
కడప దర్గాలో ఏఆర్ రెహమాన్..
కడప నగరంలోని అమీన్‌పీర్ దర్గాలో జరుగుతున్న హజరత్ ఖ్వాజా అమీనుల్లా మాలిక్ ఉరుసు ఉత్సవాలకు విశ్వ విఖ్యాత సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ హాజరయ్యారు.
కడప కల్చరల్: కడప నగరంలోని ఆస్థానె మగ్దూమ్ ఇల్లాహి (అమీన్‌పీర్) దర్గాలో వైభవోపేతంగా జరుగుతున్న హజరత్ ఖ్వాజా అమీనుల్లా మాలిక్ ఉరుసు ఉత్సవాలకు విశ్వ విఖ్యాత సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ హాజరయ్యారు. శనివారం అర్ధరాత్రి జరిగిన గంథోత్సవానికి ఆయన హాజరై ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.
దర్గా గురువులు హజరత్ సయ్యద్‌షా ఆరీఫుల్లా హుసేనీ సాహెబ్ గంథం సమర్పించారు. వారితో కలిసి రెహమాన్ ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. దాదాపు రెండు గంటలపాటు కుటుంబ సభ్యులతో కలిసి రెహమాన్ దర్గాలో గడిపారు. ఏటా నిర్వహించే ఉర్సు ఉత్సవాలకు సర్వరమాత్రికుడు తప్పక హాజరయ్యే విషయం తెలిసిందే.