
సాక్షి, గద్వాల: జోగులాంబ గద్వాలలోని కేటిదొడ్ది మండలం ఇర్కిచేడులో ఉద్రిక్తత చోటుచేసుకుంది. బీఆర్ అంబేడ్కర్ విగ్రహ ఆవిష్కరణలో రెండు వర్గాల మధ్య వివాదం తలెత్తింది. ఈ క్రమంలో ఓ వర్గం వ్యక్తులు అంబేడ్కర్ విగ్రహానికి నిప్పంటించారు. ఈ సందర్బంలో ఇరు వర్గాలను చెదరగొట్టే క్రమంలో ఎస్‌ఐకి మంటలు అంటుకున్నాయి. దీంతో ఆయన తీవ్రంగా గాయపడినట్టు సమాచారం. ఈ నేపధ్యంలో పోలీసులు మోహరించి ఇరు వర్గాలను చెదరగొట్టారు. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment