rename
-
పోర్టు బ్లెయర్ పేరు మార్చిన కేంద్రం.. కొత్తగా..
ఢిల్లీ: కేంద్రంలోని బీజేపీ సర్కార్ దేశంలోని పలు ప్రాంతాల పేర్లను మార్చడంలో బిజీగా ఉంది. ఉత్తరాదిలో ఇప్పటికే పలు ప్రాంతాల పేర్లను మార్చిన కేంద్రం.. తాజాగా అండమాన్ నికోబార్ దీవుల రాజధాని పోర్ట్ బ్లెయిర్ పేరును కేంద్ర ప్రభుత్వం మార్చింది. ఇక, నుంచి పోర్టు బ్లెయిర్ పేరును శ్రీ విజయపురంగా పిలవాలని సూచించింది.ఈ సందర్భంగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా ట్విట్టర్ వేదికగా.. ప్రధాని నరేంద్ర మోదీ ఆశయాలకు అనుగుణంగా పోర్ట్‌బ్లెయిర్ పేరును శ్రీ విజయపురంగా మార్చాలని నిర్ణయించాం. మునుపటి పేరు వలసవాద వారసత్వాన్ని సూచిస్తోంది. శ్రీ విజయపురం అనేది భారత స్వాతంత్ర్య పోరాటంలో సాధించిన విజయానికి ప్రతీక. నాటి పోరాటంలో అండమాన్ నికోబార్ పాత్ర ఎంతో ప్రత్యేకం అని చెప్పుకొచ్చారు. Inspired by the vision of PM @narendramodi Ji, to free the nation from the colonial imprints, today we have decided to rename Port Blair as "Sri Vijaya Puram."While the earlier name had a colonial legacy, Sri Vijaya Puram symbolises the victory achieved in our freedom struggle…— Amit Shah (@AmitShah) September 13, 2024 Central Government renames Port Blair in Andaman and Nicobar Islands to "Sri Vijaya Puram" pic.twitter.com/pw18yukCOl— All India Radio News (@airnewsalerts) September 13, 2024 ఇది కూడా చదవండి: కోల్‌కతా అభయ కేసులో బిగ్ ట్విస్ట్.. -
కర్ణాటక: రామనగర జిల్లా ఇక బెంగళూరు సౌత్
బెంగళూరు: కర్ణాటక కేబినెట్ శుక్రవారం(జులై 26) కీలక నిర్ణయం తీసుకుంది. రామనగర జిల్లా పేరును బెంగళూరు సౌత్‌గా మార్చారు. పేరు మార్పు నిర్ణయాన్ని కేబినెట్ ఆమోదించినట్లు న్యాయ, శాసనసభా వ్యవహారాల మంత్రి హెచ్‌కే పాటిల్ తెలిపారు.రామనగర జిల్లాలోని మాగడి, కనకాపుర, చెన్నపట్న,హరోహల్లి తాలూకాలు బ్రాండ్ బెంగళూరు వినయోగించుకోవడం కోసమే పేరు మార్చినట్లు ప్రభుత్వం చెబుతోంది. ఈ పేరు మార్పు ఉంటుందని రామనగర జిల్లా నుంచే ప్రాతినిథ్యం వహిస్తున్న డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ గత ఏడాదే వెల్లడించారు. జిల్లా పేరు మార్చాలని డీకే శివకుమార్ నేతృత్వంలో రామనగర జిల్లా ప్రజాప్రతినిధులు ప్రభుత్వానికి ఇప్పటికే వినతి పత్రం సమర్పించారు. -
రాష్ట్రపతి భవన్‌లోని దర్బార్ హాల్, అశోక్ హాల్ పేర్ల మార్పు
న్యూఢిల్లీ: రాష్ట్రపతి భవన్‌లోని ముఖ్యమైన రెండు హాళ్ల పేర్లను కేంద్రం మార్చింది. పలు ముఖ్యమైన కార్యక్రమాలకు వేదికగా ఉన్న దర్బార్ హాల్, అశోక్ హాల్ పేర్లను పేర్లను.. ఇకపై ‘గణతంత్ర మండపం’,‘అశోక్ మండపం’గా పిలవనున్నారు. ఈ మేరకు ప్రెసిడెంట్ సెక్రటేరియట్ గురువారం వెల్లడించింది. భారతీయ సాంస్కృతిక విలువలు, నైతికతలను ప్రతిబింబించేలా చేయడంలో భాగంగా ఈ పేర్లు మార్చినట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది.కాగా జాతీయ అవార్డుల ప్రదానం వంటి కీలక కార్యక్రమాలు దర్బార్ హాల్లో జరుగుతుంటాయి. ‘దర్బార్’ అనే పదం కోర్టు, అసెంబ్లీ అనే అర్థాలను ప్రతిబింబిస్తుంది. గతంలో ఆంగ్లేయులు, భారత పాలకులు సమావేశాలు నిర్వహించిన ప్రాంతాన్ని దర్బార్ అనేవారు. అయితే భారత్ గణతంత్ర రాజ్యంగా మారిన తర్వాత ఆ పదం ప్రాముఖ్యతను కోల్పోయింది. గణతంత్ర అనే పదం స్వతంత్ర భారతంలో లోతుగా పాతుకుపోయింది. అందుకే ఈ హాల్‌కు గణతంత్ర మండపంగా మారుస్తున్నాం’ అని అధికారిక ప్రకటనలో పేర్కొంది.ఇకపోతే ‘అశోక్ హాల్’ పేరును ‘అశోక్ మండపం’ అని మార్చడంపై కూడా కేంద్రం వివరణ ఇచ్చింది.‘ అశోక్ హాల్ నిజానికి ఒక బాల్రూమ్. అశోక్ అంటే అన్ని బాధల నుంచి విముక్తుడైన వ్యక్తి అని అర్థం. అలాగే 'అశోక' అనేది అశోక్ చక్రవర్తిని సూచిస్తుంది. ఇది ఐక్యత, శాంతియుత సహజీవనానికి చిహ్నం. అశోక పదం భారతీయ మత సంప్రదాయాలు, కళలు, సంస్కృతిలో లోతైన ప్రాముఖ్యతను కలిగి ఉంది. సమాజంలో అశోక చెట్టుకున్న ప్రాముఖ్యత దృష్ట్యా దానికి అశోక్ మండపం అని మార్చినట్లు వివరించింది. -
ఇక నుంచి ముద్రగడ పద్మనాభ రెడ్డి
అమరావతి/కాకినాడ, సాక్షి: అన్న మాట ప్రకారం పేరు కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం మార్చుకున్నారు. ఇక నుంచి ఆయన పేరు అధికారికంగా ముద్రగడ పద్మనాభ రెడ్డి. ఈమేరకు AP Gazette లో ప్రచురణ కూడా అయ్యింది.అసెంబ్లీ ఎన్నికల్లో పిఠాపురం నియోజకవర్గం నుంచి పవన్ కల్యాణ్ గెలిస్తే తన పేరు మార్చుకుంటానని వైఎస్సార్సీపీ నేత ముద్రగడ పద్మనాభం ప్రచార సమయంలో సవాల్ విసిరారు. అయితే.. ఎన్నికల్లో పవన్ నెగ్గడం, ఆ తర్వాత మీడియా ముందుకు వచ్చిన ముద్రగడ తన సవాల్‌కు కట్టుబడి ఉంటానని ప్రకటించడమూ తెలిసిందే. తాజాగా.. ఆయన పేరు మారింది. ముద్రగడ పద్మనాభ రెడ్డిగా ఈ మేరకు గెజిట్ విడుదలైంది. -
ఇండియా పేరు 'భారత్'గా మారితే ఎన్ని వేలకోట్లు ఖర్చవుతుందంటే?
గత కొన్ని రోజుల నుంచి ఇండియా పేరుని భారత్‌గా మార్చాలనే ఆలోచనలు చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. దీని కోసం 2023 సెప్టెంబర్ 18 నుంచి 22 వరకు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి ఆగస్టు 31న ప్రకటించారు. అయితే ఇండియా పేరు భారత్‌గా మారిస్తే.. ఎలాంటి ఆర్థిక పరిణామాలు ఎదురవుతాయనే వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ఔట్లుక్ బిజినెస్ నివేదికల ప్రకారం, ఇండియా భారత్‌గా మారాలంటే ఏకంగా రూ. 14 వేలకోట్లు ఖర్చవుతుందని తెలుస్తోంది. ఎందుకంటే గతంలో కొన్ని దేశాలు పేర్లు మార్చుకోవడం వల్ల ఎంత ఖర్చయింది అనే వివరాల ఆధారంగా ఇంత పెద్ద మొత్తం ఖర్చు అయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు. 2018లో ఆఫ్రికాలోని స్వాజిల్యాండ్ దేశం పేరుని ఎస్వంటిని (Eswantini)గా మార్చడానికి సుమారు 60 మిలియన్ డాలర్లు ఖర్చయినట్లు ప్రముఖ న్యాయవాది 'డారెన్ అలివర్' గణాంకాలు వెల్లడించాయి. అంతే కాకుండా ఈయన ప్రకారం ఒక పెద్ద దేశం సగటు మార్కెటింగ్ బడ్జెట్ దాని మొత్తం ఆదాయంలో దాదాపు 6 శాతం వరకు ఉంటుంది. కాగా రీబ్రాండింగ్ కోసం మొత్తం మార్కెటింగ్ బడ్జెట్లో 10 శాతం వరకు ఖర్చవుతుంది. అలివర్ సూత్రం ప్రకారం.. 2022-23 ఆర్థిక సంవత్సరానికి భారతదేశ ఆదాయం మొత్తం రూ.23.84 లక్షల కోట్లు. కావున అలివర్ (Oliver) సూత్రం ప్రకారం రూ. 23.84 లక్షల కోట్లు × 0.006 = రూ. 14,304 కోట్లు (రీబ్రాండింగ్ మొత్తం). ఈ విధంగా భారత్ పేరుగా ఇండియా స్థిరపడాలంటే వేలకోట్లు ఖర్చవుతుందని చెబుతున్నారు. ఇండియా అన్న పేరుని భారత్‌గా మార్చితే.. ఇండియా పేరు ఉన్న ప్రతి చోటా (కరెన్సీ నోట్ల మీద, ఆధార్, పాన్, ప్రభుత్వ సంస్థలు ఇలా) భారత్ అనే పదం చేర్చాలి వస్తుందని, ఇది ఎక్కువ ఖర్చుతో కూడుకున్న పని అని నిపుణులు చెబుతున్నారు. ఇదీ చదవండి: ఇలా అయితే ఎలా గురూ.. కేవలం 48 గంటల్లో అన్నీ బుక్కయిపోయాయ్! ఇప్పటికే భారతదేశంలోని కొన్ని నగరాల పేర్లు కూడా మార్చడం జరిగింది. మహారాష్ట్రలోని ఔరంగాబాద్ నగరం ఛత్రపతి శంభాజీనగర్‌గా.. హోషంగాబాద్ 2021లో నర్మదాపురంగా, ఉత్తరప్రదేశ్‌లోని అలహాబాద్ నగరం 2018లో ప్రయాగ్‌రాజ్‌గా పేరు మార్చింది. అలహాబాద్ పేరు మార్చడం వల్ల ఆ రాష్ట్ర ప్రభుత్వానికి రూ. 300 కోట్లకు పైనే ఖర్చు అయినట్లు ఇండియా టుడే గతంలో నివేదించింది. ఈ లెక్క ప్రకారం ఇండియా.. భారత్‌గా మారితే ఎన్ని వేలకోట్లు ఖర్చు అవుతుందో ఊహించవచ్చు. -
ఇండియా పేరు మార్పుపై ఐరాస స్పందన
న్యూయార్క్: కేంద్ర ప్రభుత్వం.. ఇండియా అనే పేరును భారత్‌గా మారబోతోందన్న ఊహాగానాలపై విస్త్రృత స్థాయిలో చర్చ నడుస్తున్న వేళ ఐక్యరాజ్య సమితి స్పందించింది. అలాంటి విజ్ఞప్తి ఏదైనా తమ దాకా వస్తే.. తప్పకుండా పరిశీలిస్తామని తెలిపింది. దేశాలు తమ తమ పేర్లను మార్చుకునే క్రమంలో.. ప్రపంచ దేశాల సమాఖ్య ఐక్యరాజ్య సమితికి విజ్ఞప్తులు పంపుతుంటాయి కూడా. ఐరాస గనుక ఆ విజ్ఞప్తిని అధికారికంగా అంగీకరిస్తే.. అప్పటి నుంచి ప్రపంచవ్యాప్తంగా ఆ దేశాన్ని కొత్త పేరుతోనే పిలుస్తుంటారు. ఇదే విషయాన్ని ఐరాస సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రస్ ఉపప్రతినిధి ఫర్హాన్ హక్ ప్రస్తావించారు. ‘‘ చివరిసారిగా.. టర్కీ దేశం కూడా తుర్కీయేగా తమ పేరును మార్చాలని ఐరాసకు విజ్ఞప్తి పెట్టుకుంది. అలా ఇండియా కూడా అలాంటి విజ్ఞప్తి ఏదైనా చేస్తే.. తప్పక పరిశీలిస్తాం. ఇండియా మాత్రమే కాదు ఏ దేశం అలా రిక్వెస్ట్ పంపినా పరిశీలిస్తాం’’ అని తెలిపారు. కిందటి ఏడాది టర్కీ తుర్కీయేగా తమ దేశం పేరును మార్చుకున్న సంగతి తెలిసిందే. మరోవైపు దేశంలో పేరు మార్పు అంశం రాజకీయదుమారానికి తెర తీసింది. ఈనెల 9-10 తేదీల్లో ఢిల్లీలో జరగబోయే జీ20 సదస్సు సందర్భంగా ఏర్పాటు చేసిన విందు ఆహ్వాన పత్రికల్లో ‘ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా’కు బదులుగా ‘ప్రెసిడెంట్ ఆఫ్ భారత్’ President of Bharat అని ఉండటంతో ఈ అంశం కాస్తా తెరపైకి వచ్చింది. కాంగ్రెస్ తీవ్ర స్థాయిలో కేంద్రంపై విరుచుకుపడుతోంది. బీజేపీ ఆ విమర్శలకు కౌంటర్ ఇస్తోంది. అయితే.. విపక్ష ఇండియా కూటమిలోని కొన్ని పార్టీల నేతలు భారత్ అనే పేరు మార్పుపై సానుకూల వ్యాఖ్యలు చేస్తుండడం గమనార్హం. మరోవైపు ప్రధాని మోదీ ఈ విషయంలో కేంద్ర మంత్రులకు దిశానిర్దేశం చేశారు. పేరు మార్పు విషయంలో వివాదాలకు దూరంగా ఉండాలని మంత్రులను కోరారాయన. -
ఇండియా బదులుగా భారత్ అని ముద్రించిన కేంద్రం
-
పార్కుకు 'వాజ్‌పేయీ' పేరు మార్పు.. బీజేపీ ఆందోళనలు..
పాట్న: బిహార్‌లో అటల్ బిహారీ వాజ్‌పేయీ పార్కు పేరును కోకోనట్ పార్క్‌గా మార్చడంపై రాజకీయంగా వివాదానికి దారితీసింది. బిహార్ అటవీ శాఖ మంత్రి తేజ్ ప్రతాప్ యాదవ్.. అటల్ బిహారీ వాజ్‌పేయీ పార్క్ పేరును కోకోనట్ పార్క్‌గా సోమవారం అధికారికంగా పేరు మార్చారు. పార్క్ బయట శిలాఫలాకాన్ని కూడా ఆవిష్కరించారు. దీంతో నితీష్ ప్రభుత్వంపై బీజేపీ మండిపడింది. పార్క్‌ను మొదట్లో కోకోనట్ పార్కు పేరుతోనే పిలిచేవారు. 2018లో అటల్ బిహారీ వాజ్‌పేయీ మృతి చెందగా.. ఆయన జ్ఞాపకార్థం కోకోనట్ పార్క్‌కు అటల్ పేరును ఫిక్స్ చేశారు. ప్రస్తుతం నితీష్ ప్రభుత్వం ఆ పార్కు పేరును కోకోనట్‌గా మార్చడంపై బీజేపీ నుంచి ఆందోళనలు వ్యక్తమయ్యాయి. 'వాజ్‌పేయీ వర్థంతి సందర్భంగా నితీష్ కుమార్ ఇటీవల పూలమాలలు సమర్పించారు. ప్రస్తుతం ఆయన ప్రభుత్వంలోని మంత్రి తేజ్ ప్రతాప్ యాదవ్ అటల్ పేరుపై ఉన్న పార్కుకు కొత్త పేరును మార్చారు. ఒకే ప్రభుత్వం వాజ్‌పేయీపై విభిన్నమైన నిర్ణయాలు తీసుకుంటోంది. పార్కుకు అటల్ పేరును యథావిధిగా ఉంచాలి' అని బీజేపీ డిమాండ్ చేసింది. రాజకీయంగా వివాదాస్పదం కావడంతో అటల్ పార్కుకు రాకపోకలను నిలిపివేశారు. ఓ వైపు పార్కు బయట కోకోనట్ పేరుతో శిలాఫలకం ఉండగా.. పార్కు బయట వాజ్‌పేయీ పేరు అలాగే ఉంది. ఇదీ చదవండి: 'ఆపరేషన్ హస్త'.. నాయకుల మధ్య పొలిటికల్ వార్.. -
నెహ్రూ మ్యూజియం కాదు.. ఇక ప్రధానమంత్రి మ్యూజియం
న్యూఢిల్లీ: దేశ రాజధాని న్యూఢిల్లీ తీన్‌మూర్తి భవన్లో అంతర్జాతీయ ప్రఖ్యాతి వహించిన నెహ్రూ మెమోరియల్ మ్యూజియం అండ్ లైబ్రరీ (ఎన్ఎంఎంఎల్)ని ప్రధానమంత్రి మ్యూజియం అండ్ లైబ్రరీ సొసైటీ (పీఎంఎంల్) అని అధికారికంగా పేరు మార్చడం వివాదస్పదమవుతోంది. కాంగ్రెస్, బీజేపీ మధ్య మాటలు మంటలు చెలరేగాయి. నెహ్రూ పేరుని చరిత్ర పుటల్లోంచి తొలగించడానికి ప్రధాని మోదీ ప్రయతి్నస్తున్నారంటూ కాంగ్రెస్ మండిపడుతూ ఉంటే, ప్రధానమంత్రులందరికీ సమ ప్రాధాన్యం ఇచ్చామని బీజేపీ ఎదురుదాడికి దిగింది. నెహ్రూ మ్యూజియం పేరు మార్చాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినప్పుడే దీనిపై వివాదం రేగింది. కాగా మ్యూజియం పేరు మారుస్తూ సోమవారం నాడు అధికారికంగా ఉత్తర్వులు జారీ అయ్యాయి. ‘‘నెహ్రూ మెమోరియల్ మ్యూజియం లైబ్రరీ ఇక నుంచి ప్రైమ్ మినిస్టర్స్ మ్యూజియం అండ్ లైబ్రరీగా మారింది. ప్రజాస్వామ్యానికి అనుగుణంగా వైవిధ్యాన్ని చాటి చెప్పడానికే ఈ పేరు మార్పు జరిగింది. ఈ నెల 14 నుంచి ఉత్వర్వులు అమల్లోకి వచ్చాయి’’ అని పీఎంఎంల్ వైస్ చైర్మన్ సూర్యప్రకాశ్ వెల్లడించారు. తీన్‌మూర్తి భవనంలో 16 ఏళ్లపాటు నెహ్రూ అధికారిక నివాసంగా ఉంది. 1966 , ఏప్రిల్1న అందులో నెహ్రూ మ్యూజియంను ఏర్పాటు చేశారు. నెహ్రూని అప్రతిష్టపాల్జేయడమే మోదీ ఎజెండా: కాంగ్రెస్ నెహ్రూ వారసత్వాన్ని అప్రతిష్టపాల్జేయడమే ప్రధాని మోదీ ఎజెండా అని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేష్ ఆరోపించారు. ఈ మేరకు ట్విటర్లో ఒక పోస్టు పెట్టారు. ‘‘ప్రధాని మోదీ అభద్రతా భావం, భయాందోళనల మధ్య నెహ్రూ మ్యూజియం పేరు మార్చారు. నెహ్రూ వారసత్వాన్ని విధ్వంసం చేయాలని ఆయన భావిస్తున్నారు. మ్యూజియం పేరులో ఎన్ స్థానంలో పీ అని మార్చారు. అందులో ‘‘పీ’’ అంటే చిన్నతనం, ఇబ్బంది పెట్టడం’’ అని జైరామ్ రమేష్ పేర్కొన్నారు. నెహ్రూ పేరు మార్చారు కానీ స్వాతంత్య్ర సంగ్రామంలో ఆయన పోషించిన పాత్రను, భారత్‌ను లౌకిక, ప్రజాస్వామ్య దేశంగా ఆయన నడిపించిన విధానాన్ని చెరిపేయలేరని ఆ ట్వీట్లో పేర్కొన్నారు. ప్రధానమంత్రులందరి ఘనత చాటడానికే: బీజేపీ కాంగ్రెస్ చేసిన ఆరోపనల్ని బీజేపీ కొట్టిపారేసింది. దేశ ప్రధానమంత్రులందరి ఘనతలు ప్రపంచానికి చాటి చెప్పడానికే మ్యూజియం పేరుని మార్చినట్టు స్పష్టం చేసింది. లాల్‌బహదూర్ శాస్త్రి, పీ.వీ.నరసింహారావు, హెచ్.డి.దేవెగౌడ, ఐకే గుజ్రాల్ ఇలా ఎందరో భారత దేశాన్ని గొప్పగా తీర్చిదిద్దారని, ఈ మ్యూజియం ఏ ఒక్కరికో, ఒక కుటుంబానికో చెందినది కాదని బీజేపీ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా అన్నారు. -
ఇక నెహ్రూ కాదు.. కాంగ్రెస్, బీజేపీ మాటల యుద్ధం
ఢిల్లీ: నెహ్రూ మెమోరియల్ మ్యూజియం, లైబ్రరీ(ఎన్ఎమ్ఎమ్ఎల్) పేరు మార్పుపై కాంగ్రెస్, బీజేపీ మధ్య మాటల యుద్ధం నడిచింది. భారత చరిత్రలో తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ వారసత్వాన్ని అంతం చేయడమే దీని ప్రధాన ఉద్దేశమని కాంగ్రెస్ మండిపడింది. కాంగ్రెస్ రాజరిక స్వభావంపై బీజేపీ ఎదురుదాడి చేసింది. ఢిల్లీలోని తీన్ మూర్తి మార్గ్‌లో ఉన్న నెహ్రూ మ్యూజియం, లైబ్రరీ సొసైటీ పేరు మార్చాలని ఈ ఏడాది జూన్‌లో నిర్ణయం తీసుకోగా.. నేడు అధికారికంగా అమలుపరిచారు. ఈ అంశంపై ట్విట్టర్ వేదికగా కాంగ్రెస్ నాయకుడు జైరాం రమేశ్ స్పందించారు. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన నెహ్రూ మ్యూజియం, లైబ్రరీ(NMML) పేరును ‘ప్రధానమంత్రి మెమోరియల్’(PMML)గా మార్చేశారు. నెహ్రూ పేరుతో ప్రధాని మోదీ అభద్రతా భావానికి గురయ్యారని.. నెహ్రూ వారసత్వాన్ని దెబ్బతీయాలని 'N' స్థానంలో 'P'ను పెట్టారని చెప్పారు. P అంటే కేవలం చిన్నతనం, దుఖం అనే భావమేనని అన్నారు. ఇదీ చదవండి: ఆ పని చేస్తే.. శరద్ పవార్‌కు కేంద్ర మంత్రి పదవి..? క్లారిటీ.. జైరాం రమేశ్ విమర్శలను ధీటుగా తిప్పకొట్టారు బీజేపీ నాయకుడు షెహజాద్ పూనావాలా. దేశ ప్రధానులందరి విజయాలను సూచించే నిర్మాణాలకు కేవలం ఒక్క కుటుంబానికి చెందిన వారి పేరు పెట్టడం ఏంటని ప్రశ్నించారు. ప్రధానులందరూ దేశం కోసం పనిచేశారని చెప్పారు. ఒక్క నిర్మాణానికి దేశ ప్రధానులందరి పేరు పెట్టినంత మాత్రాన నెహ్రూ వారసత్వం దెబ్బతింటుందా..? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ భావజాలం ఏంటో అర్ధమవుతోందని అన్నారు From today, an iconic institution gets a new name. The world renowned Nehru Memorial Museum and Library (NMML) becomes PMML—Prime Ministers’ Memorial Museum and Library. Mr. Modi possesses a huge bundle of fears, complexes and insecurities, especially when it comes to our first… — Jairam Ramesh (@Jairam_Ramesh) August 16, 2023 బ్రిటీష్ వారి కాలంలో సైన్యానికి అధిపతి కమాండర్ ఇన్ ఛీప్‌కు నిలయంగా ఉండేది ప్రస్తుతం నెహ్రూ మ్యూజియం. స్వాతంత్య్రం తర్వాత అది ప్రధాని నెహ్రూ నివాసంగా మారింది. ఆయన మరణాంతరం మ్యూజియంగా మార్చారు. ప్రధాని మోదీ అధికారంలోకి రాగానే.. మ్యూజియం ప్రాంగణంలో దేశ ప్రధానులందరి(నెహ్రూ-మోదీ) విజయాలు ప్రతిబింబించేలా ప్రధానమంత్రి సంగ్రహాలయాన్ని నిర్మించారు. ఇదీ చదవండి: ఢిల్లీ చట్టంపై అసెంబ్లీ స్పెషల్ సెషన్..ఎల్జీ అభ్యంతరం -
పేరు మార్చుకున్న అదానీ కంపెనీ..
న్యూఢిల్లీ: అదానీ ట్రాన్స్మిషన్ లిమిటెడ్ తన పేరును మార్చుకుంది. అదానీ గ్రీన్ ఎనర్జీ సొల్యూషన్స్ లిమిటెడ్‌గా ఈ నెల 27వ తేదీ నుంచి పేరు అమల్లోకి వచ్చినట్టు అదానీ ట్రాన్స్మిషన్ ప్రకటించింది. రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్, అహ్మదాబాద్ శాఖ నుంచి పేరు మార్పునకు సంబంధించిన సర్టిఫికెట్ ఆఫ్ ఇన్కార్పొరేషన్ అందుకున్నట్టు తెలిపింది. పేరు మార్పునకు సంబంధించి అవసరమైన పత్రాలను కంపెనీ స్టాక్ ఎక్స్ఛేంజీలకు సమర్పించింది. అదానీ గ్రీన్ ఎనర్జీ సొల్యూషన్స్ దేశంలోనే అతిపెద్ద విద్యుత్ సరఫరా కంపెనీగా ఉంది. 14 రాష్ట్రాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ముంబై, ముంద్రా సెజ్‌లలో 12 మిలియన్లకుపైగా వినియోగదారులకు సేవలు అందిస్తోంది. జూన్‌లో ముగిసిన మొదటి త్రైమాసికానికి సంబంధించిన ఫలితాలను ఆమోదించడానికి, ప్రకటించడానికి కంపెనీ బోర్డు సమావేశం జూలై 31న జరగనుంది. -
భారత క్రికెటర్‌కు అరుదైన గౌరవం..
భారత మహిళా క్రికెటర్ మిన్ను మణికి కేరళలోని మనంతవాడి మున్సిపాలిటీ అరుదైన గౌరవం ఇచ్చింది. వయనాడ్ జిల్లాలోని ఈ మున్సిపాలిటీలో ఉన్న మైసూరు రోడ్డు జంక్షన్ పేరును మిన్ను మణి జంక్షన్ గా మార్చేసింది. తనకు ఈ గౌరవం దక్కడం పట్ల మిన్ను చాలా సంతోషాన్ని వ్యక్తం చేసింది. జులై 9న బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టి20తో మిన్ను మణి అంతర్జాతీయ క్రికెట్ అరంగేట్రం చేసింది. తొలి మ్యాచ్ లోనే అదరగొట్టింది. బంగ్లా బ్యాటర్ షమీమా సుల్తానాను తొలి వికెట్‌గా దక్కించుకుంది.తర్వాతి రెండు మ్యాచ్ లలో వరుసగా 4 ఓవర్లలో కేవలం 9 రన్స్ ఇచ్చి 2 వికెట్లు, 4 ఓవర్లలో 28 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీసుకుంది. సిరీస్ లో అత్యధిక వికెట్లు తీసుకున్న బౌలర్లలో రెండో స్థానంలో నిలిచింది. మూడు టీ20ల్లో కేవలం 11.6 సగటుతో 5 వికెట్లు తీసింది. కాగా ఈ నెల 14న ప్రత్యేకంగా సమావేశమైన మనంతవాడి మున్సిపల్ కౌన్సిల్.. మైసూరు రోడ్డు జంక్షన్ ను మిన్ను మణి జంక్షన్ గా మార్చాలని నిర్ణయించారు. మిన్నును ఎలా గౌరవించాలా అని ఆలోచించే క్రమంలో ఇలా రోడ్డు జంక్షన్ కు ఆమె పేరు పెట్టాలని నిర్ణయించినట్లు మనంతవాడి మున్సిపల్ ఛైర్ పర్సన్ రత్నవల్లి చెప్పారు. మనంతవాడిలో మిన్ను ఇంటికి మంచి రోడ్డు వేస్తామని స్థానిక ఎమ్మెల్యే ఓఆర్ కేలు చెప్పారు. మున్సిపల్ రోడ్డు నుంచి 200 మీటర్ల దూరంలో ఆమె ఇల్లు ఉంది. ప్రస్తుతం ఆమె ఇంటికి వెళ్లడానికి సరైన రోడ్డు సౌకర్యం లేదు. త్వరలోనే ఈ రోడ్డు నిర్మాణం పూర్తవుతుందని ఈ సందర్భంగా కేలు హామీ ఇచ్చారు.ఈ సందర్భంగా మిన్నును సన్మానించేందుకు ప్రత్యేక కార్యక్రమం కూడా మనంతవాడి మున్సిపాలిటీ అధికారులు చేపట్టారు. చదవండి: కోహ్లి టాప్ అనుకుంటే పప్పులో కాలేసినట్లే.. వరుస విజయాలు.. కెరీర్ బెస్ట్ అందుకున్న సాత్విక్-చిరాగ్ జోడి -
అహ్మద్‌నగర్ కాదు.. అహల్యానగర్
ముంబై: దేశంలో బీజేపీ పాలిత రాష్ట్రాల్లో పలు నగరాలు, వీధులకు పేర్లను మారుస్తున్న పరిణామాలు చూస్తున్నాం. తాజాగా మహారాష్ట్రలో షిండే శివసేన-బీజేపీ కూటమి ప్రభుత్వం కూడా అలాంటి చర్యకే దిగింది. అహ్మద్‌నగర్ జిల్లా పేరును అహల్యా నగర్‌గా మార్చేసింది. బుధవారం చౌండీలో జరిగిన అహల్యాదేవి జయంతోత్సవాల సందర్భంగా ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే స్వయంగా ఈ ప్రకటన చేశారు. 18వ శతాబ్దంలో ఇండోర్ స్టేట్‌ను పాలించిన వీరవనితే అహల్యాదేవి హోల్కర్. ఆమె జన్మస్థలంలోనే.. అదీ 298 జయంతి ఉత్సవాల సందర్భంగా సీఎం షిండే ఈ ప్రకటన చేయడం విశేషం. అహ్మద్‌నగర్, పూణేకు 120 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. 15వ శతాబ్ధంలో ఈ ప్రాంతాన్ని అహ్మద్ నిజాం షా పాలించారు. ఆయన పేరు మీద ఈ ప్రాంతానికి అహ్మద్‌నగర్ పేరొచ్చిందని చెబుతుంటారు. ఛత్రపతి శివాజీ, అహల్యాదేవి హోల్కర్ లాంటి వాళ్లను ఆరాధ్యులుగా భావించి మా ప్రభుత్వం ముందుకు సాగుతోంది. అహల్యాదేవి హోల్కర్కు సముచిత గౌరవం అందించాలనే ప్రజలందరి అభిష్టం మేరకు ఈ జిల్లా పేరును అహల్యా నగర్‌గా మార్చాం అని షిండే ప్రకటించారు. ఇక డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ మాట్లాడుతూ.. ‘‘మా కూటమిది పక్కా హిందుత్వ ప్రభుత్వమని, అహల్యాదేవి లాంటి వాళ్లు లేకపోతే కాశీ లాంటి సుప్రసిద్ధ క్షేత్రాలు ఉండేవే కావ’’ని చెప్పుకొచ్చారు. అంతకు ముందు షిండే ప్రభుత్వం ఔరంగాబాద్ పేరును ఛత్రపతి శంభాజీనగర్‌గా, ఒస్మానాబాద్‌ను ధారాశివ్‌గా మార్చిన విషయాన్ని సైతం ఫడ్నవిస్ ప్రస్తావించారు. ఇదీ చదవండి: తన వేలితో తన కన్నే పొడుచుకున్న రాహుల్! -
చైనాకు గట్టి కౌంటర్ ఇచ్చిన అమెరికా..భారత్‌కే మద్దతు అని ప్రకటన
వాషింగ్టన్: అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దులోని 11 ప్రదేశాలకు పేర్లు పెట్టి.. ఈ భూభాగం టిబెట్ దక్షిణప్రాంతం అంటూ చైనా వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. దీనిపై భారత్ ఇప్పటికే తీవ్రంగా స్పదించింది. అయితే తాజాగా అగ్రరాజ్యం అమెరికా కూడా ఈ వ్యవహారంపై స్పందించింది. చైనా చర్యను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు అగ్రరాజ్యం తేల్చి చెప్పింది. చైనా తీసుకుంటున్న ఏకపక్ష నిర్ణయాలు ఎంతమాత్రమూ ఆమోదయోగ్యం కాదని స్పష్టం చేసింది. అరుణాచల్ ప్రదేశ్ ఎప్పటికీ భారత్‌లో అంతర్భాగమేనని తాము గుర్తిస్తున్నట్లు శ్వేతసౌధం ప్రకటనలో తెలిపింది. ఏం జరిగిందంటే..? అరుణాచల్ ప్రదేశ్.. టిబెట్‌లో అంతర్భాగమంటూ వాదిస్తున్న చైనా మరో దుశ్చర్యకు పాల్పడి సరిహద్దుల్లోని పదకొండు ప్రదేశాలకు పేర్లు పెట్టి.. జాంగ్నాన్ పేరుతో టిబెట్ దక్షిణ ప్రాంతంలో భాగమంటూ ఒక ప్రకటన విడుదల చేసింది. దీనికి ప్రతిస్పందనగా భారత్ ఘాటుగానే బదులిచ్చింది. ఈ పేర్లన్నింటిని తిరస్కరిస్తున్నట్లు ప్రకటిచింది. అరుణాచల్ ప్రదేశ్.. ఎప్పుడూ భారత్‌లో అంతర్భాగమే తేల్చిచెప్పింది. 'అరుణాచల్ ప్రదేశ్ భారత్ అంతర్భాగం. అది విడదీయరాని భాగం. ఏవో పేర్లు కనిపెట్టి.. కనికట్టు చేసే ప్రయత్నాలు ఫలించబోవు. అవి వాస్తవాలను మార్చలేవు' అని ప్రకటనలో పేర్కొంది. చదవండి: ఇంత జరిగినా అదే పాట! తీరు మార్చుకోని ట్రంప్.. బైడెన్ పాలనపై ఆరోపణలు -
Renaming Arunachal Areas: తీరు మార్చుకోని చైనా!
అరుణాచల్ ప్రదేశ్‌లోని ప్రదేశాల పేర్లు మార్చడానికి చైనా చేసిన ప్రయత్నాన్ని భారత్ తీవ్రంగా వ్యతిరేకించింది. అయినా సరే చైనా తన తీరు మార్చుకోకపోగా ఆ ప్రాంతం మా సార్వభౌమాధికారం అని పేర్కొంది. ఈ మేరకు చైనా విదేశాంగ మంత్రిత్వశాఖ ప్రతినిధి మావో నింగో మాట్లాడుతూ..జాంగ్నాన్(అరుణాచల్‌ప్రదేశ్) చైనా భూభాగంలో భాగం. ఆ భౌగోళిక పేర్లనను తమ స్టేట్ కౌన్సిల్ నిబంధనలకు అనుగుణంగానే చైనా అధికారులు ప్రమాణీకరించారని కరాఖండీగా చెప్పింది. ఇది చైనా సార్వభౌమ హక్కుల పరిధిలో ఉందని వాదిస్తోంది. కాగా. చైనా పౌరవ్యవహారాల మంత్రిత్వ శాఖ అరుణాచల్ ప్రదేశ్‌లోని 11 ప్రదేశాల పేర్లను పెట్టి..జాగ్నాన్ పేరుతో టిబెట్‌లో భాగమని ప్రకటించింది. దీనికి భారత్ ఘాటుగా బుదలివ్వడమే గాక ఆ పేర్లన్నింటిని తిరస్కరించింది. ఈ మేరకు భారత్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చి కూడా అరుణాచల్‌ప్రదేశ్ ఎప్పటికీ భారతదేశంలో అంతర్భాగమేనని నొక్కి చెప్పారు. చైనా ఇలా చేయడం తొలిసారి కాదు, ఇలాంటి దుశ్చర్యలు ఎన్ని చేసినా వాస్తవాన్ని మార్చలేదని బాగ్చి అన్నారు. (చదవండి: పేర్లు మార్చేసి చైనా దుశ్చర్య.. భారత్ ఘాటు బదులు) -
చైనా మళ్లీ అదే పని.. భారత్ ఘాటు బదులు1
ఢిల్లీ: అరుణాచల్ ప్రదేశ్.. టిబెట్‌లో అంతర్భాగమంటూ వాదిస్తున్న చైనా తాజాగా మరో దుశ్చర్యకు దిగింది. అరుణాచల్ సరిహద్దుల్లోని పదకొండు ప్రదేశాలకు పేర్లు పెట్టి.. జాంగ్నాన్ పేరుతో టిబెట్ దక్షిణ ప్రాంతంలో భాగమంటూ ఒక ప్రకటన విడుదల చేసింది. అయితే.. ప్రతిస్పందనగా భారత్ ఘాటుగానే ప్రకటన విడుదల చేసింది. ఈ పేర్లన్నింటిని తిరస్కరిస్తున్నట్లు పేర్కొంది. అరుణాచల్ ప్రదేశ్.. ఎప్పుడూ భారత్‌లో అంతర్భాగమే అని ఢిల్లీ వర్గాలు ఒక ప్రకటనలో స్పష్టం చేశాయి. చైనా అలాంటి నివేదిక గురించి విడుదల చేసిందని తెలిసింది. చైనా ఇలాంటి పని చేయడం తొలిసారేం కాదు కదా. మేము దీనిని పూర్తిగా తిరస్కరిస్తున్నాము అని విదేశాగం మంత్రిత్వ శాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చీ తెలిపారు. అరుణాచల్ ప్రదేశ్ భారత్ అంతర్భాగం. అది విడదీయరాని భాగం. ఏవో పేర్లు కనిపెట్టి.. కనికట్టు చేసే ప్రయత్నాలు ఫలించబోవు. అవి వాస్తవాలను మార్చలేవు అని బాగ్చీ స్పష్టం చేశారు. Our response to media queries regarding the renaming of places in Arunachal Pradesh by China:https://t.co/JcMQoaTzK6 pic.twitter.com/CKBzK36H1K — Arindam Bagchi (@MEAIndia) April 4, 2023 2017లో దలైలామా అరుణాచల్ ప్రదేశ్ పర్యటన తర్వాత చైనా మొదటిసారి ఇలాంటి పనే చేసింది. ఆ సమయంలో ఆరు ప్రాంతాల పేర్లను మార్చేసింది. చైనా అధికార ప్రభుత్వ మీడియా గ్లోబల్ టైమ్స్ కథనం ప్రకారం.. ‘ప్రామాణిక భౌగోళిక పేర్లు’ అని చైనా తన చర్యను సమర్థించుకుంటూ వస్తోంది. ఇక 2021లో రెండో బ్యాచ్ కింద 15 ప్రాంతాల పేర్లను మార్చేసింది. ఆయా సందర్భాల్లో భారత్ చైనా చర్యను ఖండించింది. తాజాగా.. 11 ప్రాంతాలు(రెండు నదులు, ఐదు పర్వత ప్రాంతాలు, రెండు నివాస ప్రాంతాలు, రెండు మైదాన ప్రాంతాలు) పేర్లను మార్చేసింది. -
టిప్పు సుల్తాన్ పేరు తొలగించిన మహా సర్కార్
ముంబై: మహా వికాస్ అఘాడీ కూటమి ప్రభుత్వంలో ఉద్దవ్ థాక్రే సీఎంగా ఉన్నప్పుడు తీసుకున్న ఓ నిర్ణయాన్ని.. తాజాగా షిండే సర్కార్ రద్దు చేసింది. ముంబై మలాద్ ప్రాంతంలోని ఓ పార్క్‌కు టిప్పు సుల్తాన్ పేరును తొలగిస్తున్నట్లు శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. దీంతో సకల్ హిందూ సమాజ్, బీజేపీ శ్రేణులు సంబురాలు చేసుకున్నాయి. ఈ మేరకు బీజేపీ నేత, ముంబై సబర్బన్ డిస్ట్రిక్ గార్డియన్ మినిస్టర్ మంగళ్ ప్రభాత్ పేరు తొలగింపునకు సంబంధించిన ఆదేశాలను కలెక్టర్‌కు జారీ చేశారు. దీంతో అధికారులు రంగంలోకి దిగి ఆ బ్యానర్‌ను తొలగించారు. అంతేకాదు.. ట్విటర్ ద్వారా ఈ విషయాన్ని కూడా ఆయన తెలియజేశారు. అసలు ఆ పేరు ఉండాలని ఎవరూ అక్కడ కోరుకోలేదని ఆయన అంటున్నారు. ఉన్నపళంగా గత ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని, టిప్పు సుల్తాన్ పేరుతో ఓ బ్యానర్ వెలిసిందని, ఆ సమయంలో అక్కడ నిరసనలు జరిగాయని గుర్తు చేశారాయన. ఇందులో ఎలాంటి రాజకీయం లేదని, ప్రజాభీష్టాన్ని గౌరవించడమే తమ ఉద్దేశమని స్పష్టం చేశారు. అష్ఫాఖుల్లా ఖాన్, బీఆర్ అంబేద్కర్.. ఇలాంటి మహనీయుల పేర్లను నిర్ణయించాలని బీజేపీ స్థానికులను కోరుతోంది. ఇదిలా ఉంటే.. ఈ నిర్ణయాన్ని ఎన్సీపీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. మరోవైపు టిప్పు సుల్తాన్ పేరును ప్రభుత్వం ప్రతిపాదించిన సమయంలో బీజేపీ సైతం తీవ్ర స్థాయిలో అభ్యంతరం వ్యక్తం చేసింది. మరోవైపు పొరుగు రాష్ట్రంలో కర్ణాటకలోనూ టిప్పు సుల్తాన్ పట్ల వ్యతిరేకత కొనసాగుతున్న సంగతి తెలిసిందే. Finally, victory of the Right! Ordered removal of name Tipu Sultan from the park in Malad after considering the protests by Sakal Hindu Samaj & demand by @iGopalShetty Ji in the DPDC meeting. Last year MVA govt had named the ground after Tipu Sultan and we had to protest it! pic.twitter.com/IRBgiAmfbZ — Mangal Prabhat Lodha (@MPLodha) January 27, 2023 -
ఎన్టీఆర్‌గారంటే నాకే గౌరవం ఎక్కువ: సీఎం జగన్
సాక్షి, అమరావతి: దివంగత ఎన్టీఆర్ అంటే తనకెంతో గౌరవమని, ఆయన్ని తక్కువ చేసి మాట్లాడే వారు మన దేశంలోనే ఉండరని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో ఐదవ రోజు భాగంగా బుధవారం.. హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చే బిల్లుపై చర్చ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడారు. అనవసరంగా గొడవలు చేసి.. టీడీపీ సభ్యులు సభ నుంచి వెళ్లిపోవడం దురదృష్టకరమని, వాళ్లు కూడా ఈ చర్చ సందర్భంగా ఉండి ఉంటే బాగుండేదని సీఎం జగన్ వ్యాఖ్యానించారు. ‘‘ఎన్టీఆర్‌గారంటే అంటే నాకు ఎలాంటి కోపం లేదు. ఒకరకంగా.. ఎన్టీఆర్‌కు చంద్రబాబునాయుడుగారి కంటే జగన్మోహన్రెడ్డినే ఎక్కువ గౌరవం ఇస్తాడు. ఏపొద్దు కూడా ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడిన సందర్భం లేదు. పైగా ఎన్టీఆర్ మీద నాకు ఆప్యాయతే ఉంది. ఆయన్ని అగౌరవ పరిచే కార్యక్రమూ నా తరపున ఏనాడూ జరగద’’ని సీఎం జగన్ స్పష్టం చేశారు. నందమూరి తారకరామారావు అని పలకడం చంద్రబాబు నాయుడికి నచ్చదని, అదే చంద్రబాబు నోట వెంట నందమూరి తారకరామారావు అనే మాట వస్తే పైన ఉన్న ఎన్టీఆర్‌గారికి నచ్చదని పేర్కొన్నారు సీఎం జగన్. ‘‘నటుడిగా, రాజకీయవేత్తగా గొప్పఖ్యాతి సంపాదించిన వ్యక్తి ఎన్టీఆర్. కూతురిని ఇచ్చిన అల్లుడు(చంద్రబాబు) వెన్నుపోటు పొడవడం, దానికి తోడు ఈనాడు రామోజీరావుగారి పథక రచన, మరో జర్నలిస్ట్ రాధాకృష్ణ డబ్బు సంచులు మోయడం.. ఇలాంటి పరిణామాలతో మానసిక క్షోభకు గురై ఎన్టీఆర్ అకాల మరణం చెందారు. చంద్రబాబు వెన్నుపోటు పొడవకుండా ఉంటే.. చాలాకాలం బతికి ఉండేవారు. అసలు చంద్రబాబు సీఎం అయ్యి ఉండేవారు కాదు’’ అని సీఎం జగన్‌ని పేర్కొన్నారు. ఏ పక్షాన ఉన్నా తమ తరపున ఏనాడూ ఎన్టీఆర్‌ను ఒక్క మాట అనలేదని, పైగా పాదయాత్రలో ఇచ్చిన హామీ కింద ఎన్టీఆర్ జిల్లాగా పేరు పెట్టడం తెలిసిందేనని సీఎం జగన్ గుర్తు చేశారు. జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పానని చెప్పుకునే చంద్రబాబు.. ఎన్టీఆర్‌కు భారత రత్న ఇప్పించలేకపోయారన్నారు. దివంగత మహానేత వైఎస్సార్.. పేదల కష్టాలు తెలిసిన వ్యక్తి. ఖరీదైన వైద్యాన్ని పేదలకు అందించిన మానవతావాద మహాశిఖరం. ప్రాణం విలువ తెలిసిన డాక్టర్. వైద్య రంగంలో సంస్కరణలకర్త. పేదవాడి సమస్యలు, జీవితాలు అర్థం చేసుకున్న వ్యక్తి అని సీఎం జగన్ గుర్తు చేసుకున్నారు. దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఆరోగ్యశ్రీ పథకంతో పాటు ప్రజావైద్యం కోసం 108, 104 సర్వీసులు తెచ్చిన ఘనత ఆయనది. ఆ సమయంలో దేశం మొత్తం ఆయన గురించి గొప్పగా మాట్లాడుకుందని సీఎం జగన్ ప్రస్తావించారు. ఏపీ 11 మెడికల్ కాలేజీలకు ఎనిమిది, టీడీపీ ఆవిర్భావం కంటే ముందే ఉన్నాయి. 1983 నుంచి ఈరోజువరకు టీడీపీ చరిత్రలో ఒక్క మెడికల్ కాలేజీ పెట్టలేదు. మూడు మెడికల్ కాలేజీలు వైఎస్సార్ హయాంలోనే వచ్చాయి. ప్రస్తుతం మరో 17 మెడికల్ కాలేజీలు నిర్మాణంలో ఉన్నాయి. మొత్తంగా.. ఏపీలో ఉన్న(నిర్మాణ దశలో ఉన్నవి కలుపుకుని) 28 మెడికల్ కాలేజీల్లో 20 కాలేజీలు వైఎస్సార్, ఆయన కొడుకు(వైఎస్ జగన్) హయాంలోనే వచ్చాయి. అలాంటప్పుడు వైఎస్సార్ పేరు పెట్టకూడదనడం న్యాయమేనా?, అర్హత దక్కాల్సిన వాళ్లకు క్రెడిట్ ఇవ్వకపోవడం ధర్మమేనా? అని సీఎం జగన్, టీడీపీని నిలదీశారు. ఎన్టీఆర్ విషయంలో ఆయన మీద ఎలాంటి కల్మషం లేదని, ఎవరూ అడగకపోయినా ఆయన పేరు మీద జిల్లా పెట్టామని, టీడీపీ హయాంలో ఏదైనా కట్టి ఉంటే.. దానికి ఎన్టీఆర్ పేరు పెట్టమని వాళ్లు అడిగితే సానుకూలంగా స్పందిస్తామని సీఎం జగన్ తెలియజేశారు. బాగా ఆలోచించే ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పుపై నిర్ణయం తీసుకున్నామని, మార్పు ముందు ఎన్టీఆర్ పేరు మార్చడం కరెక్టేనా? అని నన్ను నేను ప్రశ్నించుకున్నా అని సీఎం జగన్ చెప్పుకొచ్చారు. ఇదీ చదవండి: ‘ఎన్టీఆర్‌పై ప్రేమే ఉంటే చెప్పులు, రాళ్లు ఎందుకేశారు?’ -
రాజ్‌పథ్ పేరు మార్చేసిన కేంద్రం!
ఢిల్లీ: దేశరాజధానిలోని చారిత్రక మార్గం రాజ్‌పథ్ పేరు మార్చాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. రాజ్‌పథ్, సెంట్రల్ విస్టా లాన్ పేరును ‘కర్తవ్యపథ్’గా అధికారికంగా మార్చబోతోంది. ఈ మేరకు న్యూఢిల్లీ మున్సిపల్ (NDMC) సెప్టెంబర్ 7వ తేదీన నిర్వహించబోయే ప్రత్యేక సమావేశంలో.. కౌన్సిల్ ముందుకు రాజ్‌పథ్ పేరుమార్చే ప్రతిపాదన బిల్లు రానుంది. ఇండియా గేట్ వద్ద నేతాజీ విగ్రహం నుంచి.. రాష్ట్రపతి భవన్ వద్ద దాకా ఉన్న రోడ్డును రాజ్‌పథ్‌గా వ్యవహరిస్తారననది తెలిసిందే. బ్రిటిషర్ల కాలంలోనే రాజమార్గంగా రాజ్‌పథ్‌ను ఉపయోగించడం జరిగింది. ఢిల్లీ నడిబొడ్డున పునరుద్ధరించిన రాజ్‌పథ్, సెంట్రల్ విస్టా లాన్లు కొత్త రూపాలతో త్వరలో ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి. ఈ నేపథ్యంలో.. కొత్త పేరును సైతం వాడుకలోకి తేవాలని ప్రభుత్వం భావిస్తోంది. 1911లో కోల్‌కతా నుంచి ఢిల్లీకి రాజధానిని మార్చింది బ్రిటీష్ వైశ్రాయ్ పాలన. ఆ సమయంలో నిర్వహించిన దర్బార్ కోసం వచ్చిన అప్పటి బ్రిటిష్ చక్రవర్తి జార్జ్ 5 వచ్చారు. ఆ టైంలోనే రాజ్‌పథ్ వాడుకలోకి వచ్చింది. అయితే 75 ఏళ్ల స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా.. బ్రిటిషర్లు, వలసపాలనలో పేర్లకు, గుర్తులకు స్వస్తి చెప్పాల్సిన అవసరం ఉందని పంద్రాగస్టు ప్రసంగంలో ప్రధాని మోదీ అభిప్రాయపడ్డారు. అంతేకాదు.. ఈ నెల 8న సెంట్రల్ విస్టా రీడెవలప్మెంట్ ప్రాజెక్టు కింద విజయ్ చౌక్ నుంచి ఇండియా గేట్ వరకు స్ట్రెచ్‌ను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. లండన్‌లో జార్జ్ 5 తండ్రి ఎడ్వర్డ్ 7 స్మారకార్థం 1905లో కింగ్స్‌వేను ప్రారంభించారు. రాజ్‌పథ్ దీనినే పోలి ఉంటుంది. అయితే స్వాతంత్రం అనంతరం ఢిల్లీ కింగ్స్‌వేను హిందీ భాషకు అనుగుణంగా రాజ్‌పథ్ అని మార్చేశారు. సెంట్రల్ విస్టా రీడెవలప్మెంట్ ప్రాజెక్టులో భాగంగా.. ఈ రోడ్డును మీడియా, ప్రభుత్వ డాక్యుమెంట్లు ‘సెంట్రల్ విస్టా ఎవెన్యూ’గా పేర్కొన్నాయి. కానీ, ఫార్మల్గా రాజ్‌పథ్ అనే పేరే కొనసాగుతోంది. త్వరలో అది కర్తవ్య పథ్‌గా మారనుంది. ల్యాండ్‌మార్క్స్ రాష్ట్రపతి భవన్, సెక్రటేరియెట్ భవనం, విజయ్ చౌక్, ఇండియా గేట్, నేషనల్ వార్ మెమోరియల్.. రాజ్‌పథ్‌కు గుర్తులుగా ఉన్నాయి. కొత్త రూపం సంతరించుకోనున్న రాజ్‌పథ్ వెంట రాష్ట్రాల వారీగా ఫుడ్‌స్టాల్స్, గ్రానైట్ వాక్‌వేలు ఏర్పాటు చేశారు. వెండింగ్ జోన్లు, పార్కింగ్ స్థలాలు, రౌండ్ ది క్లాక్ సెక్యూరిటీ ఉండనుంది. ఇదీ చదవండి: అర్షదీప్ సింగ్‌కు ఖలిస్తాన్ లింక్ అంటగట్టడంపై కేంద్రం సీరియస్ -
Monkeypox: మంకీపాక్స్ పేరు మార్చేయండి
న్యూయార్క్: ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో మంకీపాక్స్ కేసులు పెరిగిపోతున్నాయి. కొత్త వైరస్ ఎఫెక్ట్‌తో చాలా దేశాలు అప్రమత్తం అయ్యాయి కూడా. ఇక ప్రపంచ ఆరోగ్య సంస్థ.. వారాంతంలో ప్రపంచ ఆరోగ్య అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. ఇప్పటికే పలు దేశాలు ఎయిర్‌పోర్ట్‌లలో టెస్టులు, లక్షణాలు కనిపిస్తే చికిత్స.. ట్రేసింగ్ చేపడుతున్నాయి. ఈ దరిమిలా డబ్ల్యూహెచ్‌వోకు ఓ అరుదైన విజ్ఞప్తి వచ్చింది. మంకీపాక్స్ వైరస్ పేరును అత్యవసరంగా మార్చాల్సిన అవసరం ఉందని WHOకి విజ్ఞప్తులు అందుతున్నాయి. మంకీపాక్స్ అనే పేరునే ట్రీట్మెంట్లో ఉన్న రోగులు ఓ కళంకంగా భావించే అవకాశం ఉంది. పైగా ఆఫ్రికా, ఆసియా దేశాల ప్రజలు జాతివివక్షగా భావించే అవకాశాలు లేకపోలేదు. కాబట్టి, వైరస్ పేరు మంకీపాక్స్ నుంచి మరోలా మార్చాలని ప్రపంచ ఆర్గోగ్య సంస్థకు న్యూయార్క్ సిటీ పబ్లిక్ హెల్త్ కమిషనర్ అశ్విన్ వాసన్ ఓ లేఖలో కోరారు. ‘‘బాధాకరమైన, జాత్యహంకార చరిత్రలో మంకీపాక్స్ వంటి పదజాలం రంగుల సంఘాల కోసం పాతుకుపోయింది’’ అని లేఖలో ఆయన పేర్కొన్నారు. అలాగే ప్రైమేట్స్ నుంచే మంకీపాక్స్ అనే పదం పుట్టలేదని, గతంలో కోవిడ్-19ను చైనీస్ వైరస్‌గా అప్పటి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రస్తావించడం దుమారం రేపిన సంగతిని సైతం ఆయన లేఖలో ప్రస్తావించారు. మంకీపాక్స్ అనేది ఎవరికైనా సోకుతుందని, అయతే రేసిజం, ఎల్జీబీటీక్యూ(లైంగిక ధోరణి)తోనూ వైరస్ వ్యాప్తి చెందుతోందన్న వాదన సైతం.. చికిత్సలకు అవాంతరంగా మారొచ్చని అశ్విన్ వాసన్ నొక్కి చెప్పారు. ఇదిలా ఉంటే.. ప్రపంచవ్యాప్తంగా 75 దేశాల్లో 16వేలకు పైగా మంకీపాక్స్ కేసులు నిర్దారణ అయ్యాయి. చదవండి: కరోనా-మంకీపాక్స్ తేడాలు ఏంటో తెలుసా? -
Turkey To Turkiye: టర్కీ పేరు మార్చుకోవడానికి కారణం ఇదే!
అంకారా: మిడిల్ ఈస్ట్ కంట్రీ టర్కీ.. అధికారికంగా తన పేరు మార్చుకుంది. టర్కీ కాస్త ఇక నుంచి ‘తుర్కియె’గా మారనుంది. ఇక నుంచి కొత్త పేరుతో తమను గుర్తించాలని ఐక్యరాజ్య సమితికి టర్కీ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతిపాదన పంపారు. ఆ వెంటనే ఐరాస అంగీకారం చెబుతూ.. ఈ విషయాన్ని ప్రకటించింది. దేశం గుర్తింపులో మార్పులుచేసే ‘‘రీబ్రాండింగ్’’ను.. కిందటి ఏడాది అధ్యక్షుడు రెచప్ టయ్యప్ ఎర్దోవాన్ మొదలుపెట్టారు. ఇందులో భాగంగా దేశం పేరును మార్చాలంటూ ప్రముఖ అంతర్జాతీయ సంస్థలను అక్కడి ప్రభుత్వ అధికారులు ఆశ్రయిస్తున్నారు. ఎర్దోగాన్ సైతం తమ దేశం పేరును తుర్కియె (Türkiye)గా ఉచ్చరించాలని ప్రపంచ దేశాలను కోరుతున్నారు. తుర్కుల సంస్కృతి, సంప్రదాయాలు, నాగరికత, విలువలకు తుర్కియా అనే పదం చక్కగా నప్పుతుందని ఎర్దోవాన్ చెబుతూ వస్తున్నారు. గత ఏడాది పేరును మారుస్తున్నట్లు టర్కీ ప్రకటించిన వెంటనే ప్రభుత్వ మీడియా సంస్థ టీఆర్టీలో వెంటనే మార్పులు చేశారు. టర్కీ (turkey)గా ఉన్న దేశం పేరును తుర్కియె(Türkiye)గా మార్చుకున్నట్లు.. ఐక్యరాజ్య సమితికి పంపిన లేఖలో పేర్కొన్నారు. కొత్త పేరును అధికారికంగా గుర్తించాలని ఐక్యరాజ్య సమితిని కోరారు టర్కీ విదేశాంగ మంత్రి. తమ దేశం పేరును మార్చాలని టర్కీ పెట్టుకున్న అభ్యర్థనకు ఐరాస అంగీకారం తెలిపింది. దీంతో టర్కీ అనే పేరు ఇక చరిత్ర కానుంది. కారణం ఇదే.. టర్కీ అనేది ఒక పక్షి పేరు. అంతేకాదు.. ఫెయిల్యూర్, మూర్ఖుడు, సిల్లీ ఫెలో అనే ఇంగ్లిష్ అర్థాలు కూడా ఉన్నాయి. అందుకే ఈ పేరు మార్చాలని ఎప్పటి నుంచో ప్రయత్నాలు సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తాజా నిర్ణయం తీసుకుందని టీఆర్టీ చెబుతోంది. గత జనవరిలో ‘హలో తుర్కియా’ పేరిట ప్రత్యేక కార్యక్రమాన్ని కూడా నిర్వహించారు. రీబ్రాండింగ్ ప్రక్రియలో భాగంగా.. ఇక నుంచి ఆ దేశం నుంచి ఎగుమతి అయ్యే ప్రాడక్టులపై ‘మేడ్ ఇన్ తుర్కియె’ మారుస్తారు. దేశం కొత్త పేరును విస్తృతంగా ప్రాచుర్యంలోకి తీసుకురావాలని అక్కడి ప్రభుత్వం విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. మిశ్రమ స్పందన దేశం పేరును మార్చడంపై అక్కడి ప్రజల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది. వచ్చే ఏడాది ఎన్నికలు జరుగుతుండటంతో ఆర్థిక సంక్షోభం నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు ఎర్దోవాన్ ఇలాంటి చర్యలు తీసుకుంటున్నారని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. జనాలు కూడా తమ పరిస్థితి పట్టించుకోకుండా.. ఇలా పేర్లు మారుస్తున్న ప్రభుత్వంపై మండిపడుతున్నారు. ఇదిలా ఉంటే.. దేశాలు ఇలా పేర్లు మార్చుకోవడం కొత్తేమీ కాదు. 2020లో డచ్ ప్రభుత్వం హోలాండ్ అనే పేరును ఇకపై వాడబోమని నెదర్లాండ్స్, ఐరాసకు తెలిపింది. అంతకుముందు మాసిడోనియా కూడా గ్రీస్‌తో ఉన్న గొడవల నేపథ్యంలో.. నార్త్ మాసిడోనియాగా పేరు మార్చుకుంది. గతంలో పర్షియా ఇరాన్ అయ్యింది. అలాగే.. సియామ్ కాస్త థాయ్‌లాండ్ అయ్యింది. ఇలా ఎన్నో దేశాలు పేర్లు మార్చుకున్నాయి. -
ఆ పేర్లు మార్చేయాల్సిందే: బీజేపీ డిమాండ్
న్యూఢిల్లీ: ఢిల్లీలో బీజేపీ కొత్త డిమాండ్‌తో ఉద్యమాన్ని తెర మీదకు తెచ్చింది. హిందుత్వ అనుబంధ సంస్థలతో పోరాటానికి దిగింది. మొఘలాయిల పాలనకు.. బానిసత్వానికి గుర్తులుగా మిగిలిపోయి కొన్ని రోడ్ల పేర్లను వెంటనే మార్చాలంటూ డిమాండ్ చేస్తోంది. ఈ మేరకు ఢిల్లీ బీజేపీ చీఫ్ ఆదేశ్ గుప్తా.. ఎన్డీఎంసీ(న్యూఢిల్లీ మున్సిపల్ కౌన్సిల్)కు ఓ లేఖ రాశారు. తుగ్లక్ రోడ్, అక్బర్ రోడ్, ఔరంగజేబ్ లేన్, హుమాయూన్ రోడ్, షాజహాన్ రోడ్.. వీటి పేర్లను తక్షణమే మార్చేయాలని డిమాండ్ చేశారాయన. అంతేకాదు.. వాటికి ఏయే పేర్లను పెట్టాలో కూడా సూచించాడు ఆ లేఖలో. తుగ్లక్‌రోడ్‌ను గురు గోవింద్ సింగ్ మార్గ్, అక్బర్ రోడ్‌ను మహారాణా ప్రతాప్ రోడ్, ఔరంగజేబ్ లేన్‌ను అబ్దుల్ కలాం లేన్, హుమాయూన్ లేన్‌ను మహర్షి వాల్మీకి రోడ్, షాజహాన్‌రోడ్‌ను జనరల్ బిపిన్ రావత్ గా మార్చేయాలంటూ డిమాండ్ చేశారు. పోయిన నెలలోనూ ఆయన 40 ఊర్ల పేర్లను మార్చాలంటూ ఢిల్లీ ప్రభుత్వానికి సైతం ఒక డిమాండ్ చేశారు. అలాగే బాబర్ లేన్‌ను స్వతంత్ర సమర యోధుడు ఖుదీరామ్ బోస్ గా మార్చాలని కోరారు. ఇదిలా ఉంటే.. 13 మంది సభ్యులతో కూడిన ఎన్డీఎంసీ ఈ లేఖను పరిశీలనకు తీసుకుంది. సాధారణంగా.. చరిత్ర, సెంటిమెంట్, సదరు వ్యక్తి గురించి సమాజానికి తెలియాల్సి ఉందన్న అవసరం మేరకు.. రోడ్లకు, ప్రదేశాలకు పేర్లు మార్చే అంశాన్ని పరిశీలిస్తారు. ఇక 2014లో బీజేపీ అధికారంలోకి వచ్చాక.. యూపీ, ఢిల్లీలో కొన్ని ప్రాంతాల పేర్లను మార్చే ప్రయత్నాలు చేసి విమర్శలు ఎదుర్కొంది. ఆంగ్లేయులు, ఇస్లాం పాలకుల గుర్తులు ఇప్పుడేందుకంటూ ఆ టైంలో కొందరు బీజేపీ నేతలు పేర్ల మార్పు ఉద్యమాన్ని తీవ్రతరం చేశారు కూడా. కుతుబ్ మినార్ను కూడా.. ఇదిలా ఉండగా.. రోడ్ల పేర్ల మార్పు తెర మీదకు రావడంతో మరికొన్ని డిమాండ్లు తెర మీదకు వచ్చాయి. ఢిల్లీలోని కుతుబ్ మినార్ పేరును విష్ణు స్తంభ్‌గా మార్చాలంటూ హిందూ సంఘం ఒకటి మంగళవారం ధర్నా చేపట్టింది. యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందిన మహాకల్ మానవ్ సేవా ప్రాంతంలో ఈ సంఘం నినాదాలు చేసింది. దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకోగా.. భారీగా పోలీసులు మోహరించారు. అంతేకాదు నిరసనల సమయంలో కొందరు హనుమాన్ చాలీసా పఠించినట్లు సమాచారం. Delhi | Members of Hindu organisation Mahakal Manav Sewa protest near Qutub Minar, demand renaming of Qutub Minar as Vishnu Stambh pic.twitter.com/HuPsf6oakP — ANI (@ANI) May 10, 2022 చదవండి: దేశద్రోహ చట్టాన్ని పునఃసమీక్షిస్తాం -
రాజీవ్ ఖేల్‌రత్న అవార్డు పేరు మార్పు
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో క్రీడాకారులకు అందించే అత్యుత్తమ క్రీడా పురస్కారం రాజీవ్ ఖేల్‌రత్న అవార్డు. ఈ పురస్కారం పేరు మారింది. ఈ అవార్డును ఇకపై మేజర్ ధ్యాన్‌చంద్ ఖేల్‌రత్నగా శుక్రవారం మార్చారు. ఈ విషయాన్ని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ట్విటర్లో ప్రకటించారు. దేశ ప్రజలందరి నుంచి వచ్చిన విజ్ఞప్తులతో వారి మనోభావాలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. మాజీ ప్రధానమంత్రి రాజీవ్‌గాంధీ పేరు మీదుగా ఖేల్‌రత్న పురస్కారం 1991-92లో ప్రారంభించారు. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం క్రీడాకారులకు అవార్డులు ప్రకటిస్తున్నారు. ఇప్పుడు రాజీవ్ పేరు తొలగించి ధ్యాన్‌చంద్ పేరు పెట్టారు. ధ్యాన్‌చంద్ భారత హకీ దిగ్గజం. ధ్యాన్‌చంద్ కెప్టెన్సీలో హకీ జట్టు మూడుసార్లు వరుసగా ఒలింపిక్స్ స్వర్ణ పతకాలు సొంతం చేసుకుంది. అంతటి గొప్ప వ్యక్తి జయంతిని (ఆగస్టు 29) జాతీయ క్రీడా దినోత్సవంగా నిర్వహించుకుంటున్నాం. తాజాగా టోక్యోలో జరుగుతున్న ఒలింపిక్స్‌లో మళ్లీ భారత హాకీ జట్టు పతకం పొందింది. మహిళల జట్టు సెమీ ఫైనల్ వరకు వెళ్లి అద్భుత ప్రదర్శన చేసినా నిరాశ చెందారు. అయినా వారి పోరాటాన్ని దేశం కీర్తించింది. వీటన్నింటినీ చూస్తుంటే హాకీకి పూర్వ వైభవం వచ్చిందని అందరూ భావిస్తున్నారు. ఈ క్రమంలోనే హాకీ దిగ్గజంగా ఉన్న ధ్యాన్‌చంద్ పేరు పెట్టడంతో మళ్లీ హాకీ క్రీడకు మంచి రోజులు రానున్నాయి. I have been getting many requests from citizens across India to name the Khel Ratna Award after Major Dhyan Chand. I thank them for their views. Respecting their sentiment, the Khel Ratna Award will hereby be called the Major Dhyan Chand Khel Ratna Award! Jai Hind! pic.twitter.com/zbStlMNHdq — Narendra Modi (@narendramodi) August 6, 2021 -
విదేశీ గడ్డపై వెలిగిన ఖ్యాతి.. న్యూయార్క్ వీధికి రామ్‌లాల్ పేరు
మన ఖ్యాతి మరోసారి విదేశీ గడ్డపై వెలిగింది. న్యూయార్క్‌లో ఓ వీధికి భారత మూలాలున్న వ్యక్తి పేరును పెట్టారు. ప్రముఖ మత గురువు, భాషా పండితుడు ‘ధర్మాచార్య’ పండిట్ రామ్‌లాల్ పేరుతో ఓ వీధికి నామకరణం చేయగా, క్వీన్స్ రిచ్మండ్ హిల్‌లో అధికారిక వేడుక నిర్వహించారు. గుయానా స్కెల్డాన్లో భారత మూలాలు ఉన్న కుటుంబంలో పుట్టి పెరిగారు రామ్‌లాల్. ఆయన అక్కడ స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొన్నారు. 1979లో అమెరికా బ్రూక్లిన్కు వెళ్లి అక్కడో ఆస్పత్రిలో పని చేశారు. ఇండో-కరేబియన్ కమ్యూనిటీ లీడర్లలో ఒకరిగా ఎదిగారు. ఆర్య సమాజం తరపున పనిచేశారు. ముఖ్యంగా హిందీ భాషాభివృద్ధికి ఎంతో కృషి చేశారు. గుయానాలో ఉన్నప్పుడు టాగూర్ మెమొరియల్ స్కూల్లో భారతీయ విద్యార్థులకు హిందీ బోధించేవారాయన. 2019లో 90 ఏళ్ల వయసులో ఆయన కన్నుమూశారు. లిబర్టీ అవెన్యూ, 133వ వీధికి రామ్‌లాల్ పేరు పెట్టాలని ఇండో-కరేబియన్స్ నుంచి ప్రతిపాదనలు రాగా, జూన్ 27న న్యూయార్క్ మేయర్ బిల్ డె బ్లాసియో సంతకం చేశారు. దీంతో వీధికి రామ్లాల్గా నామకరణం పూర్తికాగా, అట్టహాసంగా జరిగిన ప్రారంభ వేడుకలో న్యూయార్క్ సిటీ కౌన్సిల్ అడ్రిన్నె అడమ్స్ పాల్గొన్నారు. ఇంతకు ముందు న్యూయార్క్‌లో రమేశ్ కాళిచరణ్ వే, జోనాథన్ నారాయిన్ వే, పంజాబ్ అవే, గురుద్వారా వే, లిటిల్ గుయానా అవెన్యూలుగా కొన్ని వీధులకు పేర్లు పెట్టారు. -
అయోధ్య ఎయిర్‌పోర్ట్‌కు నామకరణం.. పేరేమిటంటే
లక్నో: హిందూవుల చిరకాల కల.. కోట్లాది మంది ప్రజల భక్తిభావనతో ముడిపడిన క్షేత్రం అయోధ్య. ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో రామ మందిర నిర్మాణ పనులు మొదలయ్యాయి. ఇప్పటికే విరాళాలు భారీగా వస్తున్నాయి. ఈ క్రమంలో రామ మందిర నిర్మాణం ఒక్కో దశ పూర్తి చేసుకుంటోంది. ఆలయ నిర్మాణంతో పాటు అయోధ్య నగర రూపురేఖలు మారుతున్నాయి. ఇప్పటికే విమానాశ్రయం సిద్ధమవుతుండగా తాజాగా ఎయిర్ పోర్టుకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం సరికొత్త పేరు పెట్టింది. రాముడి పేరు వచ్చేలా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పేరు పెట్టారు. ఈ మేరకు అధికారిక ప్రకటన సోమవారం జారీ చేశారు. ‘మర్యాద పురుషోత్తమ్ శ్రీరామ్ ఎయిర్‌పోర్టు’ అని నామకరణం చేశారు. ఈ క్రమంలోనే తాజాగా ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్లో యోగి ప్రభుత్వం విమానాశ్రయ అభివృద్ధికి రూ.101 కోట్లు కేటాయించింది. ఈ ఎయిర్‌పోర్టును అంతర్జాతీయంగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం తోడ్పాడుతోంది. దీనికోసం బడ్జెట్లో నిధులు కేటాయించింది కూడా. రాష్ట్రంలోని అలీగడ్, మొరాదాబాద్, మీరట్ వంటి నగరాల నుంచి అయోధ్యకు రాకపోకలు ప్రారంభించనున్నట్లు యోగి ప్రకటించారు. అయితే రాష్ట్రంలో కొన్ని నగరాలకు యోగి ప్రభుత్వం కొత్త పేర్లు పెడుతున్న విషయం తెలిసిందే.