కోట్లు నగదు బదిలీ చేశామని పేర్కొన్నారు. ‘‘రాష్ట్రంలో అందరికీ సంక్షేమ ఫలాలు అందాలి. నియోజకవర్గంలో ఇళ్ల స్థలాల కోసం రూ. 200 కోట్లు మంజూరు చేశాం. 22 వేల 212 మంది అక్క చెల్లెమ్మలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేశాము. కోర్టు కేసులను పరిష్కరించుకుని ఇళ్ల నిర్మాణం వేగవంతం చేశాం. ప్రొద్దుటూరులో తాగునీటి పైప్‌లన్నీ శిథిలావస్థకు చేరుకున్నాయి. డ్రైనేజీ వ్యవస్థను ఆధునీకరిస్తున్నాం. అందుకుగానూ రూ.163 కోట్లు కేటాయించాం. 171 కిలోమీటర్ల పొడవైన అధునాతన పైపు లైను ఏర్పాటు చేస్తున్నాం. పెన్నానదిపై బ్రిడ్జి నిర్మాణానికి రూ.53 కోట్లు మంజూరు చేశాం. నియోజకవర్గ నాయకుల అభ్యర్థన మేరకు ప్రొద్దుటూరులో ఉర్దూ డిగ్రీ కాలేజీ మంజూరు చేస్తున్నాం. ఆంజనేయ స్వామి ఆలయం అభివృద్ధికి నిధులు మంజూరు చేస్తున్నాం'’ అని సీఎం జగన్ అన్నారు. (మరిన్నీ ఫోటోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి) 12:50PM ►జిల్లా ఇంచార్జి మంత్రి ఆదిమూలపుసురేష్ మాట్లాడుతూ.. 'సంక్షేమరంగంలో ఏపీ ఎంతో ముందంజలో ఉంది. అమ్మఒడి వంటి గొప్ప కార్యక్రమం తీసుకొచ్చిన ఘనత సీఎం జగన్‌దే. రాష్ట్రంలో సంక్షేమాన్ని చూసి చంద్రబాబు ఓర్వలేకపోతున్నారు' అని అన్నారు. 12:40PM ►ప్రొద్దుటూరు నియోజకవర్గ అభివృద్ధి కోసం రూ.515.90 కోట్లు కేటాయించిన సీఎం జగన్‌కు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి కృతజ్ఞతలు తెలియజేశారు. ►వైఎస్ జగన్ ఆశీస్సులతో కౌన్సిలర్ నుంచి ఈ స్థాయికి ఎదిగానని ఎమ్మెల్యే రాచమల్లు అన్నారు. 12:30PM: ►ప్రొద్దుటూరులో 8 అబివృద్ధి కార్యక్రమాలకు సీఎం వైఎస్ జగన్ శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. 12:20PM ►మూడు రోజుల పర్యటన నిమిత్తం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కడప జిల్లా ప్రొద్దుటూరు చేరుకున్నారు. ►ప్రొద్దుటూరులో రూ.515.90 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన ►ప్రొద్దుటూరులోని 5 ప్రధాన మురికి కాల్వల పనులకు రూ.163 కోట్లు ►ప్రొద్దుటూరులో నూతన మంచినీటి పైప్‌లైన్‌కు రూ.119కోట్లు ►ప్రొద్దుటూరులో నూతన కూరగాయల మార్కెట్ కోసం రూ.50.90 కోట్లు ►పెన్నానదిపై బ్రిడ్జి నిర్మాణానికి రూ.53కోట్లు ►ప్రొద్దుటూరు జిల్లా ఆస్పత్రి మౌలిక వసతులకు రూ.20.50కోట్లు ►ఆర్టీసీ బస్టాండ్ ఆధునీకరణకు రూ.4.5కోట్లు ►యోగివేమన ఇంజనీరింగ్ కాలేజ్ మౌలిక వసతుల కోసం రూ.66కోట్లు ►ఎస్సీఎన్ఆర్ డిగ్రీ కాలేజ్ నూతన గదుల నిర్మాణం కోసం రూ.24కోట్లతో పనులు 10:55AM కృష్ణా జిల్లా ►తాడేపల్లి నుండి గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న సీఎం జగన్మోహన్ రెడ్డి. ►కాసేపట్లో గన్నవరం నుండి కడప బయలుదేరనున్న సీఎం జగన్ 09:25AM సాక్షి, కడప : మూడు రోజుల పర్యటన నిమిత్తం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం జిల్లాకు రానున్నారు. గురువారం నుంచి శనివారం వరకు సీఎం జిల్లాలో పర్యటించనున్నారు. 23వ తేదీ తొలిరోజు ప్రొద్దుటూరులో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసి అక్కడ జరిగే బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. ఆ తర్వాత బద్వేలుకు వెళ్లి అక్కడ నూతన ఆర్డీఓ కార్యాలయం ఏర్పాటుకు శంకుస్థాపన చేస్తారు. అనంతరం గోపవరం వద్ద సెంచురీ ఫ్లై వుడ్ పరిశ్రమకు శంకుస్థాపన చేస్తారు. ఆ తర్వాత కమలాపురం నియోజకవర్గంలోని కొప్పర్తికి చేరుకుని అక్కడ పలు పరిశ్రమలకు శంకుస్థాపన చేస్తారు. 24న రెండవరోజు ఇడుపులపాయ, పులివెందులలో జరిగే పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈ సందర్భంగా ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళులర్పించి ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొంటారు. అనంతరం పులివెందులలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనతోపాటు పూర్తయిన పలు అభివృద్ధి పనులను ప్రారంభిస్తారు. ఈనెల 25న మూడవరోజు కుటుంబ సభ్యులతో కలిసి క్రిస్మస్ ప్రార్థనల్లో పాల్గొంటారు. మధ్యాహ్నం తర్వాత కడప ఎయిర్‌పోర్టు నుంచి గన్నవరం బయలుదేరి వెళతారు. నేటి పర్యటన ఇలా.. ►11.20 నుంచి 11.35 గంటల వరకు ప్రొద్దుటూరులో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేస్తారు. ►11.40 నుంచి మధ్యాహ్నం 1.00 గంట వరకు అక్కడ నిర్వహించే బహిరంగ సభలో పాల్గొంటారు. ►1.35 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి బద్వేలు నియోజకవర్గం గోపవరం మండలంలోని గోపవరం ప్రాజెక్టు కాలనీ–1కు చేరుకుంటారు. ►1.50 నుంచి 1.55 గంటల వరకు బద్వేలు రెవెన్యూ డివిజన్ కొత్త కార్యాలయానికి శంకుస్థాపన చేస్తారు. ►1.55 నుంచి 2.25 గంటల వరకు మెజర్స్ సెంచురీ ఫ్లై పరిశ్రమకు శంకుస్థాపన చేస్తారు. ►2.55 గంటలకు సీకే దిన్నె మండలం కొప్పర్తికి చేరుకుంటారు. స్థానిక నాయకులతో మాట్లాడతారు. ►3.10 గంటలకు కొప్పర్తి గ్రామంలోని వైఎస్సార్ జగనన్న మెగా ఇండస్ట్రియల్ హబ్ ఆర్చిని ప్రారంభిస్తారు. ►3.25 గంటలకు వైఎస్సార్ ఈఎంసీ ఇండస్ట్రియల్ ఎన్క్లేవ్ వద్ద ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను సీఎం ప్రారంభిస్తారు. ►5.05 గంటలకు ఇడుపులపాయలోని హెలిప్యాడ్ చేరుకుంటారు. అక్కడ 5.20 గంటల వరకు స్థానిక నాయకులతో మాట్లాడతారు. ►5.25 గంటలకు గెస్ట్‌హౌస్‌కు చేరుకుని రాత్రికి అక్కడే బస చేస్తారు. -
సీఎం జగన్ కడప జిల్లా పర్యటన.. పూర్తి షెడ్యూల్ ఇదే
సాక్షి, కడప సిటీ/అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి జిల్లా పర్యటన ఖరారైంది. ఈనెల 23 నుంచి 25వ తేదీ వరకు జిల్లాలోని వివిధ ప్రాంతాలలో ఆయన పర్యటించనున్నారు. జిల్లాలోని గోపవరం, ప్రొద్దుటూరు, కొప్పర్తి, ఇడుపులపాయ, పులివెందుల ప్రాంతాల్లోని వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, శిలాఫలకాలు ఆవిష్కరించనున్నారని తెలిపారు. అలాగే ప్రొద్దుటూరు, పులివెందులలో నిర్వహించే బహిరంగ సభల్లో సీఎం పాల్గొని ప్రసంగించనున్నారు. షెడ్యూల్ వివరాలు ఇలా ఉన్నాయి. 23వ తేదీ ►ఉదయం 10.30 గంటలకు గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరి 11.15 గంటలకు కడప ఎయిర్పోర్ట్ చేరుకుంటారు ►12.00 – 1.25 గంట వరకు ప్రొద్దుటూరు మండలం బొల్లవరంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలు, అనంతరం బహిరంగ సభ ►మధ్యాహ్నం 2.00 గంటలకు బద్వేలు నియోజకవర్గం గోపవరం మండలంలోని గోపవరం ప్రాజెక్ట్ కాలనీ-1 కు చేరుకుంటారు ►2.15 –2.20 బద్వేలు రెవెన్యూ డివిజన్ కొత్త కార్యాలయానికి శంకుస్ధాపన ►2.20 – 2.50 గంటలకు మెస్సర్స్ సెంచరీప్లై పరిశ్రమకు శంకుస్థాపన ►3.20 గంటలకు సీకే దిన్నె మండలం కొప్పర్తికి చేరుకోనున్న సీఎం ►3.35 గంటలకు కొప్పర్తి గ్రామంలోని వైఎస్ఆర్ జగనన్న మెగా ఇండస్ట్రియల్ హబ్ ఆర్చి ప్రారంభం ►3.50 – 4.50 గంటలకు వైఎస్సార్ ఈఎంసీ ఇండస్ట్రియల్ ఎన్క్లేవ్ వద్ద ఏర్పాటుచేసిన స్టాల్స్ ప్రారంభోత్సవం ►సాయంత్రం 5.30 గంటలకు ఇడుపులపాయ చేరుకుని వైఎస్ఆర్ ఎస్టేట్ గెస్ట్‌హౌస్‌లో రాత్రి బస 24వ తేదీ ►ఉదయం 9.05 గంటలకు వైఎస్సార్ ఘాట్ వద్దకు చేరుకుని దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి సమాధి వద్ద నివాళులర్పించి ప్రార్ధనల్లో పాల్గొంటారు ►ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు ఇడుపులపాయలోని ప్రార్ధనా మందిరానికి చేరుకుని అక్కడ నిర్వహించే ప్రార్ధనల్లో పాల్గొంటారు. ►మధ్యాహ్నం 1.40 గంటలకు పులివెందుల పట్టణ పరిధిలోని ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ పార్క్‌కు చేరుకుంటారు ►2.10 – 2.35 మధ్య ఇండస్ట్రియల్ పార్క్‌లో ఆదిత్య బిర్లా యూనిట్‌కు శంకుస్ధాపన ►2.40 –3.25 గంటలకు వైఎస్సార్ జగనన్న హౌసింగ్ కాలనీలో ఇళ్ళ పట్టాల పంపిణీ, బహిరంగ సభలో లబ్ధిదారులతో ముఖాముఖి ►3.35 గంటలకు మార్కెట్ యార్డుకు చేరుకుని వివిధ అభివృద్ది కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు ►3.55 – 4.05 గంటలకు మోడల్ పోలీస్ స్టేషన్ ప్రారంభోత్సవ కార్యక్రమం ►4.15 గంటలకు రాణితోపు సమీపంలో ఆక్వా హబ్ ప్రారంభోత్సవం ►సాయంత్రం 5.05 గంటలకు ఇడుపులపాయ చేరుకుని వైఎస్ఆర్ ఎస్టేట్ గెస్ట్‌హౌస్‌లో రాత్రి బస 25వ తేదీ ►ఉదయం 9.00 గంటలకు ఇడుపులపాయ ఎస్టేట్ నుంచి బయలుదేరి 9.20 గంటలకు పులివెందుల చేరుకుంటారు ►9.35 – 10.55 గంటల మధ్య పులివెందుల భాకరాపురం సీఎస్ఐ చర్చిలో క్రిస్మస్ సందర్భంగా జరిగే ప్రత్యేక ప్రార్ధనలలో పాల్గొంటారు ►11.00 గంటలకు సీఎస్ఐ చర్చి కాంపౌండ్‌లో ఏర్పాటుచేసిన షాపింగ్ కాంప్లెక్స్ ప్రారంభోత్సవం ►11.35 గంటలకు కడప ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుని గన్నవరం బయలుదేరుతారు ►12.50 గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకోనున్న సీఎం -
సీఎం జగన్ పర్యటనకు పక్కాగా ఏర్పాట్లు.. వివరాలివే.
సాక్షి, విశాఖపట్నం: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి డిసెంబర్ 17న విశాఖ జిల్లా పర్యటనకు సంబంధించి పక్కాగా ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.మల్లికార్జున అధికారులను ఆదేశించారు. సీఎం పర్యటన సందర్భంగా బుధవారం ఆయన పోలీసు కమిషనర్ మనీష్‌కుమార్ సిన్హాతో కలిసి విమానాశ్రయం, ఎన్ఏడీ ఫ్లైఓవర్, వీఎంఆర్డీఏ పార్కు, ఏయూ కన్వెన్షన్ సెంటర్, వైజాగ్ కన్వెన్షన్, పీఎం పాలెం ప్రాంతాలను పరిశీలించారు. ఎయిర్పోర్ట్ వద్ద ప్రజాప్రతినిధుల కోసం అవసరమైన ఏర్పాట్లు చేయాలన్నారు. ఎన్ఏడీ ఫ్లైఓవర్, వీఎంఆర్డీఏ పార్కు వద్ద ఏర్పాట్లకు సంబంధించి అధికారులకు పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఎం.వేణుగోపాలరెడ్డి, జీవీఎంసీ కమిషనర్ లక్ష్మీశ, వీఎంఆర్డీఏ కమిషనర్ వెంకటరమణారెడ్డి, ఆర్డీవో పెంచల కిశోర్ పాల్గొన్నారు. సీఎం జగన్ విశాఖ పర్యటన వివరాలు.. ►రేపు విశాఖపట్నంలో సీఎం వైఎస్ జగన్ పర్యటన ►విశాఖ నగరంలో పలు అభివృద్ది ప్రాజెక్ట్‌ల ప్రారంభోత్సవం ►సాయంత్రం 4.10 గంటలకు గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి విశాఖ బయలుదేరనున్న సీఎం ►సాయంత్రం 5.20 గంటలకు ఎన్ఏడీ జంక్షన్లో ఎన్ఏడీ ఫ్లై ఓవర్, వీఎంఆర్డీఏ అభివృద్ది చేసిన మరో 6 ప్రాజెక్ట్‌లను ప్రారంభించనున్న సీఎం ►సాయంత్రం 6.00 గంటలకు విజయనగరం జిల్లా డీసీసీబీ చైర్మన్ నెక్కల నాయుడు బాబు కుమార్తె దివ్యా నాయుడు వివాహ ఫంక్షన్‌కు హాజరవనున్న ముఖ్యమంత్రి ►సాయంత్రం 6.20 గంటలకు ఉడా పార్క్ వద్ద ఉడా పార్క్‌తో పాటు జీవీఎంసీ అభివృద్ది చేసిన మరో 4 ప్రాజెక్ట్‌లను ప్రారంభించనున్న సీఎం ►సాయంత్రం 7 గంటలకు పీఎం పాలెం వైజాగ్ కన్వెన్షన్‌లో ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు మనవరాలు నిహారిక వివాహ రిసెప్షన్‌కు హాజరుకానున్న సీఎం ►అనంతరం రాత్రి 8 గంటలకు విశాఖ నుంచి గన్నవరం తిరుగు పయనం చదవండి: (సీఎం జగన్‌తో ఫ్లిప్‌కార్ట్ సీఈఓ భేటీ.. పెట్టుబడులపై విస్తృత చర్చ) -
సిమ్లా పర్యటనకు వెళ్లిన సీఎం వైఎస్ జగన్
విమానాశ్రయం (గన్నవరం): సీఎం వైఎస్ జగన్ గురువారం సిమ్లా పర్యటనకు వెళ్లారు. తొలుత తాడేపల్లి నుంచి రోడ్డుమార్గం ద్వారా ఆయన ఉదయం 10 గంటలకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడి నుంచి కుటుంబసభ్యులతో కలిసి చండీగఢ్ ఎయిర్‌పోర్ట్‌కు బయలుదేరి వెళ్లారు.విమానాశ్రయంలో సీఎం ప్రోగ్రాం కోఆర్డినేటర్ తలశిల రఘురాం, విజయవాడ సీపీ బత్తిన శ్రీనివాసులు, డీసీపీ హర్షవర్థన్‌రాజు, పలువు రు అధికారులు సీఎంకు వీడ్కోలు పలికారు. చదవండి: Jagananna Vidya Kanuka:..రూ.789 కోట్లతో 48 లక్షలమంది పిల్లలకు ‘కానుక’ -
కొన్ని గంటల్లో సీఎం పర్యటన.. పేలుడు కలకలం
భీమవరం: పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం టూటౌన్ పరిధిలో శుక్రవారం రాత్రి పేలుడు సంభవించింది. ఉండి రోడ్డులోని జంట కాలువల సమీపంలోని పెట్రోల్ బంక్ పక్కన ఖాళీ స్థలంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ పేలుడు బాంబుతో సంభవించిందా లేక మరేదైనా కారణమా అనేది ఇంకా నిర్ధారణ కాలేదు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి శనివారం భీమవరంలో పర్యటించనుండగా.. పేలుడు సంభవించడంతో పోలీస్, అధికార యంత్రాంగాలు కలవరపడ్డాయి. సీఎం పర్యటన కోసం వచ్చిన బాంబ్ స్క్వా డ్ పేలుడు సంభవించిన ప్రాంతంలో అణువణువు తనిఖీ చేసింది. సమాచారం అందుకున్న ఎస్పీ రాహుల్‌దేవ్ శర్మ హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఈ ఘటన బాంబు పేలుడు వల్ల సంభవించలేదని ఆయన ప్రాథమికంగా నిర్ధారించారు. పాత ఫ్రిజ్‌లోని గ్యాస్ సిలిండర్ లేదా ఎలక్ట్రానిక్ పరికరాల్లో ఉపయోగించే ఏదైనా బ్యాటరీ వల్ల గాని పేలుడు సంభవించి ఉండొచ్చని భావిస్తున్నామన్నారు. నిపుణులు పరీక్షల అనంతరమే దీనికి కారణం ఏమిటనేది స్పష్టంగా తెలుస్తుందన్నారు. ఆవు కాలు వేయడంతో.. పెట్రోల్ బంక్ పక్కన ఎంతోకాలంగా పాత ఇనుప సామాను వ్యాపారం నిర్వహిస్తున్నారు. షాపు వెనుక ఖాళీ ప్రదేశంలో పాత ఇనుప సామగ్రిని నిల్వ చేస్తుంటారు. అదే ప్రాంతంలో పచ్చిక ఉండటంతో నిత్యం ఆవులు మేత కోసం అక్కడికి వస్తుంటాయి. శుక్రవారం రాత్రి ఆవులు పచ్చగడ్డి మేస్తుండగా ఒక ఆవు గుర్తుతెలియని వస్తువుపై కాలువేయడంతో పేలుడు సంభవిం చింది. పేలుడు ధాటికి ఆవు వెనుక కాలు పూర్తిగా దెబ్బతినగా.. పొట్టభాగంలో తీవ్ర గాయమై కదలలేని స్థితిలో పడిపోయింది. పేలుడు శబ్దం చాలాదూరం వినిపించినట్టు చెబుతున్నారు. -
మాట ఇచ్చారు.. నిలబెట్టుకున్నారు..
సాక్షి, రాజమహేంద్రవరం: రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన మాటను నిలబెట్టుకుంది. అంతర్వేదిలో 2021 ఉత్సవాలు, రథోత్సవం కొత్త రథంతోనే నిర్వహిస్తామని భక్తులకు ఇచ్చిన హామీని సీఎం వైఎస్ జగన్ నెరవేర్చారు. అంతర్వేదిలో రథం దగ్థౖమైన తర్వాత ఐదు నెలల్లో అన్ని హంగులతో కొత్త రథం నిర్మాణం పూర్తయ్యింది. శుక్రవారం నుంచి ప్రారంభమయ్యే అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి కల్యాణోత్సవాలకు కొత్త రథాన్ని ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి సర్వాంగ సుందరంగా సిద్ధం చేశారు. కల్యాణోత్సవాలు, కొత్త రథాన్ని ప్రారంభించేందుకు సీఎం శుక్రవారం అంతర్వేదికి వస్తున్నారు. వైఎస్ జగన్ సుమారు గంట పాటు స్వామి సేవలో గడపనున్నారు.. భక్తుల మనోభావాలకే సర్కారు పెద్దపీట రథం దగ్ధం అయిన నాటి నుంచి కొత్త రథం రూపు దాల్చేంత వరకు రాష్ట్ర ప్రభుత్వం భక్తుల మనోభావాలకే పెద్ద పీట వేసింది. గతేడాది సెప్టెంబర్ 5న అర్థరాత్రి దాటాక అంతర్వేదిలో రథం దగ్ధం అయ్యింది. దీన్ని సాకుగా తీసుకుని రాజకీయ లబ్ధి పొందేందుకు ప్రతి పక్షాలు, కొన్ని సంస్థలు ప్రయత్నించాయి. కుట్రలకు తెరలేపాయి. కొత్త రథం లేకుండా ఫిబ్రవరిలో ఉత్సవాలు నిర్వహించడం అరిష్టమనే ప్రచారాన్ని కూడా చేశాయి. ఉద్యమాలు, నిరసన పేరుతో రాద్ధాతం చేసి రాష్ట్ర ప్రభుత్వంపై బురదజల్లేందుకు ప్రయత్నించాయి. అయితే సంఘటన జరిగిన మరుక్షణమే సీఎం స్పందించారు. కొత్త రథం తోనే ఉత్సవాలు నిర్వహిస్తామని ప్రకటించారు. రథం దగ్ధం కేసును సీబీఐకి అప్పగించాలని కేంద్రాన్ని కోరడంతో ప్రతిపక్షాల నోళ్లు మూతపడ్డాయి. ఇటీవల పార్లమెంటు సమావేశాల సందర్భంలో సైతం వైఎస్సార్సీపీ ఎంపీలు రథం దగ్థంపై సీబీఐ దర్యాప్తు విషయం ఏమైందని కేంద్రాన్ని ప్రశ్నించడం గమనార్హం. రూ.95 లక్షలతో కొత్త రథం అంతర్వేదిలో ఫిబ్రవరిలోగా కొత్త రథం తయారు చేయించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. దీనిని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సీఎం ఈ కార్యక్రమం వెంటనే కార్యరూపం దాల్చేలా సెప్టెంబర్ 8న మంత్రుల బృందాన్ని ఏర్పాటు చేశారు. రూ.95 లక్షల నిధులు మంజూరు చేశారు. స్వామి కల్యాణోత్సవాల సమయానికి కొత్త రథాన్ని సిద్ధం చేయాలనే సంకల్పంతో పనులు వేగవంతం చేశారు. రథం నిర్మాణాన్ని పర్యవేక్షించేందుకు ప్రభుత్వం అధికారులతో మరో కమిటీని కూడా నియమించింది. ఈ కమిటీ రథం నిర్మాణాన్ని, పనుల్లో నాణ్యతను ఎప్పటికప్పుడు పరిశీలించింది. మొత్తం 1,330 ఘనపటడుగుల బస్తర్ టేకును రథం కోసం వినియోగించారు. విశాఖ శారదా పీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర స్వామి, పుష్పగిరి పీఠాధిపతి శ్రీ విద్యాశంకర భారతీస్వామి కొత్త రథం పనులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. అంతర్వేదిలో సీఎం పర్యటన ఇలా.. సాక్షి, అమరావతి: సీఎం వైఎస్ జగన్ శుక్రవారం ఉదయం 11.20 గంటలకు అంతర్వేది ఫిషింగ్ హార్బర్ వద్ద హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. 11.35 గంటలకు శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ రాజగోపురం వద్దకు చేరుకుంటారు. 11.35 నుంచి 11.45 మధ్య స్వామి దర్శనం, అర్చన, మంత్రపుష్పం సమర్పణ కార్యక్రమాలను సీఎం నిర్వహిస్తారు. అనంతరం రాజ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకుంటారు. 12 గంటలకు శ్రీలక్ష్మీనరసింహస్వామి రథాన్ని ప్రారంభిస్తారు. అనంతరం 1.30కి తాడేపల్లికి చేరుకుంటారు. చదవండి: (యోధులారా వందనం : సీఎం జగన్) -
నేనున్నానంటూ..
సాక్షి ప్రతినిధి, కర్నూలు: దివంగత ఎమ్మెల్సీ చల్లా రామకృష్ణారెడ్డి కుటుంబసభ్యులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పరామర్శించారు. వారిని ఓదార్చి, మనోధైర్యాన్ని నింపారు. అన్ని విధాలా అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. కోవిడ్ బారిన పడిన రామకృష్ణారెడ్డి ఇటీవల కన్నుమూసిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో ఆయన కుటుంబాన్ని పరామర్శించేందుకు ముఖ్యమంత్రి బుధవారం చల్లా సొంతూరైన కర్నూలు జిల్లా అవుకు పట్టణానికి వచ్చారు. మధ్యాహ్నం 12.31 గంటలకు అవుకులోని ‘చల్లా భవన్’కు చేరుకున్నారు. చల్లా చిత్రపటం వద్ద నివాళులర్పించారు. తర్వాత చల్లా సతీమణి శ్రీదేవి, కుమారుడు భగీరథరెడ్డి, సోదరులు రఘునాథరెడ్డి, రామేశ్వరరెడ్డి, ప్రభాకర్‌రెడ్డితో పాటు ఇతర కుటుంబసభ్యులను పరామర్శించారు. వారిని పేరుపేరునా పలుకరించారు. కోవెలకుంట్ల, బనగానపల్లె నియోజకవర్గాల అభివృద్ధికి చల్లా ఎనలేని కృషి చేశారని, ఆయన మృతి పార్టీకి, వ్యక్తిగతంగా తనకూ తీరని లోటని సీఎం అన్నారు. తన తండ్రి దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో చల్లా ఎమ్మెల్యేగా ఉన్నారని, తాను సీఎంగా ఉన్నప్పుడు ఎమ్మెల్సీ అయ్యారని గుర్తు చేసుకున్నారు. చల్లా లేని లోటు తీర్చలేనిది చల్లా లేని లోటు కుటుంబానికి తీర్చలేనిదని, అయితే అన్ని విధాలుగా తనతో పాటు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని సీఎం భరోసానిచ్చారు. దాదాపు 25 నిమిషాల పాటు చల్లా కుటుంబసభ్యులతో గడిపారు. ఆ తర్వాత అవుకు నుంచి నేరుగా ఓర్వకల్లు చేరుకుని..అక్కడి నుండి విజయవాడకు తిరుగుపయనమయ్యారు. ముఖ్యమంత్రితో పాటు జిల్లా ఇన్చార్జి మంత్రి అనిల్‌కుమార్ యాదవ్, ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, బనగానపల్లె ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి, తదితరులు చల్లా కుటుంబాన్ని పరామర్శించారు. ముఖ్యమంత్రి ఉదయం 11.50 గంటలకు ఓర్వకల్లు ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. అక్కడి నుంచి హెలికాప్టర్లో అవుకు వచ్చారు. ఎంపీలు సంజీవ్‌కుమార్, పోచా బ్రహ్మానందరెడ్డితో పాటు పలువురు ప్రజా ప్రతినిధులు, వైఎస్సార్సీపీ నేతలు, భారీ సంఖ్యలో కార్యకర్తలు, ప్రజలు స్వాగతం పలికారు. -
నేడు విజయనగరానికి సీఎం వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం విజయనగరం జిల్లాలో పర్యటిస్తారు. విస్తీర్ణంలో రాష్ట్రంలోనే అతి పెద్దదైన గుంకలాంలోని వైఎస్సార్ జగనన్న కాలనీలో సీఎం జగన్ పైలాన్ ఆవిష్కరించి, లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తారు. అనంతరం గృహ నిర్మాణాలకు భూమి పూజలో పాల్గొంటారు. బుధవారం ఉదయం 9.30 గంటలకు తాడేపల్లి నుంచి సీఎం విజయనగరం జిల్లాకు బయలుదేరి 11:15 గంటలకు గుంకలాం చేరుకుంటారు. అక్కడ నిర్మించిన నమూనా ఇంటిని పరిశీలిస్తారు. సభావేదిక వద్ద ఇళ్ల లబ్ధిదారులతో ముఖాముఖిలో పాల్గొంటారు. మధ్యాహ్నం 2.45 గంటలకు తిరిగి తాడేపల్లిలోని తన నివాసానికి చేరుకుంటారు. విజయనగరం జిల్లాలోని గుంకలాం లేఅవుట్ ►ఈ కార్యక్రమానికి జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, సీఎం ప్రోగ్రామ్ కో ఆర్డినేటర్ తలశిల రఘురాం, ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి, జిల్లా వైఎస్సార్సీపీ రాజకీయ వ్యవహారాల సమన్వయకర్త మజ్జిశ్రీనివాసరావు ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు. ►విజయనగరం రూరల్ మండలం గుంకలాం వద్ద 397.36 ఎకరాల్లో 12,301 మంది లబ్ధిదారుల కోసం అతి పెద్ద లేఅవుట్ రూపొందించారు. రూ.4.37 కోట్లతో ఈ లేఅవుట్‌ను అభివృద్ధి చేశారు. భూమి కోసం 428 మంది రైతులకు రూ.101.73 కోట్ల నష్ట పరిహారం చెల్లించారు. ►విజయనగరం జిల్లాలో 1,08,230 మందికి ప్రభుత్వం ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తోంది. వీరిలో గ్రామీణ ప్రాంతాలకు చెందిన 65,026 మంది, పట్టణ ప్రాంతాలకు చెందిన 43,204 మంది ఉన్నారు. జిల్లాలో మొత్తం 1,164 లేఅవుట్లను సిద్ధం చేశారు. -
ఇడుపులపాయకు చేరుకున్న సీఎం జగన్
సాక్షి, వైఎస్సార్: మూడు రోజుల జిల్లా పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇడుపులపాయకు చేరుకున్నారు. గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో కడప విమానాశ్రయానికి చేరుకున్న సీఎం అక్కడ నుంచి హెలీకాప్టర్ ద్వారా ఇడుపులపాయకు వెళ్లారు. ఆయన వెంట కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు. డిప్యూటీ సీఎం అంజాద్ బాష, ఇంచార్జ్ మంత్రి ఆదిమూలపు సురేష్, ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి, విప్ కొరుముట్ల శ్రీనివాసులు, ఎమ్మెల్యేలు రవీంద్రారెడ్డి, రఘురామి రెడ్డి, మేడా మలికార్జున రెడ్డి, సుధీర్ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, రాచమల్లు శివప్రసాద్ రెడ్డి, ఎమ్మెల్సీ జఖియా ఖనం, కత్తి నరసింహ రెడ్డి, మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి, జిల్లా కలెక్టర్ హరికిరణ్, కర్నూలు రేంజ్ డిఐజి వెంకట్రామి రెడ్డి, స్థానిక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సీఎం జగన్‌కు ఘన స్వాగతం పలికారు. నేటి రాత్రికి ఇడుపులపాయలోని వైఎస్సార్ అతిథి గృహంలో ముఖ్యమంత్రి బస చేయనున్నారు. (చదవండి: సీఎం వైఎస్ జగన్ కడప పర్యటన షెడ్యూల్) అభివృద్ధి పనులకు శ్రీకారం వైఎస్సార్ జిల్లాలో సీఎం వైఎస్ జగన్ మూడు రోజుల పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ఆ వివరాలు... ► రూ.3115 కోట్లతో గండికోట-సీబీఆర్, గండికోట-పైడిపాలెం లిఫ్ట్ స్కీంకు శంకుస్థాపన ► రూ.1256 కోట్లతో మైక్రో ఇరిగేషన్‌కు శంకుస్థాపన ► రూ.34 కోట్లతో పులివెందులలో నూతన ఆర్టీసీ కాంప్లెక్స్ నిర్మాణానికి శంకుస్థాపన ► రూ.36 కోట్లతో తొండూరు బీసీ రెసిడెన్షియల్ స్కూల్‌కు శంకుస్థాపన ► రూ.46 కోట్లతో పాడా పరిధిలో మౌలిక సదుపాయాల కల్పనకు శంకుస్థాపన ► రూ.184 కోట్లతో మల్టీ కెనెక్టివిటీ బిటి రోడ్స్‌కు శంకుస్థాపన ► రూ.14.5 కోట్లతో గండి ఆంజనేయస్వామి క్షేత్రంలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన ► రూ.180 కోట్లతో పులివెందుల ఏరియా డెవలప్మెంట్ అథారిటీ పరిధిలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన -
సీఎం జగన్ పర్యటన ఏర్పాట్లను పర్యవేక్షించిన మంత్రి నాని
సాక్షి, కృష్ణాజిల్లా: జగ్గయ్యపేట మండలం తక్కెళ్ళపాడులో ఈనెల 21న సమగ్ర భూ సర్వే కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రారంభించనున్నట్లు రాష్ట్ర రవాణా, సమాచారశాఖ మంత్రి పేర్నినాని తెలిపారు. మంగళవారం సీఎం పర్యటన ఏర్పాట్లను సీఎం ప్రోగ్రాం కో ఆర్డినేటర్ తలశిల రఘురాం, ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను, జిల్లా కలెక్టర్ ఇంతియాజ్, జేసీ మాధవిలత, జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్ బాబుతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి నాని మీడియాతో మాట్లాడుతూ.. రైతులు ఎదుర్కొంటున్న భూ వివాదాల శాశ్వత పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర భూ సర్వే చేపడుతోంది. బ్రిటిష్ కాలంలో ఉన్న సర్వేలతోనే నేటి వరకు రికార్డులు ఉన్నాయి. రైతుల మధ్య సరిహద్దు గొడవలు ఉండటం, కోర్టులు చుట్టూ తిరిగి సమయం వృధా, ధనం వృధా అవుతోంది. వీటి శాశ్వత పరిష్కారం కోసం అత్యాధునిక పరికరాలతో శాటిలైట్ ద్వారా ఈ సర్వే ప్రక్రియకు శ్రీకారం చుట్టబోతున్నాము. వివాదాలు లేకుండా చేసి ఆస్తిపై యజమానులకు హక్కు కల్పించే దిశగా ఈ సర్వే జరుగుతుంది' అని మంత్రి నాని వెల్లడించారు. ప్రభుత్వవిప్ ఉదయభాను మాట్లాడుతూ.. ప్రతి రైతుకు భూమిపై హక్కు కల్పించే విధంగా సమగ్ర భూ సర్వే చేపట్టేందుకు సీఎం నిర్ణయించారు. ప్రతీ ఇంటిని కూడా సర్వే నిర్వహించి శాశ్వత హక్కు కల్పించే విధంగా కార్డులు జారీ చేయడం జరుగుతుంది' అని ఉదయభాను తెలిపారు. -
ఏలూరు: బాధితులను పరామర్శిస్తున్న సీఎం వైఎస్ జగన్
-
ఏలూరు ప్రభుత్వాస్పత్రిలో సీఎం జగన్
సాక్షి, పశ్చిమగోదావరి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పశ్చిమగోదావరి జిల్లా ఏలూరుకు చేరుకున్నారు. హెలీప్యాడ్ నుంచి నేరుగా ఏలూరు ప్రభుత్వాసుపత్రికి చేరుకున్న సీఎం అస్వస్థతకు గురై చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు. సీఎం జగన్ వెంట మంత్రి పేర్ని నాని, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఉన్నారు. బాధితుల పరామర్శ అనంతరం జడ్పీ సమావేశ మందిరంలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. అనంతరం దేవరపల్లికి చేరుకొని గోపాలపురం ఎమ్మెల్యే తల్లారి వెంకట్రావు కుమార్తె వివాహ రిసెప్షన్‌కు ముఖ్యమంత్రి హాజరు కానున్నారు. కాగా, ఏలూరులో పలువురు అస్వస్థతకు గురైన విషయం తెలియగానే సీఎం జగన్ ఆదివారం ఉదయం రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్లనానితో మాట్లాడారు. తక్షణం తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. బాధితులను స్వయంగా పరామర్శించడమే కాకుండా వారికి అందుతున్న చికిత్సను పర్యవేక్షించాలన్నారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో మంత్రి నాని ఆదివారం ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రిలో బాధితులను పరామర్శించడమే కాకుండా వైద్యపరంగా తీసుకోవాల్సిన చర్యలను అధికారులతో స్వయంగా పర్యవేక్షించారు. సీఎం ఆదేశాలతో వైద్య ఆరోగ్యశాఖకు చెందిన ఉన్నతాధికారులు కూడా ఏలూరులో బాధితులను పరామర్శించి అస్వస్థతకు దారితీసిన కారణాలపై పలు పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ ఘటనకు దారితీసిన కారణాలు, పరిస్థితులను స్వయంగా తెలుసుకునేందుకు ముఖ్యమంత్రి ఏలూరులో పర్యటించి అధికారులతో సమావేశంకానున్నారు. చదవండి: (సర్కారు బాసట.. కోలుకుంటున్నారు) (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
7న దేవరపల్లికి సీఎం జగన్
సాక్షి, పశ్చిమగోదావరి (దేవరపల్లి): ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈనెల 7న దేవరపల్లికి రానున్న దృష్ట్యా పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ ముత్యాలరాజు, ఎస్పీ నారాయణ నాయక్ పరిశీలించారు. ఎమ్మెల్యే తలారి వెంకట్రావు కుమార్తె వివాహ రిసెప్షన్ వేడుకలకు సీఎం జగన్ హాజరవుతున్నారు. స్థానిక జెడ్పీ హైస్కూల్లో ఏర్పాటు చేసిన హెలీప్యాడ్‌ను బారికేడ్లను కలెక్టర్, ఎస్పీ పరిశీలించారు. ఏర్పాట్లపై ఎమ్మెల్యే తలారి వెంకట్రావును అడిగి తెలుసుకున్నారు. చదవండి: (మహిళల రక్షణలో 'దిశ' మారదు) సీఎం పర్యటన రేపు ఏర్పాట్లు పరిశీలించిన కలెక్టర్, ఎస్పీ అనంతరం పొగాకు వేలం కేంద్రంలో ఏర్పాటు చేస్తున్న రిసెప్షన్ వేదిక, వీవీఎస్ గార్డెన్లో ఏర్పాటు చేసిన వీఐపీల వాహనాల పార్కింగ్ ప్రదేశాన్ని పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. హెలీప్యాడ్ వద్దకు ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులతో పాటు మరో 25 మందిని అనుమతిస్తామని, ఇద్దరు ఫొటోగ్రాఫర్లకు అనుమతి ఉంటుందన్నారు. పాత్రికేయులకు హెలీప్యాడ్, రిసెప్షన్ వేదిక వద్దకు అనుమతి ఉండదని చెప్పారు. రిసెప్షన్ వేదిక వద్దకు 150 మంది బంధువులు, నాయకులకు అనుమతి ఉంటుందన్నారు. కోవిడ్ నిబంధనలు కచ్చితంగా పాటించాలన్నారు. ఈ కార్యక్రమంలో కొవ్వూరు ఆర్డీఓ లక్ష్మారెడ్డి, డీఎస్పీ శ్రీనాథ్, డీపీఓ రమేష్‌బాబు, ఇంటిలిజెన్స్ డీఎస్పీ జి.వి.కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు. -
సీఎం జగన్ పర్యటనకు పటిష్ట ఏర్పాట్లు
సాక్షి, చిత్తూరు : రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి జిల్లా పర్యటన సందర్భంగా పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని జిల్లా ఇన్చార్జి కలెక్టర్ మార్కండేయులు ఆదేశించారు. రేణిగుంట ఎయిర్‌పోర్ట్‌లో సోమవారం ఏఎస్ఎల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తిరుమల బ్రహ్మోత్సవాల్లో స్వామివారికి పట్టు వ్రస్తాలను సమర్పించేందుకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈనెల 23, 24 తేదీల్లో తిరుమల పర్యటనకు రానునున్నట్లు తెలిపారు. 23న మధ్యాహ్నం 3.05 గంటలకు గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి ప్రత్యేక విమానంలో బయ లుదేరి 3.50 గంటలకు తిరుపతి విమానాశ్రయానికి చేరుకుంటారన్నారు. అక్కడ నుంచి నేరుగా రోడ్డు మార్గంలో తిరుమల పద్మావతి అతిథి గృహానికి చేరుకుంటారన్నారు. అక్కడ నుంచి బేడి ఆంజనేయస్వా మి ఆలయానికి చేరుకుని, శ్రీవారికి పట్టువ్రస్తాలను సమర్పిస్తారన్నారు. ఉత్సవాల్లో పాల్గొని, తర్వాత అతిథి గృహంలో బస చేస్తారని, 24న ఉదయం 6.25 గంటలకు మరోమారు వెంకన్నను దర్శించుకుని, తిరుమల నుంచి తిరుగు ప్రయాణమవుతారని తెలిపారు. అలాగే బెంగళూరు నుంచి కర్ణాటక సీఎం యడ్యూరప్ప ఈనెల 23న సాయంత్రం తిరుపతి విమానాశ్రయానికి చేరుకుని, అక్కడ నుంచి తిరుమలకు రోడ్డు మార్గంలో వెళతారన్నారు. వారి పర్యటనకు పటిష్టమైన భద్రత ఏర్పాట్లు చేయాలని పోలీసు అధికారులకు ఐజీ శశిధర్‌రెడ్డి జిల్లా పోలీసు అధికారులను ఆదేశించారు. (డైనమిక్ సీఎం వైఎస్ జగన్) అలాగే రోడ్డు మార్గంలో శానిటేషన్ చర్యలు, ఎయిర్‌పోర్ట్‌లో స్వాగతం కోసం వచ్చే ప్రతినిధుల కోసం ప్రత్యేక బారికేడ్ల నిర్మాణం తదితర అంశాలపై చర్చించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తలను తీసుకోవాలని సూచించారు. తరువాత ముఖ్యమంత్రి ప్రయాణించనున్న రోడ్డు మార్గంలో ట్రయల్‌రన్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎయిర్పోర్ట్ డైరెక్టర్ సురేష్, తిరుపతి అర్బన్ ఎస్పీ రమేష్‌రెడ్డి, తిరుపతి మున్సిపల్ కమిషనర్ గిరీష, డీఎస్పీ చంద్రశేఖర్, ఎయిర్పోర్ట్ సీఎస్ఓ రాజశేఖర్‌రెడ్డి, తహసీల్దార్ శివప్రసాద్, కిరణ్‌కుమార్, రుయా సూపరిండెంటెండ్ భారతి తదితరులు పాల్గొన్నారు. -
సీఎం జగన్ వైఎస్సార్ జిల్లా పర్యటన ఖరారు
సాక్షి, వైఎస్సార్ : మాజీ ముఖ్యమంత్రి, దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతిని పురస్కరించుకొని జూలై 7, 8 తేదీల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వైఎస్సార్ జిల్లా పర్యటన ఖరారైంది. ఈ సందర్భంగా సీఎం జిల్లా పర్యటనను విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ సి. హరికిరణ్ ఆదేశాలు జారీ చేశారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ హరికిరణ్ జిల్లా అధికారులతో, ఎస్పీ అన్బురాజన్‌తో సమీక్షా సమావేశం నిర్వహించారు. కోవిడ్-19 నేపథ్యంలో స్టాండర్డ్ ఆపరేషనల్ ప్రోటోకాల్(ఎస్ఓపీ) తప్పనిసరిగా పాటించాలన్నారు. పర్యటనలో భాగంగా ఇడుపులపాయ, ఆర్కే వ్యాలీ ట్రిపుల్ ఐటీలో ముఖ్యమంత్రి నిర్వహించే కార్యక్రమాల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలన్నారు. బందోబస్తు పరంగా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాటు చేయాలని ఎస్పీ అన్బురాజన్‌కు తెలిపారు. -
అభివృద్ధి.. అడుగులు
సాక్షి ప్రతినిధి కడప: ఆరు నెలల వ్యవధిలోనే ప్రభుత్వం జిల్లాలో వేల కోట్ల అభివృద్ది పనులకు శ్రీకారం చుట్టనుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈనెల 23, 24, 25 తేదీలలో వీటికి శంకుస్థాపనలు చేయనున్నారు. పులివెందులలో ఇండోర్స్టేడియంతోపాటు ఇప్పటికే పూర్తయిన పలు అభివృద్ది పనులను ప్రారంభించనున్నారు. సీఎం తాజా పర్యటనలో వేయనున్న శిలాఫలకాలు జిల్లా ప్రగతిలో మైలురాళ్లుగా నిలవనున్నాయి. వివిధ అభివృద్ధి పనులలో పాలుపంచుకునేందుకు ఆయన మూడు రోజుల పర్యటన ఖరారైంది. పులివెందుల, జమ్మలమడుగు, మైదుకూరు, కడప, రాయచోటి ప్రాంతాలలో పెద్ద ఎత్తున అభివృద్ది కార్యక్రమాలకు ఈనెల 23 నుంచి 25 వరకూ పలు శంకుస్థాపనలు చేయనున్నారు. సీఎం పర్యటనపై జిల్లావ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. ఏర్పాట్ల పూర్తిలో అధికారులు బిజీబిజీగా ఉన్నారు. సీఎం పర్యటన ఇలా..23వతేదీ(సోమవారం) ⇔ ఉదయం 8.50గంటలకు : కడప ఎయిర్‌పోర్టుకు సీఎం చేరిక ⇔ 9.20: కడపలో రైల్వే ఓవర్‌బ్రిడ్జి ప్రారంభం ⇔ 9.55: రిమ్స్‌లో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన ⇔ 10.30: వైఎస్సార్ ఉచిత భోజన వసతి భవనం ప్రారంభం ⇔ 11.35: హెలికాప్టర్లో జమ్మలమడుగు మండలం సున్నపురాళ్లపల్లె చేరిక ⇔ 11.50: ఏపీ హైగ్రేడ్ స్టీల్స్‌కు సీఎం శంకుస్థాపన, అనంతరం బహిరంగ సభ ⇔ మధ్యాహ్నం 2.10 గంటలకు: దువ్వూరు మండలం నేలటూరు హెలీప్యాడ్ వద్ద దిగుతారు. ⇔ 2.15గంటలకు: మైదుకూరు, బద్వేలు నియోజకవర్గాలకు సంబంధించిన నీటి ప్రాజెక్టులకు శంకుస్థాపన,అనంతరం బహిరంగసభలో ప్రసంగిస్తారు. ⇔ సాయంత్రం 5 గంటలకు: సీఎం ఇడుపులపాయ చేరిక 24వ తేదీ (మంగళవారం) ⇔ ఉదయం 9.05గంటలకు: ఇడుపులపాయ వైఎస్సార్ ఘాట్‌కు చేరిక. ⇔ 9.10గంటలకు: దివంగత ముఖ్యమంత్రి వైస్సార్‌కు నివాళి ⇔ 9.55: ఇడుపులపాయ చర్చిలో ప్రార్థనలు మధ్యాహ్నం ⇔ 2.00గంటలకు: రాయచోటి సభాస్థలికి ముఖ్యమంత్రి చేరుకుంటారు. ⇔ 2.15కు: వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన, అనంతరం బహిరంగసభ ⇔ సాయంత్రం 5 గంటలకు: పులివెందుల బాకరాపురంలోని నివాసానికి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి వెళతారు. 25వ తేదీ (బుధవారం) ⇔ 9.20 గంటలకు: క్రిస్మస్ సందర్భంగా పులివెందుల సీఎస్ఐ చర్చిలో ప్రార్థనలు ⇔ 11.15కు: పులివెందుల జూనియర్‌కళాశాల మైదానంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, వైఎస్సార్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ప్రారంభం ⇔ మధ్యాహ్నం 2.30కు: బాకరాపురం నుంచి హెలికాప్టర్ ద్వారా కడప ఎయిర్‌పోర్ట్‌కు... ⇔ 3గంటలకు: కడప ఎయిర్‌పోర్ట్‌నుంచి గన్నవరం బయలుదేరుతారు. -
5న అనంతకు సీఎం వైఎస్ జగన్
సాక్షి,పెనుకొండ/పుట్టపర్తి అర్బన్: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పర్యటన నేపథ్యంలో ‘కియా’ వద్ద జరుగుతున్న ఏర్పాట్లను మంత్రి మాలగుండ్ల శంకరనారాయణ మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఈ నెల 5న కియా మోటార్స్ గ్రాండ్ సెర్మనీ వేడుకలకు ముఖ్యమంత్రి హాజరవుతున్నట్లు తెలిపారు. పరిశ్రమ పురోగతి, కార్ల ఉత్పత్తి, సౌకర్యాలు, ఉద్యోగాల కల్పన తదితర విషయాలపై ‘కియా’ ప్రతినిధులతో సీఎం సమీక్షించనున్నట్లు వివరించారు. మంత్రి వెంట కలెక్టర్ గంధం చంద్రుడు, ఎస్పీ సత్యయేసుబాబు, సబ్‌కలెక్టర్ టి.నిశాంతి, కియా ప్రతినిధులు ఉన్నారు. అనంతరం పుట్టపర్తి విమానాశ్రమాన్ని కలెక్టర్, ఎస్పీ పరిశీలించారు. అక్కడి సౌకర్యాలపై విమానాశ్రయం అధికారులను అడిగి తెలుసుకున్నారు. రన్‌వే భద్రతాపై చర్చించారు. వీరి వెంట ట్రైనీ కలెక్టర్ జాహ్నవి, కదిరి ఆర్డీఓ రామసుబ్బయ్య, తహసీల్దార్ గోపాలక్రిష్ణ, సీఐలు వెంకటేష్‌నాయక్, బాలసుబ్రహ్మణ్యంరెడ్డి, ఆర్ఐ శ్రీనివాసులు ఉన్నారు. పుట్టపర్తి విమానాశ్రయంలో రన్‌వే పరిశీలనకు వెళ్తున్న అధికారులు సీఎం పర్యటన షెడ్యూల్ ఖరారు అనంతపురం అర్బన్: ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి ఈనెల 5న జిల్లాకు విచ్చేస్తున్నారు. ‘కియా’ మోటర్స్ కంపెనీ గ్రాండ్ ఓపెనింగ్ సెర్మనీ కార్యక్రమంలో ఆయన పాల్గొననున్నారు. ఈ మేరకు సీఎం ప్రోగ్రాం షెడ్యూల్‌ను అధికారులు మంగళవారం విడుదల చేశారు. పెనుకొండ సమీపంలోని కియా కంపెనీలో ఏర్పాట్ల పరిశీలనకు వెళ్తున్న కలెక్టర్, ఎస్పీ.. సీఎం పర్యటన ఇలా.. ►ఉదయం 9.30 గంటలకు గన్నవరం విమానాశ్రయం నుంచి బయలుదేరనున్న సీఎం జగన్మోహన్రెడ్డి ఉదయం 10.30 గంటలకు పుట్టపర్తి విమానాశ్రయానికి చేరుకుంటారు. ►10.40 గంలలకు అక్కడి నుంచి హెలికాప్టర్లో బయలుదేరి 11.05 గంటలకు పెనుకొండ మండలం ఎర్రమంచి గ్రామం వద్ద ఉన్న కియా మోటర్స్ కంపెనీకి వద్దకు చేరుకుంటారు. ►ఉదయం 11.05 గంటల నుంచి మధ్యాహ్నం 12.35 గంటల వరకు ప్లాంట్ టూర్లో భాగంగా పరిపాలన విభాగం, ప్రెస్, బాడీ, పైయింట్, అసెంబ్లీంగ్, ఇంజన్ షాప్‌లను, టెస్ట్ డ్రైవర్‌ను సందర్శిస్తారు. ►మధ్యాహ్నం 12.35 నుంచి మధ్యాహ్నం 1.15 గంటల వరకు ఓపెనింగ్ సెర్మనీలో పాల్గొని ప్రసంగిస్తారు. ►మధ్యాహ్నం 1.20 గంటలకు కియా కంపెనీ వద్ద నుంచి హెలికాప్టర్లో బయలుదేరి మధ్యాహ్నం 1.30 గంటలకు పుట్టపర్తి విమానాశ్రయం చేరుకుంటారు. ►మధ్యాహ్నం 1.55 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి మధ్యాహ్నం 2.55 గంటలకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు. -
ఎన్నికల హామీ డప్పు!
సీఎం చంద్రబాబు జిల్లా పర్యటన అంతా ఎన్నికల హడావుడిని తలపించింది. షెడ్యూల్ కంటే గంటన్నర ఆలస్యంగా వచ్చిన ఆయన శంకుస్థాపనలు.. ప్రారంభాలతో హడావుడి చేశారు. ఆయన ప్రసంగంలో హామీలు వరదలై పారాయి. నాలుగేళ్లుగా ప్రజలు, రైతన్నలు గగ్గోలు పెడుతున్నా పట్టించుకోని చంద్రబాబు, అధికార పార్టీ నేతలకు ఒక్కసారిగా జిల్లా సమస్యపై మమకారం పెరిగి హామీల వర్షం కురిపించారు. ఎవరూ చేయని విధంగా తాను చేసినట్లు ఎన్నికల డప్పు కొట్టుకున్నారు. కావలి/నెల్లూరు టౌన్ : నెల్లూరు జిల్లాలో నాకు తక్కువ సీట్లు ఇచ్చారు. ఇక్కడ 10 నియోజకవర్గాలు ఉన్నాయి. కానీ 2014 ఎన్నికల్లో నెల్లూరు జిల్లా నాకు మూడే సీట్లు ఇచ్చింది. కానీ నేను వివక్ష చూపకుండా నెల్లూరు జిల్లాను అభివృద్ధి చేశానని సీఎం చంద్రబాబునాయుడు చెప్పుకొచ్చారు. జిల్లాను అభివృద్ధి విషయంలో ఎప్పుడు రాజీ పడకుండా కావాల్సిన పనులు అన్ని పూర్తి చేస్తున్నాని చెప్పారు. శుక్రవారం జిల్లాలోని కావలి నియోజకవర్గంలో సీఎం జన్మభూమి–మా ఊరు ఆరో విడత కార్యక్రమంలో భాగంగా పర్యటించారు. తొలుత బోగోలు మండలం జువ్వలదిన్నెకు హెలికాప్టర్ ద్వారా చేరుకున్నారు. అనంతరం అక్కడి నుంచి చిప్పలేరు హైలెవల్ వంతెను ప్రారంభించారు. అక్కడి నుంచి జువ్వలదిన్నెలోని పొట్టిశ్రీరాములు స్మారక భవనాన్ని సందర్శించి అనంతరం అక్కడ పొట్టి శ్రీరాములు విగ్రహాన్ని ఆవిష్కరించారు. అక్కడి నుంచి బోగోలు చేరుకుని జన్మభూమి సభలో సుదీర్ఘంగా ప్రసంగించారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను కూడా కలుపుకుని అన్నీ అభివృద్ధి పనులు తామే చేసినట్లు చెప్పారు. సాగరమాల ప్రాజెక్ట్‌లో భాగంగా చెన్నై–బెంగళూరు కారిడార్ రూ.50 వేల కోట్లతో వస్తుందని, దాని వల్ల నెల్లూరు– చెన్నై–తిరుపతి ట్రై ఇండస్ట్రీయల్ జంక్షన్లుగా అభివృద్ధి చెందుతాయని చెప్పారు. రూ.48 కోట్లతో పులికాట్ ముఖద్వారం పూడికతీత పనులు కూడా కొద్ది రోజుల్లో మొదలవుతాయని చెప్పారు. ఇప్పటికే ఈ జిల్లాలో పోర్టు, సెజ్ ఉందని కొద్ది రోజుల్లో గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ కూడా వస్తే జిల్లా అన్ని విధాలా సర్వతో ముఖాభివృద్ధి సాధిస్తుందని చెప్పారు. కావలి నియోజకవర్గంలో గిరిజన రెసిడెన్షియల్ స్కూల్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. పట్టాల హడావుడి బోగోలు జన్మభూమి సభలో సీఎం ప్రసంగానికి కంటే ముందే సీజేఎఫ్ఎస్ పట్టాల పంపిణీ కార్యక్రమం నిర్వహించి, అందరికీ మండలాల వారీగా ఇవ్వడానికి 80 కౌంటర్లు ఏర్పాటు చేశారు. దీంతో సీఎం ప్రసంగించడం మొదలు పెట్టగానే సభకు వచ్చిన వారు పట్టాల కోసం కౌంటర్ల ముందు బారులు తీరారు. సీఎం సభ పూర్తయినా రెండు గంటల వరకు పట్టాల పంపిణీ జరిగింది. అయితే సభలో ప్రకటించిన విధంగా 66,276.79 ఎకరాలకు సంబంధించి 60,956 మందికి పూర్తిస్థాయిలో పట్టాలు సిద్ధం కాకపోవడంతో అందరికీ ఇవ్వలేదు. దీంతో కొందరు నిరాశగా వెనుదిరిగారు. ఈ క్రమంలో సీఎం సభలో మాట్లాడుతూ ఎక్కడ పైసా అవినీతి లేకుండా అందరికీ పట్టాలను పసుపు–కుంకుమ పేరుతో ఇస్తున్నామని ప్రకటించారు. సీజేఎఫ్ఎస్ పట్టాలు తయారు చేసిన రెవెన్యూ సిబ్బందికి వారి కోరిక మేరకు ఒక నెల వేతనాన్ని బోనస్‌గా అందిస్తున్నట్లు సీఎం ప్రకటించారు. మూడు జిల్లాల నుంచి బస్సులు ముగింపు సభ కావడంతో జనసమీకరణకు నెల్లూరుతో పాటు ప్రకాశం, చిత్తూరు జిల్లాల నుంచి వందల సంఖ్యలో ఆర్టీసీ బస్సుల్ని జనతరలింపునకు వినియోగించారు. ముఖ్యంగా కావలి నియోజకవర్గంలో అన్ని మండలాలకు కలిపి 160 బస్సులు ఏర్పాటు చేశారు. వీరితో పాటు సీజేఎఫ్ఎస్ పట్టాలు కూడా సభలో ఇస్తామని ప్రకటించిన క్రమంలో ప్రతి మండలానికి ఐదు బస్సులు ఏర్పాటు చేసి జనాల్ని సభకు తరలించారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రేవు ముత్యాలరాజు సభాధ్యక్షత వహించారు. మంత్రులు పి.నారాయణ, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, మాజీ మంత్రులు ఆదాల ప్రభాకర్‌రెడ్డి, పరసా వెంకటరత్నం, ఎమ్మెల్యేలు కురుగొండ్ల రామకృష్ణ, బొల్లినేని రామారావు, పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి, పాశం సునీల్‌కుమార్, ఎమ్మెల్సీ బీద రవిచంద్ర, మాజీ ఎమ్మెల్యేలు బీద మస్తానరావు, బొల్లినేని కృష్ణయ్య, నెల్లూరు నగర మేయర్ అబ్దుల్ అజీజ్, జెడ్పీ చైర్మన్ బి.రాఘవేంద్రరెడ్డి పలువురు పార్టీ నేతలు పాల్గొన్నారు. -
ఎన్నికల రాళ్లు
మాట మార్చడంలో దిట్ట.. హామీలు విస్మరించడంలో అధిక అనుభవం.. నమ్మకద్రోహం చేయడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య.. ఇలాంటి లక్షణాలన్నీ పుష్కలంగాఉన్న టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ప్రజల్ని వంచించడంలో తనను మించినవారు లేరని మారో మారు నిరూపించుకోబోతున్నారు. బుధవారం జిల్లాకు రానున్న రాష్ట్ర ముఖ్యమంత్రి రామాయపట్నం పోర్టుకు శంకుస్థాపన పేరుతో తన మోసాల చిట్టాలో మరో మైలు‘రాయి’ని చేరుకోబోతున్నారు. ఎన్నికలు తరుముకొస్తున్న తరుణంలో హడావుడిగా చేస్తున్న శంకుస్థాపనలు బాబు మార్క్ రాజకీయాలకు నిదర్శనమని ప్రజలు, ప్రజాసంఘాలు విమర్శలు గుప్పిస్తున్నారు. సాక్షి ప్రతినిధి, ఒంగోలు/ఉలవపాడు: రాబోయే ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకొని మరోమారు జనాన్ని వంచించి ఓట్లు దండుకునేందకే సీఎం చంద్రబాబు రామాయపట్నం పోర్టుకు శంకుస్థాపన చేస్తున్నారన్న విమర్శలు వెల్లు వెత్తుతున్నాయి. రామాయపట్నంలో పోర్టు కం షిప్‌యార్డు నిర్మించాలని చాలాకాలంగా డిమాండ్ ఉంది. వెనుకబడిన ప్రకాశం జిల్లాలో మేజర్ పోర్టు నిర్మాణం జరిగితే రాయలసీమ జిల్లాలతో పాటు నెల్లూరు, గుంటూరు ప్రాంతాలు సైతం అభివృద్ధి చెందుతాయన్నది అందరి భావన. 2012 ప్రాంతంలోనే రామాయపట్నం పోర్టు ప్రతిపాదన తెరపైకి వచ్చింది. దుగరాజపట్నం పోర్టు కోసమే కేంద్రం తొలుత మొగ్గు చూపినా అనుకూలతలు లేవని కేంద్రం నియమించిన నిపునుల కమిటీ తేల్చి చెప్పడంతో మరో పోర్టును ప్రతిపాదించాలని కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాన్ని పలుమార్లు కోరింది. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి సమాధానం ఇవ్వలేదు. రామాయపట్నం పోర్టును ప్రతిపాదించలేదు. దీంతో రామాయపట్నం ప్రతిపాదన ముందుకు రాలేదు. వాస్తవానికి రూ.2,700 కోట్లతో 5500 ఎకరాలలో రామాయపట్నంలో పోర్టు కం షిప్ యార్డు నిర్మించాలన్నది ప్రతిపాదన. మొదటి దశలో రూ.7,300 కోట్లు ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఇదే జరిగి ఉంటే ఇప్పటికే మొదటి దశ పూర్తయి ఉండేది. వేలాది మందికి ఉద్యోగాలు లభించి ఉండేవి. పోర్టు కం షిప్ యార్డు నిర్మిస్తే రూ.లక్ష కోట్లతో పెట్రో కెమికల్ కాంప్లెక్స్ నిర్మించేందుకు దుబాయ్‌కి చెందిన కంపెనీ ముందుకు వచ్చింది. ఇప్కో సైతం ఇక్కడి నుంచే ఎగుమతులు జరిపేది. రాయలసీమ ప్రాంతాల్లో అధికంగా ఉన్న ఖనిజంతో పాటు సిమెంట్ ఉత్పత్తులు సైతం రామాయపట్నం నుంచే ఎగుమతులు జరిగేవి. రాష్ట్రంలోనే రామాయపట్నం అతిపెద్ద పోర్టుగా మారేది. కానీ చంద్రబాబు సర్కార్ రామాయపట్నం పోర్ట్ పై శ్రద్ద పెట్టలేదు. కేంద్రానికి రామాయపట్నం పోర్ట్ నిర్మించాలని లేఖ ఇచ్చిఉంటే ఇక్కడ భారీ పోర్ట్ కం షిప్‌యార్డు నిర్మాణం జరిగేది. రామాయపట్నం ప్రతిపాదనను కేంద్రానికి ఇవ్వని బాబు ఇపుడు తానే రామాయపట్నం మినీ పోర్ట్‌గా నిర్మిస్తానంటూ శంకుస్థానకు సిద్ధమయ్యారు. బాబు నిర్మించే పోర్ట్ ఎప్పటికి మొదలైతుందో తెలియని పరిస్థితి. కేవలం రాబోయే ఎన్నికల కోసమే చంద్రబాబు పోర్ట్‌కు శంకుస్థాపన రాయి వేస్తున్నారన్న విమర్శలు వెల్లు వెత్తుతున్నాయి. పోర్ట్ నిర్మాణం జరిగేది కాదని ఆ పార్టీ నేతలే వ్యాఖ్యానిస్తుండడం గమనార్హం. చంద్రాబాబు మాటపై జనం సంగతి దేవుడెరుగు ఆ పార్టీ నేతలకే నమ్మకం లేకపోవడం గమనార్హం. జిల్లాకు మూడేళ్ల కిందటే ట్రిపుల్ ఐటీ మంజూరైంది. ఇప్పటికీ భవనాలు నిర్మించక పోవడంతో వైఎస్సార్ కడప జిల్లా ఇడుపులపాయలో తరగతులు నిర్వహించాల్సి వస్తోంది. దొనకొండ, కనిగిరి ప్రాంతాల్లో పరిశ్రమలు వస్తున్నాయని నాలుగున్నరేళ్లుగా చెబుతునే ఉన్నారు. ఒక్క పరిశ్ర రాలేదు. అధికారంలోకి వచ్చిన మరుసటి ఏడాది నుంచి వెలిగొండ నీళ్లిస్తున్నామన్నారు. ఈ రోజుకూ లేదు. గుండ్లకమ్మ ప్రాజెక్ట్ కు సంబందించి 95 శాతం పనులు వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్నపుడే పూర్తి చేశారు. మిగిలిన 5 శాతం పనులు కూడా బాబు హయాంలో పూర్తికాలేదు. అమరావతి–అనంత ఎక్స్‌ప్రెస్ వే అన్నారు. భూసేకరణ కూడా జరగలేదు. చెప్పుకుంటూ పోతే జిల్లాకు సంబందించి బాబు వందలాది హామీలు ఇచ్చారు. బాబు వేసిన శిలాఫలకాలు ముళ్ల కంపల్లో కనుమరుగయ్యాయి. కందుకూరు ప్రాంతంలో పేపర్ మిల్లు, జిందాల్ స్టీల్ తదితర కంపెనీలకు భూములు అప్పగించేందుకే చంద్రబాబు అబద్దపు మాటలు చెపుతున్నారని జిల్లా వాసులకు తెలియంది కాదు. రాబోయే ఎన్నికల్లో జనాన్ని మరోమారు వంచించి ఓట్లు దండుకొనేందుకే చంద్రబాబు రామాయపట్నం పోర్టు శిలాఫలకం వేస్తున్నారన్న విమర్శలు వెల్లు వెత్తుతున్నాయి. రామాయపట్నమే పోర్టుకు అనుకూలత ♦ కేంద్ర ప్రభుత్వం నియమించిన సాంకేతిక నిపుణుల కమిటీ పోర్టు కమ్ షిప్‌యార్డు నిర్మాణానికి రామయపట్నం తీరం అనువైనదిగా ఇప్పటికే నివేదికనిచ్చింది. ♦ ప్రై వేట్ వ్యక్తుల నుంచి కొనుగోలు చేయాల్సిన అవసరం లేకుండా పోర్టు కోసం అవసరమైన మేర ప్రభుత్వ భూములున్నాయి. ♦ ఇక్కడ సముద్రం సహజంగానే లోతుగా ఉంది. కాబట్టి షిప్‌యార్డు నిర్మాణానికి డ్రెడ్జింగ్ (ఇసుక తవ్వి బయటకు పోయడం) అవసరం ఉండదు. ♦ కేంద్ర నౌకాయాన శాఖలోని ఆర్థిక–రవాణా విభాగానికి చెందిన ఉన్నత స్థాయి అధికారి బిఎం అరోరా నేతత్వంలోని కమిటీ రామాయపట్నం తీరం ఎగుమతులు, దిగుమతులకు అనుకూలమని నివేదిక ఇచ్చింది. ♦ గ్రానైట్, ఆక్వా ఉత్పత్తులను విదేశాలకు భారీ స్థాయిలో ఎగుమతి చేయవచ్చు. దుబాయ్ పెట్రోకెమికల్ కాంప్లెక్స్ తరహాలో ఇక్కడ పరిశ్రమలు స్థాపించేందుకు చైనా, సింగపూర్ దేశాల కంపెనీలు వచ్చే అవకాశం ఉంది. ♦ రామాయపట్నం తీరం నుంచి జాతీయ రహదారి, రైలు మార్గం రెండు తీరంకు కేవలం 5 కి.మీ. లోపే ఉన్నాయి. – రామాయపట్నంలో ప్రతిపాదించి కేవలం పోర్టు నిర్మాణమే కాదు. షిప్ బిల్డింగ్ యూనిట్, షిప్ బ్రేకింగ్ యూనిట్ (డిస్‌మాల్టిల్), నేషనల్ మ్యానుఫాక్చరింగ్ ఇన్వెస్ట్మెంట్ జోన్. ఇవన్నీ వస్తే ఉద్యోగాల సంఖ్య లక్షల్లోనే ఉంటుంది. ♦ రామాయపట్నం పోర్టు వస్తే గ్రానైట్, ప్రత్తి, పొగాకు, ఆక్వా ఉత్పత్తులు, ఇనుప ఖనిజాల ఎగుమతులకు మరింత అనుకూలం. ముఖ్యమంత్రి పర్యటన ఇలా... ముఖ్యమంత్రి చంద్రబాబు బుధవారం ఉదయం 10 గంటలకు హెలికాప్టర్లో బయలుదేరి 10.40 గంటలకుగుడ్లూరు మండలం రావూరులో హెలి పాడ్ వద్దకు చేరుకుంటారు. అక్కడి నుంచి 10.55 కు ఎంఓయూ గ్యాలరీ వద్దకు చేరుకుంటారు. అక్కడ ఏసియా పేపర్ మిల్లు ప్రతినిధులతో మాట్లాడి గ్యాలరీని తిలకిస్తారు. 11.30 గ్యాలరీ వద్ద నుంచి బయలుదేరి 11.45కు రామాయపట్నం పోర్టు, పేపరు మిల్లు పైలాన్‌ను ఆవిష్కరిస్తారు. 12 గంటలకు జన్మభూమి సభ వద్దకు చేరుకుంటారు. అక్కడ స్టాల్స్‌ను పరిశీలించి సభలో మాట్లాడతారు. మధ్యాహ్నం 2 గంటల వరకు సభలో పాల్గొని 2.15 గంటలకు బయలుదేరుతారు.2.30 కు హెలిపాడ్ వద్దకు చేరుకుంటారు. 2.30 నుంచి 3 గంటలకు రిజర్వుడు టైమ్ లో ఉంటారు. 3గంటలకు బయలుదేరి 3.45 కు సెక్రటేరియట్‌కు చేరుకుంటారు. -
సీఎం పర్యటన బందోబస్తు.. కానిస్టేబుల్ మృతి
సాక్షి, భూపాలపల్లి : రెండోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన కె.చంద్రశేఖరరావు తన తొలి అధికార పర్యటనలో భాగంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులను సందర్శిస్తున్నారు. దానిలో భాగంగానే జయశంకర్ భూపాలపల్లిలో కేసీఆర్ సోమవారం పర్యటించారు. ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా ఓ విషాదం చోటుసుకుంది. తీవ్ర అస్వస్థతకు గురైన ఓ పోలీసు ప్రాణాలు విడిచాడు. వివరాలు.. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో కన్నెపల్లి పంప్‌హౌజ్ వద్ద బందోబస్తు విధులు నిర్వర్తిస్తున్న హెడ్ కానిస్టేబుల్ వజ్జ నారాయణ (ఏ ర్ హెచ్ సి 521)కు గుండెపోటు వచ్చింది. ఆయనను హుటాహుటిన ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందారు. విషయం తెలుసుకున్న జయశంకర్ జిల్లా ఎస్పీ భాస్కరన్ కానిస్టేబుల్ కుటుంబాన్ని పరామర్శించారు. (కన్నెపల్లి పంపుహౌస్ పనులను పరిశీలించిన కేసీఆర్) -
సీఎం సభ కోసం డ్వాక్రా మహిళలపై ఒత్తిడి
వైఎస్ఆర్ జిల్లా, ప్రొద్దుటూరు : ఉక్కు కర్మాగారం శంకుస్థాపన కార్యక్రమం కోసం ఈనెల 27న సీఎం చంద్రబాబు నాయుడు మైలవరం మండలం కంబాలదిన్నె గ్రామానికి వస్తున్నారు. ఈ నేపథ్యంలో సభను విజయవంతం చేసేందుకు సంబంధిత అధికారులు అవస్థలు పడుతున్నారు. డీఆర్డీఏ పీడీ రామచంద్రారెడ్డి సోమవారం ఆయా మండలాలకు సంబంధించి ప్రొద్దుటూరు, మైదుకూరు నియోజకవర్గాల్లోని డ్వాక్రా సంఘాలకు సంబంధించిన గ్రామ సమాఖ్య సహాయకులతో సమావేశాన్ని నిర్వహించారు. ఆయా మండలాల అధికారులు కూడా సూచనలు చేశారు. ముఖ్యమంత్రి సభకు 15వేల మంది డ్వాక్రా మహిళలను తరలించాల్సి ఉందని సూచించారు. ప్రధానంగా మైదుకూరు, ప్రొద్దుటూరు, జమ్మలమడుగు నియోజకవర్గాల నుంచే వీరిని తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆగమేఘాలపై సమస్యల పరిష్కారం కోసం హామీ ఈనెల 5వ తేదీ నుంచి వెలుగు సిబ్బంది తమ సమస్యల పరిష్కారం కోసం సమ్మెబాట పట్టారు. మండలాల్లో పనిచేస్తున్న ఏపీఎంలు, సీసీలు, ఎంఎస్‌సీసీలు సమ్మె చేస్తుండటంతో డ్వాక్రా మహిళల సమస్యలను పరిష్కరించే వారు కరువయ్యారు. జిల్లా వ్యాప్తంగా 33,259 డ్వాక్రా సంఘాల పరిధిలో 3,20,720 మంది సభ్యులు ఉన్నారు. చాలా మండలాల్లో వీరి సమ్మె నాటి నుంచి బ్యాంకు అధికారులు రుణాలు మంజూరు చేయలేదు. తొలి నుంచి డ్వాక్రా మహిళల రుణ పత్రాలపై సీసీలు గ్యారెంటీ కింద సంతకాలు చేసేవారు. వారు సంతకాలు చేయకపోవడంతో రుణాలు ఆగిపోయాయి. మొత్తం 18 రకాల విధులు ఆగిపోయాయి. చంద్రన్న పెళ్లికానుక పరిస్థితి కూడా అలాగే ఉంది. ఈ దరఖాస్తులను అప్లోడ్ చేయాల్సిన ఏపీఎంలు సమ్మెలో ఉండటంతో దరఖాస్తులన్నీ పెండింగ్‌లోనే ఉన్నాయి. ఇప్పటికీ చాలా డ్వాక్రా సంఘాలు సమ్మె ప్రభావం కారణంగా పసుపు, కుంకుమ కింద మంజూరు చేసిన డబ్బు వారి ఖాతాల్లో జమ కాలేదు. ఇలా అనేక రకాల ఇబ్బందులు పడుతున్నారు. ఇన్ని రోజులైనా వెలుగు సిబ్బంది సమస్యలను ప్రభుత్వం పరిష్కరించలేదు. ప్రస్తుతం సీఎం చంద్రబాబు నాయుడు వస్తున్నారని తెలుసుకున్న అధికారులు ఆగమేఘాల మీద మండలాలకు వెళ్లి గ్రామ సమాఖ్య సహాయకులతో చర్చిస్తున్నారు. వెలుగు సిబ్బంది స్థానంలో డీఆర్డీఏ అధికారులకు ఇన్చార్జి బాధ్యతలు అప్పగించారు. స్వయంగా డీఆర్డీఏ పీడీ డ్వాక్రా మహిళలతో మాట్లాడుతున్నారు. వెంటనే బ్యాంకు రుణాలు మంజూరు చేయించేందుకు చర్యలు తీసుకుంటామని చెబుతున్నారు. అసలు విషయం ఏమిటంటే గ్రామ సమాఖ్య సహాయకులతో డీఆర్డీఏ పీడీ రామచంద్రారెడ్డి సోమవారం సాయంత్రం స్వయంగా సెల్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. మీ సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. గతంలో ఏపీఎంలతో మాత్రమే పీడీ సెల్ కాన్ఫరెన్స్ నిర్వహించేవారు. మళ్లీ విద్యార్థులను పంపాలా.. యోగి వేమన విశ్వ విద్యాలయంలో ఈనెల 4న నిర్వహించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో నిర్వహించిన జ్ఞానభేరి సదస్సుకు జిల్లాలోని అన్ని కళాశాలల నుంచి విద్యార్థులను తరలించారు. ఇందుకు సంబంధించి రెవెన్యూ అధికారులకు అదనపు బాధ్యతలు అప్పగించారు. ప్రతి బస్సుకు ఒక వీఆర్ఓ చొప్పున నియమించి పర్యవేక్షణకు ఆర్ఐలను ఏర్పాటు చేశారు. ఇందు కోసం అటు కళాశాలల యాజమాన్యాలు, ఇటు రెవెన్యూ అధికారులు అవస్థలు పడ్డారు. ప్రస్తుతం సీఎం చంద్రబాబు నాయుడు ఉక్కు కర్మాగారం శంకుస్థాపనకు వస్తున్న నేపథ్యంలో డ్వాక్రా మహిళలతోపాటు విద్యార్థులను తరలించేందుకు వేర్వేరుగా ఏర్పాట్లు చేశారు. ప్రొద్దుటూరు ప్రాంతంలోని 12 విద్యా సంస్థలకు సంబంధించి బస్సుకు 50 మంది చొప్పున విద్యార్థులను తరలించాలని ఆదేశాలు జారీ చేశారు. జ్ఞానభేరి తరహాలోనే వీఆర్ఓలకు బాధ్యతలు అప్పగించారు. మొన్నే కదా విద్యార్థులను పంపించింది. మళ్లీ విద్యార్థులంటే ఎలా? పరీక్షల సమయం ఆసన్నమవుతోందని ఆయా విద్యా సంస్థల యాజమాన్యాలు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నాయి. ఇవి ప్రభుత్వ ఆదేశాలు, పాటించక తప్పదని రెవెన్యూ అధికారులు హెచ్చరిస్తున్నారు. -
కేసీఆర్ కాళేశ్వరం టూర్ వాయిదా
సాక్షిప్రతినిధి, కరీంనగర్: ముఖ్యమంత్రి కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శన కార్యక్రమం వాయిదా పడింది. మంగళ, బుధవారం (రెండురోజులు) ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ప్రాజెక్టులను సందర్శించేందుకు షెడ్యూల్ ప్రకటించారు. కేసీఆర్ రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత తొలిసారిగా శనివారం రాష్ట్రంలోని భారీ నీటిపారుదల ప్రాజెక్టులపై సీఎం నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఈ పర్యటన ఖరారైంది. 18న కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని మేడపల్లి, సుందిళ్ల, అన్నారం బ్యారేజీలు, పంపుహౌస్‌లను సందర్శించిన అనంతరం రాత్రివరకు అధికారులతో సమీక్ష జరపాలని నిర్ణయించుకున్నారు. అనంతరం కరీంనగర్ తెలంగాణ భవన్లో రాత్రి బస చేసి.. బుధవారం ఉదయం ఎస్సారెస్పీ పునరుజ్జీవ పథకం పనులు పరిశీలించాలనకున్నారు. కానీ.. పెథాయ్ తుపాను ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురుస్తుండడంతో ఈ కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు సీఎంవో వర్గాలు ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధికారులకు సమాచారం అందించాయి. ఈ పర్యటన మళ్లీ ఎప్పుడు ఉంటుందనే దానిపై త్వరలోనే నిర్ణయించి ప్రకటించనున్నట్లు పేర్కొన్నారు. -
బాబూ.. ఎందుకీ దుబారా!
ప్రజాధనం అంటే సీఎం చంద్రబాబుకు అలుసుగా మారింది. తన ఆర్భాటం, సౌకర్యం కోసం ఖజానాను అప్పుల్లోకి నెట్టేస్తున్నారు. ఉద్యోగాల భర్తీకి, ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి డబ్బుల్లేవని బీద అరుపులు అరుస్తున్న చంద్రబాబు .. తన సొంత బాకా కొట్టుకోవడానికి మాత్రం ఎంత ఖర్చు చేయడానికైనా వెనుకాడడం లేదు. చేసింది గోరంత, ప్రచారం కొండంత అన్న చందంగా అవసరం లేని కార్యక్రమాలకు కూడా ఆర్భాటం చేస్తున్నారు. గురువారం జిల్లా పర్యటనకు కూడా దాదాపు రూ.3.5 కోట్లు ప్రజాధనం ఖర్చు చేయడానికి సిద్ధమైపోయారు. హెలికాప్టర్‌పై నగర పర్యటన, జనసమీకరణ కోసం వృథా ఖర్చు చేస్తున్నారు. జన సమీకరణకు స్వయంగా మంత్రి రంగంలోకి దిగి ఇంజనీరింగ్ కళాశాలలకు టార్గెట్లు ఇచ్చారు. ఉన్నతాధికారులతో ప్రిన్సిపాళ్లకు ఫోన్లు చేయించి విద్యార్థులను పంపించకపోతే గుర్తింపు రద్దంటూ హెచ్చరికలు చేయడం గమనార్హం. మరో వైపు ఆర్టీసీ నుంచి కూడా కనీసం 300కు తక్కువ కాకుండా బస్సులను జనాల తరలింపు కోసం మళ్లిస్తున్నారు. సాక్షి, విశాఖపట్నం: సీఎం చంద్రబాబు 2014 నుంచి ఇప్పటి వరకు 106 సార్లు విశాఖ జిల్లాలో పర్యటించారు.అందులో 95 సార్లు విశాఖ నగరానికే వచ్చారు. మూడొంతుల పర్యటనలు సదస్సులు, సమ్మేళనాల్లో పాల్గొనేందుకే వచ్చినవే. గురువారం సీఎం మరోసారి విశాఖకు వస్తున్నారు. ఈ సారి పర్యటన అంతా గ్రేటర్ విశాఖ పరిధిలోనే సాగనుంది. అయినా గతానికి భిన్నంగా పర్యటన సాగనుంది. నగరమంతా పూర్తిగా హెలికాప్టర్లోనే చక్కర్లు కొట్ట బోతున్నారు. గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో రానున్న సీఎం చంద్రబాబు మెడ్‌టెక్ జోన్‌తో పాటు భీమిలి మండల పరిధిలో జరిగే కార్యక్రమాల్లో పాల్గొంటారు. ప్రత్యేక విమానం, హెలికాప్టర్ల ఖర్చు ఎంత తక్కువ వేసుకున్నా రూ.50 లక్షలు పైమాటేనని అధికారులు చెబుతు న్నారు. ఇక మెడ్‌టెక్ జోన్లో జరిగే గ్లోబల్ ఫారం సదస్సు ప్రారంభోత్సవ వేడుకలకు కోటికి పైగా ఖర్చవుతుందని అధికారులు చెబుతున్నారు. ఇక తగరపువలస జూట్‌మిల్లు గ్రౌండ్లో నిర్వహించ తలపెట్టిన బహిరంగ సభ ఖర్చు అక్షరాల రూ.2కోట్ల పైమాటేనని లెక్కలేస్తున్నారు. ఇందు కోసం మొత్తం అయ్యే ఖర్చు అక్షరాల మూడున్నరకోట్ల పైమాటేనని అంచనా వేస్తున్నారు. ఇలాంటి పర్యటనలకు దుబారా అవసరమా అని ప్రజలు మండిపడుతున్నారు. మరో వైపు అధికారులు నలిగిపోతున్నారు. జనసమీకరణ కోసం హైరానా ఏపీ మెడ్‌టెక్ జోన్ (ఏఎంటీజెడ్)ను జాతికి అంకితం చేయడంతో పాటు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో జరిగే గ్లోబల్ ఫోరం సదస్సులో సీఎం చంద్రబాబు పాల్గొంటారు. జీవీఎంసీ పరిధిలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. అనంతరం భీమిలి మండలం చిల్లపేట చెరువు వద్ద ఐటీహబ్‌కు శంకుస్థాపన చేస్తారు. అనంతరం తగరపువలస జూట్‌మిల్లు గ్రౌండ్లో జరిగే బహిరంగసభలో పాల్గొంటారు. దీనికి కనీసం 30వేల మందిని సమీకరించాలని తలపోశారు. మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం కావడంతో జనసమీకరణకు ఆయన స్వయంగా రంగంలోకి దిగారు. డ్వాక్రా సంఘాల సభ్యులను తరలించాలని తొలుత భావించినా వెలుగు సిబ్బంది సమ్మె బాట పట్టడంతో ఈసారి విద్యార్థులను తరలించాలని నిర్ణయించారు. జిల్లా పరిధిలోనే కాకుండా ఉత్తరాంధ్రలోని ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులను తరలించాలని నిర్ణయానికి వచ్చారు. దీంతో ఉన్నతాధికారుల ద్వారా ఆయా కళాశాలల యాజమాన్యాలకు ఫోన్లు చేసి మరీ విద్యార్థులను తరలించాలని హుకుం జారీ చేశారు. ఆంధ్రా, జేఎన్టీయూకే, అంబేడ్కర్ యూనివర్సిటీలు అనుబంధంగా ఉన్న 48 ఇంజనీరింగ్ కళాశాలల ప్రిన్సిపాళ్లకు నేరుగా ఫోన్లు చేసి తగరపువలస సభకు మీ విద్యార్థులను పంపాలని ఆదేశాలు జారీ చేశారు. పంపించకపోతే మీ గుర్తింపురద్దు చేస్తామని హెచ్చరికలు చేశారు. ప్రతి కళాశాల నుంచి 400 మందికి తక్కువ కాకుండా విద్యార్థులను తీసుకు రావాలని, పైగా వారికి భోజనాలు పెట్టించి మరీ బస్సులు ఎక్కించాలని ఆదేశాలు జారీ చేశారు. సభా ప్రాంగణం వద్ద ఏ కళాశాల బస్సులు, విద్యార్థులు కన్పించకపోయినా చర్యలు తప్పవని హెచ్చరికలు జారీ అయ్యాయి. దీంతో ఏం చేయాలో పాలుపోక కళాశాల నిర్వాహకులు తలలు పట్టుకుంటున్నారు. మరో వైపు ఆర్టీసీ నుంచి 300కు తక్కువ కాకుండా బస్సులను జనాల తరలింపు కోసం మళ్లిస్తున్నారు. -
నేడు సీఎం చంద్రబాబు రాక
ఒంగోలు అర్బన్: జిల్లా కేంద్రం ఒంగోలులో బుధవారం జరిగే జ్ఞానభేరి కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన ఖరారయింది. ఉదయం 9.45 గంటలకు ఇంటి నుంచి హెలికాప్టర్లో బయలుదేరి 10.05 గంటలకు మార్టూరు సమీపంలో ఏర్పాటు చేసిన హెలీప్యాడ్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గాన 11 గంటలకు ఒంగోలు దక్షిణ బైపాస్‌లో ఏర్పాటు చేసిన జ్ఞానభేరి వేదిక వద్దకు చేరుకుంటారు. అనంతరం కార్యక్రమంలో ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను సందర్శిస్తారు. మధ్యాహ్నం 1.30 గంటలకు తిరుగు ప్రయాణమవుతారు. మార్టూరు వరకు రోడ్డు మార్గం ద్వారా అక్కడి నుంచి హెలికాప్టర్లో నివాసానికి చేరుకుంటారని అధికారులు వెల్లడించారు. మంగళవారం సాయత్రం 5 గంటల సమయంలో జిల్లా కలెక్టర్ వి.వినయ్‌చంద్, ఎస్సీ సత్యఏసుబాబు, ఇతర జిల్లా అధికారులతో కలిసి మార్టూరు మండలం రాజుపాలెం సమీపంలోని హెలీప్యాడ్‌ను పరిశీలించారు. భద్రత పరమైన చర్యల గురించి అధికారులతో చర్చించారు. -
భేరికి వస్తారా.. చస్తారా?
ప్రకాశం, చీరాల: ముఖ్యమంత్రి చంద్రబాబు జిల్లా పర్యటనలు రాష్ట్ర స్థాయి నుంచి జిల్లా, మండల, నియోజకవర్గ స్థాయి అధికారులకు తలనొప్పిగా మారాయి. నెలకు ఒకసారి సీఎం జిల్లాకు వస్తుండటంతో సదస్సులకు జనాలను తరలించడం, అందుకు బస్సులు అందించలేక తలలు పట్టుకుంటున్నారు. తరచూ జిల్లాకు సీఎం వస్తున్నారని సమాచారం వస్తే చాలు అధికారులు హడలి పోతున్నారు. జిల్లాకు గత రెండు నెలల వ్యవదిలోనే నాలుగు సార్లు జిల్లా పర్యటనకు సీఎం రావడం అందుకు ఏర్పాట్లు చేయలేక అధికారులు, నాయకులు తలలు పట్టుకుంటున్నారు. ఏర్పాట్లు ఒక ఎత్తయితే సీఎం సభలకు జనాలను తీసుకురావడం, పొదుపు సంఘాల మహిళలను తరలించడం, వారి తరలింపుకు కావాల్సిన బస్సులు ఏర్పాటు చేయడం, సభలకు హాజరయ్యే వారికి మంచినీరు, బిస్కెట్ ప్యాకెట్లు అందించలేక అల్లాడుతున్నారు అధికారులు. గతంలో పొదుపు మహిళలు, పురుషులను విధిగా తరలించేలా చర్యలు తీసుకున్న అధికారులు ఈ దఫా మాత్రం జ్ఞానభేరీ పేరుతో సీఎం సభకు విద్యార్థులను తరలించే పనిలో నిమగ్నమయ్యారు. బుధవారం ఒంగోలులో నిర్వహించే జ్ఞాన భేరి కార్యక్రమానికి ముఖ్యమంత్రి హాజరవుతున్నారని అధికారులకు సమాచారం అందగానే అధికారుల హడావుడి అంతాఇంతా కాదు. జిల్లాలో ఉన్న ప్రభుత్వ, ప్రవేటు డిగ్రీ కళాశాలల్లో చదువుకుంటున్న విద్యార్థులను విధిగా సీఎం సభకు తరలింపు చేసేలా జిల్లా ఉన్నతాదికారులు చర్యలు చేపట్టారు. ఒక్కో కళాశాలకు ఒక్కో ప్రభుత్వ అధికారిని నియమించి మరీ బలవంతంగా విద్యార్థులను తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అధికారుల నియామకంతో పాటుగా విద్యార్థులను సభకు తరలించాలని కోరుతూ గత మూడు రోజులుగా నియోజకవర్గ, మండల, ప్రత్యేకాధికారులు నియోజకవర్గ ప్రధాన కేంద్రాల్లో తిష్టవేసి మరి కళాశాలల్లోని విద్యార్థులను పంపించాలని బలవంతంగా ఆదేశిస్తున్నారు. జిల్లాలోని 12 నియోజకవర్గాల్లో ఉన్న ప్రభుత్వ, ప్రవేటు, ఎయిడెడ్ డిగ్రీ కళాశాలల విద్యార్థులను సీఎం సభకు పంపించాలని కళాశాలల యాజమాన్యాలతో ప్రత్యేకంగా సమావేశాలను కూడా నిర్వహించడం చూస్తుంటే అధికారులకు విద్యార్థుల చదువు కంటే సీఎం సభలే ముఖ్యంగా ఉన్నాయని విద్యార్థులు, ఉపాధ్యాయులు విమర్శిస్తున్నారు. పరీక్షల కాలంలో ఇదేంది బాబూ... డిసెంబర్ నెల నుంచి ఫిబ్రవరి వరకు విద్యార్థులకు కీలక సమయం. మార్చిలో జరగనున్న ఆఖరి సెమిస్టర్ పరీక్షలకు ఈనెలలో కీలకం. సీఎం జిల్లాకు జ్ఞానభేరితో వస్తున్నారని విద్యార్థులను ఎలా పంపించగలం అని కళాశాలల యాజమాన్యాలు అధికారులను వేడుకున్నా ఫలితం లేదు. పరీక్షలుంటే తర్వాత చదివించుకోండి ముందు విద్యార్థులను సభకు పంపించిండంటూ అధికారుల ఆదేశాలతో అధ్యాపకులు, యాజమాన్యాలు కంగుతింటున్నారు. ఒక్కో అధికారికి ఒక్కో కళాశాలను కేటాయించి మరీ విద్యార్థులను సభకు పంపించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. డిగ్రీ కళాశాల్లోని విద్యార్థుల వివరాలు... సీఎం జ్ఞానభేరి సభకు జిల్లాలోని అన్నీ డిగ్రీ కళాశాల విద్యార్థులను విధిగా పంపించాలని అధికారులు ఆయా కళాశాలల యాజమాన్యాలకు ఆదేశాల జారీ చేశారు. చీరాల, వేటపాలెం, పర్చూరు, ఇంకొల్లు, అద్దంకి, ప్రాంతాల్లో ఉన్న ప్రభుత్వ, ప్రవేటు, ఎయిడెట్ విద్యాసంస్థల్లో చదువుతున్న 6943 మంది విద్యార్థులను సీఎం సభకు పంపించాలని జ్ఞానభేరికి హాజరయ్యేలా రిజిస్టర్ కూడా చేయించి మరీ సర్క్యులర్‌ను విడుదల చేయడంతో పాటుగా కళాశాలలు విదిగా తమ విద్యార్థులను పంపించాలని ఆదేశించారు. విద్యార్థులను తరలించేందుకు బస్సులను కూడా ఆయా కళాశాలల యాజమాన్యాలే ఏర్పాటు చేసుకోవాలని హుకుం జారీ చేశారు. దీంతో తరగతులను ఆపించి డీజిల్ ఖర్చులను భరించి మరీ సభలకు ఎలా పంపించగలం అంటూ యాజమాన్యాలు తలలు పట్టుకుంటున్నారు. అధ్యాపకులు, యాజమాన్యాలతోప్రత్యేక సమావేశాలు... జ్ఞానభేరి సభలకు విద్యార్థులను తరలించేందుకు ఒక్కో డిగ్రీ కళాశాల నుంచి 500 మందిని తరలించాలని ఆదేశాలు రావడంతో మండల, నియోజకవర్గ అధికారులు కళాశాలల ప్రతినిధులు, యాజమాన్యాలతో సమావేశాలను నిర్వహిస్తున్నారు. మండల తహశీల్దార్ 500 మందిని, ఎంపీడీవో 500 మందిని, నియోజవర్గ ప్రత్యేకాధికారి విద్యార్థులు అందరిని సభలకు తరలించేందుకు సమావేశాలను ఏర్పాటు చేయడం పలు విమర్శ«లకు తావిస్తోంది. మొత్తం మీద సీఎం సారూ జిల్లాకు వస్తుంటే ప్రజలు, విద్యార్ధులు పొదుపు మహిళల తరలింపును అధికారులే దగ్గరుండి సభలకు తరలించడంపై విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, కళాశాల అధ్యాపకులు, యాజమాన్యాలు తీవ్రంగా విమర్శలు గుప్పిస్తున్నారు. -
ఇదేమి గోలయ్యా ‘బాబు’
సాక్షి, గుంటూరు: సాధారణంగా జిల్లాలో సీఎం పర్యటనంటే ఏవైణౠ కొత్త పథకాలు ప్రవేశపెట్టి వరాల జల్లు కురిపిస్తారని ప్రజలు ఆశ పడతారు. కానీ ప్రస్తుతం జిల్లాలో సీఎం పర్యటనంటే ప్రజలు అసహనానికి లోనవుతున్నారు. ముఖ్యంగా ప్రైవేట్ విద్యా సంస్థలైతే సీఎం, మంత్రి నారా లోకేశ్ జిల్లా పర్యటనæ అంటే హడలిపోతున్నారు. సీఎం, చినబాబు పాల్గొనే సభలకు భారీగా జనాలను సమీకరించడం కోసం ప్రైవేట్ విద్యా సంస్థల బస్సులు పంపాలంటూ అ«ధికారులే హకుం జారీ చేస్తున్నారు. మొన్నటికి మొన్న పంచాయతీరాజ్ శాఖ మంత్రి నారా లోకేశ్ పల్నాడు పర్యటన సందర్భంగా పల్నాడులోని పలు పాఠశాలలకు సెలవు ప్రకటించారు. ఆయా బస్సులను జన సమీకరణకు తీసుకెళ్లారు. చినబాబు పర్యటన ముగిసి కొద్ది రోజులు కూడా కాక ముందే జిల్లాలో సీఎం పర్యటన ఉండటంతో ప్రైవేట్ విద్యా సంస్థల్లో బుగులు మొదలైంది. సోమవారం సీఎం చంద్రబాబు సత్తెనపల్లి నియోజకవర్గంలో పర్యటించనున్నారు. కార్యక్రమానికి భారీగా జనాలను తరలించేందుకు సిద్ధమైనట్లు ఆ పార్టీ వర్గాలే చెబుతున్నాయి. దీంతో అధికార పార్టీ నేతలు ప్రైవేటు స్కూళ్ల యాజమాన్యాలపై పడ్డారు. గతంలో సైతం సీఎం, మంత్రుల సభలు, పార్టీ కార్యక్రమాలకు పాఠశాలలకు సెలవులు ప్రకటించి బస్సులు తీసుకెళ్లారు. చీటికి మాటికి పాఠశాలలకు అనవసరంగా సెలవులు ప్రకటించడం వల్ల పిల్లల భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారుతుందని తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు మండి పడుతున్నారు. గతంలో నారా హమారా.. టీడీపీ హమారా.. మహానాడు, వనం మనం, స్వచ్ఛ భారత్‌కు సంబంధించిన కార్యక్రమాలకు పాఠశాల బస్సులను ఉపయోగించారు. అయితే సీఎం సభలకు, ప్రభుత్వ కార్యక్రమాలకు కొన్ని ప్రైవేటు విద్యా సంస్థల యాజమాన్యాలు స్వచ్ఛందంగా బస్సులను పంపిస్తుండగా, మరికొన్ని విద్యా సంస్థల యాజమాన్యాలను రవాణా శాఖ అధికారులు బెదిరించి బస్సులు తీసుకెళుతున్నారు. ఆర్టీసీకి బకాయి ఉన్నందునే... ప్రతి ప్రభుత్వ, పార్టీ కార్యక్రమానికి ఆర్టీసీ బస్సులను విచ్చలవిడిగా వినియోగించుకుంటున్న టీడీపీ నేతలు సంస్థకు బకాయి పడ్డారు. ఈ నేపథ్యంలో మళ్లీ ఆర్టీసీ బస్సులను వినియోగిస్తే సమస్యలు ఎదురవుతాయని ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలను బెదిరిస్తున్నట్లు సమాచారం. నిబంధనలు తుంగలోకి.. ప్రభుత్వ, పార్టీ కార్యక్రమాలకు విద్యా సంస్థ వాహనాలను వినియోగించరాదన్న నిబంధనలను తెలుగుదేశం ప్రభుత్వం తుంగలో తొక్కుతోంది. పాఠశాలలకు సెలవు ప్రకటించి స్కూల్ బస్సులను తీసుకెళ్లడంపై విద్యార్థి సంఘాల నాయకులు మండి పడుతున్నాయి. సాధారణంగా స్కూల్ బస్సులను ఇతర కార్యక్రమాలకు వినియోగించే సమయంలో రవాణా కార్యాలయం ద్వారా పర్మిట్‌ను పొందాలి. జిల్లాలో అధికార పార్టీ నాయకులు ఈ నిబంధనలు పాటించడం లేదనే విమర్శలు ఉన్నాయి. ఇలా బెదిరించి జనాలను తరలిస్తే అటు ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు, ఇటు ప్రజల ఆగ్రహానికి గురవుతామని తెలుగుదేశం పార్టీలోని కొందరు నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
నిర్బంధాలు.. అరెస్టులు
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు జిల్లా పర్యటన సందర్భంగా ప్రజావ్యతిరేకత కనిపించకుండా పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. ప్రతిపక్ష వైఎస్సార్సీపీ నాయకులను ముందస్తు అరెస్ట్‌లు, గృహ నిర్బంధాలు చేశారు. రెండురోజులుగా అప్రజాస్వామికంగా అరెస్టులు చేస్తుండడంపై వైఎస్సార్సీపీ నాయకులు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు అనంతపురం సెంట్రల్: అనంతపురంలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్‌రెడ్డి ఇంటి వద్ద శనివారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. టీడీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతిపై ముఖ్యమంత్రిని కలిసి వినతిపత్రం అందజేయాలని బయల్దేరిన ఎమ్మెల్సీ తనయుడు, వైఎస్సార్సీపీ రాప్తాడు జెడ్పీటీసీ వెన్నపూస రవీంద్రారెడ్డిని అప్పటికే అక్కడ మోహరించిన పోలీసులు అడ్డుకున్నారు. దీంతో వారు నల్లబ్యాడ్జిలతో బైఠాయించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా పోలీసులు, వైఎస్సార్సీపీ కార్యకర్తలకు వాగ్వాదం చోటు చేసుకుంది. వెన్నపూస రవీంద్రారెడ్డి మాట్లాడుతూ మహాత్మగాంధీ ఉపాధిహామీ పథకంలో రూ.500 కోట్లకు పైగా అవినీతి జరిగిందని తెలిపారు. అవినీతి లేకుండా చేస్తానని చెప్పే ముఖ్యమంత్రి చంద్రబాబు గురివింద గింజ సామెతను గుర్తుకు తెస్తున్నారన్నారు. ప్రజా సమస్యలు, అవినీతి గురించి ప్రశ్నిస్తే అరెస్ట్‌లు చేస్తారా అంటూ మండిపడ్డారు. ప్రజాస్వామ్య దేశంలో ఉన్నామా? లేక నిరంకుశ పాలనలో ఉన్నామా అని నిలదీశారు. చింతకుంట మధు గృహ నిర్బంధం: వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి చింతకుంట మధును శుక్రవారం అర్దరాత్రి నుంచే గృహం నిర్బంధం చేశారు. మారుతీనగర్‌లోని ఆయన నివాసానికి నాల్గవ పట్టణ ఎస్ఐ అల్లాబకాష్, పోలీసు సిబ్బంది చేరుకున్నారు. గృహ నిర్బంధం చేయడంపై చింతకుంట మధు మండిపడ్డారు. మేమేమైనా ఉగ్రవాదులమా.? టెర్రరిస్టులమా అని ప్రశ్నించారు. పలువురు నేతల అరెస్ట్ సీఎం పర్యటన సందర్భంగా ప్రతిపక్ష వైఎస్సార్సీపీ నాయకులను ఎక్కడికక్కడ అరెస్ట్‌లు చేసి టూటౌన్ పోలీసుస్టేషన్‌కు తరలించారు. రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఆలమూరు శ్రీనివాసరెడ్డి, విద్యార్థి విభాగం అనంతపురం పార్లమెంట్ అధ్యక్షులు రాజేష్, రాష్ట్ర కార్యదర్శి చంద్రశేఖర్‌యాదవ్, ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శి పురుషోత్తం, మైనార్టీ విభాగం రాష్ట్ర కార్యదర్శి జేఎం బాషా, రైతు విభాగం జిల్లా కార్యదర్శి, ప్రధాన కార్యదర్శి వలిపిరెడ్డి శివారెడ్డి, గోగుల పుల్లయ్య, వెంకటేశ్వరరెడ్డి, రాంప్రసాద్, మహిళా విభాగం నగర అధ్యక్షురాలు కృష్ణవేణి, నాయకులు మునీరా, భారతి తదితరులను వేర్వేరు చోట్ల అరెస్ట్ చేసి టూటౌన్ పోలీసుస్టేషన్‌కు తరలించారు. ఈ సందర్బంగా నాయకులు మాట్లాడుతూ ప్రజాసమస్యలను సీఎం దృష్టికి తీసుకుపోవాలనుకున్న ప్రతిపక్ష పార్టీల నాయకులను అరెస్ట్ చేయడం అప్రజాస్వామిక చర్య అని అన్నారు. నాయకుల పరామర్శ అక్రమ అరెస్టులను వైఎస్సార్సీపీ నాయకులు ఖండించారు. టూటౌన్ పోలీసుస్టేషన్లో నిర్బం ధించిన కార్యకర్తలను ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్‌రెడ్డి, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి వై.వి శివారెడ్డిలు పరామర్శించారు. పోలీసుల తీరును తప్పుపట్టారు. ప్రజాస్వామ్య దేశంలో భావప్రకటనా స్వేచ్ఛను హరించేలా టీడీపీ ప్రభుత్వం చూస్తుండడం బాధాకరమన్నారు. ప్రజా వ్యతిరేకత నుంచి బయటపడేందుకు పోలీసులను అడ్డుపెట్టుకొని అరెస్ట్‌లు చేయిస్తున్నారని మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో ఈ ప్రభుత్వానికి ప్రజలే గట్టిగా బుద్ధి చెబుతారని హెచ్చరించారు. అక్రమ అరెస్టులు దారుణం అనంతపురం సప్తగిరి సర్కిల్: సీఎం పర్యటన నేపథ్యంలో వైఎస్సార్సీపీ నాయకులను ముందస్తు అరెస్టులు చేయడం దారుణమని వైఎస్సార్సీపీ లీగల్ సెల్ జిల్లా అధ్యక్షుడు నారాయణరెడి తెలిపారు. ముఖ్యమంత్రి రెండు రోజుల పర్యటన సందర్భంగా వైఎస్సార్సీపీ హిందూపురం పార్లమెంటు అధ్యక్షుడు శంకరనారాయణ, రాప్తాడు జెడ్పీటీసీ వెన్నపూస రవీంద్రారెడ్డి, వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం నాయకులను అరెస్టు, హౌస్ అరెస్టులు చేయడం రాజ్యాంగ విరుద్ధమని పేర్కొన్నారు. పోలీసుల పహారాతో రాష్ట్రాన్ని పాలిస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. వైఎస్సార్సీపీ నాయకుల అక్రమ అరెస్టులకు కారణమైన కలెక్టర్, ఎస్పీలపై హైకోర్టులో ప్రజా ప్రయోజనాల వ్యాజ్యాన్ని దాఖలు చేస్తున్నట్లు తెలిపారు. -
అయ్య..బాబోయ్!
ఒంగోలు: సీఎం చంద్రబాబు పర్యటన జిల్లా వాసులకు ఇబ్బంది కలిగిస్తోంది. ఆయన కార్యక్రమాలను విజయవంతం చేసేందుకు అధికారులు పడరాని పాట్లు పడుతున్నారు. ఈ క్రమంలో నిబంధనలకు సైతం తిలోదకాలు ఇస్తూ అపప్రద మూటగట్టుకుంటున్నారు. సీఎం శుక్రవారం జిల్లాకు వస్తున్న నేపథ్యంలో రెండు రోజుల ముందు నుంచే అధికారులు ఏర్పాట్లు ప్రారంభించారు. ఒక వైపు రవాణ శాఖ, మరో వైపు విద్యాశాఖ అధికారులు వెరసి తీసుకుంటున్న చర్యల కారణంగా ప్రజానీకం, విద్యాసంస్థల యాజమాన్యాలు బెంబేలెత్తుతున్నాయి. అందునా రెండు రోజుల సీఎం పర్యటన కావడంతో ఏం చేయాలో తోచక దిక్కుతోచని పరిస్థితులు నెలకొన్నాయి. ఇదీ..రవాణశాఖ అధికారుల తీరుముఖ్యమంత్రి పర్యటన అంటే ఎన్ని వాహనాలు కావాలో అన్ని వాహనాలను సమకూర్చాల్సిన బాధ్యత జిల్లా రెవెన్యూ విభాగానిది. వాహనదారులు తీసుకొచ్చిన వాహనాలను రవాణశాఖ అధికారులు తనిఖీ చేసి ఫిట్నెస్ బాగా ఉందని ధ్రువీకరించిన తర్వాతే వాటిని సీఎం టూర్‌కు అనుమతి ఇస్తారు. రవాణ శాఖ ఫిట్‌నెస్‌గానే ఉందని నిర్థారించిన తర్వాత వాటిని పోలీసుశాఖ స్వాధీనం చేసుకుంటుంది. సీఎం టూర్ ముగిసిన తర్వాత వాహనదారునికి ఒక్కో వాహనానికి అద్దె రూపంలో సంబంధిత మొత్తం చెల్లించాల్సిన బాధ్యత రెవన్యూ శాఖది. కానీ మన జిల్లాలో మాత్రం ఆది నుంచి వాహనాలు సమకూర్చడం, ఫిట్నెస్ను నిర్థారించి సీఎం కార్యక్రమం కోసం వాహనాలను పోలీసు శాఖకు అప్పగించడం మొత్తం వ్యవహారం రవాణాశాఖే చూసుకుంటోంది. ఈ నేపథ్యంలో జిల్లాలో మూడు చోట్ల సీఎం పర్యటన ఉండడంతో వాహనాల కోసం రవాణ శాఖ అధికారులు రోడ్డెక్కారు. వాహనం ముచ్చటగా ఉందని భావిస్తే చాలు.. కారులో ఫ్యామిలీ ఉన్నా సరే అర్థాంతరంగా దించేసి సీఎం సభకు పెట్టాలంటూ హెచ్చరికలు జారీ చేయడం ప్రారంభించారు. ఒక్కో కాన్వాయ్‌కు 32 వాహనాల వరకు సమకూర్చాల్సి ఉంటుంది. వాటిలో అంబులెన్స్ తదితరాలు మినహాయిస్తే 20 వాహనాలు తప్పనిసరి. మార్టూరు మండలం నాగరాజుపల్లి, ఒంగోలు, వెలిగొండ మొత్తంగా మూడు కాన్వాయ్‌లకు కలిపి 60కుపైగా వాహనాలను సమకూర్చాల్సిన బాధ్యత రవాణ శాఖ అధికారులు చేపట్టారు. అందులోనూ సీఎం కార్యక్రమం.. ఏ మాత్రం వాహనం ట్రబుల్ ఇచ్చినా రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ అయ్యే అవకాశం లేకపోలేదు. పబ్లిక్ ట్రాన్స్‌పోర్టు వాహనాలైతే రన్నింగ్ ఎలా ఉంటుందో అనే భావనతో ఎక్కువుగా ప్రైవేటు వాహనాలపై దృష్టి సారించారు. స్థానిక కర్నూల్ రోడ్డు బైపాస్ జంక్షన్లో వాహనాన్ని నిలిపి పత్రాలు సీజ్ చేసుకొని సీఎం సభకు పంపాలంటూ హెచ్చరికలు జారీ చేయడంతో ఓ డ్రైవర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. పబ్లిక్ వాహనాలను వదిలి పెట్టి ప్రైవేటు వాహనాలు పెట్టమని ఎలా హెచ్చరికలు జారీ చేస్తారంటూ అతడు అడ్డం తిరిగాడు. అంతే కాకుండా ఆయిల్ కొట్టించుకుని రవాణ శాఖ కార్యాలయంలో వాహనం ఉంచాలని ఆదేశించడం ఏంటి అంటూ మండిపడటం, ఇదే సమయంలో మీడియా అక్కడకు చేరుకోవడంతో రవాణ శాఖ అధికారులు అక్కడి నుంచి జారుకున్నారు. పేరుకున్న బకాయిలు ప్రాథమికంగా అందిన సమాచారం ప్రకారం నాలుగేళ్లలో జిల్లాకు సీఎం వచ్చిన సందర్భంగా ఏర్పాటు చేసిన కాన్వాయ్‌లకు సంబంధించి దాదాపు రూ.3.50 లక్షలు మాత్రమే విడుదలైనట్లు తెలుస్తోంది. ఇంకా రూ.6.50 లక్షల వరకు బకాయిలు ఉన్నట్లు వినికిడి. తాజాగా మరో మూడు కాన్వాయ్‌లకు నిధులు విడుదల కావాల్సి ఉండటం, మరో నాలుగు నెలల్లో ఎన్నికలు కూడా వస్తున్న దశలో వాహనాలను అద్దెకు తీసుకుంటే బకాయీల బెడద ఏర్పడుతుందనే ఉద్దేశంతోనే రవాణ శాఖ అధికారులు ప్రైవేటు వాహనాలపై దృష్టి సారించారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. దీనిపై రవాణ శాఖ అధికారులు మాత్రం ప్రైవేటు ముసుగులో పబ్లిక్ ట్రాన్స్‌పోర్టు కింద నడుస్తున్న వాహనాలు ఉన్నాయని, సీఎం కాన్వాయ్ కోసం ప్రైవేటు వాహనాలను కూడా స్వాధీనం చేసుకోవచ్చని చెబుతుండడం గమనార్హం. సీఎం వస్తున్నారు.. బడులకు సెలవు ఇవ్వండి.. సీఎం జిల్లాకు వస్తున్నారని, శుక్రవారం పాఠశాలలకు సెలవు ఇవ్వాలంటూ జిల్లా విద్యాశాఖ అధికారితో పాటు మండల విద్యాశాఖ అధికారులు ప్రైవేటు విద్యాసంస్థల యాజమాన్యాలను ఆదేశించారు. ఎక్కడా సీఎం వస్తున్న సందర్భంగా సెలవు అంటూ ప్రకటించవద్దని సూచించారు. మరి..బడికి ఎందుకు సెలవు ఇచ్చారని తల్లిదండ్రులు ప్రశ్నిస్తే తామేం సమాధానం చెప్పాలంటూ విద్యాసంస్థల యాజమాన్యాలు ప్రశ్నిస్తే అధికారులు ఎలాగోలా ఒకరోజు మేనేజ్ చేసుకోండంటూ సూచించడం గమనార్హం. ప్రభుత్వం సూచించిన రోజు సెలవులు ఇవ్వాలని, సెలవు రోజు బడిపెడితే గుర్తింపు రద్దు చేస్తామని హెచ్చరిస్తున్న అధికారులే అనధికారికంగా సెలవు ప్రకటించాలని ఒత్తిడి తెస్తుండటం పలు విమర్శలకు తావిస్తోంది. ఇప్పటికే పదో తరగతి విద్యార్థుల కోసం 100 రోజుల ప్రణాళికలను సిద్ధం చేసుకొని బడులు నిర్వహిస్తున్న ప్రైవేటు యాజమాన్యాలకు ఈ వ్యవహారం తలబొప్పి కట్టిస్తోంది. సీఎం సభకు బడి బస్సులు మరో వైపు కాస్త దూరంలో ఉన్న టూర్‌కు విద్యార్థులను తీసుకెళ్లాలన్నా బడి బస్సుకు నిర్ణీత దూరం ఉంటుందని, అంతవరకు మాత్రమే తిప్పాలంటూ ఆంక్షలు విధించే రవాణ శాఖ సైతం సీఎం సభ కావడంతో బడి బస్సులకు సైతం ఆంక్షలు పక్కన బెట్టేసింది. నాగరాజుపల్లి సభకు బడులకు సెలవులు ఇచ్చి మరీ బస్సులను ఏర్పాటు చేయాలని ఆదేశించింది. అనధికారికంగా ఏర్పాటు చేస్తున్న వ్యవహారం కావడంతో బస్సులకు ఆయిల్, డ్రైవర్లకు అవసరం అయ్యే అదనపు భారం తదితరాల వ్యయం కూడా విద్యాసంస్థల యాజమాన్యాలే వహించాల్సి రావడంతో పాటు నెలకు రెండుసార్లు సీఎం టూర్లు ఉంటుంటే బడులకు సెలవులు ఎలా ఇస్తారంటూ పలు ప్రైవేటు విద్యాసంస్థల యాజమాన్యాలతో తల్లిదండ్రులు వాగ్వాదానికి దిగిన సందర్భాలు నెలకొన్నాయి. ఏది ఏమైనా స్వచ్ఛందంగా వాహనాలను సేకరించుకోవడం, స్వచ్ఛందంగా ప్రజలు వచ్చేలా చేసుకోవాల్సిన కార్యకమంలో బలవంతంగా బడులకు సెలవులు ఇచ్చి, బడి బస్సులను పార్టీ కార్యకర్తలు, నాయకుల కోసం ఏర్పాటు చేయాలని ఆదేశిస్తుండటం విడ్డూరంగా ఉందని పలువురు బహిరంగంగా పేర్కొంటుండటం గమనార్హం. -
సీఎం టూర్..!
ప్రకాశం , పెద్దదోర్నాల: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జిల్లా పర్యటన నేపథ్యంలో మండల పరిధిలోని వెలిగొండ ప్రాజెక్టు సొరంగ నిర్మాణ ప్రాంతం వద్ద భద్రతా ఏర్పాట్లను ముమ్మరం చేశారు. బుధవారం ప్రాజెక్టు ప్రాంతాన్ని ఏఆర్ అడిషనల్ ఎస్పీ తిమ్మారెడ్డి శివారెడ్డి, ఐయస్‌డబ్ల్యూ డీఎస్పీ గోపాలకృష్ణ, మార్కాపురం డీఎస్పీ రామాంజనేయులు, ఇతర అధికారులు సందర్శించారు. ముఖ్యమంత్రి తొలుత మొదటి సొరంగ నిర్మాణ ప్రాంతానికి చేరుకుని కన్వేయర్ బెల్ట్ ట్రయల్‌రన్‌ను స్వయంగా పరిశీలించనున్న నేపథ్యంలో మోటార్లకు సంబంధించి రిమోట్ బటన్ ద్వారా కన్వేయర్ బెల్ట్‌ను రన్ చేసే ఏర్పాట్లను సమీక్షించారు. అనంతరం లోకో ట్రైన్లో మొదటి సొరంగంలో ప్రయాణించి టన్నెల్‌ను పరిశీలించనున్నారు. దీంతో సొరంగంలో ముఖ్యమంత్రి ప్రయాణించే లోకో రైలు బోగీని పరిశీలించి, బోగీలో చేయవలసిన ఏర్పాట్లపై ప్రాజెక్టు అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా అధికారులు లోకో రైలులో సొరంగంలో ప్రయాణించి సొరంగ ప్రాంతంలో చేపట్టవలసిన భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించారు. ప్రాజెక్టు ప్రాంతంలో ఏర్పాటు చేయనున్న ఫొటో గ్యాలరీ, కాంట్రాక్టర్లు, ఇరిగేషన్ అధికారులతో ప్రాజెక్టు పనులపై సమీక్ష నిర్వíßహించే ప్రాంతంలో చేపట్టే భధ్రతా ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. కార్యక్రమంలో ఆర్డీవో రామకృష్ణారెడ్డి, సీఐ మల్లికార్జునరావు, ఎస్సైలు రామకోటయ్య, బ్రహ్మనాయుడు, తిరుమలరావు, తదితరులు పాల్గొన్నారు. బుధవారం సాయంత్రం ఎమ్మెల్యే పాలపర్తి డేవిడ్‌రాజు పార్టీ నాయకులతో కలిసి ప్రాజెక్టు ప్రాంతంలో చేపడుతున్న భద్రతా ఏర్పాట్లను అధికారులను అడిగి తెలుసుకున్నారు. సభను విజయవంతం చేద్దాం మార్టూరు: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయడు నవంబర్ 2వ తేదీన మార్టూరులో పర్యటించనున్న నేపథ్యంలో కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అధికారులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ వి. వినయచంద్ అన్నారు. బుధవారం ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా స్థానిక మండల పరిషత్ కార్యాలయం ఆవరణలో జిల్లా మరియు స్థానిక అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో మాట్లాడారు. వెలిగొండ పర్యటన ముగించుకొని ముఖ్యమంత్రి శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు హెలికాప్టర్ ద్వారా స్థానిక రాజుపాలెం సెంటర్లో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్ద దిగి డేగరమూడి గ్రామంలో నిర్వహించే గ్రామదర్శిని కార్యక్రమంలో పాల్గొంటారని, మధ్యాహ్నం 3 గంటలకు పోలీస్ స్టేషన్ వెనుక వైపు గల బహిరంగ స్థలంలో నిర్వహించే సభలో సీఎం పాల్గొంటారని తెలిపారు. తన పర్యటనలో డేగరమూడి గ్రామంలో ఏర్పాటు చేసిన గోకులంను, పార్కును ప్రారంభిస్తారని చెప్పారు. పర్యటనకు అవసరమైన పరిసర గ్రామాల్లోని రోడ్లు, మౌలిక వసతులు ఎలాంటి లోపం లేకుండా అధికారులు పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. సమావేశానికి ముందు కలెక్టర్, ఎస్పీ సత్య ఏసుబాబు, జాయింట్ కలెక్టర్ నాగలక్ష్మి, స్థానిక శాసన సభ్యులు ఏలూరి సాంబశివరావు సభాస్థలిని, హెలిప్యాడ్‌ను, డేగరమూడి గ్రామాలను ఇతర అధికారులతో కలిసి పరిశీలించారు. -
ముఖ్యమంత్రి పర్యటన షెడ్యూల్ ఖరారు
ప్రకాశం,పెద్దదోర్నాల: ముఖ్యమంత్రి జిల్లా పర్యటన ఖరారైంది. నవంబర్ 2,3వ తేదీల్లో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు జిల్లాలో పర్యటించనున్నట్టు కలెక్టర్ వినయ్‌చంద్ తెలిపారు. పర్యటనలో భాగంగా వెలిగొండ సొరంగ నిర్మాణ పనులను సందర్శించనున్న నేపథ్యంలో కలెక్టర్ వినయ్‌చంద్, జేసీ నాగలక్ష్మీలతో పాటు పలు శాఖల అధికారులతో కలిసి ఏర్పాట్లను పర్యవేక్షించారు. అనంతరం కలెక్టర్ విలేకరుల సమావేశం నిర్వహించి ముఖ్యమంత్రి పర్యటన వివరాలు వెల్లడించారు. షెడ్యూల్ ఇలా.ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు 2వ తేదీ ఉదయం 9గంటలకుఅమరావతిలో హెలికాప్టర్లో బయలుదేరి సుమారు 10 గంటల ప్రాంతంలో వెలిగొండ సొరంగ నిర్మాణ పనుల ప్రాంతానికి చేరుకుంటారు. అక్కడ నుంచి నేరుగా మొదటి సొరంగ నిర్మాణ ప్రాంతానికి చేరుకుని కన్వేయర్ బెల్ట్ ట్రయల్ రన్‌ను పరిశీలిస్తారు. అనంతరం 10.15 గంటలకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన లోకో ట్రైన్లో మొదటి సొరంగంలో ప్రయాణించి టన్నెల్‌ను పరిశీలిస్తారు. అనంతరం ప్రాజెక్టు ప్రాంతంలో ఏర్పాటు చేసిన ఫొటో గ్యాలరీని పరిశీలిస్తారు. వెంటనే ప్రాజెక్టుకు సంబంధించిన కాట్రాక్టర్లు, ఇరిగేషన్ అధికారులతో ప్రాజెక్టు పనులపై సమీక్ష నిర్వహిస్తారు. ప్రాజెక్టుకు సంబంధించి ఏడు ప్యాకేజీల పనులపై రివ్యూ, పవర్ పాయింట్ ప్రజంటేషన్ నిర్వహిస్తారు. అనంతరం మీట్ ద ప్రెస్ కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం ఇక్కడి నుంచి 11.15కు హెలికాప్టర్లో బయలు దేరి 12 గంటలకు మార్టూరు మండలం డేగలమూడిలో జరిగే గ్రామదర్శినిలో పాల్గొని, 3 గంటలకు మార్టూరులో నిర్వహించే బహిరంగసభలో పాల్గొంటారు. అక్కడ నుంచి 5.15 గంటలకు ఒంగోలు చేరుకుని బస చేస్తారని సాయంత్రం 7 గంటలకు పార్టీ నేతలతో సమావేశం నిర్వహిస్తారు. 3వ తేదీన పూర్తి స్థాయిలో పార్టీ కార్యక్రమాల్లో పాల్గొని సాయంత్రం రోడ్డు మార్గాన లేదా, హెలికాప్టర్లో అమరావతికి చేరుకుంటారని తెలిపారు. హెలిప్యాడ్ పరిశీలన: అనంతరం సొరంగ నిర్మాణ ప్రాంతం వద్ద గతంలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌ను పరిశీలించారు. హెలిప్యాడ్ వద్ద భద్రతా ఏర్పాట్లపై మార్కాపురం డీఎస్పీ రాయాంజనేయులుకు సూచనలు చేశారు. హెలిప్యాడ్ ప్రాంతం చుట్టూ చిల్లచెట్లను తొలగించాలని ఆర్అండ్బీ ఈఈ మహేశ్వరరెడ్డికి సూచనలు చేశారు. అనంతరం సొరంగ నిర్మాణ పనుల ప్రాంతాన్ని పరిశీలించారు. ఇరిగేషన్ సీఈ గోపాల్‌రెడ్డి, ఎస్ఈ రెడ్డయ్య, ఈఈ అబూతాలిమ్, ఆర్డీవో రామకృష్ణారెడ్డి, డీఎస్పీ రామాంజనేయులు, సీఐ మల్లికార్జునరావు, ఆర్అండ్బీ డీఈ మహేశ్వరుడు, తహశీల్దార్ రత్నకుమారి, ఎస్సై రామకోటయ్య పాల్గొన్నారు. -
మండుటెండలో పరీక్ష
సాక్షి, తిరుపతి: నగరంలో శనివారం సీఎం చంద్రబాబు పర్యటన విద్యార్థులకు పరీక్ష పెట్టింది. ఎండ తీవ్రతకు వారంతా అల్లాడిపోయారు. మూడు గంటలపాటు మండుటెండలో నిరీక్షించా ల్సి వచ్చింది. అలిపిరి మార్గంలోని కపిలతీర్థం వద్ద నగరవనం పార్క్‌ను సీఎం ప్రారంభించారు. తర్వాత పచ్చదనం– పరిశుభ్రతపై మహతి ఆడిటోరియం నుంచి నెహ్రూ మున్సిపల్ గ్రౌండ్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమం ముందుగా నిర్ణయించింది కాదు. రెండు రోజుల క్రితం ఆదరాబాదరాగా ఖరారు చేశారు. దీంతో జనాన్ని తరలించటం సాధ్యం కాదని అధికారయంత్రాంగం విద్యార్థులపై దృష్టి పెట్టింది. వారితో ర్యాలీ నిర్వహించాలని నిర్ణయించారు. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల విద్యార్థులను ఉద యం 9 గంటలకే మహతి ఆడిటోరియం వద్దకు తరలించారు. 10.50కి సీఎం ర్యాలీని ప్రారంభిస్తారని అధికారులు ప్రకటించారు. ఆయన మహతికి వచ్చేసరికి మధ్యాహ్నం 12.05 గంటలైంది. నెహ్రూ మున్సిపల్ గ్రౌండ్‌కు చేరుకోడానికిమరో అర్ధగంట పట్టింది. దీంతో గంటల తరబడి ఎండలో ఆడిటోరియం వద్ద వేచి ఉన్న విద్యార్థులు మళ్లీ ర్యాలీలో పాల్గొన్నారు. వారంతా ఎండకు ఆపసోపాలు పడ్డారు. ప్రజల భాగస్వామ్యం లేకుండా విద్యార్థులతో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు, అధికారులు ఈ ప్రదర్శనలో పాల్గొనడం విమర్శలకు దారితీసింది. ముఖ్యమంత్రి రహదారిలో ర్యాలీగా వెళ్తున్నా ఎక్కడా జన స్పందన లేకపోయేసరికి పార్టీ నేతలు చిన్నబుచ్చుకున్నారు. ఎమ్మెల్యే సుగుణమ్మ ఇంటి వద్ద కనీసం స్వాగతం ఫ్లెక్సీలైనా లేకపోయేసరికి చంద్రబాబు నిరుత్సాహానికి గురైనట్లు తెలిసింది. చప్పగా సాగిన ప్రసంగం...అడిగి మరీ చప్పట్లు కొట్టించుకున్న వైనం తిరుపతిలోని మున్సిపల్ గ్రౌండ్లో జరిగిన బహిరంగ సభకు మహిళలను, విద్యార్థులను తరలించారు. సీఎం చంద్రబాబు ప్రసంగం సభికులను ఆకట్టుకోలేదు. తిరుపతిని నంబ ర్ వన్ చేస్తానని పదేపదే చెప్పటం తప్పితే... కొత్తగా ప్రస్తావించిందేమీ లేదు. డిజిటల్ డోర్ నంబర్లు, ఫ్లైవోవర్, వాకింగ్ ట్రాక్ గురించి చెప్పుకొచ్చారు. ఆయన ప్రసంగి స్తున్న సమయంలోనే జనం లేచి వెళ్లిపోవటం కనిపించింది. -
నేడు సీఎం పర్యటన
కర్నూలు(అగ్రికల్చర్): ముఖ్యమంత్రి చంద్రబాబు శనివారం జిల్లాలో పర్యటించనున్నారు. బనగానపల్లె నియోజకవర్గంలోని అవుకు, కొలిమిగుండ్ల మండలాల్లో పర్యటిస్తారు. ముందుగా ప్రకటించిన పర్యటన షెడ్యూల్లో మార్పులుచోటుచేసుకున్నాయి. తిరుపతిలో పర్యటించిన అనంతరం ఇక్కడికి రానున్నారు. గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో రేణిగుంటకు చేరుకొని.. అక్కడి నుంచి తిరుపతి వెళతారు. అక్కడ పర్యటన ముగిసిన తర్వాత ప్రత్యేక విమానంలో కడప చేరుకుంటారు. అక్కడినుంచి హెలికాప్టర్లో మధ్యాహ్నం 1.45 గంటలకు అవుకు మండలం రామాపురానికి వస్తారు. రెండు గంటలకు అవుకు రిజర్వాయర్ సమీపంలోని గాలేరు–నగరి సుజల స్రవంతి (జీఎన్ఎస్ఎస్) హెడ్‌రెగ్యులేటర్‌కు చేరుకుంటారు. 2.30 గంటల వరకు అక్కడ జలశ్రీకి హారతి, జీఎన్ఎస్ఎస్ హెడ్‌రెగ్యులేటర్ నుంచి గండికోట రిజర్వాయర్‌కు నీటి విడుదల, గోరుకల్లు రిజర్వాయర్, పులికనుమ ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించి జాతికి అంకితం చేయడం, అవుకు రిజర్వాయర్‌లో బోటింగ్, రెస్టారెంట్, వీఐపీ గెస్ట్‌హౌస్ ప్రారంభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. 2.40 గంటలకు కొలిమిగుండ్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మైదానానికి చేరుకుంటారు. 2.45 నుంచి 4.30 వరకు బహిరంగసభలో పాల్గొంటారు. అనంతరం హైదరాబాద్‌కు బయలుదేరి వెళతారు. ఏర్పాట్ల పరిశీలన కొలిమిగుండ్ల/అవుకు: సీఎం పర్యటన సందర్భంగా చేసిన ఏర్పాట్లను మంత్రి అఖిలప్రియతో పాటు జిల్లా అధికారులు శుక్రవారం పరిశీలించారు. అవుకులో ఏర్పాట్లను మంత్రి అఖిలప్రియ, జేసీ ప్రసన్న వెంకటేష్, వివిధ శాఖల జిల్లా, డివిజన్ స్థాయి అధికారులు పరిశీలించారు. అలాగే కొలిమిగుండ్ల ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో బహిరంగ సభ ఏర్పాట్లను రాయలసీమ డీఐజీ ఘట్టమనేని శ్రీనివాస్ చూశారు. సభా ప్రాంగణంతో పాటు ఇతర ప్రాంతాలను తనిఖీ చేశారు. -
హక్కులపై ఉక్కుపాదం
సాక్షి ప్రతినిధి, ఏలూరు, చింతలపూడి: ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడి పర్యటన పూర్తిగా నిర్బంధం నడుమ సాగింది. ప్రజలు, నాయకులు, రైతులపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. చింతలపూడి ఎత్తిపోతల పథకం రైతులకు జరుగుతున్న అన్యాయంపై నిలదీస్తారనే భయంతో సోమవారం రాత్రి నుంచే రైతు నాయకులు, వామపక్ష నేతలతోపాటు వైఎస్సార్ సీపీ నేతలను పోలీసులు గృహ నిర్బంధంలో పెట్టారు. ముఖ్యమంత్రి చింతలపూడి రావడానికి కొద్దినిముషాల ముందు వైఎస్సార్ సీపీ చింతలపూడి సమన్వయకర్త వీఆర్ ఎలీజా, మండల అధ్యక్షురాలు జగ్గవరపు జానకీరెడ్డి, మండల నేత వెంకటేశ్వరరావు తదితరులను అరెస్టు చేసి పోలీసు స్టేషన్‌కు తీసుకువెళ్లడం వివాదానికి దారితీసింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జిల్లా చింతలపూడి పర్యటన నేపథ్యంలోమంగళవారం పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. ముఖ్యమంత్రి రావడానికి ముందే వైఎస్సార్ సీపీ నాయకులను అక్రమంగా అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు బలవంతంగా తరలించారు. ముఖ్యమంత్రిని కలిసి ఎక్కడ సమస్యలపై ప్రశ్నిస్తారోనన్న భయంతో నియోకవర్గ సమన్వయకర్త వీఆర్ ఎలీజా, మండల అధ్యక్షురాలు జగ్గవరపు జానకిరెడ్డితో పాటు మరికొంత మంది విద్యార్థి విభాగం నాయకులను అదుపులోకి తీసుకున్నారు. స్థానిక మార్కెట్ కమిటీ ఆవరణలో బుధవారం జరిగే గురుపూజోత్సవ కార్యక్రమ ఏర్పాట్లను పరిశీలించి ఇంటికి కాలినడకన వస్తున్న ఎలీజాను అడ్డుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించడం పట్ల వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. వారు పోలీస్ స్టేషన్‌కు చేరుకుని అక్రమంగా పోలీస్ స్టేషన్‌కు తరలించి నిర్భంధిచిన వైఎస్సార్ సీపీ నేతలను విడిచి పెట్టాలని ఆందోళనకు దిగారు. దాంతో పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నిలదీస్తారనే భయంతోనే.. ముఖ్యమంత్రి పర్యటన ముగిశాక సాయంత్రం ఐదున్నర గంటలకు అదుపులోకి తీసుకున్న వైఎస్సార్ సీపీ నాయకులను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎలీజా మాట్లాడుతూ అక్రమ అరెస్ట్‌లకు భయపడేది లేదని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి పర్యటన ఆసాంతం ప్రభుత్వ గొప్పలు చెప్పుకోవడానికే సరిపోయిందని ఎద్దేవా చేశారు. ప్రజలు ఎక్కడ నిలదీస్తారోనన్న భయంతోనే రెండు వేలమంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేసుకున్నారని విమర్శించారు. అనంతరం వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలతో కలిసి పోలీస్ స్టేషన్ వద్ద నుంచి పాదయాత్రగా ఫైర్‌స్టేషన్ సెంటర్ చేరుకుని వైఎస్ రాజశేఖర్‌రెడ్డి విగ్రహానికి పాలాభిషేకం చేశారు. ప్రభుత్వ తీరుకు , పోలీసుల తీరుకు నిరసనగా నినాదాలు చేశారు. అక్కడి నుంచి కాలి నడకన కార్యకర్తలతో కలిసి మెయిన్‌రోడ్డును శుద్ది చేసుకుంటూ వైఎస్ఆర్ సిపి కార్యాలయానికి చేరుకున్నారు. పలువురి గృహ నిర్భంధం ముఖ్యమంత్రి పర్యటనను పురస్కరించుకుని మండలంలోని సీపీఐ, వైఎస్సార్ సీపీ నేతలతోపాటు చింతలపూడి ఎత్తిపోతల పథకం రైతు సంఘం నాయకులను పోలీసులు గృహనిర్బంధం చేశారు. వైఎస్సార్ సీపీ జిల్లా అధికార ప్రతినిధి బొడ్డు వెంకటేశ్వరరావు, సీపీఐ మాజీ జిల్లా కార్యదర్శి ఎం. వసంతరావు, సీపీఐ మండల కార్యదర్శి కె.గురవయ్య, పట్టణ కార్యదర్శి టి.బాబు, యర్రగుంటపల్లి సీపీఐ నాయకులు పి. సోమశేఖర్, చింతలపూడి ఎత్తిపోతల పథకం రైతు సంఘం నాయకులు అలవాల ఖాదర్‌బాబురెడ్డి, పి.ముత్తారెడ్డి, కాంగ్రెస్ పీసీసి కార్యదర్శి మారుమూడి థామస్ తదితరులను ముందస్తుగా గృహనిర్బంధం చేశారు. ఎమ్మెల్సీ ఆళ్ల నాని ఖండన ప్రజాస్వామ్యంలో ప్రజలకు న్యాయం చేయలేకపోగా, ప్రశ్నిస్తారన్న భయంతో ముందస్తు అరెస్టులు, గృహనిర్బంధాలకు పాల్పడటం సరికాదని ఎమ్మెల్సీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏలూరు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు ఆళ్ల నాని విమర్శించారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చింతలపూడి పర్యటన సందర్భంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు, రైతు నేతలను అరెస్టులు చేయడం, గృహనిర్బంధాలకు పాల్పడటం సరికాదన్నారు. తమకు అన్యాయం జరిగిందని గత రెండేళ్లుగా ఉద్యమిస్తున్న రైతుల సమస్యను పరిష్కరించాల్సిందిపోయి వారిని అరెస్టు చేయడం ప్రజాస్వామ్యం కాదని ఆయన విమర్శించారు. ‘చింతలపూడి’ రైతులకు దక్కని హామీ గత రెండేళ్లుగా తమకు ఇచ్చే పరిహారాన్ని పెంచాలని చింతలపూడి ఎత్తిపోతల పథకం నిర్వాసిత రైతులు చేస్తున్న ఆందోళనపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సానుకూలంగా స్పందించలేదు. ఒకే పథకంలో ఒక్కో చోట ఒక్కో రేటు ఇవ్వడం, తమకు అన్యాయం జరుగుతుందని పోరాడుతున్న రైతు కమిటీ నేతలను ముందస్తుగానే గృహనిర్బంధంలోకి తీసుకున్నారు. బోయగూడెంలో ఒక రైతు ప్రశ్నించినప్పుడు కూడా ముఖ్యమంత్రి న్యాయం చేస్తామని హమీ ఇవ్వలేదు. బహిరంగ సభలో స్థానిక ఎమ్మెల్యే పీతల సుజాత ఈ విషయాన్ని ప్రస్తావించినా ముఖ్యమంత్రి మాత్రం స్పందించలేదు. ఆయిల్‌పామ్ మద్దతు ధరపై స్పందనేదీ! పక్కనే ఉన్న పొరుగు రాష్ట్రంలో ఆయిల్‌పామ్‌కు మంచిధర దక్కుతుండగా, ఇక్కడ గిట్టుబాటు ధర రావడం లేదు. ఈ విషయంపై ఎంపీ మాగంటి బాబు ప్రస్తావించారు. ఈ అంశంపై ముఖ్యమంత్రి మాట్లాడుతూ అవసరమైతే మరో ఫ్యాక్టరీ పెడతామని, అప్పటి వరకూ రైతులతోనే ఇప్పుడున్న ఫ్యాక్టరీని నడుపుతామని చెప్పారు. ఫ్యాక్టరీ యాజమాన్యాన్ని ఖబడ్దార్ అంటూ హెచ్చరించినా, మద్దతు ధర ఎంత ఇప్పిస్తాననే మాట ముఖ్యమంత్రి నోట రాకపోవడంపై ఆయిల్‌పామ్ రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
సీఎం పర్యటన.. ప్రైవేట్ స్కూళ్లకు సెలవు
పశ్చిమగోదావరి, ఏలూరు (ఆర్‌ఆర్‌పేట)/ద్వారకాతిరుమల : ముఖ్యమంత్రి చంద్రబాబు మంగళవారం జిల్లా పర్యటనకు రానుండడంతో అధికారులు జనసమీకరణకు పూనుకున్నారు. చింతలపూడిలో సీఎం గ్రామదర్శిని కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఆ సభకు జనాన్ని తరలించేందుకు అధికారులు ప్రైవేట్ స్కూల్ బస్సులను సమీకరిస్తున్నారు. అందుకోసం ఏకంగా ప్రైవేట్ స్కూళ్లకు సెలవు ప్రకటించారు. ఈ మేరకు ఏలూరు, జంగారెడ్డిగూడెం డివిజన్లలోని ప్రైవేట్ స్కూళ్లకు సెలవు ప్రకటిస్తూ జిల్లా విద్యాశాఖాధికారి అధికారికంగా ఆదేశాలిచ్చారు. ముఖ్యమంత్రి పర్యటన కోసం స్కూళ్లకు సెలవు ఇవ్వడంపై విద్యార్థుల తల్లిదండ్రులు విస్మయం వ్యక్తం చేయడమే కాకుండా మండిపడుతున్నారు. గ్రామదర్శినికి సుమారు 150 బస్సులు చింతలపూడిలో నిర్వహించనున్న గ్రామ దర్శిని కార్యక్రమానికి జనాన్ని తరలించడానికి సుమారు 150 బస్సులు కావాలని జిల్లా రెవెన్యూ అధికారుల నుంచి రవాణాశాఖ అధికారులకు ఆదేశాలు వెళ్లాయి. దీంతో రవాణా శాఖ అధికారులు ఏలూరు డివిజన్ పరిధిలోని ఏలూరు, చింతలపూడి, లింగపాలెం, కామవరపుకోట, టి.నరసాపురం, కొయ్యలగూడెం, ద్వారకాతిరుమల తదితర ప్రాంతాలతో పాటు జంగారెడ్డిగూడెం డివిజన్ పరిధిలోని పలు మండలాల్లోని ప్రైవేట్ స్కూళ్లకు చెందిన బస్సులను స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు జనాన్ని తరలించే బాధ్యతను అధికారులకు డ్వాక్రా మహిళలకు అప్పగించారు. వచ్చిన వారికి స్నాక్స్ వంటి వాటికి అయ్యే ఖర్చులను కూడా గ్రామ సంఘాలే భరించాలని ఆదేశించారు. దీంతో డ్వాక్రా మహిళలు ఇదెక్కడి గోలరా బాబు.. అంటూ తలలు పట్టుకుంటున్నారు. -
నేడు జిల్లాకు సీఎం చంద్రబాబు రాక
చిత్తూరు కలెక్టరేట్: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుక్రవారం జిల్లాకు రానున్నారు. ఈ మేరకు ఆయన పర్యటన వివరాలను కలెక్టర్ ప్రద్యుమ్న గురువారం ఒక ప్రకటనలో వెల్ల్లడించారు. సీఎం ఉదయం 9.45 గంటలకు రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుంటారు. 10.15 గంటలకు తిరుపతిలోని ముత్యాలరెడ్డి పల్లెలో అన్న క్యాంటిన్‌ను ప్రారంభిస్తారు. అలిపిరి బైపాస్ రోడ్డు సమీపంలో టీటీడీ, టాటా ట్రస్టు సంయుక్తంగా నిర్మిస్తున్న శ్రీవెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ కేన్సర్ రీసెర్చ్ సెంటర్‌కు 10–45 గంటలకు భూమిపూజ చేస్తారు. ఈ కార్యక్రమంలో టాటా గ్రూప్ కంపెనీల చైర్మన్ రతన్ ఎన్.టాటా కూడా పాల్గొంటారు. ఎగ్జిబిషన్ స్టాల్స్‌ను సీఎం సందర్శిస్తారు. 11.05 గంటలకు బహిరంగ సభలో పాల్గొంటారు. మధ్యాహ్నం 12.10 గంటలకు పుదిపట్ల ఎస్వీ జూ పార్కు సమీపంలోని బ్రదర్స్ రెసిడెన్సీకి చేరుకుంటారు. ఎస్వీ అగ్రికల్చర్ కాలేజి మైదానం నుంచి హెలికా ప్టర్‌లో బయలుదేరి 1.45 గంటలకు చిత్తూరులోని అపోలో మెడికల్ కాలేజీ వద్దకు వస్తారు. మెడికల్ కాలేజీలోని గెస్ట్çహౌస్‌లో 2.20 గంటల వరకు వి శ్రాంతి తీసుకుని 2.25 గంటలకు అపోలో నాలెడ్జి సిటీని ప్రారంభిస్తారు. తర్వాత అక్కడ సభలో చం ద్రబాబు ప్రసంగించనున్నారు. సాయంత్రం 4 గంటలకు తేనెబండ వద్ద కాపు భవన్ నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. 4.40 గంటలకు హెలికాప్టర్లో బయలుదేరి 5.10 గంటలకు రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుని విజయవాడ వెళ్లనున్నారు. సీఎం పర్యటనకు చురుగ్గా ఏర్పాట్లు ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా తిరుపతి, చిత్తూరులో అధికారులు ఏర్పాట్లు చేశారు. కలెక్టర్ ప్రద్యుమ్న ఏర్పాట్లను పరిశీలించారు. తేనెబండ వద్ద భూమి పూజ స్థలాన్ని ఎస్పీ రాజశేఖర్‌బాబుతో కలిసి ఆయన పరిశీలించారు. కాన్వాయ్ ట్రయల్ రన్‌ను వీరిద్దరూ పర్యవేక్షించారు. -
బాబుగారొస్తారని..
సాక్షి, తూర్పుగోదావరి, రాజమహేంద్రవరం: పదుల సంఖ్యలో అధికారులు.. సబ్ కలెక్టర్ నుంచి తహసీల్దార్లు, డిప్యూటీ తహసీల్దార్లు, ఆర్ఐలు.. డివిజనల్ పంచాయతీ అధికారి, ఎంపీడీవోలు, పంచాయతీ కార్యదర్శులు, వందల సంఖ్యలో పారిశుద్ధ్య కార్మికులు.. గత 20 రోజులుగా గోకవరం మండలం మల్లవరం గ్రామంలో తిష్ట వేశారు. ముఖ్యమంత్రి పర్యటన కోసం వీరందరూ నానా హైరానా పడుతున్నారు. నాలుగేళ్లుగా లేనిది ఆ గ్రామంలో రోడ్లు వేసేస్తున్నారు. వేసిన రోడ్లకు రంగులేసేస్తున్నారు. మార్కింగ్‌లు ఏర్పాటు చేస్తున్నారు. కొత్త డ్రైనేజీలు నిర్మిస్తున్నారు. ఎప్పుడూ తమ గ్రామం వైపు కన్నెత్తి కూడా చూడని పెద్దపెద్ద అధికారులు ఇలా ఇన్ని రోజులపాటు తమ గ్రామంలో ఉండడం చూసి ప్రజలు ఆశ్చర్యానికి గురవుతున్నారు. చంద్రబాబు పర్యటన నేపథ్యంలో తమ గ్రామ స్వరూపం మారిపోతుందని అనుకుంటున్నా.. చేస్తున్న పనులన్నీ ఆ గ్రామంలోని సమస్యలు ముఖ్యమంత్రి కంట పడకుండా ఉండేందుకేనన్నట్టుగా ఉన్నాయంటూ గ్రామస్తులు ముక్కున వేలేసుకుంటున్నారు. ఇక్కడి సిబ్బంది అక్కడ.. గ్రామంలో జరుగుతున్న పనులను పర్యవేక్షించేం దుకు రాజమహేంద్రవరం రెవెన్యూ డివిజన్లోని అధికారులకు మల్లవరంలో డ్యూటీ వేశారు. సబ్ కలెక్టర్ సీఎం సాయికాంత్ వర్మ ప్రతి రోజూ ఆ గ్రామానికి వెళ్లి పనులు జరుగుతున్న తీరు తెలుసుకుంటుండగా, ఇతర అధికారులు అక్కడే ఉండి పనులు చేయిస్తున్నారు. రాజమహేంద్రవరం డివిజన్లోని పలు మండలాల నుంచి తహసీల్దార్లు, ఎంపీడీవోలను మల్లవరం పంపడంతో, వివిధ పనుల కోసం ఆయా కార్యాలయాలకు వెళ్తున్న ప్రజలు అధికారులు లేక ఉసూరుమంటూ వెనుదిరుగుతున్నారు. అధికారులు ఎక్కువ సమయం మల్లవరంలో ఉంటుండడంతో కార్యాలయాల్లో రోజువారీ పనులు స్తంభించిపోతున్నాయి. దాదాపు 7 వేల మంది ఉన్న మల్లవరం గ్రామానికి రాజమహేంద్రవరం డివిజన్లోని గ్రామాల నుంచి 120 మంది పారిశుద్ధ్య కార్మికులను ట్రాక్టర్లతో సహా తరలించారు. ఐదు రోజులుగా మల్లవరంలో 120 మంది పారిశుద్ధ్య కార్మికులు పని చేస్తున్నారు. మల్లవరంలో పరిస్థితి అలా ఉండగా, ఆ 120 మంది కార్మికులు వాస్తవంగా విధులు నిర్వహించాల్సిన గ్రామాల్లో పారిశుద్ధ్యం పడకేసింది. సీఎం పర్యటన అనంతరం, ఆ కార్మికులు తాము పని చేస్తున్న ప్రాంతాలకు తిరిగి వెళ్లిపోతే, మల్లవరంలో పారిశుధ్య పనులు ఎవరు చేస్తారన్న ప్రశ్న తలెత్తుతోంది. ముఖ్యమంత్రి పర్యటన కోసం హడావుడి చేయడం కాకుండా, తమ గ్రామంలో శాశ్వతంగా కార్మికులను నియమించి పారిశుధ్య పనులు సక్రమంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. లక్ష్యం మరచి సుందరీకరణ గ్రామదర్శిని, నగర దర్శిని పేర్లతో గ్రామాలు, పట్టణాలల్లో పారిశుధ్య సమస్యలు, ప్రజల ఇక్కట్లు, స్థానిక సమస్యలను తెలుసుకుని పరిష్కరించాలి. ప్రభుత్వ పథకాలు అందుతున్నాయో లేదో తెలుసుకొని ప్రజలతో నేరుగా మమేకమై పరిష్కరించాలి. కానీ గ్రామదర్శిని పేరుతో ముఖ్యమంత్రి చేస్తున్న కార్యక్రమం అసలు లక్ష్యాన్ని పక్కదోవ పట్టించేవిధంగా ఉంది. సీఎం పర్యటనకు పక్షం రోజుల ముందే అధికారులు అక్కడ అభివృద్ధి పనులు చేయడం, రోడ్లు, గోడలకు రంగులు వేయడం, మొక్కలు నాటడం, డ్రైనేజీ, పారిశుధ్య పనులు చేపట్టడం చేస్తున్నారు. తద్వారా దీర్ఘకాలంగా గ్రామంలో తిష్ట వేసిన సమస్యలు సీఎంకు కనపడనీయకుండా చేస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి -
ప్రగతికి పరుగులు
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: నాలుగున్నరేళ్ల ‘ప్రగతి నివేదన’కు సభాస్థలి సిద్ధమవుతోంది. వచ్చే ఎన్నికల సమరానికి వేదికగా భావిస్తున్న ఈ సభను గులాబీ అధినాయకత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ ముహూర్తం ఖరారు చేసిన మరుక్షణం నుంచే సభా ప్రాంగణం ఆగమేఘాల మీద రూపుదిద్దుకుంటోంది. టీఆర్ఎస్ నాయకగణం కొంగరకలాన్‌లోనే తిష్టవేసి బహిరంగ సభ ఏర్పాట్లను పర్యవేక్షిస్తోంది. రవాణా శాఖ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి, మేయర్ బొంతు రామ్మోహన్, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, శంభీపూర్ రాజు, నరేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డిల ప్రత్యక్ష పర్యవేక్షణలో పనులు శరవేగంగా సాగుతున్నాయి. రెండు రోజుల క్రితం ఇక్కడ పర్యటించిన సీఎం కేసీఆర్.. సభా ప్రాంగణానికి చేరుకోవడానికి నలువైపులా కనీసం 20 మార్గాలు ఉండాలని సూచించారు. దీంతో శనివారం సభాస్థలికి నలుదిక్కులా ఉన్న లింకురోడ్లను పరిశీలించి మార్గాల అభివృద్ధిపై మంత్రి మహేందర్‌రెడ్డి బృందం మార్గనిర్దేశం చేసింది. మరోవైపు ఔటర్ రింగ్‌రోడ్డు నుంచి కొంగరకలాన్‌కు వెళ్లే ఇరుకైన మార్గాన్ని యుద్ధ ప్రాతిపదికన రెండు వరుసల రహదారిగా విస్తరించే పనులు చేపట్టారు. ఇంకోవైపు సభా ఆవరణను పూర్తిగా చదును చేశారు. వందలాది జేసీబీ, హిటాచీలు, డోజర్లను వినియోగిస్తూ 1600 ఎకరాలను మైదానంగా తీర్చిదిద్దుతున్నారు. రూట్ మ్యాప్‌పై కమిషనర్ కసరత్తు సభాస్థలిని శనివారం రాచకొండ కమిషనర్ మహేశ్ భగవత్ సందర్శించారు. సభకు అనుసంధానం చేసే మార్గాలపై పోలీస్ అధికారులకు దిశానిర్దేశం చేశారు. ప్రజలు సాధ్యమైనంత త్వరగా బహిరంగ సభకు చేరుకోవడం.. సభ పూర్తయ్యాక అదేస్థాయిలో నిష్క్రమించేలా ఏర్పాట్లు చేయాలని నిర్ణయించడంతో కొత్త రోడ్ల అభివృద్ధిపై రవాణా మంత్రి మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే కిషన్‌రెడ్డితో చర్చించారు. 25 లక్షల మంది రానున్నందున భద్రతాలోపాలు తలెత్తకుండా ఆదివారం నుంచే ప్రత్యేక పోలీస్ కంట్రోల్ రూమ్‌ను కూడా ఏర్పాటు చేయాలని స్థానిక అధికారులను ఆదేశించారు. ఇప్పటినుంచే తాత్కాలికంగా గుడారాలు ఏర్పాటు చేసి పోలీసులు పహారా కాస్తున్నారు. వేదిక వెనకభాగంలో హెలిపాడ్, వీఐపీలకు ప్రత్యేక మార్గాన్ని అందుబాటులోకి తీసుకురానున్నారు. లక్షలాదిగా తరలివచ్చే వాహనాల పార్కింగ్‌కు ఇబ్బందులు తలెత్తకుండా పార్టీ నాయకత్వం చర్యలు తీసుకుంటోంది. దీనికి అనుగుణంగా ప్రైవేటు భూములను కూడా వినియోగించుకుంటోంది. ఈ మేరకు తాత్కాలికంగా రోడ్లు, పార్కింగ్ కోసం గుర్తించిన భూముల రైతుల సమ్మతి తీసుకుంటోంది. నష్టపరిహారం కూడా చెల్లిస్తామని హామీ ఇవ్వడంతో భూములు ఇచ్చేందుకు రైతులు ముందుకొస్తున్నారు. నేతల హడావుడి.. ప్రగతి నివేదన సభ ప్రాంగణానికి అధికార పార్టీ నేతల తాకిడి పెరిగిపోయింది. పనులను పర్యవేక్షించేది కొందరైతే.. హడావుడి చేసి ముఖ్యనాయకుల చూపులో పడేందుకు మరికొందరు ప్రయత్నిస్తుండడంతో సభాస్థలి వద్ద సందడి నెలకొంది. కొందరు నేతలు ఏకంగా మందీమార్బలంతో హంగామా సృష్టిస్తుండడం కనిపించింది. కాగా, శనివారం పర్యటించిన వారిలో టీఎస్ఐఐసీ చైర్మన్ బాలమల్లు, మాజీ మంత్రి దానం నాగేందర్, ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్, జెడ్పీ వైస్ చైర్మన్ ప్రభాకర్‌రెడ్డి, పార్టీ నాయకులు మంచిరెడ్డి ప్రశాంత్‌కుమార్‌రెడ్డి, మనోహర్‌రెడ్డి, రమేశ్‌గౌడ్, చల్లా మాధవరెడ్డి, ఆర్డీఓ రవీందర్‌రెడ్డి తదితరులు ఉన్నారు. పార్కింగ్ కోసం 900 ఎకరాలు ఇబ్రహీంపట్నంరూరల్: సభకు రాష్ట్రం నలుమూల నుంచి వచ్చే ప్రతినిధులకు అనువుగా ఉండేలా పార్కింగ్ స్థలాలను శనివారం గుర్తించారు. జిల్లా మంత్రి మహేందర్‌రెడ్డి, నగర మేయర్ బొంతు రామ్మోహన్, ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, ప్రభుత్వ విప్ పల్లా రాజేశ్వర్‌రెడ్డిలు పార్కింగ్ స్థలాలను పరిశీలించారు. 9 పార్కింగ్ స్థలాలకు గాను 900 ఎకరాల భూమి సరిపోతుందని వెల్లడించారు. 20 వేల బస్సులు, 50 వేల ఫోర్ వీలర్స్ వాహనాలను నిలిపేలా స్థలాలు కేటాయించారు. రాచకొండ సీపీ మహేష్బాగవత్, జాయింట్ సీపీ, డీసీపీ ప్రకాష్‌రెడ్డిలు కలిసి ఎమ్మెల్సీ శంభీపూరి రాజుతో చర్చించారు. 12 అప్రోచ్ రోడ్ల నిర్మాణం .. సభకు ఇరువైపులా 12 రోడ్లు ఉంటే సులభంగా ఎక్కడి వారు అక్కడికి చేరుకునేలా రోడ్లు ఏర్పాటు చేస్తున్నారు. సభాస్థలికి ఇప్పటికే నాలుగు రోడ్లు ఉన్నాయి. మెయిన్‌రోడ్డు నుంచి కొంగరకలాన్ వరకు ఉన్న రోడ్డును డబుల్ రోడ్డు చేస్తున్నారు. శ్రీశైలం హైవే ప్యాబ్‌సీటీ నుంచి మరో రోడ్డు వేయనున్నారు. ఔటర్ సర్వీస్ రోడ్డు నుంచి మరో రెండు రోడ్లు, హెలిపాడ్ వరకు ఒక రోడ్డు వేయాలని నాయకులు సూచించారు. కలెక్టరేట్ ముందు నుంచి కొంగరకలాన్ తండా వరకు రోడ్డు వేయాలని మంత్రులు సూచించారు. కలెక్టరేట్ 100 ఫీట్ల రోడ్డు నుంచి నేరుగా ఔటర్ రింగ్‌రోడ్డును కలుపుతూ 200 ఫీట్లతో మరో పెద్ద రోడ్డు వేయడానికి పనులు ప్రారంభించారు. చెట్లు తీసి మరో చోట నాటి.. సభ స్థలంలో ఇబ్బందికరంగా ఉన్న వేప చెట్లను నరికి వేయకుండా వేర్లతో పాటు తవ్వి టీఎస్ఐఐసీ భూముల్లో పాతాలని టీఎస్ఐఐసీ చైర్మన్ బాలమల్లు, ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ సిబ్బందిని అదేశించారు. దీంతో చెట్లను తొలగించి ఇతర ప్రాంతాల్లో నాటుతున్నారు. -
అధికార ఆట..!
జిల్లాలోని క్రీడా మైదానాలు క్రీడాకారులు ఆడుకునేందుకా లేక హెలీక్యాప్టర్ల ల్యాండింగ్ కోసమా అన్న చందంగా తయారయ్యాయి. ఇప్పటికే నగరంలో మూడు శాశ్వత హెలీప్యాడ్లు ఉండగా.. తాజాగా మరో హెలీప్యాడ్‌ను ఏర్పాటు చేస్తున్నారు.. అది కూడా నగరం నడిబొడ్డున ఉన్న ఏకైక డీఎస్ఏ క్రీడామైదానంలో. దీంతో క్రీడాకారులు ఉన్న మైదానాలన్నీ హెలీప్యాడ్ల నిర్మాణానికే వినియోగిస్తే ఇక తాము ఎక్కడ ఆడుకోవాలంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కడప స్పోర్ట్స్: ముఖ్యమంత్రి పర్యటనతో జిల్లాకు కలిగే ప్రయోజనం సంగతి ఏమో కాని.. క్రీడాకారులకు మాత్రం నష్టపోతూనే ఉన్నారు. గతంలో స్టేడియంలో ఏర్పాటు చేసిన ఓ సభ కోసం మైదానం చుట్టూ ఉన్న ప్రహరీలను కూల్చారు. తర్వాత ఏడాదికి గాని మళ్లీ ఆ గోడల స్థానంలో గేట్లు ఏర్పాటు చేయలేకపోయారు. తరచూ క్రీడల అభివృద్ధికి కృషిచేస్తామంటూ గొప్పలు చెప్పుకునే పాలకులు.. ఉన్న మైదానాలను నాశనం చేస్తుండటం పట్ల క్రీడాకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా నగరంలోని డీఎస్ఏ మైదానంలో శాశ్వత హెలీప్యాడ్ ఏర్పాటు చేస్తుండడంతో ఏమి చేయాలో క్రీడాకారులకు పాలుపోవడం లేదు. ఏదైనా కష్టం వస్తే.. జిల్లాలో ఉన్నతాధికారులకు చెప్పుకుంటారు.. వారి ఆదేశాల మేరకే మైదానంలో శాశ్వత హెలీప్యాడ్ ఏర్పాటు చేస్తుండడంతో తమ బాధను ఎవరికి చెప్పుకోవాలో అర్థం కావడం లేదంటూ క్రీడాకారులు ఆవేదన చెందుతున్నారు. మరో మైదానం బలి జిల్లా కేంద్రమైన కడప నగరంలో ఉన్న మైదా నాలు రెండే రెండు.. ఒకటి డీఎస్ఏ క్రీడామైదానం.. మరొకటి ఆర్ట్స్ కళాశాల మైదానం. రెండు సంవత్సరాల క్రితం క్రీడాకారులు వ్యతిరేకించినప్పటికీ ఆర్ట్స్ కళాశాల మైదానం మధ్యలో శాశ్వత హెలీప్యాడ్‌ను ఏర్పాటు చేశారు. దీంతో పాటు 10 సంవత్సరాల క్రితం రిమ్స్‌లో కూడా శాశ్వత హెలీప్యాడ్ ఏర్పాటు చేశారు. దీంతో పాటు నగర శివారులోని డీటీసీలో కూడా హెలీప్యాడ్ ఉంది. పైగా అందుబాటులో విమానాశ్రయం కూడా ఉంది. ఇన్ని హెలీప్యాడ్లు ఉండగా మళ్లీ మరో హెలీప్యాడ్ నిర్మాణం చేపట్టడం ఏంటని నగర ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం నగరంలోని ప్రకాశం పంతులు జిల్లా క్రీడాప్రాథికారసంస్థ మైదానం (మున్సిపల్ స్టేడియం) మధ్యభాగంలో హాకీ కోర్టులో శాశ్వత హెలీప్యాడ్ నిర్మాణం కోసం పనులు ప్రారంభించారు. మంగళవారం ప్రారంభించిన పనులను చూస్తున్న క్రీడాకారులు ఇక్కడ తవ్వుతున్నారేంటని ప్రశ్నించడంతో ఇక్కడ శాశ్వత హెలీప్యాడ్ ఏర్పాటు చేస్తున్నామని పేర్కొనడంతో క్రీడాకారులు అవాక్కయ్యారు. ప్రతిరోజూ ఇక్కడ తాము సాధన చేస్తుంటామని.. త్వరలో ఇక్కడ అంతర్ జిల్లాల హాకీ టోర్నమెంట్ నిర్వహించనున్న నేపథ్యంలో ఇలా హెలీప్యాడ్ ఏర్పాటు చేస్తే తాము ఎక్కడ సాధన చేయాలంటూ జిల్లా క్రీడాప్రాథికార సంస్థ అధికారులను ప్రశ్నించారు. జిల్లా ఉన్నతాధికారుల నిర్ణయమని తామేమీ చేయలేమంటూ డీఎస్ఏ అధికారులు చేతులెత్తేశారు. దీంతో తమ బాధ ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాని స్థితిలో క్రీడాకారులు ఉన్నారు. కలెక్టరేట్ వద్ద ఆందోళన.. డీఎస్ఏ మైదానంలోని హాకీ కోర్టులో శాశ్వత హెలీప్యాడ్ నిర్మాణాన్ని నిలిపివేయాలంటూ హాకీ క్రీడాకారులు మంగళవారం రాత్రి ఆందోళనకు దిగారు. నిర్మాణ పనులపై జిల్లా కలెక్టర్‌ను కలిసి విన్నవించేందుకు పలువురు క్రీడాకారులు కలెక్టరేట్‌కు చేరుకున్నారు. జిల్లా కలెక్టర్ అందుబాటులో లేకపోవడంతో కలెక్టరేట్ ముఖద్వారం వద్ద బైఠాయించి నిరసన తెలిపారు. హెలీప్యాడ్ నిర్మాణం నిలిపివేయాలంటూ నినాదాలు చేశారు. హాకీ కోర్టులో హెలీప్యాడ్ ఏర్పాటు వద్దు.. ప్రతి రోజూ ఉదయం, సాయంత్రం వేళల్లో నగరంలోని డీఎస్ఏ మైదానంలో హాకీ సాధన చేస్తుం టాం. అయితే మంగళవారం సాయంత్రం ఆడుకునేందుకు వస్తే ఇక్కడ గుంత తవ్వుతున్నారు. అదీ కోర్టు మధ్యలో తవ్వడంతో ఆడుకునేందుకు వీలులేకుండా పోతోంది. అధికారులు ఆలోచించి నిర్మాణ పనులు నిలిపివేయాలి. – అఖిల్, హాకీ క్రీడాకారుడు, కడప శాశ్వత నిర్మాణం వద్దు.. డీఎస్ఏ మైదానంలో శాశ్వత హెలీప్యాడ్ ఏర్పాటు చేస్తే క్రీడాకారులకు ఇబ్బందులు తప్పవు. బాగున్న మైదానాన్ని ఇలా హెలీప్యాడ్ కోసం వినియోగించడం సరికాదు. ఒకవేళ తప్పనిసరి అనుకుంటే తాత్కాలిక హెలీప్యాడ్ ఏర్పాటు చేసుకుంటే బాగుంటుంది. అధికారులు ఆలోచించి నిర్మాణ పనులు ఆపివేయాలి. – కుమార్‌బాబు, క్రీడాకారుడు, కడప -
అటు పంద్రాగస్టు... ఇటు సీఎం టూర్...
విజయనగరం గంటస్తంభం: జిల్లాలో గడచిన నాలుగైదు రోజులుగా అధికారులు, సిబ్బంది తెగ హడావుడి పడుతున్నారు. ఓవైపు ముఖ్యమంత్రి ఈ నెల 14వ తేదీన వస్తుండటం, మరోవైపు ఈ నెల 15న స్వాతంత్య్రదిన వేడుకలు నిర్వహించాల్సి రావడంతో రెండింటిపనులూ చేయాల్సి రావడంతో హైరానా పడాల్సి వస్తోంది. రెండింటిలో ఏ కార్యక్రమం విఫలమైనా విమర్శలు ఎదుర్కోవాల్సి ఉంటుంద ని ఆందోళన చెందుతున్నారు. దీనివల్ల సెలవురోజుల్లోనూ విధుల్లోనే ఉన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈ నెల 14వ తేదీన జిల్లాలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఆ రోజు 10.30గంటల నుంచి సాయంత్రం 4గంటల వర కు సాలూరు నియోజకవర్గంలో జరిగే కార్యక్రమాల్లో పాల్గొంటారు. అక్కడి నుంచి విజయనగరం చేరుకుని నగరదర్శిని, తర్వాత జెడ్పీ అతిథి గృహంలో అధికారులతో సమావేశమవుతారు. రాత్రికి ఇక్కడే బస చేసి ఉదయాన్ని శ్రీకాకుళం జిల్లా వెళతారు. ఇక ఆగస్టు 15వ తేదీన సోతంత్య్రదినోత్సవం ఉంది. ఆ రోజున పోలీసు పరేడ్ మైదానంలో వేడుకలు నిర్వహించాల్సి ఉంది. జిల్లా ఇన్చార్జి మంత్రి గంటా శ్రీనివాసరావు జెండా ఆవిష్కరిస్తారు. శకటాల ప్రదర్శన, స్టాల్స్ ఏర్పాటు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిం చాల్సి ఉంది. అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలవద్ద సైతం పతాకావిష్కరణ చేయాల్సి ఉంటుంది. రెండింటికి సన్నద్ధత కావాల్సిందే రెండు కార్యక్రమాలు యంత్రాంగానికి కీలకమైనవే. స్వాతంత్య్ర వేడుకలకే పదిరోజుల ముందునుంచి సిద్ధమవడం పరిపాటి. మంత్రి ప్రసంగాని కి ప్రగతి నివేదికలు ఇవ్వడం, ఉత్తమ పనితీరు కనపరిచిన వారికి ప్రశంసా పత్రాలకోసం కసరత్తు, ప్రగతిని చూపే శకటాల ఏర్పాటు, ఆస్తులు పంపిణీకి స్టాల్స్ ఏర్పాటు తదితర వాటిని ముందే చేసుకోవాలి. ఇది ఏటా జరిగేదే. ఈసారి ముఖ్యమంత్రి పర్యటన తోడవడంతో అధికారులు సతమతం అవుతున్నారు. నాలుగు రోజులుగా సాలూరులో సీఎం పర్యటన ఏర్పాట్లు చూస్తున్నారు. గదబ బొ డ్డవలసలో గ్రామదర్శిని విజయవంతం చేసేందు కు సన్నాహాలు చేస్తున్నారు, బహిరంగ సభకు జనాలను తరలించే పనిలో నిమగ్నమయ్యారు.సెలవు రోజునా తప్పని విధులు ఈ కార్యక్రమాల పుణ్యమాని అధికారులతోపాటు సిబ్బంది కూడా రెండో శనివారం సెలవు తీసుకోలేకపోయారు. గ్రామదర్శిని జరిగే గ్రామంలో రోడ్లు బాగు చేయడం, కాలువలు శుభ్రపరచడం, రంగులు పూయడం, అంతా బాగుందని జనాలతో చెప్పించేందుకు సమావేశాలు పెట్టడం వంటివాటితో బీజీగా కొందరున్నారు. విజయనగరం పట్టణంలో రోడ్లు, కాలువలు బాగు చేయడం, లైట్లు వేయడం, గోడలకు రంగులు వేయడం, బస ఉండే జెడ్పీ అతిథిగృహంలో ఏర్పాట్లు చేయడంలో మరికొందరు ఉన్నారు. మొత్తమ్మీద ఈ రెండు కార్యక్రమాలు అధికారులు, సిబ్బందికి కత్తిమీద సాములా మారాయి. -
కియ్యో..మొర్రో !
కియా.. ప్రస్తుతం ఈ పేరు జిల్లా వాసులకు సుపరిచితం. కియా కార్ల పరిశ్రమ ఇక్కడికి రావడంతో జిల్లావాసులు ఆనందం వ్యక్తం చేస్తున్నా.. అందుకు తమ భూములు కోల్పోయిన రైతులు మాత్రం భగ్గుమంటున్నారు. ఏడాదిగా పరిహారం కోసం కాళ్లరిగేలా తిరుగుతున్నా.. ఫలితం లేదని మండిపడుతున్నారు. ఎన్ని అర్జీలు ఇచ్చినా.. ఎంత మంది అధికారులను వేడుకున్నా.. ఫలితం లేదంటున్నారు. పరిహారం రాకపోతే ఆత్మహత్యలే శరణ్యమని కన్నీటి పర్యంతమవుతున్నారు. పెనుకొండ : వడ్డే నాగరాజుకు చెందిన (సర్వేనెంబర్ 193–10లో) 2.34 ఎకరాలు భూమిని కియా కార్ల పరిశ్రమకు ప్రభుత్వం తీసుకుంది. 1.50 ఎకరాలకు పరిహారం ఇవ్వగా మరో 0.84 సెంట్ల భూమికి పరిహారం ఇవ్వాలి. ఏడాదిగా తిరుగుతున్నా పరిహారం అందడం లేదు. దీంతో నాగరాజుతో పాటు ఆయన అన్నదమ్ములంతా రెవెన్యూ కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ♦ మండలంలోని కురుబవాండ్లపల్లికి చెందిన ఈ.రామాంజనేయులుకు సర్వేనంబర్ 355లో 3.59 ఎకరాలు ఉంది. రూ.37.69 లక్షల పరిహారం అందాలి. కానీ ఇప్పటి వరకు పరిహారం పెండింగ్‌లో ఉంది. వీరే కాదు.. కియా కోసం భూమిని కోల్పోయి.. నేటికీ పరిహారం అందని రైతులు దాదాపు 40 మంది ఉన్నారు. వీరి పరిస్థితి త్రిశంకుస్వర్గంలో ఉంది. రెవెన్యూ అధికారులు రైతుల సమస్యను గాలికొదిలేయడంతో తమకు ఆత్మహత్యలే శరణ్యమంటున్నారు.. బాధిత రైతులు. కియా కార్ల పరిశ్రమకు భూములు ఇచ్చి పలువురు రైతులు ఏడాదైనా పరిహారం అందకపోవడంతో కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. న్యాయం చేయమని అధికారులు, నాయకులను వేడుకుంటున్నారు. అయినా ఇప్పటికీ న్యాయం జరక్కపోగా కాలయాపనతో రైతులు తీవ్ర ఇబ్బందుల్లోకి పడే ప్రమాదం ఏర్పడింది. సీఎం వచ్చి వెళ్లాక చూద్దామని అధికారులు అంటుండగా ఆయన వచ్చి వెళ్లాక తమ డబ్బు వస్తుందో లేదోనని రైతులు ఆందోళన చెందుతున్నారు. హక్కుదారులైనా.. రైతులకు పరిహారం మమ.. ఏళ్ల తరబడి కొందరు రైతులు భూములు సాగుచేసుకుంటున్నారు. భూమిపై పట్టాదారు పాసుపుస్తకం, 1–బీ తదితర వివరాలతో పూర్తీ హక్కులు కలిగి ఉన్నారు. అయితే భూమికి సంబంధించిన పట్టాలు రైతుల వద్ద లేవని అధికారులు పరిహారం వారి ఖాతాలకు జమ చేయడం లేదు. కనీసం చిన్న వివాదాలు కూడా పరిష్కరించకుండా పరిహారం సొమ్మును పెండింగ్‌లో ఉంచారు. అలాగే కొందరు రైతులకు వారి భూములు వంక పొరంబోకులో ఉన్నాయని నిలుపుదల చేశారు. అయితే ఆ భూములకు సంబంధించి రైతుల వద్ద పట్టాదారు పాసుపుస్తకం,1బీ, సిస్తు చెల్లించిన రశీదులు ఇతర ఆధారాలన్నీ ఉన్నాయి. అయినా బాధితులు పరిహారం కోసం ఏడాదిగా కార్యాలయం చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. సీఎం పర్యటన అడ్డుకుంటామంటున్న రైతులు తమ పరిహారం విషయమై తాడో పేడో తేల్చుకోవాలని బాధిత రైతులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈనెల 22న జరిగే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పర్యటనను అడ్డుకోవాల ని యోచిస్తున్నారు. ఇప్పటికే పలువురు రైతులు నిరసన తెలపగా లోలోపల రెవెన్యూ అధికారులు పోలీసుల ద్వారా పంచాయితీ చేసి సీఎం పర్యటన ముగిసే వరకు వివాదం జఠిలం కాకూడదన్న ఆలోచనతో ఉన్నారు. అయితే సీఎం వచ్చి వెళ్లాక తమ పరిస్థితి ఏంటోనన్న ఆందోళనలో రైతులు మునిగిపోయారు. పరిహారం కోసం కంటతడి పెనుకొండ : పరిహారం ఇవ్వకుండా అధికారులు అధికారులు తమ భూముల్లో కియా కార్లపరిశ్రమకు సంబంధించి పనులు చేయిస్తున్నారని పలువురు గిరిజనులు బుధవారం కంటి తడిపెట్టారు. పలువురు అధికారులను కలిసి తమ సమస్యను విన్నవించుకున్నా ఎవరూ పట్టించుకోకపోవడంతో పనులు చేస్తున్న జేసీబీలను అడ్డుకున్నారు. వివరాల్లోకెళితే.. అధికారులు రెండో విడత తీసుకున్న కియా కార్ల పరిశ్రమ భూముల్లో పలువురు రైతులకు ఇంకా పరిహారం ఇవ్వాల్సి ఉంది. అయితే సీఎం చంద్రబాబునాయుడు పర్యటన నేపథ్యంలో బహిరంగ సమావేశం జరిగే ప్రాంతానికి అతి సమీపంలో ఉన్న రైతులు సాలీబాయి, గోవింద్‌నాయక్, ఆంజనేయులు నాయక్ తదితరుల భూములకు పరిహారం అందలేదు. దీంతో తమకు పరిహారం ఇవ్వకువండానే తమ భూముల్లో పనులు చేస్తున్నారని, తమ పరిహారం గురించి ఎవరూ పట్టించుకోవడం లేదని మహిళా రైతుసాలీబాయి పెద్ద ఎత్తున రోధించింది. రైతులు గోవింద్‌నాయక్, ఆంజనేయులు నాయక్ తదితరులు కంట తడిపెట్టారు. ఆగ్రహంతో జేసీబీ పనులు అడ్డుకున్నారు. తమకు పరిహారం ఇవ్వకుండానే పనులు చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. వెంటనే తమ భూపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేకుంటే పొలంలోనే ఆత్మహత్యలు చేసుకుంటామని పేర్కొన్నారు. 35ఎకరాలు పెండింగ్‌లో ఉంది.. అన్నదమ్ముల వివాదాలు ఉన్న భూములకు, వంక పోరంబోకు భూములకు సంబంధించి 35 ఎకరాల మేర పరిహారం పెండింగ్‌లో ఉంది. అన్నదమ్ముల వివాదాలకు సంబంధిం చి పరిష్కరించుకుని వస్తే వెంటనే పరిహారం ఇస్తాం. వంక భూములకు సంబంధించి ప్రభుత్వానికి నివేదిక పంపాం. వచ్చిన వెంటనే అందజేస్తాం. ఏ రైతుకు అన్యాయం చేయం. – రామమూర్తి, ఆర్డీఓ -
సీఎం వస్తే.. జేబులకు చిల్లే!
నర్సీపట్నం: ముఖ్యమంత్రి పర్యటనకు వస్తే ఎంతో కొంత అదనపు ప్రయోజనం ఒనగూరుతుందని ఇటు ప్రజలు, పాలకులు ఆశగా ఎదురుచూస్తుంటారు. అదే సీఎం తమ జిల్లాకు వస్తున్నారంటే జిల్లా స్థాయి నుంచి కిందిస్థాయి అధికారుల్లో ఒకటే అలజడి చోటుచేసుకుంటోంది. ఒక పక్క తక్కువ సమయంలో సకాలంలో హడావుడిగా పూర్తిచేయాల్సిన పనులు..మరో పక్క చేపట్టే పనులకు సంబంధించి నిధుల భారం తమపై ఎంత పడుతుందోనని ఆందోళన. ముఖ్యమంత్రి మాత్రం హాయిగా నాలుగు మాటలు చెప్పి టాటా అంటూ చేతులు ఊపి ప్రత్యేక హెలికాప్టర్ ఎక్కి వెళ్లిపోతారు. పర్యటనకు అయిన నిధుల భారం ఏళ్ల తరబడి అధికారులను వేధిస్తూనే ఉంటోంది. రోడ్లు, భవనాలశాఖలో ఈ సమస్య ఎక్కువగా ఉంటోంది. నిధులు కేటాయించని ప్రభుత్వం.. వీటికి ప్రభుత్వం నుంచి ఏమైనా ప్రత్యేక నిధులు మంజూరు చేశారంటే అదీ లేదు. కాంట్రాక్టర్ల చేత పనులు చేయిద్దామంటే ఈ నిధులు ఎప్పటికి మంజూరవుతాయో తెలియని పరిస్థితి. ఇక చేసేదేమీ లేక యుద్ధప్రాతిపదికన పనులు చేయాల్సి రావడంతో జిల్లా స్థాయి నుంచి కిందిస్థాయి అధికారులంతా కలిసి తమ జేబుల నుంచి ఈ మొత్తాన్ని పెట్టుబడిగా పెట్టి కార్యక్రమాన్ని పూర్తిచేశారు. ఇదేకాకుండా గతంలో సీఎం చంద్రబాబునాయుడు ఎస్.రాయవరం పర్యటనకు వచ్చినపుడు ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ తదితర వ్యయానికి సంబంధించిన బిల్లులు ఇంకా మంజూరు కాలేదు.మంత్రి అయ్యన్నపాత్రుడు నిర్వహించేది రోడ్లు, భవనాలశాఖ అయినా ఈ ఖర్చు చేసిన బిల్లుల మంజూరులో ఎందుకు వివక్ష చూపిస్తున్నారో అర్థం కాని పరిస్థితి. ఈ విషయమై డీఈ వేణుగోపాల్‌ను వివరణ కోరగా ఈ అంశంపై మాట్లాడేందుకు నిరాకరించారు. మంజూరు కాని హెలిప్యాడ్ బిల్లులు జన్మభూమి–మా ఊరు కార్యక్రమంలో భాగంగా సీఎం చంద్రబాబునాయుడు ఈ నెల 5న నర్సీపట్నం నియోజకవర్గంలోని ధర్మసాగరం గ్రామాన్ని సందర్శించారు. కేవలం రెండు రోజుల ముందే కార్యక్రమం ఖరారు కావడంతో అధికారుల్లో ఒకటే హడావుడి. ప్రధానంగా జన్మభూమి కార్యక్రమమైనా ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటుతో అన్ని శాఖల అధికారులకు పని భారం పడింది. హెలికాప్టర్‌పై కార్యక్రమానికి రానుండటంతో హెలిప్యాడ్‌తో పాటు సభా వేదిక వద్దకు రహదారిని ప్రత్యేకంగా తీర్చిదిద్దడం అర్అండ్బీ అధికారులకు తలకు మించిన భారమైంది. ఒక పక్క హెలిప్యాడ్ నిర్మాణం..మరో పక్క రహదారి మరమ్మతు పనులు..ఇవన్నీ కేవలం 48 గంటల్లో పూర్తి కావాల్సి ఉన్నందున ఎక్కువ మంది కూలీలను ఏర్పాటు చేయాల్సి వచ్చింది. రాత్రి పగలు పనులు చేయాల్సి రావడంతో అదనంగా చెల్లించాల్సి వచ్చింది. ఈ విధంగా సీఎం పర్యటనకు ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ ఒక్కదానికే సుమారు రూ.3 లక్షల వరకు ఖర్చు చేయాల్సి వచ్చింది. -
సీఎం పర్యటనలో టీవీ కెమెరామెన్‌కు గుండె పోటు
బొబ్బిలి: సీఎం పర్యటనలో భాగంగా పట్టణంలో హెలీపాడ్ నుంచి వస్తున్న విలేకర్ల బృందంలోని ఓ టీవీ కెమెరామెన్ సూర్యప్రకాష్‌కు శుక్రవారం ఆకస్మాత్తుగా గుండెపోటు వచ్చింది. దీంతో విలేకర్లు కాన్వాయ్‌లో ఉన్న అంబులెన్స్‌ను ఇవ్వమని కోరగా సీఎం కాన్వాయ్‌లో ఉన్న అంబులెన్స్ ఇవ్వకూడదని, బాడంగి లేదా బొబ్బిలి ఆసుపత్రులకు ఫోను చేస్తే అంబులెన్స్ వస్తుందని అధికారులు ఉచిత సలహా ఇచ్చారు. దీంతో అక్కడ పరిస్థితి చేయిదాటిపోయే పరిస్థితి ఉత్పన్నమయింది. అయితే అక్కడి నుంచి డీసీహెచ్ఎస్ ఉషశ్రీ చర్యలు తీసుకోవడంతో ప్రైవేటు అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించగలిగారు. బొబ్బిలి ఆసుపత్రిలో కూడా కనీస సౌకర్యాలు లేకపోవడంతో ఇబ్బందులు పడ్డారు. బొబ్బిలి ఆసుపత్రిలో ఫిజిషియన్ లేకపోవడంతో పాటు జనరేటర్ సదుపాయం కూడా లేదు. దీంతో కెమెరామెన్‌ను కాపాడుకునేందుకు పలు అవస్థలు పడాల్సి వచ్చింది. అక్కడి నుంచి విజయనగరంలోని తిరుమల ఆసుపత్రిలో చేర్పించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగానే ఉందని సహచర మీడియా ప్రతినిధులు తెలిపారు. సీఎం కాన్వాయ్‌లో రెండు, సభ దగ్గర కొన్ని అంబులెన్స్‌లు ఉన్నా గుండెపోటు వచ్చిన వారికి మాత్రం అంబులెన్స్‌లు ఇవ్వని తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి. -
సీఎం వస్తే.. జేబుకు చిల్లే!
ఆందోళన చెందుతున్న అధికారులు అనంతపురం అర్బన్: ముఖ్యమంత్రి జిల్లాకు వస్తున్నారంటే... అధికారులు హడలిపోతున్నారు. ఏర్పాట్లపేరుతో ఇప్పటికే భారీగా ముట్టజెప్పుకున్న అధికారులు...ఇపుడు మళ్లీ సీఎం వస్తున్నారనగానే జేబులు తడుముకుంటున్నారు. సీఎం పర్యటనల కోసం ఇప్పటికే లక్షలాది రూపాయలు అప్పులు చేసిన అధికారులు...ఆ బిల్లులు రాక.. అరువు తెచ్చిన చోట మాటపోతోందని ఆవేదన చెందుతున్నారు. రూ.లక్ష లేక రూ.2 లక్షలో కాదు ఏకంగా రూ.కోటిన్నరకు పెగా బిల్లులు బకాయి ఉండడంతో వాటిని ఎలా తీర్చాలో అర్థం కాక... పరిస్థితి కలెక్టర్‌కి చెప్పుకునే ధైర్యం చాలక మనోవేదనకు గురవుతున్నారు. ఇక ఆర్టీసీ సంస్థకు ఏకంగా రూ.7.56 కోట్లు బకాయి ఉన్నట్లు తెలిసింది. మోయలేని భారం ఈ ఏడాది ఇప్పటి వరకు ముఖ్యమంత్రి నాలుగు సార్లు జిల్లా పర్యటనకు వచ్చారు. ఐదవసారిగా ఈనెల 8న జిల్లాకు వస్తున్నారు. ముఖ్యమంత్రి సభలకు తరలించే ప్రజలకు భోజన వసతి గతంలో ఉండేది కాదు. కానీ రాయదుర్గం నియోజకవర్గంలో జరిగిన ‘ఏరువాక’ కార్యక్రమానికి దాదాపు 200 బస్సుల్లో ప్రజలను తరలించారు. వీరందరికీ అధికారులు భోజన వసతి కల్పించారు. పర్యటనకు వచ్చిన ప్రతిసారి ముఖ్యమంత్రి రెండు, మూడు కార్యక్రమాలతో పాటు, బహిరంగసభలోనూ పాల్గొంటారు. ఇందుకు వేదిక, పూల అలంకరణ, మైక్ సిస్టం, బారికేడ్లు ఏర్పాటు, కుర్చీలు, షామియానాలు, ఇలా పలు రకాల ఏర్పాట్ల బాధ్యత అధికారులదే. వీటనింటికి తమ పరపతి మీద అరువు పెట్టి పూర్తి చేస్తునామనీ, సీఎం పర్యటన తర్వాతైనా బిల్లులు మంజూరు చేస్తున్నారా... అంటే అదీ లేదని అధికారవర్గాలు వాపోతున్నాయి. చివరికి రూ.50 వేలు బిల్లు కూడా మంజూరు కావడం లేదని కొందరు అధికారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అందుకే సీఎం పర్యటన అంటే భయపడాల్సి వస్తోందంటున్నారు. -
ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్, ఎస్పీ
ఉరవకొండ: ఉరవకొండలో ఈనెల 8న సీఎం పర్యటన నేపథ్యంలో చేస్తున్న ఏర్పాట్లను మంగళవారం కలెక్టర్ వీరపాండియన్, ఎస్పీ అశోక్‌కుమార్, జేసీ–2 ఖాజమోహిద్దీన్లు పరిశీలించారు. పైలాన్ స్థూప నిర్మాణ పనులు, ఇంద్రావతి డీప్‌కట్ జలహరతి పనులు, హెలీప్యాడ్ నిర్మాణం, బహిరంగ సభ పనులను కలెక్టర్ పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ, వర్షం కారణంగా పనులకు కాస్త ఆటంకం కలిగినా ఏర్పాట్లు సకాలంలో పూర్తి చేస్తామన్నారు. అన్నీ శాఖల సమన్వయంతో పనులు త్వరగా పూర్తయ్యేలా చూస్తామన్నారు. -
సీఎం పర్యటించే ప్రాంతాల పరిశీలన
ఉరవకొండ: ఈనెల 8న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఉరవకొండ పర్యటనకు వస్తుండటంతో ప్రత్యేక పోలీసు బలగాలతో గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తామని జిల్లా ఎస్పీ అశోక్‌కుమార్ తెలిపారు. శుక్రవారం ముఖ్యమంత్రి పర్యటించే ప్రాంతాలను ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్, ఉరవకొండ సీఐ చిన్నగౌస్తో కలిసి ఎస్పీ పరిశీలించారు. ఈ సందర్భంగా ఇంద్రావతి డీప్‌కట్ వద్ద మొదట సీఎం చేపట్టే జలహరతి కార్యక్రమం, అనంతరం పైలాన్ ప్రారంభోత్సవం, హంద్రీనీవా వెడల్పు పనుల ప్రారంభోత్సవ కార్యక్రమాలకు స్థలాలను పరిశీలించారు. అనంతరం ఉరవకొండ ఎస్కే ప్రభుత్వ ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో జరిగే బహిరంగ సభ ఏర్పాట్లను కూడా వారు పరిశీలించారు. సీఎం పర్యటన సందర్భంగా ట్రాఫిక్‌కు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నామనీ, వాహనాల పార్కింగ్‌కు స్థలాన్ని కేటాయిస్తామని ఎస్పీ తెలిపారు. -
ఫలితం పొంది విమర్శించడం న్యాయమా?
పట్టిసీమను నిర్మించడంతోనే రాయలసీమకు సాగునీరు – పండ్ల కొనుగోలులో ‘సూట్’ తీసేసే వారిపై పీడీ కేసులు.. రాష్ట్ర బహిష్కరణ – 2, 3 నెలల్లో మడకశిర బ్రాంచ్ కెనాల్‌కు హంద్రీనీవా నీరు – ఈ ఏడాది 6.50లక్షల మంది కౌలు రైతులకు పంటరుణాలు - అనంతపురం జిల్లా రాప్తాడు పర్యటనలో సీఎం చంద్రబాబు సాక్షిప్రతినిధి, అనంతపురం : ‘ఒక్కొక్కసారి బాధ కలుగుతుంది. రుణమాఫీలో రూ.1.50లక్షలు తీసుకున్నారు. ఇప్పుడు ఇన్పుట్ సబ్సిడీ, ఇన్సూరెన్స్ తీసుకుని నన్ను విమర్శిస్తున్నారంటే చాలా బాధ కలుగుతుంది. ఇది న్యాయమా? అని అడుగుతున్నా. ఇలా విమర్శించే వారిని వ్యతిరేకిస్తున్నామని అంతా సంఘీభావం తెలియజేయాలి.’’ ఏ ప్రభుత్వమైనా పనిచేసినప్పుడు ప్రజలు కృతజ్ఞతగా ఉండాలి.’’ అని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. ఇన్పుట్ సబ్సిడీ పంపిణీ నేపథ్యంలో రైతు కృతజ్ఞతయాత్ర పేరుతో చంద్రబాబు అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గంలో పర్యటించారు. మొదట కనగానపల్లి మండలం ముక్తాపురంలో ఎన్టీఆర్ గృహకల్ప పేరుతో నిర్మించిన 32 ఇళ్లను ప్రారంభించారు. తర్వాత లబ్ధిదారులతో ముఖాముఖి నిర్వహించారు. ఆపై బహిరంగసభలో ప్రసంగించారు. సీఎం ప్రసంగం ఆయన మాటల్లోనే.. ‘పాదయాత్రను హిందూపురం నుంచే ప్రారంభించా. రైతుల కష్టాలు చూసి రుణమాఫీ చేయాలని నిర్ణయించా. దానికి కట్టుబడి మాఫీ చేశా. రాష్ట్రంలో రూ.24,500కోట్లను మాఫీ చేశా. అందులో రూ.2,728కోట్లు అనంతపురానికి వచ్చింది. నేను ఒక ఉద్యానవన తోటగా రాయలసీమను చేస్తా. దేశమే కాదు.. ప్రపంచం మొత్తం అనంతపురం పండ్లు, కూరగాయలు తినేరోజు వస్తుంది. రాయదుర్గంలో ఇప్పటికే ఎడారి ఛాయలు కన్పిస్తున్నాయి. అందుకే హంద్రీనీవా పూర్తి చేసే బాధ్యత తీసుకున్నా. మరో 2, 3 నెలల్లో హిందూపురం నుంచి మడకశిరకు నీళ్లు తీసుకెళతాం. రేయిన్గన్లతో పంటలను కాపాడేందుకు యత్నించా! రాష్ట్రానికి ఇన్పుట్, ఇన్సూరెన్స్ కలిపి రూ.2,214కోట్లు ఇస్తే రూ.1451కోట్లు అనంతపురానికి ఇచ్చాను. ఈ ఏడాది హంద్రీనీవా ద్వారా జిల్లాలోని చెరువులను నింపుతాం. మల్యాల, ముచ్చుమర్రి నుంచి నీటిని ఎత్తిపోస్తాం. ఈ ఏడాది రాష్ట్రంలో 6.50లక్షల మంది కౌలు రైతులకు రుణాలు ఇవ్వాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నాం. పండ్ల ఉత్పత్తులు రైతులు విక్రయించే సమయంలో వ్యాపారులు సూట్ వసూలు చేస్తున్నారు. ఇకపై ఎవరైనా సూట్ వసూలు చేస్తే వారిపై పీడీ యాక్టు నమోదు చేస్తాం. రాష్ట్ర బహిష్కరణ చేస్తా. అలాగే ఇన్పుట్ సబ్సిడీని అనర్హులు తీసుకునేందుకు వీళ్లేదు. అర్హులైన వారే తీసుకోవాలి. తాడిపత్రి ఉదంతంలో అనాథగా మారిన ప్రసన్నకు సీఎం అండ: తాడిపత్రిలో మంగళవారం తెల్లవారుజామున రామసుబ్బారెడ్డి అనే వ్యక్తి తన భార్య సులోచనమ్మ, ఇద్దరు పిల్లలు ప్రత్యూష, సాయి ప్రతిభను సుత్తితో కొట్టి చంపిన విషయం విదితమే. ఈ ఘటన తర్వాత బుధవారం రామసుబ్బారెడ్డి పురుగుమందు సేవించి ఆత్మహత్య చేసుకున్నారు. తల్లిదండ్రులతో పాటు ఇద్దరు పిల్లలు చనిపోయారు. అయితే పెద్దకుమారై ప్రసన్న తిరుపతిలో ఉండటంతో బతికిపోయింది. ఈ క్రమంలో ప్రసన్నను మహిళా కమిషన్ చైర్మన్ నన్నపనేని రాజకుమారి ముఖ్యమంత్రి సభకు తీసుకొచ్చారు. ఈ ఉదంతాన్ని సీఎం వివరించారు. ఆపై ప్రసన్న మాట్లాడుతూ ‘మా నాన్న మా అమ్మను, చెల్లెళ్లను దారుణంగా చంపేశారు. మా నాన్న అని చెప్పుకునేందుకే సిగ్గుగా ఉంది. కుటుంబంలో అందరూ చనిపోయి అనాథగా మారడంతో నేను కూడా ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా. ఐఐఎంలో మేనేజ్మెంట్ కోర్సు చేయాలని మా అమ్మ చెప్పేది. ఇప్పుడు ఆ లక్ష్యం కోసమే నేను బతుకుతా. అది సాధిస్తా.’ అన్నారు. ప్రసన్న పేరుతో ముఖ్యమంత్రి చంద్రబాబు రూ.20లక్షలు ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తున్నట్లు ప్రకటించారు. ప్రసన్న బాగోగులను తానే చూసుకుంటానని హామీ ఇచ్చారు. ప్రసన్నను చదివించే బాధ్యతను తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి తీసుకున్నారు. కార్యక్రమంలో మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, పరిటాల సునీత, కాలవ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. -
అన్నదాత గొంతు నొక్కి.....
∙ సీఎం సభావేదిక వద్ద రైతులను తరిమేసిన పోలీసులు ∙ ఉదయం నుంచి సాయంత్రం వరకూ నిరీక్షించి భంగపాటు ∙ ఆందోళన జరగకుండా ముందస్తు అరెస్టులు ∙ అడుగడుగునా పోలీస్ నిఘాలో సీఎం పర్యటన శ్రీకాళహస్తి: అన్నదాత గొంతు నొక్కారు. తమ గోడు కనీసం సీఎంకైనా చెప్పుకుందామని వారు చేసిన ప్రయత్నాన్ని ఉక్కుపాదంతో అణచివేశారు. శ్రీకాళహస్తి నియోజకవర్గంలో పరిశ్రమల ఏర్పాటంటూ రైతుల నుంచి బలవంతంగా అధికారులు భూములను సేకరించారు. ఈవిషయంలో వారి బాధలను ఏమాత్రం పరిగణనలోకి తీసుకోలేదు. ఈనేపథ్యంలో సీఎం చంద్రబాబు గురువారం తొట్టంబేడు మండలం తాటిపర్తికి పరిశ్రమల భూమిపూజకు వచ్చారు. ఈ విషయాన్ని ముందుగా తెలుసుకున్న రైతులు ఆయనకు తమ కష్టాలను వివరించాలని ఆరా టపడ్డారు. ఉదయం 10గంటలకే వారంతా సభాస్థలికి చేరుకున్నారు. సాయంత్రం వరకు నాలుగు గ్రామాలకు చెందిన వందలాదిమంది రైతులు మండుతున్న ఎండలో నిరీక్షించారు. తాగడానికి నీళ్లు,ఆహారం లేకపోయినా కూర్చున్నారు. తీ రా సీఎం కాసేపట్లో వస్తున్నారని తెలు సుకుని పోలీసులు వారిని దారుణంగా అడ్డుకున్నారు. సమీప ప్రాంతాల్లో లేకుండా లేకుండా వెళ్లగొట్టారు. లేదంటే కేసులు తప్పవని హెచ్చరించారు. చేసేది లేక కొందరు భయంతో వెళ్లిపోయారు. మ రి కొందరిని బలవంతంగా బస్సుల్లో ఎక్కించి గ్రామాలకు తరలించారు. 1996లో 20మంది రైతులకు 40ఎకరాల భూమిని, 2008–09లో వైఎస్ రాజశేఖరరెడ్డి సీఎంగా ఉన్న రోజుల్లో 180 ఎకరాలను ఇందిరమ్మ పేరుతో ఎస్సీ, ఎస్టీలతోపాటు కొందరు బీసీలకు పంపిణీ చేశారు. వీరి భూములను అధికారులు లాక్కోవడంతో పరిహారం కోసం రైతులు సీఎం సభ వద్ద నిరసన తెలియజేశారు. కొందరు కన్నీరు పెట్టారు. ఇంకొందరు ఆగ్రహంతో రగిలిపోయారు. వచ్చే ఎన్నికల్లో పేదోళ్లే సరైన బుద్ధి చెబుతారం టూ హెచ్చరించారు. స్థానికంగా ఉన్న పదిమంది రైతులకు సీఎంతో మాట్లాడే అవకాశం కల్పిస్తామని అ«ధికారులు చెప్పారు. తీరా సీఎం వచ్చాక అధికారులు వారిని పట్టించుకోలేదు. దీంతో వారు అసంతృప్తి వ్యక్తం చేశారు. సీఎం పర్యటన నేపథ్యంలో పోలీసులు ముం దస్తు అరెస్టులు చేశారు. రైతులపక్షాన నిలుస్తున్న తొట్టంబేడు మండల వైఎస్ఆర్సీపీ మండల కన్వీనర్ వాసుదేవనాయుడుతోపాటు సీపీఐ నేత గురవయ్య, సీపీఎం నేత అంగేరి పుల్లయ్యను అరెస్టు చేశారు. -
జోల పాటే !
ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రసంగం మంత్రులతో పాటు మిగతా నేతలకూ జోలపాటలా మారింది. వ్యవసాయంపై ఓ వైపు ఆయన లెక్చర్ దంచికొడుతుంటే వారంతా నిద్రమత్తులో జోగారు. మంత్రులు దేవినేని, కాలవతో పాటు ఎమ్మెల్సీలు పయ్యావుల, శమంతకమణి, ఎంపీ జేసీ , ఎమ్మెల్యే ఉన్నం తదితరులు హాయిగా కూర్చీలోనే కునుకు తీశారు. శుక్రవారం రాయదుర్గం మండలం ఉడేగోలంలో నిర్వహించిన ఏరువాక సభలో ఈ దృశ్యాలను ‘సాక్షి’ క్లిక్‌మనిపించింది. - సాక్షి ఫొటోగ్రాఫర్, అనంతపురం -
చంద్రబాబుకు ఝలక్
సీఎం పర్యటన, పోతవరంలో, శనివారం cm tour, in pothavaram, saturday అందరూ సంతోషంగా ఉన్నారా’ నల్లజర్ల మండలం పోతవరం గ్రామస్తులను ఉద్దేశించి సీఎం చంద్రబాబు అడిగిన ప్రశ్న ఇది. ‘లేదు.. లేదు.. ఎవరికీ సంతోషం లేదు’ గ్రామస్తులిచ్చిన సమాధానం అదిరిపడిన సీఎం ‘ఎంతమంది సంతృప్తికరంగా లేరో చేతులెత్తుండి’ అనగానే.. సభా ప్రాంగణంలో ఉన్న వారిలో 70 శాతం మంది చేతులెత్తారు. సర్దుకున్న చంద్రబాబు కారణం ఏమిటో చెప్పండని అడగ్గా.. ‘ఎక్కడికక్కడ అవినీతి పెరిగిపోయింది. పాలన లంచాలమయంగా మారింది’ అంటూ ఘాటుగానే జవాబిచ్చారు. నల్లజర్ల మండలం పోతవరంలో ఈ ఘటన చోటుచేసుకుంది. సాక్షి ప్రతినిధి, ఏలూరు : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు నల్లజర్ల మండలం పోతవరం గ్రామస్తులు ఝలక్ ఇచ్చారు. ఆ గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసిన చంద్రబాబు అక్కడి పాఠశాలలో డిజిటల్ అక్షరాస్యత భవనాన్ని ప్రారంభించారు. అనంతరం పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ.. బహిరంగ మలవిసర్జన లేని జిల్లాగా పశ్చిమ గోదావరిని ప్రకటిస్తున్నానని ఘనంగా చెప్పారు. ‘ఈ గ్రామానికి అన్నీ చేశాం. అందరూ సంతోషంగా ఉన్నారా’ అని వేదికపై నుంచి ప్రజలను సీఎం ప్రశ్నించారు. దీనికి జనం నుంచి ‘లేదు.. లేదు’ అనే సమాధానం రావడంతో ముఖ్యమంత్రి కంగుతిన్నారు. ఎంతమంది అసంతృప్తితో ఉన్నారని ప్రశ్నించగా.. సభలోని 70 శాతం మంది చేతులు పైకెత్తారు. వారిలో కొందరిని మీ సమస్యలేమిటని చంద్రబాబు ఆరా తీశారు. లంచం ఇస్తేనే పని చేస్తారట గ్రామానికి చెందిన అబ్బూరి లక్ష్మి మాట్లాడుతూ తన మామగారు చనిపోయారని, తమకున్న పొలానికి పట్టాదార్ పాస్‌బుక్ మంజూరు చేసి.. 70 సెంట్ల పొలాన్ని తన భర్త పేరుపై మార్చేందుకు చర్యలు తీసుకోవాలని రెవెన్యూ అధికారులను అడుగుతుంటే... రూ.30 వేలు లంచమిస్తేనే పని చేస్తామని చెబుతున్నారని వాపోయింది. ఎవరు అడిగారని ముఖ్యమంత్రి ప్రశ్నించగా.. వీఆర్ఓ ఫణిబాబు అని సమాధానం చెప్పింది. దీంతో ముఖ్యమంత్రి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ సంబంధిత రెవెన్యూ అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గ్రామ రెవెన్యూ అధికారిపై విచారణ జరిపి 24 గంటల్లో చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కాటంనేని భాస్కర్‌ను ఆదేశించారు. మూడేళ్లుగా పెన్షన్ రావడం లేదు మరో వృద్ధురాలు శ్యామలను సంతృప్తిగా ఉన్నావా అని ముఖ్యమంత్రి ప్రశ్నించగా.. తనకు మూడేళ్లుగా పెన్షన్ రావడం లేదని, సంతృప్తి ఎలా ఉంటుందని బదులిచ్చింది. రేషన్ కార్డు ఉందా అన్ని అడగ్గా.. ‘కార్డు లేదు. రేషన్ లేదు. పింఛన్ కూడా రావడం లేదు’ అని బదులిచ్చింది. కంగుతిన్న ముఖ్యమంత్రి నీ కుటుం బంలో ఎవరికైనా పింఛను వస్తుందేమో.. అందుకే తొలగించి ఉంటారన్నారు. తన కుటుంబంలో ఎవరికీ పెన్షన్ లేదని, తనకూ రావడం లేదని వాపోయింది. అధికారులు నీ సమస్యను పరిష్కరిస్తారని చెప్పిన ముఖ్యమంత్రి వేరే వ్యకితో మాట్లాడారు. ఇల్లు మంజూరు కాలేదు గ్రామానికి చెందిన మరో వ్యక్తిని ‘నీవు సంతృప్తిగా ఉన్నావా’ అని సీఎం అడగ్గా.. ఎన్టీఆర్ గృహ నిర్మాణ పథకంలో ఇంటి కోసం మూడేళ్ల క్రితం దరఖాస్తు చేసుకున్నా మంజూరు కాలేదని చెప్పాడు. సీఎం బదులిస్తూ.. ‘ఇప్పుడే శంకుస్థాపన చేశాను. త్వరలో నీకు ఇల్లు వస్తుందిలే. అప్పుడు సంతృప్తిగా ఉందువు’ అని ముఖ్యమంత్రి సర్ధి చెప్పారు. అవినీతి ఎక్కడ జరిగినా వెంటాడతానని సీఎం హెచ్చరించారు. అవినీతిపరులపై దాడులు చేయిస్తామని.. పట్టుబడిన సొమ్మును స్వాధీనం చేసుకుని పేదల సంక్షేమానికి ఖర్చు పెడతామని అన్నారు. దాడుల్లో పట్టుబడిన అధికారులు రెండు నెలల అనంతరం తమ ఉద్యోగం తిరిగొస్తుందనే భావనలో ఉన్నారని.. ఇకనుంచి అలాంటి పరిస్థితి ఉండదన్నారు. ఇదిలావుండగా నల్లజర్లలో జెడ్పీ ఛైర్మన్ ముళ్లపూడి బాపిరాజు ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన సభకు జనం రాలేదు. ఉపాధి కూలీలు, డ్వాక్రా మహిళలు, అంగన్ వాడీ కార్యకర్తలను తీసుకొచ్చినా.. సభావేదిక ముందు కుర్చీలు ఖాళీగా కనిపించాయి. రైతులు భూములివ్వాల్సిందే ఏలూరు (మెట్రో) : రైతులు ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వానికి భూములు ఇవ్వాల్సిందేనని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. నల్లజర్లలో బహిరంగ సభలో మాట్లాడుతూ రోడ్లు అభివృద్ధి చేయాలంటే భూమి అవసరమన్నారు. అందువల్ల రైతులు ఉదా రంగా భూములు ఇవ్వాలని కోరారు. చేపల, రొయ్యల పరిశ్రమలు ఏర్పాటు చేయాల్సిన అవస రం ఉందని, అటువంటి పరిశ్రమలకు అడ్డుపడకూడదని పరోక్షంగా ఆక్వాపార్క్ అంశాన్ని ప్రస్తావించారు. నిరుద్యోగ భృతి ఇచ్చేందుకు విధివిధానాలు రూపొందిస్తున్నామన్నారు. అంతకుముందు పోతవరం విచ్చేసిన చంద్రబాబుకు స్వాగతం లభించింది. మంత్రులు దేవినేని ఉమ, పైడికొం డల మాణిక్యాలరావు, పితాని సత్యనారాయణ, కేఎస్ జవహర్, జెడ్పీ చైర్మన్ ఎం.బాపిరాజు, ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్, ఎంపీలు తోట సీతారామలక్ష్మి, మురళీమోహన్, ఎమ్మెల్యేలు చింతమనేని ప్రభాకర్, ముప్పిడి వెంకటేశ్వరరావు, గన్ని వీరాంజనేయులు, ఆరిమిల్లి రాధాకృష్ణ, పులవర్తి రామాం జనేయులు, ఎం.శ్రీనివాసరావు, కలెక్టర్ కె.భాస్కర్, డీసీసీబీ చైర్మన్ ముత్యాల వెంకటేశ్వరరావు, పోతవరం సర్పంచ్ పసుమర్తి సతీష్ పాల్గొన్నారు. -
గ్రామాభివృద్ధిలో భాగస్వాములు కండి
అనంతపురం అర్బన్ : గ్రామాభివృద్ధిలో అందరూ భాగస్వాములై రాయలసీమను రతనాలసీమగా మార్చుకుందామని పంచాయతీరాజ్ శాఖ మంత్రి నారా లోకేశ్, భారీ నీటి పారుదల శాఖ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు పేర్కొన్నారు. గురువారం స్థానిక కేటీఆర్ ఫంక్షన్ హాల్లో నీటి వినియోగ సంఘాల అధ్యక్షులు, ఇంజినీరింగ్ విద్యార్థులతో ‘నీరు ప్రగతి– ఉద్యమం– 90 రోజుల ప్రణాళిక’ అంశంపై సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి అధ్యక్షత జరిగిన సమావేశంలో మంత్రులు నారా లోకేశ్, దేవినేని ఉమా మహేశ్వరరావు మాట్లాడారు. జిల్లాను పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తామని, తద్వారా యువతకు విరివిగా అవకాశాలు వస్తాయన్నారు. రానున్న రెండేళ్లలో లక్ష ఐటీ ఉద్యోగాలు, ఐదు లక్షల పారిశ్రామిక ఉద్యోగాలు ఇవ్వాలనే లక్ష్యంతో పని చేస్తున్నామన్నారు. అన్ని గ్రామాల్లోనూ సీసీ రోడ్లు నిర్మిస్తామన్నారు. ఐదు వేలు జనాభా కలిగిన ప్రాంతాల్లో భూగర్భ డ్రైనేజీ నిర్మిస్తామన్నారు. 2018 నాటికి హంద్రీ–నీవా, గాలేరి–నగరి ప్రాజెక్టులు పూర్తి చేసి రైతులకు నీటిని ఇవ్వాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి ఉన్నారన్నారు. -
ఇన్‌పుట్‌పై అదేమాట
– ఇన్సూరెన్స్ లేదా ఇన్పుట్ సబ్సిడీ ద్వారా ఎకరాకు రూ.6 వేలు ఇస్తామని సీఎం పునరుద్ఘాటన – ఇన్పుట్ సబ్సిడీ చెల్లింపు ద్వారా ఏపీ ఖజానాపై భారం రూ.45 కోట్లు మాత్రమే – తక్కిన మొత్తం బజాజ్ కంపెనీ, కేంద్రం వాటానే – ‘అనంత’ పర్యటనలో చంద్రబాబు ప్రకటనతో సుస్పష్టమైన పరిహారం లెక్కలు – కరువు జిల్లాపై కనికరం చూపని సీఎం (సాక్షిప్రతినిధి, అనంతపురం) ఇన్పుట్ సబ్సిడీ, ఇన్సూరెన్స్ గురించి ‘అనంత’ రైతులకు ఉన్న అవగాహన రాష్ట్రంలోని మరే జిల్లా రైతులకూ ఉండదు. ఎందుకంటే జిల్లాలో ఏటా పంటనష్టం జరుగుతోన్నా కాస్తోకూస్తో ఉపశమనం లభిస్తోంది వీటివల్లే! అయితే.. ఎప్పుడూ లేని విధంగా చంద్రబాబు ప్రభుత్వం ‘అనంత’ రైతులను నిలువునా మోసం చేస్తోంది. కరువు దెబ్బకు విలవిలలాడిపోతున్న అన్నదాతలపై ఏమాత్రమూ కనికరం చూపడం లేదు. ఇన్సూరెన్స్ అనేది ఓ కంపెనీకి సంబంధించిన వ్యవహారం. మనం స్కూటర్కొని ఇన్సూరెన్స్ చేస్తాం. ప్రమాదం జరిగితే సదరు కంపెనీ మనకు పరిహారం చెల్లిస్తుంది. ఇందులో ప్రభుత్వ పాత్ర ఏమీ ఉండదు. వాతావరణ బీమాలోనూ ఇదే వర్తిస్తుంది. రైతులు బజాజ్ అలయంజ్ కంపెనీకి ప్రీమియం చెల్లించారు. పంట నష్టపోతే ఆ కంపెనీ పరిహారం ఇస్తుంది. అయితే.. బీమా పరిహారాన్ని కూడా తామే ఇస్తున్నట్లు చంద్రబాబు ‘అనంత’ రైతులను మోసం చేస్తున్నారు. 2016 ఖరీఫ్‌లో జిల్లా వ్యాప్తంగా రూ.1,070 కోట్ల మేర పంట నష్టం జరిగిందని, ఎకరాకు రూ.6వేల చొప్పున పరిహారం చెల్లించాలని జిల్లా యంత్రాంగం ప్రభుత్వానికి నివేదిక పంపింది. ఇందులో కేంద్రం తన వాటాగా రూ. 535 కోట్లు విడుదల చేయనుంది. తక్కిన రూ.535 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం వాటాగా విడుదల చేయాలి. ఇదిలావుండగా, బజాజ్ కంపెనీ జిల్లాకు రూ.367 కోట్ల ఇన్సూరెన్స్ ఇస్తున్నట్లు ఇంతకుముందు ప్రకటించింది.అయితే.. తాజాగా అన్ని పంటలకూ కలిపి రూ.450 కోట్ల ఇన్సూరెన్స్ ఇచ్చేందుకు ఆ కంపెనీ సిద్ధమైనట్లు తెలిసింది. కేంద్రం ఇన్పుట్ సబ్సిడీ రూపంలో ఇచ్చే రూ.535 కోట్లు, ఇన్సూరెన్స్ కంపెనీ ఇచ్చే రూ.450 కోట్లు కలిపితే రూ.985 కోట్లు అవుతుంది. సీఎం చంద్రబాబు మాత్రం పామిడిలో గురువారం జరిగిన బహిరంగ సభలో తాము జిల్లా రైతులకు పరిహారం రూపంలో రూ.1,030 కోట్లు ఇస్తామని ప్రకటించారు. కేంద్రం, బజాజ్ కంపెనీ ఇచ్చే రూ.985 కోట్లకు రాష్ట్ర ప్రభుత్వం కేవలం రూ.45కోట్లు కలిపి.. మొత్తం రూ.1,030 కోట్లు రైతులకు ఇవ్వనున్నారు. అయితే..అంతా రాష్ట్ర ప్రభుత్వమే ఇస్తోందన్నట్లు చంద్రబాబు ప్రకటించుకున్నారు. ‘అనంత’ చరిత్రలో ఇప్పటి వరకూ ఇన్సూరెన్స్, ఇన్‌పుట్‌సబ్సిడీకి లంకెపెట్టి రైతులను మోసం చేసిన ప్రభుత్వం ఏదీ లేదు. అసంబద్ధ విధానాలతో రైతులను మోసం చేసే మొట్టమొదటి ప్రభుత్వం ఇదే అవుతోందని ప్రతిపక్షాలు, రైతుసంఘాలు దుయ్యబడుతున్నాయి. జిల్లాలో తీవ్ర కరువు పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో పరిహారంపై పామిడి సభలో చంద్రబాబు ఏదైనా ప్రకటన చేస్తారని రైతులు ఆశించారు. వారి ఆశలను సీఎం అడియాసలు చేశారు. పేరూరు, బీటీపీలను ఈ ఏడాదే పూర్తి చేస్తాం : సీఎం సీఎం చంద్రబాబు గురువారం నీరు–ప్రగతి ఉద్యమం రాష్ట్రస్థాయి ప్రారంభోత్సవం కోసం పామిడికి వచ్చారు. నీరు–ప్రగతి పైలాన్‌ను ఆవిష్కరించారు. ఆపై స్టాళ్లను సందర్శించారు. తర్వాత స్థానిక జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన బహిరంగసభలో మాట్లాడారు. హంద్రీ–నీవా ప్రధాన కాలువను కర్నూలు జిల్లా ముచ్చుమర్రి నుంచి జీడిపల్లి వరకూ మొదటి విడతలో వెడల్పు చేస్తామని ప్రకటించారు. అందుకు సంబంధించిన ఉత్తర్వులను పాత, కొత్త కలెక్టర్లు శశిధర్, వీరపాండ్యన్‌లకు అందించారు. పేరూరు, బీటీ ప్రాజెక్టు పనులను కూడా ఈ ఏడాదే ప్రారంభిస్తామన్నారు. ఇన్పుట్ సబ్సిడీ లేదా ఇన్సూరెన్స్ రూపంలో రైతులకు రూ.1030 కోట్ల పరిహారం ఇస్తామన్నారు. ఈ ఏడాది ఖరీఫ్‌లో పంటసాగు చేసే సమయానికి ఆ డబ్బులు ఖాతాల్లో జమ చేస్తామన్నారు. గుత్తి నియోజకవర్గంలో 12 చెరువులకు నీళ్లు అందించేందుకు రూ.40కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. కసాపురంలో టూరిజం సర్క్యూట్‌కు మరో రూ.20కోట్లు కేటాయిస్తామన్నారు. పామిడి, గుత్తిలో డిగ్రీకాలేజీల ఏర్పాటు, గుంతకల్లులో పాలిటెక్నిక్ కాలేజీ, తాగునీరు, రోడ్ల సమస్యలపై గుంతకల్లు ఎమ్మెల్యే జితేంద్రగౌడ్ ముఖ్యమంత్రి వద్ద ఏకరువు పెట్టారు. అన్నీ పరిశీలిస్తామని ముఖ్యమంత్రి చెప్పారు. సభ అనంతరం నేరుగా అనంతపురం చేరుకుని కేటీఆర్ కళ్యాణమంటపంలో నీటిసంఘాల ప్రతినిధులతో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్నారు. నీటి ఆవశ్యకత, సంరక్షణపై ప్రసంగించారు. ఆపై శిల్పారామాన్ని ప్రారంభించారు. శిల్పారామాన్ని రానున్న రోజుల్లో బ్రహ్మాండమైన పార్కులా అభివృద్ధి చేస్తామని చెప్పారు. అక్కడి నుండి నేరుగా పుట్టపర్తికి చేరుకుని తిరుగుపయనమయ్యారు. పర్యటనలో మంత్రులు పరిటాల సునీత, దేవినేని ఉమామహేశ్వరరావు, కాలవ శ్రీనివాసులు, నారా లోకేశ్, విప్ యామినీ బాల, ఎంపీ జేసీదివాకర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు బీకే పార్థసారథి, హనుమంతరాయచౌదరి, ఈరన్న, చాంద్‌బాషా, పల్లె రఘునాథరెడ్డి, ప్రభాకర్‌చౌదరి, ఎమ్మెల్సీలు పయ్యావుల కేశవ్, తిప్పేస్వామి, శమంతకమణి తదితరులు పాల్గొన్నారు. -
సీఎం పర్యటనకు పకడ్బందీ బందోబస్తు
అనంతపురం సెంట్రల్ : ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా çఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పకడ్బందీ బందోబస్తు చేపట్టాలని ఎస్పీ రాజశేఖరబాబు ఆదేశించారు. బందోబస్తులో పాల్గొనే అధికారులతో బుధవారం రాత్రి సమీక్షించారు. సీఎం పర్యటన బందోబస్తు కోసం ముగ్గురు అడిషనల్ ఎస్పీలు, 15 మంది డీఎస్పీలు, 42 మంది సీఐలు, 100 మంది ఎస్ఐలు, ఇతర సిబ్బంది కలిపి మొత్తం 1,700 మందిని వినియోగిస్తున్నట్లు వివరించారు. ఇతర జిల్లా నుంచి కూడా ఫోర్సును రప్పించినట్లు తెలిపారు. సీఎం పర్యటించే ప్రాంతాలు, రహదారులు, సభా ప్రాంగణం, హెలీప్యాడ్, కాన్వాయ్, పార్కింగ్ తదితర ప్రాంతాల్లో విధులు నిర్వర్తించే సిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్నారు. -
నేడు సీఎం పర్యటన
అనంతపురం అర్బన్ : ముఖ్యమంత్రి చంద్రబాబు గురువారం జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 10.30 గంటలకు ప్రత్యేక విమానంలో పుట్టపర్తికి చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాప్టర్లో 11 గంటలకు పామిడి మండలం నీలూరు– కాలాపురం రోడ్డు వద్ద ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. 11.10 గంటలకు ఫారంపాండ్ పనులను ప్రారంభిస్తారు. అక్కడి నుంచి పామిడికి 11.30 గంటలకు చేరుకుంటారు. స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ‘నీరు– ప్రగతి– ఉద్యమం’ పైలాన్‌ను ప్రారంభిస్తారు. స్టాళ్లను సందర్శిస్తారు. ఆ తర్వాత బహిరంగ సభలో ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు. మధ్యాహ్నం ఒంటి గంట నుంచి 1.45 వరకు విశ్రాంతి తీసుకుంటారు. 2.30 గంటలకు అనంతపురం నగరంలోని గుత్తి రోడ్డులో ఉన్న కేటీఆర్ ఫంక్షన్ హాలుకు చేరుకుని.. నీటి వినియోగ సంఘాల అధ్యక్షులతో సమావేశమవుతారు. సాయంత్రం నాలుగుకు నగర శివారులోని శిల్పారామాన్ని ప్రారంభిస్తారు. సాయంత్రం ఐదు గంటలకు హెలికాప్టర్లో బయలుదేరి పుట్టపర్తి చేరుకుంటారు. అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో తిరిగి వెళతారు. -
ముఖ్యమంత్రి పర్యటన వాయిదా
–17–20 తేదీల మధ్య ఉండే అవకాశం కర్నూలు(అగ్రికల్చర్): ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి జిల్లా పర్యటన వాయిదా పడింది. ఈ నెల 17–20 తేదీల మధ్య పర్యటన ఉండే అవకాశం ఉంది. ఈ నెల 15న ఓర్వకల్లు మండలం కొమ్ముచెరువులో చెక్‌డ్యాం నిర్మాణానికి సీఎం శంకుస్థాపన చేయనున్నారని జిల్లా అధికారులు..బుధవారం ప్రకటించారు. ఈ దిశగా ఏర్పాట్లుకు కూడా సమాయత్తమయ్యారు. అయితే సీఎం పర్యటన వాయిదా పడిందని గురువారం.. అధికారులకు సమాచారం అందింది. -
రాష్ట్రానికి తలమానికంగా గజ్వేల్ మార్కెట్
♦ కూరగాయలు, మాంసాహార మార్కెట్‌ను అద్భుతంగా నిర్మించండి: కేసీఆర్ ♦ నియోజకవర్గాన్ని రాష్ట్రంలో నంబర్ వన్‌గా తీర్చిదిద్దాలి ♦ సొంత నియోజకవర్గంలో సీఎం పర్యటన... ♦ అభివృద్ధి పనులపై సమీక్ష గజ్వేల్: సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లో నిర్మించ తలపెట్టిన వెజ్ అండ్ నాన్‌వెజ్ మార్కెట్ రాష్ట్రానికే తలమానికంగా ఉండాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించారు. గజ్వేల్‌ను రాష్ట్రంలోనే నంబర్ వన్ నియోజకవర్గంగా తీర్చిదిద్దేం దుకు అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలని సూచించారు. శుక్రవారం తన సొంత నియో జకవర్గం గజ్వేల్‌లో సీఎం పర్యటించారు. బస్సులో పట్టణమంతా కలియదిరిగారు. ఆడిటోరియం, ఎమ్మెల్యే క్యాంపు కార్యాల యం, ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ కాంప్లెక్స్, బాలిక లు, బాలుర ఎడ్యుకేషన్ హబ్‌ల నిర్మాణ పనులను పరిశీలించారు. ముందుగా వెజ్ అండ్ నాన్‌వెజ్ మార్కెట్ నిర్మాణం కోసం ప్రతిపాదించిన పాత ప్రభుత్వ జూనియర్ కళాశాల స్థలాన్ని సందర్శించారు. మార్కెట్ మ్యాపును పరిశీలించి మార్పుచేర్పులపై అధి కారులతో చర్చించారు. ఇక్కడ 4.13 ఎకరాలు అందుబాటులో ఉందని, ఇందులో వెజ్, నాన్‌వెజ్, పండ్లు, పూల మార్కెట్లు నిర్మించను న్నామని కలెక్టర్ వెంకట్రామ్రెడ్డి, జేసీ హన్మం తరావు,మార్కెటింగ్ శాఖ డీఈ శ్రీనివాసరావు సీఎంకు తెలిపారు. 304 కూరగాయలు, 58 నాన్ వెజ్, మరో 40 పండ్లు, పూల దుకాణాలు పూర్తి ఏసీ సౌకర్యంతో ఉంటాయన్నారు. 8/8 చదరపు అడుగుల్లో దుకాణాలు నిర్మిస్తామని, మార్కెట్లో అంతర్గతంగా తొమ్మిది మీటర్ల వెడల్పుతో కిలోమీటరు పొడవు గల ఆరు రోడ్లను నిర్మిస్తామన్నారు. మార్కెట్లోకి ప్రవేశించడానికి ప్రధాన రహదారి గుండా మూడు మార్గాలు, ప్రాథమిక పాఠశాల నుంచి రెండు మార్గాలను ప్రతిపాదించినట్లు తెలపగా... అవసరమైతే బస్టాండ్ ప్రాంగణం నుంచి కూడా మార్గం తీసుకునే విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాలని సీఎం అధికా రులకు సూచించారు. దీనిద్వారా మార్కెట్ లోకి వచ్చే మార్గాల సంఖ్య ఆరుకు చేరుతుం దన్నారు. మార్కెట్‌కు వచ్చే ప్రజలకు ట్రాఫిక్ పరంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా రోడ్ల డిజైన్ ఉండాలని పేర్కొన్నారు. ఎన్ని నిధులైనా ఇస్తాం... మార్కెట్ నిర్మాణానికి సుమారు రూ.5 కోట్లకుపైగా వెచ్చించాల్సి వస్తుందని అధికారులు సీఎం దృష్టికి తెచ్చారు. ఎన్ని నిధులు ఇవ్వడానికైనా సిద్ధంగా ఉన్నామని, మార్కెట్ నిర్మాణం మాత్రం రాష్ట్రానికే తలమానికంగా ఉండాలని సీఎం స్పష్టం చేశారు. అనంతరం బస్సులో నుంచే ఆడిటోరియం, ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం, ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ కాంప్లెక్స్, బాలికల ఎడ్యుకేషన్ హబ్, సంగాపూర్ జీఎంఆర్ ప్రభుత్వ గురుకుల పాలిటెక్నిక్ ప్రాంగణంలో నిర్మిస్తున్న బాలుర ఎడ్యుకేషన్ హబ్ నిర్మాణ పనులను పరిశీలించారు. వీటితో పాటు పట్టణంలో డబుల్ బెడ్రూమ్ మోడల్ కాలనీ, వంద పడకల ఆసుపత్రి నిర్మాణం, రోడ్ల విస్తరణ తదితర అంశాలపై అధికారులతో ఆరా తీశారు. -
సీఎం పర్యటనకు భారీ బందోబస్తు
పిఠాపురం : ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురువారం పిఠాపురంలో పర్యటించనున్న సందర్భంగా భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు ఎస్పీ రవిప్రకాష్ తెలిపారు. మంగళవారం పిఠాపురంలో సీఎం పర్యటించనున్న ప్రాంతాలను జిల్లా కలెక్టరు అరుణ్‌కుమార్‌తో కలిసి ఆయన పరిశీలించి మాట్లాడుతూ ఇటీవల మావోయిస్టుల భారీ ఎ¯ŒSకౌంటర్ తరువాత సీఎంకు బందోబస్తు పెంచిన నేపథ్యంలో నిఘా పెంచామన్నారు. బుధవారం నుంచి ఈ ప్రాంతాలను తమ స్వాధీనంలోకి తీసుకుంటామన్నారు. సుమారు 1500 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈ సందర్భంగా పిఠాపురం జగ్గయ్య చెరువు సమీపంలో ఏర్పాటు చేస్తున్న సీఎం బహిరంగ సభ , వైజంక్ష¯ŒSలో నిర్మిస్తున్న హెలీపేడ్ను అధికారులు పరిశీలించారు. వీరి వెంట ఎమ్మెల్యే ఎస్‌వీఎస్‌ఎ¯ŒS వర్మ, పలువురు అధికారులు ఉన్నారు. ఆర్డీఓ కార్యాలయానికి మెరుగులు రామచంద్రపురం: సీఎం చంద్రబాబు గురువారం పట్టణానికి రానుండడంతో అధికార యంత్రాంగం అంతా పట్టణంలోనే ఉంటూ ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నది. పట్టణంలోని బైపాస్ రోడ్డు నుంచి నూతన ఆర్డీఓ కార్యాలయ భవనం వరకు రహదారికి ఇరువైపులా తుప్పలు తొలగించి రహదారి వేస్తున్నారు. బైపాస్ రోడ్డు సమీపంలో హెలిపాడ్‌ను నిర్మిస్తున్నారు. అక్కడి నుంచి వచ్చి నూతనంగా నిర్మించిన ఆర్డీవో కార్యాలయ శిలాఫలకం ఆవిష్కరించి ప్రారంభించనున్నారు. అనంతరం పక్కనే గల వీఎస్ఎం కళాశాల మైదానంలో నిర్వహించే జన్మభూమి మావూరు సభలో పాల్గొనున్నారు. ఆర్డీఓ కార్యాలయం ఆవరణంలో ప్రత్యేకంగా పూల తోటను ఏర్పాటు చేశారు. -
ఆయకట్టుపై.. అదే మాట !
– హంద్రీ-నీవా నీరు కుప్పానికి తీసుకెళ్లేదాకా ఆయకట్టుకు ఇచ్చేది లేదని సీఎం పునరుద్ఘాటన – వేరుశనగకు హెక్టారుకు రూ.15వేల చొప్పున ఇన్సూరెన్స్ లేదా ఇన్పుట్ సబ్సిడీ – శ్రీరామరెడ్డి తాగునీటి పథకం పనులపై విచారణ –దెబ్బతిన్న 13.5 కిలోమీటర్ల పైపులైన్ పనులకు రూ.30 కోట్లు – గొల్లపల్లిలో పర్యాటకాభివృద్ధి - వేసవిలో తాగునీటి ఎద్దడి నివారణకు ముందస్తు చర్యలు – జిల్లా పర్యటనలో ముఖ్యమంత్రి చంద్రబాబు – గంగపూజ చేసి గొల్లపల్లి రిజర్వాయర్‌కు నీరు విడుదల (సాక్షి ప్రతినిధి, అనంతపురం) 'హంద్రీ-నీవా నీటిని చిత్తూరు, కుప్పానికి తీసుకెళ్లేందుకే ఆయకట్టుకు ఇవ్వడం లేదని కొన్ని పత్రికలు విమర్శిస్తున్నాయి. మారాల, చెర్లోపల్లి రిజర్వాయర్లు, మడకశిర బ్రాంచ్ కెనాల్‌కు నీళ్లివ్వాలి. చిత్తూరు జిల్లాలో అడవిపల్లి, చిత్తూరు, కుప్పానికి తీసుకెళ్లాలి. చెరువులు, చెక్‌డ్యాంలు, రిజర్వాయర్లు నింపాల'ని ముఖ్యమంత్రి చంద్రబాబు పునరుద్ఘాటించారు. ఆయకట్టుకు నీరిస్తామని మాత్రం చెప్పలేకపోయారు. దీన్నిబట్టి చూస్తే కళ్లెదుటే నీళ్లున్నా మరికొన్నేళ్ల పాటు ఆయకట్టుకు అందే అవకాశం లేదని స్పష్టమైంది. సీఎం చంద్రబాబు శుక్రవారం పెనుకొండ మండలంలోని గొల్లపల్లి రిజర్వాయర్‌కు నీరు విడుదల చేశారు. ఆయన మధ్యాహ్నం రిజర్వాయర్‌కు చేరుకున్నారు. పైభాగంలో మూడురోజుల కిందట కొద్దిగా లిఫ్ట్‌చేసి నిల్వ ఉంచిన నీటికి గంగపూజ చేసి రిజర్వాయర్‌లోకి విడుదల చేశారు. తర్వాత పైలాన్‌ను ఆవిష్కరించారు. రిజర్వాయర్‌కు ‘ఎన్టీఆర్ జలాశయం’ అని నామకరణం చేశారు. తర్వాత బహిరంగసభలో ప్రసంగించారు. ఆపై మడకశిరలో పసుపు–కుంకుమ కార్యక్రమంలో పాల్గొన్నారు. పెట్టుబడి నిధి కింద జిల్లా సమాఖ్యకు రూ.197.64 కోట్లు, బ్యాంక్ లీకేజీ కింద రూ.306 కోట్ల చెక్కులను అందజేశారు. ఈ రెండు సభల్లోనూ ముఖ్యమంత్రి ప్రసంగఽం ఇలా సాగింది. భూగర్భజలాలు పెంచుతాం ‘జీడిపల్లికి నీళ్లొచ్చాయి. ఇప్పుడు గొల్లపల్లికి ఇచ్చాం. 1.6 టీఎంసీలు ఇక్కడ నిల్వ చేసుకోవచ్చు. తాగునీరు, పారిశ్రామిక అవసరాల కోసం గొల్లపల్లిలో మరో రిజర్వాయర్ నిర్మించే ఆలోచన చేస్తున్నాం. ఇక్కడి నుంచి చెరువులు, చెక్‌డ్యాంలు నింపి భూగర్భజలాలు పెంచుతాం. మడకశిర బ్రాంచ్ కెనాల్‌కు, ఈ ఏడాదిలోనే చెర్లోపల్లి, మారాల రిజర్వాయర్లకు నీళ్లిస్తాం. జీడిపల్లి, గొల్లపల్లి, పీఏబీఆర్, ఎంపీఆర్, చిత్రావతి రిజర్వాయర్లను నింపి భూగర్భజలాలు పెంచుతాం. దీంతో శాశ్వతంగా కరువు నివారిస్తాం. ఇప్పటి వరకూ 20 టీఎంసీల కృష్ణాజలాలు జిల్లాకు చేరాయి. వేసవిలో మంచినీటి సమస్య రాకుండా ఉండేందుకు మరో 13 టీఎంసీలు కావాలి. దీని కోసం ప్రధాన కాలువను వెడల్పు చేయాలి. దీని కోసం అంచనాలు సిద్ధం చేశాం. గొల్లపల్లిలో టూరిజం గెస్ట్‌హౌస్, మ్యూజియం నిర్మించి పర్యాటకంగా అభివృద్ధి చేస్తాం. హైవే నుంచి రిజర్వాయర్‌కు రోడ్డు కూడా నిర్మిస్తాం. అయితే.. రైతులు వారి పొలాలను ల్యాండ్‌పూలింగ్ ద్వారా ఉచితంగా ఇవ్వాలి. హెక్టారుకు రూ.15 వేల పరిహారం రెయిన్గన్లతో వేరుశనగకు నీళ్లిచ్చాం. అయితే దిగుబడిని కాపాడలేకపోయాం. దీంతో ఇన్సూరెన్స్, ఇన్పుట్ సబ్సిడీ ద్వారా హెక్టారుకు రూ.15వేల పరిహారం అందిస్తాం. అలాగే జిల్లాలో రూ.7,200 కోట్లతో 25 పరిశ్రమలఽ ఏర్పాటుకు కృషి చేస్తున్నాం. శ్రీరామరెడ్డి పథకంపై విచారణ శ్రీరామరెడ్డి తాగునీటి పథకం పనులు నాసిరకంగా చేశారు. 13.5 కిలోమీటర్ల మేర నాసిరకం పైపులైన్లు వేశారు. దీంతో 895 గ్రామాలకు నీరివ్వాల్సి ఉంటే.. 300 గ్రామాలకే ఇస్తున్నారు. దీనిపై విచారణకు ఆదేశిస్తున్నా. బాధ్యులుగా తేలిన కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకుంటాం. పైపులైన్ కోసం రూ.30 కోట్లు మంజూరు చేస్తున్నాం. మార్చిలోపు పనులు పూర్తి చేయాలి. అలాగే పశువులకు గడ్డి కొరత లేకుండా ఇంటింటికి దాణా పంపిణీ చేస్తామ’ని చెప్పారు. వేసవిలో తాగునీటి సమస్య లేకుండా జేసీనాగిరెడ్డి, సీబీఆర్తో పాటు మంచినీటి పథకాల మరమ్మతులను మార్చిలోపు పూర్తి చేయాలని కలెక్టర్‌ను ఆదేశించారు. కార్యక్రమంలో మంత్రులు కామినేని శ్రీనివాస్, కొల్లురవీంద్ర, దేవినేని ఉమామహేశ్వరరావు, పరిటాల సునీత, పల్లె రఘునాథరెడ్డి, చీఫ్‌విప్ కాలవ శ్రీనివాసులు, విప్ యామినీబాల, మేయర్ స్వరూప, ఎంపీ నిమ్మల కిష్టప్ప, ఎమ్మెల్యేలు బీకే పార్థసారథి, బాలకృష్ణ, వరదాపురం సూరి, జితేంద్రగౌడ్, హనుమంతరాయచౌదరి, ఈరన్న, చాంద్‌బాషా, ప్రభాకర్‌చౌదరి, ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్, కలెక్టర్ కోన శశిధర్, జాయింట్ కలెక్టర్ లక్ష్మీకాంతం తదితరులు పాల్గొన్నారు. -
నిరసనల మధ్య సీఎం పర్యటన
రుణాలు మాఫీ అన్నారు ఏమయిందని డ్వాక్రా మహిళలు ప్రశ్నలు నిలదీయడానికి వెళ్తామంటే అడ్డుకుంటారా : పోలీసులపై పలువురి ఆగ్రహం హామీలిచ్చి తప్పుకోవడం ఇదేమి పద్ధతంటూ ఆవేదన పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు దళిత, గిరిజన గర్జన సభలో బాబును సత్కరించిన కారెం శివాజీ సాక్షి, రాజమహేంద్రవరం : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శనివారం జిల్లాలో నిర్వహించిన సుడిగాలి పర్యటన నిరసనల మధ్య సాగింది. ఆర్ట్స్ కళాశాలలో జరిగే బహిరంగ సభలో పలువురు మహిళలు పలు ప్రశ్నలతో సీఎంను నిలదీయడానికి ముందుకు వెళ్తుంటే పోలీసులు అడ్డుకున్నారు. వారిద్దరి మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. సీఎం కూడా అసహనానికి గురై ఆగ్రహం వ్యక్తం చేయడంతో బాధితులు నినాదాలు చేశారు. రాజమహేంద్రవరం రూరల్ మండలం శాటిలైట్ సిటీ గ్రామంలో గురజాల అక్కమ్మతల్లి ఆలయాన్ని కొందరుక కూల్చివేసి స్థలాన్ని ఆక్రమించారని, న్యాయం చేయాలని సీఎం పాదయాత్ర సందర్భంగా గ్రామస్తులు ప్లకార్డులతో నిరసన తెలి పారు. పోలీసులువ వీరిని మందలించి ప్లకార్డులను లాక్కున్నారు. ఆలస్యంగా ప్రారంభం... ముందుగా నిర్ణయించిన ప్రకారంకన్నా గంటన్నర ఆలస్యంగా పర్యటన సాగింది. మధురపూడి విమానాశ్రయం నుంచి నేరుగా రాజమహేద్రవరం సెంట్రల్ జైలుకు చేరుకున్న సీఎం పరిపాలన భవనాన్ని ప్రారంభించి, 50 పడకల ఆస్పత్రికి శంకుస్థాపన చేశారు. అనంతరం ఖైదీలతో మాట్లాడుతూ జైలులో వృత్తులు నేర్చుకుని విడదలైన తరువాత ఉపాధి పొందాలని సూచించారు. శాటిలైట్ సిటీలో జన చైతన్య యాత్రలో భాగంగా గ్రామంలో రూ.40లక్షల వ్యయంతో నిర్మించే రైతు బజారు, చేపల మార్కెట్‌కు శంకుస్థాపన శిలాఫలకాలు ఆవిష్కరించారు. బాబు జగ్జీవ¯ŒSరామ్, ఎన్టీ రామారావు విగ్రహాలను ఆవిష్కరించారు. అనంతరం చెరుకూరి కల్యాణ మండంలో తెలుగు దేశం పార్టీ సమావేశంలో మాట్లాడుతూ అర్హులైన వారందరికీ సంక్షేమ పథకాలు అందేలా కార్యకర్తలు పని చేయాలన్నారు. మున్సిపల్ స్టేడియంలో డ్వాక్రా సంఘాల మహిళలతో ముఖాముఖి కార్యక్రమంలో మాట్లాడారు. మొబైల్ నగదు రహిత లావాదేవీలు జరిపేలా పరిజ్ఞానం పెంచుకోవాలంటూ తమ వద్ద ఉన్న సెల్ఫోన్లలో లైట్లు ఆ¯ŒS చేసి చూపాలని మహిళలను కోరారు. కారెం శివాజీ ఆధ్వర్యంలో జరిగిన దళితగిరిజన సభలో మాట్లాడుతూ దళిత సంక్షేమమే ధ్యే యంగా పని చేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం చంద్రబాబును దళిత, గిరిజన నేతలు సన్మానించారు. సాయంత్రం దివా¯ŒSచెరువులో నగర వనాన్ని ప్రారంభించారు. అటవీ అకాడమీ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. నన్నయ్య యూనివర్సిటీలో లైబ్రరీ, హాస్టల్ భవనాలను ప్రారంభించారు. చివరగా జీఎస్ఎల్ డెంటల్ కళాశాలను ప్రారంభించారు. ఎంపీలు ఎం.మురళీమోహన్, పండుల రవీంద్రబాబు, తోట నరసింహం, ఎమ్మెల్యేలు బుచ్చయ్య చౌదరి, పెందుర్తి వెంకటేష్, తోట త్రిమూర్తులు, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, దాట్ల బుచ్చిరాజు, ఎమ్మెల్సీలు సోమువీర్రాజు, అప్పారావు, చైతన్యరాజు, మేయర్ పంతం రజనీశేషసాయి, జిల్లా కలెక్టర్ హెచ్. అరుణ్‌కుమార్, జేసీ సత్యనారాయణ, కమిషనర్ విజయరామరాజు, సబ్‌కలెక్టర్ విజయ్‌కృష్ణ¯ŒS తదితరులు పాల్గొన్నారు. డ్వాక్రా మహిళలతో ముఖాముఖి : స్వయం సహాయక సంఘాలతో సీఎం ముఖాముఖి కార్యక్రమానికి అధికారులు ఉభయగోదావరి జిల్లాల నుంచి డ్వాక్రా మహిళలను తరలించారు. పార్టీ కార్యకర్తల సమావేశంలో భోజన ం, జనచైతన్య యాత్ర సభలో పాల్గొన్న ప్రజలకు పులిహోర ప్యాకెట్లు అందించిన నేతలు మహిళలకు బిస్కెట్లు పంచారు. అవికూడా అందిరికీ ఇవ్వకపోవడంతో చిన్నపిల్లతో వచ్చిన మహిళలు ఆకలితో ఇబ్బంది పడ్డారు. ప్రకటించిన విధంగా వ్యవసాయ శాఖలో పనిచేస్తున్న ఎంపీఈపీల జీతం రూ.8 వేల నుంచి రూ.12 వేలకు పెంచాలని సంఘ అధ్యక్ష, కార్యదర్శులు రమణ, శ్రీరాములు సీఎంకు వినతిపత్రం ఇచ్చారు. కడియం ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు రవాణా సౌకర్యాలు ఏర్పాటు చేయాలని మార్గాని సత్యనారాయణ విజ్ఞాపన పత్రం ఇచ్చారు. -
సీఎం పర్యటనపై ఖాకీ డేగకన్ను
-
సీఎం పర్యటనపై ఖాకీ డేగకన్ను
- మావోయిస్ట్ అగ్రనేత ఆర్కే ఆచూకీ కోసం ప్రజాసంఘాల నేతల ఆందోళనల నేపథ్యంలో ప్రత్యేక నిఘా - ఆర్కే కుమారుడు మున్నా ఎన్‌కౌంటర్‌తో అప్రమత్తం - సీఎం పర్యటనకు ముందు రోజు హెలికాప్టర్‌తో ఒంగోలు నగరాన్ని స్కాన్ - ప్రజా సంఘాల నేతల కదలికపై ఆరా ఒంగోలు క్రైం : ఉభయ రాష్ట్రాల్లో ముందెన్నడూ లేని విధంగా మావోయిస్ట్‌ల భారీ ఎన్కౌంటర్ నేపథ్యంలో పోలీసు శాఖ అప్రమత్తమైంది. మంగళవారం జిల్లాలో ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబునాయుడు పర్యటన కోసం ఒంగోలు నగరంతో పాటు జిల్లాలో నిఘాను ముమ్మరం చేశారు. ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి వచ్చిన ఇంటెలిజెన్స్ ఉన్నతాధికారుల పర్యవేక్షణలో నిఘా కొనసాగుతోంది. గతంలో ముఖ్యమంత్రి పర్యటనలకు భిన్నంగా ఈ సారి పర్యటనలో పోలీసులు విభిన్న కోణాల్లో నిఘాను పెంచారు. ఒంగోలు నగరాన్ని డోన్ కెమెరాతో స్కాన్ చేయిస్తున్నారు. ముఖ్యమంత్రి పర్యటనకు ముందురోజు ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా నగరాన్ని, నగర పరిసర ప్రాంతాలను అత్యాధునిక వీడియో కెమెరాలతో పర్యవేక్షించడం ఇదే ప్రధమం కావటం విశేషం. పోలీసు భద్రతను పెంచడం ఒక ఎత్తయితే.. డోన్ కెమెరాతో పాటు ముందురోజు హెలికాప్టర్ ద్వారా నగరాన్ని కెమెరాలతో స్నానింగ్ చేయటం మరొక ఎత్తు. వీటన్నింటికీ ప్రధాన కారణం ఒడిశా-ఆంధ్రా బోర్డర్(ఓఏబీ)లో ఈ నెల 24న జరిగిన మావోయిస్ట్‌ల భారీ ఎన్‌కౌంటరే కారణం. ఆర్కే కు జిల్లాతో ఉన్న సంబంధం నేపథ్యంలో అప్రమత్తం ఏఓబీ ఎన్కౌంటర్లో మావోయిస్ట్ అగ్రనేత అక్కిరాజు రామకృష్ణ అలియాస్ ఆర్కే కనుమరుగు కావటంతో పాటు ఆయన తనయుడు ఓఏబీ సెక్షన్ కమాండెంట్ అక్కిరాజు మున్నా అశువులు బాయటం అందరికీ తెలిసిందే. ఆర్కేతో జిల్లాకు సంబంధాలు ఎక్కువగా ఉండటమే భద్రతను కట్టుదిట్టం చేసేందుకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. ఆర్కే వివాహం చేసుకుంది టంగుటూరు మండలం ఆలకూరపాడులో. ఇటీవల ఆర్కే తనయుడు మున్నా అంత్యక్రియలు కూడా అక్కడే జరిగాయి. మావోయిస్ట్‌లు ముఖ్యమంత్రి, ఆయన కుమారుడిని అంతమొందిస్తామని హెచ్చరించిన నేపథ్యంలో వారి భద్రతపై పోలీసు ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. ఇప్పటికే ఆర్కే ఆచూకీ తెలపాలంటూ విశాఖపట్నంలో ప్రజాసంఘాల ఆధ్వర్యంలో ఆందోళనలు చేపడుతున్న విషయం తెలిసిందే. ముఖ్యమంత్రి ఒంగోలు వస్తున్నందున పోలీసులు నిఘా ఉంచారు. ఇక సాధారణంగా ప్రజాసంఘాలు, రైతు సంఘాల, కుల సంఘాలు, కార్మిక సంఘాల నేతలపై దృష్టి సారించి వారి కదలిక లపై నిఘా ఉంచారు. -
గులాబీ దళపతి క్షేత్ర పర్యటన!
- దసరా తర్వాత జిల్లాలకు - పార్టీ సంస్థాగత అంశాలపై దృష్టి - సిద్దిపేట నుంచే తొలి పర్యటన సాక్షి, హైదరాబాద్: అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ప్రభుత్వ పాలనపై మాత్రమే దృష్టి పెట్టిన గులాబీ దళపతి, సీఎం కె.చంద్రశేఖర్‌రావు ఇక పార్టీ సంస్థాగత వ్యవహారాలపైనా దృష్టి సారించనున్నారు. ఇప్పటికే రెండు మూడు పర్యాయాలు తాను జిల్లాల్లో పర్యటిస్తానని కేసీఆర్ ప్రకటించారు. కానీ, వివిధ కారణాలతో పర్యటన వాయిదా పడుతూ వచ్చింది. ఈసారి తప్పనిసరిగా సీఎం జిల్లాల పర్యటన ఉండేలా పార్టీ నాయకత్వం ప్రణాళికను సిద్ధం చేసినట్లు తెలిసింది. దసరా తర్వాత నుంచి ఆయన జిల్లాల్లో పర్యటిస్తారని పార్టీ వర్గాలు చెప్పాయి. ఇప్పటికే కొన్ని జిల్లాల నేతలకు సమాచారం ఇచ్చారని చెబుతున్నారు. కాగా, సిద్దిపేట నుంచే సీఎం పర్యటనలు మొదలుపెట్టనున్నారని తెలుస్తోంది. రైతులతో నేరుగా: తాజా వర్షాలతో చెరువులు, సాగునీటి ప్రాజెక్టులు నిండి రైతులంతా సంతోషంగా ఉండడంతో వారిని నేరుగా కలవాలని సీఎం భావిస్తున్నారని పేర్కొం టున్నారు. కొత్త జిల్లాలు కూడా దసరా నుంచే ఉనికిలోకి వస్తున్న నేపథ్యంలో ఒకటి రెండు చోట్ల మినహా ప్రభుత్వ ప్రతిపాదనలకు ఇప్పటికే అనుకూలత వ్యక్తమవుతున్న దృష్ట్యా ఈ రెండు అంశాలను సమర్థంగా వినియోగించుకోవాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. జిల్లా స్థాయిలోనూ అధికారులతో సమీక్షలు నిర్వహించడం ద్వారా క్షేత్రస్థాయిలోని సమస్యల గురించి తెలుసుకోవడం, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల అమలు తీరును సమీక్షించడం వంటి వాటికి జిల్లాల పర్యటనలను ఉపయోగించుకోనున్నారని తెలుస్తోంది. పార్టీ సమావేశాలు కూడా జరుపుతారని అంటున్నారు. మొత్తంగా ప్రజల్లోకి వెళ్లడం ద్వారా తమ పాలనపై ప్రజల నాడిని మరోసారి తెలుసుకోవడం, ప్రజావసరాలకు అనుగుణంగా ప్రణాళికలు సిద్ధం చేసుకోవడం, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధుల్లో మరింత బాధ్యతను పెంచడం వంటి బహుళ ప్రయోజనాల కోసం సీఎం పర్యటనలు ఉంటాయని విశ్లేషిస్తున్నారు. పదవుల పంపకంపై దృష్టి జిల్లాల పర్యటనల్లో భాగంగా ముఖ్యమంత్రి.. పార్టీ సంస్థాగత వ్యవహారాలపై దృష్టి పెట్టడంతోపాటు రెండేళ్లకు పైగా పెండింగులో ఉన్న పదవుల పంపకంపైనా దృష్టి పెడతారని చెబుతున్నారు. జిల్లాల్లో పార్టీ అధ్యక్ష పదవులు తప్ప వేటినీ భర్తీ చేయలేదు. కొత్త జిల్లాలు ఏర్పాటయ్యాక వాటిని కూడా పరిగణనలోకి తీసుకుని అటు అధికారిక పదవులు, ఇటు పార్టీ పదవుల పంపకంపై స్పష్టత ఇస్తారని సమాచారం. కొత్త జిల్లాల నేపథ్యంలో జిల్లా స్థాయి అధికారిక పదవుల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉంది. డీసీసీబీ, డీసీఎంఎస్, జిల్లా గ్రంథాలయ సంస్థ వంటి వాటి విషయంలో చైర్మన్ల పదవులు కొత్తగా అందుబాటులోకి రానున్నాయి. సీఎం కేసీఆర్ జరపనున్న జిల్లాల పర్యటనలో ఈ పదవుల నియామకానికి సంబంధించి నిర్ణయాలు తీసుకుంటారని సమాచారం. -
సీఎం హడావుడి పర్యటనలు!
జగన్ పర్యటన ఖరారైన కొద్దిసేపటికే పయనం ప్రతిపక్ష నేత తిరగనున్న ప్రాంతాల్లో మొక్కుబడి పర్యటన రోడ్లు, రైల్వేట్రాక్‌లను పరిశీలించి వెళ్లిన సీఎం బాధితులు ఆందోళన చేయటంతో ఆదివారంపరామర్శలు సాక్షి, గుంటూరు : జిల్లాలో గత ఐదు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు, చెరువులు పొంగి పొర్లడంతో వరద ఉధృతికి అనేక ప్రాంతాల్లో పంటలు దెబ్బతిని, గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్న విషయం తెలిసిందే. భారీ వర్షాల వల్ల జిల్లాలో తొమ్మిది మంది మృతి చెందినా స్పందించని సీఎం చంద్రబాబు అధికారులు, అధికార పార్టీ నేతలకు సైతం ముందస్తు సమాచారం లేకుండా శని, ఆదివారాల్లో సత్తెనపల్లి, పెదకూరపాడు, గురజాల, మాచర్ల నియోజకవర్గాల్లో హడావిడిగా పర్యటించారు. తన నివాసానికి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న వరద ప్రాంతాల బాధితులను కనీసం పరామర్శించని సీఎం శని, ఆదివారాల్లో మాత్రం హడావుడిగా పర్యటించి మమ అనిపించారు. ఈ హడావుడి ఎందుకంటే... ఇంత హడావిడిగా సీఎం పర్యటించడానికి కారణం.. జిల్లాలోని గురజాల, మాచర్ల, సత్తెనపల్లి నియోజకవర్గాల్లో ఈ నెల 26, 27 తేదీల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పర్యటన ఖరారు కావడమే. శనివారం పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు పర్యటనలో ఉన్న సీఎం చంద్రబాబు మధ్యాహ్నం నుంచి హుటాహుటిన వరద ప్రాంతాల పర్యటనకు విచ్చేశారు. గతంలో కూడా వైఎస్ జగన్ ప్రజా సమస్యలపై ఆందోళన చేసేందుకు తేదీ ప్రకటించగానే తానూ చేస్తానంటూ హడావుడి చేసిన విషయం అందరికీ తెలిసిందే. పోనీ వరద బాధితుల పరామర్శ అయినా సక్రమంగా చేశారా అంటే అదీ లేదు. హడావుడిగా హెలికాప్టర్లో వెళ్లి రెడ్డిగూడెం, ధూళిపాళ్ల, క్రోసూరులో రోడ్లు, వంతెనలు, రైల్వే ట్రాక్‌లను పరిశీలించి పర్యటన ముగించుకుని గుంటూరుకు చేరుకుని సమీక్షల పేరుతో అర్ధరాత్రి వరకూ కలెక్టరేట్లో గడిపి వెళ్లిపోయారు. తనను కలిసేందుకు వచ్చిన వరద బాధితులను సైతం పలకరించకపోవడం గమనార్హం. దీంతో రెడ్డిగూడెంలో మహిళలు రోడ్డుపైకి చేరి ఆందోళనకు దిగడంతో పాటు సీఎం కాన్వాయ్‌లోని వాహనాలను అడ్డుకున్నారు. కష్టాలు చెప్పుకొందామని వస్తే పోలీసులతో గెంటివేశారని, ఈ మాత్రానికి ఎందుకు వచ్చారంటూ వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం పర్యటన ఉందని తెలియని టీడీపీ జిల్లా నాయకులు శనివారం మధ్యాహ్నం జిల్లా సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రులు, ఎమ్మెల్యేలు నియోజకవర్గ ఇన్చార్జిలు హాజరుకావాల్సి ఉండగా, సీఎం పర్యటన మధ్యాహ్నం ఉండటంతో అర్ధాంతరంగా ముగించి పర్యటనకు వెళ్లారు. సీఎం ఇంత హడావిడిగా వరద ప్రాంతాల్లో ఎందుకు పర్యటించారో అర్థంకాక మొదట టీడీపీ నేతలు సైతం అయోమయంలో పడ్డారు. చివరకు విషయం తెలుసుకుని తమ నాయకుడి తెలివితేటలకు లోలోన మురిసిపోయారు. అయితే వైఎస్ జగన్ గురజాల నియోజకవర్గం దాచేపల్లి నుంచి వైఎస్ జగన్ పర్యటన మొదలుకానున్న నేపథ్యంలో ఆదివారం ఉదయం మళ్లీ హడావుడిగా సీఎం దాచేపల్లి, గురజాల, రెంటచింతలలో పర్యటించారు. ఇదంతా చూసిన జిల్లా వాసులు సీఎంకు వరద బాధితులను పరామర్శించాలనే చిత్తశుద్ధి లేదని, కేవలం వైఎస్ జగన్‌కు ఎక్కడ పేరు వస్తుందోననే రాజకీయ కోణంతో వెళ్లారని నిట్టూరుస్తున్నారు. సీఎం సేవలో ఉన్నతాధికారులు.. నిలిచిన సహాయక చర్యలు ముఖ్యమంత్రి చంద్రబాబు శని, ఆదివారాల్లో హడావిడిగా జిల్లాలోని సత్తెనపల్లి, పెదకూరపాడు, గురజాల, మాచర్ల నియోజకవర్గాల్లో పర్యటించిన నేపథ్యంలో జిల్లా కలెక్టర్ నుంచి ఉన్నతాధికారులంతా ఆయన సేవలో తరించారు. దీంతో వరద ప్రాంతాల్లో బాధితులను ఆదుకునేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలనే సూచనలు కూడా చేయలేని పరిస్థితి. దీంతో వరద బాధితులకు సహాయక చర్యలు నిలిచిపోయాయి. వరద ప్రాంతాల్లో అన్ని శాఖలకు సంబంధించి దెబ్బతిన్న పనులను పునరుద్ధరించే పనులు సైతం నిలిచిపోయాయి. దీంతో సీఎం పర్యటన వల్ల వరద బాధితులకు ఎటువంటి ఉపయోగం కలుగకపోగా, ఇబ్బందులు తెచ్చిపెట్టిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. -
ఎందుకింత ఆర్భాటం..?
– పంట అంపశయ్యపై ఉన్న దశలో దేనీకీ హడావుడి – సీఎం చంద్రబాబుపై వామపక్ష నాయకుల ధ్వజం అనంతపురం అర్బన్ : వేరుశనగ పంట అంపశయ్యపై ఉన్న దశలో ముఖ్యమంత్రి చంద్రబాబు జిల్లాలో ఆర్భాటం చేస్తున్నారని వామపక్ష నాయకులు విమర్శించారు. బుధవారం స్థానిక సీపీఐ కార్యాలయంలో విలేకరులతో సీపీఐ, సీపీఎం, సీపీఐ(ఎంఎల్) జిల్లా కార్యదర్శులు, సీపీఐ(ఎంఎల్) న్యూ డెమోక్రసీ, ఎస్‌యూసీఐ నాయకులు డి.జగదీశ్, వి.రాంభూపాల్, సి.పెద్దన్న, జి.పెద్దన్న, రాఘవేంద్ర మాట్లాడారు. ఎండిన పంటకు రక్షక తడుల పేరుతో ప్రభుత్వ∙వైఫల్యాలను కప్పిపుచ్చుకుని, రైతులను మభ్య పెడుతున్నారని విమర్శించారు. ఇద్దరు మంత్రులు, ప్రజాప్రతినిధుల్లో ఒక్కరు కూడా పంట ఎండిపోతోందనే విషయాన్ని తన దష్టికి తీసుకురాలేదని చంద్రబాబు అనడం చూస్తే రైతుల సమస్యలపై ప్రభుత్వానికి ఏ మాత్రమూ చిత్తశుద్ధి లేదన్న విషయం స్పష్టమవుతోందన్నారు. మెట్టభూముల్లోనే కాకుండా తోటల్లో వేసిన వేరుశనగ పంటకు కూడా ఉడలు దిగలేదన్నారు. దీనిపై అధ్యయనం చేసి కారణాలు తెలుసుకోవాలన్నారు. వేరుశనగ పంట వాడు పట్టినప్పుడు ముఖ్యమంత్రి, మంత్రులు కష్ణా పుష్కాల వినోదాల్లో మునిగి తెలుతూ రైతులను ఆదుకునే చర్యలు చేపట్టలేదన్నారు. అదే సమయంలో జిల్లా అధికార యంత్రాంగం స్వాతంత్య్ర వేడుకల్లో నిమగ్నమై పట్టించుకోలేదన్నారు. ఇప్పుడు వచ్చి పంటను కాపాడేందుకు తాను శ్రమిస్తున్నానని చెప్పుకోవడానికి, ప్రజల్లో భ్రమలు కల్పించడానికి జిల్లాలో ముఖ్యమంత్రి మూడు రోజులు జిల్లాలో మకాం వేశారన్నారు. దీనివల్ల రాజకీయ ప్రయోజనాలే తప్ప రైతాంగానికి ఎలాంటి ఉపయోగం లేదని మండిపడ్డారు. సమావేశం సీపీఐ సహాయ కార్యదర్శి సి.జాఫర్, సీపీఎం కార్యదర్శి వర్గ సభ్యులు ఓ.నల్లప్ప పాల్గొన్నారు. -
రైతులకు ఆర్థిక భరోసా ఇవ్వాలి
హిందూపురం అర్బన్ : ఖరీఫ్‌లో సాగు చేసిన పంటలన్నీ ఎండిపోయి తీవ్రంగా నష్టపోయిన రైతులకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆర్థికSభరోసా ఇవ్వాలని డీసీసీ అధ్యక్షుడు కోటాసత్యం, పీసీసీ అధికార ప్రతినిధి బాలాజీ మనోహర్ డిమాండ్ చేశారు. మంగళవారం స్థానిక ప్రెస్‌క్లబ్‌లో వారు విలేకరులతో మాట్లాడుతూ సీఎం, మంత్రులు, అధికారుల పర్యటనలకు చేస్తున్న ఖర్చును రైతులకు పంట నష్టపరిహారంగా అందించవచ్చునన్నారు. అంతేకాకుండా ప్రధాని ఫసల్ బీమా పథకాన్ని వేరుశనగ రైతులకు కూడా వర్తింపజేయాలని తెలిపారు. జిల్లా సర్వసభ్య సమావేశం నియోజకవర్గంలో సమస్యలను ప్రస్తావిస్తూ కాంగ్రెస్ పార్టీ ప్రతినెలా చేపడుతున్న ప్రజా పోరుబాటలో భాగంగా అన్ని నియోజకవర్గాల్లో జిల్లా స్థాయి సమావేశాలు కొనసాగిస్తున్నామని డీసీసీ అధ్యక్షుడు కోటాసత్యం చెప్పారు. ఇందులో భాగంగా సెప్టెంబరు 3న హిందూపురంలోని ఇందిరమ్మ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం ఉంటుందని అదేరోజు మధ్యాహ్నం కేహెచ్ ఫంక్షన్ హాల్లో జిల్లా సర్వసభ్య సమావేశం జరుగుతుందన్నారు. సమావేశంలో కాంగ్రెస్ సీనియర్‌నాయకులు రమణ, ఆదిమూర్తి, శైవలి రాజశేఖర్, జిల్లా కార్యదర్శి అబ్దుల్లా, రవూఫ్, యూత్ కాంగ్రెస్ నాయకులు రెహమత్, జబీ, మధు, జమీల్, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. -
అంతా ఆర్భాటమే
-పంటను కాపాడతామంటూ హడావుడి చేస్తున్న సీఎం - మంగళవారం సాయంత్రం ఆరు గంటలకు జిల్లాకు చేరిక - రెండు పొలాల్లో ఫొటోలకు ఫోజులు.. ప్రతీ ఎకరాకు నీరిస్తామని ప్రకటన -ముఖ్యమంత్రి ఆర్భాటంపై అధికార వర్గాల్లో తీవ్ర వ్యతిరేకత - అదను దాటిపోయినందున ఇన్‌పుట్‌సబ్సిడీ ఇవ్వాలంటున్న రైతులు అనంతపురం: రక్షకతడితో పంటను కాపాడతామంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆర్భాటం చేస్తున్నారని ప్రజలు, రైతులు విమర్శిస్తున్నారు. సీఎం ఇంతకుముందు నెలలో మూడుసార్లు జిల్లా పర్యటనకు వచ్చినా వేరుశనగ పంట పరిస్థితి గురించి ఆరా తీయలేదు. ఈ నెల 12 నుంచి 24 వరకూ కృష్ణా పుష్కరాల్లో మునిగితేలుతూ ‘అనంత’లో ఎండిన పంటను నిర్లక్ష్యం చేశారు. ఈలోగా జిల్లాలో 5.41 లక్షల హెక్టార్లలో పంట ఎండిపోయింది. దీన్ని కాపాడతానని ప్రకటించి విఫలమయ్యారు. అయితే.. ఆ నిందను మంత్రులు, అధికారులపైకి నెట్టేస్తున్నారు. పంట ఎండిన సమాచారం తనకు తెలీదనే కారణంతో తప్పించుకోవాలని చూస్తున్నారు. దీనిపై ప్రతిపక్షాలు, రైతుసంఘాలు మండిపడుతున్నాయి. ఈ క్రమంలో ఎలాగైనా పంట కాపాడేందుకు తాను తపన పడ్డానని, తీవ్రంగా శ్రమించాననే భావన ప్రజల్లోకి వెళ్లేలా చంద్రబాబు మరోసారి ‘అనంత’కు వచ్చా రు. పంట ఎండటాన్ని విపత్తుగా తీసుకున్నాని, అందుకే ఇక్కడే ఉండి కాపాడతానని ప్రకటించారు. ఆదివారం అమడగూరు, కదిరి నియోజకవర్గాల్లో పంటలను పరిశీలించారు. పంటలను కాపాడేందుకు కార్యాచరణ ప్రకటించారు. ఇంతలోనే మంగళవారం మరోసారి జిల్లా పర్యటనకు వచ్చారు. సాయంత్రం 6గంటలకు పెనుకొండ నియోజకవర్గం రొద్ద మండలం పెద్దమంతూరు చేరుకున్నారు. అక్కడ వెంకమ్మ అనే రైతు వేరుశనగ పొలాన్ని, పరిగి మండలంలో గణపతిపురం అనే గ్రామంలో భాస్కర్ అనే మరో రైతు పొలాన్ని పరిశీలించారు. ఈ రెండు పొలాల్లో మంగళవారం ఉదయం నుంచి సాయంత్రం 6గంటల వరకు రెయిన్గన్లతో నీరు ఇవ్వలేదు. మంత్రులు వచ్చినపుడు ఫొటోలకు పోజు లిచ్చేందుకు కాసేపు నీళ్లు వదలడం... తర్వాత ఆపేయడం చేశారు. మధ్యాహ్నం తర్వాత పూర్తిగా రెయిన్గన్లను ఆపేసి సీఎం రాగానే ఆన్ చేశారు. వాటిని చూసి సీఎం రెయిన్గన్లతో రైతుల పంటలు కాపాడుతున్నామని ప్రకటిస్తున్నారు. ఇవి చూసి సీఎం చుట్టూ ఉన్న పలువురు అధికారులతో పాటు రైతులు నవ్వుకుంటున్నారు. పంటను కాపాడలనే చిత్తశుద్ధి ఉంటే ఉదయం నుంచి రైతులకు ఎందుకు రెయిన్గన్ల ద్వారా నీరివ్వలేదని, కేవలం సీఎం ముందు 5 నిమిషాలు సినీఫక్కీలో రెయిన్గన్లు ఆడించడంపై మండిపడుతున్నారు. పంట కాపాడటమంటే ఇంట్లో భోజనం వండినంత సులువు కాదని, అదనులో నీళ్లివ్వడం చేయాలన్నారు. గతేడాది హంద్రీ–నీవా పనులను పూర్తి చేసి ప్రధాన కాలువ నుంచి ఉప, పిల్లకాలువను ఏర్పాటు చేసి ఉంటే ఈ ఏడాది ఈ పరిస్థితి తలెత్తేది కాదని చర్చించుకున్నారు. పంట ఎండిన సంగతి తెలీదన్నసంగతిపై జోరుగా చర్చ పంట ఎండిన సంగతి తనకు మంత్రులు, అధికారులు చెప్పలేదని సీఎం చేసిన వ్యాఖ్యలపై జోరుగా చర్చసాగింది. మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు అధికారులు, రైతులతో పాటు మీడియా ప్రతినిధులు ఈ వ్యాఖ్యలపై చర్చించారు. నెలరోజులుగా పంట ఎండిపోతుంటే వ్యవసాయశాఖ మంత్రికి తెలీదా? జిల్లా మంత్రులు చెప్పలేదా? సకాలంలో పంట కాపాడలేకపోవడానికి ఇదే కారణమైతే మంత్రులను వెంటనే కేబినెట్ నుంచి బర్తరఫ్ చేయాలని చర్చించుకున్నారు. అలాగే రెవెన్యూ, వ్యవసాయశాఖల నుంచి నెలరోజులుగా సమాచారం ప్రభుత్వానికి చేరలేదంటే చంద్రబాబు పాలనలో అధికార వ్యవస్థ ఎలా నడుస్తోందో ఇట్టే తెలుస్తోందని రుసరుసలాడారు. సకాలంలో పంటకు నీళ్లివ్వడంలో నిర్లిప్తత ప్రదర్శించి పంట ఎండిపోయిన తర్వాత నీరిచ్చి కాపాడతామనే ఆర్భాటం చేయడం ఎంత వరకు సమంజసమని, పంటను ప్రభుత్వం కాపాడిందనే సాకును చూపుతూ ఇన్పుట్ సబ్సిడీని ఎగ్గొట్టేందుకే ఈ పర్యటనలు చేస్తున్నారని పరిశీలకులు మండిపడుతున్నారు. కార్యక్రమంలో మంత్రులు పత్తిపాటి పుల్లారావు, పరిటాల సునీత, ఎంపీ నిమ్మల కిష్టప్ప, ఎమ్మెల్యే బీకే పార్థసారథి, కలెక్టర్ శశిధర్, జేసీ లక్ష్మీకాంతం, ప్రత్యేకాధికారి నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. -
‘సమస్యలపై సీఎంను నిలదీస్తాం’
అనంతపురం అర్బన్ : జిల్లాకు శనివారం వస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును రైతాంగ సమస్యలు, రైతు ఆత్మహత్యలపై నిలదీస్తామని ఏపీ రైతు సంఘం (సీపీఎం) రాష్ట్ర అధ్యక్షుడు పెద్దిరెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లాలో రైతులు ఆత్మహత్య చేసుకున్నా షరుతుల పేరుతో పరిహారం ఇవ్వడం లేదని పేర్కొన్నారు. ఏపీ డైరీ పరిధిలోని రైతులకు రూ.కోట్ల పాల బిల్లుల బకాయిలు చెల్లించకుండా పాడి రైతుల్ని అప్పుల పాలు చేస్తున్నారని తెలిపారు. జిల్లాలో బలవంతపు భూసేకరణ నిలిపివేయాలని, ఎన్పీ కుంటలో సోలార్ హబ్‌కి సేకరించిన భూములకు సంబంధించి పరిహారాన్ని సాగుదారులు, రైతులకు ఇవ్వాలనే డిమాండ్లతో ముఖ్యమంత్రిని నిలదీస్తామని తెలిపారు. -
స్కూళ్లు మూసేసి రండి
► మధ్యాహ్న భోజనం పెట్టి స్కూళ్లు బంద్ చేయాలి ► ప్రతి టీచరూ ముఖ్యమంత్రి సభకు రావాల్సిందే ► స్పష్టం చేసిన విద్యాశాఖ అధికారులు అనంతపురం ఎడ్యుకేషన్ : ‘మండలానికి ముఖ్యమంత్రి చంద్రబాబు వస్తున్నారు. విద్యార్థులకు మధ్యాహ్నం భోజనం పెట్టేసి ఇంటికి పంపండి. స్కూళ్లు బంద్ చేసి హెచ్ఎంలు, టీచర్లందరూ సీఎం సమావేశానికి రావాలి’ అంటూ బుక్కరాయసముద్రం, శింగనమల మండలాల్లో పని చేస్తున్న ప్రభుత్వ ఉపాధ్యాయులకు విద్యాశాఖ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు శనివారం బుక్కరాయసముద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయ భవనాన్ని ప్రారంభిస్తారు. అనంతరం కేజీబీవీలో ఏర్పాటు చేసిన రైతు ఉత్పత్తిదారుల సంఘం సమావేశంలో పాల్గొంటారు. వాస్తవానికి ఈ రెండు కార్యక్రమాలకు విద్యాశాఖకు సంబంధం లేదు. ఒకవేళ ఉన్నా...పాఠశాలలను ఎట్టి పరిస్థితుల్లోనూ బంద్ చేయకూడదు. అయితే ముఖ్యమంత్రి సమావేశం కదా...జనాలు తక్కువగా వస్తే బాగుండదని భావించిన శింగనమల నియోజక వర్గానికి చెందిన ఓ ముఖ్యనేతలు బడులు మూయించే కార్యక్రమానికి పూనుకున్నారు. ప్రతి స్కూల్ నుంచి టీచర్లను పంపాలని మండల విద్యాశాఖ అధికారులపై ఒత్తిడి చేసినట్లు తెలిసింది. వారు ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు ఫోన్లు చేసి ఆదేశాలు జారీ చేశారు. ఇంకొందరికి మాత్రం ఎక్కడ ఇబ్బందు లు తలెత్తుతాయోనని భావించి.. నేరు గా పిలిపించుకుని చెప్పినట్లు తెలిసింది. పైగా సమావేశానికి హాజరుకాని ఉపాధ్యాయుల వివరాలు కూడా అధికార పార్టీ నాయకులకు అందజేస్తామంటూ బెదిరింపులకు దిగినట్లు సమాచారం. ఎలాంటి కారణం లేకుండానే రెండు మండలాల్లోని పాఠశాలలు మధ్యాహ్నం నుంచి మూతపడనున్నాయి. దీనిపై డీఈఓ అంజయ్యను వివరణ కోరగా... తానెవరికీ చెప్పలేదన్నారు. కొందరు ఫోన్లు చేసి అడిగినా...పాఠశాలలు బంద్ చేయడం కుదరదని చెప్పానని, మరి ఆ స్కూళ్ల హెచ్ఎంలకు ఎవరు చెప్పారో తనకు తెలీదన్నారు. -
ఇచ్చిందేంటి బాబూ?!
ప్రియతమ ముఖ్యమంత్రి గారికి, అయ్యా! ‘అనంత’ కరువు, వెనుకబాటుతనం గురించి మీకు తెలియంది కాదు. మీరు గతంలో సీఎంగా ఉన్న తొమ్మిదేళ్లలో ఏడేళ్లు వరుస కరువులతో జిల్లా తల్లడిల్లింది. జనం ఆకలి తీర్చడానికి గంజికేంద్రాలు, పశువుల కోసం గడ్డికేంద్రాలు ఏర్పాటు చేయాల్సి వచ్చింది. ఇప్పుడు తిరిగి రెండేళ్లుగా కరువు నెలకొంది. ఈ రెండేళ్లలో 63 మండలాల్లోనూ కరువొచ్చిందని మీ ప్రభుత్వమే ప్రకటించింది. జిల్లా ప్రజలు గడిచినlఎన్నికల్లో ఇద్దరు ఎంపీలు, 12మంది ఎమ్మెల్యేలను మీ పార్టీ తరఫున గెలిపించారు. రాజధాని ప్రకటన సమయంలో ‘అనంత’ అభివృద్ధి కోసం 15 వరాలను అసెంబ్లీ సాక్షిగా మీరు ప్రకటించారు. ఇవి కాక జిల్లా పర్యటనకు వచ్చినప్పుడు మరో ఆరు హామీలిచ్చారు. ఇది చూసి ‘మీకు అనంత అంటే ఎంత ప్రేమో’ అనుకున్నాం. మీరు ఇప్పటి వరకూ 11 సార్లు జిల్లాకు వచ్చారు. నేడు 12వ సారి వస్తున్నారు. కాగా.. మీరిచ్చిన హామీల్లో ఏ ఒక్కటీ అమలు చేయలేకపోయారు. పైగా వచ్చిన ప్రతిసారీ ‘అనంత’ అంటే నాకు అమితమైన ప్రేమ.. మొన్న చైనాకు వెళుతుంటే కలలో కూడా ‘అనంతే’ గుర్తుకొచ్చిందంటూ వల్లమానిన ‘అభిమానం’ చూపుతారు. ప్చ్..ఏం లాభం?! మీ మాటలు నీటి మూటలే అవుతున్నాయి. హంద్రీ–నీవా ద్వారా 2014 ఖరీఫ్‌లో ఆయకట్టుకు నీళ్లిస్తామన్నారు. ఇవ్వలేదు. 2015కైనా ఇచ్చారా? అదీ లేదు! ‘2016 ఆగస్టుకు నీళ్లివ్వాల్సిందే! పనులు చేయాల్సిందే! లేదంటే కాంట్రాక్టర్లను బ్లాక్‌లిస్టులో పెడతా. అధికారులపై చర్యలు తీసుకుంటా’ అని ఇటీవల దిగువచెర్లోపల్లికి వచ్చినపుడు హడావుడి చేశారు. కానీ మొదటివిడత ఆయకట్టుకు నీళ్లిచ్చేందుకు కాంట్రాక్టర్లకు మీరే వచ్చే ఏడాది జూన్ వరకూ గడువిచ్చారు. జరుగుతున్న పనులు చూస్తే మరో మూడేళ్లయినా పూర్తయ్యేలా లేవు. దీన్నిబట్టి చూస్తే మీ మాటలు నేతిబీరలో నెయ్యి చందం అనుకోక తప్పదు. కేంద్రం ఫసల్‌బీమాను ప్రవేశపెట్టింది. ఇందులో శ్రీకాకుళం, విజయనగరం, నెల్లూరు జిల్లాల్లో వేరుశనగను చేర్చారు. ‘అనంత’లో మాత్రం ఎత్తేశారు. రైతులపై మీకు అభిమానమే ఉంటే, వారికి మేలు చేయాలని సంకల్పమే ఉంటే ‘అనంత’ వేరుశనగను ఫసల్‌బీమాలో ఎందుకు పెట్టించలేదు? కనగానపల్లి మండలం దాదులూరు దగ్గర గోరుచిక్కుడు ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేస్తామని తొలి వ్యవసాయ బడ్జెట్లో ప్రకటించారు. ఇప్పుడు దాని ప్రస్తావనే లేదు. గుజరాత్‌లోని జునాఘడ్ వేరుశనగ పరిశోధన సంస్థకు అనుబంధంగా ఎన్పీ కుంటలో ప్రాంతీయ పరిశోధన కేంద్రం, బుక్కరాయసముద్రంలో నూనె గింజల పరిశోధన కేంద్రం ఏర్పాటు చేస్తామన్నారు. రూ. వెయ్యి కోట్లతో అనంతను హార్టికల్చర్హబ్గా మారుస్తామన్నారు. ఇవేవీ ఆచరణకు నోచుకోలేదు. ఎయిమ్స్ అనుబంధ కేంద్రం ఏర్పాటు చేస్తామని ఊరించి.. చివరకు గుంటూరుకు తరలించారు. మీ రెండేళ్ల పాలన ఎలా సాగిందో! రెండు ఎంపీ, 12 ఎమ్మెల్యే సీట్లు గెలిపించిన ‘అనంత’ ప్రజలకు ఎలాంటి మేలు చేశారో మీరు ఏరోజైనా ఆత్మపరిశీలన చేసుకున్నారా?! సంపూర్ణ రుణమాఫీ చేయనందున రెండేళ్లలో 154మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. వీరి కుటుంబాలకు ఇప్పటి వరకూ పూర్తిస్థాయిలో పరిహారం ఇవ్వలేదు. 24 మంది చేనేత కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారు. వీరి కుటుంబాల పరిస్థితి అత్యంత దయనీయంగా ఉంది. డ్వాక్రా రుణాలు మాఫీ చేయనందుకు ఐదు వేలకుపైగా గ్రూపులు డిఫాల్టయ్యాయి. ఈ రెండేళ్లలో ఒక్క ఉద్యోగమైనా భర్తీ చేశారా? ఏ ఒక్కరికైనా నిరుద్యోగ భృతి ఇచ్చారా? అర్హత ఉన్నా పింఛన్లు తొలగించారు. రెండేళ్లలో ఏ ఒక్కరికీ ఇళ్లు నిర్మించలేదు. ఇంటి స్థలమూ ఇచ్చిన దాఖలాలు లేవు. ఒక్క మాటలో చెప్పాలంటే రెండేళ్లలో మీ పార్టీనేతలు మాత్రమే ఆర్థికంగా బలపడ్డారు తప్ప, ఏ ఒక్క సామాన్యునికీ మేలు జరగలేదు. ఇప్పటికీ బెంగళూరు, కేరళ, తమిళనాడులో వలసెళ్లిన రైతులు, కూలీలు ఉన్నారు. ఇప్పటికైనా మీరు రైతులు, పేదల కష్టాలు చూడండి. నిజంగా రెండేళ్లలో ఏం చేశారో సమీక్షించండి. ‘అనంత’ను సింగపూర్ చేయాల్సిన పనిలేదు. తాగు, సాగునీరు ఇవ్వండి చాలు. వలసలు పోకుండా బతికేందుకు పని కల్పించండి. పిల్లలకు మంచి చదువు, సామాన్యులకు వైద్యం అందించండి. మా వినతులు ఆలకించి, సానుకూలంగా స్పందిస్తారని ఆశిస్తూ.. – ‘అనంత’ ప్రజలు -
నేడు సీఎం పర్యటన
అనంతపురం అర్బన్ : ముఖ్యమంత్రి చంద్రబాబు శనివారం జిల్లా పర్యటనకు వస్తున్నారు. ధర్మవరం, బుక్కరాయముద్రంలో జరిగే కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆయన ప్రత్యేక విమానంలో ఉదయం 11.15 గంటలకు పుట్టపర్తి విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాప్టర్లో ధర్మవరం చేరుకుంటారు. అక్కడ నిర్మించిన ఎన్టీఆర్ రైల్వే ఓవర్ బ్రిడ్జిని ప్రారంభిస్తారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల కూడలిలోని మాజీ రాష్ట్రపతి దివంగత అబ్దుల్ కలాం విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పిస్తారు. వనం– మనం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటుతారు. తర్వాత ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగిస్తారు. మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రెండు వరకు ఆర్అండ్బీ అతిథిగృహంలో విశ్రాంతి తీసుకుంటారు. అక్కడి నుంచి బుక్కరాయసముద్రం చేరుకుని గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని ప్రారంభిస్తారు. కస్తూరిబా విద్యాలయం సమీపంలో రైతు ఉత్పత్తిదారుల సంఘాల సమావేశంలో పాల్గొంటారు. ఆ సంఘాలకు మినీ ట్రాక్టర్లను అందజేస్తారు. సాయంత్రం ఐదు గంటలకు అక్కడి నుంచి పుట్టపర్తికి చేరుకుని ప్రత్యేక విమానంలో కోయంబత్తూరు వెళతారు. -
6న సీఎం పర్యటన
అనంతపురం అర్బన్ : ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ నెల ఆరున జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 10.45 గంటలకు పుట్టపర్తి విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి 10.50కి హెలికాప్టర్లో ధర్మవరం చేరుకుని రైల్వే ఓవర్ బ్రిడ్జిని ప్రారంభిస్తారు. స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో బహిరంగ సభలో పాల్గొంటారు. అక్కడి నుంచి మధ్యాహ్నం 2.35 గంటలకు బుక్కరాయసముద్రం చేరుకుని.. గ్రామ పంచాయతీ భవనం ప్రారంభిస్తారు. తర్వాత సమీపంలోని కేజీబీవీలో రైతు ఉత్పత్తిదారుల సంఘం సమావేశంలో పాల్గొంటారు. సాయంత్రం ఐదు గంటలకు తిరిగి వెళతారు. -
సీఎం పర్యటన ఏర్పాట్లపై సమావేశం
అనంతపురం అగ్రికల్చర్: ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ నెల 6న జిల్లాకు రానున్న నేపథ్యంలో పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లపై వ్యవసాయ, అనుబంధ శాఖల అధికారులు కసరత్తు చేస్తున్నారు. మంగళవారం సాయంత్రం ఏపీఎంఐపీ కార్యాలయంలో ఆ శాఖ పీడీ ఎం.వెంకటేశ్వర్లు, ఏపీడీ ఆర్.విజయశంకరరెడ్డి, వ్యవసాయశాఖ జేడీ పీవీ శ్రీరామమూర్తి, ఉద్యానశాఖ డీడీ బీఎస్ సుబ్బరాయుడు, ఏడీ–1 సీహెచ్ శివసత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. 6వ తేదీ మధ్యాహ్నం బుక్కరాయసముద్రం మండల శివారు ప్రాంతంలో రైతు ఉత్పత్తిదారుల సంఘాల (ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్స్– ఎఫ్‌పీవో) సదస్సు నిర్వహణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చించారు. -
సీఎం పర్యటనకు పటిష్టమైన ఏర్పాట్లు
అనంతపురం అగ్రికల్చర్: సీఎం చంద్రబాబు ఈనెల 6న ధర్మవరం, బుక్కరాయసముద్రం మండలాల్లో పర్యటిస్తున్నందున అందుకు అవసరమైన ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని కలెక్టర్ శశిధర్ ఆదేశించారు. ఆదివారం రెవెన్యూభవన్‌లో కలెక్టర్ జేసీ–1 బి.లక్ష్మీకాంతం, జేసీ–2 ఖాజామొహిద్దీన్, ట్రైనీ కలెక్టర్ డాక్టర్ వినోద్‌కుమార్, డీఆర్ఓ హేమసాగర్‌తో కలిసి సీఎం పర్యటన ఏర్పాట్లపై అన్ని ప్రభుత్వ శాఖల అధికారులతో సమీక్షించారు. ధర్మవరంలో చేనేత కార్మికుల రుణమాఫీకి సంబంధించి రాష్ట్ర స్థాయి సదస్సుతో పాటు రైల్వే ఓవర్‌బ్రిడ్జి ప్రారంభోత్సవం ఉంటుందన్నారు. అలాగే బుక్కరాయసముద్రంలో రైతు ఉత్పత్తిదారుల సంఘాల (ఎఫ్‌పీఓ) రాష్ట్ర స్థాయి సదస్సు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ధర్మవరం పర్యటన ఏర్పాట్ల పర్యవేక్షణ జెడ్పీ సీఈఓ రామచంద్ర, పట్టుశాఖ జేడీ అరుణకుమారి, అలాగే బుక్కరాయసముద్రం ఏర్పాట్లు జేసీ–2 ఖాజా మొహిద్దీన్ పర్యవేక్షిస్తారని తెలిపారు. ఎక్కడా ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. విద్యుత్, రహదారులు, పరిశుభ్రత, అంబులెన్సులు, ఫైరింజన్లు తదితర వాటిపై దృష్టి సారించాలని ఆదేశించారు. కళాజాత, సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాట్లు చేయాలన్నారు. సమావేశంలో డీఆర్డీఏ పీడీ ఎం.వెంకటేశ్వర్లు, డ్వామా పీడీ ఎ.నాగభూషణం, ఉద్యానశాఖ డీడీ బీఎస్ సుబ్బరాయుడు, ట్రాన్స్‌కో ఎస్ఈ ఆర్ఎన్ ప్రసాదరెడ్డి, డీఎంహెచ్ఓ డాక్టర్ వెంకటరమణ, వ్యవసాయశాఖ డీడీఏ జయచంద్ర పాల్గొన్నారు. -
ఆయనొస్తున్నారని..
► సీఎం పర్యటన పేరుతో నిధుల పందేరానికి రంగం సిద్ధం ► బాగా ఉన్న రోడ్డుపైనే మళ్లీ నిర్మాణం ► శిల్పారామంలో రూ.15.50 లక్షలతో ప్రహరీ ► రూ.90 లక్షల పనులకు రంగం సిద్ధం ► కార్పొరేషన్ తీరుపై సర్వత్రా విమర్శలు నగర పాలక సంస్థ పాలకవర్గం, అధికారుల వ్యవహారశైలిపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కొన్నిచోట్ల అవసరం లేకున్నా పనులు చేయడం, నిధులు ఇష్టారాజ్యంగా ఖర్చు చేస్తుండటంపై ప్రతిపక్ష పార్టీల నాయకులతో పాటు ప్రజలు మండిపడుతున్నారు. నగర సమగ్రాభివృద్ధిని ఏమాత్రమూ పట్టించుకోకుండా తమకు ‘నగదు’ మిగిలే పనులపైనే దృష్టి పెడుతున్నారన్న ఆరోపణలున్నాయి. అనంతపురం న్యూసిటీ : ముఖ్యమంత్రి పర్యటన పేరుతో మరోసారి నిధుల పందేరానికి నగర పాలక సంస్థ సిద్ధమైంది. గత పర్యటన సందర్భంగా విచ్చలవిడిగా నిధులు ఖర్చు చేసి విమర్శల పాలైన పాలకవర్గం, అధికారులు.. ఈసారి కూడా అదే పంథాలో వెళుతుండడం గమనార్హం. ముఖ్యమంత్రి చంద్రబాబు వచ్చే నెల 6, 15వ తేదీల్లో ‘అనంత’ పర్యటనకు రానున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని పనులు చేపట్టేందుకు నగరపాలక సంస్థ అధికారులు, పాలకవర్గం రంగం సిద్ధం చేశారు. నగరంలో బాగా ఉన్న రోడ్డుపైనే మళ్లీ వేయడానికి ప్రతిపాదనలు సిద్ధం చేయడం వివాదాస్పదమవుతోంది. శిల్పారామంలో రూ.15 లక్షలతో ప్రహరీ ఏర్పాటు చేయనున్నారు. వాస్తవానికి శిల్పారామం నగరపాలక సంస్థ పరిధిలోకి రాదు. అయినా లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టడానికి సిద్ధపడడం విమర్శలకు తావిస్తోంది. రూ 28.10 లక్షలతో అంబేడ్కర్ సర్కిల్ నుంచి ఎస్పీ కార్యాలయం, ఆర్అండ్బీ అతిథి గృహం నుంచి డీఆర్డీఏ కార్యాలయం, డీఆర్డీఏ నుంచి ఉపాధ్యాయ భవన్ వరకు, రూ.20 లక్షలతో పోలీస్ శిక్షణ కళాశాల (పీటీసీ) నుంచి కొవ్వూర్నగర్ నాగులకట్ట వరకు బీటీ రోడ్లు వేసేందుకు టెండర్లను ఆహ్వానించనున్నారు. సైనిక్ భవన్ నుంచి లేపాక్షి ఎంపోరియం షాపింగ్ కాంప్లెక్స్ వరకు రూ.6 లక్షలతో సీసీ రోడ్డు వేయనున్నారు. ఎస్పీ, ఆర్అండ్బీ కార్యాలయం ముందు రోడ్లు బాగా ఉన్నప్పటికీ ఎందుకు టెండర్లు పిలుస్తున్నారో అర్థం కావడం లేదని ప్రజలు అంటున్నారు. పరిధిలో లేకున్నా.. నగరపాలక సంస్థ పరిధిలోకి రాని ప్రాంతాల్లోనూ అభివృద్ధి పనులు చేపట్టాలని పాలకవర్గం, అధికారులు నిర్ణయం తీసుకోవడం దుమారం రేపుతోంది. ప్రజాధనాన్ని నగరపాలక సంస్థ పరిధిలోనే ఖర్చు చేయాలి. అందుకు భిన్నంగా అధికారులు వ్యవహరిస్తున్నారనడానికి శిల్పారామంలో చేపట్టనున్న పనులే నిదర్శనం. శిల్పారామం వద్ద గతంలోనూ నగరపాలక సంస్థ నిధులు రూ.40 లక్షలతో మ్యూజికల్ ఫౌంటేన్ ఏర్పాటు చేశారు. ఈ పనులకు బిల్లు చేయబోమని మొదట్లో అధికారులు చెప్పారు. చివరకు అధికార పార్టీ నేతల ఒత్తిడికి తలొగ్గారు. జేఎన్టీయూ నుంచి ఆడిటోరియం వరకు రూ 9.68 లక్షలతో బీటీ రోడ్డు వేయనున్నారు. ఇది కూడా కార్పొరేషన్ పరిధిలోకి రాదు. కౌన్సిల్ ఆమోదం తీసుకుంటాం : – సురేంద్రబాబు, ఎస్ఈ, నగర పాలక సంస్థ శిల్పారామం నగరపాలక సంస్థ పరిధిలోకి రాదు. ఉన్నతాధికారుల సూచన మేరకు ప్రహరీ ఏర్పాటుకు టెండర్లను పిలవనున్నాం. ఎస్పీ కార్యాలయం, ఆర్అండ్బీ అతిథిగృహం ముందున్న రోడ్లు దెబ్బతిన్నాయి. అందుకే కొత్తగా వేయాలని నిర్ణయించాం. -
ఆగస్టులో సీఎం పర్యటన : కలెక్టర్
అనంతపురం అర్బన్ : ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆగస్టు 6 లేదా 7వ తేదీ జిల్లా పర్యటనకు వచ్చే అవకాశం ఉందని కలెక్టర్ కోనశశిధర్ తెలిపారు. ప్రభుత్వ విప్ యామినీబాల, ఎమ్మెల్సీ శమంతకమణి, ఎస్పీ రాజశేఖర్‌బాబుతో కలిసి బుక్కరాయసముద్రం – నార్పల రోడ్డులోని కేజీబీవీ ముందున్న మైదానాన్ని హెలిప్యాడ్, బహిరంగ సమావేశం ఏర్పాట్ల కోసం కలెక్టర్ బుధవారం పరిశీలించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ రైతు ఉత్పత్తి సంఘాల (ఎఫ్‌పీఓ) రాష్ట్ర స్థాయి ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని అనంతపురం జిల్లాలో నిర్వహించాలని రాష్ట్ర ఉన్నతాధికారుల నుంచి ప్రాథమిక సమాచారం అందిందన్నారు. శింగనమల నియోజకవర్గ పరిధిలోని ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ పరిశోధన కేంద్రం (రేకులకుంట) సమీపంలో ఎఫ్‌పీఓ రాష్ట్ర స్థాయి ప్రారంభోత్సవం నిర్వహిస్తే బాగుంటుందనే నిర్ణయానికి వచ్చినట్టు తెలిపారు. అదేవిధంగా ఓపెన్ ఎయిర్ జైలు ప్రాంతాన్ని, దేవరకొండ సమీపంలో మరో ప్రాంతాన్ని హెలిప్యాడ్, బహిరంగ సమావేశం నిర్వహణకు స్థల పరిశీలన చేశామన్నారు. సీఎం పర్యటన సందర్భంగా ఏర్పాట్లను పకడ్బందీగా చేపట్టాలని ఆర్అండ్బీ ఎస్ఈ మాధవి సుకన్యను ఆదేశించారు. -
త్వరలో జిల్లాకు సీఎం కేసీఆర్
ఈ నెల 11 లేదా12న వచ్చే అవకాశం హరితహారం ప్రారంభించనున్న కేసీఆర్ సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఈ నెలలో జిల్లాకు వచ్చే అవకాశం ఉంది. ఈ నెల 11 లేదా 12న సీఎం పర్యటన ఖరారైనట్లు తెలిసింది. 11న వచ్చినా.. 12న ఖరారైనా రెండు రోజులు జిల్లాలో గడిపే అవకాశం ఉన్నట్లు అత్యంత విశ్వసనీయవర్గాల సమాచారం. తెలంగాణ హరితహారం కార్యక్రమాన్ని ప్రభుత్వం ఈ నెల 11 నుంచి ప్రారంభించనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జిల్లాలో పర్యటించనున్న ఆయన హరితహారం కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. జిల్లాల పునర్విభజనపై బుధవారం హైదరాబాద్ హెచ్ఐసీసీలో టీఆర్ఎస్ఎల్పీ సమావేశం సందర్భంగా సీఎం కేసీఆర్‌ను జిల్లా మంత్రి, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులుకోరినట్లు కూడా తెలిసింది. తెలంగాణ హరితహారం కార్యక్రమాన్ని ప్రారంభించాలన్న ప్రజాప్రతినిధుల కోరిక మేరకు సీఎం జిల్లాకు రానున్నారు. గతేడాది కూడా జూలై 5, 6 తేదీలలో రెండు రోజులపాటు జిల్లాలో పర్యటించిన కేసీఆర్ హరితహారాన్ని ప్రారంభించి, జిల్లా అభివృద్ధిపై సమీక్షించారు. ఈ సారి కూడా ఆయన జిల్లాలో హరితహారం ప్రారంభించేందుకు రానున్నారని తెలిసింది. ఈ మేరకు హరితహారం కింద జిల్లాలో చేపట్టే కార్యక్రమాలపై ముఖ్యమంత్రి కార్యాలయవర్గాలు గురువారం ఆరా తీసినట్లు సమాచారం. రెండు, మూడు రోజుల్లో సీఎం కె. చంద్రశేఖర్‌రావు పర్యటనకు సంబంధించిన పక్కా షెడ్యూల్ ఖరారు కానుంది. -
సీఎం పర్యటనపై అధికారులతో జేసీ సమీక్ష
ఏలూరు (మెట్రో) : రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న కాపు రుణమేళా సదస్సుకు పెద్ద సంఖ్యలో వాహనాలు రానున్నందున ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని జాయింట్ కలెక్టర్ పి.కోటేశ్వరరావు పోలీస్ అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన సందర్భంగా మంగళవారం స్థానిక ఇండోర్ స్టేడియంలో పోలీస్ ఇంటిల్‌జెన్సీ స్పెషల్ బ్రాంచి, డీఎస్పీ, ఇతర జిల్లా అధికారులతో ఆయన ఏర్పాట్లను పరిశీలించారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి వెయ్యి బస్సుల్లో కాపులు రుణమేళాకు హాజరవుతున్నట్టు సమాచారం అందిందని, వారికి ఇబ్బందులు కలగకుండా చూడాలని జేసీ కోరారు. సభకు వచ్చే వాహనాలకు పోలీస్ పరేడ్ గ్రౌండ్, కేపీడీటీ కాలేజ్, అశోక్‌నగర్, మినీ బైపాస్ తదితర ప్రాంతాల్లో పార్కింగ్ కేటాయించాలన్నారు. సీఆర్ రెడ్డి కళాశాల గ్రౌండ్స్‌లో ప్రత్యేక హెలిప్యాడ్‌ను ఏర్పాటు చేస్తున్నామని 25న ఉదయం హెలికాఫ్టర్‌లో ఏలూరు చేరుకుంటారన్నారు. అదనపు జేసీ షరీఫ్, ఆర్అండ్బీ ఎస్ఈ శ్రీమన్నారాయణ, డీపీవో ఆర్వీ సూర్యనారాయణ, డీఎస్పీ జి.వెంకటేశ్వరరావు, ఆర్డీవో నంబూరి తేజ్‌భరత్ పాల్గొన్నారు. -
చంద్రబాబుది ‘టైర్రర్’ పాలన
ఫలితంలేని దావోస్ పర్యటన ఎందుకు బాబూ: వాసిరెడ్డి పద్మ సాక్షి, హైదరాబాద్: ప్రజలకు మద్దతుగా నిలుస్తూ.. ప్రభుత్వ దురాగతాలను అడ్డుకుంటున్న ప్రతిపక్ష ప్రజా ప్రతినిధులపై కేసులు పెట్టి అరెస్టులు చేయడం దారుణమని, రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఒక ‘టై’ పాలనను సాగిస్తున్నారని వైఎస్సార్సీపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ సోమవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ.. ప్రజా సమస్యలపై ఆందోళన చేయడమే నేరమన్నట్లుగా టీడీపీ ప్రభుత్వం వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు. నరసరావుపేట నియోజకవర్గంలోని రొంపిచర్లలో రైతులకు మద్దతుగా నిలిచి నిరసన తెలిపిన స్థానిక వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిపై కేసులు పెట్టి అరెస్టులు చేశారని ఆమె మండిపడ్డారు. తిరుపతి విమానాశ్రయంలో ప్రయాణీకుల తరఫున మాట్లాడినందుకు అక్కడి మేనేజర్‌తో ఫిర్యాదు చేయించి తమ ఎంపీ మిథున్‌రెడ్డిని అరెస్టు చేశారని ఆమె ధ్వజమెత్తారు. మిథున్‌రెడ్డి అరెస్టు రాజకీయ కుట్ర అంటూ నిరసన వ్యక్తం చేసిన పలువురు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలను కూడా అరెస్టు చేశారన్నారు. కాల్‌మనీ, సెక్స్ రాకెట్‌పై శాసనసభలో గట్టిగా నిలదీయడానికి ప్రయత్నించిన ఎమ్మెల్యే ఆర్.కె.రోజాను ఏడాది పాటు సస్పెండ్ చేసి టీడీపీ దురాగతానికి పాల్పడిందని పద్మ దుయ్యబట్టారు. బాబుది పిరికితనం.. పరిపాలనలో ఘోర వైఫల్యం చెందిన చంద్రబాబును ప్రశ్నించిన వారిపై కేసులు పెడుతున్నారని, ఓ రకంగా అది ఆయన పిరికితనానికి అద్దం పడుతోందని ఆమె అన్నారు. తన పాలనను ప్రశ్నిస్తున్నారనే భయంతోనే పెట్టుబడులు తెస్తామనే పేరుతో దావోస్ పర్యటనకు పరిగెత్తారన్నారు. గతంలో కూడా పలు మార్లు అక్కడకు వెళ్లిన చంద్రబాబు సాధించిందేమీ లేదన్నారు. -
వైఎస్ఆర్ జిల్లాలో పోలీసుల ఓవరాక్షన్
కడప: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శనివారం వైఎస్ఆర్ జిల్లాలో పర్యటించనున్నారు. ఇడుపలపాయ ట్రిపుల్ ఐటీ స్నాతకోత్సవంలో ఆయన పాల్గొంటారు. అయితే సీఎం పర్యటన సందర్భంగా స్థానిక పోలీసులు ఓవరాక్షన్ ప్రదర్శిస్తున్నారు. ముఖ్యమంత్రి పర్యటనను అడ్డుకుంటారంటూ సీపీఐ, సీపీఎం నేతలను ముందుగా అరెస్టు చేశారు. అదే విధంగా వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే అంజద్ బాషా, మేయర్ సురేష్ బాబును హౌజ్ అరెస్టు చేశారు. దీంతో వైఎస్ఆర్ సీపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. అదుపులో 26 మంది వైఎస్సార్ జిల్లాలోని అలంఖాన్‌పల్లి గ్రామంలో జరగనున్న జన్మభూమి బహిరంగ సభలో పాల్గొనడానికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రానున్న నేపథ్యంలో ఐదు పోలీస్స్టేషన్ల పరిధిలో వైఎస్సార్సీపీ, కాంగ్రెస్, సీపీఎం, సీపీఐ పార్టీలకు చెందిన 26 మంది నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. -
వైఎస్ఆర్ జిల్లాలో పోలీసుల ఓవరాక్షన్
-
సోమిరెడ్డికి అస్వస్థత
నెల్లూరు: టీడీపీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి అస్వస్థతకు గురయ్యారు. శనివారం మధ్యాహ్నం సీఎం చంద్రబాబు నెల్లూరు జిల్లాలో వరద ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. సీఎంతో పాటు పర్యటనలో పాల్గొన్న సోమిరెడ్డి ఆకస్మాత్తుగా అనారోగ్యానికి గురయ్యారు. ఆయనకు ఛాతిలో నొప్పి రావడంతో వెంటనే నెల్లూరులోని ఆస్పత్రికి తరలించారు. ఆయన్ను పరీక్షించిన వైద్యులు ఎలాంటి అపాయం లేదని తెలిపారు. సోమిరెడ్డి ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. -
‘పట్టిసీమ’ పూర్తికాకున్నా సీఎం పర్యటన ఖరారు
-
అయిననూ.. వచ్చి పోవలె!
- ‘పట్టిసీమ’ పూర్తికాకున్నా సీఎం పర్యటన ఖరారు - పంద్రాగస్టు నాడు నీళ్లివ్వకుండానే ప్రజలకు అంకితం - ఏలూరులో జెండా పండగకు అంతరాయం! సాక్షి ప్రతినిధి, ఏలూరు: పట్టిసీమ ఎత్తిపోతల పథకాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ పంద్రాగస్టు నాడే వినియోగంలోకి తీసుకురావాలని మొండిపట్టుపట్టిన ప్రభుత్వం చివరకు వెనక్కి తగ్గింది. పనులు కొలిక్కిరాని నేపథ్యంలో ఆ రోజున నీటిని విడుదల చేయడం కాకుండా.. కనీసం ఆ పథకాన్ని ప్రజలకు అంకితం చేయాలని నిర్ణయించింది. ఇందుకోసం ఆగస్టు 15న ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబునాయుడు పట్టిసీమ రానున్నారు. శనివారం విశాఖపట్నంలో స్వాతంత్య్ర దినోత్సవ రాష్ట్రస్థాయి వేడుకలు ముగించుకుని మధ్యాహ్నం 2.30 గంటలకు చంద్రబాబు పట్టిసీమ చేరుకుంటారు. అక్కడ వివిధ కార్యక్రమాల్లో పాల్గొని సాయంత్రం 5గంటలకు పట్టిసీమ నుంచే హెలికాప్టర్లో తిరిగి వెళతారు. ఈ మేరకు షెడ్యూల్ ఖరారైంది. కాగా, పట్టిసీమ వద్ద పంపులు బిగించే పనులు పూర్తి కాకున్నా.. తాడిపూడి కాలువను అనుసంధానం చేసే పనులు కొలిక్కి రాకున్నా.. పోలవరం కుడి కాలువ పనులు ఇంకా కొనసాగుతూనే ఉన్నా.. పట్టిసీమ ఎత్తిపోతల పథకాన్నిజాతికి అంకితం చేయడం వల్ల ప్రయోజనం ఏమిటనే చర్చ అధికారవర్గాల్లోనూ మొదలైంది. కాంక్రీటు పనులే కొలిక్కి రాలేదు వాస్తవానికి ఆగస్టు 15 నాటికి పట్టిసీమ పథకం వద్ద కాంక్రీటు పనులు కూడా పూర్తయ్యే పరిస్థితులు లేవు. రూ.1,300 కోట్ల వ్యయంతో ఎత్తిపోతలను నిర్మించి 24 పంపులు, 24 మోటార్లతో 12 పైపులైన్ల ద్వారా 8,500 క్యూసెక్కుల నీటిని కృష్ణాకు తరలించాలనేది ప్రభుత్వ లక్ష్యం. కాగా, పంద్రాగస్టు నాటికి కనీసం 8 పంపులతోనైనా నీటిని తరలిస్తామని సీఎం రెండు నెలల కిందట ప్రకటించారు. పనులు జరగకపోవడంతో కనీసం నాలుగు పంపుల ద్వారా అయినా నీరు పంపాలని ఇటీవల నిర్ణయించారు. ఆ తరువాత 2 పంపులు.. చివరకు ఒక పంపుతోనైనా నీరు తరలించేందుకు విశ్వప్రయత్నం చేశారు. ప్రస్తుతం ఒక మోటారు, ఒక పంపు ఏర్పాటుకు సంబంధించి కాంక్రీటు పనులు కూడా కాలేదు. వీటిని పూర్తి చేయడానికి కనీసం వారం రోజులు పట్టే అవకాశం ఉంది. దీనికితోడు ఇప్పటివరకు మోటార్లు, పంపులు కూడా రాలేదు. అలాగే విద్యుత్ కనెక్షన్లకు సంబంధించి తాత్కాలిక పనులూ కొలిక్కి రాలేదు. ఆ పనులు పెండింగ్‌లోనే.. పోలవరం కుడికాలువ నిర్మాణానికి సంబంధించి ఆరు ప్యాకేజీల్లో 39.22 లక్షల క్యూబిక్ మీటర్ల ఎర్త్‌వర్క్ చేయాల్సి ఉండగా, ఇప్పటివరకు 21.91 లక్షల క్యూబిక్ మీటర్ల పనులు జరిగాయి. ఇంకా 17.31 లక్షల క్యూబిక్ మీటర్ల పనులు జరగాల్సి ఉంది. రోజుకు సగటున 2.50 నుండి 3 లక్షల క్యూబిక్ మీటర్ల పనులు జరుగుతున్నాయి. ఈ లెక్కన కాలువ తవ్వకం పనులు పూర్తయ్యేందుకు ఇంకా వారం రోజులు పడుతుంది. దీనికి తోడు కాలువల లైనింగ్ పనులు మరో మూడు రోజులు పట్టే అవకాశం ఉంది. పోనీ తాత్కాలికంగా పట్టిసీమను పక్కనపెట్టి తాడిపూడి కాలువ ద్వారా పోలవరం కుడి కాలువకు నీళ్లు మళ్లించాలని భావించినా అది కూడా సాధ్యమయ్యేలా కనిపించలేదు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో ప్రభుత్వం వెనక్కి తగ్గింది. ముందునుంచి ఆగస్టు 15 నాటికి పథకం ప్రారంభిస్తామని విపరీతమైన ప్రచారం చేసిన నేపథ్యంలో చివరకు సీఎం వచ్చి జాతికి అంకితం చేసే కార్యక్రమాన్నైనా చేపట్టాలని నిర్ణయించారు. పంద్రాగస్టు వేడుకలకు అంతరాయం! సీఎం చంద్రబాబు రాకతో జిల్లా కేంద్రం ఏలూరులో శనివారం పంద్రాగస్టు వేడుకలు హడావుడిగా చేయాల్సిన పరిస్థితి నెలకొంది. అన్ని శాఖల అధికారులు, పెద్ద సంఖ్యలో విద్యార్థులు, ప్రజలు పాల్గొనే వేడుకలు ఉదయం 9గంటలకు మొదలుపెట్టినా మధ్యాహ్నం 12.30 వరకు కొనసాగుతాయి. శకటాల ప్రదర్శన, అధికారులు, ఉద్యోగులకు ప్రశంసా పత్రాల పంపిణీ జరగాలి. కానీ.. మధ్యాహ్నం 2.30 గంట లకు సీఎం పట్టిసీమ రానున్న నేపథ్యంలో కలెక్టర్ కె. భాస్కర్, డీఐజీ హరికుమార్, ఎస్పీ భాస్కర్ భూషణ్ సహా అధికారులంతా హడావుడిగా పట్టిసీమ చేరుకోవాల్సి ఉంటుంది. పోనీ.. ఏలూరులో వేడుకలను కుదించినా.. ఉన్నతాధికారులు ఎంతవేగంగా అక్కడికి చేరుకున్నా మిగిలిన ఉద్యోగులు జెండా పండగ పూర్తి చేసుకుని అక్కడకు రావడం ఇబ్బందికరంగా పరిణమించనుంది. ఇక పోలీసుశాఖాపరంగా కూడా ఆ రోజు సీఎం పర్యటనకు బందోబస్తు ఏర్పాటుచేయడం తలకు మించిన భారంగా మారనుంది. -
పచ్చ ప్రలోభాలు
సాక్షి ప్రతినిధి, కర్నూలు: ఎమ్మెల్సీ ఎన్నికల్లో బలం లేకపోయినా నిలబడి పరువు నిలుపుకునేందుకు అధికార పార్టీ నానా యాతన పడుతోంది. ఓటుకు నోట్లు ఇస్తూ ప్రలోభ పెట్టడంతో పాటు విహారయాత్రల పేరిట క్యాంపు రాజకీయాలకు తెరతీసింది. తమకు పనులున్నాయని పలువురు ఎంపీటీసీ సభ్యులు పేర్కొంటున్నా...క్యాంపునకు రావాల్సిందేనని ఒత్తిళ్లు చే స్తోంది. ఇంతటితో ఆగకుండా..ఎన్నికల రోజు ముఖ్యమంత్రి పర్యటన జిల్లాలో జరిగే విధంగా ప్రణాళిక రచించడం విమర్శలకు తావిస్తోంది. మొత్తం మీద బలం లేకపోయినా ఎన్నికల్లో నిలబడి...గెలిచేందుకుఅధికార పార్టీ చేస్తున్న ఫీట్లు కాస్తా సర్కస్ తీరును కనబరుస్తోందన్న అభిప్రాయం జిల్లాలో వ్యక్తమవుతోంది. ఓటుకు నోటు ఇవ్వడం ఫలితం లేదని భావించిన అధికార పార్టీ.. విహారయాత్రల పేరుతో ఫ్యామిలీకి టూర్ ప్యాకేజీని ప్రకటించింది. ఈ టూర్ ప్యాకేజీలకు పెద్దగా ఆసక్తి కనబర్చకపోవడంతో ఎలాగైనా క్యాంపుకు తరలించేందుకు భారీ ఏర్పాట్లను చేసింది. పనులున్నాయి.. మహాప్రభో మేం రాలేమని పలువురు ఎంపీటీసీలు తేల్చిచెప్పినప్పటికీ టీడీపీ నేతలు మాత్రం వదలటం లేదు. కచ్చితంగా క్యాంపుకు రావాల్సిందేనని ఒత్తిళ్లు తెస్తున్నారు. ఇంటి వద్దకు వాహనాన్ని తీసుకెళ్లి ఇంట్లో వారందరినీ తీసుకెళ్లే ప్రయత్నాలు చేశారు. తమ పిల్లలకు చదువులున్నాయి.. రాలేమని అన్నప్పటికీ పిల్లాజల్లాలతో కలిపి క్యాంపునకు తరలించే ప్రయత్నం చేశారు. తమతో పాటు రాకపోతే తమకు ఓటు వేయరనే ఆందోళన, భయంతోనే అధికార పార్టీ నేతలు ఈ విధంగా వ్యవహరిస్తున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. తారాస్థాయికి ప్రలోభాలు.. బలం లేకపోయినప్పటికీ బరిలోకి నిలిచి గెలిచేందుకు నానాకష్టాలు పడుతున్న అధికార పార్టీ...ప్రలోభాల పర్వాన్ని తారాస్థాయికి తీసుకెళ్లింది. ఒకవైపు ఈ నెల 3వ తేదీన ఎమ్మెల్సీ ఎన్నికలకు ఓటింగ్ జరుగుతోంది. ఇదే సందర్భంలో జిల్లాలో మల్యాల ఎత్తిపోతల పథకాన్ని పరిశీలించే పేరిట ముఖ్యమంత్రి పర్యటనను అధికార పార్టీ ఖరారు చేసింది. తద్వారా జిల్లాలో జరుగుతున్న ఎన్నికలపై ప్రభావం చూపే ప్రయత్నం చేసిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. టీడీపీ అధిష్టానానికి ఫిర్యాదు.. ఒకరిద్దరు ఎమ్మెల్యేలు తనకు సహకరించడం లేదని కూడా అధికార పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి శిల్పా చక్రపాణి రెడ్డి ఆందోళనలో ఉన్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో వీరిపై అధిష్టానానికి ఫిర్యాదు చేసినట్టు కూడా తెలుస్తోంది. తమ నియోజకవర్గాల్లో ఒకరిద్దరిని కూడా తమవైపు తిప్పుకోలేకపోయారని ఆయన ఈ ఫిర్యాదులో పేర్కొన్నట్టు సమాచారం. ఒకవైపు సొంత పార్టీ నేతల నుంచి మద్దతు లేదని కలవరపడుతున్న సదరు నేత.. సొంత నియోజకవర్గంలో కూడా ఓడిపోయిన తర్వాత చేసిన వ్యాఖ్యలు కాస్తా ఆయన్ను మరింత ఆందోళనకు గురిచేస్తోందన్న చర్చ నడుస్తోంది. శ్రీశైలం నియోజకవర్గ ప్రజలు, నేతలు తనను మోసం చేశారంటూ.. ఓడిపోయిన తర్వాత ఆయన దూషించారన్న వార్త కూడా జిల్లాల్లో గుప్పుమంటోంది. ఈ వ్యాఖ్యలతో మనస్తాపానికి గురైన పలువురు ఓటర్లు ఇప్పుడు తమ ప్రతాపం చూయించేందుకు సిద్ధమవుతున్నారని కూడా తెలుస్తోంది. మొత్తం మీద బలం లేకపోయినా నిలిచి భంగపాటుకు గురి అవుతామనే ఆందోళన అధికార పార్టీ నేతల్లో కనిపిస్తోంది. -
మొక్కవోని దీక్షతో..
ఫ్లోరైడ్ మహమ్మారిని పారదోలేందుకు సీఎం కంకణం చౌటుప్పల్/మర్రిగూడ : ఓ వైపు భారీ వర్షం.. ఈదుగు గాలులు.. మరోవైపు వర్షంలో హెలికాప్టర్లో రాలేని పరి స్థితి.. 2గంటలు ఆలస్యమైనా రోడ్డు మార్గాన వచ్చి డిండి ఎత్తిపోతల పథకానికి మర్రిగూడ మండలం శివన్నగూడెం శివారులోని చెర్లగూడెంలో ఏర్పాటుచేసిన పైలాన్‌ను ఆవి ష్కరించారు. మునుగోడు, దేవరకొండ నియోజకవర్గాల్లోని ఫ్లోరైడ్‌ను తరిమికొడతానని, బీడు భూములను సస్యశ్యామలం చేసేందుకు సాగు, తాగుజలాలను అందిస్తానని కం కణం కట్టుకున్న సీఎం కె.చంద్రశేఖర్‌రావు మొక్కవోని దీక్షతో కార్యాచరణ ప్రకటించారు. రిజర్వాయర్ నిర్మాణం తో నిర్వాసుతులయ్యే రైతులకు 5రెట్లు పెంచి పరిహారం ఇస్తామంటూ భరోసానిచ్చారు. నిర్వాసిత కు టుబంలో ఒకరికి ఉద్యోగాన్ని ఇస్తామని ప్రకటించారు. ఇద్దరు చదువుకున్నోళ్లు ఉంటే రెండు ఉద్యోగాలు ఇస్తానని ప్రకటించారు. రైతులెవరూ ప్రాజెక్టు పనులకు అడ్డుపడొద్దని విజ్ఞప్తి చేశారు. నెల రోజుల్లో పనులను ప్రారంభిస్తామని చెప్పారు. కూలిన టెంట్లు.. 2కి.మీ.ల మేరట్రాఫిక్జాం.. పైలాన్ ఆవిష్కరణ అనంతరం 3గంటలకు బహిరంగ సభ జరగాల్సి ఉంది. అంతకుముందు నుంచే వర్షం ప్రారంభమైంది. ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం పడడంతో బహిరంగ సభ కోసం ఏర్పాటు చేసిన టెంట్లు, శామియాలు నెలకూలాయి. బారీకేడ్లు నేలకొరిగాయి. సభావేదికపై ఉన్న టెంటు కూడా రెండుసార్లు పడిపోయింది. స్టేజీ మాత్రమే మిగిలింది. ఓ పోలీస్ కానిస్టేబుల్‌కు గాయాలయ్యాయి. దాదాపు గంటకుపైగా భారీ వర్షం కురిసింది. జనం వర్షంలో తడిసి ముద్దయ్యారు. తడవకుండా ఉండేందుకు నానా ఇబ్బందులుపడ్డారు. ఫ్లెక్సీలను, స్వాగతం తెలుపుతూ ఏర్పాటుచేసిన బ్యానర్లను తీసుకొని రక్షణ కవచాలుగా వాడుకున్నారు. మరికొందరు తాటికొమ్మలను, కుర్చీలను తలపై వర్షానికి అడ్డుగా పెట్టుకున్నారు. బహిరంగ సభ ప్రాంగణమంతా చెల్లాచెదురుగా మారింది. వర్షంలో తడిసి ముద్దయిన జనం, ఇక సీఎం ఏం వస్తారులే అనుకుంటూ వెనుదిరాగారు. మరికొంతమంది మాత్రం వర్షాన్ని సైతం లెక్కచేయకుండా అక్కడే ఉన్నారు. శివన్నగూడ నుంచి బహిరంగ సభ ప్రదేశం 3 కి.మీ.ల దూరం ఉంది. సింగిల్‌రోడ్డు కావడం, వర్షం కురవడంతో, 2కి.మీ.ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. వాహనాలు రోడ్డు దిగలేని పరిస్థితి. పోలీసు వాహనాలు సైతం రోడ్డు దిగి మట్టిలో కూరుకుపోయాయి. పోలీసులు వర్షంలో తడుస్తూ, గంటపాటు శ్రమించి ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. సభకు ముందే వచ్చి పంటపొలాల్లో పార్కింగ్ చేసిన పలు వాహనాలు వర్షానికి మట్టిలో కూరుకుపోయాయి. వాహనాలను అక్కడే వదిలేసి తిరుగు ప్రయాణమయ్యారు. 2రోజుల వరకు ఈ వాహనాలను తీసుకెళ్లే పరిస్థితి లేదు. 20 నిమిషాల్లో ముగిసిన సీఎం పర్యటన.. డిండి ఎత్తిపోతల పథకం ప్రారంభోత్సవానికి మర్రిగూడ మండలంలో తలపెట్టిన సీఎం పర్యటన వర్షం కారణంగా కేవలం 20నిమిషాల్లోనే ముగిసింది. హైదరాబాద్‌లో సీఎం 2.30గంటలకు బయలుదేరి, 3గంటలకు ఫైలాన్ వద్దకు రావాల్సి ఉంది. వర్షం కారణంగా, రోడ్డు మార్గాన 3.30గంటలకు బయలుదేరారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం, గున్గల్, లోయపల్లి, క్షుదాభక్షపల్లి గ్రామాల మీదుగా 4.45గంటలకు చెర్లగూడెం వద్ద ఏర్పాటు చేసిన ఫైలాన్ వద్దకు చేరుకున్నారు. మంత్రి జగదీశ్‌రెడ్డి, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు స్వాగతం పలికారు. ఆ తర్వాత కేసీఆర్ పైలాన్‌ను ఆవిష్కరించారు. అనంతరం అక్కడ ఉన్న జనాన్ని ఉద్దేశించి 10నిమిషాల పాటు ప్రసంగించారు. తిరిగి 5.05గంటలకు అక్కడినుంచి రోడ్డు మార్గాన్నే హైదరాబాద్‌కు తిరుగుప్రయాణమయ్యారు.ఇలా1.50గంటలపాటు సాగాల్సిన సీఎం పర్యటన వర్షం కారణంగా 20 నిమిషాల్లోనే ముగిసింది. ఏందయ్యా.. తమాషా చేస్తున్నారా.. సీటీలు తర్వాతేద్దాం.. కేసీఆర్ రాగానే జనం ఉత్సాహంతో కేకలు వేశారు. పైలాన్‌ను ఆవిష్కరించిన వెంటనే సభావేదిక పైకి వచ్చారు. రెండు చేతులెత్తి నమస్కరిస్తూ, విజయనాథం చూపుతూ మునుగోడు ప్రజలపై ఉన్న తన ఆప్యాయతను చాటారు. కేసీఆర్ మాట్లాడబోతుండగా, జనం కేకలు వేయడం, ఈలలు వేయడంతో, కేసీఆర్ సుతిమెత్తగా మందలించారు. ‘‘లొల్లి చేయొద్దు, ఇప్పటికే వర్షం ఉన్న సమయాన్ని మింగింది. మీరు లొల్లి చేస్తే, ఏదో మాట్లాడాలనుకున్న విషయాలు కూడా మాట్లాడలేను. అయినా కొందరు సీటీలు వేయడంతో, ఏందయ్యా తమాషా చేస్తున్నారా, సీటీలు తర్వాతేద్దాం’’ అంటూ, సుతిమెత్తగా చురకలంటించారు. ఆ తర్వాత ప్రసంగాన్ని కొనసాగించారు. తన ప్రసంగంలో టీడీపీ నేతలను తనదైన శైలిలో విమర్శిస్తూ జనాన్ని నవ్వించారు. కార్యక్రమంలో రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి టి.హరీష్‌రావు, విద్యుత్‌శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి, ప్రభుత్వ విప్ గొంగిడి సునిత, జిల్లా పరిషత్ చైర్మన్ బాలునాయక్, భువనగిరి ఎంపీ బూర నర్సయ్యగౌడ్, ఎమ్మెల్సీలు నేతి విద్యాసాగర్, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, పూల రవీందర్, ఎమ్మెల్యేలు కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, రవీంద్రనాయక్, గాదరి కిశోర్, వేముల వీరేశం, పైళ్ల శేఖర్‌రెడ్డి, కలెక్టర్ సత్యనారాయణరెడ్డి, విద్యాసాగర్‌రావు, మేరెడ్డి శ్యాంప్రసాద్‌రెడ్డి, జిల్లా పార్టీ అధ్యక్షుడు బండా నరేందర్‌రెడ్డి, నోముల నర్సింహయ్య, చింతల వెంకటేశ్వర్‌రెడ్డి, డోకూరి శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
సీఎం రాకకోసం..
ఏర్పాట్లు పరిశీలించిన కలెక్టర్, ఎమ్మెల్యే ఆల నేడు సీఎం పర్యటన తేదీ ఖరారయ్యే అవకాశం భూత్పూర్ : పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనుల ప్రారంభానికి త్వరలో సీఎం కె.చంద్ర శేఖర్‌రావు జిల్లాకు రానుండటంతో ఏర్పాట్లపై జిల్లా ఉన్నతాధికారులు ప్రత్యేకదృష్టి సారించారు. బుధవారం మండలకేంద్రంలో కలెక్టర్ టీకే శ్రీదేవి స్థానిక ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డితో కలిసి పర్యటించారు. తహశీల్దార్ కార్యాలయం వెనకభాగంలో సీఎం సభా ప్రాంగణాన్ని ఏర్పాటుచేసే స్థలాన్ని పరిశీలించారు. అనంతరం సీఎం పర్యటన రూట్‌మ్యాప్‌లపై స్థానిక అధికారులతో చర్చించారు. అంతేకాకుండా మండల పరిధిలోని కర్వెన వద్ద నిర్మించనున్న రిజర్వాయర్ పనుల శంకుస్థాపనకు మండల కేంద్రంలో పైలాన్ నిర్మాణంపై చర్చించారు. సభాప్రాంగణం, పైలాన్ ఏర్పాట్లపై వెంటనే ఇంజనీర్లు స్థలాలను ఎంపికచేసి నిర్మాణ పనులు చేపట్టాలని ఆదేశించారు. అనంతరం హెలిప్యాడ్ ప్రాంగణం, సభ ప్రాంగానికి సీఎం వెళ్లే మార్గాలు గుర్తించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సభాప్రాంగణానికి చుట్టుపక్కల దారులను గుర్తించాలని అధికారులకు సూచించారు. సీఎం పర్యటన సందర్భంగా పటిష్ట బందోబస్తు ఏర్పాటుచేయాలని పోలీసు ఉన్నతాధికారులను కోరారు. కలెక్టర్ వెంట భూసేకరణ ప్రత్యేక కలెక్టర్ వనజాదేవి, మహబూబ్‌నగర్ ఆర్డీఓ హన్మంత్‌రెడ్డి, ఆర్అండ్బీ ఈఈ గిరిష్‌కుమార్, జెడ్పీటీసీ సభ్యుడు చంద్రమౌళి, తహశీల్దార్ పాండు, ఎంపీడీఓ గోపాల్, భూత్పూర్ సర్పంచ్ శోభరత్నం, టీఆర్ఎస్ నాయకులు నారాయణగౌడ్, భూషణ్‌కుమార్, మురళీధర్‌గౌడ్ ఉన్నారు. -
గవర్నర్, సీఎం పర్యటన ఏర్పాట్ల పరిశీలన
30న గవర్నర్, సీఎం ‘గుట్ట’కు రానున్నారని కలెక్టర్ సత్యనారాయణరెడ్డి వెల్లడి ఎస్పీతో కలిసి అధికారులతో సమీక్ష యాదగిరికొండ : యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో చేపట్టనున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించేందుకు గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి కేసీఆర్, చిన్నజీయర్ స్వామిజీలు ఈ నెల 30న రానున్నారని కలెక్టర్ సత్యనారాయణరెడ్డి, ఎస్పీ విక్రమ్‌జీత్ దుగ్గల్ తెలిపారు. గవర్నర్, సీఎం పర్యటన సందర్భంగా ఏర్పాట్లపై సంబంధిత అధికారులతో సమీక్షించేందుకు గాను సోమవారం కలెక్టర్, ఎస్పీలు గుట్టకు వచ్చారు. అనంతరం వివిధ శాఖల అధికారులతో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ సత్యనారాయణరెడ్డి మాట్లాడుతూ 30న ఉదయం 9గంటలకు యాదాద్రిలో చేపట్టే వైటీడీఏ అభివృద్ధి పనులను గవర్నర్, సీఎం ప్రారంభిస్తారని పేర్కొన్నారు. దీంట్లో భాగంగా సీఎం కేసీఆర్ కోసం కొండ కింద హెలిప్యాడ్ కోసం సైదాపురం, మల్లాపురం, సురేంద్రపురి గ్రామాలకు దగ్గరగా ఉన్న కొద్దిపాటి స్థలాలను పరిశీలించారు. అలాగే కొండపైన గల 14 ఎకరాల్లో దేవస్థానం నిర్మాణం జరుగుతుందన్నారు. కొండ కింద నుంచి కొండ పైకి లెసైన్సులు లేని వారు ఆటోలు నడిపితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అలాగే సెక్స్ వర్కర్ల ఉపాధిపై వారిని కౌన్సిలింగ్ చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. రోడ్డు విస్తరణలో భాగంగా ఎవరూ జీవనోపాధి కోల్పోకుండా ఉండేందుకు నిర్వాసితులతో వేర్వేరుగా మాట్లాడి తగిన చర్యలు తీసుకుంటామన్నారు. గుట్ట అభివృద్ధిలో ప్రజలంతా భాగస్వాములు కావాలని కోరారు. గుట్టకు నీటి ఎద్దడి తీవ్రంగా ఉందని, విష్ణు పుష్కరిణికి నీటిని విడుదల చేయాలని ఆలయ ఈఓ గీతారెడ్డి కోరగా వెంటనే కలెక్టర్ స్పందించి 10 లక్షల గ్యాలరీల కృష్ణా వాటర్‌ను విడుదల చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం ఎస్పీ దుగ్గల్ మాట్లాడుతూ గుట్టకు భక్తుల రద్దీ పెరుగుతున్నందున తగిన భద్రత అవసరమన్నారు. రానున్న రోజుల్లో కొండపైన పోలీస్టేషన్, కొండకింద మరో పోలీస్టేషన్, ఒక మహిళా పీఎస్, ట్రాఫిక్ పోలీస్టేషన్, సీసీ కెమెరా గది, కమ్యూనికేషన్ రూం, రెండు చెక్‌పోస్టులు ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. వీటన్నటిని పరిశీలించేందుకు ఒక డీఎస్పీ కార్యాలయం ఏర్పాటు చేయనున్నామని తెలిపారు. అనంతరం కలెక్టర్, ఎస్పీలు విష్ణు పుష్కరిణి, సంగీత భవనం, తదితర పరిసరాలను పరిశీలించారు. ఇటీవల టెస్టింగ్ కోసం ఏర్పాటు చేసిన ఎయిర్ కూలర్ సిస్టంను పరిశీలించి ఈఓ గీతారెడ్డిని అభినందించారు. అలాగే ప్రతిరోజు 40వేల మంది భక్తుల కోసం ప్రత్యేక వసతులైన మంచినీటి ఏర్పాటు , భోజన వసతి, లైటింగ్ సిస్టంను పరిశీలించి చాలా బాగుందని ఆయన అన్నారు.ఈ కార్యక్రమంలో దేవస్థానం చైర్మన్ బి.నరసింహామూర్తి, ఆర్డీఓ మధుసూదన్, డీఎస్పీ మోహన్‌రెడ్డి, ఈఓ గీతారెడ్డి, తహసీల్దారు రామమూర్తి, ఏఈఓ దోర్భల భాస్కర శర్మ, ఆర్అండ్ బీ, ఆర్డబ్ల్యూఎస్ అధికారులు, దేవస్తానం అధికారులు దయాకర్‌రావు, డీఈఈ రామారావు తదితరులు పాల్గొన్నారు. స్వామివారిని దర్శించుకున్న కలెక్టర్, ఎస్పీ అంతకుముందు కలెక్టర్ సత్యనారాయణ రెడ్డి, ఎస్పీ విక్రమ్‌జీత్ దుగ్గల్‌లు స్వామి అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. వీరికి ఆలయ అర్చకులు పూలమాలతో స్వాగతం పలికి పూజల అనంతరం వేద మంత్రాలతో ఆశీర్వచనం చేశారు. ఈ సందర్భంగా దేవస్థానం చైర్మన్ నరసింహామూరి కలెక్టర్‌కు లడ్డూ ప్రసాదాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో అధికారులతోపాటు ప్రధానార్చకులు నల్లందీగళ్ లక్ష్మీ నరసింహాచార్యులు, నరసింహాచార్యులు, ఉప ప్రధానార్చకులు వెంకటాచార్యులు, సురేంద్రాచార్యులు ఉన్నారు. -
సీఎం పర్యటనపై మండిపడుతున్న కమ్యూనిస్టులు
అనంతపురం: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అనంతపురం పర్యటనపై ఆ జిల్లాకు చెందిన కమ్యూనిస్టు పార్టీలు తీవ్రగా వ్యతిరేకిస్తున్నాయి. అనంత కరువు నివారణలో చంద్రబాబు విఫలం అయ్యారని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు. రైతుల ఆత్మహత్యలు పట్టించుకోలేదని జిల్లావ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చారు. చంద్రబాబు పర్యటను నిరసనగా సీపీఎం నేతలు కలెక్టరేట్ ముందు 20 గంటలు ప్రజా జాగరణ చేపట్టనున్నారు. హంద్రీనీవా ప్రాజెక్టు వెంటనే పూర్తి చేయాలన్న డిమాండ్‌తో ఆందోళన తీవ్రతరం చేయాలని సీపీఎం నేతలు డిమాండ్ చేశారు. గుంతకల్లు, రాప్తాడు, ఉరవకొండ నియోజకవర్గాల్లో హంద్రీనీవా కాల్వ గట్టులపై నిద్ర చేపట్టనున్నట్టు వారు తెలిపారు. -
నేడు సీఎం రాక
- ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు - సదాశివనగర్‌లో ‘మిషన్‌కాకతీయ’ ప్రారంభం - అక్కడే కేసీఆర్ బహిరంగ సభ నిర్వహణ - సభాస్థలిని పరిశీలించిన మంత్రి ‘పోచారం’ సదాశివనగర్: ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు గురువారం సదాశివనగర్ మండల కేంద్రానికి రానున్నారు. ఈ నేపథ్యంలో అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ‘కాకతీయ మిషన్’ కార్యక్రమంలో భాగంగా సీఎం ఇక్కడ చెరువు పూడిక తీత పనులను ప్రారంభించనున్నారు. అనంతరం చెరువు వద్ద బహిరంగ సభ ఉంటుంది. హెలీప్యాడ్ వద్ద బారికేడ్లు ఏర్పాట్లు చేశారు. మైదానాన్ని చదును చేశారు. సీఎం పర్యటన స్థలాన్ని వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, కలెక్టర్ రొనాల్డ్‌రోస్, ఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి, ఎమ్మెల్యేలు రవీందర్‌రెడ్డి, హన్మంత్ సింధే, గణేశ్ గుప్తా బుధవారం పరిశీలించారు. సీఎం కాన్వాయి ట్రయల్ రన్ నిర్వహించారు. వారి వెంట జడ్పీటీసీ పడిగెల రాజేశ్వర్‌రావు, ఎంపీపీ బంజ విజయ శివకుమార్, టీఆర్ఎస్ మండల కన్వీనర్ నారెడ్డి లింగారెడ్డి, వైస్ ఎంపీపీ రూపేందర్ రెడ్డి, మాజీ సర్పంచ్ కమలాకర్‌రావు, దశ రథ్రెడ్డి, బాల్‌రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, నర్సింహారెడ్డి, లడ్డు శ్రీను, రాజిరెడ్డి ఉన్నారు. సీఎం పర్యటన ఇలా - ప్రగతిన గర్: సీఎం హైదరాబాద్ బేగంపేట్ ఎయిర్పోర్ట్ నుంచి హెలీక్యాప్టర్ ద్వారా ఉదయం 9.55కు బయలుదేరుతారు. 10.30కు సదాశివన గర్ మండల కేంద్రానికి చేరుకుంటారు. - ‘మిషన్ కాకాతీయ’ పనులను ప్రారంభిస్తారు. అక్కడి నుంచి మధ్యాహ్నం 12 గంటలకు బయలుదేరి 12.20కి మెదక్‌లోని నాచారం లక్ష్మీనరసింహస్వామి గుట్టకు చేరుకుని స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారు. 4.40కి మెదక్‌నుంచి బయలుదేరి 5 గంటలకు బేగంపేట్ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుంటారు. -
మొదటి వారంలో జిల్లాకు సీఎం..!
నిర్మల్, జైపూర్లలో పర్యటన సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు మార్చి మొదటి వారంలో జిల్లాలో పర్యటించే అవకాశాలున్నాయి. ప్రభుత్వం మార్చి 1 నుంచి శ్రీకారం చుట్టాలని భావిస్తున్న బీడీ కార్మికుల జీవన భృతి పథకాన్ని.. మొదటివారంలో జిల్లాలోని నిర్మల్‌లో ప్రారంభించేందుకు వస్తున్నట్లు తెలుస్తోంది. అయితే పలు జిల్లాల్లో పట్టభద్రుల ఎమ్మెల్సీ కోడ్ అమలులో ఉన్న నేపథ్యంలో సీఎం పర్యటన ఖరారు విషయంలో కొంత సందిగ్ధత నెలకొంది. జిల్లాలో సుమారు 68 మంది బీడీ కార్మికులున్నారు. వీరికి ప్రతినెలా రూ.వెయ్యి భృతి చెల్లిస్తామని ప్రభుత్వం గతంలో ప్రకటించింది. ఇప్పటికే జిల్లా అధికార యంత్రాంగం ఈ పథకానికి అర్హుల ఎంపిక ప్రక్రియలో నిమగ్నమైంది. ఎంపీడీవోలు, వీఆర్వోలు క్షేత్రస్థాయి పర్యటనలు చేపట్టారు. ఈ పథకాన్ని తన నియోజకవర్గంలో ప్రారంభించాలని రాష్ట్ర న్యాయ, గృహ నిర్మాణ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి సీఎం కేసీఆర్‌కు విజ్ఞప్తి చేసినట్లు తెలుస్తోంది. నిర్మల్‌తోపాటు, నిజామాబాద్ జిల్లాలో కూడా ఒకేరోజు సీఎం పర్యటన ఉండే అవకాశాలున్నాయి. జైపూర్ పవర్ ప్లాంట్ పనులకు శంకుస్థాపన..? సింగరేణి నిర్మిస్తున్న జైపూర్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో మూడో యూనిట్ నిర్మాణ పనులకు సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేసే అవకాశాలున్నాయి. ఈ మేరకు ఇక్కడ బహిరంగ సభ ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. ఇందుకోసం సింగరేణి అధికారులు ఇప్పటి నుంచే సీఎం పర్యటన ఏర్పాట్లు ప్రారంభించినట్లు తెలుస్తోంది. బహిరంగ సభా స్థలాన్ని చదును చేస్తున్నారు. ఇక్కడ 600 మెగావాట్ల చొప్పున రెండు యూనిట్ల నిర్మాణ పనులు చకచకా జరుగుతున్నాయి. రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభం నుంచి గట్టెక్కే చర్యల్లో భాగంగా ఇక్కడ మరో 600 మెగావాట్ల సామర్థ్యం కలిగిన మూడో యూనిట్‌ను నిర్మిస్తామని సీఎం కేసీఆర్ భావిస్తున్నారు. 2014 డిసెంబర్ 25న ఈ పవర్ ప్లాంటును కూడా సందర్శించారు. ఈ రెండు కార్యక్రమాలు ఒకే రోజు ఉంటాయా? వేర్వేరు రోజుల్లో జిల్లాలో పర్యటిస్తారా.. అనే అంశంపై స్పష్టత రావాల్సి ఉంది. -
సీఎం పర్యటనకు ఏర్పాట్లు..
యాదగిరికొండ : యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీ నరసింహస్వామి దేవస్థానానికి బుధవారం సీఎం రానున్న నేపథ్యంలో అధికారులు కొండపై పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారు. దేవస్థానం ఈఓ గీతారెడ్డి మంగళవారం కొండపై అధికారులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటుచేశారు. సీఎం కేసీఆర్ ఆలయ పరిసరాలను పరీశీలిస్తారని, ఎక్కడ ఎటువంటి అపరిశుభ్ర వాతావరణం కనిపించకూడదని ఆదేశించారు. మంచినీటి ఏర్పాట్లు, సీఎం వసతి సౌకర్యాలను పరిశీలించారు. విద్యుత్ నిరంతరాయంగా ఉండాలని ఆమె సూచించారు. సీఎం కారు దిగిన ప్రాంతం నుంచి ఆండాల్ నిలయం వరకు ఎక్కడ, ఎటువంటి పొరపాట్లు జరగకుండా చూడాలని సూచించారు. స్థానిక సీఐ శంకర్‌గౌడ్, ఎస్ఐ రాజశేఖర్‌రెడ్డిలు ఆలయ పరిసరాలను పరిశీలించారు. ప్రత్యేక పోలీసు బలగాలను దింపారు. సమావేశంలో ఏఈఓలు చంద్రశేఖర్, కోల అంజనేయులు, దోర్భల భాస్కర శర్మ, సిబ్బంది పాల్గొన్నారు. -
మార్చి ఒకటిన జిల్లాకు సీఎం కేసీఆర్!
- బీడీ కార్మికుల భృతి ప్రారంభం ఇక్కడి నుంచే - కామారెడ్డిలో శ్రీకారం చుట్టనున్న ముఖ్యమంత్రి - తిమ్మాపూర్ వెంకన్న కొండకు వెళ్లే అవకాశం - సీఎం పర్యటన ఏర్పాట్లలో అధికారులు సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు మార్చి ఒకటిన జిల్లాలో పర్యటించనున్నారు. బీడీ కార్మికులకు నెలకు రూ.వెయి రూపాయల భృతిని వచ్చే నెల నుంచి చెల్లిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ మేరకు సీఎం బీడీ కార్మికుల సమస్యలు, భృతిపై శనివారం ఉన్నతాధికారులతో సమీక్ష జరిపిన అనంతరం నిజామాబాద్, మెద క్, కరీంనగర్ జిల్లాలలో స్వయంగా తానే ఈ పథకాన్ని ప్రా రంభించనున్నట్లు ప్రకటించారు. బీడీ కార్మికుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని అమలు చేస్తున్న కొత్త పథకాన్ని కామారెడ్డి నుంచి ప్రారంభించేందుకు సీఎం కేసీఆర్ జిల్లాలోపర్యటించనున్నట్లు సమాచారం. అలాగే బీర్కూరు మండలం తిమ్మాపూర్‌లో నిర్మి స్తున్న వెంకన్న కొండను కూడ ముఖ్యమంత్రి సందర్శించనున్నారు. ఇటీవల బీర్కూరు మండలంలో జరిగిన వివిధ కార్యక్రమాలలో పాల్గొన్న మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి కూడ సీఎం కేసీఆర్ మార్చి ఒకటిన జిల్లాకు రానున్నట్లు ప్రకటించారు. వాస్తవానికి ముఖ్యమంత్రి కేసీఆర్ జనవరి 21న జిల్లాలో పర్యటించాల్సి ఉంది. అపుడు అధికారులు కూడా కామారెడ్డిలో మకాం వేసి ఏర్పాట్లను పరిశీలించారు. వాటర్‌గ్రిడ్, మిషన్ కాకతీయ, విద్య, వైద్య ఆరోగ్య,గృహనిర్మాణ, వ్యవసాయ తదితర శాఖలకు సంబంధించిన నివేదికలను సిద్ధం చేశారు. చివరి నిముషంలో సీఎం పర్యటనను రద్దయినట్లు సీఎంఓ సమాచారం వచ్కిచంది. తిరిగి ఇపుడు సీఎం పర్యటన ఖరారు కావడంతో అధికారులు మళ్లీ ఏర్పాట్లపై దృష్టి సారించారు. సీఎం కోసం కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో హెలీప్యాడ్ ఏర్పాటు చేసే అవకాశం ఉంది. -
సీఎం పర్యటన వాయిదా
తిరిగి ఫిబ్రవరి మొదటి వారంలో..? ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు పర్యటన తాత్కాలికంగా వాయిదా పడింది. ఈనెల 22, 23 తేదీల్లో సీఎం జిల్లాలో పర్యటిస్తారని భావించిన అధికారులు ఈ మేరకు ఏర్పాట్లు చేశారు. తిరిగి ఫిబ్రవరి మొదటి వారంలో సీఎం జిల్లాకు వచ్చే అవకాశాలున్నాయని, పార్లమెంటరీ కార్యదర్శి జలగం వెంకట్రావు తెలిపారు. సాక్షి ప్రతినిధి, ఖమ్మం: రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు జిల్లా పర్యటన తాత్కాలికంగా వాయిదా పడింది. ఈనెల 22, 23 తేదీల్లో సీఎం జిల్లాలో పర్యటిస్తారని భావించిన అధికారులు ఈ మేరకు ఏర్పాట్లు చేశారు. వివిధ కారణాలతో ఆయన పర్యటన వాయిదా పడిందని, తిరిగి ఫిబ్రవరి మొదటి వారంలో సీఎం జిల్లాకు వచ్చే అవకాశాలున్నాయని, తేదీలు ఇంకా ఖరారుకాలేదని పార్లమెంటరీ కార్యదర్శి జలగం వెంకట్రావు తెలిపారు. సీఎం జిల్లాలోని ఖమ్మం, మణుగూరు, కొత్తగూడెం, భద్రాచలం ప్రాంతాల్లో పర్యటించే అవకాశం ఉందని తొలుత భావించిన అధికారులు ఆ మేరకు ఆయా ప్రాంతాల్లో ఆగమేఘాల మీద ఏర్పాట్లు చేశారు. అయితే ఈ నెల 22వ తేదీన ఆదిలాబాద్ జిల్లా గిరిజనులు అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే నాగోబా జాతర జరగనుండటంతో దానికి హాజరయ్యేందుకు ముఖ్యమంత్రి వెళ్లనున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన పర్యటన వాయిదా పడినట్లు తెలుస్తోంది. సీఎం ఫిబ్రవరి మొదటివారంలో జిల్లా పర్యటనకు వచ్చే అవకాశం ఉందని, ఏ తేదీన వస్తారు?, ఎన్ని రోజులు ఉంటారనే విషయం ఇంకా ఖరారు కాలేదని పార్లమెంటరీ కార్యదర్శి, ముఖ్యమంత్రి కార్యాలయ వ్యవహారాల ఇన్చార్జి జలగం వెంకటరావు విలేకరులకు తెలిపారు. సీఎం పర్యటనకు సంబంధించి జిల్లా అధికారులు సర్వసన్నద్ధం అవుతూనే ఉన్నారు. సోమవారం నుంచి జిల్లా కేంద్రంలోని 17 మున్సిపల్ రెవెన్యూ వార్డులలో ఆసరా పింఛన్లు మంజూరు కాని వారి నుంచి దరఖాస్తులు తీసుకుంటున్నారు. ఆహార భద్రత కార్డుల అర్హులను గుర్తించే ప్రక్రియను వేగవంతం చేశారు. ఇందుకు 17మంది జిల్లా అధికారులను ఖమ్మం నగరంలో ప్రాంతాల వారీగా నియమించారు. సీఎం పర్యటన ఫిబ్రవరి మొదటివారంలో ఖాయమని తెలుస్తోంది. -
కంకణ బద్ధుడు
⇒ మాట నిలబెట్టుకుంటున్న కేసీఆర్ ⇒ రాష్ట్రంలోనే గజ్వేల్‌కు ప్రత్యేక గుర్తింపు ⇒ ఇప్పటికే రూ. 3 వేల కోట్ల నిధుల విడుదల ⇒ ఉద్యమంలా గజ్వేల్ నియోజకవర్గం అభివృద్ధి పనులు ⇒ నేడు గజ్వేల్‌లో సీఎం పర్యటన ⇒ నిధులన్నీ గజ్వేల్‌కేనా అంటూ జిల్లా వాసుల పెదవివిరుపు సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: ‘గజ్వేల్ ప్రజలు నా మీద అమృతం కురిపించారు. ఇక గజ్వేల్ రూపు రేఖలు మారిపోతాయ్. మీ అరికాలుకు ముళ్లు గుచ్చుకుంటే నా పంటితో పీకేస్తా. రాష్ట్ల్రంలోనే గజ్వేల్ నియోజకవర్గాన్ని ఆదర్శంగా నిలబెడతా. త్వరలోనే మీరంతా చూస్తారు’’ జూన్ 4న ముఖ్యమంత్రి హోదాలో తొలిసారిగా గజ్వేల్ లో జరిగిన సభలో సీఎం కేసీఆర్ ప్రజలకు ఇచ్చిన మాట.. ‘‘ ఒక రోజు చూసుకుని పవర్ డే పెట్టుకుందాం. ఆ రోజున కరెంటోళ్లంతా మీ ఊళ్లకే వస్తరు.. పోలు పోలు తీరుకుంటా సర్వేజేస్తరు. కరెంటె తీగలు వేలాడుతున్నా, పోలు వంగిపోయినా రాసుకొని పోయి, మళ్లోరోజు పెట్టుకొని వాటి స్థానంలో కొత్తయి పెడతరు’’ గజ్వేల్ అభివృద్ధిపై నవంబర్ 30న ఎర్రవల్లి ఫాం హౌస్‌లో సమీక్షా సమావేశంలో కేసీఆర్ అన్న మాటలివి. ‘కేసీఆర్ మాటలు తుపాకీ రాముని తూటాలు’ అని ప్రతిపక్షాలు ేహ ళన చేశాయి. ఆచరణ సాధ్యం కానీ హామీలంటూ విమర్శించాయి. ఆయన హామీల విలువ రూ. లక్ష కోట్లు దాటాయని కాంగ్రెస్, టీడీపీ నాయకులు లెక్కలు కట్టిమరీ కడిగిపారేశారు. కాలం చక్రం గిర్రున తిరిగింది... ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఏడు నెలలు పూర్తి చేసుకున్నారు. ఈ ఏడు నెలల కాలంలో కేసీఆర్ ఇచ్చిన ప్రతి మాటకూ కంకణ బద్ధుడయ్యారు. ఇచ్చిన ప్రతి హామీకి కార్యరూపం ఇస్తున్నారు. ఇప్పటి వరకు సుమారు రూ. 3 వేల కోట్ల వరకు నిధులు మంజూరు చేశారు. వాటిలో ఇప్పటికే కొన్ని వరాలు ఫలితాలను ఇస్తున్నాయి.. ఇంకొన్ని ప్రగతిలో ఉన్నాయి... మరికొన్ని ప్రణాళిక స్థాయిలో ఉన్నాయి. ముఖ్యమంత్రి గజ్వేల్ ప్రజలకు ఇచ్చిన తొట్టతొలి హామీ గజ్వేల్ డెవలప్మెంట్ అథారిటి(గడా) ఏర్పాటు. ఇప్పుడిది గజ్వేల్ ప్రజలకు చిరస్మరణీయమైన సేవలు అందిస్తోంది. ఇక కేసీఆర్ ఆదేశాల మేరకు శనివారం గజ్వేల్‌లో ఉద్యమం తరహాలో ట్రాన్స్‌కో అధికారులు పోల్ టూ పోల్ సర్వే నిర్వహించారు. 10,075 కరెంటు సమస్యలను గుర్తించారు. వీటి పరిష్కారానికి సర్కార్ రూ 10 కోట్లు మంజూరు చేసింది. ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఇప్పటికే గజ్వేల్ నియోజకవర్గంలో మూడు సార్లు పర్యటించారు. అనధికారికంగా ఆయన వస్తూ...పోతూనే ఉన్నారు. తన ఎర్రవల్లి ఫాం హౌస్‌కు వచ్చిన ప్రతిసారీ గజ్వేల్ నియోజకవర్గం గురించే ఆలోచన చేశారు. తాజాగా ఆయన మంగళవారం గజ్వేల్ పట్టణంలో పర్యటనకు వస్తున్నారు. పట్టణంలో ఆయన పాదయాత్ర చేస్తూ కమ్మరి, కుమ్మరి, చాకలి కుల వృత్తుల వారితో మాట్లాడుతారు. వారి కష్టసుఖాలను స్వయంగా తెలుసుకునే ప్రయత్నం చేయనున్నారు. అయితే సీఎం కేసీఆర్ కేవలం తాను ప్రాతినిథ్యం వహిస్తున్న గజ్వేల్‌పైనే అధికంగా దృష్టి సారించడంపై జిల్లాలోని మిగతా ప్రాంతాల ప్రజలు పెదవి విరుస్తున్నారు. గజ్వేల్ అంత కాకపోయినా తమ ప్రాంత అభివృద్ధికీ నిధులు కేటాయించాలని కోరుతున్నారు. గజ్వేల్ నియోజకవర్గ అభివృద్ధికి సీఎం హామీలు, వాటి ప్రగతి ⇒ గజ్వేల్ చుట్టూ రింగు రోడ్డు ఏర్పాటుభూ సేకరణకు రూ.30 కోట్లు మంజూరు ⇒ గజ్వేల్ నగర పంచాయతీలో శాశ్వత దాహార్తి నివారణకు ‘గోదావరి సుజల స్రవంతి పథకం’ రూ.60 కోట్లు మంజూరు. పనుల ప్రారంభానికి సన్నహాలు ⇒ గజ్వేల్‌లో 5 వేల మంది పేదలకు ఇళ్లస్థలాలు, గృహనిర్మాణదరఖాస్తుల స్వీకరణ పూర్తి, కానీ స్థల సేకరణ లో జాప్యం, గృహనిర్మాణంపై ఖరారు కానీ విధివిధానాలు ⇒ ఆర్అండ్బీ రోడ్లకు రూ.350 కోట్ల నిధులు మంజూరు ⇒ పీఆర్ రోడ్ల అభివృద్ధికి రూ.200 కోట్లు మంజూరు ⇒ ములుగులో హార్టికల్చర్ యూనివర్శిటీ, ఫారెస్ట్రీ కళాశాల ఏర్పాటు రూ.100 కోట్లు కేటాయింపు ⇒ గజ్వేల్ మిల్క్గ్రిడ్కు రూ.30 కోట్ల మంజూరుకు అనుమతి, పథకం ప్రారంభం ⇒ గజ్వేల్ ప్రభుత్వాసుపత్రి అభివృద్ధి, హైరిస్క్ కేంద్రం ఏర్పాటు, 100 పడకల వరకు స్థాయిపెంపునకు రూ.18 కోట్లకుపైగా మంజూరు ⇒ తూప్రాన్ ప్రభుత్వాసుపత్రి 100 పడకలుగా మార్చేందుకు మొదలైన కార్యాచరణ ⇒ పవర్‌డే కార్యక్రమ నిర్వహణ, కరెంటు సమస్యల పరిష్కారానికి రూ.10 కోట్లు మంజూరు ⇒ మండల కేంద్రాలు, పంచాయతీలు, మదిర గ్రామాల అభివృద్ధికి రూ.50 కోట్లు మంజూరు, పనులు ప్రారంభం ⇒ గజ్వేల్ నియోజకవర్గంలో కొత్తగా 220 కేవీ, ఒక 132, మరో ఆరు 33/11కేవీ సబ్స్టేషన్లు స్థల సేకరణ షురూ. ⇒ మిషన్ కాకతీయ కింద 606 చెరువుల అభివృద్ధి. ఇప్పటివరకు 23 చెరువులకు రూ.9 కోట్లు మంజూరు, మిగితా చెరువుల అభివృద్ధికి కొద్ది రోజుల్లో నిధులు విడుదలయ్యే అవకాశం గజ్వేల్‌లో ముఖ్యమంత్రి పర్యటన ఇలా.. ⇒ ఉదయం 11.00 నుంచి 11.30 గంటల వరకు రోడ్డు మార్గంలో సీఎం కేసీఆర్ గజ్వేల్‌కు చేరుకుంటారు. ⇒ తొలుత ఎస్సీ కాలనీలో పిడిచెడ్ రోడ్డు వైపున నిర్మించిన మోడల్ బస్‌షెల్టర్‌ను పరిశీలిస్తారు. ⇒ ఆ తర్వాత ఎస్సీ కాలనీవాసులతో ముఖాముఖి...కాలనీలో మౌలిక వసతులపై ఆరా ⇒ 12.00 గంటలకు కోటమైసమ్మ గుడి వద్ద నుంచి బ్రహ్మణ, ముస్లింలు, కుమ్మరి, రజక తదితర చేతి వృత్తుల వారితో ముఖాముఖి అవుతారు. ఆ తర్వాత పాదయాత్ర కొనసాగింపు. ⇒ 12.30 గంటలకు ఎంపీడీఓ కార్యాలయం నుంచి 17వార్డులోని ఢిల్లీవాలా హోటల్ సమీపంలోని ఇళ్ల మధ్యనున్న ఖాళీ ప్రదేశంలో ప్రజల పలకరింపు. వారినుద్దేశించి ప్రసంగం. ⇒ 1.00 గంటకు పట్టణంలో రైతు బజార్, కల్చరల్ ఆడిటోరియం, ఇంటిగ్రేటేడ్ కార్యాలయాల భవన సముదాయం, ఎమ్మెల్యే కార్యాలయ భవం ఏర్పాటు కోసం స్థల పరిశీలనపై అధికారులు, ప్రజాప్రతినిధులతో చర్చ. ⇒ 1.30 నుంచి 2.00 గంటల వరకు భోజన విరామం. ⇒ 2.30 గంటలకు పట్టణంలోని ప్రజ్ఞా గార్డెన్స్‌లో సుమారు గంటపాటు మున్సిపల్ పాలకవర్గం, వివిధ శాఖల అధికారులతో సమీక్షా సమావేశం. అంతా గజ్వేల్ కేనా...! ‘కేసీఆర్‌కు ఒక్క గజ్వేలొల్లే ఓటేసింళ్లా.... మేమెయ్యలేదా? మాది తెలంగాణే కదా? మెతుకు సీమల లేమా? మధన్‌రెడ్డి దొరకు ఓటేయ్యమంటే ఓటేస్తిమి, ఆ దొర కేసీఆర్ సారు నిలబెట్టిన మనిషే కదా..! ఆళ్లనో తీరుగజూసుడేంది..మమ్ములనోతీరుగ జూసుడేంది. గజ్వేలోళ్లకు రెండు సెతులతోటి పెడుతన్నడూ, ముఖ్యమంత్రి సారు మాకు దోసిలితో కూడ ఎయ్యనంటే ఎట్టా. గజ్వేల్ జనానికి పెట్టినట్టే మాగ్గూడ పెట్టాలె సారు’ -రామ నర్సమ్మ, నర్సాపూర్ -
నిరసనలు.. నిర్బంధాలు
సీఎం పర్యటన సందర్భంగా ఘటనలు హన్మకొండ : జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటన నిరసనలు, నిర్బంధాల మధ్య కొనసాగింది. ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఏబీవీపీ విద్యార్థులు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు కాన్వాయిని అడ్డుకున్నారు. హన్మకొండలోని కలెక్టరేట్లో సోమవారం ఉదయం అధికారులతో సమీక్ష జరిపిన అనంతరం హంటర్ రోడ్డులోని మాజీ మంత్రి కెప్టెన్ లక్ష్మీకాంతరావు ఇంటికి వెళ్తున్న క్రమంలో మాస్టర్జీ కాలేజీ వద్ద ఏబీవీపీ కార్యకర్తలు జెండా పట్టుకొని ఒక్కసారిగా దూసుకొచ్చారు. జామర్ వాహనాన్ని అడ్డుకున్నారు. పోలీసులు వారిని తొలగిస్తుండగానే.. మరికొందరు విద్యార్థులు కేసీఆర్ ప్రయాణిస్తున్న వాహనానికి అడ్డుగా పడుకున్నారు. దీంతో కేసీఆర్ భద్రతా సిబ్బంది, కేయూ సీఐ దేవేందర్‌రెడ్డి, స్థానికంగా బందోబస్తులో ఉన్న పోలీసులు విద్యార్థులను రోడ్డుపై నుంచి అడ్డు తొలగించి వాహనాన్ని, కాన్వాయిని పంపించారు. ఏబీవీపీ కార్యకర్తలను అరెస్ట్ చేసి, సుబేదారి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈ క్రమంలో స్వల్ప లాఠీచార్జి చేశారు. టీఆర్ఎస్ మహిళా నాయకుల నిరసన లక్ష్మీకాంతరావు ఇంటికి చేరుకున్న సీఎం కేసీఆర్‌ను కలుసుకునేందుకు టీఆర్ఎస్ మహిళా నాయకులను పోలీసులు అనుమతించలేదు. దీంతో రహీమున్నీసాబేగం నిరసన తెలిపారు. దీంతో ఆమెను పోలీసు వాహనంలోకి ఎక్కించగా.. కిందికి దూకి వాహనం వెనక టైరుకు అడ్డంగా పడుకుంది. పోలీసులు బలవంతంగా ఆమెతో పాటు పలువురి మహిళలను పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఐకేపీ వీఓఏల దిగ్బంధం సమస్యలు పరిష్కరించాలని ఐకేపీ వీఓఏలు హన్మకొండ ఏకశిల పార్కులో ధర్నా చేపట్టారు. అదే సమయంలో సీఎం కేసీఆర్ కలెక్టరేట్లో అధికారులు సమీక్ష నిర్వహిస్తున్నారు. దీనికి అవాంతరాలు కలిగిస్తారనే ఉద్దేశంతో సీఐ కిరణ్‌కుమార్, ఎస్సైలు రాంప్రసాద్, విజ్ఞాన్‌రావు అదనపు బలగాలను రప్పించి పార్కులోనే వీఓఏలను దిగ్బంధించారు. దీంతో స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. వీఓఏల సంఘం, సీఐటీయూ నాయకులను సీఎంతో మాట్లాడిస్తామని కెప్టెన్ లక్ష్మీకాంతరావు ఇంటికి పోలీసులు తీసుకెళ్లారు. అయితే కేసీఆర్‌ను కలవకుండా తిరిగి పంపించడంతో వీఓఏలు మండిపడ్డారు. దీంతో కలెక్టరేట్ ముట్టడించాలనే పట్టుదలకు వచ్చారు. వెంటనే గ్రహించిన పోలీసులు తగిన భద్రతా చర్యలు చేపట్టి నివారించారు. వీరి ప్రతినిధులను కలెక్టరేట్‌కు సీఎంను కలిసేందుకు పంపించారు. అధికారులు కేసీఆర్‌తో మాట్లాడించగా.. వీఓఏలు సంతృప్తి చెందారు. కాగా, సీఎం కేసీఆర్ హైదరాబాద్‌కు తిరుగుముఖం పట్టే వరకు ఏకశిల పార్కులో దిగ్బంధించి వెళ్లిపోయాక వారిని వదిలిపెట్టారు. కాంగ్రెస్ నేతల నిర్బంధం వరంగల్ : సీఎం కేసీఆర్ జిల్లా పర్యటన సందర్భంగా పోలీసులు కాం గ్రెస్ నేతలను నిర్బంధించారు. జిల్లా లో నెలకొన్న సమస్యలతోపాటు ఎన్నికల హామీలు అమలు చేయాలని వినతిపత్రం సమర్పించాలని కాంగ్రెస్ నేతలు నిర్ణయించారు. సీఎం నుంచి స్పందన లేకుంటే... ఆయన ముందే నిరసన తెలియజేయాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. సమాచారమందుకున్న పోలీసులు అప్రమత్తమై ముందు జాగ్రత్తగా కాంగ్రెస్ నాయకులను అదుపులోకి తీసుకున్నారు. ఉదయం 7 గంటలకే డీసీసీ అధ్యక్షుడు నాయిని రాజేందర్‌రెడ్డిని హన్మకొం డలోని ఆయన ఇంటిలో స్థానిక సీఐ కిరణ్‌కుమార్ ఆధ్వర్యంలో గృహ నిర్బంధం చేశారు. విషయం తెలుసుకున్న కాంగ్రెస్ శ్రేణులు పెద్ద సంఖ్యలో నాయిని ఇంటివద్దకు చేరుకున్నాయి. నిరసనకు దిగడంతో పోలీసులు పలువురిని అరెస్టు చేసి హన్మకొండ పోలీస్‌స్టేషన్‌కు తరలిం చారు. నాయినితోపాటు కాంగ్రెస్ నగర అధ్యక్షుడు తాడిశెట్టి విద్యాసాగర్, టీపీసీసీ మీడియా సెల్ కన్వీనర్ ఈవీ.శ్రీనివాసరావు, యువజన కాం గ్రెస్ నాయకులు రాజనాల శ్రీహరి, వరద రాజేశ్వర్‌రావు, మాజీ మేయర్ ఎర్రబెల్లి స్వర్ణ, మాజీ ఎమ్మెల్యే కొండేటి శ్రీధర్ తదితరులను అరెస్ట్ చేశారు. అరెస్ట్ అయిన వారిలో జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు నమిండ్ల శ్రీనివాస్, నాయకులు బిన్నీ లక్ష్మణ్, ధనరాజు, లింగాజి, రాయబారపు సాంబయ్య తదితరులు ఉన్నారు. కాగా, అనేక పోరాటాలు, త్యాగాల తో ఆవిర్భవించిన తెలంగాణ రాష్ట్రం లో కొత్త సర్కార్ నియంతృత్వ విధానాలు అవలంభిస్తోందని ఈ సందర్భంగా డీసీసీ అధ్యక్షుడు నాయిని ఆగ్రహం వ్యక్తం చేశారు. జర్నలిస్టుల వినతి హన్మకొండ అర్బన్ : జిల్లాలో అపరిష్కృతంగా ఉన్న జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ టీయూడబ్ల్యూజే (ఐజేయూ) ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌కు వినతిపత్రం అందజేశారు. హౌసింగ్ సొసైటీలకు ఇళ్ల స్థలాల కేటాయిం పు, హెల్త్ కార్డుల జారీకి చర్య తీసుకోవాలని కోరారు. సీఎం రాక సందర్భంగా కొందరు మీడియా ప్రతిని ధులను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేయడం, గృహ నిర్బం ధంలో ఉంచడం వంటి సంఘటన లు ఇకపై జరగకుండా చూడాలని కోరారు. ముఖ్యమంత్రిని కలిసిన వారిలో ప్రతినిధులు పిన్నా శివకుమార్, భాస్కర్, సుధాకర్ ఉన్నారు. ఐఎస్‌సీసీ సదస్సులో పాల్గొన్న గురునాథరావు మహబూబాబాద్ టౌన్ : న్యూఢిల్లీలోని ఇండియన్ నేషనల్ సైన్స్ అకాడమీలో ‘విజ్ఞానశాస్త్ర పరిపాలన-అనుసరించాల్సిన వ్యూహాలు’ అంశం పై ఈనెల 25 నుంచి 29వ తేదీ వర కు జరిగిన ఇండియన్ సైన్స్ కమ్యూనికేషన్ కాంగ్రెస్ (ఐఎస్‌సీసీ) - 2014 సదస్సులో మానుకోటకు చెం దిన సైన్స్ కమ్యూనికేటర్, ప్రభుత్వ ఉపాధ్యాయుడు వి.గురునాథరావు పాల్గొన్నారు. ‘భారతదేశ విజ్ఞానశా స్త్ర పరిపాలన ఎదుర్కొంటున్న సవాళ్లు-అవసరమైన నూతన వ్యూహాల’ పై పరిశోధన పత్రం సమర్పించారు. -
రేపు జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన
* చిత్తూరులో ఆస్పత్రి ప్రారంభం * పీవీకేఎన్ డిగ్రీ కళాశాలలో బహిరంగ సభ * అధికారికంగా విడుదల కాని టూర్ షెడ్యూల్ చిత్తూరు (అర్బన్): రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురువారం చిత్తూరు నగరానికి రానున్నారు. దీనికి సంబంధించి అధికారిక షెడ్యుల్ విడుదల కాకపోయినా జిల్లా యంత్రాంగం ఇందుకు తగిన ఏర్పాట్లు చేస్తోంది. కలెక్టర్ సిద్దార్థజైన్, ట్రైనీ కలెక్టర్ శ్రుతి ఓజా, జెడ్పీ సీఈవో వేణుగోపాల్‌రెడ్డి తదితరులు మంగళవారం రాత్రి చిత్తూరు నగరంలోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద స్థలాన్ని పరిశీలించారు. సీఎం పర్యటనపై టీడీపీ నేతలకు సమాచారం అందినట్లు తెలిసింది. గురువారం ఉదయం 11 గంటలకు చంద్రబాబు నాయుడు హెలిప్యాడ్‌లో మురకంబట్టులోని సీతమ్స్ కళాశాల వద్దకు చేరుకుంటారు. మాజీ ఎంపీ ఆదికేశవులునాయుడు జ్ఞాపకార్థం నిర్మించిన ఆస్పత్రిని ప్రారంభిస్తారు. అనంతరం కట్టమంచిలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో నిర్మించిన టాయ్లెట్లు ప్రారంభిస్తారు. అనంతరం హై రోడ్డు మీదుగా పీసీఆర్ కూడలి వద్ద ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పిస్తారు. ఓవర్ బ్రిడ్జి నుంచి ఠాణా వరకు ఉన్న రోడ్డుకు ఎన్టీఆర్ మార్గ్‌గా నామకరణం చేసిన శిలాఫలకాన్ని ఆవిష్కరిస్తారు. కొంగారెడ్డిపల్లె కూరగాయల మార్కెట్ వద్ద మినరల్ వాటర్ ప్లాంటును ప్రారంభిస్తారు. పీవీకేఎన్ డిగ్రీ కళాశాలలో నిర్వహించే బహిరంగ సభలో ప్రసంగిస్తారు. చిత్తూరులో రూ 5.కోట్లతో నిర్మించనున్న సప్తగిరి గ్రామీణ బ్యాంకు, రూ.2 కోట్లతో నిర్మించనున్న సహకార భవనం, బీసీల భవనం, ఏపీ ఫెడరేషన్ ఆఫ్ ట్రైనింగ్ సెమినార్ భవ నాలకు శంకుస్థాపనలు చేస్తారు. బహిరంగ సమావేశం అనంతరం మెసానికల్ మైదానానికి చేరుకుని హెలికాప్టర్లో తిరుగు ప్రయాణమవుతారు. అధికారులతో జేసీ సమావేశం చిత్తూరు (సెంట్రల్): ముఖ్యమంత్రి పర్యటనను విజయవంతం చేసేందుకు జేసీ భరత్‌గుప్త మంగళవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జిల్లా అధికారులతో సమావేశమయ్యారు. సీఎం పర్యటన విధులను వివిధ శాఖలకు కేటాయించారు. -
సీఎం పర్యటన ఏర్పాట్ల పరిశీలన
సిద్దిపేట జోన్: ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ నెల 10న సిద్దిపేటలో పర్యటిస్తున్న నేపథ్యంలో ఆదివారం మంత్రి హరీష్‌రావు సిద్దిపేటలో పలు ప్రాంతాలను పరిశీలించారు. సాయంత్రం స్థానిక పత్తి మార్కెట్, మినీ స్టేడియంను సందర్శించి హెలిప్యాడ్ నిర్మాణానికి అనువైన స్థలాన్ని ఆర్అండ్బీ అధికారులతో కలిసి పరిశీలించారు. అనంతరం కోమటి చెరువు వద్ద గల ఫిల్టర్ బెడ్‌ను మంత్రి సందర్శించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తన పర్యటనలో భాగంగా ఫిల్టర్ బెడ్‌ను పరిశీలించి సమావేశం నిర్వహించనున్న నేపథ్యంలో అందుకు అవసరమైన ఏర్పాట్లు, పరిసరాల స్థితి గతులను మంత్రి హరీష్‌రావు అడిగి తెలుసుకున్నారు. ఫిల్టర్‌బెడ్ పరిసర ప్రాంతాల్లో వృథాగా ఉన్న స్క్రాప్‌ను వెంటనే తొలగించాలని ఆర్డబ్ల్యూఎస్ అధికారులను ఆదేశించారు. అదే విధంగా ఈ నెల 10న ఫిల్టర్ బెడ్లో గ్రిడ్‌కు సంబంధించిన ప్రత్యేక సదస్సు నిర్వహించనున్నందున అనువైన వేదిక, ఫిల్టర్ బెడ్ పవర్‌పాయింట్ ప్రజంటేషన్ గురించి తెలుసుకున్నారు. త్వరితగతిన పనులను పూర్తి చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. మంత్రి వెంట కలెక్టర్ రాహుల్ బొజ్జా, సిద్దిపేట ఆర్డీఓ ముత్యంరెడ్డి, ఆర్అండ్బీ ఈఈ బాల్‌నర్సయ్య, ఆర్డబ్ల్యూఎస్ డిప్యూటీ ఈఈ చారి, మంత్రి ఓఎస్డీ బాలరాజు, తహశీల్దార్ ఎన్వై గిరి, మున్సిపల్ కమిషనర్ రమణాచారి, సిద్దిపేట డీఎస్పీ శ్రీధర్, మున్సిపల్ మాజీ చైర్మన్ రాజనర్సు, శేషుకుమార్ తదితరులున్నారు. -
24.. 25..సీఎం ఎప్పుడు వచ్చేనో?
భువనగిరి : ముఖ్యమంత్రి కేసీఆర్ జిల్లా పర్యటన షెడ్యూల్ ఇంకా అధికారికంగా ఖరారు కాలేదు. అసెంబ్లీ సమావేశాలు ముగింపురోజైన ఈ నెల 21వ తేదీ సాయంత్రం జిల్లాలోని గ్రీన్హౌస్ కల్టివేషన్ వ్యవసాయ క్షేత్రాలను పరిశీలిస్తారని ముందుగా అనుకున్నారు. కానీ అసెంబ్లీ సమావేశాలు మరికొన్ని రోజులపాటు పొడిగించే అవకాశం ఉన్నందున ఈ నెల 24 లేదా 25వ తేదీల్లో ఏదో ఒకరోజు జిల్లాలోని భువనగిరి డివిజన్‌కు రానున్నట్లు తెలుస్తోంది. సీఎం పర్యటన ద్వారా జిల్లాలో జరుగుతున్న గ్రీన్హౌస్ కల్టివేషన్పై మంత్రి వర్గ సహచరులకు, ఎంపీలు,ఎమ్మెల్యేలు, అధికారులకు అవగాహన కల్పించాలని నిర్ణయించినట్లు సమాచారం. ఇందుకోసం ఆయన పూర్తిస్థాయిలో పర్యటన చేపట్టాలని నిర్ణయించారు. శాసనసభ సమయం మరికొన్ని రోజులు పొడిగించిన పక్షంలో అవి ముగిసిన వెంటనే రావాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. భువనగిరి, బొమ్మలరామారం మండలాల్లోని గ్రీన్హౌస్ వ్యవసాయ క్షేత్రాలున్నాయి. వాటిని పరిశీలించాలని నిర్ణయించుకున్నారు. తెలంగాణ వ్యా ప్తంగా గ్రీన్హౌస్ కల్టివేషన్ ద్వారా రైతులకు అధికంగా మేలు చేయాలని భావిస్తున్నారు. ఏర్పాట్లలో అధికారులు.. మరోవైపు ఉద్యానవనశాఖ అధికారులు సీఎం పర్యటన సందర్భంగా ఏర్పాట్లు ముమ్మరంగా చేస్తున్నారు.. భువనగిరిలోని వివేరా హోటల్ వెనక గల గ్రీన్హౌస్ కల్టివేషన్ క్షేత్రాన్ని అడిషనల్ ఎస్పీ రాధాకిషన్‌రావు గురువారం సందర్శించారు. సీఎం రానున్న సమయంలో భద్రతాపరంగా తీసుకోవాల్సిన చర్యలను స్థానిక సీఐలతో కలిసి చర్చించారు. సీఎం పర్యటన ఇంకా ఖరారు కాలేదు భువనగిరి : గ్రీన్హౌస్ కల్టివేషన్ పరిశీలనకు సీఎం పర్యటనకు ఇంకా ఖరారు కాలేదని కలెక్టర్ చిరంజీవులు తెలిపారు. గురువారం రాత్రి ఆయన భువనగిరి వివేరాహోటల్ వెనుక చేపట్టిన గ్రీన్హౌస్కల్టివేషన్ విధానాన్ని ఆయన పరిశీలించారు. పాలీహౌస్లో సేద్యమవుతున్న కూరగాయలు, పండ్ల తోటలను పరిశీ లించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్టాడుతూ ఇక్కడ జరుగుతున్న గ్రీన్ కల్టివేషన్ బాగుందని, దీనిని పరిశీలించేందుకు సీఎం వచ్చే అవకాశాలు ఉన్నాయన్నారు. ఇప్పటివరకు పర్యటన తేదీ ఖరారు కాలేదన్నారు. ఆయన వెంట ఆర్డీఓ ఎన్.మధుసూదన్, తహసీల్దార్ వెంకట్‌రెడ్డి, ఉద్యానవన కన్సల్టెంట్ వెంకట్‌రెడ్డి, రైతు రాఘవేందర్‌రెడ్డి ఉన్నారు. -
సీఎం స్పెషల్ బస్సుకు తప్పిన ప్రమాదం
సరుబుజ్జిలి: రణస్థలంలో గురువారం జరిగిన సీఎం చంద్ర బాబు సభకు స్వయం శక్తి సంఘాల మహిళలతో సరుబుజ్జిలి నుంచి బయల్దేరిన ఆర్టీసీ బస్సు.. స్థానిక కర్ర చెరువు సమీపంలో బురదలోకి దిగబడి, పక్కకు ఒరిగిపోయింది. దీంతో మహిళలు భ యాందోళనకు గురయ్యారు. కొందరు బస్సు నుంచి.. బయటకు గెంతేశారు. మరి కొద్దిగా బస్సు ఒరిగి ఉంటే..పెను ప్రమాదం సంభవించేదంటూ.. విలపించారు స్థానిక టీడీపీ కార్యకర్తలు స్థానికంగా ఉన్న ఓ ట్రాక్టర్‌ను, ఎల్‌ఎన్‌పేట నుంచి పొక్లెయిన్‌ను తెచ్చి..బస్సును బయటకు తీసేసరికి 3 గం టలు కావడంతో..కొందరు మహిళలు వెనుదిరి గారు. మరి కొందరు టీడీపీ నాయకుల ఒత్తిడి మేర కు ఆకలితో చంద్రబాబు సభకు హాజరయ్యారు. -
సీఎం పర్యటనకు ఏర్పాట్లు ముమ్మరం
ఆర్మూర్ టౌన్/నిజామాబాద్‌అర్బన్ : ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు ఈనెల 7న జిల్లా పర్యటిస్తున్నం దున ప్రజాప్రతినిధులు, అధికారులు ఏర్పాట్లలో మునిగిపోయారు. వ్య వసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మం గళవారం పనులను పర్యవేక్షించారు. శ్రీరాంసాగర్ నుంచి ఆర్మూర్‌కు తాగునీరును అందించే పథకానికి ఆర్మూర్‌లో సీఎం శంకుస్థాపన చేయనున్నారు. ఈ పథకం రూ. 114 కోట్లతో చేపట్టనున్నారు. ఆర్మూర్‌లోని మినీ స్టేడియంలో నిర్వహించే బహిరంగసభలో కేసీఆర్ పాల్గొంటారు. తాగు నీటి పథకం శిలాఫలకం, కాకతీయ కళాతోరణం ఏర్పాట్లను మంత్రి పోచారం, ఎమ్మెల్యే జీవన్ రెడ్డి పరిశీలించారు. అనంతరం మినీ స్టేడియానికి వెళ్లి సభా వేదిక, వీఐపీ గ్యాలరీ, మీడియా గ్యాలరీలు, ప్రజలు కూర్చునే స్థలాల వివరాలను ఆర్అండ్బీ ఎస్ఈ సుకన్యను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కేబినెట్ ఆమో దం పొందిన 43 అంశాలను ప్రజలకు తెలియపరుస్తూ సభా ప్రాంగణంలో ఫ్లెక్సీలను ఏర్పాటు చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. సభా వేదికకు వచ్చే వారికి ఇబ్బం దులు తలెత్తకుండా ట్రాఫిక్, పార్కింగ్ సమస్య లేకుండా చూడాలని డీఎస్పీ ఆకుల రామ్ రెడ్డికి సూచించారు. అనంతరం పట్టణంలోని అం గడి బజార్లో ఏర్పాటు చేసిన పార్కింగ్ స్థలా న్ని, ముఖ్య మంత్రి వచ్చి పోయే మార్గాలను మంత్రి పరిశీలించారు. ఆర్డీవో యాదిరెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ మోత్కూరి లింగా గౌడ్, టీఆర్ఎస్ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు వేముల సురేందర్ రెడ్డి, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు న్యావనంది గంగారెడ్డి తదితరులు మంత్రి వెంట ఉన్నారు. కలెక్టర్ రోనాల్డ్‌రాస్, ఎస్పీ తరుణ్‌జోషి సోమవారమే ఆర్మూర్‌లో సీఎం పర్యటన ఏర్పాట్లను పరిశీలించారు. సీఎం వెళ్లే నిజామాబాద్, ఆర్మూర్ ప్రధాన రహదారి వెంబడి పిచ్చిమొక్కలను తొలగిస్తూ, డ్రైనేజీలను అధికారులు శుభ్రం చేయిస్తున్నారు. బాల్కొండ మండలం పోచంపాడ్‌లో సీఎం కేసీఆర్ బస ఏర్పాట్లను పరిశీలించారు. విత్తన పరిశోధన కేంద్రంగా అంకాపూర్ ఆర్మూర్ అర్బన్: వ్యవసాయ రంగంలో ఆధునిక పరిజ్ఞానాన్ని అవలంబిస్తూ దేశంలోనే ప్రశంసలు అందుకుంటున్న అంకాపూర్ గ్రామాన్ని వ్యవసాయ పరిశోధన కేంద్రంగా తీర్చిదిద్దుతామని మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. పర్యటనలో భాగంగా కేసీఆర్ గ్రామాభివృద్ధి కమిటీ కమ్యునిటీ హాల్లో రైతులతో ముఖాముఖి నిర్వహించే సభాస్థలిని పోచారం పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ రాష్ట్రంలో ఇతర గ్రామాలను అంకాపూర్ తరహాలో అభివృద్ధి చేసేందుకు కృతనిశ్చయంతో ఉన్నారన్నారు. అంకాపూర్‌ను సీడ్ హబ్‌గా తీర్చిదిద్దుతామన్నారు. తొలిసారి గా విచ్చేస్తున్న సీఎంకు గ్రామ ప్రజలు అఖండ స్వాగతం పలకాలన్నారు. గ్రామంలో వ్యవసాయ క్షేత్రాలను సీఎం పరిశీలిస్తారని చెప్పా రు. ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ అంకాపూర్‌ను చాలా ఇష్టపడతారన్నారు. గ్రీన్ అగ్రికల్చర్‌ను గ్రామంలో ప్రవేశ పెట్టేందుకు కేసీఆర్ యోచిస్తున్నట్లు తెలిపారు. గ్రామ రైతాంగం, అభివృద్ధి, భూసారం, జలవనరు లు, తదితరు అంశాలపై సీఎం నేరుగా రైతుల తో చర్చిస్తారన్నారు. గ్రామాన్ని పైలట్ గ్రామంగా తీసుకోనున్నట్లు చెప్పారు. రాష్ట్రాన్ని వ్యవసాయ రంగంలో అభివృద్ధి చేసేందుకు సీఎం పర్యటన దోహద పడుతుందన్నారు. రూ. 20 వేల కోట్ల రైతు రుణాలను మాఫీ చేసిన రైతు బాంధవుడని అన్నారు. మంత్రి, ఎమ్మెల్యేను గ్రామాభివృద్ధి కమిటీ అధ్యక్షుడు సల్ల చిన్న అనంత్, మాజీ అధ్యక్షుడు జి రాజన్న, సర్పంచ్ పుష్ప, వీడీసీ సభ్యులు సన్మానించారు. -
బాబు వచ్చారు...పిల్లలకు సెలవిచ్చారు
ఏలూరు : ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పర్యటన సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రయివేట్ పాఠశాలల విద్యార్థులకు సెలవు వచ్చింది. జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో ప్రైవేట్ పాఠశాలలకు గురువారం ఏకంగా సెలవు ప్రకటించేశారు. రవాణా శాఖ అధికారుల ఆదేశాల మేరకు స్థానికంగా ఉన్న స్కూల్ బస్సులన్నీ సీఎం సభకు పంపించడంతో గురువారం సెలవు ఇచ్చి ఆదివారం నిర్వహిస్తున్నట్టు ఓ విద్యాసంస్థ యాజమాన్యం తల్లిదండ్రులకు వర్తమానం పంపారు. ముఖ్యమంత్రి సభకు పాఠశాల బస్సులను పంపి పిల్లల చదువులతో చెలగాటం ఏమిటని తల్లిదండ్రులు మండిపడుతున్నారు. కాగా రవాణాశాఖ అధికారులు చెప్పిన తరువాత బస్సులు పంపకపోతే ఏ ఇబ్బందులు తలెత్తుతాయోనన్న భయంతో విధిలేని పరిస్థితుల్లో బస్సులు పంపినట్టు ఓ విద్యాసంస్థ ప్రతినిధి తెలిపారు. -
చంద్రబాబు సభకు స్కూల్ బస్సులు
కొవ్వూరు : ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సభకు జనాన్ని తరలించేందుకు స్కూల్ బస్సులను వినియోగించడంతో విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. బస్సులు సభకు పంపడంతో కొవ్వూరుతో పాటు జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో ప్రైవేట్ పాఠశాలలకు గురువారం ఏకంగా సెలవు ప్రకటించేశారు. రవాణా శాఖ అధికారుల ఆదేశాల మేరకు స్థానికంగా ఉన్న స్కూల్ బస్సులన్నీ సీఎం సభకు పంపించడంతో గురువారం సెలవు ఇచ్చి ఆదివారం నిర్వహిస్తున్నట్టు కొవ్వూరులో ఓ విద్యాసంస్థ యాజమాన్యం తల్లిదండ్రులకు వర్తమానం పంపారు. ముఖ్యమంత్రి సభకు పాఠశాల బస్సులను పంపి పిల్లల చదువులతో చెలగాటం ఏమిటని తల్లిదండ్రులు మండిపడుతున్నారు. సీఎం పర్యటనలో భాగంగా బుధవారం కామవరపుకోటలో రైతు సదస్సు, 17న కొయ్యలగూడెంలో మహిళ సదస్సు నిర్వహించాలని నిర్ణయించారు. కామవరపుకోటలో రైతు సదస్సుకు జిల్లావ్యాప్తంగా రైతు రుణార్హత కార్డులు పొందేవారిని వ్యవసాయ అధికారులు బస్సుల్లో తరలించారు. 236 బస్సుల్లో 11,800 మంది కౌలు రైతులను సదస్సుకు తరలించారు. దీంతో జిల్లాలోని పాఠశాల బస్సులతోపాటు వివిధ సంస్థలకు చెందిన బస్సులు, ప్రైవేట్ బస్సులను ఏర్పాటు చేసే బాధ్యత స్థానిక రవాణా శాఖ అధికారులకు అప్పగించారు. కొన్ని బస్సులు బుధవారం, మరికొన్ని గురువారం వెళ్లాలని రవాణాశాఖ అధికారులు పాఠశాలల యాజమాన్యాలను ఆదేశించారు. రవాణాశాఖ అధికారులు చెప్పిన తరువాత బస్సులు పంపకపోతే ఏ ఇబ్బందులు తలెత్తుతాయోనన్న భయంతో విధిలేని పరిస్థితుల్లో బస్సులు పంపినట్టు ఓ విద్యాసంస్థ ప్రతినిధి తెలిపారు. గురువారం నాటి సభకు జిల్లావ్యాప్తంగా 778 బస్సులు అవసరమవుతాయని అధికారులు ప్రతిపాదించారు. వీటిలో 200 బస్సులను స్వయం సహాయక సంఘ మహిళలను తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. ఒక్క కొవ్వూరు రెవెన్యూ డివిజన్ నుంచే 153 బస్సులను గురువారం నాటి మహిళా సభకు వినియోగించనున్నారు. -
‘పచ్చ’ ఆహ్వాన పత్రిక
సాక్షి ప్రతినిధి, ఏలూరు: జిల్లాకు వస్తున్న ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబునాయుడును ప్రసన్నం చేసుకునేందుకు టీడీపీ నేతలు, కార్యకర్తలే కాదు అధికారులూ పోటీ పడుతున్నారు. ఆయన వద్ద ఎలా మార్కులు కొట్టేయాలా అని అదేపనిగా ఆలోచిస్తున్న అధికారులకు ఓ ‘పచ్చ’ ఐడియా వచ్చింది. అంతే.. సీఎం పర్యటన షెడ్యూల్‌ను పచ్చ పత్రికగా ముద్రించేశారు. పూర్తిగా పసుపు రంగుతో ఓ శుభలేఖ రూపంలో ముద్రించి జిల్లాలోని ముఖ్యులకు, పాత్రికేయులకు పంపించారు. ఇప్పటికే రేషన్ కూపన్లను ఎన్టీఆర్ ప్రజాపంపిణీ కూపన్లుగా మార్చి పసుపురంగులో ముద్రిస్తున్న అధికారులు చివరకు బాబు పర్యటన వివరాల పత్రికకూ ఇలా పసుపు పూసేశారు. మునుపెన్నడూ ముఖ్యమంత్రి పర్యటన షెడ్యూల్ ఇలా శుభలేఖ రూపంలో వచ్చేదికాదు. అంతెం దుకు గతంలో తొమ్మిన్నరేళ్ల బాబు హయాంలోనూ అధికారులు ఈ పోకడలకు పోయిన దాఖలాలు లేవు. పసుపు పూల కోసం తంటా : అధికారుల తీరు ఇలా ఉంటే టీడీపీ నేతలు, కార్యకర్తలు పసుపు పూల కోసం ఊరంతా జల్లెడపట్టి వెతుకున్నారు. చంద్రబాబు రెండురోజుల పర్యటన నేపథ్యంలో మార్కెట్లో ఒక్కసారిగా పసుపు రంగు పూలకు, ఆ రంగు బొకేలకు గిరాకీ వచ్చేసింది. ‘లాభాల మాట దేవుడెరుగు.. అందరూ వచ్చి పసుపు రంగు పూల బొకేలు, దండలే అడుగుతున్నారు. ఆ రంగులో వచ్చే పూలు తక్కువగా ఉన్నాయి. ఏం చేయాలో మాకు అర్థం కావడం లేద’ంటూ ఏలూరులోని పూల వ్యాపారులు వాపోతున్నారు. -
సీఎం పర్యటన విషయం తెలియదు : ఉత్తమ్
హుజూర్నగర్ : ఈ నెల 27 లేదా 30వ తేదీలలో పులిచింతల ప్రాజెక్టు ప్రారంభానికి జిల్లాకు సీఎం వస్తున్నారన్న సమాచారం తనకు పూర్తిస్థాయిలో తెలియదని రాష్ట్ర గృహనిర్మాణ శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చెప్పారు. బహుశా ప్రాజెక్టును గుంటూరు జిల్లానుంచే ప్రారంభించవచ్చని తెలిపారు. ఆదివారం సాయంత్రం ఆయన హుజూర్‌నగర్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అడ్డుకుంటున్న ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి పర్యటనను అడ్డుకుంటారా అని విలేకరులు ప్రశ్నించగా తెలంగాణ ప్రాంతంలోఆయన పర్యటనే లేదని, అలాంటప్పుడు అడ్డుకోవాల్సిన అవసరం లేదన్నారు. రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న రచ్చబండ-3లో గృహనిర్మాణశాఖ ద్వారా 13 లక్షల 65వేల మంది లబ్ధిదారులకు ఇళ్ల మంజూరు పట్టాలు పంపిణీ చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ప్రభుత్వం ప్రవేశపెట్టి అమలు చేస్తున్న సంక్షేమ పథకాల లబ్ధికి అర్హులైన ప్రతి ఒక్కరూ దరఖాస్తు చేసుకోవాలన్నారు. -
కిరణ్ రచ్చబండ వాయిదా
సాక్షి ప్రతినిధి, కడప: ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి జిల్లా పర్యటన వాయిదా పడింది. చిత్తూరు, వైఎస్సార్ జిల్లాల పర్యటనలో భాగంగా ఈనెల 21న రాయచోటిలో రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహించదలిచారు. ఈ మేరకు అధికారులకు స్పష్టమైన సమాచారం ఉంది. రచ్చబండ నిర్వహణ కోసం జిల్లా యంత్రాంగం కసరత్తు చేస్తోంది. గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ (జీఓఎం) సమావేశంలో పాల్గొనే నిమిత్తం సీఎం కిరణ్ సోమవారం న్యూఢిల్లీకి వెళ్లారు. సమావేశం అనంతరం మారుతున్న రాజకీయ పరిణామాల నేపధ్యంలోనే ఆయన పర్యటన వాయిదా పడినట్లు సమాచారం. ఈమేరకు జిల్లా యంత్రాంగానికి సీఎంఓ నుంచి ఆదేశాలున్నట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి 21న జిల్లాలో నిర్వహించదలిచిన రచ్చబండ కార్యక్రమం రద్దు అయిన సమాచారాన్ని కలెక్టరేట్ వర్గాలు ధృవీకరిస్తున్నాయి. సీఎం పర్యటన జిల్లాలో ఎప్పుడు ఉంటుందనే విషయంపై ఇంకా స్పష్టత లేదు. ఈనెల 22న ఉంటుందని కొందరు కాంగ్రెస్ నాయకులు పేర్కొంటున్నా, అధికారిక సమాచారం లేదు. -
16న సీఎం పర్యటన
కలెక్టరేట్ (కాకినాడ), న్యూస్‌లైన్ : రచ్చబండ కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి ఎన్.కిరణ్‌కుమార్‌రెడ్డి ఈ నెల 16న రాజమండ్రి సిటీ నియోజకవర్గంలో పర్యటించనున్నారని కలెక్టర్ నీతూ ప్రసాద్ వెల్లడించారు. మండల, డివిజనల్ అధికారులతో కలెక్టరేట్ నుంచి ఆమె సోమవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ముఖ్యమంత్రి పర్యటనకు అన్ని ఏర్పాట్లూ చేపట్టాలని అధికారులను ఆదేశించారు. రచ్చబండ కార్యక్రమాల్లో రాష్ట్ర స్థాయిలో ప్రామాణీకరించిన బ్యాక్ డ్రాప్‌లను మాత్రమే ప్రదర్శించాలన్నారు. పింఛన్లు, రేషన్ కార్డులు, ఇళ్ల కోసం దరఖాస్తుల స్వీకరణకు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయాలని, ప్రతి దరఖాస్తుకూ తప్పనిసరిగా రశీదు అందజేయాలని స్పష్టం చేశారు. జిల్లాలో ఇటీవలి భారీ వర్షాల వల్ల ఐదు రోజులకు పైబడి ముంపునకు గురైన బాధిత కుటుంబాలకు 20 కేజీల బియ్యం, రెండు లీటర్ల కిరోసిన్ ఇవ్వాలని కలెక్టర్ ఆదేశించారు. మూడు రోజులు ముంపునకు గురైన బాధిత కుటుంబాలకు 10 కేజీల బియ్యం, రెండు లీటర్ల కిరోసిన్ పంపిణీ చేయాలని సూచించారు. బాధితుల వివరాలు, పంట, ఇళ్లకు జరిగిన నష్టాల జాబితాను వారం రోజుల్లో పూర్తి చేయాలని, నమోదు సక్రమంగా చేయాలని చెప్పారు. ఓటరు జాబితా సవరణ ప్రక్రియపై సమీక్షిస్తూ జిల్లాలో కొత్తగా అర్హత పొందిన యువతను ఓటర్లుగా నమోదు చేసేందుకు ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలని కలెక్టర్ నీతూ ప్రసాద్ ఆదేశించారు. ఈ సమావేశంలో డీఆర్వో బి.యాదగిరి, సీపీఓ వి.మహీపాల్, డీపీఓ శ్రీధర్‌రెడ్డి, డీఆర్డీఏ ప్రాజెక్ట్ డెరైక్టర్ చంద్రశేఖరరాజు, జేడీఏ ఎన్.విజయ్ కుమార్, జేడీ ఏహెచ్ లివింగ్స్టన్, మత్స్యశాఖ జేడీ గోవిందయ్య, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
సీఎం పర్యటన వాయిదా
సాక్షి, నల్లగొండ : సీఎం కిరణ్‌కుమార్ రెడ్డి జిల్లా పర్యటన వాయిదా పడింది. తుపాను తాకిడికి అతలాకుతలమైన జిల్లా రైతాంగాన్ని పరామర్శించేందుకు, పంట నష్టం తెలుసుకునేందుకు బుధవారం జిల్లాకు సీఎం రానున్నారని అధికారులు ప్రకటించారు. ఈ మేరకు అధికార యంత్రాంగం హడావిడిగా ఏర్పాట్లు చేయడంలో మునిగిపోయింది. పలుచోట్ల స్థల పరిశీలన కూడా చేశారు. వర్షం వల్ల సంభవించిన నష్టానికి సంబంధించి శాఖలవారీగా అధికారులు సమాచారం సేకరించి దగ్గర పెట్టుకున్నారు. చివరకు పర్యటన వాయిదా పండిందని సీఎం పేషీ నుంచి సమాచారం అందింది. సీఎం రాకపోవడానికి స్పష్టమైన కారణాలేంటన్నవి అధికారుల వద్ద కూడా లేవు. అయితే సీఎంకు వైజాగ్ పర్యటన ఖరారు కావడంతో రాలేకపోతున్నారని కొందరు అంటున్నా.. అసలు దీని వెనుక రాజకీయ పరమైన అంశాలు ఉన్నాయని ఇంకొందరు భావిస్తున్నారు. సీఎం వస్తున్నారని... నిడమనూరు : ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి బుధవారం నిడమనూరుకు వస్తున్నారని కలెక్టర్ చిరంజీవులు, ఎస్పీ ప్రభాకర్‌రావు మంగళవారం ఏర్పాట్లను పరిశీలించారు. హెలిప్యాడ్, సమావేశ స్థలాలను ఎంపిక చేశారు. వేంపాడు స్టేజీ వద్ద హెలికాప్టర్ దిగేందుకు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ఏర్పాట్లను పరిశీలించిన వారిలో జోనల్ మార్కెటింగ్ ఆఫీసర్ ప్రసాదరావు, జిల్లా పశువర్ధక శాఖ సహాయసంచాలకులు ఖదీర్, ఐబీ ఈఈ హమీద్‌ఖాన్, డీఈ సురేందర్‌రెడ్డి, ఏఈలు చెన్నకేశవరెడ్డి, హలీం, ఆర్డీఓ శ్రీనివాసరెడ్డి, డీఎస్పీ సుభాష్‌చంద్రబోస్, నిడమనూరు మార్కెట్‌కమిటీ చైర్మన్ రాయలింగయ్య, మాజీ ఎంపీపీ హన్మంతరావు, తహసీల్దార్ రాజు, ఎంపీడీవో ప్రతాప్‌నాయక్, నాగభూషణ్‌రావు, సీఐ ఆనందరెడ్డి, లక్ష్మారెడ్డి, ఉన్నం చినవీరయ్య, నల్లబోతు వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. మిర్యాలగూడలో పర్యటించాలని సీఎంను కోరిన జూలకంటి మిర్యాలగూడ : ఇటీవల కురిసిన వర్షాలకు అపార నష్టం నెలకొన్నందున బాధితులను పరామర్శించడానికి మిర్యాలగూడకు రావాలని ముఖ్యమంత్రి కిరణ్‌ను ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి కోరారు. మంగళవారం ఎమ్మెల్యే సీఎం కిరణ్‌కుఫోన్ చేసిన జిల్లాలో పర్యటిస్తున్న సందర్భంగా మిర్యాలగూడ నియోజకవర్గానికి కూడా రావాలని కోరారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ బుధవారం జిల్లాలో పర్యటించడం లేదని, షెడ్యూల్ మారిందని, మరోసారి జిల్లాకు వచ్చిన సమయంలో మిర్యాలగూడకు వస్తానని సీఎం హామీ ఇచ్చినట్లు రంగారెడ్డి ‘న్యూస్‌లైన్’కు తెలిపారు. మరోసారి జిల్లాకు వచ్చినపుడు మిర్యాలగూడకు తప్పకుండా రావాలని కోరినట్లు జూలకంటి రంగారెడ్డి తెలిపారు.