రైల్వే పోలీసులకు పట్టుబడిన నిషేధిత కల్లు విక్రయదారులు(ఫైల్)
గద్వాల క్రైం : నిషేధిత కల్లు తయారీ.. విక్రయాలపై పోలీసు, ఎక్సైజ్ శాఖ పటిష్టమైన చర్యలు చేపట్టింది. అయితే నిషేధిత కల్లును కొందరు గుట్టుగా అధికారుల కళ్లు గప్పి రైలుమార్గాల ద్వారా గద్వాలకు చేరుస్తున్నారు. ఇక రైల్వే పోలీసుల తనిఖీల్లో నిత్యం నిషేధిత కల్లును పలువురు తీసుకెళ్తున్న తరుణంలో నిఘా ఉంచి నిందితుల నుంచి వందలాది లీటర్ల నిషేధిత కల్లును స్వాధీనం చేసుకుంటున్నారు. గద్వాల మండల కేంద్రంలోని నిషేధిత కల్లు తయారీ, విక్రయాలపై పోలీసు, ఎక్సైజ్ శాఖ పటిష్టమైన చర్యలు తీసుకుంది.
దొడ్డిదారిన వనపర్తి నుంచి..
ఇటీవల గద్వాలకు చెందిన కొందరు రైలు మార్గాల ద్వారా నిషేధిత కల్లును దొడ్డిదారిన వనపర్తి జిల్లా నుంచి గద్వాలకు తీసుకొస్తున్నారు. ఇలా తీసుకొచ్చిన ని షేధిత కల్లును రహస్యంగా కల్లు ప్రియులకు విక్రయిస్తున్నారనే సమాచారం అధికారులకు తెలిసింది. దీంతో ఎక్సైజ్ అధికారులు రైల్వే పోలీసులను అప్రమత్తం చేయడంతో నిత్యం రైల్వే అ ధికారులు ముమ్మరంగా తనిఖీలు చేపడుతున్నారు. తనిఖీల్లో 20 రోజుల్లోనే 1,000 లీటర్ల నిషేధిత కల్లును స్వాధీనం చేసుకొని 15 మందిపై కేసులు నమోదు చేసి ఎక్సైజ్ అధికారులకు అప్పగించారు.
రైలు మార్గంలో ఎందుకంటే..
గద్వాలో నిషేధిత కల్లు తయారీ, విక్రయాలు చేస్తే అధికారులు కేసులు నమోదు చేస్తున్నారు. దీంతో నిషేధిత కల్లుకు అలవాటు పడిన కల్లు ప్రియులు కల్లు దొరక్కపోవడంతో వనపర్తి జిల్లాకు వెళ్తున్నారు. ఇది అదునుగా భావించిన కొందరు అక్కడి నుంచి ఇక్కడకు తీసుకొచ్చి అధిక ధరలకు విక్రయిస్తే లాభం వస్తుందనే దురాలోచనతో రైలు మార్గం ద్వారా గుట్టుగా తీసుకొస్తున్నారు. అందులోనూ రైలు మార్గం ద్వారా తీసుకురవాడం సులువుగా ఉండటం. అధికారులు పెద్దగా దృష్టి సారించరనే నేపంతో రైలు మార్గం ఎంచుకున్నారనే విమర్శలు నెలకొన్నాయి.
నిషేధిత కల్లు విక్రయాలపై నిఘా..
నిషేధిత కల్లు తాగడంతో ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభవం చూపుతుంది. పలు ఆరోగ్య సమస్యలు, మత్తు కలిగించే క్లోరల హైడ్రేట్, ఆల్ఫాజోం తదితర పదార్థాలతో తయారు చేసిన కల్లు తాగడంతో మత్తుకు బానిసగా మరి మానసికంగా కుంగిపోతారు. నిషేధిత కల్లు దొరకని సమయంలో పిచ్చిగా కేకలు వేయడం ఇతరత్ర భయాందోళనకు దారి తీస్తారు. ప్రభుత్వం కల్తీ కల్లు తయారీ, విక్రయాలపై ఉక్కుపాదం మోపింది. నిషేధిత కల్లు ఎవరైనా రహస్యంగా తీసుకొస్తున్నట్లు తెలిస్తే సంబంధిత అధికారులకు సమాచారం అందించాలి. నిషేధిత కల్లును విక్రయించినా, ఇతర ప్రాంతాల నుంచి తీసుకొచ్చినా చట్టపరంగా చర్యలు తీసుకుంటాం.
– గోపాల్ గద్వాల ఎక్సైజ్ సీఐ
Comments
Please login to add a commentAdd a comment