pulivendula visit
-
CM YS Jagan: నేనున్నానని.. మీకేం కాదని..
సాక్షి ప్రతినిధి, కడప: వైఎస్సార్ జిల్లా పర్యటనలో భాగంగా రెండవ రోజు శనివారం పులివెందులలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పలువురు ఆపన్నులకు అభయహస్తం అందించారు. నేనున్నానని, మీకేం కాదంటూ సత్వర చర్యలకు ఉపక్రమించారు. బాధితులను చూసి కాన్వాయ్ ఆపి, వాహనం దిగి నేరుగా వారి వద్దకే వెళ్లి సమస్యలు తెలుసుకున్నారు. నరాల వ్యాధితో బాధ పడుతున్నానని అన్నమయ్య జిల్లా రాజంపేట కొలిమి వీధికి చెందిన అనంతగిరి (23), తమ కుమారుడు జశ్వంత్‌కు మాటలు రావడం లేదని కర్నూలు జిల్లా ఆస్పరి మండలం తంగరడోణ గ్రామానికి చెందిన దంపతులు రంగన్న, లక్ష్మి సీఎంకు తమ గోడు వెళ్లబోసుకున్నారు. తమ కుమారుడు మహేంద్ర నడవలేక పోతున్నాడని పులివెందులలోనే ఉంటున్న కర్నూలు జిల్లా ఆస్పరి మండలం పెద్దహోతూరు గ్రామానికి చెందిన నాగరాజు, పుష్పావతి దంపతులు, తన భార్య అనారోగ్యంతో ఉన్నదని పులివెందుల మండలం నల్లపురెడ్డిపల్లి గ్రామానికి చెందిన వెంకట మల్లేష్, ప్రమాదంలో కుడి కాలు కోల్పోయిన తనను ఆదుకోవాలని రాయచోటి ప్రాంతానికి చెందిన షేక్ ఖదీర్‌లు సీఎంకు తమ బాధలు చెప్పుకున్నారు. సీఎంను కలిసిన రాయచోటి ప్రాంతానికి చెందిన షేక్ ఖదీర్. ఇటీవల జరిగిన బైక్ యాక్సిడెంట్లో తన కుడికాలు తీసేశారని, జీవనోపాధి కోల్పోయానని, సొంత ఇల్లు కూడా లేదని సీఎంకి వినతి. ఆదుకుంటామంటూ సీఎం భరోసా. pic.twitter.com/vm4tpEtzkS — CMO Andhra Pradesh (@AndhraPradeshCM) December 24, 2022 తన తొమ్మిది నెలల కొడుక్కు గుండెలో రంధ్రం ఉందని సింహాద్రిపురం మండలం బలపనూరుకు చెందిన అంకాలమ్మ.. తన కుమార్తె లావణ్య (13) తీవ్ర అనారోగ్యంతో ఉందని పులివెందుల 7వ వార్డుకు చెందిన ఆంజనేయులు సీఎంకు సమస్యలు వివరించారు. అందరి సమస్యలు ఓపికగా విన్న ముఖ్యమంత్రి.. అనారోగ్యంతో, ఇతర సమస్యలతో బాధ పడుతున్న వారందరికీ మెరుగైన వైద్యం అందించేలా, ఆదుకునేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ విజయరామరాజును ఆదేశించారు. సీఎం స్పందనపై బాధితులందరూ ఆనందం వ్యక్తం చేశారు. తన బిడ్డ గుండె జబ్బుతో బాధపడుతున్నాడని సీఎంకు విన్న వించిన సింహాద్రిపురం మండలం బలపనూరుకు చెందిన అంకాలమ్మ. మొత్తం వైద్యం ఖర్చును ప్రభుత్వమే భరిస్తుందన్న సీఎం. అధికారులకు ఆదేశాలు. pic.twitter.com/6XAy7VW021 — CMO Andhra Pradesh (@AndhraPradeshCM) December 24, 2022 పులివెందుల 7 వ వార్డుకు చెందిన ఆంజనేయులు తన కుమార్తె లావణ్య (13) తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న విషయాన్ని సీఎం దృష్టికి తీసుకొచ్చారు. లావణ్య చికిత్సకు ఎంత ఖర్చయినా సరే ప్రభుత్వమే భరించి పూర్తిగా నయం చేసేలా చర్యలు తీసుకుంటుందని సీఎం ఆ కుటుంబానికి భరోసానిచ్చారు. pic.twitter.com/4Cbh1ufJZd — CMO Andhra Pradesh (@AndhraPradeshCM) December 24, 2022 -
వైఎస్సార్ జిల్లాలో సీఎం జగన్ మూడు రోజుల పర్యటన.. షెడ్యూల్ ఖరారు
సాక్షి, కడప సిటీ: రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వైఎస్సార్ జిల్లాలో ఈనెల 23, 24, 25 తేదీలలో మూడు రోజులపాటు పర్యటించనున్నారు. ఈ మేరకు సీఎం పర్యటన వివరాలను జిల్లా కలెక్టర్ విజయరామరాజు పత్రికలకు విడుదల చేశారు. ముఖ్యమంత్రి పర్యటన వివరాలు ఇలా.. ఈనెల 23వ తేదీన ►ఉదయం 10.15 గంటలకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తాడేపల్లిలోని తన నివాసం నుంచి బయలుదేరి 10.35 గంటలకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు. ►10.45 గంటలకు గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి 11.30 గంటలకు కడప ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. ►11.35 గంటలకు అక్కడి నుంచి రోడ్డు మార్గాన బయలుదేరి 11.50 గంటలకు కడపలోని అమీన్‌పీర్ దర్గాకు చేరుకుంటారు. ►11.50 నుంచి మధ్యాహ్నం 12.20 గంటల వరకు దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తారు. ►12.20 గంటలకు దర్గా నుంచి బయలుదేరి 12.35 గంటలకు రాష్ట్ర పరిశ్రమల సలహాదారు రాజోలి వీరారెడ్డి స్వగృహానికి చేరుకుంటారు. ►12.35 నుంచి 12.45 గంటల వరకు విశ్రాంతి తీసుకుంటారు. ►12.45 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి ఏపీఎస్ ఆర్టీసీ చైర్మన్ అబ్బిరెడ్డి మల్లికార్జునరెడ్డి ఇంటికి 12.50 గంటలకు చేరుకుని నూతన వధూవరులను ఆశీర్వదిస్తారు. ►1.00 గంటకు మల్లికార్జునరెడ్డి ఇంటి నుంచి బయలుదేరి 1.15 గంటలకు మాధవి కన్వెన్షన్ సెంటర్‌కు చేరుకుంటారు. ►1.15 నుంచి 1.25 గంటల వరకు వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి అఫ్జల్ఖాన్ కుమారుడి వివాహ వేడుకలకు హాజరవుతారు. ►1.25 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి కడప ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. ►1.45 గంటలకు కడప ఎయిర్‌పోర్టు నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో బయలుదేరి 2.05 గంటలకు కమలాపురంలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. ►2.15 గంటలకు బహిరంగసభ వేదిక వద్దకు చేరుకుంటారు. ►2.15 నుంచి 2.25 గంటల వరకు వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేస్తారు. ►2.30 నుంచి 3.45 గంటల వరకు బహిరంగసభలో పాల్గొని ప్రజలనుద్దేశించి మాట్లాడతారు. ►3.55 గంటలకు కమలాపురం హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. ►4.00 నుంచి 4.30 గంటల వరకు స్థానిక నేతలతో మాట్లాడతారు. ►4.35 గంటలకు హెలికాప్టర్లో బయలుదేరి 4.50 గంటలకు ఇడుపులపాయ చేరుకుంటారు. ►5.00 గంటలకు ఇడుపులపాయ వైఎస్సార్ గెస్ట్‌హౌస్‌కు చేరుకుని రాత్రికి అక్కడే బస చేస్తారు. 24వ తేదీన ►ఉదయం 9.00 గంటలకు వైఎస్సార్ గెస్ట్‌హౌస్ నుంచి బయలుదేరి వైఎస్సార్ ఘాట్‌కు చేరుకుంటారు. ►9.10 నుంచి 9.40 గంటల వరకు వైఎస్సార్ ఘాట్ వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తారు. ►9.45 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి 10.00 నుంచి 12.00 గంటల వరకు ఇడుపులపాయలోని చర్చిలో ప్రార్థనల్లో పాల్గొంటారు. ►మధ్యాహ్నం 12.05 గంటలకు వైఎస్సార్ ఎస్టేట్‌కు చేరుకుని 12.15 నుంచి 12.30 గంటల వరకు విశ్రాంతి తీసుకుంటారు. ►12.35 గంటలకు ఇడుపులపాయ నుంచి బయలుదేరి 12.40 గంటలకు పులివెందులలోని భాకరాపురంలోగల హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. ►1.10 నుంచి 1.20 గంటల వరకు విజయ హోమ్స్ జంక్షన్‌ను ప్రారంభిస్తారు. ►1.30 నుంచి 1.40 గంటల వరకు కదిరిరోడ్డు జంక్షన్‌ను, విస్తరణ రోడ్డును ప్రారంభిస్తారు. ►1.50 నుంచి 2.00 గంటల వరకు కూరగాయల మార్కెట్ ప్రారంభిస్తారు. ►2.05 నుంచి 2.20 గంటల వరకు మైత్రి లే అవుట్‌ను ప్రారంభిస్తారు. ►2.35 నుంచి 2.50 గంటల వరకు రాయలాపురం వంతెనను ప్రారంభిస్తారు. ►3.00 నుంచి 3.30 గంటలవరకు డాక్టర్ వైఎస్సార్ బస్టాండును ప్రారంభించి ప్రజలనుద్దేశించి మాట్లాడతారు. ►3.35 నుంచి 3.55 గంటల వరకు అహోబిలపురం స్కూలు అభివృద్ధి పనులను ప్రారంభిస్తారు. ►4.05 నుంచి 4.20 గంటల వరకు 10 ఎంఎల్డీ ఎస్టీపీని ప్రారంభిస్తారు. ►4.30 నుంచి 4.45 గంటల వరకు జీటీఎస్‌ను ప్రారంభిస్తారు. ►5.00 గంటలకు భాకరాపురం హెలిప్యాడ్ చేరుకుని 5.40 గంటలకు ఇడుపులపాయలోని వైఎస్సార్ గెస్ట్‌హౌస్‌కు చేరుకుని రాత్రికి అక్కడే బస చేస్తారు. 25వ తేదీన ►ఉదయం 8.40 గంటలకు ఇడుపులపాయ ఎస్టేట్ నుంచి బయలుదేరి 9.05 గంటలకు పులివెందుల భాకరాపురం హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. ►9.15 నుంచి 10.15 గంటల వరకు సీఎస్ఐ చర్చిలో జరిగే క్రిస్మస్ ప్రార్థనల్లో పాల్గొంటారు. ►10.25 గంటలకు పులివెందుల నుంచి బయలుదేరి 11.00 గంటలకు కడప ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. ►11.00 గంటలకు ఇక్కడి నుంచి బయలుదేరి 11.55 గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకుని 12.20 గంటలకు తాడేపల్లిలోని నివాసానికి చేరుకుంటారు. -
వైఎస్సార్ జిల్లా: అభివృద్ధి పనులకు అంకురం (ఫోటోలు)
-
వేంపల్లి పిల్లలకు ఆల్‌ది వెరీ బెస్ట్: సీఎం జగన్
సాక్షి, వైఎస్సార్ జిల్లా: వైఎస్సార్ జిల్లా పర్యటనలో భాగంగా గురువారం సాయంత్రం వేంపల్లిలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా.. రాష్ట్రంలోనే మోడల్ పాఠశాల గుర్తింపు పొందిన వేంపల్లి జెడ్పీ స్కూల్‌కు వెళ్లి.. అక్కడి పిల్లలతో ముఖాముఖి నిర్వహించారు. రూ. 15 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన వేంపల్లి జెడ్పీ పాఠశాలను సీఎం జగన్ ప్రారంభించారు. నాడు-నేడులో భాగంగా.. స్కూల్ రూపురేఖలు గతంలో ఎలా ఉండేవో? ఇప్పుడు ఎలా మారాయో.. స్వయంగా విద్యార్థులకు, తల్లిదండ్రులకు చూపించారు సీఎం జగన్. అంతేకాదు పిల్లలందరూ బాగా చదవాలని కోరుకుంటూ ఆల్‌ది వెరీ బెస్ట్ తెలియజేశారు. ‘అందరూ బాగా చదవాలి. ఈరోజు మీరు వేసే అడుగులు.. పెద్ద పెద్ద స్కూల్స్‌లో చదివే పిల్లల చదువులకు ఏమాత్రం తీసిపోకూడదు. గొప్పగా చదవాలి. ప్రపంచంతో పోటీ పడాలి’ అని కోరుకుంటూ మరోసారి ఆల్ ది వెరీ బెస్ట్ తెలియజేశారు. వైఎస్సార్ పర్యటనలో భాగంగా.. వేంపల్లిలో బాలుర, బాలికల ఉన్నత పాఠశాలలను సీఎం జగన్ ప్రారంభించారు. దాదాపు రూ.40 కోట్ల వ్యయంతో కూడిన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారాయన. -
విత్తన్నం నుంచి విక్రయం వరకూ ప్రభుత్వమే..
-
ప్రకృతి వ్యవసాయం గ్రామ స్థాయి నుంచి శిక్షణ: సీఎం వైఎస్ జగన్
-
ప్రకృతి వ్యవసాయంలో రైతులకు అండగా ఉంటాం: సీఎం జగన్
సాక్షి, వైఎస్సార్: ప్రకృతి వ్యవసాయమే ఈరోజుల్లో శ్రేయస్కరమని.. ఇందుకోసం ఏపీ ప్రభుత్వం అన్ని విధాల రైతులకు ప్రోత్సాహం అందిస్తుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. వైఎస్సార్ జిల్లా పర్యటనలో భాగంగా.. గురువారం మధ్యాహ్నాం పులివెందులలో ఏపీకార్ల్ వద్ద న్యూటెక్ బయోసైన్సెస్‌కు శంకుస్థాపన చేసి ఆయన ప్రసంగించారు. ‘రసాయనాలతో కూడిన ఆహారం వల్ల ఎన్నో రకాల క్యాన్సర్లు వస్తున్నాయి. ఆహార ఉత్పత్తుల్లో రసాయనాలను తగ్గించాలి. ప్రకృతి వ్యవసాయమే ఈ రోజుల్లో అన్నివిధాలా శ్రేయస్కరం. ఏపీలో ఆరు లక్షల మంది రైతులు ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు. వ్యవసాయ శాస్త్రవేత్తలు గ్రామాలపై మరింత దృష్టిసారించాలి. గ్రామస్థాయి నుంచి శిక్షణ అవసరం. ప్రకృతి వ్యవసాయంపై రైతుల్లో అవగాహన పెంచాలి. ఆర్బీకేల ద్వారా అవసరమైన శిక్షణ అందిస్తున్నాం. ప్రకృతి వ్యవసాయంపై అంతర్జాతీయ సంస్థలతో మన ప్రభుత్వం ఒప్పందాలు కుదుర్చుకుంటోంది. రైతుల పెట్టుబడి వ్యయాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం తరపున పలు చర్యలు చేపడుతున్నాం. విత్తు నుంచి విక్రయం వరకూ ఆర్బీకేలు అండగా నిలుస్తున్నాయి. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను అభివృద్ధి చేసేందుకు పథకాలు అమలు చేస్తున్నాం’’ అని సీఎం జగన్ తెలియజేశారు. -
సీఎం జగన్ పులివెందుల పర్యటన.. పూర్తి షెడ్యూల్ ఇదే..
కడప సిటీ: రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈనెల 17వ తేదీ శుక్రవారం ఒకరోజు జిల్లా పర్యటనకు రానున్నారని జిల్లా కలెక్టర్ విజయరామరాజు తెలిపారు. తొలుత ప్రొద్దుటూరు పట్టణంలో డీసీసీబీ మాజీ చైర్మన్ ఇరగంరెడ్డి తిరుపాల్‌రెడ్డి మనవడి వివాహ వేడుక కార్యక్రమంలో పాల్గొంటారన్నారు. అలాగే పులివెందుల పట్టణంలోని ఆర్అండ్బీ అతిథి గృహంలో పులివెందుల నియోజకవర్గానికి చెందిన ముఖ్య నాయకులతో సీఎం సమావేశం కానున్నారని ఆయన పేర్కొన్నారు. అనంతరం పర్యటన ముగించుకుని సాయంత్రం కడప ఎయిర్‌పోర్టు నుంచి తాడేపల్లిలోని తన నివాసానికి బయలుదేరి వెళతారని కలెక్టర్ వివరించారు. సీఎం పర్యటన షెడ్యూల్ ఇలా! ►ఈనెల 17వ తేదీ ఉదయం 9.30 గంటలకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తన నివాసం నుంచి బయలుదేరి 9.50 గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. ►10.00 గంటలకు అక్కడి నుంచి విమానంలో బయలుదేరి 10.40 గంటలకు కడప ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. ►10.45 గంటలకు ప్రత్యేక హెలికాప్టర్లో బయలుదేరి 11.00 గంటలకు ప్రొద్దుటూరుకు చేరుకుంటారు. ►11.00 నుంచి 11.15 గంటల వరకు స్థానిక నేతలతో ముచ్చటిస్తారు. ►అక్కడి నుంచి బయలుదేరి 11.25 గంటలకు ప్రొద్దుటూరు పట్టణంలోని శ్రీదేవి ఫంక్షన్ హాలుకు చేరుకుంటారు. ►11.25 నుంచి 11.40 గంటల వరకు డీసీసీబీ మాజీ చైర్మన్ ఇరగంరెడ్డి తిరుపాల్‌రెడ్డి మనవడి వివాహ వేడుకల్లో పాల్గొంటారు. ►11.50 గంటలకు వివాహ వేదిక నుంచి బయలుదేరి హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. ►ఇక్కడి నుంచి బయలుదేరి మధ్యాహ్నం 12.10 గంటలకు పులివెందుల హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. ►12.20 గంటలకు రోడ్డు మార్గాన ఆర్అండ్బీ గెస్ట్‌హౌస్‌కు వెళతారు. ►12.20 నుంచి 12.30 గంటల వరకు విశ్రాంతి తీసుకుంటారు. ►12.30 నుంచి 4.00 గంటల వరకు పులివెందుల నియోజకవర్గ ముఖ్య నాయకులతో సమావేశమవుతారు. ►4.00 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి 4.10 గంటలకు పులివెందులలోని హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. ►అక్కడినుంచి 4.15 గంటలకు బయలుదేరి 4.30 గంటలకు కడప ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. ►కడప ఎయిర్‌పోర్టు నుంచి 4.40 గంటలకు బయలుదేరి గన్నవరం విమానాశ్రయానికి వెళతారు. ►5.45 గంటలకు తాడేపల్లిలోని తన నివాసానికి చేరుకుంటారు. చదవండి: (సచివాలయాలు సూపర్) సీఎం పర్యటన ఏర్పాట్ల పరిశీలన పులివెందుల రూరల్ : రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈనెల 17వ తేదీన జిల్లా పర్యటనలో భాగంగా పులివెందులకు రానున్న నేపథ్యంలో బుధవారం స్థానిక ఆర్అండ్బీ అతిథి గృహంలో సీఎం పర్యటన ఏర్పాట్లపై కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, జిల్లా కలెక్టర్ విజయరామరాజు, ఎస్పీ అన్బురాజన్‌లు ఇతర అధికారులతో చర్చించారు. పటిష్ట బందోబస్తు: సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పులివెందులలో పర్యటించే ప్రాంతాల వద్ద గట్టి బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ అన్బురాజన్ తెలిపారు. బుధవారం స్థానిక ఆర్అండ్బీ అతిథి గృహం వద్ద ఆయన డీఎస్పీ శ్రీనివాసులు, సీఐ రాజు, ఎస్ఐలకు ఏర్పాట్లపై దిశా నిర్దేశం చేశారు. ఎస్పీ మాట్లాడుతూ ముఖ్యమంత్రి పర్యటనలో ఎలాంటి అవాంతరాలు తలెత్తకుండా కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. అనంతరం పులివెందులలోని హెలీప్యాడ్ స్థలాన్ని, ఆర్అండ్బీ అతిథి గృహాన్ని ఆయన పరిశీలించారు. కార్యక్రమంలో జేసీ సాయికాంత్ వర్మ, ఓఎస్డీ అనిల్‌కుమార్‌రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు. సమస్యలపై కలెక్టర్ ఆరా పులివెందుల నియోజకవర్గంలోని సమస్యలపై కలెక్టర్ విజయరామరాజు ఆరా తీశారు. బుధవారం స్థానిక ఏపీ కార్ల్ భవనంలో ఆయన జేసీ సాయికాంత్ వర్మ, ఓఎస్డీ అనిల్‌కుమార్‌రెడ్డిలతో కలిసి పులివెందుల, తొండూరు, వేంపల్లె మండలాల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పులివెందుల, తొండూరు, వేంపల్లె మండలాలకు సంబంధించిన వైఎస్సార్సీపీ నాయకులతో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈనెల 17వ తేదీన స్థానిక ఆర్అండ్బీ అతిథి గృహంలో సమావేశం నిర్వహిస్తారన్నారు. మండలాల్లోని గ్రామాల్లో సీఎం దృష్టికి తీసుకొచ్చే సమస్యల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. మండలాల్లో నెలకొన్న సమస్యలు ప్రస్తావించిన వెంటనే సమాధానం చెప్పే విధంగా అధికారులు ఉండాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు. హెలిప్యాడ్‌ను పరిశీలించిన కలెక్టర్, ఎస్పీ ప్రొద్దుటూరు: సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పర్యటన సందర్భంగా ఏర్పాటు చేస్తున్న హెలిప్యాడ్‌ను బుధవారం కలెక్టర్ విజయరామరాజు, ఎస్పీ అన్బురాజన్‌లు పరిశీలించారు. శ్రీదేవి ఫంక్షన్‌హాల్ ఎదురుగా హెలిప్యాడ్‌ను ఏర్పాటు చేస్తున్నారు. బుధవారం వేకువ జామున భారీ వర్షం పడిన నేపథ్యంలో తగు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. వర్షం పడినా ఇబ్బందులు తలెత్తకుండా రహదారిని ఎత్తుగా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ప్రత్యామ్నాయంగా ఆర్టీఓ కార్యాలయం సమీపంలో హెలిప్యాడ్‌ను కూడా అధికారులు సిద్ధం చేస్తున్నారు. వారి వెంట జేసీ సాయికాంత్‌వర్మ, రిజర్వ్ అడిషనల్ ఎస్పీ మహేష్‌కుమార్, ఐఎస్‌డబ్ల్యూ డీఎస్పీ కృపాకర్, ప్రొద్దుటూరు డీఎస్పీ ప్రసాద్‌రావు, తదితరులు ఉన్నారు. -
పులివెందుల రోడ్డును ఫోర్‌లైన్ రోడ్డుగా మారుస్తున్నాం: సీఎం జగన్
సాక్షి, పులివెందుల: పులివెందులను రూ.630 కోట్లతో ఆదర్శ పట్టణంగా తీర్చిదిద్దుతున్నామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు. వైఎస్సార్ కడప జిల్లా పర్యటనలో భాగంగా పులివెందులలోని మోడల్ టౌన్, వాటర్ గ్రిడ్, స్పోర్ట్స్ కాంప్లెక్స్, క్రికెట్ స్టేడియం పనులకు సీఎం జగన్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. పులివెందులను రూ.630 కోట్లతో ఆదర్శ పట్టణంగా తీర్చిదిద్దుతున్నామని, రోడ్లు, తాగునీరు, డ్రైనేజ్ కోసం రూ.154 కోట్లు కేటాయించామని తెలిపారు. పులివెందుల రోడ్డును ఫోర్‌లైన్ రోడ్డుగా మారుస్తున్నామని, రూ.30 కోట్లతో స్కిల్ ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నామని సీఎం తెలిపారు. రూ.500 కోట్లతో మెడికల్ కాలేజ్, నర్సింగ్ కాలేజ్ ఏర్పాటు చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. అనంతరం ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ చేరుకొని మహానేత వైఎస్ఆర్కు సీఎం జగన్ నివాళులర్పించనున్నారు. -
నేడు సీఎం వైఎస్ జగన్ ఇడుపులపాయకు రాక
సాక్షి, పులివెందుల : దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి వర్ధంతి సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సోమవారం జిల్లాకు రానున్నారు. ఉదయం గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో కడప ఏయిర్‌పోర్టుకు చేరుకుంటారు. అక్కడినుండి హెలికాప్టర్లో ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్దకు వెళతారు. అక్కడ తన తండ్రి దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి ఘాట్ వద్ద నివాళులర్పిస్తారు. అనంతరం అక్కడి నుంచి హెలికాప్టర్లో పులివెందుల హెలిప్యాడ్ చేరుకొని రోడ్డుమార్గంలో స్థానిక పాలకేంద్రం వద్ద ఏర్పాటు చేసిన దివంగత మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొంటారు. విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. నివాళులర్పించనున్న కుటుంబ సభ్యులు సోమవారం దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతి సందర్భంగా ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, వైఎస్సార్సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ, వైఎస్ షర్మిలమ్మ, వైఎస్ జగన్ సతీమణీ వైఎస్ భారతిరెడ్డి, దివంగత జార్జిరెడ్డి సతీమణి వైఎస్ భారతమ్మ, కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, ఇతర కుటుంబ సభ్యులు నివాళులర్పించి ప్రత్యేక ప్రార్థనలో పాల్గొననున్నారు. అనంతరం వైఎస్ కుటుంబ సభ్యులు పులివెందులలోని పాలకేంద్రం వద్ద ఏర్పాటు చేసిన వైఎస్ వివేకా విగ్రహావిష్కరణలో వైఎస్ వివేకా సతీమణి వైఎస్ సౌభాగ్యమ్మ, కుమార్తె సునీత, అల్లుడు నర్రెడ్డి రాజశేఖర్‌రెడ్డి,ఇతర కుటుంబ సభ్యులు పాల్గొననున్నారు. సమీక్ష సమావేశం : సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సోమవారం పులివెందులలోని స్థానిక ఆర్అండ్బీ అతిథి గృహాంలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, కలెక్టర్ హరికిరణ్, పులివెందుల పాడా ఓఎస్డీ అనిల్‌కుమార్‌రెడ్డి, అన్ని శాఖల అధికారులు హాజరుకానున్నారు.పులివెందుల నియోజకవర్గంలో మండలాల వారీగా చేపట్టాల్సిన అభివృద్ధి పనుల గురించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధికారులకు దశానిర్ధేశం చేయనున్నారు. మెగా రక్తదాన శిబిరం : వైఎస్సార్ వర్ధంతి సందర్భంగా స్థానిక బాకరాపురంలో గల వైఎస్సార్ ఆడిటోరియంలో పులివెందుల వైఎస్సార్ సీపీ నేత వైఎస్ మనోహర్‌రెడ్డి ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించనున్నారు. రక్తదాన శిబిరం ఉదయం 6గంటలకే ప్రారంభమవుతుందని.. ఈ కార్యక్రమానికి వైఎస్సార్ సీపీ నేతలు, కార్యకర్తలు, అభిమనులు, నాయకులు పెద్ద ఎత్తున హాజరై జయప్రదం చేయాలని వైఎస్ మనోహర్‌రెడ్డి పిలుపునిచ్చారు. పటిష్ట బందో బస్తు : ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పర్యటన సజావుగా సాగేందుకు కడప ఎస్పీ అభిషేక్ మహంతి పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. అడిషనల్ ఎస్పీ ఒకరు, డీఎస్పీలు ఏడుగురు, సీఐలు 17మంది, ఎస్ఐలు 40మంది, ఇతర పోలీసు సిబ్బందితో కలిపి మొత్తం 1132మందితో బందోబస్తు ఏర్పాటు చేశారు. సీఎం కాన్వాయికి సంబంధించిన రిహార్సల్స్‌ను కూడా పట్టణంలో నిర్వహించారు. సీఎం పర్యటన వివరాలు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సోమవారం ఉదయం 6.30గంటలకు తాడేపల్లిలోని తన నివాసం నుంచి బయలుదేరి 6.50 గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. 7గంటలకు ఎయిర్‌పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో కడపకు బయలుదేరుతారు. 7.40గంటలకు కడప ఎయిర్‌పోర్టు చేరుకుంటారు.అక్కడ హెలికాప్టర్లో 7.50గంటలకు ఇడుపులపాయకు బయలుదేరుతారు. 8.10గంటలకు ఇడుపులపాయలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. 8.15 గంటలకు అక్కడ నుంచి రోడ్డుమార్గాన వైఎస్సార్ ఘాట్‌కు బయలుదేరుతారు. 8.20గంటలకు వైఎస్సార్ ఘాట్ వద్దకు చేరుకుంటారు. 8.30గంటల నుంచి 9.30గంటల వరకు వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళులర్పించి కుటుంబ సభ్యులతోకలసి ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొంటారు. 9.35గంటలకు వైఎస్సార్ ఘాట్ నుంచి హెలిప్యాడ్ వద్దకు రోడ్డు మార్గాన బయలుదేరుతారు. 9.40గంటలకు ఇడుపులపాయ వద్ద ఉన్న హెలిప్యాడ్ చేరుకుంటారు. 9.45గంటలకు ఇడుపులపాయనుంచి పులివెందుల బయలుదేరి వెళతారు. 10.05గంటలకు పులివెందుల బాకరాపురంలోని హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. 10.10గంటలకు రోడ్డుమార్గాన పాలకేంద్రం వద్దకు బయలుదేరుతారు. 10.20గంటల నుంచి 10.50 గంటల వరకు దివంగత మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొంటారు. 10.55గంటలకు అక్కడ నుంచి రోడ్డు మార్గాన ఆర్అండ్బీ బంగ్లాకు బయలుదేరుతారు. 11గంటల నుంచి 12.30గంటల వరకు అక్కడ పులివెందుల ప్రాంత అభివృద్ధిపై అధికారులతో సమీక్షసమావేశం నిర్వహిస్తారు. 12.30 గంటల నుంచి 1.30గంటల వరకు రిజర్వ్‌గా ప్రకటించారు. 1.30గంటలకు ఆర్అండ్బీ బంగ్లా నుంచి బాకరాపురం హెలిప్యాడ్‌కు బయలుదేరుతారు. 1.35గంటలకు బాకరాపురం హెలీప్యాడ్ చేరుకుంటారు. 1.45గంటలకు అక్కడ నుండి హెలికాప్టర్లో కడప ఎయిర్‌పోర్టుకు బయలుదేరుతారు. 2.15గంటలకు కడప ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. 2.30గంటలకు కడప ఎయిర్‌పోర్టునుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం బయలుదేరుతారు. 3.10గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్టు చేరుకొంటారని కడప కలెక్టర్ హరికిరణ్ అధికారికంగా ప్రకటించారు. -
సీఎం వైఎస్ జగన్ పర్యటన వాయిదా
సాక్షి, పులివెందుల : రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నేటి(గురువారం) పులివెందుల పర్యటన వాయిదా పడింది. కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి ఈమేరకు తెలిపారు. బుధవారం సాయంత్రం స్థానిక ఆర్అండ్బీ అతిథి గృహంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రస్తుతం ఢిల్లీలోనే ఉన్నందువలన గురువారం కూడా అక్కడే ఉండాల్సి రావడంతో పర్యటన వాయిదా పడిందన్నారు. మంగళవారం సీఎం వైఎస్ జగన్ ప్రధానమంత్రి నరేంద్రమోడిని కలిసి రాష్ట్ర పరిస్థితులను వివరించడం జరిగిందన్నారు. ఈ నేపథ్యంలో బుధవారం కేంద్ర హోం మంత్రి అమిత్‌షా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌లను కలిసి రాష్ట్ర పరిస్థితిపై చర్చించాల్సి ఉందన్నారు. కేంద్ర మాజీ మంత్రి సుష్మా స్వరాజ్ మృతి చెందిన నేపథ్యంలో కేంద్ర మంత్రులను కలవలేకపోయారన్నారు. గురువారం వారిని కలిసి రాష్ట్ర పరిస్థితులపై చర్చిస్తారన్నారు. పర్యటన వాయిదా పడినట్లు సీఎం కార్యాలయం నుంచి సమాచరం అందిందన్నారు. దివంగత మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి విగ్రహావిష్కరణ, పులివెందుల అభివృద్ధిపై అధికారుల, నాయకులతో సమీక్ష సమావేశం వాయిదా పడిందన్నారు.. మళ్లీ సీఎం ఎప్పుడు పర్యటించేది తరువత ఆయన కార్యాలయ వర్గాలు తెలియజేస్తాయన్నారు. -
సీఎం జగన్ ఢిల్లీ పర్యటన పొడిగింపు
సాక్షి, న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. కాగా అక్కడ కీలక నేతల్ని కలవాల్సి ఉన్నందున ఢిల్లీ పర్యటనను పొడిగించారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కార్యాలయం బుధవారం ఓ పత్రికా ప్రకటనను విడుదల చేసింది. దీంతో ఈ నెల 8 (గురువారం)న పులివెందుల, పెనుకొండలో సీఎం పర్యటనలు రద్దయ్యాయి. పెనుకొండలో కియా కొత్తకారు విడుదలకు సీఎం బదులుగా పలువురు మంత్రులు హాజరుకానున్నారు. ఈ కార్యక్రమంలో సీఎం ప్రసంగాన్ని ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి చదివి వినిపించనున్నారు. ఇక ఢిల్లీ పర్యటనలో భాగంగా సీఎం జగన్ గత రెండు రోజులు బిజీబిజీగా గడిపారు. ఈ బుధవారం రాత్రి 10 గంటలకు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షాతో భేటీ అయ్యారు. విభజన చట్టంలోని హామీలు, రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన అంశాలపై చర్చించారు. మంగళవారం సాయంత్రం ప్రధాని మోదీని కలిసిన ఆయన, నేటి మధ్యాహ్నం కేంద్ర ఉపరితల, రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ, ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌తో భేటీ అయ్యారు. అంతకుముందు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను సీఎం కలిశారు. -
సీఎం పులివెందుల పర్యటన ఇలా....
సాక్షి, కడప: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం పులివెందుల పర్యటనకు వస్తున్నారు. ఆరోజు ఉదయం 9.35 గంటలకు కడప ఎయిర్‌పోర్టుకు చేరుకుని 9.40 గంటలకు అక్కడి నుంచి హెలికాఫ్టర్‌లో బయలుదేరి 10.10 గంట లకు పులివెందుల గాయత్రి కాలనీలోని హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. 10.20 గంటలకు హెలిప్యాడ్ నుంచి బయలుదేరి 10.30 గంటలకు భాకరాపురం చేరుకుంటారు. 10.35 నుంచి 10.55 గంటల వరకు మాజీమంత్రి వైఎస్ వివేకానందరెడ్డి విహ్రావిష్కరణ కార్యక్రమంలో పాల్గొం టారు. 11.00 గంటలకు భాకరాపురం నుంచి బయలుదేరి 11.10 గంటలకు పులి వెందుల ఆర్అండ్బీ గెస్ట్‌హౌస్‌కు వస్తారు. 11.15 గంటల నుంచి 12.15 గంటల వరకు పులివెందుల అభివృద్దిపై అధికారులతో సమావేశం నిర్వహిస్తారు. 12.15 నుంచి 12.45 గంటల వరకు రిజర్వుడు. 12.50 గంటలకు ఆర్అండ్బీ గెస్ట్‌హౌస్ నుంచి బయలుదేరి గాయత్రి కాలనీ వద్దగల హెలిప్యాడ్‌కు 12.55 గంటలకు చేరుకుం టారు. మధ్యాహ్నం 1.00 గంటకు అక్కడి నుంచి బయలుదేరి అనంతపురం జిల్లా పెనుగొండకు వెళతారు. -
చెన్నారెడ్డి కుటుంబానికి వైఎస్ జగన్ పరామర్శ
వీరపునాయునిపల్లె : వైఎస్సార్ జిల్లా వీరపునాయునిపల్లె మండలం కె.రాజుపాళెం గ్రామంలో వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం పర్యటించారు. అక్కడ ఇటీవల మృతి చెందిన మాజీ సర్పంచ్ పెద్ద చెన్నారెడ్డి కుటుంబాన్ని జగన్మోహన్రెడ్డి పరామర్శించారు. కాగా పులివెందుల నియోజకవర్గ పర్యటనలో ఉన్న వైఎస్ జగన్ కె. రాజుపాళెంలో పర్యటించారు.