ఎంతకు తెగించింది..! భర్త రూ.8 కోట్లు ఇవ్వలేదని, ప్రియుడితో కలిసి | Wife Kills Man For 8 Crores Dumps Body 800 km Away: Cops | Sakshi
Sakshi News home page

ఎంతకు తెగించింది..! భర్త రూ.8 కోట్లు ఇవ్వలేదని, ప్రియుడితో కలిసి

Published Mon, Oct 28 2024 4:06 PM | Last Updated on Mon, Oct 28 2024 4:34 PM

Wife Kills Man For 8 Crores Dumps Body 800 km Away: Cops

బెంగళూరు: 20 రోజుల క్రితం జరిగిన హత్య కేసును పోలీసులు తాజాగా ఛేధించారు. పోలీసుల విచారణలో విస్తుపోయే విషయాలు వెలుగుచూశాయి. లగ్జరీ జీవితానికి అలవాటుపడిన మహిళ.. సొంత భర్తనే డబ్బులు డిమాంఢ్‌ చేయడం.. అతడు నిరాకరించడంతో ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసినట్లు తేలింది. పక్కా ప్లాన్‌ ప్రకారం హత్య చేసి మరో రాష్ట్రంలో మృతదేహాన్ని పడేసి నిప్పంటించిన మహిళ.. చివరకు పోలీసుల దర్యాప్తులో అడ్డంగా దరికిపోయింది.

పోలీసుల వివరాల ప్రకారం.. అక్టోబర్‌ 8న  కొడగు జిల్లాలో అక్టోబరు 8న సగం కాలిపోయిన మృతదేహాన్నికర్ణాటక పోలీసులు గుర్తించారు. సొంటికొప్ప టౌన్ సమీపంలోని కాఫీ ఎస్టేట్‌లో లభ్యమైన మృతదేహం 54 ఏళ్ల రమేష్ అనే తెలంగాణ వ్యాపారిదిగా గుర్తించారు. దీంతో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.  ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించారు. ఎరుపు రంగు మెర్సిడెస్ బెంజ్ కారు అక్కడ అనుమానాస్పదంగా తిరిగినట్లు గుర్తించారు. ఆ కారు ఎవరిదో తెలుసుకునేందుకు తుమకూరు వరకు 500కుపైగా సీసీటీవీ ఫుటేజ్‌లను పరిశీలించారు. చివరకు కారు నంబర్‌ ప్లేట్‌ను కనుగొన్నారు. హైదరాబాద్‌కు చెందిన 52 ఏళ్ల వ్యాపారవేత్త రమేష్ పేరుతో ఆ కారు రిజిస్టర్ అయినట్లు గుర్తించారు.

రమేష్‌ అదృష్యమైనట్లు అతని భార్య నిహారిక(29) ఇటీవల మిస్సింగ్ ఫిర్యాదును నమోదు చేసింది. దీంతో పోలీసులు కారు రిజిస్టర్ అయిన తెలంగాణలోని పోలీసులను సంప్రదించారు. అయితే రమేష్ హత్యలో ఆమె పాత్ర ఉన్నట్లు కొడగు పోలీసులు అనుమానించారు. ఆమెను అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. రూ.8 కోట్ల ఆస్తి కోసం ప్రియుడైన వెటర్నరీ డాక్టర్ నిఖిల్, గతంలో జైలులో పరిచయమైన అంకుర్ సహాయంతో భర్త రమేష్‌ను హత్య చేసినట్లు ఆమె ఒప్పుకుంది. అక్టోబర్‌ 1న హైదరాబాద్‌లోని ఉప్పల్‌ ప్రాంతంలో ఊపిరాడకుండా చేసి రమేష్‌ను చంపినట్లు కొడగు పోలీస్ అధికారి తెలిపారు.

నిందితులు అతడి ఇంటికి చేరుకుని డబ్బు తీసుకున్నారని చెప్పారు. ఆ తర్వాత రమేష్‌ మృతదేహంతో అతడి కారులో బెంగళూరుకు ప్రయాణించారని పేర్కొన్నారు బంకులో పెట్రోల్‌ నింపుకున్న తర్వాత కొడగు జిల్లా సుంటికొప్ప సమీపంలోని కాఫీ తోటలో రమేష్ మృతదేహానికి నిప్పంటించారని పోలీస్‌ అధికారి తెలిపారు. ఆ తర్వాత ముగ్గురు నిందితులు హైదరాబాద్‌కు చేరుకున్నారని, మూడు రోజుల తర్వాత తన భర్త కనిపించడంలేదని నిహారిక ఫిర్యాదు చేసిందని చెప్పారు.

కాగా, నిహారిక చిన్నప్పుడు పేదరికం వల్ల చాలా ఇబ్బందిపడినట్లు తెలిసిందని పోలీస్‌ అధికారి తెలిపారు. 16వ ఏటా ఆమె తండ్రి మరణించడంతో తల్లి రెండో పెళ్లి చేసుకుందని చెప్పారు. చదువులో రాణించిన నిహారిక ఇంజినీరింగ్ పూర్తి చేసి ఉద్యోగంలో చేరిందని అన్నారు. ఒక వ్యక్తిని పెళ్లాడిన ఆమె ఒక బిడ్డకు జన్మనిచ్చిందని, ఆ తర్వాత భర్త నుంచి విడిపోయిందని చెప్పారు. హర్యానాలో ఉన్నప్పుడు ఆర్థిక మోసానికి పాల్పడి జైలుకు కూడా వెళ్లిందని అన్నారు. జైలులో అంకుర్‌ పరిచయమైనట్లు వెల్లడించారు.

జైలు నుంచి విడుదలైన తర్వాత హైదరాబాద్‌కు చెందిన వ్యాపారవేత్త రమేష్‌తో నిహారికకు రెండో పెళ్లి జరిగినట్లు పోలీసులు తెలిపారు. అతడికి కూడా ఇది రెండో వివాహమని చెప్పారు. నిహారికకు రమేష్‌ విలాసవంతమైన జీవితాన్ని అందించాడని చెప్పారు. అయితే లగ్జరీ లైఫ్‌కు అలవాటు పడిన ఆమె రమేష్‌ను రూ.8 కోట్లు అడిగిందని, అంత డబ్బు ఇచ్చేందుకు భర్త నిరాకరించడతో అతడి ఆస్తి కోసం హత్య చేయాలని ప్లాన్‌ వేసిందన్నారు. రిలేషన్‌షిప్‌లో ఉన్న వెటర్నరీ డాక్టర్‌ నిఖిల్‌, జైలులో పరిచయమైన అంకుర్‌తో కలిసి రమేష్‌ను హత్య చేసి 800 కిలోమీటర్ల దూరంలో మృతదేహాన్ని పడేసి కాల్చివేశారని పోలీస్‌ అధికారి వివరించారు. ముగ్గురు నిందితులను అరెస్ట్‌ చేసి కేసు దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement