కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మరోసారి వార్తల్లో నిలిచారు. రాజకీయంతో కాదు.. ఈసారి ఆయన ఫోక్ డ్యాన్స్‌తో అదరగొట్టారు. మైసూర్ ఆలయ ఉత్సవాల్లో భాగంగా గురువారం రాత్రి ఆయన హుషారుగా స్టెప్పులేశారు.
73 ఏళ్ల సిద్ధరామయ్య తన సొంత ఊరు.. సిద్ధారామనహుండి నుంచి వచ్చిన బృందంతో కలిసి వీర కునిత అనే జానపద నృత్యానికి నృత్యం చేశారు. ఆ ఆలయ దైవం సిద్ధరామేశ్వరుడ్ని ప్రార్థిస్తూ.. గాల్లో చేతులు ఆడిస్తూ డ్యాన్సులు వేశారాయన. ఆ దైవం పేరు మీదే ఆయనకు సిద్ధరామయ్య పేరు పెట్టారు. పైగా అక్షరాభ్యాసం కంటే ముందు నుంచే ఆయన వీర కునిత నృత్యంలో ఆరితేరారు. అందుకే అంత లయబద్ధంగా వాళ్లతో కలిసి హుషారుగా గంతులేయగలిగారు.
ನಮ್ಮೂರಿನ ಸಿದ್ಧರಾಮೇಶ್ವರ ದೇವರ ಜಾತ್ರೆಯಲ್ಲಿ ತಂದೆಯವರು ಸಂಗಡಿಗರೊಂದಿಗೆ ವೀರಕುಣಿತದ ಹೆಜ್ಜೆ ಹಾಕಿದ ಕ್ಷಣಗಳು pic.twitter.com/GjMv5v4oeA
— Dr Yathindra Siddaramaiah (@Dr_Yathindra_S) March 24, 2022
ఈ వీడియోను ఆయన తనయుడు, కాంగ్రెస్ ఎమ్మెల్యే యతింద్ర సిద్ధరామయ్య షేర్ చేశారు. మూడేళ్లకొకసారి ఈ ఆలయ వేడుకలు ఘనంగా జరుగుతుంటాయి. కానీ, ఆలయ పునర్మిర్మాణం, కరోనా కారణంగా గత ఆరేళ్లుగా ఈ వేడుకలు జరగలేదు. దీంతో ఈ దఫా వేడుకలు ప్రత్యేకతను సంతరించుకున్నాయి.
సిద్ధరామయ్య డ్యాన్సింగ్ స్కిల్స్ చూపించడం ఇదే కొత్త కాదు. 2010లో కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ‘బెల్లారీ చలో’ పాదయాత్ర సందర్భంగా వీరగషే అనే జానపద నృత్యానికి హైలెవల్ పర్‌ఫార్మెన్స్ ఇచ్చారాయన.
Comments
Please login to add a commentAdd a comment