బేల : వక్ఫ్ భూముల కోసం మండలకేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలోని అంతరాష్ట్రరోడ్డుపై గురువారం స్థానిక జామా మసీదు కమిటీ ఆధ్వర్యంలో ధర్నా చేశారు. వక్ఫ్ భూములను తమకు అప్పగించడంలో వక్ఫ్ బోర్డు జిల్లా ఇన్‌స్పెక్టర్, త హశీల్దార్‌లు పట్టింపులేనట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ వారికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా మండల కో ఆప్షన్ సభ్యుడు తన్వీర్‌ఖాన్, కమిటీ సభ్యులు మాట్లాడారు. ఎనిమిదేళ్లుగా స్థానిక జామా మసీదు నిర్వహణను పట్టించుకోని నవాబొద్దీన్ వక్ఫ్ భూములను తన స్వాధీనంలో ఉంచుకున్నాడని ఆరోపించారు.
విలువైన ఈ భూములను కమిటీకి అప్పగిస్తానని గతంలో రాత పూర్వకంగా రాసిచ్చి ఆ తర్వాత నిరాకరిస్తున్నాడని పేర్కొన్నారు. కోర్టు ఈ భూములను కమిటీకి అప్పగించాలనీ తీర్పు ఇచ్చినా ఆయన స్పందించడం లేదని పేర్కొన్నారు. వెంటనే ఈ భూములను జామా మసీదు మసాబ్ కమిటీకి అప్పగించాలని, లేని పక్షంలో నిరాహార దీక్ష చేపడతామని హెచ్చరించారు. ధర్నా వద్దకు చేరుకున్న త హశీల్దార్, ఆందోళనకారులను సముదాయించారు. సమస్య ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఆందోళ నలో కమిటీ సభ్యులు అబ్ధుల్ సలీం, హపీజ్, మసూద్ హైమద్, బబన్, ముస్తాక్, షకీల్‌ఖాన్, సిరాజ్ తదితరులు పాల్గొన్నారు.
వక్ఫ్ భూముల కోసం రాస్తారోకో
Published Fri, Nov 21 2014 3:00 AM | Last Updated on Sat, Sep 2 2017 4:49 PM
Advertisement