సాక్షి, కడప : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి గురువారం జిల్లాలోని ప్రసిద్ధ అమీన్‌పీర్ దర్గాను సందర్శించారు. అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించి చాదర్ సమర్పించారు. ఆయన వెంట వైఎస్సార్‌సీపీ మాజీ ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, పార్టీ కార్యకర్తలు, అభిమానులు, ముస్లిం సోదరులు ఉన్నారు. రంజాన్ మాసం సందర్భంగా దర్గాను సందర్శించిన వైఎస్ జగన్ దివంగత ముజావర్ (దర్గా పీఠాధిపతులు)లకు నివాళులర్పించారు. ఆయన రాకతో దర్గా పరిసర ప్రాంతాలు జనంతో కిక్కిరిసిపోయాయి.
(చదవండి : ఆత్మీయులతో జగన్ మమేకం)
ఇక అమీన్‌పీర్ దర్గా పీఠాధిపతి ఆరీఫుల్లా హుస్సేనీ ఆశీస్సులు తీసుకున్న అనంతరం కడప ఎమ్మెల్యే అంజాద్ బాషా ఏర్పాటు చేసే ఇఫ్తార్ విందులో వైఎస్ జగన్ పాల్గొననున్నట్టు సమాచారం. రెండు రోజుల పర్యటనలో భాగంగా ఆయన బుధవారం వైఎస్సార్ జిల్లాకు వచ్చారు. పోలింగ్ అనంతరం ఆయన తొలిసారిగా జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ నెల 23న ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో పార్టీ అభ్యర్థులు, కౌంటింగ్ ఏజెంట్లకు వైఎస్ జగన్ దిశానిర్దేశం చేసినట్టు తెలుస్తోంది.
సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి :
అమీన్‌పీర్ దర్గాను సందర్శించిన వైఎస్ జగన్
Comments
Please login to add a commentAdd a comment