Kailash Gambhir
-
న్యాయవ్యవస్థ కళ్లు తెరవాల్సిందే!
సాక్షి, న్యూఢిల్లీ : భారత్‌లోని ఉన్నత న్యాయవ్యవస్థకు సంబంధించి జనవరి పదవ తేదీన రెండు వివాదాస్పద పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఒకటి సంజయ్ ఖన్నాను సుప్రీం కోర్టుకు నియమించడాన్ని విమర్శిస్తూ ఢిల్లీ హైకోర్టు మాజీ జడ్జీ కైలాష్ గంభీర్ రాష్ట్రపతికి లేఖ రాయడం. రెండూ డిసెంబర్ 12వ తేదీన సుప్రీంకోర్టుకు ఇద్దరు జడ్జీలను నియమిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని సుప్రీంకోర్టు కొలీజియం రద్దు చేసుకోవడం. 32 మంది జడ్జీల సీనియారిటీని కాదని సంజయ్ ఖన్నాను సుప్రీం కోర్టు జడ్జీగా నియమించారని గంభీర్ ఆరోపించారు. మరి ఈనేపథ్యంలోనే ఇద్దరు జడ్జీల నియామకాన్ని సుప్రీం కోర్టు ఎందుకు రద్దు చేసుకుందో మాత్రం వెల్లడించలేదు. జడ్జీలే జడ్జీలను నియమించే వ్యవస్థ ఒక్క భారత దేశంలో తప్పా ప్రపంచంలోని ఏ ప్రజాస్వామ్య దేశంలో లేదు. ప్రధాన న్యాయమూర్తి, నలుగురు సుప్రీం కోర్టు సీనియర్ జడ్జీలతో కూడిన కొలీజియం హైకోర్టులు, సుప్రీం కోర్టుకు జడ్జీలను నియమిస్తుంది. ఈ పద్ధతి 1993 నుంచి అమల్లోకి వచ్చింది. అంతకుముందు ప్రధాన న్యాయమూర్తి సలహా మేరకు కేంద్ర ప్రభుత్వమే నియామకాలు జరిపేది. ఆ పద్ధతి వల్లన కేంద్రంలో అధికారంలో ఉండే రాజకీయ పార్టీ ప్రభావం నియామకాలపై ఉంటుందన్న ఉద్దేశంతో సుప్రీం కోర్టు ఈ కొత్త వ్యవస్థను తీసుకొచ్చింది. ఈ వ్యవస్థను మార్చేందుకు కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం 2015లో ప్రయత్నించి విఫలమయింది. సుప్రీం కోర్టు కొలీజియం నియామకాల్లో కూడా కేంద్రం ప్రభావం అప్పుడప్పుడు కనిపించడం, నియామకాలు వివాదాస్పదం అవడం తెల్సిందే. ఇప్పుడు సంజయ్ ఖన్నా నియామకం వివాదాస్పదం కాగా, అంతకుముందు సుప్రీం కోర్టు కొలీజియం తీసుకున్న నిర్ణయాన్ని ఎందుకు రద్దు చేసుకుందో, అందులో ఏమి అవతవకలు జరిగాయో అంతు చిక్కడంలేదు. ఉన్నత న్యాయ వ్యవస్థలో కూడా పారదర్శకత లోపించిన కారణంగా ఇవన్నీ జరుగుతున్నాయి. ఆర్టీఐ (సమాచార హక్కు) చట్టం నుంచి సుప్రీం కోర్టు తనను తాను మినహాయించుకోవడం అంటేనే అది పారదర్శకతకు ఎంత విలువ ఇస్తుందో అర్థం అవుతోంది. సీబీఐ డైరెక్టర్ పదవి నుంచి అలోక్ వర్మను తొలగింపునకు ఓటేసినందుకు ప్రత్యుపకారంగా జస్టిస్ సిక్రీని లండన్‌లోని ‘కామన్వెల్త్ సెక్రటేరియట్ ఆర్బిట్రల్ ట్రిబ్యునల్’ నియామకానికి కేంద్రం సిఫార్సు చేసిందని జాతీయ మీడియాలో విమర్శలు రావడంతో సిక్రీ ఆ పదవిని తిరస్కరించడం కూడా ఇక్కడ గమనార్హం. ఇప్పటికైనా న్యాయవ్యవస్థ కళ్లు తెరచి తనను సరిదిద్దుకోవాలి. పారదర్శకతకు పెద్ద పీట వేయాలి. లేకపోతే న్యాయ వ్యవస్థపై కూడా ప్రజలకు విశ్వాసం పోయే ప్రమాదం ఉంది. -
అబద్ధం చెప్పావ్.. ప్రార్థన చెయ్!
న్యూఢిల్లీ: వైవాహిక స్థితి గురించి అబద్ధం చె ప్పిందని తేలడంతో ఆగ్రహించిన హైకోర్టు పాపపరిహారంగా రాజ్‌ఘాట్ వద్ద వారంపాటు ప్రార్థనలు చేయాలని ఓ మహిళను ఆదేశించింది. మొదటిసారిగా కోర్టు వచ్చానని, చట్టం గురించి సరిగ్గా తెలియనందున క్షమించాలన్న ఫరా ఖాతూన్ విజ్ఞప్తిని న్యాయమూర్తులు కైలాష్ గంభీర్, ఇందర్మీత్ కౌర్‌తో కూడిన బెంచ్ తిరస్కరించింది. రాజ్‌ఘాట్ వద్ద నిత్యం కనీసం నాలుగు గంటలపాటు ఏడురోజులు ప్రార్థనలు నిర్వహించాలని బెంచ్ ఆదేశించింది. ‘ఎంసీడీ పాఠశాలలో టీచర్‌గా పనిచేస్తున్న ఈ మహిళకు కోర్టులో నిజాయితీగా ఉండాలన్న విషయం తెలియదంటే నమ్మలేం. వెంట ఆమె న్యాయవాది లేడనో, సామాజిక ఒత్తిడి కారణంగానో ఇలా చేసిందనే వాదనను అంగీకరించలేం’ అని బెంచ్ స్పష్టీకరించింది. ఆమె ప్రవర్తన పూర్తి అనుచితం గా ఉందని, అబద్ధాల మీద అబద్ధాలు చెబుతోం దని న్యాయమూర్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సాక్షాత్తూ కోర్టులోనే ప్రమాణం చేసి మరీ అబద్ధం చెప్పేందుకు తెగించడం దారుణమని, ఇది క్షమార్హం కాదని వ్యాఖ్యానించింది. ఇక ఈ కేసు వివరాలిలా ఉన్నాయి. వేరే మతస్తుడిని వివాహం చేసుకుందనే కోపంతో ఖాతూన్‌ను తండ్రి నిర్భందించినందున, ఆమెను కోర్టులో హాజరుపర్చేలా ఆదేశించాలని భర్త రాకేశ్ బెంచ్‌ను కోరారు. ఇతడి వాదనలో నిజానిజాలు తెలుసుకోవడానికి ఆమెను కోర్టులో హాజరుపర్చాల్సిందిగా ఆదేశాలు జారీ కావడంతో ఖాతూన్ గత నెల 27న న్యాయమూర్తుల ఎదుట హాజరయింది. రాకేశ్‌తో తనకు పెళ్లే కాలేదని న్యాయమూర్తులకు తెలిపింది. ప్రభుత్వం జారీ చేసిన వివాహ ధ్రువపత్రం, పెళ్లి ఫొటోలు, ముస్లిం నుం చి హిందువుగా మారినట్టుగా ఉన్న పత్రాలన్నీ బూటకమని వాదించింది. ఈ వ్యవహారంపై దర్యాప్తు నిర్వహించాలని బెంచ్ పోలీసులను ఆదేశించింది. దొరికిపోతాననే భయం పెంచుకున్న ఖాతూన్ చేసిన తప్పుకు బేషరతుగా క్షమాపణ చెబుతున్నట్టు కోర్టుకు తెలిపింది. తన అనుమతి లేకుండానే రాకేశ్ పెళ్లి గురించి తన తల్లిదండ్రులకు తెలియజేయడంతో ఒత్తిడికి గురయ్యానని వివరణ ఇచ్చింది. దీంతో సంతృప్తి చె ందని బెంచ్ ఖాతూన్‌కు రూ. రెండు వేల జరిమానా విధించడంతోపాటు ప్రార్థనలు చేయాలని కూడా ఆదేశిం చింది. ఆమె ప్రార్థనలను స్థానిక పోలీసులు తని ఖీ చేయాలని ఆదేశించింది. రాకేశ్, ఖాతూన్‌కు గ త ఏడాది ఏప్రిల్ తొమ్మిదిన వివాహం జరిగింది. -
హత్య కేసులో ఇద్దరికి బెయిల్ నిరాకరణ
న్యూఢిల్లీ: అట్లాంటిక్ సముద్రంలో ఓ పడవలో నేవీ కెప్టెన్‌ను హత్య చేసిన కేసులో అరెస్టయిన ఇద్దరికి ఢిల్లీ హైకోర్టు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. ఇది తీవ్రమైన నేరమన్న జస్టిస్ కైలాశ్ గంబీట్, జస్టిస్ ఇందర్‌మీట్ కౌర్ నేతృత్వంలోని ధర్మాసనం వివేక్ మందోక్, శంకర్ భాటియాలకు బెయిల్ ఇవ్వడం కుదరదని స్పష్టం చేసింది. 2004, ఏప్రిల్ నాలుగున ఓ పడవలోని తన కేబీన్‌లో ఉన్న కెప్టెన్ రాజన్ అగర్వాల్‌ను హత్య చేసిన వివేక్, శంకర్లు మృతదేహాన్ని సముద్రంలోకి విసిరేశారు.