బెంగళూరులోని పీజీ హాస్టల్‌లో ఓ యువతిని అతి దారుణంగా హత్య చేసిన నిందితుడిని పోలీసులు ఎట్టకేలకు పట్టుకున్నారు. ఘటన జరిగిన మూడు రోజులకు మధ్యప్రదేశ్‌లో అదుపులోకి తీసుకున్నారు. విచారణ నిమిత్తం నిందితుడిని నగరానికి తీసుకున్నట్లు బెంగళూరు పోలీస్ కమిషనర్ దయానంద్ తెలిపారు. నిందితుడిని పట్టుకునేందుకు మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.
కాగా బిహార్‌కు చెందిన 24 ఏళ్ల యువతి కృతి కుమారిని ఓ దుండగుగు అర్థరాత్రి హాస్ట్‌లోకి చొరబడి కత్తితో పొడిచి చంపిన విషయం తెలిసిందే. బెంగళూరులోని రద్దీగా ఉండే కోరమంగళలోని పీజీ హాస్టల్‌లో మంగళవారం రాత్రి 11 గంటల సమయంలో ఈ ఘోరం జరిగింది.
అయితే బాధితురాలికి నిందితుడు ముందుగానే పరిచయం ఉన్నట్లు పోలీసుల విచారణలో తెలిసింది. ఓ ప్రైవేటు కంపెనీ పనిచేస్తున్న కృతికి.. హాస్ట్‌లో తన రూమ్‌మెట్‌కు ప్రియుడు అని వెల్లడైంది. తన రూమ్‌మెట్, ఆమె ప్రియుడు ప్రతిసారి ఉద్యోగం విషయంలో గొడవపడేవారిని, వీరి విషయంలో కుమారి జోక్యం చేసుకోవడంతో గొడవలు పెద్దగా అయినట్లు సమాచారం.
అయితే ప్రియుడికి దూరంగా ఉండాలని కృతి తన రూమ్‌మెట్‌కు సలహా ఇచ్చింది. ఈ విషయం తెలుసుకున్న నిందితుడు.. ఆవేశంతో ఆమెను చంపడానికి హాస్ట్‌లోకి ప్రవేశించినట్లు తెలిసింది.
ఈ దారుణ హత్యకు సంబంధించిన దృశ్యాలు హాస్టల్‌లోని సీసీటీవీ కెమెరాల్లో రికార్డయింది. ముందుగా నిందితుడు కుమారి రూమ్ తలుపు తట్టడం, ఆమె డోర్ తీయగానే బలవంతంగా కారిడార్‌లోకి లాక్కెళ్లాడు. అతడి బారి నుంచి తప్పించుకునేందుకు ఎంత ప్రయత్నించినా ఫలించలేదు. యువతిని గొడకు నెట్టి తన వెంట తెచ్చుకున్న పదునైన ఆయుధంతో ఆమెపై పలుమార్లు దాడి చేశాడు. మెడపై కత్తితో పదే పదే పొడిచాడు. దీంతో తీవ్రగాయాలతో ప్రాణాలు వదిలింది.
యువతి కేకలు విన్న మిగతా హాస్టల్ మహిళలు భయటంతో బయటకు పరుగులు తీశారు. వారిలో ఒకరు పోలీసులకు ఫోన్ చేయడగా.. పోలీసులు వచ్చే సరికి నిందితుడు అక్కడి నుంచి పారిపోయాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిన తాజాగా అతుపులోకి తీసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment