Karnataka: Daughter Kills Mother In Bengaluru, Stuffs Body In Trolley Bag - Sakshi
Sakshi News home page

బెంగుళూరులో దారుణం.. తల్లిని హత్య చేసి.. సూట్‌కేసులో కుక్కి పోలీస్‌ స్టేషన్‌కు

Published Tue, Jun 13 2023 11:46 AM | Last Updated on Tue, Jun 13 2023 1:03 PM

Woman kills Mother In Bengaluru Walks Into PS With Body Stuffed in Bag - Sakshi

సమాజంలో అరాచకాలు, హత్యలు పెరిగిపోతున్నాయి. మానవత్వం మరిచి క్రూరంగా ప్రవర్తిస్తున్నారు. రక్తసంబంధాలను సైతం విస్మరించి దారుణాలకు తెగబడుతున్నారు.  క్షణికావేశంలో నిండు జీవితాలను బలి తీసుకుంటున్నారు. తాజాగా కర్ణాటక రాజధాని బెంగళూరులో ఇలాంటి ఘోరమే వెలుగుచూసింది. 39 ఏళ్ల ఓ మహిళ.. నవమాసాలు మోసి జన్మనిచ్చిన తల్లినే అతి కిరాతకంగా హత్య చేసింది.

అంతేగాక  తల్లి మృతదేహాన్ని సూట్‌కేసులో కుక్కింది. తరువాత సూట్‌కేసును బెంగుళూరు పోలీస్‌ స్టేషన్‌కు తీసుకెళ్లి పోలీసుల ఎదుట లొంగిపోయింది. మైకో లేఅవుట్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో సోమవారం మధ్యాహ్నం ఈ ఘటన చోటుచేసుకుంది. నిందితురాలిని ఫిజియోథెరపిస్ట్‌ సేనాలి సేన్‌గా గుర్తించారు. ఆమె తన భర్తతో కలిసి పశ్చిమ బెంగాల్‌లో నివసిస్తోంది. కొంతకాలంగా తన తల్లి బీవాతో కలిసి బిలేకహళ్లిలోని ఎమ్‌ఎస్‌ఆర్‌ అపార్ట్‌మెంట్‌లో ఉంటోంది.

తల్లీకూతుళ్లకు తరుచూ గొడవలు అవుతున్నాయి. ఈ క్రమంలోనే ఇద్దరి మధ్య సోమవారం మరోసారి వాగ్వాదం జరిగింది. కోపంతో తల్లికి ఎక్కువ మోతాదులో నిద్రమాత్రలు ఇచ్చింది. దీంతో బీవా అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో టవల్‌తో గొంతు నులిమి హత్య చేసింది. మృతదేహాన్ని ట్రాలీ బ్యాగ్‌లో కుక్కి పోలీస్‌ స్టేషన్‌కు తీసుకెళ్లింది. ఇంట్లో తగాదాల కారణంగా తల్లిని తానే హతమార్చినట్లు పోలీసుల ఎదుట లొంగిపోయింది. పోలీసులు నిందితురాలిని అదుపులోకి తీసుకున్నారు. దర్యాప్తు జరుపుతున్నారు.
చదవండి: బాచుపల్లిలో నారాయణ కాలేజీ విద్యార్థిని ఆత్మహత్య

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement