రన్యా రావుపై బీజేపీ ఎమ్మెల్యే అనుచిత వ్యాఖ్యలు | BJP MLA Basangouda Patil Yatnal Controversy Remarks Against Ranya Rao | Sakshi
Sakshi News home page

రన్యా రావుపై బీజేపీ ఎమ్మెల్యే అనుచిత వ్యాఖ్యలు

Published Mon, Mar 17 2025 1:06 PM | Last Updated on Mon, Mar 17 2025 1:28 PM

BJP MLA Basangouda Patil Yatnal Controversy Remarks Against Ranya Rao

బెంగళూరు: కన్నడ నటి రన్యారావుపై బీజేపీ ఎమ్మెల్యే అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆమె తన ప్రైవేటు భాగాల్లో బంగారం దాచిపెట్టి స్మగ్లింగ్‌ చేసిందని షాకింగ్‌ కామెంట్స్‌ చేశారు. ఇదే సమయంలో బంగారం స్మగ్లింగ్‌ వ్యవహారంలో మంత్రుల ప్రమేయం కూడా ఉందని అన్నారు. దీంతో, ఆయన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.

బీజాపూర్ బీజేపీ ఎమ్మెల్యే బసంగౌడ పాటిల్ యత్నాల్‌ తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. రన్యారావు తన శరీరమంతా బంగారంతో కప్పేసింది. ఆమె తన శరీరంలో ఏయే చోట్ల బంగారం దాచుకుని వచ్చిందో నాకు తెలుసు. ఆమె తన ప్రైవేటు భాగాల్లో బంగారం దాచిపెట్టి స్మగ్లింగ్‌ చేసింది. బంగారం స్మగ్లింగ్‌ వ్యవహారంలో మంత్రులకు కూడా ప్రమేయం ఉంది. ఈ విషయాలు అన్నీ నాకు తెలుసు. శాససభ సమావేశాల్లో ఒక్కొక్కరి బండారం బయటపెడతాను. ప్రతి పాయింట్‌ అసెంబ్లీలో వివరిస్తాను. రన్యా రావుతో పరిచయం ఉన్న ఇద్దరు మంత్రుల పేర్లను సభలో చెబుతాను. నేను ఇప్పుడు మీడియా ముందు దాని గురించి మాట్లాడను. ఆమెకు ప్రోటోకాల్ ఇచ్చిన వారి గురించి మేము సమాచారాన్ని సేకరించాం. వాళ్ళకి బంగారం ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరి కోసం తెచ్చారో నాకు తెలుసు. ఎవరు తప్పు చేసినా, అది తప్పే. కస్టమ్స్ అధికారులు తప్పు చేస్తే, మేం వారిని సమర్థించడం లేదు’ అని అన్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

మరోవైపు కస్టడీలో తనను టార్చర్‌ చేస్తున్నారంటూ రన్యా రావు కోర్టుకు వెల్లడించిన విషయం తెలిసిందే. తెల్ల కాగితంపై తన సంతకాలు చేయించుకున్నారని ఆరోపించారు. కనీసం నిద్ర పోనివ్వకుండా, తిండి కూడా తిననివ్వడం లేదంటూ ఫిర్యాదు చేశారు. కాగా, రన్యా రావు కేసు విషయంలో ఎయిర్‌ పోర్టులో ప్రోటోకాల్‌ ఉల్లంఘన వెనుక ఆమె సవితి తండ్రి, ఐపీఎస్‌ అధికారి రామచంద్రరావు ఉన్నట్లు ఆరోపణలు రావడంతో, ఆయన పాత్రపై విచారణ జరపాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. 

ఇదిలా ఉండగా.. బంగారం స్మగ్లింగ్ వ్యవహారం కర్ణాటక రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. అధికార కాంగ్రెస్-బీజేపీ మధ్య డైలాగ్ వార్ నడుస్తోంది. మార్చి 3న బెంగళూరు అంతర్జాతీయ ఎయిర్‌పోర్టులో రూ.12 కోట్ల విలువైన బంగారంతో రన్యా రావు పట్టుబడిన విషయం తెలిసిందే. దీంతో, రంగంలోకి దిగిన డీఆర్ఐ అధికారులు ఈ కేసును దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement