Jogulamba Gadwal
-
జోగులాంబ గద్వాల జిల్లాలో బీఆర్ఎస్ పార్టీకి షాక్
-
గద్వాల యువతి బలవన్మరణంలో ట్విస్ట్
క్రైమ్: జోగులాంబ గద్వాల్ జిల్లా ధరూర్‌లో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. నర్సింగ్ విద్యార్థిని ఆత్మహత్య ఉదంతంలో ట్విస్ట్ చోటు చేసుకుంది. ఆమె కడుపు నొప్పితో బలవన్మరణానికి పాల్పడలేదని.. ప్రియుడి మోసం భరించలేకే అఘాయిత్యానికి పాల్పడిందని తేలింది. ధరూర్ మండల కేంద్రానికి చెందిన సునంద(23) డిగ్రీ పూర్తి చేసి.. హైదరాబాద్‌లో ఓ ప్రైవేట్ నర్సింగ్ కాలేజీలో చదువుతోంది. తాజాగా సొంతూరికి వెళ్లిన ఆమె.. ఇంట్లోనే ఉరేసుకుని అఘాయిత్యానికి పాల్పడింది. గమనించిన కుటుంబ సభ్యులు గద్వాల ఏరియా ఆస్పత్రికి తరలించగా.. అక్కడే ఆమె చికిత్స పొందుతూ కన్నుమూసింది. పోస్ట్‌మార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించి.. ఆత్మహత్య చేసుకుందని పోలీసులు ప్రకటించారు. అయితే.. సునంద తొలుత కడుపు నొప్పి భరించలేక ఆత్మహత్య చేసుకుందనే ప్రచారం నడిచింది. కానీ, ప్రియుడి ఆ మోసం భరించలేకే ఆమె ఆత్మహత్యకు పాల్పడిందని తర్వాత తేలింది. అంతేకాదు.. ఆ విషయం బయటకు పొక్కకుండా ఉండేందుకు గ్రామ పెద్దలు పంచాయితీ పెట్టి.. రూ.9 లక్షలను యువతి తరపు బంధువులకు ఇచ్చేందుకు ముందుకొచ్చినట్లు వెలుగులోకి వచ్చింది. యువతి బంధువులను గ్రామ పెద్దలు బలవంతంగా ఒప్పించారని.. ఈ వ్యవహారంలో పోలీసులకు వాటా ఉన్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సునందకు న్యాయం చేయాలని పలువురు ఆందోళనకు సిద్ధమవుతున్నారు. ఇక ఈ ఆరోపణలపై పోలీసులు స్పందించాల్సి ఉంది. ఇదీ చదవండి: అదే పనిగా భర్త నైట్‌షిఫ్ట్ వెళ్తున్నాడని.. -
విషాదం.. కొడుకు పుట్టినరోజే.. తండ్రి ఆత్మహత్య..
ఉండవెల్లి: కొడుకు జన్మించిన రోజే ఓ తండ్రి బలవన్మర ణానికి పాల్పడ్డాడు. ఈ విషాదకర ఘటన జోగుళాంబ గద్వాల జిల్లా ఉండవెల్లిలో చోటు చేసు కుంది. ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్న రాజు (29)కు కొన్నేళ్ల క్రితం గీతతో వివాహమైంది. వారిద్దరికి పాప, కుమారుడు ఉండగా.. ఆదివారం మూడో సంతానంగా మగ బిడ్డ అలంపూర్ ప్రభుత్వ ఆస్పత్రిలో జన్మించాడు. కుమారుడిని చూసి వచ్చిన రాజు.. మధ్యాహ్నం వేళ ఇంట్లోనే ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియడం లేదని అతని తల్లిదండ్రులు, స్థానికులు చెబుతున్నారు. మనిషికి ఉండేది ఒక్కటే జీవితం. ఆత్మహత్య అన్ని సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com చదవండి: జైలు నుంచి బయటకొచ్చిన నిహారిక -
కుక్కల పరుగు పందెం.. మామూలుగా లేదుగా!
అయిజ(జోగుళాంబ గద్వాల జిల్లా): అయిజలోని తిక్కవీరేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం అంతర్రాష్ట్ర శునకాల పరుగు పోటీ నిర్వహించారు. పోటీలో వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన 9 కుక్కలు పాల్గొనగా.. అన్ని బహుమతులను కర్ణాటక రాష్ట్రానికి చెందిన శునకాలు కైవసం చేసుకోవడం విశేషం. ఇండి జిల్లాకు చెందిన వీఐపీ లల్యా ప్రథమ బహుమతిగా రూ.15,016, సుల్తాన్ ద్వితీయ బహుమతిగా రూ.10,016, తేజకళ్ల తృతీయ బహుమతిగా రూ.8,016, బాపురం జిల్లాకు చెందిన అంజి నాలుగో బహుమతిగా రూ.5,016 గెలుపొందాయి. పోటీలను తిలకించేందుకు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వేలాదిమంది తరలివచ్చారు. చదవండి: బాబా ముసుగులో ‘నిత్య’ పెళ్లికొడుకు -
ఛార్జింగ్‌లో ఉన్న మొబైల్ తీస్తుండగా షాక్ తగిలి చిన్నారి మృతి
సాక్షి, గద్వాల్: జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఛార్జింగ్‌లో ఉన్న మొబైల్ ఫోన్ తీస్తుండగా షాక్ తగిలి నిహారిక అనే చిన్నారి అక్కడికక్కడే మృతిచెందింది. అయిజ మండలం ఈడిగొనిపల్లి గ్రామంలో మంగళవారం ఈ ఘటన జరిగింది. కాగా పదేళ్ల నిహారిక 4వ తరగతి చదువుతుంది. కూతురు అకస్మిక మరణంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. కాగా ఇటీవల కాలంలో ఎలక్ట్రిక్ పరికరాలు ప్రమాదకరంగా మారుతున్నాయి. సెల్ఫోన్లు, ఈ-వాహనాలు పేలుతున్న ఘటనలు అధికంగా జరుగుతున్నాయి. కొన్ని సంఘటనల్లో ప్రాణాలు కోల్పోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ క్రమంలో చార్జింగ్ పెట్టి ఫోన్ మాట్లాడవద్దని, పిల్లలను వీటికి దూరంగా ఉంచాలని నిపుణులు సూచిస్తున్నారు. చదవండి: మల్లారెడ్డి ఆదాయాలపై ఐటీ విచారణ: 13 మంది హాజరు.. మరో 10 మందికి నోటీసులు -
జోగులాంబ గద్వాల్ జిల్లాలో దారుణం..
-
దేవీ శరన్నవరాత్రులు: అమ్మవారికి రూ.5,55,55,555తో అలంకారం
దేవీ శరన్నవరాత్రోత్సవాలతో ఆధ్యాత్మికశోభ వెల్లివిరుస్తోంది. వేడుకల్లో భాగంగా ఐదో రోజు శుక్రవారం అలంపూర్ జోగుళాంబ, బాసర సరస్వతి, శ్రీశైలం భ్రమరాంబ అమ్మవార్లు స్కందమాతగా దర్శనమిచ్చారు. విజయవాడ కనకదుర్గను, వరంగల్ భద్రకాళిదేవిని శ్రీలలితాత్రిపుర సుందరిగా అలంకరించారు. – జోగుళాంబ శక్తిపీఠం(గద్వాల జిల్లా)/ హనుమకొండ కల్చరల్/ బాసర(ముథోల్) దేవీశరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మహబూబ్‌నగర్‌లోని వాసవి కన్యకాపరమేశ్వరి ఆలయంలో అమ్మవారిని మహాలక్ష్మి దేవి రూపంలో అలంకరించారు. రూ.5,55,55,555.55(5 కోట్ల 55 లక్షల 55 వేల 555 రూపాయల 55 పైసలు)ల కరెన్సీ నోట్లతో అలంకరించి పూజలు చేశారు. – స్టేషన్ మహబూబ్‌నగర్ -
జలమే గరళమై! గద్వాలలో ఘోరం.. 100 మందికి అస్వస్థత, ఇద్దరు మృతి
గద్వాల రూరల్: కలుషిత తాగునీరు ఇద్దరి ప్రాణాలను బలితీసుకున్న ఘటన బుధవారం జోగుళాంబ గద్వాల జిల్లా కేంద్రంలో చోటుచే సుకుంది. గద్వాల పట్టణం 12వ వార్డుకు చెందిన వేదనగర్, గంటగేరి, ధరూరుమెట్టు, కృష్ణారెడ్డి బంగ్లా కాలనీల్లో మూడు రోజుల కిందట తాగునీరు కలుషితమై పలువురు వాంతులు, విరేచనాలతో అస్వస్థతకు గురయ్యారు. ఈ క్రమంలో గంటగేరికి చెందిన కృష్ణ (50), మంగలి నర్సింగమ్మ (59) సైతం వాంతులు విరేచనాలతో గద్వాల జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి లో చేరారు. చదవండి👉🏾వణుకు పుట్టిస్తున్న డెంగీ.. పెరుగుతున్న డయేరియా కృష్ణ పరిస్థితి విషమంగా మారడంతో స్థానికంగా ఉండే ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అయినా పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో కర్నూలుకు రిఫర్ చేశారు. దీంతో బుధవారం ఆస్పత్రికి తీసుకెళుతుండగా మార్గమధ్యలో గుండెపోటు రావడంతో మృతి చెందాడు. అలాగే ఈ నెల 4 నుంచి జిల్లా ఆస్ప త్రిలో మంగలి నర్సింగమ్మ చికిత్స పొందుతు న్న క్రమంలో బుధవారం ఆమె పరిస్థితి విష మించడంతో కర్నూలులోని ఓ ప్రైవేట్ ఆస్ప త్రిలో చేర్పించారు. అక్కడే చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది. మృతులిద్దరూ పక్క పక్క వీధుల వారే కావడంతో ఆ కాలనీలో విషాదం నెలకొంది. కాగా, 12వ వార్డులోని 4 కాలనీల్లో వాంతులు, విరేచనాలతో 3 రోజు లుగా ప్రభుత్వ జిల్లా ఆస్పత్రిలో 24 మంది చికిత్స పొందుతున్నారు. గద్వాల ప్రైవేట్ ఆస్ప త్రుల్లో 70–75 మంది చికిత్స తీసుకుంటుండగా వారిలో 20 మంది చిన్నారులు ఉన్నారు. చదవండి👉🏾తాగేనీళ్లు లేకున్నా..మద్యం ఏరులై పారుతోంది కలుషిత నీటితోనే.. ఈ నెల 4న వాంతులు, విరేచనాలతో బాధపడుతున్న కేసులు గుర్తించాం. వెంటనే వైద్యులతో కూడిన ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి కలుషిత నీటి ప్రభావానికి గురైన కాలనీలో సర్వే చేపట్టాం. మృతి చెందిన ఇద్దరూ వాంతులు, విరేచనాల బారినపడినవారే. అయితే వారికి ఇతర అనారోగ్య సమస్యలు ఉండటంతో వైద్యం అందించే సమయంలో ఆరోగ్య పరిస్థితి క్షీణించి మృతి చెందారు. అస్వస్థతకు గురైన వారి నుంచి రక్తనమూనాలతోపాటు వారు వినియోగించే నీటి నమూనాలు సేకరించాం. నివేదిక వచ్చాక పూర్తి వివరాలు తెలుస్తాయి. ప్రాథమికంగా ఇలాంటి కేసులు నీటి కలుషితం కారణంగానే తలెత్తుతాయి. – చందూ నాయక్, డీఎంహెచ్ఓ, గద్వాల -
ప్రాణం పోయింది... పరీక్షల్లో ఉత్తీర్ణుడయ్యాడు!
పెబ్బేరు: ఉన్న ఒక్కగానొక్క కొడుకు బాగా చదివి ఉన్నత స్థాయికి ఎదుగుతాడని ఆ తల్లిదండ్రులు ఆశ పడ్డారు. కానీ 16ఏళ్ల ప్రాయంలోనే కొడుకు అర్ధాంతరంగా కన్నుమూశాడు. తాజాగా పదో తరగతి పరీక్ష ఫలితాల్లో ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణుడ వ్వడంతో కుటుంబం కంటికి పుట్టెడుగా శోకిస్తోంది. వివరాల్లోకి వెళ్తే... జోగుళాంబ గద్వాల జిల్లా అయిజ మండలంలోని చిన్నతాండ్రపాడుకు చెందిన చంద్రకళ, కుర్వ ఆంజనేయులు దంపతులు బతుకుదెరువు నిమిత్తం 20 ఏళ్లకిందట పెబ్బేరుకు వచ్చి స్థిరపడ్డారు. వీరికి కొడుకు రాకేష్(16), కూతురు నందిని. ఇద్దరు పిల్లలను స్థానికంగా ఓ ప్రైవేట్ పాఠశాలలో చదివిస్తున్నారు. పక్షవాతానికి గురైన తండ్రి ఆంజనేయులు కొన్ని నెలలుగా ఇంటి వద్దే ఉంటున్నాడు. రాకేష్ ఈ ఏడాది పదోతరగతి పరీక్షలు రాశాడు. తండ్రికి చేదోడు వాదోడుగా ఉంటున్న అతను.. జూన్ 19న తోటి స్నేహితులతో కలిసి ఈతకు వెళ్లి, బావిలోపడి ప్రమాదవశాత్తు మృతి చెందాడు. కాగా గురువారం విడుదలైన పదోతరగతి ఫలితాల్లో 8.8 జీపీఏ సాధించాడు. కొడుకు పాసైనట్లుగా తెలుసు కున్న తల్లిదండ్రులు, తోటి విద్యార్థులు అతడిని గుర్తు తెచ్చుకుని కన్నీరు మున్నీరయ్యారు. -
టీఆర్ఎస్లో అసంతృప్తి సెగలు.. రహస్య భేటీ..
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: జోగుళాంబ గద్వాల జిల్లాలోని అలంపూర్ నియోజకవర్గంలో అధికార పార్టీ టీఆర్ఎస్లో అంతర్గత విభేదాలు రచ్చకెక్కాయి. స్థానిక ఎమ్మెల్యే అబ్రహం వ్యవహరిస్తున్న తీరుపై అసంతృప్తి సెగలు రాజుకున్నాయి. ప్రధానంగా పాలనా వ్యవహారాల్లో ఆయన తనయుడు జోక్యం చేసుకోవడం.. పార్టీలోని స్థానిక ప్రజాప్రతినిధులకు ప్రాధాన్యం ఇవ్వకపోవడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. చదవండి👉: కేసీఆర్ సుముఖత.. టీఆర్ఎస్ వెంట పీకే టీమ్ నియోజకవర్గ పరిధిలోని పలువురు అసంతృప్త నేతలు ఇటీవల రహస్యంగా సమావేశమై పోరు కార్యాచరణ పథకం రచించారు. ఇందుకనుగుణంగా దూకుడుగా వ్యవహరిస్తుండటంతో కారులో కిరికిరి తారాస్థాయికి చేరినట్లు స్పష్టమవుతోంది. పాలమూరులో ఒకవైపు బీజేపీ ప్రజాసంగ్రా మ యాత్ర కొనసాగుతుండగా మరోవైపు కాంగ్రెస్ సైతం క్షేత్రస్థాయిలో ప్రభుత్వంపై పోరుబాట పట్టింది. ఈ క్రమంలో అలంపూర్‌లో అధికార పార్టీలో చోటుచేసుకుంటున్న రాజకీయ పరిణామాలు ఆసక్తి రేపుతున్నాయి. గులాబీలో అంతర్గత పోరు రచ్చకెక్కిన నేపథ్యంలో ఈ పరిస్థితులు ఎటువైపు దారి తీస్తాయోనని చర్చ జోరుగా సాగుతోంది. ఇలా ముదిరింది.. 2009 డీలిమిటేషన్లో అలంపూర్ నియోజకవర్గం ఎస్సీ రిజర్వ్డ్గా మారింది. ఆ ఏడాది జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యరి్థగా వీఎం అబ్రహం బరిలో నిలిచి విజయం సాధించారు. 2014లో ఈ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి సంపత్‌కుమార్ గెలుపొందారు. తర్వాత జరిగిన 2018 ఎన్నికల్లో ఈసారి టీఆర్ఎస్ నుంచి అబ్రహం పోటీచేసి గెలిచారు. అయితే గెలిచిన కొంతకాలం తర్వాత స్థానిక నేతలను పట్టించుకోవడం లేదనే అభిప్రాయం పార్టీ వర్గాల్లో ఉంది. అదే సమయంలో ఆయన తనయుడు అజయ్ పొలిటికల్ ఎంట్రీకి అబ్రహం సన్నాహాలు చేస్తున్నారని.. వచ్చే ఎన్నికల్లో అలంపూర్ నుంచే వారసత్వం పుచ్చుకోనున్నట్లు ప్రచారం మొదలైంది. దీంతో పాటు అధికారిక కార్యక్రమాలకు ఆహ్వానం అందకపోవడం.. అందినా చివరి నిమిషంలో కబురు రావడం వంటి సంఘటనలు స్థానిక ప్రజాప్రతినిధుల్లో అసంతృప్తిని రగిల్చాయి. దళితబంధు, ఇతర పథకాల అమలులో స్థానిక ప్రజాప్రతినిధుల అభిప్రాయాలను సైతం పరిగణనలోకి తీసుకోకపోవడం మరింత నిప్పు రాజేసినట్లు సమాచారం. దీంతో పలువురు అసమ్మతి నేతలు ఇప్పటికే నాలుగైదు పర్యాయాలు రహస్యంగా భేటీ అయినట్లు తెలిసింది. అయితే పార్టీకి చెడ్డ పేరు రావొద్దనే ఉద్దేశంతో తగిన సమయం కోసం వేచిచూసినట్లు తెలుస్తోంది. అయిజలో రహస్య భేటీ.. ప్రస్తుతం అసంతృప్తితో రగులుతున్న నేతలు మొదట్లో ఎమ్మెల్యే అబ్రహంతో సఖ్యతగానే ఉన్నారు. ఎప్పుడైతే తన కొడుకు అజయ్ పొలిటికల్ ఎంట్రీ కోసం ప్రయత్నాలు మొదలుపెట్టడం.. అధికారిక కార్యక్రమాలతో పాటు తమ పరిధిలోని మండలాలు, గ్రామాల్లో జరిగే వివిధ కార్యకళాపాల్లో అజయ్ పెత్తనం చేయడాన్ని సీరియస్‌గా తీసుకున్న పలువురు జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, సర్పంచులు, పీఏసీఎస్, గ్రంథాలయ సంస్థ చైర్మన్లు సోమవారం అయిజలోని ఓ ఫంక్షన్ హాల్లో సమావేశమై పోరు కార్యాచరణపై చర్చించారు. కేటీఆర్ వద్దకు పంచాయితీ.. ఓ నిర్ణయానికి వచ్చిన అసంతృప్త నేతలు సమావేశం అనంతరం టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు బండ్ల కృష్ణమోహన్ రెడ్డిని కలిశారు. ఎమ్మెల్యే అబ్రహం తీరుతో తమకు జరుగుతున్న అవమానాలను ఏకరువు పెట్టారు. ఆ తర్వాత ఉమ్మడి జిల్లాకు చెందిన మంత్రులు శ్రీనివాస్‌గౌడ్, సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డిని హైదరాబాద్‌లోని వారి క్యాంపు కార్యాలయాల్లో కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తోపాటు సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి తమ సమస్యను పరిష్కరించాలని కోరినట్లు సమాచారం. స్పందించిన వారు ‘అలాగేనని.. ప్లీనరీ ఉంది.. తర్వాత కలిసి మాట్లాడదాం’ అని అసంతృప్త నేతలను సముదాయించినట్లు తెలిసింది. ఎక్కడ కూడా బహిర్గతం కావొద్దని.. అంతర్గతంగానే పరిష్కరించుకుందామని సూచించినట్లు తెలుస్తోంది. అయితే ఈ పంచాయితీ కేటీఆర్ వద్దకు చేరినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. ప్లీనరీ తర్వాత దీనిపై ఆయన దృష్టి సారించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల అలంపూర్‌లో గట్టి పట్టు ఉన్న టీఆర్ఎస్ నేత తిరుమల్‌రెడ్డి మృతిచెందడం.. మరోవైపు గెలుపోటములను శాసించే చల్లా వెంకట్రామరెడ్డి బీజేపీలో చేరతారనే ప్రచారం జరుగుతుండడం.. ఈ క్రమంలో టీఆర్ఎస్లో అంతర్గత విభేదాలు రచ్చకెక్కడం చర్చనీయాంశాలుగా మారాయి. అలంపూర్ నియోజకవర్గంపై దృష్టి సారించిన అధికార పారీ్టలో కొందరు నేతలు ఇప్పటి నుంచే చక్రం తిప్పుతున్నారని ఆ పార్టీలో ప్రచారం జరుగుతోంది. ఇసుకదందాలో తనయుడి మితి మీరిన జోక్యంతోనే ఎమ్మెల్యేపై అసమ్మతి సెగ రాజుకుందనే అభిప్రాయాలు టీఆర్ఎస్ శ్రేణుల నుంచి వినిపిస్తున్నాయి. -
గద్వాల జిల్లాలో ఉద్రిక్తత.. ఎస్ఐకి తీవ్ర గాయాలు
సాక్షి, గద్వాల: జోగులాంబ గద్వాలలోని కేటిదొడ్ది మండలం ఇర్కిచేడులో ఉద్రిక్తత చోటుచేసుకుంది. బీఆర్ అంబేడ్కర్ విగ్రహ ఆవిష్కరణలో రెండు వర్గాల మధ్య వివాదం తలెత్తింది. ఈ క్రమంలో ఓ వర్గం వ్యక్తులు అంబేడ్కర్ విగ్రహానికి నిప్పంటించారు. ఈ సందర్బంలో ఇరు వర్గాలను చెదరగొట్టే క్రమంలో ఎస్ఐకి మంటలు అంటుకున్నాయి. దీంతో ఆయన తీవ్రంగా గాయపడినట్టు సమాచారం. ఈ నేపధ్యంలో పోలీసులు మోహరించి ఇరు వర్గాలను చెదరగొట్టారు. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది. -
మానవపాడు తహసీల్దార్ కార్యాలయంలో అగ్ని ప్రమాదం
-
జోగులాంబ గద్వాల జిల్లాలో అక్రమంగా రేషన్ బియ్యం తరలింపు
-
జోగులాంబ గద్వాల జిల్లాలో తీవ్ర విషాదం
సాక్షి, గద్వాల: జోగులాంబ గద్వాల జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. అయిజ మండలంలోని కొత్తపల్లి గ్రామంలో ఆదివారం తెల్లవారుజామున కురిసిన భారీ వర్షానికి నివాస గుడిసె కూలి ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరోఇద్దరు ప్రాణాలతో బయటపడ్డారు. మృతి చెందిన వారిలో నలుగురు చిన్నారులు, ఇద్దరు భార్య భర్తలు ఉన్నారు. ప్రమాదం జరిగినప్పుడు గుడిసెలో మొత్తం ఏడుగురు ఉన్నారు. గ్రామానికి చెందిన హరిజన్ మోషకు భర్య శాంతమ్మ, కుమారులు చిన్న, రాము, చరణ్, తేజ కూతురు స్నేహ ఉన్నారు. ప్రతిరోజు మాదిరిగానే కుటుంబ సభ్యులంతా రాత్రి గుడిసేలో నిద్రిస్తుండగా వర్షానికి తడిసి ఒక్కసారిగా కుప్పకూలింది. దీంతో భార్యభర్తలతో సహా నలుగురు పిల్లలు చనిపోయారు. కూతురు స్నేహకు తీవ్రగాయాలు కావటంతో కర్నూల్ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనతో గ్రామం మొత్తం విషాదంలో మునిగిపోయింది. చదవండి: (ప్రయాణంలో విషాదం.. ఆరుగురు సాఫ్ట్వేర్ ఉద్యోగులు) -
టీఆర్ఎస్ నేత బూతు పురాణం
-
కేటీఆర్ పర్యటన నేపథ్యంలో ప్రతిపక్షాల ముందస్తు అరెస్ట్
-
ర్యాలంపాడు రిజర్వాయర్ కట్టకు బీటలు
-
తాగొచ్చి వేధిస్తున్నాడని తల్లీ, అక్క దారుణం..
జోగులాంబ గద్వాల : జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. తాగి వచ్చి వేధిస్తున్నాడనే కోపంతో యువకుడిపై పెట్రోల్ పోసి నిప్పంటించారు తల్లి, అక్క. ఈ సంఘటన ఉండవెల్లి మండలంలో గురువారం చోటుచేసుకుంది. బొంకూరు గ్రామానికి చెందిన శేఖర్ నిత్యం తాగి వచ్చి వేధిస్తున్నాడని అతడి తల్లి మద్దమ్మ, అక్క నీలమ్మ కోపం పెంచుకున్నారు. గురువారం అర్థరాత్రి అతడిపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. శరీరం మొత్తం కాలిపోవటంతో అతడ్ని కర్నూల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు. -
అత్త ముక్కు కొరికిన కోడలు
సాక్షి, మానవపాడు (అలంపూర్): గతంలో కోడలిని అత్త కొట్టిన సంఘటనలు చూశాం.. ఇప్పుడు అత్త ముక్కును కోడలు కొరి కింది. జోగుళాంబ గద్వాల జిల్లా మానవపాడు మంగలి వీధిలోని శారదమ్మ, జయ్యన్న దంపతు లకు ప్రసాద్, భాస్కర్, శేఖర్ సంతానం. పెద్ద కొడుకు ప్రసాద్ కర్నూలులోని అత్తగారి ఇంట్లో నివాసం ఉంటున్నాడు. అన్నదమ్ముల మధ్య తరచూ కుటుంబ కలహాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో సోమ వారం ఉదయం మరోసారి గొడవ పడ్డారు. దీంతో చిన్న కుమారుడు శేఖర్ భార్య రేవతి ఆగ్రహంతో అత్త శారదమ్మ ముక్కు కొరికింది. తీవ్రరక్తస్రావం కావడంతో ఆమెను ఆస్పత్రికి తరలించగా, వైద్యులు.. ముక్కుకు ఏడు కుట్లు వేశారు. చదవండి: (ప్రేమించిన వ్యక్తిని మరిచిపోలేకపోతున్నా..) -
గర్భిణి సింధూరెడ్డి మృతదేహం లభ్యం
-
విగతజీవిగా తేలిన గర్భిణి సింధూరెడ్డి
సాక్షి, జోగులాంబ గద్వాల: కలుగొట్ల వాగులో రెండు రోజులుగా వెతుకుతున్న గర్భిణి నాగసింధూరెడ్డి(28) విగతజీవిగా తేలింది. సోమవారం తెల్లవారుజామున తుంగభద్ర నదిలో కర్నూలు బ్రిడ్జి దగ్గర గర్భిణీ మృతదేహం లభ్యమైంది. నాగసింధూరెడ్డి మృతదేహాన్ని చూసి కుటుంబ సభ్యులు, బంధువులు హృదయ విదాకరంగా విలపించారు. కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన భార్యభర్తలు నాగసింధూరెడ్డి, శివశంకర్‌రెడ్డితోపాటు వారి స్నేహితుడు జిలానీబాషా కలిసి శనివారం బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు కారులో బయల్దేరారు. కలుగొట్ల వాగులో వీరు ప్రయాణిస్తున్న కారు కొట్టుకుపోయింది. మిగతా ఇద్దరు బయటపడగా.. సదరు మహిళ గల్లంతైంది. గల్లంతైన ప్రాంతం పరిసర ప్రాంతాల్లో గాలింపు చర్యలు చేపట్టారు. చివరికి గర్భిణి శవమై విగతజీవిగా కనిపించడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. (నీటి ఉధృతికి కొట్టుకుపోయిన కారు..) చదవండి: (తాత ఒకరికి... మనవడు మరొకరికి !) -
జోగులాంబ గద్వాల జిల్లాలో భారీ వర్షాలు
-
వేములవాడకు పోటెత్తిన భక్తులు
సాక్షి, హైదరాబాద్ : మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా తెలంగాణలో శివాలయాలకు భక్తులు పోటెత్తుతున్నారు. వేకువజామునే స్నానమాచరించి గుడికి చేరుకుని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. రాష్ట్రంలోని ప్రముఖ శివాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో రాజ రాజేశ్వరస్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. మహా శివరాత్రి సందర్భంగా ఆర్జిత సేవలన్నింటిని రద్దు చేసి లఘు దర్శనాలకు మాత్రమే అనుమతి ఇస్తున్నారు. స్వామివారికి ప్రభుత్వం తరపున దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి పట్టువస్త్రాలు సమర్పించారు. ఖమ్మం: కల్లూరు మండలంలోని కాశ్మీర మహాదేవ క్షేత్రం శివాలయాన్ని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య దంపతులు దర్శించుకున్నారు. వైరా మండలం స్నానాల లక్ష్మీపురం గ్రామం శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయంలో భక్తులు అభిషేక పూజలు నిర్వహించారు. ఎమ్మెల్యే లావుడ్యా రాములు నాయక్ ఈ ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. కాంగ్రెస్ సీఎల్పీ నేత బట్టి విక్రమార్క రామలింగేశ్వర స్వామి దర్శనం చేసుకున్నారు. కూసుమంచిలోని గణపేశ్వరాలయంలోని పూజా కార్యక్రమాల్లో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పాల్గొన్నారు. సిద్దిపేట : హుస్నాబాద్ మండలం పొట్టపల్లి శ్రీ స్వయంభూ రాజరాజేశ్వర స్వామికి కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ పట్టు వస్త్రాలు సమర్పించారు. కొమురవెల్లి మల్లికార్జున స్వామిని దర్శించుకోవడానికి భక్తులు భారీగా తరలివస్తున్నారు. దుబ్బాక మండలం చెల్లాపూర్‌లోని సోమేశ్వర ఆలయంలో శివయ్యను దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. కొమురం భీం అసిఫాబాద్: కాగజ్ నగర్ మండలంలోని ఈజ్గాంలో శివమల్లన్న జాతర ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోనేరు కోనప్ప దంపతులు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.నల్లగొండ: తిప్పర్తి మండలం, రామలింగాలగూడెం శివాలయంలో శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. వీరికి పూజారులు, ఆలయ అధికారులు పూర్ణకుంభంతో ఘనస్వాగతం పలికారు. అనంతరం స్వామి వారికి పాలకిషేకం చేసి ప్రత్యేక పూజలో పాల్గొన్నారు. భద్రాద్రి కొత్తగూడెం: సుజాతనగర్లో గల 400 ఏళ్ల క్రితం నిర్మించిన పురాతన శివాలయంలో శివునికి అభిషేకాలు నిర్వహించారు. ఈ సందర్భంగా భారీ సంఖ్యలో హాజరైన భక్తులు స్వామిని దర్శించుకుంటున్నారు బూర్గంపాడు మండలం మోతె గ్రామంలో పవిత్ర గోదావరి నదిమధ్యలో కొలువైన వీరభద్ర స్వామి ఆలయానికి భక్తులు పెద్ద ఎత్తున చేరుకుంటున్నారు. సరిహద్దు రాష్ట్రాల నుంచి వేల సంఖ్యలో శివయ్యను దర్శించేందుకు తరలి వస్తున్నారు. ములుగు: వెంకటాపురం మండలం లోని శ్రీ ఉమారామళింగేశ్వరస్వామి ఆలయంలో మహాశివరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఆలయంలో భక్తుల రద్దీ పెరుగుతోంది. స్వామివారికి ఉదయం నుంచి ప్రత్యేక పూజలు చేపట్టారు రాజన్న సిరిసిల్ల: వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామిని మంత్రి ఈటల రాజేందర్ దర్శించుకున్నారు. స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు. దక్షిణ కాశీగా పేరొందిన వేములవాడ రాబోయే రోజుల్లో గొప్ప పర్యాటక, అధ్యాత్మిక కేంద్రంగా మారబోతుందన్నారు. ఆలయ అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని పేర్కొన్నారు. మెదక్: పాపన్నపేట్ మండలంలోని నాగసాన్ పల్లి ఏడుపాయల వనదుర్గా మాతకు మంత్రి హరీష్ రావు పట్టు వస్త్రాలు సమర్పించారు. వీరి వెంట ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి, ఎంపీ ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యే మదన్ రెడ్డి ఉన్నారు. ఏడుపాయల మంజీర నదిలో భక్తులు పుణ్య స్నానాలు ఆచరిస్తున్నారు. ఉపవాస దీక్షతో వనదుర్గాభవాన్ని మాతను దర్శించుకుంటున్నారు. ఏడుపాయల వన దుర్గ భవాని క్షేత్రంలో ఎస్పీ శ్రీమతి చందన దీప్తి ఆదేశాల మేరకు మూడంచెల భద్రత నెలకొల్పారు. కామారెడ్డి: బిచ్కుంద మండల కేంద్రంలోని కాశీ విశ్వనాథ్ ఆలయాన్ని జుక్కల్ ఎమ్యెల్యే హన్మంత్ షిండే సందర్శించారు. బాన్సువాడ మoడలం సోమేశ్వర్ సోమలింగాల ఆలయంలో స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. పెద్దపల్లి: మంథని వద్ద గోదావరినదిలో పుణ్యస్నానాలు ఆచరించిన అనంతరం భక్తులు శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. జగిత్యాల: వెల్గటూరు మండలం కోటిలింగాల వద్ద భక్తులు గోదావరినదిలో పుణ్యస్నానాలు ఆచరించిస్తున్నారు. అనంతరం కోటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్న భక్తులు చేపడుతున్నారు. సంగారెడ్డి: ఝరాసంగం మండల కేంద్రంలోని కేతకీ సంగమేశ్వర స్వామిని జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు బి బి పాటిల్ దర్శించుకున్నారు. నారాయణఖేడ్‌లోని పంచగామ శివాలయంలో శివరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఝరాసంగం శ్రీ కేతకి సంగమేశ్వర స్వామి ఆలయంలో శివరాత్రి సందర్భంగా స్వామి వారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చారు. మంజీర నదిలో పుణ్యస్నానాలు చేసిన భక్తులు చిట్కూల్ చాముండేశ్వరి ఆలయంలో ప్రత్యేక పూజలు చేపట్టారు. ఆందోల్ గ్రామంలోని శివాలయంలోనూ అభిషేకాది కార్యక్రమాలు చేపట్టారు. మంచిర్యాల్: లక్సెట్టిపేట దండేపల్లి జన్నారం శివరాత్రి సందర్భంగా ఉదయాన్నే గోదావరి పుణ్య స్నానం ఆచరించిన భక్తులు అనంతరం శివాలయాల్లో మొక్కులు తీర్చుకుంటున్నారు. జోగులాంబ గద్వాల- అలంపూర్ బాలబ్రహ్మేశ్వరాలయంలో భారీగా తరలివస్తున్న భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. గద్వాల సమీపంలో కృష్ణానదీలో పుణ్యస్నానాలు ఆచరించి నదీఆగ్రహారం స్పటిక రామేశ్వరాలయంలో అత్యంత భక్తి శ్రద్ధలతో పూజలు చేపట్టారు. అడ్డాకుల మండలం కందూరులో కల్పవృక్షాలకు నెలవైన శ్రీ రామలింగేశ్వరాలయాన్ని భక్తులు దర్శించుకుంటున్నారు. నిజామాబాద్: మహా శివరాత్రి పర్వదిన వేడుకలు జిల్లాలో వైభవంగా కొనసాగుతున్నాయి. నీల కంటేశ్వరాలయం , శంభుని గుడి, ఆర్మూర్ నవనాథ సిద్దేశ్వరాలయం, బోధన్ చక్రేశ్వరాలయం, లొంక రామ లింగేశ్వరాలయంలో స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. నీలకంటేశ్వర ఆలయంలో జిల్లా పరిషత్ చైర్మన్ విఠల్ రావు ప్రత్యేక పూజలు చేశారు. ఆర్మూర్: నవ సిద్ధుల గుట్టపై భక్తుల తాకిడి పెరిగింది. నిర్మల్: బాసరలో మహాశివరాత్రి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. జ్ఞాన సరస్వతి అమ్మవారి ఉప ఆలయం శ్రీ సురేశ్వరాలయం, శ్రీ వ్యాసేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు చేపట్టారు. తెల్లవారుజామున సుప్రభాతసేవతో సంతతధార అభిషేకాలు మొదలయ్యాయి. శివలింగానికి ఆలయ అర్చకులు, వేదపండితులు బిల్వార్చనతో పూజలు చేశారు. సాయంత్రం ప్రదోష కాలంలో మహాలింగార్చన కార్యక్రమం తలపెట్టారు. పుట్టమన్నుతో చేసిన 365 మృత్తికా లింగమూర్తులకు వేదమంత్రోత్సరణతో అభిషేక పూజలు నిర్వహించనున్నారు. రాత్రి లింగోద్భవ సమయంలో సూర్యేశ్వర, వ్యాసేశ్వర ఆలయాల్లో మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, మహా హారతి, మంత్రపుష్పంతో ప్రత్యేక పూజలు చేయనున్నారు. మంచిర్యాల: లక్సెట్టిపేట దండేపల్లి జన్నారంలో శివరాత్రి సందర్భంగా భక్తులు ఉదయాన్నే గోదావరి పుణ్య స్నానం ఆచరించారు. అనంతరం శివాలయాల్లో మొక్కులు తీర్చుకుంటున్నారు. -
ఆ స్థానాల్లో ఫలించిన టీఆర్ఎస్ వ్యూహాలు
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వెలువడిన క్షణం నుంచే అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఎన్నికలు జరిగిన 17 మున్సిపాలిటీల్లో కేవలం 8 స్థానాల్లోనే స్పష్టమైన మెజార్టీ సాధించిన టీఆర్ఎస్ మిగతా పీఠాలను సైతం కైవసం చేసుకునేలా వ్యూహాలు రచించింది. ఈ క్రమంలో మెజార్టీ సాధించని భూత్పూర్, కోస్గి, నారాయణపేట, అమరచింత, కల్వకుర్తి, కొల్లాపూర్, అయిజ పురపాలికలపై జెండా ఎగరవేసింది. గులాబీ పార్టీ ఎత్తుగడలతో గెలుపునకు ఆస్కారమున్న భూత్పూర్, నారాయణపేట పీఠాలను బీజేపీ పోగొట్టుకుంది. ఉమ్మడి జిల్లాలో కేవలం మక్తల్‌లో మాత్రమే కాషాయం జెండా ఎగిరింది. ఇటు నిన్నటి వరకు కోస్గి పీఠంపై కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయమనే పూర్తి ధీమాతో ఉన్న ఆ పార్టీకి కోలుకోలేని దెబ్బ తగలింది. రెండ్రోజుల్లో చోటు చేసుకున్న పరిణామాలతో కోస్గి పీఠం ‘చే’జారింది. వ్యూహాత్మకంగా వ్యవహరించిన టీఆర్ఎస్ అనూహ్యంగా పాగా వేసింది. చైర్మన్ రేసులో ఉన్న అభ్యర్థులు తమకున్న సభ్యుల బలగాన్ని రహస్య శిబిరాలకు తరలించి సోమవారం నేరుగా ఆయా మున్సిపాలిటీలకు తరలించారు. ముందుగా గెలిచిన అభ్యర్థులు కౌన్సిలర్లుగా ప్రమాణాస్వీకారం చేయగా.. తర్వాత చైర్మన్, వైస్ చైర్మన్లను ఎనుకున్నారు. కొల్లాపూర్‌లో ‘గులాబీ’ని గెలిపించారు.. రాష్ట్రంలోనే చర్చనీయాంశంగా మారిన కొల్లాపూర్ ‘పుర’పోరు కథ సుఖాంతమైంది. ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి వర్గీయులు 9 మంది గెలుపొందగా.. ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ తరఫున బరిలో దిగిన జూపల్లి వర్గీయులు 11 మంది విజయం సాధించారు. దీంతో ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ పుర పీఠాన్ని కైవసం చేసుకునే అవకాశం ఏర్పడింది. ఈ క్రమంలో పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు తమ ఎక్స్అఫీషియో ఓట్లతో ఆ పుర పీఠంపై గులాబీ జెండా ఎగరేసేందుకు స్థానిక ఎమ్మెల్యే హర్షవర్ధన్‌రెడ్డి, ఎంపీ రాములు, ఎమ్మెల్సీ దామోదర్‌రెడ్డి కొల్లాపూర్‌కు చేరుకున్నారు. ముందుగా కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారం పూర్తయిన వెంటనే ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ నుంచి గెలుపొందిన కౌన్సిలర్లు అనూహ్యంగా సమావేశ గది బయటికి వెళ్లిపోయారు. దీంతో ఎంపీ, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే ఎక్స్అఫీషియో ఓట్లతో టీఆర్ఎస్ కొల్లాపూర్ పురంపై గులాబీ జెండా ఎగిరింది. మక్తల్‌లో రభస.. మక్తల్‌లో చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ల ఎంపిక ప్రక్రియలో బీజేపీ, కాంగ్రెస్ నేతల మధ్య తలెత్తిన వివాదం తారాస్థాయికి చేరుకుంది. పట్టణంలో మొత్తం 16 వార్డులు ఉంటే.. టీఆర్ఎస్ 5, బీజేపీ 8 స్థానాల్లో గెలుపొందింది. కాంగ్రెస్ రెండు, ఇండిపెండెంట్ అభ్యర్థి ఒకరు గెలిచారు. పుర పీఠంపై పాగాకు వ్యూహం రచించిన బీజేపీ.. కాంగ్రెస్ నుంచి గెలిచిన ఇద్దరిని జత కలుపుకుంది. ఎన్నిక సమయంలో బీజేపీకి అనుకూలంగా ఓటేస్తే.. వైస్ చైర్పర్సన్ పదవి ఇస్తామని హామీ ఇస్తామని నమ్మించినట్లు కాంగ్రెస్ నేతలు పేర్కొన్నారు. ఒప్పందంలో భాగంగా చైర్పర్సన్ ఎన్నికలో బీజేపీ అభ్యర్థి పావనికి అనుకూలంగా అందరూ చెయ్యి ఎత్తారు. అయితే కాంగ్రెస్ అభ్యర్థుల వైస్చైర్పర్సన్కు బీజేపీ అభ్యర్థులు సహకరించకపోగా.. తమ పార్టీకి చెందిన అఖిలను వైస్ చైర్‌పర్సన్‌గా ఎన్నుకున్నారు. బీజేపీ నేతల తీరుపై కాంగ్రెస్ కౌన్సిలర్లు మండిపడ్డారు. తమను నమ్మించి మోసం చేశారని బీజేపీ నాయకత్వంపై ఆక్రోశం వ్యక్తం చేశారు. ► కల్వకుర్తి మున్సిపల్ పరిధిలో స్థానిక ఎమెల్యే జైపాల్‌యాదవ్‌కు ముఖ్య అనుచరుడిగా ఉన్న షానవాజ్ ఖాన్‌కు వైస్ చైర్మన్ పదవి వరిస్తుందని అందరూ భావించారు. కానీ చైర్మన్‌గా ఎడ్మ సత్యం ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత గత పాలకవర్గంలో వైస్ చైర్మన్‌గా పని చేసి.. ఈ సారి మరోసారి గెలుపొందిన మాజీ ఎమ్మెల్యే ఎడ్మ కృష్ణారెడ్డి అనుచరుడు షాహీద్ పేరు తెరపైకి వచ్చింది. గెలిచిన అభ్యర్థులందరూ షాహీద్ వైపే మొగ్గుచూపడంతో అతను వైస్ చైర్మన్‌గా ఎన్నికయ్యాడు. దీంతో ఎమ్మెల్యే వర్గీయుల్లో కాస్త అసంతృప్తి వ్యక్తమవుతోంది. ► పుర ఎన్నికల ఫలితాల తర్వాత అమరచింతలో మారిన రాజకీయ సమీకరణాలు గులాబీ నేతలను కాస్త ఆందోళనకు గురి చేశాయి. అక్కడున్న పది వార్డుల్లో టీఆర్ఎస్ మూడు, సీపీఎం రెండు, బీజేపీ, టీడీపీ, సీపీఐ, కాంగ్రెస్, స్వతంత్రులు ఒక్కో స్థానంలో గెలుపొందిన విషయం తెలిసిందే. తర్వాత స్వతంత్ర అభ్యర్థిగా గెలుపొందిన రాజకుమార్ కారెక్కారు. ఆరో వార్డు నుంచి గెలిచిన మాధవి, పదో వార్డు నుంచి గెలుపొందిన గోపి సీపీఎం అభ్యర్థులతో పురపీఠం కైవసం చేసుకుందామని భావించిన ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డికి మద్దతు విషయంలో ఒక అభ్యర్థిపై అనుమానం వచ్చింది. ముందస్తు జాగ్రత్తగా ఎక్స్అఫీషియో ఓటు వేద్దామనే ఆలోచనతో అమరచింత మున్సిపాలిటీకి చేరుకున్నా.. సదరు అభ్యర్థి సైతం టీఆర్ఎస్ వైపే మొగ్గు చూపడంతో చిట్టెం ఓటు అవసరం లేకుండానే గులాబీ అక్కడ జెండా ఎగరవేసింది. ► భూత్పూర్ మున్సిపల్ పరిధిలో పది వార్డులకు టీఆర్ఎస్, బీజేపీ నాలుగు చొప్పున స్థానాలు గెలుచుకోగా.. కాంగ్రెస్ అభ్యర్థులు రెండు వార్డుల్లో గెలిచారు. దీంతో రంగంలో దిగిన దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి ఆదివారం రాత్రి 11గంటల ప్రాంతంలో గెలిచిన బీజే పీ అభ్యర్థుల్లో ఇద్దరికి గులాబీ కండువా కప్పా రు. దీంతో గులాబీ బలం ఆరుకు చేరింది. సో మవారం ఉదయమే భూత్పూర్కు వచ్చిన బీజే పీ జిల్లా అధ్యక్షురాలు పద్మజా రెడ్డి విప్ జారీ చేసి వెళ్లినా.. ఆ పురంపై గులాబీ జెండా ఎగరడాన్ని మాత్రం అడ్డుకోలేకపోయారు. అయితే.. బీజేపీ నుంచి గెలిచి కారెక్కిన కెంద్యాల శ్రీనివాస్‌కు వైస్ చైర్మన్ పదవి వరించింది. చేజారుతూ.. చేజిక్కిన ‘కోస్గి’ అధికార పార్టీ అనూహ్యంగా కోస్గి పీఠం పాగా వేసింది. ఆ మున్సిపాలిటీ పరిధిలో 16వార్డులు ఉండగా.. టీఆర్ఎస్, కాంగ్రెస్ చెరో ఏడు చొప్పున గెలుచుకోగా.. ఇద్దరు స్వతంత్రులు గెలుపొందారు. స్వతంత్రుల్లో 4వ వార్డు నుంచి గెలుపొందిన జనార్దన్‌రెడ్డి (టీఆర్ఎస్ రెబల్) కాంగ్రెస్‌కు మద్దతివ్వగా.. మరో అభ్యర్థి బెస్త ఎల్లమ్మ టీఆర్ఎస్కు మద్దతు తెలిపింది. దీంతో రెండు పార్టీలకు ఎనిమిది చొప్పున మెజార్టీ వచ్చింది. ఈ క్రమంలో టీఆర్ఎస్ నుంచి గెలుపొందిన అనిత కాంగ్రెస్‌కు మద్దతు ఇచ్చారు. దీంతో టీఆర్ఎస్ ఏడు, కాంగ్రెస్ తొమ్మిది స్థానాల్లో మెజార్టీ సాధించింది. ఈ క్రమంలో టీఆర్ఎస్ తరఫున స్థానిక ఎమ్మెల్యే ఒక్కరే ఎక్స్అఫీషియో ఓటుకు దరఖాస్తు చేసుకున్నారనే సమాచారంతో కాంగ్రెస్ నేతలు పుర పీఠం తమదేననే ధీమాతో ఉండిపోయారు. కానీ సోమవారం ఉదయం ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డితో పాటు ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి సైతం హాజరయ్యారు. దీంతో ఎమ్మెల్యే ఒక్కరే ఎక్స్అఫీషియో ఓటు కోసం దరఖాస్తు చేసుకున్నారంటూ అధికారులు తమను తప్పుదోవ పట్టించారని ఆరోపిస్తూ కాంగ్రెస్ నేతలు ఆందోళనకు దిగారు. కౌన్సిలర్ల పదవికి ప్రమాణస్వీకారం చేసిన కాంగ్రెస్ అభ్యర్థులు, ఇతర పార్టీ నేతలందరూ చైర్పర్సన్, వైస్ చైర్మన్ పదవుల ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమాన్ని బహిష్కరించి బయటికి వెళ్లిపోయారు. దీంతో పూర్తి మెజార్టీతో ఉన్న టీఆర్ఎస్ నాయకులతో అధికారులు చైర్పర్సన్, చైర్మన్లను ఎన్నుకుని వారితో ప్రమాణస్వీకారం చేయించారు. గెలుపు కోసం వారి ఓట్లు.. హంగ్ ఉన్న పట్టణాల్లో ఎక్స్అఫీషియో ఓట్లు వేసి తమ అభ్యర్థులను గెలిపించుకునేందుకు ఉమ్మడి జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులందరూ కదిలారు. ముందుగా ఓటు అవసరం లేకుండా.. ఇతర పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులతో లాబీయింగ్ చేసిన నాయకులు ఆ ప్రయత్నాలు ఫలించని చోటుకు వెళ్లి ఓటేశారు. కోస్గిలో కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి, మహబూబ్‌నగర్ ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి, కొల్లాపూర్‌లో నాగర్‌కర్నూల్ ఎంపీ రాములు, ఎమ్మెల్సీ దామోదర్‌రెడ్డి, ఎమ్మెల్యే హర్షవర్ధన్‌రెడ్డి, అయిజలో అలంపూర్ ఎమ్మెల్యే అబ్రహం టీఆర్ఎస్ అభ్యర్థులకు మద్దతుగా ఓట్లేశారు. మక్తల్‌లో ఎమ్మెల్సీ రాంచందర్‌రెడ్డి బీజేపీ అభ్యర్థులకు మద్దతుగా ఓటేశారు. నీకొకటి.. నాకొకటి.. ‘పుర’ పీఠాలు కైవసం కోసం స్పష్టమైన మెజార్టీ రాని పార్టీలు కలిసి రెండు చోట్ల పాగా వేశాయి. పది వార్డులు ఉన్న అమరచింతలో టీఆర్ఎస్ 3, సీపీఎం 2, కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ, ఇండిపెండెంట్, సీపీఐ నుంచి ఒక్కొక్కరు గెలుపొందారు. దీంతో ఆ పీఠంపై పాగాకు ప్రయత్నించిన టీఆర్ఎస్.. స్వతంత్ర అభ్యర్థిగా గెలుపొందిన రాజకుమార్‌కు గులాబీ కండువా కప్పి పార్టీలో చేర్పించుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆరో వార్డు నుంచి గెలిచిన మాధవి, పదో వార్డు నుంచి గెలుపొందిన గోపి సీపీఎం అభ్యర్థులతో మంతనాలు జరిపిన స్థానిక ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి చైర్పర్సన్ పదవిని టీఆర్ఎస్ అభ్యర్థి మంగమ్మకు ఇచ్చి.. వైస్ చైర్మన్ పదవిని గోపికి ఇచ్చారు. ఇటు 20 వార్డులు ఉన్న ఆ మున్సిపాలిటీలో టీఆర్ఎస్ ఆరు స్థానాల్లో, కాంగ్రెస్ నాలుగు స్థానాల్లో గెలుపొందగా.. ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ (ఏఐఎఫ్బీ) నుంచి పోటీ చేసి టీఆర్ఎస్ రెబెల్స్ పది మంది గెలుపొందిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఏఐఎఫ్బీ గెలిచిన పదిమంది టీఆర్ఎస్ రెబెల్స్ కావడం.. వారందరూ తాము టీఆర్ఎస్కే మద్దతు ఇస్తామని చెప్పడంతో ఇరువురి మధ్య సయోధ్య కుదిరింది. ఈ క్రమంలో టీఆర్ఎస్ నుంచి గెలిచిన 16వ వార్డు అభ్యర్థి దేవన్నకు చైర్మన్.. తొమ్మిదో వార్డు నుంచి ఏఐఎఫ్బీ తరఫున గెలిచిన నర్సింహుడుకు వైస్ చైర్మన్ పదవి వరించింది. -
‘దిశ’ అస్థికల నిమజ్జనం
ఎర్రవల్లిచౌరస్తా (అలంపూర్): జోగుళాంబ గద్వాల జిల్లా ఇటిక్యాల మండలం బీచుపల్లిలోని కృష్ణానదిలో సోమవారం ‘దిశ’అస్థికలను తండ్రి శ్రీధర్‌రెడ్డి నిమజ్జనం చేశారు. మత్స్యకారుల సాయంతో పుట్టి ద్వారా కృష్ణలోకి వెళ్లి తండ్రి శ్రీధర్‌రెడ్డి అస్థికలను నదిలో కలిపారు. ఆయన వెంట కుటుంబ సభ్యులు, వెటర్నరీ శాఖ ఉద్యోగులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎన్కౌంటర్ చేయాలి.. అనంతరం శ్రీధర్‌రెడ్డి మాట్లాడుతూ ఇలాంటి పరిస్థితి వస్తుందని కలలో కూడా ఊహించలేదన్నారు. ఈ సందర్భంగా కంటతడి పెట్టుకున్నారు. ఏ తండ్రికీ ఇలాంటి పరిస్థితి రావద్దని అన్నారు. అతి కిరాతకంగా హత్య చేసిన మానవ మృగాలను బహిరంగంగా ఎన్కౌంటర్ చేయాలన్నారు. దిశ తమ మధ్య లేకపోవడం కలచివేస్తోందని సహచర ఉద్యోగులు పేర్కొన్నారు. అతి దారుణంగా నిండు ప్రాణాన్ని బలిగొన్న ఆ నరరూప రాక్షసులను బహిరంగ ప్రదేశంలో ఉరితీయాలని డిమాండ్ చేశారు.