
మైసూరు: ఓ తల్లి ఉన్మాదిగా మారి రెండేళ్ల వయసున్న కుమారుడిని వేటకొడవలితో నరికి కడతేర్చింది. అనంతరం చెరువులోకి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈఘటన హెచ్.డి.కోటె తాలూకా, బూదనూరులో చోటు చేసుకుంది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం మేరకు బూదనూరు గ్రామానికి చెందిన శంకర్‌తో మేటికుప్పె గ్రామానికి చెందిన భవాని(28)కి ఐదేళ్ల క్రితం వివాహమైంది. తనను దేవుడు ఆవహిస్తున్నాడని భవానీ చెప్పేది.
చదవండి: రూ.35 లక్షల విలువైన శ్రీగంధం దుంగల పట్టివేత
దీంతో దంపతుల మధ్య గొడవలు జరిగేవి. ఈక్రమంలో భవానీ పుట్టింటికి వెళ్లింది. భర్త శంకర్ వెళ్లి భార్య, రెండేళ్ల కుమారుడిని గ్రామానికి తీసుకొని వచ్చాడు. నాలుగు రోజుల క్రితం శంకర్ వేరే ఊరికి వెళ్లాడు. ఈక్రమంలో భవానీ ఉన్మాదిలా మారింది.
శుక్రవారం తన బిడ్డను కొడవలితో దాడి చేసి హతమార్చింది. అనంతరం ఆమె చెరువులోకి దూకింది. స్థానికులు బాలుడిని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. మరో వైపు చెరువులో గాలించగా భవానీ కూడా విగతజీవిగా కనిపించింది. హెచ్‌డీ కోటె పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment