ameen peer dargah
-
కడప పెద్ద దర్గా ఉరుసు ఉత్సవాల్లో పాల్గొన్న సీఎం జగన్ (ఫొటోలు)
-
పెద్దదర్గా ఉరుసు ఉత్సవాల్లో సీఎం జగన్
-
వైఎస్ఆర్ జిల్లా : అమీన్ పీర్ దర్గాలో సీఎం జగన్ (ఫొటోలు)
-
కడప అమీన్ పీర్ దర్గాలో సీఎం వైఎస్ జగన్
-
కొప్పర్తిలో ఇండస్ట్రీయల్ పార్క్ పూర్తయితే 2 లక్షల ఉద్యోగాలు: సీఎం జగన్
CM Jagan Kadapa Tour Live Updates 04:23PM కమలాపురం బహిరంగసభలో సీఎం జగన్ ప్రసంగం ►కమలాపురం నియోజకవర్గంలో ప్రారంభోత్సవాలు చేయడం సంతోషంగా ఉంది ►కమలాపురంలో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టాం ►దేవుడు ఆశీస్సులతో అందరికీ మంచి చేస్తున్నా ►వైఎస్సార్ జిల్లాకు కృష్ణా నీటిని తీసుకురావడానికి మహానేత వైఎస్సారే కారణం ►గాలేరు-నగరిని తీసుకొచ్చేందుకు వైఎస్సార్ ఎంతో కృషి చేశారు ►మహానేత వైఎస్సార్ కృషితోనే గండికోట ప్రాజెక్టును పూర్తి చేశాం ►గత ప్రభుత్వ హయాంలో ఈ ప్రాజెక్టులు నిలిచిపోయాయి ► గత ప్రభుత్వం ఈ ప్రాజెక్టులను పట్టించుకోలేదు ► రూ. 550 కోట్లతో బ్రహ్మంసాగర్ లైనింగ్ పనులు చేపట్టాం ► మేం వచ్చాకే చిత్రావతి ప్రాజెక్టులో నీటిని నిల్వ చేశాం ► కొప్పర్తిలో ఇండస్ట్రీయల్ పనులకు శంకుస్థాపన చేశాం ► ఇండస్ట్రీయల్ పార్క్ పూర్తయితే 2 లక్షల ఉద్యోగాలు వస్తాయి ►కమలాపురంలో రూ. 1017 కోట్లు నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశాం ►వివక్ష చూపించకుండా అర్హులైన అందరికీ సంక్షేమ పథకాలు ►బటన్ నొక్కి నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేస్తున్నాం ►రాష్ట్ర విభజన సమయంలో స్టీల్‌ప్లాంట్ కడతామని హామీ ఇచ్చారు ►విభజన చట్ట హామీలను గత పాలకులు పట్టించుకోలేదు ►జనవరి నెలాఖరులో కడప స్టీల్‌ప్లాంట్ నిర్మాణానికి అడుగులు పడతాయి ►కడప స్టీల్‌ప్లాంట్ నిర్మాణ పనులకు శ్రీకారం చుడతాం ►జిందాల్ కంపెనీ ఆధ్వర్యంలో రూ. 8,800 కోట్లతో స్టీల్‌ప్లాంట్ నిర్మాణం ►గత ప్రభుతంలో లంచాలు ఇస్తేనే పెన్షన్లు వచ్చేవి ►గత ప్రభుత్వంలో ఏ పథకం కావాలన్నా లంచాలే ►గత ప్రభుత్వంలో రైతులకు ట్రాక్టర్లు ఇవ్వాలన్నా లంచాలే ►గతంలోనూ అదే బడ్జెట్.. ఇప్పుడు అదే బడ్జెట్ ►గత ప్రభుత్వం ఇన్ని పథకాలు ఎందుకు ఇవ్వలేకపోయింది ►గత ప్రభుత్వ విధానం దోచుకో, పంచుకో, తినుకో ►గజ దొంగల మాదిరి దోచుకోవడం, పంచుకోవడమే వారి పని ►గత ప్రభుత్వానికి, మన ప్రభుత్వానికి తేడా గమనించండి ►రాజకీయ నాయకుడికి విశ్వసనీయత ఉండాలి ►ఇదే నా రాష్ట్రం.. ఇదే నా కుటుంబం ►ప్రజా సంక్షేమమే నా విధానం ►చంద్రబాబు మాదిరిగా ఈ రాష్ట్రం కాకపోతే ఆ రాష్ట్రమని నేను అనడం లేదు ►ఈ పార్టీ కాకపోతే, మరో పార్టీ అని నేను అనడం లేదు ►ఇదే నా రాష్ట్రం..ఇక్కడే నా నివాసం ►5 కోట్ల మంది ప్రజలే నా కుటుంబం ►చంద్రబాబులా దత్తపుత్రుడిని, ఎల్లోమీడియాను నమ్ముకోలేదు ►చంద్రబాబు మాదిరిగా ఈ రాష్ట్రం కాకపోతే ఆ రాష్ట్రమని... ఈ పార్టీ కాకపోతే, మరో పార్టీ అని,దత్తపుత్రుడిలా ఈ భార్య కాకపోతే మరో భార్య అని నేను అనడం లేదు 04.10PM ►పులివెందులకు మించి కమలాపురానికి సీఎం నిధులిచ్చారు: రవీంద్రనాథ్‌రెడ్డి ►అర్హలైన ప్రతీ ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయి: రవీంద్రనాథ్‌రెడ్డి ►రూ.900 కోట్లతో అభివృద్ధి పనులు ప్రారంభించడం సంతోషంగా ఉంది: రవీంద్రనాథ్‌రెడ్డి ►సచివాలయ వ్యవస్థతో గడప గడపకూ సంక్షేమ పథకాలు అందిస్తున్నాం: రవీంద్రనాథ్‌రెడ్డి 03:20PM ►కమలాపురంలో సీఎం జగన్ ►పలు అభివృద్ధి కార్యక్రమాలకు సీఎం జగన్ శ్రీకారం ►రూ. 900 కోట్ల అభివృద్ధి కార్యక్రమాలకు సీఎం జగన్ శంకుస్థాపన 02:50PM ►వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి ఆఫ్జల్ ఖాన్ కుమారుడి వివాహ వేడుకలకు హాజరైన సీఎం జగన్ 02:15PM ►పటేల్ రోడ్ లోని ఆర్టీసీ చైర్మన్ మల్లిఖార్జున రెడ్డి ఇంటికి చేరుకున్న సీఎం జగన్. ►మల్లిఖార్జున రెడ్డి కుమార్తె హారిక వివాహానికి హాజరైన సీఎం జగన్.. నూతన దంపతులను ఆశీర్వదించారు. 01:18 PM ►కడప అమీన్‌పీర్ దర్గాలో సీఎం వైఎస్ జగన్ ►దర్గాలో చాదర్ సమర్పించి.. ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్న సీఎం జగన్ ►కడప, కమలాపురం, పులివెందుల నియోజకవర్గాల్లో పర్యటించనున్న సీఎం ► మొదటిరోజు పర్యటనలో కమలాపురంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్న సీఎం ►రూ.900 కోట్లతో అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన 01:05 PM ►అమీన్ పీర్ దర్గాకు చేరుకున్న సీఎం జగన్ ►సీఎంకు స్వాగతం పలికిన దర్గా పీఠాధిపతి అరీఫుల్లా హుస్సేనీ 12:52 PM ►కడప చేరుకున్న సీఎం జగన్ ►మరికొద్దిసేపటిలో పెద్ద దర్గా చేరుకుని ప్రత్యేక పూజలు చేయనున్న సీఎం జగన్ సాక్షి, కడప: రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వైఎస్సార్ జిల్లాలో మూడు రోజులపాటు (డిసెంబర్ 23, 24, 25) పర్యటిస్తున్నారు. అందులో భాగంగానే శుక్రవారం సీఎం జగన్ వైఎస్సార్ కడప జిల్లాకు చేరుకున్నారు. జిల్లాలో మూడు రోజుల పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. -
దక్షిణ భారత అజ్మీర్.. కడప అమీన్‌పీర్ దర్గా
కడప కల్చరల్: ఇస్లాం సూఫీ తత్వాన్ని బోధిస్తూ కులమతాలకు అతీతంగా ప్రజల్లో ఆధ్యాత్మిక చింతనను పెంచుతూ మానవత్వానికే పెద్దపీట వేస్తున్న కడప అమీన్‌పీర్ దర్గాకు విశిష్టమైన పేరుంది. దీన్ని దక్షిణ భారత అజ్మీర్‌గా కూడా కొనియాడుతారు. ఈ దర్గా ప్రధాన ఉరుసు ఉత్సవాలు ఈనెల 7, 8 తేదీలలో నిర్వహిస్తారు. 12వ తేదీ వరకు ఉత్సవాలు కొనసాగుతాయి. చరిత్ర.. 16వ శతాబ్దంలో కర్ణాటకలోని బీదర్ ప్రాంతం నుంచి మహా ప్రవక్త (సొ.అ.వ) వంశీయులైన ఖ్వాజాయే ఖాజుగా నాయబె రసూల్ అతాయే రసూలుల్లాహ్ హజరత్ ఖ్వాజా సయ్యద్‌షా పీరుల్లామాలిక్ సాహెబ్ తన సతీమణి, కుమారులు హజరత్ ఆరీఫుల్లా హుసేనీ సాహెబ్, హజరత్ అహ్మద్ హుసేనీ సాహెబ్తోపాటు భక్తగణంతో ఈ ప్రాంతానికి వచ్చారు. ఆధ్యాత్మిక బోధనలతో అందరినీ ఆకట్టుకున్నారు. నాటి నవాబులు వీరి మహిమలను గమనించి ప్రియ భక్తులు అయ్యారు. వారి కోరిక మేరకు గురువులు కడప నగరంలో స్థిరపడ్డారు. జీవసమాధి.. హజరత్ పీరుల్లా మాలిక్ సాహెబ్ పట్ల ఈర‡్ష్యతో స్థానికుల్లో కొందరు సవాలు విసిరారు. దాని ప్రకారం ఆయన జీవ సమాధి అయి మూడవరోజున దర్శనం ఇవ్వడంతో శత్రువులు సైతం ప్రియమైన భక్తులుగా మారారు. కాగా, హజరత్ అమీనుల్లా హుసేనీ సాహెబ్ 10వ పీఠాధిపతిగా వ్యవహరించారు. ఆయన పేరుతోనే దర్గాను అమీన్‌పీర్ సాహెబ్ దర్గాగా పేర్కొనేవారు. కాలక్రమంలో అది అమీన్‌పీర్ దర్గాగా మారింది. ప్రస్తుతం దర్గా 11వ పీఠాధిపతి హజరత్ ఖ్వాజా సయ్యద్‌షా ఆరీఫుల్లా హుసేనీ సాహెబ్ నిర్వహణలో ఉంది. దర్గాలో మొత్తం గురువులు, వారి వారసుల పేరిట ఇస్లామిక్ క్యాలెండర్ ప్రకారం యేటా మొత్తం 11 చిన్న ఉరుసులు, గంధం ఉత్సవాలు నిర్వహిస్తారు. ప్రస్తుతం పెద్ద ఉరుసును వారం రోజులపాటు అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. పాకిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, పలు ఇస్లామిక్ దేశాల నుంచి కూడా ఈ ఉరుసుకు హాజరవుతారు. -
సర్వమతాల సంస్కృతికి ప్రతీక కడప అమీన్ పీర్ దర్గా
-
మహిమాన్విత సూఫీ క్షేత్రం.. కడప అమీన్‌పీర్ దర్గా
అడుగడుగునా ప్రశాంతత ఉట్టిపడే పవిత్రభూమి అది ఆధ్యాత్మిక శిఖరంగా విశ్వఖ్యాతిగాంచిన ప్రాంగణమది ఎందరో మహానుభావులు కొలువైన పుణ్యవాటిక అది భక్తుల కొంగుబంగారమై విలసిల్లుతున్న సూఫీ క్షేత్రమది అదే.. కడప నగరంలోని ప్రఖ్యాత అమీన్ పీర్ (పెద్ద) దర్గా.. ప్రధాన ఉత్సవానికి ముస్తాబవుతోంది.. త్వరత్వరగా! ఇపుడా సన్నిధిలో.. ఉరుసుకు వేళయింది రారండంటూ.. ఆహ్వానిస్తున్న సు‘గంధ’ పరిమళాలు వేడుకను కనులారా చూద్దామంటూ.. కదిలొస్తున్న ‘చాంద్ సితారే’లు ‘అయ్.. మాలిక్ దువా ఖుబూల్ కరో’ అంటూ దగ్గరవుతున్న చేతులు అందరి మనసుల్లో ప్రతిధ్వనిస్తున్న ‘ఆమీన్.. ఆమీన్’ పలుకులు కడప కల్చరల్ : ఆధ్యాత్మిక చింతనకు... మత సామరస్యానికి మారుపేరు కడప అమీన్‌పీర్ దర్గా. ప్రశాంతతకు నిలయంగా జాతీయ స్థాయిలో ఖ్యాతి గాంచిన పెద్దదర్గా గొప్ప ఆధ్యాత్మిక క్షేత్రంగా విలసిల్లుతోంది. మంగళవారం నుంచి ప్రారంభమయ్యే ప్రధాన ఉరుసు ఉత్సవాలకు దర్గా సర్వాంగ సుందరంగా సిద్ధమైంది. ఇప్పటికే విద్యుద్దీప కాంతులతో శోభాయమానంగా వెలుగొందుతోంది. పలు ప్రాంతాల నుంచి వస్తున్న భక్తులతో దర్గా ప్రాంగణంలో ఆధ్యాత్మిక వాతావరణం ఉట్టిపడుతోంది. కడప నగరంలోని అమీన్‌పీర్ (పెద్ద) దర్గా జాతీయ స్థాయిలో విశిష్ట ఖ్యాతి పొందింది. దశాబ్దాలపాటు కఠోరమైన తపస్సు చేసిన దివ్య గురువులకు దర్గా నిలయంగా మారింది. ఇక్కడ గురువులు జీవ సమాధి కావడంతో మహిమాన్విత క్షేత్రంగా విలసిల్లుతోంది. దర్గాలో ప్రార్థనలు చేసి తమ సమస్యలు చెప్పుకుంటే తప్పక మంచే జరుగుతుందని భక్తుల విశ్వాసం. ఏటా జరిగే ఉత్సవాలలో మతాలకతీతంగా భక్తులు విశేష సంఖ్యలో పాల్గొంటుంటారు. ఈ దర్గా మతసామరస్యానికి, జాతీయ సమైక్యతకు మారుపేరుగా నిలుస్తోంది. మహిమాన్విత క్షేత్రం 16వ శతాబ్దంలో కర్ణాటకలోని బీదర్ ప్రాంతం నుంచి మహా ప్రవక్త మహమ్మద్ వంశీకులైన ఖ్వాజా యే ఖ్వాజా.. నాయబే రసూల్ అతాయే రసూలుల్లా హజరత్ ఖ్వాజా సయ్యద్‌షా పీరుల్లా మాలిక్ సాహెబ్ తన సతీమణితో పాటు కుమారులు హజరత్ ఆరీఫుల్లా హుసేనీ సాహెబ్, హజరత్ అహ్మద్ హుసేనీ సాహెబ్‌లు పలువురు శిష్యగణంతో ఆధ్యాత్మిక బోధనలు చేస్తూ ఈ ప్రాంతానికి వచ్చారు. జీవ సమాధి హజరత్ పీరుల్లా మాలిక్ ఆధ్యాత్మిక బోధనలు చేయడంతో పాటు ఎన్నో మహిమలు చూపేవారు. అనతి కాలంలోనే మాలిక్ పట్ల పెద్ద సంఖ్యలో విశ్వాసం చూపడం, వారి సంఖ్య పెరుగుతుండటంతో గిట్టనివారికి కన్నుకుట్టింది. పీరుల్లా మాలిక్‌కు మహిమలే ఉంటే జీవసమాధి అయి మూడో రోజు సజీవంగా కనిపించాలని సవాల్ విసిరారు. దాన్ని చిరునవ్వుతో స్వీకరించిన ఆయన మొహర్రం పదో రోజు (షహదత్) తన పెద్ద కుమారుడు హజరత్ ఆరీఫుల్లా హుసేనీకి బాధ్యతలు అప్పగించి వందలాది మంది చూస్తుండగా సమాధిలోకి వెళ్లారు. మూడో రోజు సమాధి తెరిచిన వారికి అందులో ఆయన నమాజు చేస్తూ కనిపించారు. ఆయన శక్తిని ప్రత్యక్షంగా చూసిన గిట్టనివారు సైతం శిష్యులుగా మారారు. అనంతరం దర్గా బాధ్యతలు పెద్ద కుమారుడు హజరత్ ఆరీఫుల్లా హుసేనీ సాహెబ్ చేపట్టగా, చిన్న కుమారుడు హజరత్ అహ్మద్ హుసేనీ సాహెబ్ నందలూరు కేంద్రంగా ఆధ్యాత్మిక ప్రయాణం సాగించారు. మహా తపస్వి దర్గాను వ్యవస్థీకరించింది హజరత్ సయ్యద్‌షా పీరుల్లా మాలిక్ అయినా ఇక్కడి పెద్ద ఉరుసు మాత్రం సూఫీ సర్ మస్తాని ఆరీఫుల్లా మహమ్మద్ మహమ్మదుల్ హుసేనీ సాహెబ్ పేరిటే జరుగుతోంది. వీరు 40 ఏళ్లకు పైగా తాడిపత్రి అడవుల్లో, మిగతా 23 ఏళ్లు శేషాచల అడవుల్లో కఠోర తపస్సు చేశా రు. భక్తులు తొలుత ప్రధాన గురువులైన హజరత్ పీరుల్లా మాలిక్ సాహెబ్‌ను దర్శించుకుని తర్వాత హజరత్ ఆరీఫుల్లా హుసేనీ సాహెబ్‌తో పాటు హజరత్ అమీనుల్లా హుసేనీ సాహెబ్, ఇతర గురువుల మజార్లను దర్శించుకుంటారు. 11వ పీఠాధిపతి ఆధ్వర్యంలో.. దర్గాకు ప్రస్తుతం హజరత్ ఖ్వాజా సయ్యద్‌షా ఆరీఫుల్లా హుసేనీ సాహెబ్ 11వ పీఠాధిపతిగా వ్యవహరిస్తున్నారు. ఆయన చిన్న వయస్సులోనే అనేక మత గ్రంథాలను అధ్యయనం చేసి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని సాధించడం విశేషం. శిష్య కోటికి ఈయన కొంగు బంగారంగా నిలిచారు. మానవతా వాదానికి మారుపేరుగా నిలుస్తున్న ఆయన హయాంలోనే దర్గా విశేషంగా అభివృద్ధి చెందింది. కులమతాలకతీతంగా పీఠాధిపతి పట్ల భక్తుల్లో ఎనలేని గౌరవభావం నెలకొంది. కవిగా గురువులు ఆధ్యాత్మిక గురువుగానే కాకుండా కవిగా కూడా ప్రస్తుత దర్గా పీఠాధిపతి హజరత్ సయ్యద్‌షా ఆరీఫుల్లా హుసేనీ సాహెబ్ పేరు గడించారు. ‘అల్ రిసాలా’ సినిమాలో ఆయన ‘మర్హబా.. యా ముస్తఫా’ అనే నాత్ గీతాన్ని రాశారు. అది పెద్ద విజయం సాధించింది. అనంతరం ‘జుగ్ని’ సినిమాలో ఖాసిఫ్ పేరిట ఆయన ‘లాఖో సలాం’ పాట రాశారు. ఈ రెండు గీతాలను ఏఆర్ రెహ్మాన్ స్వీయ సంగీత నిర్వహణలో ఆలపించారు. ఇవేకాకుండా అనేక నాత్ సూఫీ గీతాలను రచించారు. ఇవి డీవీడీలు తదితర రూపాల్లో భక్తులకు అందుబాటులో ఉన్నాయి. అటు ఆధ్మాత్మిక సందేశాలు.. ఇటు కవితాత్మక రచనలతో ఆయన ప్రత్యేకత చాటారు. సినీ నటుల సందడి ప్రముఖ సినీ సంగీత దర్శకుడు ఏఆర్ రెహ్మాన్ తన కుటుంబంతో ఏడాదికి కనీసం ఆరేడుసార్లు దర్గాను దర్శిస్తారు. బాలీవుడ్ స్టార్లు అభి షేక్, ఐశ్వర్యబచ్చన్, అమీర్‌ఖాన్, సల్మాన్‌ఖాన్‌లతో పాటు మరెందరో తెలుగు, తమిళ సినీ ప్రముఖులు.. రాష్ట్ర, జాతీయ స్థాయి ప్రజాప్రతినిధులు కూడా ఈ దర్గాను దర్శిస్తుంటారు. సేవలకు మారు పేరుగా దర్గా పెద్దల ఆధ్వర్యంలో సామాజిక సేవా కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్నారు. పేద ముస్లిం యువతులకు కుట్టు, అల్లికల్లో శిక్షణ.. యువకులకు ఐటీఐ ద్వారా వృత్తి విద్యలు నేర్పుతున్నారు. అమీన్ బ్లడ్ గ్రూప్ పేరిట రక్తదానం చేస్తున్నారు. -
డిసెంబర్ 6న వైఎస్సార్ జిల్లాలో సీఎం జగన్ పర్యటన
సాక్షి, వైఎస్సార్ జిల్లా: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి డిసెంబర్ 6న వైఎస్సార్ కడప జిల్లాలో పర్యటించనున్నారు. ప్రఖ్యాత అమీన్ పీర్ దర్గాను సీఎం సందర్శిస్తారు. దర్గా ఉరుసు సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు కూడా చేస్తారు. అనంతరం కడప నగర శివారులోని మాధవి కన్వెన్షన్‌లో ఆర్టీసీ ఛైర్మన్ దుగ్గాయపల్లె మల్లికార్జున రెడ్డి కుమార్తె వివాహ రిసెప్షన్‌కు హాజరై.. నూతన వధూవరులను ఆశీర్వదించనున్నారు. సీఎం జగన్ పర్యటన నేపథ్యంలో పోలీసులు జిల్లాలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. చదవండి: (సీఎం జగన్ ప్రమాణ స్వీకారం వీడియో చూస్తూ ఆపరేషన్) -
కడపలో స్టార్ హీరోయిన్ సమంత సందడి
-
అమీన్‌పీర్ దర్గాను సందర్శించిన వైఎస్ జగన్
-
చాదర్ సమర్పించిన వైఎస్ జగన్
సాక్షి, కడప : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గురువారం జిల్లాలోని ప్రసిద్ధ అమీన్‌పీర్ దర్గాను సందర్శించారు. అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించి చాదర్ సమర్పించారు. ఆయన వెంట వైఎస్సార్సీపీ మాజీ ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, పార్టీ కార్యకర్తలు, అభిమానులు, ముస్లిం సోదరులు ఉన్నారు. రంజాన్ మాసం సందర్భంగా దర్గాను సందర్శించిన వైఎస్ జగన్ దివంగత ముజావర్ (దర్గా పీఠాధిపతులు)లకు నివాళులర్పించారు. ఆయన రాకతో దర్గా పరిసర ప్రాంతాలు జనంతో కిక్కిరిసిపోయాయి. (చదవండి : ఆత్మీయులతో జగన్ మమేకం) ఇక అమీన్‌పీర్ దర్గా పీఠాధిపతి ఆరీఫుల్లా హుస్సేనీ ఆశీస్సులు తీసుకున్న అనంతరం కడప ఎమ్మెల్యే అంజాద్ బాషా ఏర్పాటు చేసే ఇఫ్తార్ విందులో వైఎస్ జగన్ పాల్గొననున్నట్టు సమాచారం. రెండు రోజుల పర్యటనలో భాగంగా ఆయన బుధవారం వైఎస్సార్ జిల్లాకు వచ్చారు. పోలింగ్ అనంతరం ఆయన తొలిసారిగా జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ నెల 23న ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో పార్టీ అభ్యర్థులు, కౌంటింగ్ ఏజెంట్లకు వైఎస్ జగన్ దిశానిర్దేశం చేసినట్టు తెలుస్తోంది. సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి : అమీన్‌పీర్ దర్గాను సందర్శించిన వైఎస్ జగన్ -
అమీన్ పీర్ దర్గాను దర్శించుకున్న వైఎస్ జగన్
-
అమీన్ పీర్ దర్గాను దర్శించుకున్న వైఎస్ జగన్
-
అమీన్ పీర్ దర్గాను దర్శించుకున్న వైఎస్ జగన్
సాక్షి, కడప: సుదీర్ఘ ప్రజాసంకల్పయాత్రను విజయవంతంగా పూర్తిచేసుకుని కడప జిల్లాకు చేరుకున్న ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి అమీన్ పీర్ దర్గాను దర్శించుకున్నారు. దర్గా వద్దకు చేరుకున్న జననేతకు పార్టీ శ్రేణులు, ప్రజలు ఘనస్వాగతం పలికారు. దర్గా పెద్దలు కూడా వైఎస్ జగన్‌కు ఎదురొచ్చి.. లోనికి ఆహ్వానించారు. దర్గాలో వైఎస్ జగన్ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అక్కడి ఆచారం ప్రకారం వైఎస్ జగన్ చాదర్ సమర్పించారు. ప్రజాసంకల్పయాత్ర ప్రారంభానికి ముందు వైఎస్ జగన్ తిరుమల శ్రీవారిని, అమీన్ పీర్ దర్గాను దర్శించిన సంగతి తెలిసిందే. అయితే 14 నెలల పాటు కొనసాగిన పాదయాత్ర విజయవంతంగా ముగిసిన నేపథ్యంలో ఆయన మొక్కులు చెల్లించుకునేందుకు సంకల్పించుకున్నారు. గురువారం అలిపిరి నుంచి తిరుమలకు కాలినడకన వెళ్లిన వైఎస్ జగన్.. సామాన్య భక్తునిలా క్యూ లైన్లో వెళ్లి శ్రీవారి దర్శనం చేసుకున్నారు. నిన్న రాత్రి తిరుమలలోనే బస చేసిన జననేత నేడు ఉదయం వైఎస్సార్ జిల్లాకు చేరుకున్నారు. వైఎస్సార్ జిల్లాకు చేరుకున్న వైఎస్ జగన్‌కు ప్రజలు అడుగడుగున బ్రహ్మరథం పడుతున్నారు. దారి పొడుగున పూల వర్షం కురిపిస్తూ.. తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. -
పెద్దదర్గాలో అలీ ప్రార్థనలు
కడప కల్చరల్: కడప నగరంలోని అమీన్‌పీర్ దర్గాలో బుధవారం ప్రముఖ సినీ నటుడు అలీ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. సహచరులతో కలిసి దర్గాను దర్శించుకున్న ఆయనకు దర్గా ముజావర్ అమీర్ మొహర్రం మాసం సందర్భంగా దర్గాలో నిర్వహించే ప్రత్యేక ఉత్సవాల గురించి వివరించారు. ఈ సందర్భంగా అలీ దర్గాలోని పీరుల్లామాలిక్ మజార్‌తోపాటు ఆ ప్రాంగణంలోని ఇతర గురువుల మజార్లను కూడా దర్శించుకుని పూల చాదర్‌ను సమర్పించి ప్రార్థనలు నిర్వహించారు. సమీపంలోని చావిడిలోని పీర్లను దర్శించుకున్నా ప్రసాదాన్ని స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఇప్పటికి నాలుగైదుసార్లు ఈ దర్గాను దర్శించుకున్నానని, దర్గా దర్శనం తనకెంతో ఆత్మబలాన్ని ఇస్తోందని తెలిపారు. -
కడపలో దర్గా వార్షిక ఉరుసు ఉత్సవాలు
-
కడప పెదదర్గాను దర్శించుకున్న ఆలీ
-
కడప దర్గాలో ఏఆర్ రెహమాన్..
కడప కల్చరల్: కడప నగరంలోని ఆస్థానె మగ్దూమ్ ఇల్లాహి (అమీన్‌పీర్) దర్గాలో వైభవోపేతంగా జరుగుతున్న హజరత్ ఖ్వాజా అమీనుల్లా మాలిక్ ఉరుసు ఉత్సవాలకు విశ్వ విఖ్యాత సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ హాజరయ్యారు. శనివారం అర్ధరాత్రి జరిగిన గంథోత్సవానికి ఆయన హాజరై ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. దర్గా గురువులు హజరత్ సయ్యద్‌షా ఆరీఫుల్లా హుసేనీ సాహెబ్ గంథం సమర్పించారు. వారితో కలిసి రెహమాన్ ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. దాదాపు రెండు గంటలపాటు కుటుంబ సభ్యులతో కలిసి రెహమాన్ దర్గాలో గడిపారు. ఏటా నిర్వహించే ఉర్సు ఉత్సవాలకు సర్వరమాత్రికుడు తప్పక హాజరయ్యే విషయం తెలిసిందే.