వాషింగ్టన్: అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దులోని 11 ప్రదేశాలకు పేర్లు పెట్టి.. ఈ భూభాగం టిబెట్ దక్షిణప్రాంతం అంటూ చైనా వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. దీనిపై భారత్ ఇప్పటికే తీవ్రంగా స్పదించింది. అయితే తాజాగా అగ్రరాజ్యం అమెరికా కూడా ఈ వ్యవహారంపై స్పందించింది.
చైనా చర్యను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు అగ్రరాజ్యం తేల్చి చెప్పింది. చైనా తీసుకుంటున్న ఏకపక్ష నిర్ణయాలు ఎంతమాత్రమూ ఆమోదయోగ్యం కాదని స్పష్టం చేసింది. అరుణాచల్ ప్రదేశ్ ఎప్పటికీ భారత్‌లో అంతర్భాగమేనని తాము గుర్తిస్తున్నట్లు శ్వేతసౌధం ప్రకటనలో తెలిపింది.
ఏం జరిగిందంటే..?
అరుణాచల్ ప్రదేశ్.. టిబెట్‌లో అంతర్భాగమంటూ వాదిస్తున్న చైనా మరో దుశ్చర్యకు పాల్పడి సరిహద్దుల్లోని పదకొండు ప్రదేశాలకు పేర్లు పెట్టి.. జాంగ్నాన్ పేరుతో టిబెట్ దక్షిణ ప్రాంతంలో భాగమంటూ ఒక ప్రకటన విడుదల చేసింది.
దీనికి ప్రతిస్పందనగా భారత్ ఘాటుగానే బదులిచ్చింది. ఈ పేర్లన్నింటిని తిరస్కరిస్తున్నట్లు ప్రకటిచింది. అరుణాచల్ ప్రదేశ్.. ఎప్పుడూ భారత్‌లో అంతర్భాగమే తేల్చిచెప్పింది. 'అరుణాచల్ ప్రదేశ్ భారత్ అంతర్భాగం. అది విడదీయరాని భాగం. ఏవో పేర్లు కనిపెట్టి.. కనికట్టు చేసే ప్రయత్నాలు ఫలించబోవు. అవి వాస్తవాలను మార్చలేవు' అని ప్రకటనలో పేర్కొంది.
చదవండి: ఇంత జరిగినా అదే పాట! తీరు మార్చుకోని ట్రంప్.. బైడెన్ పాలనపై ఆరోపణలు
Comments
Please login to add a commentAdd a comment