
మైసూరు : కర్ణాటక మాజీ సీఎం సిద్ధరామయ్యకు మైసూరులోని జిల్లా కోర్టు షాక్ ఇచ్చింది. భూ అక్రమణ కేసులో సిద్ధరామయ్యపై కేసు నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. సిద్ధరామయ్య డిప్యూటీ సీఎంగా ఉన్నప్పుడు మైసూరు పరిధిలోని హింకల్ ప్రాంతంలో భూ అక్రమణలకు పాల్పడినట్టు ఆరోపిస్తూ గంగరాజు అనే వ్యక్తి కోర్టుని ఆశ్రయించారు.
దీనిపై గంగరాజు మాట్లాడుతూ.. సిద్ధరామయ్య తనకు కేటాయించిన స్థలంతో పాటు మరికొంత స్థలాన్ని ఆక్రమించి ఇంటిని నిర్మించుకున్నారని ఆరోపించారు. కొంత కాలం తర్వాత ఆ ఇంటిని ఇతరులకు విక్రయించారని.. ఈ భూ వ్యవహారానికి సంబంధించి తాను 2017లోనే లక్ష్మీపురం పోలీసులను ఆశ్రయించానని తెలిపారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో ఈ అక్రమాలకు సంబంధించిన వివరాలను గవర్నర్‌కు అందజేసినట్టు వెల్లడించారు. ఆ తర్వాత కోర్టుని ఆశ్రయించానని తెలిపారు. గంగరాజు పిటిషన్‌పై విచారణ చేపట్టిన కోర్టు సిద్ధరామయ్యతో పాటు మరో ముగ్గురిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని లక్ష్మీపురం పోలీసులను ఆదేశించింది.
Comments
Please login to add a commentAdd a comment