కడప సిటీ: రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఈనెల 17వ తేదీ శుక్రవారం ఒకరోజు జిల్లా పర్యటనకు రానున్నారని జిల్లా కలెక్టర్ విజయరామరాజు తెలిపారు. తొలుత ప్రొద్దుటూరు పట్టణంలో డీసీసీబీ మాజీ చైర్మన్ ఇరగంరెడ్డి తిరుపాల్‌రెడ్డి మనవడి వివాహ వేడుక కార్యక్రమంలో పాల్గొంటారన్నారు. అలాగే పులివెందుల పట్టణంలోని ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో పులివెందుల నియోజకవర్గానికి చెందిన ముఖ్య నాయకులతో సీఎం సమావేశం కానున్నారని ఆయన పేర్కొన్నారు. అనంతరం పర్యటన ముగించుకుని సాయంత్రం కడప ఎయిర్‌పోర్టు నుంచి తాడేపల్లిలోని తన నివాసానికి బయలుదేరి వెళతారని కలెక్టర్ వివరించారు.
సీఎం పర్యటన షెడ్యూల్ ఇలా!
►ఈనెల 17వ తేదీ ఉదయం 9.30 గంటలకు సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తన నివాసం నుంచి బయలుదేరి 9.50 గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు.
►10.00 గంటలకు అక్కడి నుంచి విమానంలో బయలుదేరి 10.40 గంటలకు కడప ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు.
►10.45 గంటలకు ప్రత్యేక హెలికాప్టర్‌లో బయలుదేరి 11.00 గంటలకు ప్రొద్దుటూరుకు చేరుకుంటారు.
►11.00 నుంచి 11.15 గంటల వరకు స్థానిక నేతలతో ముచ్చటిస్తారు.
►అక్కడి నుంచి బయలుదేరి 11.25 గంటలకు ప్రొద్దుటూరు పట్టణంలోని శ్రీదేవి ఫంక్షన్ హాలుకు చేరుకుంటారు.
►11.25 నుంచి 11.40 గంటల వరకు డీసీసీబీ మాజీ చైర్మన్ ఇరగంరెడ్డి తిరుపాల్‌రెడ్డి మనవడి వివాహ వేడుకల్లో పాల్గొంటారు.
►11.50 గంటలకు వివాహ వేదిక నుంచి బయలుదేరి హెలిప్యాడ్‌కు చేరుకుంటారు.
►ఇక్కడి నుంచి బయలుదేరి మధ్యాహ్నం 12.10 గంటలకు పులివెందుల హెలిప్యాడ్‌కు చేరుకుంటారు.
►12.20 గంటలకు రోడ్డు మార్గాన ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌస్‌కు వెళతారు.
►12.20 నుంచి 12.30 గంటల వరకు విశ్రాంతి తీసుకుంటారు.
►12.30 నుంచి 4.00 గంటల వరకు పులివెందుల నియోజకవర్గ ముఖ్య నాయకులతో సమావేశమవుతారు.
►4.00 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి 4.10 గంటలకు పులివెందులలోని హెలిప్యాడ్‌కు చేరుకుంటారు.
►అక్కడినుంచి 4.15 గంటలకు బయలుదేరి 4.30 గంటలకు కడప ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు.
►కడప ఎయిర్‌పోర్టు నుంచి 4.40 గంటలకు బయలుదేరి గన్నవరం విమానాశ్రయానికి వెళతారు.
►5.45 గంటలకు తాడేపల్లిలోని తన నివాసానికి చేరుకుంటారు.
చదవండి: (సచివాలయాలు సూపర్)
సీఎం పర్యటన ఏర్పాట్ల పరిశీలన
పులివెందుల రూరల్ : రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఈనెల 17వ తేదీన జిల్లా పర్యటనలో భాగంగా పులివెందులకు రానున్న నేపథ్యంలో బుధవారం స్థానిక ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో సీఎం పర్యటన ఏర్పాట్లపై కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, జిల్లా కలెక్టర్ విజయరామరాజు, ఎస్పీ అన్బురాజన్‌లు ఇతర అధికారులతో చర్చించారు.
పటిష్ట బందోబస్తు: సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పులివెందులలో పర్యటించే ప్రాంతాల వద్ద గట్టి బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ అన్బురాజన్ తెలిపారు. బుధవారం స్థానిక ఆర్‌అండ్‌బీ అతిథి గృహం వద్ద ఆయన డీఎస్పీ శ్రీనివాసులు, సీఐ రాజు, ఎస్‌ఐలకు ఏర్పాట్లపై దిశా నిర్దేశం చేశారు. ఎస్పీ మాట్లాడుతూ ముఖ్యమంత్రి పర్యటనలో ఎలాంటి అవాంతరాలు తలెత్తకుండా కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. అనంతరం పులివెందులలోని హెలీప్యాడ్ స్థలాన్ని, ఆర్‌అండ్‌బీ అతిథి గృహాన్ని ఆయన పరిశీలించారు. కార్యక్రమంలో జేసీ సాయికాంత్ వర్మ, ఓఎస్డీ అనిల్‌కుమార్‌రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.
సమస్యలపై కలెక్టర్ ఆరా
పులివెందుల నియోజకవర్గంలోని సమస్యలపై కలెక్టర్ విజయరామరాజు ఆరా తీశారు. బుధవారం స్థానిక ఏపీ కార్ల్ భవనంలో ఆయన జేసీ సాయికాంత్ వర్మ, ఓఎస్డీ అనిల్‌కుమార్‌రెడ్డిలతో కలిసి పులివెందుల, తొండూరు, వేంపల్లె మండలాల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పులివెందుల, తొండూరు, వేంపల్లె మండలాలకు సంబంధించిన వైఎస్సార్‌సీపీ నాయకులతో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఈనెల 17వ తేదీన స్థానిక ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో సమావేశం నిర్వహిస్తారన్నారు. మండలాల్లోని గ్రామాల్లో సీఎం దృష్టికి తీసుకొచ్చే సమస్యల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. మండలాల్లో నెలకొన్న సమస్యలు ప్రస్తావించిన వెంటనే సమాధానం చెప్పే విధంగా అధికారులు ఉండాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు.
హెలిప్యాడ్‌ను పరిశీలించిన కలెక్టర్, ఎస్పీ
ప్రొద్దుటూరు: సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పర్యటన సందర్భంగా ఏర్పాటు చేస్తున్న హెలిప్యాడ్‌ను బుధవారం కలెక్టర్ విజయరామరాజు, ఎస్పీ అన్బురాజన్‌లు పరిశీలించారు. శ్రీదేవి ఫంక్షన్‌హాల్ ఎదురుగా హెలిప్యాడ్‌ను ఏర్పాటు చేస్తున్నారు. బుధవారం వేకువ జామున భారీ వర్షం పడిన నేపథ్యంలో తగు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. వర్షం పడినా ఇబ్బందులు తలెత్తకుండా రహదారిని ఎత్తుగా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ప్రత్యామ్నాయంగా ఆర్టీఓ కార్యాలయం సమీపంలో హెలిప్యాడ్‌ను కూడా అధికారులు సిద్ధం చేస్తున్నారు. వారి వెంట జేసీ సాయికాంత్‌వర్మ, రిజర్వ్ అడిషనల్ ఎస్పీ మహేష్‌కుమార్, ఐఎస్‌డబ్ల్యూ డీఎస్పీ కృపాకర్, ప్రొద్దుటూరు డీఎస్పీ ప్రసాద్‌రావు, తదితరులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment