wakf board
-
మనీలాండరింగ్ కేసు: ఆప్ ఎమ్మెల్యేకు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ
ఢిల్లీ: ఆప్ ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్‌కు ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు సెప్టెబర్ 23వరకు 14 రోజుల జ్యుడీషల్ కస్టడీ విధించింది. అమానతుల్లా ఖాన్ ఢిల్లీ వక్ఫ్‌బోర్డ్‌లో నియామకాలు, ఆ సంస్థకు చెందిన రూ.100 కోట్లు విలువ చేసే ఆస్తుల లీజుకు సంబంధించి అవకతవకలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎందుర్కొంటున్నారు. ఇక.. ఈ వ్యవహారానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఆయన్ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ఇటీవల అరెస్టు చేసిన విషయం తెలిసిందే. తాజాగా సోమవారం ఈడీ అమానతుల్లా ఖాన్‌ను రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరించింది. అమానతుల్లా ఖాన్ని విడుదల చేస్తే ఈ కేసులో సాక్షులను ప్రభావితం చేసి అకాశం ఉందని ఈడీ కోర్టుకు తెలిపింది. దీంతో విచారణకు ఆటంకం కలుగుతుందని ఆయన్ను 14 రోజలు జ్యుడీషియల్ కస్టడీకి ఇవ్వాలని ఈడీ కోర్టును కోరింది. ఈడీ అభ్యర్థను పరిగణలోకి తీసుకున్న కోర్టు ఆప్ ఎమ్మెల్యేకు సెప్టెంబర్ 23 వరకు జ్యుడీషియల్ కస్టడీ విధించింది.సెప్టెంబర్ 2వ తేదీన ఉదయం నుంచే ఆప్ ఎమ్మెల్యే నివాసంపై ఈడీ సోదాలు చేపట్టింది. సుమారు ఆరు గంటలు సోదాలు చేసిన అనంతరం ఈడీ అధికారులు అమానతుల్లా ఖాన్ అరెస్ట్ చేశారు. -
సాంకేతికతను జోడిస్తే సత్వర న్యాయం
కర్నూలు (లీగల్): సాంకేతికతను జోడిస్తే సత్వర న్యాయం సాధ్యమని, వక్ఫ్ ఆస్తుల పరిరక్షణలో ప్రజలకు సత్వర న్యాయం అందించేలా వక్ఫ్ బోర్డు ట్రిబ్యునల్ పనిచేయాలని ఏపీ హైకోర్టు న్యాయమూర్తి, కర్నూలు జిల్లా అడ్మినిస్ట్రేటివ్ జడ్జి జస్టిస్ బి.కృష్ణమోహన్ అన్నారు. శనివారం కర్నూలులో ఏర్పాటు చేసిన ఏపీ వక్ఫ్ బోర్డు ట్రిబ్యునల్‌ను జస్టిస్ కృష్ణమోహన్ ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఇప్పటికే కర్నూలులో లోకాయుక్త, హ్యూమన్ రైట్స్ కమిషన్, ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ వంటి సంస్థలు ఏర్పాటయ్యాయని, తాజాగా వక్ఫ్ బోర్డు ట్రిబ్యునల్ కూడా చేరిందని అన్నారు. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్ర విభజన జరిగిన తొమ్మిదేళ్ల తర్వాత రాష్ట్ర వక్ఫ్ బోర్డు ట్రిబ్యునల్ కోర్టు ఏర్పాటు కావడం గొప్ప విషయమన్నారు. ప్రస్తుతం టెక్నాలజీ బాగా పెరిగిందని, న్యాయవాదులు దీనిని బాగా వినియోగించుకోవాలన్నారు. ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్, సెషన్స్ జడ్జి ఎన్.శ్రీనివాసరావు మాట్లాడుతూ.. వక్ఫ్ బోర్డు ట్రిబ్యునల్‌కు జి.భూపాల్‌రెడ్డి చైర్మన్‌గా, ట్రిబ్యునల్ మెంబర్లుగా నాగేశ్వరరావు, అబ్దుల్ మజీద్ వ్యవహరిస్తారన్నారు. వక్ఫ్ ఆస్తులకు సంబంధించిన వివాదాలు, ప్రశ్నలు, ఇతర విషయాలపై వక్ఫ్ ఆస్తుల నిర్ధారణ హక్కులు, ప్రయోజనాలను సమర్థించేందుకు ట్రిబ్యునల్ కోర్టు పని చేస్తుందని చెప్పారు. విభజన జరిగిన నాటి నుంచి ఇప్పటివరకు రాష్ట్ర వక్ఫ్ బోర్డు ట్రిబ్యునల్ కోర్టులో 213 కేసులు పెండింగ్‌లో ఉన్నాయని వివరించారు. మైనార్టీ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఏఎండీ ఇంతియాజ్, కలెక్టర్ జి.సృజన, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి సీహెచ్ వెంకట నాగ శ్రీనివాసరావు, డీఆర్వో ఎస్వీ నాగేశ్వరరావు, ఫ్యామిలీ కోర్టు జడ్జి ప్రతిభాదేవి, జ్యుడిషియల్ ఫస్ట్‌క్లాస్ మెజిస్ట్రేట్ కల్యాణి పాల్గొన్నారు. -
దాడులతో నన్ను భయపెట్టలేరు: మాలిక్
ముంబై: వక్ఫ్ ఆస్తుల అమ్మకాల్లో అక్రమాలు జరిగాయంటూ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ పలు చోట్ల సోదాలు చేస్తూ తనను భయపెట్టగలనని భావిస్తోందని, అది అసాధ్యమని మహారాష్ట్ర మైనారిటీ వ్యవహారాల మంత్రి నవాబ్ మాలిక్ వ్యాఖ్యానించారు. మహారాష్ట్రలో పలు చోట్ల వక్ఫ్ ఆస్తులను అక్రమంగా అమ్మేశారని, మనీ ల్యాండరింగ్ జరిగిందనే ఆరోపణలపై ఈడీ అధికారులు గురువారం పుణెసహా ఏడు చోట్ల సోదాలు చేశారు. ఈ నేపథ్యంలో మంత్రి మాలిక్ ముంబైలో మీడియాతో మాట్లాడారు. ‘ సోదాలు చేస్తే నేనేమీ భయపడను’ అని వ్యాఖ్యానించారు. వక్ఫ్ బోర్డు అధీనంలోని 30వేల ఆస్తుల్లో నిరభ్యంతరంగా సోదాలు చేసుకోవచ్చని ఈడీకి ఆయన ఆహ్వానం పలికారు. బీజేపీ రాజకీయ ప్రత్యర్థి పార్టీలను భయపెట్టేందుకే మోదీ సర్కార్ ఈడీ, ఎన్సీబీ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తోందని మాలిక్ ఆరోపించారు. ‘ఈడీ విధినిర్వహణ నిజంగా చేయదలిస్తే, బీజేపీ అధికారంలో ఉన్న యూపీలోని ఉత్తరప్రదేశ్‌లో షియా వక్ఫ్ బోర్డు ఇచ్చిన ఫిర్యాదులను పట్టించుకోండి’ అని చురకలంటించారు. ఫడ్నవిస్‌కు పరువు నష్టం నోటీసులు పంపిన నవాబ్ అల్లుడు తన ఇంట్లో మాదకద్రవ్యాలు దొరికాయంటూ బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవిస్ తనపై తప్పుడు ఆరోపణలు చేశారంటూ నవాబ్ మాలిక్ అల్లుడు సమీర్ ఖాన్ ఆగ్రహం వ్యక్తంచేశారు. పరువు నష్టం కింద రూ.5 కోట్లు చెల్లించాలని, క్షమాపణలు చెప్పాలని ఫడ్నవిస్‌కు తన లాయర్ ద్వారా సమీర్ నోటీసులు పంపించారు. ఈ నోటీస్‌పై చట్టపరంగానే స్పందిస్తామని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి చెప్పారు. -
‘86 శ్మశానాలు కబ్జా అయితే ఐదు కేసులేనా?’
సాక్షి, హైదరాబాద్: వక్ఫ్‌బోర్డు ఆస్తులు ఆక్రమణకు గురవుతున్నా చట్టపరంగా సరైన చర్యలు చేపట్టడం లేదంటూ బోర్డు సీఈవో హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. హైదరాబాద్ జంటనగరాల పరిధిలో 86 ముస్లిం శ్మశానాలను కబ్జాదారులు ఆక్రమించారని తేలినా.. కేవలం 5 చోట్ల మాత్రమే కేసులు నమోదు చేయించడం ఏమిటని నిలదీసింది. వక్ఫ్ ఆస్తులను కాపాడటంలో బాధ్యతారహితంగా వ్యవహరించిన సీఈవోను ఇంటికి పంపడమే మేలంటూ ఘాటుగా వ్యాఖ్యానించింది. సీఈవోపై వెంటనే తగిన చర్యలు చేపట్టాలని మైనారిటీ వెల్ఫేర్ శాఖ ముఖ్య కార్యదర్శిని హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు సోమవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్.ఎస్.చౌహాన్, జస్టిస్ బి.విజయసేన్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. జంటనగరాలలోని ముస్లింల శ్మశానాలు ఆక్రమణకు గురవుతున్నాయని, అక్రమ నిర్మాణాలు వెలుస్తున్నా వక్ఫ్‌బోర్డు చర్యలు చేపట్టడం లేదని నగరానికి చెందిన సామాజిక కార్యకర్త మహ్మద్ ఇలియాస్ దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యాన్ని ధర్మాసనం విచారించింది. (చదవండి: మెరూన్ పాస్‌బుక్ ఇవ్వకండి) ఈ సందర్భంగా వక్ఫ్‌బోర్డు సీఈవో మహ్మద్ కాసీం విచారణకు వ్యక్తిగతంగా హాజరయ్యారు. ఆక్రమణలపై కేసులు నమోదు చేయాలని పోలీసు అధికారులకు లేఖలు రాశామని కాసీం వివరించారు. అయితే ఇది సివిల్ వివాదమని, కేసులు నమోదు చేయలేమంటూ వారు రాతపూర్వకంగా సమాచారం ఇచ్చారని తెలిపారు. దీనిపై ధర్మాసనం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. స్థానిక పోలీసులు కేసు నమోదు చేయకపోతే జిల్లా ఎస్పీని ఎందుకు సంప్రదించలేదని ప్రశ్నించింది. అక్కడా కేసు నమోదు చేయాలని ఆదేశాలు ఇవ్వకపోతే నేరుగా న్యాయస్థానం ముందు ప్రైవేటు ఫిర్యాదు దాఖలు చేసుకునే అవకాశం ఉన్నా ఎందుకు ఆ దిశగా చర్యలు చేపట్టలేదంటూ మండిపడింది. తనకు సీఆర్పీసీ గురించి తెలియదని కాసీం వ్యాఖ్యానించడంపై ధర్మాసనం స్పందిస్తూ ఇంత చేతగానీ సీఈవో ఉంటే వక్ఫ్‌బోర్డు ఆస్తులకు రక్షణ ఎక్కడ ఉందంటూ అసహనం వ్యక్తం చేసింది. అక్రమణదారులకు నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకున్నారని, 18 ఏళ్లు గడిచినా వాటిపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించింది. అక్రమార్కులపై వెంటనే చట్టపరంగా తగిన చర్యలు చేపట్టాలని మైనారిటీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శిని ఆదేశించింది. తమ ఆదేశాలపై తీసుకున్న చర్యలను వివరిస్తూ మూడు నెలల్లో నివేదిక సమర్పించాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. -
వక్ఫ్ బోర్డు అసమర్థత కనిపిస్తోంది: హైకోర్టు
సాక్షి, హైదరాబాద్: ముస్లిం శ్మశాన వాటికలను కబ్జాల నుంచి పరిరక్షించాలన్న పటిషన్‌పై మంగళవారం తెలంగాణ హైకోర్టులో మంగళవారం విచారణ జరిపింది. ముస్లిం శ్మశాన వాటికల ఆక్రమణలపై నివేదికను వక్ఫ్ బోర్డు కోర్టుకు సమర్పించింది. దీనిపై స్పందించిన హైకోర్టు శ్మశానాల కబ్జాదారులపై కేసులు ఎందుకు పెట్టలేదని ప్రశ్నించింది. అలాగే కబ్జాలను చాలా సాధారణ అంశంగా వక్ఫ్ బోర్టు చూస్తోందని పేర్కొంది. ఈ విషయంలో వక్ఫ్ బోర్డు అసమర్థత కనిపిస్తోందని హైకోర్టు వ్యాఖ్యానించింది. (రాజస్తాన్ ఎడారిలా.. తెలంగాణ) వక్ఫ్ బోర్డు చైర్మన్ మైనార్టీల కోసం పని చేస్తున్నారా అని హైకోర్టు ప్రశ్నించింది. దేవుడికి అంకితమిచ్చిన భూముల రక్షణకు బాధ్యతా యుతంగా ఉండాలని హితవు పలికింది. అయితే సిబ్బంది కొరత వల్ల, కరోనా వేళ మరింత ఇబ్బందిగా ఉందని వక్ఫ్ బోర్డు న్యాయవాది కోర్టుకు తెలిపారు. మంత్రికి చెబితే ప్రభుత్వంతో మాట్లాడి పరిష్కరిస్తారు కదా అని హైకోర్టు బదులిచ్చింది. సర్వే నెంబర్ల వారీగా కబ్జాల వివరాలతో స్పష్టమైన నివేదిక ఇవ్వాలని వక్ఫ్ బోర్డును హైకోర్టు ఆదేశించింది. (ఫీల్డ్ అసిస్టెంట్ల పిటిషన్‌పై హైకోర్టు విచారణ) -
మసీదుల్లో ప్రార్ధనలకు వెళ్లొద్దు
-
ఇళ్లలోనే ప్రార్థనలు చేసుకోవాలి..
సాక్షి, విజయవాడ: కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో మసీదుల్లో ఇమామ్, మౌసమ్ లు మాత్రమే ప్రార్థనలు చేస్తారని ఏపీ వక్ఫ్ బోర్డ్ సీఈవో అలీమ్ బాషా తెలిపారు. ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. మసీదుల్లో ప్రార్థనలకు వెళ్లొద్దని.. ఇంట్లోనే ప్రార్థనలు చేసుకోవాలని ముస్లిం సోదరులకు ఆయన సూచించారు. కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ ప్రకటించిన నేపథ్యంలో ముస్లిం లా బోర్డ్ ఫత్వా కూడా జారీ చేసిందన్నారు. దార్ ఉలూమ్ దియోబంద్, జమై నిజామియా వంటి యూనివర్సిటీలు కూడా ఇదే చెబుతున్నాయని తెలిపారు. ముస్లిం పర్సనల్ లా బోర్డ్ కూడా శుక్రవారం ప్రార్థనలు ఇళ్లలోనే చేసుకోవాల్సిందిగా ఫత్వా జారీ చేసిందన్నారు. ముస్లిం సోదరులంతా సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. (కరోనా ప్రభావం: ఆర్బీఐ కీలక నిర్ణయం) -
వక్ఫ్ భూముల్లో గురుకులాలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని వక్ఫ్ భూములను అవసరమైన చోట మైనారిటీ గురుకులాల భవన సముదాయాల నిర్మాణాలకు లీజుకు ఇవ్వాలని రాష్ట్ర వక్ఫ్ బోర్డు పాలకమండలి నిర్ణయించింది. ఈ మేరకు వక్ఫ్ అభివృద్ధి కమిటీకి సిఫార్సు చేసింది. మంగళవారం హైదరాబాద్ హజ్‌హౌస్‌లోని రాష్ట్ర వక్ఫ్ బోర్డు కార్యాలయంలో జరిగిన వక్ఫ్ బోర్డు పాలకమండలి సమావేశంలో సుమారు 37 అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకుంది. సమావేశం అనంతరం చైర్మన్ మహ్మద్ సలీం బోర్డు నిర్ణయాలను విలేకరులకు వెల్లడించారు. వక్ఫ్ బోర్డు ఆదాయ మార్గాల పెంపు కోసం ఆరు ఆస్తుల అభివృద్ధిపై ప్రధాన దృష్టి సారించి చర్చించినట్లు తెలిపారు. వక్ఫ్ ఆస్తుల పరిరక్షణ, అభివృద్ధి కోసం పలు నిర్ణయాలు తీసుకున్నట్లు వివరించారు. వక్ఫ్ ఆస్తుల కేసులపై హైకోర్టులో వాదించేందుకు సీనియర్ న్యాయవాదులను నియమిం చాలని నిర్ణయించినట్లు చెప్పారు. వక్ఫ్ బోర్డు ఆదాయం ఆబ్జెక్టివ్ ఆఫ్ వక్ఫ్ ప్రకారం వినియోగించాలని తీర్మానించినట్లు పేర్కొన్నారు. మసీదుల రోజువారీ వ్యవహారాల నిర్వహణ కోసం 15 పాలకమండళ్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. కొన్ని మసీదుల పాలకమండలి కాలపరిమితి కూడా పొడిగిస్తూ తీర్మానం చేశామన్నారు. బోర్డుకు ఇద్దరు రిటైర్డ్ తహసీల్దార్లను నియమించాలని నిర్ణయించామని పేర్కొన్నారు. ఈ పాలకమండలి సమావేశంలో సభ్యులైన సయ్యద్ షా అక్బర్ నిజామోద్దీన్ హుస్సేని, మీర్జా అన్వర్ బేగ్ తదితరులు పాల్గొన్నారు. -
ముస్లింలకు ఒరిగిందేమీ లేదు
సాక్షి, హైదరాబాద్: నాలుగేళ్ల టీఆర్ఎస్ పాలనలో ముస్లింలకు ఎలాంటి ప్రయోజనం కలగలేదని, ఎన్నికలకు ముందు కేసీఆర్ మైనార్టీలకు 12% రిజర్వేషన్ కల్పిస్తామని నమ్మించి ఓట్లు దండుకున్నాడని, రాబోయే ఎన్నికల్లో ముస్లింలు గుణపాఠం చెప్పడం ఖాయమని అల్‌ఇండియా సున్ని ఉలేమా బోర్డు రాష్ట్ర అధ్యక్షుడు మౌలానా హమీద్ హుస్సేన్ షుత్తరీ విరు చుకుపడ్డారు. బుధవారం డబీర్‌పురాలోని సంస్థ కార్యాల యంలో రాబోయే ఎన్నికలకు సున్ని ఉలేమా బోర్డు రూపొందించిన మేనిఫెస్టోను ఆయన విడుదల చేశారు. ఈ సందర్భంగా షుత్తరీ మాట్లాడుతూ, ప్రతి ఏటా మైనార్టీలకు కేటాయించే బడ్జెట్ నాలుగేళ్లలో ఏ సంవత్సరం కూడా 40% కంటే ఎక్కువ విడుదల కాలేదన్నారు. అధికారంలోకి వచ్చిన 4 నెలల్లో మైనార్టీలకు 12% రిజర్వేషన్ కల్పిస్తానని హామీఇచ్చిన కేసీఆర్ ప్రస్తుతం ఆ విషయాన్ని ఎందుకు ప్రస్తావించడం లేదని ప్రశ్నించారు. మజ్లిస్ పార్టీ ముస్లింల ప్రయోజనాలకోసం పాటుపడకుండా తమ వ్యక్తిగత ప్రయోజనాలకు కోసం పని చేస్తుందన్నారు. టీఆర్ఎస్, మజ్లిస్ పార్టీలతో ముస్లింల సంక్షేమం, అభివృద్ధి జరగలేదన్నారు. రాబోయే ఎన్నికల్లో ఏ సెక్యులర్ పార్టీ తాము ప్రతిపాదిస్తున్న అంశాలకు పూర్తి స్థాయిలో అంగీకరిస్తే అ పార్టీకి మద్ధతు ఇస్తామని తెలిపారు. వక్ఫ్ బోర్డులో జరుగుతున్న అక్రమాలపై రిటైర్డ్ న్యాయమూర్తితో విచారణ జరిపించాలని కోరారు. ముస్లింలకు సబ్ ప్లాన్ ఏర్పాటు చేయాలని, ఉర్దూ మీడియం స్కూళ్లు, కాలేజీల్లో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయుల, అధ్యాపకుల పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు తారీక్ ఖాద్రీ, అబ్దుల్ వాసే తదితరులు పాల్గొన్నారు. -
‘తాజ్‌మహల్‌ను షాజహాన్ మాకు రాసిచ్చారు’
సాక్షి, న్యూఢిల్లీ : ప్రపంచంలో ఏడో వింత, ప్రఖ్యాత కట్టడం తాజ్‌మహల్‌ను దాని నిర్మాత మొఘల్ చక్రవర్తి షాజహాన్ తమకు రాసిచ్చారని ఉత్తరప్రదేశ్ సున్నీ వక్ఫ్ బోర్డు వాదిస్తోంది. ఈ మేరకు ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా(ఏఎస్ఐ)తో సుప్రీంకోర్టులో పోరాడుతోంది. మంగళవారం సున్నీ వక్ఫ్ బోర్డు వాదనలు విన్న దేశ అత్యున్నత న్యాయస్థానం తాజ్‌మహల్‌ను షాజహాన్ సున్నీ బోర్డుకు రాసిచ్చిన పత్రాలను చూపాలని కోరింది. పత్రాలను కోర్టు ముందు ఉంచేందుకు వారం రోజుల పాటు గడువు ఇచ్చింది. భార్య ముంతాజ్‌పై తన ప్రేమకు గుర్తుగా షాజహాన్ తాజ్‌మహల్‌ను నిర్మించారు. 1658లో షాజహాన్ మరణించారు. తాజ్‌మహల్ వక్ఫ్ బోర్డుకు చెందుతుందని షాజహాన్ చేసిన డిక్లరేషన్ కాకుండా మరే ఆధారాలు ఉన్నా కోర్టు ముందు ప్రవేశపెట్టాలని సున్నీ బోర్డుకు సుప్రీంకోర్టు సూచించింది. తాజ్‌మహల్ వక్ఫ్ బోర్డుకు చెందుతుందంటే భారతదేశంలో ఎవరు నమ్ముతారు? అంటూ సున్నీ బోర్డును ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా ప్రశ్నించారు. ఇలాంటి కేసుల వల్ల విలువైన కోర్టు సమయం వృథా అవుతోందన్నారు. భారతదేశానికి స్వతంత్రం వచ్చిన అనంతరం తాజ్‌మహల్‌తో పాటు దేశ సాంస్కృతికను తెలియజెప్పే కట్టడాలను కాపాడే బాధ్యతను ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా తీసుకుంది. -
దర్గా భూములు సేకరించే ప్రతిపాదన వచ్చిందా?
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తున్న రిజర్వాయర్ కోసం నిజామాబాద్ మంచిప్పలోని దర్గాకు చెందిన భూముల సేకరణ విషయంలో ప్రభుత్వం నుంచి ప్రతిపాదన వచ్చిందో లేదో చెప్పాలని హైకోర్టు మంగళవారం వక్ఫ్‌బోర్డుకు స్పష్టం చేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ కొంగర విజయలక్ష్మితో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది. మంచిప్ప, కొండం చెరువులను కలుపుతూ నిర్మిస్తున్న రిజర్వాయర్ నిర్మాణం వల్ల నిజామాబాద్‌లో ఉన్న 400 సంవత్సరాల నాటి దర్గా ముంపునకు గురవుతోందని, ఈ దర్గా పరిరక్షణకు చర్యలు తీసుకునేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ హైదరాబాద్‌కు చెందిన స్వచ్ఛంద సంస్థ సొసైటీ ఫర్ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రెస్ అండ్ ఎంపవర్మెంట్ హైకోర్టులో పిల్ దాఖలు చేసింది. దీనిపై మంగళవారం విచారణ సందర్భంగా పిటిషనర్ తరఫు న్యాయవాది రచనారెడ్డి వాదనలు వినిపిస్తూ.. రిజర్వాయర్ కోసం దర్గాకు చెందిన భూములను ప్రభుత్వం సేకరిస్తోందని పేర్కొన్నారు. దీనిపై వక్ఫ్‌బోర్డ్‌కు, ముఖ్యమంత్రికి, కేంద్ర జల వనరుల సంఘానికి పిటిషనర్ వినతిపత్రాలు సమర్పించారని, అయితే ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. -
టీడీపీని నమ్ముకుంటే మోసం చేశారు
సాక్షి, అమరావతి: వక్ఫ్‌బోర్డు చైర్మన్‌గా జలీల్‌ఖాన్ నియామకంపై తెలుగుదేశం పార్టీ మైనార్టీ నాయకుల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. కడప జిల్లా టీడీపీ మైనార్టీ సెల్ అధ్యక్షుడిగా ఉన్న అమీర్‌బాబు వక్ఫ్‌బోర్డు డైరెక్టర్ పదవికి రాజీనామా చేశారు. అమీర్‌ను సోమవారం వక్ఫ్‌బోర్డు డైరెక్టర్‌గా సీఎం నియమించారు. 25 సంవత్సరాలుగా టీడీపీని నమ్ముకొని ఉంటే తనకు చైర్మన్ పదవి ఇవ్వకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు మోసం చేశారని ఆయన విమర్శించారు. జలీల్‌ఖాన్, ఇతర సభ్యులు ప్రమాణ స్వీకారం చేస్తున్న సమయంలో రాజీనామా పత్రాన్ని ఇచ్చి ఆయన వెళ్లిపోయారు. అనంతరం సీఎం చంద్రబాబును కలసి తన అసంతృప్తిని తెలియజేశారు. సీఎం వారించినా పట్టించుకోకుండా అమీర్‌బాబు వెళ్లిపోయినట్లు సమాచారం. అనంతపురం జిల్లాకు చెందిన టీడీపీ మాజీ ఎంపీ కేఎం సైఫుల్లా వక్ఫ్‌బోర్డు డైరెక్టర్ పదవికి రాజీనామా చేశారు. చైర్మన్ పదవిని ఆశించిన ఆయన అది రాకపోవడంతో రాజీనామా పత్రాన్ని జలీల్‌ఖాన్‌కు అందజేశారు. ముఖ్యమంత్రికి కూడా లేఖ పంపారు. ప్రస్తుతం ఆయన జాయింట్ పార్లమెంటరీ పార్టీ వక్ఫ్‌బోర్డు సబ్‌కమిటీ చైర్మన్‌గా ఉన్నారు. బాధ్యతలు స్వీకరించిన జలీల్ ఖాన్ రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్‌గా విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే జలీల్‌ఖాన్ ఎన్నికయ్యారు. ఆయనతో పాటు ఎన్నికైన మరో ఎనిమిది మంది సభ్యులు సోమవారం మధ్యాహ్నం పదవీ బాధ్యతలు స్వీకరించారు. బాధ్యతల స్వీకారం సందర్భంగా జలీల్‌ఖాన్ మీడియాతో మాట్లాడుతూ.. వక్ఫ్‌బోర్డు స్థలాల పరిరక్షణ కోసం నూతన విధానాన్ని ప్రవేశపెడతామన్నారు. -
టీడీపీని నమ్ముకుంటే మోసం చేశారు..
సాక్షి, అమరావతి : రాష్ట్ర వక్ఫ్ బోర్డ్ చైర్మన్‌గా జలీల్ ఖాన్ నియామకంపై తెలుగుదేశం పార్టీలోని మైనార్టీ నాయకులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తనకు వక్ఫ్ బోర్డ్ చైర్మన్ పదవి ఇవ్వకపోవడంపై టీడీపీ మైనార్టీ సెల్ అధ్యక్షుడు అమీర్ బాబు కలత చెందారు. 25 సంవత్సరాల నుంచి పార్టీని నమ్ముకుని ఉంటే, వక్ఫ్ బోర్డు చైర్మన్ పదవి ఇవ్వకుండా మోసం చేశారని ఆయన వ్యాఖ్యానించారు. వక్ఫ్ బోర్డు చైర్మన్, ఇతర డైరెక్టర్లు ప్రమాణ స్వీకారుం చేస్తుండగా అమీర్ మధ్యలోనే వెళ్లిపోయారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని కలిసి తన అసంతృప్తిని తెలియజేశారు. ముఖ్యమంత్రి వారించిన వినకుండా తనకు కేటాయించిన వక్ఫ్ బోర్డు డైరెక్టర్ పదవికి కూడా ఆయన రాజీనామా చేశారు. రాజీనామా లేఖను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి సమర్పించి, అక్కడి నుంచి వెళ్లిపోయారు. -
ఆడంబరాలపై ఆంక్షలు
సాక్షి, హైదరాబాద్: ముస్లింల పెళ్లంటే ఆడంబరాలతో అర్ధరాత్రి దాటాల్సిందే. హంగూ ఆర్భాటాల బరాత్‌తో పెళ్లికొడుకు ఫంక్షన్ హాల్‌కు చేరాలంటే రాత్రి 11.30 గంటలు కావాల్సిందే. తర్వాత నిఖా(పెళ్లి) ప్రక్రియ ముగిసేసరికి అర్ధరాత్రి 12 గంటలు దాటాల్సిందే. ఇక విందు భోజనాల్లో పలు రకాల బిర్యానీలు, చికెన్, స్వీట్ డిష్‌లు ఉండాల్సిందే. ఇదీ హైదరాబాద్‌లో తాజా పరిస్థితి. దీనిని కట్టడి చేసేందుకు తెలంగాణ వక్ఫ్‌బోర్డు పాలకమండలి ప్రత్యేక కార్యాచరణకు సిద్ధమైంది. ఇటీవల అర్ధరాత్రి వివాహ వేడుకలు, ఆర్కెస్ట్రాలతో పెద్ద ధ్వనులు, ’బరాత్’ల్లో ప్రమాదాలు, నగరవాసులకు కలుగుతున్న ఇబ్బందులు, ఆడంబరాలకు పోయి అప్పులపాలవుతున్న ఉదంతాలపై వక్ఫ్‌బోర్డు స్పందించింది. నిఖా ప్రక్రియ రాత్రి తొమ్మిది గంటలలోపు పూర్తి చేసేవిధంగా వక్ఫ్‌బోర్డు కార్యాచరణ రూపొందిస్తోంది. నిఖాకు సాయంత్రం ఐదు నుంచి రాత్రి 8 గంటల వరకు సమయపాలన నిర్దేశించనుంది. ఈ మేరకు పెళ్లిళ్లు జరిపించే ఖాజీలకు ఆదేశాలు జారీ చేయాలని యోచిస్తోంది. బిర్యానీ, స్వీట్‌తో సరి: పెళ్లి విందులో ఆడంబరాలకు వెళ్లకుండా బిర్యానీ, స్వీట్‌తో సరిపెట్టే విధంగా కట్టడి చేయాలని వక్ఫ్‌బోర్డు భావిస్తోంది. పెళ్లి విందంటే లక్షల రూపాయలతో కూడుకున్న ఖర్చు. పలు వెరైటీల బిర్యానీ, మటన్, చికెన్, స్వీట్, సూప్ డిష్‌లు వడ్డించడం సర్వసాధారణమైంది. దీంతో ఆయా కుటుంబాలు అప్పులపాలవుతున్నాయి. 12 గంటలకు ఫంక్షన్‌హాల్ మూసివేత బెంగళూరు, పుణే, మహారాష్ట్రల్లో పెళ్లి ఫంక్షన్హాల్లో రాత్రి 11.30 తర్వాత లైట్లు ఆర్పివేస్తారు. హైదరాబాద్‌లో మాత్రం తెల్లవారుజాము వరకు విందుభోజనాలు, ఇతర కార్యక్రమాలు కొనసాగుతూనే ఉంటాయి. ఇటీవల ఒక బరాత్‌లో కాల్పులు, మరో బరాత్‌లో తల్వార్ క్రీడ కారణంగా ఒకరు మృతి చెందారు. రాత్రి 12 దాటితే ఫంక్షన్ హాల్‌ను మూసివేసే విధంగా చర్యలు చేపట్టనుంది. నిఖా జరిపించే ఖాజీలు, మతపెద్దలతోపాటు పోలీసు ఉన్నతాధికారులతో 23న వక్ఫ్‌బోర్డు పాలకమండలి సమావేశం కానుంది. పెళ్లి వేడుకల సమయపాలన, వివాహ విందుపై సూచనలు, సలహాలు సేకరించాలని నిర్ణయించింది. ఇప్పటికే వక్ఫ్‌బోర్డు చైర్మన్ సలీం పాతబస్తీలోని పోలీసులతో సమావేశమయ్యారు. బరాత్‌లో కత్తులు, డ్రమ్ముల శబ్దాలను నిషేధించారు. -
‘వక్ఫ్’ రికార్డుల డిజిటైజేషన్‌కే సీలు
సాక్షి, హైదరాబాద్: వక్ఫ్ బోర్డు ఆస్తులను రక్షించే చర్యల్లో భాగంగానే వక్ఫ్ బోర్డు కార్యాలయంలో రికార్డులున్న గదులకు సీల్ వేశామని తెలంగాణ ప్రభుత్వం హైకోర్టుకు విన్నవించింది. మొత్తం కార్యాలయానికి సీల్ వేయలేదని, రికార్డులున్న గదులకే వేశామని వివరించింది. కార్యాలయంలో రికార్డులను సీజ్ చేసి, కార్యాలయానికి సీలు వేయడాన్ని సవాల్ చేస్తూ న్యాయవాది ఎం.ఎ.కె. ముఖీద్ దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ అభినంద్‌కుమార్ షావిలిల ధర్మాసనం గురువారం మరోసారి విచారించింది. వక్ఫ్ కార్యాలయం మొత్తానికి సీలు వేయలేదని, రోజువారీ విధుల నిర్వహణకు ఇబ్బంది లేదని అడ్వొకేట్ జనరల్ (ఏజీ) దేశాయ్ ప్రకాశ్‌రెడ్డి చెప్పారు. రికార్డుల డిజిటైజేషన్ నిమిత్తం ఈ చర్యలు తీసుకున్నామని, రికార్డుల క్రమబద్ధీకరణ, డిజిటైజేషన్‌ల కోసం ఆరుగురు అధికారులు పనిచేస్తున్నారని, రెండు వారాలపాటు ఈ ప్రక్రియ కొనసాగుతుందని తెలిపారు. వక్ఫ్ అధికారులతో ప్రభుత్వం చర్చించి, విధులకు ఆటంకం లేకుండా 14న మెమో ఇచ్చామని చెప్పారు. దేవుడి ఆస్తులకు రక్షణ కరువు వాదనల అనంతరం ధర్మాసనం స్పందిస్తూ.. ‘‘వక్ఫ్, దేవాదాయ ఆస్తులకు రక్షణ కొరవడుతోందని, వీటి రక్షణలో ప్రజా ప్రయోజనాలు ఉన్నాయని అభిప్రాయపడింది. ఈ వ్యాజ్యం లో వక్ఫ్ ఆస్తులు అన్యాక్రాంతం కాకుండా చర్యలుంటే మంచిదేనని పేర్కొంది. మణికొండలో ఆక్రమణలకు గురైంది వక్ఫ్ ఆస్తులేనని ధర్మాసనం గుర్తు చేసింది. రోజువారీ విధుల నిర్వహణకు సమస్యలు ఎదురైతే తమ దృష్టికి తీసుకు రావాలని పిటిషనర్‌కు సూచన చేసింది. విచారణ వచ్చే మంగళవారానికి (21వ తేదీకి) వాయిదా పడింది. -
‘అయోధ్య’పై వక్ఫ్, అఖాడా ఏకాభిప్రాయం
అలహాబాద్: అయోధ్యలో రామ మందిరం వివాదంపై అఖిల భారతీయ అఖాడా పరిషత్, యూపీ షియా వక్ఫ్‌బోర్డు మధ్య ఓ ఒప్పందంపై ఏకాభిప్రాయం కుదిరింది. ఈ ఒప్పందంపై ఇరుపక్షాలు సంతకాలు చేయగానే, ఆ వివరాలను సుప్రీంకోర్టుకు తెలపనున్నారు. ‘అయోధ్య లేదా ఫైజాబాద్‌లో మసీదు నిర్మించకూడదనే ఏకాభిప్రాయానికి వచ్చాం. ముస్లిం జనాభా అధికంగా ఉన్న ఏదేనీ ఇతర ప్రాంతంలో మసీదు నిర్మాణానికి మేం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపుతాం’ అని షియా వక్ఫ్‌బోర్డు చీఫ్ వసీం రిజ్వీ చెప్పారు. -
వక్ఫ్ బోర్డు కార్యాలయం సీజ్ అన్యాయం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ వక్ఫ్ బోర్డును సీజ్ చేయడాన్ని సవాల్ చేస్తూ ఉమ్మడి హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలైంది. వక్ఫ్ బోర్డు, అందులోని రికార్డులను ఈ నెల 8, 9 తేదీల్లో మైనార్టీ సంక్షేమ శాఖ, రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శులు, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ సీజ్ చేయడం చట్ట వ్యతిరేకమంటూ న్యాయవాది ఎం.ఎ.కె.ముఖీద్ పిల్ దాఖలు చేశారు. ఇందులో ఆ ముగ్గురు అధికారులతోపాటు తెలంగాణ వక్ఫ్ బోర్డు ముఖ్య కార్యనిర్వహణాధికారిని ప్రతివాదులుగా చేర్చారు. ఈ నెల 7న అర్ధరాత్రి నాంపల్లిలోని వక్ఫ్ బోర్డు కార్యాలయాన్ని, రికార్డులను అధికారులు సీజ్ చేయడం చట్ట వ్యతిరేకమని ప్రకటించాలని హైకోర్టును కోరారు. వక్ఫ్ బోర్డు యాక్ట్ ప్రకారం కార్యాలయం, రికార్డులు సీజ్ చేసే అధికారం ప్రభుత్వానికి లేదని, వక్ఫ్ బోర్డు పాలక మండలిని రద్దు చేసి ప్రత్యేక అధికారిని నియమించే అధికారం మాత్రమే ఉందన్నారు. -
తెలంగాణకు కొత్త వక్ఫ్ చట్టం
సాక్షి, హైదరాబాద్: కేంద్ర వక్ఫ్ చట్టానికి అనుగుణంగా తెలంగాణకు కొత్త వక్ఫ్ చట్టాన్ని రూపొందించాలని అధికారులను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆదేశించారు. రాష్ట్రంలోని వక్ఫ్ ఆస్తులన్నింటినీ వెంటనే గుర్తించి, వాటి రక్షణకు చర్యలు తీసుకోవాలని కోరారు. వక్ఫ్ భూములకు ప్రహరీ/కంచె నిర్మించాలని, వాటిని కలెక్టర్ల స్వాధీనంలో ఉంచాలని చెప్పారు. భూ రికార్డుల ప్రక్షాళనలో భాగంగా వక్ఫ్ భూములను గుర్తించి, రెవెన్యూ రికార్డుల్లో వివరాలు నమోదు చేయాలని సూచించారు. వక్ఫ్ ఆస్తుల పరిరక్షణకు తెలంగాణ వక్ఫ్ బోర్డు అధిక ప్రాధాన్యమివ్వాలని చెప్పారు. గురువారం ప్రగతి భవన్లో వక్ఫ్ బోర్డు సభ్యులతో సీఎం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తెలంగాణలో వక్ఫ్ ఆస్తులు ఎక్కుడున్నాయో, ఎలా ఉన్నాయో వెంటనే వివరాలు సేకరించాలని ఆదేశించారు. కబ్జాలకు గురైన వక్ఫ్ భూములను స్వాధీనం చేసుకునేందుకు వ్యూహం ఖరారు చేయాలని, ఈ విషయంలో ప్రభు త్వం అండగా ఉంటుందని వెల్లడించారు. రెవెన్యూ శాఖ, వక్ఫ్ బోర్డు మధ్య వివాదం ఉంటే వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. భూమి కాని, ఆస్తి కాని ఒకసారి వక్ఫ్ ఆస్తిగా నిర్ధారణ జరిగితే ఎప్పటికైనా వక్ఫ్ ఆస్తిగానే ఉంటుందని సీఎం అన్నారు. కలెక్టర్లు సహకరించాలి వక్ఫ్ ఆస్తుల రక్షణకు 2 కమిటీలు వేయాలని సీఎం సూచించారు. ఒక కమిటీ రికార్డుల నిర్వహణను, మరో కమిటీ క్షేత్రస్థాయిలో పర్యటించి ఆస్తులను గుర్తించి, రక్షించే చర్యలు పర్యవేక్షించాలని చెప్పారు. వక్ఫ్ భూముల రక్షణ విషయంలో పూర్తి స్థాయిలో సహకరించాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. వక్ఫ్ బోర్డు పనితీరు ఎలా ఉండాలో, బోర్డు విధి విధానాలు ఎలా ఉండాలో స్పష్టత రావాలని అభిప్రాయపడ్డారు. త్వరలోనే వక్ఫ్ బోర్డు విస్తృత స్థాయి సమావేశం నిర్వహించుకుని భవిష్యత్ కార్యాచరణను ఖరారు చేయాలని సూచించారు. సమావేశంలో వక్ఫ్ బోర్డు చైర్మన్ ఎండీ సలీం, సీఈఓ మన్నన్, ఎమ్మెల్యే అక్బరుద్దీన్, ప్రభుత్వ సలహాదారు ఏకే ఖాన్, మైనార్టీ శాఖ కార్యదర్శి ఉమర్ జలీల్, సీఎంవో కార్యదర్శులు స్మితా సబర్వాల్, భూపాల్‌రెడ్డి, బోర్డు సభ్యులు మజామ్ ఖాన్, అక్బర్ నిజాముద్దీన్, సయ్యద్ జకీరుద్దీన్, ఇక్బాల్, అన్వర్, నిసాన్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు. -
వక్ఫ్‌బోర్డుకు తాళం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర వక్ఫ్ బోర్డుకు తాళం పడింది. ఇటీవల మైనారిటీ సంక్షేమంపై సీఎం సమీక్షలో వక్ఫ్ భూమలపై అధికారులు చెప్పిన వివరాలకు ఆయన సంతృప్తి చెంద లేదు. బోర్డు అవినీతి అంశాన్ని సీఎం కేసీఆర్ సీరియస్‌గా తీసుకున్నారు. సీఎం ఆదేశాల మేరకు రెవెన్యూ అధికారులు రంగంలోకి దిగి కీలక రికార్డులను స్వాధీనం చేసుకుని, ఆయా విభాగాల గదుల న్నింటిని సీజ్ చేశారు. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో వక్ఫ్ బోర్డు కార్యకలాపాలపై పూర్తిగా ఆరా తీయాలన్న కేసీఆర్ ఆదేశాలతో రెవెన్యూ అధికారులు మంగళవారం అర్ధరాత్రి నుంచి తనిఖీలు చేపట్టారు. హైదరాబాద్ జిల్లా కలెక్టర్ యోగితా రాణా, రెవెన్యూ డివిజన్ అధికారి చంద్రకళ, డిప్యూటీ సీఎం ఓఎస్డి అసదుల్లా, పలువురు మండల రెవెన్యూ అధికారులతో హైదరాబాద్ హజ్‌హౌస్‌లోని వక్ఫ్‌బోర్డు కార్యాలయంపై ఆకస్మిక దాడి చేశారు. బుధవారం తెల్లవారుజామున 3 గంటల వరకు రికార్డులను పరిశీలించి.. వాటిని స్వాధీనం చేసుకున్నారు. తిరిగి బుధవారం ఉదయం 9 నుంచి సాయంత్రం 6 గంటల వరకు రెవెన్యూ డివిజన్ అధికారి కె.చంద్రకళ ఆధ్వర్యంలో అధికారుల బృందం హజ్ హౌస్‌లోని వక్ఫ్‌బోర్డు విభాగాల్లోని రికార్డులను పరిశీలించి.. ఎక్కడికక్కడే సీజ్ చేసింది. వక్ఫ్‌బోర్డు సీఈవో, చైర్మన్ గదులు వదిలి పెట్టి మిగతా వక్ఫ్ బోర్డు రికార్డు విభాగంతో పాటు గణాంకాల, కంప్యూటర్, పరిపాలన, వివాహాల రిజిస్ట్రేషన్, జిల్లా ల్యాండ్ రికార్డుల విభాగం గదులన్నింటినీ రెవెన్యూ అధికారులు సీల్ చేసి ముద్ర వేశారు. దీంతో వక్ఫ్‌బోర్డు కార్యకలాపాలు పూర్తిగా స్తంభించిపోయాయి. వక్ఫ్ భూముల స్వాహా: కోట్లాది విలువైన వేలాది ఎకరాల వక్ఫ్ భూములు స్వాహాకు గురయ్యాయి. దేవుడి భూములను పర్యవేక్షించాల్సిన వక్ఫ్ అధికారుల అండదండలతో ముతవల్లిలు దర్జాగా దందా సాగించారు. అక్రమంగా భూముల విక్రయం, లీజు, నిర్మాణాల పేరుతో కోట్లాది రూపాయల ఆదాయాన్ని దిగమింగారు. దర్గా, మసీదు, ఆశ్రుఖానా, చిల్లాల స్థలాలతో పాటు శ్మశాన వాటికల స్థలాలు సైతం వదలకుండా స్వాహా చేశారు. వక్ఫ్ చట్టాలు, నోటీసుల జారీ కాగితాలకే పరిమితమవడంతో అక్రమార్కులకు అడ్డూ అదుçపూ లేకుండా పోయింది. 57,423.91 ఎకరాల భూమి అన్యాక్రాంతం: రాష్ట్రంలో వక్ఫ్‌బోర్డుకు సంబంధిం చిన సుమారు 74 శాతం భూమి ఆక్రమణకు గురైనట్లు అధికార లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. వక్ఫ్ పరిధిలోని 33,929 సంస్థలకు ఉన్న 77,538.07 ఎకరాల భూమిలో 57,423.91 ఎకరాల భూమి కబ్జాకు గురైంది. అధికంగా ఉమ్మడి మెదక్, రంగారెడ్డి, ఆదిలాబాద్, హైదరాబాద్ జిల్లాల్లో వక్ఫ్ భూములు అన్యాక్రాంతమయ్యాయి. కాగా, రాష్ట్ర వక్ఫ్ బోర్డులో అక్రమాలకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ మైనార్టీ డిపార్ట్మెంట్ గ్రేటర్ అధ్యక్షుడు అబ్దుల్లా సొహెల్ ఆధ్వర్యంలో పార్టీ నేతలు ముందు ధర్నా చేశారు. సీఎం వక్ఫ్ రికార్డులను సీజ్ చేయడాన్ని స్వాగతిస్తున్నామని, ఈ అక్రమాలపై సీఐడీతో విచారణ జరపాలని డిమాండ్ చేశారు. -
కొద్ది దూరంలో మసీదు నిర్మించొచ్చు
అయోధ్య కేసు పరిష్కారానికి సుప్రీంకోర్టుకు వక్ఫ్‌బోర్డు సూచన న్యూఢిల్లీ: అయోధ్యలో రామ మందిరం–బాబ్రీ మసీదు సమస్యకు పరిష్కారంగా వివాదాస్పద స్థలానికి కొంచెం దూరంలో మసీదును నిర్మించవచ్చని ఉత్తరప్రదేశ్ షియా కేంద్ర వక్ఫ్‌బోర్డు మంగళవారం సుప్రీంకోర్టుకు తెలిపింది. అలాగే బాబ్రీ మసీదు స్థలాన్ని సున్నీ వక్ఫ్‌బోర్డు తమదని చెప్పుకుంటుండటాన్ని షియా వక్ఫ్‌బోర్డు వ్యతిరేకించింది. సుప్రీంకోర్టుకు సమర్పించిన అఫిడవిట్లో దీనిని ప్రస్తావిస్తూ మసీదు స్థలం తమదేననీ, వివాదాన్ని సామరస్యంగా పరిష్కరించుకునేందుకు చర్చలు జరిపే హక్కు తమకే ఉందని షియా వక్ఫ్‌బోర్డు పేర్కొంది. కొత్తగా నిర్మించే మసీదు, ఆలయం తగినంత దూరంలో ఉండాలనీ, ప్రార్థనా స్థలాల్లో ఒకమతం వారు వాడే లౌడ్ స్పీకర్ల వల్ల మరో మతం వారికి ఇబ్బంది ఉండకూడదని వక్ఫ్‌బోర్టు కోర్టుకు విన్నవించింది. రామ జన్మభూమి–బాబ్రీ మసీదు కేసులో వివాదాస్పద 2.77 ఎకరాల స్థలాన్ని మూడు భాగాలుగా సున్నీ వక్ఫ్ బోర్డు, నిర్మోహి అఖారా, రామ మందిరాలకు పంచుతూ అలహాబాద్ హైకోర్టు 2010లో తీర్పు ఇచ్చింది. ఈ తీర్పును సవాలు చేస్తూ పలు పిటిషన్లు సుప్రీంకోర్టులో దాఖలయ్యాయి. ఏళ్ల నుంచి అపరిష్కృతంగా ఉన్న ఈ పిటిషన్లను త్వరగా విచారించాలని బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి సుప్రీంకోర్టును గతంలో కోరారు. దీంతో పిటిషన్లపై విచారించేందుకు జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ ఎస్ఏ నజీర్‌తో కూడిన త్రిసభ్య ధర్మాసనాన్ని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేఎస్ ఖేహర్ ఇటీవల నియమించారు. -
వక్ఫ్‌బోర్డు బలోపేతానికి సహకరిద్దాం
– స్వాధీనం చేసుకున్న భూములకు పరిహారం ఇప్పించండి – దుల్హన్ పథకం కింద జిల్లాకు రూ.5కోట్లు – రాష్ట్ర్ర మైనార్టీ సంక్షేమ శాఖ కమిషనర్ ఆదేశాలు కర్నూలు (అగ్రికల్చర్): వక్ఫ్‌బోర్డు భూములను వివిధ అవసరాలకు తీసుకున్నందున వాటికి రైతులతో సమానంగా పరిహారాన్ని వక్ఫ్‌బోర్డుకు చెల్లించాలని రాష్ట్ర మైనార్టీ సంక్షేమ శాఖ కమిషనర్ షేక్ మహమ్మద్ ఇక్బాల్ రెవెన్యూ అధికారులను ఆదేశించారు. బుధవారం వక్ఫ్‌భూముల పరిరక్షణ, మైనార్టీల సంక్షేమం తదితర అంశాలపై కలెక్టరేట్ సమావేశ మందిరంలో çసమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో వక్ఫ్‌భూములు 23వేల ఎకరాలు ఉండగా 5వేల ఎకరాలు అన్యాక్రాంతమైందని, మిగిలిన 18 వేల ఎకరాలను కాపాడుకోవాల్సిన అవసరముందన్నారు. ఓర్వకల్లు ఇండస్ట్రియల్ పార్కులో 430 సర్వే నెంబరులో వక్ఫ్‌ల్యాండ్‌ను ప్రభుత్వం ఇతర అవసరాలకు కేటాయించిందని ఆ ప్రాంతంలో ఎకరాకు రూ.13 లక్షల ప్రకారం పరిహారం ఇచ్చినందున వక్ఫ్‌భూములకు కూడా ఇదే తరహాలో చెల్లించేలా చర్యలు తీసుకోవాలని కర్నూలు ఆర్డీఓకు సూచించారు. మునగాలపాడు సమ్మర్ స్టోరేజ్ ట్యాంకు నిర్మాణం కోసం వక్ఫ్ ల్యాండ్ తీసుకున్నారని వీటికి పరిహారం ఇప్పించాలని తెలిపారు. కల్లూరులోని సర్వే నెంబరు 532లోని 22.75 ఎకరాల భూమికి వీకర్‌సెక్షన్ కాలనీ కోసం, నంద్యాలలోని కుందూ నదిలో సర్వే నెం.914లోని 3.25 ఎకరాలు ప్రభుత్వం ఇతర అవసరాలకు తీసుకుందని వీటికి పరిహారం ఇప్పించాలని సూచించారు. అనంతరం మైనార్టీల సంక్షేమానికి తీసుకుంటున్న చర్యలను వివరించారు. దుల్హన్ పథకానికి రూ.5కోట్లు విడుదల చేస్తూ ప్రొసీడింగ్ ఇచ్చారు. సమావేశంలో వక్ఫ్‌బోర్డు సీఈఓ ఖాదర్, జిల్లా రెవెన్యూ అధికారి గంగాధర్‌గౌడ్, మైనార్టీ సంక్షేమ అధికారి షేక్ మస్తాన్ వలి, కర్నూలు, నంద్యాల ఆర్డీఓలు హుసేన్ సాహెబ్, రామసుందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
30 ఏళ్ల పాటు వక్ఫ్‌బోర్డు ఆస్తుల లీజు
- వక్ఫ్‌బోర్డు అధీనంలో నాంపల్లి దర్గా హుండీ - వారం పద్ధతిపై జాన్పాడ్ దర్గా హుండీ వేలం - వక్ఫ్‌బోర్డు ఆధ్వర్యంలో ఆస్పత్రి నిర్మాణం సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర వక్ఫ్‌బోర్డు ఆదాయ వనరులు పెంచుకునేందుకు 11 రకాల ఆస్తులను 30 ఏళ్ల పాటు లీజుకు ఇవ్వా లని రాష్ట్ర వక్ఫ్‌బోర్డు పాలక మండలి సమా వేశం తీర్మానించింది. సోమవారం హైదరా బాద్ హజ్‌హౌస్‌లో బోర్డు చైర్మన్ మహ్మద్ సలీమ్ అధ్యక్షతన జరిగిన పాలక మండలి సమావేశంలో పలు కీలకమైన నిర్ణయాలు తీసుకుంది. హైదరాబాద్ నాంపల్లిలోని దర్గా యూసుఫైన్ ముతవల్లి పదవీకాలం పొడిగిం పును రద్దు చేస్తూ దర్గా హుండీని వక్ఫ్‌బోర్డు అధీనంలోకి తీసుకోవాని నిర్ణయించింది. వక్ఫ్‌బోర్డు ఆస్తులపై హోర్డింగ్‌ల ఏర్పాటును రద్దు చేసింది. నల్లగొండ జిల్లాలోని హజరత్ జాన్పాడ్ దర్గా హుండీ వారం పద్ధతిపై వేలం వేయాలని, బడా పహాడ్, జహంగీర్ పీరా హుండీలకు టెండర్ పిలవాలని నిర్ణయిం చింది. గుట్టల బేగంపేటలోని ఆస్తులను పూర్తి స్థాయి వక్ఫ్‌బోర్డు నిర్వహణలోకి తీసుకుంటూ తీర్మానించింది. వక్ఫ్‌బోర్డు ద్వారా వితంతు వులు, వృద్ధులకు పెన్షన్ ఇవ్వాలని నిర్ణయిం చింది. సీఎంతో చర్చించి రాష్ట్ర వక్ఫ్‌బోర్డు ఆధ్వర్యంలో ఆస్పత్రి నిర్మాణం చేపట్టాలని నిర్ణయించింది. వక్ఫ్‌బోర్డులో పనిచేస్తున్న 70 ఏళ్లు దాటిన వారి సేవలను రద్దు చేస్తూ ఇటీవల పదవీ విరమణ చేసిన ముగ్గురి పదవీ కాలాన్ని పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ సమావేశంలో పాలకమండలి సభ్యులు సయ్యద్ అక్బర్ నిజాముద్దీన్, మిర్జా అన్వర్ బేగ్, వహీద్ అహ్మద్, డాక్టర్ నాసిర్ హుస్సేన్, మల్లిక్ మోతసమ్ ఖాన్, సోఫియా బేగం తదితరులు పాల్గొన్నారు. -
రాష్ట్ర వక్ఫ్‌బోర్డు సీఈవోపై వేటు
అభియోగాలతో మాతృ సంస్థకు సరెండర్ సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర వక్ఫ్‌బోర్డు పాలకవర్గం తొలి సమావేశం చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈవో)పై వేటు వేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. సీఈవో అసదుల్లాపై పలు అభియోగాలు మోపుతూ మాతృ సంస్థ రెవెన్యూ శాఖకు సరెండర్‌చేస్తూ తీర్మానించింది. తాత్కాలిక సీఈఓగా జియావుద్దీన్ ఘారీని నియమించింది. బోర్డు నిర్ణయంపై డిప్యూటీ సీఎం మహమూద్ అలీ సీరియస్ అయ్యారు. ప్రభుత్వ పరిధిలోని సీఈవో అంశంపై నిర్ణయం తీసుకోవడాన్ని ఆయన తీవ్రంగా పరిగణించినట్లు తెలుస్తోంది. ఎజెండాలో లేకుండానే..: వక్ఫ్ బోర్డు పాలకవర్గం సరిగ్గా పక్షం రోజుల క్రితం కొలువు తీరింది. బోర్డు ఇన్చార్జిగా వ్యవహరించిన కాంపిటెంట్ అథారిటీకీ గల అధికారాలను ఉపసంహరించి చైర్మన్‌కు అప్పగించే ఎజెండాతో పాలకవర్గం తొలిసారిగా సమావేశమైంది. సమావేశం ప్రార ంభం కాగానే అధికారులు నేరుగా బోర్డు సీఈవో అసదుల్లాపై దర్గా షరీఫ్ హుండీ వేలం, ఇన్చార్జి ముతవల్లీలు, సిబ్బంది నియామకం తదితర అభియోగాలు మోపుతూ సస్పెన్షన్ చేయడంతో పాటు ఎఫ్ఐఆర్ నమోదు చేయాలనే ప్రతిపాదన ప్రవేశపెట్టారు. దీన్ని వ్యతిరేకిస్తూ ఓ సభ్యుడు సమావేశాన్ని బహిష్కరించి బయటకు వెళ్లిపోగా... మరొక సభ్యుడు తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో కొంత వెనక్కి తగ్గి సీఈవోను మాతృ సంస్థకు సరెండర్ చేయాలని తీర్మానించారు. -
సీబీఐ విచారణకు ఆదేశించండి
వక్ఫ్ బోర్డు అక్రమాలపై నేడు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్న రాష్ట్ర మైనార్టీ కమిషన్ సాక్షి, హైదరాబాద్: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని వక్ఫ్‌బోర్డు ఆస్తులు, భూముల అన్యాక్రాంతం, అక్రమ బదలాయింపులు, అధికార దుర్వినియోగాలపై సీబీఐ విచారణకు ఆదేశించాలని కోరుతూ హైకోర్టును రాష్ట్ర మైనార్టీ కమిషన్ ఆశ్రయించనుంది. ఈ మేరకు సోమవారం హైకోర్టులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కార్యదర్శులు, వక్ఫ్‌బోర్డు, సీఈవోలతో పాటు సుమారు 11 మందిని ప్రతివాదులుగా చేర్చుతూ రాష్ట్ర మైనార్టీ కమిషన్‌తో పాటు వ్యక్తిగతంగా చైర్మన్ అబిద్ రసూల్ ఖాన్ రిట్ పిటిషన్ దాఖలు చేయనున్నారు. ఉమ్మడి రాష్ట్రాల నుంచి వక్ఫ్ బోర్డు ఆస్తులు, భూముల అన్యాక్రాంతం, దుర్వినియోగం, వేలాది ఎకరాల అక్రమ బదలాయింపులు, తదితర అక్రమాలపై కమిషన్‌కు పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందినట్లు పిటిషన్లో పేర్కొన్నారు. వాటిలో మచ్చుతునకగా 15 కేసులను పరిగణనలోకి తీసుకొని విచారణ జరిపించగా.. భారీగా అక్రమాలు, కుంభకోణాలు వెలుగు చూశాయని పిటిషన్లో పేర్కొన్నారు. రెండు రాష్ట్రాల్లో 40 శాతానికి పైగా వక్ఫ్ ఆస్తులు అన్యాక్రాంతం అయినట్లు తేలిందన్నారు. వక్ఫ్‌బోర్డు భూములు, ఆస్తుల అక్రమాలపై సమగ్ర విచారణ జరిపించి అక్రమార్కులపై చర్యలకు సిఫార్సులు చేసే విధంగా సీబీఐని ఆదేశించాలని పిటిషన్లో కమిషన్ విజ్ఞప్తి చేసింది. లేకుంటే మిగతా ఆస్తులు, భూములు కూడా అన్యాక్రాంతమయ్యే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. -
జూన్ 2లోగా రెండు వక్ఫ్ బోర్డులు