అబద్ధం చెప్పావ్.. ప్రార్థన చెయ్!
అబద్ధం చెప్పావ్.. ప్రార్థన చెయ్!
Published Sat, Dec 21 2013 11:31 PM | Last Updated on Sat, Sep 2 2017 1:50 AM
న్యూఢిల్లీ: వైవాహిక స్థితి గురించి అబద్ధం చె ప్పిందని తేలడంతో ఆగ్రహించిన హైకోర్టు పాపపరిహారంగా రాజ్‌ఘాట్ వద్ద వారంపాటు ప్రార్థనలు చేయాలని ఓ మహిళను ఆదేశించింది. మొదటిసారిగా కోర్టు వచ్చానని, చట్టం గురించి సరిగ్గా తెలియనందున క్షమించాలన్న ఫరా ఖాతూన్ విజ్ఞప్తిని న్యాయమూర్తులు కైలాష్ గంభీర్, ఇందర్మీత్ కౌర్‌తో కూడిన బెంచ్ తిరస్కరించింది. రాజ్‌ఘాట్ వద్ద నిత్యం కనీసం నాలుగు గంటలపాటు ఏడురోజులు ప్రార్థనలు నిర్వహించాలని బెంచ్ ఆదేశించింది. ‘ఎంసీడీ పాఠశాలలో టీచర్‌గా పనిచేస్తున్న ఈ మహిళకు కోర్టులో నిజాయితీగా ఉండాలన్న విషయం తెలియదంటే నమ్మలేం. వెంట ఆమె న్యాయవాది లేడనో, సామాజిక ఒత్తిడి కారణంగానో ఇలా చేసిందనే వాదనను అంగీకరించలేం’ అని బెంచ్ స్పష్టీకరించింది. ఆమె ప్రవర్తన పూర్తి అనుచితం గా ఉందని, అబద్ధాల మీద అబద్ధాలు చెబుతోం దని న్యాయమూర్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
సాక్షాత్తూ కోర్టులోనే ప్రమాణం చేసి మరీ అబద్ధం చెప్పేందుకు తెగించడం దారుణమని, ఇది క్షమార్హం కాదని వ్యాఖ్యానించింది. ఇక ఈ కేసు వివరాలిలా ఉన్నాయి. వేరే మతస్తుడిని వివాహం చేసుకుందనే కోపంతో ఖాతూన్‌ను తండ్రి నిర్భందించినందున, ఆమెను కోర్టులో హాజరుపర్చేలా ఆదేశించాలని భర్త రాకేశ్ బెంచ్‌ను కోరారు. ఇతడి వాదనలో నిజానిజాలు తెలుసుకోవడానికి ఆమెను కోర్టులో హాజరుపర్చాల్సిందిగా ఆదేశాలు జారీ కావడంతో ఖాతూన్ గత నెల 27న న్యాయమూర్తుల ఎదుట హాజరయింది. రాకేశ్‌తో తనకు పెళ్లే కాలేదని న్యాయమూర్తులకు తెలిపింది. ప్రభుత్వం జారీ చేసిన వివాహ ధ్రువపత్రం, పెళ్లి ఫొటోలు, ముస్లిం నుం చి హిందువుగా మారినట్టుగా ఉన్న పత్రాలన్నీ బూటకమని వాదించింది.
ఈ వ్యవహారంపై దర్యాప్తు నిర్వహించాలని బెంచ్ పోలీసులను ఆదేశించింది. దొరికిపోతాననే భయం పెంచుకున్న ఖాతూన్ చేసిన తప్పుకు బేషరతుగా క్షమాపణ చెబుతున్నట్టు కోర్టుకు తెలిపింది. తన అనుమతి లేకుండానే రాకేశ్ పెళ్లి గురించి తన తల్లిదండ్రులకు తెలియజేయడంతో ఒత్తిడికి గురయ్యానని వివరణ ఇచ్చింది. దీంతో సంతృప్తి చె ందని బెంచ్ ఖాతూన్‌కు రూ. రెండు వేల జరిమానా విధించడంతోపాటు ప్రార్థనలు చేయాలని కూడా ఆదేశిం చింది. ఆమె ప్రార్థనలను స్థానిక పోలీసులు తని ఖీ చేయాలని ఆదేశించింది. రాకేశ్, ఖాతూన్‌కు గ త ఏడాది ఏప్రిల్ తొమ్మిదిన వివాహం జరిగింది.
Advertisement
Advertisement