prayers
-
మహాశివరాత్రి రోజు భక్తిలో మునిగి తేలిన సుప్రిత (ఫోటోలు)
-
ప్రియుడితో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న జాన్వీ కపూర్ (ఫోటోలు)
-
క్రిస్మస్ ప్రత్యేక ప్రార్ధనల్లో వైఎస్ జగన్, కుటుంబ సభ్యులు (ఫొటోలు)
-
కమల పూర్వీకుల గ్రామంలో సందడి
కమలా హారిస్ పూర్వీకుల గ్రామం తమిళనాడులోని మన్నార్గుడి జిల్లా తులసేంద్రపురంలో సందడి నెలకొంది. మంగళవారం స్థానిక ధర్మ శాస్త శ్రీ కేశవ పెరుమాళ్ ఆలయంలో జరిగిన అభిషేకం, అర్చన కార్యక్రమాల్లో అమెరికా, యూకేల నుంచి వచి్చన ముగ్గురు మహిళా అభిమానులు పాల్గొనడం విశేషం. వీరిని చూసి గ్రామస్తులంతా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. వీరిలో ఒకరు అమెరికాలోని లాస్‌వెగాస్ నుంచి వచ్చినట్లు తెలిపారు. కమలా హారిస్ గెలవాలని కోరుకుంటున్నామన్నారు. ఈ ఆలయ దేవత కమల తాత గోపాలన్ కుటుంబం కుల దైవమని ఆలయ పూజారి సెంథిల్ కుమార్ తెలిపారు. గోపాలన్ కుటుంబ సభ్యులు గతంలో ఆలయానికి రూ.లక్ష విరాళమిచ్చారంటూ అక్కడి శిలా ఫలకంపైన పేర్లను చూపించారు. 2014లో కమలా హారిస్ పేరిట జరిగిన కుంభాభిషేకం కోసం రూ.5 వేలు ఇచ్చారన్నారు. గోపాలన్ కుటుంబ సభ్యులెవరూ ప్రస్తుతం గ్రామంలో ఉండటం లేదన్నారు. గోపాలన్ బ్రిటిష్ ప్రభుత్వంలో అధికారిగా పనిచేశారు. ఆయన కుమార్తె శ్యామలే కమల తల్లి. 2021లో కమలా హారిస్ అమెరికా ఉపాధ్యక్షురాలయ్యారు. ఆ సమయంలో కమల కోసం ఆమె పిన్ని, శ్యామల చెల్లెలు చిట్టి ఇదే ఆలయంలో పూజలు చేశారని పూజారి సెంథిల్ కుమార్ చెప్పారు. అమెరికా అధ్యక్షురాలిగా కమల గెలిస్తే ఊళ్లో అన్నదానం జరిపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని స్థానిక కౌన్సిలర్ అరుల్ మోళి తెలిపారు. -
కార్తీకాన శివరూపం.. కమనీయం ఆ దర్శనం! (ఫోటోలు)
-
కాశీ విశ్వనాథుణ్ణి దర్శించుకున్న సీఎం
వారణాసి: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ శరన్నవరాత్రుల సందర్భంగా మహాశివుణ్ణి ఆరాధించారు. వారణాసికి చేరుకున్న ఆయన ముందుగా భారత సేవాశ్రమ సంఘ్‌లో దుర్గాదేవిని పూజించి, అనంతరం కాశీ విశ్వనాథుణ్ణి, కాలభైరవ ఆలయాన్ని, విశాలాక్షి ఆలయాన్ని సందర్శించారు.నవరాత్రులలో పంచమి రోజున వారణాసికి వచ్చిన సీఎం యోగి ముందుగా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించి, ఆలయ అభివృద్ధి ప్రణాళికలకు స్థల పరిశీలన చేశారు. అనంతరం ఆయన పలు ఆలయాలను సందర్శించారు. త్వరలో ప్రధాని నరేంద్ర మోదీ వారణాసి పర్యటన ఉండవచ్చని స్థానిక అధికారులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని పలు పథకాలకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేయనున్నారని తెలిపారు.ఇది కూడా చదవండి: నాకేం తక్కువ..? నాకూ మద్యం షాపు కావాలి -
కాకినాడలో మాజీ MLA ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పూజలు
-
YSR Jayanthi: ఇడుపులపాయకు వైఎస్ జగన్
-
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న యాంకర్ సుమ.. పలువురు సినీ ప్రముఖులు (ఫొటోలు)
-
రామసేతు ఒడిలో మోదీ ప్రాణాయామం
చెన్నై: రామసేతు వద్ద ప్రధాని నరేంద్ర మోదీ ప్రణాయామం చేశారు. సముద్ర నీటితో ప్రార్థనలు చేశారు. తీరంలో పూలమాలలు వేసి నివాళులర్పించారు. రామాయణంతో సంబంధం ఉన్న తమిళనాడులోని అరిచల్మునై జిల్లాలో ప్రధాని మోదీ పర్యటిస్తున్నారు. శనివారం రాత్రి రామేశ్వరంలో బస చేసిన మోదీ.. రామసేతు నిర్మించిన ప్రదేశంగా పేరొందిన అరిచల్మునైకి వెళ్లారు. రామాయణంతో సంబంధం ఉన్న ప్రదేశాల మూడు రోజుల పర్యటనను ప్రధాని మోదీ తమిళనాడులో ముగించనున్నారు. శుక్రవారం చెన్నైలో ఖేలో ఇండియా గేమ్స్ 2023ను ప్రారంభించారు. శనివారం శ్రీరంగంలోని శ్రీరంగనాథస్వామి, రామేశ్వరంలోని అరుల్మిగు రామనాథస్వామి ఆలయాలను సందర్శించారు. సోమవారం అయోధ్యలో శ్రీరామ మందిర ప్రతిష్ఠాపన జరగనున్న నేపథ్యంలో రామాయణంతో సంబంధం ఉన్న తమిళనాడు ఆలయాలను మోదీ సందర్శించారు. #WATCH | Tamil Nadu: Prime Minister Narendra Modi visits Arichal Munai point in Dhanushkodi, which is said to be the place from where the Ram Setu was built. pic.twitter.com/GGFRwdhwSH— ANI (@ANI) January 21, 2024 అయోధ్య రామమందిరంలో జనవరి 22న బాలరాముని ప్రాణ ప్రతిష్ఠ జరగనుంది. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఈ వేడుకకు దేశంలో దాదాపు 7000 మంది ప్రముఖులు హాజరవుతారు. ఇదీ చదవండి: అయోధ్య రామయ్య దర్శనం, ప్రసాదం ఉచితమే..! -
నీదే దయ.. దేవుని ముందు ప్రణమిల్లిన ప్రొఫెసర్ ఆర్నాల్డ్ డిక్స్
ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీ జిల్లా సిల్క్యారా టన్నెల్ సొరంగంలో చిక్కుకున్నవారిని రక్షించే రెస్క్యూ ఆపరేషన్ దాదాపు పూర్తయింది. టన్నెల్లో అమర్చిన పైప్‌లైన్ ద్వారా రెస్క్యూ బృందం వారిని బయటకు తీసుకురానుంది. దాదాపు 17 రోజుల పాటు టన్నెల్లో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ గడిపిన కార్మికులు బయటకు వస్తున్నారు. వారంతా సురక్షితంగా ఉండాలని కోరుకుంటూ దేవుని ముందు ప్రణమిల్లి ప్రార్థించారు అంతర్జాతీయ టన్నెలింగ్ నిపుణుడు ప్రొఫెసర్ ఆర్నాల్డ్ డిక్స్. నవంబర్ 12న ఉత్తరకాశీలోని సిల్క్యారా సొరంగంలో చిక్కుకున్న 41 మంది కార్మికులను రక్షించేందుకు అంతర్జాతీయ టన్నెలింగ్ నిపుణుడు ఆర్నాల్డ్ డిక్స్ రంగంలోకి దిగారు. రెస్క్యూ బృందం ప్రయత్నాలు ఫలించి బాధితులు బయటపడుతున్న వేళ ఆర్నాల్డ్ డిక్స్ మంగళవారం టన్నెల్ సైట్ సమీపంలోని చిన్న దేవాలయం వద్ద కార్మికుల క్షేమం కోసం అర్చకులతో కలిసి పూజలు చేశారు. దేవుని ముందు ప్రణమిల్లి ప్రార్థనలు చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా మారింది. While long awaited breakthrough in #Uttarkashi tunnel operation is achieved, visual of Prof. Arnold Dix, international tunnelling expert, bowing and praying before temple near the site is so heartwarming. Prayers for safety of all the trapped workers. pic.twitter.com/CcrkeEZZ9i — Arun Bothra 🇮🇳 (@arunbothra) November 28, 2023 -
చంద్రయాన్-3: తిరుమల శ్రీవారి సన్నిధిలో ఇస్రో శాస్త్రవేత్తలు
సాక్షి, తిరుపతి: తిరుమల శ్రీవారిని ఇస్రో శాస్త్రవేత్తల బృందం దర్శించుకుంది. గురువారం ఉదయం స్వామి వారి నైవేద్య విరామ సమయంలో ఇస్రో శాస్త్రవేత్తల బృందం స్వామి వారి సేవలో పాల్గొన్నారు. చంద్రయాన్-3 యొక్క సూక్ష్మ నమూనాలను శ్రీ వేంకటేశ్వర స్వామి వారి పాదాల చెంత ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేశ ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్న చంద్రయాన్–3 ప్రయోగానికి సమయం దగ్గరపడుతోంది. షెడ్యూల్ ప్రకారం ఈ నెల 14వ తేదీన మధ్యాహ్నం 2.35 గంటలకు జియో సింక్రనస్ లాంచ్ వెహికల్ ఎంకే–3(ఎల్వీఎం–3) రాకెట్ శ్రీహరి కోటలోని సతీశ్ ధావన్ అంతరిక్ష కేంద్రం(షార్) నుంచి నింగిలోకి దూసుకెళ్లనుంది. చదవండి: బాహుబలి రాకెట్ చంద్రయాన్ 3 ఇందుకోసం భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో) సైంటిస్టులు ఏర్పాట్లు పూర్తిచేశారు. ప్రయోగం ఎట్టిపరిస్థితుల్లోనూ గురి తప్పకూడదన్న లక్ష్యంతో శ్రమిస్తున్నామని చెబుతున్నారు. ఇప్పుడు అందరి దృష్టి ఎల్వీఎం–3 రాకెట్‌పైనే కేంద్రీకృతమై ఉంది. చంద్రయాన్–3 మిషన్‌లో భాగంగా ఆర్బిటార్, ల్యాండర్, రోవర్‌ను చందమామ వద్దకు మోసుకెళ్లే ఈ రాకెట్‌కు ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. -
రోజంతా కేజ్రీవాల్ ధ్యానం
న్యూఢిల్లీ: దేశాభ్యున్నతి కోసం ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ బుధవారం రోజంతా ధ్యానం, పూజలు, ప్రార్థనలు చేశారు. అవి ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం దాకా కొనసాగినట్టు ఆప్ ట్వీట్ చేసింది. అంతకుముందు ఉదయం ఢిల్లీలో రాజ్‌ఘాట్ వద్ద మహాత్మాగాంధీ సమాధిని కేజ్రీవాల్ సందర్శించి నివాళులర్పించారు. హోలీ సందర్భంగా దేశం కోసం ప్రార్థనలు చేస్తానని కేజ్రీవాల్ మంగళవారమే పేర్కొన్నారు. దేశం కోసం మంచి పనులు చేస్తున్న వారిని జైళ్లపాలు చేస్తున్నారని, దోచుకుంటున్న వారిని మాత్రం వదిలేస్తున్నారని ఆరోపించారు. -
రిషభ్ పంత్ కోలుకోవాలని టీమిండియా క్రికెటర్ల పూజలు.. ఫోటోలు వైరల్
-
రిషభ్ పంత్‌కు ప్రమాదం.. ప్రార్థిస్తున్నా అంటూ ఊర్వశీ రౌతేలా పోస్ట్
టీమిండియా స్టార్ క్రికెటర్ రిషభ్ పంత్ రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. కాగా స్వస్థలం ఉత్తరాఖండ్ నుంచి ఢిల్లీకి వస్తున్న సమయంలో.. రూర్కీ సమీపంలోని నర్సన్ సరిహద్దు వద్ద ఈ ప్రమాదం జరిగింది. అతడు ప్రయాణిస్తున్న కారు యాక్సిడెంట్‌కు గురైన తర్వాత పూర్తిగా దగ్ధమైయ్యింది. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైన రిషభ్ పంత్ అదృష్టవశాత్తూ ప్రాణాలతో బయటపడ్డాడు. ప్రస్తుతం డెహ్రాడూన్‌లోని మాక్స్ ఆస్పత్రిలో చికిత్స జరుగుతోంది. ఇక పంత్ త్వరగా కోలుకోవాలని పలువురు అభిమానులు ప్రార్థనలు చేస్తున్నారు. తాజాగా నటి ఊర్వశీ రౌతేలా సైతం పంత్ యాక్సిడెంట్‌ప తనదైన శైలిలో స్పందించింది. పేరు ప్రస్తావించకుండా.. ప్రార్థిస్తున్నాను అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్టును షేర్ చేసింది. ఊర్వశీ పోస్ట్‌పై చాలామంది ఫ్యాన్స్ పంత్ త్వరగా కోలుకోవాలంటూ కామెంట్స్ చేస్తున్నారు. కాగా ఊర్వశీ-రిషభ్ పంత్ మధ్య గత కొన్నిరోజులుగా సోషల్ మీడియాలో కోల్డ్‌వార్ నెలకొన్న సంగతి తెలిసిందే. తనకోసం ఓ హోట్‌లో ఆర్పీ చాలా సేపు ఎదురుచూశాడని ఊర్వశీ పేర్కొనగా.. కొంతమంది పబ్లిసిటీ కోసం ఇలాంటి చీప్ ట్రిక్స్ వాడతారని, ఇలాంటి వాళ్లనే చేస్తే జాలేస్తుందని రిషభ్ పంత్ ఊర్వశీని ఉద్దేశిస్తూ ఆ మధ్య పోస్ట్ చేసిన సంగతి విధితమే. View this post on Instagram A post shared by Urvashi Rautela (@urvashirautela) -
భర్తల ఆయురారోగ్యాల కోసం ఇంకా జల్లెడ నుంచి చంద్రుడిని చూస్తారా?
జైపూర్: కర్వాచౌత్ నాడు భారతీయ మహిళలు జల్లెడ ద్వారా చంద్రుడిని చూసి తమ భర్తల ఆయురారోగ్యాల కోసం ప్రార్థనలు నిర్వహించడం దురదృష్టకరమని రాజస్తాన్ మంత్రి గోవింద్ రామ్ మేఘవాల్ చేసిన వ్యాఖ్యలు వివాదాన్ని రేపాయి. అభివృద్ధి చెందిన దేశాల్లో మహిళలు సైన్స్ ప్రపంచంలో బతుకుతూ ఉంటే, మన దేశంలో జల్లెడ ద్వారా చంద్రుడిని చూస్తూ భర్త ఆయుష్షు కోసం పూజలు చేస్తున్నారని మరి ఆ భర్తలు భార్యల కోసం జల్లెడలోంచి ఎప్పుడూ చంద్రుడిని చూడలేదని వ్యాఖ్యానించారు. మంత్రి వ్యాఖ్యలపై బీజేపీ తీవ్రంగా స్పందించింది. ఎందరో భారతీయ మహిళలు విమాన పైలెట్లుగా ఉన్నారని, కల్పనా చావ్లా వంటి వారు అంతరిక్షంలోకి వెళ్లారని బీజేపీ ఎమ్మెల్యే రామ్‌లాల్ శర్మ గుర్తు చేశారు. -
Qutub Minar Row: ఆలయ పునరుద్ధరణ సాధ్యం కాదు!
న్యూఢిల్లీ: రక్షిత స్మారక ప్రదేశం అయితే కుతుబ్ మినార్ కాంప్లెక్స్‌లో.. ఆలయాన్ని పునరుద్ధరించడం సాధ్యం కాదని ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా తేల్చి చెప్పేసింది. భారత పురావస్తు సర్వే శాఖ కీలక ప్రకటన చేసింది. కుతుబ్ మినార్ కాంప్లెక్స్‌లో ఆలయపునరుద్ధరణ వ్యవహారం సాకేత్ కోర్టుకు వెళ్లింది. ఈ నేపథ్యంలో.. ఆ స్థలంలో ఆలయాన్ని పునరుద్ధరించాలనే అభ్యర్థనను ఏఎస్ఐ తోసిపుచ్చింది. కుతుబ్ మినార్ అనేది 1914 నుంచి పరిరక్షణ స్మారకంగా కొనసాగుతోంది. అలాంటి చోటులో నిర్మాణాలను మార్చడం సాధ్యం కాదు. స్మారక చిహ్నం వద్ద ఆరాధన పునరుద్ధరణ అనుమతించబడదు అని ఏఎస్ఐ స్పష్టం చేసింది. పూజలకే కాదు.. నమాజ్‌కు నో ఆర్కియాలజీ నిబంధనల ప్రకారం.. నివాసం లేని ప్రదేశాల్లో ప్రార్థనలకు అనుమతించరు. ఈ లెక్కన.. కుతుబ్‌మినార్ దగ్గర పూజలకే కాదు.. నమాజ్‌కు అనుమతులు ఇవ్వలేదు. దీనిపై అభ్యంతరాలు వ్యక్తం అవుతుండగా.. తాము తాజాగా ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయలేదని ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా స్పష్టం చేసింది. పాలసీ ప్రకారం.. నమాజ్‌ను నిలిపివేయాలని గతంలోనే కోరామని, పంపిన ఆదేశాలు కూడా ఎప్పటివో అని స్పష్టం చేసింది. జ్ఞానవాపి మసీద్ సర్వే వ్యవహారం వార్తల్లో నిలిచి వేళ.. ఏఎస్ఐ మాజీ రీజినల్ డైరెక్టర్ ధరమ్వీర్ శర్మ కుతుబ్‌మినార్ మీద ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కుతుబ్ మినార్ను కుతుబ్ అల్ దిన్ ఐబక్ కట్టించలేదని, సూర్యుడి దశను అధ్యయనం చేసేందుకు రాజా విక్రమాదిత్య కట్టించాడని వాదిస్తున్నాడు. మరోవైపు హిందూ సంఘాలు కుతుబ్ మినార్ వద్దకు చేరుకుని విష్ణు స్తంభ్‌గా పేరు మార్చాలంటూ డిమాండ్ చేస్తున్నాయి. చదవండి: కుతుబ్ మినార్ తవ్వకాలపై కేంద్రం క్లారిటీ -
పుతిన్ మానసిక వైద్యం చేయించుకో... మిన్నంటుతున్న నిరసనలు
కీవ్: రష్యా దాడిని నిరసిస్తూ యూరప్ అంతటా నిరసనలు మిన్నంటుతున్నాయి. ‘పుతిన్! మానసిక వైద్యం చేయించుకో. ఉక్రెయిన్ను, ప్రపంచాన్ని ప్రశాంతంగా ఉండనివ్వు’ అంటూ జర్మనీ రాజధాని బెర్లిన్‌లో భారీ ప్లకార్డుల ప్రదర్శన జరిగింది. మరోవైపు ప్రపంచ దేశాల నుంచి ఉక్రెయిన్‌కు సాయం కూడా వెల్లువెత్తుతోంది. 100 టన్నుల మేరకు మందులు, టెంట్లు, స్లీపింగ్ బ్యాకులు, బ్లాంకెట్లు తదితరాలను పంపుతున్నట్టు ఇజ్రాయెల్ తాజాగా ప్రకటించింది. దాంతోపాటు రష్యాతో తనకున్న సత్సంబంధాల దృష్ట్యా యుద్ధాన్ని ఆపేందుకు చర్చలకు మధ్యవర్తిత్వం వహిస్తానంటూ ముందుకొచ్చింది. ఉక్రెయిన్‌కు మరింత సైనిక సాయం పంపడంపై ఈయూ దేశాల విదేశాంగ మంత్రులు ఆదివారం రాత్రి పొద్దుపోయాక వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వీరోచితంగా పోరాడుతున్న ఉక్రెయిన్ దళాలకు తక్షణం సాయం చేయడం కనీస ధర్మమని మంత్రులకు ఈయూ విదేశాంగ విధాన చీఫ్ జోసెఫ్ బోరెల్ విజ్ఞప్తి చేశారు. పోప్ ప్రార్థనలు ఉక్రెయిన్‌లో ప్రాణ నష్టానికి అడ్డుకట్ట పడి శాంతి నెలకొనాలంటూ ప్రపంచవ్యాప్తంగా ప్రార్థనలు జరుగుతున్నాయి. సె యింట్ పీటర్స్ స్క్వేర్‌లో ఆదివారం జరిగిన మధ్యాహ్న ప్రార్థనల్లో పోప్ ఫ్రాన్సిస్ ఈ మేరకు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. -
భజనలు చేస్తూ మోదీ.. లంగర్లో వడ్డిస్తూ రాహుల్
వారణాసి/ఢిల్లీ: పంజాబ్ ఎన్నికల సందడి అక్కడికి వెయ్యి కిలోమీటర్ల దూరంలోని ఉత్తరప్రదేశ్ వారణాసిలో కనిపించింది. కాంగ్రెస్ నుంచి ఆప్ వరకు పార్టీలకతీతంగా రాజకీయ నాయకులందరూ గురు రవిదాస్ సంస్మరణలో మునిగితేలారు. 15వ శతాబ్దానికి చెందిన దళిత నాయకుడు గురు రవిదాస్ జయంతిని పురస్కరించుకొని బుధవారం రాజకీయ నాయకులు, భక్తులతో వారణాసి కిటకిటలాడిపోయింది. రవిదాస్ అనుచరుల ఓట్లను లక్ష్యంగా చేసుకొని అన్ని పార్టీల వారు పోటీలు పడి మరీ ప్రార్థనలు చేశారు. Very special moments at the Shri Guru Ravidas Vishram Dham Mandir in Delhi. pic.twitter.com/PM2k0LxpBg — Narendra Modi (@narendramodi) February 16, 2022 ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఢిల్లీలోని కరోల్‌బాగ్‌లో రవిదాస్ ఆలయాన్ని సందర్శించి మహిళా భక్తులతో కలిసి కూర్చొని భజనలు చేశారు. రవిదాస్ జన్మస్థలమైన వారణాసిలో ఆలయాన్ని అభివృద్ధి చేస్తున్నామని, ఒక ఎంపీగా తనకా అవకాశం దక్కడం అదృష్టమని మోదీ ఒక ట్వీట్లో పేర్కొన్నారు. కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వారణాసిలోని రవిదాస్ ఆలయంలో లంగర్ (సమూహ భోజనాలు)లో భక్తులకు భోజనాలు వడ్డించారు. పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్‌జిత్ సింగ్ చన్నీ తెల్లవారుజామున 4 గంటలకే రవిదాస్ ఆలయాన్ని సందర్శించారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి, ఆప్ ఎంపీ సంజయ్‌సింగ్ కూడా ప్రార్థనలు చేశారు. రవిదాస్‌కి ఎందుకింత ప్రాధాన్యం ► గురు రవిదాస్ వారణాసిలోని గోవర్ధన్‌పూర్ గ్రామంలో చర్మకారుల కుటుంబంలో జన్మించారు. రవిదాసియా అనే ప్రత్యేక మతాన్ని వ్యాప్తి చేశారు. పంజాబ్‌లో ప్రముఖ డేరా సచ్చఖానంద్ బల్లాన్ రవిదాసియా మతాన్నే ఆచరిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఈ డేరాకు 20 లక్షల మంది అనుచరులు ఉన్నారు. ► చిన్నప్పట్నుంచి అంటరానితనాన్ని ఎదుర్కొన్న ఆయన సమాజంలో నెలకొన్న వర్ణ వివక్షను ప్రశ్నిస్తూ కవిత్వం రాశారు. ఆయన రాసిన కవిత్వానికి, రవిదాసులో సాహితీవేత్తకి కులాలకతీతంగా అభిమానులున్నారు. ► సిక్కు రాడికల్ సంస్థకు చెందిన కొందరు నాయకులు 2009లో వియన్నాలో గురు రవిదాస్ డేరాలపై జరిపిన దాడిలో ఒక నాయకుడు మరణించాడు. దీంతో సిక్కు మతంతో తమకు సంబంధం లేదని ఆ డేరా ప్రకటించింది. గురు గ్రంథ సాహిబ్ స్థానంలో రవిదాస్ రచించిన 200 కీర్తనలతో కూడిన అమృత్వాణిని తీసుకువచ్చారు. అదే తమకు మత గ్రంథమని ప్రకటించుకున్నారు. ► పంజాబ్ జనాభాలో 32 శాతం దళితులున్నారు. వారిలో ఎక్కువ మంది రవిదాస్ అనుచరులు కావడంతో రాజకీయ పార్టీల తలరాతలు మార్చే ఓటు బ్యాంకుగా మారారు. ► ఈ సారి పంజాబ్ ఎన్నికలు ఫిబ్రవరి 14నే జరపాలని తొలుత ఎన్నికల సంఘం నిర్ణయించినప్పటికీ రవిదాస్ జయంతి కోసం ఎన్నికల్ని కూడా 20 తేదీకి వాయిదా వేసింది. ► పంజాబ్‌లో దళితుల ఓట్లను ఆకర్షించడానికి గతంలో బీఎస్పీ ప్రయత్నించి కొంత సఫలమైంది. అయితే ఆ పార్టీకి రామ్‌దాసియా సిక్కుల మద్దతు మాత్రమే లభించింది. ఈసారి వీరి ఓట్ల కోసం ప్రతీ పార్టీ గట్టి ప్రయత్నాలు చేస్తోంది. వారణాసిలోని రవిదాస్ ఆలయంలో వడ్డిస్తున్న రాహుల్ -
రవిదాస్ దేవాలయంలో ప్రార్థనలు చేసిన మోదీ
Modi offered prayers at Guru Ravidas Vishram Dham Mandir: ప్రధాని నరేంద్ర మోదీ గురు రవిదాస్ జయంతి సందర్భంగా బుధవారం ఢిల్లీలోని కరోల్ బాగ్‌లోని రవిదాస్ విశ్రామ్ ధామ్ మందిర్‌లో ప్రార్థనలు చేశారు. ఆయన భక్తులతో మమైకమై ఆలయంలో 'షాబాద్ కీర్తన'లో పాల్గొన్నారు. సందర్శకుల పుస్తకంలో కూడా గురు రవిదాస్ జీవితం అందరికీ ఆదర్శమని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన పలు ఫోటోలు, వీడియోలను ట్విట్టర్లో పోస్ట్ చేశారు. అలాగే రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ కూడా ట్విట్టర్లో ...."రవిదాస్ జయంతి సందర్భంగా దేశ ప్రజలకు శుభాకాంక్షలు. సాధువు చూపిన మార్గాన్ని అనుసరించి సమానత్వం, సామరస్యంతో కూడిన సమాజాన్ని నిర్మించడానికి మనమందరం సహకరిద్దాం" అని ట్వీట్ చేశారు. అంతేకాదు ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం కూడా రవిదాస్ జయంతి సందర్భంగా దేశ రాజధాని ఢిల్లీలో సెలవు ప్రకటించింది. గురు రవిదాస్ 15 లేదా 16వ శతాబ్దపు భక్తి ఉద్యమకారుల్లో ఒకరు. అతని శ్లోకాలు గురు గ్రంథ్ సాహిబ్‌లో ప్రముఖంగా ఉంటాయి. హిందూ క్యాలెండర్ ప్రకారం మాఘ పౌర్ణమిని గురుదాస్ జయంతిగా జరుపుకుంటారు. గురు రవిదాస్ లింగ లేదా కులం ఆధారంగా చేసే విభజనను వ్యతిరేకించారు. లింగ సమానత్వం కోసం కృషి చేశారు. అంతేకాదు రవిదాస్‌ని ప్రముఖ భక్తి ఉద్యమ కవయిత్రి మీరా బాయికి ఆధ్యాత్మిక మార్గదర్శి అని కొందరు అంటుంటారు. Very special moments at the Shri Guru Ravidas Vishram Dham Mandir in Delhi. pic.twitter.com/PM2k0LxpBg — Narendra Modi (@narendramodi) February 16, 2022 (చదవండి: మోడల్‌గా మారిన 60 ఏళ్ల కూలీ!) -
పాఠశాలల్లో ప్రార్థనలపై వివాదం
నశంకరి: పాఠశాలలకు విద్యార్థులు హిజబ్– కాషాయ కండువాలతో రావడం తీవ్ర వివాదాస్పదం కాగా, దక్షిణ కన్నడ, బాగల్‌కోటే జిల్లాల్లో రెండు పా ఠశాలల్లో ఒకవర్గం విద్యార్థులు పాఠశాలల్లో నమాజ్ చేయడం సోషల్ మీడియాలో వ్యాప్తి చెందింది. ఇలా అయితే మేము భజన చేస్తామని మరోవర్గం విద్యార్థులు హెచ్చరించారు. దక్షిణ కన్నడ జిల్లా కడబ తాలూకా అంకత్తడ్డ ప్రభుత్వ పాఠశాలలో 10 మందికి పైగా విద్యార్థులు శుక్రవారం నమాజ్ చేసినట్లు వీడియోలు వచ్చాయి. ఇకపై ఎవరైనా తరగతి గదుల్లో నమాజ్ చేసినట్లు కనబడితే తమ విద్యార్థులు భజన చేస్తారని పాఠశాల అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు ప్రవీణ్భండారీ హెచ్చరించారు. ఇళకల్ ప్రభుత్వ పా ఠశాలలోనూ ఇలాంటి దృశ్యమే పునరావృతమైంది. -
ఇదేం చిత్రం.. కోహ్లి సెంచరీ కోసం పాక్ ఆటగాళ్ల మొక్కులు
టీమిండియా మెషిన్ గన్ విరాట్ కోహ్లి సెంచరీ మార్క్ సాధించి దాదాపు మూడేళ్లు కావొస్తుంది. కోహ్లి సెంచరీ లేకుండా ఇన్నేళ్లు ఉండడం ఇదే తొలిసారి. అతను ఎప్పుడు సెంచరీ కొడతాడా అని క్రికెట్ అభిమానులు వెయ్యికళ్లతో ఎదురుచూస్తున్నారు. అయితే తాజాగా ఒక ఆసక్తికర విషయం బయటపడింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోహ్లి అభిమానులే గాక.. పాక్ క్రికెటర్లు సహా ఆ దేశ క్రికెట్ అభిమానులు కూడా కోహ్లి సెంచరీ కోసం పరితపిస్తున్నారని సమాచారం. ఈ విషయాన్ని పీఎస్ఎల్(పాకిస్తాన్ ప్రీమియర్ లీగ్)లో పాల్గొంటున్న ఇస్లామాబాద్ యునైటెడ్ స్ట్రాటెజీ మేనేజర్ హసన్ చీమా తన ట్విటర్లో వెల్లడించాడు. చదవండి: ర్యాంకింగ్స్‌లో దుమ్మురేపిన ఐపీఎల్.. రెండో స్థానంలో సమ్మర్ ఒలింపిక్స్ ''పీఎస్ఎల్ గురించి ఎక్కువగా ట్వీట్ చేయకూడదు అనుకున్నా. కానీ ఒక విషయం నాకు జీర్ణం కావడం లేదు. పీఎస్ఎల్లో ఆడుతున్న పాక్ ఆటగాళ్ల దగ్గర నుంచి అభిమానుల వరకు ఒక విషయాన్ని బలంగా కోరుకుంటున్నారు. అదేంటంటే.. కోహ్లి 71వ సెంచరీ అందుకోవాలని. దీనికోసం పాక్ ఆటగాళ్లు సహా ఫ్యాన్స్ మొక్కుకుంటున్నారు. ఇది నాకు ఆశ్చర్యం కలిగించలేదు. పేరుకే ప్రత్యర్థులం కానీ క్రికెట్లో రాణించే ఆటగాడికి ఏ దేశం నుంచైనా అభిమానులు ఉంటారన్న దానికి కోహ్లియే ఉదాహరణ. కోహ్లి కచ్చితంగా 71వ సెంచరీ సాధిస్తాడు.'' అని ట్వీట్ చేశాడు. ఇది విన్న టీమిండియా అభిమానులు.. ''ఇదేం చిత్రమో.. బయటకు మాత్రం మా చేతిలో పాక్ ఓడిపోతే.. మన దేశాన్ని తిడతారు.'' అంటూ కామెంట్స్ చేశారు. ఇక కోహ్లి ఇటీవలే టెస్టు కెప్టెన్సీ నుంచి వైదొలిగిన సంగతి తెలిసిందే. కాగా అంతకముందే వన్డే, టి20 కెప్టెన్‌గా పక్కకు తప్పుకున్నాడు. ఇకపై సీనియర్ బ్యాట్స్‌మన్‌గా జట్టుకు సేవలందించనున్నాడు. సౌతాఫ్రికాతో సిరీస్‌లో కోహ్లి పర్వాలేదనిపించాడు. అందరు విఫలమైనచోటు తాను కాస్త సక్సెస్ అయ్యాడు. కేప్‌టౌన్ టెస్టులో కోహ్లి సెంచరీ చేస్తాడని అంతా భావించారు. కానీ 21 పరుగుల తేడాతో ఆ ముచ్చట తీరకుండానే 79 పరుగుల వద్ద ఔటయ్యాడు. ఇక సౌతాఫ్రికాతో జరిగిన తొలి వన్డే , మూడో వన్డేలో హాఫ్ సెంచరీలు సాధించినప్పటికి.. వాటిని సెంచరీలుగా మలచలేకపోయాడు. 71వ సెంచరీ సాధిస్తాడని ఎదురుచూస్తున్న కోహ్లి అభిమానుల కల.. విండీస్‌తో సిరీస్‌లోనైనా తీరుతుందేమో చూడాలి. కాగా ఫిబ్రవరి 6 నుంచి టీమిండియా వెస్టిండీస్‌తో సిరీస్ ఆడనుంది. చదవండి: సిక్స్ కొడితే ఫైనల్‌కు.. బౌలర్‌కు హ్యాట్రిక్; ఆఖరి బంతికి ట్విస్ట్ -
విషాదం: తొక్కిసలాటలో 29 మంది దుర్మరణం
న్యూఢిల్లీ: లైబీరియాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. రాజధాని మొనోర్వియాలోని ఒక చర్చిలో తొక్కిసలాటలో 29 మంది మరణించారు. వీరిలో 11 మంది పిల్లలు, ఒక గర్భిణీ స్త్రీ కూడా ఉన్నారని స్థానిక మీడియా నివేదించింది. తీవ్రంగా గాయపడిన మరికొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు ప్రకటించారు. బుధవారం రాత్రి జరిగిన ఈ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. రాజధాని శివారులోని న్యూక్యూటౌన్ లో పెంతెకొస్తల్ చర్చ వద్ద ఆరాధన వేడుక సమయంలో దోపిడీ ముఠా మారణాయుధాలతో చర్చిలోకి ప్రవేశించినట్టు తెలుస్తోంది. దీంతో సమావేశానికి హాజరైన వందలాది భక్తులు భయంతో పరుగులు తీశారు. ఈ సందర్భంగా తీవ్ర గందరగోళం నెలకొంది. ఈ తొక్కిసలాటలో 29మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో ఒకరిని పోలీసులు అరెస్ట్ చేశామని, విచారణ కొనసాగుతోందని స్థానిక పోలీసు ఉన్నతాధికారి వెల్లడించారు. లైబీరియన్ రెడ్‌క్రాస్, డిజాస్టర్ మేనేజ్మెంట్ ఏజెన్సీలు బాధితులకు సహాయ సహకారాలను అందిస్తున్నాయి. మరోవైపు లైబీరియా అధ్యక్షుడు జార్జ్ వీహ్ సంఘటనా సందర్శించి మృతులకు నివాళుర్పించారు. మూడు రోజుల జాతీయ సంతాప దినాలను ప్రకటించారు."ఇది దేశానికి విచారకరమైన రోజు." అని డిప్యూటీ ఇన్ఫర్మేషన్ మినిస్టర్ విచారం వ్యక్తం చేశారు. -
దుర్గమ్మ సన్నిధిలో ఎమ్మెల్యే రోజా
సాక్షి, విజయవాడ : వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా విజయవాడ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్నారు. శ్రావణ శుక్రవారం సందర్భంగా అమ్మవారిని దర్శించుకున్నట్టుగా ఆమె తెలిపారు. మరోవైపు తెలగు రాష్ట్రాల్లో మహిళలు వరలక్ష్మీ వ్రతం పూజలు ఘనంగా నిర్వహిస్తున్నారు. లక్ష్మీదేవి నట్టింట్లోకి నడిచిరావాలని, బాధలు, కష్టాలు తొలగిపోవాలని వరలక్ష్మిని కొలుస్తున్నారు. కరోనా నేపథ్యంలో చాలా మంది ఇళ్లలోనే పూజలు చేస్తున్నారు. నిర్మాత, నటి మంజుల ఘట్టమనేని కూడా ఇంట్లోనే వరలక్ష్మీ వత్రం పూజలు చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను ఆమె ట్విటర్లో షేర్ చేశారు. లక్ష్మీ దేవి అందరి జీవితాల్లోకి ఆనందం, విజయం, ఆరోగ్యం, సంపద తీసుకురావాలని ఆకాంక్షించారు. హీరోయిన్ ప్రణీత కూడా అందరికి వరలక్ష్మీ వ్రతం శుభాకాంక్షలు తెలియజేశారు. -
ఫాదర్ పాలు దొంగిలించిన పిల్లి
పిల్లి పాలు తాగడం చాలా సాధారణమైన అంశం. కానీ ప్రస్తుతం ఓ పిల్లి పాలు తాగుతున్న వీడియో మాత్రం ప్రపంచం అంతా చక్కర్లు కొడతూ తెగ వైరలవ్వడమే కాక పిల్లిని.. దాని యజమానిని ఓవర్‌నైట్‌లో స్టార్స్‌ని చేసింది. కాంటర్బరీ కేథడ్రాల్ ఉదయం ప్రార్థనల లైవ్ స్ట్రీమ్ సెషన్లో జరిగిన ఈ సంఘటన ప్రస్తుతం తెగ వైరలవుతోంది. ఆ వివరాలు.. డీన్ లైవ్‌లో తన ఉపన్యాసాలను చదువుతుండగా.. ఆయన 13 ఏళ్ల పెంపుడు పిల్లి టైగర్ ఎలాంటి జంకు లేకుండా అక్కడకు వచ్చి డీన్ పక్కన ఉన్న కుర్చిపై కూర్చుటుంది. అంతటితో ఊరుకోక ఆ పక్కనే టేబుల్ మీద డీన్ కోసం ఉంచిన పాల వాసనను పసిగడుతుంది. వెంటనే దాని మీదకు దూకి పాలు తాగడం ప్రారంభించింది. ఇది అంతా వీడియోలో రికార్డయ్యింది. టైగర్‌ను గమనించిన డీన్.. ‘క్షమించండి ఈ ఉదయం మాకొక స్నేహితుడు దొరికాడు’ అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వీడియో తెగ వైరలవుతోంది. WATCH: Thirteen-year-old Tiger the cat joins the livestream of Canterbury Cathedral's morning prayers and drinks milk that was meant for the Dean pic.twitter.com/wZRDO5Uph6 — Reuters India (@ReutersIndia) July 10, 2020 -
ఇళ్లలోనే రంజాన్ వేడుకలు..
సాక్షి, అనంతపురం: జిల్లాలో రంజాన్ పర్వదిన వేడుకలు ఘనంగా జరిగాయి. కరోనా నేపథ్యంలో భౌతిక దూరం పాటిస్తూ ముస్లింలు రంజాన్‌ను జరుపుకున్నారు. మసీదుల్లో ఐదు మంది చొప్పున మత పెద్దలు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఎవరి ఇళ్లల్లో వారు కుటుంబ సభ్యులతో కలిసి రంజాన్ ప్రత్యేక ప్రార్థనలు జరుపుకున్నారు. ముస్లింలు అత్యధికంగా నివసించే అనంతపురం, హిందూపురం, పెనుకొండ, ధర్మవరం, తాడిపత్రి, గుంతకల్లు, కదిరి తదితర పట్టణాల్లో రంజాన్ సందర్భంగా ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు చేసి అంతా సుభిక్షంగా ఉండాలని.. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలని అల్లాను ప్రార్థించారు. ముస్లింలకు ప్రతి విషయంలోనూ అండగా నిలుస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి సహకరించాలని వారు ఆకాంక్షించారు. కర్నూలు: జిల్లాలో లాక్డౌన్ నిబంధనలకు అనుగుణంగా రంజాన్ వేడుకలు జరుపుకున్నారు మసీదుల్లో భౌతిక దూరం పాటిస్తూ ముస్లిం సోదరులు ప్రార్థనలు జరుపుకున్నారు. కరోనా వైరస్ కట్టడి కి అందరు కలిసి కట్టుగా కృషి చేయ్యాలని ముస్లిం మత పెద్దలు పిలుపునిచ్చారు. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్ ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆయన కోరారు. తూర్పుగోదావరి: కాకినాడలో రంజాన్ వేడుకలను ముస్లిం సోదరులు భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. లాక్డౌన్ కారణంగా ఇళ్ల వద్దే కుటుంబసభ్యులతో కలిసి ప్రార్ధనలు నిర్వహించుకున్నారు. వైఎస్సార్ జిల్లా: రంజాన్ సందర్భంగా కమలాపురం నియోజకవర్గ ముస్లిం సోదరులకు ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి, వైఎస్సార్సీపీ సమన్వయ కర్త దుగ్గాయపల్లె మల్లికార్జున రెడ్డి. జడ్పీటీసీ నరేన్ రామాంజుల రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. నెలరోజులు కఠోర ఉపవాస దీక్షలు చేసి అల్లాహ్ దగ్గరయిన ముస్లిం సోదరులందరూ రంజాన్ పండుగను ఘనంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు. మత సామరస్యానికి ప్రతీకగా నిలవాలని కోరారు. కరోనా విపత్కర పరిస్థితుల్లో ఇళ్లలోనే ఉండి నవాజ్ ఈద్ ప్రార్థనలు చేసి ప్రభుత్వానికి సహకరించిన ప్రతి ముస్లిం సోదరులకు అభినందనలు తెలిపారు. విజయవాడ: వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముస్లిం మైనార్టీలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పెద్దపీట వేశారన్నారు. ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్ కల్పించిన ఘనత దివంగత మహానేత వైఎస్సార్‌కే దక్కిందన్నారు. -
ఇళ్ల వద్దే ప్రార్ధనలు చేసుకోవాలి..
-
కరోనా: వారిపైనే సిక్కోలు దృష్టి
సాక్షి, శ్రీకాకుళం: ఢిల్లీ వెళ్లి వచ్చిన వారిపైనే సిక్కోలు పరిస్థితి ఆధారపడింది. రాష్ట్రంలో కరో నా కేసులు అమాంతం పెరగడానికి కారణం ఢిల్లీ తబ్లిగీ జమాత్ ప్రార్థనలే అన్న సంగతి అందరికీ తె లిసిందే. అయితే ఆ ప్రార్థనలకు మన జిల్లా నుంచి ఎవ్వరూ హాజరు కాలేదు. కానీ ఆ సమయంలోనే ఢిల్లీ ప్రయాణాలు చేసిన వారు ఉన్నారు. వారిపైనే ఇప్పుడు అందరి దృష్టి నెలకొంది. ఏ మాత్రం అ లసత్వం వహించినా చైన్‌లా కరోనా వ్యాపించే అవకాశం ఉంది. దాన్ని అడ్డుకునే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. ఒక్కొక్కరిగా గుర్తిస్తున్నారు. వెంటవెంటనే శాంపిల్స్ తీసి ల్యాబ్‌కు పంపిస్తున్నారు. ప్రస్తుతం జిల్లా నుంచి 50వరకు శాంపిల్స్ పెండింగ్‌లో ఉన్నాయి. వాటి ఫలితాలు ఏం వస్తాయోనన్న టెన్షన్ జిల్లా వాసులకు పట్టుకుంది. మొ న్నటి వరకు విదేశాల నుంచి వచ్చిన వారితోనే క రోనా వ్యాపిస్తుందని భయం ఉండేది. దాన్ని దృష్టిలో ఉంచుకుని అధికార యంత్రాంగం అప్రమత్త మైంది. విదేశాల నుంచి వచ్చిన వారందరినీ క్వా రంటైన్‌లో పెట్టింది. జిల్లాకు 1455 మంది విదేశాల నుంచి రాగా ఇప్పటివరకు 14 రోజుల క్వారంటైన్ పూర్తి చేసుకున్న వారు 1217 మంది ఉన్నారు. 14 రోజుల లోపు క్వారంటైన్లో ఉన్న వారు 228 మంది మాత్రమే. ఇప్పటివరకు వారిలో కరోనా లక్షణాలు పెద్దగా కనిపించలేదు. దీంతో విదేశాల నుంచి వచ్చిన వారిపై కాస్త భయం తగ్గింది. అనుకోకుండా ఢిల్లీలో జరిగిన తబ్లిగీ జమాత్ కార్యక్రమంతో రాష్ట్ర వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా పెరిగింంది. మన జిల్లాలో ఇంతవరకు ఒక్క పాజిటివ్ లేదు. తబ్లిగీ జమాత్ కార్యక్రమానికి మన జిల్లా నుంచి ముస్లింలెవరూ హాజరు కాలేదు. కాకపోతే ఆ కార్యక్రమానికి వెళ్లి తిరిగిన వచ్చిన వివిధ ప్రాంతాల వారితో రైళ్లలో ప్రయాణించే వా రు, ఆ సమయంలో వివిధ అవసరాల కోసం ఢిల్లీ లో ఉన్న వారు మన జిల్లాలో ఉన్నట్టు ప్రాథమిక సమాచారం. ఢిల్లీ సెల్ టవర్స్ సిగ్నల్ ఆధారంగా ఫోన్ నంబర్లు సేకరించి వారిని సంప్రదిస్తున్నారు. ఇదే సమయంలో ఢిల్లీ టవర్‌తో సంబంధం ఉన్న సెల్ నంబర్లకు జిల్లా నుంచి వెళ్లిన ఫోన్ కాల్స్ ఆధారంగా గుర్తిస్తున్నారు. మొత్తానికి దొరికిన వారికి సంబంధించి శాంపిల్స్ తీస్తున్నారు. అటు ఢిల్లీ ప్రయాణికులు, ఇటు కరోనా లక్షణాల అనుమానితులకు సంబంధించి 95 శాంపిల్స్ తీసి పంపించగా వా టిలో ఇప్పటివరకు 49 నెగిటివ్ వచ్చాయి. మరో 46 శాంపిల్స్ పెండింగ్‌లో ఉన్నాయి. వాటిపైనే ఇప్పుడందరిలో ఉత్కంఠ నెలకొంది. ఢిల్లీ నుంచి వచ్చిన వారిపై ఆరా పొందూరు: మండలానికి ఢిల్లీ నుంచి వచ్చిన వారిని తహసీల్దార్ తామరాపల్లి తాడివలస పీహెచ్సీ డాక్టర్ సాగరికతో కలిసి పరిశీలించారు. రైల్వే డిపార్ట్మెంట్ ఇచ్చిన సమాచారం మేరకు 10 మంది ఢిల్లీ నుంచి వచ్చారని తెలిసిందని అన్నారు. వారిలో ఐదుగురు మాత్రమే మండలంలో ఉండగా మిగిలిన వారు రాలేదని చెప్పారు. ముగ్గురిని క్వా రంటైన్‌కు పంపించామని, ఇద్దరిని హోమ్ క్వారెంటైన్లో ఉంచామని తెలిపారు. వారిలో ఇద్దరికి పరీక్షలు జరిపించగా సాధారణ దగ్గు మాత్రమే ఉందని చెప్పారు. లాక్‌డౌన్‌కు సహకరించండి కాశీబుగ్గ: ప్రజలంతా ఇళ్లకే పరిమితమై లాక్‌డౌన్‌కు సహకరించాలని కాశీబుగ్గ డీఎస్పీ శివరామిరెడ్డి కోరారు. శుక్రవారం కాశీబుగ్గలో సీఐ వేణుగోపాలరావుతో కలిసి విలేకరులతో మాట్లాడారు. డివిజన్ పరిధిలోని 12 మండలాలకు ఢిల్లీ నుంచి వచ్చిన వారు 70 మందిని గుర్తించి జిల్లా కేంద్రంలోని క్వారంటైన్ సెంటర్‌కు తరలించామన్నారు. -
కరోనా వైరస్: తేరుకోకపోతే ముప్పే..
సాక్షి, కాకినాడ: కరోనా మహమ్మారి జిల్లాను అతలాకుతలం చేస్తోంది. జిల్లాలో బుధవారం నాటికి ఆరుగురిలో పాజిటివ్ లక్షణాలు కనిపించడంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. మరో 97 మందిని వైరాలజీ టెస్టులు చేసేందుకు కాకినాడ జీజీహెచ్‌కు తరలించి చర్యలు తీసుకుంటోంది. రాజమహేంద్రవరం, కాకినాడ నగరాలతోపాటు పెద్దాపురం, పిఠాపురం ప్రాంతాల్లో పాజిటివ్ కేసులు నమోదు కావడమే కాకుండా రాజమహేంద్రవరంలో ఒక వ్యక్తి అనుమానాస్పదంగా మృతి చెందిన విషయం తెలిసిందే. ఢిల్లీ వెళ్లి వచ్చిన కాకినాడ, పెద్దాపురాల్లోని ఇద్దరు వ్యక్తుల్లో కరోనా పాజిటివ్ లక్షణాలు కనిపించింది. (కరోనా : అమెరికాలో ఒక్క రోజులోనే 884 మంది మృతి) దీంతో కాకినాడలోని కొంత భాగాన్ని జిల్లా యంత్రాంగం రెడ్ జోన్‌గా ప్రకటించింది. ఆ ప్రాంతంలో గట్టి పోలీస్ బందోబస్త్ ఏర్పాటు చేసి నియంత్రణ చర్యలు చేపట్టింది. వీరిలో రాజమహేంద్రవరానికి చెందిన ఇద్దరు, కాకినాడకు చెందిన ఇద్దరు, పెద్దాపురానికి చెందిన ఒకరు, పిఠాపురానికి చెందిన ఒకరిలో కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడంతో కాకినాడ జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్నారు. రాజమహేంద్రవరం శాంతినగర్‌లో పాజిటివ్ వచ్చిన రోగి కోడలు (36), మనవడు (18), మనుమరాలు (16)కు సైతం పాజిటివ్‌గా తేలింది. తేరుకోకపోతే ముప్పే.. పాజిటివ్ వచ్చిన వ్యక్తులు, ఢిల్లీకి వెళ్లి వచ్చినట్లు అధికారులు నిర్ధారించిన 25 మంది ఎక్కడెక్కడ తిరిగారు, ఎవరెవరిని కలిశారనే విషయాలు రాబట్టడంలో అధికారులు తలమునకలయ్యారు. ఢిల్లీతోపాటు ఇతర దేశాలు, రాష్ట్రాల నుంచి వచ్చిన వారందరూ స్వచ్ఛందంగా వచ్చి సంబంధిత అధికారులను సంప్రదించాలని జిల్లా కలెక్టర్ డి.మురళీధర్‌రెడ్డి విజ్ఞప్తి చేస్తున్నారు. అందరికీ ఉచిత వైద్య నిర్ధారణతో పాటు చికిత్స కూడా అందజేస్తామన్నారు. (కేవలం 29 సబ్జెక్టులకే పరీక్షలు ) రెవెన్యూ, పోలీస్, వైద్యాధికారులతో ర్యాపిడ్ యాక్షన్, జాయింట్ యాక్షన్ కమిటీలు ఏర్పాటు చేయడంతోపాటు జిల్లా, పట్టణ, మండల, గ్రామ స్థాయి అధికారుల సమన్వయంతో ఆయా ప్రాంతాల్లో పరిస్థితులను గురించి ఈ కమిటీలు అధికారులకు నివేదికలిస్తున్నాయి. ఇతర దేశాలు, రాష్ట్రాలు, ఢిల్లీ నుంచి వచ్చిన వారి వివరాలను తెలిపేలా కలెక్టరేట్లో ప్రత్యేక అత్యవసర విభాగాన్ని ఏర్పాటు చేశారు. వైఎస్సార్ గార్డెన్స్ ప్రాంతంలో హై అలర్ట్ పిఠాపురం: ఒక యువకుడికి కరోనా పాజిటివ్ రావడంతో పట్టణ ప్రజలు ఉలిక్కిపడ్డారు. స్థానిక వైఎస్సార్ గార్డెన్స్ ఏరియాలో అధికారులు హై అలెర్ట్ ప్రకటించారు. ఢిల్లీ వెళ్లి వచ్చిన కాకినాడకు చెందిన ఒక వ్యక్తికి కరోనా పాజిటివ్ రాగా ఆ వ్యక్తి గత 20వ తేదీన పిఠాపురం వచ్చి ఇక్కడ ఒక విశ్రాంత పోలీసు అధికారి, సహకార సంఘం నాయకుడు తదితర 20 మంది వ్యక్తులతో గడిపినట్టు తేలింది. వారందరినీ గుర్తించిన అధికారులు కాకినాడ జీజీహెచ్‌కు తరలించారు. వారిలో పిఠాపురం వైఎస్సార్ గార్డెన్స్‌లో నివాసముంటున్న ఒక 20 ఏళ్ల యువకుడికి పాజిటివ్ రిపోర్టులు రావడంతో అంతటా అప్రమత్తమైంది. బుధవారం ఇలా.. జిల్లాలో బుధవారం ఒక్క రోజే 90 నమూనాలు పరీక్షించగా.. 69 నెగిటివ్, 5 పాజిటివ్, 16 ఫలితాలు రావాల్సి ఉంది. కేసులపై నిరంతర నిఘా... జిల్లా కరోనా అనుమానిత కేసులపై అధికారులు పర్యవేక్షిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా రూరల్, అర్బన్ ప్రాంతాల్లో 17,658 మందిపై పర్యవేక్షణ కొనసాగుతోంది. 165 క్వారంటైన్ కేంద్రాలు: జిల్లా వ్యాప్తంగా ‘కోవిడ్–19’ వైరస్ అనుమానితులకు వైద్య సేవలు అందించేందుకు 165 క్వారంటైన్ సెంటర్లు ఏర్పాటు చేశారు. అందులో 6509 పడకలు సిద్ధంగా ఉంచారు. 3441 మంది స్వీయ గృహ నిర్బంధంలో ఉన్నారు. 351 మంది క్వారంటైన్ కేంద్రాల్లో వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. -
‘తబ్లిగి జమాత్’తో పెరిగిన కేసులు
న్యూఢిల్లీ: గత 24 గంటల వ్యవధిలో దేశవ్యాప్తంగా 376 కొత్త కరోనా కేసులు, మూడు మరణాలు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య శాఖ బుధవారం ప్రకటించింది. ఢిల్లీలో జరిగిన తబ్లిగి జమాత్‌కు హాజరై ‘కరోనా’తో తిరిగి స్వస్థలాలకు వెళ్లిన వారి వల్ల ఒక్కసారిగా కేసుల సంఖ్య పెరిగిందని వివరించింది. అంతేకానీ, ఇది దేశవ్యాప్తంగా చోటు చేసుకున్న ట్రెండ్ కాదని స్పష్టం చేసింది. కరోనాతో ఇప్పటివరకు 1,637 కేసులు, 38 మరణాలు నమోదయ్యాయని వెల్లడించింది. అలాగే, 132 మంది చికిత్స అనంతరం కోలుకుని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారని తెలిపింది. వీరిని మినహాయిస్తే చికిత్స పొందుతున్న కేసుల సంఖ్య 1,446కి చేరుతుందని పేర్కొంది. ఢిల్లీలోని తబ్లిగి జమాత్‌కు హాజరైనవారికి సంబంధించి బుధవారం కొత్తగా 154 కేసులు నమోదయ్యాయని ఆరోగ్య శాఖ జాయింట్ సెక్రటరీ లవ్ అగర్వాల్ వెల్లడించారు. వీటిలో జమ్మూకశ్మీర్ నుంచి 23, ఢిల్లీ నుంచి 18, తమిళనాడు నుంచి 65 ఉన్నాయన్నారు. (యూరప్‌లో 30 వేల మంది మృతి) రాష్ట్రాల లెక్క వేరే అయితే, వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు ప్రకటించిన సమాచారం ప్రకారం, కేసుల సంఖ్య 1,910గా, మృతుల సంఖ్య 58గా తెలుస్తోంది. దేశవ్యాప్తంగా బుధవారం సుమారు 400 కొత్త కేసులు, కనీసం 11 మరణాలు నమోదైనట్లు రాష్ట్రాల గణాంకాలు వెల్లడిస్తున్నాయి. మొత్తం కేసుల సంఖ్య ఢిల్లీలో 152కి, మహారాష్ట్రలో 335కి పెరిగిందని ఆయా రాష్ట్రాలు ప్రకటించాయి. మహారాష్ట్రలో బుధవారం ఒక్కరోజే 33 కొత్త కేసులు నమోదవగా, అందులో 30 ఒక్క ముంబైలోనే నమోదయ్యాయి. బుధవారం మహారాష్ట్రలో కోవిడ్–19తో ఆరుగురు మరణించారు. దాంతో, రాష్ట్రంలో మొత్తం మరణాల సంఖ్య 16కి చేరింది. కాగా, ప్రస్తుతం మహారాష్ట్రలో క్వారంటైన్లో ఉన్న 5 వేల మందిలో అత్యధికులు హై రిస్క్ కేటగిరీలో ఉన్న నేపథ్యంలో.. కేసుల సంఖ్య భారీగా పెరిగే అవకాశముందని అధికారులు భావిస్తున్నారు. తమిళనాడులో మొత్తం కేసుల సంఖ్య 234కి చేరింది. వీటిలో 110 కేసులు ఢిల్లీలోని తబ్లిగి జమాత్‌కు హాజరైనవారికి సంబంధించినవే కావడం గమనార్హం. ఢిల్లీ జమాత్‌కు హాజరైన వారిలో ఉత్తరప్రదేశ్‌లో 569 మందిని, గుజరాత్లో 85 మందిని, కర్ణాటకలో 50 మంది విదేశీయులను క్వారంటైన్ చేశారు. గుజరాత్ నుంచి భారీగా దాదాపు 1,500 వరకు ఆ మత సమావేశాలకు హాజరయినట్లు సమాచారం. అస్సాం నుంచి ఢిల్లీ మర్కజ్‌కు 347 మంది హాజరు కాగా, వారిలో 230 మందిని క్వారంటైన్ చేసినట్లు ఆ రాష్ట్రం ప్రకటించింది. లైఫ్ లైన్ విమానాలు కరోనాపై పోరులో భాగంగా 20 వేల రైలు కోచ్‌ల్లో దాదాపు 3.2 లక్షల ఐసోలేషన్, క్వారంటైన్ బెడ్స్‌ను సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. 5 వేల కోచ్‌ల్లో బెడ్స్ ఏర్పాటు ఇప్పటికే ప్రారంభమైందన్నారు. నిర్ధారణ పరీక్షల కిట్స్, ఔషధాలు, మాస్క్‌ల తరలింపు కోసం పౌర విమానయాన శాఖ ‘లైఫ్‌లైన్’ విమానాలను సిద్ధం చేసిందన్నారు. గత 5 రోజుల్లో ఈ విమానాల ద్వారా 15.4 టన్నుల వైద్య పరికరాల సరఫరా జరిగిందన్నారు. నేడు సీఎంలతో మోదీ వీడియో కాన్ఫరెన్స్ న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. కరోనా కట్టడికి చేపట్టాల్సిన చర్యలు, వలస కార్మికుల సామూహిక ప్రయాణాలు, తబ్లిగి జమాత్‌లో పాల్గొన్నవారు, ఆ తరువాత కలిసిన వారిని గుర్తించడం, నిత్యావసర వస్తువులను ప్రజలకు అందుబాటులో ఉంచడం.. తదితర అంశాలు ఆ సమావేశంలో చర్చకు రావచ్చని సంబంధిత వర్గాలు బుధవారం వెల్లడించాయి. -
కరోనా వైరస్: ప్రకాశం భయకంపితం
సాక్షి, చీరాల: జిల్లాలో కరోనా మహమ్మారి కరాళ నృత్యం చేస్తోంది. మూడు రోజుల క్రితం వరకు లండన్ వెళ్లి వచ్చిన యువకునికి తప్ప అతని కుటుంబ సభ్యులకు సైతం నెగిటివ్ రిపోర్టు రావడంతో జిల్లా ప్రజలు, అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ తరుణంలో ఢిల్లీ ప్రార్థనలకు వెళ్లి వచ్చిన ఓ మతపెద్ద ద్వారా అతని భార్య, కుమారునితోపాటు మరో ఏడుగురికి సైతం కరోనా వైరస్ సోకినట్లు నిర్ధారణ కావడంతో జిల్లా అధికారులతోపాటు ప్రజలు భయకంపితులయ్యారు. ఇప్పటి వరకు జిల్లాలో 11 పాజిటివ్ కేసులు నమోదు కాగా, అందులో 10 కేసులు ఢిల్లీ ప్రార్థనలకు వెళ్లి వచ్చినవారు, వారితో సన్నిహితంగా మెలిగిన వారే కావడం గమనార్హం. (అమెరికాలో ఒక్కరోజే 865 కరోనా మరణాలు!) జిల్లాలో నమోదైన 11 పాజిటివ్ కేసుల్లో అత్యధికంగా చీరాలలో 4 కేసులు నమోదు కాగా, కందుకూరులో 3, ఒంగోలు నగరంలో 2, కనిగిరి, కారంచేడులో ఒక్కొక్కటి చొప్పున కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో పాజిటివ్ కేసులు నమోదైన ప్రాంతాలను హైరిస్క్ జోన్లుగా పేర్కొంటూ రెడ్ అలర్ట్ ప్రకటించారు. జిల్లాలో ఢిల్లీ ప్రార్థనలకు వెళ్లి వచ్చిన 280 మందిలో సుమారు 100 మందికి పైగా ఆచూకీ తెలియలేదు. వీరందరూ స్వచ్ఛందంగా క్వారంటైన్ కేంద్రాలకు వచ్చి వైద్య చికిత్స పొందాలని జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్ కోరారు. అంతే కాకుండా వీరి ఆచూకీ కోసం ప్రత్యేక టాస్‌్కఫోర్స్ బృందాలు వెతుకులాట ప్రారంభించాయి. (కౌలాలంపూర్ నుంచి అంటుకుందా? ) ఒంగోలు నగరంలో పాజిటివ్ కేసులు నమోదైన వ్యక్తి భార్య ఆ చుట్టు పక్కల పిల్లలకు ట్యూషన్ చెప్పిందని గుర్తించిన అధికారులు ట్యూషన్‌కు వెళ్లే పిల్లలను గుర్తించి కుటుంబ సభ్యులందరినీ మంగళవారం క్వారంటైన్ కేంద్రాలకు తరలించారు. ఢిల్లీ ప్రార్థనలకు వెళ్లి వచ్చిన వారితో పాటు వైరస్ సోకిన వ్యక్తులతో సన్నిహితంగా ఉన్న వారందరినీ గుర్తించి దగ్గరలోని క్వారంటైన్ కేంద్రాలకు తరలించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. జిల్లాలో ఉన్న 10 క్వారంటైన్ కేంద్రాల్లో ఇప్పటి వరకు 696 మంది ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. ఒంగోలు జీజీహెచ్‌లో ఐసోలేషన్ వార్డులో ఉన్న వారితోపాటు జిల్లా వ్యాప్తంగా సుమారు 80 మంది అనుమానిత లక్షణాలు ఉన్న వారి శాంపిల్స్‌ను ల్యాబ్‌లకు పంపగా వారి రిపోర్టులు రావాల్సి ఉంది. జిల్లాలో ఇప్పటికే 11 కేసులు నమోదు కాగా ఈ సంఖ్య ఇంకా పెరిగే అవకాశముందనే ఆందోళన సర్వత్రా నెలకొంది ఢిల్లీలో ఇస్తిమాకు హాజరైన 14 మందిని క్వారంటైన్‌కు తరలించడంతో నిర్మానుష్యంగా ఇస్లాంపేట చీరాలలో.. చీరాల ప్రాంతం కరోనా కోరల్లోకి వెళ్లింది. ఢిల్లీలో మతపరమైన కార్యక్రమానికి జిల్లా నుంచి 280 మంది వెళ్లగా వారిలో 80 మంది చీరాల పరిసర ప్రాంత ప్రజలు కావడం విశేషం. చీరాల మండలంలోని సాల్మన్‌సెంటర్ పంచాయతీ నవాబుపేటలో భార్యభర్తలకు కరోనా పాజిటివ్ రావడంతో జిల్లా యంత్రాంగం ఉలిక్కిపడింది. మార్చి 12 చీరాల మండలం సాల్మన్‌సెంటర్ పంచాయతీలోని నవాబుపేటకు చెందిన వ్యక్తితో పాటు మరో ఏడుగురు ఇస్తిమాకు చీరాల నుంచి ఢిల్లీ వెళ్లారు. చీరాలలో నాలుగు పాజిటివ్ కేసు నమోదు కావడంతో జిల్లా యాంత్రాంగం చూపు చీరాలపై పడింది. జిల్లా కలెక్టర్, ఉన్నతాధికారులు మొత్తం హుటాహుటిన చీరాలకు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. నవాబుపేటకు చెందిన భార్యభర్తలకు పాజిటివ్ రావడంతో శనివారం ఆయన కుటుంబంతో సహ గృహనిర్భందంలోకి వెళ్లారు. నవాబుపేట, పేరాల ప్రాంతాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించారు. రహదారులు మూతపడ్డాయి. చీరాలలో కంట్రోల్ రూం ఏర్పాటు చేశారు. కంట్రోల్ రూం నెం. 08594–232327 కు ఎవరైనా అనుమానిత కేసులు ఉంటే సంప్రదించాలన్నారు. అలానే అనుమానిత కేసులు తరలించేందుకు మూడు అంబులెన్స్‌లు ఏర్పాటు చేశారు. చీరాల ప్రాంతాన్ని కంటోన్మెంట్ జోన్‌గా ఏర్పాటు చేసి జిల్లా పరిషత్ సీఈఓ, డీవైఎంహెచ్‌ఓ చీరాలలోనే ఉండి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. నవాబుపేటలో రాకపోకలపై పూర్తిగా ఆంక్షలు విధించారు. వలంటీర్లు, ఏఎన్ఎంలు సర్వేలు నిర్వహిస్తున్నారు. కందుకూరులో.. కందుకూరు పట్టణలంలో కరోనా కలకలం రేపింది. పట్టణానికి చెందిన ముగ్గురు వ్యక్తులకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో తీవ్ర ఆందోళనకర వాతావరణం నెలకొంది. కరోనా సోకిన ముగ్గురు వ్యక్తులు ఢిల్లీలో ప్రార్థనకు వెళ్లి వచ్చిన వారే కావడం, వారు పట్టణంలోని పలు కార్యక్రమాల్లో పాల్గొనడంతో ప్రజలు హడలి పోతున్నారు. ప్రస్తుతం కరోనా సోకిన వ్యక్తులు ఎవరెవరిని కలిశారు, ఏ కార్యక్రమాల్లో పాల్గొన్నారనే దానిపై అధికారులు ఆరా తీస్తున్నారు. ఢిల్లీ నుంచి వచ్చిన వ్యక్తులకు కరోనా పాజిటివ్‌గా తేలుతుండడంతో రెండు రోజుల క్రితం వీరిని ఒంగోలు రిమ్స్‌కు తరలించారు. వైద్య పరీక్షల అనంతరం ఈ ముగ్గురికి కరోనా సోకినట్లు వైద్యులు నిర్ధారించారు. దీంతో పట్టణంలో ఒక్కసారిగా కలకలం రేగింది. ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత దాదాపు 10 రోజులపాటు వీరు పట్టణంలో తిరగడంతోపాటు వివిధ కార్యక్రమాల్లో పాల్గొనడమే ఇందుకు కారణం. ప్రస్తుతం ఈ ముగ్గురు కుటుంబ సభ్యులను అధికారులు ఒంగోలు రిమ్స్‌కు తరలించారు. ఆయా ప్రాంతాలను రెడ్‌జోన్‌గా ప్రకటించారు. మక్కా మసీద్‌లో ఇమామ్‌గా పనిచేసిన వ్యక్తి గత శుక్రవారం మసీదులో జరిగిన నమాజ్‌లో పాల్గొన్నారు. ఈ నమాజ్‌లో 80 మంది వరకు పాల్గొన్నట్లు గుర్తించారు. అలాగే బూడిదపాలేనికి చెందిన వ్యక్తి లింగసముద్రంలో ల్యాబ్ టెక్నీషియన్‌గా పనిచేస్తున్నాడు. ఈయన 50 మందికి పైగా రక్త పరీక్షలు చేసినట్లు తేలింది. వారిలో 42 మంది క్వారంటైన్‌కు స్వయంగా వచ్చారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఎమ్మెల్యే మానుగుంట మహీధర్‌రెడ్డి మాట్లాడుతూ.. విక్కిరాలపేటరోడ్డు, బూడిదపాలెం, మక్కామసీదు, పోతురాజుమిట్ట ప్రాంతాలను రెడ్ అలెర్ట్ జోన్స్‌గా ప్రకటిస్తున్నామని తెలిపారు. ప్రజలు అర్ధం చేసుకుని స్వియ నియంత్రణలో ఉండాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం కందూరుకు ఇన్చార్జిగా జెడ్పీ సీఈఓ కైలాస్‌గిరీశ్వర్, ఆర్డీఓ ఓబులేసు, డీఎస్పీ శ్రీనివాసులు, కమిషనర్ మనోహర్, వైద్యాధికారులతో కలిసి సమీక్ష నిర్వహించారు. కనిగిరిలో.. ఢిల్లీలో నిజాముద్దీన్ ఇస్తిమాకు వెళ్లి వచ్చిన కనిగిరికి చెందిన ఏడుగురిని క్వారంటైన్ సెంటర్‌కు తరలించిన సంగతి విధితమే. వారిలో అర్బన్ కాలనీకి చెందిన ఒకరికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో అతని కుటుంబంలోని 11 మంది, సన్నిహితులైన నలుగురు మొత్తం 15 మందిని క్వారంటైన్ సెంటర్‌కు తరలిస్తున్నట్లు కమిషనర్ డీవీఎస్ నారాయణరావు తెలిపారు. అలాగే కరోనా లక్షణాలు ఉన్న వ్యక్తితో పూర్తిగా దగ్గరగా వ్యవహరించిన ఇద్దరు వ్యక్తులను కూడా ఒంగోలుకు తరలించినట్లు సమాచారం. కరోనా పాజిటివ్ వ్యక్తి నివాసం నుంచి 300 మీటర్ల మేర రెడ్‌జోన్‌గా ప్రకటించారు. అ ప్రాంతంలోని అన్ని గృహాల్లో వైద్య, మున్సిపల్, రెవెన్యూ శాఖల అధికారులు సర్వే చేపట్టారు. కరోనా బాధితుడు నివాసం ఉంటున్న అర్బన్ కాలనీ ప్రాంతాన్ని ఎమ్మెల్యే బుర్రా మధుసుదన్ యాదవ్‌తో పాటు, జెడ్పీ సీఈఓ కైలాష్ గిరీశ్వర్, నియోజకవర్గ ప్రత్యేక అధికారి నర్శింహారావు, వైద్యులు, వివిధ శాఖల అధికారులు సందర్శించారు. కరోనా పాజిటివ్ వచ్చిన వ్యక్తి జనతా కర్ఫ్యూ రోజున పోలీసులు, జర్నలిస్టులకు వాటర్ బాటిళ్లు, పండ్లు వగైరా పంపిణీ చేశాడు. ఈ నెల 23 నుంచి ఇప్పటి వరకు అతనికి దగ్గరగా వ్యవహరించిన వ్యక్తులు ఎవరనే దానిపై పూర్తిగా వివరాలు సేకరించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. కారంచేడులో.. మండలంలోని కుంకలమర్రు గ్రామంలో మంగళవారం కరోనా పాటిజివ్ కేసు నమోదు కావడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ఒంగోలు ఆర్డీఓ ప్రభాకరరెడ్డి హుటాహుటిన గ్రామానికి చేరుకున్నారు. రెవెన్యూ, వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు తమ సిబ్బందిని అప్రమత్తం చేశారు. వలంటీర్లను, ఆశా, ఏఎన్ఎంలను రంగంలోకి దించారు. మంగళవారం ఆర్డీఓ కారంచేడు ఎంపీడీఓ కార్యాలయ సమావేశ మందిరంలో అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలను అప్రమత్తంగా ఉంచాలన్నారు. గ్రామంలో మొత్తం 12 బృందాలను ఏర్పాటు చేసి గ్రామంలోని ప్రతి ఇంటినీ జల్లెడపడతారన్నారు. పాజిటివ్ వచ్చిన వ్యక్తితో అతి సన్నిహితంగా ఉన్న వారి పేర్లుతోపాటు, వారి ఆరోగ్య పరిస్థితిని నమోదు చేస్తామన్నారు. గ్రామానికి ఇరువైపులా చెక్‌పోస్టులు ఏర్పాటు చేస్తున్నామన్నారు. గ్రామంలోకి ఎవరూ రావద్దని, గ్రామస్తులు కూడా ఎవరూ బయటకు వెళ్లవద్దంటూ సూచించారు. గ్రామం మొత్తం సోడియం హైపోక్లోరైట్ ద్రావణాన్ని పిచికారీ చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో డీవైఎంహెచ్‌ఓ డాక్టర్ మాధవీలత, ఇన్చార్జి తహసీల్దార్ బ్రహ్మయ్య, ఎంపీడీఓ ప్రద్యుమ్నకుమార్, వైద్య సిబ్బంది, రెవెన్యూ, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. జిల్లాకు కోవిడ్ హాస్పిటల్‌గా నెల్లూరు వైద్యశాల ఒంగోలు: ప్రకాశం జిల్లాలో కోవిడ్ పాజిటివ్ కేసుల ఆరోగ్యం మెరుగుపడకపోతే వారిని నెల్లూరు జిల్లా వైద్యశాలకు తరలించనున్నారు. నెల్లూరు జిల్లా వైద్యశాలను పూర్తిస్థాయి కోవిడ్ వైద్యశాలగా మార్చారు. అక్కడ పూర్తి వెంటిలేటర్ల సౌకర్యంతోపాటు కోవిడ్‌కు అందించే అధునాతన వైద్య పరికరాలను ప్రభుత్వం సమకూర్చింది. అయితే ఒంగోలు జీజీహెచ్‌లో ఉన్న కోవిడ్ 19 అనుమానితులందరూ ఆరోగ్యంగానే ఉన్నారు. వీరికి కోవిడ్ 19 జిల్లా నోడల్ అధికారి డాక్టర్ జాన్ రిచర్డ్స్ ఆధ్వర్యంలోని వైద్య బృందం చికిత్స అందిస్తోంది. -
కరోనా వైరస్: డేజంర్ జర్నీ
సాక్షి, కర్నూలు: కరోనావైరస్ (కోవిడ్-19) మహమ్మారికి లాక్డౌన్, క్వారంటైన్‌తో కళ్లెం వేయాలని చూసిన ప్రభుత్వం, జిల్లా యంత్రాంగానికి కొత్త సమస్య ఎదురైంది. ఢిల్లీలో మతపరమైన ప్రార్థనలకు వెళ్లి వచ్చిన వారిలో కరోనా లక్షణాలు ఉన్నట్లు పలు జిల్లాల్లో తేలడం, అక్కడికి వెళ్లొచ్చిన వారిలో అన్ని జిల్లాల కంటే కర్నూలు వాసులే అధికంగా ఉండటంతో అధికారులు ఒక్కసారిగా ఉలికిపాటుకు గురయ్యారు. వెంటనే అప్రమత్తమై..రానున్న పెనుముప్పును నివారించేందుకు చర్యలు చేపడుతున్నారు. ఢిల్లీని నుంచి వచ్చిన వారిని గుర్తించి క్వారంటైన్‌కు చేర్చిన అధికారులు.. వారి సన్నిహితులు, నివాస ప్రాంతాలను జల్లెడ పడుతున్నారు. (అమెరికాను వణికించిన భూకంపం ) కరోనా వైరస్ విదేశాల నుంచి వస్తున్న వారితో ఇండియాలో వ్యాపిస్తోందని ప్రాథమిక దశలో గుర్తించిన ప్రభుత్వం వెంటనే వారిపై దృష్టి సారించింది. విమానాశ్రయాల్లో స్క్రీనింగ్ చేయించడంతో పాటు అనుమానితులను క్వారంటైన్లో ఉంచింది. అయితే ఆలస్యంగా వెలుగుచూసిన ఢిల్లీ ఘటన ఇతర ప్రాంతాలతో పాటు కర్నూలు జిల్లా వాసులనూ కలవరపెడుతోంది. మార్చి 13 నుంచి 15 వరకు ఢిల్లీలోని నిజాముద్దీన్ ప్రాంతంలో గల మర్కజ్లో మతపరమైన ప్రార్థనలకు వెళ్లొచ్చిన వారిలో కొందరికి కరోనా సోకడం, తెలంగాణలో మరణాలు కూడా సంభవించడంతో అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి.(కరోనా: మరో ప్రముఖ నటుడు మృతి ) మన ప్రభుత్వం కూడా వెంటనే సర్వే చేయించింది. ఢిల్లీకి వెళ్లొచ్చిన వారిలో అత్యధికంగా కర్నూలు జిల్లా వాసులు 258 మంది ఉన్నట్లు ఇప్పటిదాకా గుర్తించారు. అందులోనూ కర్నూలు, నంద్యాల, ఆళ్లగడ్డ, చాగలమర్రి, ఆదోని ప్రాంత వాసులు ఎక్కువగా ఉన్నారు. అదీగాక 60 ఏళ్లకు పైబడిన వారే అధికంగా ఉండడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమై.. వీరిని రాయలసీమ యూనివర్సిటీ, ట్రిపుల్ ఐటీల్లోని క్వారంటైన్ సెంటర్లలో చేర్చుతోంది. ఇప్పటిదాకా 188 మందిని క్వారంటైన్‌కు తరలించింది. 43 మందిని హోం ఐసోలేషన్‌లో ఉంచింది.12 మంది ఇతర రాష్ట్రాలకు వెళ్లినట్లు గుర్తించింది. మరో 15 మంది ఆచూకీ దొరకలేదు. సర్కారు పటిష్ట చర్యలు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు కరోనా కట్టడికి జిల్లా అధికారులు గట్టి చర్యలు చేపట్టారు. లాక్‌డౌన్‌ను పక్కాగా అమలు చేస్తున్నారు. తెలంగాణ, కర్ణాటక సరిహద్దు ప్రాంతాల నుంచి వాహనాల రాకపోకలు నిలిపేశారు. ఇప్పటి వరకూ 23 మందిని ఐసోలేషన్‌లో ఉంచి..వైద్యపరీక్షలు నిర్వహించారు. వీరిలో 13 మందికి కరోనా లేదని తేలింది. సంజామల మండలం నొస్సంలో ఉండే రాజస్థాన్ యువకుడికి పాజిటివ్ వచ్చింది. మరో 9 మంది రిపోర్టులు రావాల్సి ఉంది. ప్రస్తుత పరిస్థితిపై ఆరా ఢిల్లీకి వెళ్లొచ్చిన వారిలో ఎక్కువమంది కర్నూలు వాసులే ఉండటంతో ప్రస్తుత పరిస్థితిపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్నితో పాటు వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక సీఎస్ జవహర్‌రెడ్డి కలెక్టర్‌తో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. పెనుముప్పుపై అప్రమత్తం ఢిల్లీ నుంచి వచ్చిన వారు 20 రోజులుగా జనం మధ్యనే తిరిగారు. ఒకవేళ వారికి పాజిటివ్ వస్తే వారి ద్వారా ఇంకెంతమందికి వ్యాపించి ఉంటుందోనని అధికారులు హైరానా పడుతున్నారు. ఎన్ని కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నా, ఇలాంటి తప్పిదాలు కరోనా వ్యాప్తికి కారణమవుతున్నాయని ఆందోళన చెందుతున్నారు. అందుకే ఢిల్లీకి వెళ్లిన వారి కుటుంబ సభ్యులు సైతం హోం క్వారంటైన్లో ఉండాలని సూచించారు. వారి సన్నిహితులపైనా దృష్టి సారించారు. కరోనా బాధితులకు చికిత్స అందించేందుకు ముందస్తు జాగ్రత్తగా కర్నూలు సర్వజనాస్పత్రితో పాటు విశ్వభారతి, శాంతిరామ్ బోధనాస్పత్రులను ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకుంది. వీటిలో వెంటిలేటర్లతో పాటు అవసరమైన అన్ని సదుపాయాలు పూర్తిస్థాయిలో కలి్పంచారు. అవసరమైతే జిల్లాలోని మరిన్ని ప్రైవేటు ఆస్పత్రులను ఆ«దీనంలోకి తీసుకుని వైద్యం అందించేందుకు అధికారులు సిద్ధమయ్యా రు. వైద్యులు, నర్సుల కొరత లేకుండా ఉండేందుకు ఇప్పటికే వైద్య ఆరోగ్యశాఖ చర్యలకు ఉపక్రమించింది. రిటైర్డ్ సిబ్బందితో పాటు ప్రైవేటు ఆస్పత్రుల సిబ్బంది సేవల వినియోగానికి ఏర్పాట్లు చేస్తోంది. -
మసీదుల్లో ప్రార్ధనలకు వెళ్లొద్దు
-
ఇళ్లలోనే ప్రార్థనలు చేసుకోవాలి..
సాక్షి, విజయవాడ: కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో మసీదుల్లో ఇమామ్, మౌసమ్ లు మాత్రమే ప్రార్థనలు చేస్తారని ఏపీ వక్ఫ్ బోర్డ్ సీఈవో అలీమ్ బాషా తెలిపారు. ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. మసీదుల్లో ప్రార్థనలకు వెళ్లొద్దని.. ఇంట్లోనే ప్రార్థనలు చేసుకోవాలని ముస్లిం సోదరులకు ఆయన సూచించారు. కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ ప్రకటించిన నేపథ్యంలో ముస్లిం లా బోర్డ్ ఫత్వా కూడా జారీ చేసిందన్నారు. దార్ ఉలూమ్ దియోబంద్, జమై నిజామియా వంటి యూనివర్సిటీలు కూడా ఇదే చెబుతున్నాయని తెలిపారు. ముస్లిం పర్సనల్ లా బోర్డ్ కూడా శుక్రవారం ప్రార్థనలు ఇళ్లలోనే చేసుకోవాల్సిందిగా ఫత్వా జారీ చేసిందన్నారు. ముస్లిం సోదరులంతా సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. (కరోనా ప్రభావం: ఆర్బీఐ కీలక నిర్ణయం) -
మసీదులో మహిళలు ప్రార్థన చేయొచ్చు
న్యూఢిల్లీ: మసీదుల్లోకి వచ్చి ముస్లిం మహిళలు ప్రార్థనలు చేయడం ఇస్లాంలో ఆమోదనీయమేనని అఖిల భారత ముస్లిం పర్సనల్ లా బోర్డ్(ఏఐఎంపీఎల్బీ) వెల్లడించింది. ముస్లిం పురుషుల మాదిరిగానే ముస్లిం మహిళలు కూడా నమాజ్ చేసేందుకు మసీదుకు రావొచ్చని తెలిపింది. ఈ మేరకు సుప్రీంకోర్టుకు బుధవారం అఫిడవిట్ సమర్పించింది. మసీదుల్లోకి మహిళలను అనుమతించేలా ఆదేశించాలని కోరుతూ యాస్మీన్ జుబేర్ అహ్మద్ పీర్జాదే దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం విచారణ సందర్భంగా ఏఐఎంపీఎల్బీ ఈ అఫిడవిట్ అందించింది. ఈ అంశాన్ని కూడా శబరిమల సహా మతపరమైన ప్రదేశాల్లో మహిళలు ఎదుర్కొంటున్న వివక్షకు సంబంధించి దాఖలైన పిటిషన్లపై ఏర్పాటైన 9 మంది సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం విచారిస్తుంది. ‘ఇస్లాం గ్రంధాలు, ఇతర సంప్రదాయాలు, విశ్వాసాల ప్రకారం మసీదుల్లోకి మహిళలు వచ్చి నమాజ్ ఆచరించడం ఆమోదనీయమే. మహిళలు మసీదుల్లోకి స్వేచ్ఛగా రావొచ్చు. అలా రావాలా? వద్దా? అని నిర్ణయించుకునే హక్కు ఆ మహిళలకు ఉంది. ఈ విషయానికి సంబంధించి ఉన్న విరుద్ధమైన మతపర అభిప్రాయాలపై మేం స్పందించదలచుకోలేదు’ అని ఏఐఎంపీఎల్బీ ఆ అఫిడవిట్లో పేర్కొంది. ముస్లిం మహిళలు కచ్చితంగా సామూహిక ప్రార్థనల్లో పాల్గొనాలని కానీ, శుక్రవారం ప్రార్థనల్లో పాలు పంచుకోవాలని కానీ ఏ నిబంధన ఇస్లాంలో లేదని ఏఐఎంపీఎల్బీ కార్యదర్శి మొహ్మద్ ఫజ్లుర్రహీమ్ తన న్యాయవాది షంషాద్ ద్వారా కోర్టుకు తెలిపారు. మసీదుల్లో కానీ, ఇంట్లో కానీ ప్రార్థన చేసే అవకాశం ఇస్లాం ముస్లిం మహిళలకు కల్పించిందన్నారు. -
యెమెన్ రక్తసిక్తం
దుబాయ్: అంతర్యుద్ధంతో అట్టుడుకుతున్న యెమెన్ మరోసారి రక్తమోడింది. మసీదులో ప్రార్థనలు చేస్తున్న సైనికులే లక్ష్యంగా జరిగిన డ్రోన్ క్షిపణి దాడిలో 80 మందికి పైగా మృతి చెందారు. ఈ ఘటనకు హుతి తిరుగుబాటుదారులే కారణమని అనుమానిస్తున్నారు. మరిబ్ ప్రావిన్సు సైనిక శిబిరంలోని మసీదులో శనివారం సైనికులంతా ప్రార్థనలు చేస్తుండగా ఈ దాడి చోటుచేసుకుంది. ఘటనలో 83 మంది సైనికులు చనిపోగా 148 మంది గాయపడ్డారని ఆస్పత్రి వర్గాల సమాచారం. 2014లో యెమెన్‌లో అంతర్యుద్ధం మొదలైన తర్వాత జరిగిన అతిపెద్ద దాడి ఇదే. కాగా, నిహ్మ్ ప్రాంతంలో జరిపిన సైనిక చర్యలో పెద్ద సంఖ్యలో హుతిలను మట్టుబెట్టినట్లు అధికారులు వెల్లడించారు. యెమెన్ ప్రభుత్వానికి సౌదీ అరేబియా నేతృత్వంలోని సంకీర్ణ బలగాలు మద్దతిస్తుండగా హుతి తిరుగుబాటుదారులకు ఇరాన్ సహకారం అందిస్తోంది. తాజా ఘటనపై హుతి తిరుగుబాటు నేతలు స్పందించలేదు. ఐక్యరాజ్యసమితి మధ్యవర్తిత్వంతో కీలకమైన హొడైడా నౌకాశ్రయం చుట్టుపక్కల ప్రాంతం నుంచి వైదొలిగేందుకు ఇరుపక్షాలు అంగీకరించిన తర్వాత ఏడాది కాలంగా హింసాత్మక ఘటనలు తగ్గుముఖం పట్టాయి. కానీ, ఒప్పందంలోని అంశాల అమలు నత్తనడకన సాగుతుండటంతో శాంతిస్థాపనపై నీలినీడలు అలుముకున్నాయి. అంతర్యుద్ధం కారణంగా దేశంలో వేలాది మంది చనిపోగా లక్షలాదిగా జనం నిరాశ్రయులయ్యారు. దేశంలో తీవ్రమైన కరువు ఏర్పడింది. -
జామియా మసీదులో మళ్లీ ప్రార్థనలు
శ్రీనగర్: ఆర్టికల్ 370 రద్దు అనంతరం జమ్మూ కశ్మీర్‌లోని నౌహరిహట్టా ప్రాంతంలోని జామియా మిలియా మసీదులో జరిగే రోజువారీ సామూహిక ప్రార్థనలు బుధవారం తొలిసారిగా ప్రారంభమయ్యాయి. జమ్మూ కశ్మీర్‌ను రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజన, ఆర్టికల్ 370 రద్దు చేసిన తర్వాత అధికారులు ఆగస్టు 5న ఈ మసీదుకు సంబంధించిన అన్ని మార్గాలను మూసివేశారు. అప్పట్నుంచి మసీదులో ప్రార్థనలు జరుపుకునేందుకు వీలులేకుండా పోయింది. అయితే 136 రోజుల అనంతరం ఈ మసీదును బుధవారం మధ్యాహ్నం నుంచి తెరిచి సామూహిక ప్రార్థనలకు ఆహ్వానించినట్లు అధికారులు తెలిపారు. -
దేవుని ప్రేమను చర్చి ప్రత్యక్షంగా కనపర్చాలి
కాకులా? అరవడానికి తప్ప అవెందుకు పనికొస్తాయి? అంటుంది లోకం. కరువులో చిక్కుకున్న నా సేవకుడు ఏలియాను పోషించేందుకు కాకులు నాకు చాలా ఉపయోగకరమైనవి అంటాడు దేవుడు. మనిషి ఆలోచనలకు, దేవుని ఆలోచనలకూ మధ్య ఇంత తేడా ఉంటుంది. కరువులో, కారడవిలోని కెరీతు వాగు దగ్గరి ఒక గుహలో ప్రార్థనాదీక్షలో అజ్ఞాతంగా ఉన్న ఏలియాకు మరి ఆహారమెలా? అని ఆలోచించిన ప్రేమామయుడు దేవుడు. అందువల్ల ప్రవక్తకు దేవుడు ప్రతిరోజూ కాకులతోనే ఆహారం పంపి పోషించాడు ( 1 రాజులు 17:4–6). ఇలా పేదలు. ధనికులు, పండితులు, పామరులన్న వివక్షకు తావులేని సమదృష్టి, సమ న్యాయమున్న దేవుని అనంతమైన ప్రేమను అపొస్తలులు సరిగ్గా ఒడిసిపట్టుకున్నారు కాబట్టే వాళ్ళు స్థాపించిన ఆదిమ చర్చి పేదరికంలో కూడా అత్యంత ప్రభావంతో విస్తరించి దేవునికి మహిమ తెచ్చింది. ఆదిమ కాలంలో చర్చిలన్నీ పేదలు, శరణార్థులైన విశ్వాసుల ఇళ్లలోనే స్థాపించబడ్డాయి, అందువల్ల చర్చి అనేది ఒక అనువైన స్థలమే తప్ప, అందమైన మహా కట్టడం కాదు. అయితే దేవుని సహజ స్వభావమైన సార్వత్రిక ప్రేమ, సమన్యాయం, సమదృష్టికి దూరంగా, విరుద్ధంగా నడిచే ఏ చర్చి, పరిచర్య, విశ్వాస జీవితమైనా అది దైవవ్యతిరేకమైనదే. యేసు పరలోకారోహణ తర్వాత ఆనాడు మేడగదిలో వినూత్న విశ్వాసుల సమక్షంలో, వాళ్ళే సభ్యులుగా ఆవిర్భవించిన ‘చర్చి’ దేవుని అద్భుతమైన ప్రేమకు మరో సాదృశ్యం, సాధనం కూడా. అందుకే యేసుప్రభువు ప్రేమను భూదిగంతాలకు వెళ్లి ప్రకటించాలన్న దేవుని మహాభీష్టాన్ని నెరవేర్చే విశ్వాససమూహమైన చర్చికి యేసు ప్రభువే శిరస్సని పౌలు తన పత్రికల్లో వర్ణించాడు. చర్చికి దేవుడిచ్చిన విశిష్టమైన స్థానమిది. అయితే రాను రానూ బాహ్యసౌందర్యానికి, సంఖ్యాబలానికే ప్రాముఖ్యతనిచ్చిన కారణంగా కాపరులకు, చర్చి సభ్యులకు మధ్య అసలు సంబంధమే లేని మెగా చర్చిలు ఆవిర్భవించాయి. చర్చి కాపరి, చర్చిలో విశ్వాసులతోనే నివసిస్తూ ఒక తండ్రిగా, దేవుని ప్రేమ మూర్తీభవించిన ఒక నిస్వార్థ నాయకుడుగా, వారి కష్ట సుఖాల్లో పాలుపంచుకునే ఆప్తుడని అర్థం. ఆదిమ అపొస్తలులు అలాగే ఉన్నారు అందుకే చర్చి ద్వారా దేవుని ప్రేమ భూదిగంతాలకు పాకింది. అయితే చర్చి భవనాలు గొప్పగా నిర్మించి తాము కూడా చాలా గొప్పవాళ్లమనిపించుకోవాలన్న పరిచారకుల దురాశయం కారణంగా, మెగా చర్చిలు ఏర్పడ్డాయి.కానీ ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టడం, ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడం, నిరాశ్రయులను, నిరుపేదలను ఆదరించడమే నిజమైన క్రైస్తవమనే సత్యం మాత్రం పూర్తిగా మరుగున పడింది (మత్తయి 25: 35,36). ధనార్జనే ధ్యేయం గా, చివరికి బైబిల్లోని దశమభాగం సూత్రాన్ని వక్రీకరించి, నిరుపేదల నుండి కూడా ముక్కుపిండి డబ్బు వసూలు చేసే సుంకరుల్లాంటి కాపరుల తరంలో చర్చి వ్యాపార కేంద్రంగా మారింది. ఒక్క చర్చి కోసం పడే శ్రమతోనే, వంద చర్చిల కానుకల్ని రాబట్టాలన్న వ్యాపారపు కాసుల గోలే తప్ప, విశ్వాసుల సంక్షేమమే పట్టని ఇలాంటి ‘చర్చి’కి యేసు శిరస్సు ఎలా అవుతాడు? దేవుడే విశ్వాసులతో పాటు ఉండాలనుకొని తనను తాను ‘ఇమ్మానుయేలు’ అంటే ‘దేవుడు మనకు తోడు’ అని పిలిపించుకోగా, విశ్వాసులకు దూరంగా ఉండాలనుకునే బోధకుడు ఆ దేవుని ప్రతినిధి ఎలా అవుతాడు? మంచి కాపరి తన గొర్రెల కోసం ప్రా ణం పెడతాడని యేసుప్రభువన్నాడు (యోహాను 10:11). అలాంటి ప్రభువు దృష్టి్టలో ఈ కాపరులు ఏమవుతారు? కాకులు కూడా నాకు కావాలనుకున్న దేవుని ప్రేమ ఎక్కడ? ఎంతటి విశ్వాసులైనా నాకు వాళ్ళఖ్ఖర్లేదు. వాళ్ళిచ్చే కాసులు, నాకొచ్చే పేరే నాకు ముఖ్యం అనుకునే ఈ చర్చిలు, కాపరులెక్కడ? –రెవ.డా.టి.ఎ.ప్రభుకిరణ్ సంపాదకులు, ఆకాశధాన్యం -
దేశవ్యాప్తంగా మసీదులు దగ్గర ప్రార్ధనలు
-
వైఎస్ జగన్ సీఎం కావడంతో మొక్కు తీర్చుకున్న బలిజ కాపు సంఘాలు
-
‘అమ్మా! నన్ను కూడా...’
ఒక మహర్షి బీజాక్షర సంయుక్తమైన శ్లోకాన్ని అందించినట్లే శ్యామశాస్త్రి గారు కూడా తన కీర్తనల్లో అంతటి ప్రయత్నం చేసారు. ‘సుమేరు మధ్య వాసినీ వరదే పరదేవతా..’ –మధ్యమా స్వరూపంలో ఉన్న వాక్కుకు అధిష్ఠానమైన దేవతకు పరదేవత–అని పేరు, ‘సుమేరు మధ్య వాసిని, పరదేవత, హిమాద్రిసుతే’’ ..అది లోపల శ్యామశాస్తిగ్రారు దర్శనం చేస్తూ బయటికి వ్యక్తీకరించిన వైఖరీ వాక్కు. కనుక ఆ కీర్తనను మీ ఇంట్లో తెలిసి విన్నా, తెలియకుండా విన్నా ఆ వాక్కులోంచి శబ్ద బ్రహ్మమయి, చరాచరమయి, జ్యోతిర్మయి, వాఙ్మయి అయి అమ్మవారి అనుగ్రహం వైఖరీ రూపంలో ఒక్కసారి శబ్ద బ్రహ్మంగా ఇల్లంతా వ్యాప్తి చెందుతుంది. అది మన జీవితాలలో ఎటువంటి సానుకూల మార్పులనయినా తీసుకురాగలదు. అదీ వాగ్గేయకారులు మనకు చేస్తున్న ఉపకారం.శంకరాచార్యులు ఎక్కడయినా ప్రార్థన చేస్తే...అది శంకరులు చేస్తున్నట్లు ఆయన పేరుతో ఉండదు. ‘అమ్మా ! నన్ను కూడా...’’ అంటారు. అంటే ఆ శ్లోకాన్ని తరువాత కాలంలో ఎవరయినా తెలిసి కానీ, తెలియక కానీ చదువుకుంటే, అది వారే ప్రార్థన చేస్తున్నట్లుగా భావించి, వారిపట్ల అమ్మవారి అనుగ్రహం ప్రసరించాలని అలా చేసారు. అందుకే వారు జగద్గురువులు అయ్యారు.అలాగే శ్యామశాస్తిగ్రారు కూడా ‘శ్యామకష్ణ సోదరీ గౌరీ పరమేశ్వరీ గిరిజా/అలమేలవేణీ కీరవాణీ, శ్రీ లలితే హేమాద్రిసుతే పాహిమాం..’’ అన్న కీర్తనలోకూడా ఆయన మనకు ఇటువంటి ఉపకారమే చేస్తున్నారు.‘అమ్మా! నీవెటువంటిదానివో తెలుసా ! సుమేరు మధ్య వాసినివి. నీలవేణి కలిగిన దానివి’ అంటే నల్లని జడ కలిగిన దానివి. కబరీబంధం(జడ) ఉన్నదానివి–అంటున్నారు. అమ్మవారి కబరీ బంధం మన కంటికి కనబడదు. అమ్మవారిని ఎదురుగుండా వెళ్ళి దర్శనం చేసుకుంటాం. అమ్మవారి వెనక్కి వెడితే – కిరీటానికి మధ్యలో కొంచెం ఖాళీ ఉండి అందులో కబరీ బంధం ఇముడుతుంది. దానిని దర్శనం చేస్తే మన అజ్ఞానం పోతుంది.నల్లకలువల దండలా ఉండే నల్లటి జడ, నల్లటి అజ్ఞానాన్ని ఎలా పోగొడుతుంది ? అది తెలియాలంటే లలితా సహస్రనామంలోకి వెళ్ళాలంటారు. దేవతలను ఉపాసన చేసేటప్పడు కేశాది, పాదాది పర్యంతం(తల దగ్గర మొదలుపెట్టి పాదాల వరకు) చేయాలి. అదే పురుష స్వరూపాన్ని చేసినప్పుడు పాదాది, కేశాది పర్యంతం చేయాలి. కానీ లలితా సహస్రంలో ముందు తల చెప్పరు. ‘చతుర్బాహుసమన్విత’ అన్నారు. అలా చేతులతో ఎందుకు మొదలుపెట్టారో శ్యామశాస్తిగ్రారు ఆ రహస్యాన్ని ఆవిష్కరించారు.అమ్మవారు నాలుగు చేతులతో నాలుగు ఆయుధాలు(చతుర్బాహు సమన్విత)పట్టుకుంది. రాగం కోర్కెను జయించాలి. పొద్దస్తమానం సంసార లంపటంతో కూడిన కోర్కెలు కోరుకోవడం కాదు. ‘అమ్మా ‘ నీ చరణ సేవ ఎన్నడు చేస్తానమ్మా!’ అన్న కోర్కె పుట్టాలి. అటువంటి కోర్కెలు కోరేటట్లుగా మనస్సును మార్చగలిగే స్థితిని ఇచ్చి వరాలిస్తుంది కనుక ‘వరదే’ అన్నారు. అమ్మవారి చేతిలో ఉన్న బాణాల ఆకర్షణ చేత–‘క్రోధాంకుశోజ్వల’...క్రోధాన్ని క్రోధంతో, కోరికను తిరస్కతితో గెలవబడితే– మనస్సునుండి అజ్ఞానం తొలగి కబరీబంధ దర్శనమవుతుంది. అందుకని చేతులు ముందుగా చెప్పి తరువాత తల చెబుతారు అమ్మవారికి. నీ పాద సేవ చేయాలనే కోర్కెలను మాలో కలిగించి వాటిని నువ్వే తీర్చే స్వరూపమున్న ‘వరదే’, ‘హిమగిరి సుతే’ పాహిమాం ! అంటున్నారు. -
మసీదుల్లోకి మహిళల ప్రవేశంపై వైఖరేంటి?
న్యూఢిల్లీ: మసీదుల్లోకి ముస్లిం మహిళల ప్రవేశం, ప్రార్థనలకు అనుమతించే విషయంలో వైఖరి వెల్లడించాలంటూ కేంద్రాన్ని సుప్రీంకోర్టు కోరింది. ఈ విషయమై పుణేకు చెందిన యాస్మీన్ జుబేర్ అహ్మద్ పీర్జాదే, జుబేర్ అహ్మద్ నజీర్ అహ్మద్ పీర్జాదే అనే మహిళలు దాఖలు చేసిన పిటిషన్‌ను జస్టిస్ ఎస్ఏ బాబ్డే, జస్టిస్ ఎస్ఏ నజీర్‌ల ధర్మాసనం మంగళవారం విచారించింది. ‘శబరిమలలోకి మహిళల ప్రవేశంపై మేమిచ్చిన తీర్పును దృష్టిలో ఉంచుకుని మాత్రమే ఈ పిటిషన్‌ను స్వీకరిస్తున్నాం. మరోవిధంగా అయితే, మీరు మాకు సరైన సమాధానాలు ఇవ్వలేరు’ అని ధర్మాసనం పేర్కొంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 14లోని సమానత్వపు హక్కు మరో వ్యక్తి నుంచి పొందేందుకు కూడా వర్తిస్తుందా? మసీదులో ప్రభుత్వ పాత్ర ఎక్కడుంది? అని ధర్మాసనం ప్రశ్నించగా.. దేశంలోని మసీదులకు ప్రభుత్వ సాయం, గ్రాంట్లు అందుతున్నాయని పిటిషనర్ సమాధానం ఇచ్చారు. మసీదులోకి రానివ్వడం లేదంటూ తాము ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదని బదులిచ్చారు. మహిళలను మసీదుల్లోకి రానివ్వవద్దంటూ మత గ్రంథాల్లో లేదని, పవిత్ర మక్కాతోపాటు కెనడాలోని మసీదుల్లోకి మహిళలు ప్రవేశించి ప్రార్థనాలు చేసుకునే వీలుందని పిటిషనర్ తెలిపారు. సౌదీలో మసీదులోకి మహిళల ప్రవేశంపై ఫత్వా ఉందన్నారు. కొన్ని చోట్ల మహిళలను లోపలికి అనుమతిస్తున్నా వారికి వేరుగా ఏర్పాట్లు ఉన్నాయన్నారు. మనం దేశంలోని సున్నీల్లోనే మసీదుల్లోకి మహిళల ప్రవేశంపై నిషేధం ఉందని తెలిపారు. పురుషులతోపాటు మహిళలు మసీదుల్లో ప్రార్థనలు చేసుకునేందుకు గల రాజ్యాంగ హక్కు కల్పించాలని కోరారు. పిటిషనర్ వాదనలు విన్న ధర్మాసనం.. కేంద్రంతోపాటు న్యాయశాఖ, మైనారిటీ వ్యవహారాల శాఖ, జాతీయ మహిళా కమిషన్, మహారాష్ట్ర వక్ఫ్ బోర్డ్, సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్, ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డ్‌లకు కూడా నోటీసులు జారీ చేసింది. -
మహిళ ఆధ్వర్యంలో జుమ్మాప్రార్థనలు
శతాబ్దాలుగా వస్తున్న షరియత్ సంప్రదాయాన్ని కాదని, ఒక మహిళ జుమ్మా ప్రార్థనలు ప్రారంభించి, నూతన అధ్యాయానికి నాంది పలికింది. కేరళ మనప్పురం జిల్లాలోని వండూర్కి దగ్గరగా ఉన్న చేరుకోడ్ గ్రామంలో జుమ్మా ప్రార్థనలు నిర్వహించిన జమీదా నిజానికి ఓ టీచర్. ఈ పనికి ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుందని తెలిసి కూడా తాను ఈ నిర్ణయం తీసుకున్నానని సాక్షికి స్వయంగా తెలిపారు. ఆ వివరాలు... ఇమామ్‌గా మారాలని ఎందుకు అనుకున్నారు? మారిన తరవాత మీకు ఎలా అనిపిస్తోంది? ఖురాన్లో స్త్రీపురుష వివక్షను ప్రస్తావించలేదు. ‘ఇది మహిళల పని, ఇది పురుషుల పని’ అని ఎక్కడా లేదు.. మానవులు – ప్రేమ అనే అంశం మాత్రమే ఖురాన్లో ఉంటుంది. మహిళలు, పురుషుల గురించి ఖురాన్ ఏం చెప్పిందో అందరికీ అర్థమయ్యేలా చెప్పాలనుకున్నాను. అందుకే ఇమామ్ అయ్యాను. ఇలా మారినందుకు చాలా సంతోషంగా ఉంది. మా సంప్రదాయాలు, నమ్మకాల గురించి ముస్లిం మహిళలకు విపులంగా వివరించాను. ఖురాన్, అందులోని నమ్మకాలు, వాస్తవాలు, సమానత్వం గురించి తోటి మహిళలకు మరింత విపులంగా తెలియచేయాలనుకుంటున్నాను. మీ కుటుంబ నేపథ్యం... మా తల్లిదండ్రులు పదకొండుమంది సంతానంలో నేను ఆఖరిదాన్ని. నాకు ఇద్దరు పిల్లలు. నేను విడాకులు తీసుకుని పిల్లలతో జీవిస్తున్నాను. అమ్మాయికి 13 సంవత్సరాలు, ఏడో తరగతి క్యాలికట్‌లో చదువుతోంది. అబ్బాయికి ఏడు సంవత్సరాలు, రెండో తరగతి చదువుతున్నాడు. మా పెద్దలు నాకు ఇష్టం లేని వివాహం చేశారు. నేను ముస్లిం మహల్ కమిటీ (మసీదు)కి విడాకుల కోసం వెళ్లాను. అల్లా విడాకులు ఇష్టపడరని ముస్లిం పెద్దలు నన్ను తప్పుదోవ పట్టించారు. అలా చెప్పడంతో విడాకులు వెనకబడ్డాయి. పదిసంవత్సరాల తరవాత మహిళా తలాక్ సిద్ధాంతం ప్రకారం విడాకులు పుచ్చుకున్నాను. (1939 ఫసాఖ్ చట్టం) .నేను హదీసులను తిరస్కరించడం మా ఇంట్లో ఎవరికీ నచ్చలేదు. ఇప్పుడే కాదు, నేను చిన్నతనం నుంచి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటూనే ఉన్నాను. ఖురాన్ సున్నత్ సొసైటీ ఏంటి? ఖురాన్ సున్నత్ సొసైటీ అనేది మా సంస్థ. చేకన్నూర్ మౌల్వీ దీనిని స్థాపించారు. ఖురాన్ సన్నత్ సొసైటీ కేవలం ఖురాన్లో ఉన్న విషయాలను మాత్రమే చెబుతుంది. వాటికే కట్టుబడి ఉంటుంది. ఆయనను 1993లో మత ఛాందసులు చంపేశారు. 1400 సంవత్సరాలుగా పురుషాధిక్య మతంగా ఇస్లామ్‌లో పాతుకుపోయిన దురాచారం మీద ఈ సంఘం పోరాటం చేస్తుంది. ఖురాన్‌ను ఇష్టపడేవారిని మా సంస్థకు ఆహ్వానించి, మా సంస్థలో ఉన్న ముస్లిం మత పండితుల ఆధ్వర్యంలో... మా మార్గం లోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాం. మిమ్మల్ని ఎవరైనా వ్యతిరేకించారా? నేను ఇమామ్‌గా మారినందుకు ఎందరో మగవారు వ్యతిరేకించారు. మీరు నిషేధించిన పుస్తకం గురించి... 16వ శతాబ్దంలో పొన్ననిలో జీవించిన షేక్ సైనుద్దీన్ మఖుమ్ రచించిన ఫత్ ఉల్ముయీన్ పుస్తకాన్ని బహిష్కరించారు. ఈ పుస్తకాన్ని అరబిక్ దేశాలలోను, భారతదేశంలోని మత సంస్థలలోను పాఠ్యాంశంగా పెట్టారు. ఈ పుస్తకంలో ముస్లిం యువకులను టెర్రరిజం వైపుకు నడిపే అంశాలు చాలా ఉన్నాయి. నేను చేసిన పనిని ఎవ్వరూ ప్రశంసించకపోగా, సోషల్ మీడియాలో నాకు వ్యతిరేకంగా నాపై రకరకాల కామెంట్లు పెడుతున్నారు. అమీను గురించి... 2016లో త్రివేండ్రంలో ఉన్న సమయంలో ఒక రోజున మహిళలకు ఖురాన్ బోధిస్తుండగా, ‘అమీన్’ అర్థం గురించి వివరించాను. నమాజ్‌లో ఆ పదం చెప్పలేదు. కొందరు ముస్లిం పెద్దలు నా క్లాసులో జరుగుతున్నదంతా రికార్డు చేశారు. తరవాతి వారం క్లాసు నడపడానికి వెళ్లాను. మసీదు కమిటీ సభ్యులు, కొన్ని ఇతర సంస్థలకు చెందిన కొందరు పురుషులు వచ్చి, నా తరగతి గదిని పగలగొట్టారు. నేను... యూదు యువతినని, ఇస్లామ్‌కి వ్యతిరేకినని నన్ను దూషించడంతో, ఒంటరినైపోయాను. హదీసులకు వ్యతిరేకంగా చేసిన పోరాటం గురించి... మా కుటుంబ సభ్యులు నన్ను వెలివేశారు. అంటే ముర్తహాద్ అంటారు. ముర్తహాద్ అంటే హదీసులను బíß ష్కరించడం, ముస్లిం పండితుల మాటలను వ్యతిరేకించడం అని అర్థం. అదే సమయంలో నేను పని చేస్తున్న మూడు అరబిక్ కాలేజీల వారు కూడా నన్ను బహిష్కరించారు. నాకు ఆదాయం పోయింది. ఇంటి అద్దె కూడా కట్టలేని స్థితికి చేరుకున్నాను. పిల్లల్ని చదివించడానికి కూడా డబ్బు లేదు, ఆ సమయంలో మా అమ్మ నాతో ఉంది. ఎలా పోరాడారు... సోషల్ మీడియా ద్వారా ముస్లిం పండితులను ఎదుర్కోవడం ప్రారంభించాను. ఆ సమయంలో ఖురాన్ సన్నత్ సొసైటీ సభ్యులు నన్ను కాలికట్ రమ్మని పిలిచారు. వారు పిలిచిన సమయంలో నేను ట్రిపుల్ తలాఖ్ (అఖిలా హదియా) గురించి ఒక టీవీ చానెల్లో చర్చలో పాల్గొన్నాను. – డా. వైజయంతి డిసెంబరు 11, 2017 రాత్రి సమయంలో ఇద్దరు వ్యక్తులు నన్ను చంపడానికి మా ఇంటికి వచ్చారు. ఆ సమయంలో నేను కాలికట్ దగ్గర ఉన్న కప్పాడ్లో నివసిస్తున్నాను. నేను వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాను. ఎస్ఐ వచ్చి వారిని అరెస్టు చేశారు. డిసెంబరు 22, 2017 రాత్రి 12.30కి మళ్లీ నా మీద హత్యాప్రయత్నం చేశారు. అతడిని మళ్లీ అరెస్టు చేశారు. ఇప్పటికీ కొందరు ఛాందస సంస్థల పెద్దలు, నాయకులు నన్ను చంపాలనుకుంటున్నారు. ప్రస్తుతం ఉద్యోగం లేదు. జుమాగా జీవిస్తున్నాను. నాకు నచ్చిన మార్గంలో ఆనందంగా, హాయిగా ఉన్నాను. – జమీదా 1999లో న్యూయార్క్‌లో మొట్టమొదటగా అమీనా వదాహ్, ఘజాలా అన్వర్లు జుమ్మా ప్రార్థనలు చేయించారు. భారతదేశంలో నేడు జమీదా టీచర్ తొలి అడుగు వేశారు. -
తల్లి్ల మరియా... కాచికాపాడుమమ్మా!
శ్రీకాకుళం మేత్రాసన పాలక పునీతురాలు, క్రైస్తవుల సహాయమాత మేరిమాత మహోత్సవం నేడు శ్రీకాకుళం జిల్లా వీరఘట్టం సమీపంలోని యు.వెంకమ్మపేట వద్ద మరియగిరిపై జరుగుతోంది. ఈ కొండపై వెలసిన మరియమ్మకు శ్రీకాకుళం మేత్రాసనం పీఠాధిపతి అడ్డగట్ల ఇన్నయ్య ఆధ్వర్యంలో ఏటా జనవరి 30న ప్రత్యేక దివ్యపూజలు నిర్వహిస్తారు. ‘విశ్వ స్వరూపుడైన దేవదేవుని పుత్రుని నీ వరాల గర్భంబున ధరియించిన మేరిమాతా వందనం అభివందనం..’ అంటూ, ‘దేవునిచే ఎన్నుకొనబడిన ఓ సుధాభాషిణి నీకే వందనం.. దైవప్రజలారా.. దైవ జనమా..’ అంటూ బిషప్ ఇన్నయ్య స్తోత్రం పలికి పూజలు చేయడం ఇక్కడ ఆనవాయితీ. ఈ యాత్రకు ఒక రోజు ముందే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్టణం జిల్లాలతో పాటు ఒడిశ్సా రాష్ట్రం నుండి తండోపతండాలుగా క్రైస్తవులు, హిందువులు తరలివచ్చి దివ్యపూజలో పాల్గొంటారు. అనంతరం మరియగిరి కొండను అధిరోహించి మేరిమాతను దర్శించుకొని మొక్కులు తీర్చుకుంటారు. కులమతాలకు అతీతం మరియగిరి యాత్ర రోజున ఈ ప్రాంతంలో ఆధ్యాత్మికత వెల్లివిరుస్తుంది. మఠకన్యలు, పీఠాధిపతులు, క్రైస్తవ గురువుల ప్రత్యేక ప్రార్థనలతో మేరిమాత స్తోత్రం మారు మ్రోగుతుంది. ఈ సందర్భంగా మేరిమాతను దర్శించుకొనేందుకు కులమతాలకు అతీతంగా భక్తులు కొవ్వొత్తులు వెలిగించి, కొబ్బరికాయలు కొట్టి, హిందూ సంప్రదాయంలో ఉన్నట్లు తలనీలాలు అర్పించి మొక్కులు చెల్లించుకుంటారు. ‘ఓ తల్లీ మరియా.. మమ్మల్ని కాచికాపాడుమమ్మా’ అంటూ ప్రార్థనలు చేస్తారు. దివ్య పూజలో క్రైస్తవ గీతాలను ఆలపిస్తూ మరియమ్మను స్తుతిస్తారు. కుటుంబ సమేతంగా మేరీమాతను దర్శించుకున్న తర్వాత భక్తులు వనభోజనాలు చేస్తారు. ఏటా 25 వేల నుండి 30 వేల మంది భక్తులు హాజరై మేరీమాతను దర్శించుకుంటారు. ఈ ఏడాది కూడా ఈ ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు నిర్వాహకులు ముమ్మర ఏర్పాట్లు చేశారు. ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నేటి మరియగిరి యాత్రకు ఉత్తరాంధ్ర జిల్లాల నుండి తరలివచ్చే భక్తుల కోసం పార్వతీపురం, పాలకొండ, శ్రీకాకుళం, సాలూరు, టెక్కలి, విజయనగరం తదితర ఆర్టీసీ డిపోల నుండి స్పెషల్ బస్సులు నడుపుతున్నారు. ఈ ఏడాది సుమారు 35 వేలమంది భక్తులు హాజరయ్యే అవకాశం ఉందన్న అంచనాతో మరియగిరి వద్ద ప్రత్యేక ఆర్టీసీ కంట్రోల్ పాయింట్‌ను ఏర్పాటు చేశారు. -
జగన్ ఆరోగ్యం బాగుండాలని ప్రార్థనలు
నెల్లూరు(సెంట్రల్): వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆరోగ్యం బాగుండాలని కోరుతూ వైఎస్సార్సీపీ జిల్లా అధికార ప్రతినిధి సయ్యద్ మునవర్ ఆధ్వర్యంలో స్థానిక బారాషాహిద్ దర్గాలో శనివారం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. మునవర్ మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్రెడ్డికి వచ్చే ప్రజాదరణ చూసి ఓర్వలేక టీడీపీ నాయకులు హత్యాయత్నానికి కుట్రపన్నారని ఆరోపించారు. అనంతరం పేదలకు అన్నదానం నిర్వహించారు. కార్యక్రమంలో ఎస్ఆర్ ఇంతియాజ్, సయ్యద్ షాకీర్‌బాబా, షేక్ హాజీ, ఎండీ రవూఫ్, ఎండీ రహీం, ఎస్కే జమీర్, ఎస్కే ఖయ్యూం, సయ్యద్ ఆలీమ్, షఫీ, ఎస్కే కాలేషా పాల్గొన్నారు. వైఎస్ జగన్ ఆరోగ్యం కోసం పూజలు ముత్తుకూరు: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డిపై విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో శ్రీనివాస్ అనే వ్యక్తి కత్తితో పొడిచి హత్యాయత్నం చేయడంతో గాయపడిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో జిల్లాలోని పలు మండలాల్లో వైఎస్ జగన్ ఆరోగ్యం కుదుటపడాలని ఆలయాల్లో పూజలు నిర్వహించి కొబ్బరి కాయలు కొట్టారు.ముత్తుకూరు మండలం మామిడిపూడి మహాలక్ష్మమ్మ ఆలయంలో వైఎస్ జగన్ ఆరోగ్యం కుదుటపడాలని వైఎస్సార్సీపీ నాయకులు కొబ్బరికాయలు కొట్టారు. -
రేపు ఇష్ట దైవాల ప్రార్థనలకు వైఎస్సార్ సీపీ విజ్ఞప్తి
సాక్షి, హైదరాబాద్: విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో జరిగిన హత్యాయత్నం నుంచి దేవుడి ఆశీస్సులతో, ప్రజల దీవెనలతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి క్షేమంగా బయటపడ్డారని ఆ పార్టీ పేర్కొంది. ఈ సందర్భంగా శుక్రవారం రోజున తెలుగు రాష్ట్రాల్లో ప్రజాస్వామ్యవాదులు, వైఎస్సార్ సీపీ అభిమానలు, కార్యకర్తలు, నాయకులంతా వారి ఇష్ట దైవాలను ప్రార్థించాలని విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు వైఎస్సార్ సీపీ పత్రికా ప్రకటన విడుదల చేసింది. తొమ్మిదేళ్లుగా వైఎస్ జగన్‌ను ఎదుర్కోలేని వారే ఇటువంటి హత్యారాజకీయాలను ప్రోత్సహిస్తున్నట్టు అర్థమవుతోందని వైఎస్సార్ సీపీ విమర్శించింది. వైఎస్ జగన్‌పై దాడి జరిగిన వెంటనే సానుభూతి కోసం జరిగిదంటూ టీడీపీ అనుకూల మీడియా ప్రచారాన్ని చేయడం సిగ్గు చేటన్నారు. ఇందుకోసం టీడీపీ ముందుగానే ప్రణాళికల్ని సిద్ధం చేసుకుందని ఆరోపించారు. సీఎం చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు లోకేశ్, డీజీపీ ఆర్పీ ఠాకూర్లు.. ఈ ముగ్గురు ప్రధాన సూత్రధారులుగా జరుగుతున్న కుట్రలపై.. నిజాయితీపరులైన అధికారులతో కేంద్ర దర్యాప్తు సంస్థలతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. -
ఫరూఖ్ అబ్దుల్లాకు నిరసన సెగ
శ్రీనగర్: జమ్మూ, కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూఖ్ అబ్దుల్లాకు చేదు అనుభవం ఎదురైంది. బుధవారం బక్రీద్ పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీనగర్‌లోని హజరత్‌బాల్ మసీదులో ప్రార్థనలు చేస్తున్న సమ యంలో పలువురు నిరసనకారులు ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆగస్టు 20న దివంగత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి సంస్మరణ సభ సందర్భంగా ఆయన ‘భారత్ మాతాకీ జై’అని నినా దాలు చేసిన రెండు రోజులకే ఈ ఘటన జరగడం గమనార్హం. ఆరోగ్యం సహకరించకపోవడంతో కుర్చీలోనే కూర్చుని అబ్దుల్లా ప్రార్థనలు చేస్తున్నారు. అయితే ఘటన జరుగుతున్నా కూడా అబ్దుల్లా స్పందించకుండా అలాగే ప్రార్థనలను కొనసాగించారు. ‘ఫరూఖ్ అబ్దుల్లా తిరిగి వెళ్లిపోండి. మాకు కావాల్సింది స్వాతంత్య్రం’ అంటూ నిరసనకారుల గుంపు నినాదాలు చేసింది. అందులో కొందరు అబ్దుల్లాకు దగ్గరగా వచ్చే ప్రయత్నం చేశారు. అయితే అబ్దుల్లా అనుచరులు, రక్షక సిబ్బంది ఫరూఖ్‌కు అడ్డుగా నిలబడి వారిని నిలువరించారు. ‘కొందరు ఆందోళన చేశారు. ‘నేను ప్రార్థనా స్థలాన్ని విడిచి వెళ్లలేదు. ప్రార్థనలు పూర్తి చేసుకున్నాను. నిరసన వ్యక్తం చేసిన వారంతా నా మనుషులే. ఎవరో వారిని తప్పు దోవ పట్టించారు. వారి నాయకుడి బాధ్యతల నుంచి నేను తప్పించుకోను. ప్రతి ఒక్కరినీ సమైక్యంగా ఉంచే బాధ్యత నాపై ఉంది’ అని ఫరూఖ్ అబ్దుల్లా పేర్కొన్నారు. కశ్మీర్లో ప్రశాంతంగా బక్రీద్ కశ్మీర్ లోయలో ముస్లింలు బక్రీద్ పర్వదినాన్ని సంతోషంగా జరుపుకొన్నారు. మసీదుల్లో ప్రశాంతంగా సామూహిక ప్రార్థనలు చేశారు. అయితే ప్రార్థనల తర్వాత శ్రీనగర్, అనంత్‌నాగ్‌లోని జంగ్లాట్ మండీ, బారాముల్లాలోని సోపోర్ ప్రాంతాల్లో ఈద్గాల వద్ద దుండగులు రాళ్లు రువ్వారు. ఈ ఘటనలు మినహా అన్ని ప్రాంతాల్లో ప్రశాంతంగా బక్రీద్ పర్వదినాన్ని ప్రజలు జరుపుకొన్నారని పోలీసులు తెలిపారు. -
కేరళను ఆదుకోండి: పోప్
వాటికన్ సిటీ: భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలం అయిన కేరళను ఆదుకోవాలని పోప్ ఫ్రాన్సిస్ అంతర్జాతీయ సమాజానికి పిలుపునిచ్చారు. వరద బాధితుల కోసం ఆయన ఆదివారం సెయింట్ పీటర్స్ స్క్వేర్ వద్ద ప్రార్థనలు నిర్వహించారని వాటికన్ న్యూస్ పేర్కొంది. ‘కేరâý ప్రజల్ని ఆదుకోనేందుకు అంతర్జాతీయ సమాజం ముందుకు రావాలి’ అని ఆయన కోరారు. -
పాతబస్తీలో ప్రశాంతంగా ప్రార్ధనలు
సాక్షి, హైదరాబాద్: రంజాన్ మాసం చివరి శుక్రవారం సందర్భంగా పాతబస్తీలో ముస్లిం సోదరుల ప్రార్థనలు ప్రశాంతంగా ముగిశాయి. పాతబస్తీలో పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. భద్రతా ఏర్పాట్లను సీపీ అంజనీకుమార్ పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నగరంలో శనివారం రంజాన్ ప్రార్థనలకు 5 వేల మందితో పటిష్ట భద్రత ఏర్పాటు చేశామన్నారు. సిటీలోని 600 మసీదుల వద్ద సెక్యూరిటీ పెంచినట్టు తెలిపారు. 50 సమస్యాత్మక మందిరాల వద్ద సీసీ కెమెరాలు, మఫ్టీ పోలీసులతో నిఘా పెట్టామన్నారు. అదేవిధంగా సిటీలో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని వెల్లడించారు. -
గుడిలో పూజలకు, ప్రసాదాలపై జీఎస్టీ పన్ను
-
ప్రజాసంకల్పయాత్ర: 500 కొబ్బరికాయలతో మొక్కు
-
కార్తీక పౌర్ణమి : వైఎస్ఆర్ విగ్రహానికి పూజలు
-
ఖైరతాబాద్ గణేశుడిని దర్శించుకున్న ఉప రాష్ట్రపతి
హైదరాబాద్: ఖైరతాబాద్ మహాగణపతిని ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఏడాది ఖైరతాబాద్ గణేశుడిని దర్శనం చేసుకుంటానని చెప్పారు. ఖైరతాబాద్ గణేశుడి దర్శనం సంతోషాన్ని ఇచ్చిందన్నారు. దేశం అన్ని రంగాల్లో ముందుండాలని వేడుకున్నానని చెప్పారు. ఆయన వెంట మాజీ కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ, రాష్ట్ర మంత్రులు తలసాని శ్రీనివాస్‌యాదవ్, మహమూద్ అలీ, ఖైరతాబాద్ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, తదితరులు ఉన్నారు. ఉప రాష్ట్రపతి పర్యటన సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటుచేశారు. -
ఖైరతాబాద్ గణనాథుడికి గవర్నర్ తొలిపూజ
-
దేశవ్యాప్తంగా ముస్లిం సోదరుల ప్రార్థనలు
న్యూఢిల్లీ: ఈద్-ఉల్-ఫితర్‌ను పురస్కరించుకొని ముస్లిం సోదరులు సోమవారం దేశవ్యాప్తంగా మసీదుల్లో అత్యంత భక్తి శ్రద్ధలతో ప్రార్థనలు చేశారు. అన్ని ప్రాంతాల్లోని ప్రార్థనాలయాల వద్ద ప్రత్యేక నమాజులు చేసి అల్లాను ప్రార్థించారు. మసీదులన్నీ భక్తులతో కిటకిటలాడాయి. పిల్లా పెద్దా అనే తారతమ్యం లేకుండా పెద్ద సంఖ్యలో ఉదయం నుంచి మసీదులకొచ్చి ప్రార్థనలు జరిపారు. అనంతరం పరస్పరం ఆలింగనం చేసుకొని శుభాకాంక్షలు చెప్పుకున్నారు. దీంతో ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, చెన్నై, హైదరాబాద్, బెంగళూరు తదితర మెట్రో నగరాలతో పాటు చిన్నా, పెద్ద పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో ఇదే సందడి నెలకొంది. మరోవైపు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో రంజాన్ వేడుకలను ఘనంగా జరిగాయి. అలాగే పవిత్ర రంజాన్ సందర్భంగా హైదరాబాద్‌లో ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్నారు. మసీదుల వద్ద సందడి నెలకొంది. ఒకరినొకరు అలాయ్ భలాయ్ తీసుకుంటున్నారు. రంజాన్ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నారు. మరోవైపు సమస్యాత్మక ప్రాంతాల్లో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు పవిత్ర రంజాన్ పర్వదినాన్ని ముస్లిం సోదరులు ఘనంగా జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్ పోలీస్ కమిషనర్ మహేందర్ రెడ్డి మాట్లాడుతూ రంజాన్ వేడుకలు ప్రశాంతంగా జరిగిలే అన్ని భద్రతా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. పదివేల మంది పోలీస్ అధికారులు, సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. అలాగే ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్, స్పెషల్ పోలీస్ టీమ్‌లను కూడా రంగంలోకి దింపామన్నారు. ప్రార్థనా మందిరాల దగ్గర సీసీ టీవీలు ఏర్పాటు చేసి... పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నామన్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకున్నామన్నారు. -
కేదరనాథ్ ఆలయాన్ని సందర్శించిన మోదీ
-
సోమనాథ్ ఆలయంలో మోదీ పూజలు
అహ్మదాబాద్: గుజరాత్ పర్యటనలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్రమోదీ బుధవారం సోమానాథ్ దేవాలయాన్ని సదర్శించారు. ఆలయంలో పరమశివుడికి జలభిషేకం చేసి.. పూజలు నిర్వహించారు. సోమనాథ్ ఆలయ ట్రస్ట్ చైర్మన్ కేశుభాయ్ పటేల్, బీజేపీ అధ్యక్షడు అమిత్ షా ఈ కార్యక్రమంలో మోదీతో పాటు పాల్గొన్నారు. అనంతరం వీరు ఆలయ ట్రస్ట్ మీటింగ్‌లో పాల్గొన్నారు. మంగళవారం రెండు రోజుల గుజరాత్ పర్యటనకు వెళ్లిన మోదీ.. దాహెజ్ స్పెషన్ ఎకనమిక్ జోన్‌లోని ఓఎన్జీసీ పెట్రో అడిషనల్స్ లిమిటెడ్(ఓపీఏఎల్)ను జాతికి అంకితమిచ్చిన విషయం తెలిసిందే. త్రివేణి సంగమం వద్ద నిర్వహించే బహిరంగ సభలో మోదీ పాల్గొననున్నారు. -
క్రీడామైదానంలోకి సేద్య విజ్ఞానగణం
వ్యవసాయ శాస్త్రవేత్తలు,అధ్యాపకుల పోటీలు ప్రారంభం రాజమహేంద్రవరంలో మూడు రోజుల నిర్వహణ కంబాలచెరువు (రాజమహేంద్రవరం) : నిత్యం వ్యవసాయ రంగంపై పరిశోధనలు, విద్యార్థులకు బోధనలతో నిమగ్నమయ్యే వారంతా క్రీడామైదానంలో కాలుపెట్టారు. ఆచార్య ఎ¯ŒSజీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయ పరిధిలోని వ్యవసాయ కళాశాల అ«ధ్యాపకులు, శాస్త్రవేత్తల రాష్ట్రస్థాయిలో ఆటల పోటీలు స్థానిక వ్యవసాయ కళాశాల (ఎస్‌కేవీటీ కళాశాల క్రీడా మైదానం) వేదికగా శుక్రవారం ప్రారంభమయ్యాయి. మూడురోజుల జరిగే పోటీలను విశ్వవిద్యాలయం పాలకమండలి సభ్యుడు, కొవ్వూరు ఎమ్మెల్యే కేఎస్ జవహర్ ప్రారంభించారు. వ్యవసాయ శాస్త్రవేత్తలు, అ«ధ్యాపకులతో క్రీడా ప్రతిజ్ఞ చేయించారు. రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి 200 మంది పైగా హాజరయ్యారు. తొలిరోజు క్రికెట్, వాలీబాల్, షటిల్ బ్యాడ్మింటన్, క్యారమ్స్, రాత, ప్రసంగ పరీక్ష పోటీలు నిర్వహించారు. విజేతలకు ఆదివారం ముగింపు సభలో బహుమతులు అందజేయనున్నారు. -
అమృత్‌సర్‌లో షారుఖ్ సందడి
-
మాదన్నపేటలో భారీ బందోబస్తు
చంచల్‌గూడ: బాబ్రీ మసీదు కూల్చివేత దినం కావడంతో మంగళవారం మానద్నపేట పోలీస్ స్టేషన్ పరిధిలో భారీగా పోలీసులు మోహరించారు. ఎలాంటి అవాంఛనీయం సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు శాంతి భద్రతలపై ప్రత్యేక దృష్టి సారించారు. సున్నితమైన ప్రాంతాల్లో ప్రత్యేక పోలీసు బృందాలను రంగంలోకి దింపారు. సంతోష్‌నగర్ ఏసీపీ శ్రీనివాసలు పర్యవేక్షణలో మాదన్నపేట ఇన్స్పెక్టర్ కలింగ్ పీటర్ వత్సల రాజు ఆధ్వర్యంలో బందోబస్తును నిర్వహించారు. ఈ బందోబస్తులో 2 కంపెనీ ప్లాటూన్లు, ఇద్దరు ఏసీపీలు, నలుగురు ఇన్స్పెక్టర్లు, 12 మంది ఎస్‌లు, సిబ్బంది పాల్గొన్నట్లు ఏసీపీ తెలిపారు. -
దేవుడి మీదే భారం.. ప్రార్థించండి: అపోలో ఆస్పత్రి
-
దేవుడి మీదే భారం.. ప్రార్థించండి: అపోలో ఆస్పత్రి
గుండెపోటు వచ్చి ఆరోగ్యం విషమించిన తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్యం కోసం తాము దేవుడిని ప్రార్థిస్తున్నామని, తమతో పాటు అందరూ ఈ ప్రార్థనల్లో పాల్గొనాలని అపోలో ఆస్పత్రి వర్గాలు ఓ ప్రకటనలో తెలిపాయి. ఆదివారం సాయంత్రం గుండెపోటు వచ్చిన జయలలిత (68) గుండె, ఊపిరితిత్తులకు ప్రత్యేక పరికరాలతో మద్దతు అందిస్తున్నామని చెప్పాయి. సెప్టెంబర్ 22వ తేదీన తీవ్ర జ్వరం, డీహైడ్రేషన్‌తో అపోలో ఆస్పత్రిలో చేరిన జయలలిత దాదాపు కోలుకుంటున్నారని, ఇంక ఆమె ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు ఇంటికి వెళ్లిపోవచ్చని కూడా ఇంతకుముందు అపోలో ఆస్పత్రి చైర్మన్ ప్రతాప్ సి.రెడ్డి చెప్పారు. కానీ అంతలోనే మళ్లీ అమ్మ ఆరోగ్యం విషమించింది. ఈ నేపథ్యంలో అపోలో ఆస్పత్రి పలు ట్వీట్లు చేసింది. ఆమెకు 'ఎక్స్ట్రాకార్పోరియల్ మెంబ్రేన్ హార్ట్ అసిస్టెడ్ డివైజ్' అమర్చామని, పలువురు నిపుణులైన వైద్యులు, క్రిటికల్ కేర్ నిపుణులు చికిత్స అందిస్తున్నారని తెలిపింది. ఇప్పుడు ఆమెకు ఏ తరహా చికిత్స అందించాలన్న విషయమై లండన్‌కు చెందిన వైద్యనిపుణుడు డాక్టర్ రిచర్డ్ బాలేని కూడా సంప్రదిస్తున్నట్లు తెలిపింది. ఆమె కోలుకోవాలని అందరూ ప్రార్థించాలని కోరింది. The Hon'ble Chief Minister of Tamilnadu who is undergoing treatment at Apollo Hospitals,Greams Road, suffered a cardiac arrest this evening. — Apollo Hospitals (@HospitalsApollo) 4 December 2016 She is on extracorporeal membrane heart assist device and is being treated by a team of expert doctors and critical care specialists. — Apollo Hospitals (@HospitalsApollo) 4 December 2016 Our prayers are with her and we hope she will recover soon. We request all of you to pray for her good health and well being. #GodblessAmma — Apollo Hospitals (@HospitalsApollo) 4 December 2016 The Hon'ble CM is the beloved leader of the masses. Please join us in praying for her speedy recovery. #GodblessAmma #Jayalalithaa — Apollo Hospitals (@HospitalsApollo) 4 December 2016 -
అమ్మ కోసం..
► మంత్రుల నేతృత్వంలో యాగాలు ► రాష్ట్రవ్యాప్తంగా భక్తితో పూజలు ► సంపూర్ణ ఆరోగ్యం కోసం ప్రార్థనలు సాక్షి, చెన్నై : ముఖ్యమంత్రి జయలలిత సంపూర్ణ ఆరోగ్యాన్ని కాంక్షిస్తూ రాష్ట్రవ్యాప్తంగా కార్యకర్తలు సోమవారం గణపతి హోమాలు, ఆయుష్, మృత్యుంజయ యాగాలు జరిపించా రు. అన్నాడీఎంకే వర్గాలు భక్తి శ్రద్ధలతో యాగాలు, పూజల్లో లీనమయ్యారు.రాష్ట్ర ముఖ్యమంత్రి జె.జయలలిత ఆరోగ్యం మెరుగు పడడంతో ఐసీయూ నుంచి జనరల్ వార్డుకు మార్చిన విషయం తెలిసిందే. తమ అమ్మ ఆరోగ్యం మెరుగుపడడంతో అన్నాడీఎంకే వర్గాల ఆనందానికి అవదులు లేకుండాపోయారుు. తమ అమ్మ సంపూర్ణ ఆరోగ్యవంతురాలిగా త్వరతగతిన ప్రజా సేవకు అంకితం కావాలని కాంక్షిస్తూ ఆలయాల్లో పూజల్ని హోరెత్తించే పనిలో పడ్డారు. సోమవారం రాష్ట్రమంత్రులు, ఎమ్మెల్యేలు తమ ప్రాంతాల్లో యాగ, హోమాది పూజలను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. అమ్మ జయలలిత పేరుతో మృత్యుంజయ యాగాలు, దీర్ఘాయుష్షు పూజలు, గణపతి హోమాలను నిర్వహించారు. చెన్నై, మైలాపూర్‌లోని కపాలీశ్వర ఆలయంలో రాష్ట్రమంత్రులు తంగమణి, ఎస్పీ వేలుమణి, కామరాజర్, సరోజ, ఎంసీ.సంపత్, దురైకన్ను, కడంబూరు రాజు, వలర్మతి, రాజలక్ష్మి, రామచంద్రన్‌ల నేతృత్వంలో మహా మృత్యుంజయ యాగం జరిగింది. వ్యాసార్పాడిలోని మరుగదాంబాల్ ఆలయంలో ఎమ్మెల్యే వెట్రివేల్ నేతృత్వంలో ఆయుష్షు, మృత్యుంజయ యాగాలు భక్తి శ్రద్ధలతో సాగారుు. పురసైవాక్కంలోని గంగాదీశ్వర ఆలయంలో మంత్రి డి.జయకుమార్, పార్టీ నేత బాలగంగా నేతృత్వంలో ప్రత్యేక పూజలు, అన్నదాన కార్యక్రమం జరిగింది. నీలాంకరైలో అక్కడి పార్టీ వర్గాల నేతృత్వంలో 1,008 దీపాల పూజ నిర్వహించారు. అమంజికరైలోని ఏకాంబరేశ్వర ఆలయంలో మాజీ మంత్రి గోకుల ఇందిర నేతృత్వంలో గణపతి హోమం, పుదుకోటై్టలోని గోమతీశ్వరాలయంలో మాజీ ఎమ్మెల్యే కలై రాజన్ నేతృత్వంలో విశిష్ట పూజలు నిర్వహించారు. ఇక, అపోలో ఆసుపత్రి వద్దకు అన్నాడీఎంకే వర్గాల రాక పెరగడంతో పోలీసు అధికారులు మళ్లీ ఆ పరిసరాల్లో భద్రతను పెంచారు. -
అమ్మ ఆరోగ్యం కోసం పాలాభిషేకం
తిరువళ్లూరు: తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్యం మెరుగుపడాలని కోరుతూ కడంబత్తూరు యూనియన్‌లోని కడంబవన మురుగన్ ఆలయానికి పాలాభిషేకం నిర్వహించారు. తిరువళ్లూరులో జిల్లా వ్యాప్తంగా అమ్మ ఆరోగ్యం మెరుగుపడాలని కోరుతూ పూజలు, యాగాలు, పాలాభిషేకాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా కడంబత్తూరు యూనియన్‌లోని కడంబవన మురుగన్ ఆలయానికి అన్నాడీఎంకే నేతలు పాలాబిషేకం నిర్వహించారు. ఈ అభిషేక కార్యక్రమానికి యూనియన్ కార్యదర్శి సుధాకర్ అధ్యక్షత వహించగా ముఖ్యఅతిథిగా జిల్లా కన్వీనర్ పొన్నేరి ఎమ్మెల్యే బలరామన్ హాజరు కాగా అరక్కోణం ఎంపీ హరి, మాజీ మంత్రి రమణ పాల్గొన్నారు. ఆరోగ్యం మెరుగు పడాలని కోరుతూ ముందుగా పూజలు నిర్వహించిన అన్నాడీఎంకే నేతలు అనంతరం వంద టెంకాయలు కొట్టి పూజలు చేశారు. అనంతరం అన్నదానం నిర్వహించారు. ఈ పూజలకు అన్నాడీఎంకే నేతలు పలువురు కార్యకర్తలతో పాటు ప్రముఖులు పాల్గొన్నారు. -
ఆరోగ్యమస్తు
► పడకపై కూర్చుని భోజనం ► సీఎం మాట్లాడుతున్నారు ► అపోలో హెల్త్ బులెటిన్ విడుదల సాక్షి ప్రతినిధి, చెన్నై: అపోలో ఆసుపత్రిలో నెల రోజులుగా చికిత్స పొందుతున్న ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్యం కోసం అపోలో ఆసుపత్రి చేసిన కృషి సఫలీకృతమైందా, అమ్మ కోలుకోవాలని కోరుకుంటూ లక్షలాది మంది చేసిన పూజలు ఫలించాయా...శుక్రవారం నాటి పరిస్థితిని సమీక్షించుకుంటే అవుననే సమాధానం వస్తోంది. ముఖ్యమంత్రి జయలలిత సంభాషిస్తున్నట్లుగా అపోలో ఆసుపత్రి శుక్రవారం విడుదల చేసిన హెల్త్‌బులెటిన్‌లో స్పష్టం చేయడం గమనార్హం. గతనెల 22వ తేదీ అర్ధరాత్రి వేళ సీఎం జయలలిత అపోలో ఆసుపత్రిలో చేరారు. కేవలం జ్వరం, డీహైడ్రేషన్ మాత్రమేనని అపోలో వైద్యులు ప్రకటించారు. రెండు రోజుల్లో డిశ్చార్జ్ చేస్తున్నట్లు తెలిపారు. అన్నాడీఎంకే శ్రేణులు సైతం అమ్మకు ఏమీ కాలేదు. నేడో రేపో ఇంటి ముఖం పడతారని విశ్వాసం వ్యక్తం చేశారు. ఇలా అంచనాలు వేస్తుండగానే మూడు వారాల క్రితం అపోలో ఆసుపత్రి వద్ద ఉత్కంఠ నెలకొంది. అమ్మకు ఏదో అయిపోయిందనే ప్రచారం మొదలైంది. మీడియా సైతం అదే హడావిడి చేసింది. గవర్నర్ విద్యాసాగర్‌రావు హడావుడిగా అపోలోకు చేరుకున్నారు. లండన్ నుంచి డాక్టర్ రిచర్డ్‌ను రప్పించారు. ఢిల్లీ నుంచి ఎయిమ్స్ వైద్యుల బృందం చెన్నైకి పరుగులు పెట్టింది. సింగపూర్ నుంచి మహిళా ఫిజియోథెరపిస్టులు అపోలోకు చేరుకున్నారు. వీరికి తోడు సీఎం వ్యక్తిగత వైద్యులు డాక్టర్ శివకుమార్ నేతృత్వంలోని అపోలో వైద్యుల బృందం ఎలానూ ఉంది. అయితే అదృష్టవశాత్తు ఉత్కంఠ పరిస్థితులు సద్దుమణిగాయి. అమ్మ కోలుకుంటున్నారనే ప్రకటనతోనే నెలరోజులు గడిచిపోయాయి. ఈ నెల రోజుల కాలంలో అనేక దశల్లో తీవ్రస్థాయి చికిత్సలు చేశారు. చికిత్సలకు సీఎం శరీరం బాగా స్పందిస్తూ ఆమె కోలుకుంటున్నందునే హెల్త్ బులెటిన్లు విడుదల చేయడం లేదని అపోలో వైద్యులు అంటున్నారు. ఏమైతేనేమీ అమ్మ బాగా కోలుకోవడంతోపాటు ఆసుపత్రిలోని బెడ్‌పై కూర్చుని ఆహారం కూడా తీసుకుంటున్నట్లుగా శుక్రవారం శుభసమాచారం వెలుగులోకి వచ్చింది. సింగపూరు నుంచి వచ్చిన ఫిజియోథెరపిస్టులు అపోలోలోనే ఉండగా, డాక్టర్ రిచర్డ్ ఈనెల 23వ తేదీన లండన్ నుంచి మళ్లీ చెన్నైకి చేరుకుంటున్నారు. డాక్టర్ రిచర్డ్‌తోపాటు ఇతర వైద్యులు జయ ఆరోగ్య పరిస్థితిని సమీక్షించి మరో వారం రోజుల్లో డిశ్చార్జ్ చేస్తారని అన్నాడీఎంకే శ్రేణులు ఆశిస్తున్నాయి. కాగా పదిరోజుల తరువాత అపోలో ఆసుపత్రి శుక్రవారం విడుదల చేసిన బులెటిన్‌లో సైతం సీఎం క్రమేణా కోలుకుంటున్నారని, మాట్లాడుతున్నారని స్పష్టం చేయడం విశేషం. ట్రాఫిక్ రామస్వామిపై రెండు కేసులు: సీఎం జయలలితకు జరుగుతున్న చికిత్స పట్ల అవమానకరంగా వ్యాఖ్యానించిన సామాజిక కార్యకర్త ‘ట్రాఫిక్’ రామస్వామిపై చెన్నై సైబర్ క్రైం పోలీసులు రెండు కేసులు నమోదు చేశారు. ముఖ్యమంత్రి జయలలితకు జరుగుతున్న చికిత్సపై సవివరమైన ప్రకటన చేయాలంటూ ఒక వైద్యుడు దాఖలు చేసిన పిటిషన్‌ను మద్రాసు హైకోర్టు శుక్రవారం కొట్టివేసింది. సీఎంకు జరుగుతున్న చికిత్స గురించి అడి గే హక్కు మీకు లేదని పేర్కొంటూ న్యాయమూర్తి ఆ పిటిషన్‌ను కొట్టివేశారు. కొనసాగుతున్న ప్రార్థనలు : ఇదిలా ఉండగా, ముఖ్యమంత్రి జయలలిత సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాలని కోరుతూ రాష్ట్రమంతా ప్రార్థనలు కొనసాగుతున్నాయి. దక్షిణ భారత సినీ వాణిజ్యమండలి చైర్మన్ సీ కల్యాణ్ అధ్వర్యంలో రెండు రోజుల మహా మృత్యుంజయ మూలమంత్ర జపయాగం శుక్రవారం ప్రారంభమైంది. ఈ యాగంలో 30 శివార్చకులు యాగాన్ని నిర్వహించగా, తమిళ చిత్ర నిర్మాతల మండలి అధ్యక్షులు కలైపులి థాను, మండలి గౌరవ కార్యదర్శి కాట్రగడ్డ ప్రసాద్, నిర్మాతలు కొండ్రెడ్డి కృష్ణారెడ్డి, రవికొట్టార్కర, ఎల్ సురేష్ పాల్గొన్నారు. దక్షిణ చెన్నై ఎంజీఆర్ సంఘం నేతలు శాంతోమ్ చర్చిలో శుక్రవారం ప్రార్థనలు చేశారు. సైదాపేట అమ్మన్ ఆలయంలో మాజీ మంత్రి వలర్మతి పూజలు చేశారు. ఎమ్మెల్యే వెట్రివేల్ నేతృత్వంలో వ్యాసార్పాడి కరుమారి అమ్మన్ ఆలయానికి వెయ్యిమంది మహిళలు పాల కలశాలతో చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. -
అమ్మ కోలుకోవాలని పూజలు
పళ్లిపట్టు: అమ్మ ఆరోగ్యం కుదుటపడాలనే ఆశయంతో అన్నాడీఎంకే శ్రేణులు పూజలు కొనసాగుతున్నాయి ముఖ్యమంత్రి జయలలిత అనారోగ్యంతో చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో 22 రోజులుగా చికిత్స పొందుతున్నారు. జయ ఆరోగ్యం పట్ల విభిన్న కథనాలు వెలువడుతున్న క్రమంలో కార్యకర్తల్లో ఆందోళన నెలకొంటోంది. దీంతో అమ్మకు ఆ దేవుడే దిక్కనే విధంగా కార్యకర్తలు ఆలయాలు, చర్చిలు, మసీదుల్లో ప్రతిరోజూ పూజలు, ప్రార్థనలు చేస్తున్నారు. ఇందులో భాగంగా పళ్లిపట్టు యూనియన్ అన్నాడీఎంకే ఆధ్వర్యంలో కరింబేడు నాదాదీశ్వరాలయంలో బుధవారం విశిష్ట యాగ పూజలు నిర్వహించారు. మండల కన్వీనర్ టీడీ.శ్రీనివాసన్ ఏర్పాటు మేరకు చేపట్టిన పూజల్లో ఎంపీ హరి, ఎమ్మెల్యే నరసింహన్, కార్యకర్తలు పాల్గొన్నారు. మండల చైర్మన్ శాంతిప్రియాసురేష్, ఆవిన్ చైర్మన్ చంద్రన్ పాల్గొన్నారు. పొదటూరుపేట పట్టణ అన్నాడీఎంకే ఆధ్వర్యంలో పట్టణంలోని 18 ఆలయాల్లో పూజలు నిర్వహించారు. పార్టీ పట్టణ కన్వీనర్ నటరాజన్ ఆధ్వర్యంలో విశిష్ట అభిషేక ఆరాధన పూజలు చేపట్టి అమ్మ ఆరోగ్యం కోలుకోవాలని వేడుకున్నారు. ఎమ్మెల్యే నరసింహన్ పాల్గొన్నారు. 17 వార్డులో ఆ పార్టీ న్యాయవాది ఢిల్లీ సమక్షంలో వినైతీర్కుం వినాయకర్ ఆలయంలో పూజలు నిర్వహించి అన్నదానం పంపిణీ చేశారు. వేలూరులో.. వేలూరు: రాష్ట్ర ముఖ్యమంత్రి జయలలిత సంపూర్ణ ఆరోగ్య కావాలని కోరు తూ అన్నాడీఎంకే పార్టీ జిల్లా కార్యదర్శి, షోళింగర్ ఎమ్మెల్యే పార్తిబన్ ఆధ్వర్యంలో వాలాజ ధన్వంతరి ఆరోగ్య పీఠంలో ప్రత్యేక యాగ పూజలు నిర్వహించారు. రాష్ర్ట ముఖ్యమంత్రి అనారోగ్యం కారణంగా చెన్నై అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తె లిసిందే. అందులో భాగంగా ధన్వంతరి పీఠంలో రాణిపేట ఇంజినీరింగ్ కళాశాల చైర్మన్ బోస్ అధ్యక్షతన పూజలు చేశారు. ముందుగా పీఠాధిపతి డాక్టర్ మురళీధర స్వామిజీ పీఠంలో అమ్మ పేరుపై గణపతి హోమం, ధన్వంతరి హోమం, కాల భైరవర్ హోమం పూజలతో పాటు పీఠంలోని స్వామి వారికి జయలలిత పేరుపై ప్రత్యేక పూజలు, అభిషేకాలు, ఆరాధనలు నిర్వహించి ప్రార్థనలు చేశారు. మాజీ జిల్లా కార్యదర్శి ఏలుమలై, పట్టణ కార్యదర్శి వేదగిరి, డబ్ల్యూజీ మోహన్, కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. -
మిన్నంటిన అమ్మ భక్తి
• ఆరోగ్య క్షేమం కోసం పూజల హోరు • ఆలయాలకు పాల బిందెలతో ఊరేగింపు • హోమాలు • పరామర్శల్లో నేతలు సాక్షి, చెన్నై: అపోలో ఆసుపత్రిలో 18 రోజులుగా చికిత్స పొందుతున్న సీఎం జయలలిత సంపూర్ణ ఆరోగ్యంతో ప్రజా సేవకు మళ్లీ అంకితం కావాలని కాంక్షిస్తూ భక్తి భావంతో అన్నాడీఎంకే వర్గాలు ఆదివారం పూజల్లో నిమగ్నమయ్యారు. రాష్ట్రంలోని అన్ని ఆలయాల్లో, వాడవాడల్లో పూజలు, హోమాలు, అభిషేకాలతో ముందుకు సాగారు. ఇక, పుదుచ్చేరి సీఎం నారాయణ స్వామితో పాటుగా పలు పార్టీల నాయకులు జయలలిత ఆరోగ్యంపై వైద్యుల వద్ద ఆరా తీశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జయలలిత త్వరితగతిన కోలుకోవాలని, సంపూర్ణ ఆరోగ్య వంతురాలిగా మళ్లీ ప్రజా సేవ సాగించాలని సర్వత్రా ఆకాంక్షిస్తూ వస్తున్నారు. అయితే,ఆమె ఆరోగ్యంపై రక రకాల వదంతులు బయలు దేరడం అన్నాడీఎంకే వర్గాల్లో ఆందోళన రేకెత్తిస్తున్నది. ఈ పరిస్థితుల్లో అమ్మ సంపూర్ణ ఆరోగ్యాన్ని కాంక్షిస్తూ ఉదయం నుంచి రాత్రి వరకు భక్తి భావం మిన్నంటే విధంగా అన్నాడీఎంకే వర్గాలు పూజల్లో నిమగ్నం అయ్యారు. మదురైలో జయ పేరవై, అన్నాడీఎంకే జిల్లా పార్టీ నేతృత్వంలో యాభై వేల మందితో భారీ పాల బిందెల ఊరేగింపు తిరుప్పర గుండ్రం వరకు సాగింది. ఆరుపడై వీడుల్లో ఒకటిగా ఉన్న తిరుప్పర గుండ్రం సుబ్రమణ్యస్వామి సన్నిధిలో బ్రహ్మోత్సవాలను తలపించే విధంగా ఈ ఊరేగింపు మేళ తాళాలు, గజరాజుల ఘీంకారాల నడుమ సాగాయి. ఆలయంలో విశిష్ట పూజలు, స్వామి వారికి అభిషేకాల అనంతరం భక్తులకు భారీ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇక, రాష్ట్రంలోని అన్ని ప్రధాన ఆలయాలు, వాడ వాడల్లో ఉన్న చిన్న చిన్న ఆలయాల్లోనూ పూజలు, పాల బిందెలతో ఊరేగింపుగా వెళ్లి స్వామి, అమ్మవార్లకు అభిషేకాలను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఇక, అనేక క్రైస్తవ ఆలయాల్లోనూ ప్రార్థనలు చేశారు. అమ్మకు పరామర్శ: అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న జయలలిత ఆరోగ్య పరిస్థితిని తెలుసుకునేందుకు ఉదయం నుంచి రాత్రి వరకు పలు పార్టీలకు చెందిన వాళ్లు తరలివచ్చారు. ఆదివారం అపోలోకు వచ్చిన కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు విలేకరులతో మాట్లాడుతూ జయలలిత ఆరోగ్యంపై వదంతులు సృష్టించడం మంచిది కాదని పేర్కొన్నారు. పుదుచ్చేరి సీఎం నారాయణ స్వామి, తమిళనాడు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తిరునావుక్కరసర్, పుదుచ్చేరి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నమశ్శివాయం ఉదయాన్నే ఆసుపత్రిలో పార్లమెంట్ డిప్యూటీ స్పీకర్ తంబిదురై, ఆర్థిక మంత్రి పన్నీరు సెల్వంలను కలుసుకున్నారు. అమ్మ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఇక, తమిళ మానిల కాంగ్రెస్ నేత జీకే వాసన్ , మనిదనేయ మక్కల్ కట్చి నేత జవహరుల్లా, సీపీఐ జాతీయ కార్యదర్శి, ఎంపీ.డీ. రాజాల, పీఎంకే యువజన నేత , ఎంపీ అన్భుమణి రాందాసు, పీఎంకే నేత జీకే మణి, సీనియర్ నేత ఏకేమూర్తి వేర్వేరుగా ఆసుపత్రి వద్దకు చేరుకుని అమ్మ ఆరోగ్యంపై విచారించారు. ఆపద్ధర్మ సీఎం: సీఎం అనారోగ్య కారణాల దృష్ట్యా, కుంటు పడ్డ ప్రభుత్వ పరిపాలనను గాడిలోపెట్టేందుకు ఆపద్ధర్మ సీఎం లేదా కొత్త సీఎంను నియమించేందుకు చర్యలు తీసుకోవాలని డీఎంకే కోశాధికారి ఎంకే స్టాలిన్ మీడియాతో మాట్లాడుతూ డిమాండ్ చేశారు. అయితే, ఆపద్ధర్మ సీఎం ఈ పరిస్థితుల్లో అవసరం లేదని టీఎన్‌సీసీ అధ్యక్షుడు తిరునావుక్కరసర్ వ్యాఖ్యానించడం గమనార్హం. ఇక, అమ్మ ఆరోగ్యం మెరుగు పడుతున్న దృష్ట్యా, ఆపద్ధర్మ సీఎంతో పనిలేదని అన్నాడీఎంకే తేల్చినట్టు సంకేతాలు వెలువడ్డాయి. ఇదే విషయాన్ని గవర్నర్(ఇన్) విద్యాసాగర్‌రావుతో సాగిన బేటీలో అన్నాడీఎంకే సీనియర్ మంత్రులు స్పష్టం చేసి ఉన్నారు. అమ్మ కోలుకుంటున్న దృష్ట్యా, త్వరితగతిన మళ్లీ ప్రజాసేవకు అంకితం అవుతారని, ఈ సమయంలో మంత్రి వర్గంలో ఎలాంటి మార్పులు చేయకూడదన్న నిర్ణయానికి అన్నాడీఎంకే వర్గాలు వచ్చి ఉండడం గమనార్హం. -
అమ్మ కోలుకోవాలని పూజలు
వేలూరు: రాష్ట్ర ముఖ్యమంత్రి జయలలిత సంపూర్ణ ఆరోగ్యవంతురాలిగా ఆస్పత్రి నుంచి తిరిగి రావాలని కోరుతూ అన్నాడీఎంకే శ్రేణులు పూజలు చేపట్టారు. ఈ పార్టీ టెక్నాలజీ విభాగం జిల్లా కార్యదర్శి జననీ బిగ్ బజార్ అధినేత సతీష్‌కుమార్ అధ్యక్షతన తొర్రపాడిలోని శ్రీ సుబ్రమణ్య స్వామి ఆలయం లో ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించిన అనంతరం మహా దీపారాధన పూజలు చేశారు. ఈ సందర్భంగా భక్తులకు అన్నదాన చేశారు. కార్యక్రమంలో కోఆపరేటివ్ డెరైక్టర్ రాజ, అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు. అదే విధంగా జిల్లాలోని అన్నాడీఎంకే యూనియన్ ఆధ్వర్యంలో గుడియాత్తం సమీపంలోని మీనూర్ శ్రీ వెంకటేశ పెరుమాల్ ఆలయంలో జయలలిత పే రుపై ప్రత్యేక పూజలు, యాగ పూజలు నిర్వహించారు. అమ్మ ఆరోగ్యం కోసం రాష్ట్ర వ్యాప్తంగా కార్యకర్తలతో పాటు సామాన్య ప్రజలు కూడా కోరుకుంటున్నారని వారి కోరిక వృథా పోదని జిల్లా కార్యదర్శి పార్తిబన్, ఆశాభావం వ్యక్తం చేశారు. అనంతరం మూలవర్ వెంకటేశ పెరుమాల్‌కు వెండి కవచం, పద్మావతి అమ్మవారికి ప్రత్యేక అలంకరణలు చేపట్టి యాగ పూజలు చేశారు. కార్యక్రమంలో కేవీ కుప్పం ఎమ్మెల్యే లోకనాథన్, మాజీ జిల్లా కార్యదర్శి రాము, మాజీ యూనియన్ కార్యదర్శి కోదండన్, కార్యకర్తలు పాల్గొన్నారు. -
భద్రకాళి అమ్మ వారిని దర్శించుకున్న సీఎండీ
హన్మకొండ కల్చరల్ : వరంగల్‌లోని శ్రీ భద్రకాళి ఆలయాన్ని జెన్కో సీఎండీ ప్రభాకర్‌రావు దంపతులు ఆదివారం సందర్శించారు. ఈ సం దర్భంగా వారికి అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతించి పూజ లు చేయించారు. అనంతరం మహాదాశీర్వచనం అందజేశారు. కార్యక్రమంలో ఎన్పీడీసీఎల్ సీజీఎం వి.తిరుపతిరెడ్డి, డీఈ బి.సామ్యానాయక్, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
పూజలకు ఖైరతాబాద్ గణేష్ సిద్దం
-
ట్రంప్ గెలుపు కోసం ఐసిస్ ప్రార్థనలు!
వాషింగ్టన్: ఉగ్రవాద సంస్థ ఐసిస్‌ను నిర్మూలిస్తానని అమెరికా డెమొక్రటిక్ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ఓ పక్క హెచ్చరిస్తుంటే, మరోపక్క ఆయన గెలుపు కోసం ఐసిస్ ప్రార్థనలు చేస్తోంది. ట్రంప్ అధ్యక్షుడైతే ఆయన దూకుడు నిర్ణయాల వల్ల అమెరికా స్వీయవినాశనం తప్పదని ఐసిస్ నమ్ముతున్నట్టు ఫారిన్ ఎఫైర్స్ మేగజైన్ తెలిపింది. ట్రంప్ నిలకడలేని మనిషని, ముస్లిం వ్యతిరేకని ఐసిస్ మద్దతుదారుల ఇంటర్వ్యూలు, సామాజిక మాధ్యమాల్లో చర్చలను పత్రిక ఉటంకించింది. అదే జరిగితే ముస్లిం సమాజం ఏకమవుతుందని, ఇస్లాం మద్దతు-వ్యతిరేక వర్గాలుగా చీలి యుద్ధం జరుగుతుందని జీహాదీలు విశ్వసిస్తున్నారు. ట్రంప్ తమకు శత్రువని, అయినా ఆయనే అధ్యక్షుడు కావాలని ఐసిస్ కోరుకొంటున్నట్టు పత్రిక వెల్లడించింది. రిపబ్లికన్ అధ్యక్ష అభ్యర్థి హిల్లరీ క్లింటన్ ముస్లిం వ్యతిరేకిని కాదని ఎప్పటి మాదిరిగానే చెబుతున్నందున ఆమె కంటే ట్రంప్ వస్తేనే లాభమని ఐసిస్ మద్దతు దారులు బలంగా విశ్వసిస్తున్నారని మేగజైన్ పేర్కొంది. -
రుద్రేశ్వర స్వామికి లక్ష బిల్వార్చన
హన్మకొండ కల్చరల్ : హన్మకొండలోని వేయి స్తంభాల ఆలయంలో ఆదివారం శ్రావణ బహుళ ఏకాదశి ఆరుద్రా నక్షత్రాన్ని పురస్కరించుకుని రుద్రేశ్వర స్వామివారికి లక్ష బిల్వార్చన చేశారు. ఆలయ ప్రధాన అర్చకుడు గంగు ఉపేంద్రశర్మ ఆధ్వర్యంలో అర్చకులు ఉదయం 5 గంటల నుంచి సుప్రభాత సేవ, మంగళవాద్య సేవ, తదితర పూజలు నిర్వహించారు. వర్షాలు కురవాలని కోరుకుంటూ పంచ భూతాలకు అధిపతి అయిన పరమేశ్వరున్ని ప్రార్థిస్తూ 51 లీటర్ల పాలతో క్షీరాభిషేకం చేశారు. పూజల్లో పాల్గొన్న ప్రముఖుల్లో న్యాయవాది పశుపతి ఈశ్వర్నాథ్, శోభారాణి దంపతులు, ప్రముఖ వస్త్ర వ్యాపారి కాసం పుల్లయ్య దంపతులు, భక్తులు పాల్గొన్నారు. -
ముత్యాలమ్మ జాతర కోలాహలం
నెల్లూరు(బృందావనం): వెంగళరావునగర్ సీ బ్లాక్‌లో కొలువైన ముత్యాలమ్మ జాతర ఆదివారం వైభవంగా జరిగింది. అమ్మవారి కలశాలను వాహనాలపై ప్రతిష్టించి నేత్రపర్వంగా ఊరేగించారు. దుర్గాదేవి, మహంకాళి, కాళికాదేవి, ముత్యాలమ్మ, భైరవ, పరశురాముడి ఉత్సవమూర్తులు, 108 టెంకాయలను గుత్తులుగా కట్టి సంప్రదాయంలో భాగంగా వీపులకు ఇనుప కొక్కీలను తగిలించుకొని లాగారు. నృత్యాలు, తార తప్పెట్లు, బాణసంచా, పంబగాళ్ల ఆటపాటలతో ఉత్సవం కనువిందుగా సాగింది. మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు వేడుకులు జరిగాయి. దేవస్థానం, కార్యక్రమ నిర్వాహకుడు చిరంజీవి, తదితరులు పాల్గొన్నారు. వెల్లివిరిసిన భక్తిభావం, దేశభక్తి స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఓ భక్తుడు శరీరమంతా కొక్కీల ఇనుప చట్రాన్ని బిగించి, తన శరీరం నుంచి వెలుపలికి తీసుకొచ్చిన కొక్కీలకు జాతీయపతాకాలను ప్రదర్శిస్తూ ముందుకుసాగారు. మరి కొందరు అమ్మవారి విగ్రహాలను చిన్నిచిన్ని రథాలపై అమర్చి తమ భక్తిభావాన్ని చాటుతూ మువ్వన్నెలతో తీర్చిదిద్ది కనువిందు చేశారు. ఉత్సవాలను తిలకించేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. -
వాన కురవాలి వాన దేవుడా..
వర్షాల కోసం మసీదులో ప్రార్థనలు చేసిన ముస్లింలు హత్నూర :వర్షాలు సమృద్ధిగా కురవాలని కోరుకుంటూ గుండ్లమాచునూర్ గ్రామానికి చెందిన ముస్లింలు ఆదివారం స్థానిక మసీదులు ప్రార్థనలు చేశారు. గ్రామంలోని ముస్లింలంతా స్థానిక మసీదు వద్దకు వచ్చి ప్రార్థనలు చేశారు. -
దేవుడు ప్రేమతోనే కొన్ని ప్రార్థనలు నిరాకరిస్తాడు!
తన అద్భుతమైన సంకల్పాల కోసం దేవుడు ఇశ్రాయేలీయులను ప్రత్యేకించుకున్నాడు. వారిని గొప్పగా కాపాడి, పోషించాడు కూడా! తన ప్రజలుగా వారి జీవనశైలి ప్రత్యేకంగా ఉండాలని ఆశించి వారికి మార్గదర్శకంగా ధర్మశాస్త్రాన్నిచ్చాడు. వారిని న్యాయాధిపతులు మాత్రమే ఏలాలని, రాజులనేవారు వారి కుండకూడదని, తానే వారికి శాశ్వతమైన రాజునని దేవుడు సగర్వంగా ప్రకటించుకున్నాడు. కాని అందరిలాగే తమకూ ఒక రాజు కావాలని ఇశ్రాయేలీయులు కొన్నాళ్లకు పట్టుబట్టారు. అది ప్రమాదకరమే కాదు, దైవవ్యతిరేకమని అప్పటి న్యాయాధిపతియైన సమూయేలు ఎంత నచ్చజెప్పినా వాళ్లు వినలేదు. వారికి శాశ్వతమైన రాజుగా ఉన్న తనను తృణీకరించి, మరోరాజు కావాలనుకోవడం వల్ల బాధపడిన దేవుడు వారికొక రాజును నియమించమని సమూయేలును ఆదేశించాడు. అలా సౌలు అనే వ్యక్తి ఇశ్రాయేలీయులకు మొదటి రాజయ్యాడు. దేవుణ్ణి ఏదైనా అడిగి పొందే సర్వహక్కులూ, స్వాతంత్య్రం విశ్వాసికున్నాయి. పట్టుబట్టితే మనమడిగింది దేవుడివ్వొచ్చు కూడా. కాని అది దైవ సంకల్పానుసారమైనది కాకపోతే దాని దుష్పరిణామాలకు బాధ్యత విశ్వాసిదే! ఆ తర్వాత వందేళ్లలో ఇశ్రాయేలీయుల రాచరికపు వ్యవస్థ కింద ఆర్థికంగా, మానసికంగా, ఆత్మీయంగా కూడా బాగా చితికిపోయారు. రెహబాము అనే నాల్గవ రాజు కాలం నాటికి ఇశ్రాయేలు దేశం రెండుగా చీలి మరింత బలహీనమైంది. ఫలితంగా శత్రుదేశాలకు బానిసలయ్యారు. అలా వారి వైభవానికి తెరపడి, చివరికి అవమానాలు, బానిసత్వం, వెట్టిచాకిరి, ఆకలి కేకలే మిగిలాయి జీవితంలో కొన్నిసార్లు మనం తీసుకునే చిన్న నిర్ణయాలు పెద్ద తుఫానులు సృష్టించి పెనువిషాదాన్ని నింపుతాయి. దేవుణ్ణి ఏదైనా అడిగి పొందే సర్వహక్కులూ, స్వాతంత్య్రం విశ్వాసికున్నాయి. పట్టుబట్టితే మనమడిగింది దేవుడివ్వొచ్చు కూడా. కాని అది దైవ సంకల్పానుసారమైనది కాకపోతే దాని దుష్పరిణామాలకు బాధ్యత విశ్వాసిదే! దేవుణ్ణి అడిగేందుకు అవధుల్లేవు కాని పొందేందుకు పరిమితులున్నాయి. గె డ్డం గీసుకునే తండ్రిని ఐదేళ్ల కొడుకు తనకూ ఆ రేజర్ కావాలని అడిగితే తండ్రి ఇస్తాడా? ప్రేమించే ఏ తండ్రీ ఆ పని చేయడు. మన పరలోకపు తండ్రి అయిన దేవుడూ అంతే! దేవుడు మన ప్రార్థనలు కొన్ని నిరాకరించడం వెనుక సర్వోత్కృష్టమైన ఆయన ప్రేమ దాగి ఉన్నదని విశ్వాసి గ్రహించాలి. దేవుడే తమకు శాశ్వతమైన రాజుగా ఉంటే అదెంత ఆశీర్వాదకరమో, ఆనందదాయకమో అర్థం చేసుకోలేని ఆత్మీయాంధకారం ఇశ్రాయేలీయులది. అందుకే తమకు రాజు కావాలని కోరడం ద్వారా దేవుణ్ణి ఆయనివ్వగల బంగారు భవిష్యత్తును పోగొట్టుకుంటున్నామని వారికి అర్థం కాలేదు. ‘మీరు అడగక మునుపే పరలోకపు తండ్రికి మీ అక్కరలు తెలుసు. అన్నది దివ్యమైన పరలోక ప్రార్థన నేర్పేముందు యేసుక్రీస్తు పలికిన ఉపోద్ఘాతపు మాటలు (మత్త 6:8) ప్రార్థించే ప్రతిసారీ మనమీ మాటలు గుర్తు చేసుకోవాలి. ఉధృతంగా పారే నదిని కూడా దాటగల శక్తి ఒక చిన్న దోనెది. అంతమాత్రాన దోనె నదికన్నా గొప్పది కాదు. నదినే దాటుతున్నాను కాబట్టి నదిలో నీళ్లన్నీ నాకే కావాలంటే మునిగిపోక తప్పదు. మన ప్రార్థనలు దేవుణ్ణే పక్కన పెట్టేవిగా ఉంటే మనమడిగే ఈవులే మనకు ఉరిగా మారుతాయి. మన ప్రార్థనలు మన జీవితంలో దేవుని స్థానాన్ని నానాటికీ మరింత పదిలం చేయాలి. ఆయన సంకల్పాల నెరవేర్పునకు మన జీవితం ఒక వేదిక కావాలి. మనం దేవుణ్ణి అడిగి పొందేవి మంచివి కావచ్చుకాని, మనమడిగినవి నిరాకరించి ‘దేవుడిచ్చేవి సర్వోత్తమమైనవి’ అని మర్చిపోరాదు. - టి.ఎ.ప్రభుకిరణ్ -
ఈద్ ముబారక్
భక్తిభావం వెల్లివిరిసింది. రంజాన్ (ఈద్-ఉల్-ఫితర్) పండుగను ముస్లింలు ఘనంగా జరుపుకొన్నారు. గురువారం ఉదయాన్నే పిల్లలు, పెద్దలు స్నానాలు ఆచరించి.. కొత్త బట్టలు ధరించారు. స్నేహితులు, బంధువుల ఇళ్లకు వెళ్లి పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈద్గాలు, మసీదుల్లో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అల్లాహ్ నామస్మరణతో తరించారు. అనంతరం కులమతాలకతీతంగా ఆలింగనం చేసుకుంటూ ‘ఈద్ ముబారక్’ చెప్పుకున్నారు. ఇళ్లకు చేరుకుని షీర్ కుర్మా రుచులను ఆస్వాదించారు. ఇతర మతాలకు చెందిన స్నేహితులకు పంచిపెట్టి ఆనందంగా గడిపారు. -
భక్తి శ్రద్ధలతో రంజాన్ ప్రార్ధనలు
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో రంజాన్ వేడుకలను ఘనంగా జరిగాయి. మసీదులన్నీ భక్తులతో కిటకిటలాడాయి. పిల్లా పెద్దా అనే తారతమ్యం లేకుండా పెద్ద సంఖ్యలో ఉదయం నుంచి మసీదులకొచ్చి ప్రార్థనలు జరిపారు. ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఆలింగనం చేసుకున్నారు. చాలా మంది ముస్లింలు తెల్లని నూతన వస్త్రాలు ధరించి భక్తి శ్రద్ధలతో అల్లాను ప్రార్థించారు. హైదరాబాద్ పాతబస్తీలో రంజాన్ రద్దీని దృష్టిలో పెట్టుకుని ట్రాఫిక్‌ను మళ్లించారు. పలు దేశాల్లో ఐసిస్ దాడులు జరపడం, హైదరాబాద్‌లో సైతం ఐసిస్ సానుభూతి పరులను అరెస్ట్ చేసిన నేపథ్యంలో పోలీసులు భారీ బందోస్తును ఏర్పాటు చేశారు. హైదరాబాద్‌లోని చార్మినార్, మక్కామసీదు, మీర్ ఆలం ఈద్గా, నిజామాబాద్, ఆదిలాబాద్, మహబూబ్‌నగర్ ఇతర తెలంగాణ జిల్లాల్లో ఉదయం నుంచే రంజాన్ వేడుకలు జరుపుకున్నారు, మసీదుల్లో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అదే విధంగా కడప, అనంతపురం, కర్నూలు, విజయవాడ, గుంటూరు, ఒంగోలు, నెల్లూరు, కాకినాడ, విశాఖ జిల్లాల్లో కూడా రంజాన్ సందర్భంగా ముస్లింలు ప్రార్ధనలు నిర్వహించారు. పలు చోట్ల మసీదులు విద్యుత్‌దీపాలతో అలంకరించి పండుగ శోభను తెచ్చారు. ఇదిలా ఉండగా ,గవర్నర్ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ప్రతిపక్ష నాయకులు ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. -
రేపే ‘రంజాన్’
మదనపల్లె సిటీః ముస్లింలు పరమ పవిత్రంగా జరుపుకునే రంజాన్ (ఈద్-ఉల్-ఫితర్) పండుగను గురువారం జరుపుకోనున్నారు. ప్రభుత్వ జిల్లా సర్‌ఖాజీ కమాలుల్లాషాజహురీ, మతగురువులు మౌల్వీ షాకీరుల్లా సాహెబ్ లతీఫీ, హాఫీజ్ సైపుల్లా సాహెబ్ ఈమేరకు ప్రకటించారు. మంగళవారం రాత్రి షవ్వాల్ నెలవంక దర్శనం కానందున ఈద్ పండుగను గురువారం జరుపుకోవాలన్నారు. హిలాల్ కమిటీ మదనపల్లె జామియా మసీదులో సమావేశమై రాష్ట్ర వ్యాప్తంగా అన్ని హిలాల్ కమిటీలతో సంప్రదింపులు జరిపి ఎక్కడా నెలవంక దర్శనం కాలేదని నిర్థారించుకున్నాక ఈ మేరకు ప్రకటించారు. గురువారం ఉదయం ముస్లిం సోదరులందరూ ఈద్గాలలో ప్రత్యేక ఈద్ ప్రార్థనలు జరుపుకోవాలని సూచించారు. జకాత్,ఫిత్రాలు ఇది వరకు చెల్లించనివారు వెంటనే పేదలకు చెల్లించి వారు కూడా పండుగ సంతోషంగా జరుపుకునేలా చూడాలన్నారు. -
హజీ అలీ దర్గాలో తృప్తి దేశాయ్ ప్రార్థనలు
న్యూఢిల్లీ : భూమాత బ్రిగేడ్ వ్యవస్థాపకురాలు తృప్తి దేశాయ్ ఎట్టకేలకు ముంబైలోని హజీ అలీ దర్గాలో ప్రవేశించారు. పోలీసులు భద్రత మధ్య ఆమె గురువారం ఉదయం దర్గాలో ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం తృప్తి దేశాయ్ మాట్లాడుతూ... స్త్రీ, పురుషుల మధ్య సమానత్వం సాధించేందుకే తమ పోరాటం అన్నారు. మరొకసారి గర్భగుడికి వెళ్లి ప్రార్థనలు చేసేందుకు ప్రయత్నిస్తామన్నారు. పోలీసులు ఈసారి తమకు సహకరించారని తృప్తి పేర్కొన్నారు. హజీ అలీ దర్గాలోకి ఏప్రిల్ 28న తృప్తి దేశాయ్‌తో పాటు పలువురు మహిళలు లోనికి ప్రవేశించేందుకు యత్నించగా, పోలీసులతో పాటు స్థానిక ముస్లింలు అడ్డుకున్న విషయం తెలిసిందే. అయితే ఈసారి ఆమె దర్గాలోకి ప్రవేశించగలిగినా... దర్గాలోని ముఖ్యప్రాంతం (గర్భగుడి)లోకి మాత్రం వెళ్లలేకపోయారు. కాగా ఆలయాల్లో మహిళలకు సమాన హక్కుల కోసం తృప్తి దేశాయ్ గత కొన్ని నెలలుగా పోరాటం చేస్తున్నారు. ఇందులో భాగంగా మహారాష్ట్రలోని శని సింగ్నాపూర్, త్రయంబకేశ్వర్ ఆలయాల ప్రవేశం అనంతరం హజీ అలీ దర్గా ప్రవేశం చేశారు. -
దర్గాలో దేవాదాయశాఖ మంత్రి ప్రత్యేక ప్రార్థనలు
చింతపల్లి: నల్లగొండ జిల్లాలో దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకిరణ్‌రెడ్డి ఆదివారం పర్యటిస్తున్నారు. పర్యటనలో భాగంగా డిండి మండలం సీకే మల్లేపల్లి గ్రామంలోని హజరత్ అబ్బాస్ దర్గా ఉర్సు ఉత్సవాల్లో ఆయన పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అబ్బాస్ దర్గాలో ఉర్సు ఉత్సవాలు ఈ నెల 23వ తేదీ వరకు జరగనున్నాయి. -
కడప దర్గాలో ఏఆర్ రెహమాన్..
కడప కల్చరల్: కడప నగరంలోని ఆస్థానె మగ్దూమ్ ఇల్లాహి (అమీన్‌పీర్) దర్గాలో వైభవోపేతంగా జరుగుతున్న హజరత్ ఖ్వాజా అమీనుల్లా మాలిక్ ఉరుసు ఉత్సవాలకు విశ్వ విఖ్యాత సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ హాజరయ్యారు. శనివారం అర్ధరాత్రి జరిగిన గంథోత్సవానికి ఆయన హాజరై ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. దర్గా గురువులు హజరత్ సయ్యద్‌షా ఆరీఫుల్లా హుసేనీ సాహెబ్ గంథం సమర్పించారు. వారితో కలిసి రెహమాన్ ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. దాదాపు రెండు గంటలపాటు కుటుంబ సభ్యులతో కలిసి రెహమాన్ దర్గాలో గడిపారు. ఏటా నిర్వహించే ఉర్సు ఉత్సవాలకు సర్వరమాత్రికుడు తప్పక హాజరయ్యే విషయం తెలిసిందే. -
అనాథ పిల్లల కోసం ప్రార్థించా
మానవసేవే మాధవ సేవ అంటారు. అలాంటి మానవ సేవలోనూ ముందున్న నటి హన్సిక తన ప్రతి పుట్టిన రోజుకు ఒక అనాథను దత్తత తీసుకుంటున్న విషయం తెలిసిందే. అలా ఇప్పటికే 30 మంది అనాథ పిల్లలను అక్కున చేర్చుకుని వారి సంరక్షణ బాధ్యతల్ని చేపట్టిన హన్సిక మాధవ సేవతో పాటు మానవ సేవను చేసుకున్నారు. ఇటీవల ఆమె నటుడు కమలహాసన్, శివకార్తికేయన్‌లతో పాటు తిరుచెందూర్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్నారు.అనంతరం హన్సిక తన తల్లి మోనా, సోదరుడు ప్రసాద్‌లతో కలిసి తిరుచెందూర్లోని ఆరుముఖ కుమారస్వామి ఆలయానికి వెళ్లి స్వామిని దర్శించుకున్నారు.ఆలయ నిర్వాహకులకు ముందుగానే సమాచారం అందజేయడంతో హన్సికతో కుమారస్వామికి విశేష అర్చన కార్యక్రమాలను నిర్వహించారు.హన్సిక కుమారస్వామికి ఆరు రకాల అభిషేకాలు చేశారు. అలా సుమారు ఐదు గంటల సేపు విశేష పూజలు నిర్వహించారు. రెండు గంటల సేపు కుమారస్వామి ముందు ధ్యానంలో గడిపారు. తను దత్తత తీసుకున్న పిల్లల శ్రేయస్సు కోరుతూ కుమారస్వామిని ప్రార్థించినట్లు హన్సిక ఈ సందర్భంగా వెల్లడించారు. తిరుచెందూర్ కుమారస్వామిని దర్శించుకోవాలన్న తన చిరకాల కోరిక ఇప్పటికి నెరవేరిందని మనసుకు చాలా ప్రశాంత చేకూరినట్లుగా ఉందని ఆమె అన్నారు. ప్రస్తుతం హన్సిక విజయ్ సరసన నటించిన భారీ సాంఘిక జానపద చిత్రం పులి విడుదల కోసం ఎదురు చూస్తున్నారు. -
నీరాజనం
నరసాపురం అర్బన్ : నరసాపురంలో శ నివారం జన కెరటాలు ఎగిసిపడ్డాయి. పట్ణణంలో ఏ వీధి చూసినా జనమే. అందరి పయనం గోదావరి ఘాట్లవైపే సాగింది. పుష్కర మహాసంబరం చివరిరోజు కావడంతో భ క్తులు పోటెత్తారు. ఇతర రాష్ట్రాలు, జిల్లాల నుంచి పెద్దసంఖ్యలో భక్తులు హాజరయ్యారు. తెల్లవారుజాము నుంచే ఘాట్లన్నీ రద్దీగా మారిపోయాయి. ఘాట్లకు వచ్చే రహదారులు జనంతో నిండిపోయాయి. వలంధరఘాట్, లలితాంబ, కొండాలమ్మ, అమరేశ్వర్ ఘాట్లు జనంతో కిక్కిరిశాయి. రూరల్ పరిధిలోని ముస్కేపాలెం, లక్ష్మణేశ్వరం, దర్భరేవు, పీచుపాలెం, బియ్యపుతిప్ప ఘాట్ల వద్ద కూడా రద్దీ ఎక్కువగానే ఉంది. మధ్యాహ్నం 3 గంటల వరకు ఘాట్లకు చేరుకున్న భక్తులు స్నానాలు చేయడానికి అరగంట సమయం వరకు పట్టింది. ఉదయం పూట పాటు కారణంగా గోదావరిలో నీరు లేకపోవడంతో భక్తులు జల్లు స్నానాలు ఆచరించారు. మహిళలు, వృద్ధులు, పెద్దసంఖ్యలో స్నానాలు చేశారు. విపరీతమైన వేడి, ఉక్కపోత ఉన్నప్పటికీ అశేష జనం భక్తి ముందు అవేమీ నిలబడలేదు. దాతలు, స్వచ్ఛంద సంఘాలు భక్తులకు భోజన ఏర్పాట్లు చేశారు. 22 లక్షల మందికి పైగా స్నానాలు గోదావరి పుష్కర సంబరం ముగిసింది. అధికారుల అంచనాలను తలకిందులు చేస్తూ యాత్రికులు పుష్కరాలకు పోటెత్తారు. నరసాపురం రేవుల్లో 22 లక్షలకు మందికి పైగా స్నానాలు చేశారు. ప్రతిరోజూ 1.50 లక్షలకు మంది వరకూ స్నానాలు చేశారు. 2003 పుష్కరాల్లో నరసాపురంలో 5 లక్షల మంది వరకు స్నానాలు చేసినట్టు అంచనా. ఈ పుష్కరాల్లో భక్తుల సంఖ్య మూడు రెట్లకు పైగా పెరిగింది. 12 రోజులూ నరసాపురంలో ఉన్న అన్ని ఘాట్లలో 22,10,059 మంది పుష్కర స్నానాలు చేశారని అధికారులు లెక్కలు కట్టారు. తేదీ= హాజరైన భక్తులు 14= 1,062,248 15= 1,46,228 16= 1,39,340 17= 1,42,649 18= 3,18,396 19= 2,06,974 20= 1,72,147 21= 1,19,658 22= 1,80,636 23= 1,75,124 24= 1,66,981 25= 3,35,138 కిక్కిరిసిన కొవ్వూరు టోల్గేట్ (కొవ్వూరు) : గోదావరి పుష్కరాల సందర్భంగా కొవ్వూరు గోష్పాదక్షేత్రం భక్తులతో పోటెత్తింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు భక్తులు వస్తూనే ఉన్నారు. సాయంత్రం ఐదు గంటల నుంచి స్నానఘట్టం భక్తులతో కిటకిటలాడింది. దూరప్రాంతాల నుంచి వచ్చే భక్తులు మధ్యాహ్నానికి స్నానఘట్టానికి చేరుకుని పుణ్యస్నానం ఆచరించారు. అన్ని స్నానఘట్టాల్లో భక్తుల సందడి నెలకొంది. సాయంత్రం ఆరు గంటలకు భారీ సంఖ్యలో మహిళలు గోష్పాదక్షేత్రానికి చేరుకుని హారతి కార్యక్రమంలో పాల్గొన్నారు. దీపాలు వెలిగించి గోదావరి మాతకు నీరాజనం అర్పించారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన భక్తులు హారతి కార్యక్రమంలో పాల్గొని గోదావరి మాతకు పూజలు చేశారు. తాళ్లపూడికి యూత్రికుల తాకిడి తాళ్లపూడి : పుష్కరాల చివరిరోజు తాళ్లపూడి మండలంలోని ఘాట్లకు భక్తులు వేలాదిగా తరలివచ్చి స్నానమాచరించారు. గోదారమ్మ సంబరాన్ని భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. ఆఖరిరోజు కావడంతో గోదావరికి ఉదయం నుంచి హారతులు ఇచ్చి ఘనంగా ముగింపు పలికారు. తెల్లవారుజాము 3 గంటల నుంచి రాత్రి వరకు భక్తులు గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరించారు. వేగేశ్వరపురం, ప్రక్కిలంక, తాళ్లపూడి, తాడిపూడి, బల్లిపాడు ఘాట్ల వద్దకు రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు వచ్చి పుష్కర స్నానాలు చేశారు. శనివారం సుమారు 55 వేల మంది భక్తులు పుష్కరస్నానాలు ఆచరించారు. కోడేరు కిటకిట కోడేరు (ఆచంట) : పుష్కరాల చివరి రోజున ఊహించినట్టుగానే కోడేరు పుష్కరఘాట్ భక్తులతో పోటెత్తింది. నెల్లూరు, ఒంగోలు, ప్రకాశం తదితర జిల్లాలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి పుణ్యస్నానాలు ఆచరించారు. చివరిరోజు కావడంతో గోదార మ్మకు భక్తిశ్రద్ధలతో గంగ పూజలు నిర్వహించి ఆత్మీయ వీడ్కోలు పలికారు. ఘాట్లలోకి ఎగువ నుంచి నీరు పెద్దఎత్తున చేరడంతో భక్తులు ఉత్సాహంగా పుష్కరస్నానాలు ఆచరించారు. మండలంలోని కరుగోరుమిల్లి, భీమలాపురం, పెదమల్లం ఘాట్లు భక్తులతో కళకళలాడాయి. కోడేరు, కరుగోరుమిల్లి, భీమలాపురం, పెదమల్లం ఘాట్ల వద్ద దాతలు భక్తులకు అన్నదాన కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. జనసంద్రమైన తీపర్రు పెరవలి : గోదావరి పుష్కరాలు చివరిరోజైన శనివారం పుష్కర ఘాట్లకు భారీగా పోటెత్తారు. ఏ పుష్కర ఘాట్ చూసినా ఇసుక వేస్తే రాలనంతగా భక్తులు రావడంతో పుణ్యస్నానాలు చేసేందుకు భక్తులు అవస్థలు పడ్డారు. ఒకవైపు గోదావరి ఉధృతంగా ప్రవహిస్తుండడంతో అధికారులు జనసంద్రాన్ని చూసి హడలిపోయారు. ఏ ప్రమాదం ముంచుకొస్తుందోనని గ్రూపులు గ్రూపులుగా పుష్కర పుణ్య స్నానాలకు భక్తులను నదిలోకి దింపి స్నానాలు చేయించారు. తీపర్రు పుష్కర ఘాట్‌కు 90 వేల మంది, ఖండవల్లికి లక్షకు పైగా, ఉసులుమర్రు 15 వేలు, కానూరు అగ్రహారానికి 20 వేలు, కాకరపర్రులో 35 వేలు, ముక్కామలలో 80 వేలు, ఉమ్మిడివారిపాలెంలో 60 వేల మంది పుణ్యస్నానాలు ఆచరించినట్టు అధికారులు అంచనాలు వేశారు. సిద్ధాంతంలో జన ప్రవాహం సిద్ధాంతం (పెనుగొండ రూరల్) : గోదావరి పుష్కరాలకు సిద్ధాంతంలో మహా ముగింపు పలికారు. భక్తుల జయజయ ధ్వానాల మధ్య పుణ్యస్నానాలు చేస్తూ గోదారమ్మకు భక్తులు నిరాజనం పలికారు. శనివారం ఆఖరిరోజు కావడంతో భక్తులు తండోప తండాలుగా తరలివచ్చారు. వేకువజాము నుంచి రాత్రి వరకు పుణ్యస్నానాలు జరుగుతూనే ఉన్నాయి. రికార్డుస్థాయిలో భక్తులు తరలిరావడంతో సిబ్బంది చెమటోడ్చారు. భక్తులతో నాలుగు ఘాట్లు కిక్కిరిశారుు. శనివా రం ఒక్కరోజే 1.50 లక్షలకు పైగా భక్తులు వచ్చినట్టు అధికారులు అంచనా వేస్తున్నా రు. భక్తుల సంఖ్య అధికంగా వచ్చి నా సిద్ధాంతం గ్రామస్థులు ఆతి థ్యంలోనూ మిన్న అని నిరూపించుకొన్నారు. ప్రతి ఒక్కర ూ ఎవరి స్తోమతను బట్టి వారు భక్తులకు కావలసిన అన్ని ఏర్పాట్లు చేశారు. మం చి నీరు, పాలు, టీ, వేడినీళ్లు, అల్పాహారం, భోజ నాలు, ప్రసాదాలు ఇలా అన్నింటిని దాతలు ఇతోధికంగా పంపిణీ చేశారు. పట్టిసీమకు పోటెత్తారు పోలవరం : పుష్కరాలు చివరిరోజైన శనివారం పట్టిసీమ రేవుకు భక్తులు పోటెత్తారు. వరుసగా 3వ రోజు కూడా లాంచీలు తిరగకపోవటంతో భద్రకాళీ సమేత వీరేశ్వరస్వామిని దర్శించుకునే అవకాశం లేక భక్తులు నిరాశతో వెనుదిరిగారు. గోదావరిలో వరద నీరు పెరగడంతో పట్టిసీమ రేవులో పుష్కర ఘాట్ మెట్లపైనే పుష్కర స్నానాలు చేయాల్సి వచ్చింది. దీంతో భక్తులు ఇబ్బందులు పడ్డారు. గోదావరి పెరగటంతో మహానందీశ్వర క్షేత్రానికి వెళ్లే రోడ్డు మార్గం కూడా మునిగిపోయింది. పట్టిసీమతో పాటు పోలవరం తాత్కాలిక ఘాట్లలో, గూటాల ఆంజనేయస్వామి ఘాట్‌లో కూడా భక్తులు అధిక సంఖ్యలో పుష్కర స్నానాలు చేశారు. పట్టిసీమలో సుమారు 50 వేల మంది మిగిలిన ఘాట్లలో మరో 50 వేల మంది పుష్కరస్నానాలు చేసినట్టు అధికారులు అంచనా వేశారు. -
వైభవంగా గోదావరి పుష్కరాలు ముగింపు సంబరం
చివరి రోజున 18.10 లక్షల మంది పుణ్యస్నానాలు అత్యధికంగా కొవ్వూరు డివిజన్లో 7.39 లక్షలు తరలివచ్చిన ఒడిశా భక్తులు 15.50 లక్షల మంది పుష్కర యాత్రికులను తరలించిన ఆర్టీసీ 12 రోజుల్లో ఆర్టీసీ ఆదాయం రూ.4.40 కోట్లు సాక్షి, కొవ్వూరు :గోదావరి పుష్కరాలకు భక్తులు రికార్డు స్థాయిలో పోటెత్తారు. పుష్కరోత్సవాల ముగింపు రోజైన శనివారం ఒడిశా నుంచి పెద్దసంఖ్యలో భక్తులు వచ్చి పుణ్యస్నానాలు ఆచరించారు. మొత్తం 12 రోజుల్లో జిల్లాలోని 97 ఘాట్లలో శనివారం సాయంత్రం 4 గంటల సమయానికి స్నానాలు ఆచరించిన వారి సంఖ్య కోటిన్నర దాటింది. శనివారం ఒక్కరోజే 18.10 లక్షల మంది పుణ్యస్నానాలు ఆచరించారు. 2003 పుష్కరాలతో పోలిస్తే ఈసారి సుమారు 35 లక్షల మంది యాత్రికులు అధికంగా వచ్చారు. సాయంత్రం 6 గంటల సమయానికి సమయానికి అందిన సమాయారం ప్రకారం గడచిన 12 రోజుల్లో 1,52,50,779 మంది స్నానాలు ఆచరించారు. శనివారం జిల్లాలోని 97 ఘాట్లకు 18,10,487 మంది భక్తులు వచ్చినట్టు ప్రకటన వెలువడింది. కొవ్వూరు డివిజన్లో అత్యధికంగా 7,38,997 మంది, నరసాపురం డివిజన్లో 6,32,997 మంది, జంగారెడ్డిగూడెం డివిజన్లో 4,38,513 మంది పుణ్యస్నానాలు ఆచరించారు. జిల్లాలో సుమారు 55 వేల మంది ఒడిశా భక్తులు పుణ్యస్నానాలు ఆచరించినట్టు సమాచారం. ఆర్టీసీకీ రూ4.40 కోట్ల ఆదాయం : పుష్కరాల నేపథ్యంలో జిల్లా ఆర్టీసీకి రూ.4.40 కోట్ల మేర ఆదాయం లభించింది. ప్రదానంగా పుష్కరాల 12 రోజులు జిల్లావ్యాప్తంగా 498 ఆర్టీసీ బస్సులు రాకపోకలు సాగించాయి. వీటిలో 400 బస్సులు జిల్లాలోని పుష్కర ఘాట్లకు, ఇతర ప్రాంతాలకు రాకపోకలు సాగించగా, కొవ్వూరులో 80 ఉచిత బస్సులు, నరసాపురంలో 10, సిద్ధాంతంలో 8 బస్సులు ఏర్పాటు చేశారు. ఆర్టీసీ బస్సుల్లో 15.50 లక్షల మంది రాకపోకలు సాగించారు. -
గోదారమ్మా.. నీకు వందనం
పావన వాహిని మహాపర్వం అట్టహాసంగా ముగిసింది. ఎందరికో తీపి జ్ఞాపకాలను.. కొందరికి చేదు అనుభవాలను మిగిల్చి కాలప్రవాహంలో కలిసిపోయింది. 2027లో వచ్చే పుష్కరాల వరకు గుర్తుండేలా ఇప్పటి పాలకులకు, అధికారులకు గుణపాఠం నేర్పింది. కేవలం ప్రచారయావ తప్ప యాత్రికులకు, భక్తులకు కనీస సౌకర్యాలు కల్పించలేని పాలకుల నిర్లక్ష్యం ఎన్ని పుష్కరాలకైనా మాయనిమచ్చలా మిగిలిపోనుంది. రాజమండ్రిలో తొలిరోజు 29మంది మృత్యువాత పడిన ఘోర విషాద ఘటన పొరుగునే ఉన్న పశ్చిమ వాసులనూ కలవరపర్చింది. ఇక ఎన్నో వ్యయ ప్రయాసలు, దూరాభారాలకోర్చి వచ్చిన యాత్రికులు ప్రభుత్వ అరకొర ఏర్పాట్లు నరకయాతన అనుభవించేలా చేసినా.. గోదారి బిడ్డల ఔదార్యానికి, దాతృత్వానికి, సహాయ గుణానికి పరవశిం చిపోయారు. ఎప్పటికీ మరచిపోలేని జ్ఞాపకాలతో తిరుగు పయనమయ్యారు. కేంద్రమంత్రులు.. ప్రముఖులు ఎక్కడ? కుంభమేళా తరహాలో నిర్వహించే పుష్కరాలకు దేశ, విదేశీ ప్రముఖులను తీసుకువస్తామని ఈ ప్రాంత వైశిష్ట్యాన్ని నలుచెరగులా వ్యాపింపజేస్తామని పాలకులు తొలుత ఆర్భాటంగా ప్రకటించారు. ప్రధాని నరేంద్రమోదీ వచ్చే అవకాశముందని సీఎం చంద్రబాబు.. రాష్ట్రపతికి, ఉపరాష్ర్టపతికి స్వయంగా ఆహ్వానం ఇచ్చామని జిల్లాకు చెందిన దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు డాంబికాలు పలికారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా సహా 18మంది కేంద్రమంత్రులు గోదావరి పుణ్యస్నానాలకు తరలిరానున్నారని మాణిక్యాలరావు ఒకటికి పదిసార్లు చెప్పారు. కానీ మన రాష్ట్రానికి చెందిన వెంకయ్యనాయుడు మినహా మరే ఇతర కేంద్రమంత్రి పుష్కర స్నానానికి వచ్చిన దాఖలాలు లేవు. ఇక గోదావరి తీర ప్రాంత ఎంపీ మురళీమోహన్ సినీ నేపథ్యంతో తారలు దిగివస్తారని సగటు సినీ అభిమానులు ఆశించారు. ఒకరిద్దరు ప్రముఖులు తప్ప చలన చిత్రదిగ్గజాలే కాదు మినీ స్టార్లూ రాలేదు. రాజకీయ, సినీ ప్రముఖుల రాక ఏమోగానీ.. గోదారమ్మ చల్లని ఆశీస్సులు పొందేందుకు భక్తజనం ఊహించని విధంగా పోటెత్తింది. కానీ.. ప్రభుత్వ ఏర్పాట్లు అడుగడుగునా వెక్కిరించాయి. ‘రండి రండి.. కుంభమేళా తరహాలో పుష్కరాలు నిర్వహిస్తున్నాం. పుణ్యస్నానం చేసి తరించండి..’ అంటూ మూడునెలలుగా విపరీతమైన ప్రచారంతో ఊదరగొట్టిన చంద్రబాబు ప్రభుత్వం సరిగ్గా రెండు నెలల ముందు నుంచే ఆదరాబాదరగా పుష్కర పనులు చేపట్టింది. అప్పుడు వేధింపులు.. ఇప్పుడు అభినందనలు జిల్లాలో చేపట్టిన పనుల్లో పుష్కరాలు మొదలయ్యే నాటికి 70శాతం కూడా పూర్తి కాలేదు. అరకొర పనుల మధ్యనే పుష్కరాలు మొదలు కాగా, పూర్తయ్యేనాటికి కూడా ఇంకా కొన్ని పనులు కొనసా..గుతూనే ఉన్నాయి. వాస్తవానికి ఆ పనులు కూడా ఉన్నతాధికారులు రాత్రిపగలు తేడా లేకుండా వెంటపడితేగానీ పూర్తి కాలేదనేది నిర్వివాదాంశం. తీవ్రంగా వేధింపులకు గురిచేస్తున్నారంటూ ఓ దశలో జిల్లా కలెక్టర్ కె.భాస్కర్‌పై కాంట్రాక్టర్లు, అధికారులు తిరగబడే పరిస్థితి వచ్చినా... పుష్కరాలు పూర్తయిన తర్వాత కలెక్టర్‌ను అభినందిస్తున్నారు. జిల్లా ఎస్పీ భాస్కర్‌భూషణ్, అన్ని విభాగాల అధికారులు, సిబ్బంది ఒళ్లు హూనమయ్యేలా పనిచేయడం వల్లనే ఉన్నంతలో గట్టెక్కగలిగామనేది అధికారవర్గాల వాదన. ఈ క్రమంలో జిల్లాలో పుష్కరాల విజయవంతం క్రెడిట్ తీసుకునేందుకు ఉత్సాహం చూపుతున్న అధికారులు పుష్కరాల పేరుతో అడ్డంగా రూ.కోట్లు దోచేసిన అక్రమార్కులను వెలికితీసి వారి ఆట కట్టిస్తారో లేదో చూడాలి. పుష్కరాలు మా కష్టం వల్లే జయప్రదమయ్యాయని ఎవరెన్ని గొప్పలు చెప్పుకున్నా.. నిజాలకు సజీవ సాక్ష్యంగా పరవళ్లు తొక్కుతూ ముందుకు సాగుతున్న తెలుగువాడి జీవనాడి గోదారమ్మ తల్లికి వందనం. -జి.ఉమాకాంత్, సాక్షి ప్రతినిధి, ఏలూరు -
జయ మంగళం.. నిత్య శుభ మంగళం
భక్తజన పారవశ్యంతో గోదావరి తీరం పులకించింది. మమతానురాగాలను ప్రోది చేసింది. దాతృత్వపు ఔన్నత్యాన్ని చాటింది. అనిర్వచనీయమైన ఆనందాన్ని మిగిల్చింది. పన్నెండు రోజుల పుష్కర పండగలో ఎన్నో అనుభూతులు.. మరెన్నో అనుభవాలు.. అక్కడక్కడా అపశ్రుతులు.. అట్టహాసంగా మొదలైన ఆది పుష్కరాలు పరిసమాప్తమయ్యాయి. జయమంగళం.. నిత్య శుభ మంగళం అంటూ యాత్రికులకు.. భక్త జనులకు వీడ్కోలు పలికాయి. పూలు, పండ్లతో.. పసుపు, కుంకాలతో.. పాలు, పన్నీరుతో.. శ్రీగంధపు ధారతో.. పంచామృతాలతో.. గోదారమ్మను వివిధ రూపాల్లో అర్చించే అవకాశమిచ్చిన పుష్కరుడికి అంతా అంజలి ఘటించారు. గోదావరి తీరం నుంచి భారంగా కదిలారు. పుష్కర విధులు నిర్వర్తించిన ఉద్యోగులు, స్వచ్ఛంద సేవకులు చివరి క్షణాల్లో ఉద్వేగానికి గురయ్యారు. జీవన.. పావన వాహిని గోదారి తల్లి సేవలో తరించామన్న తృప్తితో ఇంటిముఖం పట్టారు. సాక్షి ప్రతినిధి, ఏలూరు : పుష్కర సంబరం వైభవంగా ముగిసింది. అంత్య పుష్కర రోజుల్లో మళ్లీ కలుద్దామంటూ పుష్కరుడికి భక్తజనం ఘనంగా వీడ్కోలు పలికింది. పుష్కరాల ముగింపు సంబరాన్ని శనివారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. రాత్రివేళ ఘాట్లలో దీపార్చన జరిపారు. జిల్లా అంతటా దీపార్చన నిర్వహించాలని ప్రభుత్వం పిలుపునిచ్చినప్పటికీ ప్రధాన ఘాట్లలో మినహా ఎక్కడా దీపోత్సవం జాడ కానరాలేదు. ప్రజలంతా ఇళ్లల్లో దీపాలు వెలిగించాలన్న ప్రభుత్వ పిలుపునకు పెద్దగా స్పందన కానరాలేదు. సాయంత్రం ఆరున్నర తర్వాత కొవ్వూరు గోష్పాద క్షేత్రం లోని ప్రధాన ఘాట్‌లో నదీపూజ చేసి హారతి ఇచ్చారు. అదే సమయంలో కొవ్వూరు వాసులు దీపాలు వెలిగించి బాణసంచా కాల్చారు. గోష్పాదం ఘాట్‌లో ముస్లింల ప్రార్థనలు కొవ్వూరు గోష్పాద క్షేత్రంలో డీసీసీ అధ్యక్షుడు ఎండీ రఫీఉల్లా బేగ్ ఆధ్వర్యంలో ముస్లింలు ప్రార్థనలు చేశా రు. తొలుత పుణ్యస్నానాలు ఆచరించి హిందూ, ముస్లింల ఐక్యత వర్థిల్లాలని కోరుతూ ప్రార్థన జరి పారు. గోష్పాద క్షేత్రంలో రాష్ట్ర డీజీపీ జేవీ రాముడు, రవాణా శాఖమంత్రి శిద్ధా రాఘవరావు స్నానాలు ఆచరించారు. వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి కొవ్వూరు వీఐపీ ఘాట్‌లో పుష్కరస్నానమాచరించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డికి పిండప్రదానం చేశారు. మంత్రి పీతల సుజాత, వైద్య ఆరోగ్యశాఖ కమిషనర్ పూనం మాలకొండయ్య ఘాట్లను పరిశీలించారు. నరసాపురంలో ఎండను సైతం లెక్కచేయక.. మండు వేసవిని తలపించే ఎండను ఏ మాత్రం లెక్కచేయకుండా నరసాపురం పట్టణానికి భక్తులు వెల్లువలా వచ్చారు. వేకువజామునుంచే భక్తుల రాక పోటెత్తింది. రైళ్లు, బస్సులు ఉదయం నుంచే కిటకిటలాడాయి. ఉదయం 8గంటలు దాటిన తర్వాత రద్దీ తీవ్రమైంది. రాత్రి వరకు ఘాట్ల వద్ద ఇదే పరిస్థితి నెల కొంది. పట్టణంలోని అన్ని ప్రధాన వీధులు జనంతో కిక్కిరిశాయి. ఘాట్ల వద్ద నీటిమట్టం పడిపోవడంతో చాలామంది జల్లు స్నానాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. చివరి రోజు అన్నసమారాధనలు, అల్పాహార పంపిణీలు హోరెత్తాయి. ప్రతి వీధిలోనూ అన్నసమారాధనలు, పులిహోర, మజ్జిగ పంపిణీ చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కొత్తపల్లి సుబ్బారాయుడు పలుచోట్ల అన్నసమారాధనలను ప్రారంభించారు. సిద్ధాంతంలోనూ అదే జోరు పెనుగొండ మండలంలో భక్తుల జోరు చివరి రోజూ కొనసాగింది. సిద్ధాంతంలోని కేదారీ ఘాట్‌లోని అన్ని రేవులు రద్దీగా మారాయి. స్నానాలకు వచ్చినవారు రేవుల్లో దిగడానికి అరగంట సమయం పట్టింది. ఇక్కడ కూడా పోటాపోటీగా అన్నసమారాధనలు జరిగాయి. ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ పుష్కర విధులు నిర్వహిస్తున్న అధికారులతో కలసి స్నానం చేశారు. పెరవలిలో భయం భయంగా.. గోదావరి నీటిమట్టం పెరగడంతో భక్తులను రేవుల్లోకి అనుమతించలేదు. దీంతో భక్తులు కొంత నిరుత్సాహానికి గురయ్యారు.అన్ని ఘాట్లు భక్తులతో పోటెత్తాయి. ఎండ, ఉక్కబోతతో యాత్రికులు ఇబ్బందులు పడ్డారు. నిడదవోలు మండలంలోనూ చివరి రోజున యాత్రికుల సంఖ్య రెట్టింపయింది. పెండ్యాల, పురుషోత్తపల్లి ఘాట్లలో మధ్యాహ్నం 12గంటల వరకు ఇసుకవేస్తే రాలనంతగా జనం కనిపించారు. పోలవరంలో తగ్గిన రద్దీ జిల్లాలో అన్ని ప్రాంతాల్లో ఒక పరిస్థితి అయితే పోలవరంలో మాత్రం భక్తుల సంఖ్య తగ్గింది. లాంచీల రాకపోకలు నిలిచిపోవడంతో పట్టిసీమ క్షేత్రాన్ని దర్శించుకునే వీలులేక భక్తుల పట్టిసీమ రేవుకు రాలేదు. ఎండ కారణంగా పిండ ప్రదానాలు చేసుకునేవారు అవస్థలు పడ్డారు. పోలవరం మండలంలో కూడా యాత్రికులకు అన్న సమారాధనలు నిర్వహించి భోజనాలు పెట్టారు. మంత్రి పీతల సుజాత ఘాట్లను పరిశీలించారు. -
అమ్మవారిని దర్శించుకున్న రాష్ట్రపతి
-
ఐఎస్ నరమేథం
మూడు ఖండాలూ, నాలుగు దేశాలూ... ఇస్లామిక్ స్టేట్(ఐఎస్) ఉగ్రవాదుల ఆగడానికి శుక్రవారం 200 మందికి పైగా పౌరులు బలయ్యారు. టునీసియాలో పర్యాటకులు సేద తీరుతున్న బీచ్‌లో సాయుధుడు చొరబడి 38మందిని కాల్చి చంపాడు. కువైట్‌లోని మసీదులో ప్రార్థనలు చేసుకుంటుండగా ఆత్మాహుతి దాడికి పాల్పడి 25 మందిని పొట్టనబెట్టుకున్నారు. సిరియాలో ఒక పట్టణంలోకి ప్రవేశిం చిన మిలిటెంట్లు విచ్చలవిడిగా దాడిచేసి 146మందిని చంపేశారు. ఫ్రాన్స్‌లోని ఒక ఫ్యాక్టరీలో ఉగ్రవాది ఒకరి తల నరికి చంపడంతోపాటు ఆత్మాహుతికి ప్రయత్నిం చాడు. అతన్ని సకాలంలో నిర్బంధించకపోయి ఉంటే ఫ్యాక్టరీ మొత్తం అగ్నిగుం డమై భారీ ప్రాణ నష్టం, ఆస్తినష్టం సంభవించేది. ఈ ఉదంతాలన్నీ ఐఎస్ విస్తృతినీ, దాని ప్రమాదకర పోకడలనూ తెలియ జెబుతున్నాయి. ఈ దేశాలన్నీ ఉత్తరాఫ్రికా, పశ్చిమాసియా, యూరప్ ఖండాల్లో ఉన్నాయి. ఇన్నిచోట్లా ఒక ఉగ్రవాద సంస్థ ఏకకాలంలో దాడికి పాల్పడగలగడం సామాన్యమైన విషయం కాదు. ఎందుకంటే ఇతర ఉగ్రవాద సంస్థల్లాగే ఐఎస్ సంస్థాగతమైన నిర్మాణం ఏమీ లేదు. అది కేవలం ఇంటర్నెట్ మాధ్యమాన్ని ఆసరా చేసుకుని వ్యక్తుల్ని ప్రభావితం చేస్తూ తన సిద్ధాంతాలను నూరిపోసే సంస్థ. ఎంత మంది వద్దకు అది చేరువవుతున్నదోగానీ వ్యక్తులుగా కొంతమందినైతే లోబరు చుకోగలుగుతున్నది. వారిని ఆత్మాహుతి దాడులకూ, ఇతర విధ్వంసకర చర్యలకూ పురిగొల్పుతున్నది. దాడులు జరిగేవరకూ వారి అసలు స్వరూపం ఎవరికీ తెలియకుండా జాగ్రత్తపడగలుగుతున్నది. ఒక గ్రూపుగా విధ్వంసకర చర్యలకు పాల్పడేవారి ఆనుపానులు తెలుసుకోవడం ఒకసారి కాకపోతే ఒకసారైనా భద్రతా బలగాలకు సాధ్యమవుతుంది. కొంతమంది కలిసిచేసే పని గనుక ఎక్కడో అక్కడ విషయం వెల్లడవడానికి ఆస్కారం ఉంటుంది. కానీ ఎవరితోనూ సంబంధం లేకుండా ఒక్కరిగా దాడులకు పథకరచన చేసి అమలు పరిచేవారిని పసిగట్టడం దాదాపు అసాధ్యం. ఆ బలహీనమైన స్థితిని ఐఎస్ వినియోగించుకుంటోంది. ఇలా వేర్వేరు దేశాల్లో ఒక్కొక్కరే దాడులకు దిగేలా చేయడంతోపాటు ఆ దాడులన్నీ ఒకే రోజు జరిగేలా చూడటంలో ఐఎస్ సాధించిన సమన్వయం ఎవరికైనా దిగ్భ్రాంతి కలిగిస్తుంది. టునీసియాలో 38 మందిని పొట్టనబెట్టుకుని భద్రతా బలగాలు జరిపిన కాల్పుల్లో హతుడైన 23 ఏళ్ల సీఫిద్దీన్ రెజ్గూ ఇలాంటి ఉన్మాదిగా మారాడని ఘటన జరిగేవరకూ తెలియదని అతని ఇరుగు పొరుగువారు మాత్రమే కాదు... తల్లిదండ్రులూ, తోబుట్టువులూ కూడా చెబుతున్నారు. వాస్తవానికి అతను ఇంజనీరింగ్ చదివినా ఇంటర్నెట్తో నిత్యమూ అంటిపెట్టుకుని ఉండేంత తీరికగల జీవితం కాదు. తండ్రి రోజు కూలీ చేసి సంపాదిస్తున్నవాడు. అలాంటి యువకుణ్ణి ఉగ్రవాదిగా మార్చడమే కాదు...ఆ సంగతి బయటపడకుండా అత్యంత గోప్యంగా ఉండేలా ఐఎస్ చూడగలిగింది. టునీసియాలో ఈ దాడి జరిగిన సిలియానా ప్రాంతంలో ఉగ్రవాద గ్రూపుల కదలికలు లేవు. దానికి అటూ, ఇటూ ఉన్న కెఫ్, కసెరీన్ ప్రాంతాలు గత రెండున్నరేళ్లుగా ఉద్రిక్తంగానే ఉంటున్నాయి. అక్కడ వివిధ ఉగ్రవాద గ్రూపుల మధ్య ఘర్షణలు, హత్యలు చోటుచేసుకుంటున్నాయి. భద్రతా బలగాల దృష్టంతా ఆ రెండు ప్రాంతాలపైనా ఉండగా సిలియానాలో ఒక సాధారణ యువకుడు ఇలా ఉన్మాద రూపమెత్తడం ఆశ్చర్యం కలిగించే అంశం. టునీసియాలో మూడు నెలలక్రితం ఒక మ్యూజియంపై దాడిచేసి ఉగ్రవాదులు 22మందిని హత మార్చారు. ఈ రెండు దాడుల్లోనూ ఉగ్రవాదుల లక్ష్యం బ్రిటన్ పౌరులే! టునీసియా నుంచి వెళ్లిన దాదాపు 3,000 మంది యువకులు ఇరాక్, సిరియా, లిబియాల్లో సాగుతున్న ఘర్షణల్లో పాల్గొంటున్నారు. వీరిలో వెనక్కొచ్చిన యువకులు కొందరు ఉగ్రవాదాన్ని పెంచి పోషించడంలో కీలకపాత్ర పోషిస్తున్నారు. నాలుగేళ్లక్రితం అరబ్ దేశాల్లోని నియంతలకు కంటిమీద కునుకులేకుండా చేసిన ప్రజాస్వామిక ఉద్యమానికి పుట్టినిల్లయిన టునీసియా నిరుడు జరిగిన ఎన్నికల్లో ఛాందసవాదులను కాదని సెక్యులర్ విలువలకు కట్టుబడ్డ పార్టీలను ఎన్నుకుంది. టునీసియాకు ప్రధాన ఆదాయ వనరైన టూరిజంను దెబ్బతీయడంతో పాటు తమపై దాడులకు పాల్పడుతున్న పాశ్చాత్య దేశాలకు గుణపాఠం నేర్పడం...అదే సమయంలో తనకు పోటీగా ఉన్న అల్ కాయిదా సంస్థ ప్రభావాన్ని తగ్గించడం ఐఎస్ ఉద్దేశంలా కనబడుతోంది. మతిలేని తన దాడుల ద్వారా షియా, సున్నీ తెగలమధ్య ఘర్షణలు సృష్టించడం...తన ఆధిపత్యాన్ని చాటుకోవడం కూడా ఐఎస్ దాడుల లక్ష్యం. ఐఎస్ సారథ్యం సున్నీ తెగకు చెందినవారిదే అయినా ఆ తెగలోని సాధారణ పౌరులు ఇలాంటి హింసాత్మక ఘటనలను సమర్ధించరు. ఆ రెండు తెగలకు చెందినవారూ అన్ని దేశాల్లోనూ సఖ్యతతో మెలగుతున్నారు. హింసాత్మక ఘటనలకు పాల్పడటం ఇస్లాం సిద్ధాంతాలకు విరుద్ధమని భావిస్తు న్నారు. ఇలాంటి సామరస్య భావనకు తూట్లు పొడవడమే లక్ష్యంగా కువైట్ మసీదు లో ఐఎస్ దాడిచేసింది. ఇందువల్ల కువైట్‌లో తన వర్గాన్ని పెంచుకోవచ్చునను కుంటున్నది. టునీసియాలో దాడి జరిగిన రోజునే ఫ్రాన్స్‌లోనూ ఐఎస్ అచ్చం అదే తరహా దాడికి పథకరచన చేసింది. లిబియాలో గడాఫీ ప్రభుత్వాన్ని కూల్చి ఆ దేశాన్ని వల్లకాడుగా మార్చడంలో ఫ్రాన్స్ అమెరికాతో చేతులు కలిపి పనిచేసినా మిగిలిన యూరప్ దేశాలతో పోలిస్తే అది అమెరికాను గుడ్డిగా అనుసరించే దేశం కాదు. మొన్న జనవరిలో చార్లీహెబ్డో పత్రికపై ఐఎస్ ఉగ్రవాదులు దాడి జరిపి 12 మందిని కాల్చిచంపాక ఆ దేశం ఐఎస్ ఉగ్రవాదులపై కఠిన చర్యలు తీసుకుంది. ఇది కూడా ఐఎస్‌కు ఆగ్రహం కలిగించింది. ఉగ్రవాదాన్ని అంతమొందించడానికి భద్రతా పరంగా తీసుకునే చర్యలతోపాటు ఆయా దేశాల్ల్లో పేదరికం, నిరుద్యోగం వంటివి అరికట్టడానికి కృషి జరగాలి. అంతేకాదు... అమెరికా, పాశ్చాత్య దేశాలు తాము అనుసరిస్తున్న విధానాలను సవరించుకోవాలి. లిబియాలోనైనా, సిరియా లోనైనా ఆ దేశాల విధానాల ఫలితమే ఇప్పుడు ఐఎస్ ఆవిర్భావానికి తోడ్పడ్డా యని మరిచిపో కూడదు. అలాగే మొన్న అఫ్ఘానిస్థాన్ పార్లమెంటుపై జరిగిన దాడిగానీ, ఇప్పుడు కువైట్‌లో జరిగిన దాడిగాని మన దేశానికి కూడా హెచ్చరి కలవంటివే. తగినంత అప్రమత్తతతో మెలగాల్సిన అవసరాన్ని ఈ దాడులు తెలియజెబుతున్నాయి. -
భూకంప బాధితుల కోసం సర్వమత ప్రార్థనలు
-
వైఎస్సార్సీపీ రాష్ట్ర అధ్యక్షుడు పొంగులేటి పూజలు
సాక్షి, ఖమ్మం: మహా శివరాత్రి సందర్భంగా వైఎ స్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి మంగళవారం జిల్లాలోని పలు శైవక్షేత్రాల్లో పూజలు నిర్వహించారు. తొలుత కూసుమంచిలోని గణపేశ్వరాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఖమ్మం నగర శివారు ధంసలాపురంలోని శివాలయంలో అభిషేక పూజలు చేసి గ్రామంలోని గోశాలను సందర్శించారు. వైరా మండలం స్నానాల లక్ష్మీపురంలోని శ్రీరామలింగేశ్వరస్వామి ఆలయం, కల్లూరు కనకగిరి శివాలయం, కాశ్మీర మహాదేవ క్షేత్రం, వీరభద్రస్వామి దేవాలయాలను సందర్శించి జిల్లా ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని పూజలు చేశారు. పొంగులేటి రాఘవరెడ్డి- స్వరాజ్యం ట్రస్టు ఆధ్వర్యంలో కల్లూరు శివాలయంలో నిర్మించిన కోనేరును ఎంపీ సందర్శించారు. ఖమ్మం, కల్లూరులో బ్రహ్మకుమారిలు ఏర్పాటు చేసిన జ్యోతిర్లింగాల కార్యక్రమంలో ఎంపీ పూజలు చేశారు. -
పుష్పార్చన
కల్పారంభంలో శ్రీహరి వరాహావతారమును స్వీక రించిన సందర్భంలో జనులందరి హితాన్ని కోరిన వాడై, ‘నా నామసంకీర్తన చేయండి. నన్నే శరణు వేడం డి. భక్తితో సుగంధ భరితమైన పుష్పాలను నాకే సమ ర్పించండి’ అని పేర్కొన్నాడు. అదేవిధంగా శ్రీకృష్ణావ తారమెత్తి అర్జునునకు గీతోపదేశం చేస్తూ ఎవరైతే నా పట్ల అనన్య భక్తి కలిగియుండి ప్రేమతో పత్రాన్నో పుష్పాన్నో సమర్పిస్తారో, దాన్ని నేను ఆదరంతో స్వీకరిస్తాను అని తెలియజెప్పాడు. వరాహస్వామి ఉపదేశాన్ని మానవులు సరిగ్గా మనసుకెక్కించుకున్నారో లేదోనని భావించిన జగ న్మాత భూదేవి మరొక్కసారి పరమాత్మకు ప్రీతిని కలి గించే హరినామ సంకీర్తనను, భక్తితో శ్రీహరి పాదాల సన్నిధిలో చేయవలసిన పుష్పార్చనను, శ్రీహరియే రక్ష కుడనే భావంతో చేయవలసిన శరణాగతిని గురించి తెలుపడానికి శ్రీవిల్లిపుత్తూరులో విష్ణుచిత్తుల తనయ గోదాదేవిగా అవతరించినది. గోదాదేవి ఎన్నటికీ వాడి పోని, అద్భుత భావగంధ భరితాలైన వాక్పుష్పాలను ఒక్క దగ్గరకు చేర్చి 30 పాటలతో తిరుప్పావై అనే పామాలికను తమిళంలో సమర్పించినది. దీనిలోని మాయనై అను 5వ పాశురంలో తిరుప్పావై వ్రత సమయంలో అంద రూ పుండరీకాక్షుని నామసంకీర్తనం చేస్తూ శ్రీహరి పాదపద్మ సన్నిధిలో భక్తితో పవిత్ర పుష్పాలను సమర్పించ మని గోదాదేవి భక్తులకు ప్రబోధించినది. ఆదిశంకరులు ‘‘పరమాత్మకు పరిమళ భరిత పుష్పాలను సమర్పించుటకై ఎక్కడెక్కడో భక్తులు తిరు గుతూ ఉంటే నొచ్చుకుంటాడు. ఈ బాహ్య పుష్పాల గురించి శ్రమించకుండా భక్తులు, మనస్సు అనెడి పువ్వును పరమాత్మకు సమర్పిస్తే ఆ శ్రీహరి పరమానం దమును పొందును’’ అని తెలిపారు. మన పూర్వులైన పెద్దలు శ్రీహరికి ప్రీతికరము లైన పుష్పాలు 8 కలవని పేర్కొన్నారు. ఏ ప్రాణిని కూడా వాక్కులతోనో, చేష్టలతోనో, దుష్ట ఆలోచనలతో గాని హింసించకుండా ఉండే అహింస అనే పుష్పం మొదటిది. వాక్పాణిపాద పాయు ఉపస్థలు అను ఐదు కర్మేంద్రియములను, త్వక్, చక్షు, శ్రోత్ర, జిహ్వా, ఘ్రాణ ములు అనే ఐదు జ్ఞానేంద్రియములను, కర్మేంద్రియం గాను, జ్ఞానేంద్రియం గాను చెప్పబడే మనస్సును అదు పులో పెట్టడం అనే ఇంద్రియ నిగ్రహం రెండవ పుష్పం. సకల ప్రాణుల పట్ల దయకలిగి ఉండటం అనే దయా పుష్పం మూడవది. అనుకూల ప్రతికూలాలను సహిం చడం అనే క్షమా పుష్పం నాలుగవది. లౌకిక పారమా ర్థిక క్షణిక శాశ్వత విషయాలను గుర్తించుటకు ఉపక రించే జ్ఞానమనే పుష్పం ఐదవది. తపమనే పుష్పం ఆర వది. నిరంతర భగవద్ధ్యా నమనే పుష్పం ఏడవది. సర్వ భూత హితకరమైన సత్య మనే పుష్పం ఎనిమిదవది. ఎన్నడూ వాడిపోని ఆత్మగుణములనే ఈ ఎనిమిది పుష్పాలతో భక్తులు పూజిస్తే శ్రీమహావిష్ణువు పరమప్రీ తిని పొందుతాడని మన పూర్వులైన పెద్దలు ఉపదేశిం చారు. ఈ ఉపదేశాన్ని ఆచరించే ప్రయత్నం చేద్దాం. సముద్రాల శఠగోపాచార్యులు -
కరుణామూర్తులు కండి : పోప్
వాటికన్ సిటీ/న్యూఢిల్లీ: శాంతి దూత ఏసుక్రీస్తు జన్మదినం ‘క్రిస్మస్’ సందర్భంగా గురువారం ప్రపంచ వ్యాప్తంగా వేడుకలు ఘనంగా జరిగాయి. బుధవారం అర్ధరాత్రి నుంచి చర్చిల్లో ప్రార్థనలు జరిపారు. పోప్ ఫ్రాన్సిస్ వాటికన్లోని సెయింట్ పీటర్స్ బసిలికా ఆవరణలో జరిగిన కార్యక్రమంలో దైవ సందేశమిచ్చారు. సమాజంలో హింస ప్రజ్వరిల్లిన ప్రస్తుత తరుణంలో దయతో మెలగాలని, కరుణామయులు కావాలని ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రైస్తవులకు పిలుపునిచ్చారు. సుమారు ఐదువేల మంది హాజరైన ఈ కార్యక్రమం ప్రపంచవ్యాప్తంగా టీవీల్లో మొట్టమొదటిసారిగా త్రీడీ విధానంలో ప్రసారమైంది. మరోవైపు క్రీస్తు జన్మస్థలం బెత్లెహాంలో పర్వదినం సందర్భంగా భారీ ఏర్పాట్లు జరిగాయి. క్రీస్తు జన్మించిన చోటుగా భావిస్తున్న నేటివిటీ చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు జరిగాయి. కాగా, ఢిల్లీ సహా దేశవ్యాప్తంగా ఘనంగా క్రిస్మస్ వేడుకలు జరిగాయి. చర్చిల్లో సంప్రదాయ బద్ధంగా జరిగిన సంబరాల్లో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ, ప్రధాని మోదీ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. -
తిరుమలలో అన్యమత ప్రచారం
తీవ్రంగా పరిగణించిన టీటీడీ ఆరుగురిపై కేసు తిరుమల: తిరుమలలో మళ్లీ అన్యమత ప్రచారం కలకలం రేపింది. శ్రీవారి బ్రహ్మోత్సవాల ముందు అన్యమతానికి చెందిన ఆరుగురు సాక్షాత్తు శ్రీవారి ఆలయం వద్ద అన్యమత ప్రచారం చేసి, ప్రార్థనలు చేసి, తిరిగి వాటిని వీడియో తీసి యూట్యూబ్‌లో పెట్టారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఉదంతాన్ని టీటీడీ తీవ్రంగా పరిగణించింది. 1987 రాష్ట్ర దేవాదాయశాఖ చట్ట ప్రకారం తిరుమల పరిధిలో అన్యమత ప్రచారం నిషేధం. ఇందుకు విరుద్ధంగా అమెరికాకు చెందిన ‘ఫెయిత్ ఇంటర్నేషనల్ పార్టనర్స్’ అన్యమత సంస్థ జాతీయ డెరైక్టర్ అయిన సుధీర్ మొండితోక ఇక్కడ ప్రార్థనలు చేసి మతప్రచారం చేశారు. కర్టాటకకు చెందిన ఆయన హైదరాబాద్ కేంద్రంగా అన్యమత సంస్థను నిర్వహిస్తున్నారు. ఆయన నేతృత్వంలో గత నెల మూడోవారంలో ఆరుగురు అన్యమతస్తులు ఏపీ16బిఎన్ 0568 కారులో తిరుమలకు బయలదేరారు. రెండో ఘాట్‌రోడ్డులో ప్రార్థనలు, శ్రీవారి ఆలయ అఖిలాండం వద్ద అన్యమత ప్రచారం చేశారు. పక్కనే వెళ్లే శ్రీవారి భక్తులను చూపిస్తూ మూఢులుగా అభివర్ణించారు. వారి పర్యటనంతా సుమారు 18 నిమిషాల నిడివితో చిత్రీకరించిన వీడియో దృశ్యాలను యూట్యూబ్‌లో పెట్టారు. విచారణకు మంత్రి ఆదేశం అన్యమత ప్రచారంపై పోలీసు విచారణకు ఆదేశించనున్నట్టు ఏపీ దేవాదాయ మంత్రి పి.మాణిక్యాలరావు చెప్పారు. ఇందులో టీటీడీ సిబ్బంది వైఫల్యం కొటొచ్చినట్టు కనిపిస్తోందని చెప్పారు. ఈ ఘటనకు కొందరు సిబ్బంది లాలూచీ పడడమే కారణమన్న అనుమానం ఉందన్నారు. చర్యలు తీసుకుంటాం: ఈవో తిరుమలలో అన్యమత ప్రచారం ఘటనలపై విచారణకు ఆదేశించామని టీటీడీ ఈవో గిరిధర్ గోపాల్ బుధవారం మీడియాకు వెల్లడించారు. కాగా అన్యమత ప్రచారంలో పాల్గొన్నవారిలో సుధీర్, సుకుమార్, డేవిడ్, జోసఫ్ మరో ఇద్దరున్నట్టు గుర్తించామని టీటీడీ అదనపు సీవీఎస్వో శివకుమార్‌రెడ్డి తెలిపారు. వారిపై మూడు నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేస్తామని చెప్పారు. -
ఘనంగా రంజాన్
అనంతపురం కల్చరల్ : జిల్లా వ్యాప్తంగా మంగళవారం రంజాన్ పర్వదినాన్ని ముస్లింలు భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. ఒకరినొకరు ఆలింగనం చేసుకుంటూ ఈద్ ముబారక్ చెప్పుకున్నారు. మసీదులు, దర్గాలు, ఈద్గాలలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతపురం హౌసింగ్బోర్డులోనిఈద్గా మైదానం జనసంద్రమైంది. మైనార్టీ సంక్షేమ, సమాచార, ఐటీ శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి, నగరపాలక సంస్థ మేయర్ మదమంచి స్వరూప, వివిధ రాజకీయ పార్టీల నేతలు హాజరై.. ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. నగర ఖాజీ ఇమామ్ షరీఫ్ ప్రత్యేక ప్రార్థనల అనంతరం దివ్య సందేశాన్నిచ్చారు. ముతవల్లి కె.ఎం.షఫీవుల్లా, వివిధ మసీదుల ఇమామ్‌లు రంజాన్ విశిష్టతను వివరించారు. హెచ్చెల్సీ కాలనీలోని బాహువుద్దీన్ మసీదు ప్రాంగణంలో గల ఈద్గా మైదానంలో పేష్ ఇమామ్ జమీరుల్ సందేశం వినిపించారు. పెద్దలు, గురువుల పట్ల వినయ విధేయతలు, మత సామరస్యం, సోదర భావం ప్రతి ముస్లిం అలవర్చుకోవాలని సూచించారు. రంజాన్ పర్వదినం దేశమంతటికీ సకల శుభాలు కలగజేయాలని ఆకాంక్షించారు. అనంతరం పక్కనే ఉన్న ఖబరస్థాన్‌లో సమాధుల వద్ద పెద్దల ఆత్మశాంతి కోసం ప్రార్థనలు చేశారు. మత సామరస్యాన్ని చాటుతూ ఇచ్చిన విందుల్లో ముస్లింలతో పాటు పలువురు హిందువులు ఉత్సాహంగా పాల్గొన్నారు. బహువుద్దీన్ మసీదు ముతవల్లి ఫరీదుద్దీన్, వైఎస్సార్సీపీ మైనార్టీ విభాగం నాయకులు మక్బుల్, సమీవుల్లా తదితరులు పాల్గొన్నారు. -
భక్తి శ్రద్ధలతో రంజాన్
సాక్షి, చెన్నై: అల్లా ఆజ్ఞలను పాటించడం ముస్లింలకు తప్పనిసరి విధి. ఈ విశ్వాసాలు, ఆజ్ఞాపనులను ఈమాన్ అని, ఇస్లాం అని అంటారు. మహ్మద్ ప్రవక్త సూక్తుల మేరకు ఇస్లాంకు సంబంధించి ఐదు సూత్రాలను ప్రతి ముస్లిం ఆచరించాల్సిందే. ఆ దిశగా అల్లా తప్ప మరెవరూ ఆరాధ్యులు కారని, అల్లా దాసుడు మహ్మద్ ప్రవక్తను విశ్వసించే రీతిలో నెల రోజుల పాటుగా రాష్ట్రంలోని ముస్లింలు కఠోర ఉపవాస దీక్షలను చేశారు. ఐదు పూటల నమాజులు, రాత్రుల్లో తరాబిహ్, సహజ్జుద్ నమాజులతో అల్లా ఆశీస్సులను అందుకునేందుకు ఆరాధనల్లో మునిగారు. ముస్లింలు అత్యధికంగా నివసించే ప్రాంతాల్లో నెలరోజుల పాటు ఆధ్యాత్మిక సందడి కనిపించింది. ప్రార్థనలు: రోజా వ్రతాన్ని ఆచరించిన ముస్లింలు మంగళవారం పవిత్ర పండుగ రంజాన్‌ను అత్యంత భక్తి శ్రద్ధలతో ఘనంగా జరుపుకున్నారు. చెన్నైలోని ట్రిపిక్లేన్, మన్నడి, తండయార్ పేట, పూందమల్లి, అన్నానగర్, పురసైవాక్కం, పడప్పై, తాంబరం, అరుంబాక్కం, మణ్ణివాక్కం, అన్నా సాలై, ఎంఎండీఏ, ఆవడి, వండలూరు, నీలాంకరై, కోవలం పరిసరాల్లోని పెద్ద మసీదుల్లో ఉదయం ప్రత్యేక ప్రార్థనలు జరిగాయి. సబర్బన్ పరిధిలోని చిన్న చిన్న మసీదుల్లోను, ఎంపిక చేసిన ప్రత్యేక ఈద్గా స్థలాల్లో ప్రార్థనలు చేశారు. ఈ ప్రార్థనల నిమిత్తం ఉదయాన్నే ముస్లింలు పవిత్ర స్నానం ఆచరించి కొత్త బట్టలను ధరించి, అత్తర్ల సొగసులతో జట్టులు జట్టులుగా మసీదుల వైపు నడిచారు. దారి పొడవునా అల్లాహ్ అక్బర్.... అల్లాహ్ అక్బర్, లా ఇల్లాహ ఇల్లల్లాహు అన్న పదాలను పటిస్తూ నడిచారు. మసీదుల్లో ఇమాములు, హజరత్ల నేతృత్వంలో ప్రత్యేక ప్రార్థనలు భక్తి భావాన్ని పెంపొందించే రీతిలో సాగాయి. నెల రోజుల తమ దీక్షకు అల్లా ఆశీస్సులను అందుకునే విధంగా ప్రత్యేక ప్రార్థనలు జరిగాయి. ఇస్లాం మత విశిష్టతను రంజాన్ పర్వదిన ప్రాముఖ్యతను వివరిస్తూ ప్రసంగాలు చేశారు. అనంతరం ముస్లింలు ఒకరికొకరు ఆలింగనం చేసుకుని ఈద్ ముబారక్ తెలుపుకున్నారు. పేదలకు తమ వంతు సాయాన్ని అందచేశారు. ఆయా ప్రాంతాల్లో రాజకీయ నాయకులు, ముస్లింలకు తమ శుభాకాంక్షలు తెలియచేశారు. మహిళల కోసం మసీదులు, ఈద్గా స్థలాల్లో విశేష ఏర్పాట్లు చేశారు. దీంతో పెద్ద ఎత్తున మహిళలు ప్రత్యేక ప్రార్థనకు తరలిరావడం విశేషం. అలాగే ఆయా మసీదుల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పరిసరాల్లో పోలీసు యంత్రాంగం గట్టి భద్రతా చర్యలు తీసుకుంది. విందుల సందడి : ప్రత్యేక ప్రార్థన ముగియగానే విందుల సందడి ముస్లింలు అత్యధికంగా ఉండే ప్రాంతాల్లో నెలకొన్నాయి. ఖీర్ పాయసం, కేసరి వంటి తీపి పదార్థాలను పంచుకున్నారు. మధ్యాహ్నం బిర్యానీల విందు సాగింది. ఆప్తులు, కుటుంబీకులు, సన్నిహితులు, మిత్రులతో కలసి విందు భోజనాలతో ముస్లింలు పండుగను ఆనందోత్సాహాలతో జరుపుకున్నారు. నిరుపేదలను ఆదరించాలి పోటో: 23 : భక్తి శ్రద్ధలతో మసీదులో నమాజ్ చేస్తున్న ముస్లిం సోదరులు పోటో: 24 : నమాజ్ చేస్తున్న చిన్నారులు వేలూరు: వేలూరు, తిరువణ్ణామలై జిల్లాలో రంజాన్ పండుగను భక్తి శ్ర ద్ధలతో నిర్వహించారు. ఈ పండుగకు ముస్లింలు 40 రోజుల పాటు ఉపవాసం ఉండి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. వేలూరు ఆర్ఎన్ పాళ్యం పెద్ద మసీదు, ఓటై ఈద్డా మైదానాల్లో ముస్లింలు అధిక సంఖ్యలో చేరుకొని ప్రత్యేక ప్రార్థలు జరిపారు. చిన్నా పెద్దా తేడా లేకుండా ఒకరికొకరు ఆలింగనం చేసుకొని రంజాన్ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ ప్రార్థనలో ముస్లిం మత పెద్దలు మసీదుకు చేరుకొని ముస్లింలు ఇతరులకు సాయం చేసినప్పుడే నిజమైన రంజాన్ పండుగ జరుపుకున్నవారం అవుతామన్నారు. సాటి మానవుడిని గౌరవించాలని, నిరుపేదలను ఆదరించాలని, సోదర భావం కలిగి ఉండాలని తెలిపి ప్రార్థనలు చేశారు. అదే విధంగా అంబూరులోని ఈద్గా మైదానం, గుడియాత్తం చిత్తూరు రోడ్డులోని మసీదు, వాణియంబాడిలోని మసీదుల్లో ముస్లిం సోదరులతో నిండిపోయింది. ఆంబూరు ప్రాంతంలోని పెద్ద మసీదు వీధుల్లో ట్రాఫిక్ స్తంభించి పోకుండా పోలీసులు రాకపోకలను మళ్లించారు. అదే విధంగా జిల్లా వ్యాప్తంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎస్పీ విజయకుమార్ ఆధ్వర్యంలో పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. తిరువణ్ణామలై జిల్లాలోని మసీదులన్నీ కిటకిటలాడింది. -
అల్ విదా రంజాన్...
-
ఇమ్మని దేవుణ్ణి అడగొచ్చా?
దైవికం ప్రార్థించడం అంటే ‘అడగడం’ కాదంటారు మహాత్మాగాంధీ. దైవ సన్నిధి కోసం ఆత్మ తపించాలట. మన బలహీనతల్ని ఎప్పటికప్పుడు అంగీకరించాలట. హృదయానికి తప్ప మాటలకు తావు ఉండకూడదట. అదే అసలైనపార్థన అంటారు బాపూజీ. ప్రపంచంలో నిత్యం కోట్ల మంది దేనికో ఒకదాని కోసం భగవంతుడిని వేడుకుంటూ ఉంటారు. ‘విన్నపాలు వినవలె వింత వింతలూ’ అని అన్నమయ్య పాడారు కదా, అలా ఆ వేడుకోళ్లలో కొన్ని ప్రార్థనలు ఉంటాయి. కొన్ని బెదిరింపులు ఉంటాయి. కొన్ని బ్లాక్‌మెయిల్స్ ఉంటాయి. కొన్ని అలకలు ఉంటాయి! ఇలా ఒక మనిషి ఇంకో మనిషితో ఎన్ని రకాలైన భావోద్వేగాలతో ఉండగలరో అన్ని రకాల భావోద్వేగాలనూ దేవుడి ముందు ప్రదర్శిస్తుంటారు మానవులు. కొందరు కేవలం ధన్యవాదాలు అర్పిస్తుంటారు. కొందరు కృతజ్ఞతలు చెల్లించి ఊరుకుంటారు... దేవుణ్ని అసలేమీ అడక్కుండా. అలాంటి వాళ్లు తక్కువ. శివలాల్ యాదవ్ అనే ఆయన ఈమధ్య దేవుణ్ణి ప్రార్థించాడు. ఎక్కడా? తన పూజగదిలో కాదు. బి.సి.సి.ఐ. (బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా) అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన సందర్భంగా తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ తనని సన్మానిస్తుంటే... ఆ సభలో ప్రార్థించాడు. ఏమని? తన నుంచి ఈ పదవి మళ్లీ పూర్వపు అధ్యక్షుడైన ఎన్.శ్రీనివాసన్‌కి వెళ్లిపోవాలని! క్రికెటర్లకు శ్రీనివాసన్ చేసినన్ని మేళ్లు మరే ఇతర అధ్యక్షుడూ చేయలేదు కాబట్టి తిరిగి ఆయనకే ఈ పదవి వచ్చేయాలని దేవుడిని ప్రార్థిస్తున్నట్లు శివలాల్ యాదవ్ ప్రకటించారు! ఇంకొకాయన ప్రహ్లాద్ శర్మ. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ఉంటాడు. సామూహిక ప్రార్థనలు జరిపి, యజ్ఞాలు నిర్వహించి, రెండు జర్మన్ షెప్పర్డ్ శునకాలకు పెళ్లి చేసినప్పటికీ, చుక్క వర్షమైనా పడకపోవడంతో ఆయనకు వరుణ దేవుడి మీద కోపం వచ్చింది. దేవుడికి అంత్యసందేశం (అల్టిమేటమ్) ఇచ్చేశాడు. వారంలోపు వర్షం కురిసిందా సరి, లేదంటే నిరాహార దీక్ష చేస్తానని పోస్టర్లు వేయించి మరీ గోడలకు అంటించాడు! ‘‘భూమ్మీది జీవుల్ని కాపాడడం దేవుడి బాధ్యత. ప్రాణాధారమైన నీటిని లేకుండా చేస్తే ఎలా? రైతులు అల్లాడిపోతున్నారు. ఆ మాత్రం తెలియదా? దేవుడే తలచుకుంటే ఈ క్షణంలో కుంభవృష్టి కురియదా?’’ అని శర్మగారి వాదన. ప్రార్థన స్థాయిని కూడా దాటిపోయి, దేవుడి తరఫున దైవదూతగా మాట్లాడే మామూలు మానవులు కూడా కొందరు ఉన్నారు! బెన్నీ పున్నతర నే తీసుకోండి. కేరళలోని కోళికోడ్ నుంచి వెలువడే ‘సండే షాలొమ్’ పత్రికకు ఆయన సంపాదకులు. ‘మోడీ ప్రధానిగా గెలవడం అన్నది దైవనిర్ణయం’ అని బెన్నీ తన తాజా సంపాదకీయంలో రాశారు! రాసి, అక్కడితో ఊరుకోలేదు. ‘‘ఈ ప్రపంచంలో జరిగేవేవీ దేవుడికి తెలియకుండా జరగవు. దేవుడే మోడీని తన సేవకునిగా ఎన్నుకున్నాడు కాబట్టి భక్తిపరులైన ప్రతి ఒక్కరూ మోడీని సమర్థించాలి. అలా చేయకపోతే దైవ సంకల్పాన్ని ధిక్కరించినట్లవుతుంది. ఎన్నికలకు ముందు బహుశా భారతీయులంతా మోడీని ప్రధానిని చేయమని దేవుణ్ని ప్రార్థించినట్లున్నారు. ఆ ప్రార్థన ఫలించి, దేవుడు ప్రజలను కనికరించి, కాంగ్రెస్‌ను ఓడించి, మోడీని అత్యున్నత పీఠంపై కూర్చోబెట్టాడు’’ అని విశ్లేషించారు. నువ్వే దేవుడివైతే ఎన్.శ్రీనివాసన్ని మళ్లీ బి.సి.సి.ఐ. అధ్యక్షుడిని చెయ్యమని దేవుణ్ని అడగడం, నువ్వు దేవుడివి కాకపోబట్టే కదా ఇండోర్‌లోని పొలాలన్నీ ఎండిపోతున్నాయని దేవుణ్ని అనడం, నువ్వు దేవుడివి కాబట్టే మోడీని గెలిపించావని అనుకోవడం... ఇవన్నీ దేవుణ్ని ప్రార్థించడం కాదు. దేవుణ్ని క్రికెట్లోకి, రుతుపవనాల్లోకి, రాజకీయాల్లోకి లాగడం. అంటే దేవుణ్ని మానవమాత్రులలోకి లాగేయడం! ప్రార్థించడం అంటే ‘అడగడం’ కాదంటారు మహాత్మాగాంధీ. దైవ సన్నిధి కోసం ఆత్మ తపించాలట. మన బలహీనతల్ని ఎప్పటికప్పుడు అంగీకరించాలట. హృదయానికి తప్ప మాటలకు తావు ఉండకూడదట. అదే అసలైన ప్రార్థన అంటారు బాపూజీ. మరి దేవుణ్ని అడక్కుంటే కష్టాలు తీరేదెలా? అడుగుదాం. కానీ కష్టాలు తీర్చమని కాదు. కష్టాలను ఓర్చుకునే శక్తిని ఇమ్మని అడుగుదాం. - మాధవ్ శింగరాజు -
పురాతనం సనాతనం
శరీరాన్ని క్షాళన చేసుకోవడంతో పాటు, మనసునూ క్షాళన చేసుకోవాలన్నదే ఈ పుణ్యనగరం ఇచ్చే సందేశమని అనిపిస్తుంది. పార్వతిని పరిణయమాడేందుకు కైలాసాన్ని వీడి వచ్చిన శివుడు నివాసం కోసం ఎంచుకున్న నేల వారణాసి అని పురాణ గాథలు చెబుతాయి. ఈ పట్టణానికి ఉత్తరాన ఉన్న వారుణ, దక్షిణంగా ఉన్న అసి (లేదా అస్సి) అనే చిన్న చిన్న నదుల నుంచే వారణాసి అన్న పేరు వచ్చిందని ప్రతీతి. కాశీని పురాతన పట్టణంగా పేర్కొంటుంది ఋగ్వేదం. ‘బెనారస్ అంటే చరిత్ర కంటె పురాతనం... సంప్రదాయం కంటె సనాతనం’ అంటాడు మార్క్‌టై్వన్. అందుతున్న ఆధారాలను బట్టి ఈ పుణ్యక్షేత్రం 30 శతాబ్దాల నాటిది. వేదాలు, రామాయణ-భారతాలు, జైన గ్రంథాలు, బౌద్ధుల జాతక కథలు- భారతీయ ఆత్మతో అనుబంధం ఉన్న ప్రతి అక్షరం కాశీకి కైమోడ్పులర్పించినదే. హిమసానువులలో పుట్టి సాగరం వైపు బంగ్లాదేశ్‌కు సాగే అద్భుత గంగా జలహారంలో కాంతులు వెదజల్లే ఒక మణి... వారణాసి. కాశీ అన్నా అదే. కొద్దిమందికే పరిచితమైన నామం - అవిముక్త. ఆంగ్లేయులు రుద్దిన పేరు బెనారస్ లేదా బనారస్. కాశీ జ్యోతిర్లింగాలలో ఒకటి. శక్తి పీఠాలలోనూ ఒకటి. వారణాసి అంటే పరస్పర విరుద్ధ దృశ్యాల మేళవింపు. ‘హర హర మహాదేవ్!’ అంటూ విశ్వేశ్వరుడి నామస్మరణ ఒకవైపు, ‘అల్లాహో అక్బర్’ అంటూ మసీదుల నుంచి ప్రార్థనలు మరోవైపు కాశీలో సర్వసాధారణం. ఇరుకు ఇరుకు సందులనీ, వాటిలోనే నిరంతరం సంచరించే ఆవుల మందలనీ దాటుకుని వచ్చాక కంటికి నిండుగా, విశాలంగా దర్శనమిస్తుంది గంగా ప్రవాహం. త్రిపథగ, జాహ్నవి, భాగీరథి వంటి పేర్లతో ప్రసిద్ధమైన ఆ గొప్ప నది పవిత్రత గురించి విన్న గాథలు ఓ పక్క గుర్తుకు వస్తుంటాయి. మరో పక్క నదిని అడుగడుగునా కలుషితం చేస్తున్న మనిషి చేష్టలు కంటపడుతూ ఉంటాయి. పరిశ్రమల నుంచి వ్యర్థాన్ని తెచ్చి ఆ పవిత్ర నదిలో కలిపేందుకు నిర్మించిన భారీ పైపులు మరీ బాధ కలిగిస్తాయి. కానీ సగం కాలిన మృతదేహాలను గంగలోకి తోసే పద్ధతికి చాలా కాలం కిందటే స్వస్తి చెప్పారన్న విషయం సంతోషపెడుతుంది. జానెడు గోచీతో, జడలు కట్టిన జుట్టుతో, ఒళ్లంతా బంకమట్టి పూసుకుని లోకం సంగతి పట్టించుకోకుండా గంగ చిరు కెరటాల దగ్గరే గంటల తరబడి ధ్యానంలో మునిగి ఉండే బైరాగులు తీరమంతా కనిపిస్తారు. ఘాట్లకు అవతలే దుకాణాలలో పట్టు వస్త్రాలను కళ్లప్పగించి చూస్తూ ప్రపంచాన్ని మరచే భక్తకోటి కనిపిస్తుంది. కాశీని చూడడమంటే గంగను చూడడమే. సోపాన పంక్తులతో గంగను దర్శింపచేసేవే ఘాట్లు. ఎనభయ్ నాలుగు వరకు ఉన్నాయవి. అస్సి, మణికర్ణిక, దశాశ్వమేధ్, జైన్, మహానిర్వాణ్, హనుమాన్, నారద, మంగళగౌరి, సింధియా ఘాట్ - ఇలా. ప్రతి ఘాట్‌కు ఒక కథ ఉంది. ఇంకా, మణికర్ణిక, హరిశ్చంద్ర ఘాట్లకు ఎనలేని ప్రాశస్త్యం ఉంది. ఉత్తర జన్మ లేకుండా కాశీలో కన్నుమూయాలని వచ్చేవారు వేలాదిగా ఉంటారు. తమ పార్ధివ శరీరానికి కాశీలో గంగ తీరాన అంత్యక్రియలు జరగాలని కోరుకునే వారూ ఎక్కువే. ఈ రెండు ఘాట్లు వాటికే ప్రసిద్ధి. మోక్షాన్ని కోరి వచ్చే వారితో సహా, కాశీలో ప్రాణాలు విడిచే ప్రతి ప్రాణికి కూడా అంతిమ క్షణాలలో సాక్షాత్తు శివుడే ‘రామ’ నామాన్ని కుడిచెవిలో వినిపిస్తాడని ఓ విశ్వాసం. తరతరాలుగా ఒకే దీపం నుంచి మంటను తీసుకుని తలకొరివి పెట్టే ఆచారం మణిక ర్ణిక ఘాట్‌లో ఉంది. ఈ రెండు ఘాట్ల దగ్గరే కాక, కనీసం ఐదు చోట్ల స్నానమాచరించడం సంప్రదాయం. ప్రపంచంలో అత్యంత పురాతనమైన ఆ నగరంలో మతోన్మాదంతో జరిగిన విధ్వంసానికీ, స్పర్థలతో వర్థిల్లిన విజ్ఞానానికీ కూడా ప్రత్యక్ష సాక్షి గంగ. ముస్లిం దండయాత్రల ఆనవాళ్లు విశ్వేశ్వరుడి సన్నిధిలోనే కనిపిస్తాయి. ఔరంగజేబు ధ్వంసం చేసిన ఆలయాన్ని 1780లో ఇందోర్ మహారాణి అహల్యాబాయ్ హోల్కార్ పునరుద్ధరించింది. తరువాత సిక్కు పాలకుడు రంజిత్‌సింగ్ గోపురానికి బంగారు తాపడం చేయించాడు. పూర్వపు ఆలయాన్ని ధ్వంసం చేసిన స్థలానికి పక్కనే కొత్త ఆలయాన్ని నిర్మించారు. విశ్వేశ్వరుడి గుడి గోపురం, మసీదు గోపురం పక్కపక్కనే కనిపిస్తాయి. ఈ మసీదును జ్ఞానవాపి మసీదు అనే అంటారు. జ్ఞానవాపి అంటే పాత ఆలయం కట్టిన స్థలం పేరు. ఒక్క గోడే అడ్డు. అన్నపూర్ణ మందిరం దాటాక శివాలయం కనిపిస్తుంది. ఎప్పుడైనా కావచ్చు, కాశీలో మొత్తంగా రెండు వేల ఆలయాలు వెలిశాయని చెబుతారు. వాటిలో ఐదు లక్షల ప్రతిమలు కొలువైనాయనీ అంటారు. కాశీ ఆధ్యాత్మికంగా ఎంత ప్రఖ్యాతమో, జ్ఞానానికి కూడా అంతే పేర్గాంచింది. మహామహోపాధ్యాయ మకుటాలను అలంకరించిన కాలం నుంచీ మదన్మోహన్ మాలవీయ బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం నిర్మించే వరకు ఆ ఖ్యాతి నిలబడే ఉంది. సంస్కృత విద్యకు వారణాసి విశ్వ ప్రఖ్యాతి గాంచిన పీఠం. జైన, బౌద్ధ గురువులూ కాశీని సందర్శించారు. జైన తీర్థంకరుడు పార్శ్వనాథుడు ఈ నగరం వాడే. బుద్ధుడు జ్ఞానం పొందిన తరువాత తొలి సందేశం ఇచ్చిన సార్నాథ్ కాశీ శివార్లలోనే ఉంది. ‘అష్టాధ్యాయి’ రచయిత పాణిని, ఆచార్య త్రయం (శంకరాచార్యులు, రామానుజులు, మధ్వాచార్యులు) బసవన్న గంగాస్నాన మాచరించినవారే. మొగలుల కొలువులో పని చేసిన జగన్నాథ పండితరాయలు ఆ నది ఒడ్డుకు లవంగితో కలసి వచ్చి 53 శ్లోకాల ‘గంగా లహరి’ని ఆలపించాడు. తన లాక్షణిక గ్రంథానికి రసగంగాధరమనే పేరు పెట్టుకున్నాడాయన. పెద కోమటి వేమారెడ్డితో కాశీ వచ్చిన శ్రీనాథుడు, అపారమైన ప్రేమతో స్కాందపురాణంలోని కాశీ ఖండాన్ని అనువదించే పనికి శ్రీకారం చుట్టాడు. గౌతమి తీరంలో ఆ అనువాదం పనిని పూర్తిచేశాడా ‘ఈశ్వరార్చన కళాశీలుడు.’ ఝాన్సీ లక్ష్మీభాయి ఇక్కడే పుట్టింది. ఆమె వీరగాథతో పాటు కబీర్ కవితలనూ ఆ నది విన్నది. ‘అన్ని జీవుల గొంతుకలు ఆ నది గొంతుకలో ఉన్నాయి’ అంటాడు హెర్మన్ హెస్ తన అద్భుత నవల ‘సిద్దార్థ’లో. కాశీ, పక్కనే కొద్దిపాటి ఒంపుతో ప్రవహించే గంగ ఆధునిక కాలంలోనూ రచయితలనీ, కవులనీ ఆకర్షిస్తూనే ఉంది. అందుకేనేమో, హెస్ తన నవలలోనే మరోచోట, ‘అది జీవ శబ్దం. నిత్యంగా వుంటూ, తెంపు లేకుండా మారుతూ ఉండే శబ్దం ఆ నది’ అంటాడు. గోస్వామి తులసీదాస్ ‘రామ చరితమానస్’ గంగ ఒడ్డున కూర్చుని రాశాడని చెబుతారు. ఆయన పేరిట ఒక ఘాట్ కూడా ఉంది. విభూతిభూషణ్ బంధోపాధ్యాయ పథేర్పాంచాలీ, అపరిచితుడు నవలల్లో, శరత్‌బాబు వాక్యాలలో గంగ గలగలలు వినిపిస్తూనే ఉంటాయి. రవీంద్ర కవీంద్రుడు వంగ దేశంలోని ఘాజీపూర్ నుంచి వారణాసికి పడవ ప్రయాణం చేశారు. ఆ యాత్ర లోనే నౌకాభంగం, చోఖెర్బాలి అనే రచనలకు అంకురార్పణ జరిగింది. గంగాతీరంలోని మార్మికత, కాశీ ఆధ్యాత్మిక శక్తులను అక్షరబద్ధం చేయడానికే ప్రేమ్‌చంద్ ‘సేవాసదన్’ నవల రాశారని అనిపిస్తుంది. కొన్ని పురాతన సంప్రదాయాలను ఆ మహా రచయిత నిరసించినా ఆ చరిత్రాత్మక ఘాట్ల మధ్య ‘ప్రేమ్‌చంద్ ఘాట్’ కూడా వెలిసింది. ఏనుగుల వీరాస్వామయ్య ‘కాశీయాత్ర చరిత్ర’ రాశారు. తెలుగువారు ఎందరు కాశీ పండితులుగా అవతరించారో చెళ్లపిళ్ల వేంకటశాస్త్రిగారు తన ‘కాశీయాత్ర చరిత్ర’లో ఎంత రమణీయంగా వర్ణించలేదు! వీరంతా అక్షరాలతో ఆ ప్రవాహాన్ని ఆరాధిస్తే, తన షెహనాయ్ నాదంతో పూజించిన మహా కళాకారుడు బిస్మిల్లాఖాన్. మీరొచ్చి అమెరికాలో స్థిరపడకూడదా! అని ఎవరో అడిగితే, అక్కడ గంగ లేదు మరి! అని సమాధానం ఇచ్చిన ఆరాధకుడాయన. ఇక్కడ పుట్టాడు కాబట్టే పండిట్ రవిశంకర్ సితార్ వాదనం గంగా ఝరిలా ఉరుకుతుంది. పగలంతా భక్తుల స్నానాలతో రంగుమారిపోయే గంగ, రాత్రి వేళ కాంతి రేఖలను అలంకరించుకుంటుంది. చీకట్లు ముసిరాక, ఘాట్ల సోపానాల మీద నుంచి నిత్యం గంగమ్మకు ఇచ్చే దీపాల హారతి ఓ అందమైన వేడుక. ఒకే రకం వస్త్ర ధారణతో, భారీ దీపపు గుచ్ఛాలతో, మంగళవాద్యాల నడుమ, భక్తి గీతాలాపన మధ్య ఈ కార్యక్రమం జరుగుతుంది. దీనిని నదిలోనే పడవల మీద కూర్చుని వీక్షించవచ్చు. గుహుడి వారసులుగా చెప్పుకునే ఒక తెగవారు పడవలను భక్తులకు అందుబాటులో ఉంచుతారు. లేదా గట్టునే భక్తకోటితో కూర్చునీ చూడొచ్చు. హారతి పడుతూ మెట్ల మీద నిలబడి గుండ్రంగా తిప్పే దీపపుగుత్తుల వెలుగులతోనూ, పుణ్యస్త్రీలు అరటిదొప్పలలో వెలిగించి నదిలో విడిచిపెట్టే దీపాలు కెరటాల మీద వయ్యారంగా సాగిపోతూ చిందించే చిరు వెలుగులతోనూ కొన్ని గంటల సేపు గంగ కిన్నెరలా మెరిసిపోతుంది. ఆ నిశిలో కన్ను ఎటు తిప్పినా ఈ సుందర దృశ్యమే కనిపిస్తుంది. కాశీ అంటే దీపకాంతుల నగరమని అర్థం. హిందూ చింతనలో వెలుగుకు ఎంతో ప్రాధాన్యం ఉంది. కారణం ఏదైనా నేటికీ ఆ కాంతుల నగరి హిందువుల గుండెలను స్పందింపచేస్తూనే ఉంది. గంగతో శరీరాన్ని క్షాళన చేసుకోవచ్చు. మనసును క్షాళన చేసుకోవాలంటే ఒక్క జ్ఞానంతోనే సాధ్యమన్న సందేశం అక్కడ వినిపిస్తుంది. కాశీ, గంగ, మణికర్ణిక మనకి వెల్లడించే సత్యం ఇదే. మనసుని క్షాళన చేసే జ్ఞానానికి ప్రతీకే వెలుగు. తమసోమా జ్యోతిర్గమయ. - డాక్టర్ గోపరాజు నారాయణరావు -
కడప పెద్ద దర్గాలో ఏఆర్ రెహ్మాన్
కడప కల్చరల్, న్యూస్‌లైన్ : కడప పెద్దదర్గాలో శుక్రవారం హజరత్ ఖ్వాజా సయ్యద్‌షా మహమ్మద్ మహమ్మదుల్ అమీన్‌పీర్ సాహెబ్ చిష్ఠివుల్ ఖాద్రీ ఉరుసు ఉత్సవం ఘనంగా నిర్వహించారు. పెద్ద ఉరుసు ఉత్సవాన్ని తలపిస్తూ భక్తులు భారీ సంఖ్యలో హాజరు కావడంతో దర్గా ప్రాంగణం కిటకిటలాడింది. ఇందులో భాగంగా దర్గాలోని హజరత్ అమీన్‌పీర్ సాహెబ్ మజార్‌ను రంగురంగుల విద్యుత్ దీపాలు, పూలతో కన్నుల పండువగా అలంకరించారు. భక్తులు మజార్‌ను దర్శించుకుని పూలచాదర్ సమర్పించి ఫాతెహా నిర్వహించారు. దర్గాలో రాత్రి ఖవ్వాలీ నిర్వహించారు. ఏఆర్ రెహ్మాన్ ప్రార్థనలు శుక్రవారం ఉదయం 2 గంటలకు దర్గాలో జరిగిన ఉత్సవానికి సినీ సంగీత దర్శకులు ఏఆర్ రెహ్మాన్ కుటుంబ సభ్యులతో కలిసి హాజరయ్యారు. ప్రార్థనల్లో పాల్గొన్న అనంతరం ఆయన పీఠాధిపతి స్వయంగా తెచ్చిన గంధాన్ని మజార్‌వద్ద సమర్పించారు. -
వైఎస్ కుటుంబ సభ్యుల క్రిస్మస్ ప్రార్థనలు
-
క్రీస్తుమార్గం
మహబూబ్‌నగర్ కల్చరల్, న్యూస్‌లైన్: క్రిస్మస్ను పురస్కరించుకుని బుధవారం జిల్లా కేంద్రంతో పాటు ప్రసిద్ధ ప్రార్థన మందిరాలు ఉన్న కావేరమ్మ పేట, జడ్చర్ల, ఫాతిమానగర్, లూర్ధునగర్, శాంతి నగర్, వెలగొండ కాలనీ, వనపర్తి, కొల్లాపూర్, అచ్చంపేట, గద్వాల, అలంపూర్, అయిజ, క్రిస్టియన్‌పల్లి, నాగర్‌కర్నూల్, నారాయణపేట, కల్వకుర్తి తదితర ప్రాంతాల్లో క్రిస్టమస్ పర్వదినాన్ని పురస్కరించుకుని క్రైస్తవులు చర్చీల్లో ప్రత్యేక కార్యక్రమాలు, ప్రార్థనలు నిర్వహించారు. అంతకుముందు వారం రోజులుగా పలు చోట్లు ధార్మిక ప్రసంగాలు నిర్వహించారు. ప్రత్యేకప్రార్థనల అనంతరం అన్ని మతాల వారు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమాల్లో భాగంగా పేదలకు అన్నదానం, వస్త్రదానం, రోగులకు పండుపంపిణీచేశారు. జిల్లా కేంద్రంలోని కల్వరి మెన్నోనైట్ బ్రదరన్ చర్చ్‌లో క్రిస్మస్ వేడుకలు రంగరంగవైభవంగా జరిగాయి. చర్జి అభివృద్ధి సంఘం అధ్యక్షుడు, పాస్టర్ రెవరెండ్ ఎస్.వరప్రసాద్ నేతృత్వంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ప్రముఖుల శుభాకాంక్షలు మంత్రి డీకే అరుణ గద్వాలలో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో పాల్గొని ప్రజలకు శుభాకాంక్షలు చెప్పారు. హైదరాబాద్‌కు చెందిన నేటివ్ సంస్థ ఫౌండర్, డెరైక్టర్ డాక్టర్ ఎడ్గర్ సాయలూరి ముఖ్య ప్రసంగీకుడిగా హాజరై ప్రార్థనలు నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఏజేసీ డాక్టర్ రాజారాం మాట్లాడుతూ.. జిల్లా ప్రజలు క్రీస్తుమార్గంలో నడవాలని కాంక్షించారు. ఆయన మాదిరి సమభావంతో అందరిపై ప్రేమ, ఆప్యాయత చూపాలని కోరారు. ఎమ్మెల్సీ జగదీశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, వైఎస్సార్ కాంగ్రెస్ జిల్లా కన్వీనర్ ఎడ్మకిష్టారెడ్డి మాట్లాడుతూ పరోపకారం, క్షమాగుణం, ప్రేమ, సేవలు చేయడం క్రీస్తు సూచించిన మహోన్నత మార్గాలని అన్నారు. క్రైస్తవ సోదరుల్లో ఇతర మతాల వారిని ఆదరించడమే కాకుండా సేవాభావం కలిగి ఉండే గుణాలు ఉంటాయని అన్నారు. కార్యక్రమంలో స్థానిక డీఎస్పీ మల్లికార్జున్, డీసీసీ అధ్యక్షుడు ఒబేదుల్లా కొత్వాల్, మాజీ అధ్యక్షుడు ముత్యాల ప్రకాశ్ , పీసీసీ సభ్యుడు బుర్రి వెంకట్రాంరెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పెద్దిరెడ్డి సాయిరెడ్డి, మాజీ మంత్రి పి.చంద్రశేఖర్, పట్టణ ప్రముఖులు కేఎస్ రవికుమార్, సయ్యద్ ఇబ్రాహీం, జూపల్లి భాస్కర్‌రావు, పలువురు అధికారులు పాల్గొన్నారు. -
మెర్రీ క్రిస్మస్
నెల్లూరు (వేదాయపాళెం), న్యూస్‌లైన్ : లోకరక్షకుడైన ఏసుక్రీస్తు జననం కోసం భక్తులు కనులారా వేచి చూశారు. క్రిస్మస్ పర్వదినం కోసం జిల్లా వ్యాప్తంగా ఉన్న చర్చిల్లో మంగళవారం రాత్రి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ప్రత్యేక ప్రార్ధనలు... లోకరక్షకుడి జననం కోసం మంగళవారం రాత్రి 9 గంటల నుంచి అన్ని చర్చిల్లో ప్రత్యేక స్తుతిగీతాలను ఆలపించారు. సంఘస్తులు, యువత క్రీస్తు జనన సందేశాన్ని అందించేందుకు పురవీధుల్లో క్యారల్స్గా తిరిగారు. క్యారల్స్‌లో ఆలపించిన గీతాలు ఆకట్టుకున్నాయి. శాంతాక్లాజ్ (క్రిస్మస్తాత) నృత్యాలు చిన్నారులను అలరించాయి. చర్చిల్లో అర్ధరాత్రి కేకులు కట్‌చేసి సంబరాలు చేసుకున్నారు. చిన్నారులు, మహిళలు క్రీస్తు జననాన్ని తెలిపే డ్రామాలు ప్రదర్శించారు. నెల్లూరు నగరంలోని సంతపేటలో ఉన్న రోమన్ కేథలిక్, కెథడ్రిల్ చర్చిలో బిషప్ మోస్ట్ రెవరెండ్ ప్రకాశం ఆధ్వర్యంలో జరిగిన ప్రత్యేక ప్రార్థనల్లో వేలాదిగా భక్తలు పాల్గొన్నారు. వీఆర్సీ సెంటర్లో బాప్టిస్టుచర్చి డౌనీ హాల్లో రెవరెండ్ జి.పీటర్ ఆధ్వర్యంలో క్రిస్మస్ ఈవ్, యూత్ డెరైక్టర్ జానిజో ఆధ్వర్యంలో యువజన క్రిస్మస్ వేడుకలు జరిగాయి. లోన్‌స్టార్ బాప్టిస్టు చర్చిలో రెవరెండ్ కంచర్ల ప్రభుదాస్, రెవరెండ్ విజయ్‌కుమార్, రెవరెండ్ థామస్ నేతృత్వంలో ప్రత్యేక ప్రార్థనలు జరిగాయి. ఫతేఖాన్‌పేట లూథరన్ చర్చిలో రెవరెండ్ ఏసుప్రతాప్, వ్యవస్థాపకులు జీఆర్ సుధాకర్ పర్యవేక్షణలో ప్రార్థనలు చేశారు. భారతీ సిమెంట్స్ ఆధ్వర్యంలో.. నగరంలోని డౌనీహాల్లో క్రిస్మస్ వేడుకలను భారతీ సిమెంట్స్ ఆధ్వర్యంలో మంగళవారం అర్ధరాత్రి ఘనంగా నిర్వహించారు. క్రీస్తు జనయించిన వేళ కేక్‌ను కట్ చేసి పంపిణీ చేశారు. భారతీ సిమెంట్స్ ఏరియా సేల్స్ మేనేజర్ జేఎన్ మల్లికార్జునరెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాలు, పట్టణాల్లో భారతీ సిమెంట్స్ ఆధ్వర్యంలో క్రిస్మస్ సంబరాలు జరుపుతున్నామన్నారు. క్రైస్తవులందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలను తెలియజేశారు భక్తులందరికీ కేక్‌లు పంపిణీ చేశారు. బ్రదర్ విలియమ్స్ శుభకర్ వాఖ్యోపదేశం చే శారు. రోమేల్రాయ్, సునీల్, నిరంజన్ బృందాలు భక్తిశ్రద్ధలతో గీతాలను ఆలపించారు. సంఘ కాపరి పీటర్ ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. భారతీ సిమెంట్స్ సేల్స్ ఆఫీసర్ సుబ్బరాజు పాల్గొన్నారు. కందిపప్పుపై క్రిస్మస్ స్టార్ వెంకటగిరిటౌన్, న్యూస్‌లైన్: స్థానిక కాశీపేటకు చెందిన మొద్దు వెంకటాచలం కందిపప్పుపై చెక్కిన క్రిస్మిస్ స్టార్ ఆకట్టుకుంటోంది. క్రిస్మస్ సందర్భంగా ఆయన పెన్సిల్‌పై చెక్కిన హ్యాపీ క్రిస్మస్, క్రిస్మస్ ట్రీ, శిలువ అబ్బురపరిచాయి. కళాతృష్ణ ఉంటే ఎలాంటి అద్భుతాలైనా సృష్టించవచ్చని వెంకటాచలం మంగళవారం ‘న్యూస్‌లైన్’తో అన్నారు. తల్లిదండ్రులు పెంచలమ్మ, రమణయ్య ప్రోత్సాహంతో కళారంగాల్లో రాణిస్తున్నట్టు అతను చెప్పారు. నెల్లూరు (స్టోన్‌హౌస్‌పేట), న్యూస్‌లైన్: క్రీస్తు జననాన్ని పురస్కరించుకుని అవిష్కరించిన సైకత శిల్పం పలువురిని ఆకట్టుకుంది. నగరంలోని ఏసీ నగర్‌కు చెందిన పిల్లా చంద్రశేఖర్, తమ్మిశెట్టిరవి, గుండుపోగు రవి, కళాకారులు ఈ సైకత శిల్పాన్ని కోడూరు బీచ్‌లో రూపొందించారు. క్రిస్మస్ తాత (శాంతాక్లాజ్) ఆకారాన్ని ఇసుకతో అందంగా తీర్చిదిద్దారు. నెల్లూరు శెట్టిగుంట రోడ్డుకు చెందిన సీయోన్గాస్పెల్ మినిస్ట్రీస్ ప్రార్థన మందిరం పాస్టర్ డేవిడ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ ప్రదర్శన కోడూరు బీచ్‌లో క్రిస్మస్ వాతావరణాన్ని నెలకొల్పింది. -
నేడు క్రిస్మస్
ఆర్తులు, దీనుల పాలిట రక్షకుడిగా ప్రభువైన యెహోవా ప్రియపుత్రునిగా ఏసుక్రీస్తు భువిపై అవతరించిన రోజు క్రిస్మస్. ఈ పర్వదినాన్ని నేడు జిల్లాలో అత్యంత భక్తిశ్రద్ధలతో.. ఆనందోత్సాహాలతో జరుపుకోనున్నారు. జిల్లాలోని అన్ని చర్చిలు అందంగా ముస్తాబయ్యాయి. మంగళవారం అర్ధరాత్రి నుంచే చర్చిలలో ప్రత్యేక ప్రార్థనలు ప్రారంభమయ్యాయి. గురువులు క్రీస్తు రాకను తెలిపే బైబిల్ సూక్తులు వినిపించారు. -
అబద్ధం చెప్పావ్.. ప్రార్థన చెయ్!
న్యూఢిల్లీ: వైవాహిక స్థితి గురించి అబద్ధం చె ప్పిందని తేలడంతో ఆగ్రహించిన హైకోర్టు పాపపరిహారంగా రాజ్‌ఘాట్ వద్ద వారంపాటు ప్రార్థనలు చేయాలని ఓ మహిళను ఆదేశించింది. మొదటిసారిగా కోర్టు వచ్చానని, చట్టం గురించి సరిగ్గా తెలియనందున క్షమించాలన్న ఫరా ఖాతూన్ విజ్ఞప్తిని న్యాయమూర్తులు కైలాష్ గంభీర్, ఇందర్మీత్ కౌర్‌తో కూడిన బెంచ్ తిరస్కరించింది. రాజ్‌ఘాట్ వద్ద నిత్యం కనీసం నాలుగు గంటలపాటు ఏడురోజులు ప్రార్థనలు నిర్వహించాలని బెంచ్ ఆదేశించింది. ‘ఎంసీడీ పాఠశాలలో టీచర్‌గా పనిచేస్తున్న ఈ మహిళకు కోర్టులో నిజాయితీగా ఉండాలన్న విషయం తెలియదంటే నమ్మలేం. వెంట ఆమె న్యాయవాది లేడనో, సామాజిక ఒత్తిడి కారణంగానో ఇలా చేసిందనే వాదనను అంగీకరించలేం’ అని బెంచ్ స్పష్టీకరించింది. ఆమె ప్రవర్తన పూర్తి అనుచితం గా ఉందని, అబద్ధాల మీద అబద్ధాలు చెబుతోం దని న్యాయమూర్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సాక్షాత్తూ కోర్టులోనే ప్రమాణం చేసి మరీ అబద్ధం చెప్పేందుకు తెగించడం దారుణమని, ఇది క్షమార్హం కాదని వ్యాఖ్యానించింది. ఇక ఈ కేసు వివరాలిలా ఉన్నాయి. వేరే మతస్తుడిని వివాహం చేసుకుందనే కోపంతో ఖాతూన్‌ను తండ్రి నిర్భందించినందున, ఆమెను కోర్టులో హాజరుపర్చేలా ఆదేశించాలని భర్త రాకేశ్ బెంచ్‌ను కోరారు. ఇతడి వాదనలో నిజానిజాలు తెలుసుకోవడానికి ఆమెను కోర్టులో హాజరుపర్చాల్సిందిగా ఆదేశాలు జారీ కావడంతో ఖాతూన్ గత నెల 27న న్యాయమూర్తుల ఎదుట హాజరయింది. రాకేశ్‌తో తనకు పెళ్లే కాలేదని న్యాయమూర్తులకు తెలిపింది. ప్రభుత్వం జారీ చేసిన వివాహ ధ్రువపత్రం, పెళ్లి ఫొటోలు, ముస్లిం నుం చి హిందువుగా మారినట్టుగా ఉన్న పత్రాలన్నీ బూటకమని వాదించింది. ఈ వ్యవహారంపై దర్యాప్తు నిర్వహించాలని బెంచ్ పోలీసులను ఆదేశించింది. దొరికిపోతాననే భయం పెంచుకున్న ఖాతూన్ చేసిన తప్పుకు బేషరతుగా క్షమాపణ చెబుతున్నట్టు కోర్టుకు తెలిపింది. తన అనుమతి లేకుండానే రాకేశ్ పెళ్లి గురించి తన తల్లిదండ్రులకు తెలియజేయడంతో ఒత్తిడికి గురయ్యానని వివరణ ఇచ్చింది. దీంతో సంతృప్తి చె ందని బెంచ్ ఖాతూన్‌కు రూ. రెండు వేల జరిమానా విధించడంతోపాటు ప్రార్థనలు చేయాలని కూడా ఆదేశిం చింది. ఆమె ప్రార్థనలను స్థానిక పోలీసులు తని ఖీ చేయాలని ఆదేశించింది. రాకేశ్, ఖాతూన్‌కు గ త ఏడాది ఏప్రిల్ తొమ్మిదిన వివాహం జరిగింది. -
భక్తి శ్రద్ధలతో బక్రీద్
మహబూబ్‌నగర్ అర్బన్, న్యూస్‌లైన్: ముస్లిం సోదరులు త్యాగాలకు ప్రతీకగా భావించే బక్రీద్ (ఈదుల్ జుహా) వేడుకలు బుధవారం జిల్లావ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. మహబూబ్‌నగర్‌తో పాటు గద్వాల, వనపర్తి, నాగర్‌కర్నూల్, నారాయణపేట, కొడంగల్, జడ్చర్ల, షాద్‌నగర్, కల్వకుర్తి, అచ్చంపేట, కొల్లాపూర్, ఆలంపూర్, దేవరకద్ర, మక్తల్, కొత్తకోట తదితర పట్టణాలు, మండల కేంద్రాల్లో ఉదయం నుంచే ఆనందోత్సాహాలతో మసీదులు, ఈద్గాల వద్దకు చేరుకొని ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా హిందూ, ముస్లింలు ఒకరినొకరు అలింగనం చేసుకొని శుభాకాంక్షలు తెలుపుకున్నారు. జిల్లాకేంద్రంలోని వానగుట్టపై ఉన్న రహెమానియా ఈద్గా మైదానంలోపెద్ద సంఖ్యలో ముస్లింలు ఈద్ ప్రార్థనలు చేశారు. జామె మసీద్ ప్రధాన ఇమామ్ మౌలానా అబ్దుల్ కరీమ్ సాబ్ ఉదయం 9 గంటలకు ప్రత్యేక నమాజ్ చేయించారు. బక్రీద్ ప్రత్యేకతను ఖుత్బా రూపంలో వివరించి, దైవకృప కోసం పవిత్ర ఖురాన్ గ్రంథంలోని సందేశాలతో పాటు ప్రవ క్త మహ్మద్ అలైహివసల్లమ్ ఆచరించిన ధర్మమార్గంలో నడవాలని పిలుపునిచ్చారు. అనంతరం లోక కల్యాణం కోసం దువా (ప్రార్థన) చేశారు. మహబూబ్‌నగర్‌లో రాష్ట్ర సమాచార మంత్రి డీకే అరుణ, ఎమ్మెల్సీ జగదీశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి, ఆయా అసెంబ్లీ నియోజక వర్గాల్లో సంబంధిత ఎమ్మెల్యేలు ఈద్గాల వద్ద ముస్లింలకు బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు. ప్రముఖుల ఈద్ ముబార క్... బక్రీద్ పురస్కరించుకొని పలువురు ప్రముఖులు ముస్లింలకు ఈద్ ముబారక్ చెప్పారు. ఖ్వామీ ఏక్తా కమిటీ తరఫున ఈద్గా ఆవరణలో ఏర్పాటు చేసిన వేదిక వద్ద పలువురు ప్రజా ప్రతినిధులు, అధికారులు ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో మంత్రి డీకే అరుణ, కలెక్టర్ ఎం.గిరిజాశంకర్, ట్రైనీ కలెక్టర్ విజయరామరాజు, మున్సిపల్ కమిషనర్ అమరయ్య, ఎస్పీ నాగేంద్రకుమార్, ఎమ్మెల్సీ జగదీశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాసరెడ్డి, సౌత్ జోన్ ఖాదీ బోర్డు చైర్మన్ కాళప్ప, తెలంగాణ గజిటెడ్ అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాస్‌గౌడ్, హైకోర్టు అడ్వకేట్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు గిరిధర్‌రావు, మాజీ మంత్రి పి.చంద్రశేఖర్, డీసీసీ అధ్యక్షుడు ఓబెదుల్లా కొత్వాల్, మాజీ ఎంపీలు విఠల్‌రావు, జితేందర్ రెడ్డి, తదితరులున్నారు. భారీ బందోబస్తు.. బక్రీద్ పురస్కరించుకుని జిల్లా కేంద్రంతో పాటు అన్ని మండలాలు, గ్రామాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగుకుండా జిల్లా పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు. ఈద్గాల వద్ద ప్రత్యేక పోలీసు బలగాలను మోహరించారు. -
జెరూసలెంలో జగన్ కోసం ప్రార్థనలు
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన రెడ్డికి బెయిల్ రావాలని కోరుతూ దేశవ్యాప్తంగా ప్రార్థనలు జరిగిన విషయం తెలిసిందే. అయితే, కేవలం ఇక్కడే కాదు.. క్రైస్తవుల పవిత్ర క్షేత్రం జెరూసలెంలో కూడా తెలుగువాళ్లు జగన్మోహన రెడ్డికి బెయిల్ రావాలని కోరుతూ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఇక్కడినుంచి వెళ్లిన జానీ, పుల్లెల, ఎలిసా రాజు, నెహెమయ, జి.రాజు తదితరులు తమ కుటుంబాలతో సహా వెళ్లి.. జెరూసలెంలో ప్రార్థనలు నిర్వహించారు. సోమవారం సాయంత్రానికి బెయిల్ మంజూరు కావడంతో మరోసారి వెళ్లి కృతజ్ఞతా ప్రార్థనలు చేశారు. -
జగన్ కడిగిన ముత్యంలా బయటకు వస్తాడు
-
జగన్‌కు బెయిల్ రావాలని కోరుతూ ప్రత్యేక పూజలు
-
జగన్ కోలుకోవాలని క్రైస్తవుల ప్రార్థనలు
వర్సోవ, న్యూస్‌లైన్: సమైక్యాంధ్ర కోసం దీక్షబూనిన వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ఆరోగ్యం వెంటనే కుదుట పడాలని కోరుతూ ‘పాట్నర్స్ ఆఫ్ బైబిల్ గాస్పెల్ మినిస్ట్రీస్ ట్రస్ట్’ ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అంధేరి పశ్చిమంలోని వర్సోవ ప్రాంతంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఫౌండర్ అధ్యక్షులు రెవ. జయరాజు, సంఘం పెద్దలు ప్రార్థనల్లో పాల్గొన్నారు. ‘వైఎస్ఆర్ కుటుంబం చీకటిలో దీపంలా సమాజానికి వెలుగులు పంచింది’’ అని వక్తలు కొనియాడారు. ఈ కార్యక్రమానికి డానియేలు, హిజయన్న, జి.లింగన్న, శాంతి రాజు, జి.ఇసాకు, జి.ఏసయ్య, పి.ఇమ్మాన్యుయేలు తదితరులు పాల్గొన్నారు. -
సన్మార్గంలో పయనించాలి
కరీంనగర్ కల్చరల్, న్యూస్‌లైన్ : విశ్వ మానవ సమాజం శాంతి, సన్మార్గాల్లో పయనించాలని ముస్లిం మత గురువు ఇమామ్ ముక్తి దయాస్ మొహియొద్దిన్ ప్రబోధించారు. రంజాన్ పర్వదినం సందర్భంగా కరీంనగర్ శివారులోని సాలేహ్ నగర్‌లోని ఈద్గా వద్ద శుక్రవారం ఉదయం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఆధ్యాత్మిక సందేశాన్ని అందించారు. మత సామరస్యం, శాంతి, సౌభాగ్యాలు సమాజంలో వెల్లివిరిసేలా ప్రజాజీవనం కొనసాగాలని ఆకాంక్షించారు. నిరాధారులు నిరుపేదలతో పాటు ఆకలిగొన్నవారి సాధక బాధకాలను నిర్మూలించిన రోజున ప్రభువు ప్రసన్ను డవుతాడని అన్నారు. ఉపవాస దీక్షలో ఆచరించిన సత్య ధర్మాచరణలను ఏడాది పొడవునా అనుసరించాలన్నారు. సత్ప్రవర్తన కలిగి, తమ విధులు, బాధ్యతలను సక్రమంగా నిర్వహించి అల్లా కృపకు పాత్రులు కావాలన్నారు. మత పెద్ద ఇమామ్ హఫీజ్ మహమ్మద్ అబ్దుల్ ఖదీర్ రంజాన్ ప్రత్యేకతను వివరించారు. నిరుపేదలను ఆదుకునే ఇస్లాం విశ్వాసులంటే అల్లాకు ఆనందం కలుగుతుందన్నారు. ధర్మ వర్తనులుగా అందరికీ ఆదర్శంగా నిలవాలని ఉద్బోధిం చారు. చింతకుంట ఈద్గా వద్ద ఇమామ్ మహమ్మద్ ఇంతియాదల్ హఫీజ్ ప్రార్థనలు జరిపించారు. మహమ్మద్ అలీయొద్దీన్ సందేశాన్ని అందించారు. -
నేడు రంజాన్
స్టేషన్ మహబూబ్‌నగర్, న్యూస్‌లైన్: షవ్వాల్ నెలవంక గురువారం రాత్రి దర్శనమివ్వడంతో 29 రోజుల పాటు ముస్లింలు చేపట్టిన ఉపవాసాలను, తరావీ నమాజును విరమించారు. చంద్రుడు కనిపించడంతో ముస్లింలు పరస్పరం ఈద్ ముబారక్ చెప్పుకున్నారు. శుక్రవార జిల్లావ్యాప్తంగా ముస్లిం సోదరులు రంజాన్ జరుపుకుని, సర్వ మానవ కల్యాణం కోసం ప్రార్థనలు చేస్తారు. జామియ మసీదు నుంచి శుక్రవారం ఉదయం 9 గంటలకు ముస్లిం సోదరులు సామూహికంగా గడియారం చౌరస్తా మీదుగా స్థానిక వానగట్టు ఈద్గా వద్దకు చేరుకుంటారని ఈద్గా కమిటీ ఉపాధ్యక్షుడు మహ్మద్ జకీ తెలిపారు. ఈద్గా వద్ద ఉదయం 10 గంటలకు జామియా మసీదు ప్రధాన ఇమామ్ మహ్మద్ అబ్దుల్ కరీం ప్రత్యేక ప్రార్థనలు చేయిస్తారని తెలిపారు. స్థానిక మదీనా మజీదులో ఉదయం 9.30 గంటలకు, రైల్వేస్టేషన్‌లోని చౌరస్తాలోని ఒమర్ ఓ ఆమేనా మజీదులో ఉదయం 10.15 గంటలకు రంజాన్ నమాజు నిర్వహిస్తున్నట్లు ఆయా మజీదుల నిర్వాహకులు తెలిపారు. ముస్లిం సోదరులకు కేంద్రమంత్రి జైపాల్‌రెడ్డి, ఎమ్మెల్సీ జగదీశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, కలెక్టర్ ఎం.గిరిజాశంకర్, ఎస్పీ నాగేంద్రకుమార్, వైఎస్సార్ సీపీ జిల్లా కన్వీనర్ ఎడ్మ కిష్టారెడ్డి, ఇతర నాయకులు ఈద్గా వద్దకు వచ్చి పండుగ శుభాకాంక్షలు తెలుపనున్నారు.