'చైనా-భారత్‌లు ఒకరినొకరు ఓడించుకోలేవు'
ముంబై: భారత్, చైనా మధ్య డొక్లాం వివాదం నెలకొన్న నేపథ్యంలో బౌద్ధ మత గురువు దలైలామా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భారత్, చైనాలు ఒకదాన్ని మరొటి ఓడించుకోలేవని అన్నారు. ఇరుగుపొరుగు దేశాలుగా ఈ రెండూ కలసిమెలసి ఉండాలని ఆకాంక్షించారు. ‘హిందీ చీనీ భాయి భాయి’ ఉద్దేశం ఇదేనని చెప్పారు.
ముంబైలో సోమవారం జరిగిన ఓ కార్యక్రమంలో దలైలామా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. ‘ప్రస్తుతం ఇరు దేశాల మధ్య నెలకొన్న సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో భారత్, చైనాలు.. ఒక దాన్ని మరొకటి ఓడించలేదు. ఎందుకంటే ఇరు దేశాలు సైనిక సంపత్తిలో ఎంతో శక్తిమంతమైనవి. ఇరుగుపొరుగు దేశాలైన ఇవి రెండూ కలసిమెలసి ఉండటమే సరైన నిర్ణయం' అని అన్నారు.