![CM YS Jagan 1st Day YSR Kadapa Tour Live Updates - Sakshi](/styles/webp/s3/article_images/2022/12/23/ys-jagan.jpg4_.jpg.webp?itok=UXfaUMtK)
CM Jagan Kadapa Tour Live Updates
04:23PM
కమలాపురం బహిరంగసభలో సీఎం జగన్ ప్రసంగం
►కమలాపురం నియోజకవర్గంలో ప్రారంభోత్సవాలు చేయడం సంతోషంగా ఉంది
►కమలాపురంలో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టాం
►దేవుడు ఆశీస్సులతో అందరికీ మంచి చేస్తున్నా
►వైఎస్సార్ జిల్లాకు కృష్ణా నీటిని తీసుకురావడానికి మహానేత వైఎస్సారే కారణం
►గాలేరు-నగరిని తీసుకొచ్చేందుకు వైఎస్సార్ ఎంతో కృషి చేశారు
►మహానేత వైఎస్సార్ కృషితోనే గండికోట ప్రాజెక్టును పూర్తి చేశాం
►గత ప్రభుత్వ హయాంలో ఈ ప్రాజెక్టులు నిలిచిపోయాయి
► గత ప్రభుత్వం ఈ ప్రాజెక్టులను పట్టించుకోలేదు
► రూ. 550 కోట్లతో బ్రహ్మంసాగర్ లైనింగ్ పనులు చేపట్టాం
► మేం వచ్చాకే చిత్రావతి ప్రాజెక్టులో నీటిని నిల్వ చేశాం
► కొప్పర్తిలో ఇండస్ట్రీయల్ పనులకు శంకుస్థాపన చేశాం
► ఇండస్ట్రీయల్ పార్క్ పూర్తయితే 2 లక్షల ఉద్యోగాలు వస్తాయి
►కమలాపురంలో రూ. 1017 కోట్లు నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశాం
►వివక్ష చూపించకుండా అర్హులైన అందరికీ సంక్షేమ పథకాలు
►బటన్ నొక్కి నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేస్తున్నాం
►రాష్ట్ర విభజన సమయంలో స్టీల్‌ప్లాంట్ కడతామని హామీ ఇచ్చారు
►విభజన చట్ట హామీలను గత పాలకులు పట్టించుకోలేదు
►జనవరి నెలాఖరులో కడప స్టీల్‌ప్లాంట్ నిర్మాణానికి అడుగులు పడతాయి
►కడప స్టీల్‌ప్లాంట్ నిర్మాణ పనులకు శ్రీకారం చుడతాం
►జిందాల్ కంపెనీ ఆధ్వర్యంలో రూ. 8,800 కోట్లతో స్టీల్‌ప్లాంట్ నిర్మాణం
►గత ప్రభుతంలో లంచాలు ఇస్తేనే పెన్షన్లు వచ్చేవి
►గత ప్రభుత్వంలో ఏ పథకం కావాలన్నా లంచాలే
►గత ప్రభుత్వంలో రైతులకు ట్రాక్టర్లు ఇవ్వాలన్నా లంచాలే
►గతంలోనూ అదే బడ్జెట్.. ఇప్పుడు అదే బడ్జెట్
►గత ప్రభుత్వం ఇన్ని పథకాలు ఎందుకు ఇవ్వలేకపోయింది
►గత ప్రభుత్వ విధానం దోచుకో, పంచుకో, తినుకో
►గజ దొంగల మాదిరి దోచుకోవడం, పంచుకోవడమే వారి పని
►గత ప్రభుత్వానికి, మన ప్రభుత్వానికి తేడా గమనించండి
►రాజకీయ నాయకుడికి విశ్వసనీయత ఉండాలి
►ఇదే నా రాష్ట్రం.. ఇదే నా కుటుంబం
►ప్రజా సంక్షేమమే నా విధానం
►చంద్రబాబు మాదిరిగా ఈ రాష్ట్రం కాకపోతే ఆ రాష్ట్రమని నేను అనడం లేదు
►ఈ పార్టీ కాకపోతే, మరో పార్టీ అని నేను అనడం లేదు
►ఇదే నా రాష్ట్రం..ఇక్కడే నా నివాసం
►5 కోట్ల మంది ప్రజలే నా కుటుంబం
►చంద్రబాబులా దత్తపుత్రుడిని, ఎల్లోమీడియాను నమ్ముకోలేదు
►చంద్రబాబు మాదిరిగా ఈ రాష్ట్రం కాకపోతే ఆ రాష్ట్రమని... ఈ పార్టీ కాకపోతే, మరో పార్టీ అని,దత్తపుత్రుడిలా ఈ భార్య కాకపోతే మరో భార్య అని నేను అనడం లేదు
04.10PM
►పులివెందులకు మించి కమలాపురానికి సీఎం నిధులిచ్చారు: రవీంద్రనాథ్‌రెడ్డి
►అర్హలైన ప్రతీ ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయి: రవీంద్రనాథ్‌రెడ్డి
►రూ.900 కోట్లతో అభివృద్ధి పనులు ప్రారంభించడం సంతోషంగా ఉంది: రవీంద్రనాథ్‌రెడ్డి
►సచివాలయ వ్యవస్థతో గడప గడపకూ సంక్షేమ పథకాలు అందిస్తున్నాం: రవీంద్రనాథ్‌రెడ్డి
03:20PM
►కమలాపురంలో సీఎం జగన్
►పలు అభివృద్ధి కార్యక్రమాలకు సీఎం జగన్ శ్రీకారం
►రూ. 900 కోట్ల అభివృద్ధి కార్యక్రమాలకు సీఎం జగన్ శంకుస్థాపన
02:50PM
►వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి ఆఫ్జల్ ఖాన్ కుమారుడి వివాహ వేడుకలకు హాజరైన సీఎం జగన్
02:15PM
►పటేల్ రోడ్ లోని ఆర్టీసీ చైర్మన్ మల్లిఖార్జున రెడ్డి ఇంటికి చేరుకున్న సీఎం జగన్.
►మల్లిఖార్జున రెడ్డి కుమార్తె హారిక వివాహానికి హాజరైన సీఎం జగన్.. నూతన దంపతులను ఆశీర్వదించారు.
01:18 PM
►కడప అమీన్‌పీర్ దర్గాలో సీఎం వైఎస్ జగన్
►దర్గాలో చాదర్ సమర్పించి.. ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్న సీఎం జగన్
►కడప, కమలాపురం, పులివెందుల నియోజకవర్గాల్లో పర్యటించనున్న సీఎం
► మొదటిరోజు పర్యటనలో కమలాపురంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్న సీఎం
►రూ.900 కోట్లతో అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన
01:05 PM
►అమీన్ పీర్ దర్గాకు చేరుకున్న సీఎం జగన్
►సీఎంకు స్వాగతం పలికిన దర్గా పీఠాధిపతి అరీఫుల్లా హుస్సేనీ
12:52 PM
►కడప చేరుకున్న సీఎం జగన్
►మరికొద్దిసేపటిలో పెద్ద దర్గా చేరుకుని ప్రత్యేక పూజలు చేయనున్న సీఎం జగన్
సాక్షి, కడప: రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వైఎస్సార్ జిల్లాలో మూడు రోజులపాటు (డిసెంబర్ 23, 24, 25) పర్యటిస్తున్నారు. అందులో భాగంగానే శుక్రవారం సీఎం జగన్ వైఎస్సార్ కడప జిల్లాకు చేరుకున్నారు. జిల్లాలో మూడు రోజుల పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment