AP CM Y.S. Jagan Mohan Reddy 3 Days Kadapa District Schedule Confirmed, Here Kadapa Tour Full Details - Sakshi
Sakshi News home page

YSR Kadapa: వైఎస్సార్‌ జిల్లాలో సీఎం జగన్‌ మూడు రోజుల పర్యటన

Published Thu, Dec 22 2022 7:23 AM | Last Updated on Thu, Dec 22 2022 2:56 PM

CM YS Jagan on three days visit to YSR kadapa from 23rd December - Sakshi

సాక్షి, కడప సిటీ: రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వైఎస్సార్‌ జిల్లాలో ఈనెల 23, 24, 25 తేదీలలో మూడు రోజులపాటు పర్యటించనున్నారు. ఈ మేరకు సీఎం పర్యటన వివరాలను జిల్లా కలెక్టర్‌ విజయరామరాజు పత్రికలకు విడుదల చేశారు. 

ముఖ్యమంత్రి పర్యటన వివరాలు ఇలా..  
ఈనెల 23వ తేదీన 
►ఉదయం 10.15 గంటలకు సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తాడేపల్లిలోని తన నివాసం నుంచి బయలుదేరి 10.35 గంటలకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు. 
►10.45 గంటలకు గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి 11.30 గంటలకు కడప ఎయిర్‌ పోర్టుకు చేరుకుంటారు. 
►11.35 గంటలకు అక్కడి నుంచి రోడ్డు మార్గాన బయలుదేరి 11.50 గంటలకు కడపలోని అమీన్‌పీర్‌ దర్గాకు చేరుకుంటారు. 
►11.50 నుంచి మధ్యాహ్నం 12.20 గంటల వరకు దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తారు. 
►12.20 గంటలకు దర్గా నుంచి బయలుదేరి 12.35 గంటలకు రాష్ట్ర పరిశ్రమల సలహాదారు రాజోలి వీరారెడ్డి స్వగృహానికి చేరుకుంటారు. 
►12.35 నుంచి 12.45 గంటల వరకు విశ్రాంతి తీసుకుంటారు. 
►12.45 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి ఏపీఎస్‌ ఆర్టీసీ చైర్మన్‌ అబ్బిరెడ్డి మల్లికార్జునరెడ్డి ఇంటికి 12.50 గంటలకు చేరుకుని నూతన వధూవరులను ఆశీర్వదిస్తారు. 
►1.00 గంటకు మల్లికార్జునరెడ్డి ఇంటి నుంచి బయలుదేరి 1.15 గంటలకు మాధవి కన్వెన్షన్‌ సెంటర్‌కు చేరుకుంటారు. 
►1.15 నుంచి 1.25 గంటల వరకు వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి అఫ్జల్‌ఖాన్‌ కుమారుడి వివాహ వేడుకలకు హాజరవుతారు. 
►1.25 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి కడప ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. 
►1.45 గంటలకు కడప ఎయిర్‌పోర్టు నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో బయలుదేరి 2.05 గంటలకు కమలాపురంలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. 
►2.15 గంటలకు బహిరంగసభ వేదిక వద్దకు చేరుకుంటారు. 
►2.15 నుంచి 2.25 గంటల వరకు వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేస్తారు. 
►2.30 నుంచి 3.45 గంటల వరకు బహిరంగసభలో పాల్గొని ప్రజలనుద్దేశించి మాట్లాడతారు. 
►3.55 గంటలకు కమలాపురం హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. 
►4.00 నుంచి 4.30 గంటల వరకు స్థానిక నేతలతో మాట్లాడతారు. 
►4.35 గంటలకు హెలికాప్టర్‌లో బయలుదేరి 4.50 గంటలకు ఇడుపులపాయ చేరుకుంటారు. 
►5.00 గంటలకు ఇడుపులపాయ వైఎస్సార్‌ గెస్ట్‌హౌస్‌కు చేరుకుని రాత్రికి అక్కడే బస చేస్తారు. 

24వ తేదీన 
►ఉదయం 9.00 గంటలకు వైఎస్సార్‌ గెస్ట్‌హౌస్‌ నుంచి బయలుదేరి వైఎస్సార్‌ ఘాట్‌కు చేరుకుంటారు. 
►9.10 నుంచి 9.40 గంటల వరకు వైఎస్సార్‌ ఘాట్‌ వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తారు. 
►9.45 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి 10.00 నుంచి 12.00 గంటల వరకు ఇడుపులపాయలోని చర్చిలో ప్రార్థనల్లో పాల్గొంటారు. 
►మధ్యాహ్నం 12.05 గంటలకు వైఎస్సార్‌ ఎస్టేట్‌కు చేరుకుని 12.15 నుంచి 12.30  గంటల వరకు విశ్రాంతి తీసుకుంటారు. 
►12.35 గంటలకు ఇడుపులపాయ నుంచి బయలుదేరి 12.40 గంటలకు పులివెందులలోని భాకరాపురంలోగల హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. 
►1.10 నుంచి 1.20 గంటల వరకు విజయ హోమ్స్‌ జంక్షన్‌ను ప్రారంభిస్తారు. 
►1.30 నుంచి 1.40 గంటల వరకు కదిరిరోడ్డు జంక్షన్‌ను, విస్తరణ రోడ్డును ప్రారంభిస్తారు. 
►1.50 నుంచి 2.00 గంటల వరకు కూరగాయల మార్కెట్‌ ప్రారంభిస్తారు. 
►2.05 నుంచి 2.20 గంటల వరకు మైత్రి లే అవుట్‌ను ప్రారంభిస్తారు. 
►2.35 నుంచి 2.50 గంటల వరకు రాయలాపురం వంతెనను ప్రారంభిస్తారు. 
►3.00 నుంచి 3.30 గంటలవరకు డాక్టర్‌ వైఎస్సార్‌ బస్టాండును ప్రారంభించి ప్రజలనుద్దేశించి మాట్లాడతారు. 
►3.35 నుంచి 3.55 గంటల వరకు అహోబిలపురం స్కూలు అభివృద్ధి పనులను ప్రారంభిస్తారు. 
►4.05 నుంచి 4.20 గంటల వరకు 10 ఎంఎల్‌డీ ఎస్‌టీపీని ప్రారంభిస్తారు. 
►4.30 నుంచి 4.45 గంటల వరకు జీటీఎస్‌ను ప్రారంభిస్తారు. 
►5.00 గంటలకు భాకరాపురం హెలిప్యాడ్‌ చేరుకుని 5.40 గంటలకు ఇడుపులపాయలోని వైఎస్సార్‌ గెస్ట్‌హౌస్‌కు చేరుకుని రాత్రికి అక్కడే బస చేస్తారు. 

25వ తేదీన 
►ఉదయం 8.40 గంటలకు ఇడుపులపాయ ఎస్టేట్‌ నుంచి బయలుదేరి 9.05 గంటలకు పులివెందుల భాకరాపురం హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. 
►9.15 నుంచి 10.15 గంటల వరకు సీఎస్‌ఐ చర్చిలో జరిగే క్రిస్మస్‌ ప్రార్థనల్లో పాల్గొంటారు. 
►10.25 గంటలకు పులివెందుల నుంచి బయలుదేరి 11.00 గంటలకు కడప ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. 
►11.00 గంటలకు ఇక్కడి నుంచి బయలుదేరి 11.55 గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకుని 12.20 గంటలకు తాడేపల్లిలోని  నివాసానికి చేరుకుంటారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement