three days visit
-
ఇడుపులపాయలో వైఎస్ఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించిన సీఎం జగన్
-
మీరంతా ప్రపంచంతో పోటీ పడేలా ఉండాలి: సీఎం జగన్
అహోబిలపురం స్కూల్‌ను ప్రారంభించిన తర్వాత సీఎం జగన్ మాట్లాడుతూ.. ►నాడు-నేడుతో స్కూల్స్ రూపురేఖలు మార్చాం ►రాబోయే రోజుల్లో మన పిల్లల తలరాతలు మారతాయి ►విద్యకు సంబంధించి ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తున్నాం ►విద్యార్థులు భవిష్యత్తు బావుండాలనే తపనతోనే విద్యకు పెద్ద పీట వేస్తున్నాం ►మనం కాంపిటేషన్‌తో ఉండేది పులివెందులతోనో, ఆంధ్ర రాష్ట్రంతోనో కాదు.. ►మీరంతా ప్రపంచంతో పోటీ పడేందుకే ఈ తరహా మంచి కార్యక్రమాలు చేపట్టాం ►అందుకే అంతా చక్కగా చదువుకోవాలి. ►విద్యార్థుల తల్లులకు ఒక అన్నగా, విద్యార్థులకు మేనమామగా అండగా ఉంటా 03:53PM అహోబిలపురం స్కూల్‌ను ప్రారంభించిన సీఎం జగన్ 03:16PM పులివెందులలో బస్టాండ్‌ను ప్రారంభించిన తర్వాత ప్రజలనుద్దేశించి మాట్లాడిన సీఎం జగన్ ►మనం చెడిపోయిన వ్యవస్థతో యుద్ధం చేస్తున్నాం ►జరుగుతున్న అభివృద్ధి వారికి కనిపించడం లేదు ►గతంతో పోలిస్తే అప్పుల్లో పెరుగుదల ఇప్పుడే తక్కువ ►గతంలో అదే బడ్జెట్.. ఇప్పుడూ అదే బడ్జెట్ ►గత ప్రభుత్వం ఇన్ని పథకాలు ఎందుకు ఇవ్వలేకపోయింది ►గ్లాసులో 75 శాతం నీళ్లున్నా.. నీళ్లే లేవని బాబు ప్రచారం చేస్తున్నారు ►అవినీతికి తావు లేకుండా సంక్షేమ పథకాలు అందిస్తున్నాం ►విద్యార్థులు, పేదలు, రైతుల తలరాతలు మారుతున్నాయి ►మనకు ఓటు వేయని వారికి కూడా సంక్షేమ పథకాలు ఇస్తున్నాం ►కేవలం సీఎం మారడంతోనే పేదల తలరాతలు మారుతున్నాయి ►రూ. 1.71లక్షల కోట్లు నేరుగా లబ్ధిదారుల ఖాతాలో జమ చేశాం ►గత ఎన్నికల్లో 151 సీట్లు.. ఈసారి వైనాట్ 175కి 175 సీట్లు ►లంచాలకు తావులేకుండా సంక్షేమ పథకాలు అందిస్తున్నాం ►నేరుగా లబ్దిదారుల ఖాతాల్లోనే నగదు జమ చేస్తున్నాం ►గతంలో అదే బడ్జెట్.. ఇప్పుడూ అదే బడ్జెట్ ►గత ప్రభుత్వం ఇన్ని పథకాలు ఎందుకు ఇవ్వలేకపోయింది ►పులి వెందులను ఆదర్శవంత నియోజకవర్గంగీ తీర్చిదిద్దుతున్నాం ►అత్యాధునిక వసతులతో వైఎస్సార్ బస్ టెర్మినల్‌ను ప్రారంభించాం ►రాష్ట్రంలోని బస్ టెర్మినల్‌కు పులివెందుల బస్ టెర్మినల్ ఆదర్శం 03.14PM ►పులివెందులలో సీఎం జగన్ ►కదిరి రోడ్డు జంక్షన్, విస్తరణను ప్రారంభించిన సీఎం జగన్ ►పులివెందులలో కూరగాయల మార్కెట్‌ను ప్రారంభించిన సీఎం జగన్ ►పులివెందుల బస్టాండ్‌ను ప్రారంభించిన సీఎం జగన్ 02:11PM ►వైఎస్సార్ కడప జిల్లా కూరగాయల మార్కెట్ అనుకుని నూతనంగా నాలుగుకోట్ల 30 లక్షలతో నిర్మించిన డాక్టర్ వైఎస్సార్ మెమోరియల్ పార్క్‌ను ప్రారంభించిన సీఎం జగన్ 01: 58 PM ►పులివెందుల మున్సిపాలిటీ పరిధిలో కోటి ఇరవై లక్షలతో నూతనంగా నిర్మించిన డాక్టర్ వైఎస్సార్ కూరగాయల మార్కెట్‌ను ప్రారంభించిన సీఎం జగన్ 01: 15 PM వైఎస్సార్ జిల్లా ►పులివెందులకు చేరుకున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ►విజయ హోమ్ వద్ద జంక్షన్‌ను, దివంగత నేత రాజశేఖర్ రెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించిన వైఎస్ జగన్ 10: 25 AM ►వైఎస్సార్ జిల్లాలో రెండో రోజు సీఎం జగన్ పర్యటన ►ఇడుపులపాయలో వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళులర్పించిన సీఎం జగన్ ►పులివెందులలో పలు అభివృద్ధి పనులకు సీఎం ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు ►పులివెందులలో ఆర్టీసీ బస్టాండ్‌ను ప్రారంభించనున్న సీఎం జగన్ సాక్షి, పులివెందుల: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శనివారం పులివెందులకు రానున్నారు. పులివెందులలో పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు చేయనున్నారు.సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి శనివారం మధ్యాహ్నం 12.30గంటలకు ఇడుపులపాయ నుంచి భాకరాపురం హెలీప్యాడ్‌కు చేరుకుంటారు. 1.10గంటల నుంచి 1.20 వరకు విజయ హోమ్స్ వద్ద ఉన్న జంక్షన్‌ను ప్రారంభిస్తారు. 1.30 నుంచి 1.45గంటల వరకు కదిరి రోడ్డు జంక్షన్, విస్తరణ రోడ్డును, 1.50 నుంచి 2గంటల వరకు నూతన కూరగాయల మార్కెట్‌ను, 2.05 నుంచి 2.20 గంటల వరకు మైత్రి లేఅవుట్లో వైఎస్సార్ మెమోరియల్ పార్కును ప్రారంభిస్తారు. 2.35 నుంచి 2.50 గంటల వరకు రాయలాపురం నూతన బ్రిడ్జిని ప్రారంభిస్తారు. 3గంటల నుండి 3.30గంటల వరకు డాక్టర్ వైఎస్సార్ బస్ టర్మినల్‌ను ప్రారంభించి బస్టాండు ఆవరణంలో ప్రజలనుద్ధేశించి ప్రసంగిస్తారు. 3.35గంటల నుంచి 3.55గంటల వరకు నాడు – నేడు ద్వారా అభివృద్ధి చేసిన అహోబిలాపురం స్కూలును ప్రారంభిస్తారు. 4.05గంటల నుంచి 4.20గంటల వరకు మురుగునీటిశుద్ధి కేంద్రాన్ని, 4.30గంటల నుంచి 4.45గంటల వరకు గార్బేజీ ట్రాన్స్ఫర్ స్టేషన్‌ను ప్రారంభిస్తారు. అనంతరం 5.00గంటలకు భాకరాపురం హెలీఫ్యాడ్‌కు చేరుకుని అక్కడ నుంచి ఇడుపులపాయకు బయలుదేరి వెళతారు. సీఎస్ఐ చర్చిలో ప్రార్థనలు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదివారం క్రిస్మస్ పండుగ సందర్భంగా పులివెందుల సీఎస్ఐ చర్చిలో కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించనున్నారు. అనంతరం అక్కడే క్రిస్మస్ కేక్‌ను కట్ చేయనున్నారు. సీఎం పర్యటనా ప్రాంతాల పరిశీలన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శని, ఆదివారాలు పులివెందుల పర్యటన దృష్ట్యా అందుకు సంబంధించిన ఏర్పాట్లను కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి మున్సిపల్ ఇన్చార్జి వైఎస్ మనోహర్‌రెడ్డి, పాడా ఓఎస్డీ అనిల్‌కుమార్‌రెడ్డిలతో కలిసి శుక్రవారం ఉదయం పరిశీలించారు. నూతనంగా నిర్మించిన ఆర్టీసీ బస్టాండులో సీఎం బహిరంగ సభ ఉన్న నేపథ్యంలో అందుకు సంబంధించిన ఏర్పాట్లను పరిశీలించి అధికారులకు తగిన సూచనలు, సలహాలు ఇచ్చారు. అలాగే ముఖ్యమంత్రి చేతులమీదుగా ప్రారంభించే అభివృద్ధి పనులను కూడా ఆయన పరిశీలించారు. సీఎం పర్యటనకు సంబంధించి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇడుపులపాయకు చేరుకున్న ముఖ్యమంత్రి వేంపల్లె: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈనెల 23 నుంచి 25వ వరకు మూడు రోజులపాటు జిల్లా పర్యటనలో భాగంగా ఇడుపులపాయకు చేరుకున్నారు. శుక్రవారం కడప, కమలాపురం ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన వివిధ అభివృద్ధి కార్యక్రమాలను ముగించుకుని హెలీకాప్టర్ ద్వారా ఇడుపులపాయకు వచ్చారు. సాయంత్రం 5.51 గంటలకు ఇడుపులపాయలోని వ్యవసాయ క్షేత్రంలో ఉన్న హెలీపాడ్ వద్దకు చేరుకున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు సుధీర్‌రెడ్డి, గడికోట శ్రీకాంత్‌రెడ్డి, పాడా ఓఎస్డీ అనిల్‌కుమార్‌రెడ్డి, డీసీఓ సుభాషిణి, స్పెషల్ కలెక్టర్ రోహిణి, జమ్మలమడుగు ఆర్డీఓ శ్రీనివాసులు తదితరులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ముఖ్యమంత్రి వాహనం ద్వారా రోడ్డు మార్గాన బయలుదేరి వైఎస్సార్ గెస్ట్‌హౌస్‌కు చేరుకుని రాత్రికి అక్కడే బస చేశారు. -
కొప్పర్తిలో ఇండస్ట్రీయల్ పార్క్ పూర్తయితే 2 లక్షల ఉద్యోగాలు: సీఎం జగన్
CM Jagan Kadapa Tour Live Updates 04:23PM కమలాపురం బహిరంగసభలో సీఎం జగన్ ప్రసంగం ►కమలాపురం నియోజకవర్గంలో ప్రారంభోత్సవాలు చేయడం సంతోషంగా ఉంది ►కమలాపురంలో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టాం ►దేవుడు ఆశీస్సులతో అందరికీ మంచి చేస్తున్నా ►వైఎస్సార్ జిల్లాకు కృష్ణా నీటిని తీసుకురావడానికి మహానేత వైఎస్సారే కారణం ►గాలేరు-నగరిని తీసుకొచ్చేందుకు వైఎస్సార్ ఎంతో కృషి చేశారు ►మహానేత వైఎస్సార్ కృషితోనే గండికోట ప్రాజెక్టును పూర్తి చేశాం ►గత ప్రభుత్వ హయాంలో ఈ ప్రాజెక్టులు నిలిచిపోయాయి ► గత ప్రభుత్వం ఈ ప్రాజెక్టులను పట్టించుకోలేదు ► రూ. 550 కోట్లతో బ్రహ్మంసాగర్ లైనింగ్ పనులు చేపట్టాం ► మేం వచ్చాకే చిత్రావతి ప్రాజెక్టులో నీటిని నిల్వ చేశాం ► కొప్పర్తిలో ఇండస్ట్రీయల్ పనులకు శంకుస్థాపన చేశాం ► ఇండస్ట్రీయల్ పార్క్ పూర్తయితే 2 లక్షల ఉద్యోగాలు వస్తాయి ►కమలాపురంలో రూ. 1017 కోట్లు నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశాం ►వివక్ష చూపించకుండా అర్హులైన అందరికీ సంక్షేమ పథకాలు ►బటన్ నొక్కి నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేస్తున్నాం ►రాష్ట్ర విభజన సమయంలో స్టీల్‌ప్లాంట్ కడతామని హామీ ఇచ్చారు ►విభజన చట్ట హామీలను గత పాలకులు పట్టించుకోలేదు ►జనవరి నెలాఖరులో కడప స్టీల్‌ప్లాంట్ నిర్మాణానికి అడుగులు పడతాయి ►కడప స్టీల్‌ప్లాంట్ నిర్మాణ పనులకు శ్రీకారం చుడతాం ►జిందాల్ కంపెనీ ఆధ్వర్యంలో రూ. 8,800 కోట్లతో స్టీల్‌ప్లాంట్ నిర్మాణం ►గత ప్రభుతంలో లంచాలు ఇస్తేనే పెన్షన్లు వచ్చేవి ►గత ప్రభుత్వంలో ఏ పథకం కావాలన్నా లంచాలే ►గత ప్రభుత్వంలో రైతులకు ట్రాక్టర్లు ఇవ్వాలన్నా లంచాలే ►గతంలోనూ అదే బడ్జెట్.. ఇప్పుడు అదే బడ్జెట్ ►గత ప్రభుత్వం ఇన్ని పథకాలు ఎందుకు ఇవ్వలేకపోయింది ►గత ప్రభుత్వ విధానం దోచుకో, పంచుకో, తినుకో ►గజ దొంగల మాదిరి దోచుకోవడం, పంచుకోవడమే వారి పని ►గత ప్రభుత్వానికి, మన ప్రభుత్వానికి తేడా గమనించండి ►రాజకీయ నాయకుడికి విశ్వసనీయత ఉండాలి ►ఇదే నా రాష్ట్రం.. ఇదే నా కుటుంబం ►ప్రజా సంక్షేమమే నా విధానం ►చంద్రబాబు మాదిరిగా ఈ రాష్ట్రం కాకపోతే ఆ రాష్ట్రమని నేను అనడం లేదు ►ఈ పార్టీ కాకపోతే, మరో పార్టీ అని నేను అనడం లేదు ►ఇదే నా రాష్ట్రం..ఇక్కడే నా నివాసం ►5 కోట్ల మంది ప్రజలే నా కుటుంబం ►చంద్రబాబులా దత్తపుత్రుడిని, ఎల్లోమీడియాను నమ్ముకోలేదు ►చంద్రబాబు మాదిరిగా ఈ రాష్ట్రం కాకపోతే ఆ రాష్ట్రమని... ఈ పార్టీ కాకపోతే, మరో పార్టీ అని,దత్తపుత్రుడిలా ఈ భార్య కాకపోతే మరో భార్య అని నేను అనడం లేదు 04.10PM ►పులివెందులకు మించి కమలాపురానికి సీఎం నిధులిచ్చారు: రవీంద్రనాథ్‌రెడ్డి ►అర్హలైన ప్రతీ ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయి: రవీంద్రనాథ్‌రెడ్డి ►రూ.900 కోట్లతో అభివృద్ధి పనులు ప్రారంభించడం సంతోషంగా ఉంది: రవీంద్రనాథ్‌రెడ్డి ►సచివాలయ వ్యవస్థతో గడప గడపకూ సంక్షేమ పథకాలు అందిస్తున్నాం: రవీంద్రనాథ్‌రెడ్డి 03:20PM ►కమలాపురంలో సీఎం జగన్ ►పలు అభివృద్ధి కార్యక్రమాలకు సీఎం జగన్ శ్రీకారం ►రూ. 900 కోట్ల అభివృద్ధి కార్యక్రమాలకు సీఎం జగన్ శంకుస్థాపన 02:50PM ►వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి ఆఫ్జల్ ఖాన్ కుమారుడి వివాహ వేడుకలకు హాజరైన సీఎం జగన్ 02:15PM ►పటేల్ రోడ్ లోని ఆర్టీసీ చైర్మన్ మల్లిఖార్జున రెడ్డి ఇంటికి చేరుకున్న సీఎం జగన్. ►మల్లిఖార్జున రెడ్డి కుమార్తె హారిక వివాహానికి హాజరైన సీఎం జగన్.. నూతన దంపతులను ఆశీర్వదించారు. 01:18 PM ►కడప అమీన్‌పీర్ దర్గాలో సీఎం వైఎస్ జగన్ ►దర్గాలో చాదర్ సమర్పించి.. ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్న సీఎం జగన్ ►కడప, కమలాపురం, పులివెందుల నియోజకవర్గాల్లో పర్యటించనున్న సీఎం ► మొదటిరోజు పర్యటనలో కమలాపురంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్న సీఎం ►రూ.900 కోట్లతో అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన 01:05 PM ►అమీన్ పీర్ దర్గాకు చేరుకున్న సీఎం జగన్ ►సీఎంకు స్వాగతం పలికిన దర్గా పీఠాధిపతి అరీఫుల్లా హుస్సేనీ 12:52 PM ►కడప చేరుకున్న సీఎం జగన్ ►మరికొద్దిసేపటిలో పెద్ద దర్గా చేరుకుని ప్రత్యేక పూజలు చేయనున్న సీఎం జగన్ సాక్షి, కడప: రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వైఎస్సార్ జిల్లాలో మూడు రోజులపాటు (డిసెంబర్ 23, 24, 25) పర్యటిస్తున్నారు. అందులో భాగంగానే శుక్రవారం సీఎం జగన్ వైఎస్సార్ కడప జిల్లాకు చేరుకున్నారు. జిల్లాలో మూడు రోజుల పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. -
నెరవేరనున్న నాలుగు దశాబ్దాల మెట్ట ప్రాంతీయుల కల
సాక్షి ప్రతినిధి, కడప: కరువుతో అల్లాడుతున్న రాయలసీమ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయాలని దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి కలలు కన్నారు. అధికారిక పగ్గాలు అందుకోగానే కరువు ప్రాంతాలను సస్యశ్యామలం చేసేందుకు సమగ్ర ప్రణాళిక రూపొందించారు. జలయజ్ఞం పేరుతో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి సంకల్పించారు. తక్కువ కాలంలో ఎక్కువ అభివృద్ధి పనులు చేసిన నాయకుడిగా ప్రజల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించారు. ఫలాలు అందుతాయని ఆశించిన తరుణంలో ఆయన ఆకస్మిక మరణం అశనిపాతంలా మారింది. తండ్రి స్వప్నం సాకారం చేసేందుకు తనయుడు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ముందడుగు వేశారు. గాలేరు–నగరి సుజల స్రవంతి పథకం ఫలాలు ప్రజలకందించేందుకు డిస్ట్రిబ్యూటరీ కెనాల్స్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ప్రాజెక్టులకు జీవం పోసిన వైఎస్ఆర్ మెట్ట ప్రాంతమైన రాయలసీమకు జీఎన్ఎస్ఎస్, హెచ్ఎన్ఎస్ఎస్ ప్రాణప్రదం. టీడీపీ పాలకులకు ఆ విషయం తెలిసినా చరణలో విఫలమయ్యారు. ఈ పరిస్థితుల్లో ఆ పథకాలకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జీవం పోశారు. పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్ సామర్థ్యం విస్తరించి, శరవేగంగా రెండు పథకాల పనులను పరుగెత్తించారు. ఇది జగమెరిగిన సత్యం. మెట్ట ప్రాంతాల్లో నీరు పుష్కలంగా కన్పిస్తోందంటే అందుకు వైఎస్సార్ ఏకైక కారణమని పరిశీలకులు వెల్లడిస్తున్నారు. నిండు కుండలా గండికోట ప్రాజెక్టు.. జీఎన్ఎస్ఎస్ పథకంలో జిల్లాకు ఆయువు పట్టు ఎద్దుల ఈశ్వరరెడ్డి గండికోట ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టు నిండు కుండలా దర్శనమిస్తోంది. తద్వారా అటు మైలవరం ప్రాజెక్టు, ఇటు పైడిపాలెం, వామికొండ, సర్వారాయసాగర్‌లలో సైతం పుష్కలంగా నీరు నిల్వ ఉంది. తద్వారా భూగర్భజలాలు సమృద్ధిగా ఉన్నాయి. కాగా డి్రస్టిబ్యూటరీ కెనాల్స్ పూర్తి అయితే ఆయకట్టుకు నీరు అందించే వెసులుబాటు కలగనుంది. ఈ నేపథ్యంలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి డి్రస్టిబ్యూటరీ కెనాల్స్‌కు శుక్రవారం కమలాపురంలో శంకుస్థాపన చేయనున్నారు. 2023 అక్టోబర్ నాటికి పనులు పూర్తి చేసి, ఆయకట్టుకు నీరు అందించాలని అధికారులు ప్రణాళికలు రూపొందించారు. సర్వరాయసాగర్ పునరావాసానికి గ్రీన్‌సిగ్నల్.. 3.06 టీఎంసీలతో నిర్మించిన నర్రెడ్డి శివరామిరెడ్డి ప్రాజెక్టు (సర్వరాయసాగర్) దిగువనున్న రెండు గ్రామాలకు పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు గ్రీన్‌సిగ్నల్ లభించింది. వీరపునాయునిపల్లె మండలంలోని ఒంటిగారిపల్లె, ఇందుకూరు గ్రామాల్లో నీటి జౌకులు లభిస్తున్నాయి. జౌకులు కారణంగా వ్యవసాయానికి ప్రతిబంధకంగా మారింది. దీంతో ఈ రెండు గ్రామాలకు పునరావాసం సుస్థిర నివాసం ఏర్పాటు చేసేందుకు అధికారులు ప్రతిపాదించగా ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. పాదయాత్ర హామీ అమలు... ప్రతిపక్ష నేత హోదాలో వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజా సంకల్ప పాదయాత్ర చేపట్టిన విషయం పాఠకులకు తెలిసిందే. అందులో వామికొండ, సర్వరాయసాగర్ ప్రాజెక్టు పనులు పూర్తి చేస్తామని, ఇక్కడి రైతాంగానికి సాగునీరు అందిస్తామని హామీ ఇచ్చారు. ఆమేరకు సీఎం హోదాలో వైఎస్ జగన్ పెండింగ్ పనుల పూర్తి కోసం రూ.212 కోట్లు నిధులు మంజూరు చేశారు. నేడు ఆయన శంకుస్థాపన చేయనున్నారు. వైఎస్ కుటుంబానికి కమలాపురంపై ప్రత్యేక శ్రద్ధ కమలాపురం ప్రజలన్నా, ఈ ప్రాంతమన్నా వైఎస్ కుటుంబానికి ప్రత్యేక శ్రద్ధ. నాడు వైఎస్సార్ కమలాపురం ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయాలని సంకలి్పంచగా, తండ్రి ఆశయాన్ని తనయుడు సీఎం వైఎస్ జగన్ నెరవేరుస్తున్నారు. 2019–22 మధ్య మూడేళ్ల కాలంలో నియోజకవర్గం అభివృద్ధి కోసం సుమారు రూ.1284 కోట్లు వివిధ పనుల కోసం వెచ్చించారు. శుక్రవారం దాదాపు రూ.902 కోట్లతో పలు అభివృద్ధి పనులకు సీఎం చేతుల మీదుగా శంకుస్థాపన కార్యక్రమం నిర్వహిస్తున్నాం. –ఎమ్మెల్యే రవీంద్రనాథరెడ్డి యుద్ధప్రాతిపదికన భూ సేకరణ వామికొండ, సర్వరాయసాగర్ పరిధిలో డి్రస్టిబ్యూటరీ కెనాల్స్ నిర్మాణానికి అవసరమైన భూ సేకరణను యుద్ధప్రాతిపదికన చేపడతాం. అనుకున్న సమయానికి పనులు పూర్తి చేసి రైతాంగానికి సాగునీటిని అందించేందుకు చర్యలు తీసుకుంటాం. ఇప్పటికే భూ సేకరణ చాలా వరకు పూర్తయింది. మిగిలిన భూ సేకరణ పనులు వివిధ దశల్లో ఉన్నాయి. త్వరితగతిన పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటాం. –వి.విజయరామరాజు, కలెక్టర్ అక్టోబరు నాటికి సాగునీరు వామికొండ, సర్వరాయసాగర్ ప్రాజెక్టు పరిధిలో మిగులు పనులకు రూ. 212 కోట్లు ప్రభుత్వం మంజూరు చేసింది. త్వరలోనే టెండర్లు పిలిచి పనులు ప్రారంభిస్తాం. డి్రస్టిబ్యూటరీ కెనాల్స్ పనులు పూర్తి చేసి వచ్చే అక్టోబరు నాటికి కనీసం 20 వేల ఎకరాలకు సాగునీటిని అందించేందుకు ప్రణాళికలు రూపొందించాం. –మల్లికార్జునరెడ్డి, ఎస్ఈ, జీఎన్ఎస్ఎస్, కడప జిల్లాకు రానున్న సీఎం వైఎస్ జగన్ మూడు రోజుల పర్యటన నిమిత్తం శుక్రవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి జిల్లాకు రానున్నారు. గన్నవరం విమానాశ్రయం నుంచి బయలుదేరి కడపకు 11.30 గంటలకు చేరుకుంటారు. 11.50 గంటలకు రోడ్డు మార్గాన కడప పెద్ద దర్గాకు చేరుకోనున్నారు. ప్రత్యేక ప్రార్థనలు, పీఠాధిపతితో సమావేశం అనంతరం 12.20 గంటలకు బయలుదేరి, 12.35 గంటలకు ఏపీఐఐసీ సలహాదారు రాజోలి వీరారెడ్డి ఇంటికి వెళతారు. 12.45 గంటలకు బయలు దేరి ఏపీఎస్‌ఆరీ్టసీ చైర్మన్ అబ్బిరెడ్డి మల్లికార్జునరెడ్డి నివాసానికి చేరుకొని నూతన వధూవరులను ఆశీర్వదించనున్నారు. మధ్యాహ్నం 1 గంటకు బయలుదేరి 1.15 గంటలకు మాధవి కన్వెన్షన్ హాల్లో వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి అఫ్జల్ఖాన్ కుమారుడి వివాహ వేడుకలకు హాజరు కానున్నారు. అనంతరం 1.45 గంటలకు ఎయిర్‌పోర్టు చేరుకొని హెలికాప్టర్లో 2.05 గంటలకు కమలాపురం చేరుకుంటారు. 2.15 గంటలకు బహిరంగ సభా ప్రాంగణం చేరుకొని 2.25 వరకు వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన శిలాఫకాలను ఆవిష్కరించనున్నారు. 2.30 గంటల నుంచి 3.45 గంటల వరకూ బహిరంగ సభలో ప్రజలనుద్దేశించి ప్రసంగించనున్నారు. 3.55 గంటలకు కమలాపురం హెలిప్యాడ్‌కు చేరుకొని 4.30 గంటల వరకూ స్థానిక నాయకులతో మాట్లాడతారు. 4.35 గంటలకు హెలికాప్టర్లో బయలుదేరి 4.50 గంటలకు ఇడుపులపాయ చేరుకోనున్నారు. 5 గంటలకు ఇడుపులపాయ గెస్ట్‌హౌస్‌కు చేరుకొని రాత్రికి అక్కడే బస చేయనున్నారు. -
వైఎస్సార్ జిల్లాలో సీఎం జగన్ మూడు రోజుల పర్యటన.. షెడ్యూల్ ఖరారు
సాక్షి, కడప సిటీ: రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వైఎస్సార్ జిల్లాలో ఈనెల 23, 24, 25 తేదీలలో మూడు రోజులపాటు పర్యటించనున్నారు. ఈ మేరకు సీఎం పర్యటన వివరాలను జిల్లా కలెక్టర్ విజయరామరాజు పత్రికలకు విడుదల చేశారు. ముఖ్యమంత్రి పర్యటన వివరాలు ఇలా.. ఈనెల 23వ తేదీన ►ఉదయం 10.15 గంటలకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తాడేపల్లిలోని తన నివాసం నుంచి బయలుదేరి 10.35 గంటలకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు. ►10.45 గంటలకు గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి 11.30 గంటలకు కడప ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. ►11.35 గంటలకు అక్కడి నుంచి రోడ్డు మార్గాన బయలుదేరి 11.50 గంటలకు కడపలోని అమీన్‌పీర్ దర్గాకు చేరుకుంటారు. ►11.50 నుంచి మధ్యాహ్నం 12.20 గంటల వరకు దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తారు. ►12.20 గంటలకు దర్గా నుంచి బయలుదేరి 12.35 గంటలకు రాష్ట్ర పరిశ్రమల సలహాదారు రాజోలి వీరారెడ్డి స్వగృహానికి చేరుకుంటారు. ►12.35 నుంచి 12.45 గంటల వరకు విశ్రాంతి తీసుకుంటారు. ►12.45 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి ఏపీఎస్ ఆర్టీసీ చైర్మన్ అబ్బిరెడ్డి మల్లికార్జునరెడ్డి ఇంటికి 12.50 గంటలకు చేరుకుని నూతన వధూవరులను ఆశీర్వదిస్తారు. ►1.00 గంటకు మల్లికార్జునరెడ్డి ఇంటి నుంచి బయలుదేరి 1.15 గంటలకు మాధవి కన్వెన్షన్ సెంటర్‌కు చేరుకుంటారు. ►1.15 నుంచి 1.25 గంటల వరకు వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి అఫ్జల్ఖాన్ కుమారుడి వివాహ వేడుకలకు హాజరవుతారు. ►1.25 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి కడప ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. ►1.45 గంటలకు కడప ఎయిర్‌పోర్టు నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో బయలుదేరి 2.05 గంటలకు కమలాపురంలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. ►2.15 గంటలకు బహిరంగసభ వేదిక వద్దకు చేరుకుంటారు. ►2.15 నుంచి 2.25 గంటల వరకు వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేస్తారు. ►2.30 నుంచి 3.45 గంటల వరకు బహిరంగసభలో పాల్గొని ప్రజలనుద్దేశించి మాట్లాడతారు. ►3.55 గంటలకు కమలాపురం హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. ►4.00 నుంచి 4.30 గంటల వరకు స్థానిక నేతలతో మాట్లాడతారు. ►4.35 గంటలకు హెలికాప్టర్లో బయలుదేరి 4.50 గంటలకు ఇడుపులపాయ చేరుకుంటారు. ►5.00 గంటలకు ఇడుపులపాయ వైఎస్సార్ గెస్ట్‌హౌస్‌కు చేరుకుని రాత్రికి అక్కడే బస చేస్తారు. 24వ తేదీన ►ఉదయం 9.00 గంటలకు వైఎస్సార్ గెస్ట్‌హౌస్ నుంచి బయలుదేరి వైఎస్సార్ ఘాట్‌కు చేరుకుంటారు. ►9.10 నుంచి 9.40 గంటల వరకు వైఎస్సార్ ఘాట్ వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తారు. ►9.45 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి 10.00 నుంచి 12.00 గంటల వరకు ఇడుపులపాయలోని చర్చిలో ప్రార్థనల్లో పాల్గొంటారు. ►మధ్యాహ్నం 12.05 గంటలకు వైఎస్సార్ ఎస్టేట్‌కు చేరుకుని 12.15 నుంచి 12.30 గంటల వరకు విశ్రాంతి తీసుకుంటారు. ►12.35 గంటలకు ఇడుపులపాయ నుంచి బయలుదేరి 12.40 గంటలకు పులివెందులలోని భాకరాపురంలోగల హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. ►1.10 నుంచి 1.20 గంటల వరకు విజయ హోమ్స్ జంక్షన్‌ను ప్రారంభిస్తారు. ►1.30 నుంచి 1.40 గంటల వరకు కదిరిరోడ్డు జంక్షన్‌ను, విస్తరణ రోడ్డును ప్రారంభిస్తారు. ►1.50 నుంచి 2.00 గంటల వరకు కూరగాయల మార్కెట్ ప్రారంభిస్తారు. ►2.05 నుంచి 2.20 గంటల వరకు మైత్రి లే అవుట్‌ను ప్రారంభిస్తారు. ►2.35 నుంచి 2.50 గంటల వరకు రాయలాపురం వంతెనను ప్రారంభిస్తారు. ►3.00 నుంచి 3.30 గంటలవరకు డాక్టర్ వైఎస్సార్ బస్టాండును ప్రారంభించి ప్రజలనుద్దేశించి మాట్లాడతారు. ►3.35 నుంచి 3.55 గంటల వరకు అహోబిలపురం స్కూలు అభివృద్ధి పనులను ప్రారంభిస్తారు. ►4.05 నుంచి 4.20 గంటల వరకు 10 ఎంఎల్డీ ఎస్టీపీని ప్రారంభిస్తారు. ►4.30 నుంచి 4.45 గంటల వరకు జీటీఎస్‌ను ప్రారంభిస్తారు. ►5.00 గంటలకు భాకరాపురం హెలిప్యాడ్ చేరుకుని 5.40 గంటలకు ఇడుపులపాయలోని వైఎస్సార్ గెస్ట్‌హౌస్‌కు చేరుకుని రాత్రికి అక్కడే బస చేస్తారు. 25వ తేదీన ►ఉదయం 8.40 గంటలకు ఇడుపులపాయ ఎస్టేట్ నుంచి బయలుదేరి 9.05 గంటలకు పులివెందుల భాకరాపురం హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. ►9.15 నుంచి 10.15 గంటల వరకు సీఎస్ఐ చర్చిలో జరిగే క్రిస్మస్ ప్రార్థనల్లో పాల్గొంటారు. ►10.25 గంటలకు పులివెందుల నుంచి బయలుదేరి 11.00 గంటలకు కడప ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. ►11.00 గంటలకు ఇక్కడి నుంచి బయలుదేరి 11.55 గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకుని 12.20 గంటలకు తాడేపల్లిలోని నివాసానికి చేరుకుంటారు. -
3 రోజుల పర్యటనకు నేడు విశాఖకు సాయిరెడ్డి
సాక్షి, విశాఖపట్నం: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు వి.విజయసాయిరెడ్డి మూడు రోజుల పర్యటనకు మంగళవారం విశాఖ రానున్నారు.శాసనమండలిలో వైఎస్సార్ సీపీ ఫ్లోర్‌లీడర్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావులతో కలిసి మంగళవారం ఉదయం 8 గంటలకు విమానంలో విశాఖకు చేరుకోనున్న విజయసాయిరెడ్డి నేరుగా తన క్యాంప్ కార్యాలయానికి చేరుకుంటారు. అనంతరం ఉదయం 10 గంటలకు జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్దకు చేరుకుంటారు. తమను ఎస్టీల్లో చేర్చాలంటూ గత 28 రోజులుగా రిలే నిరాహార దీక్షలు చేస్తున్న మత్స్యకారులకు సంఘీభావం ప్రకటిస్తారు. ఈ సందర్భంగా మత్స్యకారుల నుద్దేశించి మాట్లాడతారు. అనంతరం స్థానికంగా ఏర్పాటు చేసిన వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు. సాయంత్రం 4 గంటలకు పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే బూడి ముత్యాలనాయుడుతో పాటు పార్లమెంటు జిల్లా అధ్యక్షులు, సిటీ అధ్యక్షులు, కో ఆర్డినేటర్లు, పార్టీ అనుబంధ సంఘాల రాష్ట్ర, జిల్లా కమిటీల నేతలతో భేటీ అవుతారు. పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్మోహన్రెడ్డి నిర్వహిస్తున్న ప్రజా సంకల్పయాత్ర వెయ్యి కిలోమీటర్లు పూర్తిచేసుకోనున్న సందర్భఃగా ఈ నెల 28న రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించనున్న జగనన్నతో కలిసి నడుద్దాం (వాక్ విత్ జగన్) కార్యక్రమం ఏర్పాట్లపై చర్చిస్తారు. పార్లమెంటు జిల్లా కేంద్రాలతో పాటు నియోజకవర్గ, మండల కేంద్రాలు, నగరాలు, పట్టణ ప్రాంతాల్లోని వార్డుల్లో రెండు కిలోమీటర్ల చొప్పున నడవాలని పార్టీ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. పార్లమెంటు, సిటీ అధ్యక్షులు, కో ఆర్డినేటర్ల పర్యవేక్షణలో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అనుసరించాల్సిన వ్యూహంపై ఈ సమావేశంలో సమీక్షిస్తారని వైఎస్సార్సీపీ విశాఖ పార్లమెంటు జిల్లా అధ్యక్షుడు తైనాల విజయకుమార్, పార్టీ నగర అధ్యక్షుడు మళ్ల విజయప్రసాద్ చెప్పారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమాలను విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు. -
సైనిక కుటుంబాలకు రాహుల్ పరామర్శ
జమ్మూకాశ్మీర్: భారత సరిహద్దు గ్రామాల్లో ఉగ్రావాదుల దాడులకు గురై ప్రాణాలు కోల్పోయిన సైనికుల కుటుంబాలను రాహుల్ గాంధీ పరామర్శించారు. మూడు రోజులు జమ్మూకాశ్మీర్ పర్యటనలో భాగంగా బుధవారం అక్కడికి వచ్చిన ఆయన వెంటనే హెలికాప్టర్ ద్వారా పూంచ్ జిల్లాలోని బాల్కోట్ ప్రాంతానికి వెళ్లారు. ఈ జిల్లాలో పాక్ ఉగ్ర వాదుల దాడుల కారణంగా ఆరుగురు భారత సైనికులు ప్రాణాలు కోల్పోయారు. వారి కుటుంబాలను పరామర్శించడంతోపాటు సరిహద్దు వెంబడి ఉన్న గ్రామీణ ప్రజలను పరామర్శించి వారి పరిస్థితులు తెలుసుకునేందుకు రాహుల్ పర్యటన ప్రారంభమైంది. లడఖ్ ప్రాంతాన్ని కూడా రాహుల్ త్వరలో సందర్శించనున్నారు. ఈ పర్యటనలో రాహుల్ వెంటనే రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ చీఫ్ గులాం అహ్మద్ మిర్ ఇతర సీనియర్ పార్టీ నేతలు కూడా ఉన్నారు.