ప్రతీకాత్మకచిత్రం
సాక్షి, బెంగళూరు(యశవంతపుర): సోలదేవనహళ్లి పోలీసుస్టేషన్‌లో నమోదైన వ్యక్తి అదృశ్యమైన కేసును పోలీసులు ఛేదించారు. భార్య, ఆమె ప్రియుడే అతన్ని కడతేర్చినట్లు పోలీసులు నిర్ధారించారు. ఈమేరకు నిందితులను అరెస్ట్ చేశారు. సోలదేవనహళ్లిలో దాసేగౌడ, జయ దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి ఇద్దరు పిల్లలున్నారు.
దాసేగౌడ ఇంటిలో లేని సమయంలో ఒక యువకుడు అతని ఇంటికి వచ్చేవాడు. దీంతో ఆమెకు ఆ యువకుడికి మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. పసిగట్టిన దాసేగౌడ భార్యను తీవ్రంగా మందలించాడు. గతనెల 25న దంపతుల మధ్య గొడవ జరిగింది. దీంతో భర్తను కడతేర్చాలని భార్య ప్లాన్ వేసింది. అదే రోజు రాత్రి ప్రియుడిని పిలిపించి దాసేగౌడ నోట్లో బట్టలు కుక్కి పశువులను కట్టేసే తాడుతో గొంతు బిగించి హత్య చేశారు.
మృతదేహాన్ని సోలదేవనహళ్లి సమీపంలోని మైసూరు–బెంగళూరు రహదారిలో మోరీ గుంతలోకి పడేశారు. తన భర్త కనిపించడం లేదని నవంబర్ 28న పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు జయ, ఆ యువకుడి కాల్‌డేటాను సేకరించి ఇద్దరినీ అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టగా తమ ఆనందానికి అడ్డుగా ఉన్నాడని దాసేగౌడను హత్యచేసినట్లు అంగీకరించారు. దీంతో మంగళవారం మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టం కోసం తరలించి నిందితులను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.
చదవండి: (నిశ్చితార్థమైన యువకునితో బయటకెళ్లి.. ఇద్దరూ విషం తాగి..)
Comments
Please login to add a commentAdd a comment