బెంగళూరు:కర్ణాటకలోని మైసూరు(Mysuru) మునిసిపల్ కార్పొరేషన్ తీసుకున్న నిర్ణయం వివాదాస్పదమవుతోంది. నగరంలోని ఒక ప్రధాన రోడ్డుకు సీఎం సిద్ధరామయ్య(Siddaramaiah)పేరు పెట్టాలని మైసూరు కార్పొరేషన్ ప్రతిపాదించడం పట్ల ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నాయి. ఈ నిర్ణయం ప్రజలను అవమానపరచడమేనని జనతాదళ్ సెక్యులర్(JDS) పార్టీ విమర్శించింది.
మైసూరు నగరంలోని శ్రీలక్ష్మి వెంకటేశ్వరస్వామి సర్కిల్ నుంచి మెటగల్లిలోని రాయల్‌ఇన్ జంక్షన్ వరకు ఉన్న రోడ్డుకు సిద్ధరామయ్య ఆరోగ్యమార్గ అని పేరు పెట్టేందుకు మైసూరు మునిసిపల్ కార్పొరేషన్ నిర్ణయించింది. ఈ రోడ్డుకు సిద్ధరామయ్య పేరు పెట్టాలని చామరాజ ఎమ్మెల్యే హరీశ్‌గౌడ తొలుత సిఫారసు చేసినట్లు తెలుస్తోంది.
మైసూరు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ(Muda) కేసులో ఏ1 నిందితుడిగా ఉన్న సిద్ధరామయ్య పేరును రోడ్డుకు ఎలా పెడతారని బీజేపీ ప్రశ్నిస్తోంది.కార్పొరేషన్‌లో ఎన్నికైన పాలకవర్గంలేని ప్రస్తుత సమయంలో కొందరు అధికారులు ప్రభుత్వ మెప్పు కోసం ఈ నిర్ణయం తీసుకున్నారని బీజేపీ ఆరోపిస్తోంది.
ఇదీ చదవండి: గులాబ్‌జామూన్‌తో మాజీ మంత్రికి చిక్కులు
Comments
Please login to add a commentAdd a comment