ఢిల్లీ: అరుణాచల్ ప్రదేశ్.. టిబెట్‌లో అంతర్భాగమంటూ వాదిస్తున్న చైనా తాజాగా మరో దుశ్చర్యకు దిగింది. అరుణాచల్ సరిహద్దుల్లోని పదకొండు ప్రదేశాలకు పేర్లు పెట్టి.. జాంగ్నాన్ పేరుతో టిబెట్ దక్షిణ ప్రాంతంలో భాగమంటూ ఒక ప్రకటన విడుదల చేసింది. అయితే..
ప్రతిస్పందనగా భారత్ ఘాటుగానే ప్రకటన విడుదల చేసింది. ఈ పేర్లన్నింటిని తిరస్కరిస్తున్నట్లు పేర్కొంది. అరుణాచల్ ప్రదేశ్.. ఎప్పుడూ భారత్‌లో అంతర్భాగమే అని ఢిల్లీ వర్గాలు ఒక ప్రకటనలో స్పష్టం చేశాయి. చైనా అలాంటి నివేదిక గురించి విడుదల చేసిందని తెలిసింది. చైనా ఇలాంటి పని చేయడం తొలిసారేం కాదు కదా. మేము దీనిని పూర్తిగా తిరస్కరిస్తున్నాము అని విదేశాగం మంత్రిత్వ శాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చీ తెలిపారు.
అరుణాచల్ ప్రదేశ్ భారత్ అంతర్భాగం. అది విడదీయరాని భాగం. ఏవో పేర్లు కనిపెట్టి.. కనికట్టు చేసే ప్రయత్నాలు ఫలించబోవు. అవి వాస్తవాలను మార్చలేవు అని బాగ్చీ స్పష్టం చేశారు.
Our response to media queries regarding the renaming of places in Arunachal Pradesh by China:https://t.co/JcMQoaTzK6 pic.twitter.com/CKBzK36H1K
— Arindam Bagchi (@MEAIndia) April 4, 2023
2017లో దలైలామా అరుణాచల్ ప్రదేశ్ పర్యటన తర్వాత చైనా మొదటిసారి ఇలాంటి పనే చేసింది. ఆ సమయంలో ఆరు ప్రాంతాల పేర్లను మార్చేసింది.
చైనా అధికార ప్రభుత్వ మీడియా గ్లోబల్ టైమ్స్ కథనం ప్రకారం.. ‘ప్రామాణిక భౌగోళిక పేర్లు’ అని చైనా తన చర్యను సమర్థించుకుంటూ వస్తోంది.
ఇక 2021లో రెండో బ్యాచ్ కింద 15 ప్రాంతాల పేర్లను మార్చేసింది.
ఆయా సందర్భాల్లో భారత్ చైనా చర్యను ఖండించింది.
తాజాగా.. 11 ప్రాంతాలు(రెండు నదులు, ఐదు పర్వత ప్రాంతాలు, రెండు నివాస ప్రాంతాలు, రెండు మైదాన ప్రాంతాలు) పేర్లను మార్చేసింది.
Comments
Please login to add a commentAdd a comment