అలీకి దర్గా గురువుల చరిత్రను వివరిస్తున్న ముజావర్ అమీర్
కడప కల్చరల్: కడప నగరంలోని అమీన్‌పీర్ దర్గాలో బుధవారం ప్రముఖ సినీ నటుడు అలీ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. సహచరులతో కలిసి దర్గాను దర్శించుకున్న ఆయనకు దర్గా ముజావర్ అమీర్ మొహర్రం మాసం సందర్భంగా దర్గాలో నిర్వహించే ప్రత్యేక ఉత్సవాల గురించి వివరించారు. ఈ సందర్భంగా అలీ దర్గాలోని పీరుల్లామాలిక్ మజార్‌తోపాటు ఆ ప్రాంగణంలోని ఇతర గురువుల మజార్లను కూడా దర్శించుకుని పూల చాదర్‌ను సమర్పించి ప్రార్థనలు నిర్వహించారు. సమీపంలోని చావిడిలోని పీర్లను దర్శించుకున్నా ప్రసాదాన్ని స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఇప్పటికి నాలుగైదుసార్లు ఈ దర్గాను దర్శించుకున్నానని, దర్గా దర్శనం తనకెంతో ఆత్మబలాన్ని ఇస్తోందని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment