mysuru
-
ముడా కుంభకోణం.. సీఎం సిద్దరామయ్యపై ఎఫ్ఐఆర్ నమోదు
బెంగళూరు: కర్ణాటక రాజకీయాల్లో మైసూర్ అర్బర్ డెవలప్మెంట్ అథారిటీ(ముడా) భూ కుంభకోణం వ్యవహారం సంచలనం సృష్టిస్తోంది. తాజాగా ఈ కేసులో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్యపై లోకాయుక్త పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఎఫ్ఐఆర్లో సిద్ధరామయ్యను మొదటి ముద్దాయిగా పేర్కొనగా.. ఆయన సతీమణి పార్వతి, బావమరిది మల్లికార్జున్ స్వామి, దేవరాజ్, మల్లికార్జున స్వామిలను వరుస నిందితులుగా చేర్చింది.మూడా భూ కుంభకోణానికి సంబంధించి సిద్ధరామయ్యపై కేసు నమోదు చేయాలని ట్రయల్ కోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. ప్రజా ప్రతినిధుల ప్రత్యేక కోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే లోకాయుక్త పోలీసులు ఈ చర్యలు తీసుకున్నారు. మరోవైపు ముడా భూ కుంభకోణం కేసులో సీఎం సిద్ధరామయ్యపై విచారణకు గవర్నర్ అనుమతివ్వడాన్ని బుధవారం హైకోర్టు సమర్ధించిన విషయం తెలిసిందే. ఈ అనుమతిని సవాల్ చేస్తూ సీఎం వేసిన పిటిషన్‌ను కొట్టివేస్తూ.. గవర్నర్ చర్యలుచట్ట ప్రకారం ఉన్నాయని తెలిపింది. చదవండి: రాహుల్ ధైర్యవంతుడు, నిజాయితీ కలిగిన నేత: సైఫ్ ప్రశంసలు -
జైల్లో స్టార్ హీరో విలాసాలు.. కాఫీ కప్పు,సిగరెట్‌తో..
ఓ చేతిలో కాఫీ కప్పు.. మరో చేతిలో సిగరెట్‌ను గుప్పు గుప్పు మని పీలుస్తున్న ఈ స్టార్ హీరో ఎవరో గుర్తు పట్టారా?ఈ ఏడాది జూన్ 8,2024 తన ప్రియురాలు పవిత్ర గౌడ అశ్లీల పంపించాడని రేణుకాస్వామి (28) అనే యువకుడిని దారుణంగా హత్య చేసి జైలు శిక్షను అనుభవిస్తున్న శాండల్ వుడ్ స్టార్ హీరో దర్శన్ తూగదీపదే ఆ ఫొటో. అభిమాని హత్య కేసులోని ఏ1 దర్శన్‌తో పాటు ఇతర నిందితులు బెంగళూరులోని పరప్పన అగ్రహార జైలులో శిక్షను అనుభవిస్తున్నారు. కాగా, దర్శన్ బెయిల్ కోసం ఆయన భార్య ప్రయత్నిస్తున్నారు.ఈ తరుణంలో దర్శన్ పరప్పన అగ్రహార జైలు గార్డెన్లో ఓ చేతిలో కాఫీ కప్పు, మరో చేతిలో సిగరెట్ తాగుతూ రిలాక్స్ అవుతున్న ఫొటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దర్శన్‌తో పాటు రౌడీ షీటర్ విల్సన్ గార్డెన్ నాగ,మరో ఖైదీ మేనేజర్ నాగరాజ్ ఉన్నారు.ఇక ఈ ఫొటోని అదే జైలులో ఉన్న వేలు అనే ఖైదీ తన భార్యకు పంపాడని, అది సోషల్ మీడియాలో షేర్ అవ్వడంతో క్షణాల్లో వైరలైనట్లు తెలుస్తోంది. అదే సమయంలో జైల్లో నిబంధనలపై అనేక విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.హత్య కేసులో జైలు శిక్షను అనుభవిస్తున్న దర్శన్‌కు వీవీఐపీ ట్రీట్మెంట్ అందుతుందని నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అందుకు జైలు గార్డెన్లో తోటి నేరస్తులతో కబర్లు చెప్పుకునేందుకు ఏర్పాటు చేసిన కుర్చీలు, తాగేందుకు కాఫీ, సిగరెట్లు అందించడమేనని అంటున్నారు. మరి ఈ ఫొటోపై పరప్పన జైలు అధికారులు ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాల్సి ఉంది. ಏನ್ರೀ ಸ್ವಾಮಿ ಜೈಲುಇದ್ರೆ ನೆಮ್ಮದಿ ಆಗಿರ್ಬೇಕು 💀💥#DBoss #Darshan pic.twitter.com/eTNmHZqt4j— S R E E | ಶ್ರೀ ✨ (@SreeDharaNEL) August 25, 2024 -
ద్రవిడ్ కొడుకుకు సూపర్ ఆఫర్
టీమిండియా తాజా మాజీ కోచ్ రాహుల్ ద్రవిడ్ పెద్ద కొడుకు సమిత్ ద్రవిడ్‌కు బంపరాఫర్ లభించింది. కర్ణాటక టీ20 లీగ్ (కేఎస్‌సీఏ టీ20 టోర్నీ) వేలంలో సుమిత్‌ను గత సీజన్ రన్నరప్ మైసూరు వారియర్స్ సొంతం చేసుకుంది. పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ అయిన సమిత్‌ను రూ. 50000 సొంతం చేసుకున్నట్లు ఫ్రాంచైజీ యాజమాన్యం ప్రకటించింది.18 ఏళ్ల సమిత్ ఇప్పటివరకు సీనియర్ స్థాయి క్రికెట్ ఆడలేదు. సీనియర్లతో కలిసి ఆడేందుకు సమిత్‌కు ఇది మంచి అవకాశం. సమిత్‌ను కొనుగోలు చేసిన మైసూరు జట్టుకు టీమిండియా ట్రిపుల్ సెంచూరియన్ కరుణ్ నాయర్ సారథ్యం వహించనున్నాడు. ఇదే జట్టులో టీమిండియా పేసర్ ప్రసిద్ద్ కృష్ణ ఉన్నాడు. వీరి సహవాసంలో సమిత్ మరింత రాటుదేలే అవకాశం ఉంది. ప్రస్తుత సీజన్ కూచ్ బెహర్ ట్రోఫీ గెలిచిన కర్ణాటక అండర్-19 జట్టులో సమిత్ సభ్యుడిగా ఉన్నాడు. మిడిలార్డర్లో ఉపయోకరమైన బ్యాటర్‌గా పేరున్న సమిత్ ఇటీవలి కాలంలో అద్బుతంగా ఆడుతూ తండ్రికి తగ్గ తనయుడనిపించుకుంటున్నాడు. ఈ ఏడాది ప్రారంభంలో ఇంగ్లండ్ కౌంటీ జట్టు లాంకాషైర్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ సమిత్ పర్వాలేదనిపించాడు.ఇదిలా ఉంటే, సమిత్ తండ్రి రాహుల్ ద్రవిడ్ ఇటీవలే టీమిండియాను టీ20 వరల్డ్‌కప్ గెలిపించి హెడ్ కోచ్ పదవి నుంచి తప్పుకున్నాడు. ద్రవిడ్ సుమారు రెండున్నర సంవత్సరాల పాటు భారత హెడ్ కోచ్‌గా వ్యవహరించాడు. ద్రవిడ్ స్థానంలో టీమిండియా హెడ్ కోచ్‌గా గౌతమ్ గంభీర్ ఎంపికయ్యాడు. గంభీర్ ఆథ్వర్యంలో టీమిండియా రేపటి నుంచి శ్రీలంకతో టీ20 సిరీస్ ఆడనుంది.మైసూర్ వారియర్స్ జట్టు:కరుణ్ నాయర్, కార్తీక్ సీఏ, మనోజ్ భండగే, కార్తీక్ ఎస్‌యూ, సుచిత్ జే, గౌతమ్ కే, విద్యాధర్ పాటిల్, వెంకటేష్ ఎం, హర్షిల్ ధర్మాని, గౌతమ్ మిశ్రా, ధనుష్ గౌడ, సమిత్ ద్రవిడ్, దీపక్ దేవాడిగ, సుమిత్ కుమార్, స్మయన్ శ్రీవాస్తవ, జాస్పర్ ఈజే, ప్రసిద్ధ్ కృష్ణ , మహమ్మద్ సర్ఫరాజ్ అష్రఫ్. -
భారత్‌లో మరో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం.. ఎక్కడంటే?
ఎలా ఉంది ఫొటో? అద్భుతం అనిపిస్తోంది కదా? పెద్ద చెరువు.. పక్కనే పచ్చటి మైదానం. ఎక్కడుంది ఇది? అనుకుంటున్నారా? ఇప్పటికైతే లేదు కానీ... ఇంకొన్నేళ్లలో ఈ డిజైన్‌తో ఓ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంను నిర్మించాలని బీసీసీఐ ప్లాన్లు సిద్ధం చేస్తోంది. కర్ణాటకలోని మైసూర్లో కట్టనున్న ఈ స్టేడియం కోసం మైసూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (ముడా) 20.8 ఎకరాల స్థలాన్ని ఎంపిక చేసింది. కర్ణాటక రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ (కెఎస్‌సిఎ)కి అప్పగించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ముడా ఆ భూమిని కెఎస్‌సిఎ 30 సంవత్సరాల లీజుకు ఇవ్వనున్నట్లు సమాచారం. లీజు మొత్తం రూ. 18 కోట్లు ఉండవచ్చు. తాజాగా స్టేడియం నిర్మించే ప్రాంతాన్ని కెఎస్‌సిఎ అధికారులు పరిశీలించినట్లు వినికిడి. వచ్చే ఏడాది ఆఖరికి ఈ స్టేడియం నిర్మాణం పూర్తి కానున్నట్లు కెఎస్‌సిఎ వర్గాలు వెల్లడించాయి. మైసూర్లో ఈ స్టేడియం నిర్మాణం జరిగితే అది కర్ణాటక రాష్ట్రంలో రెండో అంతర్జాతీయ స్టేడియం కానుంది. ఇప్పటికే బెంగళూరులో చిన్నస్వామి అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం ఉన్న సంగతి తెలిసిందే. MUDA is all set to hand over 20.8 acres of land to the Karnataka state cricket association (KSCA) for the construction of a International cricket stadium in #Mysuru 🔥 pic.twitter.com/7TgGE7W3eD— 𝗦𝗵𝗿𝗲𝘆𝗶 ᵀᵒˣᶦᶜ (@NameIsShreyash) June 7, 2024 -
తండ్రికి సాధ్యం కానిది... కుమారుడు సాధించాడు
మైసూరు: మైసూరుకు రాజ వంశానికి చెందిన శ్రీకంఠదత్త నరసింహరాజు ఒడెయార్ మైసూరు పార్లమెంటుకు బీజేపీ నుంచి పోటీ చేసి విజయం సాధించలేకపోయారు. అయితే ఆయన దత్త కుమారుడు యదువీర్ శ్రీకంఠదత్త చామరాజ ఒడెయార్ బీజేపీ నుంచి పోటీ చేసి మొదటిసారే విజయం సాధించారు. శ్రీకంఠదత్త నరసింహరాజు ఒడెయార్ 1983లో రాజకీయాల్లోకి వచ్చారు. 1984లో కాంగ్రెస్ పారీ్టలో చేరి మైసూరు ఎంపీగా పార్లమెంట్‌కు పోటీ చేసి మొదటిసారి విజయం సాధించారు.అనంతరం 1991లో కాంగ్రెస్ నుంచి టికెట్ రాకపోవడంతో ఆ పార్టీని వీడి బీజేపీలో చేరారు. అనంతరం ఆ పార్టీ నుంచి పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి చంద్రప్రభ అరసుపై ఓటమి చవి చూశారు. తిరిగి కాంగ్రెస్‌లో చేరి 1996, 1999లో కాంగ్రెస్ నుంచి విజయం సాధించారు.2004 ఎన్నికలో పోటీ చేసి బీజేపీ అభ్యర్థి సీహెచ్ విజయశంకర్‌పై ఓటమి పాలయ్యారు. అనంతరం రాజకీయాలను దూరంగా ఉన్నారు. శ్రీకంఠ దత్త నరసింహరాజు ఒడెయార్ మరణాంతరం రాజవంశానికి చెందిన వారు ఎవరూ రాజకీయాల్లోకి రాలేదు.అయితే రాజమాత ప్రమోదాదేవి రాజకీయాల్లోకి వస్తారని అనుకున్నారు. ఆమె అయిష్టత చూపారు. 2015 ఫిబ్రవరి 23న యదువీర్ కృష్ణరాజ చామరాజ ఒడెయార్ను ప్రమోదాదేవి దత్తత తీసుకున్నారు. యదువంశానికి చెందిన 27వ యువరాజు శ్రీకంఠదత్త ఒడెయార్కు సంతానం లేదు. ప్రస్తుతం ఆయన దత్త కుమారుడు యదువీర్ మైసూరు–కొడగు పార్లమెంట్ నియోజకర్గానికి పోటీ చేసి విజయం సాధించారు.యదువీర్‌కు 1.30 లక్షల మెజారిటీ కాంగ్రెస్ అభ్యర్థి ఎం.లక్ష్మణ్‌కు 6,56,241 ఓట్లు, యదువీర్‌కు 7,95,503 ఓట్లు వచ్చాయి. యదువీర్‌కు 1,39,262 ఓట్ల మెజారిటీ లభించింది. -
నేత్రపర్వంగా మైసూరులో దసరా
మైసూరు: కర్ణాటకలో మైసూరు పట్టణంలో దసరా ఉత్సవాల్లో ప్రధాన ఘట్టమైన జంబూ సవారీ ఏనుగుల ఊరేగింపు మంగళవారం అంగరంగ వైభవంగా జరిగింది. ప్రముఖుల పూజలు, వేలాది మంది జనం మధ్య గజరాజులు ప్యాలెస్ నుంచి బన్ని మండపం వరకూ సుమారు 5 కిలోమీటర్లు ఊరేగింపుగా వెళ్లి వచ్చాయి. చాముండేశ్వరి అమ్మవారి విగ్రహంతో కూడిన 750 కిలోల బరువైన బంగారు అంబారీని అభిమన్యు ఏనుగుపై ప్రతిష్టించారు. మరో 13 ఏనుగులకు సీఎం సిద్దరామయ్య, మైసూరు రాజవంశీకులు తదితరులు ప్యాలెస్ వద్ద పూజలు చేసి మధ్యాహ్నం ఊరేగింపునకు నాంది పలికారు. అంతకుముందు, సీఎం సిద్దరామయ్య నంది ధ్వజ పూజలో పాల్గొన్నారు. సాయుధ బలగాల కవాతు, మేళతాళాలు, కళాకారుల ప్రదర్శనలు, 31 జిల్లాకు చెందిన శకటాల నడుమ ఏనుగులు ముందుకు సాగాయి. కర్ణాటక ప్రభుత్వం రాష్ట్ర ఉత్సవం(నాదహబ్బ)గా దసరా వేడుకలను నిర్వహిస్తుంది. 10 రోజులపాటు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటయ్యాయి. వీటిని తిలకించేందుకు విదేశాల నుంచీ జనం తరలివచ్చారు. Glimpse of Jumboo Savari reaching Bannimantapa and Ambaari taken back to Mysuru Palace 🙏🙏 VC : Suhas Shivaay#MysuruDasara2023 pic.twitter.com/gX3ykOOn3K — Mysuru Memes (@MysuruMemes) October 25, 2023 -
కట్టెల కోసం వెళ్తే కబళించిన పులి.. అటవీ సిబ్బంది క్వార్టర్స్ వద్దే ఘోరం!
సాక్షి, కర్ణాటక: మైసూరు జిల్లాలో ఇప్పటికే చిరుత పులులు అనేకమందిని పొట్టనపెట్టుకుంటూ ఉంటే, మరోవైపు పెద్ద పులులు కూడా జనం మీద పడుతున్నాయి. ఓ పులి యువకున్ని చంపిన సంఘటన మైసూరు జిల్లాలో హెచ్డీ కోటె పరిధిలో డీబీ కుప్ప వద్ద నాగరహోళె అడవుల్లోని బళ్ళె ప్రాంతంలో ఆదివారం జరిగింది. మరణించిన యువకుడిని మంజుగా (18) గుర్తించారు. వివరాలు... అటవీ శాఖకు చెందిన వసతి గృహాల వెనుక భాగంలో ఉన్న అడవిలో మంజు స్నేహితులతో కలిసి కట్టెల కోసం వెళ్లాడు. అటువైపు వచ్చిన పులి మంజు పైన దాడి చేసింది. తల వెనుకాల భాగంలో కొరికి, పంజాలతో చీల్చడంతో తీవ్రగాయాలై ప్రాణాలు వదిలాడు. అతని వెంట వచ్చిన మరికొంత మంది యువకులు అక్కడినుంచి పరుగులు పెట్టారు. అంతకుముందు మంజు అరుపులకు సమీపంలోని అటవీ సిబ్బంది వచ్చారు. వారిని చూసిన పులి మంజును వదిలి వెళ్ళిపోయింది. అటవీ సిబ్బంది వెంటనే మంజు మృతదేహాన్ని అక్కడి నుంచి ఆస్పత్రికి తరలించారు. అంతరసంత పోలీసులు పరిశీలించి కేసు నమోదు చేశారు. స్థానికుల ధర్నా.. క్వార్టర్స్ వెనుకలే పులి తిరుగుతున్నా అటవీ సిబ్బంది పట్టించుకోలేదని, అందుకే యువకుడు బలయ్యాడని స్థానిక ప్రజలు అటవీ అధికారుల పైన ఆగ్రహం వ్యక్తం చేశారు. మైసూరు– చామరాజనగర రహదారిపై రాస్తారోకో చేయడంతో వాహనాలకు ఆటంకం ఏర్పడింది. దీంతో పోలీసు, అటవీ ఉన్నతాధికారులు చేరుకుని రూ. 15 లక్షల పరిహారం అందజేస్తామని హామీ ఇచ్చారు. -
రోడ్డు ప్రమాదంలో ప్రధాని మోదీ సోదరుడి కుటుంబానికి గాయాలు
బెంగళూరు: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోదరుడు ప్రహ్లాద్ మోదీ కుటుంబ ప్రయాణిస్తున్న కారు రోడ్డు ప్రమాదానికి గురైంది. కర్ణాటకలోని మైసూర్ సమీపంలో వారు ప్రయాణిస్తున్న కారు రోడ్డు డివైడర్‌ను ఢీకొట్టింది. కారులో ప్రహ్లాద్ మోదీతో పాటు ఆయన భార్య, కుమారుడు, కోడలు, మనుమడు ఉన్నారు. ఈ ప్రమాదంలో మోదీ మనుమడి కాలుకి తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది. స్వల్ప గాయాలతో బయటపడిన మోదీ కుటుంబ సభ్యులను మైసూర్‌లోని జేఎస్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రహ్లాద్ మోదీ తన కుటుంబంతో కలిసి మెర్సిడేస్ బెంజ్ కార్లో బందిపురాకు వెళ్తుండగా మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు ప్రమాదం జరిగింది. కారు డివైడర్‌ను ఢీకొట్టడంతో ముందు భాగం పూర్తిగా దెబ్బతిన్నది. ప్రమాదం జరిగిన సమయంలో ఆయన కాన్వాయ్ సైతం ఉన్నట్లు సమాచారం. ఇదీ చదవండి: సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వానికి గట్టి ఎదురుదెబ్బ -
Karnataka Honour Killing: ఘోరాన్ని ముందే ఊహించి.. తల్లిదండ్రులు నన్ను చంపేస్తారంటూ..
మైసూరు: ప్రేమకు పణంగా తన ప్రాణం పోతుందని, అది తల్లిదండ్రుల చేతిలోనేనని ఆ యువతి ఊహించడం నిజమైంది. మైసూరు జిల్లాలోని పిరియా పట్టణ తాలూకా కగ్గుండి గ్రామంలో దళిత కులానికి చెందిన యువకున్ని ప్రేమించి పెళ్ళి చేసుకుందన్న కోపంతో కూతుర్ని తల్లిదండ్రులు హత్య చేసిన సంఘటన అంతటా సంచలనం సృష్టిస్తోంది. తల్లిదండ్రులు సురేష్, బేబి తనను వదలరని, చంపడానికి కూడా వెనుకాడరని హతురాలు, పీయూసీ చదివే శాలిని (17) రాసిన సుదీర్ఘ లేఖను పోలీసులు కనుగొన్నారు. హత్య జరగడానికి ముందు శాలిని అన్ని వివరాలతో పిరియా పట్టణ పోలీసులకు మూడు పేజీల లేఖను రాసింది. తను చనిపోతే అందుకు తల్లిదండ్రులే కారణమని, నన్ను హత్య చేయడానికి వారు మాస్టర్ ప్లాన్ సిద్ధం చేశారని అందులో పేర్కొంది. తన జీవితంలో ఎలాంటి సంతోషం లేదని, తల్లిదండ్రులు చిత్రహింసలకు గురి చేసేవారని ఆవేదన వ్యక్తం చేసింది. ఒకవేళ తాను మరణిస్తే ప్రియుడు మంజునాథ్‌కు ఎలాంటి సంబంధం లేదని, తల్లిదండ్రులు మాత్రమే కారణమని స్పష్టం చేసింది. చదవండి: (ట్రాప్ చేసింది ప్రజాప్రతినిధుల కుమారులే!) ఏడాది కిందట ఒక పరువు హత్య కాగా, గత ఏడాది జూన్‌లోనూ ఒక పరువు హత్య మైసూరు జిల్లాలో జరిగింది. పిరియాపట్టణలో ఇతర కులానికి చెందిన యువకున్ని ప్రేమిస్తోందన్న అక్కసుతో గాయత్రి అనే యువతిని ఆమె తండ్రి జయరాం పొలంలో నరికి చంపి పోలీసులకు లొంగిపోయాడు. ఈ నేపథ్యంలో జిల్లాలో పరువు హత్యలు పెరుగుతున్నాయన్న ఆందోళన నెలకొంది. -
తాళి కట్టే సమయానికి కుప్పుకూలిన వధువు.. ఆ తర్వాత భలే ట్విస్ట్
మైసూరు: రెండు నిమిషాల్లో వరుడు తాళి కట్టాల్సి ఉంది. ఇంతలో పెళ్లికూతురు కళ్లు తిరిగి పడిపోయింది. వెంటనే కొందరు నీళ్లు చల్లి కూర్చోబెట్టారు. వరుడు తాళి కట్టేందుకు సిద్ధం కాగా, వధువు వీల్లేదని మొండికేసింది. ఈ విడ్డూరం మైసూరు నగరంలోని విద్యాభారతి కళ్యాణ మండపంలో ఆదివారం చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. హెచ్డీ కోటెకు చెందిన యువకునితో మైసూరుకు చెందిన సించన అనే యువతికి పెద్దలు ఇటీవలే నిశ్చితార్థం చేశారు. కాగా, పెళ్లి వేడుకలో వధువు అడ్డం తిరిగింది. ఈ పెళ్లి ఎంతమాత్రం ఇష్టం లేదని, తాను ఇంటి పక్కన ఉన్న యువకున్ని ప్రేమించానని, అతనితోనే మూడుముళ్లు వేసుకుంటానని చెప్పడంతో వధూవరుల తల్లిదండ్రులు ఒక్కసారిగా షాకయ్యారు. ఇప్పుడు పెళ్లి వద్దంటే ఎలా?, తాము ఈ పెళ్లి కోసం రూ. 5 లక్షలకు పైగా ఖర్చు చేశామని, తమ డబ్బులు తిరిగి ఇవ్వాలని పెళ్లకొడుకు తల్లిదండ్రులు పట్టుబట్టారు. దీంతో, స్థానిక పోలీసులు వచ్చి వధువుకు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా ఆమె వినలేదు. దీంతో వధూవరులను పోలీసు స్టేషన్‌కు తరలించారు. ఎవరు చెప్పినా వినేది లేదని, ప్రేమించినవాడినే పెళ్లి చేసుకుంటానని పెళ్లికూతురు భీష్మించడంతో ఖాకీలు సైతం ఏమీ చేయలేకపోయారు. Bride refuses to marry at the last minute- says 'No' to the groom on the wedding day, and leaves the marriage hall with police protection. The incident happened at #Mysuru #Karnataka.@KeypadGuerilla Video pic.twitter.com/wlwc0bZ2qO — Siraj Noorani (@sirajnoorani) May 22, 2022 ఇది కూడా చదవండి: బాలికను కాళ్లతో తన్నుతూ ఆనందం పొందాడు.. వీడియో వైరల్ కావడంతో.. -
73 ఏళ్ల వయసు.. హుషారుగా గంతులేసిన మాజీ సీఎం
కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మరోసారి వార్తల్లో నిలిచారు. రాజకీయంతో కాదు.. ఈసారి ఆయన ఫోక్ డ్యాన్స్‌తో అదరగొట్టారు. మైసూర్ ఆలయ ఉత్సవాల్లో భాగంగా గురువారం రాత్రి ఆయన హుషారుగా స్టెప్పులేశారు. 73 ఏళ్ల సిద్ధరామయ్య తన సొంత ఊరు.. సిద్ధారామనహుండి నుంచి వచ్చిన బృందంతో కలిసి వీర కునిత అనే జానపద నృత్యానికి నృత్యం చేశారు. ఆ ఆలయ దైవం సిద్ధరామేశ్వరుడ్ని ప్రార్థిస్తూ.. గాల్లో చేతులు ఆడిస్తూ డ్యాన్సులు వేశారాయన. ఆ దైవం పేరు మీదే ఆయనకు సిద్ధరామయ్య పేరు పెట్టారు. పైగా అక్షరాభ్యాసం కంటే ముందు నుంచే ఆయన వీర కునిత నృత్యంలో ఆరితేరారు. అందుకే అంత లయబద్ధంగా వాళ్లతో కలిసి హుషారుగా గంతులేయగలిగారు. ನಮ್ಮೂರಿನ ಸಿದ್ಧರಾಮೇಶ್ವರ ದೇವರ ಜಾತ್ರೆಯಲ್ಲಿ ತಂದೆಯವರು ಸಂಗಡಿಗರೊಂದಿಗೆ ವೀರಕುಣಿತದ ಹೆಜ್ಜೆ ಹಾಕಿದ ಕ್ಷಣಗಳು pic.twitter.com/GjMv5v4oeA — Dr Yathindra Siddaramaiah (@Dr_Yathindra_S) March 24, 2022 ఈ వీడియోను ఆయన తనయుడు, కాంగ్రెస్ ఎమ్మెల్యే యతింద్ర సిద్ధరామయ్య షేర్ చేశారు. మూడేళ్లకొకసారి ఈ ఆలయ వేడుకలు ఘనంగా జరుగుతుంటాయి. కానీ, ఆలయ పునర్మిర్మాణం, కరోనా కారణంగా గత ఆరేళ్లుగా ఈ వేడుకలు జరగలేదు. దీంతో ఈ దఫా వేడుకలు ప్రత్యేకతను సంతరించుకున్నాయి. సిద్ధరామయ్య డ్యాన్సింగ్ స్కిల్స్ చూపించడం ఇదే కొత్త కాదు. 2010లో కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ‘బెల్లారీ చలో’ పాదయాత్ర సందర్భంగా వీరగషే అనే జానపద నృత్యానికి హైలెవల్ పర్ఫార్మెన్స్ ఇచ్చారాయన. -
గుండెపోటుతో పునీత్ రాజ్‌కుమార్ అభిమాని మృతి
Puneet Rajkumar Fan Dies Of Heart Attack In Nanjangud: దివంగత పునీత్ రాజ్‌కుమార్ అభిమాని గుండెపోటుతో మృతి చెందాడు. వివరాలు..పునీత్ నటించిన చివరి చిత్రం జేమ్స్ సినిమా విడుదల సందర్భంగా మైసూరు జిల్లా నంజనగూడు తాలూకా హెడియాల గ్రామంలో గురువారం జరిగిన సంబరాల్లో హెడియాల గ్రామ పంచాయతీ అధ్యక్షులు మంజులా కుమారుడు ఆకాశ్ (22) పాల్గొన్నాడు. ఈక్రమంలో ఆకాశ్ గుండెపోటుతో మరణించాడు. -
తమ్ముడిని తలుచుకొని కన్నీటి పర్యంతమయిన శివరాజ్‌కుమార్
Shiva Rajkumar Watches Puneeth Rajkumar Last Film James In Mysuru: దివంగత నటుడు పునీత్ రాజ్‌కుమార్ నటించిన చివరి సినిమా 'జేమ్స్' గురువారం ఆయన జన్మదినం సందర్భంగా విడుదలైంది. ఉదయం ఆరు గంటల నుంచే అభిమానులు థియేటర్ల వద్ద గుమిగూడారు. కొందరు తెరపై పునీత్‌ను చూసి నృత్యం చేయగా మరి కొందరు విలపించారు. పవర్ స్టార్ 47వ పుట్టిన రోజును అభిమానులు ఒక పండుగలా జరుపుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా నాలుగు వేల థియేటర్లలో సినిమా విడుదలైంది.చదవండి: పునీత్ చివరి చిత్రం 'జేమ్స్' ట్విట్టర్ రివ్యూ పునీత్ తెరపై కనపడగానే అభిమానుల ఈలలు, అరుపులతో థియేటర్లు దద్దరిల్లిపోయ్యాయి. మైసూరులో ఒక థియేటర్లో పునీత్ పెద్దన్న, నటుడు శివరాజ్‌కుమార్ సినిమాను చూశారు.ఈ సందర్భంగా అభిమానులు ఆయన్ను చుట్టుముట్టారు. ఫిలిం సిటీకి పునీత్ పేరు పెడితే సంతోషం మైసూరు జిల్లా నంజనగూడు తాలూకా హిమ్మావు గ్రామంలో నిర్మిస్తున్న ఫిలిం సిటీకి తన తమ్ముడు, దివంగత పునీత్ రాజ్‌కుమార్ పేరు పెడితే సంతోషిస్తామని హీరో శివరాజ్ కుమార్ అన్నారు. పునీత్ లేకుండా అతని పుట్టిన రోజు జరుపుకోవడం ఎంతో బాధగా ఉందని, ఇప్పటికీ తమ కుటుంబం అప్పు లేడనే విషయాన్ని జీర్ణించుకోలేకున్నామని కన్నీటి పర్యంతమయ్యారు. చదవండి: ఇప్పటికీ సీక్రెట్‌గానే.. పునీత్ లేడన్న విషయం ఆమెకు చెప్పలేదట -
కన్నతల్లి ఉన్మాదం.. దేవుడు ఆవహిస్తున్నాడని..
మైసూరు: ఓ తల్లి ఉన్మాదిగా మారి రెండేళ్ల వయసున్న కుమారుడిని వేటకొడవలితో నరికి కడతేర్చింది. అనంతరం చెరువులోకి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈఘటన హెచ్.డి.కోటె తాలూకా, బూదనూరులో చోటు చేసుకుంది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం మేరకు బూదనూరు గ్రామానికి చెందిన శంకర్‌తో మేటికుప్పె గ్రామానికి చెందిన భవాని(28)కి ఐదేళ్ల క్రితం వివాహమైంది. తనను దేవుడు ఆవహిస్తున్నాడని భవానీ చెప్పేది. చదవండి: రూ.35 లక్షల విలువైన శ్రీగంధం దుంగల పట్టివేత దీంతో దంపతుల మధ్య గొడవలు జరిగేవి. ఈక్రమంలో భవానీ పుట్టింటికి వెళ్లింది. భర్త శంకర్ వెళ్లి భార్య, రెండేళ్ల కుమారుడిని గ్రామానికి తీసుకొని వచ్చాడు. నాలుగు రోజుల క్రితం శంకర్ వేరే ఊరికి వెళ్లాడు. ఈక్రమంలో భవానీ ఉన్మాదిలా మారింది. శుక్రవారం తన బిడ్డను కొడవలితో దాడి చేసి హతమార్చింది. అనంతరం ఆమె చెరువులోకి దూకింది. స్థానికులు బాలుడిని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. మరో వైపు చెరువులో గాలించగా భవానీ కూడా విగతజీవిగా కనిపించింది. హెచ్డీ కోటె పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. -
విడాకులు వద్దు..కలసి కాపురం చేయండి: న్యాయమూర్తులు
మైసూరు: చిన్న చిన్న కారణాలతోనే విడాకులకు దరఖాస్తు చేసే జంటలు ప్రస్తుతం పెరిగిపోయాయి. ఇదే రీతిలో విడాకుల కోసం వచ్చిన జంటలను ఆదివారం మైసూరులో నిర్వహించిన లోక్ అదాలత్‌లో న్యాయమూర్తులు బుజ్జగించి మళ్లీ ఒక్కటి చేశారు. నగరంలోని కోర్టు కాంప్లెక్స్‌లో కుటుంబ తగాదాల జంటలకోసం లోక్ అదాలత్ నిర్వహించగా సుమారు 25 మంది దంపతులు విడాకులు కోరుతూ హాజరయ్యారు. వారికి విడాకుల వల్ల వచ్చే అనర్థాలను జడ్జిలు, న్యాయ నిపుణులు వివరించి.. కలసి కాపురం చేయాలని నచ్చజెప్పడంతో వారంతా మళ్లీ ఒక్కటయ్యారు. -
పునీత్ అభిమాని పాదయాత్ర
Puneeth Rajkumar Fan Walks From Mysuru To Tirupati As Tribute: మైసూరుకు చెందిన అభిమాని ఒకరు దివంగత యువ నటుడు పునీత్ రాజ్‌కుమార్‌కు నివాళులర్పిస్తూ తిరుమల కొండకు పాదయాత్ర ప్రారంభించాడు. మైసూరులోని ఆగ్రహారకు చెందిన మసాజ్ సందీప్‌కు పునీత్ అంటే వీరాభిమానం. ఆయన హఠాన్మరణంతో ఆవేదనకు గురయ్యాడు. పునీత్ ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ ఈనెల 19 నుంచి తిరుమలకు పాదయాత్ర చేపట్టారు. -
మైసూరు ఘటన: వీడియోలు తీసి.. 3 లక్షలు డిమాండ్
సాక్షి, బెంగళూరు/మైసూరు: ప్రశాంత రాచనగరం నేరాలతో తల్లడిల్లుతోంది. మైసూరు నగరంలోని చాముండి కొండ తప్పలిలో ఉన్న లలితాద్రిపురం సమీపంలో యువతిపైన ఇద్దరు అత్యాచారానికి పాల్పడిన కేసులో దుండగులు కరడుగట్టిన నేరస్తులుగా భావిస్తున్నారు. గ్యాంగ్ రేప్ దృశ్యాలను తమ మొబైల్ ఫోన్లలో రికార్డు చేశామని, రూ.3 లక్షలు ఇస్తే సరి, లేదంటే ఆ వీడియోలను సోషల్ మీడియాలో, ఇంటర్నెట్లో పెడతామని బాధితురాలి స్నేహితునికి ఫోన్‌చేసి హెచ్చరించారు. మంగళవారం రాత్రి యువతీ యువకుడు కలిసిఉండగా, ఇద్దరు దుండగులు యువకున్ని కొట్టి, యువతిపై దారుణానికి ఒడిగట్టడం తెలిసిందే. అప్పటినుంచి పోలీసులు దుండగుల కోసం గాలింపు చేపట్టారు. ఫోన్‌చేసి డబ్బు డిమాండ్ .. యువతీ యువకుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అఘాయిత్యం జరిపి పరారైన దుండగులు కొంతసేపటికి తనకు ఫోన్ చేశారని యువతి స్నేహితుడు తెలిపాడు. వీడియోల పేరుతో రూ. 3లక్షలు డిమాండ్ చేశారని పోలీసులకు వివరించాడు. అత్యాచారం, బెదిరింపుల సంగతిని పోలీసులకు ఫిర్యాదు చేయవద్దని దుండగులు బెదిరించారని తెలిపాడు. తమపైన ఎలాంటి కేసు నమోదైనా వెంటనే వీడియోలను సోషల్ మీడియాలో, నెట్లో వైరల్ చేస్తామని బెదిరించారు. కాగా, బాధితురాలు ప్రాణాలకు ప్రమాదం లేదని, వైద్యులు చికిత్స అందిస్తున్నారని పోలీసులు తెలిపారు. దుండగులు 20 నుంచి 30 ఏళ్ల మధ్య ఉన్నారని, పూర్తిగా మద్యం మత్తులో ఉన్నారని యువతి స్నేహితుడు చెప్పాడు. మొబైల్స్ ఆధారంగా దర్యాప్తు.. దుండగుల కోసం పోలీసులు పరిసర మొబైల్ టవర్లలో నమోదైన మొబైల్‌ఫోన్ నంబర్లను సేకరించి నిందితులను గుర్తించే పనిలో ఉన్నారు. ఘటనపై ఆళణహళ్లి పీఎస్‌లో కేసు నమోదైంది. ఆగస్టు 24వ తేదీ రాత్రి సుమారు 7.30 గంటల సమయంలో దారుణం జరిగినట్లు గుర్తించారు. ఆ సమయంలో అక్కడ ఉన్న మొబైల్ ఫోన్ల నంబర్లను ఆరా తీస్తున్నారు. అనుమానం ఉన్న వారిని పిలిచి పోలీసులు విచారణ చేస్తున్నరని అదనపు డిజిపి ప్రతాపరెడ్డి తెలిపారు. ప్రత్యేక బృందాలు గాలింపు సాగిస్తున్నాయన్నారు. పోలీస్ కమిషనర్ చంద్రగుప్త మాట్లాడుతూ మరికొన్ని గంటల్లో నిందితులను పట్టుకుంటామని చెప్పారు. మహిళా కమిషన్ రాక .. రాష్ట్ర మహిళా కమిషన్ అధ్యక్షురాలు ప్రమీళా నాయుడు గురువారం మైసూరుకు వచ్చి యువతిని కలిసి వివరాలు తెలుసుకున్నారు. పోలీసు అధికారులను కలిసి విచారణ ఎంత వరకు వచ్చిందని ఆరా తీశారు. మీడియాతో మాట్లాడుతూ దుండగుల ఆధారాలు లభ్యమైనట్లు పోలీసులు చెప్పారన్నారు. అతి త్వరలోనే వారిని పట్టుకొంటారన్నారు. ఆమె షాక్‌లో ఉంది: హోంమంత్రి.. యశవంతపుర: మైసూరులో లైంగికదాడిని సీరియస్‌గా పరిగణించినట్లు హోంమంత్రి అగర జ్ణానేంద్ర తెలిపారు. ఇంకా ఎవరినీ అరెస్ట్ చేయలేదన్నారు. బెంగళూరులో విలేకరులతో మాట్లాడారు. బాధితురాలికి ఆస్పత్రిలో చికిత్సలు అందిస్తున్నట్లు తెలిపారు. ఆమె షాక్‌లో ఉన్నందున ఆమె నుంచి వివరాలను సేకరించడం సాధ్యం కావడం లేదన్నారు. పోలీస్ ఉన్నతాధికారులు మైసూరులో ఉండి నిందితులను పట్టుకోవడానికి పనిచేస్తున్నారని తెలిపారు. బాధిత యువతి ఇతర రాష్ట్రాలకు చెందినవారని చెప్పారు. పర్యాటక కేంద్రంలో ఇలాంటి ఘటన జరగటం దురదృష్టకరమన్నారు. కాంగ్రెస్ రాజకీయం చేయడం సరికాదని, వారి హయాంలో జరగలేదా? అని ప్రశ్నించారు. చదవండి: దారుణం: మద్యం తాగి యువతిపై సామూహిక అత్యాచారం -
కష్టార్జితంతో గ్రంథాలయం: ఓర్వ లేక నిప్పు పెట్టిన దుండగులు
సాక్షి, మైసూరు: ఆయనొక ముస్లిం. నిరక్షరాస్యుడైనప్పటికీ చదువంటే అమితమైన మక్కువ. తాను కష్టపడి సంపాదించిన డబ్బులతో ఒక ప్రైవేట్ గ్రంథాలయాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. అందులో నిత్యం ఎంతో మంది పుస్తకాలు చదివేవారు. ఇది చూసి ఓర్వలేని కొందరు నిప్పు పెట్టడంతో నిన్నటివరకు కళకళలాడిన గ్రంథాలయం బూడిద కుప్పగా మారింది. 11 వేల పుస్తకాలు మంటల్లో ఆహుతయ్యాయి. కర్ణాటకలో మైసూరు నగరంలోని రాజీవ్‌నగరలోని 2వ స్టేజిలో ఈ ఘోరం చోటుచేసుకుంది. సయ్యద్ అనే భాషాభిమాని కష్టార్జితంతో ఒక షెడ్డునే గ్రంథాలయంగా మలిచాడు. వృత్తిరీత్యా చిన్నస్థాయి ప్లంబర్ అయిన ఆయనకు పుస్తకాలంటే విపరీతమైన ఇష్టం. కన్నడ భాష అంటే మరీ అధికం. చాలా ఏళ్ల కిందట వైవిధ్య పుస్తకాలతో లైబ్రరీని అందుబాటులోకి తెచ్చాడు. నిత్యం ఎంతోమంది వచ్చి పుస్తకాలు చదివి వెళ్లేవారు. కానీ శుక్రవారం రాత్రి గుర్తు తెలియని దుండగులు ఈ లైబ్రరీకి నిప్పు పెట్టారు. పుస్తకాలు, షెడ్డు మొత్తం మంటల్లో కాలిపోయాయి. ఫైర్ సిబ్బంది వచ్చేటప్పటికీ ఏమీ మిగలలేదు. కాలిపోయిన పుస్తకాలను చూసి సయ్యద్ బోరును విలపించాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దుండగుల కోసం గాలింపు చేపట్టారు. చదవండి: నడిచే పుస్తకాలయాలు బెంగాల్ ఎన్నికలు రక్తసిక్తం -
ట్రాఫిక్ పోలీసుల్ని ప్రజలు చితక్కొట్టేశారు
మైసూరు: ట్రాఫిక్ పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా బైకిస్టు జారి పడి మరణించడంతో తీవ్ర ఉద్రిక్తత చెలరేగింది. దీంతో కోపం వచ్చిన ప్రజలు పోలీసులను చితక్కొట్టారు. సోమవారం సాయంత్రం జరిగిన ఈ ఘటన వీడియోలు వైరల్ అయ్యాయి. వివరాలు.. మైసూరు నగరం బోగాది రింగ్ రోడ్డుపై దేవరాజ్ బైక్ నడుపుతుండగా సురేష్ అనే వ్యక్తి వెనుక కూర్చున్నాడు. కాస్త ముందు పోలీసులు వాహనాలను ఆపి తనిఖీలు చేస్తున్నారు. పోలీసులు చెయ్యెత్తి ఆపమనడంతో బైక్ అదుపు తప్పి కింద పడడం, దేవరాజ్ తీవ్ర గాయాలతో మరణించినట్లు తెలుస్తోంది. ఈ వార్త దావాలనంలా వ్యాపించడంతో స్థానికులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకుని ధర్నాకు దిగారు. పోలీసులు డబ్బుల కోసం ఎప్పుడంటే అప్పుడు తనిఖీలు చేస్తూ ప్రజలను ప్రమాదాలకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. వాదన ముదిరి కొందరు వ్యక్తులు ఏఎస్సైలు స్వామినాయక్, మాదేగౌడ, కానిస్టేబుల్ మంజులపై దాడి చేశారు. ఒక పోలీస్ జీపును తలకిందులు చేశారు. ప్రజలను రక్షించాల్సిన పోలీసులు భక్షకులుగా మారి ఇలాంటి అమాయకపు ప్రజల ప్రాణాలను బలి తీసుకుంటున్నారని ఆరోపించారు. Traffic Cop thrashed by locals in Mysore who were furious after one of the riders the cops tried to stop fell of the bike and lost his life. pic.twitter.com/n02bkc0F1t — Deepak Bopanna (@dpkBopanna) March 22, 2021 ఏం జరిగిందో తెలియదు.. పోలీసులు మాట్లాడుతూ బైక్‌ను టిప్పర్ ఢీకొనడం వల్లనే ప్రమాదం జరిగిందని, తమ తప్పేం లేదని చెప్పారు. బైక్ ప్రమాదంలో గాయపడిన సురేష్ తాము పొలీసులకు సుమారు 250 మీటర్ల దూరంలో ఉన్నామని, వెనుక నుంచి వేగంగా వచ్చిన టిప్పర్ తమ బైకును డీకొట్టిందని, కిందపడిన తరువాత ఏం జరిగిందో తనకు తెలియదని చెప్పాడు. దాడికి గురైన పోలీసులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు 8 మందిని అదుపులోకి తీసుకున్నారు. -
భార్య మేయరైతే.. ఆనందాన్ని ఆపడం ఎవరితరం?
సాక్షి, మైసూరు: భార్యామణి మేయరైతే భర్త ఆనందానికి పట్టపగ్గాలుంటాయా!, ఆ ఆనందాన్ని దాచుకోకుండా ఉండడం ఎవరితరం? అందుకే భార్య మేయరైన మరుక్షణమే ఆమెను గాల్లోకి ఎత్తి సంతోషాన్ని చాటుకున్నాడు భర్త. బుధవారం కర్ణాటకలోని పర్యాటకనగరి మైసూరు మేయర్ పీఠానికి ఎన్నిక జరిగింది. కాంగ్రెస్–జేడీఎస్ కూటమి నుంచి పోటీ పడిన జేడీఎస్ కార్పొరేటర్ రుక్మిణి ఘన విజయం సాధించారు. దీంతో ఆమె భర్త విజయోత్సాహంతో పొంగిపోయారు. రుక్మిణిని ముద్దాడుతూ ఎత్తుకోవడంతో అందరూ ముసిముసిగా నవ్వుకున్నారు. చదవండి: (కర్ణాటకలో మంకీ ఫీవర్.. తొలి కేసుగా నమోదు) -
కర్ణాటకలో తొలి ట్రాన్స్‌జెండర్ న్యాయవాది
మైసూరు: సమాజంలో అందరితో సమానంగా జీవించేందుకు అనేక హక్కులు సాధించుకున్న ట్రాన్స్జెండర్లు నైపుణ్యాలు పెంపొందించుకొని వివిధ రంగాల్లో రాణిస్తున్నారు. ఈక్రమంలో కర్ణాటకలో తొలిసారిగా ఒక ట్రాన్స్‌జెండర్ న్యాయవాద వృత్తిలోకి అడుగుపెట్టారు. మైసూరులోని జయనగర నివాసి శశికుమార్ అలియాస్ శశి ప్రస్తుతం ఒక సీనియర్ న్యాయవాది వద్ద సహాయకురాలిగా పని చేస్తున్నారు. 14 సంవత్సరాల వరకు యువకుడిగా ఉన్న ఈయన హార్మోన్స్‌లో వచ్చిన మార్పులతో యువతిగా మారాడు. మైసూరులోని అశోకపురంలో ఉన్న సిద్ధార్థ పాఠశాలలో 8 నుంచి 10వ తరగతి వరకు చదివిన శశి, మైసూరులో సైన్స్(పీసీఎంబీ) చదివారు. తర్వాత కువెంపు నగరంలో ఉన్న సోమాని కళాశాలలో ఆర్ట్స్ విభాగంలో శిక్షణ పొందారు. కర్ణాటక ఓపెన్ యూనివర్సిటీలో ప్రజా పరిపాలన కోర్సు చదివారు. 2018లో విద్యావర్ధక లా కళాశాలలో చేరి మూడేళ్ల లా కోర్సు పూర్తి చేశారు. చదువంటే ఎంతో ఇష్టం.. శశి మాట్లాడుతూ.. ‘చిన్నప్పటి నుంచి చదువు అంటే ఎంతో ఇష్టం. ఎంతో మంది అవహేళన చేసినా ఉన్నత విద్య అభ్యసించేందుకు శ్రమించాను. ఫీజులు చెల్లించేందుకు డబ్బు లేక పలువురి ఇళ్లలో పని చేశాను. తోటి విద్యార్థుల వద్ద కూడా అవమానాలు ఎదుర్కొన్నా. ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద యాచించుకోవాలని కొందరు ఒత్తిడి చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. పంచకర్మ వైద్యురాలు డాక్టర్ జే.రశ్మిరాణి నా ఉన్నత చదువులకు ఫీజులు చెల్లించి ఎంతో సహకారం అందించారు. మున్ముందు న్యాయమూర్తిగా ఎదగాలనేది నా ఆశయం’ అని తెలిపారు. చదవండి: 150 ఏళ్ల అనంతరం తొలి ఉరి.. 40 ఏళ్లలో తొలిసారి దిశ రవి.. ఎఫ్ఎఫ్ఎఫ్ అంటే ఏమిటి? -
అమెరికాలో కాల్పులు.. భారతీయ విద్యార్థి మృతి
మైసూరు : ఉన్నత చదువుల కోసం అమెరికాకు వెళ్లిన మైసూరు యువకుడు ఓ దుండగుడు జరిపిన కాల్పుల్లో మృతిచెందాడు. గురువారం జరిగిన ఈ ఘటన శుక్రవారం వెలుగులోకి వచ్చింది. మైసూరులోని కువెంపు నగర్‌కు చెందిన అభిషేక్ సుధేశ్ భట్ (25) ఇంజనీరింగ్ పూర్తిచేసి ఏడాదిన్నర క్రితం ఎంఎస్ చేసేందుకు అమెరికా వెళ్లాడు. శాన్ బెర్నార్డియాలోని కాలిఫోర్నియా స్టేట్ యూనివర్సిటీలో ఎంఎస్ చేస్తూ ఓ హోటల్లో పార్ట్‌టైమ్ ఉద్యోగం చేస్తున్నాడు. ఈ క్రమంలో గురువారం హోటల్‌కు వచ్చిన ఓ దుండగుడు అభిషేక్‌తో గొడవపడి, తుపాకితో కాల్పులు జరిపి పారిపోయాడు. తీవ్ర గాయాలతో అభిషేక్ అక్కడిక్కడే మృతి చెందాడు. -
ఇడ్లీ చాలెంజ్.. ఈ బామ్మతో పోటీ పడగలరా
బెంగళూరు: ఇడ్లీ చాలామందికి ఇష్టమైన అల్పాహారం. ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. తేలీకగా జీర్ణం అవుతుంది. అయితే ఇడ్లీ అంటే ఎంత ఇష్టం ఉన్నా మాములుగా ఎన్ని తినగల్గుతారు.. నాలుగు, ఆరు సరే ఓ పది. కానీ నిమిషంలోనే ఆరు ఇడ్లీలు స్వాహా చేసే వారిని ఎప్పుడైనా చూశారు. అది కూడా 60 ఏళ్ల బామ్మ అంటే నమ్మగలరా. కానీ ఇది వాస్తవం. దసరా ఉత్సవాల సందర్భంగా మైసూరులో ఇడ్లీ తినే పోటీ పెట్టారు. హుల్లాహళ్లి ప్రాంతానికి చెందిన సరోజమ్మ అనే 60 ఏళ్ల మహిళ ఏకంగా నిమిషంలో ఆరు ఇడ్లీలు తిని ఔరా అనిపించడమే కాక పోటీలో మొదటి స్థానంలో నిలిచింది. యువతులు, పెళ్లైనవారు కూడా ఈ పోటీలో పాల్గొన్నారు. కానీ వారందరిని సరోజమ్మ ఓడించింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో తెగ వైరలవుతోంది. ఇందుకు సంబంధించిన వీడియో హిందుస్తాన్ టైమ్స్, ఏఎన్ఐలో వచ్చింది. -
కాపీ డే వీజీ సిద్దార్థ తండ్రి మృతి
సాక్షి, మైసూరు: కెఫే కాపీ డే వ్యవస్థాపకుడు వీజీ సిద్దార్థ తండ్రి గంగయ్య హెగ్డే ఆదివారం మృతి చెందారు. మైసూరులోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ఇవాళ మృతి చెందినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. కాగా తీవ్ర ఆర్థిక ఒత్తిళ్లతో వీజీ సిద్ధార్థ ఈ ఏడాది ఆగస్ట్‌లో ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. మంగళూరుకి సమీపంలో ఉన్న నేత్రవతి బ్రిడ్జి వద్ద కారు దిగి ఫోన్ మాట్లాడుతూ నడుచుకుంటూ వెళ్లిన ఆయన ఆ తర్వాత కనిపించలేదు. ఎంతకీ రాకపోవడంతో ఆందోళన చెందిన కారు డ్రైవర్.. కుటుంబసభ్యులకు సమాచారం అందించడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఆయన కోసం తీవ్రంగా గాలించారు. చివరకు ఓ జాలరి ఇచ్చిన సమాచారంతో నేత్రానది వద్ద సిద్ధార్థ మృతదేహాన్ని కనుగొన్నారు. వీజీ సిద్ధార్థ ఆత్మహత్యకు ముందు ఆయన తన తండ్రి చికిత్స పొందుతున్న ఆస్పత్రికి వెళ్లి కొద్దిసేపు గడిపారు. మరోవైపు అనారోగ్య కారణాల నేపథ్యంలో గంగయ్య హెగ్డేకు కుమారుడు ఆత్మహత్య చేసుకున్న విషయాన్ని చెప్పకుండా కుటుంబసభ్యులు గోప్యంగా ఉంచారు. చదవండి: కాఫీ మొఘల్కు ఏమైంది? షేర్లు డీలా -
సిద్ధరామయ్యపై కేసు నమోదుకు కోర్టు ఆదేశాలు
మైసూరు : కర్ణాటక మాజీ సీఎం సిద్ధరామయ్యకు మైసూరులోని జిల్లా కోర్టు షాక్ ఇచ్చింది. భూ అక్రమణ కేసులో సిద్ధరామయ్యపై కేసు నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. సిద్ధరామయ్య డిప్యూటీ సీఎంగా ఉన్నప్పుడు మైసూరు పరిధిలోని హింకల్ ప్రాంతంలో భూ అక్రమణలకు పాల్పడినట్టు ఆరోపిస్తూ గంగరాజు అనే వ్యక్తి కోర్టుని ఆశ్రయించారు. దీనిపై గంగరాజు మాట్లాడుతూ.. సిద్ధరామయ్య తనకు కేటాయించిన స్థలంతో పాటు మరికొంత స్థలాన్ని ఆక్రమించి ఇంటిని నిర్మించుకున్నారని ఆరోపించారు. కొంత కాలం తర్వాత ఆ ఇంటిని ఇతరులకు విక్రయించారని.. ఈ భూ వ్యవహారానికి సంబంధించి తాను 2017లోనే లక్ష్మీపురం పోలీసులను ఆశ్రయించానని తెలిపారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో ఈ అక్రమాలకు సంబంధించిన వివరాలను గవర్నర్‌కు అందజేసినట్టు వెల్లడించారు. ఆ తర్వాత కోర్టుని ఆశ్రయించానని తెలిపారు. గంగరాజు పిటిషన్‌పై విచారణ చేపట్టిన కోర్టు సిద్ధరామయ్యతో పాటు మరో ముగ్గురిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని లక్ష్మీపురం పోలీసులను ఆదేశించింది.