dalailama
-
దలైలామాను కలిసిన న్యూజిలాండ్ క్రికెటర్లు.. ఫోటోలు వైరల్
వన్డే ప్రపంచకప్-2023లో న్యూజిలాండ్ తొలి ఓటమి చవిచూసిన సంగతి తెలిసిందే. ఆక్టోబర్ 22న ధర్మశాల వేదికగా టీమిండియాతో జరిగిన మ్యాచ్‌లో 4 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. ఈ మెగా ఈవెంట్లో కివీస్ తమ తదుపరి మ్యాచ్‌లో ఆక్టోబర్ 28న ధర్మశాల వేదికగానే ఆస్ట్రేలియాతో తలపడనుంది. అయితే తమ తర్వాతి మ్యాచ్‌కు దాదాపు 6 రోజుల బ్రేక్ రావడంతో ధర్మశాలలోని సుందరమైన ప్రదేశాలను కివీస్ జట్టు ఆటగాళ్లు చుట్టేస్తున్నారు. ఈ క్రమంలో బౌధ్దమత గురువు దలైలామాను ఆయన నివాసంలో కివీస్ ఆటగాళ్లు కలిశారు. క్రికెటర్లతో పాటు వారి కుటంబ సభ్యులు కూడా ఉన్నారు. దలైలామాతో కలసి ఫోటోలు దిగారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దలైలామాను కలిసిన న్యూజిలాండ్ క్రికెటర్లలో కెప్టెన్ కేన్ విలియమ్సన్, టామ్ లాథమ్, శాంట్నర్ వంటి స్టార్ క్రికెటర్లు ఉన్నారు. ఇక ఈ మెగా టోర్నీ పాయింట్ల పట్టికలో కివీస్ ప్రస్తుతం రెండో స్ధానంలో కొనసాగుతోంది. -
చైనా మళ్లీ అదే పని.. భారత్ ఘాటు బదులు1
ఢిల్లీ: అరుణాచల్ ప్రదేశ్.. టిబెట్‌లో అంతర్భాగమంటూ వాదిస్తున్న చైనా తాజాగా మరో దుశ్చర్యకు దిగింది. అరుణాచల్ సరిహద్దుల్లోని పదకొండు ప్రదేశాలకు పేర్లు పెట్టి.. జాంగ్నాన్ పేరుతో టిబెట్ దక్షిణ ప్రాంతంలో భాగమంటూ ఒక ప్రకటన విడుదల చేసింది. అయితే.. ప్రతిస్పందనగా భారత్ ఘాటుగానే ప్రకటన విడుదల చేసింది. ఈ పేర్లన్నింటిని తిరస్కరిస్తున్నట్లు పేర్కొంది. అరుణాచల్ ప్రదేశ్.. ఎప్పుడూ భారత్‌లో అంతర్భాగమే అని ఢిల్లీ వర్గాలు ఒక ప్రకటనలో స్పష్టం చేశాయి. చైనా అలాంటి నివేదిక గురించి విడుదల చేసిందని తెలిసింది. చైనా ఇలాంటి పని చేయడం తొలిసారేం కాదు కదా. మేము దీనిని పూర్తిగా తిరస్కరిస్తున్నాము అని విదేశాగం మంత్రిత్వ శాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చీ తెలిపారు. అరుణాచల్ ప్రదేశ్ భారత్ అంతర్భాగం. అది విడదీయరాని భాగం. ఏవో పేర్లు కనిపెట్టి.. కనికట్టు చేసే ప్రయత్నాలు ఫలించబోవు. అవి వాస్తవాలను మార్చలేవు అని బాగ్చీ స్పష్టం చేశారు. Our response to media queries regarding the renaming of places in Arunachal Pradesh by China:https://t.co/JcMQoaTzK6 pic.twitter.com/CKBzK36H1K — Arindam Bagchi (@MEAIndia) April 4, 2023 2017లో దలైలామా అరుణాచల్ ప్రదేశ్ పర్యటన తర్వాత చైనా మొదటిసారి ఇలాంటి పనే చేసింది. ఆ సమయంలో ఆరు ప్రాంతాల పేర్లను మార్చేసింది. చైనా అధికార ప్రభుత్వ మీడియా గ్లోబల్ టైమ్స్ కథనం ప్రకారం.. ‘ప్రామాణిక భౌగోళిక పేర్లు’ అని చైనా తన చర్యను సమర్థించుకుంటూ వస్తోంది. ఇక 2021లో రెండో బ్యాచ్ కింద 15 ప్రాంతాల పేర్లను మార్చేసింది. ఆయా సందర్భాల్లో భారత్ చైనా చర్యను ఖండించింది. తాజాగా.. 11 ప్రాంతాలు(రెండు నదులు, ఐదు పర్వత ప్రాంతాలు, రెండు నివాస ప్రాంతాలు, రెండు మైదాన ప్రాంతాలు) పేర్లను మార్చేసింది. -
దలైలామా భద్రతపై అలర్ట్.. పోలీసుల అదుపులో ‘చైనా మహిళ’
పట్నా: బౌద్ధమత గురువు దలైలామా బిహార్‌లోని ఆధ్యాత్మిక క్షేత్రం బుద్ధగయాలో పర్యటిస్తున్నారు. మూడురోజుల పాటు సాగే కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటారు. దలైలామా పర్యటన వేళ భద్రతాపరమైన అలర్ట్ ప్రకటించారు పోలీసులు. దలైలామాపై గూఢచర్యానికి పాల్పడుతోందన్న అనుమానాలతో చైనాకు చెందిన ఓ మహిళను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఆమెను తిరిగి చైనా పంపించే ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. దలైలామా పర్యటన వేళ చైనా మహిళ అనుమానాస్పద కదలికలపై గురువారం స్థానిక పోలీసులను అలర్ట్ చేశారు అధికారులు. ఆమె ఆనవాళ్లను సూచించే ఊహాచిత్రాన్ని విడుదల చేశారు. ఆమె పేరు సాంగ్ షియావోలాన్ అని పోలీసులు తెలిపారు. టిబెటన్ల ఆధ్యాత్మిక గురువు దలైలామాకు హాని తలపెట్టేందుకు వచ్చినట్లు అనుమానిస్తున్నామని వెల్లడించారు. ‘గయాలో నివసిస్తున్న చైనా మహిళ గురించి స్థానిక పోలీసులకు సమాచారం అందింది. ఆమె గత రెండేళ్లుగా ఇక్కడే నివసిస్తున్నట్లు తెలిసింది. ఈ క్రమంలో పోలీసులను అప్రమత్తం చేశాం. చైనా మహిళ కోసం తనిఖీలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం చైనా మహిళ ఎక్కడ ఉందనే విషయంపై స్పష్టత లేదు. ఆమె చైనా గూఢచారి అనడాన్ని కొట్టిపారేయలేం.’ అని తెలిపారు గయా సీనియర్ ఎస్పీ హర్‌ప్రీత్ కౌర్. ఆమె ఊహాచిత్రాలు బుధవారం నుంచి సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. చైనా మహిళ గురించి తెలిసిన వారు సమాచారం అందివ్వాలని పోలీసులు కోరుతున్నారు. చైనా గూఢచారి అయిన ఆ మహిళ బుద్ధగయాతో పాటు పలు ప్రాంతాల్లో ఏడాదికిపైగా నివసిస్తున్నట్లు తెలిసింది. అయితే, విదేశాంగ శాఖ వద్ద ఆమె గురించి ఎలాంటి సమాచారం లేకపోవడం గమనార్హం. బుద్ధగయాకు గత వారు చేరుకున్నారు దలైలామా. కోవిడ్-19 కారణంగా బుద్ధ పర్యటక ప్రాంతమైన బుద్ధగయాను రెండేళ్ల తర్వాత సందర్శించారు. గయా అంతర్జాతీయ విమానాశ్రయానికి డిసెంబర్ 22న చేరుకున్న ఆయనకు జిల్లా కలెక్టర్ త్యాగరాజన్, ఎస్పీ హర్‌ప్రీత్ కౌర్ ఘన స్వాగతం పలికారు. డిసెంబర్ 29-31 వరకు జరిగే వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇందులో పాల్గొనేందుకు వివిధ దేశాల నుంచి వేలాది మంది బౌద్ధ సన్యాసులు ఇప్పటికే బిహార్‌కు చేరుకున్నారు. ఇదీ చదవండి: బెంగాల్ కేబినెట్ మంత్రి ఆకస్మిక మృతి.. మమతా బెనర్జీ దిగ్భ్రాంతి -
బౌద్ధ గురు థిక్ నాక్ హాన్ మృతి
హనోయ్: ప్రముఖ బౌద్ధ గురువు, జెన్ సన్యాసి థిక్ నాక్ హాన్ 95 సంవత్సరాల వయసులో శనివారం మరణించారు. పశ్చిమ దేశాల్లో జెన్, బౌద్ధిజంను వ్యాపింపజేయడంలో ఆయన కృషి గణనీయం. థిక్ నాక్ హాన్ మృతికి ప్రపంచవ్యాప్తంగా పలువురు ప్రముఖులు సంతాపం ప్రకటించారు. వియత్నాంలోని టు హైయు పగోడాలో ఆయన చివరి శ్వాస విడిచారు. 1926లో జన్మించిన థిక్ నాక్ హాన్ 16ఏళ్ల వయసులో సన్యాసం స్వీకరించారు. 1961లో ఆయన అమెరికా పర్యటనకు వెళ్లారు. 1966లో మార్జిన్ లూథర్ కింగ్ (జూ)తో పలు విషయాలపై చర్చలు జరిపారు. వియత్నాం అంతర్యుద్ధం నివారణకు ఆయన చేసిన కృషిని గుర్తించిన మార్టిన్, థిక్‌నాక్ పేరును నోబెల్ శాంతి బహుమతికి సిఫార్సు చేశారు. ఆ సమయంలో ఆయన తిరిగి వియత్నాం రాకుండా నిషేధం కూడా విధించారు. దీంతో ఫ్రాన్స్‌లో నిర్మించిన ప్లమ్ విలేజ్‌లో ఆయన ఎక్కువకాలం గడిపారు. జెన్ బుద్ధిజం ముఖ్యాంశాలను ఆయన విరివిగా ప్రచారం చేశారు. 2014లో ఆయనకు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. 2018లో ఆయన వియత్నాంకు వచ్చి చివరి వరకు అక్కడే కాలం గడిపారు. కరేజ్ ఆఫ్ కన్సైస్ (1991), పసెమ్ ఇన్ టెర్రిస్ పీస్ అండ్ ఫ్రీడం(2015) అవార్డులు ఆయన్ను వరించాయి. 2017లో ఎడ్యుకేషన్ యూనివర్సిటీ ఆఫ్ హాంకాంగ్ ఆయనకు గౌరవ డాక్టరేట్ ఇచ్చింది. ఆయన చరిత్ర ఆధారంగా ద సీక్రెట్ ఆఫ్ 5 పవర్స్ అనే నవల కూడా వచ్చింది. స్వయంగా ఆయన కొన్ని చిత్రాల్లో, డాక్యుమెంటరీల్లో కనిపించారు. ఆయన మరణం తనను బాధిస్తోందని బౌద్ధ గురు దలైలామా విచారం వ్యక్తం చేశారు. -
చైనా దగ్గర తుపాకులున్నాయి. కానీ.. : దలైలామా
పాట్నా: క్రిస్మస్ పర్వదినం సందర్భంగా బౌద్ధ గురువు దలైలామా బుధవారం చైనానుద్దేశించి సందేశం ఇచ్చారు. ‘మా వద్ద సత్యం ఉంది. కమ్యూనిస్టు చైనా వద్ద తుపాకులు, ఆయుధాలు ఉన్నాయి. కానీ దీర్ఘకాలంలో ఆయుధ శక్తి మీద సత్యమే గెలుస్తుంది. ప్రపంచంలోనే బౌద్ధులు ఎక్కువగా ఉన్న దేశాల్లో చైనా ఒకటి. అక్కడి బౌద్ధులు ఇప్పుడిప్పుడే నెమ్మదిగా తాము నమ్మే బౌద్ధమే నిజమైనదనే అభిప్రాయానికి వస్తున్నారని వ్యాఖ్యానించారు. దలైలామా ప్రస్తుతం బీహార్‌లోని బుద్ధగయలో ఉన్నారు. జనవరి 6న జరిగే బోధిసత్వునికి సంబంధించిన కార్యక్రమంలో దాదాపు 50వేల మంది బౌద్ధులనుద్దేశించి ఆయన ప్రసంగించనున్నారు. దలైలామాను అనుసరించే చైనా బౌద్ధుల్లో అధిక శాతం మంది చైనా వెలుపలే ఉన్నారు. కాగా, నోబెల్ శాంతి బహుమతి గ్రహీత అయిన దలైలామా 1959లో భారతదేశానికి శరణార్థిగా వచ్చారు. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని కొండ ప్రాంతమైన ధర్మశాలలో ఆయన నివాసముంటున్నారు. కానీ, చైనా మాత్రం దలైలామాను టిబెట్ స్వాతంత్ర్యం కోసం పోరాడుతున్న వ్యక్తిగా గుర్తిస్తోంది. మరోవైపు తదుపరి దలైలామా ఎవరనే విషయంలో సాంప్రదాయాన్ని కొనసాగించాలని చైనా పట్టుబడుతుండగా, టిబెట్లు మాత్రం చైనా చేస్తోన్న ఒత్తిడిని వ్యతిరేకిస్తున్నారు. ఈ విషయంపై దలైలామా స్పందిస్తూ.. తదుపరి దలైలామా ఎవరనే దానిపై బయట ఇప్పటికే చాలా చర్చ జరిగింది. ఈ విషయంపై అంత తొందర ఎందుకు? ఇప్పుడు నాకు 85 ఏళ్లయినా ఆరోగ్యంగానే ఉన్నాను కదా..అంటూ సమాధానమిచ్చారు. ఇదిలా ఉండగా, ప్రస్తుత దలైలామాను కనుగొనడానికి నాలుగు సంవత్సరాలు పట్టింది. -
ఫేక్‌న్యూస్ : 15వ దలైలామాగా ‘సత్యసాయి’ విద్యార్థి
సాక్షి, హైదరాబాద్ : 15వ దలైలామాగా పుట్టపర్తిలోని సత్యసాయి ప్రైమరీ పాఠశాలకు చెందిన విద్యార్థి ఎంపికయ్యాడంటూ జరుగుతున్న ప్రచారం అవాస్తవమని తేలింది. సత్యసాయి పాఠశాల్లో 7వ తరగతి చదువుతున్న 12 ఏళ్ల దావావంగ్డి 15వ దలైలామాగా ఎంపికయ్యాడంటూ సోషల్ మీడియా వేదికగా ప్రచారం జరిగింది. అయితే ఈ ప్రచారాన్ని దలైలామా ఆఫీసు కొట్టిపారేసింది. ఈ వార్తల్లో ఎటువంటి నిజం లేదని, 15వ దలైలామాగా ఇంకా ఎవరిని ఎన్నుకోలేదని స్పష్టం చేసింది. అంతేకాకుండా దావావంగ్డి సత్యసాయి ప్రైమరీ పాఠశాలకు చెందినవాడే కాదని తేలింది. అతనికి సత్యసాయి స్కూల్‌తో ఏ మాత్రం సంబంధంలేదని స్పష్టమైంది. పశ్చిమబెంగాల్లోని డార్జిలింగ్‌కు చెందిన ప్రేమవంగ్డి,పంజూరాయ్‌ల కుమారుడు దావవంగ్డి కాగా.. 2016 లో అతన్ని ‘ద్రాక్త్సే రిన్పోచే’ అనే బౌద్ధ గురువు యొక్క అవతారమని 14వ దలైలామా గుర్తించినట్టు ‘జీ న్యూస్’ ఓ కథనంలో పేర్కొంది. కానీ తననే ఇప్పుడు 15వ దలైలామాగా ఎన్నుకున్నట్టు మాత్రం ఎక్కడా సమాచారం లేదు. -
ఆసుపత్రిలో చేరిన దలైలామా
ధర్మశాల: టిబెట్ ఆధ్యాత్మిక గురువు దలైలామా ఛాతి సంబంధిత సమస్యలతో ఢిల్లీలోని ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు. మంగళవారం ధర్మశాల నుంచి ఢిల్లీకి వచ్చిన దలైలామా మ్యాక్స్ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఛాతిలో ఇన్ఫెక్షన్ ఉన్నందువల్ల కొన్ని రోజులు చికిత్స అవసరమని వైద్యులు సూచించారు. దీంతో బుధవారం హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. ప్రస్తుతం దలైలామా ఆరోగ్యం నిలకడగా ఉందని, ఎలాంటి ప్రాణపాయం లేదని వైద్యులు తెలిపారు. నోబెల్ శాంతి బహుమతి గ్రహీత దలైలామాకు ప్రపంచవ్యాప్తంగా అభిమానులున్నారు. ఢిల్లీలోనే ఏప్రిల్ 6న ముగిసిన గ్లోబల్ లెర్నింగ్ కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న దలైలామా, సోమవారం ధర్మశాలకు వెళ్లారు. కానీ అనారోగ్యం కారణంగా మరుసటి రోజు తిరిగి ఢిల్లీ చేరుకున్నారు. మొదటిసారిగా 1959లో దలైలామా భారత్‌కు వచ్చారు. టిబెట్, చైనా ఆక్రమణకు గురికావడంతో, తప్పించుకొని భారత్ చేరుకున్న దలైలామా అప్పటి నుంచి హిమచల్‌ప్రదేశ్‌లోని ధర్మశాలలో నివాసం ఉంటున్నారు. బిహార్‌లోని నలంద విశ్వవిద్యాలయ సాంప్రదాయానికి తనను తాను వారసుడిగా దలైలామా గతంలో ప్రకటించుకున్నారు. -
‘దలైలామా నోట్’
దేశాల మధ్య సంబంధాలను నిర్దేశించే అంశాల్లో అవసరాలు, అనివార్యతలు కీలకమైనవి. ఇవి పట్టనట్టు వ్యవహరిస్తూ పాత విధానాన్నే కొనసాగించడం వల్ల సమస్యలు తలెత్తక తప్పదు. ‘టిబెట్ ప్రవాస ప్రభుత్వం’ విషయంలో, ప్రత్యేకించి బౌద్ధ ఆధ్యాత్మిక గురువు దలైలామా విషయంలో కేంద్ర ప్రభుత్వం ఇలాంటి ఆలోచనే చేసి ఉండొచ్చునని తాజా పరిణామాలు రుజువు చేస్తున్నాయి. దలైలామా మన దేశానికి వలసవచ్చి అరవైయ్యేళ్లయిన సందర్భంగా ‘ప్రవాస ప్రభుత్వం’ ఆధ్వర్యంలో ఈనెల 31, వచ్చే నెల 1 తేదీల్లో న్యూఢిల్లీలో కొన్ని కార్యక్రమాలు జరగాల్సి ఉండగా వాటిల్లో పాల్గొనవద్దని కేంద్ర కేబినెట్ కార్యదర్శి పి.కె. సిన్హా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లోని సీనియర్ నాయకులకూ, అధికారులకు సూచన చేస్తూ ఒక రహస్య నోట్ జారీ చేసిన తీరు ఆశ్చర్యం కలిగించకమానదు. ఈ నోట్ గురించి ఆంగ్ల దినపత్రిక ‘ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ నాలుగు రోజులక్రితం బయటపెట్టినప్పుడు దలైలామా విషయంలో ప్రభుత్వ వైఖరేమీ మారలేదన్న జవాబే వచ్చింది. అయితే టిబెట్ ప్రవాస ప్రభుత్వం న్యూఢిల్లీ కార్యక్రమాలను హిమాచల్ ప్రదేశ్‌లోని ధర్మశాలకు చడీచప్పుడు లేకుండా మార్చుకుంది. తొలుత అనుకున్నవిధంగా అయితే ఈనెల 31న రాజ్‌ఘాట్‌లో సర్వమత ప్రార్థనలు, ఆ మర్నాడు ‘థాంక్యూ ఇండియా’ కార్యక్రమం జరగాల్సి ఉంది. ఇందులో సర్వమత ప్రార్థనల కార్యక్రమం రద్దయింది. ‘థాంక్యూ ఇండియా’ ధర్మశాలకు తరలిపోయింది. మన దేశంలో 1959 నుంచి ‘టిబెట్ ప్రవాస ప్రభుత్వం’ కొనసాగుతోంది. ఆ ఏడాది చైనా సైన్యం టిబెట్‌లోకి ప్రవేశించి అక్కడ జరిగిన తిరుగుబాటును అణిచేయడంతో వేలాదిమంది శరణార్ధులు మన దేశానికొచ్చారు. దలైలామా కూడా చైనా సైనికుల కన్నుగప్పి మారువేషంలో పదిహేను రోజులు హిమాలయ సానువుల్లో నడిచి మన దేశానికొచ్చారు. మొదట్లో ఆయన విషయంలో ఎలాంటి వైఖరి అవలంబించాలన్న అంశంలో అప్పటి ప్రధాని నెహ్రూ ఊగిసలాట ప్రదర్శించినా చివరకు స్వయంగా వెళ్లి ఆయనకు స్వాగతం పలికారు. అలాగని దలైలామ నాయకత్వంలోని ‘ప్రవాస ప్రభుత్వాన్ని’ గుర్తించలేదు. మొదట్లో టిబెట్ పౌరులకు కొన్ని పరిమితులతో పౌరసత్వ హక్కులు కల్పించారు. వారు మన దేశ పౌరుల్లాగే అన్ని రకాల హక్కులూ అనుభవించవచ్చుగానీ... ఓటు హక్కు, ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యోగం చేసే హక్కు మాత్రం లేవు. కానీ ఆచరణలో ఇందువల్ల సమస్యలు తలెత్తుతున్నాయని భావించి మూడేళ్లక్రితం కొత్త విధానం ప్రకటించారు. వారికి భూమిని లీజుకివ్వడం, సంక్షేమ పథకాలు అమలు చేయడం, అర్హతల్నిబట్టి ఉద్యోగాలు కల్పించడం వగైరాలు అందులో ఉన్నాయి. వాటిల్లో కొన్నిటిని అరుణాచల్‌ప్రదేశ్ అమలు చేయడం ప్రారం భించింది కూడా. కానీ సమస్యేమంటే దలైలామాకు ఆశ్రయమివ్వడంగానీ, టిబెటిన్లను శర ణార్ధులుగా గుర్తించి వారికి సౌకర్యాలు కల్పించడంగానీ చైనాకు ససేమిరా ఇష్టం లేదు. అసలు దలైలామాను ప్రపంచ దేశాధినేతలైనా కలిసినా, ఆయన్ను పిలిచినా చైనాకు కోపం వస్తుంది. మొదట్లో దలైలామా దూకుడుగా ఉండేవారు. టిబెట్‌ను చైనా గుప్పెట్లో పెట్టుకుని ప్రజల మత, భాషా, సాంస్కృతిక హక్కుల్ని హరి స్తున్నదని ఆరోపించేవారు. టిబెటిన్లకు స్వాతంత్య్రం లభిస్తే తప్ప పరిస్థితి మార దని చెప్పేవారు. ప్రపంచం నలుమూలలా ఉన్న దాదాపు కోటిమంది టిబెటిన్లు ఆయన్ను ఆధ్యాత్మికవేత్తగా భావిస్తారు. కానీ 1959 తర్వాత అక్కడి భూభాగం లోని పౌరులు చైనాకు వ్యతిరేకంగా పోరాడుతున్న దాఖలాలు లేవు. ఇటు దలై లామా వైఖరిలో కూడా కాలం గడిచినకొద్దీ మార్పు వచ్చింది. తాము చైనా నుంచి టిబెట్‌కు స్వాతంత్య్రాన్ని కోరడం లేదని అయిదారేళ్లకిందటే ఆయన ప్రకటిం చారు. చైనాలో టిబెట్‌ను అంతర్భాగంగా గుర్తించి ఆ ప్రాంత అభివృద్ధికి తోడ్ప డాలన్నది ఆయన ప్రస్తుత డిమాండు. దలైలామతోపాటే మన దేశం కూడా టిబెట్ పౌరులతో వ్యవహరించే విధానాన్ని మార్చుకుంటోంది. చైనాతో సంబంధాలు మెరుగుపడినకొద్దీ టిబెటిన్ల విషయంలో కొన్ని పరిమితులు విధిస్తోంది. గతంలో ఇచ్చినట్టుగా టిబెట్ పౌరుల ఆందోళనలకు అనుమతినీయడం లేదు. చైనా నేతలు వచ్చినప్పుడల్లా ముందస్తు అరెస్టులు చేయడం, వారిపై నిఘా ఉంచడం రివాజైంది. ఇప్పుడు కేంద్ర కేబినెట్ కార్యదర్శి జారీచేసిన నోట్ కూడా అలా క్రమేపీ సడలుతూ వస్తున్న వైఖరిలో భాగమే కావొచ్చు. కానీ బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం కాకుండా మరే పార్టీకి చెందిన ప్రభుత్వమైనా ఇలాంటి నోట్ జారీ చేసి ఉంటే, వేరే వారి సంగతలా ఉంచి బీజేపీ నుంచే గట్టి వ్యతిరేకత వచ్చేది. మన విదేశాంగ కార్యదర్శి విజయ్ గోఖలే గత నెలలో చైనాలో పర్యటించి ఆ దేశ ఉప విదేశాంగ మంత్రితో చర్చలు జరిపారు. ఈ స్థాయి చర్చలు జరగడం ఏడాది తర్వాత ఇదే ప్రథమం. భారత్‌లో దలైలామా కదలికలు ఉన్నప్పుడల్లా, టిబెట్ అంశంపై ఏదైనా కార్యక్రమం జరిగినప్పుడల్లా సరిహద్దుల్లో చైనా సమస్య సృష్టించడం రివాజుగా మారింది. నిరుడు ఏప్రిల్‌లో దలైలామా అరుణాచల్‌లో పర్యటించాకే డోక్లాంలో ఘర్షణ వాతావరణం ఏర్పడింది. అది దాదాపు నిరు డంతా సాగింది. అరుణాచల్ ప్రాంతంలో చైనా సైనికుల హడావుడి ఎక్కువైంది. వచ్చే జూన్‌లో ప్రధాని నరేంద్రమోదీ చైనాలో జరిగే షాంఘై సహకార సంస్థ (ఎస్సీఓ) సమావేశాలకు వెళ్తున్నారు. అందువల్ల కూడా టిబెట్ ఉత్సవాలు దేశ రాజధానిలో జరగకుండా చూడాలని ప్రభుత్వం నిర్ణయించి ఉండొచ్చు. కానీ అందుకు ఇతర మార్గాలు ఎన్నుకుని ఉండాల్సింది. ‘టిబెట్ ప్రవాస ప్రభుత్వ’ పెద్దలతోనే కార్యక్రమాల నిర్వహణ విషయం మాట్లాడితే వారే దానికి తగినట్టుగా కార్యాచరణను రూపొందించుకునేవారు. ఆ పని చేయకుండా నోట్ వెలువరించడం, అది కాస్తా రచ్చకెక్కడం వల్ల చైనాకు మనపై చిన్నచూపు ఏర్పడే ప్రమాదం ఉంటుంది. -
ఉలిక్కి పడ్డ బుద్ధ గయ
పట్న : భారీ ఉగ్ర కుట్రను బిహార్ పోలీసులు భగ్నం చేశారు. అప్రమత్తమై బోధ్(బుద్ధ) గయలో మరో మారణ హోమం జరగకుండా నిలువరించగలిగారు. దలైలామ పర్యటన, రిపబ్లిక్ డే నేపథ్యంలో తనిఖీలు చేపట్టిన పోలీసులు శుక్రవారం సాయంత్రం రెండు క్రూడ్ బాంబులను స్వాధీనం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో భద్రతను మరింత కట్టుదిట్టం చేసి.. తనిఖీలను విస్తృతం చేశారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం... బౌద్ధ గురువు దలైలామా ప్రస్తుతం భోద్ గయలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా తనిఖీలు కొనసాగుతుండగా.. శుక్రవారం సాయంత్రం వంట గదిలో ఓ స్వల్ఫ పేలుడు సంభవించింది. తొలుత గ్యాస్ లీకేజీ అని భావించిన పోలీసులు.. తర్వాత ఫ్లాస్క్‌లో బాంబు అమర్చి పేలుడుకు పాల్పడినట్లు నిర్ధారించారు. వెంటనే బాంబ్ స్వ్కాడ్ రంగంలోకి దిగి ముమ్మరంగా తనిఖీలు చేపట్టింది. ఈ క్రమంలో కాలచక్ర మైదానంలో రెండు శక్తివంతమైన బాంబులను స్వాధీనం చేసుకున్నారు. దలైలామా శుక్రవారం తన కార్యక్రమాలను ముగించుకుని వెళ్లిన కాసేపటికే ఈ పరిణామాలు చోటు చేసుకున్నాయి. కాగా, 2013 బుద్ధ గయలో వరుస పేలుళ్లు(9 చోట్ల) దేశం మొత్తాన్ని దిగ్ర్భాంతికి గురి చేశాయి. అయితే అదృష్టవశాత్తూ ప్రాణ నష్టం మాత్రం సంభవించలేదు. ఈ ఘటన తర్వాత సీఆర్పీఎఫ్ సిబ్బందిని ఆలయ ప్రాంగణంలో మోహరించేందుకు కేంద్ర హోం శాఖ ప్రయత్నాలు చేసినా.. అవి సఫలం కాలేదు. దీంతో ఆలయ సిబ్బంది ప్రైవేట్ సెక్యూరిటీని నియమించుకుంది. ఇది కూడా చదవండి... బుద్ధ గయపై నెత్తుటిచారిక -
స్వాతంత్య్రం వద్దు.. అభివృద్ధి కావాలి
కోల్‌కతా: చైనా నుంచి టిబెట్ స్వాతంత్య్రాన్ని ఆశించడం లేదని టిబెట్ ఆధ్యాత్మిక గురువు దలైలామా స్పష్టం చేశారు. అయితే అభివృద్ధి మాత్రం కోరుకుంటుందని చెప్పారు. గురువారం ఇండియన్ చాంబర్ ఆఫ్ కామర్స్ ఏర్పాటుచేసిన కార్యక్రమంలో మాట్లాడుతూ.. ‘జరిగిందేదో జరిగిపోయింది. ఇకపై మేం భవిష్యత్తు కోసం ఆలోచించాలి’ అని అన్నారు. చైనా, టిబెట్ల మధ్య అప్పుడప్పుడు గొడవలు జరిగినా.. సన్నిహిత సంబంధాలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. చైనాతోనే ఉండాలని టిబెటన్లు కోరుకుంటున్నారని, అందువల్ల స్వాతంత్య్రాన్ని కాకుండా మరింత అభివృద్ధి ఆశిస్తున్నామని దలైలామా వెల్లడించారు. అదే సమయంలో టిబెటన్ల సంస్కృతి, వారసత్వాన్ని చైనా తప్పనిసరిగా గౌరవించాలని ఆయన స్పష్టం చేశారు. ‘టిబెట్‌కు ప్రత్యేక సంస్కృతి, భాషలు ఉన్నాయి. చైనా ప్రజలు వారి దేశాన్ని ప్రేమిస్తారు. మేం మా దేశాన్ని ప్రేమిస్తాం’ అని చెప్పారు. గత కొన్ని దశాబ్దాలుగా చైనా ఎంతో మారిపోయిందని, ప్రపంచంతో సాగడం వల్ల గతంతో పోలిస్తే 40 నుంచి 50 శాతం వరకూ మారిపోయిందన్నారు. భారతీయులు బద్ధకస్తులు చైనీయులతో పోలిస్తే భారతీయులు బద్ధకస్తులని దలైలామా పేర్కొన్నారు. అయితే భారత్ అత్యంత నిలకడైన దేశమని, ప్రపంచ వేదికపై కీలక పాత్ర పోషించే సత్తా ఉందని చెప్పారు. భారత్‌లోని పరమత సహన స్ఫూర్తిని ఆయన కొనియాడారు. భారత్, చైనాలు హిందీ–చీనీ భాయ్ భాయ్ స్ఫూర్తితో సాగాలని సూచించారు. భారతీయుల నవ్వు స్వచ్ఛమైనదని, చైనా అధికారులు కృత్రిమంగా నవ్వడంలో నిపుణులని దలైలామా నవ్వుతూ చెప్పారు. -
దలైలామాను కలిస్తే నేరమే
బీజింగ్: టిబెటిన్ల ఆధ్యాత్మిక గురువు దలైలామా(82)తో ఏ దేశాధినేత భేటీ అయినా, ఆయనకు ఆతిథ్యం ఇచ్చినా దాన్ని తీవ్రమైన నేరంగా పరిగణిస్తామని చైనా హెచ్చరించింది. వేర్పాటువాదిగా మారిన దలైలామా తమ నుంచి టిబెట్‌ను విడదీయటానికి యత్నిస్తున్నాడని ఆరోపించింది. ఇటీవల ప్రారంభమైన కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా(సీపీసీ) కాంగ్రెస్ సమావేశాల సందర్భంగా యునైటెడ్ ఫ్రంట్ వర్క్ విభాగానికి చెందిన కార్యనిర్వాహక ఉపమంత్రి జాంగ్ ఇజియాంగ్ మీడియాతో మాట్లాడుతూ.. ‘ ఏ దేశమైనా, ఏ సంస్థ లేదా వ్యక్తులైనా 14వ దలైలామాతో భేటీ కావడానికి యత్నిస్తే దాన్ని చైనా ప్రజల మనోభావాల దృష్ట్యా తీవ్రమైన నేరంగా పరిగణిస్తాం. చైనా సార్వభౌమాధికారాన్ని గుర్తించిన అనంతరం దలైలామాతో భేటీ కావడమన్నది అందుకు విరుద్ధమైన చర్య అవుతుంది. మా సార్వభౌమాధికారాన్ని గుర్తించి, మాతో సత్సంబంధాలు కోరుకునే దేశాలన్నీ ఈ విషయమై పునరాలోచించాలి. దలైలామాను ఆధ్యాత్మిక నేతగా పేర్కొంటూ విదేశీ నేతలు చేసే వాదనల్ని మేం ఎంతమాత్రం అంగీకరించబోం. ఆయన మతం ముసుగు కప్పుకున్న రాజకీయ నేత’ అని మండిపడ్డారు. భారత్‌ను నేరుగా ప్రస్తావించకుండా ‘1959లో మాతృభూమికి ద్రోహం చేసిన దలైలామా మరో దేశానికి పారిపోయి ప్రవాస ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నార’ని విమర్శించారు. చైనా నుంచి టిబెట్‌ను విడదీయాలన్న వేర్పాటువాద అజెండాతో దశాబ్దాలుగా దలైలామా బృందం పనిచేస్తూనే ఉందని ఆరోపించారు. అసలు టిబెట్ బౌద్ధం అన్నది చైనాలోనే పుట్టిందని ఇజియాంగ్ తెలిపారు. -
'చైనా-భారత్‌లు ఒకరినొకరు ఓడించుకోలేవు'
ముంబై: భారత్, చైనా మధ్య డొక్లాం వివాదం నెలకొన్న నేపథ్యంలో బౌద్ధ మత గురువు దలైలామా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భారత్, చైనాలు ఒకదాన్ని మరొటి ఓడించుకోలేవని అన్నారు. ఇరుగుపొరుగు దేశాలుగా ఈ రెండూ కలసిమెలసి ఉండాలని ఆకాంక్షించారు. ‘హిందీ చీనీ భాయి భాయి’ ఉద్దేశం ఇదేనని చెప్పారు. ముంబైలో సోమవారం జరిగిన ఓ కార్యక్రమంలో దలైలామా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. ‘ప్రస్తుతం ఇరు దేశాల మధ్య నెలకొన్న సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో భారత్, చైనాలు.. ఒక దాన్ని మరొకటి ఓడించలేదు. ఎందుకంటే ఇరు దేశాలు సైనిక సంపత్తిలో ఎంతో శక్తిమంతమైనవి. ఇరుగుపొరుగు దేశాలైన ఇవి రెండూ కలసిమెలసి ఉండటమే సరైన నిర్ణయం' అని అన్నారు. -
భారతీయ సంస్కృతి చాలా గొప్పది: దలైలామా
గన్నవరం: ఎక్కడ శాంతి ఉంటుందో ఆ ప్రదేశం ఆర్థికంగా అభివృద్ది చెందుతుందని ప్రముఖ బౌద్ధమత గురువు దలైలామా వ్యాఖ్యానించారు. శుక్రవారం నుంచి అమరావతిలో జరగనున్న జాతీయ మహిళా పార్లమెంట్ సదస్సులో పాల్గొనడానికి ఆయన గురువారం ఉదయం గన్నవరం చేరుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ భారతీయ పురాతన సంస్కృతి చాలా గొప్పదన్నారు. భారత సంస్కృతి పట్ల నేటి యువత ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని పిలుపునిచ్చారు. కాగా పర్యటన కోసం గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న ఆయన విమానం ఉదయం కొద్దిసేపు గాల్లో చక్కర్లు కొట్టింది. దట్టమైన పొగమంచు కప్పేయడంతో.. రన్‌వే కనిపించక గాలిలో చక్కర్లు కొట్టింది. అనంతరం దలైలామా క్షేమంగా విమానాశ్రయం చేరుకున్నారు. ఆయనకు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు, మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, పల్లె రఘునాథరెడ్డి తదితరులు స్వాగతం పలికారు. మరోవైపు అమరావతిలోని స్థానిక బౌద్ధ స్తూప వేదిక వద్ద బుద్ధుని ధాతువులు భద్రపరిచిన చోట ప్రత్యేక పూజలు చేయనున్నారు. 2006 తర్వాత దలైలామ అమరావతికి రావడం ఇదే తొలిసారి. -
దలైలామా విమానానికి ల్యాండింగ్ ట్రబుల్
కృష్ణా జిల్లా గన్నవరం ప్రాంతంలో పొగమంచు దట్టంగా అలముకుంది. దాంతో రన్‌వే మీద విమానాలు దిగేందుకు వీలు లేకుండా పోయింది. ఢిల్లీ నుంచి వచ్చిన ఎయిరిండియా విమానం కూడా ఇలాగే దిగేందుకు అవకాశం లేక గాల్లో చక్కర్లు కొడుతోంది. ఆ విమానంలో ప్రముఖ బౌద్ధ మత గురువు దలైలామా కూడా ఉండటంతో అధికారులు ఆందోళన చెందుతున్నరు. ఉదయం 8.55 గంటలకు ఢిల్లీ నుంచి రావాల్సిన విమానం ల్యాండ్ అవ్వడానికి తగిన విజిబులిటీ లేకపోవడంతో అది గాల్లోనే చక్కర్లు కొడుతోంది. విమానం దిగడానికి వాతావరణం అనుకూలంగా లేదని పైలట్ విమానాశ్రయ అధికారులకు చెప్పారు. సూర్యుడి వేడి వచ్చిన తర్వాత గానీ పొగమంచు విడిపోయే అవకాశం లేదని అధికారులు అంటున్నారు. మహిళా పార్లమెంటు సదస్సులో పాల్గొనేందుకు దలైలామా ఢిల్లీ నుంచి బయల్దేరి వచ్చారు. గన్నవరం విమానాశ్రయంలో తరచు ఇదే పరిస్థితి తలెత్తుతోంది. జనవరి, ఫిబ్రవరి నెలల్లో ఉదయం పూట వచ్చే విమానాలు ల్యాండింగ్ కావడానికి ఆలస్యం అవుతోంది. గ్రామీణ ప్రాంతం కావడంతో మంచు ఎక్కువగా ఉండటం ఒక కారణం కాగా, రన్‌వే పెద్దది కాకపోవడం కూడా మరో ముఖ్యమైన సమస్య అని చెబుతున్నారు. -
'ఆ మూడు దేశాలు కలిస్తే ఇంకా సూపర్'
బెంగళూరు: భారత్, జపాన్, అమెరికాల మధ్య కొన్ని అంశాల విషయంలో చాలా దగ్గర సంబంధాలు ఉన్నాయని టిబెట్‌కు చెందిన ప్రముఖ ఆధ్యాత్మిక గురువు దలైలామా అన్నారు. ఈ మూడు దేశాలకు కూడా ప్రజాస్వామ్యం, స్వేచ్చాయుత పరిపాలన, బావప్రకటన స్వేచ్ఛ అనే అంశాల్లో ఒకే విధమైన అభిప్రాయాలున్నాయని, అందుకే ఈ దేశాలు సన్నిహిత సంబంధాలు పెట్టుకోవడం చాలా ముఖ్యం అని ఆయన చెప్పారు. ప్రస్తుతం బెంగళూరు పర్యటనలో ఉన్న దలైలామా ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన భావాలను వెల్లడించారు. 'నేను తరుచుగా చెప్తుంటాను. మొత్తం ఆసియాలోనే ప్రజాస్వామ్యంపై నమ్మకాన్ని కలిగి స్థిరంగా కొనసాగుతున్న ఏకైక దేశం భారత దేశమేనని. ఇక జపాన్ పారిశ్రామికీకరణ చెందిన ప్రజస్వామ్యయుత దేశం. అలాగే అమెరికా ఒక స్వేచ్ఛా ప్రపంచం. సమానత్వం అక్కడ వర్ధిల్లుతుంది. ఈ మూడు దేశాల మధ్య ఆయా అంశాల విషయంలో సన్నిహిత సంబంధాలున్నాయి. ఇక చైనా విషయానికి వస్తే అది ఒక నిరంకుశ ప్రభుత్వాన్నికలిగిన దేశం. అయితే చైనా గొప్పదేశమని, అక్కడి ప్రజలు గొప్పవారని మాత్రం చెప్పగలను. వారు కష్టపడి పనిచేసే తత్వాన్ని మేం ఎప్పటికీ గౌరవిస్తాం. అయితే, వారి నిరంకుశాన్ని మాత్రం ఈ రోజుల్లో ఆమోదించలేం' అంటూ ఆయన చెప్పుకొచ్చారు. -
ఆ పేరులోని పదాలన్నీ బుద్ధుడిని కీర్తించేవే
సాక్షి: 'ప్రపంచ మానవులందరం ప్రస్తుతం గొప్ప విపత్కర పరిస్థితుల్లో మనుగడ సాగిస్తున్నాం. ఈ క్లిష్ట పరిస్థితుల్లో ప్రజల మధ్య పరస్పర అవగాహన, భద్రత, సామరస్యం తప్పనిసరి. అవి లేకుండా శాంతియుత సహజీవనం సాగబోదు' అన్నారు దలైలామా. టిబెటన్ ఆధ్యాత్మిక గురువైన ఆయన ఈ ప్రసంగం చేసింది క్రైస్తవుల పుణ్యస్థలమైన వాటికన్లో. దలైలామా ప్రసంగాల్లో ఎల్లప్పుడూ శాంతి ప్రస్తావన ఉంటుంది. అందుకే ఆయనను శాంతి కపోతంగా గుర్తించింది ప్రపంచం..! అత్యంత ప్రతిష్టాకరమైన నోబెల్ పురస్కార గ్రహీతల్లో 14వ దలైలామా ఒకరు. ఆయనకు 1989లో నోబెల్ శాంతి బహుమతి లభించింది. శాంతి, అహింసా మార్గాల్లో టిబెట్‌కు స్వాతంత్య్రం సంపాదించేందుకు చేస్తున్న కృషికి ఫలితంగా ఈ బహుమతిని ప్రదానం చేశారు. ఆయన ప్రస్తుతం హిమాచల్‌లోని ధర్మశాల నుంచి తన శాంతి పోరాటాన్ని కొనసాగిస్తున్నారు. బాల్యం.. దలైలామాను యేషేనారెబల్, లామో ధోండ్రబ్గా పిలిచేవారు. ఆయన టిబెట్ దేశ ఈశాన్య ప్రాంతంలోని ‘తక్త్ సేర్’ కుగ్రామంలో 1935 జూలై 6న జన్మించారు. రెండున్నరేళ్లకే బుద్ధుని అవతారంగా గుర్తింపుపొందారు. ‘లామో ధోండ్రబ్’ను బుద్ధుని అంశగా గుర్తించడంతో పాటు, తన వారసుడిగా కూడా ప్రకటించారు 13వ దలైలామా. జ్ఞాన సముద్రం.. టిబెటన్ భాషలో దలైలామా అంటే జ్ఞాన సముద్రం అని అర్థం. దలైలామా పూర్తి పేరు జెట్సన్ జంఫెల్ గవాంగ్ లోబ్సంగ్ యేషే టింజెన్ గ్యాట్నో. చాంతాడంత పొడవున్న ఈ పేరులోని పదాలన్నీ బుద్ధుని అవతారాన్ని కీర్తించేవే. పవ్రిత దైవం, దివ్య ప్రభ, సానుభూతి, విశ్వాస నిరూపక జ్ఞానసముద్రుడు అని అర్థం. విద్యాభ్యాసం.. దలైలామా ఆరేళ్ల వయసులో విద్యాభ్యాసం ప్రారంభించారు. 25 ఏళ్లు వచ్చేవరకు బౌద్ధ మత సంప్రదాయ విద్యను అభ్యసించారు. బౌద్ధ మత తత్వశాస్త్రంలో పీహెచ్డీ పట్టా (గేషే లారంపా) పొందారు. బౌద్ధ విశ్వవిద్యాలయాలైన డ్రెఫండ్, సెరా, గండెన్ బౌద్ధ విద్యాలయాల్లో 30 మంది పండితుల పరీక్షలను నెగ్గి, 15 మంది పండితులతో బౌద్ధమత న్యాయసూత్రాలపై వాదించి, భౌతిక ఆధ్యాత్మిక విభాగాలలో నైపుణ్యాన్ని నిరూపించుకున్నారు. దలైలామాగా.. యేషేనారెబల్.. పదహారేళ్ల ప్రాయంలోనే టిబెట్ పరిపాలనా వ్యవస్థకు అధిపతిగా నియమితులయ్యారు. అయితే, 1954లో టిబెట్ చైనీయుల ఆక్రమణకు గురైంది. చైనీయుల వలసలు పెరిగిపోయి దేశం వారి హస్తగతమైంది.ఈ దశలో దలైలామా టిబెట్ పరిరక్షణ కోసం మావోసేటుంగ్ చౌ ఎన్లై వంటి నాయకులతో చర్చలు జరిపారు. ఆ చర్చలు విఫలం కావడంతో ఆయన అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. మన దేశం ఆయనకు ఆశ్రయం ఇవ్వడంతో హిమాచల్ ప్రదేశ్‌లోని ధర్మశాలలో ఆశ్రమం ఏర్పాటు చేసుకున్నారు. టిబెట్ స్వాతంత్య్రం కోసం ధర్మశాల నుంచే ప్రయత్నాలు కొనసాగించారు దలైలామా. చైనా దుర్నీతిపై.. టిబెట్‌ను చైనా ఆక్రమించుకోవడంపై ఐక్యరాజ్య సమితిలో దలైలామా ఫిర్యాదు చేశారు. ఐక్యరాజ్య సమితి కూడా మూడుసార్లు టిబెట్‌కు అనుకూలంగా ప్రతిపాదనలు చేసింది. అయినా చైనా తన దురాక్రమణ పర్వాన్ని ఆపలేదు. దలైలామా తయారు చేసిన టిబెట్ రాజ్యాంగాన్ని చైనా గౌరవించలేదు. 1980వ దశకంలో ఆయన ఎన్నో దేశాలు పర్యటించి, మద్దతు కూడగట్టారు. తుది ప్రయత్నంలో భాగంగా టిబెట్‌లో శాంతి స్థాపనకు 1987లో ఐదు అంశాల ప్రతిపాదన చేశారు. ఇతర మతాలపై గౌరవం.. దలైలామా ఓ నిరాడంబర బౌద్ధ సన్యాసి. కచ్చితమైన నియమానుసారంగా బౌద్ధ మతాన్ని అవలంబించడంతో పాటు ప్రపంచంలోని ఇతర మతాలన్నింటినీ గౌరవిస్తారు. ఆయన 1973లో క్రైస్తవుల రోమన్ క్యాథలిక్ కేంద్రమైన వాటికన్ సిటీలో ఆరవ పోప్‌ను కలుసుకున్నారు. పోప్ రెండవ జాన్పాల్ని 1980, 82, 86, 88 సంవత్సరాలలో కలుసుకుని ప్రపంచ శాంతి గురించి చర్చించారు. గాంధీజీ స్ఫూర్తి.. దలైలామా ఓ సందర్భంలో.. శాంతియుత పోరాటానికి స్ఫూర్తి, ఆదర్శం భారత జాతిపిత గాంధీజీ అన్నారు. నోబెల్ శాంతి బహుమతి అందుకున్న సమయంలో దలైలామా, ‘‘ఈ పురస్కారానికి ఒక పీడిత ప్రతినిధిగా నన్ను ఎంపిక చేసినందుకు కృతజ్ఞతలు. ప్రపంచంలోని పీడిత మానవులకు, స్వతంత్రంకోసం పోరాడేవారికి, అణగారిన వర్గాల వారికి, ప్రపంచ శాంతికి పాటుపడేవారికి ఈ బహుమతి అంకితం’’ అని వ్యాఖ్యానించారు. పురస్కారాలు.. 1959.. రామన్ మెగసెసె అవార్డు 1989.. నోబెల్ శాంతి బహుమతి 2012.. టెంప్లెటన్ ప్రైజ్ (ఈ అవార్డు కింద లభించిన మొత్తాన్ని మనదేశంలోని ‘సేవ్ ద చిల్డ్రన్’ సంస్థకు విరాళంగా ఇచ్చారు) 2007.. అమెరికా నుంచి 'కాంగ్రెషనల్ గోల్డ్ మెడల్' 2006.. కెనడా నుంచి గౌరవ పౌరసత్వం 2005.. యూకేలోని బుద్ధిస్ట్ సొసైటీ నుంచి క్రిస్ట్మస్ హంఫ్రీస్ అవార్డు. -
మరో ఇరవై ఏళ్లు నాకేం పర్వాలేదు
ధర్మశాల: మరో ఇరవై ఏళ్లపాటు చక్కటి ఆరోగ్యంతో ఉంటానని టిబెటన్ ప్రముఖ ఆధ్యాత్మిక గురువు దలైలామా అన్నారు. ప్రస్తుతం 80 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆదివారం మీడియాతో మాట్లాడిన ఆయన 20 ఏళ్లు ఆరోగ్యంగా ఉంటానని, వైద్యులు కూడా తనను పరీక్షించి ఇదే విషయం చెప్పారని తెలిపారు. తన అనంతరం ప్రస్తుతం తాను ఉంటున్న హోదాకు ఎవరు వస్తారనే విషయంలో ఇప్పుడప్పుడే ఎలాంటి చింత లేదని ఆయన స్పష్టం చేశారు. తనకు 90 ఏళ్లు వచ్చే సమయానికి తాను తన హోదాలో ఉండొచ్చా లేదా అనే విషయాన్ని ప్రకటిస్తానని తెలియజేశారు. 'నేనొక సాధారణ బౌద్ధ సన్యాసిని మాత్రమే. అన్ని వేళలా మంచిచేయాలనే ప్రయత్నిస్తుంటాను. ఇప్పుడు నాకు ఎనభై ఏళ్లు. జీవితాంతం జ్ఞాన సముపార్జనకోసమే ప్రయత్నించాను. అలాగే ఇక ముందు కూడా ఉంటుంది' అని దలైలామా చెప్పారు.