
సాక్షి, విజయవాడ: కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో మసీదుల్లో ఇమామ్, మౌసమ్ లు మాత్రమే ప్రార్థనలు చేస్తారని ఏపీ వక్ఫ్ బోర్డ్ సీఈవో అలీమ్ బాషా తెలిపారు. ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. మసీదుల్లో ప్రార్థనలకు వెళ్లొద్దని.. ఇంట్లోనే ప్రార్థనలు చేసుకోవాలని ముస్లిం సోదరులకు ఆయన సూచించారు. కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ ప్రకటించిన నేపథ్యంలో ముస్లిం లా బోర్డ్ ఫత్వా కూడా జారీ చేసిందన్నారు. దార్ ఉలూమ్ దియోబంద్, జమై నిజామియా వంటి యూనివర్సిటీలు కూడా ఇదే చెబుతున్నాయని తెలిపారు. ముస్లిం పర్సనల్ లా బోర్డ్ కూడా శుక్రవారం ప్రార్థనలు ఇళ్లలోనే చేసుకోవాల్సిందిగా ఫత్వా జారీ చేసిందన్నారు. ముస్లిం సోదరులంతా సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
(కరోనా ప్రభావం: ఆర్‌బీఐ కీలక నిర్ణయం)
Comments
Please login to add a commentAdd a comment